డా. డిగో గొన్జాల్స్, డా. మంజునాథ్
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తులకు చిన్న కోతతోనే శస్త్రచి కిత్స చేసే ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా పేరుపొందిన రోబో టిక్ సర్జరీ నిపుణులు స్పెయిన్‌కు చెందిన డిగో గొన్జాల్స్ రివాజ్, రొమేనియాకు చెందిన ముగురేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుడు మంజునాథ్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు.
ఆసియా లోనే తొలిసారిగా ఒకే చిన్న కోతతో చేసే సర్జరీని అందుబాటులోకి తెచ్చా మన్నారు. ఊపిరితి త్తులకు ఇన్ఫెక్షన్లు, కేన్సర్ సోకినప్పుడు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేస్తే వేగంగా కోలుకుంటారని తెలిపారు. చిన్నపాటి గాయమే కావడం వల్లే ఏ వయసువారికైనా ఈ విధానంలో శస్త్రచికిత్స చేయవ చ్చని.. ఇటీవల ఊపిరి తిత్తుల కేన్సర్‌తో బాధప డుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి అపోలో ఆస్పత్రిలో విజయ వంతంగా ఈ శస్త్రచికిత్స చేశామని వెల్లడిం చారు. రోబోటిక్ వైద్య సేవలు సమీప భవిష్యత్తులో విస్తరించ నున్నాయని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment