![Former Karnataka CMs Siddaramaiah, Kumaraswamy booked for sedition case - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/30/karna.jpg.webp?itok=nyg_A-31)
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మల్లికార్జున అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు సిటీ కోర్టు వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. కుట్రపన్నడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం లేవనెత్తడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ డీసీపీ రాహుల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment