బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి.
ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది
Comments
Please login to add a commentAdd a comment