hd kumara swamy
-
కన్నడ రాజకీయంలో ట్విస్ట్.. కుమారస్వామికి ఝలక్!
శివాజీనగర: కర్ణాటకలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ. కుమారస్వామిని విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో, కన్నడ రాజకీయం హీటెక్కింది.గతంలో బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే చార్జ్‌షీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్చి సమర్పించారు. ఈ నేపథ్యంలో గరవ్నర్ అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో కేంద్రమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు.అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయనకు ఊరట దక్కింది. -
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కుమారస్వామికి నిరసన సెగ
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు. ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కాసేపట్లో కేంద్ర మంత్రులు సమీక్ష జరపనున్నారు. అయితే ఆ మీటింగ్‌కు కార్మిక సంఘాలను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని సంఘాల నేతలు చెబుతున్నారు. కాన్వాయ్‌లో ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలు సందర్శిస్తున్నారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరోకటి ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు దెబ్బ తిన్నాయి. ధ్వంసమైన కారులో ఒకటి మాజీ ఎంపీ జీవీఎల్‌కు చెందిన కారు ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టీల్ ప్లాంట్ అంశం.. మంత్రి కుమారస్వామికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పత్రం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వినతిపత్రం సమర్పించారు వైఎస్సార్సీపీ ఎంపీలు. పార్టీలు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి అయోధ్య రెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక. 20వేల మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. అప్పులను వాటాలుగా బదిలీ చేయాలి’ అని కామెంట్స్ చేశారు. Met Hon’ble Minister for Steel Shri H.D. Kumaraswamy Garu along with @YSRCParty MPs to urge reconsideration of Visakhapatnam Steel Plant’s privatization. Minister assured that VSP will remain a PSU and ₹15,000 crore will be pumped in for revival. RINL, a Navratna & Telugu pride,… pic.twitter.com/D9lalIywBR— Vijayasai Reddy V (@VSReddy_MP) December 2, 2024 -
కుమారస్వామి.. నీ రేటెంత?
దొడ్డబళ్లాపురం: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం చెన్నపట్టణలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జమీర్.. ఏయ్ కుమారస్వామి నీ రేటెంత అని హేళనగా మాట్లాడారు. కరియ (నలుపు వ్యక్తి) అని కుమారస్వామిని దూషించారు. కరియ కుమారస్వామి బీజేపీ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. -
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్‌మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్‌కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్‌భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్‌ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
కర్ణాటక పాలిటిక్స్‌లో ట్విస్ట్.. ఇప్పుడు కుమారస్వామి వంతు!
బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్‌భవన్‌కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్‌ఎస్‌వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్‌ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్‌భవన్‌కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్‌షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్‌భవన్‌కు నివేదిక వెళ్లింది. అయితే.. గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్నిరాని, జీ జనార్ధన్రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే.. కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కామ్‌లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
కర్ణాటకలో టెస్లా..? ‘నేను స్వార్థపరుడిని కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తాను స్వార్థపరుడిని కాదని, తన దృష్టి దేశ అభివృద్ధిపైనే ఉందని అన్నారు. తాను దృష్టి కేవలం సొంత రాష్ట్రం కర్ణాటకపైన లేదని, మొత్తం భారత్ దేశం అంతటా అభివృద్ది చెందాలని ఉన్నట్లు తెలిపారు. ఆయన భారీ పరిశ్రమల శాఖమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో తన ఫ్యాక్టరీ పెట్టాలని ఆసక్తి చూపుతుందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించారు. ‘‘ టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా ప్రాధ్యాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అభివృద్ధి. దాని ప్రకారమే పని చేస్తాం. నేను అంత స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని హెచ్డీ కుమార స్వామి అన్నారు.నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా టెస్లా సీఈఓ ఇలాన్ మాస్క్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఇక.. బీజేపీ కూటమిలో భాగంగా కుమార స్వామి జేడీఎస్ పార్టీ రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి కేంద్రమంతి పదవి దక్కించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్డీయే కూటమి పార్టీలు 28 స్థానాలకు గాను 19 సీట్లతో విజయం సాధించాయి. -
ప్రజ్వల్ భారత్‌కు వచ్చి లొంగిపో: బాబాయ్ విజ్ఞప్తి
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా అసభ్య వీడియో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అయితే ఆదివారం ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో బాబాయ్ అయిన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి స్పందించారు. విదేశంలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే ఇండియాకు రావాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసులో సిట్ ముందు దర్యాప్తు ఎదుర్కొవాలన్నారు. లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు.‘‘మీడియా ముఖంగా నేను ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా. అతను ఏ దేశంలో ఉన్నా భయం లేకూడా భారత్ తిరిగి రావాలి. ఇంకా ఎంత కాలం ఇలా దాచుకొని తిరుగుతూ ఉంటావు?. ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. ...రెండు రోజుల్లో ప్రజ్వల్ పోలీసులకు లొంగిపోవాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు. దయచేసి ఇండియాకి తిరిగి వచ్చి అధికారులు ముందు హాజరుకావాలి. అప్పడే ఈ విషయంలో ఓ ముగింపు వస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులకు నేను బహిరంగా క్షమాపణలు చేబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను’’ అని కుమారస్వామి అన్నారు. ఇక.. అధికార కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిందని, కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. -
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.దేవరాజ్ గౌడ్‌పైనా లైంగిక దాడి కేసుఇక ప్రజ్వల్ ఎపిసోడ్లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్ దేవరాజ్ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది. హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .ప్రజ్వల్ సెక్స్ వీడియో క్లిప్‌ల పెన్ డ్రైవ్‌లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది. -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ గ్యారెంటీ అమలు కావడం లేదు
-
BJP Alliance: బీజేపీతో జట్టు ఖరారు!
ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్(సెక్యులర్) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది. బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్‌సభ పోటీకి గానూ జేడీఎస్ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ-జేడీఎస్ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు. ఈ క్రమంలో.. మాండ్యా, హసన్, తుమకురు, చిక్‌బళ్లాపుర్, బెంగళూరు రూరల్ సీట్లను జేడీఎస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది. ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య -
పొలిటికల్ భేటీలు.. బిగ్ షాకిచ్చిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan." On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw — ANI (@ANI) July 17, 2023 మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు -
అప్పుడు ఉచితమని.. ఇప్పుడు షరతులా?
కర్ణాటక: అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 గ్యారంటీ పథకాలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ కూడా విద్యుత్ బిల్లు చెల్లించవద్దని, మహిళలు టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం ఆయన జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్యారంటీ పథకాలు ఉచితమని ఎన్నికల సమయంలో చెప్పిన సిద్దూ..ఇప్పుడు ఆ పథకాలకు షరతులు పెట్టాలనడం ప్రజలను మోసగించడమేనన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏ భవనం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా రాష్ట్రపతి గాని, గవర్నర్‌ను గాని ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. చత్తీస్ఘడ్ విధానసభ శంకుస్థాపనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు గాని, గవర్నర్‌ను ఆహ్వానించ లేదన్నారు. పార్లమెంట్ నూతన భవనం ఉద్ఘాటన కార్యక్రమానికి జేడీఎస్ మద్దతు ఇస్తోందని, కార్యక్రమానికి దేవెగౌడ హాజరవుతారన్నారు. కాగా రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడిగా సీఎం ఇబ్రహీం, రాష్ట్ర జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్లుగా ఇద్దరూ కొనసాగుతారని, వారి రాజీనామాలు అంగీకరించేదిలేదన్నారు. -
కర్ణాటక ఫలితాలు..మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్యం
దొడ్డబళ్లాపురం: నా నిరీక్షణ ఫలించలేదు..మీడియా వారి నిరీక్షణ ఫలించింది అంటూ మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్య వ్యాఖ్యలు చేసారు. గురువారం చెన్నపట్టణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇలాంటి ఫలితాలు తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. దేవె గౌడ రెండుసార్లు ఓటమిపాలయ్యాక కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసారు. రాబో వు రోజుల్లో ప్రజలు జేడీఎస్‌ను కోరుకుంటారన్నారు. -
ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటా
దొడ్డబళ్లాపురం:ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాను ఇంట్లో కూర్చునే రకం కాదని, ప్రజలకు అందుబాటులో ఉంటానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. గురువారం చెన్నపట్టణలో మాట్లాడిన నిఖిల్ ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు గెలవాలన్నారు. ఈరోజు తాను ఓటమిపాలైనా ఏదో ఒకరోజు గెలిచితీరుతానని, అప్పటి వరకూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అయినా చెన్నపట్టణలో కుమారస్వామిని గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. రామనగరలో తనకు 76 వేల ఓట్లు వచ్చాయని, తాను టెక్నికల్‌గా ఓడిపోయినా అంతమంది జనం తనతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు రాత్రికి రాత్రి అమాయక ప్రజలకు కూపన్ ఓచర్లు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారన్నారు. తన కుటుంబం అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలకు సేవలందిస్తాం అన్నారు. -
‘కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్.. మూడు నెలల్లో అనేక మార్పులుంటాయ్’
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు రామనగరలో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండదని, మూడు నెలల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. త్వరలో తాలూకా,జిల్లా పంచాయతీల ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయని, ఈ ఓటమి వల్ల పార్టీకి ఢోకా ఏమీ లేదని, ఇలాంటి పరాజయాలు తమకు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదన్నారు. ప్రకటించిన పథకాలకు ఏడాదికి కనీసం రూ. 70 వేల కోట్లు అవసరమని, అన్ని నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బేరసారాలు ఆడుతోందని ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయొద్దని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించారని మండిపడ్డారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సిద్ధరామయ్య కూడా ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: సిగ్నల్ జంప్! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య ఓ లేఖ రాశారని వస్తున్న వార్తలపై కూడా కుమారస్వామి స్పందించారు. ‘సిద్ధరామయ్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ ఎమ్మెల్యేలకు తాను లేఖ రాయలేదని చెప్పారు. కానీ ఇప్పటికే ఆ లేఖను సిద్ధరామయ్య ట్విటర్లోనూ పోస్ట్ చేరు. నిన్న లేఖ రాశానని చెప్పిన సిద్ధరామయ్య నేడు రాయలేదని అంటున్నారు. తన మాటలను ఆయనే కొట్టిపారేస్తున్నారు. ఈ తీరు ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది’ అని మండిపడ్డారు. #WATCH | I have voted for Congress because I love it: K Srinivasa Gowda, Karnataka JD(S) leader on Rajya Sabha elections pic.twitter.com/oMSkdlYSuQ — ANI (@ANI) June 10, 2022 -
పొలం బాట పట్టిన మాజీ సీఎం
దొడ్డబళ్లాపురం: మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి లాక్డౌన్ సమయంలో వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. చదవండి : మణిపూర్ గవర్నర్‌గా గణేశన్ -
విమర్శలు చేసేందుకు చనిపోయిన నా భర్త పేరెందుకు?
సాక్షి, బెంగళూరు: నటి, ఎంపీ సుమలత అంబరీష్, జేడీఎస్ నేత కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్ ద్వారా కుమార స్వామి, ఇతర జేడీఎస్ నేతలు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం యెడియూరప్ప, గనుల మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై విమర్శలు చేసేందుకు చనిపోయిన తన భర్త అంబరీష్ పేరును తరచూ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ఆయనకు వ్యక్తిత్వమే లేదు దొడ్డబళ్లాపురం: కుమారస్వామి ఏనాడో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని, కొత్తగా సుమలతపై చేసిన వ్యాఖ్యల వల్ల పోగొట్టుకుంది కాదని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ అన్నారు. శుక్రవారం రామనగర శివారులో మీడియాతో మాట్లాడిన ఆయన కేఆర్ఎస్ డ్యామ్ పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇదే విషయాన్ని సుమలత చెప్పి ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. -
పులి ముందు ఎలుకలా నిల్చున్నది ఎవరు?
సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు. కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు. అదే విధంగా కేఆర్ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్ ఫ్యాన్స్ కుమార- అంబి పాత ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. -
కాంగ్రెస్‌పై కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మరోపేరు కాంగ్రెస్ పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. విపక్ష సభ్యులను కొనుగులు ద్వారా అనేక సందర్భాల్లో ఆ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడ్డారు. కాగా రాజస్తాన్‌లో గవర్నర్ వ్యవహర తీరుకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ‘సేవ్ డెమోక్రసి’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. దీనిపై కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. (టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు) ఒకప్పుడు ప్రభుత్వాలను కూల్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించడం హాస్యాస్పంగా ఉందని కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలకు పదవుల ద్వారా వలవేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎమ్ కృష్ణ నాయకత్వంలో ఆ పార్టీ చేసిన అరాచకాలు ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశామని విమర్శించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను రాజ్యసభకు నామినేట్ చేయడంలో కాంగ్రెస్ చేసిన సాయం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. -
ఇది హృదయం లేని ప్రభుత్వం: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు : గృహహింసతో బాధలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వసతి సౌకర్యం కల్పించిన సంత్వాన కేంద్రాలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని జనతాదళ్ సెక్యూలర్ పార్టీ (జేడీఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. దీనిపై ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంత్వాన కేంద్రాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యాడియూరప్ప తీసుకున్న నిర్ణయం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ట్వీట్లో ‘‘లాక్డౌన్లో మహిళలపై దాడుల కేసులు పెరుగుతున్నప్పటికీ.. వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చిన రక్షణ కేంద్రాలను రద్దు చేయబోతున్నారు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. (కుమార కాషాయ రాగం) How ironic! The government has opened take away alcohol shops but shuts down Santhwana centres. Giving the bottle to the man while shutting down the care centres for victims of domestic violence. So very thoughtful! 1/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 ఇక ‘‘రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. కానీ గృహ హింస బాధిత మహిళలను సంరక్షించిన సంత్వాన కేంద్రాలు మూసివేయబడుతున్నాయి’’ అని వరుస ట్వీట్లో ఎద్దేవా చేశారు. ‘‘ఓ వైపు పురుషుల చేతికి మద్యం సిసాలు అందిస్తూ.. మరోవైపు బాధిత మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలను మూసివేస్తానడం విడ్డూరంగా ఉంది’’ అన్నారు. ‘‘రెండు దశాబ్ధాలుగా గృహహింసతో తీవ్ర ఒత్తిడికి గురైన రాష్ట్ర స్థాయి మహిళలకు సహాయం అందించడంమే కాకుండా.. జిల్లా స్థాయిలోని మహిళలు, పిల్లలకు సంరక్షణ ఇవ్వడంలో సంత్వాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి రక్షణ కేంద్రాలను ఖచ్చితంగా హృదయం లేని ప్రభుత్వమే మూసివేస్తుంది’’ అంటూ ఆయన విమర్శించారు. Government's decision to shut down Santhwana Centres across the state is unbelievably stupid. Even as the cases of atrocities increase during lock down, an important redressal system is being abolished. 2/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 -
ఆ పెళ్లిలో భౌతిక దూరం మాయం
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్‌లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్‌గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. -
సిద్ధరామయ్య, కుమారస్వామిలపై దేశద్రోహం కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మల్లికార్జున అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు సిటీ కోర్టు వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. కుట్రపన్నడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం లేవనెత్తడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ డీసీపీ రాహుల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
కుమార కాషాయ రాగం
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బీజేపీకి అనుకూలంగా కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆయన కాషాయ పార్టీకి అనుకూలంగా గళం సవరించుకున్నారు. రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూలిపోయే అవకాశమే లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి తమ పార్టీ మద్దతునిస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అందుకోసమేనా. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్లు డీకే శివకుమార్, పరమేశ్వర్ వంటివారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండడం, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కుమారస్వామి ఈ ఎత్తుగడను వేస్తున్నట్లు చర్చ సాగుతోంది. జేడీఎస్‌లోని పది నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, అధికార పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పావులు కదిపారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తే తమ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఆగిపోతారనే ఉద్ధేశంతోనే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కుమారస్వామి ప్రకటన సీఎం యడియూరప్పకు ఊరట కలిగించి ఉంటుంది. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న యడ్డి డిసెంబరులో జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరాల్సిందే. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి బహిరంగంగా ప్రకటించడం యడియూరప్పకు ప్రయోజనం కలిగించే అంశమే. బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలను కుమార యూ– టర్న్ నీరుగార్చింది. -
నా తొలి శత్రువు సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు. బీజేపీ కాదు’అని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించారు. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్‌లాగా పనిచేశానని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని, కలెక్టర్లు సహా అందరి బదిలీలు వారు చెప్పినట్లే చేశానని తెలిపారు. సాయంత్రానికి మాట మార్పు.. ఈ వ్యాఖ్యల అనంతరం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని తెలిపారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’
బెంగళూరు: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్స్‌ని బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ట్రబుల్షూటర్ డీకే శివకుమార్ తొలిసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం కూడా విశ్వాసపరీక్ష పూర్తయ్యేలా కనిపించకపోవడంతో శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘నేను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచిన నా మిత్రులు.. రేపు బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తారు. ఏదో ఓ రోజు మనమంతా చావాల్సిన వాళ్లమే కదా. మధ్యలో వచ్చే ఈ టెన్షన్స్ను తట్టుకోవడానికి మహా అయితే రాత్రికి రెండు పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. ఇంకేం చేస్తాను’ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు శివకుమార్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా నన్ను కోరారు. దాంతో నేను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను, మరి కొందరితో కలిసి ముంబై వెళ్లాను. రెబెల్ ఎమ్మెల్యేలున్న హోటల్లోనే ఓ గది బుక్ చేశాను. కానీ నన్ను హోటల్లోకి అనుమతించలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఆదరాబాదరా ముంబై వెళ్లాను. కానీ ఎమ్మెల్యేలు నన్ను కలవలేదు. పైగా వారంతా నా మీద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా చూసి నేను షాక్ అయ్యాను’ అన్నారు. ‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లో కూర్చోవడం చూశాను. అప్పుడే అక్కడికి వెళ్లి వారి రాజీనామాలను చింపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేకపోయాను’ అని వాపోయారు శివకుమార్. అయితే ఏదేమైనా ఇవాళ బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకల్లా చర్చ ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమార స్వామి తన ఛాంబర్‌లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ వెల్లడించారు. -
ఒక్కరోజు ఆగితే తిరుగులేదు
కర్ణాటక,శివాజీనగర: బల పరీక్ష నిరూపణ ప్రక్రియను మంగళవారం కూడా వాయిదా పడేటట్లు చూసుకోవాలి, బుధవారం నుంచి అదృష్టమే మారిపోతుంది అని జ్యోతిష్యులు ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి సూచించినట్లు వదంతులు విహరించాయి. జ్యోతిష్యుల సలహా ప్రకారమే కుమారస్వామి విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని సమాచారం. ఆయన జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతారన్నది తెలిసిందే. మంగళవారం కూడా బలపరీక్ష జరగకుండా ఉంటే, బుధవారం నుంచి గ్రహబలం అనుకూలిస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పదేపదే స్పీకర్‌ను కలిసి వాయిదాకు గడువు కోరడంతో పాటు గవర్నర్ ఆదేశాలనూ పక్కనపెడుతూ వచ్చారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్‌ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప -
‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు’
బెంగళూరు: తననేవరూ కిడ్నాప్ చేయలేదు అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగా విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను కిడ్నాప్ అయ్యానంటూ వస్తోన్న వార్తలపై శ్రీమంత్ పాటిల్ స్పందించారు. ‘వ్యక్తిగత పని మీద ముంబై వెళ్లిను. బాగా అలసి పోయాను. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాను. అంతే తప్ప నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు’ అంటూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీమంత్ పాటిల్. ఇదిలా ఉండగా పాటిల్‌ను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారని.. ఆయన వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సావధి ఉన్నారని డి.కె.శివకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయి అన్నారు శివకుమార్. -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్‌ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్‌ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్‌ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్‌డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్‌డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్‌తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్‌వాలా స్పీకర్‌ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్‌లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్‌ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్‌ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్‌విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్‌ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్‌తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్‌ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్‌కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్‌కుమార్‌తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్‌పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్‌నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్‌బేగ్‌లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్‌ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్‌ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్‌ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్‌కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సిద్దు!
కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. 13మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాతో కన్నడ డ్రామా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నిలబడుతుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణంలో మాత్రం లుకలుకలు బహిర్గతమయ్యాయి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కావాలనే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా ఒప్పుకోమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదనే సంకేతాలనిచ్చాయి. అయితే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేనప్పటికీ.. పిల్లి పోరు – పిల్లి పోరు కోతి తీర్చినట్లు.. కాంగ్రెస్–జేడీఎస్ విభేదాలను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చొంది. తాజా పరిణామాలను ఆ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టయినా పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదు. సిద్దరామయ్యే అంతా చేస్తున్నారా? అయితే ఉన్నపళంగా ప్రభుత్వం పడిపోయే అవకాశాల్లేవని.. ఒక్కొక్క ఇటుక రాలిపోతున్నట్లుగా కుమారస్వామి ప్రభుత్వం మెల్లిగా కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటైనప్పటినుంచీ సున్నితమైన బంధాలపైనే నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల వెనక మాజీ సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని జేడీఎస్ ఆరోపిస్తోంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్దు మద్దతుందని కుమారస్వామి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. సిద్దు ప్రోద్బలంతోనే వీరంతా రాజీనామాలకు పాల్పడ్డారంటున్నారు. ఆయన్ను సీఎం చేస్తేనే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామంటూ రెబల్ ఎమ్మెల్యేలు చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే దీనికి జేడీఎస్ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం లేదు. అయితే.. ఇదంతా మంగళవారం సభకు రానున్న స్పీకర్.. ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిద్దు అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ జై కొడితే.. జేడీఎస్ ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఆపరేషన్ ‘లోటస్’ పార్లమెంటు ఎన్నికల వరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ తాజా పరిణామాల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించింది. మరింత మంది సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే పరిస్థితులను ప్రోత్సహిస్తే.. కమలం పార్టీ గద్దెనెక్కేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇలా జరిగితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. విప్ ధిక్కరించారనే వివాదమూ ఉండదు. తద్వారా ఎలాంటి వివాదం లేకుండా బీజేపీ సర్కారు ఏర్పాటు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిగిలిన ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై బరిలో దింపి గెలిపించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుంటారు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది బలం ఉండాల్సిందే. ప్రస్తుత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ బలం 118. ఒకవేళ ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 105 (కాంగ్రెస్ 69, జేడీఎస్ 34, బీఎస్పీ 1, స్వతంత్రులు 1)కు చేరుతుంది. బీజేపీ సొంత బలం కూడా 105. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 (స్పీకర్‌ను మినహాయిస్తే). ఇది బీజేపీ, సంకీర్ణ సర్కారు మధ్య నువ్వా–నేనా అనే పరిస్థితి నెలకొంటుంది. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యేను లాక్కుంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చు. -
కన్నడ సంక్షోభం
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల బలం సంకీర్ణానికి ఉంది. తాజా రాజీనామా లను స్పీకర్ అంగీకరిస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ఆఫీస్‌లో రాజీనామా లేఖలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్ సింగ్‌తోపాటు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ గవర్నర్‌తోను కలిశాక మీడియాకు చెప్పారు. ‘ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే, ఆనంద్ సింగ్ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను. మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్‌లో ఇచ్చారు. ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ‘ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బెంగళూరుకు చేరుకోనున్నారు. ముంబై రిసార్టుకు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చార్టెర్డ్ విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి బయలుదేరారు. వీరంతా హోటల్లో బస చేసే అవకాశముందని సమాచారం. ‘ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో నాకు గానీ, మా పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతర్గత కుమ్ములాటలే కారణం: బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కమలదళం స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ఆరోపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మా ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్ ధీమా ఎమ్మెల్యేల రాజీనామా వార్తలపై సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య స్పందించారు. ‘మా ప్రభుత్వానికి ఢోకా లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘బంతి స్పీకర్ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ -
వారసులొచ్చారు..
సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్ స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది. -
‘సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నా’
బెంగళూరు : నా సొంత ఖర్చులతో త్వరలోనే అమెరికా వెళ్తున్నా అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంత సడెన్‌గా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం కుమారస్వామి పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేటితో ముగింపుకు చేరుకుంది. అయితే సీఎం పల్లె నిద్ర కార్యక్రమం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. పల్లెల్లో కూడా ఫైవ్‌స్టార్ హోటల్ అరెంజ్మెంట్స్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి త్వరలోనే తాను అమెరికా వెళ్తున్నాని.. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ఆదిచుంచునగరి మఠం శంకుస్థాపన నిమిత్తం త్వరలోనే న్యూ జెర్సీ వెళ్తున్నాను. ఇది అధికారిక పర్యటన కాదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్తున్నాన’ని తెలిపారు. ఇక తన పల్లె నిద్ర కార్యక్రమం గురించి విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ మధ్యే ఒక పాఠశాలలో బస చేసినప్పుడు అక్కడ ఓ మంచి వాక్యం నా కంట పడింది. అర్థంలేని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని పాఠశాల గోడల మీద రాసి ఉంది. అదే ఇక్కడ నేను పాటిస్తున్నాను’ అన్నారు. -
ఉద్యోగులపై కుమార స్వామి ఫైర్
బెంగళూరు/రాయచూరు రూరల్: తమ ఫిర్యాదుల ను ఇచ్చేందుకు రాయ్‌చూర్ జిల్లా యెర్మారస్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఉద్యోగులు సీఎం హెచ్డీ కుమార స్వామి వెళ్తున్న కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘గ్రామ వాస్తవ్య’కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి రాయ్‌చూర్‌కి వెళ్లారు. ‘మీరు నరేంద్ర మోదీకి ఓటు వేశారు. కానీ మీ పనులను నేను చేయాలనుకుంటున్నారు. నేను మీకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీపై లాఠీ చార్జ్ చేయాలా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి’అని వైటీపీఎస్ ఉద్యోగులపై కుమార స్వామి గట్టిగా అరిచారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అనంతరం కుమార స్వామి ఓ టీవీ చానల్లో మాట్లాడుతూ ‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల సమయం కావాలని కోరాను. అయినప్పటికీ వారు నేను వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో నేను సహనం కోల్పోయాను’అని తెలిపారు. ఒక వేళ ప్రధాన మంత్రి కాన్వాయ్‌ను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వం సహనంతో ఉంది. కానీ అసమర్థమైంది మాత్రం కాదు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు’అని పేర్కొన్నారు. గ్రామ వాస్తవ్య కార్యక్రమంలో భాగంగా సీఎం రాయ్‌చూర్ జిల్లా కరేగుడ్డలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో రాత్రి గడపనున్నారు. -
‘మోదీకి ఓటేసి.. నన్ను సాయం కోరతారేంటి’
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జనాలపై విరుచుకుపడ్డారు. లాఠీ చార్జీ చేయాలా అంటూ బెదిరింపులకు దిగారు. వివరాలు.. గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామి గ్రామాల్లో బస పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కుమారస్వామి రాయచూర్ నుంచి కర్రెగుడ్డ ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కొందరు జనాలు ఆయన బస్సును అడ్డగించి.. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. జనాల చర్యలతో అసహనానికి గురైన కుమారస్వామి వారి మీద మండిపడ్డారు. ‘మోదీకి ఓటేసి.. నన్ను సాయమడుగుతారేంటి’ అని ప్రశ్నించారు. ‘నేను మీకు మర్యాద ఇస్తున్నాను కాబట్టి ఇంత సేపు కామ్‌గా ఉన్నాను. దారి వదులుతారా లేక లాఠీ చార్జీ చేయాలా’ అంటూ కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఓ ఐదు నిమిషాల పాటు గందరగోళం నెలకొంది. ఈ లోపు పోలీసులు వచ్చి జనాలను చెదరగొట్టడంతో.. కుమారస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు కుమారస్వామి తీరు పట్ల మండిపడుతున్నాయి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి విచక్షణ మరిచి ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటంటూ విమర్శిస్తున్నాయి. -
కుమార స్వామి కడుపులోకి ‘గరళం’ ?
