
ముంబై: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలియజేసింది. కార్లైల్ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటా, కార్లైల్ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది.
తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment