ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్(సెక్యులర్) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది.
బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్‌సభ పోటీకి గానూ జేడీఎస్ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
బీజేపీ-జేడీఎస్ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు. ఈ క్రమంలో.. మాండ్యా, హసన్, తుమకురు, చిక్‌బళ్లాపుర్, బెంగళూరు రూరల్ సీట్లను జేడీఎస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది.
ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య
Comments
Please login to add a commentAdd a comment