వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్ ఆసియా రన్నరప్, మిసెస్ ఎలిగాన్స్, మిసెస్ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్–గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment