బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌, మరి జేడీఎస్‌? | Karnataka Assembly Polls 2023 Exit Polls: BJP Congress Tough Fight | Sakshi
Sakshi News home page

బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌.. హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లో మాత్రం డామినేషన్‌ ఎవరిదంటే..

Published Wed, May 10 2023 7:47 PM | Last Updated on Wed, May 10 2023 8:08 PM

Karnataka Assembly Polls 2023 Exit Polls: BJP Congress Tough Fight - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం.. పోలింగ్‌ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు.  13వ తేదీన ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది తేలిపోతుంది. ఈలోగా ఓటర్‌నాడిని అంచనా వేస్తూ.. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా.. దాదాపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ హంగ్‌ సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్‌ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 

👉 కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక జనతాదళ్‌ సెక్యులర్‌ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్‌పోల్స్‌ కోడై కూస్తున్నాయి. 

👉 ఈ రీజియన్‌లో ఓటింగ్‌ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్‌ షేర్‌ను కాషాయం పార్టీ దక్కించుకోనుంది. కాంగ్రెస్‌ కూడా దాదాపు 40 శాతం ఓట్‌ షేర్‌ దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్‌ కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. 

👉 ఇక రాజధాని బెంగళూరు రీజియన్‌లో  28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. సగానికి పైగా సీట్లతో కాంగ్రెస్‌ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్‌ డిజిట్‌ నుంచి పది స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. 

👉 ఓట్‌ షేరింగ్‌లో.. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం, జేడీఎస్‌ ఓట్‌ షేరింగ్‌ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్‌లో మెల్కోటోలో అత్యధికంగా 67.4 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. సీవీ నగర్‌లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్‌ రికార్డు అయ్యింది.

👉 సెంట్రల్‌ కర్ణాటకలో ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్‌ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్‌ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. ఇక జేడీఎస్‌ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది.

👉 హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లో.. కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. ఈ రీజియన్‌లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్‌ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్‌ ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్‌లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్‌కే దక్కవచ్చని అంచనా వేశాయి. 

ఇక కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న..  ఉత్తర కర్ణాటక, పాత మైసూర్‌ రీజియన్ల ఓటర్లు సైతం జేడీఎస్‌ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement