JDS
-
Political Honey Trap: 20 ఏళ్లుగా ‘వలపు వల’లో రాజకీయ నేతలు!
బెంగళూరు: కన్నడనాట పొలిటికల్ హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం కలకలం రేగింది. మంత్రులు సహా అనేకమంది నేతలు వలపు వల విసిరారని.. అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఉన్నత న్యాయస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించుకుంది. తనపై రెండుసార్లు హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార, విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయన. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరు(King Ping) ఉన్నారనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజన్న సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. హనీ ట్రాప్ ఆరోపణలపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర సభలో స్పందించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. మంత్రివర్గంలోని ఒక సీని యర్ సహచరుడిపై హానీ ట్రాప్ ప్రయత్నాలు జరిగి నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.బుధవారం రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వీ సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హనీ ట్రాప్ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను ఓడించలేక అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మాట్లాడుతూ... రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారని, ఇందులో భాగంగా హనీ ట్రాప్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. గత వారం తుమకూరు(Tumakuru)కు చెందిన ఓ బీజేపీ నేతపై జరిగిన హనీ ట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్ప స్వామి అనే నేతకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పోలీసులను ఆశ్రయించగా.. ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా
బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రా అని ప్రశ్నించారు. Mr. @siddaramaiah..Ughe Ughe to your 'Sidvilasa'Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!Isn't it Karma Mr siddaramaiah?ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024మోదీ కేబినెట్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.కర్మ సిద్ధాంతం అంటే ఇదేగతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్‌లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు. చదవండి : ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యాకు చిక్కులు -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెయిల్
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సూరజ్ రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో తనని లైంగికంగా వేధించాడని 27ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీన్నారు. విచారణ చేపట్టిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో సూరజ్ రేవణ్ణ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.తనపై వచ్చిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ స్పందించాడు.ఫిర్యాదు దారుడు తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు రాబట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్‌ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్‌లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్‌ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు
బెంగళూరు: జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణపై ఓ యువకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు లేఖ రాశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తిపై హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘చేతన్, అతని బావ ఇద్దరూ నన్ను కలిశారు. వారు నా దగ్గర రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. వారు కోరినట్లు రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు’ అని శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేతన్ ముందు తననను కలిసి.. ఉద్యోగం ఇప్పించటం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో నేను సూరజ్ రేవణ్ణ ఫోన్ నంబర్ ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించనందుకే తమ ఇద్దరినీ (శివకుమార్, సూరజ్ రేవణ్ణ)ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫోలీసులకు శివకుమార్ ఫిర్యాదు చేశారు.మరోవైపు.. చేతన్ సైతం ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సూరజ్ రేవణ్ణ తనను ఆయన ఫామ్ హౌజ్‌లో లైంగిక వేధింపులుకు గురిచేశాడని ఆరోపించారు. ఇక.. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రావటం రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అయింది. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. -
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్‌లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్‌కు రావాలి -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్‌లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. -
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
ప్రజ్వల్ భారత్‌కు వచ్చి లొంగిపో: బాబాయ్ విజ్ఞప్తి
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా అసభ్య వీడియో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అయితే ఆదివారం ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో బాబాయ్ అయిన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి స్పందించారు. విదేశంలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే ఇండియాకు రావాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసులో సిట్ ముందు దర్యాప్తు ఎదుర్కొవాలన్నారు. లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు.‘‘మీడియా ముఖంగా నేను ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా. అతను ఏ దేశంలో ఉన్నా భయం లేకూడా భారత్ తిరిగి రావాలి. ఇంకా ఎంత కాలం ఇలా దాచుకొని తిరుగుతూ ఉంటావు?. ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. ...రెండు రోజుల్లో ప్రజ్వల్ పోలీసులకు లొంగిపోవాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు. దయచేసి ఇండియాకి తిరిగి వచ్చి అధికారులు ముందు హాజరుకావాలి. అప్పడే ఈ విషయంలో ఓ ముగింపు వస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులకు నేను బహిరంగా క్షమాపణలు చేబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను’’ అని కుమారస్వామి అన్నారు. ఇక.. అధికార కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిందని, కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. -
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు. ‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం. -
లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
బెంగళూరు: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న విమానం టికెట్ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్ బుక్ చేసిన విమాన టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజ్వల్ బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్‌కు చెందిన జేడీఎస్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు.అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. -
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.దేవరాజ్ గౌడ్‌పైనా లైంగిక దాడి కేసుఇక ప్రజ్వల్ ఎపిసోడ్లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్ దేవరాజ్ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది. హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .ప్రజ్వల్ సెక్స్ వీడియో క్లిప్‌ల పెన్ డ్రైవ్‌లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది. -
బెంగాల్ గవర్నర్‌పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాష్ట్రంలో రాజకీయ నేతలు ధ్వజమెత్తారు. ఈ తరుణంలో ఆర్జేడీ నేత మిసా భారతి కూడా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై వచ్చిన అభియోగం ఆందోళన కలిగించే విషయం. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మిసా భారతి అన్నారు. ఈమె పాట్లీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.ఈ విషయం మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. -
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ప్రధాని మౌనమేలారేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్లో పేర్కొన్నారు.అక్కడుంది మీ ప్రభుత్వమే కదాప్రియాంక గాంధీ ట్వీట్‌పై మంగళవారం ఉదయం అమిత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్‌ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు. విచారణకు బీజేపీ డిమాండ్ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.పరువు పోతుందంటూకాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.రేవణ్ణను రప్పిస్తాంమరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
HD Revanna: అంతా రాజకీయ కుట్ర
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్ఐఆర్ వేస్తారనిగానీ, సిట్‌తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్‌కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్‌పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్‌సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు. -
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. -
Lok sabha elections 2024: కన్నడిగుల తొలి ఓటెవరికో!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి బీజేపీ–జేడీ(ఎస్) కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతోంది. జేడీ(ఎస్) పోటీ చేస్తున్న హసన్, మండ్య, కోలార్ స్థానాలకు రెండో విడతలోనే పోలింగ్ ముగియనుంది. ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం విశేషం! ఈసారి పలు స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది... బెంగళూరు నార్త్బీజేపీ నేత సదానంద గౌడ 2014 నుంచీ ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ నేత ఎంవీ రాజీవ్గౌడను ఆమె ఢీకొడుతున్నారు. గౌడ బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుడు. ఈ స్థానం 1999 దాకా కాంగ్రెస్ కంచుకోట. 2004 నుంచీ బీజేపీ జైత్రయాత్రే సాగుతోంది. దీనికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.బెంగళూరు సౌత్1996 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోట. బీజేపీ దివంగత నేత అనంతకుమార్ ఇక్కడినుంచి ఏకంగా 28 ఏళ్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు! 2019 ఎన్నికల్లో యువ నేత తేజస్వి సూర్య బీజేపీ తరఫున 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారీ ఆయనకే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారీ విజయం తనదేనని తేజస్వి ధీమాగా ఉన్నా పోరు హోరాహోరీగా సాగవచ్చంటున్నారు.హసన్మాజీ ప్రధాని దేవెగౌడ ఐదుసార్లు నెగ్గిన స్థానమిది. 2019లో మనవడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలో దింపారు. బీజేపీ నేత ఎ.మంజుపై ఆయన 1.41 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా జేడీ(ఎస్) నుంచి ప్రజ్వలే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా పేరున్న జి.పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పటేల్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు దేవెగౌడ, పుట్టస్వామి పోటీకి వేదికైన హసన్ వారి మనవళ్ల పోరుకు కేంద్రంగా మారింది!కోలార్ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న కోలార్‌లో ఈసారి గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన హామీలు ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్.మునిస్వామి 2.1 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత కె.హెచ్.మునియప్పపై నెగ్గారు. ఈసారి పొత్తులో భాగంగా జేడీ(ఎస్) అభ్యర్థి ఎం.మల్లేశ్‌బాబు పోటీ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు చేటు చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఆరుసార్లు గెలిచిన మునియప్ప ఇటీవలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్‌సభ టికెట్‌ను తన అల్లుడికి ఇప్పించుకునేందుకు ప్రయతి్నంచగా సొంత పార్టీ నేతలే మోకాలడ్డారు. సామాజిక వర్గాల ప్రభావం..రెండో దశలో భాగంగా ఎన్నికలు నిర్వహించే 14 స్థానాలకు గాను మెజారిటీ చోట్ల వొక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనా బీజేపీ దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లను ఆకర్షించడంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది.కరవు కోరలుకర్ణాటకలోని అధిక ప్రాంతాలు ప్రస్తుతం చరిత్రలోనే అతి తీవ్రమైన కరువును చూస్తున్నాయి. దాదాపు అధిక శాతం పట్టణాలను కరువు ప్రాంతాలుగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కరువు కోరల్లోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో నెగ్గుకొచి్చన కాంగ్రెస్‌కు.. లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ గ్యారంటీల ప్రభావం ఇప్పుడు అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. మండ్యవొక్కళిగ ఆధిపత్యమున్న స్థానమిది. గత ఎన్నికల్లో నటి సుమలత బీజేపీ మద్దతుతో 1.26 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. ఈ స్థానం పొత్తులో భాగంగా ఈసారి జేడీ(ఎస్)కు వెళ్లింది. కుమారస్వామే బరిలో ఉన్నారు. సుమలత బీజేపీలో చేరడం ఆయనకు మరింత కలిసి రానుంది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ (స్టార్ చంద్రు) బరిలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీ(ఎస్) విజయం సాధించడం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అంశాల్లో ఒకటి.బెంగళూరు రూరల్2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానమిది. ఈసారి కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండటంతో దేవెగౌడ అల్లుడు, ప్రముఖ వైద్యుడు సి.ఎన్.మంజునాథను బీజేపీ బరిలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. చారిత్రకంగా ఇక్కడ హస్తానిదే ఆధిపత్యం. ఆ పార్టీ ఏకంగా 13 సార్లు నెగ్గగా మూడుసార్లు జేడీ(ఎస్) గెలిచింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్‌పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్‌సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ సీఎం ఫ్యామిలీ సీట్లు కన్ఫమ్!
లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్‌బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. -
కూటమిలో ఘర్షణ.. బీజేపీ నేతపై జేడీఎస్ ఎమ్మెల్యే విమర్శలు
బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల మధ్య అసమ్మతి బయటపడింది. ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార సమావేశంలో జేడీఎస్-బీజేపీ నేతల ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్‌పై విమర్శలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణం కొండజ్జి విశ్వనాథ్ అని సమావేశంలో విమర్శలు చేయటంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గతంలో జేడీఎస్‌లో ఉన్న విశ్వనాథ్ అనంతరం బీజేపీలో చేరారు. అయితే ఈ సమావేశంలో విశ్వనాథ్ మాట్లాడటానికి ప్రయత్నించగా బీజేపీ సీనియర్ నేత సోమన్న అడ్డుకున్నారు. ఇక.. జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. కొంత సమయం తర్వాత ఇరు పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సద్దుమణిగింది. బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్.. హసన్, మాండ్య, కోలార్ లోక్‌సభ స్థానాలను బీజేపీ ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు డా. మంజూనాథ్ బీజేపీ టికెట్ మీద బెంగళూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్‌ను పోటీలోకి దింపింది. పాత మైసూరు ప్రాంతంలో.. జేడీఎస్ పొత్తుతో బీజేపీ ఒక్కలిగ ఓటర్ల మద్దుతు పొందాలని భావిస్తోంది. -
జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోంది: డీకే శివకుమార్
బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్‌ను పోటీకి దింపడం ద్వారా జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోందని అన్నారు. సీట్ల పంపకంపై జేడీ(ఎస్), బీజేపీ కూటమితో నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందిస్తూ.. నేను ఇది ఊహించాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జేడీ(ఎస్) ఇబ్బంది పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన భాగస్వాములతో ఇలాగె చేస్తోందని అన్నారు. మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే యోచనలో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాజకీయ నాయకులకు పార్టీ టికెట్స్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, మరొక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం సహజం అన్నారు. ఆయనూరు మంజునాథ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జేడీఎస్ టికెట్‌పై పోటీ చేశారు. ముదిగెరెలో ఎంపీ కుమారస్వామి టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) టికెట్‌పై పోటీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి పార్టీలో చేరిన వారిని మేము తీసుకుంటాము అన్నారు. అయితే సదానందగౌడకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా అనే దానిపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు. -
‘‘2 సీట్ల కోసం పొత్తా..? సొంతగానే గెలుస్తాం’’
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు. మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడులో బీజేపీ వ్యూ హం -
సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. వీడియోలో.. ఓ మీటింగ్‌లో జనం మధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ట్విటర్లో షేర్ చేశారు. క్యాష్ఫర్ పోస్టింగ్ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని, ఎలాంటి భయం లేకుండా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని, సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ గురించి అని తెలిపారు. క్యాష్ ఫర్ ఫోస్టింగ్ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో సుధీర్ఘ పోస్టు చేశారు. Unfortunately, former Chief Minister H.D. Kumaraswamy, who was involved in rampant corruption during his tenure, thinks all are like him. His pessimistic attitude does not allow him to think beyond corruption. His insecurity in politics often forces him to fabricate fake stories… — Siddaramaiah (@siddaramaiah) November 16, 2023 అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ Yathindra Siddaramaiah : ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹವಾ ಪ್ರತಿಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲಿಂಕ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ Click Here to Watch NewsFirst Kannada Live Updates LIVE Link : https://t.co/GFweTyzikB@siddaramaiah#CMSiddaramaiah #YathindraSiddaramaiah pic.twitter.com/Py38uVLcVv — NewsFirst Kannada (@NewsFirstKan) November 16, 2023 -
డీకే సీఎం అయితే మద్దతిస్తాం: కుమార
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జేడీయస్లోని 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఆ పార్టీ మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఎంతమంది సీఎం అవుతారో తెలియదని వ్యంగ్యమాడారు. శనివారం నగరంలోని పార్టీ ఆఫీసులో రాష్ట్రంలో కరువు పరిస్థితిపై సమీక్ష చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రభుత్వమని పిలవవచ్చునని ఆరోపించారు. కరువు నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం అవుతానన్న మంత్రి ప్రియాంక ఖర్గే కలబురిగి ప్రజలకు చేసింది ఏమిటి అన్నారు. గృహలక్ష్మీ పథకంలో ఎంతమందికి డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. -
వేడెక్కుతున్న బెళగావి రాజకీయం
బనశంకరి: గత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బెళగావి పీఎల్డీ బ్యాంకు అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ పదవిని తమ వర్గీయులకు కట్టబెట్టాలని మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, మరో వైపు ప్రజాపనులశాఖమంత్రి సతీశ్జార్కిహోళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రుల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. సంకీర్ణ సర్కార్ హయాంలో తమవర్గానికి చెందిన నేతకు పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అప్పట్లో బెళగావి గ్రామాంతర ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మీహెబ్బాల్కర్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్‌జార్కిహొళి పట్టుబట్టారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న డీకే.శివకుమార్ లక్ష్మీ హెబ్బాల్కర్కు మద్దతుగా నిలవగా రమేశ్‌జార్కిహొళికి సోదరుడు, మంత్రిగా ఉన్న సతీశ్‌జార్కిహొళి మద్దతు ఇచ్చారు. సోదరుల సవాల్‌కు ఎదురొడ్డి నిలబడిన లక్ష్మీహెబ్బాల్కర్ చివరికి వారిపై పైచేయి సాధించి తమ మద్దతుదారుడికి పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి దక్కేలా చూశారు. ఈ వివాదం రాజీద్వారా పరిష్కారమైనట్లు కనబడినప్పటికీ లక్ష్మీహెబ్బాళ్కర్– రమేశ్‌జార్కిహొళి బ్రదర్స్ మధ్య వర్గపోరు అలాగే కొనసాగి ఆపరేషన్ కమలకు దారితీసి సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. అనంతరం మూడన్నరేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాదిజరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య పోరు మొదలైంది. పైకి ఇద్దరు మంత్రులు కలిసిపనిచేస్తున్నట్లు కనబడినా అధికారుల బదిలీలు, స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో వైరుధ్యం అలాగే ఉంది. లక్ష్మీహెబ్బాల్కర్కు డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ లాశీస్సులు ఉండటంతో జార్కిహొళి కుటుంబానికి తలనొప్పిగా మారింది. మంత్రి వర్గ కూర్పులో కూడా మహిళా ఎమ్మెల్యేలు అందరిని వెనక్కి నెట్టి లక్ష్మీహెబ్బాల్కర్ మంత్రివర్గంలో స్ధానం దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతవ్యక్తుల సహకారం ఉండటంతో లక్ష్మీహెబ్బాల్కర్ పీఎల్డీ బ్యాంకుపై పట్టుసాధించాలని భీష్మించుకున్నారు. దీనిపై బహిరంగంగా మాట్లాడలేక రగిలిపోతున్న సతీశ్‌జార్కిహొళి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను విహారయాత్రకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ–జేడీఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్‌లో విభేదాలు కొంపముంచే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య తన ఆప్తుల ద్వారా రాజీప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో బయటివారి జోక్యం తగ్గకపోతే రానున్న రోజుల్లో తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉంది. -
జేడీఎస్ అధినేత దేవెగౌడ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి ఆగ్రహం
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాగా కేరళలో పినరయి విజయన్ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్ కేరళ యూనిట్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు. కేరళ యూనిట్ కూడా సమ్మతించింది ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్‌కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు. కుమారస్వామిని సీఎం చేసేందుకే.. ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్ ఖండించారు. జేడీఎస్ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం జోక్యం చేసుకోం కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు(ఎల్డీఎఫ్) జెడీఎస్ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. కేరళలో వామపక్ష పార్టీతోనే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే కె కృష్ణన్‌కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్‌కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్‌కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్‌కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
BJP Alliance: బీజేపీతో జట్టు ఖరారు!
ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్(సెక్యులర్) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది. బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్‌సభ పోటీకి గానూ జేడీఎస్ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ-జేడీఎస్ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు. ఈ క్రమంలో.. మాండ్యా, హసన్, తుమకురు, చిక్‌బళ్లాపుర్, బెంగళూరు రూరల్ సీట్లను జేడీఎస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది. ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్(జనతా దళ్(సెక్యులర్)) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కొనసాగించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్ పార్టీ భవిష్యత్తుపై పునరాలోచనలో పడింది. బీజేపీతో కలిసే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధినేత దేవె గౌడ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నామని జనతా దళ్(సెక్యులర్) అధినేత హెచ్డీ దేవె గౌడ తెలిపారు. దీంతో బీజేపీతో జేడీఎస్ పొత్తు కొనసాగించనుందనే అంశానికి తెరపడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి జేడీఎస్ పోరాడుతుందని దేవె గౌడ కుమారుడు కుమారస్వామి గత వారం తెలిపాడు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ జేడీఎస్.. బీజేపీతో కలిసే పోటీ చేయనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ ఐఏఎస్‌ల బదిలీల అంశంలో బీజేపీ నేతలతో పాటు జేడీఎస్ సభ్యులు కూడా పోరాడారు. ఈ క్రమంలో పలువురు నేతలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ అంశాల అనంతరం బెంగళూరులో మీడియా సమావేశం అనంతరం మాట్లాడిన దేవె గౌడ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఒక్క సీటు గెలిచినా పర్వాలేదు.. కానీ తాము తప్పకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. తమకు ప్రాబల్యం ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆయా స్థానాలను నిర్ణయిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు -
పొలిటికల్ భేటీలు.. బిగ్ షాకిచ్చిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan." On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw — ANI (@ANI) July 17, 2023 మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు -
కన్నడ నాట పొత్తు రాజకీయం
శివాజీనగర: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ హైకమాండ్‌తో జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్‌ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్‌తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్ పొత్తు వార్తలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది. జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. చర్చలు జరిగాయి: బొమ్మై పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు. -
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
‘కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్.. మూడు నెలల్లో అనేక మార్పులుంటాయ్’
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు రామనగరలో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండదని, మూడు నెలల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. త్వరలో తాలూకా,జిల్లా పంచాయతీల ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయని, ఈ ఓటమి వల్ల పార్టీకి ఢోకా ఏమీ లేదని, ఇలాంటి పరాజయాలు తమకు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదన్నారు. ప్రకటించిన పథకాలకు ఏడాదికి కనీసం రూ. 70 వేల కోట్లు అవసరమని, అన్ని నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. -
అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్! -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్‌గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్‌కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను దూరం పెట్టిన లింగాయత్‌లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్‌ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుమారస్వామికి భంగపాటు...
-
ఘోరంగా ఓటమిపాలైన నిఖిల్
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఏళ్లుగా రామనగర జిల్లాను కంచుకోటగా భావిస్తున్న జేడీఎస్‌కు ఈసారి ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో నాలుగు స్థానాలపైకి మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది. రామనగర నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కుమారస్వామి ఘోరంగా ఓటమిపాలయ్యాడు. దీంతో జేడీఎస్ కంచుకోటకు బీటలు పడ్డాయి. అనూహ్యంగా రామనగరలో కాంగ్రెస్ అభ్యర్థి, డీకే శివకుమార్ ఆప్తుడు ఇక్బాల్ హుసేన్ విజయం సాధించారు. మాగడిలో హెచ్‌సీ బాలక్రిష్ణ, కనకపురలో డీకే శివకుమార్ విజయం సాధించారు. ఒక్క చెన్నట్టణలో మాత్రం కుమారస్వామి ఎలాగో గట్టెక్కారు. చెన్నపట్టణలో అపర భగీరథుడిగా పిలవబడే ఎమ్మెల్సీ యోగేశ్వర్ పరాజయం పాలవడం చర్చనీయాంశంగా మారింది. -
‘కింగ్‌మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్‌ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనుంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
బీజేపీ ఓటమి.. బసవరాజు బొమ్మై ఫస్ట్ రియాక్షన్..!
-
ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్.. సీఎం రేసులో ఎవరెవరున్నారంటే?
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది. ఏ ఎగ్జిట్‌పోల్ ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ, జేడీఎస్ కలిసినా వంద స్థానాలకు చేరే అవకాశం లేదు. ఫలితాల్లో జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాలకు నుంచి ఈ సారికి 21కి జేడీఎస్ పడిపోయింది. కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఓటమి చెందారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు(ఆదివారం) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానిదే విజయం అని ఖర్గే అన్నారు. అధికారం,డబ్బు ప్రభావం పనిచేయలేదన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాగా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కాంగ్రెస్‌దే విజయం..! కర్ణాటక ప్రజల నాడి
-
కర్ణాటకలో మొదలైన ‘రిసార్ట్’ పాలిటిక్స్.. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లు!
కర్ణాటక: కర్ణాటకలో రిసార్ట్’పాలిటిక్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలిసింది. కర్ణాటక బీజేపీ నేతలతో అమిత్‌షా కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరో వైపు, ఆధిక్యంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లోకి వచ్చింది. అందరినీ బెంగుళూరు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కీలక నేతలకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతో డీకే శివకుమార్ టచ్‌లో ఉన్నారు. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను హుటాహుటిన బెంగుళూరుకు కాంగ్రెస్ తరలిస్తోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. కాగా, అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కన్నడిగులు కొనసాగిస్తున్నారు. చదవండి: సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య -
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్.. బీజేపికి పెద్ద దెబ్బ..!
-
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సిద్ధరామయ్య ఫస్ట్ రియాక్షన్
-
ఫలితాలపై జీవీఎల్ రియాక్షన్
-
గాలి జనార్థన్‌రెడ్డి ముందంజ
-
130 స్థానాలు పైనే..! కాంగ్రెస్ తిరుగులేని విజయం?
-
సెంట్రల్ కర్ణాటక, మైసూరులోనూ కాంగ్రెస్ ముందంజ
-
ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. షాక్‌లో బీజేపీ...
-
కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి.. జీవీఎల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాదాపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దీంతో, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదు. కర్ణాటక ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలిచాం. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. తొలుత మాకు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, అంతకంటే ఎక్కు సీట్లు మాకు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 111 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇక, కాంగ్రెస్‌కు ఫలితాలు ఫేవర్‌గా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ఇది కూడా చదవండి: రిసార్ట్ పాలిటిక్స్.. తెలంగాణను తాకిన కర్ణాటక రాజకీయం! -
Karnataka Election Result 2023: ముందంజలో సిద్ధరామయ్య, శివకుమార్..!
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్..
-
బళ్లారిలో 144 సెక్షన్...
-
Karnataka Results: కాంగ్రెస్‌కు లీడ్..బీజేపీకి ఫస్ట్ టైమ్ ఇలా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ నడిచింది. కాగా, పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి 82, కాంగ్రెస్‌కు 114, జేడీఎస్‌కు 23, ఇతరులకు 5 ఓట్లు లభించాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి భారీగా ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోయేది. కానీ అనుహ్యంగా కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ దూసుకెళ్లింది. తాజాగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ సీనియర్ నేతలు లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. #WATCH | Postal ballots to be counted first as counting of votes in Karnataka Assembly elections begins in Hubballi pic.twitter.com/BQ7tzIFZU5 — ANI (@ANI) May 13, 2023 ఇక, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023) అంతకుముందు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మ హుబ్లీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు కూడా గెలుపు తమదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు చేసుకున్నారు. #WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3 — ANI (@ANI) May 13, 2023 #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 -
కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే.. రిజల్ట్ ఇలా!
కర్ణాటక : కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే అంటూ జేడీఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తుమకూరు సిటీలో జేడీఎస్ విజయం సాధిస్తుందని చెబుతూ అభ్యర్థి గోవిందరాజకు నేమ్ బోర్డు తయారు చేసి అందించారు. ఈ విషయం తెలిసి ఓటర్లు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు వెల్లడైన ఫలితాల సరళిని పరిశీలిస్తే.. గోవిందరాజ లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ సమీప అభ్యర్థి జీ.బీ. జ్యోతిగణేష్పై ఆయన 1014 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. అభిమానుల అంచనాలు నిజం చేస్తూ గోవిందరాజ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారో చూడాలి. -
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
Time: 9:03 PM ►రేపు సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం ►సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య Time: 7:50 PM ►సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం సాధ్యమైందని, కాంగ్రెస్‌ని గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది అని 'ఖర్గే' వ్యాఖ్యానించారు. Time: 6:38PM ►కర్ణాటకలో 43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ ►2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5% ఓట్లు ఎక్కువ ►36 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ ►2018 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన జేడీఎస్ ఓట్లు Time: 6:10 PM ►బెంగళూరు సిటీ(28): కాంగ్రెస్ 13, బీజేపీ 15, జేడీఎస్ 0 ►సెంట్రల్ కర్ణాటక(25): కాంగ్రెస్ 19, బీజేపీ 5, జేడీఎస్ 1 ►కోస్టల్ కర్ణాటక(19): కాంగ్రెస్ 6, బీజేపీ 13, జేడీఎస్ 0 ►హైదరాబాద్ కర్ణాటక(41): కాంగ్రెస్ 26, బీజేపీ 10, జేడీఎస్ 3 ►నార్త్ కర్ణాటక(50): కాంగ్రెస్ 33, బీజేపీ 16, జేడీఎస్ 1 ►ఓల్డ్ మైసూర్(61): కాంగ్రెస్ 39, బీజేపీ 6, జేడీఎస్ 14 Time: 5:50 PM ►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Time: 5:35 PM ►కర్ణాటక ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఘన విజయం సాధించామని, భారత్‌లో జోడో యాత్ర ప్రజల్లో జోష్ నింపిందన్నారు. దుష్టపరిపాలనను కర్ణాటక ప్రజలు అంతమొందించారని, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. Time: 5:05 PM ►కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం ►ఐదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ►136 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ►65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ►19 స్థానాల్లో సరిపెట్టుకున్న జేడీఎస్ Time: 4:55 PM ►సోనియా, రాహుల్‌కి ఫోన్ చేసి అభినంధనలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్ ►ప్రజలకిచ్చిన హామీలను మొదటి రోజు నుంచే అమలు చేస్తాం - రాహుల్ Time: 4:35 PM ►ప్రజల తీర్పుని గౌరవిస్తాం, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదు, అభివృద్ధి చేసినా ఓటమిపాలయ్యాం - యడియూరప్ప ►ప్రజా తీర్పుని గౌరవిస్తాం, ఓటమిని విశ్లేషించుకుని ముందుకెళ్తాం - కుమార స్వామి Time: 4:15 PM ►కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే.శివకుమార్ ►ప్రజాస్వామ్యానిదే విజయం, బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింది - ఖర్గే ►రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న బొమ్మై Time: 3:05 PM ► కర్ణాటకలో ఏ ఎగ్జిట్‌పోల్ ఊహించని మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. Time: 2:28 PM ► అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 136 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉన్నాయి. #KarnatakaElectionResults | Congress at 136 including 10 seats that the party has won so far and 126 seats where it is leading. BJP continues to lead in 60 seats. (Source: ECI) pic.twitter.com/GxwL8HgfpP — ANI (@ANI) May 13, 2023 Time: 1:18 PM ► రెండు చోట్ల ఓడిపోయిన బిజెపి మంత్రి సోమన్న వరుణ: కాంగ్రెస్ అగ్రనేత సిద్ధ రామయ్య చేతిలో ఓటమి చామరాజ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి చేతిలో ఓటమి Time: 1:15 PM ► కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 Time: 12:50 PM ► కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. Time: 12:45 PM ► చల్లకేరే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ ప్రస్తుతం 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ 67 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ కేవలం 22 స్థానాల్లోనే ముందంజలో ఉంది. Congress wins in Challakere constituency, leads in 128 seats in Karnataka BJP ahead in 67 seats and Janata Dal (Secular) leading in 22 constituencies pic.twitter.com/mPOjg3mKOY — ANI (@ANI) May 13, 2023 Time: 12:40 PM ► బీదర్ జిల్లా ఓవరాల్ 1. ఔరాద్లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి భీం సేన్ షిండేపై 9126 ఓట్ల ఆధిక్యంలో మంత్రి ప్రభు చౌహన్ 2. బీదర్ సిటీలో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసే సరికి JDS అభ్యర్థి సూర్యకాంత్ పై 9184 ఓట్ల ఆధిక్యంలో రహీం ఖాన్ 3. బీదర్ సౌత్ లో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసేసారికి బిజెపి అభ్యర్థి శైలేంద్రపై 1756 ఓట్ల ఆధిక్యంలో అశోక్ ఖేని 4. బాల్కిలో కాంగ్రెస్ ముందంజ బిజెపి అభ్యర్థి ప్రకాష్ ఖండ్రేపై 14054 ఓట్ల ఆధిక్యంలో ఈశ్వర్ ఖండ్రే 5. హుమ్నా బాద్ లో కాంగ్రెస్- బిజెపి మధ్య తీవ్ర పోటీ 15 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి సిద్దు పాటిల్ పై 484 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజశేఖర్ పాటిల్ 6. బసవ కళ్యాణ్ లో బిజెపి ముందంజ మాజీ సీఎం కొడుకు విజయ్ సింగ్ పై 4418 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి శరణు తల్గర్ ఆధిక్యం Time: 12:31 PM ►బళ్లారి రూరల్‌లో శ్రీరాములు(బీజేపీ) ఓటమి ►శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర గెలుపు ►వరుణ నుంచి సిద్ధరామయ్య విజయం ►చిత్తాపూర్ నుంచి ప్రియాంక్ ఖర్గే విజయం ►కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ఓటమి Time: 12:15 PM ► రామనగరలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ వెనుకంజ ► చిక్కమగళూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి వెనుకంజ ► హుబ్లీ ధార్వాడ్‌లో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ వెనుకంజ Time: 12:10 PM ► సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో ముందంజ ► మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణలో ముందంజ ► చెన్నపట్నంలో జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి ముందంజ Time: 11:53 AM ►హసన్‌లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ గౌడ ఓటమి Time: 11:53 AM ►కనకపుర స్థానంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విజయం. కనకపురా నుంచి నాలుగో సారి గెలుపొందిన శివకుమార్ Time: 11:42 AM ►ఎల్లాపురాలో బీజేపీ అభ్యర్ధి శివరామ్ విజయం ►హసన్‌లో స్వరూప్(జేడీఎస్) విజయం ►చల్లకెరలో రఘుమూర్తి( కాంగ్రెస్) విజయం ►హిరియూర్‌లో సుధాకర్(కాంగ్రెస్) విజయం ►'నందిని మిల్క్ గెలిచింది ...అమూల్ ఓడింది' అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు... కెపీసీసీ ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్. Time: 11:37 AM ►కాంగ్రెస్ కి ఫుల్ మెజార్టీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.140 సీట్లు వస్తాయన్న ధీమా మాకు ఉంది. రిసార్ట్ పాలిటిక్స్ జరిగేటటువంటి అవకాశం లేదు. బీజేపీ అవినీతే వాళ్లను ఓడిస్తోంది: డీకే.శివకుమార్ Time: 11:24 AM: ►వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య ఆధిక్యం, బీజేపీ మంత్రి సోమన్నపై 2710 ఓట్ల ఆధిక్యం. ►చెన్నపట్టణంలో జేడీఎస్ ఛీఫ్ కుమారస్వామి ఆధిక్యం Time: 11:23 AM: ►బీజేపీ మంత్రి మురుగేష్ నిరానీ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యం. Time: 11:21 AM: ► కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాదీ విజయం సాధించారు. 9వేల మెజార్టీతో లక్ష్మణ్ సవాదీ గెలుపొందారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లక్ష్మణ్ సవాదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? డి కె శివకుమార్ సిద్ధ రామయ్య మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి లింక్‌పై క్లిక్ చేయండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 Time: 11:16 AM ►గంగావతి నియోజకవర్గంలో 6000 ఓట్ల ఆధిక్యత తో కొనసాగుతున్న గాలి జనార్ధన్ రెడ్డి Time: 11:07 AM ►గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం ►కోస్టల్ కర్ణాటక, బెంగుళూరులో బీజేపీ ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►ఓల్డ్ మైసూర్లో జేడీఎస్‌కు గండికొట్టిన కాంగ్రెస్ ►ఓల్డ్ మైసూర్లో మూడో స్థానంలో బీజేపీ ►ఉత్తర కార్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే(కాంగ్రెస్) ఆధిక్యం ►గంగావతిలో గాలి జనార్థన్‌రెడ్డి ఆధిక్యం ►బళ్లారి సిటీలో గాలి అరుణ లక్ష్మి వెనుకంజ Time: 10:57 AM కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు చేశారు. #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm — ANI (@ANI) May 13, 2023 Time: 10:45 AM మరోసారి జేడీఎస్ పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉండగా.. మరోసారి చక్రం తిప్పేందుకు కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఆయనతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. Time: 10:38 AM ►షిగ్గావ్ స్థానంలో బస్వరాజ్ బొమ్మె (భాజపా) ఆధిక్యం ►వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్) ఆధిక్యం ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ఆధిక్యం ►ఆధిక్యంలోకి వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ►హోళెనర్సీపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యం Time: 10:32 AM ►కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్(113) దాటింది.140 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు బెంగుళూరు రావాలని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. దూసుకుపోతున్న కాంగ్రెస్.. ► కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ► గంగావతి నియోజకవర్గంలో 2700 ఓట్ల ఆధిక్యతలో గాలి జనార్ధన్ రెడ్డి ► మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ► రెండో రౌండ్లో కాంగ్రెస్ మరింత దూకుడు. ► అనేక ప్రాంతాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ► బసవ కళ్యాణ్‌లో మాజీ సీఎం ధరమ్ సింగ్ కొడుకు విజయ్ సింగ్ కి షాక్ ► బసవ కళ్యాణ్‌లో ముందంజలో బీజేపీ అభ్యర్థి శరణు తల్గర్. ► 4 రౌండ్లు ముగిసే సరికి 12980 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ► బాగేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి ఆధిక్యత. ► పావగడ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి తిమ్మరాయప్ప ముందంజ ►బీదర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జేడీఎస్ అభ్యర్థి సూర్యకాంత్ ఆధిక్యం ► ఔరద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మంత్రి ప్రభు చవాన్ ముందంజ ► హుమనబాద్ లో బీజేపీ అభ్యర్థి సిద్దూ పాటిల్ ఆధిక్యంలో ► బీదర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్దాలే ముందంజ. ► బాల్కి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే ముందంజ Time: 09:57 AM ►హైదరాబాద్‌లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ ►ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌లు బల్క్ బుకింగ్ ►కర్ణాటక, హైదరాబాద్ వ్యక్తుల పేర్లతో రూమ్స్ బుకింగ్ ►ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించే అవకాశం Time: 09:44 AM ►కాంగ్రెస్ 82, బీజేపీ 52, జేడీఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి ►6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో డీకే శికుమార్ ►షిగ్గావ్‌లో బస్వరాజు బొమ్మై(బీజేపీ) ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య(కాంగ్రెస్) ముందంజ ►చెన్నపట్టణలో కుమారస్వామి(జేడీఎస్) స్వల్ప ఆధిక్యం ►రామనగర్‌లో నిఖిల్ కుమారస్వామి(జేడీఎస్) ముందంజ ►బెంగుళూరులో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 82 seats, BJP in 52 seats while the JDS is leading in 16 seats. #KarnatakaPolls pic.twitter.com/sL4RFJUYJ6 — ANI (@ANI) May 13, 2023 Time: 09:32 AM గాలి జనార్దన్ రెడ్డి దంపతులు ఆధిక్యం గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యం - బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం - బళ్లారి (ఎస్ టీ) స్థానంలో శ్రీరాములు (భాజపా) ఆధిక్యం - చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (భాజపా) వెనుకంజ - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఆధిక్యం - చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (భాజపా) ఆధిక్యం Time: 09:29 AM ►హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, మైసూరులో కాంగ్రెస్ హవా ►కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఆధిక్యం ►బెంగుళూరు, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ►షిగ్గావ్‌లో బస్వరాజ్ బొమ్మై ముందంజ Time: 09:24 AM 8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజలో ఉన్నారు. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్(113)ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 44 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Karnataka Election Results: As per ECI, Congress takes the lead in 44 seats, BJP in 23 seats while JDS leads in 07 seats.#KarnatakaElectionResults2023 pic.twitter.com/bFP4AfpZjN — ANI (@ANI) May 13, 2023 Time: 09:20 AM 113 మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, జేడీఎస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 25 seats, BJP in 12 seats while the JDS is leading in 02 seats. #KarnatakaPolls pic.twitter.com/ReFREHP7Wt — ANI (@ANI) May 13, 2023 Time: 09:12 AM ►8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజ ►చిక్ మంగుళూరులో సీటీ రవి వెనుకంజ ►గంగావతిలో గాలి జనార్థన్‌రెడ్డి ముందంజ ►బళ్లారి సిటీలో గాలి అరుణలక్ష్మి ముందంజ Time: 09:05 AM ►ఏడుగురు కర్ణాటక మంత్రుల వెనుకంజ ►మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి వెనుకంజ ►వరుణాలో సిద్ధరామయ్య ముందంజ #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 Time: 09:02 AM ►బసవరాజు బొమ్మై ముందంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్ శెట్టర్ ముందంజ Time: 08:59 AM ►ముంబై కర్ణాటకలో హోరాహోరీ ►ఇప్పటివరకు చెరో 23 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆధిక్యం ►బెంగుళూరు నగరంలో కాంగ్రెస్ 17, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ 23, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం Time: 08:49 AM ►100 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే వెనుకంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్‌శెట్టర్ వెనుకంజ ►గాంధీనగర్‌లో దినేష్ గుండూరావు ముందంజ Time: 08:46 AM ►కనకపురంలో డీకే శివకుమార్ ముందంజ ►బళ్లారి రూరల్‌లో శ్రీరాములు ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య ముందంజ Time: 08:39 AM ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చెన్న పట్టణంలో కుమారస్వామి, బళ్లారిలో గాలి అరుణలక్ష్మి వెనుకంజలో ఉన్నారు. Time: 08:36 AM పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో తొలుత ఆధిక్యంలో బీజేపీ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లో జేడీఎస్ పుంజుకుంటోంది. Time: 08:31 AM కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై దర్శించుకున్నారు. #WATCH | As counting of votes begins for #KarnatakaPolls, CM Basavaraj Bommai visits Hanuman temple in Hubballi. pic.twitter.com/isXkxoa79D — ANI (@ANI) May 13, 2023 Time: 08:18 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్ ఫిగర్ 113, కాంగ్రెస్ అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. Time: 08:14 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం Time: 08:11 AM బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది:బొమ్మై మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని బొమ్మై అన్నారు. #WATCH | Today is a big day for Karnataka as the people's verdict for the state will be out. I am confident that BJP will win with absolute majority and give a stable government, says Karnataka CM Basavaraj Bommai, in Hubballi. pic.twitter.com/8r9mKGiTIe — ANI (@ANI) May 13, 2023 Time: 08:02 AM కౌంటింగ్ ప్రారంభం కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. Time: 07:44 AM ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనే: కుమారస్వామి ►ఎగ్జిట్ పోల్స్‌పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి.. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. #WATCH | "No one has contacted me till now. There is no demand for me, I am a small party" says JD(S) leader HD Kumaraswamy, ahead of Karnataka election results. pic.twitter.com/0Mkbqdd7Tr — ANI (@ANI) May 13, 2023 ►ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ►ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. ►కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ►ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ►ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ►ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు ►కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. ►వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ►ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
Karnataka: బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరు: కర్ణాటకలో రేపు(శనివారం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు గెలుపు తమదంటే తమదేనని తెగేసి చెబుతున్నాయి. అటు జేడీఎస్ మాత్రం కీరోల్ మాదేనంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎన్నికల్లో ఫలితాల్లో సందర్భానుసారం, కర్ణాటకకు ఎవరితో మంచి జరుగుతుందో బేరీజు వేసుకుని మద్దతు ప్రకటిస్తామని జేడీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించన్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపుపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాలపై కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. Karnataka Assembly Elections 2023 LIVE Updates: Sec 144 imposed in Bengaluru, liquor sale banned https://t.co/oCoxBnE9Pd Ramesh rightly observed that Modi is responsible for Karnataka, TN, Kerala, AP, Telangana losses. South India will be renamed as Islamic Republic of India — Nationalist (@JagdeepakSharma) May 12, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్ -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
Karnataka: కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయాం అన్నారు. తాము నిధుల కొరతతో గెలిచే 25 స్థానాల్లో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు తాను జేడీఎస్ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయానంటూ వాపోయారు. కనీసం 120 రాకపోయినప్పటికీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. జేడీఎస్ మేకర్ కాదని కచ్చితంగా కింగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..) -
Karnataka: 2018 టైంలో అలా.. మరి ఇప్పుడు ఎలా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని, అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడించాయి. విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు మారాయంతే) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికాగా.. ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది కూడా!. 👉 కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్ ఛానెల్ సర్వే కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. 👉 అదే సమయంలో వేసిన హంగ్ అంచనా కూడా ఫలించింది. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప.. మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై కాంగ్రెస్, జేడీఎస్‌లు సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలతో సీన్ మారింది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 👉 అప్పుడు ఎగ్జిట్‌పోల్స్ మాదిరే ఇప్పుడు గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి కనిపిస్తోంది. 👉 ఇక.. గత ఎగ్జిట్‌పోల్స్‌కి ఇప్పటి ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత.. జేడీఎస్ పార్టీ. గత ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్ విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్‌మేకర్ అవుతుందని కూడా ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన జోస్యం ఫలించింది. 👉 ఇప్పుడు కూడా ఎగ్జిట్‌పోల్స్.. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. -
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మరి జేడీఎస్?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం.. పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు. 13వ తేదీన ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది తేలిపోతుంది. ఈలోగా ఓటర్‌నాడిని అంచనా వేస్తూ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా.. దాదాపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ హంగ్ సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 👉 కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక జనతాదళ్ సెక్యులర్ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్‌పోల్స్ కోడై కూస్తున్నాయి. 👉 ఈ రీజియన్‌లో ఓటింగ్ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్ షేర్‌ను కాషాయం పార్టీ దక్కించుకోనుంది. కాంగ్రెస్ కూడా దాదాపు 40 శాతం ఓట్ షేర్ దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 👉 ఇక రాజధాని బెంగళూరు రీజియన్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సగానికి పైగా సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్ డిజిట్ నుంచి పది స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 👉 ఓట్ షేరింగ్‌లో.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం, జేడీఎస్ ఓట్ షేరింగ్ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్‌లో మెల్కోటోలో అత్యధికంగా 67.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. సీవీ నగర్లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది. 👉 సెంట్రల్ కర్ణాటకలో ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఇక జేడీఎస్ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది. 👉 హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ రీజియన్‌లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్ ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్‌లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్‌కే దక్కవచ్చని అంచనా వేశాయి. ఇక కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న.. ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ రీజియన్ల ఓటర్లు సైతం జేడీఎస్ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక, అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అన్ని ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113. అయితే, ఏ పార్టీ 113 స్థానాల్లో పూర్తి మెజార్టీ రాలేదని అన్ని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 94-108 బీజేపీ: 85-100 జేడీఎస్: 24-32 #KarnatakaVotes | BJP leader Charu Pragya #LIVE on Republic, speaks on Republic-PMARQ Exit Poll projections which show that BJP gets a clean sweep in Coastal Karnataka with 14-18 seats.#KarnatakaElections #ExitPolls#BJP #Congresshttps://t.co/4WhdtSeq74 pic.twitter.com/N4Y6LXcFBl — Republic (@republic) May 10, 2023 జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 91-106 బీజేపీ: 94-117 జేడీఎస్: 14-24 AsiaNet Jan Ki Baat Exit Poll #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/C7wzN3df25 — News Arena India (@NewsArenaIndia) May 10, 2023 మ్యాటరేజ్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 103-118 బీజేపీ: 79-99 జేడీఎస్: 23-25 ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్: 122-140 బీజేపీ: 62-80 జేడీఎస్: 20-25 ఇతరులు: 3 టైమ్స్ నౌ/ ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 106-120 బీజేపీ: 78-92 జేడీఎస్: 20-26 ఇతరులు: 2-4 Predicting #KarnatakaAssemblyElections2023. Here's .@TNNavbharat-ETG Research seat and vote share predictions#ExitPoll #KarnatakaAssemblyElection pic.twitter.com/RHjTdRhrnB — ETG Research (@ETG_Research) May 10, 2023 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 99-109 బీజేపీ: 88-98 జేడీఎస్: 21-26 Exit Poll: Poll Strat ಸಮೀಕ್ಷೆ - 2023 BJP -88-98 Congress - 99-109 JDS - 21-26 Others - 00#KarnatakaElections2023 #PollStrat #KarnatakaAssemblyElection2023 #ResultsOnRitamKannada #Karnataka #ExitPolls pic.twitter.com/jzWf5XLCtk — Ritam ಕನ್ನಡ (@RitamAppKannada) May 10, 2023 ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 100-112 బీజేపీ: 83-95 జేడీఎస్: 21-29 Watch : कौन बनेगा कर्नाटक का किंग मेकर? + कर्नाटक में जीत किसकी, क्या कहते हैं एग्जिट पोल के आंकड़ें, जानिए@RubikaLiyaquat | @romanaisarkhan | @dibanghttps://t.co/smwhXUROiK #ExitPollOnABP #KarnatakaElections pic.twitter.com/t3Vx1B49Sf — ABP News (@ABPNews) May 10, 2023 న్యూస్ నేషన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 86 బీజేపీ: 114 జేడీఎస్: 21 ఇతరులు: 3 News Nation CGS Exit Poll BJP : 114 INC : 86 JDS : 21 OTH : 3 First exit poll to predict clear cut win for BJP. #KarnatakaAssemblyElections2023 — News Arena India (@NewsArenaIndia) May 10, 2023 జీ న్యూస్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 103-108 బీజేపీ: 79-94 జేడీఎస్: 25-33 #ExitPollOnZee | कर्नाटक के #ExitPoll में कांग्रेस को बढ़त LIVE: https://t.co/KqtjwEjRLK#KarnatakaElections #KarnatakaAssemblyElection2023 #BJP #Congress || @DChaurasia2312 @ShobhnaYadava pic.twitter.com/1vjkeCKGxZ — Zee News (@ZeeNews) May 10, 2023 సీ-డైలీ ట్రాకర్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 130-157 బీజేపీ: 37-56 జేడీఎస్: 22-34 ఇతరులు: 3 We will not publish any other exit poll because we are sure that the opinion polls we publish will be in the result. See you on 13th May ⚫️ Total Seat - 224/224 ▪️BJP - 37-56 ▪️ INC - 130-157 ▪️JD(S)- 22-34 ▪️ OTH - 00 - 03#CdailyTracker #KarnatakaElections2023 #OpinionPoll pic.twitter.com/CTZNf3Qu7V — C-Daily Tracker (@CdailyTracker) May 9, 2023 పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 107-119 బీజేపీ: 78-90 జేడీఎస్: 23-29 ఇతరులు: 1-3 ఇక పీపుల్స్ పల్స్ టాప్ సీఎం ఛాయిస్ ఎగ్జిట్‌పోల్‌లో.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు అత్యధిక శాతం (42) ఓట్లు దక్కాయి. ఆ తర్వాతి ప్లేస్‌లో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, బీఎస్ యాడియూరప్ప, డీకే శివకుమార్ ఉన్నారు. -
యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు
కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లా అయిన యాద్గిర్లో ఎన్నికల వేడి హోరెత్తిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఇక్కడ హోరాహోరీ తలపడుతున్నాయి. బీమా నదీ పరివాహక ప్రాంతమైన ఈ జిల్లాలోని ఓ చిన్న భాగానికి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తుండడంతో ఇక్కడ వ్యవసాయాధారిత ప్రజలు ఎక్కువగా ఉంటారు. గుర్మిట్కల్లో కొంత మేర పరిశ్రమలు ఉండగా, షాహ్పూర్లో తెలుగు ప్రజలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అయితే, రాజకీయంగా చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు ఏకపక్షంగా లేరని, విలక్షణ తీర్పు ఇవ్వనున్నారని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. యాద్గిర్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి నియోజకవర్గాల వారీగా.. షాహ్పూర్ తెలుగు ప్రజల ప్రభావం కన్పించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంత మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ చాలా కాలంగా శరణబసప్ప, గురుపాటిల్ శిర్వాల్ కుటుంబాల మధ్యనే రాజకీయంగా వైరం ఉంది. ఈసారి కూడా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఈ కుటుంబాలకు చెందిన వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గతంలో జేడీఎస్ నుంచి పోటీ చేసిన అమీన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబ రాజకీయ వైరంలో ఈయన ఈసారి కూడా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సుర్పూర్ ఇక్కడ ఓసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పోటీ మాత్రం 2008 నుంచి తలపడుతోన్న నరసింహనాయక్ (రాజగౌడ), రాజా వెంకటప్పనాయక్ల మధ్యనే కనిపిస్తోంది. నరసింహ నాయక్ బీజేపీ సిట్టింగ్కాగా, వెంకటప్పనాయక్ కాంగ్రెస్ పక్షాన బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ నుంచి బరిలో ఉన్న కొత్త అభ్యర్థి శ్రవణ్‌కుమార్ నాయక్ ప్రభావం తక్కువగానే ఉంది. కురబ యాదవ సామాజిక వర్గం ఇక్కడ ప్రభావిత శక్తి కాగా, బీజేపీ వైపు కొంత సానుకూలత కనిపిస్తోంది. గుర్మిట్కల్ ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోరు నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ పక్షాన గత ఎన్నికల్లో గెలిచిన నాగనగౌడ కుమారుడు శరణ గౌడకు టికెట్ లభించింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూరావు చించన్సూర్, బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి లలితా అనపూర్ తలపడుతున్నారు. ఈ ఇద్దరి సామాజిక వర్గం ఒకటే. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే కోలీ (ముదిరాజ్) వర్గానికి చెందిన ఇద్దరిలో కొంత మొగ్గు బాబూరావు వైపే కనిపిస్తున్నా లలిత చీల్చే ఓట్లను బట్టి గెలుపోటములు నిర్ధారణ కానున్నాయి. ఇక్కడి ప్రజలు జేడీఎస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. యాద్గిర్ లింగాయత్ సామాజికవర్గ ప్రభావం కనిపించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్ బరిలో ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎ.బి.మలక్రెడ్డి ఈసారి జేడీఎస్ పక్షాన పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకట్‌రెడ్డి ముద్నాల్ బరిలో ఉన్నారు. జేడీఎస్ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ మలక్రెడ్డి రాకతో పోటీలోకి వచ్చింది. మొత్తంగా బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి -
Karnataka, assembly elections 2023: మైకులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు. ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్‌షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్‌గా నిలిచాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి. రూ.375 కోట్లు జప్తు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి. -
Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి
నారాయణపూర్, హోస్పేట ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో.. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన తెలుగు ప్రజలు చేసే వ్యవసాయంతో కళకళలాడుతూ కనిపించే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు రాజకీయంగా చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయాభివృద్ధి కనిపిస్తుంది. రాయచూర్ (పట్టణ), రాయచూర్ (గ్రామీణ), సింధనూర్, మస్కి, మాన్వి, దేవదుర్గం, లింగుసూగుర్ నియోజకవర్గాలున్న రాయచూర్ జిల్లాలో.. ఈసారి ఎన్నికల్లో అనేక రాజకీయ, సామాజిక అంశాలు ప్రభావం చూపనున్నాయి. లింగాయత్, వాల్మీకి (నాయక్)లతోపాటు తెలుగు ప్రజలు ఇక్కడ ఎక్కువ. రెండు నియోజకవర్గాల్లో అయితే తెలుగు ప్రజలే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇది. రాయచూర్ పట్టణ (అర్బన్) రాయచూర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన శివరాజ్‌పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ మహ్మద్‌షా ఆలం, జేడీఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వినయ్‌కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పాటిల్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీ పరంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. షా ఆలంకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. రాయచూరు గ్రామీణ (రూరల్) ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన రాయచూరు రూరల్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దద్దల్ బసన్నగౌడ, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తిప్పరాజు, జేడీఎస్ అభ్యర్థి, మాజీ జెడ్పీ సభ్యుడు చిన్న నర్సింహనాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు సాత్వికుడనే పేరుంది. పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే ఈ నియోజకవర్గానికి కృష్ణా, తుంగభద్ర జలాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయన్న భావన ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బసన్నగౌడ పట్ల సానుకూలత కనిపిస్తోంది. సింధనూర్ జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట్రావ్ నాడగౌడ, కాంగ్రెస్ నుంచి అంపన్నగౌడ బాదర్లి బరిలో ఉండగా, బీజేపీ నుంచి కరియప్ప పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువే అయినా కరియప్ప కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీ టికెట్ తెచ్చుకోవడంతో.. త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ తెలుగువారు ఎక్కువ. వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు. లింగుసూగుర్ ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కాంగ్రెస్ నుంచి డీఎస్ ఉలిగేరి, బీజేపీ నుంచి మానప్ప వజ్జల్, జేడీఎస్ నుంచి సిద్ధూ బండి పోటీ చేస్తున్నారు. పైకి మాత్రం ఉలిగేరి, వజ్జల్ మధ్య పోటీ భీకరంగా కనిపిస్తోంది. అయితే, సిద్ధూ బండిపై సానుభూతి కనిపిస్తోంది. ఆయన గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆయనకు ఓట్లు పడతాయనే అంచనాలున్నాయి. జేడీఎస్ ప్రభుత్వం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారనే అభిప్రాయం కలసిరానుంది. మస్కి ఇక్కడ పారీ్టలు మారినా ప్రత్యర్థులు పాతవారే. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బసన్నగౌడ గతంలో బీజేపీలో పనిచేశారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న ప్రతాపగౌడ పాటిల్ అంతకుముందు కాంగ్రెస్‌లో పనిచేశారు. గత ఎన్నికల్లో, తర్వాత ఉప ఎన్నికల్లో వారు తలపడ్డారు. ఇప్పుడూ వీరి మధ్యనే పోటీ ఉంది. ఇక్కడ వాల్మీకి, లింగాయత్‌లు చెరోసగం బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ఉండగా.. ఇతర కులాలు, తెలుగు క్యాంపులు కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి. జేడీఎస్ నామమాత్రపు పోటీకి మాత్రమే పరిమితమనే అంచనాలున్నాయి. మాన్వి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం మాన్విలో హోరాహోరీ పోరు నడుస్తోంది. జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంపయ్యనాయక్, బీజేపీ నుంచి బీవీ నాయక్ పోటీ చేస్తున్నారు. లింగాయత్, వాల్మీకి వర్గాలు ప్రధాన ఓటర్లు అయినా తెలుగువారి ప్రభావం ఎక్కువే. మాన్వి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు బోసురాజు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వెంకటప్పనాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరూ తెలుగు ఓటర్ల మద్దతుతోనే గెలిచారని అంచనా. ఈసారి కూడా వారు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు కనిపిస్తున్నారు. దేవదుర్గం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదని, జేడీఎస్ అధికారంలో ఉన్నప్పుడే నారాయణపూర్ నుంచి సాగునీరు తీసుకువచ్చిందన్న సానుకూలత కనిపిస్తోంది. ఇక్కడ జేడీఎస్ నుంచి కరెమ్మ నాయక్, కాంగ్రెస్ నుంచి శ్రీదేవీ నాయక్, బీజేపీ నుంచి శివన్నగౌడ పోటీలో ఉన్నారు. జేడీఎస్ రెండు సార్లు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కరెమ్మ నాయక్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. కాంగ్రెస్ అభ్యరి్థకి ఉన్న కుటుంబ రాజకీయ బలం కొంతమేర ప్రభావం చూపనుంది. -
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్‌లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
తెలుగు ప్రజల మధ్దతుతో మేమె గెలుస్తాం...
-
karnataka Assembly Elections: హై ఓల్టేజ్ సీట్లలో అమీతుమీ!
సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. శిగ్గావ్లో సీఎం బొమ్మైకు పరీక్ష హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నపట్టణలో కుమారకు పోటీ రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వరుణలో సిద్దుకు తేలికేనా? మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు. కనకపురలో ఇద్దరు దిగ్గజాలు కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది. రామనగరలో తనయుని కోసం.. రామనగర నుంచి మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు. విజయేంద్రకు ఢోకా లేదా! శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. -
మార్పు దిశగా..!
కలబురిగి నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ‘హైదరాబాద్–కర్ణాటక’ ప్రధాన రాజకీయ పక్షాలకు సవాల్ విసురుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను సమానస్థాయిలో ఆదరించిన బీదర్, కలబురిగి ఓటర్లు బీదర్ దక్షిణ నియోజకవర్గంలో జేడీఎస్‌కు పట్టం కట్టారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి దిగ్గజ నేతలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబాలకు చెందిన నాయకులు బరిలోకి దిగారు. వీరిలో కొందరికి ప్రభుత్వ వ్యతిరేకత, మరికొందరికి స్థానిక వ్యతిరేకత తోడవుతుండటంతో ఫలితాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో పార్టీలు, ఎజెండాలు, హామీలు పక్కన పెట్టి అభ్యర్థుల గుణగణాలకే ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. గత ఐదేళ్లలో రెండు పార్టీలు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారడంతో ‘సుస్థిర ప్రభుత్వం’ భావన ఓటర్లలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నెల 10న జరిగే పోలింగ్‌లో ‘మార్పు’కు పట్టం కట్టేందుకు బీదర్, కలబురిగి ఓటర్లు సిద్ధమవుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. మూడు పార్టీల పాలన బేరీజు 40 శాతం కమీషన్ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లగా, అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం, పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండటం, హిజాబ్, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, అవినీతి, రిజర్వేషన్లు వంటి అంశాలు బీజేపీపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ ఇమేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తోంది. పాత నేతలకే టికెట్లు ఇవ్వడం కూడా బీజేపీకి ప్రతికూలంగా పరిణమించే సంకేతాలున్నాయి. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనతో పోల్చిచూడటం కూడా బీజేపీకి కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పాతనేతలకే టికెట్లు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా బీజేపీ అభ్యర్థుల ప్రతికూలతలను అనుకూలంగా మలచుకునే వ్యూహంతో పనిచేస్తోంది. అయితే కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల కుమ్ములాటలతో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదనే అనుమానాలు ఓటర్లలో ఉన్నాయి. బీజేపీ ప్రతికూల ఓటును జేడీఎస్ బలంగా చీల్చుకునే అవకాశం ఉండటం కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే సూచనలున్నాయి. కరోనా సమయంలో సామాజిక సేవలో నిమగ్నమైన జేడీఎస్ అభ్యర్థుల పట్ల కొన్నిచోట్ల సానుకూలత కనిపిస్తోంది. జేడీఎస్ సొంత బలంతో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేని ఓటర్లు స్థానికంగా బలమైన అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మఠాధిపతుల ప్రభావం తగ్గుముఖం బీదర్, కలబురిగి జిల్లాల్లోని 15 నియోజకవర్గాల్లో అలంద్, గుల్బర్గా ఉత్తర నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. గతంలో మాదిరిగా ఈ సామాజికవర్గంలో బీజేపీ వైపు ఏకపక్షంగా మొగ్గు కనిపించడం లేదు. మాజీ సీఎం యడియూరప్పను పదవి నుంచి తప్పించడంపై లింగాయత్ సామాజికవర్గంలో కొంతమేర అసంతృప్తి ఉంది. గతంలో ఓటర్లను ప్రభావితం చేసిన పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకీ బహిరంగ మద్దతు ప్రకటించకుండా గుంభనంగా ఉన్నారు. గుల్బర్గా ఉత్తర, దక్షిణ, రూరల్, బీదర్ దక్షిణ, ఉత్తర, హుమ్నాబాద్, అలంద్‌లో ముస్లిం ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్‌లలో మైనారిటీ ఓటు బ్యాంకుపై ధీమా కనిపిస్తోంది. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి కర్ణాటకలోనే వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన కలబురిగి, బీదర్ జిల్లాల నుంచి విద్యాధికులు బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, విద్యాసంస్థలు, సిమెంట్ కర్మాగారాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంపై అసంతృప్తి కనిపిస్తోంది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కొంత మెరుగ్గా ఉన్నా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, డంప్‌యార్డులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఏడో వేతన సవరణ జరగకపోవడంతోపాటు ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో వర్గీకరణ, ముస్లింల రిజర్వేషన్లు తొలగింపు వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచార ఎజెండాగా ఉన్నాయి. బీదర్ దక్షిణ, బీదర్ ఉత్తర, ఔరాద్, చించోలి, సేడమ్ నియోజకవర్గాలపై తెలంగాణ ప్రభావం కొంతమేర కనిపిస్తోంది. తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామంటూ జేడీఎస్ తెలంగాణ ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలతో సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తోంది. -
మేనిఫెస్టోల మహా యుద్ధం
సమయం దగ్గర పడుతున్నకొద్దీ సమరం తీవ్రమవుతోంది. మే 10న జరగనున్న పోలింగ్‌కు మరో వారం రోజులే ఉన్న వేళ ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య కర్ణాటకలో మాటల తూటాలు పేలుతున్నాయి. మేనిఫెస్టోలతో మహా యుద్ధమే జరుగుతోంది. బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ జపం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ గద్దెనెక్కితే అది ‘డబుల్ డిజాస్టర్’ అని ఎద్దేవా చేస్తోంది. మళ్ళీ కింగ్‌మేకర్ తానేనని జేడీ–ఎస్ భావిస్తోంది. గత 30 ఏళ్ళలో ఇంత పోటాపోటీగా కర్ణాటక ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. బీజేపీ, కాంగ్రెస్‌లు పైచేయి సాధించడమే లక్ష్యంగా ప్రకటించిన మేనిఫెస్టోలే అందుకు సాక్ష్యం. ప్రతిపక్షాల కుల సమీకరణాలను అభివృద్ధి, సంక్షేమ అజెండాలతో ఢీ కొట్టి, దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ శ్రమిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం నిరసన ఎదుర్కొన్న ఆ పార్టీ తన ప్రాథమిక బలాలే ఆసరాగా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. అందుకే, ఇటు సంక్షేమం, అటు హిందూత్వ డిమాండ్ల మేళవింపుగా మేనిఫెస్టోను అందించింది. ప్రజలకు ఉచితంగా ఇచ్చే సంక్షేమ పథకాలను ‘తాయిలాలు’ అంటూ రాష్ట్రాలను నిత్యం విమ ర్శించే జాతీయ పార్టీ కర్ణాటకలో మాత్రం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి (బీపీఎల్) అంటూనే సంక్షేమ హామీలు గుప్పించింది. 3 హిందూ పండుగలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అందుబాటు ధరల్లో ఆహార క్యాంటీన్లు, రోజూ అరలీటరు పాలు, వృద్ధులకు ఉచిత ఆరోగ్య చెకప్‌లు వాగ్దానం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) లాంటి తన సైద్ధాంతిక అంశాలనూ జోడించింది. కాంగ్రెస్ నిరుద్యోగం, మహిళా సాధికారతపై దృష్టి పెడుతూనే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంటి గృహలక్ష్మికి నెలనెలా రూ. 2 వేలు, బీపీఎల్ కుటుంబాలకు నెలకు 10 కిలోల ధాన్యాలు, నిరు ద్యోగులకు నెలవారీ డబ్బులు, స్త్రీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటివి వాగ్దానం చేసింది. రెండు పార్టీలూ మేనిఫెస్టోల సమరంలోకి దిగాయి. కూడు, గూడు, గుడ్డ లాంటి ప్రాథమిక సంక్షేమం అందించకుండా కేవలం రోడ్ల విస్తరణ లాంటి అభివృద్ధిపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రజల స్థితిగతుల్లో పెనుమార్పులు ఉండవు. కాబట్టి సంక్షేమ వాగ్దానాలు తప్పేమీ కాదు. కాకుంటే, పోలింగ్‌కు 9 రోజుల ముందు ప్రకటించిన ఇవి కంటితుడుపు కాకూడదు. ఎన్నికల వాగ్దానపత్రాలను అమలుచేసే చిత్తశుద్ధి ఎన్ని పార్టీలకు ఉన్నాయన్నది ప్రశ్న. నిజానికి, మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక పార్టీలు అమలు చేశాయా అన్నదానిపై ఎన్నికల సంఘపు ఆడిటింగ్ అభిలషణీయం. కర్ణాటక, కేరళల్లో బలంగా వేళ్ళూనుకున్న తీవ్రవాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ)పై ‘ఉపా’ చట్టం కింద గత సెప్టెంబర్‌లో కేంద్రం విధించిన నిషేధాన్ని కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. అందుకు ప్రతిగా కాంగ్రెస్ విద్వేషాన్ని ప్రోత్సహించే పీఎఫ్ఐ సహా బజరంగ్ దళ్ లాంటి అన్నిటినీ నిషేధిస్తామని ప్రకటించింది. ఈ వివాదాస్పద ప్రకటన కథలో కొత్త మలుపు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు సాక్ష్యమంటూ కమలనాథులంతా ధ్వజమెత్తే అవకాశం దొరికింది. ఇది సాక్షాత్తూ బజరంగ్‌ను (హనుమంతుణ్ణి) అవమానించడమే అనే కథనంతో హిందూత్వ అంశాన్ని బీజేపీ పైకి తెచ్చింది. కరడుగట్టిన కాషాయ దళమే అయినా, కర్ణాటకలో కొన్నిసార్లు మైనారిటీలపై దాడులకు దిగినా – బజరంగ్ దళ్‌ను, దేశ వ్యతిరేక పీఎఫ్ఐతో ఒకే గాటన కట్టవచ్చా? కానీ, తప్పొప్పులు మరిచిన మాటల పోటీలో ఎవరిని మాత్రం తప్పు పట్టగలం! చిత్రమేమిటంటే కర్ణాటకలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న మోదీ మాత్రం మేనిఫెస్టోలో తమ పార్టీ సైతం సంక్షేమ పథకాలు ప్రకటించిన సంగతి విస్మరించి, కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఉక్రోషం వెళ్ళగక్కడం! కాంగ్రెస్‌వన్నీ అవాస్తవిక హామీలనీ, వాటిని నెరవేరిస్తే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందనీ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. కాంగ్రెస్ తన హామీలను నెరవేరిస్తే, ఇప్పటి దాకా బీజేపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ఆగిపోతాయంటూ వింతవాదన తెరపైకి తెచ్చారు. ఇది సామాన్యులు హర్షిస్తారా అన్నది ప్రశ్న. ఇప్పటికే కొంత ప్రజాభిప్రాయం, ప్రధాన సర్వేలు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ, కర్ణాటకలో ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్న అమిత్ షా మాత్రం తమకు మెజారిటీ దాటి 15 సీట్లయినా వస్తాయంటున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం గత రెండు దశాబ్దాల్లో కర్ణాటకలో జరగని కథ. మొత్తానికి, ప్రధానపార్టీలు రెండూ తమ లక్ష్యం ఎవరనే స్పష్టతతో మేనిఫెస్టోలు తెచ్చాయి. వాటితోపాటు తమ వాదనలు తాము చేస్తున్నాయి. అయితే, ముస్లిమ్ రిజర్వేషన్ల రద్దు సహా విభజన రాజకీయాలతో కొత్త ఓటర్లను బీజేపీ ఆకట్టుకోవడం సాధ్యమేనా? అలాగే, బీజేపీది 40 శాతం కమిషన్ల అవినీతి సర్కార్ అనే వాదన ఒక్కటే పట్టుకుంటే కాంగ్రెస్ గద్దెనెక్కగలదా? 224 అసెంబ్లీ స్థానాల కర్ణాటక 2004 నుంచి ఇప్పటికి 11 మంది సీఎంలను చూసింది. కొన్నేళ్ళుగా మతోద్రిక్తతలు పెంచడం ద్వారా ఓటు బ్యాంక్ స్థిరీకరణ యత్నాలూ సాగాయి. 2018 తర్వాత ఆ అంశంపై ఓట్లు సంతృప్తస్థాయికి చేరాయనీ, కొత్తగా వచ్చేవేమీ లేవనీ బీజేపీకి అర్థమైంది. మరి ఆఖరులో అంది వచ్చిన బజరంగ్దళ్ వివాదం కలిసొస్తుందా? ఓట్లశాతంలో కొద్ది తేడాతో తలరాత మారే వేళ నిశ్శబ్ద ఓటర్ల మన్‌కీ బాత్ కీలకం. కాకపోతే, తరచూ ఎమ్మెల్యేల బేరసారాలు చూస్తున్న కన్నడసీమ ఈసారి హంగ్ తీర్పునివ్వదనీ, ఏదో ఒక పార్టీకే మెజారిటీ ఇస్తుందన్న సర్వే నిపుణుల హామీయే సాంత్వన. -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్‌పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్, జేడీఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో పంపిణీకి సిద్ధమైందని నిందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో సంజయ్ పర్యటించారు. బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్ధి మునిరాజుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడి మీడియాతోనూ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పనిచేస్తున్నాయని, ఆ పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు. ‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైంది. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవే. వాటిని పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైనరు. ఒక్క పైసా తక్కువిచ్చినా ఊరుకోకండి. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్‌ను ఖతం చేయండి. కేసీఆర్ మహా తెలివైన వాడు. మొన్నటిదాకా జేడీఎస్ కు పైసలిచ్చిండు. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే సరికి కాంగ్రెస్ పంచన చేరిండు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదట. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నడు. ’అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. -
Karnataka Assembly Election 2023: జేడీ(ఎస్)కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లే
సక్లేశ్పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్‌తో జత కట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్పుర సెగ్మెంట్లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హీటెక్కుతున్న రాజకీయం
-
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏడాదికి ఉచితంగా 5 గ్యాస్ సిలిండర్లు.. ఎన్నికల ముందు సంచలన నిర్ణయం
బనశంకరి: శాసనసభ ఎన్నికలకు జేడీయస్ పార్టీ మేనిఫెస్టోని విడుదలచేసింది. శనివారం పద్మనాభనగరలోని మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ నివాసంలో విడుదల చేశారు. ముఖ్యంగా 12 హామీలు ఉన్నాయి. మహిళల బలోపేతం, కన్నడకు ప్రాధాన్యం, రైతు చైతన్యం, వృద్ధులకు సన్మానం, విద్య ఆధునిక శక్తి, ఆరోగ్య సంపద, దివ్యాంగులకు ఆసరా, మతపర మైనారిటీల ప్రగతి, ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రోత్సాహకాలు, సీ్త్ర స్వయం సేవా సంఘాలకు రుణాలు మాఫీ, పేద కుటుంబాలకు ఏడాదికి 5 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, గర్భిణీలకు 6 నెలలపాటు రూ.6 వేలు భత్యం, వితంతు పింఛన్ రూ.900 నుంచి రూ.2500 లకు పెంపు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.5 వేలు వేతనం, అలాగే కనీసం 15 ఏళ్లు సర్వీసుతో రిటైరైన వారికి పెన్షన్ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. రైతులకు ప్రతి ఎకరా కు రూ.10 వేలు సహాయ ధనం, వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ.2 వేలు సహాయ ధనం, రైతు యువకులను పెళ్లాడే యువతులకు రూ.2 లక్షలు ప్రోత్సాహక ధనం, వృద్ధులకు నెలవారి పింఛన్ రూ.1500 నుంచి రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ డీ కుమారస్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కర్ణాటక ఎన్నికలు: 1985 నుంచి అదే ట్రెండ్.. బీజేపీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా?
కర్ణాటకలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ మార్పు అనేది మాత్రం సూచిస్తున్నట్లు ‘పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏమనగా.. రాష్ట్రంలో 1985 నుంచి వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మరి బీజేపీ రానున్న ఎన్నికల్లో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయగలదా లేదా అనేది ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడగగా.. ప్రస్తుత ముఖ్యమంత్రిగా పని చేస్తున్న బసవ రాజు బొమ్మైకి 20 శాతం మద్దతు ఇచ్చారు. మాజీ సీఎంలు సిద్ధరామయ్య, బి.యడియురప్పకు సానుకూలంగా 32 శాతం, 25 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు 5 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నించగా.. కాంగ్రెస్ అని 42 శాతం, బీజేపీ అని 38 శాతం, జేడీ (ఎస్) అని 14 శాతం మంది స్పందించారు. బీజేపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశమిస్తారా అన్న నిర్దిష్ట ప్రశ్నకు 51 శాతం మంది ఇవ్వమని, 43 శాతం ఇస్తామని, ఆరు శాతం మంది చెప్పలేమనీ బదులిచ్చారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఏయే పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని అడగగా... కాంగ్రెస్ పార్టీ జేడీ (ఎస్)తో చేతులు కలపాలని 46 శాతం మంది చెప్పారు. 41 శాతం మంది బీజేపీ-జేడీ (ఎస్) కూటమిగా ఏర్పడాలని భావించారు. కాంగ్రెస్-జేడీ(ఎస్)-ఇతరుల కూటమికి ఆరు శాతం, బీజేపీ-జేడీ(ఎస్)-ఇతరుల కూటమికి ఏడు శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారు. యాత్రలు ►విజయ్ సంకల్ప యాత్ర (బీజేపీ) : బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. మరోవైపు బీజేపీ చేపట్టిన బూత్ విజయ్ సంకల్ప అభియాన్ ప్రచారం విజయవంతం అయ్యింది. ► ప్రజాధ్వని యాత్ర (కాంగ్రెస్) : కాంగ్రెస్ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. ► పంచరత్న యాత్ర (జేడీఎస్) : జేడీఎస్ చేపట్టిన పంచరత్న యాత్ర సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది. ►బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు రాష్ట్రంలో తక్కువగా పర్యటించారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో అనేకమార్లు విస్తృతంగా పర్యటించగా, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాష్ట్రంలో ఒకటి, రెండు మార్లే పర్యటించారు. ►కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ గ్యారెంటీ కార్డుల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కూడా జరగలేదు. ►పీపుల్స్ పల్స్ ప్రతినిధులు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడి, గ్రూపులవారీగా మాట్లాడి రాజకీయ పరిస్థితులను పరిశీలించి అక్కడ ఏ పార్టీవైపు మొగ్గు ఉందో ఒక అంచనాకు వచ్చారు. అవినీతి ఎన్నికల ప్రధాన ప్రచారాంశం ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులలో, పథకాల అమలులో ‘40% సర్కార్’(కమీషన్లు) ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రధానమైనవిగా ఉండగా కమలం పార్టీ వాటిని సవరణ చేసింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగాలకు, లింగాయత్‌లకు పంచింది. కీలకం కానున్న ప్రజా సమస్యలు రోడ్ల దుస్థితిపై ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. పాత పెన్షన్ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి ముందుకొచ్చే పార్టీకే మద్దతివ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. మతతత్వ అంశాలు, హిందుత్వ అంశాలు కోస్తా కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. వొక్కలింగాల యోధులైన ఊరిగౌడ, నంజేగౌడలను టిప్పు సుల్తాన్ హత్య చేసిన అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఆ సామాజిక వర్గాల మద్దతును కూడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ కోరుకున్నట్లు వొక్కలింగాల పూర్తిమద్దతు ఆ పార్టీకి లభించడం లేదు. వారు, మొదటి ప్రాధాన్యత జేడీ (ఎస్)కు, రెండో ప్రాధాన్యత కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
కర్నాటకలో బిగ్ ట్విస్ట్.. జేడీఎస్‌కు బూస్ట్!
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు రోజుల క్రితం అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టును రిలీజ్ చేసింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో, వారందరూ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి బిగ్ బాంబ్ పేల్చారు. చాలా మంది నేతలు జేడీఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్బంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రేపు తమ పార్టీలోకి చాలా మంది నేతలు రాబోతున్నారని ప్రకటించారు. బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోల్ చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలువబోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ ఇప్పటికే తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసిందన్నారు. రేపు(శుక్రవారం) రెండో జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు స్థానం కల్పించకపోవడంతో సీనియర్ నేత, లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది.. బీజేపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం.. దొడ్డప్ప గౌడ పాటిల్ కూడా తాను పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. Many leaders will join JD(S) tomorrow. (BJP leader) Doddappa Gowda Patil Naribol's name is final. We are keen to win 30 to 40 seats in Uttara Karnataka. I will release the second list of candidates tomorrow: Former CM & JDS leader HD Kumaraswamy#KarnatakaElections2023 pic.twitter.com/omsKNzILel — ANI (@ANI) April 13, 2023 -
కర్ణాటకలో ఆసక్తికరంగా పాత మైసూరు పోరు
-
కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరులో మెజార్టీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ చిన్న పార్టీల జోరు పెరిగిపోతూ ఉండడంతో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కడం పరిపాటిగా మారింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసిపట్టడం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు కీలకంగా మారింది... అధికార వ్యతిరేకత, చిన్న పార్టీల జోరు ఈ రెండూ కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్నాయి. వరసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటే తక్కువ మార్జిన్‌తో గట్టెక్కారు. గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 36% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తే, 38% ఓట్లు సాధించిన కాంగ్రెస్ మాత్రం 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మన ప్రజాస్వామ్యంలోని ఈ వైచిత్రి కారణంగా అత్యధిక ఓట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే సవాల్‌గా మారింది. అందుకే ఈసారి పార్టీలన్నీ ఒక్క ఓటు కూడా పోకుండా క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తూ బూత్ మేనేజ్మెంట్కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మూడు ఎన్నికల ముచ్చట గత మూడు ఎన్నికల్లోనూ అన్ని పార్టీలకు స్వల్ప మార్జిన్ పెద్ద తలనొప్పిగా మారింది. 2008 ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలుపొందారు. అంటే 31% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొన్నట్టయింది. 2013 ఎన్నికల దగ్గరకి వస్తే 5 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల శాతం 30గా ఉంది. గత ఎన్నికల్లో 28% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొంది. గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, జేడీ(ఎస్) పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12 శాతం ఉండగా, కాంగ్రెస్‌కు 11 శాతం ఉంది. 1980ల వరకు ఏ రాష్ట్రంలోనైనా గెలుపు ఆధిక్యాలు చాలా ఎక్కువగా దాదాపుగా 30% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీలు పెరగడం, పార్టీల సామాజిక సమీకరణలు వంటివి ప్రధానంగా మారి ఓట్ల ఆధిక్యానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. పార్టీల్లో టెన్షన్ టెన్షన్ ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకి గండిపడుతుందా అని మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. వీటితో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు నష్టమనే అంచనాలున్నాయి. బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఏదైనా నియోజకవర్గంలో హోరాహోరి పోరు నెలకొన్నప్పుడు చిన్న పార్టీలు రెండు నుంచి మూడు వేలు ఓట్లు సంపాదించినా అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నికల్లో గెలవలేకపోయినా ఫలితాలను మార్చే సత్తా కలిగి ఉంటారు’’అని బెంగుళూరుకి చెందిన రాజకీయ విశ్లేషకుడు నరేంద్రపాణి అభిప్రాయపడ్డారు. నోటాకే ఎక్కువ ఓట్లు! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వాటిలో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసే నెగ్గింది. అలంద్, బాదామి, గడగ్, హిరెకెరూర్, కంగ్డోల్, మాస్‌కి, పావగడలో అభ్యర్థుల గెలుపులో ఓట్ల కంటే నోటాకే ఎక్కువ పడ్డాయి. ► 1985 నుంచి ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటి మెజార్టీతోనే నేతలు గట్టెక్కారు. ► 25 శాతానికి పైగా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా 5, అంతకంటే తక్కువ శాతమే ఉంది. ► గత మూడు దశాబ్దాల్లో కేవలం 5 శాతం స్థానాల్లో మాత్రమే భారీ మెజార్టీ నమోదైంది. ► విజేతలు, పరాజితులకు వచ్చిన ఓట్లు, వాటి మధ్య తేడాలను విశ్లేషిస్తే ఓటరు గాలివాటంగా పోకుండా ఎంతో మేధోమథనం చేసి ఓటేస్తున్నాడని తేటతెల్లమవుతుంది. ► మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులిద్దరికీ ఓట్లు 5 శాతం తేడా వస్తే హోరాహోరీగా పోరు సాగిందని, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే ఓటరు నిర్ణయాత్మకంగా స్పందించారని అంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక రాజకీయాల్లో మఠాల ప్రభావం
-
కర్నాటక ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. నందిని Vs అమూల్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అమూల్ పాల విషయం కాస్తా పొలిటికల్ హీట్‌ను పెంచింది. కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం, అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రస్తకే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్‌కు ఊహించని షాక్ తగిలింది. నందిని పాల ఉత్పత్తులకు సౌత్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది. #WATCH | Bengaluru: We want to protect our milk and our farmers. We already have Nandini which is a better brand than Amul...We don't need any Amul..our water, our milk, and our soil is strong: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/LNvBynEDsB — ANI (@ANI) April 8, 2023 -
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
హాసన్ విషయంలో నా వైఖరి మారదు
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు. -
‘జాతీయపార్టీలను కన్నడిగులు తిరస్కరిస్తారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఈసీ శంఖారావం పూరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమర్మం చేశాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రాంతీయవాద నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్.. జాతీయ పార్టీలను తిరస్కరించేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారాయన. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అదీ ఒకే విడతలో ముగించాలనుకోవడం మంచి పరిణామం. ఇప్పటికే మా పార్టీ 70 శాతం ప్రచారాన్ని ముగించింది అని పేర్కొన్నారాయన. ఇరు పార్టీల నుంచి పొత్తు కోసం తనకు ఆహ్వానం అందిందన్న ఆయన.. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కర్ణాటకకు చేసిందేమీ లేదని, ఈ లెక్కన ఈసారి ప్రాంతీయవాదానికే కన్నడ ప్రజలు కట్టం కడతారని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. అధికార బీజేపీ, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌లు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనపై వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని చెబుతున్న కాంగ్రెస్.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి సీనియర్లు దృష్టి సారించిన కర్ణాటక ఎన్నికల్లో.. గెలుపు తమదేనన్న ప్రకటించుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే ఉద్దేశంలో ఉంది బీజేపీ. ఇదీ చదవండి: ఆత్మ విశ్వాసం.. ఆత్మ గౌరవం.. అసంతృప్తి చెరిపేయడం.. ఎవరికో? -
కర్నాటక రాజకీయం: ఆ నిర్ణయం బీజేపీకి ప్లస్ అవుతుందా?
సాక్షి, ఢిల్లీ: దక్షిణ భారతంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఇటీవలే కర్నాటకలోని బీజేపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అధికార పార్టీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఇక, బీజేపీ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్లాన్ చేస్తున్నాయి. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. ఇక, రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ 119, కాంగ్రెస్ 75, జేడీఎస్‌కి 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలపై కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ ఏదైనా పార్టీ అధికారంలోకి రావలంటే వీరి ఓట్లే కీలకం అవుతాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార బీజేపీ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో లింగాయత్‌లకు గతంలో ఉన్న 5శాతం రిజర్వేషన్ 7శాతానికి పెంచారు. అలాగే, విద్య, ఉద్యోగాల్లో లింగాయత్ వర్గాలకు రిజర్వేషన్‌ను పెంచారు. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. కర్నాటకలో ఓట్ షేర్.. - బీజేపీ 36 శాతం. - కాంగ్రెస్ 38 శాతం. - జేడీఎస్ 18 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. కర్నాటకలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్ రచించింది. రాష్ట్రంలో ఇప్పటికే 124 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. జేడీఎస్.. 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కర్నాటకలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. 150 స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ముఖ్య నేతలు కర్నాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏకైన పాన్ ఇండియా పార్టీ. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడుతోంది. కర్నాటకలో బీజేపీ ఎప్పటినుంచో అతిపెద్ద పార్టీ. తెలంగాణ ప్రజలకు భరోసా బీజేపీ మాత్రమేనని అన్నారు. ఇది కూడా చదవండి: కర్నాటకలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. పోలింగ్ ఎప్పుడంటే? -
కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్: షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
సాక్షి, ఢిల్లీ: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్నాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోం(ఇంటి వద్ద నుంచే ఓటు) సదుపాయం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానం. 80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. వీరి సంఖ్య 12.15 లక్షలుగా ఉన్నట్టు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 41,312 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కర్నాటకలో 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ► ఏప్రిల్ 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ► అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 20 చివరి తేదీ. ► ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన. ► ఏప్రిల్ 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ. ► మే 10న పోలింగ్ జరుగనుంది. ► 13న ఓట్లు లెక్కింపు. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
కొద్దిరోజుల్లో బీజేపీలోకి.. ఈలోగా దారుణ హత్య..
బెంగళూరు: కొద్ది రోజుల్లో బీజేపీలో చేరబోతున్న జేడీఎస్ మాజీ నాయకుడు దారుణ హత్యకు గురికావడం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. మృతుడు మల్లికార్జున్ ముత్యాల్(64) మర్మాంగంపై కత్తిపోట్లు ఉండటం కలకలం రేపింది. ఆయన మెడకు తాడు కూడా బిగించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్లికార్జున్ యజమానిగా ఉన్న ఎలక్ట్రానిక్ షాపు వెనుకాలే ఈ హత్య జరిగింది. అతను రాత్రివేళ నిద్రించే సమయంలో దుండగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముత్యాలు ఇటీవలే జేడీయఎస్‌కు గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజుల్లో బీజేపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన ఓ కార్యక్రమంలో కూడా ఇటీవలే పాల్గొన్నారు. అయితే షాపులో దొంగతనానికి వచ్చినవారే మల్లికార్జున్‌ను హత్య చేసి ఉంటారని అతని కుమారుడు అనుమానిస్తున్నాడు. గతంలోనూ ఓసారి దొంగలు చోరీకి ప్రయత్నించారని పేర్కొన్నాడు. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
Hindi Diwas: ‘హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం’
బెంగళూరు: ఒకవైపు హిందీ దివస్ దినోత్సవాన్ని(సెప్టెంబర్ 14న) దేశవ్యాప్తంగా బీజేపీ ఘనంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో.. వ్యతిరేకత కూడా చాలాచోట్ల వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో హిందీ దివస్‌కు వ్యతిరేకంగా జేడీఎస్(జనతాదల్ సెక్యులర్) ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘‘హిందీని బలవంతంగా రుద్దితే చూస్తూ ఊరుకోం. భారతీయులను విడదీయాలని బీజేపీ చూస్తోంది. కేవలం ఒక భాషను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంద’’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే.. ప్రజల సొమ్ముతో ఇలాంటి వేడుకలు నిర్వహించకూడదంటూ సీఎం బసవరాజ్ బొమ్మైకి కుమారస్వామి ఇదివరకే ఓ లేఖరాశారు. బలవంతంగా హిందీ భాషా దినోత్సవం వేడుకలు జరపడం కన్నడ ప్రజలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కన్నడ భాష ప్రాధాన్యత గురించి రాష్ట్రంలో జోరుగా చర్చ కూడా నడిచింది. అయినప్పటికీ.. కర్ణాటకలో హిందీ దివస్ వేడుకలు జరుగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: ‘బీజేపీది అశాంతివాదం’ -
రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా నాలుగో సీటును దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీజేపీ రెండు సీట్లు సులభంగా గెలుస్తుంది. మూడో సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశముంది. ఇక నాలుగో స్థానంపై జేడీ(ఎస్) ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి కోరుతున్నారు. లౌకికవాద శక్తులను బలోపేతం చేసేందుకు తన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే తమ అభ్యర్థి గెలుస్తారని కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై తమకు నమ్మకం లేదని జాతీయ నేతలు చొరవ తీసుకుని తమ విజయానికి మద్దతు ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదు తమ అభ్యర్థికే జేడీ(ఎస్) మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోంది. గతంలో తాము చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే సమయం ఇప్పుడు వచ్చిందని పేర్కొంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 2020లో తమ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారని హస్తం పార్టీ గుర్తు చేసింది. కుమారస్వామి ఈ వాదనను వ్యతిరేకించారు. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. బీజేపీ నుంచి ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చిందన్నారు. ఒకవేళ బీజేపీ పోటీ చేసివుంటే కాంగ్రెస్ కచ్చితంగా బరిలోకి దిగేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగి పోయారని.. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు. ఒక్క సీటు.. మూడు పార్టీలు! ఇక తాజా రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే బలం లేనప్పటికీ నాలుగో స్థానంలో మూడు పార్టీలు పోటీకి దిగాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కర్ణాటక శాసనసభలో బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ రెండు సీట్లు సునాయాసంగా గెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థితో సహా కాంగ్రెస్‌కు 70 మంది ఉండటంతో.. వారికి ఒక సీటు ఖాయం. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు (నిర్మలా సీతారామన్, జగ్గేష్) ఎన్నికైన తర్వాత, బీజేపీకి అదనంగా 32 ఎమ్మెల్యే ఓట్లు మిగిలిపోతాయి. జైరాం రమేష్‌ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్‌కు 24 ఎమ్మెల్యే ఓట్లు మిగులుతాయి. జేడీ(ఎస్)కు 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ బలం ఒక సీటు గెలవడానికి సరిపోదు కాబట్టి కాంగ్రెస్ మద్దతును జేడీ(ఎస్) కోరుతోంది. (క్లిక్: రాజ్యసభ ఎన్నికలు.. ఎన్సీపీ నేతలకు షాక్) క్రాస్ ఓటింగ్ భయం.. అయితే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశముందని జేడీ(ఎస్) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించినట్టు కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుంది? బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై జేడీ(ఎస్) విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. నాలుగో స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు డి. కుపేంద్ర రెడ్డి- జేడీ(ఎస్) మన్సూర్ అలీఖాన్- కాంగ్రెస్ లహర్ సింగ్ సిరోయా- బీజేపీ -
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణం
తుమకూరు(కర్ణాటక): రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ వారిని మాయ చేస్తున్నారని బీజేపీ ఎంపీ బసవరాజుపై జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శలు చేయగా, ఎంపీ సైతం వాగ్బాణాలు సంధించడంతో పరిస్థితి వేడెక్కింది. గుబ్బి తాలూకా చేళూరు హోబళి సి.నందిహళ్లిలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం అధికారులతో ఎంపీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టు కట్టడానికి కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసిందని ఎంపీ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కలుగజేసుకుని అసత్య హామీలు, మాటలు చెప్పొద్దంటూ ఎంపీపై గట్టిగా మాట్లాడారు. ఎంపీ కూడా ఎమ్మెల్యేకు ఘాటుగా హెచ్చరికలు చేయడంతో అధికారులు, నేతలు నచ్చజెప్పి పంపించారు. కాగా, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణంతో సభ వేడెక్కింది. -
కోవిడ్‌తో మృతి చెందిన అభ్యర్థికి భారీ విజయం
రామనగర: రామనగర నగరసభ ఎన్నికల్లో కోవిడ్‌తో మృతి చెందిన అభ్యర్థి లీలకు భారీ విజయం లభించింది. 4వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమో పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆమె గత గురువారం కోవిడ్‌తో మృతి చెందారు. పరువు నిలుపుకొన్న జేడీఎస్ దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. 31 వార్డులకు గాను జేడీఎస్ 16 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్, బీజేపీ తలా 7 స్థానాల్లో గెలుపొందాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. దీంతో రామనగరలో డీలా పడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన నియోజకవర్గంలో పరువు కాపాడుకోగలిగారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ, స్థానికంగా ఎంతో ప్రాబల్యం ఉన్న సీపీ యోగేశ్వర్ తనకున్న పరపతితో ఓట్లను పొందలేకపోయారు. ఇక డీకే బ్రదర్స్ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయారు. -
మీకు సిగ్గు, శరం ఉందా: మాజీ సీఎం
సాక్షి,బళ్లారి: మంత్రులకు సిగ్గు, శరం ఉంటే అనవసర విషయాలు ప్రస్తావించకూడదని(ఒకే పెళ్లి), లేదంటే గురివింద సామెతను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. ఆయన గురువారం కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మంత్రి సుధాకర్.. ‘ఏకపత్నీవ్రతుడు’ అనే విషయంపై పరోక్షంగా విమర్శలు చేయడంతో మాజీ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మంత్రుల సీడీల విషయాన్ని జనం ఏ విధంగా చర్చించుకుంటున్నారో తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం విడుదలైన సీడీతో పాటు మరికొందరి సీడీలు కూడా విడుదల అవుతాయన్న భయంతోనే కోర్టుకు వెళ్లారనే విషయం మరవకూడదని కుమారస్వామి హితవు పలికారు. తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు వెళతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎదుటి వారి తప్పులనే చూపుతారు కాని తమ తప్పులను ఎరగరన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్యుద్ధాన్ని జనం ఛీత్కరించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జనం సమస్యలను గాలికి వదిలివేశారన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటరావ్ నాడగౌడ ఆయనతో పాటు ఉన్నారు. కాగా కుమారస్వామి తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆయనకు మరో భార్య రాధిక కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. చదవండి: సీడీ కేసు: సిట్ అదుపులో నిందితుడి భార్య -
అశ్లీల సీడీలు.. నన్ను కూడా ఇలాగే: మాజీ సీఎం
శివాజీనగర: నేతల అశ్లీల సీడీలు వంటివాటిని చూడడానికి నా ప్రభుత్వాన్ని కూల్చాల్సి వచ్చిందా? వారు ఇక్కడే ఉండి ప్రభుత్వాన్ని పడేయాల్సింది అని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ వీడియోలను ప్రసారం చేయరాదని ఆరుమంది మంత్రులు కోర్టుకు వెళ్లారని, అలాంటి ఐడియా ఎవరిచ్చారో? ప్రజలు వీరి గురించి ఏమనుకోవాలో? అని ఎద్దేవా చేశారు. ఇలాగ తనను కూడా అగౌరవపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. -
నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మాజీ సీఎం
బెంగళూరు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలు వివాదాస్పదమవుతున్నాయి. శాంతియుతంగా సేకరించాల్సిన విరాళాలను బెదిరింపులకు పాల్పడుతూ.. ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితి తాను ఎదుర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తననే బెదిరించారని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. రామ మందిరం పేరుతో కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. ఓ మహిళతోపాటు మరో ఇద్దరు తన ఇంటికి వచ్చారని చెప్పారు. తాను విరాళం ఎందుకు ఇవ్వడం లేదని బెదిరించారని వాపోయారు. అసలు ఆమె ఎవరు..? మా ఇంటికి వచ్చి నన్ను అడిగే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ విరాళాలు సేకరించడం సరికాదని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. తాను కూడా విరాళం ఇస్తాను. మా పార్టీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అయితే విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇంటింటికొచ్చి అడిగే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ‘రామ మందిరం హిందువుల భక్తిమనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దాని పేరుతో కొనసాగుతున్న విభజనపై నేను వ్యతిరేకం’’ అని కుమారుస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారిని నాజీలుగా పేర్కొన్నారు. జర్మనీలో హిట్లర్ చేసిన మాదిరి దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. విశ్వ హిందూ పరిషత్‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి అని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
రణరంగమైన విధాన పరిషత్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎగువసభ విధాన పరిషత్ మంగళవారం రణరంగమైంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పీఠం కోసం ముష్టియుద్ధానికి, దూషణలకు దిగడంతో చట్టసభ చరిత్రలోనే చీకటిరోజుగా మిగిలిపోయింది. చైర్మన్ స్థానంలో కూర్చొన్న డిప్యూటీ చైర్మన్‌ను కిందకి లాగిపడేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రతాప్‌చంద్రశెట్టి ప్రస్తుతం విధాన పరిషత్ చైర్మన్‌గా ఉండగా, ఆయనను తొలగించాలని బీజేపీ జేడీఎస్‌తో కలిసి చేసిన ప్రయత్నంతో ఈ రగడ చెలరేగింది. మంగళవారం ఉదయం 11.10 గంటలకు డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ లోపలికి వచ్చి చైర్మన్ స్థానంలో కూర్చున్నారు. ఇక ప్రతాప్ చంద్రశెట్టి పరిషత్‌లోకి రాకుండా బీజేపీ సభ్యులు ప్రవేశ ద్వారాన్ని మూసేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహంతో చైర్మన్ సీటు వద్దకు తోసుకొచ్చారు. బీజేపీ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ఉరికారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడను సీటుపై నుంచి లాగి కిందకి తోసేశారు. బిత్తరపోయిన ధర్మేగౌడ సభలో తన సీటు వద్దకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ మళ్లీ ధర్మేగౌడను చైర్మన్ స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చూసినా కాంగ్రెస్ సభ్యులు ఒప్పుకోలేదు. చైర్మన్ లేనట్లయితే సభ నిర్వహించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాటిల్‌ను చైర్మన్ సీటులో కూర్చోబెట్టి రక్షణగా నిలిచారు. దీంతో గొడవ తారస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు బాహాబాహీకి దిగా రు. చైర్మన్ సీటు వద్ద రక్షణగా ఉన్న గాజు ఫలకాన్ని కాంగ్రెస్ సభ్యుడు నారాయణ స్వామి పీకేశారు. మరికొందరు మైక్‌ను విరిచేసి, పేపర్లు చింపేశారు. మార్షల్స్ భద్రత మధ్యలో చైర్మన్ ప్రతాప్ చంద్రశెట్టి సభలోకి వచ్చి తన సీటులో కూర్చొన్నారు. ఆ తర్వాత ఆ గందరగోళంలోనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. -
బీజేపీతో స్నేహం.. మరోసారి సీఎం అవుతా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో విపక్ష కాంగ్రెస్-జేడీయూ మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం మూలంగా తన 12 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించుకున్న ఘనతంతా వృథా అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తనపై అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆయన కారణంగానే అనేకసార్లు కన్నీరుకార్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!) గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను గుర్తించలేకపోయానని పేర్కొన్నారు. తనన కలల్ని, రాజకీయ జీవితాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హెచ్డీ దేవెగౌడ ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌తో చేతులు కలిపానని వెల్లడించారు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలిగితే మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. కాగా (2006-07) సమయంలో బీజేపీ మద్దతుతో కుమారస్వామి సీఎంగా సేవలు అందించిన విషయం తెలిసిందే. (పవార్ సంచలన వాఖ్యలు.. ఖండించిన కర్ణాటక) మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అబద్దాలు చెప్పడంలో ఆ కుటుంబం దిట్టగా వర్ణించారు. అన్నీ చేసి చివరకు కన్నీరు కార్చడం కుమారస్వామికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతు కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలలకే ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీఎస్ యడియూరప్ప సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో కన్నడభాషలో ప్రమాణం చేశారు. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. కరోనా లాక్డౌన్ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. -
టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు : కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు కూడా నిలిచి పోయాయి. ఈ క్రమంలో ఇన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా మళ్లీ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ సారి తరగతి గదిలో విద్యార్ధుల ముందు బోధించడం లేదు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఫేస్బుక్ లైవ్ ద్వారా విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం పాఠాల్ని చెబుతున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా కదూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలు అందించిన వైఎస్వీ దత్తా. 1970లో రాజకీయాల్లో ప్రవేశించిన దత్తా 1990 నుంచి జనతాదళ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా కాలం రాజకీయాల్లో పనిచేసిన దత్తా ప్రస్తుతం ఉపాద్యాయుడిగా మారి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ అభినందించారు. (సుశాంత్ సోదరి భావోద్వేగ లేఖ ) కాగా, రాజకీయాల్లోకి రాకముందు దత్తా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. బెంగుళూరులో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు గణితం బోధించేవారు. ఆ అనుభవంతోనే ఈ సమయంలో విద్యార్థులకు మళ్లీ అధ్యాపకుడిగా మారారు. స్టూడెంట్స్ ఆయన మీద ప్రేమతో దత్తా మేష్ట్రే(మాస్టారు) అని పిలుచుకుంటారు. దత్తా మొదటి ఆన్లైన్ క్లాస్ అర్థమెటిక్ గురించి వివరించగా దానికి విశేష స్పందన లభించింది. లాక్డౌన్ ద్వారా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 4 వరకు జరగనున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గణితంతో పాటు విద్యార్థుల అభ్యర్థన మేరకు భౌతికశాస్త్రం కూడా నేర్పిస్తున్నానని వెల్లడించారు. అయితే తక్కువ సమయం ఉన్నందువల్ల కఠినమైన విషయాలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నట్లు తెలిపారు. తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో 40 వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లు తెలిపారు. ఎల్లప్పుడూ ఉపాధ్యాయునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. (కల్నల్ సంతోష్‌కు కాంస్య విగ్రహం ) -
నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగింది. గురువారం నుంచే బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్డౌన్ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. -
ప్రశాంత్ కిశోర్‌కి యమ క్రేజ్!
సాక్షి, బెంగళూరు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తిరిగి గెలుపొందడంతో ప్రశాంత్ కిషోర్‌కు డిమాండ్ పెరిగింది. ఆయనతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకులు కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను త్వరలో వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు. కాగా.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. తరువాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీ వైపా? గాడ్సే వైపా? -
ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభకు పోటీ చేయను
సాక్షి బెంగళూరు: ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజ్యసభకు పోటీ చేయనని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వెల్లడించారు. జూన్‌లో రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒక స్థానానికి కాంగ్రెస్ సహాయంతో దేవెగౌడ పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో వాటన్నింటికి ఆయన స్పష్టత నిచ్చారు. శనివారం జేపీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను రాజ్యసభకు వెళ్లనని తెలిపారు. తాను రైతుల కోసం పోరాడేందుకు రాజ్యసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడున్నా రైతుల తరపున పోరాటం చేస్తానని తెలిపారు. చదవండి: మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం తన జీవితమే ఒక పోరాటం అని, తనకు అధికార దాహం లేదని వెల్లడించారు. అంతకుముందు దాసరహళ్లిలో జరిగిన సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో దేవెగౌడ పాల్గొని మాట్లాడారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాయని, ఇక ఇంటికే పరిమితం అవుతానని ఎవరూ భావించొద్దని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన పోరాటం ఎప్పటికి ఆగదని స్పష్టం చేశారు. ఇటీవలే కేరళలో చికిత్స తీసుకుని వచ్చానని, నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు, కానీ ప్రస్తుతం వ్యవస్థకు విరుద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. -
కర్ణాటక: కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ సునాయసంగా గెలుపు సాధించి, అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారి.. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో బీజేపీ హవాను అడ్డుకుంటామని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి సోమవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేడీఎస్‌తో పొత్తు, కూటమిలో అంతర్గత విభేదాలు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణలపై స్పష్టత లేకపోడం. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఆరు సీట్లు అవసరమయితే.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని రాబట్టడానికి 12 స్థానాల్లో గెలవాల్సి రావడం. మాజీ సీఎం సిద్ధరామయ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వ పనితీరును గతంలో గట్టిగా విమర్శించడం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ఉప ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనకపోవడం. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే సరియైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటను అడ్డుకట్ట వేయకపోవడం. ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలంటే.. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. కర్ణాటక ప్రాజ్ఞవ్యంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి గెలిచి, కాంగ్రెస్ పార్టీలో విలీనమైన అనర్హత ఎమ్మెల్యే ఆర్. శంకర్‌కు.. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి టికెట్ దక్కకపపోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీకి ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, చట్టసభ సభ్యుడిని ప్రభుత్వం నామినేట్ చేయడం. కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ 17 మంది ఎమ్మెల్యేలను (శాసనసభ్యులు) అనర్హులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ వారిని ఉప ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు కల్పించడంతో.. ఓటర్లు పార్టీలకతీతంగా అభ్యర్థి వైపు మొగ్గుచూపరనే విషయాన్ని గమనించవచ్చు. ఉప ఎన్నికలు ఎందు వచ్చాయంటే..? కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతివ్వడంతో.. జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలి యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. పార్టీ ఫిరాయించిన17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వెసులుబాటు కల్పించింది. దీంతో మైనారిటీలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వ మనుగడకు, అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుకు 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. డిసెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల్లో.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. గతంలో ఈ 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో 15 స్థానాలు కైవసం చేసుకుంటామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ అన్నిస్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. డిసెంబరు 9న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ తరఫున పోటీ చేసిన 13 మంది అనర్హత ఎమ్మెల్యేల్లో 11 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం చవిచూడగా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఎంటీబీ నాగరాజు, హెచ్.విశ్వనాథ్ బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోగా.. ఆర్.శంకర్‌కు టికెట్ దక్కలేదు. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుని విజయఢంకా మోగించింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను (113) సునాయాసంగా అధిగమించి.. 117 స్ధానాలతో బలం సాధించి.. రాష్ట్రంలో సుస్థిర పాలన గమ్యం సుగమైంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా మాండ్యలో.. ఒక్కసారి కూడా సీటు గెలువని బీజేపీ ఉప ఎన్నికల ద్వారా తొలిసారి అసెంబ్లీ సీటును తన ఖాతాలో వేసుకుంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మాండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కాషాయ పార్టీ హవా సాగిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
‘ఉప’ ఫలితాలు : వారందరికీ మంత్రివర్గంలో స్థానం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో యడియూరప్ప ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభిని మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల విజయం సాధించి, మరో 6 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. కాగా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక జేడీఎస్ ఖాతా కూడా తెరవలేదు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగత 6 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖరారయినట్లే. ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం యడియూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాకటలోని కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తర్వాత అప్పటి స్పీకర్ 17మందిపై అనర్హత వేటు వేసింది. తర్వాత బలపరీక్షలో బీజేపీ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు కేసు కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్ 12 చోట్ల బరిలోకి దిగాయి. ♦ ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు. బోణీ కొట్టిన బీజేపీ ఉప ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. యల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్ శివరామ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలి విజయంతో సాధించడం పట్ల శివరాం సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా శివరాం మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 11 నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. ఓటమిని అంగీకరించిన డీకే ఉప ఎన్నికల ఫలితాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులను అంగీరించారని, అందుకే వారిని గెలిపించారని తెలిపారు. ఈ ఫలితాలతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ పటాసులు పేల్చుతున్నారు. కాగా, ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. ♦ బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉండటం పట్ల సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర హర్షం వక్తం చేశారు. తన తండ్రి, సీఎం యడియూరప్ప దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప కుమారుడికి మిఠాయి తినిపించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియురప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. -
కన్నడ ఎగ్జిట్ పోల్స్.. వారికి నిరాశే!
బెంగళూరు : కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీకి అగ్ని పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్‌లకు పరాభవం తప్పదనేలా ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఉన్నాయి. బీజేపీ 8-10, కాంగ్రెస్ 3-5, జేడీఎస్ 1-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతాయని కన్నడ పబ్లిక్ టీవీ సర్వే తెలిపింది. బీటీవీ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 9, కాంగ్రెస్ 2, జేడీఎస్ 2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పవర్ టీవీ కూడా బీజేపీ 8-12, కాంగ్రెస్‌కు 3-6, జేడీఎస్ 0-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. ప్రసుత్తం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదని స్పష్టమవుతోంది. బీజేపీ అధికారం కాపాడుకోవాలనుకుంటే కనీసం 6 స్థానాల్లో తప్పకుండా విజయం సాధించాల్సిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 66.25 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. డిసెంబర్ 9న ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
యడియూరప్ప ప్రభుత్వానికి విషమ పరీక్ష
నాలుగు నెలల యడియూరప్ప ప్రభుత్వానికి మరో అగ్నిపరీక్ష. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం మనుగడ సాగించాలా, వద్దా? అన్నదానిపై ఓటరు దేవుళ్లు నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. బెంగళూరు, బెళగావి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల జ్వరం ఆవహించింది. గెలుపోటములపై బెట్టింగ్‌లు తారస్థాయికి చేరాయి. సుమారు రెండువారాల నుంచి ప్రచారంలో నిమగ్నమైన అగ్రనేతలు 9వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ రోజున వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయి. సాక్షి, బెంగళూరు: 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీల భవితవ్యం ఇమిడి ఉంది. యడియూరప్ప సర్కారు మనుగడను తేల్చే ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మినీ అసెంబ్లీ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేరుపొందిన ఈ సమరంలో మూడు ప్రధాన రాజకీయ పారీ్టల నుంచి సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ఒకేసారి 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం కూడా రికార్డే. మొత్తం 165 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. కాగా శివాజీనగర నుంచి అత్యధికంగా 19 మంది పోటీ చేస్తుండగా, కృష్ణరాజపేటె, యల్లాపుర నుంచి అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ఓటరు కార్డు లేదా ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు తదితర 11 రకాల కార్డుల్లో ఏదైనా తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. బుధవారం ఉదయం ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ బాగానే జరుగుతుందని అన్ని పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. నిర్భయంగా ఓటేయండి : సీఎం సూచన సాక్షి బెంగళూరు: నేడు గురువారం జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లందరు నిర్భయంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సూచించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేయాలని తెలిపారు. వానాగాలీ, చలి ఉన్నా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సుమారు 85 శాతం పోలింగ్ నమోదు దాటితే ప్రజాస్వామ్యానికి బలమని బుధవారం సాయంత్రం అన్నారు. -
రాజ్యసభకు పోటీ చేద్దామా.. వద్దా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో శాసనసభ సభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థులను ఖరారు కాలేదు. కాగా బీజేపీ తరఫున కేసీ రామ్మూర్తి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 224 మంది శాసనసభ్యులు ఉన్న కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలో గెలవాలంటే సగం కంటే ఎక్కువ సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి ఇప్పటికే 105 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుంది. ఈ నెల 9న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. అప్పటి సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే 112 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కేవలం 34 ఎమ్మెల్యేలు ఉన్న జేడీఎస్ అభ్యర్థిని బరిలో దించినా గెలవడం కష్టసాధ్యం. అదేవిధంగా 66 మంది సభ్యులు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య పొత్తు కుదిరితే ఏదైనా జరగవచ్చు. సోమవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఒకవేళ కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి పోటీ నుంచి తప్పుకుంటే కేసీ రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నేడు కాంగ్రెస్ నేతల భేటీ రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ నేతలు ఆదివారం నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. కాగా కేంద్ర మాజీమంత్రి మల్లికార్జునఖర్గేకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 66 మంది సభ్యుల మద్దతుతో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. ఈ తరుణంలో పోటీ చేసి ఓడిపోవడమా?, పోటీ చేయకుండా ఉండడమా? అని మథనం జరుగుతోంది. -
సిద్ధరామయ్య, కుమారస్వామిలపై దేశద్రోహం కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మల్లికార్జున అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు సిటీ కోర్టు వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. కుట్రపన్నడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం లేవనెత్తడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ డీసీపీ రాహుల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
వెనక్కి తగ్గని బీజేపీ రెబల్స్
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. అనుకున్నట్లుగానే ఇద్దరు జేడీఎస్ అభ్యర్థులు తెల్లజెండా ఊపారు. ఇద్దరు బీజేపీ రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. శివాజీనగరలో అత్యధికంగా 19 మంది పోటీలో నిలిచారు. ప్రచారం, ప్రలోభాల పర్వం మిన్నంటబోతోంది. సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న జరగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఇప్పటివరకు రెబెల్స్ అభ్యర్థులను బుజ్జగించడం, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన పార్టీలు శుక్రవారం నుంచి ప్రచార బరిలో దిగనున్నారు. జేడీఎస్ పారీ్టకి పెద్ద షాక్ తగిలింది. హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్ అభ్యర్థి గురుదాస్యల్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ రెబెల్స్ శరత్ బచ్చేగౌడ (హొసకోటె), కవిరాజ్ అరస్ (హొసపేటె)లు వైదొలగకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరకు 15 స్థానాలకు 165 మంది రంగంలో మిగిలారు. నేటి నుంచి దూకుడు శుక్రవారం నుంచి సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందా గౌడ, సురేశ్ అంగడి, ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్‌కటీల్‌లు ప్రచారంలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్ నుంచి కుమారస్వామిలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేవెగౌడ కూడా నేటి నుంచి ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికలను బీజేపీ, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కదనరంగంలోకి దిగాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే బీజేపీ ఆరాటం అయితే అనర్హత ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు ప్రభుత్వాన్ని కూలదోల్చడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రణాళికలు రచిస్తున్నాయి. శివాజీనగరలో 19 మంది పోటీ: సీఈవో మొత్తం 15 నియోజకవర్గాల్లో 37,77,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం 165 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం మొత్తం 53 మంది ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా శివాజీనగరలో 19 మంది, అత్యల్పంగా కేఆర్ పేట, యల్లాపుర ఏడుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలను చేపట్టింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై సిబ్బందికి అవగాహన తరగతులను గురువారం బెంగళూరు కేఆర్ పురంలో ప్రారంభించింది. -
జేడీఎస్‌కు షాక్.. పోటీ విరమణ!
బెంగళూరు: ఉప ఎన్నికల సమరంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయి. హిరేకరూరు, అథణి అభ్యర్థులు పోటీ చేయరాదని నిర్ణయించారు. మరో నియోజకవర్గంలో అభ్యర్థి నామినేషన్ చెల్లలేదు. మండ్య కేఆర్‌పేటెలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ముఖం చాటేయడం గమనార్హం. 15కు గాను 14 స్థానాల్లో పోటీలోనున్న జేడీఎస్‌కు తాజా పరిణామాలు శరాఘాతమే. త్వరలో ఈ సంఖ్య పెరిగినా పెరగవచ్చని నాయకుల మాట. రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కాగా జేడీయస్‌కు పలువురు అభ్యర్థులు అనూహ్యంగా షాక్ ఇస్తున్నారు. హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగ శివాచార్యస్వామీజీ నామినేషన్ వెనక్కి తీసుకోనున్నారు. అదేవిధంగా అథణి నియోజకవర్గం జేడీయస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం లక్ష్మణసవది ఆప్తుడు గురుదాస్కళ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. చిక్కబళ్లాపురం అభ్యర్థి కేపీ.బచ్చేగౌడ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు సక్రమంగా లేదని తిరస్కరించారు. అతనికి బదులు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనితా కుమారస్వామి బంధువును ప్రకటించాలని జేడీయస్ భావిస్తోంది. కేఆర్ పేటెలో కినుక మండ్య జిల్లాలోని కేఆర్.పేటే నియోజకవర్గంలో దేవరాజుకు జేడీఎస్ టికెట్ కేటాయించడం ఎమ్మెల్యేలు పుట్టరాజు, డీసీ. తమ్మణ్ణ, అన్నదానికి నచ్చడం లేదు. దీంతో వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేఆర్.పేటే ఉప ఎన్నికలో జేడీయస్ నుంచి జిల్లా పంచాయతీ సభ్యుడు హెచ్డీ.రాజు కు టికెట్ ఇవ్వాలని పుట్టరాజుతో పాటు పలువురు జేడీయస్ నేతలు దళపతులపై ఒత్తిడి తీసుకువచ్చినా పట్టించుకోలేదు. హ్యాండిచ్చిన స్వామీజీ హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగాచార్యస్వామిజీ సీనియర్ మఠాధీశుల ఒత్తిడి వల్ల పోటీ నుంచి వైదొలిగారు. మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం అర్ధరాత్రి శివలింగాచార్య స్వామిజీతో మాట్లాడిన తరువాత రాత్రికి రాత్రి బీ.ఫారం తీసుకుని నామినేషన్ వేశారు. కానీ మంగళవారం పంచపీఠాధీశ్వర ఇతర స్వామీజీల ఒత్తిడితో గురువారం నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. జేడీఎస్ నేతల బహిష్కరణ యశవంతపుర: బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గోపాలయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని బీబీఎంపీ జేడీఎస్ కార్పొరేటర్ హేమలతా గోపాల య్య తో పాటు ఇద్దరు జేడీఎస్ నాయకులను పార్టీ నుండి బహష్కరించారు. మహదేవ్, జయరామ్ అనేవారిని పార్టీనుంచి బహష్కరించారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు అదే నెల 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో సంజీవ్ కుమార్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణ ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సహా జిల్లాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నియమావళి పోటీ చేసే అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాజరాజేశ్వరినగర, మస్కి నియోజకవర్గాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికలు జరపడం లేదు. -
ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు కాంగ్రెస్ కర్ణాటక విభాగం నివేదించింది. -
అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ
సాక్షి, బెంగళూరు: గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి అనర్హత వేటుకు గురయ్యారన్నారు. అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారు ఏర్పడడానికి కృషి చేశారని, ఉప ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
కాంగ్రెస్‌తో కటీఫ్.. ఒంటరిగానే బరిలోకి
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఉప ఎన్నికలకు నగారా మోగడంతో కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై అధికార, విపక్షాలు పార్టీలు దూకుడుపెంచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుపై జేడీఎస్ కీలక ప్రకటన చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పార్టీ తెగేసి చెప్పింది. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జేడీఎస్ అభ్యర్థులు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని, కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ట్వీట్లో జేడీఎస్ పేర్కొంది. దీంతో ఉప ఎన్నికల పోరు మూడు పార్టీల మధ్య రసవత్తరంగా జరగనుంది. కాగా జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే . అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండగా, 24న ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జేడీఎస్ అధినేత దేవెగౌడ గతంలో జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ప్రసక్తే ఉండదని కూడా తేల్చిచెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు ఉండొచ్చని, ఈసారి మాత్రం చేతులు కాల్చుకునేది లేదని, పొత్తు మాటే తలెత్తదని ఆయన చెప్పారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా -
నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!
బెంగళూరు: జేడీఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బహిర్గతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీఎస్‌ను వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పడు ఏ రకంగా బాంబు పేల్చుతారోనని పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అసమ్మతి మరింత తారా స్థాయికి చేరింది. మంత్రిగా పని చేసిన జీ.టి. దేవెగౌడ.. సంకీర్ణ సర్కార్ పతనం తర్వాత జేడీఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. మరో ఆరుగురు కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అనంతరం బెర్తులు ఖరారు చేసుకునే పనిలోపడ్డారు. బీజేపీ నేతలతో జీటీ దేవెగౌడ చెట్టాపట్టాల్ గత శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం.హెచ్డి.కుమార స్వామితో కలిసి మొత్తం జేడీఎస్ పార్టీ 37 మంది శాసన సభ్యులు విజయం సాధించారు. ఆపరేషన్ కమలం నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్ విశ్వనాథ్, మహాలక్ష్మి లేఔట్ ఎమ్మెల్యే గోపాలయ్య, కేఆర్‌పేట ఎమ్మెల్యే నారాయణగౌడలు పార్టీని వీడారు. వీరిపై అనర్హత వేటు పడింది. దీంతో జేడీఎస్ బలం 34కు చేరింది. వీరిలో మరో ఆరుగురు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదేవిధంగా మాజీ మంత్రి చెన్నిగప్ప కుమారుడు బీ.సీ.గౌరి శంకర్ కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి మాజీ మంత్రి జీటీ దెవెగౌడ.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాలను నిరంతరం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మైసూరులో బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అప్పడపుడు సీఎంను కూడా కలుస్తున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే అయిన గుబ్బి శ్రీనివాస్ ఇటీవల మాజీ మంత్రి డీకే. శివకుమార్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు హాజరు కాని మాజీ సీఎం కుమారస్వామిపై ఆరోపణలు చేశారు. వీడేది వీరేనా ? జీటీ దేవెగౌడ (చాముండేశ్వరి), ఆర్.శ్రీనివాస్ (గుబ్బి), శివలింగేగౌడ (ఆరిసికెరె), మహాదేవ్ (పిరియాపట్టణ), సురేష్‌గౌడ (నాగమంగల), రవీంద్ర శ్రీకంఠయ్య (శ్రీరంగపట్టణ), సత్యనారాయణ (సిరా)లు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జేడీఎస్ కార్యకర్తలను వ్యభిచారులతో పోల్చి వివాదం సృష్టించారు సిద్ధరామయ్య. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే మూలకారకుడంటూ జేడీఎస్ కార్యకర్తలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ విలేకరి దీని గురించి సిద్ధరామయ్యను ప్రశ్నించాడు. దానికి ఆయన మండిపడుతూ.. జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ అధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం 14 నెలల తర్వాత ఈ ఏడాది జూలైలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జేడీఎస్ శ్రేణులు సిద్ధరామయ్య మీద విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం కుమారస్వామి కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని కుమారస్వామి మండిపడ్డారు. (చదవండి: నా తొలి శత్రువు సిద్ధరామయ్య) -
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్‌తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు
సాక్షి, బెంగళూరు: కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమరస్వామి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు. మాండ్య జిల్లాలోని కేఆర్ పేట రాజకీయాల్లో తమ కుటుంబ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక్కడి నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సంకీర్ణంపై తిరుగుబాటు చేసిన నారాయణ గౌడను ఉద్దేశిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మండ్య జిల్లాలోని కేఆర్‌పేటకు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోను, మీడియాతో మాట్లాడారు. కేఆర్ పేటలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కృష్ణకు కాకుండా నారాయణగౌడను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. నారాయణగౌడ గెలుపు కోసం గ్రామ గ్రామానికి తిరిగి పని చేçసి ఆయనను గెలిపిస్తే తన కుటుంబంపైనే ఆరోపణలు చేశాడని అన్నారు. అతడు క్రిమినల్ అని మండపడ్డ కుమరస్వామి, ఇదంతా మా కుటుంబం చేసుకున్న స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు తుడుచుకున్నారు. రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు తాను మనసులో ఏముంటే దానిని మాట్లాడతానన్న కుమారస్వామి...తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండిపోవాలని అనుకున్నానని అన్నారు. పదవి పోయినా బాధ పడకుండా సంతోషంగా వదిలివచ్చానని అన్నారు. దేశం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, కానీ సోషల్ మీడియాలో నిఖిల్ ఎల్లిదియప్పా అని ప్రచారం జరగడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో మంచికి కాలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తనకు రాజకీయాల్లో కొనసాగాలని అనిపించడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. -
కుమారస్వామి సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కుమారస్వామి శనివారం న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావడం.. ముఖ్యమంత్రి అవ్వడం అన్ని యాదృచ్చికంగానే జరిగాయి. దేవుడి దయ వల్ల రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. ఈ 14 నెలలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాను. ఎవరినో సంతృప్తి పరచాల్సిన అవసరం నాకు లేదు. రాష్ట్రం కోసం పని చేశాను. ఆ తృప్తి చాలు నాకు. త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుందామని భావిస్తున్నాను’ అంటూ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఓ వైపు యడియూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేకపోయారు. వెలుపలి నుంచి యడియూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం గత నెల కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య గత నెల 23న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. అనంతరం బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. -
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
బీజేపీకీ సంకీర్ణ పరిస్థితే..
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. నేడో, రేపో కర్ణాటక కొత్త సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేయనున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. రాష్ట్రంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేబినెట్ ఏర్పాటు ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. మంత్రివర్గంలో చోటు లభించలేదనే కారణంగా కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఇదే క్రమంలో బీజేపీలో కూడా కేబినెట్ లేనిపోని తంటా తెస్తుందని భావిస్తున్నారు. అయితే మంత్రిమండలి ఏర్పాటులో ఎలాంటి అసమ్మతి లేకుండా ముగిస్తే ప్రభుత్వం కొన్నాళ్లు ప్రజా సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సర్కారు మనుగడ కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు బల నిరూపణ ఓ వైపు.. రాజీనామాల విషయంలో తుది నిర్ణయం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా రాజీనామా ఆమోదించాలా? లేక వారే ఉపసంహరించుకుంటారా తెలియలేదు. ఉపసంహరించుకుంటే బీజేపీకి తిప్పలు తప్పవు. అలా కాదని.. రాజీనామా ఆమోదించి.. పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తే బీజేపీకి లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ నుంచి డైరెక్షన్? బీజేపీ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గం, డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది ఢిల్లీలోని బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వం పతనం విషయంలో కూడా ఢిల్లీ పెద్దల డైరెక్షన్లోనే స్థానిక బీజేపీ నాయకులు నడిచినట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య తగాదా పెట్టి.. ప్రజల్లో వ్యతిరేకతా భావాలు తీసుకురావడంతో బీజేపీ నాయకులు విజయం సాధించారని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం రేసులో పలువురు సీనియర్ నాయకులు రేసులో ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరి కేబినెట్బెర్తు ఆశిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం రేసు లో అరవింద లింబావళి, ఆర్.అశోక్, కేఎస్ ఈశ్వర ప్ప, బి.శ్రీరాములు పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధం గా కాంగ్రెస్ నుంచి రమేశ్ జార్కిహోళి, జేడీఎస్ నుంచి హెచ్.విశ్వనాథ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఉపముఖ్యమంత్రి స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి? సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలు 15 మంది రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాజీనామాలపై ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ వారు రాజీనామా ఉపసంహరించుకుంటే బీజేపీ బలం తగ్గిపోతుంది. ఫలితంగా బల నిరూపణ అంత సులువు కాదు. అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచన ఉంటే రాజీనామా ఆమోదించాలని ఒత్తిడి తేవచ్చు. ఈక్రమంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. అందులో అన్ని సీట్లలో కాంగ్రెస్ – జేడీఎస్ గెలవడం అసాధ్యం. ఫలితంగా బీజేపీకి లాభం. అయితే వారు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే కొందరికి కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంది. ఎవరికి ఇవ్వాలనే దానిపై సతమతం అవుతున్నారు. సొంత పార్టీలో ఉన్న సీనియర్ నేతలే మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప నివాసంలో కీలక భేటీ కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో బీజేఎల్పీ నేత బీఎస్ యడ్యూరప్ప నివాసంలో బుధవారం ఉదయం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మురళీధరరావు, జగదీశ్ శెట్టర్, ఆర్.అశోక్, మాధుస్వామి, బసవరాజు బొమ్మయి, ఎంపీ రేణుకాచార్య, వి.సోమణ్ణ, చంద్రప్ప, హాలప్ప తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బల పరీక్ష గురించి చర్చించారు. కాగా కేబినెట్ రేసులో బెంగళూరు నేతలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి బయటికి వచ్చిన గోపాలయ్య, విశ్వనాథ్, భైరతి బసవరాజు, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, బీజేపీ నుంచి ఆర్.అశోక్, వి.సోమణ్ణ, అశ్వత్నారాయణ్, ఎస్ఆర్ విశ్వనాథ్, సతీష్‌రెడ్డి కేబినెట్ బెర్తు ఆశిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా బి.శ్రీరాములు, జేసీ మాధుస్వామి, ఆనందసింగ్, ఎ.రామదాస్, కేఎస్ ఈశ్వరప్ప, ఎస్ఏ రవీంద్రనాథ్, బీసీ పాటిల్, శంకర్‌పటేల్, కేజే బోపయ్య, ప్రతాప్‌గౌడపాటిల్ తదితరులు కేబినెట్ బెర్తుపై కన్నేసినట్లు తెలిసింది. -
ప్రజాతీర్పే పరిష్కారం
‘ఇంకెన్నాళ్లు...?’ అని అందరి చేతా పదే పదే అనిపించుకున్నాక, మూడు వారాలపాటు కాలయాపన చేశాక కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకుంది. అక్కడి రాజకీయ పరిణామాలతో విసుగు చెందిన జనం ఊపిరిపీల్చుకునేంతలోనే మధ్యప్రదేశ్‌లో కుర్చీలాట మొదలైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చేస్తామని బీజేపీ ప్రకటించగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ సవాలుకు జవాబిచ్చారు. ఆ రాష్ట్రంలోని రాజకీయం మరెన్ని మలుపులు తిరుగు తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. కర్ణాటక రాజకీయ చదరంగంలో అటు అధికార పక్షమూ, ఇటు విపక్షమూ రెండూ సాధారణ ప్రజానీకానికి ఏవగింపు కలిగించాయి. నిరుడు మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటినుంచి దినదిన గండంగానే బతుకీడుస్తోంది. 104మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... యడ్యూరప్ప సారధ్యంలో సర్కారు ఏర్పరి చినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. అటుపై 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి డీకే కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభు త్వానికి పాలనపై దృష్టి పెట్టే అవకాశమే కలగలేదు. స్వీయ రక్షణే దాని ఏకైక ఎజెండాగా మారింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని స్వల్పకాలం ఏలిన యడ్యూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేక పోయారు. వెలుపలి నుంచి యడ్యూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ఇలా రగిలిపోతుంటే కుమారస్వామి భరోసాతో ఉండటం ఎలా సాధ్యం? అందుకే ఆయన రాజీనామా చేసి పోతానని అనేకసార్లు బెదిరించారు. ఒక సందర్భంలో కంటతడి పెట్టారు. ఎవరినీ సంతృప్తిపరచలేక, సము దాయించలేక అయోమయానికి లోనయ్యారు. అయినా సిద్దరామయ్యను అదుపు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆయన్ను ఏదోవిధంగా సముదాయించినా ఆ పార్టీలో ఇతరేతర వర్గాలున్నాయి. వాటి డిమాండ్లు వాటికున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూటమి ప్రభుత్వం 14 నెలలు అధికారంలో కొనసాగడం నిజంగా వింతే. ఇప్పుడు యడ్యూరప్ప వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారో, లేదో చూడాల్సి ఉంది. సభకు గైర్హాజరైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో కూడా ఆసక్తికరమే. అయితే యడ్యూరప్ప ఏర్పరిచే ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పదవులు దక్కని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు చేసినట్టే, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించరని చెప్పలేం. 2008లో అధికారంలోకి వచ్చాక బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ము లాటలు ఎవరూ మరిచిపోరు. తొలుత యడ్యూరప్ప, ఆ తర్వాత సదానంద గౌడ, అటుపై జగదీశ్ శెట్టార్లకు అధికార పగ్గాలు అప్పగించినా అసంతృప్తి సద్దుమణగలేదు. పార్టీలో ముఠా తగాదాలు ముదిరిపోగా అధిష్టానం నిస్సహాయంగా మిగిలిపోయింది. చివరకు 2013లో దారుణంగా ఓటమి పాలయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిచేరే కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అండతో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగించగలదో చూడాలి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో వనరులు లేవు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా అదంత సులభమూ కాదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అనుకోవాలి. అసలు ఆ రెండూ ఇప్పుడున్నట్టే మిత్రపక్షాలుగా కొనసాగుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే బీజేపీ తెరవెనక ఉండి ఆడించిన రాజకీయ క్రీడ వల్ల తాము అధికారం కోల్పోయామని ప్రజల ముందు ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడానికి వాటికి అవ కాశం ఉంటుంది. రెండూ కలిసి నడిస్తేనే ఇదంతా సాధ్యం. తగినంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు ఫిరాయింపుల వల్ల కూలిపోవడం విచారించదగ్గ విషయమే. కానీ దేశంలో వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఫిరాయింపుల విషయంలో సూత్రబద్ధమైన వైఖరితో లేవు. ఫిరాయింపుల వల్ల బలైనప్పుడు ఒకలా, వాటివల్ల లబ్ధి పొందే పరిస్థితులున్నప్పుడు మరొకలా మాట్లాడటం ఆ పార్టీలకు అలవాటైపోయింది. సాగినన్నాళ్లు కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ప్రభుత్వాలను పడగొట్టింది. గతంలో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం అందుకున్నాక తానూ ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. ఫిరా యింపుల నిరోధక చట్టం ఆచరణలో పనికిమాలినదని రుజువయ్యాక కూడా కేంద్రంలో అధికారం చలాయించిన ఏ పక్షమూ దాన్ని సరిచేయడానికి పూనుకోలేదు. అలా చేయనివారే నష్టపోయినప్పుడల్లా అన్యాయం జరిగిందని శోకాలు పెడుతున్నారు. తాము అధికారంలోకొచ్చినప్పుడు మళ్లీ ఆ ఫిరాయింపులనే ప్రోత్సహించి, వాటితోనే మనుగడ సాగిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ పరిధి నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి కట్టబెడితే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అది ముందుమునుపూ ఏం సమస్యలు తెచ్చిపెడు తుందోనన్న భయంతో అలాంటి సవరణకు ఏ ప్రభుత్వమూ సిద్ధపడదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పది కాలాలపాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉందామని పార్టీలు భావించనంతకాలమూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫిరాయింపుల్ని, వాటిని ప్రోత్స హించే పార్టీలనూ ప్రజలు ఏవగించుకుంటే పార్టీలు పంథా మార్చుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ రాజకీయ సంతలు, బేరసారాలు కొనసాగక తప్పదు. కర్ణాటకలో ఇప్పుడున్న రాజ కీయ అస్థిరత సమసిపోవాలన్నా, అనైతిక రాజకీయాలకు కళ్లెం పడాలన్నా కొత్తగా ప్రజల తీర్పు కోరడమే శ్రేయస్కరం. అయితే అందుకు ఎన్ని పార్టీలు సిద్ధపడతాయన్నది ప్రశ్నార్థకమే. -
కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సుమారు14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంతోషంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ వైరలవుతోంది. రేణాకాచార్య కర్ణాటక దేవంగరే జిల్లా హోన్నాళి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. #WATCH Karnataka BJP MLA Renukacharya dances with supporters outside the Ramada Hotel in Bengaluru. HD Kumaraswamy led Congress-JD(S) government lost trust vote in the assembly, today. pic.twitter.com/6MBQNgzg4R — ANI (@ANI) July 23, 2019 స్పీకర్ సూచన మేరకు మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్‌కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి. చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..? సభ 10 నిమిషాలు వాయిదా అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్‌కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు. జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్‌ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్‌ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్‌ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్‌ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్‌డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్‌డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్‌తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్‌వాలా స్పీకర్‌ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్‌లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్‌ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్‌ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప