
ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్ ఏషియన్ బిలియనీర్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు.
2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్‌లో కొత్తగా చేరారు.
యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్‌ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్.
ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )
1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్
2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా
3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్
4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా
5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా
6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్
7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా
8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా
9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్
10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్
Comments
Please login to add a commentAdd a comment