Asia
-
రెచ్చిపోయిన రిషి ధవన్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌గా ఆసియా స్టార్స్
తొట్ట తొలి ఆసియా లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆసియా స్టార్స్ కైవసం చేసుకుంది. ఉదయ్‌పూర్‌లోని మిరాజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న (మార్చి 18) జరిగిన ఫైనల్లో ఇండియన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆసియా ప్రాంతానికి చెందిన మాజీలు, దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. ఐదు జట్లు (ఇండియన్ రాయల్స్, ఆసియా స్టార్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొన్న ఈ టోర్నీలో ఆసియా స్టార్స్ విజేతగా అవతరించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన ఇండియన్ రాయల్స్ ఫైనల్లో ఆసియా స్టార్స్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. 19.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఆసియా బౌలర్లు ఈశ్వర్ పాండే (4-0-31-3), రిషి ధవన్ (3.5-0-27-2), మునవీర (4-0-33-2), పవన్ సుయాల్ (4-0-19-1) రాయల్స్‌ను దెబ్బేశారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ సింగ్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. నమన్ ఓఝా 5, రాహుల్ యాదవ్ 4, కెప్టెన్ ఫయాజ్ ఫజల్ 11, నగార్ 16, మనన్ శర్మ 14, సక్సేనా 15, బిపుల్ శర్మ 5, గోని 2, అనురీత్ సింగ్ 15 పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆసియా స్టార్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన రిషి ధవన్ (57 బంతుల్లో 83; 11 ఫోర్లు, సిక్స్) బ్యాటింగ్‌లో రెచ్చిపోయి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ధవన్‌కు మరో ధవన్ (రాఘవ్) సహకరించాడు. రాఘవ్ ధవన్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఆసియా స్టార్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసియా స్టార్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ డకౌట్ కాగా.. కశ్యప్ ప్రజాపతి 15, దిల్షన్ మునవీర 2, సరుల్ కన్వర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇండియన్ రాయల్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, అనురీత్ సింగ్, బిపుల్ శర్మ, మనన్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధవన్, మునాఫ్ పటేల్, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆడారు. -
ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!
2025లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల యొక్క విస్తరించిన జాబితాలో 7 భారతీయ రెస్టారెంట్లు స్థానం పొందాయి. 2025లో ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ల సంకలనం 51వ నుండి 100వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైంది. ఏడు భారతీయ సంస్థలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. ఈ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో ఏడు భారతీయ సంసథలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెస్టారెంట్ల అవార్డుల ప్రదానోత్సవం ఆవిష్కరణ ఈ నెల ఆఖరున సియోల్ జరగనుంది. ఆ జాబితాలో చోటు దక్కించుక్ను ఏడు భారతీయ రెస్టారెంట్లు వరుసగా కసౌలిలోని నార్ (66వ స్థానం), బెంగళూరులోని ఫార్మ్లోర్ (68వ స్థానం), ముంబైలోని అమెరికానో (71వ స్థానం), న్యూఢిల్లీలోని ఇంజా (87వ స్థానం), ముంబైలోని ది టేబుల్ (88వ స్థానం), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (89వ స్థానం), ముంబైలోని ది బాంబే క్యాంటీన్ (91వ స్థానం). అంతేగాదు ముంబైలోని ది టేబుల్ రెండోసారి ఈ జాబితో నిలిచింది. గతంలో ఈ లిస్ట్‌లో నిలవడమేగాక "వన్ టు వాచ్ " అవార్డుని కూడా దక్కించుకుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నార్, ఫార్మ్లోర్, ఇంజా రెస్టారెంట్లు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక తొలిస్థానంలో సియోల్‌లోని బోర్న్ అండ్ బ్రెడ్ నిలిచింది. మొదటి పది స్థానాలలో బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ సియోల్‌కి సంబంధించిన ఆరు రెస్టారెంట్లు ఉండటం విశేషం. కాగా, గతేడాది ఐదు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోగా ఈ ఏడాది మరో రెండు రెస్టారెంట్లు ఈ జాబితాలో చేరడం విశేషం. (చదవండి: మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!) -
కొత్త కుబేరులు.. ఆసియా బిలియనీర్స్ లేటెస్ట్ లిస్ట్
ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్ ఏషియన్ బిలియనీర్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు. 2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్‌లో కొత్తగా చేరారు.యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్‌ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్.ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా 6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్ 7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా 8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా 9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ 10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ -
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
కరుణామయుని కోవెలకు వందేళ్ల ఉత్సవాలు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం..!ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరువేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్బర్లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.–సీహెచ్. నీలయ్యసాక్షి, మెదక్ -
ఆరు పదులకు అందాల కిరీటం
వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్ ఆసియా రన్నరప్, మిసెస్ ఎలిగాన్స్, మిసెస్ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్–గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు. -
మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. (చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి..!) -
అసియాలోనే అత్యధిక స్త్రీ అక్షరాస్యత కలిగిన దేశాలు ఇవే..
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.అయితే పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆసియాలో స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 81.6గా ఉంది. అయితే భారత్‌లో స్త్రీ అక్షరాస్యత 65.8 శాతంగా ఉంది. భారత్ కంటే అనేక అరబ్ దేశాలు అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉండటం గమనార్హం..15 ఏళ్ల కంటే ఎక్కువున్న బాలికలు, చదవడం, రాయగల సామర్థాన్ని కలిగి ఉన్నవారిని.. స్త్రీ అక్షరాస్యతగా పేర్కొంటారు. ఇది విద్య, సాధికారత ద్వారా సాధ్యమవుతుంది. మహిళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, లింగ సమానత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీల అక్షరాస్యత రేట్లను మెరురుపరచడం వల్ల వారికి ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతతాయి. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది. అన్నీ దేశాలను గమనిస్తే..స్త్రీ అక్షరాస్యతలో ఉత్తర కొరియా 100 శాతంతో ఉంది. దీనితోపాటు సమానంగాా ఉజ్బెకిస్తాన్ కూడా 100 శాతం ఉంది. తరువాత కజకిస్తాన్ -99.7 శాతంతజకిస్తాన్-99.7 శాతంజార్జియా-99.7 శాతంఅర్మెనియా-99.7 శాతంఅజర్బైజాన్-99.7 శాతంకిరిగిస్తాన్ 99.5 శాతంసైప్రస్- 99.2 తుర్క్మెనిస్తాన్- 99.6 శాతంసిరియా-81 శాతంఇరాక్ -77.9 శాతంఇరాన్ 88.7 శాతంఇజ్రాయిల్ 95.8 శాతంజోర్దాన్ 98.4 శాతంకువైట్ 95.4 శాతంసౌదీ అరేబియా 96 శాతంటర్కీ 94.4శాతంఓమన్-92.7 శాతంయెమెన్ 55 శాతంయూఏఈ-92.7 శాతందక్షిణ కొరియా-96.6 శాతంజపాన్-99 శాతంవియాత్నం 94.6 శాతంబ్రూనై -96.9 శాతంఇండోనేషియా-94.6 శాతంమలేషియా 93.6 శాతంఫిలిప్పిన్స్-96.9 శాతంసింగపూర్-96.1 శాతంశ్రీలంక-92.3 శాతంతైవాన్-97.3 శాతంమంగోలియా-99.2 శాతంఖతర్ 94.7 శాతంచైనా-95.2 శాతంభారత్ 65.8 శాతంనేపాల్ 63.3 శాతంభూటాన్ 63.9 శాతంమయన్మార్ 86.3 శాతంథాయ్లాండ్ 92.8 శాతం కంబోడియా 79.8 శాతంఇక అన్నింటికంటే తక్కువగా చివరి స్థానంలో అప్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కేవలం-22.6శాతం మాత్రమే ఉంది. -
తొలి ఆసియానటిగా చరిత్ర సృష్టించిన అన్నా: భావోద్వేగం
ప్రతిష్టాత్మక 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్‌లో నటి అన్నా సవాయ్ చరిత్ర సృష్టించారు, ఉత్తమ నాటక నటిగా ఎమ్మీ అవార్డ్ గెల్చుకున్న తొలి ఆసియా సంతతి నటిగా చరిత్రకెక్కారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మక అవార్డును తీసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఆదర్శంగా ఉండే మహిళలందరికీ తన అవార్డు అంకితమని పేర్కొనడం అక్కడున్న వారినందర్నీ ఆకర్షించింది.పాపులర్ సిరీస్ షోగన్ మొత్తం 18 ఎమ్మీలను గెలుచుకోగా ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు (25) అందుకున్న సిరీస్ కూడా 'షోగన్' కావడం విశేషం.షోగన్‌లో తన పాత్రకు అన్నా సవాయ్ నాటకంలో ఉత్తమ నటిగా ఎమ్మీని గెలుచుకుంది. భాగంగా షోగన్‌లో లేడీ మారికో పాత్రకు ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుంది. దీనిపై అన్నా సంతోషంగా వ్యక్తం చేసింది. షోగన్ బృందానికి ప్రతి ఒక్క సిబ్బందికి నటీనటులకు ధన్యవాదాలు చెప్పింది. ముఖ్యంగా సహనటుడు హిరోయుకి సనదాకు కృతజ్ఞతలు తెలిపింది. తన తల్లికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. View this post on Instagram A post shared by Emmys / Television Academy (@televisionacad) కాగా న్యూజిలాండ్‌లో జన్మించిన అన్నా 10వ ఏట తన కుటుంబంతో కలిసి జపాన్‌కు వెళ్లింది. 2004లో నిప్పాన్ టీవీ ప్రొడక్షన్ అన్నీలో టైటిల్ క్యారెక్టర్‌గా 11 ఏళ్ల వయసులో బుల్లితెరపై నట జీవితాన్ని ప్రారంభించింది.ఈ తర్వాత జేమ్స్ మెక్టీగ్ 2009 మార్షల్ ఆర్ట్స్ చిత్రం నింజా అస్సాస్సిన్లో కిరికోగా తన సినీ రంగ ప్రవేశం చేసింది. -
జ్యువెల్స్ షోలో నటీమణులు సందడి (ఫొటోలు)
-
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం, మనదేశంలోనే.. ఎక్కడుందంటే?
ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఇంతకి ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం? పదండి. ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచంలోనే వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. కాబట్టే మన దేశంతో పాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో మధాపర్ గ్రామం మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ వాసుల డిపాజిట్లు మొత్తం రూ.7,000 కోట్లకు పైమాటే. గణాంకాల ప్రకారం.. మధాపర్ జనాభా 2011లో 17,000 నుండి దాదాపు 32,000గా ఉంది. ఈ ఊరిలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్‌తో పాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి 17కి పైగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర బ్యాంకులు సైతం ఈ ఊరిలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంపన్న గ్రామంగా అవతరించడానికి కారణంమధాపర్ సంపన్న గ్రామంగా అవతరించడానికి ఎన్ఆర్ఐలే కారణమని తెలుస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న ఆ ఊరి ప్రజలు గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో ప్రతిఏటా కోట్ల మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపార రంగాల్లో గుజరాతీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఊరిలో మిగిలిన వారు యూకే,ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు.ఊరికి ఏదో ఒకటి చేయాలనిఈ సందర్భంగా చాలా మంది గ్రామస్తులు విదేశాలలో నివసిస్తున్నారు. పని చేస్తున్నప్పటికీ, వారు తమ గ్రామ అభివృద్దికి అండగా నిలుస్తున్నారని, వారు నివసించే ప్రదేశంలో కాకుండా మధాపర్ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు.సకల సౌకర్యాలకు నిలయంగాగ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రహదారి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సరస్సులు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు. -
ఇండోనేషియాలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనతహార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
2026 FIFA World Cup: భారత ఫుట్‌బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది. -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్‌ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. -
ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా రజనీ..ఆ విషయంలో అందరికంటే టాప్..
-
ఆసియా అంతటా భానుడి భగభగలు
దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దేశాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో పాటు స్కూళ్లను మూసివేశారు.అటు ఫిలిప్పీన్స్ నుండి థాయ్‌లాండ్ వరకు, ఇటు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వరకు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపధ్యంలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు ఇండోనేషియాలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది దశాబ్దాల క్రితం నాటి ఉష్ణోగ్రతల రికార్డును అధిగమించింది.ఈ వేడి వాతావరణం మే మధ్యకాలం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత, కరెంటు కోతలు, పంట నష్టం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.కంబోడియా గత 170 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని జలవనరులు, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చాన్ యుథా తెలిపారు. గడచిన వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. సెంట్రల్ మాగ్వే, మాండలే, సాగింగ్, బాగో ప్రాంతాల్లోని ఏడు టౌన్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మయన్మార్ వాతావరణ విభాగం వెల్లడించింది. మయన్మార్‌లోని పలు పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రపంచస్థాయి రికార్డులను దాటాయి.థాయ్‌లాండ్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బ్యాంకాక్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగపూర్‌లోని వాతావరణ శాఖ దేశంలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో అడవుల్లో కార్చిచ్చు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది.మలేషియాలో వరుసగా మూడు రోజులు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని మలేషియా వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆసియా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నందున పలు చోట్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి చెందారని థాయ్‌లాండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వడదెబ్బ కాణంగా దేశంలో ఇప్పటివరకూ రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు మరణించారు. ఈ వివరాలను ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది.బంగ్లాదేశ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇండోనేషియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు డెంగ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్, కేసుల కంటే డెంగ్యూ జ్వరాలు రెండింతల మేరకు పెరిగాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు
పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్ షోలో భాగమయ్యాడు. టీమ్‌లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్‌కు ఏమైంది? వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆసియాకు, నాకు గొడవలు తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే! అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇగో వల్ల.. మొన్న నేను దుబాయ్ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్‌లో ఉండటం వల్ల నా లైన్ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్ చేసింది. తనే ఫస్ట మెసేజ్ విషెస్ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్‌డే సర్ప్రైజ్ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్ సేతుపతి -
ఆసియాలోని బెస్ట్ రెస్లారెంట్లుగా ఐదు భారత రెస్టారెంట్లు!
యూకే ఆధారిత విలియం రీడ్ బిజనెస్ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం. ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్‌లో కొమెరిన్(79), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్‌కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనికి భారతీయ చెఫ్ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్ రెస్టారెంట్ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది. View this post on Instagram A post shared by The Worlds 50 Best Restaurants (@theworlds50best) (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
2023లో ఎవరెస్ట్‌ను ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని గడచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. గత 70 ఏళ్లలో సుమారు ఏడు వేల మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 2023లో నలుగురు భారతీయులతో సహా దాదాపు 500 మంది పర్వతారోహకులు ఈ ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953, మే 29న ఆవిష్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీ భాషలో సాగరమాత అని అంటారు. ఎడ్మండ్-నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం. 2023లో మొత్తం 478 మంది పర్వాతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది నలుగురు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చెందిన యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో నలుగురు నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. 2023లో నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా (53) ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది కూడా చదవండి: 2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి? -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే..
భూకంపం.. నివారించడం సాధ్యం కాని విపత్తు. అందుకే జాగ్రత్త, అప్రమత్తతే దీనికి పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కాగలిగితే భూకంపాల తరహా విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు. తాజాగా నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆసియా ఖండంలో సంభవించిన పది అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో తరచూ విపత్తులకు గురయ్యే ఆసియాఖండంలో భూకంపాలు అత్యంత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూఎన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్‌ఐఎస్‌డీఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలోని చైనా, భారత్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆసియాలోని నగరాలు చాలా వరకు ప్రణాళికాబద్ధంగా లేవు. అవి నిర్మితమైనప్పుడు లోపభూయిష్టంగా ఉన్నాయని బ్యాంకాక్‌లోని ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అర్బన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అరంబెపోలా గతంలో తెలిపారు. కాగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలో సంభవించిన పది అత్యంత భారీ భూకంపాలు ఇవే.. 1. ఇండోనేషియా: 2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మొత్తం 2,27,898 మంది మరణించారు. ఆ తర్వాత వచ్చిన సునామీ 14 ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలపై ప్రభావం చూపింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ఉత్తర సుమత్రాలో 2005, మార్చి 28న 8.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, సుమారు వెయ్యి మంది మరణించారు. 2. చైనా: 2008, మే 12న తూర్పు సిచువాన్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 87,587 మంది మృత్యువాత పడ్డారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 3,74,177 మంది క్షతగాత్రులయ్యారు. 3. పాకిస్తాన్: 2005, అక్టోబర్ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 86 వేల మంది మరణించారు. రాజధాని ఇస్లామాబాద్‌కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పాకిస్తాన్లో ఈ భూకంపం సంభవించింది. 4. ఇరాన్: 1990, జూన్ 21న ఉత్తర ఇరాన్లో సంభవించిన భూకంపంలో 50 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలొదిలారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భూకంప తాకిడికి ఇరాన్‌లోని మంజిల్, రడ్బర్ పట్టణాలు నేలమట్టమయ్యాయి. 5. ఇరాన్: 2003, డిసెంబర్ 26న బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇది రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం తాకిడికి నగరంలోని 70 శాతం ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి. 6. జపాన్: 2011, మార్చి 11న జపాన్‌లో సంభవించిన సునామీ భూకంపంలో 20,896 మంది ప్రాణాలు కోల్పోయారు. 8.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సాండియాకు 80 మైళ్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. 7. భారతదేశం: 2001, జనవరి 26న భుజ్‌లో సంభవించిన భూకంపంలో 20,085 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. గుజరాత్లో దాదాపు సగం జనాభా ఈ విపత్తుకు ప్రభావితమయ్యింది. 8. టర్కీ: 1999 ఆగస్టు 17న పశ్చిమ టర్కీలోని ఇజ్మిత్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 17,118 మంది మరణించారు. ఈ భూకంపం దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. 9. భారతదేశం: 1993, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని లాతూర్‌లో సంభవించిన భూకంపానికి 20 వేల మంది బలయ్యారు. ఈ భూకంప తీవ్రతకు లాతూర్ పట్టణమంతా ధ్వంసమయ్యింది. 40 సెకెన్లపాటు సంభవించిన ఈ భూకంపంలో 30 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. 10. ఇండోనేషియా: జావాలో 2006 మే 27న 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 5,749 మంది మృతి చెందారు. రెండేళ్ల వ్యవధిలో ఇండోనేషియాలో సంభవించిన మూడో అతిపెద్ద విపత్తు ఇది. 2009, సెప్టెంబరు 30న దక్షిణ సుమత్రాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,117 మంది మృత్యువాత పడ్డారు. ఇది కూడా చదవండి: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం? -
చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..
జీవితంలో ఎదురయ్యే చిన్నాచితకా కష్టాల గురించి ఇక మీదట నేను యాగీ చేయను. తల్లీ నువ్వొక గురువువి’ అని ట్వీట్ చేశాడు ఆనంద్ మహీంద్ర, పారా ఆర్చర్ శీతల్ దేవి గురించి. అంతే కాదు తమ సంస్థ నుంచి కోరిన కారు తీసుకోమన్నాడు.రెండు చేతులూ లేకపోయినా విలువిద్య అభ్యసించి ఆసియా పారాగేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కశ్మీర్ అమ్మాయి శీతల్‌దేవి జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో తన పట్టుదలతో చూపించింది. ఆమె జీవితం ఒక ఆదర్శమైతే ఆమె నేర్పిన పాఠం సాకులు చెప్పేవారికి గుణపాఠం. 2021లో బెంగళూరుకు చెందిన ‘బీయింగ్ యు’ అనే సంస్థ శీతల్‌కు ప్రోస్థెటిక్ చేతులు పెట్టించడానికి ఏర్పాట్లు చేసింది. ‘ప్రొస్థెటిక్ చేతులు పెడితే నువ్వు చేసే మొదటి పని ఏమిటి?’ అని అడిగితే ‘గాజులు వేసుకుంటా’ అని టక్కున సమాధానం చెప్పింది శీతల్. నిజానికి ఆ అలంకరణకు తప్పితే మిగిలిన అన్ని పనులకు, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శీతల్‌కు తన ఆత్మవిశ్వాసం చాలు. అందుకే ఆమె ప్రోస్థెటిక్ చేతులను పెద్దగా ఉపయోగించదు. దాదాపు పెట్టుకోదనే చెప్పాలి. ‘నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను’ అంటుంది శీతల్. ఈ ధైర్యం ఎంతమందికి ఉంది? రికార్డులు తిరగరాసింది ఇటీవల చైనాలో ముగిసిన ‘ఆసియన్ పారా గేమ్స్’ (దివ్యాంగుల క్రీడలు)లో విలువిద్యలో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి రికార్డు సృష్టించింది శీతల్ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్య లో రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు లేరు. అది ఒక పెద్ద విశేషం అయితే అంతకన్నా పెద్ద విశేషం శీతల్‌కు రెండుచేతులూ లేకపోవడం. అయినా సరే కుడికాలితో విల్లు ఎత్తి, కుడి భుజంతో నారి సారించి, 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలిందంటే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు సంధిస్తాడు కాబట్టి సవ్యసాచి అన్నారు. శీతల్‌కు చేతులు లేకపోయినా రెండు కాళ్లతో బాణాలు సంధిస్తే ఏమని పిలవాలో. ‘నవ్యసాచి’ అనాలేమో! " You will need Arms to compete at Archery " Sheetal Devi : OKAY , WATCH ME !!! First Female Armless Archer to play World Final 🤯#AsianParaGames #Praise4Para pic.twitter.com/8qS2THRxM0 — The Khel India (@TheKhelIndia) October 27, 2023 జీవితం గొప్పది ‘జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు, జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు, జీవితాన్ని ఎందుకు వృథా చేస్తున్నావు’ అని ఎవరినైనా అడిగితే సవాలక్ష వంకలు చెబుతారు, అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలు వచ్చాయంటారు, రోజువారి జీవితంలో వచ్చే చిన్నాచితకా సమస్యలకు చికాకు పడిపోతుంటారు, జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు... కాని శీతల్‌ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా అదే అన్నాడు శీతల్‌ను చూసి– ‘తల్లి.. నిన్ను చూశాక జీవితం విలువ తెలిసింది’ అని! ఆమెకు కారు ఆఫర్ చేశాడు. కశ్మీర్ అమ్మాయి శీతల్ దిగువ మధ్యతరగతి కశ్మీర్ అమ్మాయి. వీళ్లది కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం. తండ్రి మాన్ సింగ్ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటుంది. వీరి పెద్దకూతురు శీతల్. చిన్న కూతురు శివాని. శీతల్‌కు పుట్టుకతో చేతులు ఏర్పడలేదు. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో ‘ఫొకొమెలియా’ అంటారు. అయితే శీతల్ నిరాశలో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను బేలగా పెంచలేదు. శీతల్ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవడం వల్ల మిగిలిన శరీరం అంతా మరింత సూక్ష్మంగా, దృఢంగా తయారయ్యింది. రెండు చేతులూ లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యం. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవడం, ఫోన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది. 2 year's before whn I visited to #SheetalDevi village in Loi Dhaar (Kishtwar), she totally surprised me by her actions. She was adopted by Indian Army 11 RR Col. Shishpal & thy mde efforts & tried to tie up with no. of NGO's. It ws difficult task bt nvr fr Army @NorthernComd_IA pic.twitter.com/b69zvkDaEl — Deepak Prem Thakur 🇮🇳 (@DeepakThakur_10) October 30, 2023 జీవితం అలాగే సాగిపోయేదేమో కాని కరోనా లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్ యు గురించి తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్.. శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్‌లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంతకన్నా విజయం ఉందా? ‘నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గం అని మా కోచ్‌ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను. చాలా చాలా కష్టపడ్డాను’ అంటుంది శీతల్. అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు లేకపోవచ్చు. కాని కష్టపడితే? గెలుపు తథ్యం. శీతల్‌ను చూసి మన జీవితాల్లో లక్ష్యాన్ని గురి చూద్దాం. (చదవండి: ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు) -
హమాస్ దాడులకు ఆ ఎంవోయూ కారణం కావొచ్చు!
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కూడా దాడులకు ఒక కారణం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం..) ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి పాతిక్రేయ సమావేశం నిర్వహించిన బైడెన్.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల గురించి స్పందించారు. హమాస్ దాడుల వెనక భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రకటన కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి రుజువులు మా దగ్గర లేకున్నా.. అది నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్ విషయంలో వెనక్కి తగ్గం అని బైడెన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా.. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ కోసం అవగాహన తాఖీదు(ఎంవోయూ) జరిగింది. భారత్‌తో పాటు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్‌యూనియన్‌లు ఆ ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆసియా, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్ మధ్య ఆర్థిక మెరుగైన అనుసంధానం కోసం.. ముఖ్యంగా ఆర్థిక ఏకీకరణ ద్వారా కారిడార్ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ఎంవోయూ కుదర్చుకున్నాయి ఆయా దేశాలు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను రెండు ప్రత్యేక కారిడార్లుగా విభజించారు. తూర్పు కారిడార్ భారత్ నుంచి పశ్చిమ మధ్య ఆసియాను అనుసంధానిస్తుంది. అలాగే.. ఉత్తర కారిడార్ పశ్చిమ ఆసియాతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్‌ను అనుసంధానిస్తుంది. తాజాగా ఈ కారిడార్‌పై బైడెన్ స్పందిస్తూ.. ఇది రెండు ఖండాల మధ్య పెట్టుబడి అవకాశాలను పెంపొదిస్తుందంటూ ప్రశంసలు సైతం గుప్పించారు. ముఖ్యంగా సుస్థిరమైన మిడిల్ ఈస్ట్ నిర్మాణానికి ఈ కారిడార్ గుండా ఏర్పాటయ్యే రైల్వే పోర్ట్ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారాయన. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకి చేరుకుంది. హమాస్‌ను తుడిచిపెట్టేంత వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటూనే.. గాజాపై దాడుల్ని ఉధృతం చేయాలని తమ రక్షణ దళాన్ని ఆదేశించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ. మరోవైపు ఇజ్రాయెల్ బంధీల ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని హమాస్ భావిస్తోంది. -
అందమైన ఈ పువ్వులతో..హార్ట్ ఎటాక్ ముప్పు !
అందమైన పువ్వుల్ని చూడగానే మన ముఖంలో అనుకోకుండా చిరు నవ్వులు పూస్తాయి. ఒక్కోసారి అలాంటి మొక్కల్ని మన గార్డెన్లో కూడా పెంచుకోవాలని ఉబలాటపడతాం. ఇకపై ఇలాంటి ప్రయత్నాలకు కొంచెం ఆలోచన జోడించాల్సిందే! ఎందుకంటే కొన్ని రకాల పువ్వులు మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు తాజాగా హెచ్చరి స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన గార్డెన్ ఫేవరెట్‌గా పేరొందిన ఫాక్స్‌గ్లోవ్ పుష్పాలపై సైంటిస్టులు కీలకహెచ్చరికలు చేశారు. ఇది యూరప్ ఆసియాకు చెందిన తీగ జాతి మొక్క. ఈ మొక్కను "డెడ్ మ్యాన్స్ బెల్స్" లేదా "మంత్రగత్తెల చేతి తొడుగులు" అనే పేరుతో విక్రయిస్తారట. సాధారణ ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ పర్పురియా) మొక్క పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో ఉంటాయి. పెండ్యులస్, ట్రంపెట్ ఆకారలో గుత్తుల గుత్తుల పువ్వులు మంత్రముగ్ధులను చేస్తాయి. అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫాక్స్‌గ్లోవ్ అందమైన పువ్వుల్ని ఇవ్వడమే కాదు, గుండెపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన కార్డియాక్ గ్లైకోసైడ్గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని కూడా కలిగి ఉంటాయి. ఇవి గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయని బఫెలో, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, డాక్టర్ జెన్ వాంగ్ లైవ్ సైన్స్‌తో చెప్పారు. ఆరోగ్యకరమైన గుండె వేలకొద్దీ కార్డియాక్ కణాల ద్వారా రక్తాన్ని శరీరానికి పంపిస్తుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గా పిలిచే గుండె లయకు డిగోక్సిన్తో ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడితే రసాయన సమస్యలు తలెత్తుతాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా, మరణానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. ఫాక్స్‌గ్లోవ్ “చనిపోయినవారిని తిరిగి బతికించగలు. జీవించి ఉన్నవారిని చంపగలదు” అనేది పాత ఆంగ్ల సామెత. ఫాక్స్ గ్లోవ్‌లో అంతటి గొప్ప, ప్రాణాలను రక్షించే ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని డాక్టర్ వాంగ్ కూడా చెప్పారు. ఫాక్స్గ్లోవ్స్లోని డిగోక్సిన్ తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ - డిగోక్సిన్ విలువైన గుండె మందులాగా చాలా పాపులర్ అని, ఇతర మందులేవీ పనిచేయనపుడు గుండె వైఫల్య చికిత్సలో ఇది బాగా పనిచేస్తుందని సూచించారు. -
బర్గర్ కింగ్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండ్ కంపెనీ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో 25.36 శాతం వాటాను ప్రమోటర్ సంస్థ విక్రయించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థ క్యూఎస్ఆర్ ఏషియా పీటీఈ ద్వారా ఎవర్‌స్టోన్ క్యాపిటల్ రూ. 1,494 కోట్లకు ఈ వాటాను అమ్మివేసింది. షేరుకి రూ. 119.1 సగటు ధరలో 25.3 శాతం వాటాకు సమానమైన 12,54,41,820 షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అమల్ ఎన్ పారిఖ్, టాటా ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ సింగపూర్3 బ్యాంకెన్ ఏషియా స్టాక్‌మిక్స్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ తదితరాలు షేర్లను కొనుగోలు చేశాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి రెస్టారెంట్ బ్రాండ్స్‌లో ఎవర్‌స్టోన్ వాటా 40.8 శాతం నుంచి 15.44 శాతానికి క్షీణించింది. రెస్టారెంట్ బ్రాండ్స్ దేశీయంగా బర్గర్ కింగ్ ఇండియా, పోపియస్ బ్రాండ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో రెస్టారెంట్ బ్రాండ్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 128 వద్ద ముగిసింది. -
ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది?
ప్రతి వ్యక్తి వివిధ కూరలతో నిండిన ప్లేట్లోని ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాడు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటిది ఇది కళ్లకు ఇంపుగా కనిపించడం. రెండవది మన శరీరానికి అవసరమైన రీతిలో పోషకాలను అందించడం. అయితే ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడుందనే ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడైనా తలెత్తితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అతిపెద్ద కూరగాయల మార్కెట్ కలిగిన ఘనత భారత్ ఖాతాలోనే ఉందని తెలిస్తే ఎవరైనా చాలా సంతోషిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో ఉంది. ఆ మార్కెట్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని చాలామంది రైతులు ఆ మార్కెట్లో వ్యాపారం చేయాలని తపన పడుతుంటారు. 90 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్ ఈ మార్కెట్ విస్తీర్ణం దాదాపు 90 ఎకరాలు. ఆజాద్‌పూర్ మండికి వెళ్లగానే ముందుగా పెద్ద గేటు కనిపిస్తుంది. దానిపై ‘చౌదరి హరి సింగ్ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్‌పూర్’ అని రాసివుంటుంది. అక్కడ ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. భారతదేశంలో లభించే అన్ని రకాల కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. చిన్న, పెద్ద వ్యాపారులు ఇక్కడ విరివిగా కనిపిస్తారు. డీల్ కుదుర్చుకున్న తర్వాత కొందరికి లాభం చేకూరుతుంది. మరికొందరు గిట్టుబాటు ధర లభించక డీలా పడుతూ కనిపిస్తారు. ఈ మార్కెట్లో మహిళలు కూడా అధికసంఖ్యలో కనిపిస్తారు. ఇంటి బాధ్యతలతో పాటు వారు కూరగాయల వ్యాపారాన్ని కూడా చక్కబెడుతుంటారు. 1977లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ మండి కమిటీల వివిధ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలను నిర్వహించడానికి, నియంత్రించడానికి, మార్గనిర్దేశం చేయడానికి 1977లో ఆజాద్‌పూర్ మండిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఏర్పాటయ్యింది. మండి పరిషత్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వివిధ చట్టాలను రూపొందించింది. ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది? -
ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్!
తులిప్ గార్డెన్ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మొమోరియల్ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో ట్విట్టర్లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్ గార్డెన్ ఆసియాలో అతిపెద్దది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం. అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్ తోట శ్రీనగర్‌లోని దాల్ సరస్సు జబర్వాన్ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో దీని సిరాజ్ బాగ్ అనిపిలిచే వారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్ లోయలో ఏడు టెర్రస్లతో కూడిన టెర్రస్ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్‌ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్‌లోని వివిధ రకాల పూలతో తులిప్ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడం విశేషం. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్‌లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్‌తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్‌లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్‌లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్‌ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్‌లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా ఉన్నాడు. ఒకప్పుడు సచిన్, ధోనిలు చూసిన సంపద వైభోగాన్ని ఇప్పుడు కోహ్లి చూస్తున్నాడు. లెక్కలేనన్ని ఎండార్స్మెంట్లు, యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఆసియా ఖండంలో మాత్రం కోహ్లి రెండో ధనవంతమైన ఆటగాడిగా నిలిచాడని స్పోర్టికో అనే సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది. 2022 ఏడాదిలో రూ.277 కోట్లు సంపాదించిన కోహ్లి.. ఓవరాల్‌గా అత్యంత ధనవంతమైన ఆటగాళ్ల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్-100 లిస్ట్‌లో కోహ్లి మినహా ఏ క్రికెటర్ చోటు సంపాదించలేకపోయాడు. మరి ఆసియా ఖండం నుంచి టాప్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరని ఆరా తీస్తే జపాన్‌కు మహిలా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అని తేలింది. 2022 ఏడాదిలో ఈ మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ రూ. 434 కోట్లకు పైగా అర్జించినట్లు రిపోర్టులో వెల్లడించింది. రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఎన్బీఏ స్టార్ లెబ్రన్ జేమ్స్ రూ.1037 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. లియోనల్ మెస్సీ రూ.997 కోట్లతో రెండో స్థానం, క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్లతో మూడో స్థానం, నెయ్మర్ రూ. 843 కోట్లతో నాలుగో స్థానం.. ఇక టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్ రూ.727 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రెడ్డీస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటుపై అవగాహన కార్యక్రమాలతో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 30,813 మంది వైద్యులు పంపిన సందేశాలను ఆకులుగా అలంకరించి అతి పెద్ద హృదయాకృతిని రూపొందించినందుకు గాను ఈ ఘనత దక్కించుకుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఈ ఇన్‌స్టాలేషన్‌ను హైదరాబాద్ బాచుపల్లిలోని కంపెనీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. -
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
ఆసియాలో అతిపెద్ద చర్చి కరుణాపురంలో
ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు.. ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. అద్భుత కట్టడంగా.. కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్‌లోని జున్హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్‌తో అనుబంధంగా ఉండటం విశేషం. ప్రత్యేకతలు ఇవీ.. ♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫ్ మెటీరియల్ అద్దారు. ♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. ♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు. ♦ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు. ♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు. -
Race Walking Championship 2023: అక్ష్దీప్ సింగ్‌కు స్వర్ణం
నోమి (జపాన్): ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అక్ష్దీప్ సింగ్ 1 గంట 20 నిమిషాల 57 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఓపెన్ కేటగిరీలో పోటీపడిన భారత అథ్లెట్లు వికాష్ సింగ్, పరమ్‌జీత్ ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ప్రపంచ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం 1 గంట 20 నిమిషాల 10 సెకన్లను వికాష్ (1గం:20ని :05 సెకన్లు), పరమ్‌జీత్ (1గం: 20:08 సెకన్లు) అందుకున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో పోటీపడిన వారి సమయాన్ని పతకాల కోసం పరిగణనలోకి తీసుకోరు. -
విశ్వవేదికపై ఏనుగుఘీంకారం.. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?
ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే వారికి ఎలిఫెంట్ విస్పరర్స్వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మనిషికి, జంతువుకి, ప్రకృతికి మధ్య ఉండే గాఢానుబంధం మరోసారి చర్చకు వచ్చింది. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉంది ? ఏనుగంటే మనకి ఒక జంతువు కాదు. అంతకంటే ఎక్కువే. గణనాథుడి మారురూపంగా గజరాజుల్ని పూజిస్తాం.. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు మంచినీళ్లు తాగింది ఏనుగూ అంటూ ఏనుగు మనకెంత ముఖ్యమైనదో చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుని చూడడమంటే అదొక సంభ్రమం. కానీ ఏనుగుల్ని కాపాడుకోవడంలో మనం అంతగా శ్రద్ధ కనబరచడం లేదనే చెప్పాలి. ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడడం, ఏనుగుల ఆవాసాలైనా కారిడార్లను ఆక్రమించుకోవడం, ఏనుగుల కారిడార్లలోనే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో ఏనుగుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సంరక్షణకి ఏం చేస్తున్నాం ? జీవవైవిధ్యానికి అత్యంత కీలకమైన ఏనుగుల్ని కాపాడుకోవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్టు 30 ఏళ్లవుతున్నప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఏనుగుల్ని కాపాడుకోవడానికి మనకి ప్రత్యేకంగా చట్టాలేమీ లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకే ఏనుగులూ వస్తాయి. దీంతో ఏనుగులు ఆవాసం ఉండే కారిడార్లు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన రిజర్వ్‌ల నిర్వహణలన్నీ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఏనుగులెంత కీలకమో గ్రహించిన కేంద్రం 2010లో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. ఏనుగుల సంరక్షణ విధానాలను సమీక్షించడానికి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్)ని ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మార్చాలని, ఏనుగుల సంరక్షణ కోసం జాతీయ ఏనుగుల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అయితే నిధుల కొరతతో ఆ చర్యలేవీ కేంద్రం తీసుకోలేదు. ప్రతీ ఏడాది ఏనుగుల సంరక్షణ కోసం రూ.30–35 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయిస్తున్నారు. 2020లో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఏనుగుల రిజర్వ్‌లను చేరుస్తూ సవరణలు చేశారు. 2022, ఆగస్టు 2న సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. అంతకు మించి ఏనుగుల రక్షణకు ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోలేదు.. ఏనుగులు, మనుషులకి మధ్య ఘర్షణ ఏనుగులకి, మనుషులకి మధ్య నిత్యం ఒక ఘర్షణ నెలకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అడవుల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాడో ఏనుగులు గుంపులు గుంపులుగా పంట పొలాలపైకి పడడం, రైతుల్ని తమ కాళ్ల కింద పడి తొక్కేసి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏనుగుల బారి నుంచి పంటల్ని కాపాడడానికి విద్యుత్ కంచెలు , కందకాలు ఏర్పాటు వంటివి చేయడంతో అవి చనిపోతున్నాయి. ఇక ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో వాటిని అక్రమంగా వేటాడుతున్న వారూ ఉన్నారు. ఏనుగుల కారిడార్లలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అవి బలైపోతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో రైల్వే ట్రాక్‌ల కింద పడి 265 ఏనుగులు మరణించాయి. ఏనుగులు జరిపే దాడుల్లో ఏడాదికి సగటున 500మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రజల చేతుల్లో ఏడాదికి సగటున 100 గజరాజులు మరణిస్తున్నాయి. ఏనుగుల్ని మరింత సంరక్షించాలంటే, అవి ప్రజలు, పంట పొలాల జోలికి రాకుండా ఉండాలంటే ఏనుగులుండే కారిడార్లను పటిష్ట పరచాల్సి ఉంది. దేశంలో 110 ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ 70% మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 29% కారిడార్లు ఆక్రమణకి లోనయ్యాయి. 66% కారిడార్లలో జాతీయ రహదారుల వెంబడి వెళుతున్నాయి. 22 కారిడార్లలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఏనుగుల తినే తిండి ఎక్కువ కావడంతో అవి ప్రతీ రోజూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. అవి సంచరించే మార్గాల్లో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, మైనింగ్ తవ్వకాలు, కాలువలు, ఫెన్సింగ్‌లు ఉండడం వాటికి దుర్భరంగా మారింది. రైళ్లు, వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్నాయి. అందుకే ఏనుగులు సంచరించే కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఏనుగుల సంచారం కోసమే ప్రత్యేకంగా వంతెనలు నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి - సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్‌లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్‌లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్‌చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్‌లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్‌వెస్ట్ బ్యాంక్‌కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
Asian indoor athletics championships: షాట్‌పుట్‌లో తజీందర్ పాల్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్‌లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
అలా కలిసొచ్చింది.. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
Asia Mixed Team Badminton Championship 2023: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. అదే విధంగా.. ►మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఆకర్షి కశ్యప్ ►పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ జోడీలు... ►మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, శిఖా గౌతమ్–అశ్విని భట్ జోడీలు.... ►మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్ -
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..
సాధారణంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారికో, సర్జరీలు జరిగిన వారికో సెలైన్ పెట్టడం చూస్తూనే ఉంటాం. కానీ చెట్లకు పెద్ద పెద్ద సెలైన్లు పెడితే..!? ఇదేం పిచ్చి ఆలోచన, చెట్లకు సెలైన్ ఎందుకు? దానితో లాభమేంటి? అనిపిస్తోంది కదా.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు ఇలాంటి ఎన్నో సందేహాలు, అభిప్రాయాలను మోసుకొచ్చాయి.. నిరసనో.. చికిత్సనో అనుకుని.. చెట్లకు సెలైన్ పెట్టిన ఫొటోలను చూసి చాలా మంది.. అడవుల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమమేమో అనుకున్నారు. కొందరైతే ఫంగస్ సోకిన చెట్లకు చికిత్సగా మందు పెట్టారని అన్నారు. కానీ అసలు విషయం తెలిసి చాలా మంది అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఈ చెట్లకు సెలైన్ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి మరి. రక్షణ కోసం సుగంధం.. ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి. పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు. నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్ సోకినప్పుడు.. దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెసిన్ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది. పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు. ఆ విషాన్నే ఎక్కిస్తూ.. నిజానికి ఈ ఫంగస్ చెట్లకు విషం వంటిది. దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్‌ను విడుదల చేసుకుంటాయి. దీనిని గుర్తించిన పెంపకందారులు.. సదరు ఫంగస్ కలిపిన ద్రావణాన్ని సెలైన్ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు. దీనితో చెట్లు రెసిన్ విడుదల చేస్తాయి. కాండం సుగంధ కలపగా మారుతుంది. నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు. కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ. ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు. సెలైన్‌లో ఫంగస్‌తో.. ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు. ఫంగస్ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్ నిండుతుంది. అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్ ద్రావణాన్ని సెలైన్లా ఎక్కిస్తుంటారు. ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చెట్టును కొట్టి.. కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు. సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు. ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది. ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట. - సాక్షి, సెంట్రల్‌డెస్క్ Before agarwood can be harvested, the Aquilaria malaccensis tree must be infected with mold first pic.twitter.com/oFW90CDNYD — Business Insider (@BusinessInsider) November 14, 2022 -
Asian Continental Chess: మెరిసిన హర్ష, ప్రియాంక
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోర్నీలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది. -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
లంకకు నమీబియా షాక్
గిలాంగ్: ఆసియా టి20 చాంపియన్ శ్రీలంకకు క్రికెట్ కూన నమీబియా పెద్ద షాకే ఇచ్చింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్ (క్వాలిఫయర్స్) మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో 2014 టి20 ప్రపంచకప్ విజేత లంకను చిత్తు చేసింది. గతేడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న నమీబియా ఇక్కడ తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసింది. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఒకదశలో 14.2 ఓవర్లలో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నమీబియాను ఫ్రయ్‌లింక్, స్మిట్ ధాటిగా ఆడి ఆదుకున్నారు. ఇద్దరు చివరి 5.4 ఓవర్లలోనే ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ దాసున్ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాజపక్స (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) తప్ప ఇంకెవరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఫ్రయ్‌లింక్ (2/26), స్మిట్ (1/16) బంతితోనూ ఆకట్టుకున్నారు. వీస్, బెర్నార్డ్, షికొంగో తలా 2 వికెట్లు తీశారు. నెదర్లాండ్స్ బోణీ ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నెదర్లాండ్స్ ఆఖరిదాకా చెమటోడ్చి నెగ్గింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్ ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా... నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ఓపెనర్ వసీమ్ (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. బస్ డి లీడే (3/19) ఒక్క ఓవర్‌తో మలుపు తిప్పాడు. 91/2 స్కోరుతో ఒకదశలో పటిష్టంగానే కనిపించిన యూఏఈకు అదేస్కోరుపై వసీమ్ వికెట్‌ను కోల్పోయాక కష్టాలు మొదలయ్యాయి. 18వ ఓవర్లో ఫరీద్ (2) రనౌటయ్యాడు. ధనాధన్ ఆడే డెత్ ఓవర్లలో పరుగులకు బదులు వికెట్లు రాలడంతో యూఏఈ ఊహించనిరీతిలో కట్టడి అయ్యింది. 19వ ఓవర్ వేసిన డి లీడే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరవింద్ (18), బాసిల్ హమీద్ (4), కెప్టెన్ రిజ్వాన్ (1)లను లీడే అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో అఫ్జల్ ఖాన్ (5)ను క్లాసెన్ పెవిలియన్ చేర్చడంతో... కేవలం 19 పరుగుల వ్యవధిలోనే యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది. తర్వాత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఓడోడ్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్ (16 నాటౌట్), ప్రింగిల్ (5) కుదురుగా ఆడి గెలిపించారు. జునైద్ సిద్ధిఖ్ 3 వికెట్లు తీశాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో 19 ఓవర్లో ప్రింగిల్ను జహూర్ ఖాన్ అవుట్ చేయగా 4 పరుగులే వచ్చాయి. 6 బంతుల్లో 6 పరుగుల విజయ సమీకరణం యూఏఈని ఊరించినప్పటికీ ఎడ్వర్డ్స్, వాన్ బిక్ (4) షాట్ల జోలికి వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీసి జట్టును గెలిపించారు. గ్రూప్ ‘బి’లో నేటి మ్యాచ్‌లు స్కాట్లాండ్ vs వెస్టిండీస్ (ఉదయం గం. 9:30 నుంచి) ఐర్లాండ్ vs జింబాబ్వే (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్‌లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌లోనే కాసెరస్ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్‌లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
ఆసియాలో టాప్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్ తర్వాత అగ్రస్థాయి టెక్నాలజీ కేంద్రాలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. నైపుణ్యాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్, వ్యాపార అనుకూల వాతావరణం ఇత్యాది 14 అంశాల ఆధారంగా టాప్ టెక్నాలజీ హబ్‌లను కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సంలో బెంగళూరు 2,30,813 టెక్నాలజీ ఉద్యోగాలను కల్పించింది. ఆ తర్వాత చెన్నైలో 1,12,781, హైదరాబాద్‌లో 1,03,032 మందికి, ఢిల్లీలో 89,996 మందికి కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించాయి. ఐటీ, టెక్నాలజీ ఆధారిత రంగాలు భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే కీలక చోదకాలుగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ భారత ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ మూలాలు బలంగా ఉన్నాయి. దీంతో ప్రపంచ ఐటీ సంస్థలకు భారత్ అనుకూల కేంద్రంగా అవతరించింది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు సైతం కేంద్రంగా ఉంది’’అని జైన్ వివరించారు. కార్యాలయ స్థలాల లీజులో (ఆఫీస్ స్పేస్) బెంగళూరు సగటున 38–40 శాతం వాటాను కలిగి ఉందని.. అలాగే, బెంగళూరులో వార్షిక ఆఫీసు లీజు పరిమాణంలో టెక్నాలజీ రంగాలకు సంబంధించి 38–40 శాతంగా ఉందని ఈ నివేదిక తెలిపింది. -
ఆసియా లీడర్ల భేటీకి కేటీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి జూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్ల సిరీస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆసియా, యూరప్‌లోని అత్యంత ప్రభావశీల నాయకుల నడుమ బహిరంగ చర్చకు వీలు కల్పిస్తూ ఆసియా లీడర్స్ సిరీస్ ఒక తటస్థ వేదికగా పనిచేస్తోంది. దేశాల నడుమ భిన్నత్వం, భాగస్వామ్యాలకు మద్దతు, పరస్పర విశ్వాసంతో కూడిన సంబంధాలు మెరుగు పరచడం వంటి అంశాల్లో చర్చకు ఈ వేదిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. జూరిచ్‌లో జరిగే ఈ భేటీకి ఆసియా, యూరప్ నుంచి సుమారు వంద మంది ప్రముఖ వాణిజ్యవేత్తలు హాజరు కానున్నారు. యూరప్ ఆసియా కారిడార్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలపై పెరుగుతున్న రాజకీయ అస్థిరత ప్రభావంపై జూరిచ్ ఆసియా లీడర్ల సిరీస్ వేదికగా చర్చ జరగనుంది. అర్థవంతమైన చర్చకు బాటలు వేయడం లక్ష్యంగా తమ వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు రావాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ పేర్కొన్నారు. చదవండి: కేంద్రమంత్రిపై కస్సుమన్న హరీష్‌రావు.. స్ట్రాంగ్ కౌంటర్ -
అణు వినాశనం ముంగిట ప్రపంచం: గుటెర్రస్
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు. -
ఆసియాలోనే పెద్ద మార్కెట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ లే ఔట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్)కు టెండర్ అప్పగించామన్నారు. నమూనా లే ఔట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపామని, సోమవారం రెండు లే ఔట్లను పరిశీలించి, మార్పులు చేర్పులకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రముఖ మార్కెట్లైన ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్ కోట్, బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లేఔట్ల నమూనా తయారు చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో ఆర్ఆర్ఆర్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని ఆయన తెలిపారు. -
సావిత్రీ జిందాల్..: ఆసియాలోకెల్లా సంపన్నురాలు
న్యూఢిల్లీ: జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రీ జిందాల్ (72) ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలోని అతి పెద్ద రియల్టీ దిగ్గజం కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ కో చైర్పర్సన్ యాంగ్ హుయాన్ (41) మూడో స్థానానికి పడిపోయారు. చైనాకే చెందిన మరో వ్యాపార దిగ్గజం ఫాన్ హాంగ్‌వియ్ (55) రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల తాజా సూచీ ఈ మేరకు పేర్కొంది. జిందాల్, ఫాన్ నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు (రూ.89,490 కోట్లు) కాగా యాంగ్ సంపద 11 బిలియన్ డాలర్లకు (రూ.87,114 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 23.7 బిలియన్ డాలర్లున్న యాంగ్ సంపద విలువ చైనా రియల్టీ సంక్షోభానికి అద్దం పడుతూ ఏడు నెలల్లోనే 50 శాతానికి పైగా పడివడం గమనార్హం! ఆమె సంపద ఒక దశలో ఒక్క రోజులోనే 100 కోట్ల డాలర్ల మేరకు హరించుకుపోయింది! కరోనా నేపథ్యంలో సావిత్రీ జిందాల్ ఆస్తులు కూడా విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2020 ఏప్రిల్‌లో ఏకంగా 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రెండేళ్లలో 15.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2005లో భర్త ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రి పదో స్థానంలో ఉన్నారు. సాధికారతకు ప్రతిరూపం 72 ఏళ్ల సావిత్రీ జిందాల్ మహిళా సాధికారతకు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఆమె 1950 మార్చి 20న అసోంలోని తిన్సుకియా పట్టణంలో జన్మించారు. 1970లో ఓపీ జిందాల్‌ను పెళ్లాడారు. 50 ఏళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్‌లో బకెట్ల తయారీ ప్లాంటుతో కెరీర్ మొదలు పెట్టిన ఓపీ జిందాల్ కొన్నేళ్లలోనే దాన్నో భారీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు. భర్త మరణానంతరం 2005లో సంస్థ పగ్గాలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆయన రాజకీయ వారసత్వాన్నీ కొనసాగించారు. హిస్సార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హరియాణా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె సారథ్యంలో కంపెనీ నికర విలువ ఏకంగా నాలుగింతలు పెరిగింది. అయితే స్టీల్, సిమెంటు, ఇంధన, ఇన్ఫ్రా వంటి పలు రంగాల్లో విస్తరించిన జిందాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్న సావిత్రి కాలేజీ చదువు కూడా చదవకపోవడం విశేషం. జిందాల్స్ది పక్కా సంప్రదాయ కుటుంబం కావడంతో భర్త ఉండగా ఎన్నడూ తెరపైకి రాకుండా గడిపారామె! కనీసం భర్తను ఎన్నడూ ఎంత సంపాదిస్తున్నారని కూడా అడిగి ఎరగనంటారు! జిందాల్ కుటుంబంలో మహిళలు పెద్దగా బయటికే రారని 2010లో ఫోర్బ్స్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి స్వయంగా చెప్పారు కూడా. ‘‘మా కుటుంబంలో బయటి పనులన్నీ మగవాళ్లే చూసుకుంటారు. ఆడవాళ్లం ఇంటి బాధ్యతలకు పరిమితమవుతాం. మా ఆయన ఉండగా నేనెప్పుడూ కనీసం (స్థానిక) హిస్సార్ మార్కెట్‌కు కూడా వెళ్లింది లేదు! మార్కెట్లో ఉండేవాళ్లంతా మా బంధువులేనని, పైగా నాకంటే పెద్దవాళ్లని మా ఆయన చెబుతుండేవారు. మా కుటుంబంలో మహిళలు పెద్దలతో మాట్లాడకూడదన్నది ఓ మర్యాద’’ అని వివరించారు. కంపెనీ వ్యాపార బాధ్యతలను కుమారులు పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్ జిందాల్ చూసుకుంటారు. భర్త మాదిరిగానే ఆమె కూడా సామాజిక కార్యకలాపాల్లో నిత్యం చురుగ్గా ఉంటారు. ఫ్యాక్టరీలు పెట్టిన ప్రతి చోటా విధిగా స్థానికుల కోసం స్కూలు, ఆస్పత్రి కూడా స్థాపించడం జిందాల్స్ పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. తమ కంపెనీల్లో పని చేసేవాళ్లు కూడా కుటుంబంలో భాగమేనన్న ఓపీ జిందాల్ ఫిలాసఫీని సావిత్రి కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటారు. యాంగ్ అలా... మరోవైపు ఐదేళ్ల పాటు ఆసియా సంపన్న మహిళల్లో టాప్‌గా నిలిచిన 41 ఏళ్ల యాంగ్ మాత్రం సావిత్రికి భిన్నంగా లో ప్రొఫైల్‌లో గడుపుతుంటారు. ఇంతటి సోషల్ మీడియా యుగంలోనూ కనీసం ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్లో పెద్దగా అందుబాటులో లేవంటే యాంగ్ది ఎంతటి ప్రైవేట్ జీవితమో అర్థం చేసుకోవచ్చు. -
కలిసొచ్చిన అదృష్టం: ఆసియా రిచెస్ట్ విమెన్‌గా సావిత్రి జిందాల్ రికార్డు
సాక్షి, ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌ను స్థానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ మేజర్ వాటాదారురాలైన యాంగ్ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రినుంచి యాంగ్, భర్త అకాలమరణంతో సావిత్రి జిందాల్) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను చేపట్టడం విశేషం. 11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డాలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్ డాలర్లతో దేశంలో టాప్-10లో ఉన్న ఏకైక మహిళ కూడా. 2005లో భర్త ఓం ప్రకాష్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు పగ్గాలను చేపట్టవలసి వచ్చింది. ఆమె నాయకత్వంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్‌లో 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్ నాటికి 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆమె ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదని చెబుతారు. అయినప్పటికీ జిందాల్ గ్రూపు వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 13 మహిళా బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. కాగా 1950లో మార్చి 20న అస్సాంలోని టిన్సుకియా పట్టణంలో జన్మించిన సావిత్రి 1970లలో ఓపీ జిందాల్‌ను వివాహం చేసుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో హర్యానా మంత్రిగా కూడా సావిత్రిజిందాల్ పాపులర్. హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా 2005లో చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో తన తండ్రి వాటాను వారసత్వంగా పొంది ఈ గ్రహం మీద ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. 20215 దాదాపు 24 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ మహిళగా నిలిచింది. అయితే గత ఐదేళ్లుగా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిన యాంగ్ సంపద ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్‌లో టాప్‌ర్యాంక్‌ను కోల్పోయారు. 2005లో యాంగ్ తండ్రి వాటాను వారసత్వంగా స్వీకరించి ఈ గ్రహం మీద అత్యంత ధనవంతురాలైన పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. -
ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తులకు చిన్న కోతతోనే శస్త్రచి కిత్స చేసే ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా పేరుపొందిన రోబో టిక్ సర్జరీ నిపుణులు స్పెయిన్‌కు చెందిన డిగో గొన్జాల్స్ రివాజ్, రొమేనియాకు చెందిన ముగురేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుడు మంజునాథ్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఆసియా లోనే తొలిసారిగా ఒకే చిన్న కోతతో చేసే సర్జరీని అందుబాటులోకి తెచ్చా మన్నారు. ఊపిరితి త్తులకు ఇన్ఫెక్షన్లు, కేన్సర్ సోకినప్పుడు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేస్తే వేగంగా కోలుకుంటారని తెలిపారు. చిన్నపాటి గాయమే కావడం వల్లే ఏ వయసువారికైనా ఈ విధానంలో శస్త్రచికిత్స చేయవ చ్చని.. ఇటీవల ఊపిరి తిత్తుల కేన్సర్‌తో బాధప డుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి అపోలో ఆస్పత్రిలో విజయ వంతంగా ఈ శస్త్రచికిత్స చేశామని వెల్లడిం చారు. రోబోటిక్ వైద్య సేవలు సమీప భవిష్యత్తులో విస్తరించ నున్నాయని వైద్యులు తెలిపారు. -
డ్రాగన్ సైనిక విన్యాసాలు
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు కొనసాగుతాయని హైనన్ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. -
ఇండో పసిఫిక్‌తో వాణిజ్య బంధం బలపడాలి
ప్యాంగ్‌టెక్ (దక్షిణ కొరియా): ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శామ్సంగ్ కంప్యూటర్ చిప్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్‌లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్ చిప్‌ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్ తన పర్యటనలో శామ్సంగ్ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు. ఈ చిన్ని చిప్‌ల్లోనే ప్రపంచ సాంకేతిక పురోగతి దాగి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్లలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి బైడెన్ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్ ఉందని బైడెన్ పేర్కొన్నారు. ఇండోç పసిఫిక్ ప్రాంతంతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకొని ఇరు ప్రాంతాల ప్రజలు మరింత సన్నిహితంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ అన్నారు. -
బైడెన్‌కు ఉత్తరకొరియా క్షిపణి భయం
వాషింగ్టన్: ఆసియాలో మొట్టమొదటి పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తరకొరియా భయం పట్టుకుంది. అణు పాటవాన్ని చాటిచెప్పేందుకు ఉత్తరకొరియా ఇటీవల కాలంలో పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఆసియా పర్యటన సమయంలోనూ ఆ దేశం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం లేదా అణు పరీక్ష జరిపేందుకు కచ్చితంగా అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని జాతీయభద్రతా సలహాదారు జేక్ సలివాన్ తెలిపారు. బైడెన్ దక్షిణ కొరియా, జపాన్లలో ఆరు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్భంగా రెండు దేశాలతో మరింత చేరువ కావడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. దీంతోపాటు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతిస్తున్న చైనాకు గట్టి సందేశం పంపించడమే అధ్యక్షుడు బైడెన్ పర్యటన ప్రధానోద్దేశమని సలివాన్ తెలిపారు. మొదటగా ఆయన దక్షిణకొరియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన యూన్ సుక్ యోల్‌తోపాటు, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భేటీ అవుతారు. వాణిజ్యం, ప్రపంచ సరఫరా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగేలా చూడటం, ఉత్తరకొరియా అణు కార్యక్రమం, ఆ దేశంలో కరోనా విజృంభణ వంటి విషయాలపై చర్చలు జరుపుతారు. ఈ పర్యటన సమయంలోనే ఇండో–పసిఫిక్ వ్యూహాత్మక కూటమి క్వాడ్ దేశాల నేతలతో భేటీ అవుతారు. ఈ కూటమిలో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, భారత్, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. క్వాడ్ భేటీకి ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఈ నెల 24వ తేదీన జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న క్వాడ్ దేశాల మూడో భేటీకి ప్రధాని మోదీ హాజరుకానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై ఆయన ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపుతారు. ఇది కూడా చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! ఎందుకంటే.. -
చైనాలో కరోనా తీవ్రత.. ప్రతిష్టాత్మక క్రీడలు వాయిదా!
Asian Games 2022: చైనాలో కోవిడ్-19 భయాల నేపథ్యంలో ఆసియా క్రీడలు-2022 వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించాల్సిన 19వ ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలిపింపిక్ కౌన్సిల్ ప్రకటించింది’’ అని పేర్కొంది. తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక షాంఘై నగరానికి సమీపంలోని హాంగ్జౌలో ఇప్పటికే ఆసియా, పారా క్రీడల కోసం 56 వేదికలు నిర్మించినట్లు నిర్వాహకులు గతంలో పేర్కొన్నారు. కాగా కరోనా తీవ్రత నేపథ్యంలో షాంఘైలో గత కొద్ది రోజులుగా లాక్డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడ బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారంటూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న తరుణంలో పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి👉🏾David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! -
వృద్ధి వేగంలో భారత్ టాప్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించింది. వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించలేదు. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచింది. భారత్ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను ఆవిష్కరించింది. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మూడు త్రైమాసికాలు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.5 శాతంగా ఉంది. ప్రస్తుత సమీక్ష క్వార్టర్లో 5.4 శాతం పురోగతి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా 23.8%, 6.6% క్షీణతలు నమోదయ్యాయి. అయితే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా 0.7% పురోగతి చోటుచేసుకుంది. వృద్ధి అంచనాలకు ‘మూడవ వేవ్’ కోత! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 9.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని జనవరిలో వేసిన తొలి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా (సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్‌లో) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 8.9 శాతానికి కుదించింది. భారత్‌లో మూడవవేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణం. తాజా అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్ల నుంచి రూ.147.72 లక్షల కోట్లకు పెరుగుతుంది. 2020–21లో క్షీణత 6.6 శాతమే! ఇక కరోనా సవాళ్లతో 2020–21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.3 శాతం క్షీణించిందని తొలి అంచనా గణాంకాలు పేర్కొనగా, ఈ క్షీణ రేటను 6.6 శాతానికి తగ్గిస్తూ తాజా లెక్కలను ఎన్ఎస్ఓ విడుదల చేసింది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ‘6.6 శాతం క్షీణ బాట’ నుంచి ‘8.9 శాతం వృద్ధి’ బాటకు మారుతుందన్నమాట. 5.4 శాతం వృద్ధి ఎలా? 2011–12 ధరలను బేస్‌గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్లో 5.4 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది.. ► తయారీ: గణాంకాల ప్రకారం, ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువల వృద్ధి రేటు తయారీ రంగానికి సంబంధించి మూడవ త్రైమాసికంలో కేవలం 0.2 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో ఈ వృద్ధి 8.4 శాతం. ► వ్యవసాయం: వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 4.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: ఈ రంగంలో 6.6 శాతం వృద్ధి బాట నుంచి 2.8 శాతం క్షీణతకు మారింది. ► మైనింగ్: ఈ రంగం చక్కటి పురోగతి సాధించింది. 5.3 శాతం క్షీణ రేటు 8.8 శాతం వృద్ధికి మారింది. ► ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: 1.5 శాతం క్షీణత 3.7 శాతం వృద్ధి బాటకు మారింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు: 10.1 శాతం క్షీణ రేటు 6.1 శాతం వృద్ధికి మెరుగుపడింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 10.3 శాతం వృద్ధి రేటు 4.6 శాతానికి తగ్గింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: 2.9 శాతం క్షీణ రేటు భారీగా మెరుగుపడి 16.8 శాతం వృద్ధి బాటకు పురోగమించింది. -
హరిత ఇంధన దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: రాబోయే రెండు దశాబ్దాల్లో పర్యావరణ అనుకూల ఇంధన రంగంలో భారత్ దిగ్గజంగా ఎదగగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 0.5 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయగలదని ఆయన తెలిపారు. టెక్నాలజీతో కొత్త, పరిశుభ్రమైన ఇంధనాల వ్యయాలు గణనీయంగా తగ్గగలవని ఆసియా ఎకనమిక్ డైలాగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ చెప్పారు. అయితే, ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోదని.. బొగ్గు, దిగుమతి చేసుకున్న చమురుపై భారత్ ఆధారపడటం మరో రెండు, మూడు దశాబ్దాల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ, రాబోయే రోజుల్లో కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారించే వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 21వ శతాబ్దంలో భౌగోళికరాజకీయ పరిస్థితులను హరిత ఇంధన విధానాలవైపు మళ్లడమే ప్రభావితం చేయగలదని అభిప్రాయపడ్డారు. ఇంధనంగా బొగ్గు స్థానంలో కలప చేరినప్పుడు భారత్, చైనాను యూరప్ దేశాలు అధిగమించాయని ఆయన చెప్పారు. అలాగే చమురు వాడకం మొదలైనప్పుడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే అమెరికా, పశ్చిమాసియా పురోగతి చెందాయని పేర్కొన్నారు. ‘హరిత, పరిశుభ్ర ఇంధనాల విషయంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా మారాకా భారత్ .. ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఆవిర్భవిస్తుంది‘ అని అంబానీ తెలిపారు. ఈ పరిణామక్రమంతో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, గణనీయంగా విదేశీ మారకం కూడా ఆదా అవుతుందని చెప్పారు. కొత్త సూపర్ పవర్‌గా ఇండియా.. గడిచిన రెండు దశాబ్దాలు చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందని, వచ్చే 20 ఏళ్లలో ఇంధనం.. జీవ శాస్త్రంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవిస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. హరిత ఇంధనాల విషయంలో యావత్ ప్రపంచం ఇంకా కుస్తీ పడుతుంటే.. భారత్ ఏకంగా ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని పని చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘రాబోయే 10–20 ఏళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ విభాగాల్లో దేశీయంగా కనీసం 20–30 కొత్త కంపెనీలు.. రిలయన్స్ స్థాయిలో లేదా అంతకు మించి వృద్ధి చెందగలవని భావిస్తున్నాను‘ అని అంబానీ చెప్పారు. రిలయన్స్‌కు 1 బిలియన్ డాలర్ కంపెనీగా మారడానికి 15 ఏళ్లు, 10 బిలియన్ డాలర్ల మార్కును చేరేందుకు 30 ఏళ్లు, 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరేందుకు 38 ఏళ్లు పట్టిందని ఆయన తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం 10 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉన్న భారత టెక్నాలజీ, డిజిటల్ ఎగుమతులు నేడు 150 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇవి అర లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలవు. అలాగే, 20 ఏళ్లలో హరిత ఇంధన ఎగుమతులు కూడా అర లక్ష కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీతో చౌకగా ఇంధనం వాణిజ్యపరంగా లాభదాయకత సాధించగలిగితే టెక్నాలజీ పురోగతితో.. హరిత ఇంధనం చౌకగా లభించడానికి ఆస్కారం ఉంటుందని అంబానీ చెప్పారు. దానికి తోడు ప్రభుత్వం కూడా పారదర్శకమైన, వినియోగదారులకు అనుకూలమైన విధానాల ద్వారా కొత్త ఇంధనాలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పునరుత్పాదకత వనరుల ద్వారా 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి లక్ష్యాల్లో 40 శాతాన్ని 2021 నాటికే భారత్ సాధించేసిందని అంబానీ తెలిపారు. హరిత హైడ్రోజన్ ధరను కిలోకు డాలర్ కన్నా తక్కువకే అందించవచ్చని, రవాణా తదితర వ్యయాలను కూడా డాలర్ లోపే కట్టడి చేయవచ్చని ఆయన చెప్పారు. ‘భారతదేశ పురోగతిని ఎవ్వరూ ఆపలేరు. మనది 5 లక్షల కోట్ల డాలర్లు.. ఆ పైన 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా కచ్చితంగా అయి తీరుతుంది. అది 2025లో లేదా 2027 అవుతుందా లేక 2030–2032లో అవుతుందా అన్నదే ఆలోచించా ల్సిన విషయం‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన న్యూ ఏజ్ బాలెనో కారు..!) -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
అణు, మిసైల్ ప్రోగ్రాంలకు నిధుల కోసం... ఉత్తర కొరియా సైబర్ దాడులు
ఐరాస: అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్ స్పెషలిస్టులను ఉటంకిస్తూ ఐరాస నిపుణుల ప్యానల్ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘‘ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. ఆ సంస్థల ఇంటర్నెట్ కనెక్టెడ్‌హాట్ వాలెట్ల నుంచి మాల్వేర్, ఫిషింగ్, కోడ్ ఎక్స్‌ప్లాయిట్స్, ఇతర అధునాతన సోషల్ ఇంజనీరింగ్ మార్గాల్లో కాజేసిన ఈ నిధులను డీపీఆర్కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. తర్వాత పకడ్బందీ మనీ లాండరింగ్ ప్రకియ ద్వారా క్రిప్టో కరెన్సీని సొమ్ము చేసుకుంటోంది’’ అని ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఈ ప్యానెల్ వివరించింది. డీపీఆర్కే అంటే డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. 2019–2020 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసిందని ఏడాది కిందే ఈ ప్యానెల్ ఆరోపించింది. నిషేధాలను ఉల్లంఘిస్తూ అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని తాజా రిపోర్టులో పేర్కొంది. ‘‘అణు పరీక్షల్లాంటివి జరిపినట్టు ఆధారాల్లేకున్నా కీలకమైన యురేనియం, ఫ్లూటోనియం తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగంపై విధించుకున్న నాలుగేళ్ల స్వీయ నిషేధాన్ని పక్కన పెడతామని కొరియా ఇటీవల హెచ్చరిస్తూ వస్తుండటం తెలిసిందే. -
మధ్యాసియాలో విద్యుత్ సంక్షోభం
మాస్కో: మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో మంగళవారం విద్యుత్ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టర్కిస్తాన్‌లోని కొన్ని నగరాల్లో సైతం ఈ సంక్షోభం కనిపించింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు చీకట్లో మగ్గిపోయారు. ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్ ఫెయిల్యూర్ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్ పవర్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం కారణంగా తాష్కెంట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్‌కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్‌లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్‌లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?
సాదారణంగా మన ఊరిలో దోసకాయ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.50 - రూ.100 మధ్య ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దోసకాయ ఖరీదు ఎంతో తెలిస్తే!.. షాక్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సముద్ర దోసకాయ ఖరీదు అక్షరాల రూ.2 లక్షల పైనే ఉంటుంది. మరి, ఇవి ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?. ఈ సముద్ర దోసకాయలు ఎక్కువగా దొరకవు. వీటిని పట్టుకోవడం కోసం కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే, ఈ సముద్ర దోసకాయలు చాలా ప్రత్యేకమైన జీవులు. చికిత్స కోసం... వీటికి ఎలాంటి అవయవాలు ఉండవు. కేవలం, నోరు మాత్రమే ఉంటుంది. ఈ జీవులకు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువ సంపన్న వర్గ కుటుంబాలు వీటిని ఆహారంగ స్వీకరిస్తారు. ప్రపంచంలోని 1,250 విభిన్న జాతుల సముద్ర దోసకాయలో జపనీస్ సముద్ర దోసకాయ చాలా ప్రత్యేకమైనది. గోల్డెన్ శాండ్ ఫిష్, డ్రాగన్ ఫిష్, కర్రీ ఫిష్ వంటి ఇతర రకాలతో పోలిస్తే ఇవీ అధిక శాతం ప్రోటీన్స్ కలిగి ఉంటాయి.ఈ సముద్ర దోసకాయల చర్మంలో ఫ్యూకోసిలేటెడ్ గ్లైకోసామినోగ్లైకాన్ అనే రసాయనం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ రసాయనంను ఆసియాలోని ప్రజలు కొన్ని శతాబ్దాలుగా బాధపడుతున్న ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. (చదవండి: సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్‌గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!) ఇటీవల ఐరోపాలోని ప్రజలు కొన్ని క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీంతో రోజు రోజుకి సముద్ర దోసకాయ క్రేజ్ ఎక్కువగా పెరుగుతుంది. 1980లలో ఆహారం కోసం భారీగా డిమాండ్ వచ్చేది. అది ఇప్పుడు పాశ్చాత్య ఔషధ కంపెనీలకు ఔషదంగా పనిచేస్తుంది. మొరాకో నుంచి యునైటెడ్ స్టేట్స్, న్యూ గినియా వరకు సముద్ర దోసకాయలను ఎగుమతి చేస్తున్నాయి. సముద్ర దోసకాయలను ఎగుమతి చేసే దేశాల సంఖ్య 35 నుంచి 83కు పెరిగింది. వీటికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ జీవులలో కొన్ని జాతులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. -
వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!
ఆసియాలోని అతిపెద్ద పూల మార్కెట్ అయిన చైనా పూల మార్కెట్ రోజుకి వేలాదిమంది కస్టమర్ల ఆర్డర్లతో కళకళలాడుతుంది. ఇ-కామర్స్ అనేది చైనాలో అతి పెద్ద వ్యాపారం. అయితే ఇంతవరకు ఆన్లైన్లో సౌందర్య సాధనాలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్ల విక్రయాలతో శరవేగంగా దూసుకుపోయింది. కానీ ఇప్పడూ మాత్రం అనుహ్యంగా ఆన్లైన్ పూల మార్కెట్ మంచి ఆదాయ వనరుగా శరవేగంగా పుంజుకుంటుంది. అంతేకాదు ప్రజలంతా తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఆన్లైన్లో తమకు నచ్చిన పూల బోకేలను లేదా పూలను ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చైనా పేర్కొంది. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) పైగా చైనా దేశం తమ ఉద్యాన పరిశ్రమ ఆదాయం సుమారు 160 బిలియన్ యువాన్ల (రూ.180 కోట్లు) గా అంచనా వేసింది. అంతేకాదు ఈపూల మార్కెట్‌కి సంబంధించిన ఆన్లైన్ రిటైల్ ఇప్పుడు సెక్టార్ టర్నోవర్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మేరకు ఐదు పుష్పగుచ్ఛాలు, వెంటనే ఆర్డర్ చేసే వారికి కేవలం 39.8 యువాన్లు (రూ.468) మాత్రమే అంటూ చక్కటి ఆకర్షించే ఆఫర్లతో కస్టమర్లను మైమరిపించి కొనేలా చేస్తుంది. దీంతో ఆయా ఆన్లైన్ వ్యాపారా సంస్థలకు సంబంధించిన తమ రోజు వారి ఆదాయాలు మారుతూ వస్తున్నాయి. అంతేకాదు చైనాలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కట్ ఫ్లవర్‌లకు డిమాండ్ పెరగడంతో దక్షిణ ప్రావిన్స్ యునాన్ ఆ విజృంభణకు కేంద్రంగా మారింది. పైగా ప్రాంతీయ రాజధాని కున్మింగ్ ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌ను కలిగి ఉంది. పైగా నెదర్లాండ్స్‌లోని ఆల్స్మీర్ తర్వాత ఇదే ప్రపంచంలో రెండవ అతిపెద్దది పూల మార్కెట్. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా స్థంభించిపోయిన ఈ పూల మార్కెట్ ప్రస్తుతం ఈ ఆన్లైన్ విక్రయాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మేరకు ప్రజలు కూడా ఈ మహమ్మారీ భయంతో ఆన్లైన్లోనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నటు చైనా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజూ సగటున నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులు అమ్ముడవుతున్నాయని, పైగా చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే దాదాపు 9.3 మిలియన్లను విక్రయిస్తుందని అంటున్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
ఒలింపిక్స్ షూటింగ్లో ఆసియా కోటా పెంపు..
న్యూఢిల్లీ: ఆసియా దేశాల షూటర్లకు ఇది కచ్చితంగా తీపి కబురే! అంతర్జాతీయ క్రీడా షూ టింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఒలింపిక్స్ షూటింగ్లో ఆసియా కోటా పెంచింది. 38 బెర్త్‌ల నుంచి 48 బెర్త్‌లకు పెంచింది. వచ్చే పారిస్ ఒలింపిక్స్ (2024)లో ఈ హెచ్చింపు అమలయ్యే అవకాశాలున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం వచ్చే ఏడాది నుంచి షూటింగ్లో క్వాలిఫికేషన్ పోటీలు జరుగనున్నాయి. ఈ ఏడాది జరిగిన టోక్యో ఈవెంట్లో ఆసియా దేశాలకు 38 కోటా బెర్తులు ఇచ్చారు. ‘నిజమే...ఒలింపిక్స్ కోటా పెంచామని ఐఎస్ఎస్ఎఫ్ నుంచి ఆసియా షూటింగ్ కాన్ఫెడరేషన్ (ఏఎస్సీ)కు లేఖ రాసింది’ అని ఏఎస్సీ తెలిపింది. చదవండి: T20 WC 2021 Winner Australia: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే -
ఇండియా నుంచే ఆసియా తొలి ఫ్లయింగ్ కారు!
ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఎగిరే కార్లను తయారు చేయడానికి సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటే. ఇప్పుడిప్పుడే మన దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆసియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లండన్‌లో అక్టోబర్ 5న జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద హెలిటెక్ ఎక్స్ పో - ఎక్సెల్ షోలో ఆసియాలోని మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ ప్రోటోటైప్ కారును చెన్నైకి చెందిన సంస్థ వినాటా ఏరోమొబిలిటీ ఆవిష్కరించింది. కంపెనీ తన యూట్యూబ్ ఛానెల్లో ఎగిరే కారు డిజిటల్ ప్రోటోటైప్ వీడియోను విడుదల చేసింది. ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. దీనిని నడిపే పక్కన మరో వ్యక్తి మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇది రెక్కల మాదిరిగా నిటారుగా తెరుచుకునే డోర్లను కలిగి ఉంటుంది. ఇతర విషయాలతో పాటు నావిగేషన్ కోసం భారీ డిజిటల్ టచ్ స్క్రీన్ వ్యవస్థ ఇందులో ఉంది. వినాటా ఏరోమొబిలిటీ రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇది గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. (చదవండి: రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త!) భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఒక సీటు పక్కన షాంపైన్ హోల్డర్ ఉంది. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ చేసే పనిలో ఉంది. -
మన భుజాలపై వారి తుపాకులు!
చైనాతో ఏర్పడుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో భారీ వ్యయంతో కూడిన ఆయుధాల పరుగుపందెం కూడా మొదలైపోయింది. అసలు విషయం ఏమిటంటే, చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా? క్వాడ్, ఆకస్ లాంటి కూటములతో... మన సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలకు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఆసియా ప్రజలను కలవరపరుస్తోంది. గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ జీవించి ఉండి ఉంటే తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి ఉండేవారు. ఆసియా ఐక్యతకోసం అవిశ్రాంతంగా ప్రచారం చేసిన ఈ కవి, తత్వవేత్త ప్రస్తుతం ఆసియా ఖండంలో పేరుకుంటున్న అనైక్యతను, నిత్య ఘర్షణలను చూసి ఎంతగానో బాధపడి ఉండేవారు. ఆసియా ఖండాన్ని నిత్యం శత్రుత్వంతో రగిలించడానికి పాశ్చాత్య శక్తులు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలను చూసి టాగూర్ మనస్సు క్షోభతో కుమిలిపోయి ఉండేది. ఆసియా దేశాలను టాగూర్ సందర్శించినన్ని పర్యాయాలు మరే ఇతర భారతీయ నేతా పర్యటించలేదు. ఈ సందర్శనల ద్వారా టాగూర్ లక్ష్యం ఆసియన్ వివేచనను సృష్టించడమే. 1921లో ఆయన విశ్వభారతిని స్థాపించినప్పుడు, భారత్, ఇతర ఆసియా దేశాలను శతాబ్దాలుగా కలిపివుంచిన నాగరికతా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా ఆసియన్ ఐక్యతపట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూవచ్చారు. ఆసియన్ వివేచన పట్ల గురుదేవుల స్వప్నాలు ఈరోజు బీటలు వారిపోయాయి. ఒకప్పుడు వలసవాద పాలనలో బలిపశువులుగా మారిన దేశాలు ఇప్పుడు ప్రవాహవేగంలో కొట్టుకుపోతున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసియా దేశాలు ఇప్పుడు శాంతికి దూరమవుతున్నాయి. పాశ్చాత్యదేశాలు ఆసియా ఖండంలో పరస్పరం తలపడే బృందాలను రూపొందిస్తూ నిత్య ఘర్షణలను రగిలిస్తున్నాయి. ఆసియా ఖండంలో అంతర్గత ఘర్షణలు శాంతికి హాని చేస్తూ, పరస్పర సహకారంతో అందరూ లబ్ధి పొందే అవకాశాలకు తలుపులు మూసేశాయి. పశ్చిమాసియా ఇటీవలి కాలంలో అనేక యుద్ధాలను చూసింది. ఇరాన్–ఇరాక్ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా దురాక్రమణ, సిరియాలో, యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధాలు వీటిలో కొన్ని. ఇక దక్షిణాసియాలో బయటిశక్తులు రగిలించిన యుద్ధాలు, సైనిక ఘర్షణల కారణంగా నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్ రక్తమోడుతూనే ఉంది. అమెరికా దళాలు ఇటీవలే ఆ దేశం నుంచి వైదొలిగిన తర్వాత కూడా అఫ్గానిస్తాన్ సుస్థిరత, జాతీయ పునర్నిర్మాణం విషయంలో భారత్, తదితర పొరుగు దేశాలు సహకారమందించే ప్రయత్నాలకు తావు లేకుండా పోయింది. ఒకవైపు తాలిబన్ మతోన్మాదవైఖరి, మరోవైపు భారత్–పాకిస్తాన్ మధ్య శత్రుత్వమే దీనికి కారణం. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా భారత్, పాకిస్తాన్ దేశాలు తమ మధ్య సౌహార్ద సంబంధాలు నెలకొల్పుకోలేకపోతున్నాయి. నిరంతరం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి) పూర్తిగా నిర్వీర్యమై కోమాలో ఉంటోంది. దీంతో పోలిస్తే, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)ను ఏర్పర్చి ఆసియాలో పాశ్చాత్యేతర వేదికను చెల్లుబాటులోకి తీసుకురావడంలో చైనా ఒకమేరకు విజయం సాధించింది. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలనూ పూర్తిస్థాయి సభ్యులుగా చేసుకోవడంలో ఎస్సీఓ సఫలమైంది. దీంట్లో అఫ్గానిస్తాన్ కూడా పర్యవేక్షక ప్రతిపత్తిలో కొనసాగుతోంది. విషాదమేమిటంటే, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ దేశాలతో కూడిన ప్రాంతీయ సహకార ప్రయత్నాలకు దూరంగా ఉంటున్న భారత్ ప్రస్తుతం కాబూల్‌లో శాంతి స్థాపన, సమీకృత ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలనుంచి వైదొలిగింది. అదే సమయంలో తాలిబన్ పాలనలో ఉగ్రవాద సంస్థలకు అవకాశం ఇవ్వవద్దనే అంశంపై భారత్‌తో సహా ఈ అయిదు దేశాలకు పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు. ఈ గొప్ప అవకాశంలో పాలుపంచుకోవడానికి బదులుగా, అఫ్గాన్ విధానం విషయంలో అమెరికాతో భారత్ చేయి కలిపింది. పైగా, అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక సైనిక చర్యలను నిర్వహించడానికి వాయవ్య భారత్‌లోని ఒక ప్రాంతంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని వార్తలొస్తున్నాయి. భారత్‌కి, దక్షిణాసియా ప్రాంతానికి కూడా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. భారత్ ద్వంద్వప్రమాణాలు పాటిస్తోందన్న విమర్శలకు కూడా తావిచ్చినట్లవుతుంది. ఇది నిజమే అయితే భారత్‌కి వ్యతిరేకంగా అఫ్గాన్ భూమిని ఉపయోగించుకోవడానికి తాలి బన్లు అనుమతించరాదంటూ భారత్ స్పష్టంగానే అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాం టప్పుడు భారత గడ్డమీద నుంచి అప్గాన్ వ్యతిరేక చర్యలు చేపట్టడానికి అమెరికాను మనం ఎలా అనుమతించగలం? ఇప్పుడు మరొక ప్రధానమైన అంశం ఆసియా అంతర్గత వైరుధ్యం. ఆసియాలో రెండు అతిపెద్ద నాగరికతా దేశాలైన భారత్, చైనాలు ఆధిపత్య పోరాటంలో నిమగ్నమై ఉన్నాయి. ఒకవైపు భారత్–చైనా మధ్య శత్రుత్వం, మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఇరుగుపొరుగు దేశాలతో సముద్ర జలాలపై హక్కు విషయంలో ఏర్పడిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో చైనా విఫలమైతే, ఎంతో దూరంలో ఉన్న అమెరికాకు వివాద జలాల్లో చేపలు పట్టే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఆసియన్ వివాదాల్లో తలదూర్చవలసిన అవసరం అమెరికాకు లేదు. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ అనే కృత్రిమ భావనను అమెరికా పెంచి పోషిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటినుంచి తమదే ప్రపంచాధిపత్యం అనే విశ్వాసంతో అమెరికా పాలకులు వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవలి దశాబ్దాల్లో చైనా ఎదుగుతూ వస్తున్నందున, అమెరికా ప్రపంచాధిపత్యానికి రోజులు చెల్లిపోయాయి. ఇది అర్థమయ్యే, ఆసియాలో అనైక్యతా బీజాలను నాటే పనిలో అమెరికా బిజీగా ఉంటోంది. అందుకే, చైనాకు అడ్డుకట్టలేయడానికి అమెరికా సైనిక కూటములను నిర్మించుకుంటూ పోతోంది. దురదృష్టవశాత్తూ, చైనాతో మనకు ఎదురవుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా? అమెరికా ఇప్పుడు మరొక చైనా వ్యతిరేక కూటమి ఆకస్ని ఏర్పర్చింది. ఇది ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మూడు దేశాల మధ్య భద్రతా ఒడంబడికను సాధ్యం చేసింది. చైనాను నిలువరించడానికి ఆస్ట్రేలియాకు అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములను అమెరికా, బ్రిటన్ ఈ ఒప్పందంలో భాగంగా నిర్మించి ఇస్తాయి. నాటో కూట మిలో భాగమైన రెండు మిత్రదేశాల పట్ల ఫ్రాన్స్ అగ్రహంతో రగిలిపోతోంది. ఎందుకంటే 80 బిలియన్ డాలర్ల విలువైన ఫ్రెంచ్–ఆస్ట్రేలియన్ జలాంతర్గామి ఒప్పందానికి ఆకస్ కూటమి తూట్లు పొడిచింది. మన సముద్రాలు, మహా సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఇతర ఆసియన్ ప్రజలను కలవరపరుస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ నావికా బలాన్ని ఉపయోగించి ప్రపంచ ఆర్థిక వనరులను కొల్లగొట్టే భవిష్యత్తు గురించి గాంధీజీ వందేళ్ల క్రితమే హెచ్చరించారు. (యంగ్ ఇండియా: 1921 డిసెంబర్ 8). ఆనాడు గాంధీ చేసిన హెచ్చరిక ఇప్పుడు భయపెట్టే వాస్తవంగా మారిపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన యూరోపియన్ శత్రుత్వానికి సంబంధించిన విధ్వంసకరమైన లక్షణాలకు వ్యతి రేకంగా టాగూర్ కూడా ఆసియన్లను హెచ్చరించారు. ఇప్పుడు విశ్వగురువుగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్, మన గురుదేవులు టాగూర్ ఆనాడు చేసిన హెచ్చరికను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లుంది. సుధీంద్ర కులకర్ణి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్ కారు! మంత్రి కీలక ప్రకటన
స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా సరికొత్త ఆవిష్కరణలు ఇండియాలో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏషియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వినత నుంచి మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఇండియా దూసుకుపోతుంది. మరోవైపు రెండుమూడేళ్ల కిందట స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి. ఈ పరంపరలో మరో మైలురాయి దాటేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్ ప్రయత్నిస్తోంది, ఏషియాలోనే తొలిసారి చెన్నైకి చెందిన వినత స్టార్టప్ రూపొందించిన ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. ఫ్లైయింగ్ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ పనిలో ఉంది. Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of VINATA AeroMobility: Civil Aviation Minister Jyotiraditya Scindia (1/2) pic.twitter.com/Jqtz9gbikk — ANI (@ANI) September 20, 2021 గరిష్టంగా 60 నిమిషాలు వినత రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. బయో ఫ్యూయల్ ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఎనిమిది రోటార్లలో ఒకటి చెడిపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలపైకి సురక్షితంగా ఈ ఫ్లైయింగ్ కారుని ల్యాండ్ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది. మెడికల్ ఎమర్జెన్సీలో ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య అన్నారు. మరోవైపు రోడ్ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్ లాంటి సంస్థలు ఫ్లైయింగ్ కారు కాన్సెప్టు పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లండన్‌లో 2021 అక్టోబరు 5న లండన్ వేదికగా జరగనున్న హెలిటెక్ ఎగ్జిబిషన్లో తొలిసారిగా ఈ ఫ్లైయింగ్ కారుని ప్రదర్శించనున్నారు. చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి ! -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
భారత మహిళల ఫుట్‌బాల్ శిబిరానికి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్ టోర్నమెంట్ సన్నాహాల కోసం భారత సీనియర్ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ థామస్ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్–17, అండర్–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది. -
స్టాక్ మార్కెట్ పతనానికి ఇవే కారణం
ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్ గురువారం భారీ నష్టంతో ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక శాతాన్ని నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 486 పాయింట్లను కోల్పోయి నష్టపోయి 52,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 15,728 వద్ద నిలిచింది. టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. అధిక వెయిటేజీ షేర్లను కలిగిన మెటల్, బ్యాంకులు, ఆటో, ఆర్థిక రంగాల ఇండెక్సులు రెండున్నర శాతం పతనాన్ని చవిచూశాయి. మెటల్ షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్ల పతనం సూచీలకు అధిక నష్టాన్ని కలిగించింది. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకు గానూ ఐదు షేర్లు, నిఫ్టీ 50 షేర్లలో 7 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.555 కోట్ల విలువైన షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.949 కోట్ల షేర్లను విక్రయించారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... ఆసియా మార్కెట్లలో ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 11 పాయింట్లు క్షీణించి 53,066 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 15,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రమక్రమంగా అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 626 పాయింట్ల పతనమై 52,429 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 15,682 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివర్లో అరగంటలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంత నష్టాలను పూడ్చుకోగలిగాయి. ‘ప్రపంచ మార్కెట్లలోని విక్రయాల సెగలు దేశీయ మార్కెట్‌ను తాకడంతో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాలను ప్రకటనతో దలాల్ స్ట్రీల్లో ఆర్థిక ఫలితాల సందడి మొదలైంది. జొమాటో, పేటీఎంతో సహా మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పట్టాయి. వచ్చే వారాల్లో రెండు అంశాలు మార్కెట్ గమనానికి ఎంతో కీలకం కానున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నష్టాలకు నాలుగు కారణాలు..! పపంచ మార్కెట్లలో అమ్మకాలు... చైనాకు చెందిన దిది చుక్సింగ్, టెన్సెంట్, అలీబాబాలు సంస్థలు విలీనాలు, కొనుగోలు సరైన సమాచారాన్ని ఇవ్వలేదంటూ చైనా దేశ నియంత్రణ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. దిగ్గజ కంపెనీలపై చైనా దుందుడుకు చర్యలతో ఆసియా మార్కెట్లు సెంటిమెంట్ దెబ్బతింది. హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెట్ మూడు శాతం క్షీణించి ఆరునెలల కనిష్టానికి దిగివచ్చింది. చైనా, సింగపూర్, జపాన్, థాయిలాండ్ కొరియా దేశాల స్టాక్ సూచీలు 2% వరకు నష్టపోయాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ స్టాక్ మార్కెట్లు రెండు నుంచి రెండున్నర శాతం నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘డెల్టా’ కేసుల పెరుగుదల భయాలు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ విజృంభణ ఈక్విటీ మార్కెట్లను భయపెట్టింది. ఈ ఏడాదిలోనే జూన్ 8న ఒకరోజులో అత్యధిక కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 51.7 శాతం డెల్టా వేరియంట్ అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఐరోపాలో పలు దేశాల్లో ఇదే వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ నుంచి ప్రతికూలతలు ఈ ఏడాదిలో వీలైనంత తొందరగా బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో డాలర్ మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. డాలర్ అనూహ్య ర్యాలీ భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అవుట్‌లుక్ తగ్గింపు ఆందోళనలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ వృద్ధి అవుట్‌లుక్‌ను ఫిచ్ రేటింగ్స్ సంస్థ 12.8% నుంచి పదిశాతానికి తగ్గించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించడం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. -
భూమికి మంచు యుగాన్ని ఇచ్చింది మనమే!
భారతదేశం ఆసియా ఖండంలో భాగమేనా? ఇప్పుడెందుకీ డౌట్.. నిజమేగా అంటారా.. ఇది ఇప్పుడు నిజం.. ఇంతకు ముందు అబద్ధం. మళ్లీ ఇదేం కొర్రీ అని సందేహాం వస్తోందా? నిజమే.. ఇండియా వేరే ఖండం నుంచి వచ్చి ఆసియాకు కలిసింది. ఇదేకాదు ఇంకా ఎన్నోవిశేషాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా? అంతా టెక్టానిక్ ప్లేట్ల మహిమ! భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుంది. భూమి మధ్యలో ఉన్నది కోర్, దానిపై మాంటిల్, ఆపై క్రస్ట్ పొరలు ఉంటాయి. కోర్ అంతా దాదాపు ఇనుము, ఇతర లోహాల ముద్ద అయితే.. మధ్యలోని మాంటిల్ చాలా రకాల మూలకాలతో కూడిన లావా. అన్నింటికన్నా పైన ఉన్న క్రస్ట్ గట్టిగా మట్టి, రాళ్లతో ఉంటుంది. అయితే ఈ క్రస్ట్ ఏకమొత్తంగా పొరలా ఉండకుండా.. పెద్ద ముక్కలు (ప్లేట్లు)గా ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటాం. వీటితోనే వివిధ ఖండాలు (కాంటినెంట్స్) ఏర్పడుతాయి. మాంటిల్‌పై తేలుతున్నట్టుగా ఉండే ఈ టెక్టానిక్ ప్లేట్లు.. భూభ్రమణం, పరిభ్రమణం, ఇతర అంశాల కారణంగా కదులుతూ ఉంటాయి. గోండ్వానా ఖండం ముక్కలై.. మొదట్లో భూమిపై ఖండాలన్నీ వేరుగా ఉండేవి. యూరప్, ఆసియా కలిసి యూరేíÙయన్ ఖండంగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియాతోపాటు భారత ఉప ఖండం (ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు) మొత్తం కలిపి గోండ్వానా ల్యాండ్ అనే మరో పెద్ద ఖండంగా ఉండేవి. సుమారు 18 కోట్ల ఏళ్ల కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికలతో.. గోండ్వానా ముక్కలైంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియా దూరంగా కదిలిపోయాయి. భారత ఉప ఖండం యూరేనియన్ టెక్టానిక్ ప్లేట్ వైపు వచి్చంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అంటే మనం ఏమాత్రం గుర్తు పట్టలేనంత మెల్లగా జరుగుతాయి. అంటే సంవత్సరానికి పది, పదిహేను సెంటీమీటర్ల దూరం కదులుతాయి. హిమాలయాలను పుట్టించి.. యూరేనియన్ ప్లేట్ వైపు ఇండియన్ ప్లేట్ జరగడంతో.. ఆ ఒత్తిడికి భారీ స్థాయిలో భూభాగం పైకి లేచి, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలైన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండి గంగ, సింధు, బ్రహ్మపుత్ర ఇలా ఎన్నో నదులకు జన్మనిచ్చాయి. ఇలాంటి నదుల నుంచి కొట్టుకువచి్చన మట్టితో ఏకంగా బెంగాల్ డెల్టా ఏర్పడింది. మంచు యుగాన్ని తెచ్చి.. యూరేనియన్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టడానికి ముందు భూమి చాలా వేడిగా ఉండేది. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో మంచు ఉండేది కాదు. మొత్తంగా నీళ్లు, నీటి ఆవిరే ఉండేది. ఈ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టాక పైకి లేచిన భూభాగంలోని సిలికేట్లు భూవాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను వేగంగా పీల్చుకున్నాయి. ఇది ‘గ్లోబల్ కూలింగ్ (సూర్య కిరణాలు భూమి నుంచి ఎక్కువగా పరావర్తనం చెంది చల్లబడటం)’కు దారి తీసింది. అది భూమిపై మంచు యుగానికి దారితీసింది. అదే సమయంలో హిమాలయాలు, ధ్రువాలు, ఇతర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. అప్పటి జీవులనూ మోసుకొచ్చి.. అప్పటి ఖండాల్లో జీవజాలం వేర్వేరుగా ఉండే ది. గోండ్వానా ల్యాండ్ నుంచి విడిపోయి వచి్చ న ఇండియా.. ఆ జీవులనూ మోసుకొచ్చి ఆసియా, యూరప్ ఖండాలకు అందించింది. లక్షల ఏళ్లనాటి శిలాజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఆఫ్రికా, ఇండియా, దక్షిణ అమెరికా ఖండాల్లో జీవులన్నీ ఒకటేనని నిర్ధారించారు. జింక లాంటి జీవి నుంచి తిమింగలాలు గోండ్వానా నుంచి విడిపోయిన ఇండియా ప్రాంతం ఎన్నో జీవ సంబంధ మార్పులకు దారితీసింది. కొత్త జీవులు అభివృద్ధి చెందడానికి కారణమైంది. అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే.. భారత ఉప ఖండంలో ఒకప్పుడు నివసించిన జింక తరహా ‘ఇండోహ్యూస్’ అనే జీవులు మార్పు చెంది ప్రస్తుతమున్న తిమింగలాలుగా పరిణామం చెందినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండియా ఇంకా కదులుతూనే ఉంది భారత ఉప ఖండం ప్రాంతం ఇప్పటికీ యూరేíÙయన్ ప్లేట్ వైపు కదులుతూనే ఉంది. దీని కారణంగానే రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడి ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భారీ భూకంపం అందులో భాగమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: ‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు 500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం -
కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద
ముంబై: ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క వారంలోనే 6.2 బిలియన్ డాలర్లు పెరిగింది. తన ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర 10 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఆయన సంపద వృద్ది చెందింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం.. అంబానీ నికర ఆస్తి విలువ మంగళవారం(జూన్ 1, 2021) నాటికి 83.2 బిలియన్ డాలర్లు(రూ. 6.07 లక్షల కోట్లు)గా ఉంది. మే 23న 77 బిలియన్ డాలర్ల(రూ. 5.62 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నాడు. స్టాక్ ఎక్స్ఛేంజీ తాజా డేటా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ 49.14శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆర్ఐఎల్ షేర్లు మంగళవారం 0.5 శాతం పెరిగి రూ.2,169 చేరుకుంది. త్వరలోనే ఈ స్టాక్ ధర రూ.2,580 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రస్తావించదగిన మరో విషయం ఏమిటంటే, గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. మార్చి 23న కనిష్ట ధర 875 రూపాయల నుంచి సెప్టెంబర్ 16న రూ.2,324కు చేరుకుంది. నిరంతరం జియో ప్లాట్‌ఫామ్, రిటైల్ బిజినెస్‌ల్లోకి నిధుల సేకరణ చేపట్టడంతో రిలయన్స్ స్టాక్ మార్కెట్లలో వృద్ది కనబడింది. ట్రేడింగ్ ధోరణి ఇలాగే కొనసాగితే త్వరలో అంబానీ వ్యక్తిగత సంపదలో మరో 10 బిలియన్ల డాలర్లు జత కలుస్తాయని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాల వ్యవధిలో రిలయన్స్ షేర్లు మరో 15 శాతం పెరుగుతాయని అంచనా. అదే జరిగితే ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ ర్యాంక్ నుంచి 8వ స్థానానికి ఎదుగుతారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలలో వరుస నిధుల సేకరణ మరియు రికార్డు హక్కుల సమస్య తరువాత. అప్పటి నుండి, ఈ స్టాక్ శ్రేణికి కట్టుబడి ఉంది మరియు బెంచ్‌మార్క్ సూచికలను బలహీనపరిచింది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
ఆసియాలో రెండో అతిపెద్ద శ్రీమంతునిగా ప్రముఖ భారతీయుడు
న్యూఢిల్లీ: భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చరిత్ర సృష్టించారు. ఆసియా శ్రీమంతుల జాబితాలో రెండో స్థానానికి దూసుకుపోయారు. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ఫలితంగా ఆసియాలోనే రెండో ధనవంతుడిగా తన పేరుని నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో చోటు దక్కించుకున్న అదానీ ప్రస్తుతం ఈ ఘనతను సాధించాడు. కాగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం.. ఇప్పటిదాకా ఆసియాలో రెండో స్థానంలో కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీతో గురువారం నాటికి గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు పెరిగింది. దీంతో షాన్షాన్ను వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్లు పెరగగా అదే క్రమంలో షాన్షాన్ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో వుండగా, అదాని 14వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
మీరాబాయి ప్రపంచ రికార్డు
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మీరాబాయి క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో స్వర్ణం... ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది. స్నాచ్‌లో మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 213 కేజీలతో (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 117) జిహుయ్ హౌ (చైనా) స్వర్ణం... 207 కేజీలతో (స్నాచ్‌లో 89+క్లీన్ అండ్ జెర్క్‌లో 118) హుయ్‌హువా జియాంగ్ రజతం సాధించారు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఒక పతకం ఇవ్వకుండా... స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, టోటల్ విభాగాలకు వేర్వేరు పతకాలు అందజేస్తున్నారు. -
ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడు మన దగ్గరే!
మేడిపెల్లి(వేములవాడ): దేశంలోని అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం శివుడు నిజరూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా పేరు పొందింది. శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి.. తొంబర్రావుపేట శివాలయంలో మహాశివరాత్రిని పురష్కరించుకొని నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల 10న పుణ్యహవచనం, స్థాపిత దేవతల పూజలు, అభిషేకాలు, 11న స్వామివారి కల్యాణం, జాగారం, లింగోధ్భావం, 12న రథోత్సవం, అన్నదానం, 13న బద్దిపోచమ్మకు బోనాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చదవండి: నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు! -
22 బిలియన్ డాలర్ల నష్టం; ఆసియా కుబేరుడిగా అంబానీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరోసారి ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనా బిలియనీర్ జాంగ్ షంషన్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అధినేత జాక్ మాను తోసిరాజని అంబానీ, గత రెండేళ్ల కాలంలో అత్యధిక రోజులు ఆసియా రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్ బిజినెస్ టైకూన్ షంషన్ సుమారు 98 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీని వెనక్కి నెట్టారు. తన కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సంస్థ బీజింగ్ వాంటాయి బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్, నోన్గ్‌ఫూ బీవరేజ్ కంపెనీ షేర్లలో పెరుగుదల నమోదు కావడంతో ఈ మేరకు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేగాక, వారెన్ బఫెట్‌ను అధిగమించి ఈ భూమ్మీద ఉన్న అత్యంత ఆరో సంపన్న వ్యక్తిగా ఘనతకెక్కారు. అయితే, తాజా బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం... షంషన్ గత వారం రోజుల్లోనే 22 బిలియన్ డాలర్ల మేర సంపద నష్టపోయారు. దీంతో ముకేశ్ అంబానీ ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం షంషన్ ఆస్తి 76.6 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ -
కరోనా: సీరమ్ సీఈవోకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనవల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సీరం చేస్తున్న కృషికి గాను ఆయనకు ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదు ప్రకటించినట్లు సింగాపూర్‌కు ది స్ట్రయిట్ టైమ్స్ మీడియా శనివారం ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనా, ఉత్తర కొరియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ప్రకటించినట్లు కూడా తెలిపింది. మహమ్మారిని ఆరికట్టేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్.. ఆక్సఫర్డ్ యూరివర్శిటీ, బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాలు కలిసి కోవిడ్-19 నివారణకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ అభివృద్ద చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. (చదవండి: కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్) అయితే ఈ జాబితాలో పూనవల్లాతో పాటు చైనా, జపాన్, ఉత్తర కొరియాకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ఆసియా ప్రకటించింది. వీరిలో.. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ ‘సార్స్-కోవ్-2’ జన్యూ రూపాన్ని మ్యాప్ చేసి కంటికి కనిపించని కరోనా వైరస్ ఇదేనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆన్లైన్ బృందానికి నాయకత్వం వహించిన చైనా పరిశోధకుడు జాంగ్ యోంగ్-జేన్, చైనా మేజర్ జనరల్ చెన్-వెయ్, జపాన్‌లో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ముందంజలో ఉన్న మొరిసితా, సింగపూర్ ప్రొఫెసర్ వూయ్-ఇంగ్-యోంగ్‌లతో పాటు దక్షిణ కోరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జీన్లు ఉన్నారు. జంగ్-జీన్ తన సంస్థ ద్వారా కోవిడ్-19 చికిత్సలకు ఇతర వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ టికాలను పంపిణీ చేస్తూ తనవంతు కృషి చేశారు. అయితే ఈ ఆవార్డుకు ఎన్నికైనా ఈ ఆరుగురిని కరోనా వీరులుగా ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తూ ఈ బిరుదును ప్రకటించింది. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్) అంతేగాక కరోనా నివారణకు మహమ్మరిపై పోరాటంలో ముందంజలో నిలిచిన వీరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలచారంటూ సదరు ఆసియా ప్రశంస పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మరణాలు, ఆర్థిక కష్టాలను తెచ్చిన పెట్టిన సార్స్-కోవి-2 వైరస్‌పై వీరి పోరాటం ప్రశంసనీయమని, అందుకే వీరిని ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తున్నట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఇక వీరి ధైర్యం, సంరక్షణ, నిబద్ధత, సృజనాత్మకతకు వందనాలు అంటూ ఆసియా ప్రశంస పత్రంలో పేర్కొంది. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి ఈ ఆరుగురు ఆసియా ఆశ చిహ్నంగా పిలిచింది. అయితే అదార్ పూనవల్లా తండ్రి సైరస్ పూనవల్లా 1966లో సీరం ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. 2011లో ఆయన మరణం తర్వాత అదార్ సంస్థ మొక్క పూర్తి బాధ్యతల చేపట్టి సీరం ఇన్స్టిట్యూట్కు సీఈవో అయ్యారు. -
వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా (39) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారిపై చేసిన పోరాటానికి గాను సింగపూర్ ప్రముఖ దినపత్రిక ది స్ట్రెయిట్స్ టైమ్స్ అందించే “ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకి ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఈ ఘనతను సాధించిన ఆరుగురిలో ఒకరిగా పూనావాలా నిలిచారు.(ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన) కరోనాపై పోరులో వారి ధైర్యం, నిబద్ధత, క్రియేటివిటీకి సాల్యూట్ చెబుతున్నామంటూ సింగపూర్ డెయిలీ కితాబిచ్చింది. ఈ సంక్షోభ సమయంలో విశేష కృషితో ఆసియాతోపాటు ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచారని వ్యాఖ్యానించింది. మొత్తం ఆరుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో పనిచేసిన వీరులుగా వీరిని "వైరస్ బస్టర్స్"గా అవార్డు ప్రశంసాపత్రంలో కీర్తించింది. ఈ జాబితాలో పేర్కొన్న మరో ఐదుగురిలో చైనా పరిశోధకుడు కరోనా మహమ్మారి వైరస్ సార్స్-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు చాంగ్ యోంగ్జెన్, మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కృషి చేసినందుకుగాను చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. నిబద్ధతతో తమకు తాము అంకితమైన కృషితో ఆసియాతోపాటు, ప్రపంచ ప్రజలకు ఆశలను చిగురింప చేశారని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారెన్ ఫెర్నాండెజ్ ప్రశంసించారు. ఇంతకుముందెన్నడూ లేని కృషితో వార్తల్లో నిలవడంతోపాటు, తద్వారా ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి నివారణకు పరిష్కారానికి సమాధానం కనుగొనడంలో సాయం చేసిన వ్యక్తులకు, టీంలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిడ్-19వ్యాక్సిన్ ‘‘కోవిడ్‌షీల్డ్’’ తయారీకి తయారీకి పూణేకు చెందిన సీరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ప్రజలకు విముక్తి రావాలనే ఉద్దేశంతో తన సంస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి తన కుటుంబ సంపదలో 250 మిలియన్ డాలర్లను అందించినట్టు ఇటీవల వెల్లడించారు. ప్రధానంగా స్వల్ప, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలో కోవిడ్-19వాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. 1966లో పూనవాలా తండ్రి సైరస్ పూనావాలా సీరంను స్థాపించారు. ఆ తరువాత 2001లో సీరంలో చేరిన అదర్ పూనావాలా దినదినాభివృద్ధి చెందుతూ 2011లో సీఈవోగా అవతరించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. -
భారత్‌తో కయ్యం చైనా పన్నాగమే
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు పెంచడం, పొరుగుదేశాలు భారత్‌పై ధిక్కారస్వరం వినిపించడం వెనక చైనా సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని కెలాగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జోషువా ఐసన్‌మన్ అన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం’అనే అంశంపై అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. ఆసియాలో భారత్, చైనా రెండు బలమైన దేశాలని, ఈ రెండింటి మధ్య ఉద్రిక్తతలు పెరగడం చైనా పన్నాగమేనని ఆయన విశ్లేషించారు. డ్రాగన్ విస్తరణ విధానం రోజురోజుకూ పెరుగుతోందని, తాజాగా భూటాన్ కూడా తమ భూభాగమే అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకురావడం దీనికి నిదర్శనని చెప్పారు. భారత్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలోకి డ్రాగన్ విపరీతంగా డబ్బు ప్రవహింపజేస్తోందని, వాటికి ఆర్థిక సాయం పేరుతో ఎర వేస్తోందని చెప్పారు. ఆయా దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టడం వెనక చైనా భవిష్యత్ మిలటరీ అవసరాలు దాగున్నాయని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లో పాకిస్థాన్ మినహా మరే దే శంతోనూ భారత్‌కు ఎలాంటి రాజకీయ విభేదాలూ లేవనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, నేపాల్ అకస్మాత్తుగా భారత్‌పై వ్యతిరేకత ప్ర దర్శిస్తుండటం గమనించదగ్గ అంశమన్నారు. భారత్ పొరుగు దేశాలతో మి లటరీ సంబంధాల బలోపేతానికి చైనా అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగైతేనే చైనా దూకుడుకు ముకుతాడు.. మరోవైపు వాయవ్య ఆసియాలోనూ చైనా జోక్యం పెరుగుతోందని జోషువా అన్నారు. ఈ ప్రాంతాల్లోని దీవులపై చైనా సైన్యం ఆధిపత్యం చాటుకునేం దుకు తాపత్రయపడుతోందని వివరించారు. మొత్తానికి ఆసియా దేశాలన్నీ తనను సూపర్‌పవర్‌గా గుర్తించాలన్న తహతహ చైనాలో కనిపిస్తోందన్నారు. అలాగే కోవిడ్ తదనంతరం తలెత్తిన ఆర్థిక సమస్యల నేపథ్యంలో చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బీఆర్ఐ (బెల్ట్ అండ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్) ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. చై నా దూకుడుకు ముకుతాడు వేసేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ చేతులు కలపాల్సిన అవసరముందన్నారు. -
ఆసియా బీచ్ క్రీడలు వాయిదా
కువైట్ సిటీ: కరోనా అన్‌లాక్‌లో ఒకవైపు ఫుట్‌బాల్, క్రికెట్, ఫార్ములావన్ (ఎఫ్1) వంటి క్రీడలు పునరాగమనం చేయగా.... మరోవైపు మాత్రం పలు క్రీడా ఈవెంట్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిన్న చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... తాజాగా ఆ జాబితాలో ఆసియా బీచ్ క్రీడలు కూడా చేరాయి. షెడ్యూల్ ప్రకారం చైనాలోని సాన్యా నగరం వేదికగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరో ఆసియా బీచ్ క్రీడలు జరగాలి. అయితే చైనాతోపాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) శనివారం ప్రకటించింది. ‘ఓసీఏ, చైనీస్ ఒలింపిక్ కమిటీ (సీఓసీ), సాన్యా ఆసియా బీచ్ క్రీడల నిర్వాహక కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని ఓసీఏ పేర్కొంది. త్వరలోనే ఈవెంట్‌కు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని ఓసీఏ తెలిపింది. ఆసియా బీచ్ క్రీడలు తొలిసారిగా బాలి వేదికగా 2008లో జరిగాయి. -
ఆసియాలో అమెరికా ‘కుంపట్లు’!
‘‘తనకొక శత్రువును సృష్టించుకోకుండా అమెరికా బతుకు తెల్లారదు. ఎవరా శత్రువు? అమెరికా తన సైనిక విస్తరణ కోసం, దేశంలో అత్యంత భారీ పరిశ్రమ అయిన సైనిక వ్యవ స్థను సాకడానికయ్యే వ్యయభారమే దాని అసలు శత్రువు’’. – డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్, ప్రసిద్ధ అమెరికా పరిశోధకుడు, విశ్లేషకుడు ‘‘అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (జూలై 4) సందర్భంగా మౌంట్ రష్మోర్లో జరిగిన సభలో ప్రెసిడెంట్ ట్రంప్ అవివేకమైన, ప్రజల ఐక్యతను చీలగొట్టే ప్రసంగానికి ఒడిగట్టారు. దేశంలో ‘వామపక్ష ఫాసిజం’ మళ్లీ తలెత్తుతోందనీ, దీన్ని అనుమతిస్తే అమెరికా విలువలను, చరిత్రనూ అది తుడిచిపెట్టేస్తుందని, ఆ పని కోసమే అది అరాచకాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని నియంతృత్వ ధోరణుల వైపు నడిపిస్తోందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇవన్నీ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఆయన చేస్తున్న ఆరోపణలే. నేడు వామపక్ష ఫాసిజం మన చరిత్రను తుడిచిపెట్టి, అమెరికాకు గర్వ కారణమైన యోధాగ్రేసరులను అపహాస్యం చేస్తూ, మన చిన్నారుల భవి ష్యత్తును చిదిమేస్తూ, మన చారిత్రక నిర్మాణాలను కూలగొట్టడానికి ఉద్యమిస్తోందని ట్రంప్ అన్నారు’’ – వాషింగ్టన్ నుంచి అని కిరణ్ రిపోర్ట్. ‘హిందూ’ (5.7.2020) డొనాల్డ్ ట్రంప్ ఉన్మాదపూరిత ‘పూనకపు’ ప్రకటనలకు ఇది ఆదీ కాదు, అంతమూ కాదు. ప్రపంచ వ్యాపితంగా తన సైనిక–పారిశ్రా మిక యుద్ధ వ్యవస్థ ఆధారంగా అమెరికా సాగిస్తూ వస్తున్న దురాక్ర మణ యుద్ధాలకూ, కోట్లాది ప్రజలపై సాగించిన దమనకాండకు, అసంఖ్యాకమైన హత్యలకూ లెక్కలేదు, ఈ క్షణం దాకా ఆటవిడుపూ లేదు. అయినా సరే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో, ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య, ఆసియా దేశాల మధ్య సరికొత్తగా తంపులుపెట్టి, తమాషా చూడాలని అమెరికా ఉవ్విళ్లూరు తోంది. ఇందుకు తొలి బాణంగా ముందు అమెరికా ప్రజల ముందు ‘సోషలిజం’ లేదా ‘వామపక్ష ఫాసిజం’ పేరిట ఒక బూచీని గత సంవ త్సరన్నర కాలంగా ప్రదర్శిస్తూ స్థానిక ప్రజల్ని అమెరికా పాలకులు బెదిరిస్తున్నారు. ఆ ‘బూచీ’ చాటుననే ఆసియా, ఆఫ్రికా, ఆసియా– పసిఫిక్ ప్రాంత స్వతంత్ర దేశాల్ని కూడా అమెరికా సామ్రాజ్య పాల కులు బెదిరిస్తున్నారు. ఈ తాజా బెదిరింపులలో ఒకటి–పాత వలస సామ్రాజ్యవాద పాలకుల సామ్రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా ఆసియా దేశాల సరిహద్దుల్ని నామరూపాలు లేకుండా చెరిపేస్తూ రావటం. సరికొత్త విస్తరణవాదం వైపుగా అమెరికా ఈ చారిత్రక అవశేషంలో భాగంగానే ఆసియా, ఆఫ్రికా స్వతంత్ర దేశాల మధ్య ఏర్పడిన తగాదాలు అపరిష్కృతంగానే ఉండిపోవడం అనేది.. సరికొత్త ప్రపంచ సామ్రాజ్య శక్తిగా సైనిక బలంతో ఎదిగిన అమెరికా విస్తరణవాదానికి మరొక అవకాశంగా మారింది. భారత్–చైనాల మధ్యనే కాదు.. సింహళం, సిక్కిం, నేపాల్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల మధ్య, లాటిన్ అమెరికా దేశాల మధ్య ‘యుద్ధ కాండ’ నడపకుండా అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాని సైనిక– పారిశ్రామిక వ్యవస్థకూ ఉనికి లేదని గమనించాలి. ఈ అమె రికా ‘ఉనికివాదమే’ ఇతర దేశాల స్వతంత్ర ప్రతిపత్తి ఉసురుతీస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం సిద్ధాంతం– ‘దేశాలు, వాటి సంపద నా సొంత ఆస్తి, వాటి అస్తిత్వం నా అస్తిత్వానికి చేటు, కనుక సకల దేశాలను శాసించే జన్మహక్కు ఒక్క అమెరికాకే ఉంది’ ఇదీ వరస! ఈ కారణం చేతనే ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వలసగా బతికిన అమెరికా ఆ వలస బానిస బతుకు నుంచి తిరుగుబాట్ల ద్వారా స్వతంత్ర దేశంగా ఉనికిని చాటుకున్నా, అబ్రహాం లింకన్ దక్షిణాదిలో తెల్లవాడి బానిసత్వం నుంచి నల్లవాడి విమోచన కోసం ఉద్య మించి వేరుపడే దాకా జాతుల స్వాతంత్య్రానికి విలువ లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ అమెరికా తన గత చరిత్రను మరచిపోయి నలుపు– తెలుపు వర్ణవివక్షా చదరంగపు ఆటలోనే మగ్గిపోతోంది. ఈ ఛాయ లన్నింటినీ అమెరికా నయా సామ్రాజ్య పాలకులు పుణికి పుచ్చుకొని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల ప్రజలను పీడిస్తూనే ఉన్నారు, ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ పెట్టుబడి, రుణ సంస్థ లను శాసిస్తూ ఈ ఖండాల ప్రజలను, సంపదను దోచుకుతింటు న్నారు. తిరగబడుతున్న ప్రజలపైన అమెరికా పాలకులు తమ సైనిక పారిశ్రామిక వ్యవస్థ ద్వారా హింసాకాండకు ఒడిగడుతున్నారు. అందుకే సుప్రసిద్ధ అమెరికా మీడియా పరిశోధనా సంస్థలలో ఒకటైన ‘‘సాకర్ధార’’.. ఇటీవల అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయి డ్‌ను హత్య చేసిన అమెరికన్ పోలీసుల చర్యను, పై వివిధ నగరాలలో వచ్చిన ప్రజా వెల్లువను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య గమనించదగింది. ‘కొందరు ఈ వెల్లువను చూసి విప్లవం అనుకుంటున్నారు. కానీ అది సరైన వర్ణన కాదు, ఎందుకంటే, విప్లవం అనేది కేవలం అధికారంలో ఉన్న వ్యక్తుల్ని మార్చేది కాదు, పాలనా వ్యవస్థనే మౌలికంగా, మూల ముట్టుగా మార్చేసే నూతన వ్యవస్థ ప్రతిష్టాపనగా ఉండేది. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది అన్యాయంపై తిరుగుబాటు మాత్రమే, అయితే అది అమెరికాలో నేటి సామాజిక వ్యవస్థ పతనావస్థకు తొలి దశగా మాత్రమే చూడాలి’ (సాకర్ ధార: రివ్యూ) ఈ దృష్ట్యా చూసిన ప్పుడు నేడు ప్రపంచవ్యాపితంగా పతనదశలో ప్రవేశించినా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా అమెరికా సామ్రాజ్యవాద దురాక్ర మణ వ్యూహాలు ఆగలేదు. చైనాను కబళించడమే అసలు లక్ష్యం రాజకీయ, ఆర్థిక సామ్రాజ్య విస్తరణలు ప్రపంచ యుద్ధాలకు దారి తీయటం మనకు తెలుసు! బహుశా ఈ దృష్ట్యానే అమెరికా సుప్రసిద్ధ మాజీ దౌత్యాధికారి మార్క్ బ్రెజెన్సీ్క ఇలా అని ఉంటాడు. ‘అమె రికాలోని రాజకీయ, సైనిక, బడా వర్తక వ్యాపార వర్గాలు చైనాను కబ ళించాలని ఎదురుచూస్తున్నాయి’ అన్నాడు! ఈ విషయంలో అమెరికా పాలకవర్గాలయిన రిపబ్లికన్లకు, డెమోక్రాట్స్‌కు తేడా లేదు, దొందు దొందే! అందుకే అమెరికా అఖిల కార్మిక ఫెడరేషన్ ఈ రెండు పార్టీలను కలిపి ‘డెమోపబ్లికన్స్’ అని (డెమోక్రాట్స్–రిపబ్లి కన్స్) ఏనాడో నామకరణం చేసింది! కనుకనే మొన్న జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్య సందర్భంగా యావత్తు అమెరికాలో ప్రజలు వినిపిం చిన సామాజిక నినాదం ఒకటే. ఈ నకిలీ ప్రజాస్వామ్యంలో ఇక ‘మాకు శ్వాస ఆడటం లేదు. గాలి పీల్చుకోలేకపోతున్నాం’ అని వారు నినదించవలసి వచ్చింది. నేడు ఆ ‘శ్వాసకోశవ్యాధి’ మొత్తం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకే చుట్టుకుంది. ‘హౌడీ మోదీ’ అని ట్రంప్ అన్నా, ‘నమస్తే ట్రంప్’ అని మనం అన్నా ఆసియాలో అమె రికా దురాక్రమణ విస్తరణ మాత్రం ఆగబోవడం లేదని గుర్తించాలి! అమెరికాలో ఇవాళే కాదు, రేపు ఎవరు ప్రెసిడెంట్‌గా ఎన్నికైనా నిరంతరం ‘యుద్ధ నినాదమే అమెరికా విధానం’గా ఉంటుందన్న ప్రసిద్ధ అమెరికా పరిశోధక విశ్లేషకుడు డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ మాట అక్షర సత్యం. అంతేగాదు, అమెరికా యుద్ధ వ్యూహాన్ని, కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా వివిధ దేశాల్లో టెర్రరిస్టు గుంపులను పెంచడం కూడా అమెరికా విధానమే. ప్రపంచంలోని 120 దేశాలలో గత వందేళ్ళలోనూ అమెరికా చర్యల్ని పూసగుచ్చి వివరిస్తూ అమెరికా చారిత్రకుడు నిక్ టర్సీ ‘అమెరికా యుద్ధ రహస్యాలు’ (సీక్రెట్ హిస్టరీ ఆఫ్ యూఎస్ఎస్ఆర్) గ్రంథంలో వివరించాడు. అఫ్గానిస్తాన్, ఇరాక్ దేశాలను ఆక్రమించడంతో సహా మొత్తం 120 దేశాలలో అమెరికా పాలకులు సృష్టించిన దురాక్రమణలను, యుద్ధాలను పేరుపేరునా నిక్ టర్సీ పేర్కొన్నాడు. వీటన్నింటిలోనూ స్పెషల్ ఆపరేషన్స్ పేరిట రహస్య సర్వీసులను అమెరికా విస్తరించింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో రెక్కలు విప్పుకుంటున్న ఫాసిజం ట్రంప్ అధికారంలోకి వచ్చిన (2017) తొలి సంవత్సరంలోనే 149 దేశాలలో 70,000 మంది సైనికులలో ప్రత్యేక దళాల్ని విస్తరించాడు. ప్రెసిడెంట్ ఒబామా హయాంలో రహస్యంగా ‘సీల్’ సైనిక బృందాల్ని పంపి అమెరికానే పెంచిన బిన్లాడన్ను హతమార్చింది. ఇలా పశ్చి మాసియా, ఆఫ్రికాలతో జోక్యం చేసుకొని చొరబడి వేలాదిమంది పౌరుల్ని అమెరికా తన పొట్టన పెట్టుకుంది! అపాచీ యుద్ధ విమా నాల్ని మన పాలకులకు 2019 అక్టోబర్‌లో అమెరికా పంపించింది. ఇరాక్‌లో సెక్యులర్ అధినేత సద్దాం హుస్సేన్‌ను హత మార్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ ఆసియా, ఆఫ్రికా సైనిక స్థావరాలైనా సరే.. అమెరికా సామ్రాజ్యవాద పాలకులకు విహార కేంద్రాలుగా మారాయి. అంతర్జాతీయ సూత్రాలు, నియమాలు, అంతర్జాతీయ న్యాయస్థానా లను ఉల్లంఘించే స్వేచ్ఛను నిరంకుశంగా అమెరికా సామ్రాజ్య పాలకులు నేటికీ యధేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఇస్లామిక్ నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాదీని, అతని కుటుంబాన్ని హతమార్చిందీ అమెరికాయే. నిన్నగాక మొన్ననే, ఇరాన్ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్న సర్వసేనాధిపతి సులేమాన్‌ను రహస్యంగా హతమార్చిందీ అమెరికాయే. ఒక్కమాటలో ఇలా బల్గేరియానుంచి రుమేనియా దాకా, బుర్కి నాఫాసో నుంచి సోమాలియా దాకా, చిలీ నుంచి గ్వాటిమాలా వరకు, ఫిలిప్పైన్స్ నుంచి దక్షిణ కొరియా దాకా స్థానిక తైనాతీ పాలకులకు అమెరికా ‘గొడుగులు’ పట్టి కూర్చుని ఉంది. ఇలా ప్రపంచంలోని 72 శాతం దేశాలలో (141 దేశాలు) అమెరికా ప్రత్యేక దళాలు పని చేస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో చైనాను కవ్విస్తూ అమెరికా తిష్టవేస్తోంది. ఇలా ఒక వైపున అమెరికాలో ట్రంప్ మాటల్లో ‘వామపక్ష ఫాసిజం’ విస్తరిస్తుండగా, ఇటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఫాసిజం జడలు విప్పు కుంటుంది. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఖరీదైన విడాకులు : కొత్త బిలియనీర్‌గా ఆమె!
భర్త నుంచి విడాకులు పొంది.. తద్వారా లభించిన భరణంతో ఆసియాలోని సంపన్న మహిళల్లో ముందు వరుసలో నిలిచారు చైనాకు చెందిన యువాన్ లిపింగ్. ఇక విడిపోతున్న నేపథ్యంలో షెంజన్ కాంగ్‌టాయ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో. చైర్మన్ డూ వీమిన్. ఆయన భార్య యువాన్‌కు 163.3 మిలియన్ షేర్లు బదలాయించడంతో వీరి విడాకుల వ్యవహారం ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్‌గా నిలిచింది. సోమవారం మార్కెట్లు ముగిసేనాటికి యువాన్ ఆస్తి 3.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కాగా కెనడా పౌరురాలైన యువాన్ బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనమిక్స్‌లో ఆర్థికశాస్త్రం నుంచి బ్యాచిలర్ పట్టా పొందారు. భరణం కింద మిలియన్ల షేర్లు ఈ క్రమంలో డూ వీమిన్ను పెళ్లాడిన ఆమె.. మే 2011 నుంచి ఆగస్టు 2018 వరకు భర్తకు చెందిన షెంజన్ కాంగ్‌టాయ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో. కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకున్న 49 ఏళ్ల యువాన్‌కు భరణం కింద కంపెనీకి చెందిన 163.3 మిలియన్ షేర్లు లభించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి కావడంతో ఆమె సంపన్న మహిళల జాబితాలో చేరిపోయారు. అయితే షేర్లు తన పేరిట ఉన్నా కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నిర్వహించే ఓటింగ్‌లో పాల్గొనే హక్కును మాత్రం భర్తకే వదిలేశారు. ప్రస్తుతం యువాన్.. కాంగ్‌టాయ్ అనుబంధ సంస్థ బీజింగ్ మినాహి బయోటెక్నాలజీ కో. సంస్థలో వైస్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. డూ వీమిన్ (56) విషయానికొస్తే.. చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్‌లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన రసాయన శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1987లో క్లినిక్‌లో పనిచేయడం ప్రారంభించి, 1995 నాటికి ఓ ప్రముఖ బయోటెక్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా ఎదిగారు. అనంతరం వ్యాక్సిన్ల తయారీ సంస్థ కంగ్టాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీని అభివృద్ధి చేసుకుంటూ, 2009లో మినాహి అనే మరో సంస్థను సొంతం చేసుకుని ఉభయ సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపద ఇక కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు కాంగ్‌టాయ్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే కంగ్టాయ్ చైర్మన్ డూ, యువాన్ విడాకుల వ్యవహారంతో ఒక్కరోజులోనే 3.1 శాతం మేర షేర్లు పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 12.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 6.5 బిలియన్ డాలర్ల సంపదలో 3.2 బిలియన్ డాలర్లు (షేర్ల రూపంలో) భరణంగా భార్యకు బదలాయించడంతో డూ ఆస్తుల విలువ 3.1 డాలర్లకు పడిపోయింది. కాగా అమెజాన్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన భార్య, రచయిత్రి మెకాంజీకి దాదాపు 36.8 బిలియన్ డాలర్ల విలువైన అమెజాన్ షేర్లు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఫోర్బ్స్ మహిళా సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు, ఖరీదైన విడాకులు. దిమిత్రి రైబోలోలెవ్- ఎలీనా రైబోలోలెవ్ బెజోస్ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు విడిపోయారు. ఈ క్రమంలో బిలియనీర్ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించారు. ఎలిక్ వైల్డిస్టీన్- జోక్లిన్ వైల్డిస్టీన్ ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్ 1999లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇందులో భాగంగా 3.8 బిలియన్ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు. రూపెర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్ మన్ అమెరికన్ మీడియా మెఘల్ రూపెర్ట్ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్ డాలర్లు భరణంగా ఇచ్చారు. బెర్నీ ఎలెస్టోన్- స్లావికా ఎలెస్టోన్ ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్ డాలర్లు. స్టీవ్ వీన్- ఎలైన్ వీన్ కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. స్టీవెన్ స్పీల్బర్గ్- ఎమీ ఇర్వింగ్ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు. -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌తో డీల్ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. డీల్ వార్తల కారణంగా రిలయన్స్ షేరు ఒక్కసారిగా ఎగియడంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో చైనా దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అధిగమించి అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. జాక్ మా కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. సంపన్నుల సంపదకు కొలమానంగా పరిగణించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ సుమారు 10 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ముందు ఈ ఏడాది ఇప్పటిదాకా అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. డాలర్ల మారకంలో చూస్తే ఆసియాలో అత్యధికంగా నష్టపోయినది ముకేశ్ అంబానీయే. కానీ, ఫేస్బుక్ డీల్ కలిసి వచ్చి రిలయన్స్ షేరు పుంజుకోవడంతో మళ్లీ ఆసియా కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ
సాక్షి, ముంబై : ఫేస్బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) రిలయన్స్ అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే ఫేస్బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 సంవత్సరాలలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్ తగ్గడంతో అలీబాబా హోల్డింగ్స్ నష్టాలను చవి చూస్తోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది -
వైరస్ మరణాలు 13 వేలు
రోమ్/ప్యారిస్/లండన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఊహించనంత వేగంతో విస్తరిస్తున్న ఈ మహమ్మారితో ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వారాంతపు సెలవుల్లో గడపాల్సిన కోట్లాది మంది ప్రజలు కోవిడ్ భయంతో ఆదివారం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం యావత్ భారత్ లాక్డౌన్ పాటించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై స్వయం కర్ఫ్యూ పాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,130 మందికి వ్యాధి సోకగా ఆదివారం ఒక్కరోజే 1,702 మృతి చెందడంతో మొత్తం మరణాలు 13,444కు చేరుకున్నాయి. వీరిలో ఒక్క ఇటలీ దేశస్తులే 651 మంది ఉన్నారు. సుమారు 170 దేశాలకు వైరస్ వ్యాపించగా దీని విస్తృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో 100 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 35 దేశాలు సరిహద్దులను మూసి వేసుకున్నాయి. అయితే, మరణాలు, బాధితుల సంఖ్య వెల్లడించిన వాటికంటే ఎక్కువగానే ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఉండగా, బ్రిటన్ రాణి ఎలిజబెత్ వద్ద పనిచేసే ఉద్యోగిని కూడా వైరస్ సోకినట్లు తేలడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) బయటకు వస్తే జరిమానా యూరప్ మొత్తమ్మీద 1,52,117 కరోనా కేసులు నిర్ధారణ కాగా అందులో ఒక్క ఇటలీలోనే 59 వేల వరకు ఉన్నాయి. ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్ ఇతర యూరప్ దేశాల ప్రభుత్వాలు తమ పౌరులను ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించాయి. బయటకు వచ్చిన వారిపై జరిమానాలు తప్పవని హెచ్చరించాయి. యూరప్‌లో మరణాల సంఖ్య 7,802 కాగా తీవ్రంగా ప్రభావితమైన ఒక్క ఇటలీలోనే ఆదివారం 651 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,476కు చేరుకుంది. ప్రపంచవ్యాప్త మరణాల్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో అన్ని అత్యవసరేతర సంస్థలను మూసివేయాలని ఇటలీ ప్రధాని గిసెప్ కాంటే ఆదేశించారు. స్పెయిన్‌లో 24 గంటల వ్యవధిలో 394 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాలు 1,720కు చేరుకున్నాయి. ఫ్రాన్సులో మొత్తం 562 మంది కోవిడ్‌తో చనిపోయారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరాలను సరఫరా చేసేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫ్రాన్సు అధికారులు ప్రకటించారు. బ్రిటన్‌లో 233 మంది కోవిడ్‌తో చనిపోయారు. పబ్‌లు, రెస్టారెంట్లు, థియేటర్లు మూసివేయాలని, తొందరపడి ఎడాపెడా నిత్యావసరాలను కొనవద్దని పౌరులను బ్రిటన్ కోరింది. అమెరికాలో... అగ్రరాజ్యం అమెరికాలో ఆదివారం 47 మంది చనిపోగా మొత్తం మృతులు 349, కేసుల సంఖ్య 26,747కు చేరుకుంది. న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలెస్ నగరాలు సహా మూడో వంతు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మిగతా ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్యకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ఆసియాలో.. ఆసియా ఖండంలో 96,669 కేసులు బయటపడగా 3,479 మరణాలు నమోదయ్యాయి. వ్యాధికి మూల కేంద్రమైన చైనాలో ఆదివారం ఒక్క కేసు మాత్రమే బయటపడింది. థాయ్‌ల్యాండ్‌లో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులతో మొత్తం సంఖ్య 600కు పెరిగింది. మధ్యప్రాచ్యంలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే ఇరాన్లో 123 మంది చనిపోగా మొత్తం మరణాలు 1,685కు చేరుకున్నాయి. పాకిస్తాన్లో పాక్షిక లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు., తమ దేశం పరిస్థితి ఇటలీ మాదిరిగా ఘోరంగా లేదన్నారు. పూర్తి లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆస్ట్రేలియా సరిహద్దులను మూసివేసింది. ఆఫ్రికాలో 1,100 కేసులు ఇప్పటివరకు వెలుగుచూశాయి. రాణి సహాయకురాలికి కరోనా పాజిటివ్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ (93)కు సహాయకురాలు ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ వ్యాప్తి భయంతో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు రాణిని ముందు జాగ్రత్తగా ఇటీవలే విండ్సర్ కేజిల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. రాణి విండ్సర్కు వెళ్లకముందే ఆ సహాయకురాలికి వైరస్ సోకినట్లు మీడియా తెలిపింది. -
కేసులు 2లక్షలు.. మరణాలు 8వేలు
పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్‌లో 3,422 మంది మరణించారు. చైనా, ద.కొరియాల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చైనాలో బుధవారం కూడా కొత్తగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) అమెరికాలో.. అమెరికాలో కరోనా (కోవిడ్-19) తో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. దేశవ్యాప్తంగా మెడికేర్ టెలీహెల్త్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలు పొందాలన్నారు. కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు న్యూయార్క్ వ్యాప్తంగా సామూహిక క్వారంటైన్‌ను ప్రకటించే అవకాశముందని మేయర్ బిల్ డి బ్లేసియో పేర్కొన్నారు. మొత్తం 86 లక్షల మంది పౌరులను ఇళ్లలోనే నిర్బంధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి) యూరోపియన్ యూనియన్ వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో సరిహద్దులను మూసేస్తూ యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల ప్రజలు 30 రోజుల పాటు ఈయూ దేశాల్లోకి రాకూడదని నిషేధం విధించింది. యూరోప్‌లో మొత్తం 3,422 మరణాలు చోటు చేసుకోగా.. వాటిలో ఇటలీలోనే 2,978 మంది చనిపోయారు. (కరోనా వైరస్ కృత్రిమంగా తయారు చేసింది కాదు!) ఇరాన్లో.. మరోవైపు, ఇరాన్లో కరోనా మృత్యుఘంటికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 147 మంది ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. బుధవారం వరకు ఈ దేశంలో కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 1,135కి చేరింది. 1,192 కొత్త కేసులతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 17,161కి పెరిగింది. ఆఫ్రికాలో.. వైద్య సదుపాయాలు అతి తక్కువగా ఉండే ఆఫ్రికాలో ఇప్పటివరకు సుమారు 500 కేసులు నమోదయ్యాయి. బుర్కినాఫాసోలో తొలి మరణం చోటు చేసుకుంది. లాటిన్ అమెరికా లో 1100 కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో మంగళవారం తొలి మరణం నమోదైంది. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియాలో 454 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఐదుగురు మరణించారు. ప్రధాని మోరిసన్ దేశవ్యాప్తంగా ‘హ్యూమన్ బయో సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. అనవసర విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రజలను కోరారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. నిరుద్యోగం పెరుగుతుంది కరోనాతో విశ్వవ్యాప్తంగా నిరుద్యోగం భారీగా పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయే వీలుంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మూడున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని కార్మికులు కోల్పోతారని తెలిపింది. రాణి అపాయింట్మెంట్స్ రద్దు ► 94 ఏళ్ల బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2, రానున్న కొన్ని నెలల పాటు తన అన్ని అపాయింట్మెంట్స్ను రద్దు చేసుకున్నారు. గురువారం బకింగ్హామ్ప్యాలెస్ నుంచి విండ్సర్ క్యాజిల్‌కు తన విడిదిని మార్చుకోనున్నారు. ► కరోనాపై పోరుకు 500 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయాలంటూ వెనెజువెలా చేసిన అభ్యర్థనను ఐఎంఎఫ్ తోసిపుచ్చింది. ► వైరస్ విజృంభణ నేపథ్యంలో తమ దేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అంగీకరించారు. సత్వరమే వైద్య సౌకర్యాలను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మలేసియా– సింగపూర్లను కలిపే జొహోర్ బహ్రూ ఫ్లై ఓవర్ దారులు నిర్మానుష్యంగా మారిన దృశ్యం -
చమురు ధరలు భారీ పతనం..
న్యూఢిల్లీ : కరోనా ప్రభావం స్టాక్‌మార్కెట్ల నుంచి ముడిచమురు సహా కమాడిటీ వరకూ అన్ని మార్కెట్లనూ బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఏకంగా 30 శాతం పడిపోయాయి. డెడ్లీ వైరస్‌తో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలతో సౌదీ అరేబియా ధరలను అమాంతం తగ్గించివేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఒపెక్ దేశాలు, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం సౌదీ ఆరాంకో ధరలను భారీగా తగ్గించింది. సౌదీ ప్రైస్ వార్తో ఆసియాలో బ్యాంరెల్ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది. కరోనా షాక్‌తో ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టే క్రమంలో రానున్న నెలల్లోనూ ముడిచమురు ధరలు దిగివస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : కేజీ బేసిన్లో అడుగంటిన క్రూడాయిల్ -
ఆసియా జట్టులో కోహ్లి
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న రెండు మ్యాచ్‌ల ప్రత్యేక టి20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య మార్చి 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. కోహ్లి దీనిని అధికారికంగా ధ్రువీకరించకపోయినా అతను కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడతాడని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత దీనిపై కోహ్లి స్పష్టతనిస్తాడు. భారత జట్టు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మార్చి 18న చివరి వన్డే ఆడనుండగా... మార్చి 29న ఐపీఎల్ ప్రారంభమవుతుంది. తన బిజీ షెడ్యూల్ నుంచి కోహ్లి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంది. కోహ్లి ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. మరో నలుగురు భారత క్రికెటర్ల పేర్లు మాత్రం ఖరారయ్యాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లతో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ఆసియా ఎలెవన్ టీమ్‌లో ఉంటారు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతున్నందున ఆ దేశపు ఆటగాళ్లను ఆహ్వానించడం లేదు. వరల్డ్ ఎలెవన్ జట్టు తరఫున డు ప్లెసిస్, గేల్, బెయిర్‌స్టో, పొలార్డ్ తదితరులు ఈ రెండు మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా ఎలెవన్: కోహ్లి, రాహుల్, ధావన్, పంత్, కుల్దీప్, షమీ(భారత్), తిసారా పెరీరా, మలింగ (శ్రీలంక), ముజీబుర్ రహమాన్, రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), సందీప్ లమిచానె (నేపాల్), ముస్తఫిజుర్ , తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్ముదుల్లా (బంగ్లాదేశ్). వరల్డ్ ఎలెవన్: అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో (ఇంగ్లండ్), క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్), డు ప్లెసిస్, ఇన్‌గిడి (దక్షిణాఫ్రికా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), మిచెల్ మెక్లీనగన్ (న్యూజిలాండ్). -
జన జాతరలు
ఎస్ఎస్ తాడ్వాయి: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క – సారలమ్మ జాతరకు ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలోనే బీరప్ప, కోట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ వంటి స్థానిక జాతరలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక జాతరలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. వీటిలో ప్రధానమైన కొన్ని జాతరల విశేషాలు. జంగూబాయి: గోండు తెగకు చెందిన ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సమీపానికి సరిహద్దు ప్రాంతంగా కలసి ఉన్న మహారాష్ట్రలో ఈ జాతర జరుపుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జంగూబాయి దేవతకు ప్రతిరూపమైన పెద్దపులిని పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ద పౌర్ణమి మాసం రాగానే నెల రోజుల పాటు జంగూబాయి మాలలు వేస్తారు. జంగూమాతను టెంకాయలు మొక్కులుగా సమర్పిస్తారు. అక్కడి గుట్ట లోని గుహలో ఉండే పెద్దపులికి జంగో లింగో అంటూ జేకొడుతూ దర్శనం చేసుకుంటారు. బీరమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజీపూర్ జిల్లాలోని బస్తర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వాజేడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న లొటపిట గం డి కొండల్లో ఆదివాసీలు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. పూర్వ కాలంలో ప్రజలను దోపిడీ దొంగలు దోచుకుపోతుంటే వారి నుంచి రక్షించేందు కు ముగ్గురు అన్నదమ్ములు పగిడిద్దరాజు, పాంబోయి, బీరమయ్య సిద్ధమవుతారు. ఈ దోపిడీ దొం గలను తరుముకుంటూ పగిడిద్దరాజు మేడారానికి, భూపాలపట్నం వైపు, బీరమయ్య లొటపిట గండికి వెళ్లి స్ధిరపడతారు. అప్పటి నుంచి బీరమయ్యకు లొటపిటగండిలో, పాం బోయికి భూపాలపట్నం లో, పగిడిద్దరాజుకు మేడా రంలో జాతరలు నిర్వహిస్తారని అక్కడి పెద్దలు చెబుతారు. ఈశాన్య రాష్ట్రాల్లో హర్నిబిల్ భారత దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వందల సంఖ్యలో గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడున్న ఏడు రాష్ట్రాల్లో ప్రతి తెగకు సంబంధించి వేర్వేరుగా జాతరలు ఉన్నాయి. వీటిలో నాగాలాండ్‌లో జరిగే హర్నిబిల్ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ప్రధాన ఉద్దేశం గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకోవడం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడి గిరిజనులు ఆటపాటలతో ఆడిపాడుతారు. సంస్కృతికి సంబంధించిన వేడుక కావడంతో ఇది కనులపండువగా సాగుతుంది. హర్నిబిల్ జాతర తర్వాత జనవరిలో మణిపూర్‌లో థీసమ్ ఫణిత్ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సహ్రుల్ ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో సహ్రుల్ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. ఇక్కడ ఉండే సాల్ అనే చెట్టుకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ధర్తీ మాతగా సీతాదేవి ఇక్కడ కొలుస్తారు. ప్రకృతి విపత్తులు ఇతర కష్టాల నుంచి తమను కాపాడుతారని ఇక్కడి గిరిజనుల విశ్వాసం. మఘేపరాబ్ ఒడిశా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా అనేక జాతరలు జరుగుతాయి. ఇందులో ఏడు ప్రధానమైన జాతరలు ఉన్నాయి. వీటిలో మఘేపరాబ్ జాతర ఒకటి. ఈ జాతర సందర్భంగా తమ తెగ దేవతకు నల్లని పక్షులు బలిస్తారు. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. ఆదివాసీలకు ఇది ప్రధాన జాతర. మూడు రోజుల పాటు (ఇటీవలే జరిగింది) నిర్వ హిస్తారు. నాగోబా జాతరను మెస్రం వంశస్తులు, గోండు ఆదివాసీలు జరుపుతారు. పుష్యమాసంలో నెలవంక చంద్రుడు కనిపించగానే.. మెస్రం వంశస్తులు హస్తిన మడుగు నుంచి కలశంతో నీరు తీసుకొచ్చి నాగులమ్మ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దంతేశ్వరీ ఉత్సవాలు ఆదివాసీ తెగ ప్రజలు అత్యధికంగా జీవించే ఛత్తీస్‌గఢ్‌లో దసరా పండుగ సమయంలో ఇక్కడ అన్నమదేవ్ రాజవంశీయులు దంతేశ్వరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జగదల్పూర్ కేంద్రంగా జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు హాజరవుతారు. రాజవంశీయులు కీలక భూమిక పోషించినా ప్రధాన పాత్ర గిరిజనులదే. అదేవిధంగా రాయ్‌పూర్ సమీపంలో ఉన్న భోరమ్‌దేవ్ జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. గరియ మాత త్రిపుర రాష్ట్రంలో రీంగ్ తెగకు చెందిన ఆదివాసీలు గరియ పూజ జాతరను జరుపుకుంటారు. చైత్ర సంక్రాంతి రోజున ఒక వెదురు దండాన్ని ప్రత్యేకంగా కాటన్దారం, కాటన్‌తో తయారు చేసిన పూలతో అలంకరిస్తారు. దైవత్వానికి అంకితమైన కొందరు వ్యక్తులు ఈ దండాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతారు.ఆ సమయంలో దేవతను స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలను చేస్తూ పంటలు బాగా పండాలని బాధలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతారు. నాగోబా జాతరలో భక్తులు (ఫైల్) -
చైనాను వణికిస్తున్న ‘కరోనా’
వూహాన్: పొరుగుదేశం చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. నిన్నమొన్నటివరకూ వూహాన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనుకున్న సూక్ష్మజీవి కాస్తా ఇప్పుడు ఖండాలు దాటి తైవాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలకూ పాకినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంగళవారం నాటికి చైనాలో ఈ వైరస్ బారిన పడ్డవారు సుమారు ఆరుగురు మరణించగా మరో 300 మంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. చైనా కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువై ఈ కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందన్న అంచనాలతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. మరోవైపు ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వ నిపుణుడు ఝాంగ్ నాన్షాన్ సోమవారం ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. గత నెల చివరిలో తొలిసారి ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది. మధ్య చైనాలోని వూహాన్ ప్రాంతంలో తొలి కేసు నమోదు కాగా తరువాతి కాలంలో బీజింగ్, షాంఘై, గువాంగ్డాంగ్ ప్రాంతాల్లోనూ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మంగళవారం 80 వరకూ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ సుమారు 300 మంది వైరస్ బారిన పడినట్లు అయింది. మరో 900 మంది వైద్యుల పరిశీలనలో ఉండటం గమనార్హం. వేగం దాని లక్షణం... మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. లూనార్ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తారని, ఫలితంగా ఈ వ్యాధి మరింత ఎక్కువ మందికి సోకే అవకాశముందని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2002–2003లో సార్స్ వైరస్ విస్తృతిని గుర్తించేందుకు సాయపడిన ఝాంగ్.. ప్రభుత్వ టెలివిజన్ సీసీటీవీలో మాట్లాడుతూ గువాంగ్ డాంగ్ ప్రాంతంలో ఇద్దరికి కుటుంబ సభ్యుల నుంచే వైరస్ సోకిందని స్పష్టం చేయగా, 15 మంది వైద్యాధికారులూ వైరస్ బారిన పడినట్లు వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఇదిలా ఉండగా.. వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని, ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని అందుకోవాలని అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశించారు. ఏమిటీ కరోనా వైరస్... జలుబు నుంచి తీవ్రస్థాయి శ్వాసకోశ వ్యాధులకు కారణమైన వైరస్ల కుటుంబానికి చెందింది. ఎంఈఆర్ఎస్, సార్స్ వంటి వాటిని ఇప్పటికే గుర్తించగా.. ఏడవ రకం వైరస్ అయిన కరోనా వైరస్‌ను వూహాన్లో తొలిసారి గుర్తించారు. చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్కానర్ వ్యాప్తి ఇలా.. ఈ వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు. –గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే. –వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు అప్రమత్తం.. వూహాన్ కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఆసియాదేశాలు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు ప్రారంభించాయి. 2002 –2003లో చైనా నుంచే సార్స్ వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై పరీక్షలు జరపడం మొదలుపెట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ ఉధృతిని గుర్తించడంతోపాటు, నియంత్రణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరినీ థర్మోస్ స్కాన్లు తీసేందుకు థాయ్‌లాండ్ సిద్ధమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోని మూడు విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్ ప్రక్రియ మొదలైంది. జపాన్ కూడా అప్రమత్తమయింది. అంతేకాకుండా, హాంకాంగ్‌లోనూ విమాన ప్రయాణీకుల స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు వైరస్ ప్రభావం పర్యాటక రంగంపై పడుతుందన్న అంచనాలతో ఆసియా స్టాక్ మార్కెట్లలో షేర్లు పతనమయ్యాయి. -
భారత ఉపఖండం వల్ల భూమిపై అనేక మార్పులు!
వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది. ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్‌ను రికార్డు చేశారు. అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
ప్రేమ.. పగ.. యుద్ధం
ప్రేమతో ఈ కథ మొదలవదు.పగతోనూ ప్రారంభం అవదు.సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రపంచాన్ని పంచుకు తినాలని ఉవ్విళ్లూరే రెండు శక్తులైన బ్రిటన్, రష్యాల మధ్యఆధిక్యపోరులో.. బ్రిటన్ క్రమంగా ఆప్ఘనిస్తాన్ వరకు వ్యాపిస్తుంది. ఆప్ఘన్ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు యువకులైన భారత సిపాయిలను సైన్యంలోకి తెమ్మని ఒకహవల్దార్ను నియమిస్తుంది. ఇక అక్కడి నుంచి ప్రేమ, పగ, ప్రతీకారం, మోసం, సాహసం, కుయుక్తి, కుట్ర, పన్నాగం.. కథను నడిపిస్తాయి.వీరులైన 21 మంది సిక్కు సిపాయిలు కథను పరుగులు తీయిస్తారు. ప్రారంభం 1897. ఆసియాలో పెత్తనం కోసం బ్రిటన్, రష్యాల మధ్య పోటీ పరాకాష్టకు చేరిన సమయం. అప్పటికే రష్యా మధ్యాసియాలో పాగా వేసింది. ఇటు బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అఫ్గానిస్తాన్ సరిహద్దుల దాకా వ్యాపించింది. లఖార్ట్, గులిస్తాన్ కోటలను అవుట్పోస్ట్లుగా చేసుకుంది. వీటికి ఆధిపత్యం వహిస్తుంటారు.. కల్నల్ హఫ్టన్, మేజర్ చార్ల్స్ డేస్ వోక్స్. ఈ హద్దులకు ఆవల ఉన్న అఫ్గాన్ ప్రాంతాన్నీ ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. అందుకు సారాగఢిని బేస్‌గా చేసుకుంటారు. అఫ్గాన్‌తో యుద్ధం చేయడానికి ఊళ్లోని బలవంతులైన యువకులను తీసుకురావల్సిందిగా భారత సిపాయి హవల్దార్ ఇషార్ సింగ్ (మోహిత్ రైనా)ను ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రయత్నం కోసం సొంత ప్రాంతానికి వస్తాడు ఇషార్ సింగ్ మరో సిపాయితో కలిసి. ప్రతీకారం అప్పటికే పెళ్లయ్యున్న ఇషార్ సొంతూరితోపాటు అత్తగారి ఊరు, చుట్టుపక్కల ఊళ్లూ తిరుగుతుంటాడు.. సైన్యంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న యువకులను వెదుకుతూ. అత్తగారి ఊళ్లో బల్వీందర్ సింగ్ ఎదురుపడ్తాడు. సైన్యంలో చేరమని కోరుతాడు. అప్పటికే బల్వీందర్.. ఇషార్ సింగ్ మీద పగతో రగిలిపోతుంటాడు. తాను ఇష్టపడ్డ సోనీని ఇషార్ సింగ్ పెళ్లి చేసుకున్నందుకు. అయితే సోనీ .. బల్వీందర్నేమీ ఇష్టపడదు. పైగా అసహ్యించుకుంటుంది కూడా. ప్రేమ, పెళ్లి అంటూ వెంటబడ్డందుకు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న బల్విందర్.. సైన్యంలో చేరమని అడిగిన ఇషార్‌ను అవమానపరుస్తాడు. ‘‘పరాయి పాలకులకు నువ్వు గులామ్‌గిరి చేస్తున్నది కాక.. మమ్మల్ని చేయమని అడుగుతున్నావా?’’ అంటూ. అయితే బల్వీందర్‌సింగ్ స్నేహితుడు బల్వీందర్సింగ్కి ఓ సలహా ఇస్తాడు.. ‘‘ఇలా మాటలతో కాకుండా ఇషార్ మీద నిజంగా కక్ష తీర్చుకోవాలంటే అతను చెప్పినట్టే సైన్యంలో చేరి సమయం దొరికినప్పుడు ఇషార్‌ను చంపేయ్’’ అని. ఆ మాట నచ్చుతుంది బల్వీందర్కి. సైన్యంలో చేరడానికి ఒప్పుకుంటాడు. చాలా ప్రయాసపడి ఇంకొంత మందినీ ఒప్పించి తీసుకెళ్తాడు ఇషార్‌సింగ్. వాళ్లంతా సిక్కులే. మోసం మొత్తానికి 21 మంది సిక్కు వీరులతో ఒక క్యాంప్ తయారవుతుంది. వీళ్లు సార్టాప్, సారాగఢి చూసుకుంటూంటారు. యుద్ధం కోసం వీళ్లకు శిక్షణ ప్రారంభించబోతుండగా ఒకరోజు ఒకముస్లిం వనిత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ కోటలోకి. ‘‘ఇక్కడికి దగ్గర్లో ఉన్న కబేలా (తండా లాంటిది)లో ఉంటున్నాం. మా అక్క గర్భవతి. నొప్పులతో బాధపడుతోంది. మీ దగ్గర డాక్టర్ ఉన్నాడని తెలిసి వచ్చాను. కొంచెం సాయం చేయండి. కాదనకండి’’ అంటూ ప్రాధేయపడ్తుంది. కల్నల్ హఫ్టన్ భార్య తమ దగ్గరున్న డాక్టర్‌తోపాటు ఆయా థెరిసానూ పంపిస్తుంది. వీళ్లు వెళ్లాక కాని అర్థం కాదు అది మోసమని. హఫ్టన్ ఏ ప్రాంతాన్నయితే కైవసం చేసుకోవాలని చూస్తున్నాడో ఆ ప్రాంతపు ఏలిక గుల్ బాద్షా పన్నిన కుట్ర అది. డాక్టర్‌ను, థెరిసాను బంధిస్తాడు. వాళ్ల కోసం బ్రిటిష్ సేనలు వస్తే యుద్ధం చేయాలని తయారుగా ఉంటాడు. వేగుల ద్వారా ఈ విషయం హఫ్టన్ క్యాంప్‌కి తెలుస్తుంది. వెంటనే ఎదురుదాడికి వెళ్లి డాక్టర్ని, థెరిసాను విడిపించుకురావాలని ఆవేశపడ్తాడు గురుముఖ్‌సింగ్ అనే సైనికుడు. సంయమనం పాటించమంటాడు ఇషార్ సింగ్. థెరిసా.. గురుముఖ్ను ఇష్టపడ్తుంటుంది. ఇషార్ సింగ్ మాటవినకుండా, హఫ్టన్ అనుమతి లేకుండా ఒక్కడే బయలుదేరుతాడు గురుముఖ్. సాహసం ఒడుపుగా గుల్‌బాద్షా కోటలోకి వెళ్లి, చాకచక్యంగా డాక్టర్‌ను, థెరిసాను విడిపించి బయటకు తీసుకొస్తాడు గురుముఖ్. దాన్ని గుల్‌బాద్షా పసిగట్టడమే కాదు తమ సరిహద్దు దాటేలోపలే వాళ్లను పట్టుకుంటాడు కూడా. గురుముఖ్ను గుల్‌బాద్షా తుపాకితో కాల్చబోతుంటే డాక్టర్ అడ్డుపడ్తాడు. దాంతో డాక్టర్‌కు తుపాకి గుండు తగిలి నేలకొరుగుతాడు. ఈ గొడవలో థెరెసాను తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు గురుముఖ్. అక్కడ క్యాంప్ నుంచి హె న్రీ మెయిన్ అనే సైనికాధికారి, ఇషార్‌సింగ్, బల్విందర్ సింగ్ వస్తారు గుల్ బాద్షా మీద దాడికి. దార్లో తూటా తగిలి పడి ఉన్న డాక్టర్ కనపడ్తాడు వీళ్లకు. పరిస్థితి అర్థమవుతుంది. డాక్టర్‌ను తీసుకొని క్యాంప్‌కి తిరిగి వెళ్లమని ఇషార్సింగ్కు ఆర్డర్ వేస్తాడు హెన్రీ. హతాశుడవుతాడు ఇషార్‌సింగ్. బదులు చెప్పలేక అయిష్టంగానే వెనుదిరుగుతాడు ఇషార్. కుయుక్తి థెరిసాతో తప్పించుకున్న గురుముఖ్ స్థానిక గిరిజన ముస్లిం కబేలాకు చేరుతాడు. అప్పటికే థెరిసా కాలుకి గాయమవుతుంది. కబేలా పెద్దను వైద్య సహాయం కోరుతాడు. వైద్యం చేయడానికి గుడారంలోకి తీసుకెళ్తారు వాళ్లను. ఇంతలోకే ఓ వైపు నుంచి గుల్‌బాద్షా, ఇంకో వైపు నుంచి హెన్రీ మెయిన్ వాళ్లు ఆ గుడారంలోకి వస్తారు. గుల్బాద్షాను చూస్తాడు గురుముఖ్. ప్రమాదాన్ని గ్రహించి థెరిసాను అక్కడినుంచి పంపించేస్తాడు. ఆ క్రమంలోనే గుడారాలకు బల్వీందర్ నిప్పు పెడ్తూండడం చూస్తాడు గుర్ముఖ్. అతను అయోమయంలో ఉండగానే గుల్‌బాద్షా, అతని అనుచరులు ఓ గుడారంలోంచి తప్పించుకుపోవడాన్ని చూస్తాడు బల్వీందర్, ఇటు గురుముఖ్ కూడా. గుల్‌బాద్షా తప్పించుకుపోతూ అవతలివైపున ఉన్న హెన్రీకి స్నేహపూర్వకంగా చేయి ఊపడమూ గమనిస్తాడు బల్వీందర్. కుట్ర థెరిసా, గురుముఖ్, హెన్రీ, బల్వీందర్ క్యాంప్‌కి చేరుతారు. బల్వీందర్ ఆ కబేలాకు నిప్పుపెట్టడాన్ని మర్చిపోలేక ఆ సంగతిని గురుముఖ్.. ఇషార్కూ చెప్తాడు. అతనికీ బల్వీందర్ చర్యలోని ఆంతర్యం బోధపడదు. దాంతో బల్వీందర్‌ను నిలదీస్తాడు ఇషార్‌సింగ్. అయినా బల్వీందర్ పెదవి విప్పడు సరికదా.. ఇషార్‌ను చంపే అవకాశం పోయినందుకు రుసరుసలాడుతుంటాడు. హెన్రీ మాటలు, చేతల మీదా అనుమానం వస్తుంది ఇషార్‌కు. అతని మీద కన్నేసి ఉంచుతాడు. ఇదిలా సాగుతుండగానే క్యాంప్‌లోని పావురాల గుంపులోకి ఓ కొత్త పావురం చేరుతుంది. అది ఉత్తరాలను మోసేది అని తెలుస్తుంది ఓ సిపాయికి. ఇషార్ దృష్టికి తీసుకొస్తాడు. ఆ విషయం తెలిసిన హెన్రీ.. తుపాకిని పేల్చి ఆ పావురం ఎగిరిపోయేలా చేస్తాడు. దీంతో హెన్రీ మీద అనుమానం బలపడ్తుంది ఇషార్‌కు. బల్వీందర్‌ను అదుపులోకి తీసుకుని ఆ క్యాంప్‌లో న్యాయ విచారణ చేపడితే గుల్‌బాద్షాకు హెన్రీ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని తేలుతుంది. కబేలాలో గుల్‌బాద్షా తమ చేతికి చిక్కేవాడని బందీగా తెచ్చేవాళ్లమని.. బల్వీందర్ నిప్పు పెట్టడం వల్లే తప్పించుకుపోయాడని గురుముఖ్ చేసిన ఆరోపణ మీద ఈ విచారణంతా సాగుతుంది. హెన్రీ.. ఐర్లాండ్ దేశస్తుడు. బ్రిటన్ మీద కోపంతో ఉంటాడు. గుల్ బాద్షాకు స్పైగా మారి బ్రిటన్ మీద çకసితీర్చుకోవాలనుకుంటాడు. ఒకసారి క్యాంప్‌లో బవ్వీందర్ ఓ నాటు బాంబును ఇషార్ మీదకు విసరబోతుంటే హెన్రీ పట్టుకుంటాడు. ఈ నిజం బయటపెడితే మరణ శిక్ష అని భయపెడ్తాడు బల్వీందర్‌ను. బతిమాలుకున్న బల్వీందర్‌తో బేరం కుదుర్చుకుంటాడు. అతని తప్పును కాయాలంటే తను ఎప్పుడు ఏ పని చెబితే ఆ పని చేయాలని. అలా మాట ప్రకారమే కబేలా నుంచి గుల్ బాద్షాను తప్పించడంలో హెన్రీకి ఉపయోగపడ్తాడు బల్వీందర్. ఇవన్నీ సాక్ష్యాధారాలతో రుజువై హెన్రీకి శిక్ష పడ్తుంది. పన్నాగం తగలబడిపోయిన కబేలా.. ఇటు భారత్, అటు అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో లేని స్వతంత్ర ప్రాంతం. కబేలా తగలబడిందని న్యాయం కోసం అఫ్గానిస్తాన్ రాజు దగ్గరకు వస్తారు కబేలా వాసులు. అప్పుడు రాజు హఫ్టన్కు, గుల్‌బాద్షాకు లేఖలు పంపిస్తాడు రావాల్సిందిగా. ఇద్దరూ వస్తారు. అతని ఆస్థానంలోనే తమ సైనికాధికారితో కలిసి గుల్‌బాద్షా చేసిన కుట్ర గురించి రాజుకు చెప్తాడు హఫ్టన్. గుల్ బాద్షాను మందలించి, ఇక్కడితోనైనా యుద్ధాలోచనలు మాని సంధి చేసుకొమ్మని హితవు చెప్తాడు అఫ్గాన్ రాజు. సంధికి సరే అంటాడు గుల్‌బాద్షా. ఆ శుభ సందర్భంగా ఆ రోజు రాత్రి విందును ఏర్పాటు చేస్తాడు అఫ్గాన్ రాజు. సరదాగా ఓ ఆట ఆడుదామని మల్లయుద్ధ పోటీ పెట్టి, బరిలోకి ఇషార్‌ను ఆహ్వానించి ఓడిస్తాడు గుల్‌బాద్షా. అంతేకాదు సిగరెట్లో పేలుడు పదార్థం పెట్టి హఫ్టన్ను హతమార్చడానికీ ప్రయత్నిస్తాడు. దీన్ని భగ్నంచేసి అఫ్గాన్ రాజు దృష్టికి తీసుకెళ్తాడు ఇషార్. వీళ్ల ముందు ఆ రాజు.. గుల్‌బాద్షాకు మరణ శిక్ష విధించి, బంధించి హఫ్టన్ వాళ్లు వెళ్లిపోయాక.. బ్రిటన్ ఆక్రమిత సారాగఢ్ మీదకు ఎలా దండెత్తాలో ఉపాయం చెప్తాడు గుల్‌బాద్షాకు. ముగింపు 1897..సెప్టెంబర్ 12. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చాక.. సారాగఢిలోని 21 మంది సిక్కులకు శిక్షణను ముమ్మరం చేయాలని నిర్ణయానికి వస్తారు హఫ్టన్, ఇషార్‌లు. ఆ 21 మందికున్న ప్రత్యేకతలన్నిటినీ పరీక్షించి.. తర్ఫీదు ఆరంభిస్తాడు ఇషార్. ఈలోపే అఫ్గాన్ రాజు ఇచ్చిన సలహా ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఒరక్ౖజñ అనే గిరిజన తెగలోని పదివేల మంది సహాయంతో సారాగఢి మీదకు దండెత్తుతాడు గుల్ బాద్షా. అప్పటికి ఈ 21 మంది సిక్కు జవాన్లు యుద్ధానికి సన్నద్ధంగా ఉండరు. అయినా వచ్చిన ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్తారు. జట్లుగా విడిపోయి పదివేల మంది గిరిజనులను అడ్డుకోవడానికి తుపాకులను, కత్తులను, బాంబులను సిద్ధం చేసుకుంటారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలై రాత్రి వరకు సాగుతుంది యుద్ధం. సారాగఢి .. గుల్‌బాద్షా వశం కాకుండా చివరి శ్వాస వరకూ పోరాడుతారు సిక్కులు. ఇషార్ నాయకత్వం వహించిన ఆ సైన్యం.. 180 మంది ప్రత్యర్థులను నేలకొరిగిస్తుంది. గుల్‌బాద్షా కూడా మరణిస్తాడు. ఇదీ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. -
ఆసియాకే కుబేరుడు అంబానీ!
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన ఈ– కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ చీఫ్ ‘జాక్ మా’ను కూడా అధిగమించారు. వార్షికంగా చూస్తే.. మిగతా సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పరుగుల కారణంగా ముకేశ్ అంబానీ సంపద మాత్రం 4 బిలియన్ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అటు జాక్ మా సంపద 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ర్యాంకింగ్‌లు ప్రారంభించిన 2012 సంవత్సరం నాటి నుంచి చూస్తే ఆసియా సంపన్నుల సంపద ఇలా తగ్గిపోవడం ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, షేర్ల విలువలు అనుచిత స్థాయిలకు పెరిగిపోయాయన్న ఆందోళనలు.. ఇందుకు కారణమయ్యాయి. చైనాతో పాటు భారత్, దక్షిణ కొరియా దేశాల సంపన్నులపై ఎక్కువగా ప్రభావం పడింది. బ్లూమ్‌బర్గ్ సూచీలో ర్యాంకింగ్ పొందిన 40 మంది చైనా సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద తగ్గిపోయింది. లిస్టులో భారతీయ కుబేరులు 23 మంది ఉండగా.. వారి సంపద 21 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఉక్కు దిగ్గజం అర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నికర విలువ అత్యధికంగా 29 శాతం మేర (5.6 బిలియన్ డాలర్లు) కరిగిపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్స్ తయారీ దిగ్గజం సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి సంపద 4.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. -
మూడు కోతులు
ఆసియా అమ్మాయిలు ఎంతో గొప్పగా అమెరికా అమ్మాయిల్ని నెత్తిన పెట్టుకుంటే, వీళ్లేం చేశారో చూడండి! బాల్య చాపల్యంతో తెలియక చేసిందే. కానీ, వీడియోను చూస్తే ఈ కోతుల్ని పట్టలేం బాబోయ్ అనిపిస్తుంది. అంత ‘బుల్లీయింVŠ ’ చేశారు ఇంత అందమైన ముఖాలు వేసుకుని! పైన వీడియో గ్రాబ్ చూడండి. మధ్యలో ఉన్న అమ్మాయి మిస్ యు.ఎస్.ఎ. శారా రోజ్ సమ్మర్స్. కుడివైపున ఉన్నది మిస్ ఆస్ట్రేలియా ఫ్రాన్సెస్కా హంగ్. ఎడమవైపున మిస్ కొలంబియా వలేరియా మొరేల్స్. ఈ ముగ్గురిలో ఒకరికి ఇవాళ బ్యాంకాక్‌లో జరుగుతున్న ‘మిస్ యూనివర్స్’ పోటీలలో టైటిల్ వస్తే కనుక ఆ ఒకరి పేరు నాన్–ఇంగ్లిష్ దేశాలకు అలవాటవడానికి కొన్నాళ్లు పట్టొచ్చు. శారా, ఫ్రాన్సెస్కా, వలేరియా.. నోరు తిరగని పేర్లేమీ కానప్పటికీ.. ఐశ్వర్యలా, సుస్మితలా మనకు వెంటనే స్ఫురణకు రాని ఇంగ్లిష్ పేర్లవి.. ‘హు వన్ మిస్ యూనివర్స్ 2018?’ అంటే! పేర్లను, పదాలను అటుంచితే.. ఇంగ్లిష్ అంతా వేరుగా ఉంటుంది. ఆ ఉచ్చారణ, గ్రామర్, పదాల విరుపుల్లోని ఆ స్టెయిల్.. మనది కాదు. ఐశ్వర్యను తిన్నగా పలకడం మొదట్లో వాళ్లకెలా చేతనై ఉండదో.. ఇంగ్లిష్ పేర్లను పలకడం, గుర్తుపెట్టుకోవడం, పెట్టుకుని సరిగ్గా అలానే ప్రొనౌన్స్ చెయ్యడం మనకు చేతకాదు. టై కట్టుకోవడం ఎలాగో యూట్యూబ్‌లో చూసి చేర్చుకోగలం. ప్రాక్టీస్ చేసి సూది మొనలా ఉండే హై హీల్స్ మీద నడవగలం. ఆ భాషే.. ఒక పట్టాన ఒంటబట్టదు. మాట్లాడలేం ఇంగ్లిష్‌లో గడగడ. గడగడలాడించేవారు మనలోను ఉంటారు. కానీ విన సొంపుగా ఉండదు. స్టెయిల్ మిస్సవుతుంది. స్టెయిల్‌ని కూడా సాధన చేసి మాట్లాడితే మనకే అన్నేచురల్గా అనిపిస్తుంది. కానీ మాట్లాడాలి. ఇంగ్లిష్ మాట్లాడలేకపోతే మన ఊళ్లో ఉన్న మార్ట్‌లోనే చెల్లుబాటు కాని ముఖంతో నిల్చోవాల్సి వస్తుంది. ఇంక బెంగుళూరు వెళ్లేం మాట్లాడతాం? వీసా ఆఫీస్‌కి బలహీనమైన భాషతో ఎలా నడిచి వెళ్తాం? మాతృభాషను బలహీనం అనడం కాదు. అమ్మ మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటుంది. ఇంగ్లిష్ పెద్దమ్మ అలాక్కాదు. చికాగ్గా ముఖం పెడుతుంది.‘సే ఇట్ వన్సెగైన్’ అని. చచ్చినట్లు కంట్లోంచి ఇంగ్లిష్ ఉబికి రావల్సిందే. ఇంగ్లిష్ లేకుండా, ఇంగ్లిష్ మాట్లాడ్డం రాకుండా బతకలేం. అయినా కూడా.. వెస్టర్న్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. అందాల పోటీలకు వెళ్తున్న మన అమ్మాయిలకు ధైర్యంగా బెస్టాఫ్ లక్ చెబుతున్నాం. మనమే కాదు, మనకంటే తక్కువ ఇంగ్లిష్ తెలిసిన దేశాల్లోని వాళ్లు కూడా వచ్చిన రెండు ముక్కల్తోనే, నాలుగు రాళ్ల కోసం దేశాటనకు చద్దిమూటల్ని కట్టుకుంటున్నారు. ఇంగ్లిష్ దేశాల వాళ్లకు మళ్లీ ఇంత కష్టం ఉండదు. మన ఊళ్లోకొచ్చి కూడా వాళ్లు హాయిగా ఆ వచ్చిన రెండు రోజులు బతికేసి వెళ్లిపోగలరు. మనమే వాళ్ల భాషలో వండిపెడతాం కాబట్టి. ఇప్పుడీ అమ్మాయిలున్నారు కదా.. వాళ్లు ఏం చేశారంటే, అందాల పోటీలో కంటెస్ట్ చెయ్యడానికి దేశం కాని దేశంలోకి, భాష తెలియని దేశంలోకి వచ్చి కూడా, వాళ్లతో పాటు కంటెస్ట్ చెయ్యడానికి వచ్చిన లోకల్ వియత్నాం అమ్మాయినీ, లోకల్ కాంబోడియా అమ్మాయిని.. ఇంగ్లిష్ మాట్లాడ్డం రాదని వెక్కిరించారు! నేరుగా వెక్కిరించలేదు. వీడియో ఒకటి తీసి దాన్ని నెట్లోకి అప్లోడ్ చేశారు! పాపం అంతకు ముందే కాంబోడియా కంటెస్టెంట్ రెర్న్ సైనత్.. మధ్యలో ఉన్న అమ్మాయి పక్కన నిలబడి గొప్పగా ఆ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంది.. ‘చూశారా! నేనూ, నా పక్కన ఇంగ్లిష్ అమ్మాయి’ అన్నట్లు! ఆసియా అమ్మాయిలు అంత గొప్పగా అమెరికా అమ్మాయిల్ని నెత్తిన పెట్టుకుంటే, వీళ్లిలా కోతుల్లా చేశారు! బాల్య చాపల్యంతో తెలియక చేసిందే. కానీ వీడియోను చూస్తే ఈ కోతుల్ని పట్టలేం బాబోయ్ అనిపిస్తుంది. అంత ‘బుల్లీయిం ’ చేశారు ఇంత అందమైన ముఖాలు వేసుకుని!‘‘తనెంత తెలివైందో చూడు! ఇంగ్లిష్ వచ్చినట్లే యాక్ట్ చేసింది. సంభాషణంతా అయ్యాక చివర్న ఒక ప్రశ్న అడుగు.. బ్లాంక్ ఫేస్ పెడుతుంది, ఏం అర్థంకాక’’ (మిస్ వియత్నాం హెన్నీ హావభావాల్ని పెద్ద నవ్వుతో ఇమిటేట్ చేస్తూ.. మధ్యలో ఉన్న మిస్ యు.ఎస్. అన్న మాట).ఆ మాటకు.. ‘అవునవును’’ అని ఎడమవైపు మిస్ కొలంబియా నవ్వు. ‘‘ఏదేదీ మళ్లీ చేసి చూపించు’’ అని కుడివైపు మిస్ ఆస్ట్రేలియా నవ్వు. ఈ అమ్మాౖయెతే ఎంత కోతిలా బిహేవ్ చేసిందో వీడియోలో చూడాల్సిందే. లేదంటే పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ సోషల్ క్రిటిక్ టి.ఎస్.ఇలియట్.. సమాధిలోంచి లేచి వచ్చి వర్ణించాలి. ఆ తర్వాత ముగ్గురూ మిస్ కాంబోడియా రెర్న్ సైనత్ మీద పడ్డారు. ‘‘ఆ పిల్ల నోట్లోంచి ఒక్క ఇంగ్లిష్ ముక్క రాలేదు చూశావా!’’, ‘‘ఎంత అయోమయంగా ఉంటారో ఇలాంటి వాళ్లు ఎవరితోనూ కలవలేక. ఒక్కరు కూడా ఇక్కడ ఆ పిల్ల భాషలో మాట్లాడేవాళ్లు లేరు’’ (సైనత్ గురించి మిస్ యు.ఎస్., మిస్ ఆస్ట్రేలియా). వీళ్ల తీరుకు సోషల్ మీడియా విస్తుపోయింది. అక్షింతలు కూడా వేసింది. చివరికి ఆ మధ్యలో ఉన్న అమ్మాయి శారా రోజ్ సమ్మర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సారీ’ చెప్పింది. తనే హీరోయిన్ ఈ ఎపిసోడ్ మొత్తానికి. ఒకవేళ మిస్ యూనివర్స్ టైటిల్ ఈ ముగ్గురికీ మిస్ అయి, ఆ ఇద్దరిలో ఒకరికి వచ్చినా వీళ్లు బాధపడే యోగ్యత లేదిప్పుడు. అంతగా పశ్చాత్తాపంలో ఉన్నారు. ‘ప్రతి కల్చర్ గొప్పది. ప్రతి భాష గొప్పది. హెన్నీ, సైనత్ల మీద నాకు రెస్పెక్ట్ ఉంది. మేమంతా ఎక్కడెక్కడి నుంచో ఒక చోటికి వచ్చిన వాళ్లం. మేం అక్కచెల్లెళ్లం’ అని చక్కటి అందమైన ఇంగ్లిష్‌లో కామెంట్ పెట్టింది శారా రోజ్.తెలిసిన భాషలో భావయుక్తంగా మాట్లాడ్డంలో లేని అందం, భాష తెలియకపోయినా భావం వ్యక్తం అయ్యేలా మాట్లాడ్డంలో ఉంటుంది. సారీ అమ్మాయిలూ.. మీ అంత మంచి ముఖాల్ని కోతులు అన్నందుకు! కోతి వేషాల్ని ఆపేందుకు పెద్దవాళ్లు అనేమాటే ఇది. ఆల్ ది బెస్ట్. టైటిల్ కొట్టుకొచ్చేయండి. కొట్టుకురాలేకపోయినా పర్లేదు. మీరు అందాల రాణులే. అపాలజీ చెప్పడం వల్ల మీ శిరస్సులపై కిరీటం లాంటి ధగధగల వెలుగులేవో ఈసరికే వచ్చి చేరడం మీరూ గమనించుకునే ఉంటారు. -
ఇన్వెస్ట్మెంట్.. మనోళ్లకు మహా ఇష్టం!
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్ చార్టర్డ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది అభిప్రాయాలను సేకరించింది. పొదుపు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు తగినంత ఆదాయం కలిగి సంపన్న వినియోగదారులుగా అవతరిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మనదేశంలో ఎక్కువ మంది సంపన్న కస్టమర్లు నమ్మే విషయం... సంపద నిర్వహణ సమర్థంగా నిర్వహించడం అన్నది గొప్ప సామాజిక చైతన్యానికి ప్రతీక అని. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ... ♦ మన దేశంలో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు. ఈ సర్వేలో ఇదే గరిష్ట స్కోరు. ♦ 31 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటుంటే, 25 శాతం మంది ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలను, 22 శాతం ఈక్విటీలను ఎంచుకుంటున్నారు. కానీ, భారత్ వెలుపల సర్వే జరిగిన ఇతర మార్కెట్లలో ఈ సాధనాలను ఎంచుకునే వారు 16 శాతం, 19 శాతం, 18 శాతంగానే ఉన్నారు. ♦ 44 శాతం మంది కెరీర్లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు. మరో 25 శాతం మంది అయితే వ్యాపారం ఆరంభించాలని, సంపద వృద్ధికి ఇదే చక్కని మార్గమని భావిస్తున్నారు. ♦ ఇక మనదేశంలో సంపన్న వినియోగ వర్గంగా అవతరించే వారిలో 79 శాతం మంది సమర్థవంతమైన సంపద నిర్వహణ సామాజిక చైతన్యానికి కీలకమని భావిస్తుండడం గమనార్హం. ♦ అధిక సామాజిక చైతన్యం కలిగిన మార్కెట్‌గా భారత్ నిలిచింది. చైనా, భారత్ దేశాల్లో మూడింట రెండొంతులు (67%) మంది సామాజిక చైతన్యం పెరుగుదలను అనుభవిస్తున్నారు. ♦ తమ పిల్లల చదువుల కోసం పొదపు చేయడం వీరి కీలక లక్ష్యంగా ఉంది. మన దేశంలో 17 శాతం మంది దీన్నే తెలియజేశారు. అంతేకాదు ఇతర మార్కెట్లలోనూ ఇదే అగ్ర ప్రాధాన్యమని 16 శాతం మేర చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ♦ మన దేశంలో ఎక్కువ మందికి ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ... తక్కువ ఆర్థిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న అన్ని సాధనాల గురించి తెలియకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్టు స్టాండర్డ్ చార్డర్ట్ బ్యాంకు, రిటైల్ బ్యాంకింగ్ భారత విభాగం హెడ్ శ్యామల్ సక్సేనా తెలిపారు. డిజిటల్ ఉపకరణాలు వారి లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని చెప్పారు. సామాజిక చైనత్యం మన దేశంలో సామాజిక చైనత్యం ఫరిడవిల్లుతోంది. ఆదాయాల్లో చక్కని వృద్ధి ఇందుకు తోడ్పడుతోంది. 46% మందికి గత ఏడాదిలో 10% వేతనం పెరగ్గా, 30 శాతం మందికి గత ఐదేళ్ల కాలంలో 50 శాతం అంతకంటే ఎక్కువే వేతనం వృద్ధి చెందింది. 78% మంది డిజిటల్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. వారి విజయానికి ఇవే కీలకమని భావిస్తున్నారు. 80 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్‌కు ఓటేయగా, డిజిటల్ నగదు నిర్వహణ అన్నది ఆర్థిక లక్ష్యాల సాధనకు తమను దగ్గర చేశాయని తెలిపారు. -
‘టెక్నాలజీ’కి బెంగళూరు టాప్..
న్యూఢిల్లీ: టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి గానీ.. విస్తరించడానికి గానీ ఆసియాలో అత్యుత్తమమైన నగరంగా బెంగళూరు నిల్చింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ 7వ స్థానం దక్కించుకుంది. ఆసియాలోని సంపన్న, వర్ధమాన దేశాల్లోని 16 నగరాల్లో 50 అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ముంబైకి 10వ స్థానం, ఢిల్లీ–ఎన్సీఆర్ 11వ ప్లేస్ దక్కించుకుంది. సర్వే ప్రకారం ఆసియాలో టెక్నాలజీ కార్యకలాపాల ప్రారంభానికి, విస్తరణకు అత్యధికులు మొగ్గు చూపుతున్న టాప్ నగరాలుగా బెంగళూరు, సింగపూర్, షెంజెన్ ఉన్నాయి. ఆసియాలో టోక్యో తర్వాత మెరుగైన కార్యాలయాల లభ్యత, సంస్థల యాజమాన్యాలకు తక్కువ వ్యయాలతో.. జీవన వ్యయాల విషయంలో చౌకైన టాప్ 10 నగరాల్లో ఒకటిగా బెంగళూరు నిల్చింది. ఓవరాల్‌గా బెంగళూరుకు 68 శాతం స్కోరు వచ్చింది. వృద్ధి అవకాశాలకు హైదరాబాద్.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరంగా హైదరాబాద్ 59 శాతం స్కోరుతో ఏడో స్థానం దక్కించుకుంది. అయితే సామాజిక, ఆర్థిక అంశాల్లో గానీ.. నిపుణుల లభ్యతలో గానీ బెంగళూరుతో పోలిస్తే పోటీలో వెనకబడి ఉంది. అయితే, పన్ను రేట్లు, జీవన వ్యయాలు తక్కువగా ఉండటం.. తదితర అంశాలతో మిగతా నగరాల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది. -
హెల్త్‌ప్రో వేదికపై అన్ని ఆరోగ్య సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ కేర్4యు తాజాగా ‘హెల్త్‌ప్రో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన తొలి యాప్ ఇదే. ఆసుపత్రులు, వైద్యులు, రోగ పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు, బీమా కంపెనీలను రియల్ టైంలో ఒకతాటిపైకి తీసుకొస్తుంది. సమాచారం క్షణాల్లో చేరుతుంది. భారత్‌లో ఎస్తోనియా రాయబారి రిహో క్రూవ్ చేతుల మీదుగా హెల్త్‌ప్రో యాప్‌ను ఆవిష్కరించారు. కేర్4యు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కంపెనీని మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి స్థాపించారు. యాప్ ద్వారా బీమా కంపెనీ నుంచి 30 సెకన్లలో ప్రీ–అప్రూవల్ వస్తుందని కేర్4యు డైరెక్టర్ ప్రబిన్ బర్దన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. సమయం ఆదా అవడమేగాక పారదర్శకత, సమాచార గోప్యత ఉంటుందని చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ మొత్తం లావాదేవీలను పరిశీలిస్తుందని, సమాచారం అంతా యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతుందని గుర్తుచేశారు. 350 ఆసుపత్రులు, క్లినిక్స్‌తో కంపెనీ చేతులు కలిపింది. బిజినెస్ పార్టనర్‌గా బీమా సంస్థ ఫ్యూచర్ జనరాలీ వ్యవహరిస్తోంది. మరో 8 బీమా కంపెనీలతో కేర్4యు చర్చిస్తోంది. యాప్ సహకారంతో క్లెయిమ్ ప్రాసెస్ త్వరతగతిన పూర్తి అవుతుందని ఫ్యూచర్ జెనరాలీ ఎండీ కె.జి.కృష్ణమూర్తి రావు చెప్పారు. -
నటుడిపై నటి లైంగిక దాడి!
ఏడాది క్రితం హాలీవుడ్ దిగ్గజ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక అకృత్యాలపై తొలిసారి నోరు మెదిపి, ‘మీ టూ’ అనే ఒక మహోద్యమానికి ఆద్యులుగా నిలిచినవారిలో ఒకరైన ఇటాలియన్ నటి, డైరెక్టర్ ఏషియా అర్జెంటో ఇప్పుడు తనే స్వయంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఇంకో రెండు నెలల్లో 17వ పుట్టినరోజు జరుపుకోబోతాడనగా.. నటుడు, టీనేజ్ మ్యుజీషియన్ అయిన జిమ్మీ మెనెట్ను అప్పటికి 37 ఏళ్ల వయసులో ఉన్న ఏషియా అర్జెంటో 2013 మే 9న కాలిఫోర్నియాలోని ఒక హోటల్ గదిలో లైంగికంగా వేధించి, అతడిపై అత్యాచారం జరపడమే కాకుండా, అందుకు ప్రతిఫలంగా అతడికి 3,80,000 డాలర్లను (సుమారు 2 కోట్ల 64 లక్షల76 వేల 500 రూపాయలు) ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై న్యూయార్క్ మీడియాలో అకస్మాత్తుగా ఇప్పుడు వరుస కథనాలు మొదలయ్యాయి. అయితే, నటుడు జిమ్మి బానెట్‌పై తాను లైంగిక దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఏషియా అర్జెంటో ఖండించారు. బానెట్ ఆర్థిక కష్టాల్లో ఉండటంతో వాటినుంచి గట్టెక్కించేందుకే అతనికి తన భాగస్వామి ఆంటోనీ బౌర్డెయిన్ ఆర్థిక సహకారాన్ని అందజేసినట్టు ఆమె తెలిపారు. ఒంట్లో ఇనుప ధాతువు లోపం వల్ల ఏర్పడే రక్తహీనత (అనీమియా) గర్భిణులలో.. అది కూడా 20–30 ఏళ్ల వయసు గర్భిణులలో బాగా ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని వి.ఆర్.కె. ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ల వైద్యులు కలిసి జంటనగరాలలోని ప్రసూతి ఆసుపత్రులకు వచ్చే గర్భిణులపై నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. కాన్పునకు కాన్పునకు మధ్య తగినంత ఎడం లేకపోవడం, పెద్దగా చదువుకుని ఉండకపోవడం; స్త్రీ, పురుష అసమానతలు, పౌష్టికాహార లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి.. వీటన్నిటి కారణంగా గర్భిణులు రక్తహీనతకు గురవుతున్నారని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీప్రొడక్షన్, కాంట్రాసెప్షన్, ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ’లో ప్రచురితం అయిన ఈ సర్వే వివరాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ కుమార్తె అనితాబోస్ ఫ్యాఫ్.. తన తండ్రి అస్థికల్ని భారత్‌కు తెప్పించాలని ఇండియా, జపాన్ దేశాలకు పునర్విజ్ఞప్తి చేశారు. 1945 ఆగస్టు 18న తైవాన్ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం తన తండ్రి అస్థికలు 1945 సెప్టెంబరు నుండీ టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉండిపోయాయని గుర్తు చేస్తూ, స్వాతంత్య్రం వచ్చాకే తిరిగి తన జన్మభూమిలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించిన తన తండ్రి.. ఆ ఆకాంక్ష నెరవేరకుండానే చనిపోయినందున, ఆయన అస్థికలనైనా ఇండియాకు తెప్పించడం ఆయన ఆత్మకు శాంతినిస్తుందని అనితాబోస్ రెండు దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. కేరళ వరదల్లో కడలుండి నదీ తీరంలో ఉన్న ఇళ్లు మునిగిపోయి, ఇంట్లోని సర్వస్వం కోల్పోయి మలప్పురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో పాటు తలదాచుకున్న అంజు అనే 19 ఏళ్ల యువతి, ఎనిమిది నెలల క్రితం చేసుకున్న నిశ్చితార్థానికి ఏమాత్రం విఘాతం కలగకూడదన్న కృతనిశ్చయంతో.. వధువు దుస్తుల్లో ముస్తాబై, ముందనుకున్న ముహూర్తానికే ఆదివారం నాడు అక్కడికి సమీపంలోని త్రిపురాంతకం ఆలయంలో వివాహం చేసుకోవడం రెండు వైపుల వారికీ కన్నుల పండుగే అయింది! ఘనంగా చేయాలనుకున్న వివాహం అనూహ్యంగా సంభవించిన వరదల వల్ల అవాంతరాలకు గురయినప్పటికీ, అంజు చూపిన చొరవ కారణంగా అనుకున్న రోజుకే జరగడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని వరుడు షైజు (27) తల్లిదండ్రులు, బంధువులు వధువును ప్రశంసల జల్లుల్లో ముంచెత్తారు. ఇంకో నెలలో కొత్త మిస్ అమెరికా రానున్న తరుణంలో.. ‘మిస్ అమెరికా ఆర్గనైజేషన్’ చేత గత 11 నెలలుగా తను వేధింపులకు గురవుతున్నట్లు మిస్ అమెరికా 2017 కారా మండ్.. 3000 పదాలతో కూడిన ఒక దీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెజీనా హాపర్ తనను నిరంతరం విమర్శిస్తూ ఉండేవారని, సోషల్ మీడియాలో తనను పోస్టింగ్‌లు పెట్టుకోనిచ్చేవారు కాదని, ఈవెంట్లలో పాల్గొనడంపైన కూడా అప్రకటిత నిషేధం విధించారని.. అసలు ఈ ఏడాదంతా టైటిల్ గెలిచిన సంతోషమే లేకపోగా.. ఒక బానిసలా, అన్నిటినీ సహిస్తూ తను జీవించానని’’ కారా మండ్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పురిటినొప్పులు పడుతున్న మారియా డెల్ కార్మెన్ వెనెగాస్ (32) అనే కాలిఫోర్నియా మహిళను ఆమె భర్త జోయల్ అరోనా లారా (34) ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అడ్డగించి, అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆ మహిళే అతి కష్టం మీద కారును నడిపించుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. 12 ఏళ్ల క్రితం మెక్సికో నుంచి యు.ఎస్.కి వలస వచ్చిన వెనెగాస్ దంపతులకు, వారి ఐదుగురు పిల్లలకు యు.ఎస్. పౌరసత్వం ఉన్నప్పటికీ అధికారులు అడిగినప్పుడు వెనెగాస్ గుర్తింపు పత్రాలు తప్ప, ఆమె భర్తవి సమయానికి కారులో లేకపోవడంతో ఐ.సి.ఇ. (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు.. పక్కనే నిండు గర్భిణి అయిన భార్య ఉందని కూడా లేకుండా అతడి చేతికి బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు. సెప్టెంబర్ 7న ఇజ్రాయెల్‌లో జరగబోతున్న ‘మీటియర్స్ ఫెస్టివల్’లో కచేరీ ఇవ్వాలని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ‘లానా డెల్ రే’ గా ప్రసిద్ధురాలైన ప్రముఖ అమెరికన్ గాయని ఎలిజబెత్ ఊల్రిడ్జ్ గ్రాంట్.. తనని తను సమర్థించుకున్నారు. ‘వెలిదేశం’ అయిన ఇజ్రాయెల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు లానా డెల్ రే వెళ్లడం సరికాదని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా 2005 నుంచీ ప్రచారోద్యమం చేపట్టిన బి.డి.ఎస్. (బాయ్‌కాట్, డైవెస్ట్‌మెంట్, శాంక్షన్ – బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షలు) అనే పాలస్తీనా సంస్థ అభ్యంతరం చెప్పడంతో లానా ఈ విధమైన ప్రకటన చేస్తూ, సంగీతానికి హద్దులు, సరిహద్దులు ఉండవని అన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి పాకిస్తాన్ సంతతి ముస్లిం మహిళ మెహ్రీన్ ఫరూకీ.. ప్రమాణ స్వీకారం చేసి వారమైనా కాకముందే, ముస్లింల వ్యతిరేకి అయిన క్రాస్‌బెంచ్ (విపక్ష / స్వతంత్ర) సెనెటర్ ఫ్రేజర్ యానింగ్కి పంచ్ ఇచ్చారు. ఎంత కఠినమైన నిర్ణయమైనా సరే తీసుకుని, ఆస్ట్రేలియాలోకి ముస్లింల వలసలను నివారించాల్సిన అవసరం ఉందని యానింగ్ అన్న మాటకు స్పందిస్తూ.. ‘‘ఏవేళనైనా సరే, ఆయన మా ఇంటి తలుపు తట్టి.. నాతో కొన్ని నిమిషాలు కూర్చోగలిగితే.. బహుళ జాతుల సహజీవనంలోని సౌందర్యం, సుసంపన్నతల గురించి రెండు మూడు విషయాలను ఆయనకు నేర్పి పంపుతాను’’ అని మెహ్రీన్ ఫరూకీ వ్యాఖ్యానించారు. -
‘ఫెయిర్’ జపాన్
డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే పరిస్థితి జపాన్‌ది! గెలిచినా ముందుకెళ్లలేని స్థితి పోలాండ్‌ది! ఈ లెక్కల మధ్య... ఆసియా జట్టు అనూహ్యంగా ఓడింది. అయినా తదుపరి రౌండ్ చేరింది. ఊహించని గణాంకాలు తెరపైకి వచ్చి జపాన్ను ఒడ్డున పడేశాయి. వొల్గొగ్రాడ్: ప్రస్తుత ప్రపంచ కప్‌లో నాకౌట్ చేరిన ఏకైక ఆసియా జట్టుగా జపాన్ నిలిచింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పోలాండ్ చేతితో 0–1తో ఓడినా ఆ జట్టుకు కొంత అదృష్టం తోడై ముందుకెళ్లింది. పోలాండ్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెడ్నారెక్ (59వనిమిషం) గోల్ చేశాడు. ఆధిపత్యం అటు ఇటు... పెద్దగా మెరుపుల్లేకుండానే సాగిన ఆటలో మొదటి భాగంలో పోలాండ్, రెండో భాగంలో జపాన్ ఆధి పత్యం కనబర్చాయి. యొషినొరి మ్యుటో దాడితో ప్రారంభంలో ఆసియా జట్టుకే గోల్ అవకాశం దక్కింది. కీపర్ లుకాజ్ ఫాబియాన్స్కీ అడ్డుకోవడంతో స్కోరు కాలేదు. అయితే, ప్రత్యర్థి డిఫెన్స్ బలంగా ఉండటంతో పైచేయి చిక్కలేదు. ఓ దశలో పోలాండ్‌కు కమిల్ గ్రోస్కీ హెడర్ షాట్‌తో గోల్ తెచ్చినంత పని చేశాడు. కానీ, కీపర్ ఎజ్జి కవాషిమా చురుగ్గా స్పందించి నిలువరించాడు. జపాన్ మొదటి భాగంలోనే ఆరుగురు ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లుగా దింపి నా ఫలితం పొందలేకపోయింది. ఇటు పోలాండ్ కెప్టెన్ లెవాన్‌డొస్కీ ప్రత్యర్థి శిబిరంపై కనీసం షాట్ కూడా కొట్టలేకపోవడంతో స్కోరేమీ లేకుండానే తొలి 45 నిమిషాల సమయం ముగిసింది. ఏకైక గోల్... రెండో భాగమూ పోటాపోటీగానే ప్రారంభమైంది. అయితే, రఫల్ కుర్జావా కొట్టిన ఫ్రీ కిక్‌ను అద్భుత రీతిలో అందుకున్న బెడ్నారెక్ గోల్ పోస్ట్‌లోకి పంపడంతో ఆధిక్యం దక్కింది. సరిగ్గా ఈ సమయానికి అటువైపు మ్యాచ్‌లో సెనగల్‌పై కొలంబియా గోల్ చేయకపోవడంతో గ్రూప్‌లో జపాన్ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఒక్కసారిగా దాడులు పెంచింది. అయితే, చివర్లో లెక్క అర్థం చేసుకుని ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సమయాన్ని గడిపేసి ముగించింది. మ్యాచ్ మొదటి భాగంలో బంతి 56 శాతం పోలాండ్ ఆధీనంలోనే ఉంది. మొత్తం మీద చూస్తే జపానే (54 శాతం) బంతిని ఎక్కువ నియంత్రణలో ఉంచుకుంది. ఎల్లో కార్డులే కారణం వరల్డ్ కప్ చరిత్రలో ఇదో అరుదైన ఘటన. తొలి సారి ఒక జట్టు ‘ఫెయిర్ ప్లే’ ద్వారా నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘హెచ్’లో గురువారం అన్ని మ్యాచ్‌లు ముగిశాక కొలంబియా 6 పాయింట్లతో అగ్రస్థానంతో ముందంజ వేసింది. జపాన్, సెనెగల్ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఇరు జట్లు ఒక మ్యాచ్ గెలిచి, ఒకటి ఓడి, మరోటి డ్రా చేసుకున్నాయి. చేసిన గోల్స్, ఇచ్చిన గోల్స్ కూడా సమానంగా (4) ఉన్నా యి. దాంతో ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం మైదానంలో ఆటతీరును బట్టి ఫెయిర్ ప్లే ప్రకారం ఇరు జట్లలో ఒకరిని ఎంపిక చేశారు. గ్రూప్ దశలో జపాన్ 4 ఎల్లో కార్డులకు గురి కాగా (–4 పాయింట్లు), సెనెగల్ ఆటగాళ్లు 6 ఎల్లో కార్డులు (–6 పాయింట్లు) అందుకున్నారు. ఫలితంగా జపాన్‌దే పైచేయి అయింది. అయితే పేరుకు ‘ఫెయిర్ ప్లే’ అయినా పోలాండ్‌తో మ్యాచ్‌లో జపాన్ క్రీడా స్ఫూర్తిపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. స్కోరులో వెనుకబడిన తర్వాత కూడా ఆ జట్టు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శించింది. మ్యాచ్ తర్వాత ఎల్లో కార్డుల లెక్క ముందుకు వస్తుందని గుర్తించిన జపాన్ చివరి పది నిమిషాల్లో అతి జాగ్రత్తగా, అసలు ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా ఆడింది. అటు గోల్స్ సంఖ్య పెరిగినా ఫలితం లేదని భావించి పోలాండ్ కూడా దాడులు చేయకపోవడంతో ఆఖర్లో ఆట ట్రైనింగ్ సెషన్‌లా సాగింది. వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌లో నేడు విశ్రాంతి దినం -
ఇక ఇండో పసిఫిక్ కమాండ్..!
అసియా, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అమెరికా సైనిక స్థావరం పేరును ‘అమెరికా పసిఫిక్ కమాండ్’ నుంచి ‘అమెరికా భారత–పసిఫిక్ కమాండ్’గా మార్పు చేశారు. ఈ మేరకు అమెరికా సైన్యం బుధవారం పసిఫిక్ కమాండ్ పేరును మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ద్వారా వ్యూహాత్మక ప్రణాళికల్లో భారత్‌ను కీలక భాగస్వామి చేసేందుకు అమెరికా సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోందని అంచనా వేస్తున్నారు. సైనికపరంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న భారత్ పాత్రకు గుర్తింపుగా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ మార్పు వల్ల వెంటనే అదనపు బలగాలు లేదా యుద్ధనౌకలను ఈ ప్రాంతానికి తరలించే అవకాశం లేదు. తమ అధికారిక పత్రాల్లో ఆసియా–పసిఫిక్ అనే పదానికి బదులు ఇండో–పసిఫిక్ అనే పదాన్ని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. పసిఫిక్ కమాండ్ అంటే ? అమెరికాకు చెందిన అతి పాత, పెద్ద సైనిక స్థావరం. ఫసిఫిక్ మహా సముద్రంలోని హవాయి రాష్ట్రంలోని నావికా కేంద్రం పెరల్ హార్బర్లో ప్రధానకేంద్రముంది. ఈ కమాండ్ పరిధి 10 కోట్ల చదరపు మైళ్ల కంటే ఎక్కువ భూభాగం, 52 శాతం భూ ఉపరితలం వ్యాపించి ఉంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు,ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో 3,75,000 మంది సైనికులు, ఇతర సిబ్బంది భారత్‌తో సహా వివిధ దేశాలపై పర్యవేక్షణ సాగిస్తుంటారు. పసిఫిక్–హిందూ మహాసముద్రాల మధ్యనున్న 36 దేశాలు దీని పరిధిలోకి వస్తాయి. యూఎస్ఆర్మీ పసిఫిక్, యూఎస్ పసిఫిక్ ఫ్లీట్, యూఎస్ పసిఫిక్ ఎయిర్పోర్సెస్, యూఎస్ మెరైన్ ఫోర్సెస్ పసిఫిక్, యూఎస్ ఫోర్సెస్ జపాన్, యూఎస్ ఫోర్సెస్ కొరియా, స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఏరియా, స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పసిఫిక్ ఈ ›ప్రాంతం నుంచే పనిచేస్తాయి. యూఎస్ పసిఫిక్ కమాండ్ జాయింట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్, ద సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘చైనా మమ్మల్నే లేపేద్దామనుకుంటే ఊరుకోం..’
న్యూయార్క్ : ఆసియా దేశాల నుంచి తమనే లేకుండా చేయాలనుకుంటే సహించేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఆసియా దేశాలపై చైనా పెత్తనాన్ని తాము అంగీకరించబోమని పేర్కొంది. తన బలాన్ని, ఉద్దేశాలను బలవంతంగా ఆసియా దేశాలపై చైనా ప్రదర్శించడాన్ని తాము వ్యతిరేకిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలన వర్గంలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ట్రంప్ పాలన వర్గం చైనాతో ఉత్పాదక సంబంధాలను కోరుకుంటుందని, వివిధ సమస్యల పరిష్కారంపై, నిర్వహణలపై తాము కలిసి పనిచేయాలనుకుంటున్నామని ట్రంప్ సీనియర్ అధికారి సుసాన్ థార్న్టన్ తెలిపారు. ఆసియా నుంచి తమను పూర్తిగా పక్కన పెట్టాలని చైనా భావిస్తే ఆ విషయాన్ని తాము అంత తేలికగా పక్కన పెట్టబోమని, సీరియస్‌గానే తీసుకుంటామని చెప్పారు. తమ దేశాన్ని పక్కన పెట్టించే ఉద్దేశంతో ఆసియాలోని దేశాలను చైనా ఒత్తిడి చేయాలని భావించినా తాము అంగీకరించబోమని, ఆ విషయాన్ని అస్సలు సహించబోమని అన్నారు. మరింత ఎత్తుకు ఎదగడానికి అంతర్జాతీయ సమాజం అంగీకరించినా నిబంధనలు, విలువలను చైనా మర్చిపోకూడదని, వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆ దేశం ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఆసియాన్ సదస్సులో రామాయణ కథలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహాకావ్యం రామాయణానికి ఒక్క భారత్‌తోనే కాదు ఆసియాన్ దేశాలతోనూ విడదీయరాని బంధముంది. చరిత్ర, నాగరికతల పరంగా భారత్‌ను ఆసియాన్ దేశాలతో మమేకం చేసింది ఈ ఇతిహాసమే. ఈ విశేషాలు ప్రస్ఫుటించేలా 25–26న ఢిల్లీలో జరిగే భారత్–ఆసియాన్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన కళాకారులు రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఆసియాన్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ రామాయణం దోహదపడింది. -
ఆసియాలో ముకేశ్ ఫ్యామిలీయే రిచ్చ్చ్!
న్యూఢిల్లీ: సంపదలో ముకేశ్ అంబానీ ఖ్యాతి దేశం దాటి ఖండాంతరాల్లో మారుమోగుతోంది. ఇప్పటిదాకా ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ఉంటూ వస్తున్న ముకేశ్ అంబానీ... ఇపుడు ఆసియాలోనూ ఆ ఘనత సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన తాజా జాబితాలో ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ముకేశ్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. దీంతో శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. నిజానికి ఇక్కడ లీ కుటుంబ సంపద కూడా ఏమీ తగ్గలేదు. 11.2 బిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 40.8 బిలియన్ డాలర్లకు చేరింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేరు ధర గతేడాదితో పోలిస్తే 75%మేర లాభపడింది. కానీ వీరి సంపద కన్నా ముకేశ్ అంబానీ కుటుంబ సంపద జెట్ స్పీడ్‌లో పెరిగిపోయింది. ఇక హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు. ఆసియాలోని అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ కుటుంబం ఇది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సన్ హంగ్ కై ప్రాపర్టీస్ వీరిదే. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ‘ఆసియాలోని టాప్–50 అత్యంత ధనిక కుటుంబాల జాబితా–2017’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ►టాప్–10లో భారత్ నుంచి ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రమే స్థానం పొందింది. అయితేనేం!! జాబితాలో ఎక్కువ కుటుంబాలు ఇండియా నుంచే ఉన్నాయి. ►జాబితాలో భారత్ నుంచి మొత్తంగా 18 కుటుంబాలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో ప్రేమ్‌జీ కుటుంబం (19.2 బిలియన్ డాలర్లు–11వ స్థానం), హిందుజా కుటుంబం (18.8 బిలియన్ డాలర్లు–12వ స్థానం), మిట్టల్ కుటుంబం (17.2 బిలియన్ డాలర్లు–14వ స్థానం), మిస్త్రీ కుటుంబం (16.1 బిలియన్ డాలర్లు–16వ స్థానం), బిర్లా కుటుంబం (14.1 బిలియన్ డాలర్లు–19వ స్థానం) తదితరులున్నారు. ►జాబితాలోని 50 కుటుంబాల మొత్తం సంపద విలువ 699 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇందులో దాదాపు 200 బిలియన్ డాలర్లమేర పెరుగుదల నమోదయ్యింది. ►జాబితాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక కుటుంబం సంపద విలువ కనీసం 5 బిలియన్ డాలర్లు ఉండాలి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.32,500 కోట్ల పైమాటే!!. -
ట్రంప్ వస్తున్నాడు.. వస్తున్నాడోచ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ఆసియా పర్యటన ప్రారంభమైంది. 11 రోజుల ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసియాలోని కీలక దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఒక అమెరికా అధ్యక్షుడు చేపట్టిన సుదీర్ఘమైన ఆసియా పర్యటన ఇదే కావడం గమనార్హం. ఉత్తర కొరియా రెచ్చగొట్టే రీతిలో అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు చేస్తూ.. తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ పర్యటన లక్ష్యం ఇదే..!? పట్టపగ్గాలు లేని రీతిలో ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలతో చెలరేగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి దీటైన జవాబు ఇచ్చేందుకు ట్రంప్ ఈ పర్యటన చేపట్టినట్టు భావిస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియాతో ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడి.. ఉ.కొరియాపై చైనా కఠినంగా వ్యవహరించేలా ఒత్తిడి తేవాలని ట్రంప్ భావిస్తున్నారని, ఇదే పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. ఇప్పటికే అణ్వాయుధ పరీక్షల విషయంలో ఉత్తరకొరియాతో ట్రంప్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. -
ఆసియా టాప్–50 వర్సిటీల్లో మూడు భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్ (క్యూఎస్) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది.టాప్–10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఐఐటీ–బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ–ఢిల్లీ 41వ, ఐఐటీ–మద్రాస్ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. టాప్ టెన్‌లో రెండు సింగపూర్ వర్సిటీలు, నాలుగు హాంకాంగ్ (హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–3, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–5, సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–8, ద చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–10) వర్సిటీలు, ఒక దక్షిణ కొరియా వర్సిటీ (కొరియా అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–4), మూడు చైనా వర్సిటీలు (సింఘువా వర్సిటీ–6, ఫుడాన్ యూనివర్సిటీ–7, పెకింగ్ వర్సిటీ–9) చోటు దక్కించుకున్నాయి. టాప్–100 జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి. ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్ ఫలితాలు, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాకింగ్ నిర్ణయించింది. -
తంగడంచెలో మెగా సీడ్ పార్క్
- అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారం - ఒకటి, రెండు నెలల్లో సీఎం చేతులు మీదుగా శుంకుస్థాపనకు చర్యలు - వ్యవసాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ కర్నూలు(అగ్రికల్చర్): జూపాడుబంగ్లా మండలం తంగడంచ ఫామ్‌లో ఆసియాలోనే అతిపెద్ద మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి జవహార్‌లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోమవారం తంగడంచెకు వెల్లి అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులతో కలసి భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడ్ పార్క్‌ను అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారంతో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒకటి, రెండు నెలల్లో ప్రాథమిక పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుమీదుగా శంకు స్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం తంగడంచెలో 805 ఎకరాల భూములు ఉన్నాయని, సీడ్ పార్క్‌కు ఎంత అవసరమైతే అంత ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విత్తనోత్పత్తి, పరిశోధన, శిక్షణ, సీడ్ సర్టిపికేషన్ కార్పోరేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాఖ తదితర వన్ని ఇందులో ఉంటాయన్నారు. ఆయన వెంట నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, డీడీఏ పీపీ మల్లికార్జునరావు, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. -
అవినీతిలో భారత్ టాప్
ఆసియా–పసిఫిక్ దేశాల్లో నంబర్‌వన్ ... ♦ ట్రాన్స పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో వెల్లడి ♦ లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పిన 69 శాతం భారతీయులు ♦ భారత్‌లో అగ్రస్థానంలో పోలీసుల అవినీతి బెర్లిన్/న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి రాజ్యమేలుతుందని తాజా సర్వే ఒకటి తేల్చిచెప్పింది. అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో మన దేశం మొదటిస్థానంలో ఉందని ట్రాన్స పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగిందని వెల్లడించింది. ఇక ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించాల్సి వస్తోందని సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారు. భారత్‌లో పోలీసులు, ప్రభుత్వాధికారులతో పాటు మతపెద్దల్లోనూ అవినీతి ఎక్కువేనని అధిక శాతం మంది తేల్చిచెప్పారు. పోలీసులు లంచం తీసుకుంటున్నారని సర్వేలో పాల్గొన్న 85 శాతం భారతీయులు అభిప్రాయపడగా... తర్వాతి స్థానాల్లో ప్రభుత్వాధికారులు(84 శాతం), బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ (79 శాతం), స్థానిక కౌన్సిలర్లు (78), ఎంపీలు (76), పన్ను అధికారులు (74), మత పెద్దలు (71 శాతం) నిలిచారు. సర్వే మేరకు భారత్‌లోని దాదాపు 69 శాతం మంది లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పగా... 65శాతంతో వియత్నాం తర్వాతి స్థానంలో నిలిచింది. చైనాలో 26శాతం, పాక్ లో 40శాతం మంది లంచం చెల్లిస్తున్నామన్నారు. జపాన్ 0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలవగా, దక్షిణ కొరియా 3 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది. ఆసియాపసిఫిక్ లో 16 దేశాల్లో 22 వేల మందిని ప్రశ్నించామని... ఆ లెక్కన గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం చెల్లించినవారు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని పేర్కొంది. పోలీసు లు, జడ్జీలు లేదా కోర్టు సిబ్బంది, టీచర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి లంచం లేదా బహుమతి లేదా ఉపకారం చేస్తున్నారో అన్న అంశాలపై సర్వే చేశారు. నిజాయితీ మతనాయకులు 14 శాతమే ఈ సర్వేలో భారత్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. భారత్‌లో మతనాయకులు అవినీతికి అతీతులు కారని తేల్చింది. మత నాయకుల్లో కొందరు లేదా ఎక్కువమంది లేదా అందరూ అవినీతిపరులంటూ 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. మత నాయకుల్లో కొందరే అవినీతిపరులని 37 శాతం, ఎక్కువ మంది అని 23 శాతం, అందరూ అవినీతిపరులేనని 11 శాతం అభిప్రాయపడ్డారు. మతనాయకులు ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని 14 శాతం మంది చెప్పగా... 15 శాతం మంది ఏ సమాధానం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ మొత్తంగా చూస్తే మతనాయకులు అత్యధిక అవినీతి పరులంటూ ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది అభిప్రాయపడడం గమనార్హం. పెరుగుదలలో చైనా ఫస్ట్ అవినీతి పెరుగుదలలో చైనా 73 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగి ఏడో స్థానంలో ఉంది. పోలీసు విభాగం లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆసియా పసిఫిక్ ప్రజలు ఆరోపించారు. తాము లంచం చెల్లించాల్సి వస్తోందని 38 శాతం పేదలు పేర్కొనగా... ఇతర ఆదాయ వర్గాలతో పోల్చితే వీరిదే అధిక శాతం కావడం గమనార్హం. పోలీసులు టాప్ భారత్‌లో లంచం తీసుకుంటున్న వారి జాబితాలో మాత్రం పోలీసులదే తొలిస్థానం. పోలీసులు లంచం డిమాండ్చేస్తారని 85 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారని 84 శాతం మంది చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ 79 శాతం, స్థానిక కౌన్సిలర్లు 78 శాతం, ఎంపీలు 76 శాతంలో నిలిచారు. ఇక పన్ను అధికారులు 74 శాతంతో ఆరో స్థానంలో ఉండగా మతనాయకులు 71 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు. జడ్జీలు, మేజిస్ట్రేట్లు అవినీతిపరులని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. లంచం తీసుకోని వారు తక్కువే.. ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడరని 6 శాతం మంది చెప్పారు. పోలీసులు లంచం తీసుకోరని 7 శాతం, స్థానిక కౌన్సిలర్లు అవినీతికి పాల్పడరని 9 శాతం భారతీయులు చెప్పారు. ఇక ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతిచేయరని 26 శాతం, జడ్జీలు, మేజిస్ట్రేట్లు అవినీతిరహితులని 19 శాతం భారతీయులు వెల్లడించారు. ఎంపీల విషయానికి కొస్తే అది 12 శాతమే. కఠిన చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు అవినీతిపై మాటలు ఆపి, చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ సేవలు పొందేందుకు బలవంతంగా ప్రజలు లంచం ఇచ్చేలా చేస్తున్నారని, పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని సంస్థ చైర్మన్ జోస్ ఉగాజ్ అభిప్రాయపడ్డారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి సమాచారం వెల్లడించేవారికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. చట్టపరంగా సరైన నిరోధక వ్యవస్థ లేకపోతే అవినీతి అవిచ్ఛిన్నంగా సాగుతుందని, అది చిన్న నేరం కాదని, మన బతుకుదెరువుకు నష్టం కల్గించడంతో పాటు, విద్యను అడ్డుకోవడం, వైద్య సేవల్ని ఆటంకపర్చడంతో పాటు చివరకు మనల్ని చంపేస్తుందని ఆయన పేర్కొన్నారు. -
తొలి స్థానంలో నిలిచిన నీతా అంబానీ
న్యూయార్క్ : ఆసియా మోస్ట్ పవర్ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాతో రిలయన్స్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ మొదటిస్థానంలో నిలిచారు. 50 మంది మహిళా వ్యాపార వేత్తలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 2016 ఆసియా మోస్ట్ పవర్ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. వీరిద్దరితో పాటు మరో ఆరుగురు భారతీయ మహిళలు ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. మ్యూ సిగ్మా సీఈవో అంబిగా ధీరజ్(14), వెల్స్ పన్ ఇండియా సీఈవో దీపాళి గోయింకా(16), లుపిన్ సీఈవో వినితా గుప్తా(18), ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందాకొచ్చర్(22), వీఎల్ సీసీ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు వందనా లుత్రా(26), బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ కిరణ్ ముజుందర్ షా(28)లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా లింగవివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళలు వ్యాపార రంగంలో రాణించవచ్చనే సందేశాన్ని వీరు అందిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. -
57 ఏళ్ళ వయసులోనూ అదే ఉత్సాహం..
ఆమె.. తన అభిరుచిని డబ్బు సంపాదనకు మార్గంగా మలచుకుంది. ఉపాధిగా బస్ డ్రైవర్ జీవితాన్ని ప్రారంభించి 23 ఏళ్ళ క్రితమే మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చింది. ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా పేరు తెచ్చుకొని 57 ఏళ్ళ వయసులోనూ అదే ఉత్సాహంతో విధులు నిర్వహిస్తోంది. కన్యాకుమారిలో పుట్టిన వసంతకుమారి వివాహం అనంతరం చెన్నైలో బస్ డ్రైవర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో ఆమె తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. 19 ఏళ్ళ వయసులోనే వసంతకు నలుగురు పిల్లలున్న ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. భర్త భవన నిర్మాణ కూలిగా పనిచేసేవాడు. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే మహాలిర్ మండ్రం అనే ఓ మహిళా సంఘంలో వసంత.. సెక్రెటరీగా పనిచేసేది. అయితే చాలీ చాలని జీతాలతో జీవనోపాధి కష్టంగా మారడంతో బతకు బండిని ఈడ్చేందుకు మార్గాలను అన్వేషించింది. సంపాదనే ధ్యేయంగా బస్ డ్రైవర్ గా స్థిరపడేందుకు నిర్ణయించుకొంది. అదే ఇష్టంగా మలచుకొని 23 ఏళ్ళ క్రితం డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన వసంత.. ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా పేరు తెచ్చుకోవడమే కాక, ప్రస్తుతం 57 ఏళ్ళ రిటైర్మెంట్ వయసులోనూ అదే ఉత్సహంతో చెన్నైలో విధులు నిర్వహిస్తోంది. నేను ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు అధికారులు అది ఎంతో కష్టమైన ఉద్యోగం అని, పురుషులే కష్టాలు ఎదుర్కొంటున్న ఫీల్డ్ లో నెగ్గుకు రావడం కష్టమన్నారని వసంత చెప్తోంది. ఎవరెన్ని చెప్పినా.. అనుకున్నది సాధించిన వసంత హెవీ వెహికిల్ లైసెన్స్ సంపాదించి డ్రైవింగ్ ఫీల్డ్ లోకి ఎంటరయ్యింది. మొదట్లో నైపుణ్య పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో అధికారులు తిరస్కరించారు. అయినా పట్టు వదలకుండా... వారిని ఎన్నోసార్లు అభ్యర్థించడంతో మరోసారి టెస్ట్ కు పిలిచారు. అప్పడు తన సత్తా చూపించిన వసంత.. డ్రైవర్ గా ఎంపికయ్యింది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో 1993 లో ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన ఆమె... తిరిగి వెనక్కు చూడలేదు. ఎటువంటి ప్రత్యేక సదుపాయాలను పొందలేదు. పురుషులతో సమానంగా విధులు నిర్వహించింది. ఇప్పటికీ ఆమె నాగర్ కోయిల్ నుంచి తిరువనంతపురం రెగ్యులర్ రూట్ లో రాత్రి పదిగంటల వరకూ విధులు కొనసాగిస్తోంది. ఉద్యోగం ప్రారంభించిన కొత్తలో ఉదయం 6 గంటలకు డ్యూటీకి వస్తే మధ్యాహ్నం 2 గంటల వరకూ షిఫ్ట్ లో ఉండాల్సి వచ్చేదని, ఆ సమయంలో పిల్లలను ఇరుగు పొరుగులకు అప్పగించేదాన్నని అంటున్న వసంత.. ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉండేదని చెప్తోంది. తన తర్వాత ఎంతోమంది మహిళలు డ్రైవర్ గా ఉద్యోగంలో చేరినా.. కొద్ది కాలంలోనే డెస్క్ ఉద్యోగాలకు మారిపోయారని చెప్తోంది. మహిళా డ్రైవర్ గా ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నావంటూ ఎంతోమంది తనను ప్రశ్నిస్తారని, ఏ క్షేత్రంలోనైనా కష్టం ఉంటుందని, అది ఎదుర్కోవడమే ముఖ్యమని ఆమె చెప్తుంది. ఇటీవల రెయిన్ డ్రాప్స్ ఉమెన్ ఎచీవర్ అవార్డును అందుకున్న వసంతకుమారి ఏప్రిల్ 2017 లో రిటైర్ కానుంది. పదవీ విరమణ అనంతరం డ్రైవింగ్ పాఠశాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ఆమె... కుదరని పక్షంలో కనీసం అటువంటి కళాశాలల్లో శిక్షకురాలిగానైనా ఉద్యోగం కొనసాగిస్తానని, తన జీవితాన్ని నిలబెట్టిన డ్రైవింగ్ ను శరీరం సహకరించినంత వరకూ వదిలేది లేదని చెప్తోంది. -
నష్టాలతో బోణీ..
♦ ఆసియా, యూరప్ మార్కెట్ల క్షీణత ప్రభావం ♦ సెన్సెక్స్‌కు 72 పాయింట్ల నష్టం కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఆసియా, యూరోప్ మార్కెట్ల పతన ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు క్షీణించి 25,270 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 7,713 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే చివరి గంటలో బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు తగ్గాయి. ఐదు వారాల్లో తొలిసారిగా మార్కెట్ నష్టపోయింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో జపాన్‌లో వ్యాపార విశ్వాసం క్షీణించడంతో జపాన్ స్టాక్ సూచీ నికాయ్ 3.5 శాతం పతనం కావడం, ముడి చమురు ధరల క్షీణత మళ్లీ ప్రారంభమవడం, అమెరికా ఉద్యోగ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు వేచి చూడడం ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి. -
భారీ ఈవెంట్ల భాగ్యం
చారిత్రక నగరం చరిత్రను తిరగరాస్తోంది. నవనాగరిక దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. ఒకటి వెంట ఒకటిగా వెల్లువెత్తుతున్న విభిన్న రకాల ఈవెంట్లు సిటీని వినూత్నంగా పరిచయం చేస్తున్నాయి. భవిష్యత్‌లో మరెన్నో ఈవెంట్లు నగర వేదికపై నాట్యం చేయనున్నాయి. ఏవియేషన్ షో లాంటి అధికారిక ఈవెంట్ల పరంపర కొనసాగుతుండగానే మరోవైపు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలూ సిటీలో వెల్లువెత్తుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వేదికగా దేశంలోనే అతిపెద్ద ఆధునిక సంగీత, నృత్యోత్సవంగా పేరొందిన ‘సన్‌బర్న్’ ఇటీవటే సిటీజనులకు పరిచయమై సూపర్ హిట్టయింది. ఆ పేరు పలికితే చాలు సిటీలోని పార్టీ పీపుల్ ఆలోచనలు, ప్రణాళికలు గోవా దిశగా పరుగు తీసే పరిస్థితిలో మార్పు తెచ్చిందీ ఈవెంట్. స్థానిక కాన్సెప్ట్‌తో రూపొందిన స్కై ఫెస్ట్ కూడా టాక్ ఆఫ్ ది సిటీ అయింది. వైట్‌తో గ్రేట్.. ట్రెండ్‌కు మరింత ఆజ్యం పోస్తూ వచ్చేసిందే వైట్ సెన్సేషన్. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ ఈవెంట్‌ను సొంతం చేసుకోవడానికి పలు నగరాలు పోటీపడినా ఆసియాలోనే తొలిసారి సిటీకి దక్కడం.. సిటీ ఈవెంట్స్ హబ్ కానుందనే ఆశలకు రెక్కలు తొడిగింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌కు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్ దిగ్విజయంగా పూర్తవడంతో అంతర్జాతీయంగా పేరొందిన ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు సిటీ వైపు దృష్టి సారించాయి. ఈ తరహా భారీ ఈవెంట్లు నగర పర్యాటక రంగానికి ఊపునిస్తాయనే నమ్మకం ఉంది. ఈ ఈవెంట్‌కు హాజరైన వారిలో 40 శాతం మంది ఇతర ప్రాంతాల వారేనని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ఈవెంట్లకు సిటీ వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాంపస్ పార్టీ కమింగ్ సూన్.. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, సైన్స్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్, స్టార్టప్స్.. వీటన్నింటినీ కలబోసిన క్యాంపస్ పార్టీ సెప్టెంబర్‌లో సిటీకి రానుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. ఉదయం టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లు, సాయంత్రం పార్టీలు నిర్వహిస్తారు. దాదాపు 10 వేల మంది యువత టెంట్లలోనే బస చేస్తారు. అలాగే ‘బ్రాడ్ వే మ్యూజికల్స్’ పేరుతో మరో పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ డిసెంబర్లో సిటీ చేరనుంది. ఇది దాదాపు 20 రోజులు జరుగుతుంది. ఇలా సెన్సేషన్ విజయం చూసిన తర్వాత టుమారో ల్యాండ్, ఆల్ట్రా.. లాంటి మరెన్నో ఇంటర్నేషనల్ ఫెస్టివళ్లు మన దేశానికి రావాలని చూస్తున్నాయి. ‘సన్‌బర్న్’ ఈ ఏడాది కూడా సిటీలో జరగనుంది. ఈసారి మార్టిన్ గార్రిక్స్, అవిసి, హార్డ్‌వెల్.. లాంటి పాపులర్ డీజేలు సిటీకి రానున్నారు. ఫెస్టివల్ విలేజ్ అవసరం.. ప్రపంచస్థాయి వినోద సంబరాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్న వేడుకలను మేం పరిచయం చేస్తున్నాం. సన్‌బర్న్, వైట్ సెన్సేషన్.. లాంటి ఈవెంట్లు తీసుకురాగలిగామంటే ఇక్కడి పార్టీ ప్రియుల అభిరుచి, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే కారణం. ప్రభుత్వ సహకారం లేనిదే భారీ ఈవెంట్ల నిర్వహణ అసాధ్యం. వైట్ సెన్సేషన్ తర్వాత చాలా మంది ఇక్కడ ఈవెంట్లు చేయాలని చూస్తున్నారు. అయితే ఆడిటోరియం అద్దెకు తీసుకోవడం వల్ల ఈవెంట్లకు చాలా ఖర్చవుతోంది. ఈవెంట్స్ విలేజ్ చాలా అవసరం. అప్పుడు ఏడాదంతా ఈవెంట్స్ నిర్వహించొచ్చు. - విజయ్ అమృత్‌రాజ్, ఓలా ఈవెంట్స్ -
ఆసియా టెన్నిస్ టూర్ ఆవిష్కరణ
దోహా: ఆసియా ఖండంలోని వర్ధమాన టెన్నిస్ ఆట గాళ్ల అభివృద్ధి కోసం ఓ కొత్త వేదిక ఏర్పాటయ్యింది. కేవలం ఆసియాలోని దేశాలకు చెందిన యువ ఆటగాళ్లు మాత్రమే పోటీ పడేందుకు ఆసియన్ టెన్నిస్ టూర్ (ఏటీటీ)ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన ఆసియా టెన్నిస్ సమాఖ్య (ఏటీఎఫ్) బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో ఏటీటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 18 నుంచి ఏటీటీ తొలి పోటీలు ఢిల్లీలో జరుగుతాయి. ఈ టోర్నీలో ఆడి గెలిచినందుకు ఆటగాళ్లకు ఎలాంటి ర్యాంకింగ్స్ పాయింట్లు లభించకున్నా డబ్బులు మాత్రం అందుతాయి. ఏటీటీలో టాప్-5 ఆటగాళ్లుగా నిలిచినవారు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)తో పర్యటించే అవకాశం లభిస్తుంది. రెండు విభాగాలుగా ఈ ఈవెంట్ జరుగుతుంది. -
ఆసియాలోనే పెద్ద జాతరకు రైళ్లు లేవా?
కోటి మందికి పైగా భక్తుల రాక ప్రత్యేక రైళ్ల కోసం ఎంపీల వినతులు ఉలుకూ పలుకూ లేని రైల్వేశాఖ సాక్షి, హన్మకొండ : ఆసియాలోనే పెద్దదైన.. కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం గిరిజన జాతరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహారిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఒక్క ప్రత్యేక రైలును ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. పెరగనున్న రద్దీ 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తులు రైళ్ల ద్వారా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు. ముఖ్యంగా కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర-దక్షిణ-పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా వచ్చే ఉండే లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ఖమ్మం-డోర్నకల్-కాజీపేట-బల్లార్షా, సికింద్రాబాద్-బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపించాల్సి ఉంది. కానీ ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, పసూనూరి దయాకర్ ఇప్పటికే రైల్వేశాఖకు లేఖలు రాశారు. బస్సులకేదీ ప్రత్యామ్నాయం? 2014 జాతర సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకు 22 వేల బస్సులు ఉండేవి. వీటిలో 3200 బస్సులను మేడారం జాతరకు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా 10,454 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఇతరత్రా మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్లో 8000 బస్సులుంటాయి. వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులన్నీ ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. దీంతో వారం రోజులపాటు పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట- సికింద్రాబాద్-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేట-బల్లార్షా, కరీంనగర్-సిర్పూర్ కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్డు-డోర్నకల్-కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమంటే అటే.. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో తొంభై శాతం రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి. కానీ ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రైల్వేశాఖ ఎలాంటి ముందస్తు సన్నాహాకాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ముంబై 12వ స్థానం, 20వ స్థానంలో ఢిల్లి
-
ఆసియాలో నీటికి ఢోకా లేదు
బీజింగ్: బ్రహ్మపుత్ర, సింధూ నదులతో పాటు ఆసియాలోని చాలా నదులల్లో నీటి నిల్వలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఆసియా ఖండం నదుల్లోని నీళ్లు అడుగంటిపోయి నీటి కటకట ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నట్లు ఏమి జరగదని ఒక కొత్త అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. రానున్న దశాబ్దాల్లో ఆసియా నదుల్లో నీటి నిల్వలు పెరగనున్నట్లు అధ్యయనం తేల్చింది. చైనా, భారత్ ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో చాలా వేగంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధి విస్తరించడమే దీనికి కారణమని స్వీడన్‌లోని గొతేన్బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ డెలియాంగ్ చెన్ పేర్కొన్నారు. -
స్కూటర్ టైర్ మార్కెట్లోకి మిచెలిన్
హైదరాబాద్: అంతర్జాతీయ దిగ్గజ టైర్ల తయారీ కంపెనీ ‘మిచెలిన్’ తాజాగా భారత్‌లో స్కూటర్, బైక్ టైర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ ‘మిచెలిన్ సిటీ ప్రో టైర్ల’ను మార్కెట్లో ఆవిష్కరించింది. 150 సీసీ బైక్స్ వరకు ఈ టైర్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో టూవీలర్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, డైలీ సిటీ రైటింగ్‌కు టైర్లు అనువుగా ఉంటాయని మిచెలిన్ (ఆసియా, ఆఫ్రికా, మధ్య తూర్పు) టూవీల్స్ కమర్షియల్ డెరైక్టర్ ప్రదీప్ జి తంపీ తెలిపారు. ‘మిచెలిన్ సిటీ ప్రో టైర్లు’ దేశవ్యాప్తంగా ఉన్న మిచెలిన్ ప్రీమియం డీలర్షిప్స్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. -
ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా జైట్లీ
న్యూఢిల్లీ: ఆసియాలో ఉత్తమ ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ మేగజైన్.. ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ జైట్లీని ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, ఆసియా’గా ఎంపికచేసినట్లు తెలిపింది. గడచిన 18 నెలలుగా భారత్ ఆర్థిక వ్యవస్థ సాధించిన పురోగతి క్రెడిట్ ప్రధాని నరేంద్రమోదీకి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్‌కు దక్కుతుందని, ఇందులో ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీకి భాగం ఉందనీ ఆ మేగజైన్ వ్యాసంలో పేర్కొంది. ఆసియా ప్రాంతానికి సంబంధించి ‘ఎమర్జింగ్ మార్కెట్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ గత ఏడాది రఘురామ్ రాజన్‌కు లభించిన సంగతి తెలిసిందే. 2010లో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ జర్నల్ ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, ఆసియా’గా ఎంపికచేసింది. -
తిండి గోల
బెటర్ గార్డ్ కాకరకాయ పేరు వింటేనే ముఖం అదోలా పెడతారు చాలామంది. ఆరోగ్యప్రదాయిని అని హెచ్చరిస్తే తప్పదన్నట్టు కాస్త కూరను భోజనంలో వడ్డించుకుంటారు. రుచి చూశాక మాత్రం ‘సూపర్’ అని కితాబులిచ్చేస్తారు. బిటర్గార్డ్, బిటర్ మెలన్ అంటూ విదేశీయులు దీనికి చాలా పేర్లే పెట్టారు. ఆసియా, ఆఫ్రికా మైదానాలలో విపరీతంగాపెరిగే తీగజాతి మొక్క కాకర. మనదేశం నుంచి 14వ శాతాబ్దంలో చైనాలోకి అడుగుపెట్టింది. కాకర సాగుబడి ద్రాక్ష తోటల పెంపకం మాదిరిగానే ఉంటుంది. జూన్, జులై మాసాలలో పువ్వులతో సింగారించుకున్న ఈ మొక్క సెప్టెంబర్ నుంచి నవంబర్ నాటికి కాయలను ఇస్తుంది. చాలా వరకు వీటిని పచ్చగా ఉన్నప్పుడే కాయగూరగా వాడుతారు. పండుగా మారిన తర్వాత బాగా నీరుపట్టి ఇంచుమించు దోసకాయలా ఉంటుంది. వంటగానే కాక కొన్ని దేశాలలో నాటు వైద్యంగా కాకర రసాన్ని ఉపయోగిస్తారు. -
వీరు చదువులకు దూరం..
‘యునిసెఫ్’ ప్రకారం, ఘర్షణాత్మక వాతావరణం ఉన్న దేశాల్లోని లక్షలాది మంది పిల్లలు బడులకు దూరమవుతున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పూర్తి ప్రతికూల పరిస్థితులున్న దేశాల్లో ఈ సంఖ్యలు ఇలా ఉన్నాయి: సూడాన్ 31 లక్షలు, ఇరాక్ 30 లక్షలు, యెమెన్ 29 లక్షలు, సిరియా 24 లక్షలు, లిబియా 20 లక్షలు -
బ్లాక్ మండే
-
భారత్ పరిస్థితి భేష్: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తోందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో సంస్కరణల ప్రక్రియ జోరందుకుందని పేర్కొంది. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, బీమా రంగంలో సంస్కరణలకు ప్రయత్నం, ప్రభుత్వ వ్యయాలు తగ్గింపునకు కృషి ద్వారా ద్రవ్యలోటు కట్టడి చర్యలు వంటి అంశాలను ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రస్తావించింది. 7% జీడీపీ వృద్ధి దిశగా విశ్వాసం గణనీయంగా మెరుగుపడినట్లు విశ్లేషించింది. ఇదే ప్రాంతంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు 2014 చివరినాటికి ఊహించినదానికన్నా పేలవ పనితీరును నమోదు చేసుకుంటున్నాయని పేర్కొంది. చైనా వృద్ధి మందగించిందని, జపాన్ మాంద్యంలోకి జారిపోయిందని పేర్కొంది. అమెరికా పటిష్ట రికవరీ ఎగుమతుల రంగానికి సానుకూల అంశమని పేర్కొంది. -
ఆసియా ఇన్ఫ్రా బ్యాంక్ ఆవిర్భావం
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల పెత్తనానికి చెక్..! * బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు; వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు * భారత్, చైనాతో పాటు మరో 19 దేశాలకు సభ్యత్వం... * అవగాహన ఒప్పందంపై సంతకాలు * అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు... బీజింగ్: అమెరికా, ఇతరత్రా పశ్చిమ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పెత్తనానికి చెక్ చెప్పేవిధంగా ఆసియాలో కొత్త బ్యాంకు ఆవిర్భవించింది. ఈ ప్రాంతంలోని దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులందించే లక్ష్యంతో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) శుక్రవారం ఏర్పాటైంది. చైనా నేతృత్వంలో బీజింగ్ కేంద్రంగా నెలకొల్పనున్న ఏఐఐబీ కోసం అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)పై చైనా, భారత్‌తో పాటు మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా... వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కూడా దీని ప్రధానోద్దేశంగా భావిస్తున్నారు. ఇక్కడి ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐఐబీ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. భారత్ తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ ఉషా టైటస్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. విధివిధానాలు త్వరలో ఖరారు... ఏఐఐబీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.6.1 లక్షల కోట్లు) అధీకృత మూలధనంతో ఇది ఏర్పాటవుతుందని ఎంఓయూలో పేర్కొన్నారు. ప్రాథమిక వినియోగ మూలధనం 50 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. చైనా ఆర్థిక శాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఏఐఐబీకి తొలి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన గతంలో పనిచేశారు. సభ్య దేశాలతో సంప్రదింపుల తర్వాత ఓటింగ్ హక్కులు, ఇతర ప్రామాణిక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీడీజీ, ప్రజల కొనుగోలు శక్తి(పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీ) ఆధారంగా వీటిని ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం చూస్తే భారత్‌కు ఏఐఐబీలో చైనా తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు కానుంది. ఈ కొత్త బ్యాంకు కారణంగా ఆసియా ప్రాంతంలోని దేశాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల లభ్యత పెరగనుందని ఉషా టైటస్ పేర్కొన్నారు. ఇటీవల బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని మోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏఐఐబీలో సభ్యత్వానికి ఇండిమాను ఆహ్వానించారు. భారత్, చైనాలతో పాటు ఏఐఐబీలో వియత్నాం, ఉజ్జెకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, సింగపూర్, ఖతార్, ఒమన్, ఫిలిప్పైన్స్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, బ్రూనై, కంబోడియా, కజకిస్థాన్, కువైట్, లావో పీడీఆర్, మలేసియా, మంగోలియా, మయన్మార్లు వ్యవస్థాపక సభ్య దేశాలుగా చేరాయి. అయితే, ఏడీబీలో ప్రధాన భూమిక పోషిస్తున్న జపాన్‌తో పాటు దక్షిణకొరియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియాలు కూడా ఏఐఐబీకి దూరంగా ఉన్నాయి. ప్రధానంగా అమెరికా ఒత్తిడే దీనికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. కార్పొరేట్లు హర్షం... ఏఐఐబీలో భారత్ సభ్యదేశంగా చేరడాన్ని భారత కార్పొరేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల మౌలిక సదుపాయాలకు, నిధుల కొరతకు కొంత పరిష్కారం లభిస్తుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ఆసియాలో మౌలిక సదుపాయాల కోసం వచ్చే పదేళ్లలో సుమారు 8 ట్రిలియన్ డాలర్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. ఒక్క భారత్‌కే ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.61 లక్షల కోట్లు) అవసరమని భావిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంకుకు అదనంగా... వర్ధమాన దిగ్గజ దేశాల కూటమి బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మౌలిక నిధుల కల్పన కోసం బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చైనాలోని షాంఘై కేంద్రంగానే ఏర్పాటు కానుంది. దీని మొదటి అధ్యక్ష పదవి కూడా భారత్‌కే లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు పోటీగానే బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇప్పటికే పశ్చిమ దేశాల్లో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏఐఐబీ ఆవిర్భావం జరగడం విశేషం. కాగా, ఎంఓయూపై సంతకాల అనంతరం సభ్య దేశాల ప్రతినిధులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఏఐఐబీ ఏర్పాటును అత్యంత కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ‘సంపన్నులు కావాలంటే మంచి ‘రహదారులు’ నిర్మించుకోవాలన్నది చైనాలో సామెత. ఇప్పుడు ఏఐఐబీ ఏర్పాటు వెనుక ప్రధానోద్దేశం కూడా ఇదే. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు పరుగులు తీయాలన్న సంకల్పంతోనే ఈ బ్యాంకును నెలకొల్పుతున్నాం’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఒక్క ఆసియా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలను కూడా దీనిలో భాగస్వామ్యానికి ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడీబీ తదితర బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి నిర్వహణ నైపుణ్యాలు, అనుభవాలను ఏఐఐబీకి వినియోగించుకుంటామన్నారు. కాగా, ఈ కొత్త బ్యాంకుతో తమకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావో బీజింగ్‌లో వ్యాఖ్యానించారు. -
ఆసియా క్రీడల్లో భారత్ జోరు!
-
జూవిలాపం
- ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో జంతువులు కరువు - వృద్ధాప్యంతో దర్శనమివ్వని సింహాలు - షెడ్లకే పరిమితమైన ఏనుగులు - భూతద్దం పెట్టి వెతికినా కనిపించని మొసళ్లు - ఉసూరుమంటున్న సందర్శకులు తిరుపతి(మంగళం) : శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతి పెద్దది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇదంతా కేవలం పేరుకు మాత్రమే. సందర్శకులు మాత్రం జూపార్క్ ఏమాత్రమూ అలరించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో జూ పార్క్ పేరు పరంగా దినదినాభివృద్ధి జరుగుతున్నప్పటికీ జంతువుల పరంగా ఏమాత్రమూ ఎదుగుబొదుగు లేకుండా ఉంది. 2200 హెక్టార్ల విస్తీర్ణంలో 1100 జంతు, పక్షి జాతులతో సందర్శకులను రంజింపజేస్తున్నాయని అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కనపడడంలేదు. ఒకటి, రెండు మినహా గడిచిన 30 ఏళ్లలో అవే జంతువులు సందర్శకులకు దర్శనమిస్తున్నాయి. అందులో వయస్సు మీరినవి, ఒంటరిగా ఉన్నవి, గాయాలపాలైనవే ఎక్కువుగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల పరిధిలో జంతువుల నివాస ప్రాంతం ఉన్నప్పటికి 1100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ సందర్శకులకు కనిపించేవి పదుల సంఖ్యలో కూడా ఉండవు. దీంతో సందర్శకులు నిరుత్సాహంతో ఉసూరుమంటున్నారు. పేరుకు జింకల సఫారీ, సింహాల సఫారీని ఏర్పాటు చేసినా అసలు వాటిలో సింహాలు, జింకలు మచ్చుకైనా కనపడవు. సఫారీలో మధ్యలో ఏర్పాటు చేసిన రింగురోడ్ల నిర్మాణానికి, జంతువులు సేద తీరేందుకు నిర్మించిన షెడ్లకు ఏమాత్రమూ అనుసంధానం లేకుండా పోయింది. ఈ కారణంగా సఫారీ వాహనంలో వెళ్లే సందర్శకులకు గంటల తరబడి వేచిచూసినా ఒక్క జంతువు కూడా కనబడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గడిచిన పదేళ్లకాలంలో కొత్త జంతువులను తీసుకొస్తామని చెబుతూ వచ్చిన అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. హిమాలయ బ్లాక్ బియర్, ఆడ జిరాఫీ, జీబ్రాలు, నీటి ఏనుగులు తీసుకొస్తామని గత పాలకులు, అటవీ శాఖ అధికారులు, సెంట్రల్ జూ అథారిటీ(సీజెడ్ఏ) ప్రకటనలు చేసినప్పటికి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. జిరాఫీ విషయానికి వస్తే అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో కోల్‌కతా జూపార్క్ నుంచి ఒక మగ జిరాఫీని తెప్పించారు. త్వరలోనే మరో ఆడ జిరాఫీని మగ జిరాఫీకి తోడు తెప్పిస్తామని చెప్పారు. అయితే ఐదేళ్లు గడిచిపోయినా తెప్పించలేదు. నక్కలు, తోడేళ్లు, హైనాలు జూలో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా సందర్శకులకు కనిపించిన పాపానపోలేదు. అసలు అవి ఉన్నాయా లేవా అనే అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. మొసళ్లు అయితే పేరుకు ఉన్నప్పటికీ సందర్శకులకు కనిపించని దుస్థితిలో వాటి నివాస స్థావరాలు ఉన్నాయి. ఏనుగుల విషయానికి వస్తే జూలో నాలుగు ఏనుగులు ఉన్నప్పటికి అవి కేవలం షెడ్లకే పరిమితమ య్యాయి. గతంలో షెడ్లలో కట్టేసిన ఏనుగులను కనీసం దగ్గర నుంచైనా చూడనిచ్చేవారు. అయితే ఇప్పుడు భద్రతా కారణాలు చూపిస్తూ సందర్శకులు చూసే దూరాన్ని అమాంతం పెంచేశారు. గతంలో నిర్వహిస్తున్న ఏనుగుల అంబారీని సైతం నిలిపివేశారు. జూను అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పటికీ ఇందుకు అనుకూలంగా ఒక్క అడుగు పడడంలేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిరిగి అటవీ శాఖ మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటికే జూపార్క్‌ను నాలుగైదు సార్లు సందర్శించి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కొత్త జంతువులను తెప్పిస్తామని చెప్పినప్పటికీ అటు వైపు దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా మంత్రిగారు జూకు కొత్త జంతువులను తెప్పిం చాలని ఆశిద్దాం. -
కెరీర్‌కు లీ నా గుడ్‌బై!
వుహాన్ (చైనా): ఆసియాలో అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న లీ నా తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 32 ఏళ్ల ఈ చైనా స్టార్ ఆదివారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు స్థానిక సీఎన్టీవీ పేర్కొంది. అయితే అంతకన్నా ముందు శుక్రవారమే సోషల్ మీడి యాలో లీ నా తన అభిమానులకు ఈ విషయం తెలిపే అవకాశం ఉంది. మోకాలి గాయం కారణంగా లీ నా గత జూన్ నుంచి టెన్నిస్‌కు దూరంగా ఉంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న తను గతంలో ఫ్రెంచ్ ఓపెన్ (2011), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) నెగ్గింది. -
నాడు దోషి... నేడు విజేత
శతాబ్దంన్నర కంటే ఎక్కువ చరిత్ర కలిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆసియా క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే జపాన్ యువకెరటం కీ నిషికోరి రూపంలో తొలిసారి ఆసియా క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. దాంతో యూఎస్ ఓపెన్‌లో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని యావత్ జపాన్‌తోపాటు ఆసియా మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసింది. అయితే క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అసమాన ఆటతీరు ముందు నిషికోరి చేతులెత్తేయడంతో ఆసియా అభిమానులకు నిరాశ తప్పలేదు. తుది మెట్టుపై నిషికోరి బోల్తా యూఎస్ ఓపెన్ చాంపియన్ సిలిచ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఆసియా నుంచి పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను చూసేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. సంచలన విజయాలతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జపాన్ యువతార కీ నిషికోరి పోరాటం టైటిల్ పోరులో ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-3తో పదో సీడ్ నిషికోరిపై గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేకాకుండా సిలిచ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సిలిచ్ 17 ఏస్‌లు సంధించడంతోపాటు నిషికోరి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సిలిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒకేసారి సఫలమైన నిషికోరి 30 అనవసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన సిలిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు); రన్నరప్ నిషికోరికి 14 లక్షల 50 వేల డాలర్లు (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ (వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రొయేషియా క్రీడాకారుడిగా సిలిచ్ నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రస్తుతం సిలిచ్‌కు ఇవానిసెవిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ సాధించిన ఫైనల్ విజయాలు సోమవారమే రావడం విశేషం. తాజా ప్రదర్శనతో సిలిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి, నిషికోరి 8వ స్థానానికి ఎగబాకారు. స్థిరమైన ఆటతీరు క్వార్టర్స్‌లో ఆరో సీడ్ బెర్డిచ్ను, సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరిన సిలిచ్ అదే దూకుడును టైటిల్ పోరులోనూ ప్రదర్శించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న సిలిచ్ బుల్లెట్ వేగంతో కూడిన భారీ సర్వీస్‌లు... కచ్చితమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద చలాకీతనంతో నిషికోరి ఆట కట్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్పై, మూడో సీడ్ వావ్రింకాపై, ఐదో సీడ్ రావ్నిక్లపై అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరిన నిషికోరి తుదిపోరులో సిలిచ్ జోరు ముందు ఎదురునిలువలేకపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 68 కేజీల బరువున్న నిషికోరి మ్యాచ్ మొత్తంలో రెండో సెట్లో మాత్రమే ఒకసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. తన ప్రధాన ఆయుధం శక్తివంతమైన సర్వీస్‌లను నమ్ముకున్న సిలిచ్ ఆరోగేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో సిలిచ్ ఒకసారి తన సర్వీస్ కోల్పోయినా వెంటనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌పై తన పట్టుబిగించాడు. మూడో సెట్లోనూ సిలిచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌లో క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో సిలిచ్ మ్యాచ్‌ను ముగించాడు. * ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక 14వ సీడ్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. * పీట్ సంప్రాస్ (2002లో-ప్రపంచ 17వ ర్యాంకర్) తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్‌లో లేని క్రీడాకారుడు యూఎస్ ఓపెన్‌ను (సిలిచ్-ప్రపంచ 16వ ర్యాంకర్) గెలవడం ఇదే ప్రథమం. గాస్టన్ గాడియో (ప్రపంచ 44వ ర్యాంకర్; 2004-ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత సిలిచ్ రూపంలో టాప్-10లో లేని క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. * గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అత్యంత పొడగరి క్రీడాకారుడిగా యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా-2009 యూఎస్ ఓపెన్) సరసన సిలిచ్ చేరాడు. ఈ ఇద్దరూ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నారు. * ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్‌ను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నెగ్గిన 13వ క్రీడాకారుడు సిలిచ్. గతంలో ఆండీ ముర్రే (2012), డెల్‌పొట్రో (2009), లీటన్ హెవిట్ (2001) ఈ ఘనత సాధించారు. * ఓపెన్ శకంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో (క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్) ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఐదో ఆటగాడు సిలిచ్. గతంలో ఫెడరర్ (2003-వింబుల్డన్), రిచర్డ్ క్రాయిసెక్ (1996-వింబుల్డన్), ప్యాట్ క్యాష్ (1987-వింబుల్డన్), గిలెర్మో విలాస్ (1977-ఫ్రెంచ్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. నాడు దోషి... నేడు విజేత క్లిష్ట పరిస్థితులు గొప్ప వ్యక్తుల్లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి. మారిన్ సిలిచ్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్లో సిలిచ్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా... మోకాలి నొప్పితో వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో మ్యూనిచ్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు అతనికి వింబుల్డన్ టోర్నీలో సమాచారం ఇవ్వడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. దాంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సిలిచ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఫలితంగా సిలిచ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 2013 చివర్లో తన చిన్ననాటి అభిమాన క్రీడాకారుడు గొరాన్ ఇవానిసెవిచ్ను కోచ్‌గా నియమించుకున్నాడు. అదే సమయంలో తన నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేశాడు. తన సహాయక సిబ్బందిలో ఎవరో తెలియకుండా తనకు నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న మాత్రలను ఇవ్వడంతోనే ఇలా జరిగిందని వాదించాడు. సిలిచ్ వాదనలతో ఏకభవించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ నిషేధాన్ని నాలుగు నెలలకు కుదించింది. సత్తా ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో సిలిచ్లో ఉన్న అసలు చాంపియన్ బయటకు రావడంలేదని ఇవానిసెవిచ్ గ్రహించాడు. అతని ఆటలోని లోపాలను సవరించాడు. అతని ప్రధాన ఆయుధమైన భారీ సర్వీస్‌లకు మరింతగా పదును పెట్టాడు. పదేపదే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని సూచించాడు. అయితే సిలిచ్ తన ఆటతీరును మార్చుకోవడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో అనుకున్న ఫలితం వచ్చింది. మూడో రౌండ్లో 18వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), నాలుగో రౌండ్లో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) లను ఓడించిన సిలిచ్ ఫైనల్లో పదో సీడ్ నిషికోరిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. డోపింగ్‌లో దోషిగా తేలి కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో సిలిచ్ స్థయిర్యం కోల్పోకుండా పరిణతితో వ్యవహరించాడు. పట్టుదలే పెట్టుబడిగా పోరాటం చేసి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ను చక్కదిద్దుకున్నాడు. -
నేడు ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం
నేపితా: మయన్మార్‌లో శనివారం జరిగే ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం మయన్మార్ రాజధాని నేపితా చేరుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆమె చర్చలు జరపనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఆమె పలు కీలక సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంతోపాటు తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ రీజినల్ ఫోరమ్ సదస్సుల్లో సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. అలాగే చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
ఆఫ్రికాపై ధూళి కమ్మితే.. భారత్‌లో వర్షం!
రుతుపవనాలపై ప్రభావం చూపుతున్న ధూళి కణాలు వాషింగ్టన్: ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాలపై ధూళి మేఘాలు కమ్ముకుంటే భారత్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయట. భారత్‌కు పశ్చిమ దిక్కున ఉన్న ప్రాంతాలపై గాలిలో ధూళికణాలు పెరగడం వల్ల అక్కడ గాలి బాగా వేడెక్కుతుందని, ఫలితంగా తూర్పు వైపు ప్రయాణించే గాలిలో తేమ శాతం పెరిగి భారత్‌లో వర్షాలు అధికంగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబోరేటరీ శాస్త్రవేత్తలతో కలిసి ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన వి.వినోజ్ బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వర్షపాతంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసిన వినోజ్ బృందం ఈ మేరకు కనుగొంది. -
రికార్డు స్థాయి వాణిజ్య రియల్టీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2013లో రికార్డు స్థాయిలో వాణిజ్య రియల్టీ పెట్టుబడులు నమోదయ్యాయి. 2012తో పోల్చితే గత యేడాది ఈ పరిమాణం 29 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 127 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ ల్యాంగ్ లాసల్లీ (జేఎల్ఎల్) తన తాజా నివేదికలో తెలిపింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గుతూ, 2009 నుంచి బలహీనంగా ఉన్నప్పటికీ విలువ రూపంలో మాత్రం పెట్టుబడులు 2013లో భారీగా నమోదయ్యాయి. తక్కువ రెంటల్స్, ఆకర్షణీయమైన విలువకు ఆఫీస్ స్పేస్‌ల లభ్యత వంటి అంశాల వల్ల మొత్తంగా క్రియాశీలత ‘బేస్’ పెరగడం దీనికి ఒక కారణమని కూడా జేఎల్ఎల్ ఇండియా హెడ్ అసుతోష్ లిమాయీ తెలిపారు. ముఖ్యాంశాలు... భారత్‌సహా చైనా, ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో 20 మార్కెట్లను ప్రాతిపదికగా తీసుకుని ‘ఆసియా పసిఫిక్ డెజైస్ట్ 2013 క్యూ4’ పేరుతో కన్సల్టెంట్ నివేదిక వెలువడింది. ఇన్వెస్టర్ల క్రియాశీలత చాలా బాగుంది. అయితే వ్యయ పొదుపులపై దృష్టిపెట్టిన కార్పొరేట్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోంది. చైనా, జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్ల వాటా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం వరకూ ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టమయ్యే అవకాశాల వల్ల 2014లో వాణిజ్య రియల్టీ మార్కెట్ కొంత మెరుగుపడవచ్చు. దీనివల్ల స్వల్ప-మధ్యకాలికంగా ఇకపై ఆఫీస్ రెంటల్స్ పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భారత్ స్థితి బలహీనమే... కాగా కమర్షియల్ రియల్టీ పెట్టుబడులకు సంబంధించి భారత్ పరిస్థితి బలహీనంగానే ఉందని అసుతోష్ లిమాయీ తెలిపారు. ఈ విలువ 10 బిలియన్ డాలర్లకన్నా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. -
ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్
మీరు స్కూల్‌కి సైకిల్‌పై వెళుతున్నారా? లేక సాయంత్రం ఇంటికి వచ్చాక ఇంటి చుట్టూ సైకిల్‌తో చక్కర్లు కొడుతున్నారా? ఏదైనా కానివ్వండి... సైకిల్ నడపడం అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో, పర్యావరణపరంగా కూడా అంతే మంచిది. సైకిల్ కాలుష్య రహితమైనది. పైగా దీన్ని ఉపయోగించడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సైకిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1860వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో యాంత్రికంగా నడిచే ద్విచక్ర సైకిల్‌ను మొట్టమొదటిసారి ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద దాదాపు వందకోట్ల సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. ఇది మిగిలిన ద్విచక్రవాహనాల కంటే రెండు వంతులు ఎక్కువ. ఒక కారు తయారీ ఖర్చుతో ‘100’ సైకిళ్ళను తయారుచేయవచ్చు. 1935 సంవత్సరంలో ఫ్రెడ్ ఎ. బిర్చ్మోర్... యూరప్, ఆసియా, యునెటైడ్ స్టేట్స్లో 25,000 మైళ్ళు సైకిల్‌పై ప్రయాణించారు. న్యూజెర్సీ, ఓహియోలోని సెయింట్ హెలెన్స్ పాఠశాలలో సైకిలింగ్ అనేది తప్పనిసరి సబ్జెక్ట్. ఈ పాఠశాలలో విద్యార్థులు తరగతులకు, హాల్‌కు మధ్య వున్న స్థలంలో సైకిళ్ళను నడుపుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైకిల్ 67 అడుగుల పొడవు కలిగివుంది. దానికి 35 సీట్లు ఉంటాయి. రోజూ సైకిల్ నడిపేవారు ఉన్న వయసు కంటే పది సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారని వైద్యులు తేల్చారు. అదేవిధంగా సైకిల్ తొక్కడం వల్ల 50 శాతం వరకు గుండె వ్యాధుల బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. -
మహానగర జీవన ‘చిత్రం’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో పాలిటన్ మహానగర జీవన చిత్రంలో పలు ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు కొంగుబంగారమైన ఈ నగరం ప్రపంచ విస్తీర్ణంలో 38వ స్థానం దక్కించుకుంది. ఆసియాలో 22వ స్థానంతో అలరారుతోంది. 95.77 లక్షల జనాభాతో భాసిల్లుతోంది. 2041 నాటికి ఆ సంఖ్య 1.90 కోట్లకు చేరనుంది. హైటెక్ నగర సామాజిక, ఆర్థికాభివద్ధితో పాటు విద్య, లింగనిష్పత్తి, కుటుంబ ఆదాయం, రవాణా తదితర అంశాలపై లీ అసోసియేట్స్ సిద్ధం చేసిన తాజా నివేదికలోని అంశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నివేదిక వెల్లడించిన పలు ఆంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అల్పాదాయ వర్గాలే అత్యధికం మహానగరం (హెచ్ఎంఏ) పరిధిలో అల్పాదాయ, మధ్యాదాయం పొందే వేతనజీవు లు, కార్మికులే అత్యధికం. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు సగటున నెలకు రూ.20,200, అద్దె ఇళ్లలో ఉంటున్న వారు రూ.13,600 ఆర్జిస్తున్నట్లు లెక్కగట్టారు. మురికివాడల్లో నివసించేవారి కుటుంబ ఆదాయం నెలకు రూ.9800 మాత్రమే. హెచ్ఎంఏ పరిధిలో వేతన శ్రేణులిలా ఉన్నాయి. శివార్లలో జన ప్రభంజనం.. జనాభా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 95,77,759గా ఉంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 67,57,552 మంది ఉండగా.. గ్రేటర్‌కు ఆవల మిగతా జనాభా కేంద్రీకృతమైంది. పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) పరిధిలో నివసిస్తున్నవారు 39,93,389 మంది మాత్రమే. అంటే గడిచిన దశాబ్ద కాలంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని తెలుస్తోంది. పోటీతత్వంలో నాలుగో స్థానం పెట్టుబడుల ప్రవాహం, పోటీతత్వం, కొత్త కంపెనీల స్థాపనకు దేశ వ్యాప్తంగా అనుకూలమైన నగరాలను పరిశీలిస్తే (2010కి ముందు స్థితి) హెచ్ఎంఏ ప్రాంతం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక, సేవలు, పారిశ్రామిక రంగానికి ఇతోధికంగా తోడ్పాటునందించడంతో ఈ పరిస్థితి ఉండేదని లీ నివేదిక అభిప్రాయ పడింది. మౌలిక వసతులు, ఆర్థికవృద్ధి, పాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, సంస్థాగత మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి 800 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 2010 నాటికి ఆయా నగరాల స్థానం ఇలా ఉంది.. మహిళల ఉపాధి అత్యల్పం జనాభాలో సగం ఉన్న మహిళలకు హెచ్ఎంఏ పరిధిలో ఉపాధి కల్పన అత్యల్పంగా ఉందని లీ నివేదిక పేర్కొంది. మహిళల్లో ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉపాధి పొందుతున్నవారు 6.3 శాతం కాగా, స్వయం ఉపాధి పొందుతున్నవారు 4.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. మహిళల్లో 77.8 శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారని నివేదిక అంచనా వేసింది. భవిష్యత్‌లో జన విస్ఫోటనమే.. ప్రస్తుతం హెచ్ఎంఏ జనాభా 95.77 లక్షలు ఉండగా, 2015 నాటికి ఇది 1.20 కోట్లకు చేరనుంది. 2041 నాటికి ఏకంగా 1.90 కోట్లకు చేరువకావడం తథ్యమని లీ అసోసియేట్స్ నివేదిక అంచనా వేసింది. మన పొరుగున ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8.5 మిలియన్ల జనాభా ఉండగా..అది 2025 నాటికి 1.22 కోట్లకు చేరనుందని అంచనా. చెన్నై నగర జనాభా ప్రస్తుతం 8.7 మిలియన్లు ఉండగా ఇది 2025 నాటికి 1.28 కోట్లకు చేరడం తథ్యమని తెలిపింది. అక్షరాస్యత ఓకే.. హెచ్ఎంఏ పరిధిలో అక్షరాస్యత 80.5 శాతంగా ఉంది. ఇందులో నామమాత్రపు విద్య (ప్రాథమిక విద్య) పూర్తి చేసినవారు 45.8 శాతం. పట్టభద్రులు 10.2 శాతం, పోస్టు గ్రాడ్యుయేట్లు 3.5 శాతం ఉన్నట్టు నివేదిక లెక్కగట్టింది. పురుషుల్లో అక్షరాస్యులు 84 శాతం ఉండగా.. స్త్రీలలో 76.5 శాతం మందే అక్షరాస్యులని నివేదిక తెలిపింది. సగం మందికి ఉపాధి కరువు హెచ్ఎంఏ పరిధిలో మొత్తం జనాభాలో కేవలం 38.7 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇది 2001లో 34.3 శాతంగా ఉంది. పరిధుల వారీగా ఉపాధి కల్పన శాతాల్లో ఈ విధంగా ఉంది.. తగ్గిన స్త్రీ-పురుష నిష్పత్తి.. చిన్న కుంటుంబంపై అన్నివర్గాల్లో అవగాహన పెరగడంతో కుటుంబ పరిమాణం తగ్గింది. 2001లో సగటు కుటుంబ పరిమాణం ఇంటికి ఐదుగురు సభ్యులుండగా ఇది 2011 నాటికి నలుగురికి చేరింది. స్త్రీ, పురుష నిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 960 మంది మాత్రమే మహిళలున్నారు. ఆడపిల్లలపై నేటికీ వివక్ష కొనసాగుతున్నట్టు లింగ నిష్పత్తిని చూస్తే తెలుస్తోందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. వసతుల కల్పనకు భారీ బడ్జెట్ అవసరం.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ పరిధిలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక వసతుల కల్పనకు రూ.3.94 లక్షల కోట్లు అవసరమని లీ నివేదిక అభిప్రాయపడింది. 2012-2017 మధ్య కాలంలో మం చినీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ రహదారులు, ప్రజారవాణ తదితర వసతుల కల్పనకు ఈ నిధులు అవసరమని స్పష్టం చేసింది.