bankok
-
ఆరు పదులకు అందాల కిరీటం
వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్ ఆసియా రన్నరప్, మిసెస్ ఎలిగాన్స్, మిసెస్ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్–గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు. -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్'!
బ్యాంకాక్‌లోని పోటాంగ్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెఫ్ పిచాయా పామ్ సూన్టోర్నియానాకిజ్ 2024 సంవత్సరానికి ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్ ఆఫ్ ది ఇయర్‌గా టైటిల్‌ని గెలుచుకుంది. బ్యాంకాక్‌లో పెరిగిన థాయ్, చైనీస్ ,ఆస్ట్రేలియన్ చెఫ్ పిచాయా పొటాంగ్లో మంచి పేరుగాంచిన చెఫ్‌గా ప్రసిద్ధి చెందింది. తన పామ్ జాతి వారసత్వానికి గుర్తుగా థాయ్ చైనీస్ వంటకాలను హైలెట్ చేస్తోంది. ఆమె ఈ అవార్డుని మార్చి 26, 2024న కొరియాలోని సియోల్‌లో వేడుకగా జరగనున్న అవార్డుల ఫంక్షన్లో ఆ అవార్డుని తీసుకుంటారు. ఈ ఏడాదిలో ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలైన తొలి మహిళా చెప్గా పిచాయా పామ్ నిలిచింది. ఈ ఏడాది అవార్డులను ఉత్తమ రెస్టారెంట్లు, బెస్ట్ చెఫ్‌ల వారిగా విస్తృత జాబితాను చేసింది. గతేడాది ఆసియాలో 50 ఉత్తమ రెస్టారెంట్లలో ఆమె రెస్టారెంట్ 35వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే 50 ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో పిచాయ్ రెస్టారెంట్ 88వ స్థానానికి పరిమితమయ్యింది. 'పోటాంగ్ ' అంటే సింపుల్ అని అర్థం. ఆమె తన పామ్ జాతి వారసత్వాన్ని, కుటుంబ వృత్తి అయినా ఆయర్వేద వైద్యాన్ని ప్రతిబింబించేలా వంటలు చేస్తుంది. అంతేగాదు చైనాటౌన్ ఆధారిత రెస్టారెంట్ ఆమె కుటుంబానికి చెందిన హెర్బల్ ఫార్మసీని కూడా పునర్నిర్మించే పనిలో ఉంది. ఆమె ప్రధానంగా 'సాల్ట్, యాసిడ్, స్పైస్, టెక్స్చర్, మైలార్డ్ రియాక్షన్ వంటి ఐదు ఇన్‌గ్రేడియంట్స్ ఫిలాసఫి కచ్చితంగా ఉండేలా తన వంటల మెనూని రూపొందించింది. ఆమె వంటల మెనూ పురాతన సంప్రదాయల్ని మిళితం చేసేలా ఉంటుంది. అంతేగాదు పిచాయా అమెరికన్ ఉమెన్స్ క్లబ్ ఆఫ్ థాయిలాండ్ సహకారంతో సొంతంగా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉమెన్ ఫర్ ఉమెన్(డబ్ల్యూఎఫ్డబ్ల్యూ)ని కూడా ప్రారంభించింది. ఇది ఒక లాభప్రేక్ష లేని సంస్థ. దీని సాయంతో గ్రామీణ మహిళకు పాకశాస్త్రంలో నైపుణ్యాలను, మెళుకువలను నేర్పిస్తుంది. పిచాయా ఏళ్లుగా పాకశాస్త్రంలో తీసుకున్న శిక్షణ, తన కుటుంబ ప్రోత్సహాం, చిన్ననాటి నుంచి రుచుల సమ్మేళనాల గూర్చి విన్న కథలు, తదితరాలు తనను ప్రపంచ స్థాయిలో అందరూ మెచ్చుకునేలా వండే స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకొచ్చింది. అదే తనకు ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా స్థానం దక్కించుకునేలా చేసిందని చెప్పింది చెఫ్ పిచాయా. View this post on Instagram A post shared by Tatler Dining Hong Kong (@tatlerdininghk) (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్ర.. ఈ డివైజ్ గురించి తెలుసుకోవాల్సిందే!
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది. ‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్‌కు చెందిన స్విచ్‌లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్‌ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే! చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
సూకీకి మరో ఆరేళ్ల జైలు శిక్ష
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది -
రెండు తలలతో జన్మించిన పిల్లి.. మురిసిపోతున్న యజమాని!
బ్యాంకాక్: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు. ఫ్రాంక్ అండ్ లూయీదే గిన్నిస్ రికార్డు ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్ అండ్ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం. ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది! -
మరో విమానం ఇంజన్ ఫెయిల్: వరుస ఘటనలతో ప్రయాణీకులు బెంబేలు
సాక్షి, న్యూఢిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణీకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమానంలో విండ్‌షీల్డ్ క్రాక్ కారణంగా బుధవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దీనిపై డీజీసీఐ సంస్థకు నోటీసులు కూడా జారి చేసింది. తాజాగా మరో ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా విమానంలో ఇంజీన్ ఫెయిల్ అయిన ఘటన ఆందోళన రేపింది. అయితే విమానం సేఫ్టీగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి, ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే విస్తారా విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో విమానాన్ని ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి లాగాల్సి వచ్చింది. బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (సింగిల్ ఇంజన్) నిన్న (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, అయితే ప్రయాణీకుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది ట్యాక్సీవే నుంచి పార్కింగ్ విమానాన్ని తరలించారని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. -
అయ్యో ఈ కోతికి ఎంత కష్టమొచ్చింది!
థాయ్‌లాండ్: జంక్ ఫుడ్ తింటే మనుషులే కాదు జంతువుల సైతం అనారోగ్య బారిన పడతాయి. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. హాయిగా చెట్ల కొమ్మలపై అటూ ఇటూ దూకుతూ యాక్టివ్‌గా ఉండాల్సిన ఈ కోతి జంక్ ఫుడ్ తిని తిని ఉభకాయంతో బాధపడుతోంది. వివరాలు.. బ్యాంకాక్ చెందిన మనోప్ అనే ఓ షాప్ యాజమానురాలు గాడ్జిల్లా అనే కోతిని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని వయసు 3 సంవత్సరాలు. ఆమె రోజు తనతో పాటే ఈ కోతిని మార్కెట్‌కు తీసుకువచ్చి తన షాపు ఎదురుగా కట్టి ఉంచుతుంది. దీంతో ఆ దారిన వచ్చిపోయే వారంతా దానికి జంక్ ఫుడ్‌ను ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా రోజు బర్గర్, పిజ్జా, బన్లు వంటి పదార్థాలు తినడం వల్ల ఈ 3 ఏళ్ల కోతి 20 కేజీల బరువెక్కింది. అంటే దాని వయసుకు ఉండాల్సిన సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో ఉందని కోతి యజమానురాలు మనోప్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింటా వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ కోతిపై పడింది. అయ్యే ఈ కోతికి ఎంత కష్టం వచ్చిందో అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే గాడ్జిల్లా మొదటి యజమాని దానిని విడిచిపెట్టడంతో ఆమె ఈ కోతినిను పెంచుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనికి మంచి ఆహారం ఇవ్వాలన్నది తన కోరిక అట. కానీ గాడ్జిల్లా అధిక బరువుతో బాధపడుతుండటంతో తిరిగి దాని బరువును అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. గాడ్జిల్లా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు రెస్క్యూ టీం బ్యాంకాక్ రోడ్లపై కనుగోని దీని పాత యజమానికి అప్పగించారట. ఇది చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరగడం వల్ల ఆడవిలో స్వయంగా ఆహారం వెతుక్కొవడం దానికి తెలియదని ఆమె వివరించింది. అయితే ఈ కోతి రోజు ఉదయం పూట వ్యాయమం చేస్తున్నప్పటికి పలు అరోగ్య సమస్యల వల్ల ఉభకాయంతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. గాడ్జీల్లా ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతుందని అందుకే రోజు గాడ్జీల్లాను మార్కెట్‌కు తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గాడ్జీల్లా కేవలం తనకు ఇష్టమైన వారు ఆహారం పెడితేనే తింటుందట. -
‘ఆర్సెప్’లో చేరడం లేదు!
బ్యాంకాక్: కీలకమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ–ఆర్సెప్)’ ఒప్పందంలో భారత్ చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. ఆర్సెప్కు సంబంధించి భారత్ ఆకాంక్షలకు, ఆందోళనలకు చర్చల్లో సరైన సమాధానం లభించలేదని తేల్చి చెప్పింది. పలు ప్రపంచ దేశాల అధినేతలు హాజరైన ఆర్సీఈపీ సదస్సులో ప్రసంగిస్తూ భారత ప్రధాని మోదీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆర్సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ‘భారతీయులకు అందే ప్రయోజనాల దృష్టికోణం నుంచి ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తే నాకు సానుకూల సమాధానం లభించడం లేదు’ అని అన్నారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. చైనా ఒత్తిడి అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సులోనే అది జరగాలని సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. మరోవైపు, దేశీయ మార్కెట్‌ను సంరక్షించుకోవడం కోసం కొన్ని నిబంధనలు అవసరమని భారత్ వాదిస్తోంది. ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదముందనే భయాల నేపథ్యంలో.. దేశీయ ఉత్పత్తుల మార్కెట్‌కు సముచిత రక్షణ కల్పించాలన్నది భారత్ వాదనగా ఉంది. ఒకవేళ ఈ ఆర్సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40%, ప్రపంచ జీడీపీలో 35% ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి. 15 దేశాలు సిద్ధం ఈ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. తరువాతైనా, ఈ ఒప్పందంలో భారత్ చేరే అవకాశముందా? అన్న ప్రశ్నకు ‘ఈ ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయించుకుంది’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ పేర్కొన్నారు. భారత్ పేర్కొన్న ఏకాభిప్రాయం వ్యక్తం కాని అంశాలపై శనివారం 16 దేశాల వాణిజ్య మంత్రులు జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. ‘గత ప్రభుత్వాల హయాంలో అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి ప్రయోజనకరం కాకపోయినా.. పలు వాణిజ్య ఒప్పందాలకు భారత్ అమోదం తెలిపింది. ఇప్పుడలా లేదు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సొంత ప్రయోజనాల విషయంలో స్పష్టంగా ఉంటోంది’ అని వాణిజ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘ఇండో పసిఫిక్’ అభివృద్ధే లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, సమృద్ధి, అభివృద్ధిల కోసం కలసి కట్టుగా కృషి చేయాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఈస్ట్ ఆసియా సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజొ అబె సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిలటరీపరంగా, వాణిజ్యపరంగా చైనా విస్తరణవాద దూకుడుతో పాటు ఈ ప్రాంత భద్రత, వాణిజ్యం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష నిర్వహించారు. 2012 నుంచి.. ఆర్సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి. -
కాఫీ తాగి మృతి చెందిన కోతి
బ్యాంకాక్ : ఎండకు అలసిపోయిన ఓ కోతి కాఫీ తాగి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. బ్యాంకాక్‌కు వచ్చిన ఓ టూరిస్టు బైక్‌పై కూర్చుని కాఫీ తాగుతున్నాడు. దాహర్తితో ఉన్న కోతి.. బైక్‌పై దూకి అతని చేతిలో కాఫీ కప్పును తీసుకుని పారిపోయింది. అనంతరం కాఫీని తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు కోతిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కోతి మరణించింది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్లే దాన్ని సేవించిన కోతి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. -
ఉప్పీ రూపీ... క్లబ్లో పెప్పీ!
బ్యాంకాక్‌లో బ్రహ్మాండమైన క్లబ్ అది. క్లబ్‌లోకి ఎంటరైన ఉప్పీ... అదేనండీ ఉపేంద్రకు సాంగ్ సింగాలనిపించింది. డ్యాన్స్ చేయాలనిపించింది. అక్కడే బోలెడంత మంది రష్యన్ డ్యాన్సర్లు ఉన్నారు. ఉప్పీతో కాలు కదపడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. అంతే.. క్లబ్లో పెప్పీ సాంగ్ స్టార్టయింది. ఇంతకీ ఉపేంద్ర బ్యాంకాక్ వెళ్లడం ఏంటి? క్లబ్లో చిందేయడం ఏంటి? అనుకుంటున్నారా! ‘ఉప్పీ రూపీ’ అనే సినిమా కోసమే ఇదంతా. కె. మాధేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో ఓ క్లబ్ సాంగ్, ఉప్పీ, చిత్రకథానాయిక రచితా రామ్ పాల్గొనగా ఒక డ్యూయెట్ సాంగ్ తీశారు. అక్కడే ఒక మేజర్ ఫైట్ కూడా షూట్ చేశారు. ఇందులో ఉపేంద్ర కామన్ మాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. నెగటివ్ షేడ్ నుంచి హీరోగా మారే పాత్ర ఇది. అవినీతి అధికారులకు అద్దంలా ఉప్పీ పాత్ర ఉంటుంది. ఈ రేసీ పొలిటికల్ డ్రామా ఉప్పీ కెరీర్లో మరో మరపు రాని సినిమాగా నిలిచిపోతుందట. ‘ఉప్పీ రూపీ’ షూటింగ్ బ్యాంకాక్ లో ముగించుకుని, అక్కణ్ణుంచి ఉప్పీ స్ట్రైట్‌గా హైదరాబాద్ వచ్చేస్తారు. ఆయన నటిస్తోన్న మరో చిత్రం ‘హోమ్ మినిస్టర్’ షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. టైటిల్‌ని బట్టి ఇది పొలిటికల్ మూవీ అనుకునేరు. ప్రతి భర్తకీ అతని భార్యే హోమ్ మినిస్టర్. ఈ నేపథ్యంలోనే సినిమా ఉంటుందట. శ్రీహరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
భారత్‌కు నాలుగు పతకాలు
యూత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్‌కు అర్హత కోసం జరుగుతున్న ఆసియా స్థాయి క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్.. తొలిరోజే ఓ స్వర్ణంతో సహా నాలుగు పతకాలతో మెరిసింది. బాలుర 1500 మీటర్ల రేసులో అజయ్‌కుమార్ సరోజ్ 3 నిమిషాల 56.47 సెకన్లతో స్వర్ణం సాధించాడు. దీంతో ఆగస్టు 16 నుంచి 28 వరకు చైనాలోని నన్‌జింగ్‌లో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌కు అజయ్ అర్హత సాధించాడు. ఇక బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో మేమన్ పౌలోజ్ 13.80 సెకన్లతో, బాలుర జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 70.54 మీటర్ల దూరంతో రజత పతకాలను సొంతం చేసుకున్నారు. భారత్‌కు దక్కిన మరో పతకాన్ని (కాంస్యం) బాలికల జావెలిన్ త్రోలో పుష్పా జఖార్ సాధించింది. 48.73 మీటర్ల దూరంతో పుష్ప మూడో స్థానంలో నిలిచింది. ఇక బాలికల హై జంప్ లిబియా షాజీ ఐదో స్థానం, బాలుర డిస్కస్ త్రోలో ఎస్.మిత్రవరుణ్ నాలుగో స్థానం పొందారు. -
పంచామృతం: సర్వర్లు, వెయిటర్లు, క్లీనర్లు!
‘‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం నీ చేతగానితనమే...’’ అంటాడు వారన్ బఫెట్. ఆ అపర కుబేరుడు ఇలా అన్నట్లు తెలియకపోయినా, ఈ అక్షర సత్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితాలను మలుపు తిప్పుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. శ్రమతో, ప్రతిభతో తమరాతను తిరగరాసుకున్న వాళ్లున్నారు. వాళ్లలో మనకు బాగా పరిచయం ఉన్న వాళ్లూ ఉన్నారు. అంటే సిల్వర్ స్క్రీన్‌మీద హీరోలుగా, ఆఫ్ స్క్రీన్‌లో సెలబ్రిటీలుగా వెలుగుతున్న వాళ్లు. విశేషం ఏమిటంటే హోటళ్లలో సర్వర్లుగా, వెయిటర్లుగా జీవితాన్ని మొదలు పెట్టిన వాళ్లు వీళ్లంతా. తర్వాత స్టార్ల హోదాకు చేరారు. స్మృతి ఇరానీ రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర నటిగా గుర్తింపు ఉన్న వ్యక్తి స్మృతీ ఇరానీ. ఈ పార్శీ నటి ముంబైలోని మెక్‌డొనాల్డ్స్‌లో మెట్లు తుడిచేవారట! ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొన్నా అదృష్టం కలిసి రాలేదు. కానీ స్టార్‌ప్లస్ సీరియల్స్‌తో స్మృతి దశ తిరిగింది. అక్షయ్ కుమార్ బ్యాంకాక్‌లోని ఒక సాధారణ హోటల్లో వెయిటర్‌గా, గిన్నెలు కడిగేవాడిగా పనిచేశాడు ఈ కిలాడీ హీరో. కొన్ని సంవత్సరాల పాటు అదే వృత్తిలో కొనసాగిన అక్షయ్ అదే సమయాన్ని మరో విధంగానూ ఉపయోగించుకొన్నాడు. మార్షల్ ఆర్ట్స్‌కు కూడా ఫేమస్ అయిన బ్యాంకాక్‌లో వాటిని అవపోసన పట్టాడు. తర్వాత ఇండియా వచ్చేసి మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రవేశాన్నే అర్హతగా చేసుకొని సినిమా అవకాశాలను సంపాదించాడు. ఆ తర్వాత అక్షయ్ దశ తిరిగింది. బొమన్ ఇరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ లో డాక్టర్పాత్రతో ఈ పార్శీ నటుడి పేరు మార్మోగింది. అంతకు ముందు చిన్నాచితకా పాత్రలు చేసినా, సినిమా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలే పడ్డాడు బొమన్. ముంబాయిలోని తాజ్‌మహల్ హోటల్లో రూమ్ సర్వీస్ బాయ్‌గా, వెయిటర్‌గా చాలా సంవత్సరాల పాటు పనిచేశాడు. నాడు ఎంగిలి ప్లేట్లు కడిగిన అతడే ఇప్పుడు జనం మెచ్చిన నటుడయ్యాడు. జిమ్ క్యారీ ఈ కెనడియన్ యాక్టర్ ‘బ్రూస్ ఆల్మైటీ’ సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించాడు. తర్వాత అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘బ్రూస్ ఆల్మైటీ’ కథలాగే, ఈ హీరో వ్యక్తిగత కథ కూడా స్ఫూర్తిమంతమైనదే. ఒక రెస్టారెంట్లో క్లీనింగ్ బాయ్‌గా, సెక్యూరిటీగా పనిచేశాడట జిమ్. ఆ సమయంలో తాను పాడై, నిలిపి ఉంచిన వ్యాన్‌లో తలదాచుకొనే వాడినని క్యారీ చెబుతాడు. లియనార్డో డికాప్రియో ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఒకప్పుడు ఒక చీకటి ప్రపంచంలో జీవించేవాడు. చుట్టూ డ్రగ్ డీలర్స్, ప్రాస్టిట్యూట్స్... ఇలాంటి వారందరికీ సహాయకుడిగా, వాళ్లలో ఒకడిగా కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చాక డికాప్రియోకి వెల్కమ్ చెప్పింది ఒక హోటల్. అక్కడ సర్వర్‌గా పనిచేయడంతో అతడి కొత్త జీవితం మొదలైంది. అలా అలా... హాలీవుడ్లో వికసించింది.