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ సీట్లు రాకపోవడంతో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచి ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుస్తీ పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నుంచి వస్తోన్న ఒత్తిడులకు సంకీర్ణ ప్రభుత్వం వణికిపోతోంది. సంకీర్ణ పక్షాల మధ్య సరైన సమన్వయం లేనందున తాను పదవి నుంచి తప్పుకుంటానని జేడీ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు ఏహెచ్ విశ్వనాథ్ మంగళవారం మీడియా ముఖంగా హెచ్చరించడం పరిస్థితి పరాకాష్టకు ప్రత్యక్ష ఉదాహరణ. విశ్వనాథను పార్టీ అధ్యక్షుడి స్థాయికి తీసుకొచ్చిందీ దేవెగౌడ కుటుంబమే అయినప్పటికీ పార్టీలో ఉన్న అసమ్మతివాదులు, పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం భావిస్తున్నవారు ఆయన్ని ఎగదోస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రామలింగారెడ్డి మంగళవారం నాడు సోషల్ మీడియాను ఆశ్రయించి తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు సంకీర్ణ ప్రభుత్వ నాయకత్వాన్ని విమర్శించారు. పార్టీ సీనియర్ సభ్యులను ఇలా పక్కన పెట్టడం సరికాదంటూ ఆయన పార్టీ నాయకత్వాన్ని కూడా హెచ్చరించారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కుమార స్వామిపై తీవ్ర ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నేతల ప్రకటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంత్రి వర్గంలో ఉన్న మూడు ఖాళీలను స్వతంత్య్ర అభ్యర్థుల ద్వారా భర్తీ చేసుకొని సంకీర్ణ ప్రభుత్వం బలాన్ని పెంచుకోవాలని కుమారస్వామి ఆలోచిస్తుంటే మంత్రి పదవుల కోసం ఇరు సంకీర్ణ పక్షాల నుంచి పోటీ పెరిగింది. గత జనవరి నెలలోనే కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుంటుండడం వల్ల తాను ముఖ్యమంత్రిలా కాకుండా ఓ గుమాస్తాలా పనిచేయాల్సి వస్తోందని అన్నారు. అన్న తర్వాత ఆయన తన మాటలను మీడియా వక్రీకరించిందంటూ సర్దుకున్నారు. మళ్లీ తన పరిస్థితి గరళం మింగిన శివుడిలా ఉందని అన్నారు. అప్పట్లోనే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న వార్తలు వచ్చాయి. అది నిజం కాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సంకీర్ణ పక్షాలకు ఓటమి ఎదురవడంతో మళ్లీ ప్రభుత్వం నైరాశ్యంలో పడిపోయింది. ప్రభుత్వ మనుగడను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోక పోవడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది. ముందుగా దాన్ని పట్టించుకుంటే నాలుగు రోజులపాటు ప్రభుత్వం పడకుండా ఉంటుంది. లేకపోతే కుమార స్వామి గొంతులోని ‘గరళం’ కడుపులోకి పోతుంది. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్‌ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్‌ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా ఎంపీ, మనవడు ప్రజ్వల్ ప్రకటన సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ సంచలన ప్రకటన చేశారు. హసన్ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు. -
కర్ణాటక సంకీర్ణంలో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏడాది ముచ్చటే కానుందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను ప్రారంభించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్లు మొత్తం 28 లోక్‌సభ సీట్లలో బీజేపీ 18 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్(77), జేడీఎస్(37) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో 111 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. సొంత గూటిలో అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కని అసమ్మతి నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారేసరికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇందుకు తగ్గట్లు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. కేపీసీసీ చీఫ్ గుండూరావు ఫ్లాప్ షో అనీ, సిద్దరామయ్య ఓ మూర్ఖుడనీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ బఫూన్ అని ఆ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ విరుచుకుపడ్డారు. వీరివల్ల కర్ణాటకలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సుధాకర్ స్పందిస్తూ ఈవీఎంలపై పార్టీ హైకమాండ్ పోరాటాన్నే తప్పుపట్టారు. కర్ణాటకలో సంకీర్ణ కూటమి బీటలు వారుతోందని చెప్పేందుకు ఇవన్నీ సాక్ష్యాలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రమేశ్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కమల’.. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ ‘ఆపరేషన్ కమల’లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైన రమేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తనతో పాటు మహేశ్ కుమతిహళ్లి, భీమా నాయక్, జేఎన్ గణేశ్ సహా 22 మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన షాకు వివరించినట్లు సమాచారం. గెలిచినఎంపీలతో మే 24న సమావేశం కావాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మా ప్రభుత్వమే కొనసాగుతుంది: సీఎం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనల్ని సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. తన ప్రభుత్వం మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
మీడియాను బహిష్కరిస్తున్నా: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై అలిగారు. మీడియాను తాను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కుమారస్వామి ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం బయటకురాగానే కుమారస్వామిని చుట్టుముట్టిన మీడియా, సమావేశంలో ఏం చర్చించారని ప్రశ్నించింది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన కుమారస్వామి..‘మీరంతా(మీడియా) వార్తల కోసం ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయండి. ఇష్టమొచ్చినట్లు రాసుకోండి. ఎంజాయ్ చేయండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. తన కుమారుడు నిఖిల్, సినీనటి సుమలత బరిలో ఉన్న మాండ్యలో మీడియా సుమలతకే ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎం అలకబూనినట్లు్ల తెలుస్తోంది. -
మోదీ ఛాయ్ అమ్మి పార్టీకి నిధులు సేకరించారా..?
హుబ్లీ : కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఓటు బ్యాంక్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వేసిన సెటైర్లపై కర్నాటక సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి స్పందించారు. తాను దేశభక్తుడిని కాదని ప్రధాని మోదీ చెబుతున్నారని, దేశభక్తి గురించి తాను మోదీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉండగా కశ్మీర్లో ఒక్క పేలుడు ఘటన చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. అది తమ వారసత్వమని, తనపై ముద్ర వేసే హక్కు ప్రధాని మోదీకి లేదని కుమారస్వామి పేర్కొన్నారు. బీజేపీ తన మేనిఫెస్టోలో అవినీతిరహిత పాలన అందిస్తామని పేర్కొందని మరి మోదీ దేశమంతటా తిరిగి టీ అమ్మి బీజేపీని సంపన్న పార్టీగా చేశారా అని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత సర్కార్ అని ఆయన చెప్పుకోవడం బూటకమని వ్యాఖ్యానించారు. కర్వార్‌లో ఓ బీజేపీ నేత నుంచి పట్టుబడ్డ రూ 78 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. -
కర్ణాటకలో కొనసాగుతున్న ఈసీ తనిఖీలు
బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. శివమొగ్గలో ప్రచార నిమిత్తం వచ్చిన సీఎం కుమారస్వామి హెలికాప్టర్లో ఎన్నికల స్క్వాడ్ క్షుణ్ణంగా తఖీలు చేసింది. అలాగే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప హెలికాప్టర్లో కూడా తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నెల 18న జరిగే తొలిదశంలో 14 స్ధానాలకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్లో కూడా ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిసింది. నవీన్ పట్నాయక్ సూట్ కేసును కూడా నిశితంగా పరిశీలించి..చివరికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది. -
నా కొడుకుపై పద్మవ్యూహం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి బరిలో ఉన్న తన కొడుకు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ తదితరులు కలిసి పద్మవ్యూహం పన్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. మహాభారత యుద్ధకాలంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేందుకు కౌరవులు పద్మవ్యూహం పన్నినట్లుగా ఈ ఎన్నికల్లో నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, ఇతరులు స్వతంత్ర అభ్యర్థి సుమలతతో కుమ్మక్కయ్యారన్నారు. ‘మాండ్యలో జరుగుతున్న పరిణామాలు చేయిదాటి పోయాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సుమలతకు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, రైతు సంఘాలు మద్దతిస్తున్నాయి. జేడీఎస్‌ను అణచివేయటానికి వీరంతా చేతులు కలిపారు’ అని శుక్రవారం ఆయన మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుమలత స్పందించారు. ‘అవును, కాంగ్రెస్ కార్యకర్తలు నావెంటే ఉన్నారు. నన్ను ఓడించటానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పద్మవ్యూహం పన్నారు’ అంటూ తిప్పికొట్టారు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు పాక్‌తో యుద్ధభయాన్ని ప్రధాని మోదీ కల్పిస్తారని రిటైర్డు సైనికాధికారి ఒకరు రెండేళ్ల క్రితమే తనతో చెప్పారని సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో సంక్షోభం సృష్టించి, ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు మోదీ ప్రయత్నిస్తారు’ అని రెండేళ్ల క్రితమే రిటైర్డ్ సైనికాధికారి ఒకరు తనతో చెప్పినట్లు వెల్లడించారు. -
రాజీనామా చేస్తే పది కోట్లు, మంత్రిపదవి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లుగా ఉన్న మరో ఆడియోటేపు తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక టేపును ఈ నెల 8న స్వయంగా సీఎం కుమారస్వామి విడుదల చేయడం తెలిసిందే. ఈ నెల 7న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ఆయన కుమారుడు శరణ గౌడలతో మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో టేపు తాజాగా జేడీఎస్ వర్గాల ద్వారా బయటకొచ్చింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తామే గెలిపించుకోవడంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా ఆ టేపులో ఉంది. నువ్వే మంత్రివి కావచ్చు.. టేపులో ఉన్న దాని ప్రకారం శరణగౌడతో యడ్యూరప్ప మాట్లాడుతూ ‘మొదటి మీ నాన్నతో రాజీనామాకు ఒప్పించు. ముంబై లోని హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్లు. సాయంత్రానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు అయ్యాక అందరు కలసి ఒకేసారి రాజీనామా చేయండి. ఆ వెంటనే మొదట మీ ఇంటికి రూ. 20 కోట్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నా కొడుకు బీవై విజయేంద్ర చూసుకుంటాడు. ఉప ఎన్నికల్లో నిన్ను గెలిపించి, మంత్రిని కూడా చేస్తాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీఎస్ పార్టీ ఎక్కడికిపోతుందో ఎవరికీ తెలియదు’ అని సూచించారు. శివనగౌడ మాట్లాడుతూ రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే దాన్ని అంగీకరించరేమో.. అని చెప్పబోతుండగా మళ్లీ యడ్యూరప్ప.. ‘దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవ సరం లేదు. సమావేశాలు ముగిసేలోగా రాజీనామాలను స్పీకర్ అంగీకరించి తీరాల్సిందే. అదం తా పెద్దలు చూసుకుంటారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ చూసుకుంటారు. నిన్ను మంత్రిని చేయడమే కాకుండా యాదగిరి జిల్లాకు ఇంచార్జిని కూడా చేస్తాం. రాజీనామాకు అంగీకరిస్తే సాయంత్రంలోగా రాయ చూరులోని మార్వాడిల నుంచి రూ. 20 కోట్లు అందిస్తాం’ అని చెబుతున్నట్లుగా ఉంది. -
కర్ణాటక సంకీర్ణంలో గుబులు
బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి మళ్లీ గుబులు మొదలైంది. విప్‌ను ధిక్కరించి 9 మంది కాంగ్రెస్ సభ్యులు బుధవారం అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. జనవరి 18న సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన నలుగురు ఇందులో ఉన్నారు. రిసార్ట్‌లో సహచర ఎమ్మెల్యేపై దాడిచేసి పరారైన జేఎన్ గణేశ్ ఈ 9 మందిలో ఉన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారును అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో 9 మంది సభ్యులు సభకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. అందులో నలుగురు సభ్యులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే వారు సిద్దరామయ్య నోటీసులకు స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. సంకీర్ణం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ వాజూబాయ్ వాలా ప్రసంగానికి అంతరాయం కలిగించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగంలో నేరుగా చివరి పేరా చదివి ముగించారు. -
రాజీనామాకు నేను సిద్ధమే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పందిస్తూ..ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని దినేశ్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అన్నారు. కుమారస్వామికి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు. -
కర్ణాటకలో రాజకీయ హైడ్రామా
-
కర్ణాటక హైడ్రామా.. కాంగ్రెస్, జేడీఎస్ ధీమా!
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తుంటే తమ సంకీర్ణ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు బుధవారం ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ తన ఎమ్మెల్యేలతో గురుగ్రామ్‌లోని రిసార్ట్స్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. కర్ణాటకలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నా జేడీఎస్, కాంగ్రెస్ నేతలు పరిస్థితి తమ అదుపులోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముంబై హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, వారు తిరిగివచ్చి తమతో కలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాను రిలాక్స్డ్గా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గురుగ్రామ్‌లోని రిసార్ట్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇక కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఇది చిన్న విషయమని దీనికి ఏమంత ప్రాధాన్యం లేదని జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత పోరు లేదని, ముంబై హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలందరితో తాను సంప్రదింపులు జరుపుతున్నానని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా, వరుసగా 79, 37 స్ధానాలు గెలుపొందిన కాంగ్రెస్, జేడీఎస్‌లు బీజేపీకి చెక్ పెట్టేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 18న సీఎల్పీ భేటీ కుమారస్వామి సర్కార్‌ను కూలదోసేందుకు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు సాగిస్తోందనే ప్రచారం నేపథ్యంలో తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ సంసిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ గూటికి చేరకుండా అడ్డుకునేందుకు ఈనెల 18న సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధ్యక్షతన ఈనెల 18న విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని సిద్ధరామయ్య కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. -
కర్ణాటకలో హైడ్రామా : అవిశ్వాసానికి బీజేపీ సంసిద్ధం
సాక్షి, బెంగళూర్: కన్నడ సీమలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 13 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగడుతూ కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కాగా, ముగ్గురు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలో ఓ హోటల్లో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని స్వయంగా కర్ణాటక మంత్రి శివకుమార్ ఆరోపించారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు సమాచారం ఇచ్చి ముంబై వెళ్లారని, వారితో తాను టచ్‌లో ఉన్నానని సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని హోటల్లో బీజేపీ నేతల సమక్షంలో ఉన్నారని కర్ణాటక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే బీజేపీ కుట్ర ఫలించదని ఆయన అన్నారు. రిసార్ట్ రాజకీయం.. కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు మరోసారి తెరలేచింది. బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురైదుగురు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస చేసిన వ్యాఖ్యలు కాషాయకూటమిలో కలకలం రేపాయి. మరోవైపు జేడీఎస్ సైతం తమ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చూస్తోందని ఆ పార్టీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ తమ శాసనసభ్యులను గురుగావ్‌లోని రిసార్ట్స్‌కు తరలించింది. కాగా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ దినేష్ గుండూరావ్ చెప్పారు. ముంబై హోటల్లో బస చేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీ గూటికి చేరుతారన్నారు. ఆరోపణలు అవాస్తవం : యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాషాయపార్టీ నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలోని సంకీక్ణ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన తమకు లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురుని ప్రలోభపెట్టేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
‘నా కుమారుడి సాక్షిగా రుణమాఫీ చేస్తాం’
సాక్షి బెంగళూరు: రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం భాగల్కోటె జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుల రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఉన్న ఒక్క కుమారుడు నిఖిల్ సాక్షిగా రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. తనకు ఒక్కడే కుమారుడని.. ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతానని భరోసా ఇచ్చారు. రుణమాఫీ విషయంలో ఎవరినీ మోసం చేయబోమని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి పంటలకు నికర ధరలు ఉంటాయన్నారు. మహారాష్ట్ర తరహాలో చేయాలని చెరకు రైతులు చెబుతున్నారు. మీరే (రైతులు) మహారాష్ట్ర వెళ్లి చూసిరావాలన్నారు. ఈమేరకు రెండు రోజుల క్రితం ఢిల్లీలో రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రానున్న రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీలకు అనుమతి కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రుణ విముక్తి పత్రాలు భాగల్కోటె – 96, బాదామి – 422, హునగుంద – 274, జమఖండి – 1,198, ముధోళ – 450, బీళగి – 356 కలిపి మొత్తం 2,796 మంది రైతులకు రుణ విముక్తి పత్రాలు అందజేశారు. -
అవి ఎన్కౌంటర్ ఆదేశాలే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు!’ అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి మంగళవారం నాడు ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్‌ను ఫోన్లో ఆదేశించడం వైరల్ అవడంతో తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సామాన్య పౌరుడిగా ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. జేడీఎస్ నాయకుడు ప్రకాష్‌ను ప్రత్యర్థులు చంపడం పట్ల కుమార స్వామి స్పందించిన తీరిది. నోరు జరాననో, ఉద్వేగంతో మాట్లాడానంటూ సర్దు కోవడానికి ప్రయత్నిస్తే సమసిపోయే విషయం కాదది. అధికారంలో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రతీకారాలకు బూటకపు ఎన్కౌంటర్లకు అలవాటైన రోజులివి. హతుడు ప్రకాష్ పార్టీకి విదేయుడని కుమార స్వామి చెబుతున్నారుగానీ, ఆయన పార్టీకంటే ఎక్కువగా కుమార స్వామి విధేయుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుమార స్వామి విజయం కోసమే ఎక్కువగా పార్టీలో ప్రచారం చేశారు. అంతటి వ్యక్తి చనిపోతే అంతగా ఆవేశం రావడం నిజమేగానీ, ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు’ అంటూ ప్రత్యేక అధికారాలిచ్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. కుమారస్వామి ఆదేశించిందీ లేదా వ్యాఖ్యానించిందీ పార్టీ నాయకులనో, కార్యకర్తలనుద్దేశించో కాదు, సాక్షాత్తు సీనియర్ పోలీసు అధికారిని ఉద్దేశించింది. దేశంలో 2005లో గుజరాత్లో జరిగిన ‘సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్’ కేసు నుంచి బూటకపు ఎన్కౌంటర్లకు అధికారిక ఆమోద ముద్ర లభించినట్లు ఉంది. భోపాల్ కారాగారం నుంచి పారిపోయారన్న కారణంగా 2016, అక్టోబర్ నెలలో ఎనిమిది మంది సిమీ కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదంటూ పౌరులకు నీతులు చెప్పే ప్రభుత్వాలకే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటయింది. చట్టం అంటే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారించడం, అందుకు సరైన ఆధారాలు చూపించడమే కాకుండా నిందితులకు తమను తాము సమర్థించుకునే హక్కు కూడా ఉండడం. ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పడుతుంది కనుక ప్రభుత్వాలు కూడా దొడ్డిదారి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాయి. -
కనికరం లేకుండా కాల్చి పారెయ్యండి: సీఎం
బెంగళూరు: జనతాదళ్(ఎస్) కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై దోషులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ సీఎం కుమారస్వామి పోలీసులను ఆదేశించడం వివాదాస్పదమైంది. జేడీఎస్‌కు చెందిన జిల్లా నేత హొణ్నలగెరె ప్రకాశ్ సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని మద్దూర్ వద్ద అడ్డుకున్నారు. కారులో ఉన్న ప్రకాశ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. దోషులు కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఉత్తర్వులిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఏదో కోపంలో అలా అన్నానే కానీ, ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదన్నారు. ప్రకాశ్ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ఈ ఘటనకు నిరసనగా జేడీఎస్ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. -
కర్ణాటక కేబినెట్ విస్తరణ
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వజూభాయివాలా 8 మంది కాంగ్రెస్ నేతల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పొత్తులో భాగంగా కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్ కు ఆరు, జేడీఎస్‌కు రెండు సీట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రమేశ్ జార్కిహొళితో పాటు కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగేందుకు అంగీకరించని స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను మంత్రి పదవుల నుంచి సంకీర్ణ ప్రభుత్వం తప్పించింది. కాంగ్రెస్ తరఫున సతీశ్ జార్కిహోళి, తుకారాం, పరమేశ్వర్ నాయక్, రహీంఖాన్, సీఎస్ శివళి, ఎంటీబీ నాగరాజు, ఆర్బీ తిమ్మాపుర(ఎమ్మెల్సీ), ఎంబీ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే తమ తరఫున మంత్రులను ఖరారు చేస్తామని జేడీఎస్ అంటోంది.. కుమారస్వామి కేబినెట్లో 34 ఖాళీల్లో జేడీఎస్‌కు 12, కాంగ్రెస్‌కు 22 స్థానాలు దక్కేలా ఒప్పందం కుదిరింది. తాజా విస్తరణ నేపథ్యంలో కర్ణాటకలో మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. మరోవైపు ఈసారి కూడా విస్తరణలో చోటుదక్కని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి, బీసీ పాటిల్ ఆందోళనకు దిగారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాజీ సీఎం సిద్దరామయ్య మాట తప్పారని కాంగ్రెస్ నేత బీకే సంగమేశ్ ఆరోపించారు. -
‘పెట్రో’ ధరను రూ.2 తగ్గించిన కర్ణాటక
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. కలబురిగిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తమ జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను 3.25, 3.27% చొప్పున తగ్గనుంది. ఇది ప్రస్తుతం 32%, 21 శాతంగా ఉంది’ అని వివరించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.80, డీజిల్ రూ.76.21గా ఉంది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు రూ.91 ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ.90కు చేరుకుంది. ముంబై మినహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర దేశంలోనే అత్యధికంగా రూ.91కి ఎగబాకింది. పెట్రోలు, డీజిల్‌లపై సర్‌చార్జితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39% వరకు వ్యాట్ వసూలు చేస్తోంది. -
బెంగళూరులోనే ఏరో షో
సాక్షి బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా షో బెంగళూరులోనే జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ షో వేదికను మార్చొద్దని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి 24వరకు బెంగళూరులో ఏరో షో జరగనుంది. ఈ షోను లక్నోలో నిర్వహించాలంటూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపై వివాదమవడం తెల్సిందే. గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచీ అందిన ఇలాంటి విజ్ఞాపనలను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. వైమానిక ప్రదర్శనను బెంగళూరులోనే నిర్వహించాలని కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఇదే వాదన వినిపించారు.ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1996 నుంచి రెండేళ్లకోసారి బెంగళూరులో జరుగుతున్న ఈ విమానాల పండుగలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ వైమానిక సంస్థలు పాల్గొంటాయి. -
ఏరియల్ సర్వేలో పత్రికా వీక్షణం
యశవంతపుర: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వరద బాధిత జిల్లాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే సమయంలో దినపత్రిక చదవడం విమర్శలకు తావిస్తోంది. విహంగ వీక్షణంలో పేపర్‌ను చూస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సీఎం వైఖరిపై విమర్శలు తప్పడం లేదు. మైసూరు నుంచి హిరియాపట్టణ వరకు సీఎం ఏరియల్ సర్వే చేశారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి, ఆ సమయంలో పేపర్లో తలదూర్చడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు బీజేపీ పనేనని, తనపై ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని కుమారస్వామి దుయ్యబట్టారు. -
అమ్మో.. సొంతింటిలో నిద్రపోవడమా?
సాక్షి, బెంగళూరు: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 170 కిలోమీటర్ల ప్రయాణం రోజూ చేయడమంటే మాటలా? కానీ నమ్మకం అలా చేయిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్డీ రేవణ్ణ జ్యోతిష్య నమ్మకాలతో రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజూ నియోజకవర్గం (హోళెనరసిపుర) నుంచి రాజధాని బెంగళూరుకు రానుపోను ప్రయాణాలు సాగిస్తున్నారు. బెంగళూరులోని బనశంకరి ఫేజ్–2లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లు కూడా ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్నన్నాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పారట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి ఏమంటున్నారు? మంత్రి రేవణ్ణకు ఇంత వరకు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప ఉన్న బంగ్లాలో రేవణ్ణ చేరాల్సి ఉంది. కానీ మహదేవప్ప మూడు నెలల గడువు కోరారు. రోజూ నియోజకవర్గం నుంచి బెంగళూరుకు రాకపోకలపై మంత్రి రేవణ్ణ స్పందిస్తూ.. ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తోంది’ అని చెప్పారు. బెంగళూరు– హోళెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే ప్రయాణం. ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అన్నారు. -
కావేరి బోర్డుపై న్యాయ పోరాటం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. -
రాహుల్‌తో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్ జేడీఎస్ నేత ధనిష్ అలీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్ మాత్రం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడితే సరిపోతుందని వాదిస్తోంది. కొత్త ప్రభుత్వ దశదిశను వెల్లడించేందుకు పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్ స్పష్టం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలుస్తానని సీఎం కుమారస్వామి సైతం గతంలో పేర్కొన్నారు. అయితే కొద్దినెలల కిందట సీఎంగా తాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో ప్రస్తుతం నూతన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం నిర్ధిష్ట ప్రాజెక్టులు, పథకాలు చేపట్టదలిస్తే అనుబంధ బడ్జెట్లో వాటిని పొందుపరచవచ్చని ఆయన కుమారస్వామికి సూచించారు. -
ఏడాది వరకు నేనే సీఎం
సాక్షి, బెంగళూరు: కనీసం సార్వత్రిక ఎన్నికలయ్యే వరకైనా తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటాననీ, అప్పటి వరకు తననెవరూ టచ్ చేయలేరని ఆ రాష్ట్ర సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా పనిచేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొనడం గమనార్హం. రుణమాఫీపై గందరగోళం వద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై చర్చ ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనీ, ముఖ్యమంత్రిగా కుమారస్వామి కొనసాగుతారని కాంగ్రెస్ చెబుతున్నా.. సీఎం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. జేడీఎస్–కాంగ్రెస్‌లు అధికారం చేపట్టినప్పటి నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఇరు పక్షాల నేతలు తీవ్రస్థాయిలో లాబీయింగ్‌లు చేశారు. చివరకు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ మద్దతు అవసరం కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే ప్రసక్తే ఉండబోదని పరిశీలకులు భావిస్తున్నారు. ముసాయిదా కమిటీ ఏర్పాటు జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చాల్సిన వివిధ హామీలను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను పరిశీలించి వాటిని ఎలా నెరవేర్చాలో నివేదిక ఇవ్వడమే ఈ ముసాయిదా కమిటీ విధి. -
చిచ్చుపెట్టిన కేబినెట్ కూర్పు
బెంగళూరు: కర్ణాటకలో కేబినెట్ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్‌సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ ఇద్దరు మంత్రుల మద్దతుదారులు మైసూరు, మాండ్యల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాసేవకు ఏ శాఖ అయితే ఏంటి?: సీఎం జేడీఎస్ మంత్రుల అసమ్మతిపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ శాఖ అయితే ఏంటని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖ కేటాయించడంపై స్పందిస్తూ.. నేనేం చదువుకున్నాను? ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి బీఎస్సీ డిగ్రీ చదివారు. ఢిల్లీలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. ‘రాహుల్‌తో నా అభిప్రాయాల్ని పంచుకున్నాను. ప్రత్యేకంగా ఏమీ డిమాండ్ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. రాహుల్‌తో భేటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావుతో పాటు కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ పాల్గొన్నారు. ‘విభేదాల్ని పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’ అని గౌడ చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, రోషన్‌బేగ్, హేచ్కే పాటిల్, శివశంకరప్ప, జర్కిహోళి వంటి వారికి కేబినెట్లో చోటు దక్కలేదు. వారంతా కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు పలువురు సిద్ధం: యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరులో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జేడీఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్తిగా ఉన్నవారిని చేర్చుకోవడం మన బాధ్యత’ అని అన్నారు. అసమ్మతిని ఎదుర్కొనేందుకు కొత్త ఫార్ములా పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం అందులో ఒకటి. మంత్రుల పనితీరుపై ఆరునెలలకోసారి సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి చాన్స్ ఇవ్వడం. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టుల్ని భర్తీ చేయకుండా అవసరమున్నప్పుడు విస్తరించడం వంటివి కూడా ఫార్ములాలో ఉన్నాయి. -
కన్నడ మంత్రులకు శాఖల కేటాయింపు
బెంగళూరు: తర్జన భర్జనల అనంతరం కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం కుమారస్వామి ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకోగా.. డిప్యూటీ సీఎం పరమేశ్వర హోం బాధ్యతలు నిర్వహించనున్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు భారీ, మధ్య నీటిపారుదల, వైద్య విద్య శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆర్వీ దేశ్‌పాండేకు రెవెన్యూ, కేజే జార్జ్‌కు భారీ, మధ్యతరహా పరిశ్రమలు అప్పగించారు. ఏకైక మహిళామంత్రి జయమాలకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృష్ణ బైర గౌడకు గ్రామీణాభివృద్ధి, శివ శంకర రెడ్డికి వ్యవసాయం, ప్రియాంక్ ఖర్గేకు సాంఘిక సంక్షేమæ శాఖ బాధ్యతలను అప్పగించారు. -
‘నా బిడ్డ అనుకునే పాలిచ్చా’
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. కన్నతల్లికి దూరమైన ఓ పసికందుకు పాలిచ్చి.. ఆకలిని తీర్చిందామె. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్లాస్టిక్ బ్యాగులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై నగేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించారు. బ్యాగ్‌లో రక్తం, బొడ్డు తాడు ఉండటంతో అప్పుడే పుట్టిన చిన్నారిగా నిర్ధారించారు. వెంటనే ఆ మగ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఉచితంగా చికిత్స అందించారు. ఆపై కాస్త కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఆకలితో ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్వటం ప్రారంభించింది. అది గమనించిన కానిస్టేబుల్ అర్చన ఆ చిన్నారిని ఒళ్లోకి తీసుకుని పాలు పట్టించారు. అర్చన మూడు నెలల బాబుకు తల్లి. ఈ మధ్యే మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘ఏడుస్తుంది నా బిడ్డే అనిపించింది. చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఆ బాబుకు పాలిచ్చా’ అని అర్చన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అర్చనపై ప్రశంసలు... ఈ విషయం తన దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసలు గుప్పించారు.‘ఈ ఉదంతం కదిలించింది. ఆ చిన్నారి ఆకలిని తీర్చిన ఆ తల్లికి వందనాలు’అని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు కూడా ఫేస్ బుక్ పేజీలో ‘అర్చనకు సెల్యూట్’ పేరిట ఓ సందేశం ఉంచారు. మరోవైపు ఈ కథనం చూసిన ప్రజలు కూడా ఆ తల్లి హృదయానికి సలాం కొడుతున్నారు. అన్నట్లు ఆ బిడ్డకు కుమారస్వామి అన్న పేరు పెట్టిన ఏఎస్సై నగేశ్.. ఇకపై ఆ పసికందు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు. బెంగళూరులోని శిశుమందిర్ నిర్వాహకులకు ఆ బాబును అప్పగించగా, ఆ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
కర్ణాటకలో ఎట్టకేలకు శాఖలపై ఏకాభిప్రాయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడింది. సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య శాఖల పంపకంపై సయోధ్య కుదిరింది. జూన్ 6న కొత్త మంత్రులు ప్రమాణంచేస్తారని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో కలసి కుమారస్వామి శుక్రవారం గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసి పది రోజులు పూర్తయినా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్.. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వమే ముఖ్యం తప్ప మంత్రిత్వ శాఖలు కాదనీ, ఆర్థిక శాఖను జేడీఎస్‌కే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారని వేణుగోపాల్ తెలిపారు. కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ మాకంటే మాకే కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇన్నాళ్లూ పట్టుబట్టడం తెలిసిందే. ఈ అంశంపై మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో రాహుల్ ఫోన్లో మాట్లాడినట్లు వేణుగోపాల్ చెప్పారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని ఇరు పార్టీలూ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు దక్కే శాఖలు హోం, రెవెన్యూ, నీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, బెంగళూరు నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, అటవీ–పర్యావరణం, పరిశ్రమలు, కార్మిక, గనులు, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. వీటితోపాటు మహిళా–శిశు సంక్షేమం, ఆహార–పౌర సరఫరాలు, హజ్, వక్ఫ్, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, విజ్ఞాన సాంకేతికత, సమాచార సాంకేతికత, యువజన–క్రీడలు, కన్నడ సంస్కృతి శాఖలు కాంగ్రెస్ వద్దే ఉంటాయి. జేడీఎస్‌కు దక్కే శాఖలు ఆర్థిక, ఎక్సైజ్, విద్యుత్తు, నిఘా, సమాచార, ప్రణాళిక–గణాంకాలు, ప్రజా పనులు, సహకారం, పర్యాటకం, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, పట్టు పురుగుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా, సూక్ష్మ నీటి పారుదల శాఖలు జేడీఎస్‌కు దక్కాయి. -
కర్ణాటకలో శాఖలపై కాక!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేపోతోంది. అధిష్టానం కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిప్యూటీ సీఎం పరమేశ్వర అధిష్టానంపైనే పూర్తి విశ్వాసం ఉంచగా సిద్దరామయ్య త్వరగా తేల్చాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆర్థిక శాఖ సహా కీలకమైన 4 శాఖలపై నిర్ణయం తీసుకోలేదు. రైతు రుణమాఫీ నేపథ్యంలో ఇది తనవద్దే ఉంచుకోవాలని సీఎం పట్టుబడుతుండగా.. తమకే కావాలని సిద్దరామయ్య ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీ ట్రబుల్ షూటర్ గులాంనబీ ఆజాద్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారూ మంత్రి పదవుల కోసం పట్టుబట్టడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అటు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, సీఎం సోదరుడు రేవణ్ణలు పీడబ్ల్యూడీ శాఖ కావాలంటున్నారు. కాంగ్రెస్ పలు శాఖలపై ఒత్తిడి తెస్తుండటంతో సంకీర్ణంపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని బయటపెట్టేలా జేడీఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. కింది స్థాయిలో ఇరుపార్టీల్లోనూ అసంతృప్తి తారస్థాయిలో కనబడుతోంది. ఫలితాలు రాగానే బేషరతు మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ ముందుకొచ్చిందని ఇప్పుడు కొర్రీలు పెట్టడం సరికాదంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాహుల్ గాంధీ విదేశాల నుంచి భారత్‌కు తిరిగొచ్చాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. పుణ్యాత్ముడివల్లే అధికారం: కుమారస్వామి సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కుమారస్వామి పుణ్యాత్ముడితో పోల్చారు. ఆ పుణ్యా త్ముడి వల్లే అధికారంలోకి వచ్చానన్నారు. ‘ఈరోజు నాకు ప్రజల ఆశీస్సులు లేకున్నా పుణ్యాత్ముడు రాహుల్ నాపై నమ్మకం ఉంచడం వల్లే అధికారం దక్కింది. ఆయన్ని కూడా విశ్వాసంలోకి తీసుకునే ఓ నిర్ణయం తీసుకుంటా’ అని రైతులతో కుమారస్వామి అన్నారు. ప్రజా విశ్వాసం కాకుండా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైనే తాను ఆధారపడి ఉన్నానని గతంలో వ్యాఖ్యానించడంతో బీజేపీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
సీఎం పీఠం కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌తో భేదాభిప్రాయాలున్నాయని సీఎం కుమారస్వామి చెప్పారు. ఇవి ప్రభుత్వాన్ని పడగొట్టేంత పెద్దవేమీ కాదన్నారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోవాలనుకోవటం లేదన్నారు. ‘శాఖల కేటాయింపు జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో సమస్యలున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి ఆమోదం లభించాక∙కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఏ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకోను. ప్రతిదాన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోను’ అన్నారు. కాంగ్రెస్‌తో చర్చించాకే రుణమాఫీ ‘దురుద్దేశపూర్వకంగానే యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్త బంద్‌కు (సోమవారం) పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గను. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలతో చర్చించాను. వారి నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్వామి తెలిపారు. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తానన్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత డీకే శివకుమార్సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీకి వెళ్లారు. ‘అన్ని చర్చలు ఢిల్లీలోనే జరుగుతాయి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలి వంటి నిర్ణయాలను అధిష్టానమే తీసుకుంటుంది’ అని పరమేశ్వర తెలిపారు. అంతకుముందు వీరంతా బెంగళూరులోని ఓ హోటల్లో చర్చలు జరిపారు. కన్నడ ప్రభుత్వ పాలన కోసం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సమన్వయ కమిటీ ఏర్పాటుపైనా అధిష్టానంతో చర్చించనున్నారని సమాచారం. కాంగ్రెస్ జాబితా ఖరారు డీకే శివకుమార్ సహా 16 మందికి చోటు సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటాలో ఉన్న మంత్రిత్వ శాఖలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు డీకే శివకుమార్, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గేసహా 16 మంది పేర్లున్నాయి. ఢిల్లీలోని 12 తుగ్లక్ రోడ్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేలు శనివారం సమావేశమై ఈ జాబితాను ఖరారు చేశారు. కీలక శాఖలను జేడీఎస్‌కు ఇవ్వద్దని కర్ణాటక కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అటు, మే 28న (సోమవారం) జరగాల్సిన ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలోనూ సంకీర్ణ పక్షాలు ఓ నిర్ణయానికి రాలేకపోయాయి. కాంగ్రెస్‌తో పొత్తు అంతవరకే: దేవెగౌడ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. శనివారం రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని దేవెగౌడ పేర్కొన్నారు. జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. నకిలీ ఓటరు కార్డులు బయటపడడంతో ఈ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. -
కర్ణాటకం ముగిసింది!
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో తమ స్పీకర్ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు. బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్– జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం చూపనందుకు బాధగా ఉంది అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది. ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్–కాంగ్రెస్‌లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైతురుణాల్ని మాఫీ చేయాలి సభ నుంచి వాకౌట్కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
నేడు కుమారస్వామి బలనిరూపణ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నడ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస పరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షను ‘సంకీర్ణం’ సీరియస్‌గా తీసుకుంది. మొత్తం బలనిరూపణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ‘ఆపరేషన్ కమల’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్ గదుల్లోనే ఉన్నారు. మే 15న ఫలితాలు వెల్లడైనప్పటినుంచీ కాంగ్రెస్ రిసార్టు రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారిని హోటల్ నుంచి పంపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా నగరంలోని మరో హోటల్లోనే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించనట్లు తెలిసింది. బీజేపీ మరో ప్రయత్నం సరైన బలం లేక విశ్వాస పరీక్షకు ముందే వెనక్కు తగ్గిన బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్ నేత ఎస్. సురేశ్ కుమార్‌తో నామినేషన్ వేయించింది. శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరపున మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఖరారు కాగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరికి అవకాశం దక్కనుంది. యడ్యూరప్ప, ఇతర ముఖ్యనేతల ఆదేశాలతోనే నామినేషన్ వేసినట్లు సురేశ్ కుమార్ తెలిపారు. ‘అసెంబ్లీలో మా సంఖ్య, వివిధ అంచనాలతో నేను విజయం సాధిస్తానని మా పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్ వేశాను. ఫలితం మీరే చూస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య వెంటరాగా రమేశ్ గురువారం నామినేషన్ వేశారు. తమ అభ్యర్థి విజయం సాధించటం తథ్యమని, అందుకని ముందే బీజేపీ తమ నామినేషన్ వెనక్కు తీసుకోవడమే మంచిదని సిద్దరామయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిపై మాజీ సీఎం, అసెంబ్లీలో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్‌పై స్వామికి నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. తన డిప్యూటీ పరమేశ్వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. లింగాయత్‌ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు (రాజకీయాల్లో తలదూర్చవద్దంటూ) ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి అపవిత్ర కూటమిపై ప్రజలకు పెద్దగా ఆశల్లేవన్నారు. ‘ఐదేళ్ల’పై చర్చించలేదు! డిప్యూటీ సీఎం పరమేశ్వర బెంగళూరు: కుమారస్వామే ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర స్పష్టంచేశారు. ‘జేడీఎస్‌కు ఏయే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఏయే శాఖల బాధ్యతలు ఇస్తారనేదానిపైనా ఎలాంటి నిర్ణయం జరగలేదు’ అని అన్నారు. మరి ఐదేళ్లు జేడీఎస్‌కే ఈ బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ప్రశ్నించగా.. ‘పార్టీలో చర్చిస్తాం. రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల మధ్య డిప్యూటీ సీఎం విషయంలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని పరమేశ్వర తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 70–80% ఓట్లున్న బూత్‌లలోనూ బీజేపీ మెజారిటీ సాధించటంపై విచారణ జరుపుతామన్నారు. -
రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత బలపరీక్ష
-
కాంగ్రెస్‌తో దోస్తీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు
-
రేపు బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక
బెంగళూరు: జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. -
అక్కడ ప్రమాణం చేస్తే.. ఐదేళ్లు కష్టమే!
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు. గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదేఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణంచేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు. 1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జాలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు. యడ్యూరప్పకూ చుక్కెదురే.. కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు. -
మోదీ అశ్వమేధ గుర్రాన్ని కట్టేశాం
బెంగళూరు/మైసూరు: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల అశ్వమేధ గుర్రాన్ని కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కట్టేసిందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణం చేశాక మాట్లాడుతూ ‘మోదీ, షాల అశ్వమేధ గుర్రాన్ని కట్టేయడమే నా లక్ష్యమని యూపీ ఎన్నికల తర్వాత చెప్పా. కాంగ్రెస్ సాయంతో ఈరోజు కర్ణాటకలో నేను ఆ పని చేయగలిగా’ అని అన్నారు. సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామనీ, అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున అందుకు కొంత సమయం పడుతుందన్నారు. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడకుండా మనోనిబ్బరంతో ఉండాలనీ, రైతుల బిడ్డగా, సేవకుడిగా వారి బాధను అర్థం చేసుకుంటానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఏదైనా చేయాలంటే భాగస్వామ్య పక్షం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామ ని అన్నారు. బీజేపీకి అధికారం దక్కనివ్వకూడదన్న లక్ష్యంతోనూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో జతకలిసినట్లు కుమారస్వామి వెల్లడించారు. -
నా జీవితంలోనే బిగ్ చాలెంజ్: కుమార స్వామి
బెంగళూరు : కాంగ్రెస్ మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించడం తన జీవితంలోనే పెద్ద సవాల్ అని జేడీఎస్ అధినేత, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఇక రేపు (బుధవారం) కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఇష్ట దైవాలను దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీనేగరిలోని ఆదిశంకరాచార్య ఆలయానికి సతీసమేతంగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జేడీఎస్-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు కొనసాగించడం నాకు పెద్ద సవాల్. ముఖ్యమంత్రిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ ప్రభుత్వం సరైన పాలనను అందిస్తుందా అని ప్రజల్లో కూడా సందేహాలున్నాయి. నాపై శారదాంబే, జగద్గురుల దీవెనలుంటాయి. వారి ఆశిస్సులతో అంతా మంచే జరుగుతోంది.’ అని కుమార స్వామి పేర్కొన్నారు. నేడు కుమార స్వామి శ్రీనేగరి శారదాంబె ఆలయం, దక్షిణామయ పీఠంలను దర్శించుకున్నారు. కుమార స్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్సీ అధినేత్రి మాయవతి, ఎస్పీనేత అఖిలేష్ యాదవ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. -
కుమారస్వామితో చర్చించాకే..
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో చర్చలు జరిపేందుకు ఢిల్లీ బయలుదేరిన సీనియర్ కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, జీ పరమేశ్వరలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సూచనలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరిని ప్రతిపాదించాలనే కసరత్తు సాగించేందుకు ఈ నేతలంతా తొలుత రాహుల్ గాంధీతో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే జేడీఎస్ నాయకత్వానికి తమ మద్దతును నిర్థారించిన అనంతరమే వీటిపై చర్చించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్పష్ఠం చేశారు. మరోవైపు జేడీఎస్ నేత, కర్ణాటక పాలనాపగ్గాలు చేపట్టనున్న హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మరికాసేపట్లో భేటీ కానున్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపైనా ఈ సందర్భంగా కాంగ్రెస్ దిగ్గజాలతో కుమారస్వామి చర్చిస్తారని భావిస్తున్నారు. ఏఏ శాఖలు ఎవరికి అప్పగించాలనే దానిపైనా ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశాలూ చర్చకు రానున్నాయి. సీఎం కుమారస్వామి ఆర్థిక, ఆరోగ్య, పీడబ్ల్యూడీ శాఖలను తన వద్దే ఉంచుకోవాలని భావిస్తుండగా, హోం, ఇంధన శాఖ వంటి కీలక శాఖలను కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఈ షరతుతోనే తాను ఎన్నికల అనంతర పొత్తుకు అంగీకరించానని కుమారస్వామి చెబుతున్నారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. -
సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు
-
సీఎం సీటు పంచుకోం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్–కాంగ్రెస్ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు. కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్ సీఎం, 13 కేబినెట్ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్! ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు. రజనీ వర్సెస్ స్వామి తమిళనాడుకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్థితి చూస్తే.. కుమార స్వామి మనసు మార్చుకుని కావేరీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘కర్ణాటకలో నీరుంటే వారికి విడుదల చేయగలం. రజనీకాంత్ ఇక్కడికొచ్చి మా డ్యాముల పరిస్థితి, రైతుల దీనస్థితి చూడాలని ఆహ్వానిస్తున్నా. ఇవన్నీ చూశాక కూడా మీరింకా నీరు కావాలంటే మనం చర్చిద్దాం’ అని పేర్కొన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు! కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సోమవారం కలిసిన అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీఎస్‌కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్ నుంచి కూడా మరో ఉపముఖ్యమంత్రి ఉండొచ్చని తాజా సమాచారం. రిసార్టులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తోంది. ఏ విషయంలోనూ తప్పటడుగుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండ్రోజులు వెనక్కు జరిపారు. ప్రస్తుతానికి 221 మంది సభ్యులున్న సభలో ఈ కూటమికి 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కుమారస్వామి తాను ఎన్నికైన రెండో స్థానానికి (రామనగర) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది. -
23న కుమారస్వామి ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్ వజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్‌తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు. విపక్ష నేతలకు ఆహ్వానం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్–జేడీఎస్‌లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. -
బీజేపీ నాయకులెవరూ నన్ను సంప్రదించలేదు
-
పరిమితుల్లేని రైతు రుణమాఫీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వస్తే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై పరిమితులేమీ లేకుండా పూర్తిగా మాఫీ చేస్తామని జేడీఎస్ హామీనిచ్చింది. రైతులకు ఎరువులు, విత్తనాలను ఉచితంగా అందజేస్తామంది. కర్ణాటక ఎన్నికల కోసం జేడీఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి సోమవారం విడుదల చేశారు. ‘జనతా ప్రణాళిక – జనాలే పాలకులు’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో జేడీఎస్ పలు హామీలను ఇచ్చింది. కొన్ని ముఖ్య వాగ్దానాలు: 65 ఏళ్లు పైబడిన పేదలకు నెలకు రూ.6వేల పింఛన్ లోకాయుక్త ఏకీకరణ, ఏసీబీ రద్దు పేద మహిళలకు కుటుంబ నిర్వహణ నిమిత్తం నెలకు రూ.2 వేలు రైతు సమస్యలు వినడానికి ప్రతి నెలా ముఖాముఖి కార్యక్రమం పీజీ వరకు ఉచిత విద్య ఉద్యోగ శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ప్రతి న్యాయవాదికీ నెలకు రూ.5 వేల ఉపకార వేతనం సాగునీటి కోసం ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు బెంగళూరుకు కొత్తగా మరో రింగు రోడ్డు. -
ముఖ్యమంత్రి వాచ్ ఖరీదు అరకోటిపైనే !!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్, కళ్లద్దాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి ఆరోపించారు. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పది లక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. ‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్ల స్థానంలో వజ్రాలను పొదుగుతారు. అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70లక్షలుగా ఉంటుంది. సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈ వాచ్‌ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. ఈ విమర్శలతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది.