న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్‌బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్‌స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.
మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment