Treason Case
-
కాషాయ జెండా ఎగరేసినందుకు.. బంగ్లాదేశ్‌లో 18 మందిపై దేశ ద్రోహం కేసు
ఢాకా: మైనారిటీ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్ యంత్రాంగం వ్యవహరిస్తున్నదనేందుకు తాజా ఉదాహరణ. మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవాలంటూ ఇటీవల చత్తోగ్రామ్‌లో హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాషాయ జెండా ఎగురవేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 18 మందిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. మరో 20 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులపైనా అక్టోబర్ 25న కేసు నమోదు చేశారు. తమ 8 డిమాండ్ల అజెండాకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్, భారత ప్రభుత్వం సాయంగా నిలిచాయని పుండరీక్ ధామ్ ప్రెసిడెంట్, కేసు బాధితుడు అయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తెలిపారు. తమ నిరసన బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాద న్నారు. కాగా, ఈ చర్యను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారంలో ఖండించడం గమనార్హం. ఇలా ఉండగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే తప్ప, పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి దేశ ద్రోహం కేసును తనంత తానే నమోదు చేయలేరని పరిశీలకులు అంటున్నారు. నేరం రుజువైతే జీవిత కాల జైలు శిక్ష పడవచ్చు. -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
ఇది పాక్ నుంచి మనం నేర్చుకోవాల్సిందే!
పాకిస్తాన్ నుంచి భారతదేశం నేర్చుకునే విషయాలు చాలా తక్కువ. కానీ ఆ దేశం నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయని లాహోర్ హైకోర్టు ఈ మధ్య ఇచ్చిన ‘రాజద్రోహం రద్దు’ తీర్పు చూసిన తరువాత అనిపిస్తుంది. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లో ఉన్న సెక్షన్ 124(ఏ) అనేది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును ప్రకటించింది. ఆ నిబంధన దుర్వినియోగం అవుతోందనీ, అది వలసవాదులు వదిలిన అవశేషమనీ లాహోర్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు తమ ప్రత్య ర్థులకి వ్యతిరేకంగా ఈ నిబంధనను ఉపయోగిస్తున్నా యని దాఖలైన బ్యాచ్ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి షాహీద్ కరీమ్ ఈ నిబంధనును రద్దు చేశారు. పాకిస్తాన్ మాజీ నియంత జనరల్ పర్వేజ్ ముషా ఫ్ 2007వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని తారుమారు చేసినందుకు... 2019వ సంవత్సరంలో ఆయనను దోషిగా నిర్ధారించి, మరణశిక్షను విధించిన న్యాయ మూర్తి జస్టిస్ కరీం. మన దేశం, పాకిస్తాన్ ఇరుదేశాలూ ఈ నిబంధనను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వారసత్వంగా పొందినవే. భారతీయులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన నిబంధన సెక్షన్ 124(ఏ). భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన వ్యక్తులనూ, అదే విధంగా అప్పుడు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తులనూ అణచి వేయడానికి తయారు చేసిన నిబంధన ఇది. మహాత్మాగాంధీ, బాల గంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు అందరూ ఈ నిబంధన బాధితులే. సెక్షన్ 124 (ఏ) నిబంధనను సుప్రీంకోర్టు గత సంవత్సరం రద్దు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను పునఃపరిశీలించే వరకు ఈ నిబంధనను ఆపేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధన కింద కేసులను నమోదు చేయకూడదు. దీని కింద అభియోగాలు ఉన్న అన్ని విచారణలనూ, అప్పీళ్లనూ, ఇతర ప్రొసీడింగ్స్‌నూ ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మా సనం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం దీనిని ఉపసంహరించడానికి ఎలాంటి ఆసక్తినీ కనబ రచడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు భారత ప్రభుత్వం పునఃపరిశీలన కూడా చేయలేదు. మన సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఈ నిబంధనను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని లేదా పరిశీలించాలని చెప్పింది. కానీ రద్దు చేయలేదు. కానీ పాకిస్తాన్ హైకోర్టు మన సుప్రీంకోర్టు కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి దీనిని రద్దు చేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ప్రకటించింది. అందుకని మనం ఈ విషయంలో పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. సెక్షన్ 124 (ఏ) అనేది మన దేశంలో, పాకిస్తాన్లో ఒకే విధంగా ఉంది. ఎవరైనా, మాటల ద్వారా, ద్వేషం వల్ల ధిక్కారాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినా, లేదా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి లేదా ప్రేరేపించ ప్రయత్నం చేసినా... వాళ్ళను ఈ నిబంధన కింద శిక్షించడానికి అవకాశం ఉంది. 1962వ సంవత్సరంలో ‘కేదార్నాథ్’ కేసులో ఈ నిబంధన చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ దీని పరిధిని పరిమితం చేసింది. అశాంతి సృష్టించే ఉద్దేశంతో లేదా హింసను ప్రేరేపించే చర్యలకు మాత్రమే ఈ నిబంధనను పరి మితం చేయాలని కోర్టు నిర్దేశించింది. కానీ పాలకులు దీన్ని పట్టించుకోలేదు. నిబంధనలో ఉన్న అంశాలను అక్షరాలా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి, దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదు. నినాదాలు చేసినందుకు, శాంతియుతంగా నిరసన తెలిపినా, ప్రభు త్వాన్ని విమర్శిస్తూ పోస్టులను పెట్టినా వారిపై తరచూ దేశద్రోహ కేసులను నమోదు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోయింది. దేశ పౌరులను బెదిరించడం సర్వ సాధారణమై పోయింది. పాకిస్తాన్లో నెలకొని ఉన్న ప్రస్తుత రాజకీయ గందరగోళంలో ఈ నిబంధనను రద్దు చేయడం చరిత్రాత్మకమైన విషయంగా పేర్కొ నవచ్చు. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. భారత పౌరుల హక్కులను ఇది కాలరాస్తోంది. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇది ఉండటానికి వీల్లేదు. చాలా ప్రజాస్వామ్య దేశాలు దీన్ని రద్దు చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఈ నిబంధన రద్దు గురించి స్పందన కన్పించలేదు. కానీ ఆ దేశంలోని రాజకీయ పక్షాలు, పౌరులు, జర్నలిస్టులు, న్యాయ వాదులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. పాకి స్తాన్‌లోని మానవ హక్కుల కమిషన్ కూడా ఈ రద్దును స్వాగతించింది. భారత ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి మనకు సంక్రమించిన చాలా శాసనాలను పురాత నమైనవిగా భావించి రద్దు చేసింది. దాదాపుగా 1500 చట్టాలను తొలగించింది. కాని, ఈ నిబంధనను తొలగించడానికి ఉత్సుకత చూపించడం లేదు. భారతదేశ మొదటి ప్రధాని దీని బాధితుడే. కానీ – భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవ రణ ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఏర్పడినాయి. ఇందిరాగాంధీ హయాంలో సెక్షన్ 124 (ఏ)ను కాగ్నిజబుల్ నేరంగా మార్చారు. అది 1974 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన దుర్వినియోగం జరుగుతున్నా పాల కులు దీనిని తొలగించడానికి ఇష్టపడడం లేదు. లాహోర్ హైకోర్టు తీర్పుతోనైనా మన దేశంలోనూ దీనిని త్వరగా తొలగిస్తే మన ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. మంగారి రాజేందర్, వ్యాసకర్త మాజీ జిల్లా జడ్జి. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
సూకీకి మరో ఆరేళ్ల జైలు శిక్ష
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవును... కొనసాగిస్తే ద్రోహమే!
శతాబ్దిన్నర క్రితం నాటి వలస పాలకుల చట్టమది. ఇవాళ అన్ని రకాలుగా కాలం చెల్లిన శాసనమది. అయినా సరే ఏలినవారి చేతిలో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే బలమైన ఆయుధంగా మిగిలింది. నిరసన తెలిపే రైతుల మొదలు విమర్శించే విలేఖరుల దాకా ప్రతి ఒక్కరినీ పాలకుల దృష్టిలో రాజద్రోహుల్ని చేసింది. ప్రభుత్వ సమీక్ష సాగే వరకు ఆ చట్టం అమలును నిలిపి వేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారమిచ్చిన ఆదేశం చరిత్రాత్మకమైనది. వేధింపులకూ, రాజకీయ కక్ష సాధింపులకూ సాధనంగా మారిన భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ‘సెక్షన్ 124ఎ’ను సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనలపై ప్రజాస్వామ్యవాదులకు ఈ తీపి కబురు వచ్చింది. ఈ ఒక్క మాటతో చట్టాల దుర్వినియోగం సంపూర్ణంగా మారకపోయినా, కనీసం ఒక ముందడుగు. ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వ సమీక్ష ప్రక్రియ కోసం వేచిచూడాలి. ఒక చట్టంగా ఏదీ చెడ్డది కాకపోవచ్చు. కానీ, దుర్వినియోగంతోనే సమస్యంతా! రాజద్రోహ చట్టంలోనూ అదే జరిగింది. ఆ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చి, వారం తిరగకుండానే సరైన వేదికపై చట్టాన్ని సమీక్షిస్తామని మాట మార్చే ఏలికలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థల చొరవే సామాన్యులకు శ్రీరామరక్ష. రాజద్రోహ చట్టం కింద 2014 –19 మధ్య అయిదేళ్ళ కాలంలో దేశంలో మొత్తం 326 కేసులు దాఖలయ్యాయని హోమ్ శాఖే చెబుతోంది. వాటిలో అత్యధికంగా 54 కేసులు అస్సామ్ లోవే. అయితే, నమోదైన ఆ కేసుల్లో సగాని కన్నా తక్కువగా కేవలం 141 కేసుల్లోనే ఛార్జ్షీట్లు ఫైలయ్యాయి. తీరా ఆరుగురంటే ఆరుగురే దోషులుగా తేలారట. దీన్నిబట్టి పెడుతున్న కేసులకూ, దోషులకూ పొంతన లేదన్న మాట. ఇప్పటికీ ఏటా 90 శాతానికి పైగా కేసులు పెండింగ్‌లోనే. చరిత్ర చూస్తే, ఐపీసీ ముసాయిదాను రూపొందిస్తున్నప్పుడే బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే రాజద్రోహ చట్టాన్ని అందులో చేర్చారు. అయితే, 1860లో అమలులోకి వచ్చిన శిక్షాస్మృతిలో పొర పాటున ఈ చట్టాన్ని చేర్చలేదు. తర్వాత 1890లో ప్రత్యేక చట్టం 17 ద్వారా ఐపీసీలో 124ఎ సెక్షన్ కింద నేరంగా రాజద్రోహాన్ని చేర్చారు. అప్పట్లో ద్వీపాంతరవాస శిక్ష విధించేవారు. అటుపైన 1955లో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ అసమ్మతిని సహించలేని బ్రిటిష్ పాలకులు తిలక్, అనీబిసెంట్, మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధులపై ఈ శాసనాన్నే ప్రయోగించిన తీరు ఓ పెద్ద కథ. స్వాతంత్య్రం వచ్చాక రెండు హైకోర్టులు ఐపీసీ ‘సెక్షన్ 124ఎ’ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కానీ, 1962 నాటి ప్రసిద్ధ కేదార్నాథ్ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆ హైకోర్టు తీర్పుల్ని కొట్టేసి, ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొంది. హింసకు ప్రేరేపించనంత వరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినా సరే అది రాజద్రోహం కాదంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాతా గత 60 ఏళ్ళలో విచ్చలవిడిగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉండడం సిగ్గుచేటు. ఒక్క 2019లోనే రాజద్రోహం కేసులు 25 శాతం, అరెస్టులు 41 శాతం పెరిగాయి. అలా ఉద్యమ నేతలు హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి, బీమా కొరేగావ్ కేసు నిందితుల మొదలు తాజా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా – ఆమె భర్త దాకా పలువురు ఇప్పుడు రాజద్రోహులు. ప్రత్యర్థుల నోరు నొక్కడానికి కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఈ చట్టాన్ని వాటంగా చేసుకున్నాయని విమర్శలు వస్తున్నది అందుకే. 1950ల నుంచి నేటి దాకా పార్టీలకు అతీతంగా ఈ పాపంలో అందరిదీ భాగం ఉంది. భారత లా కమిషన్, సుప్రీం కోర్ట్ ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించాయి. చట్టాన్ని రద్దు చేయడమే సబబన్నాయి. దేశ సమైక్యత, సమగ్రతకు పాకిస్తాన్, చైనా సహా అనేక ప్రమాదాలు పొరుగునే పొంచి ఉన్నవేళ, తీవ్రవాదాన్నీ, అసాంఘిక శక్తుల్నీ అణచివేయడానికి కఠిన చట్టాలు అవసరమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనో, మరొకటనో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఆ చట్టాలను దుర్వినియోగం చేయడంతోనే చిక్కు. ప్రాథమిక హక్కులైన వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు మినహాయింపుగా రాజద్రోహాన్ని పెట్టాలనే చర్చ రాజ్యాంగ రచన రోజుల్లోనే వచ్చింది. భారత రాజ్యాంగ షరిషత్లోని పలువురు సభ్యులు దానితో విభేదించి, ఆ మాటను చేర్చనివ్వక స్వేచ్ఛను కాపాడారు. అయితే, ఇవాళ చట్టమంటూ ఉన్నాక అరుదుగానో, తరచుగానో దుర్వినియోగం కాక తప్పని దుఃస్థితిలో పడ్డాం. అందువల్లే రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే వాదనలో బలం ఉంది. సమీక్షిస్తామనడం మంచిదే కానీ, దానికి ఏళ్ళూపూళ్ళూ కాలయాపన చేస్తేనే కష్టం. కొత్త పేరు, కొత్త రూపంలో పాత చట్టం తెస్తే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పటికే లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్ సాక్షిగా రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే, విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న ‘ఉపా’ లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలపైనా ఆ ఉదార సమీక్ష నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది. మారిన కాలానికి తగ్గట్టుగా శిక్షాస్మృతిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త స్మృతిని పార్లమెంట్ ఆమోదంతో తేవాలని నిపుణుల మాట. ఎనిమిదేళ్ళలో 1500కి పైగా పాత చట్టాలను రద్దు చేశామని జబ్బలు చరుస్తున్న పాలకులు ఇంతటి విప్లవానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపటికీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయలేదనే కన్నా, ఇప్పుడు తాము చేసిచూపడంలోనే చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే అమృత కాలం గడిచిపోయింది. -
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
జేఎన్‌యూ విద్యార్థి ఇమామ్‌పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. -
ఒడిశాతో కుమ్మక్కై.. టీడీపీ నేత నిర్వాకం
సాలూరు: ఒడిశాతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న కొదమ టీడీపీ నాయకుడు చోడిపల్లి మాలతిదొరపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా దురాక్రమణలకు మాలతిదొరే కారణమని రాజన్నదొర విమర్శించారు. ఒడిశాలో కలిసిపోదామంటూ గిరిజనులను రెచ్చగొడుతున్న ఆయనను పోలీసులు విచారిస్తే కొటియా కుట్రలన్నీ బహిర్గతమవుతాయన్నారు. సోమవారం పట్టణంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. మాలతిదొర ఈ ఏడాది మార్చి నెలలో కొదమ, సిరివర గ్రామాల్లో ఒడిశా నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను ఒడిశాలో కలిసిపోదామంటూ రెచ్చగొట్డాడని చెప్పారు. ఒడిశా ఉత్సవ్ దివస్ జెండాను కొటియా పల్లెల్లో మాలతిదొరచే ఒడిశా నాయకులు ఎగురవేయించారంటే ఆయన తీరును అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ అంశంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. గత టీడీపీ హయాంలో గిరిజనులకు మంజూరైన పథకాల్లో మాలతిదొర అనేక అక్రమాలకు పాల్పడినట్లు లిఖిత పూర్వక ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో విచారణ కొసాగుతుందని వెల్లడించారు. కొటియా గ్రామాలపై సుప్రీంకోర్టులో స్టేటస్కో అమలులో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. -
మొత్తం దేశద్రోహం కేసులు 326
న్యూఢిల్లీ: 2014– 2019 మధ్యకాలంలో దేశంలో దేశద్రోహం ఆరోపణలకు వర్తించే ఐపీసీ 124ఏ సెక్షన్ కింద మొత్తం 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో 141 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదవగా, 6 కేసుల్లో మాత్రమే నేరం రుజువై, దోషులకు శిక్ష పడింది. ఈ సెక్షన్ దుర్వినియోగమవుతోందని, బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఈ సెక్షన్ ఇంకా అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం 326 కేసుల్లో అత్యధికంగా 54 కేసులు అస్సాంలోనే నమోదయ్యాయి. అస్సాంలో 54 కేసులకు గానూ, 26 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదు కాగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. అయితే, వీటిలో ఏ ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. -
సుప్రీం తీర్పుల్లో వెలుగు నీడలు!
జస్టిస్ ఫిడ్జరాల్డ్ (1868 ఇంగ్లాండ్) ‘దేశద్రోహం’ అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిస్టుల కేసును విచారిస్తూ, జర్నలిస్టుల విమర్శనా హక్కును సమర్థిస్తూ, ప్రభుత్వ న్యాయపాలనా వ్యవస్థ నిర్ణయాలనే, దాని నిర్వాహకుల ఉద్దేశాలనే విమర్శించే హక్కు జర్నలిస్టులకు ఉంది. కాని ఇదే జర్నలిస్టులు తమ పరిధులు దాటి ప్రజలలో కావాలని ప్రభుత్వం పైన ఏహ్యతను, అగౌరవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, చట్టం విద్రోహం కింద జమకడుతుందన్నాడు! అయితే అదే సమయంలో ప్రభుత్వ చర్యలను ఎంతగా విమర్శించినా ఆ చర్చ, ఆ విమర్శ, ఎంత స్వేచ్ఛగా సాగినా అది ప్రభుత్వంపై ప్రజలలో విద్వేషాన్ని, అసహనాన్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. ఆ పరిధి దాటినప్పుడే అది పనిగట్టుకుని రెచ్చగొట్టే రాతల కిందికి, చర్చల కిందికి వస్తుంది కూడా అని జస్టిస్ ఫిడ్జరాల్డ్ పేర్కొన్నాడు. ఒక్కో చెట్టు నీడలో నిజం బతికి బట్టకట్టదు, న్యాయం చచ్చిపోతుందట! అలాగే కొందరు జర్నలిస్టులు ఏదో సాధిద్దామనుకొని తమ చేతిలో ఉన్న కలం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అర్ధ సత్యాలను వ్యాపింపజేస్తూ వాటినే తిరుగులేని సత్యాలుగా, ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి పత్రికలనే ‘దురదగొండి’ బాపతు అంటారు, కానీ ఆత్మనిగ్రహంతో సమన్వయ పూర్వకంగా నడిచే ప్రతిష్టాత్మక వార్తాపత్రికలకు, జర్నలిస్టులకు ఈ జబ్బు ఉండదు’’. – సుప్రసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. ఆర్. కృష్ణయ్యర్ ‘వెనల్–వెనియల్ జర్నలిజం, వల్నరబుల్ జ్యుడిషియలిజం’’ ‘రాజద్రోహ (దేశద్రోహ) నేరారోపణ కేసుల్లో జర్నలిస్టులకు రక్షణ అవసరం. ప్రభుత్వ విధానాలను లేదా చర్యలను విమర్శించే హక్కు, కఠినాతికఠినంగా విమర్శించే హక్కు ప్రభుత్వ విధానాలను మెరుగుపరిచే దృష్టితో లేదా వాటిని లీగల్ మార్గాల ద్వారా మరింత సవరించే హక్కు జర్నలిస్టులకు ఉంది. అందువల్ల జర్నలిస్టుల అభిప్రాయ ప్రకటనకు గల స్వేచ్ఛను సెడిషన్ అభియోగం నుంచి కాపాడి తీరాలి. ప్రజల స్థితిగతులను మెరుగుపరిచే దృష్ట్యా జర్నలిస్టులు, ప్రభుత్వ చర్యలపై నిశితంగా వ్యాఖ్యానించి విమర్శించే హక్కు ఉంది’’. –గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలో ఉన్న సుప్రీం బెంచ్ తీర్పు (3–6–21) గత ఏడేళ్లుగానూ, అంతకుముందు కొన్ని సందర్భాలలోనూ పాలక వర్గాల ‘సన్నాయి నొక్కుళ్లకు’ అనేక సందర్భాలలో, ఊగిసలాడుతూ తిరుగులేని తీర్పులు ఇవ్వడంలో కొంత జంకుతూ వచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కొన్ని మాసాలుగా తన స్వతంత్రమైన విశిష్ట స్థానాన్ని జాగరూకతతో కాపాడుకుని నిలదొక్కుకోడానికి ప్రయత్నించడం హర్షణీయమూ, గర్వకారణం కూడా. సీనియర్ జర్నలిస్టు, ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత వినోద్ దువాపైన అరవైఏళ్లనాటి ‘రాజద్రోహ’ నేరం తాలూకు ‘కవిలకట్ట’ను బయటకు లాగి పాలకులు ప్రయోగించబోవడమే సుప్రీం తాజా నిర్ణయానికి కారణమయింది. ఇంతకుముందు కొలది రోజులనాడే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరోనా మహమ్మారి తాండవిస్తున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ భారీఎత్తున సభలు, సమావేశాలు ఎలక్షన్ ర్యాలీలు అనుమతించినందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులపై హత్యానేరం ఎందుకు మోపకూడదని ఆ రాష్ట్ర ౖహై కోర్టు ప్రశ్నించింది. దానిపై ఎలక్షన్ కమిషన్, హైకోర్టు హెచ్చరికను పత్రికలు ప్రచురించకుండా చూడవలసిందిగా సుప్రీంబెంచ్కి మొరపెట్టుకున్నా సుప్రీం బెంచ్ పాటించ నిరాకరించడం సుప్రీంలో ఆలస్యంగానైనా వచ్చిన గుణాత్మకమైన మార్పులకు ఒక నిదర్శనంగా భావించవచ్చు. అంతేకాదు, పత్రికాస్వేచ్ఛను కోర్టులో వాదోపవాదాల రిపోర్టింగ్ వరకూ విస్తరించ వలసిందేనని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ తన తీర్పులో నొక్కి చెప్పింది! అంతేకాదు జస్టిస్ లలిత్ బెంచ్ 1962 నాటి కేదార్నాథ్ సింగ్ తీర్పును ఉదాహరిస్తూ ‘దేశద్రోహం అనే అభియోగం సెడిషన్ 124– ఎ క్రిమినల్లా కేవలం చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని హింసాచర్యల ద్వారా కూలద్రోసే ప్రయత్నాన్ని అడ్డుకోడానికి మాత్రమే ఉద్దేశించింది గాని, దేశప్రజల స్థితిగతులను మెరుగుపరచి తీరాలని, అందుకు సంబంధించిన చట్టాలను మార్చి తీరాలని కోరే డిమాండ్లకు ఆందోళనలకు వర్తించదని సుప్రీం తాజా తీర్పులో (లలిత్ బెంచ్) స్పష్టం చేసిందని గుర్తించాలి. అంతేకాదు ‘ ది గ్రేట్ రిప్రెషన్’ అన్న మకుటంలో సుప్రసిద్ధ జర్నలిస్టు, సుప్రీంకోర్టు న్యాయవాది, చిత్రాంషుల్ సిన్హా భారతదేశంలో ‘రాజద్రోహ/ దేశద్రోహం’ కేసుల పుట్టుపూర్వాలను జల్లెడ పడుతూ రాసిన గ్రంథం అనేక చారిత్రక సత్యాల పుట్ట (2019)! అందులో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘124–ఎ’ నేరం పేరిట 58 మందిని అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. కాగా అదే ‘దేశద్రోహం’ నేరం అభియోగం కింద అరెస్టుచేసిన 61 మంది కేసులు అతీగతి 2019 వరకూ తేలలేదు. కనీసం సుప్రీంకోర్టు ఈ కేసుల మంచి చెడులను 2019 వరకూ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు! అలాగే ‘రాజద్రోహ’ నేరానికి పాల్పడ్డారన్న అభియోగానికి సంబంధించి 33 శాతం కేసులు ఇంతవరకూ విచారణకు రాలేదని తెలిసి పోలీసులే ఆ కేసుల్ని మూసేశారట! ఇంక 2016లో ‘రాజద్రోహ’ నేరారోపణపై అరెస్టు చేసిన 48 మందిలో, 26 మందిపై చాలాకాలానికి గాని చార్జిషీట్లు తెరవలేదట! ‘పాలకులు పాల్పడే ఈ నిరంకుశ చర్యల్ని సుమోటోగా ప్రశ్నించిన దాఖలాలు లేవు! అదేమంటే ఆ పని శాసన వేదికల బాధ్యత అని సుప్రీం సరిపెట్టుకుంటుంది.! చివరికి ఈ శాసనాలు, ఈ చట్టసభలు, న్యాయస్థానాలూ ‘ఎవరికి పుట్టిన బిడ్డలురా, ఎక్కెక్కి ఏడవను’ ప్రశ్నించనూ అన్న చందంగా ఉన్నాయి. ఇంత గందరగోళం మధ్య కూడా ప్రభుత్వ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, రాజ్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టుపైన కోర్టు ధిక్కార నేరం మోపడానికి వ్యతిరేకించారు! అంతేకాదు పౌరహక్కుల ప్రసిద్ధ సుప్రీం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి అక్కసు కొద్దీ చేసేది లేక ఒకే ఒక్క ‘‘రూపాయి జరిమానా’’ విధించి చిల్లరగా వ్యవహరించినప్పుడు కూడా అటార్నీ జనరల్ చాలా హుందాగా, బాహాటంగా విభేదించారు. అలాగే గతంలో జస్టిస్ ఫిడ్జరాల్డ్ (1868 ఇంగ్లాండ్) ‘దేశద్రోహం’ అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిస్టుల కేసును విచారిస్తూ, జర్నలిస్టుల విమర్శనా హక్కును సమర్థిస్తూ, ప్రభుత్వ న్యాయపాలనా వ్యవస్థ నిర్ణయాలనే, దాని నిర్వాహకుల ఉద్దేశాలనే విమర్శించే హక్కు జర్నలిస్టులకు ఉంది. కాని ఇదే జర్నలిస్టులు తమ పరిధులు దాటి ప్రజలలో కావాలని ప్రభుత్వం పైన ఏహ్యతను, అగౌరవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, చట్టం విద్రోహం కింద జమకడుతుందన్నాడు! అయితే అదే సమయంలో ప్రభుత్వ చర్యలను ఎంతగా విమర్శించినా ఆ చర్చ, ఆ విమర్శ, ఎంత స్వేచ్ఛగా సాగినా అది ప్రభుత్వంపై ప్రజలలో విద్వేషాన్ని, అసహనాన్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. ఆ పరిధి దాటినప్పుడే అది పనిగట్టుకుని రెచ్చగొట్టే రాతల కిందికి, చర్చల కిందికి వస్తుంది కూడా అని జస్టిస్ ఫిడ్జరాల్డ్ పేర్కొన్నాడు. కానీ మనకు స్వాతంత్య్రం సాధించడానికి నానా త్యాగాలు చేసి, చివరికి రాజద్రోహం నేరాలను కూడా బ్రిటిష్ వలస పరిపాలకుల నుంచి ఎదుర్కొన్న బాలగంగాధర తిలక్, గాంధీజీ, భగత్‌సింగ్, సుభాస్ చంద్రబోస్, గదర్ వీరులు, వీర సావర్కర్, సోషలిస్టు, కమ్యూనిస్టు విప్లవకారులంతా జైళ్లపాలైనవారే. అంతవరకూ ఇండియన్ పీనల్ కోడ్‌లో ‘ 124–ఎ’ సెక్షన్ చేర్చిన తరువాత 21 సంవత్సరాల దాకా శిక్షలు లేవు, విచారణా లేదు. జాతీయోద్యమం దశదిశలా అల్లుకుపోయేదాకా ఆ సెక్షన్ నిద్రావస్థలోనే ఉంది. ఆ తర్వాతనే దుమ్ముదులుపుకొని దేశభక్తులపైన, విప్లవకారులపైన 124–ఎ విరుచుకుపడి నాయకులు, కార్యకర్తలు అనేకమందికి యావజ్జీవ కారాగారశిక్షలు విధించింది. కొందరు జైళ్ళలోనే కాలం చేశారు. సొంత రాజ్యాంగం, స్వాతంత్య్రం వచ్చింది కాని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వారి అవసరాల కోసం, ప్రయోజనాల కోసం మనపై రుద్దిపోయిన, కాలం చెల్లిన ‘రాజద్రోహ’ నేరాభియోగ సెక్షన్ మాత్రం దేశంలో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. ఏబీకె ప్రసాద్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏమంటివి.. ఏమంటివి..! రాజద్రోహం నవ్విపోతోంది
సాక్షి, అమరావతి: ‘రాజద్రోహం కేసులా..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉండగా ఏనాడూ అలాంటి కేసులు పెట్టించ లేదని బుకాయిస్తుండటం విస్మయ పరుస్తోందని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. రాజ ద్రోహానికి పాల్పడే ఆయన తొలిసారి సీఎం అయ్యారు. 1994 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో పార్టీని గెలిపించుకుని సీఎం అయిన ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రాజద్రోహానికి పాల్పడ్డారు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా కుట్ర పన్ని 1995లో ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించి, అడ్డదారిలో సీఎం అయ్యారు. పిల్లనిచ్చిన, రాజకీయ పునర్జన్మనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ రాజద్రోహం కేసులను ఆయుధాలుగా చేసుకునే రాజకీయ ప్రత్యర్థులను వేధించారు. తన ప్రత్యర్థులు, తన అవినీతిని ప్రశ్నించే వారిపై ఆయన నిస్సంకోచంగా ఈ కేసులు పెట్టించారని, పొరుగు రాష్ట్రం సీఎంపైనా రాజద్రోహం కేసులు పెట్టించిన ఘనత ఈ దేశంలో చంద్రబాబుకే దక్కుతుందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో దొరికిపోయి.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటూ చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అడ్డదారిలో గెలిపించుకునేందుకు ‘ఓటుకు కోట్లు’ కుట్రకు పాల్పడ్డారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆ అక్కసుతో ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టించారు. 12 చోట్ల ఫిర్యాదులు చేయించి 124 ఏ సెక్షన్ కింద కేసులు పెట్టించారు. ‘నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.. నీకు పోలీసులు ఉంటే నాకూ పోలీసులు ఉన్నారు’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌పై అక్రమంగా దేశద్రోహం కేసులు పెట్టించిన విషయం అందరికీ తెల్సిందే. రాజద్రోహం కేసులతో బ్లాక్ మెయిల్ తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నించిన వారిపై చంద్రబాబు లెక్కలేనన్ని రాజద్రోహం కేసులు పెట్టించారు. చంద్రబాబు తాను సీఎంగా ఉండగా విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు. దీనిపై గిరిజనులు తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. ఆ ఉద్యమానికి మద్దతుగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం ఏజెన్సీలోని చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై చంద్రబాబు ప్రభుత్వం రాజద్రోహం కేసుతోపాటు మూడు కేసులు నమోదు చేసింది. ఆ కేసుల పేరుతోనే బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు కోట్లు ఎరవేసి ఆమెను నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారు. ప్రశ్నించిన వారిపై ఎడాపెడా కేసులే ► టీడీపీ ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రి చినరాజప్ప దిష్టి బొమ్మను తగుల బెట్టారని బీజేపీ నేతలపై రాజద్రోహం కేసు పెట్టారు. ► టీడీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పులను విమర్శించారని చెబుతూ న్యాయవాదుల మీద సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహం కేసులు బనాయించారు. ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరులో టీడీపీ నిర్వహించిన ‘నారా హమారా’ సభ సందర్భంగా ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలను ప్రశ్నించారని కొందరు ముస్లిం యువకుల మీద కుట్ర కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై కేసులు ఎత్తి వేసింది. ► తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’ గుంటూరు రిపోర్టర్‌పై తన మనుషులతో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసించి అక్రమంగా కుట్ర కేసు పెట్టించారు. -
కంగనాపై దేశద్రోహం కేసు
ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెట్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
‘చచ్చినా అతన్ని వదలొద్దు.. శవాన్ని అయినా ఉరి తీయండి’
కరాచి : రాజద్రోహం కేసులో ఉరిశిక్ష పడిన మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజద్రోహం కేసు తీర్పు వివరాలను ముగ్గురు సభ్యుల బెంచ్ గురువారం సమగ్రంగా చదివి వినిపించింది. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో మూడు రోజులపాటు వేలాడదీయాలని పేర్కొంది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్‌కి పారిపోయిన ముషారఫ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. (చదవండి : ముషారఫ్‌కు మరణశిక్ష) రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించగా జస్టిస్ కరీం, జస్టిస్ నజారుల్లా అక్బర్ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ వకార్ అహ్మద్, జస్టిస్ కరీం ముషారఫ్ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి : ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు) -
ముషారఫ్ ఎప్పటికీ ద్రోహి కాదన్న పాక్ ఆర్మీ
-
ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్‌కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. -
పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
-
ముషారఫ్‌కు మరణశిక్ష
ఇస్లామాబాద్: సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్ పై ఈ కేసు నమోదైంది.పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింద్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్‌ల బెంచ్ మంగళవారం వెల్లడించింది. కోర్టు తీర్పు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ముషారఫ్ అందుబాటులో లేరు. అయితే ఫిర్యాదులను, రికార్డులను, వాదనలు, కేసులోని వాస్తవాలను పరిశీలించిన మీదట ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్‌కి వ్యతిరేకంగా మెజారిటీ తీర్పుని వెల్లడించారు. 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షస్థానంలో ఉండి ముషారఫ్ సైనికాధిపతిగా వ్యవహరించడంతో ముషారఫ్ పాలనలో జనం విసిగిపోయారు. సుప్రీంకోర్టు జడ్జీలనూ ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచారు. అనేక మంది జడ్జీలను విధుల నుంచి తొలగించారు. తర్వాత 2008లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఓ రాజకీయ పార్టీ వైఫల్యంతో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ముషారఫ్‌కి ఈ శిక్ష అమలు చేయడం ఇప్పుడు సవాల్‌గా మారనుంది. దుబాయ్‌లోని ఆసుపత్రి పడకపై నుంచి ముషారఫ్ గత నెలలో ఓ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. అందులో కేసులో తనపై న్యాయమైన విచారణ జరగడంలేదని ఆరోపించారు. అలాగే ‘జాతికి సేవ చేశాను. దేశ అభ్యున్నతి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అని వీడియోలో ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుని ముషారఫ్ పై కోర్టులో చాలెంజ్ చేయొచ్చని న్యాయనిపుణులు వెల్లడించారు. అమెరికాపై నవంబర్ 9 న జరిగిన దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో ముషారఫ్ అమెరికా పక్షం వహించడం పట్ల మతపరమైన పార్టీలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ హింసకు దారితీశాయి. -
మాజీ నియంతకు మరణశిక్ష
పాకిస్తాన్‌ను ఒక అర్థరాత్రి చెరబట్టి, ఏ రకమైన ప్రజామోదమూ లేకుండా తొమ్మిదేళ్లపాటు పాలించి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌కు అక్కడి ప్రత్యేక న్యాయ స్థానం దేశద్రోహ నేరంకింద మరణశిక్ష విధించడం ఆ దేశంలో మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కి వెళ్లినప్పుడు ఈ శిక్ష నిలబడుతుందా... పాక్ సైన్యం ఈ తీర్పును ఎలా పరిగణిస్తుందన్న అంశాలు పక్కనబెడితే పాకిస్తాన్ చరిత్రలో సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న సైనికాధికారికి పౌర న్యాయస్థానంలో మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఇప్పటికే అనారోగ్యంతో దుబాయ్ ఆసుపత్రిలో ఉన్న ముషార్రఫ్ తన వాదన వినకుండా తీర్పునిచ్చారని, తనను వేధిస్తున్నారని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చుగానీ... ఆయన చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు. 1999 అక్టోబర్‌లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ శ్రీలంక పర్యటనకెళ్లినప్పుడు రక్తరహిత కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ముషార్రఫ్ ఆ తర్వాత వరసబెట్టి ప్రజా స్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ముందుగా మీడియా పీకనొక్కి, ఆ తర్వాత న్యాయవ్యవస్థ పనిపట్టారు. 2007లో దేశంలో రాజ్యాంగాన్ని రద్దుచేసి, కొత్తగా తాత్కాలిక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దానికింద ఎమర్జెన్సీ విధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ మూర్తులంతా పదవుల్నించి తప్పుకుని కొత్త రాజ్యాంగం కింద ప్రమాణస్వీకారం చేయాలని హుకుం జారీచేశారు. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని తక్షణం నిలిపేస్తున్నట్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వీరిని, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తెకర్ చౌధ్రితోసహా వంద మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచారు. వివిధ హైకోర్టులు, ఆ కిందిస్థాయి న్యాయస్థానాలకు చెందిన 76 మంది న్యాయమూర్తులు కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకులందరినీ ఖైదు చేశారు. ఈ చర్య తర్వాత పాకిస్తాన్ అంతటా ఆందోళనలు రాజుకోవడంతో ముషార్రఫ్ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసుకుని నేరుగా పాలించడం మొదలుపెట్టారు. అటు సైనిక దళాల చీఫ్‌గా, ఇటు దేశాధ్యక్షుడిగా జోడు పదవుల్లో ఉన్న ముషార్రఫ్‌పై ఏదో ఒక పదవే ఉంచుకోవాలంటూ సైన్యం నుంచి కూడా ఒత్తిళ్లు రావడంతో సైనిక దళాల పదవికి స్వస్తి చెప్పి అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించు కున్నారు. తనకు ఆప్తుడైన ఐఎస్ఐ చీఫ్ కయానీకి సైనిక దళాల చీఫ్ పదవి కట్టబెట్టారు. రాజ్యాం గాన్ని రద్దు చేసిన కేసులోనే ఇప్పుడు ముషార్రఫ్‌కు ఇప్పుడు మరణశిక్ష పడింది. తనను ఏరి కోరి తెచ్చుకున్న నవాజ్ షరీఫ్‌కు తాను ఎసరు పెట్టినట్టే... తాను తెచ్చుకున్న జనరల్ కయానీ తనకే ఎదురు తిరగడం ముషార్రఫ్‌కు అనుభవంలోకొచ్చింది. 2008 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ముషార్రఫ్ కనుసన్నల్లో పనిచేసే పీఎంఎల్–క్యూ తుడిచిపెట్టుకుపోగా పీపీపీ ఘనవిజయం సాధించింది. తన టక్కుటమార విద్యలన్నీ విఫలమయ్యాయని గ్రహించాక ఇక అయిష్టంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పౌర ప్రభుత్వాలను కబ్జా చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైనికాధికారుల్లో ముషార్రఫ్ మొదటివారేమీ కాదు. ఆ దేశం దాదాపు 35 ఏళ్లపాటు సైనిక పదఘట్టనల్లోనే బతుకీడ్చింది. తమ పాలనలోని అవినీతి జనం కళ్లబడకుండా, పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాల జోలికి వారు పోకుండా ఇస్లామిక్ సిద్ధాంతం పేరు చెప్పి ప్రజలను బుజ్జగించడం సైనిక పాలకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహం. ఆ తానులో ముక్కగా ముషార్రఫ్ కూడా దాన్నే కొనసాగించారు. అటు అఫ్ఘాన్‌లో తాలిబన్లకు బహి రంగంగా సహాయసహకారాలిస్తూ, భారత్‌లో ఉగ్రవాద దాడులు చేసేందుకు ప్రోత్సహించారు. పాక్‌లో తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం అవసరం గనుక అమెరికా ఈ కుట్రలన్నిటికీ సహక రిస్తూ వచ్చింది. 2001లో అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేశాక ఇదంతా మారక తప్పలేదు. ఆ తర్వాత చాటుమాటుగా ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ వచ్చారు. ఈ సంస్కృతిని ఇంకా పాక్ విడనాడలేదు. ఇప్పుడు తీర్పు వెలువరించిన ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించిన వైనాన్ని గమనిస్తే, ముషార్రఫ్‌ను కాపాడటానికి అది ఎన్ని పాట్లు పడిందో అర్థమవుతుంది. ఈ పనంతా మొదట్లో ముషార్రఫ్ చేసుకోవాల్సి వచ్చింది. 2013నాటి ఈ కేసు విచారణలో అడుగు ముందుకు పడకుండా ఎప్పటికప్పుడు ఆయన ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూనే వచ్చారు. అవన్నీ వృధాయేనని అర్థమయ్యాక 2016లో ఆయన కొద్దిరోజుల్లో తిరిగొస్తానని నమ్మబలికి దేశం నుంచి నిష్క్రమించారు. ఈ మూడేళ్లూ చడీచప్పుడూ చేయని ఇమ్రాన్ సర్కార్ ఇక తీర్పు వెలువడటం తథ్యమని తెలిశాక ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వకుండా ఆపాలంటూ పిటిషన్ వేసింది. అలా నెలరోజులు గడిచిపోయింది. ఆ అడ్డంకి కూడా అధిగమించి ఈ నెల 17న తీర్పునిస్తామని ఈ నెల 5న ప్రకటించాక ముషార్రఫ్‌తో పాటు అప్పటి ప్రధాని షౌకత్ అజీజ్, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ దోగర్, అప్పటి న్యాయమంత్రి జహీద్ హమీద్‌లను కూడా నిందితులుగా చేర్చాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వీరందరినీ చేర్చి కొత్తగా విచారించాలని కోరింది. ఇన్నేళ్లపాటు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని మందలించి, పిటిషన్‌ను కొట్టేసి ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరిం చింది. తుది అప్పీల్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ తీర్పును ఎటూ సుప్రీంకోర్టు నిలిపివేస్తుంది. ఆ నిర్ణయం ఇప్పట్లో రాదనే చెప్పాలి. అక్కడ కూడా చుక్కెదురయ్యాక దేశాధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టొచ్చు. కానీ ఆ దేశ రాజకీయాలపై ఇంకా సైన్యం పట్టుసడలని వర్తమానంలో ఈ తీర్పు ప్రతీ కాత్మకమైనదే అయినా ఎన్నదగినది. దీని పర్యవసానాలెలా ఉంటాయో మున్ముందు చూడాలి. -
సిద్ధరామయ్య, కుమారస్వామిలపై దేశద్రోహం కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మల్లికార్జున అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు సిటీ కోర్టు వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. కుట్రపన్నడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం లేవనెత్తడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ డీసీపీ రాహుల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు
న్యూఢిల్లీ: మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని పలు పార్టీలు, సంఘాలు ఖండించాయి. కేసును వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమీ డిమాండ్ చేశాయి. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శనివారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. -
హార్దిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్‌పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
సోషల్ మీడియాలో పోస్ట్‌లతో అరెస్టులు
జైపూర్/సిమ్లా/రాయ్‌పూర్/బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక పోస్ట్‌లు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పారామెడికల్ విద్యనభ్యసిస్తున్న నలుగురు కశ్మీరీ విద్యార్థినులు తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు ఉగ్రదాడికి సంబరాలు చేసుకుంటూ, ఆ ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే విద్యా సంస్థ వారిని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించింది. నలుగురు అమ్మాయిలపై పోలీసులు దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జిలేఖా బీ అనే మహిళ కూడా ఫేస్బుక్లో ‘పాకిస్తాన్ కీ జై’ అని పోస్ట్ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు కస్టడీ విధించింది. కర్ణాటకలో శనివారమే మరో యువకుణ్ని కూడా పోలీసులు ఇదే విషయమై అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న మరో కశ్మీరీ తహ్సీన్ గుల్ ఇన్‌స్టాగ్రాంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కైఫ్(18) ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని పోస్ట్ చేసి అరెస్టయ్యాడు. మరోవైపు బయట పరిస్థితులు బాగాలేనందున కశ్మీరీ విద్యార్థులు క్యాంపస్ దాటి బయటకు రాకూడదని యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం సూచించింది. మన మధ్య గొడవలే శత్రువు లక్ష్యం.. మిగతా భారతీయులు కశ్మీరీలను వెలేస్తే పాక్ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందనీ, కొందరు అత్యుత్సాహపరులు తామేం చేస్తున్నారో మెదడుతో ఆలోచించాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ యువతపై మీరు దాడి చేసి, వారిని వెలేసి ఎవరికి ప్రయోజం చేకూర్చదలచారు? కశ్మీర్ వదిలేసి బయటకొచ్చి బతుకుతున్న వారిని కశ్మీరీ ఆదర్శవంతులుగా మీరు చూడాలి. అలాంటివారిపై దాడులు చేయడం ద్వారా కశ్మీరీ లోయలో తప్ప మిగతా భారత దేశంలో వారికి స్థానం, భవిష్యత్తు లేదనే సందేశాన్ని మీరిస్తున్నారు. కశ్మీరీలు, మిగతా భారతీయుల మధ్య గొడవలు సృష్టించాలన్న శత్రువు లక్ష్యాన్ని మీరే నెరవేరుస్తున్నారు’ అని ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి నకిలీ ఫొటోలు.. నమ్మొద్దు పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికుల శరీర భాగాలుగా చెబుతూ కొన్ని నకిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయనీ, వాటి ని ఎవరూ నమ్మవద్దని సీఆర్పీఎఫ్ ఆదివారం ప్రజలకు సూచించింది. దేశంలో ద్వేషం పెంచేందుకు కొందరు దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనీ, ఆ ఫొటోలను ఎవరూ ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ‘దయచేసి అలాంటి పోస్ట్‌లు, ఫొటోలను షేర్, లైక్ చేయకండి. ఇతరులకు పంపకండి’ అని సీఆర్పీఎఫ్ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఫొటోలు, పోస్ట్‌లు వస్తే webpro@ crpf.gov.inMì కి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని కోరింది. -
అలీగఢ్ విద్యార్థులపై దేశద్రోహ కేసులు
అలీగఢ్: ఓ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సహా 14 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైన ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బుధవారం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో జరగబోయే ఓ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆహ్వానించిన నేపథ్యంలో క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలు వర్సిటీలో ఒవైసీ పర్యటనకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒవైసీ పర్యటనను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటు వర్సిటీలో చిత్రీకరించడానికి వచ్చిన ఓ టీవీ చానెల్ సిబ్బందితో సైతం కొందరు విద్యా ర్థులు గొడవ పడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి బీజేవైఎంకు చెందిన ముఖేశ్ లోధి బైక్‌పై వస్తుండగా క్యాంపస్‌లో అడ్డగించి కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు సల్మాన్ ఇంతియాజ్, ఉపాధ్యక్షుడు హుజైఫా అమీర్ సహా 14 మందిపై కేసులు నమోదయ్యాయి. -
‘రఫేల్ ఒప్పందంలో రాజద్రోహానికీ పాల్పడ్డారు’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ ఒప్పందంపై కాగ్ నివేదికను పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రఫేల్ కేవలం అవినీతి వ్యవహారమే కాదని ఇది రాజద్రోహం కేసని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై సంతకాలు జరగకముందే దీని గురించి రిలయన్స్ డిఫెన్స్‌కు చెందిన అనిల్ అంబానీకి తెలుసని వెలుగులోకి వచ్చిన ఓ ఈమెయిల్ నిరూపిస్తోందని పేర్కొన్నారు. ఒప్పందం గురించి అనిల్ అంబానీకి ముందే తెలియడం అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు కొద్ది రోజుల ముందు 2015, మార్చి 28న పంపినట్టుగా ఉన్న ఆ ఈమెయిల్ ఇమేజ్ను కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పోస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ 9-11 మధ్య ఫ్రాన్స్‌తో రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేస్తారని ఎయిర్‌బస్, ఫ్రాన్స్ ప్రభుత్వం, అనిల్ అంబానీలకు ముందే తెలుసని ఈమెయిల్ ద్వారా వెల్లడవుతోందని, ప్రభుత్వం దీనిపై చెబుతున్నవన్నీ అసత్యాలేనని తేలిందని కపిల్ సిబల్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ గూఢచారి పాత్రను అద్భుతంగా పోషించారని రాహుల్ మండిపడ్డారు. ఈ-మెయిల్లో ఏముంది..? యూరప్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ తాను అప్పటి ఫ్రాన్స్ రక్షణ మంత్రి సహచరుడితో టెలిఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు ఈమెయిల్లో ప్రస్తావించారు. అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రి కార్యాలయానికి వచ్చారని, ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్నాయని ప్రధాని మోదీ పర్యటనలో ఎంఓయూ (అవగాహనా ఒప్పందం)పై సంతకాలు జరుగుతాయని చెప్పారని ఆ ఎగ్జిక్యూటివ్ ఈ మెయిల్లో పేర్కొన్నారు. కపిల్ సిబల్ పోస్ట్ చేసిన ఈ ఈ-మెయిల్ రఫేల్ ఒప్పందంపై తాజా ప్రకంపనలకు కేంద్రమవుతోంది. -
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
షరీఫ్ కోర్టుకు రావాల్సిందే
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఊరట పొందిన షరీఫ్‌ను.. లాహోర్ హైకోర్టు రాజద్రోహం కేసులో అక్టోబర్ 8వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఓ ఇంటర్వ్యూలో ముంబై దాడుల గురించి మాట్లాడినందకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో ఆయన డాన్ పత్రికతో మాట్లాడుతూ.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని పరోక్షంగా అంగీకరించారు. దాడులకు పాల్పడింది పాక్ ఉగ్రవాదులేనని తెలిపారు. పాక్‌లో ఉగ్రవాదులు కదలికలు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై అమీన్ మాలిక్ అనే మహిళ కోర్టును ఆశ్రయించారు. ‘2017లో సుప్రీం కోర్టు షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. అయినా ముంబై దాడులో పాక్ ప్రమేయం ఉందని మాట్లాడి షరీఫ్ దేశద్రోహానికి పాల్పడ్డాడ’ని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన లాహోర్ హైకోర్టు ఈ కేసులో డాన్ జర్నలిస్టు సిరిల్ ఆల్మైడాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కానీ అతడు కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 8న అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పంజాబ్ డీఐజీని ఆదేశించింది. షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంపై కూడా ఆయన న్యాయవాది నాసిర్ భుట్టోను ప్రశ్నించింది. దీనికి నాసిర్ ఆయన తదుపరి వాయిదాకు హాజరవుతారని తెలిపారు. భార్య చనిపోవడం వల్ల ఆయన బాధలో ఉన్నట్టు వివరించారు. అక్రమాస్తులు కేసులో శిక్షలు అనుభవిస్తున్న షరీఫ్‌తోపాటు, ఆయన కుటుంబసభ్యులకు విధించిన జైలు శిక్ష రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
ఈ కేసుల వెనుక మతోన్మాద మాఫియా..
పంజగుట్ట: ప్రజలను మతం, మూఢనమ్మకాల పేరుతో దగాచేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న బాగు గోగినేనిపై దేశద్రోహం కేసు పెట్టడం హేతువాద గొంతుకని నొక్కడమేనని పలువురు హేతువాదులు విమర్శించారు. ఆయనపై చేసిన ఆరోపణలు, బనాయించిన కేసులు ఏవీ చట్టంముందు నిలబడే స్థాయిలో లేవన్నారు. బాబు గోగినేని ‘బిగ్‌బాస్–2’ లో ఉన్నందున అతను ఎవ్వరికీ అందుబాటులో లేడని, అతను బయటకు వచ్చాక కేసుకు పూర్తిగా సహకరిస్తారని, అతనిపై అన్ని నిరాధార ఆరోపణలు చేశారని రుజువు చేస్తారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి మాదివాడ రామబ్రహ్మం, వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్‌రెడ్డి, నటుడు కత్తి మహేష్, న్యాయవాదులు గాంధీ, జువ్వూరి సుధీర్ మాట్లాడారు. వీరనారాయణ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా బాబుపై కేసు వేశారని, కోర్టు ఆదేశాలతో మాదాపూర్ పోలీసులు అతనిపై రాజద్రోహం, దేశద్రోహం, నమ్మకద్రోహం, మోసం, మతాల మధ్య వ్యతిరేకతను రెచ్చగొట్టడం లాంటి కేసులు బనాయించారన్నారు. సీఆర్పీసీ 41 ప్రకారం నేరం మోపబడిన వ్యక్తి వివరణ తీసుకుని నేరం జరిగిందని తేలితేనే కేసు నమోదు చేయాలన్నారు. ఈ కేసుల వెనుక మతోన్మాద వ్యాపార మాఫియా ఉందన్నారు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక బాబు పోలీసులకు పూర్తిగా సహకరించి కేసు నుంచి బయటపడతారని తెలిపారు. -
విజయ్ మాల్యాకు బెయిల్ పొడిగింపు
లండన్: దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు యూకే న్యాయస్థానం బెయిల్‌ను పొడిగించింది. ఏప్రిల్ 2 వరకు తాజా బెయిల్ పొడిగింపు వర్తిస్తుందని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈ కేసులో చివరి వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ డిఫెన్స్ లాయరు.. భారత ప్రభుత్వం కేసును కొట్టేయాలని డిమాండ్ చేయటంతో ఎటూ తేలకుండానే కేసు వాయిదా పడింది. భారత ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యాధారాలు అంగీకారయోగ్యంగా లేవంటూ మాల్యా తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసు తర్వాతి విచారణ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టం కాకపోయినా మూడు వారాల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 2017లో దేశద్రోహం కేసులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
సర్కార్‌ను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులా?
ఎమర్జెన్సీలోనూ ఇలాంటి పరిస్థితి లేదు: విమలక్క హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న గొంతులను అణగదొక్కేందుకే వారిపై రాజద్రోహం కేసులను బనాయిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. నాటి సీమాంధ్ర పాలకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే నేటి తెలంగాణ పాలకులు ప్రజాసంఘాల నాయకుల్ని, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ ‘పౌర హక్కుల ప్రజా సంఘం’(పీయూసీఎల్) రాష్ట్ర 17వ మహాసభలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో పాటలతో ఉర్రూతలూగించిన అమర్, రాజేందర్‌లపై దేశద్రోహపు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఎమర్జెన్సీ, చీకటి రోజుల్లో కూడా ప్రజాసంఘాల కార్యాలయాల్ని మూసివేయలేదని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అరుణోదయ కార్యాలయం మూసివేతను నిరసిస్తూ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులతో కుట్రపన్ని మోడీ నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల, బీసీ ఉద్యమనేత సాంబశివరావు, ప్రొఫెసర్ చక్రధరరావు, కె.ప్రతాప్‌రెడ్డి, నజీర్‌ఖాన్, జ్యోతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ గిలానీని విడుదల చేయాలి
దేశద్రోహం అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీని విడుదల చేయాలని డీయూ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. గిలానీపై దేశద్రోహం అభియోగాన్ని మోపి చట్టాన్ని దుర్వినియోగపరచారని ఆరోపించింది. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్లో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో మాట్లాడినందుకు గిలానీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తక్షణం ఆయన్ని విడుదల చేసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని డీయూ ఉపాధ్యాయసంఘం కోరింది. ఇటువంటి వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేసింది. దేశద్రోహ చట్టం ప్రయోగించడానికి సంబంధించి పరిమితులను సుప్రీం కోర్టు స్పష్టంగా వెల్లడించిందని, శాంతియుత వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తి తన అభిప్రాయాలను వెల్లడిస్తే అటువంటి సందర్భాల్లో దేశద్రోహ చట్టం ప్రయోగించరాదని స్పష్టం చేసినట్లు తెలిపింది. -
స్మృతి.. తప్పుకోవాలి
కన్హయ్య డిమాండ్.. ఢిల్లీలో జేఎన్‌యూ భారీ ర్యాలీ న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్‌ల విడుదల కోరుతూ.. జేఎన్‌యూ విద్యార్థులు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జంతర్‌మంతర్ వద్ద సభను ఏర్పాటు చేశారు. ‘విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలి. మీవి మొసలి కన్నీళ్లు, మీ నవ్వు, ఏడుపు అన్నీ అబద్ధాలే’ అని ఈ సందర్భంగా కన్హయ్య అన్నారు. కాగా, వేదిక సమీపంలో నలుగురు యువకులు కన్హయ్యపై దాడికి ప్రయత్నించగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. కాగా, రాజద్రోహం కేసులో బెయిల్‌పై వచ్చిన కన్హయ్య.. నిబంధలనకు విరుద్ధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన బెయిల్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ కేసును విచారించనుంది. కాగా, దేశ వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్‌యూ నుంచి కన్హయ్య, ఖాలిద్, అనిర్బన్‌తోపాటు 21మంది విద్యార్థులను బహిష్కరించటంపై వారినుంచి సమాధానం వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని యూనివర్సిటీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ తేల్చింది. ఖాలిద్, అనిర్బన్ వర్సిటీలో సామరస్య వాతావరణం చెడిపోయేందుకు కారణమయ్యారని స్పష్టం చేసింది. అయితే.. నోటీసులందుకున్న విద్యార్థులందరూ చర్చించాకే.. నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని విద్యార్థులు తెలిపారు. మరోవైపు, రాజద్రోహం కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఖాలిద్, అనిర్బన్ పెట్టుకున్న పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ కోర్టు విచారించనుంది. ఈ ఇద్దరి జ్యుడీషియల్ రిమాండును మార్చి 29 వరకు పొడిగించింది. -
రాజకీయాలదే రాజద్రోహం!
జాతీయతపై చర్చ జరగాలన్న జేఎన్‌యూ ‘రోహిత్ కా జేఎన్‌యూ’ అంటూ వెలిసిన పోస్టర్లు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి.. తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్ కోసం ఎదురుచూస్తున్నామని ‘రోహిత్ కా జేఎన్‌యూ’, ‘జస్టిస్ ఫర్ రోహిత్’ పేరుతో వర్సిటీలో పోస్టర్లు వెలిశాయి. తీహార్ జైలునుంచి కన్హయ్య విడుదలై వర్సిటీకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యార్థులు, ప్రొఫెసర్లు కోరుతున్నట్లు వాటిలో ఉంది. ‘దేశంలో, వర్సిటీల్లో రాజద్రోహం గురించి కాదు.. రాజకీయాలే రాజద్రోహంగా తయారయ్యాయనే అంశంపై చర్చించాలి. భావప్రకటనను వ్యక్తీకరించినందుకు విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇప్పుడు జాతీయతపై చర్చ జరగాలి’ అని జేఎన్‌యూఎస్‌యూ వైస్ ప్రెసిడెంట్ షెహ్లా రషీద్ షోరా తెలిపారు. రాజద్రోహం కేసులో జైలుపాలైన తోటి విద్యార్థులకు మద్దతుగా సందేశాలిచ్చేందుకు.. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద పెద్ద గోడను నిర్మించే పనిలో ఉన్నారు. కాగా కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఫిబ్రవరి 24న జరిగిన విచారణలో కన్హయ్య లాయర్లు ఇచ్చిన వివరణపై జడ్జి విభేదించటంతో.. కేసు 29కి వాయిదా పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. జేఎన్‌యూ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ విపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అఫ్జల్‌గురు ఉరితీతపై జరుగుతున్న వివాదంతో జేఎన్యూకు ఎలాంటి నష్టమూ జరగదని.. వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మేధావుల మద్దతుందని.. చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. అప్రజాస్వామిక నియంత పాలన తప్ప.. మేధావుల ఆలోచనను ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో విభజన సృష్టించేందుకు కేంద్రం మద్దతు తెలుపుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. అయితే.. దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కఠినచర్యలు తప్పవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమది బలహీన ప్రభుత్వం కాదని.. జాతివ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కాగా, రాజద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు అశుతోష్‌ను ఢిల్లీలోని ఆర్కేపురం స్టేషన్ పోలీసులు ఆదివారం రెండుసార్లు ప్రశ్నించారు. ఖాలిద్, అనిర్బన్లతో కలిసి అశుతోష్‌ను కార్యక్రమ నిర్వహణపైనే ప్రశ్నించారు. -
భారతీయ శిక్షా స్మృతిని సమీక్షించాలి
21వ శతాబ్దంలో మార్పులు తప్పనిసరి: ప్రణబ్ కొచ్చి: 21వ శతాబ్దంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతీయ శిక్ష్మా స్మృతి (ఐపీసీ) లో మార్పులు తీసుకురావాలని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. కొచ్చిలో ఐపీసీ 155వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం ముగింపు సభలో రాష్ట్రపతి పాల్గొన్నారు. మొదట రూపొందించిన జాబితాకు కొన్ని నేరాలను మాత్రమే చేర్చారన్నారు. జేఎన్‌యూ విద్యార్థులపై రాజద్రోహం కేసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు కొట్టాయంలో సీఎంఎస్ కళాశాల రెండో శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి పోతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో దేశ సత్తా చాటేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర కృషి సలపాలని పిలుపునిచ్చారు. -
రాజద్రోహం కేసులో హార్దిక్ అరెస్టు
సూరత్: పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మొదట.. భారత-దక్షిణాఫ్రికాల మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన వన్డే సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమాన పరిచిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో రూ.10వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే.. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పటేళ్ల ఉద్యమంలో భాగంగా.. అక్టోబర్ 3న తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపండి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజద్రోహం కేసు పెట్టినట్టు సూరత్ డీసీపీ మార్కండ్ చౌహాన్ తెలిపారు. సాధారణంగా.. రాజద్రోహం కేసులో కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది.