న్యూఢిల్లీ: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,200 కోట్లు) సమీకరించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. కార్యకలాపాల విస్తరణ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. క్విప్ ఇష్యూకి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, దేశీ మ్యుచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 4.2 రెట్లు బిడ్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభం
అదానీ ఎంటర్‌ప్రైజెస్ గతేడాది జనవరిలోనే రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రకటించినప్పటికీ, సరిగ్గా అదే సమయంలో గ్రూప్ కార్యకలాపాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేయడం ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయినప్పటికీ, కంపెనీ దాన్ని రద్దు చేసుకుని, ఇన్వెస్టర్లకు సొమ్ము వాపసు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment