voting
-
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్‌లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్‌సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్‌లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్‌లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్‌ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్‌కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్‌లకు అల్విదా సిరియాలో అసద్‌ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్: మైనర్లకూ ఓటుహక్కు.. యూనస్ సర్కారు నిర్ణయం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.18 ఏళ్ల లోపు వారు కూడా..మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్‌లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడు చేసిన ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)ఓటుహక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వ్యతిరేకించిన బీఎన్పీ2024 ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనానంతరం తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా యూనస్ నియమితులయ్యారు. ఆయన తాజాగా బంగ్లాదేశ్‌లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకించింది.కొత్త ఓటరు జాబితా కోసం..ఢాకాలోని జాతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో బీఎన్పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దీనివలన మరింత సమయం వృధా అవుతుందని, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అలంగీర్ పేర్కొన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆరోపించారు.రాజకీయ పార్టీలతో చర్చ జరగాలిదేశ అధ్యక్షుడు ఓటింగ్‌కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సివస్తుంది. అలాకాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌కే వదిలేసి ఉంటే బాగుండేది. అప్పుడు సరైన నిర్ణయం వెలువడేది. ప్రస్తుతం దేశంలో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదిస్తే సరిపోయేది. అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చ జరిగేదని ఆలంగీర్ అన్నారు. కాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షడు యూనస్ డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్థం మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయిని అన్నారు. ఓటరు జాబితాను సవరించాక ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీజమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. -
బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు
-
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్‌కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్‌కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్‌లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maharashtra Election: ఓటు వెయ్యడానికిబారులు తీరిన జనం
-
కొనసాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఓటుకు నోటు.. డబ్బులిస్తూ దొరికిపోయిన బీజేపీ నేత?
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుంది. పోలింగ్‌కు ఒకరోజు ముందు రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పాల్ఘర్ జిల్లాలో ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. వినోద్ తావ్డే వద్ద ఉన్న బ్యాగ్‌లో సుమారు రూ.5 కోట్లు ఉన్నాయని బహుజన్ వికాస్ అఘాడి (బీవీఏ) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్ నాయక్, వినోద్ తావ్డేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్ని, బీఏవీ చేస్తున్న ఆరోపణల్ని వినోద్ తావ్డే ఖండించారు. సమావేశం జరిగే హోటల్ గదిలో పలువురు వద్ద కరెన్సీ దర్శనమివ్వడం వివాదం తలెత్తింది. వినోద్ తావ్డే ఓటర్లకు డబ్బులు నోట్లను పంచుతున్నారంటూ బీవీఏ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. ఆ డబ్బులు బ్యాగ్ తనది కాదని చెప్పడం గమనించవచ్చు.ఓటుకు నోటు ఘటనపై ఓ బీవీఏ నేత మాట్లాడుతూ.. తావ్డే తనని హోటల్ రూం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. తావ్డేతో పాటు వసాయ్ నుంచి పోటీ చేస్తున్న బీఏవీ ఎమ్మెల్యే అభ్యర్థులు హితేంద్ర ఠాకూర్, ఆయన కుమారుడు,నలసోపరా నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్తి క్షితిజ్ సైతం హోటల్ గదిలో ఉన్నట్లు తెలిపారు. తావ్డే తీరుపై బీవీఏ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేసిన పోలీసులు..బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేని భయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Shameless @BJP4India exposed again! In Vasai Vihar, #VinodTawde, BJP General Secretary, was caught red-handed by Bahujan Vikas Agadi distributing cash, with a bag filled with ₹5 crore, to voters and party workers during #MaharashtraElections. Hello @ECISVEEP, please wake up!!… pic.twitter.com/hlnjGdmwdi— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) November 19, 2024 -
మైకులు బంద్.. ముగిసిన ‘మహా’ ఎన్నికల ప్రచారం
ముంబయి:మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం(నవంబర్18) సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు మరింత వేడెక్కి పార్టీల మధ్య యాడ్వార్ నడిచింది. ప్రత్యర్థుల వైఫల్యాలివే అంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలిచ్చాయి.కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను కన్నడ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై బీజేపీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలుకొని కొవిడ్ కిట్ స్కామ్ వరకు అనేక అంశాలను ప్రకటనల్లో బీజేపీ ప్రస్తావించింది.పాల్గర్లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులతో పాటు ఎంవీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. బుధవారం(నవంబర్20) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మహిళలు... మరాఠాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండూ చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానారకాలుగా చీలిపోయి కని్పస్తుండటం విశేషం. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో రెండుగా చీలిపోవడం తెలిసిందే.దాంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్ధవ్ వర్గం; అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం తహతహలాడుతున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా; ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహా వికాస్ అఘాడీగా మోహరించాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలనూ మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలావరకు తేల్చనున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలావరకు మహిళలు, మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ఓటింగ్లో మహిళల జోరుమహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. పలు ఎన్నికలుగా ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటెత్తారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కారు పలు పథకాలు, తాయిలాలు ప్రకటించింది. 21–65 ఏళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 అందించే లడ్కీ బహిన్ పథకం అందులో భాగమే. ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను, అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది.వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా రూ.3,000 నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలి్పస్తాని పేర్కొంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 అందిస్తామన్న హామీ కూడా యువతుల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. టేబుల్⇒ మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు ⇒ పురుషులు 4.93 కోట్లు ⇒ మహిళలు 4.6 కోట్లురెబెల్స్ కాకతిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కన్పిస్తున్నారు. ముఖ్యంగా మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కూటమి అభ్యర్థులపై ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు చీల్చే ఓట్లు చాలాచోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన మహాయుతి నేతలను వెంటాడుతోంది.ముఖ్యంగా 62 స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబెల్స్ బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్ చేసింది. వీరికి జంప్ జిలానీలు తోడయ్యారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి! వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కని్పస్తున్నారు.మరాఠా రిజర్వేషన్లుఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటినుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పాటిల్ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదేపదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కని్పంచడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. వారికోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది. రైతులు, నిరుద్యోగంవీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కని్పస్తోంది. ఇటీవలి అకాల వర్షాలు రాష్ట్రంలో సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. దాంతో షిండే సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఎగుమతులపై నిషేధం ఉల్లి రైతులను బాగా దెబ్బ తీసింది. ఇవన్నీ తన పుట్టి ముంచేలా కని్పస్తుండటంతో దాంతో రైతులను ఆకట్టుకునేందుకు మహాయుతి సర్కారు ఆపసోపాలు పడుతోంది. పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది. ఇక మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్న మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. -
USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్‌హౌస్‌ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్ రాష్ట్రాల్లో పర్యటించారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్‌హౌస్‌ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
USA Presidential Elections 2024: స్వేచ్ఛకే అమెరికన్ల ఓటు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజనవాదాన్ని అమెరికన్లు ఓడించడం ఖాయమని కమలా హారిస్ ధీమా వెలిబుచ్చారు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకే ఓటేయాలని దేశమంతా పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారం భాగంగా నాకిది కొట్టొచ్చినట్టు కన్పించింది’’ అని చెప్పారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లోని డెట్రాయిట్లో ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘ఈసారి రెడ్ (రిపబ్లికన్లకు ఓటేసేవి) స్టేట్స్, బ్లూ (డెమొక్రాట్లకు ఓటేసేవి) స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాష్ట్రాలూ కలిసి చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీ సంఖ్యలో కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకొస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. -
ట్రంప్ వైపే కీలక స్వింగ్!
వాషింగ్టన్: ఫలితాలను తేల్చే కీలక స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవడా, అరిజోనా, విస్కాన్సిన్ అనూహ్యంగా ట్రంప్ వైపు మొగ్గుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోనూ ఆయనే ఆధిక్యంలోకి వచ్చినట్టు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్‌లో తేలడం విశేషం. నవంబర్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ పోల్‌లో ట్రంప్‌కు ఓటేస్తామని 49 శాతం చెప్పారు. హారిస్‌కు జైకొట్టిన వాళ్లకంటే ఇది ఏకంగా 1.8 శాతం అధికం! అరిజోనాలోనైతే ట్రంప్ ఏకంగా 6.5 శాతం ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆయనకు 52.3, హారిస్ 45.8 శాతం మంది జైకొట్టారు. నెవడాలో కూడా ట్రంప్ 5.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఆయన నార్త్ కరోలినాలో 3.2, జార్జియాలో 2.5, పెన్సిల్వేనియాలో 1.9, మిషిగన్‌లో 1.5, విస్కాన్సిన్లో 1.1 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. మరో సర్వే సైతం ఏడు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంపే గెలిచే అవకాశముందని తెలిపింది.అక్టోబర్ 24– నవంబర్ 2 మధ్య జరిగిన న్యూయార్క్ టైమ్స్/ సియానా కాలేజ్ పోల్ సర్వే స్వింగ్ స్టేట్స్లో హోరాహోరీయే సాగుతోందని పేర్కొంది. అయితే వాటిలో ఇప్పటిదాకా న్యూయార్క్ టైమ్స్ జరిపిన అన్ని పోల్స్‌లోనూ హారిస్ కనీసం 4 శాతం, అంతకుమించి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా తాజా సర్వేలో ట్రంప్ మెరుగవడం విశేషం. హారిస్ 49 శాతం ఓట్లతో ట్రంప్ కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవడాల్లో హారిస్‌కు ఆధిక్యం కనబడగా అరిజోనాలో ట్రంప్ స్పష్టంగా ముందంజలో ఉన్నారు. హారిస్ నెవడాలో 3 శాతం, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో 2 శాతం, జార్జియాలో ఒక శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరికీ పెన్సిల్వేనియాలో 48 శాతం, మిషిగాన్‌లో 47 శాతం చొప్పున వచ్చాయి. అరిజోనాలో మాత్రం ట్రంప్ ఏకంగా 4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్బీసీ న్యూస్ తాజా సర్వేలో ట్రంప్, హారిస్ ఇద్దరూ చెరో 49 శాతం ఓట్లు సాధించారు. ఎవరికి ఓటేయాలో ఇంకా తేల్చుకోలేదని సర్వేలో పాల్గొన్న వారిలో 2 శాతం మంది చెప్పారు. పోల్ ఆఫ్ పోల్స్‌లో ట్రంప్ 0.1 శాతం అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.ఓటేసిన వారిలో హారిస్‌కు 8 శాతం ఆధిక్యంఏడు స్వింగ్ స్టేట్లలో ఇప్పటికే 40 శాతం మంది ఓటేశారు. వారిలో హారిస్ 8 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ సర్వే తెలిపింది. కాకపోతే ఓటేయాల్సి ఉన్న వారిలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది. పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొంది. అమెరికాలో ఏడు స్వింగ్ స్టేట్స్ను మినహాయిస్తే మిగతావన్నీ సేఫ్ స్టేట్లే. వాటిలో ఏదో ఒక పార్టీయే నిలకడగా గెలుస్తూ వస్తోంది. వాటిని రెడ్ (రిపబ్లికన్), బ్లూ (డెమొక్రటిక్) రాష్ట్రాలుగా పేర్కొంటారు. రెడ్ స్టేట్స్ 1980 నుంచి రిపబ్లికన్లకు, బ్లూ స్టేట్స్ 1992 నుంచి డెమొక్రాట్లకు జై కొడుతూ వస్తున్నాయి. దాంతో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో పై చేయి సాధించే వారే గద్దెనెక్కడం పరిపాటి. వాటిలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు హోరాహోరీగా తలపడుతుంటారు. ఈ రాష్ట్రాల్లో సాధారణంగా గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగానే ఉంటుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అరిజోనాలో కేవలం 10,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.హారిస్‌వైపు అయోవా!పోలింగ్ తేదీ ముంచుకొచ్చిన వేళ రిపబ్లికన్లకు అనూహ్య షాక్ తగిలింది. వారికి అత్యంత సేఫ్ స్టేట్స్లో ఒకటైన అయోవా అనూహ్యంగా హారిస్‌వైపు మొగ్గుతున్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చింది. అందులో హారిస్‌కు 47 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు 44 శాతమే దక్కాయి. మహిళలతో పాటు తటస్థ ఓటర్లు భారీగా ఆమె వైపు మొగ్గడమే ఇందుకు కారణమని దెస్ మొయినెస్ రిజిస్టర్ వార్తా పత్రిక కోసం ఈ సర్వేను నిర్వహించిన సెల్జర్ పోల్ సంస్థ వివరించింది. అమెరికాలో పోల్స్ నిర్వహణలో అత్యధిక రేటింగులున్నది ఈ సంస్థకే కావడం విశేషం. అమెరికావ్యాప్తంగా మహిళల్లో ఇదే ధోరణి ప్రతిఫలిస్తే హారిస్ భారీ మెజారిటీతో నెగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు. సెప్టెంబర్ పోల్‌లో అయోవాలో ట్రంప్ 4 శాతం ఆధిక్యంలో ఉన్నారు. జూన్‌లో బైడెన్‌పై 18 పాయింట్ల ఆధిక్యం కనబరిచారు. అయోవా పోల్ తాజా ఫలితాలను తప్పుడువంటూ ట్రంప్ కొట్టిపారేశారు. -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం..? అందరికీ అర్థమయ్యే రీతిలో..!
వాషింగ్టన్ డిసి : ఏ ప్రజాస్వామ్య దేశమైన ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడుతారు అనే విషయం అందరికి విదితమే ! మరి ప్రజాస్వామ్య రాజకీయా వ్యవస్థల్లో ప్రజలే నిర్ణేతలు అయినప్పటికీ.. వోటింగ్ విధానం వివిధ దేశాల్లో విభిన్న రీతులలో ఉంటుంది! మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పురాతనమైన దేశం అంటే ఎన్నో దేశాలు పేర్లు వినిపిస్తాయి.. కానీ ప్రజల నానుడిలో ప్రజాస్వామ్య దేశాలలో పురాతనమైనదిగా అగ్రరాజం అమెరికా నిలువగా.. అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ దేశం నిలుస్తోంది. అందులో అగ్రరాజం అమెరికా ఎలక్షన్స్ అంటే ప్రపంచమంతా ఆశక్తిగా గమనిస్తుంది. మరి అగ్ర రాజ్యం ఎన్నికల విధానాన్ని ఎప్పుడు పరిశీలిద్దాం.ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువ ఓట్లు రావాలి.. ఇది అందరికీ తెలిసిన విషయమే..! కానీ ఎన్నికల్లో ఓట్లెక్కవ వచ్చినా ఓడిపోతారు అనే విషయం మీకు తెలుసా.. ! అవును అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లెక్కువ వచ్చినా.. గెలుస్తారనే ఏమీ లేదు. ఒట్లు తక్కువ వచ్చిన వారు కూడా ప్రెసిడెంట్ గా ఎన్నిక అవ్వచ్చు. అమెరికా చరిత్రలో అలా జరిగింది కూడా! మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! దీనికి కారణం… అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ! 2024 నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అగ్రదేశం కావడంతో అక్కడ ఎవరు ఓటు వేసేందుకు అర్హులు? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? సెనెట్ ఎలా కొలువుదీరుతుంది? ఇలాంటి అనేక అంశాలు సహా మొత్తం అమెరికా ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..!అమెరికాలో ఎన్నికలు టైమ్ అంటే టైమ్అగ్రరాజ్యంలో ప్రతి నాలుగేళ్ల ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో ఎన్నికలంటే ఆ దేశంలోని ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి దేశాధ్యక్షుడు ఎవరో తేలితే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని దేశాలు ముందే అంచనా వేసుకుంటాయి. ప్రపంచంలో ప్రధానంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ, స్విస్ సిస్టమ్, కమ్యూనిజం పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అమెరికన్లు అధ్యక్ష పాలనను ఎంచుకున్నారు. ఫలితంగా అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఎవర్నీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ ఉంటాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటనా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అంతటి శక్తిమంతుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది.అమెరికాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి..? ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి..? ఎప్పుడు ఫలితాలను ప్రకటించాలి..? ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి..? వంటివి అన్నీ ముందే ఫిక్స్ చేస్తారు. అమెరికాలో టైమ్ అంటే టైమ్.. 2024లో ఎన్నికలు జరగాలంటే.. ఆ ప్రకారం నిర్వహిస్తారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎలాంటి ఆటంకమూ ఏర్పడలేదంటే మీరే అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో ఏడాది పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్‌లో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం రోజే ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.అధ్యక్ష అభ్యర్థులను ఎలా నామినేట్ చేస్తారు?అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. రిపబ్లిక్ పార్టీ మరియు డెమొక్రటిక్ పార్టీ. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్.. ఓటింగ్ ద్వారా తమ పార్టీల తరుపున ఎవరు పోటీ చేయాలో నిర్ణయిస్తారు. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు, కాకస్‌లను పార్టీలు నిర్వహిస్తాయి. ప్రైమరీల్లో అభ్యర్థులకు రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌లో చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే అభ్యర్థులుగా నిలుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఓ నెలపాటు జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వారు ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే చాన్స్ ఉంటుంది. ఇదంతా జరిగాక ఎన్నికల ప్రచారానికి రెండు నెలల సమయం ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ రెండు నెలల్లో ఎన్నికల ప్రచారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తారు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రికార్డు సాధించాయి.అధ్యక్ష అభ్యర్థిపై అధికారిక ప్రకటనఅధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడానికీ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయా పార్టీల జాతీయ సమావేశాల్లోనే వారిని అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధుల కేటాయింపు విధానం రెండు పార్టీలకు వేర్వేరుగా ఉంటుంది. డెమొక్రాట్లు అయితే ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్లు, మద్దతుదారుల నిష్పత్తి ఆధారంగా వారికి ప్రతినిధులను కేటాయిస్తారు. రిపబ్లికన్లలో అయితే నిష్పత్తి విధానంతోపాటు ‘విజేతకే మొత్తం ప్రతినిధులు’ అన్న విధానాన్ని కూడా అనుసరిస్తారు. అంటే ప్రైమరీలు, కాకస్‌లలో ఎక్కువ ఓట్లు సాధించిన వారికే మొత్తం ప్రతినిధులను కేటాయిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ విధానం మారుతుంది.నేషనల్ కన్వెషన్లో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారిని డెలిగేట్స్.. సూపర్ డెలిగేట్స్ అంటారు. అంటే పార్టీ అధ్యక్షులు , మాజీ అధ్యక్షులు అన్నమాట. వీరు నేషనల్ కన్వెన్షన్‌లో ఫైనల్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఇందులోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడాలి? రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉండాలి? అని డిసైడ్ చేస్తారు. ఈ నేషనల్ కన్వెన్షన్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఏర్పాటవుతుంది.రిపబ్లిక్ పార్టీలో డానాల్డ్ ట్రంప్ కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే అధ్యక్ష బరిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్లపై ఆంక్షలు మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.డెమొక్రటిక్ తరుపున ముందుగా జో బైడెన్ అనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆయనే తప్పుకోవడంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.ప్రస్తుతం అధ్యక్ష బరిలో రిపబ్లిక్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ నుంచి కమలాహారీస్ పోటీ చేస్తున్నారు . ఎన్నికలు అనగానే భారతదేశంలో జరిగినట్టు ఇంటింటి ప్రచారాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బహిరంగ సభలు అమెరికాలోనూ ఉంటాయేమోనని చాలామంది అనుకుంటారు. కానీ.. భారత ఎన్నికల వ్యవస్థతో పోల్చతే అమెరికా అధ్యక్ష ఎన్నికల స్వరూపం పూర్తిగా భిన్నమైంది. కేవలం టీవీల్లోనే డిబేట్లు జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులూ లైవ్ టీవీ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది.ఎలక్టోరల్ కాలేజ్అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఇక్కడ ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. రాజధాని వాషింగ్టన్లో ముగ్గురు ఉంటారు. మొత్తం 103 మంది. వీరు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్ట్రోరల్ కాలేజీలో ఓటేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. ఇవన్నీ కలిస్తే మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు అన్నమాట. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ప్రజలు ఓటు వేసేది ఈ ఎలక్టర్లకే..!మరొక విషయం.. ఇక్కడ పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే.. విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు.ఉదాహరణకు… కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్ సీట్లుండగా... తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి.నవంబరు 5న ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు అనేవి ఖరారవుతాయి. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. అర్థం అవ్వలేదా..! సరే మీకు ఒక Example చెబుతాను..కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో ట్రంప్ కు కమలా హారిస్ కంటే ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చాయి అనుకుందాం..! కమలా హారిస్‌కు పాపులర్ ఓట్లు తక్కువ వచ్చినా.. 28 ఎలక్టోరల్ సీట్లు వస్తే మాత్రం.. ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందా.. దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే… 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావటం అధ్యక్ష పీఠానికి అత్యవసరం!ఇక్కడ మీకు ఓ డౌట్ రావచ్చు..! 28 ఎలక్టోరల్ సీట్లు గెలిచిన డెమోక్రాటిక్ ప్రతినిధులు కమలా హారిస్ కు ఓటు వేస్తారు.. కానీ 26 ఎలక్టోరల్ సీట్లు గెలిచిన రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు కమలా హారిస్ ఎందుకు ఓటు వేయాలి అని.అంటే కాలిఫోర్నియాలోని 54 ఎలక్టర్లంతా.. సగం కంటే ఎక్కవగా గెలిచిన డెమోక్రాటిక్ పార్టీ కమలా హారిస్‌కే కచ్చితంగా ఓటేయాలన్న రాజ్యాంగ నిబంధనేదీ లేదు. కానీ ఎలక్టోరల్ ప్రతినిధులుగా ఉన్నవారు నమ్మక ద్రోహానికి పాల్పడటం చాలా అరుదు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరైనా ఒకవేళ విశ్వాసాన్ని వమ్ముచేస్తే వారిపై ఆయా రాష్ట్రాలు కఠిన శిక్ష విధించాలని అమెరికా సుప్రీంకోర్టు 2020లో ఆదేశించింది.అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయొచ్చు. అమెరికాలో దూర ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఆన్ లైన్ లోనూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నట్లు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2024 నవంబరు 5న ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు.అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పే స్వింగ్ స్టేట్స్ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. పార్టీలు ఈ సింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తారు.2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది భావన! అందుకే వాటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు.ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైనా ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకుగాను… 270 మద్దతు లభించినవారు అధ్యక్షులవుతారు. ఎక్కువ ఓట్లు వచ్చినా ఓడిపోతారుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల ఓట్లు ఎక్కువగా పడ్డా అంటే పాపులర్ ఓటు సాధించినప్పటికి.. ఎలక్టోరల్ కాలేజీలో దెబ్బతిని కొంతమంది అభ్యర్థులు అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. 1824లో జాన్ క్విన్సీ ఆడమ్స్ పాపులర్ ఓటు గెల్చుకున్నా .. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. 2000 సంవత్సరంలో ఆల్ గోర్‌కు, 2016లో హిల్లరీ క్లింటన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంది.అల్‌గోర్‌కు జార్జ్ బుష్ కంటే 5లక్షలకు పైగా ఓట్లు వచ్చినా ఓడిపోయారు. 2016లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌కు 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ… ఎలక్టోరల్ కాలేజీకి అవసరమైనన్ని రాలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నిక హోరాహోరాగా సాగుతున్న నేపథ్యంలో… ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ 269 చొప్పున ఓట్లు వచ్చి.. టై అయితే పరిస్థితి ఏంటీ.? 1824లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నలుగురు అభ్యర్థులకూ ఎలక్టోరల్ కాలేజీలో సమానంగా ఓట్లు వచ్చాయి.అమెరికా రాజ్యాంగం ప్రకారం..ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం కుదరకపోతే.. అధ్యక్షుడిని.. కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభ అయినా ప్రతినిధుల సభ ఎన్నుకుటుంది. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ అయినా సెనెట్ ఎన్నుకుంటుంది.అమెరికా అధ్యక్షుడిని ప్రజల పాపులర్ ఓటు ద్వారా ఎంపిక చేయాలా.. కాంగ్రెస్ ద్వారానా అనే చర్చలో భాగంగా.. ఈ ఎలక్టోరల్ కాలేజీ పద్ధతి ఆవిర్భవించింది. అన్ని రాష్ట్రాల, అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం ఉండాలన్న అమెరికా రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీన్ని మార్చాలని, రద్దుచేయాలని ఇప్పటిదాకా దాదాపు 700సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు.అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారు?2024 నవంబర్5న అమెరికా ప్రెసిడెంట్ ఎవరనేది దాదాపు ఖరార్ అవుతుంది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే సదరు వ్యక్తులు బాధ్యతలు స్వీకరించలేరు. కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండున్నర నెలలు గడువు ఇస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత 2025 జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ ..అమెరికా కాంగ్రెస్ భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి ఎన్నికైన ప్రెసిడెంట్ వైట్‌హౌస్‌కి వెళతారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం ప్రెసిడెంట్ కి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.ఇంకా ఎవరెవరు ఎన్నికవుతారు?ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అలాగే కాన్సిలర్ల ఎన్నిక, గవర్నర్ల పోస్టుకు ఎన్నిక అన్నీ జరుగుతాయి. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ), సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి. ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి. ప్రతినిధుల సభకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్ష ఎన్నికలతో కలిపి ఒకసారి, రెండేళ్లు పూర్తయ్యాక మరోసారి నిర్వహిస్తారు. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనేట్ లో 100 స్థానాలున్నాయి. సెనేట్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. సెనేట్‌లో దాదాపు 35 స్థానాలకు 2024 నవంబర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు. మొత్తంగా ఎవరైతే 270 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తారో, వారు అధ్యక్షులుగా గెలుపొందుతారు. -సింహబలుడు హనుమంతు -
ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు
భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌కు 36 గంటల ముందే ప్రచారానికి తెర పడుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. కనీసం నాలుగు వారాల పాటు ప్రచారం, ఓటింగ్ సమాంతరంగా సాగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 12 రోజులే ఉంది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కానీ ఏకంగా 2.1 కోట్ల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే.1.33 కోట్ల పోస్టల్ ఓట్లుఫ్లోరిడా వర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 78 లక్షల ఓట్లు వ్యక్తిగత పద్ధతుల ద్వారా పోలయ్యాయి. మిగతా 1.33 కోట్ల పై చిలుకు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలయ్యాయి. ఆసియన్ అమెరికన్లలో మాత్రం 1.7 శాతం మంది మాత్రమే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నట్టు ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. దాని గణాంకాల ప్రకారం వ్యక్తిగత ప్రారంభ ఓటర్లలో 41.3 శాతం మంది రిప బ్లికన్లు ఓటు వేయగా, డెమొక్రాట్లు 33.6 శాతం మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యా లెట్ల ద్వారా డెమొ క్రాట్లు 20.4 శాతం, రిపబ్లికన్లు 21.2 శాతం ఓటు హక్కును వినియో గించుకున్నారు.జార్జియా రాష్ట్రంలో నాలుగో వంతు ఓటర్లు ఇప్పటికే ఓటేశారు. 18.4 లక్షల మంది జార్జియన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం తెలిపింది. ఇలినాయీ, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ఓటింగ్ సెంటర్లలో ఎక్కడ చూసినా పార్కింగ్ ప్రదేశాలు కిక్కిరిసి కన్పించాయి.అత్యధికంగా ఓటేసింది రిపబ్లికన్లే7 అతి కీలక స్వింగ్ స్టేట్లయిన అరిజోనా, నెవెడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేని యా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ఫలితాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తాయని అమెరికా రాజకీయ పండితులు చెబుతుంటారు. ఈ కీలక యుద్ధభూమి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌లో రిపబ్లికన్ ఓటర్లే పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని సీనియర్ పొలి టికల్ జర్నలిస్ట్ మార్క్ హాల్పెరిన్ అన్నారు. బహుశా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విజయానికి ఇది సూచిక కావచ్చని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ బాగా శ్రమించిందని అరిజోనాలో ముందస్తు బ్యాలెట్లను ట్రాక్ చేసే డెమొక్రాటిక్ రాజకీయ వ్యూహకర్త శామ్ అల్మీ అంగీకరించారు.ప్రత్యేక సౌలభ్యం.. ముందస్తు ఓటింగ్ అమెరికా ఓటర్లకున్న ప్రత్యేకమైన సౌలభ్యం. వారు మెయిల్– ఇన్– బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీన్ని మన దగ్గరి పోస్టల్ బ్యాలెట్‌తో పోల్చవచ్చు. కొన్ని చోట్ల పోలింగ్ రోజుకు వారాల ముందే పోలింగ్ కేంద్రాలను తెరుస్తారు. ముందుగానే ఓటేయాలనుకునే వారు నిర్ధారిత బూత్‌లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
మహారాష్ట్ర పోలింగ్ బుధవారమే ఎందుకు?
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నగారా మోగించింది.నామినేషన్లు, పోలింగ్, ఫలితాల తేదీల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ తేదీ,పోలింగ్ జరిగే వారం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు.నవంబర్ 20 (బుధవారం) మహారాష్ట్రలో ఉన్న మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తాం. పోలింగ్ కోసం బుధవారాన్ని మేం కావాలనే ఎంచుకున్నాం. వారం మధ్యలో పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనే బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నాం.వీకెండ్లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’అని రాజీవ్‌కుమార్ చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల -
ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్ గా మిగిలిపోతాయి.ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్ ఓటింగ్ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్ పోలింగ్ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపైఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్ స్లిప్‌లను పోలింగ్ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.వీవీప్యాట్ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు. ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.ట్యాంపరింగ్ సాధ్యమేనా?సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.2009 ముందు వరకు ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్ స్లిప్ లపై మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా? జరగదని చెప్పజాలం.1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్ పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్ చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజల విశ్వాసం పెంచాలంటే పేపర్ బ్యాలెట్ ఒక్కటే పరిష్కారం
-
Haryana Election: ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
HARYANA ASSEMBLY ELECTION POLLING UPDATES...హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.మరికాసేపట్లో హర్యానాలో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 49.1 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పలుచోట్లు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.7% పోలింగ్ నమోదైంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అధికార బీజేపీ హ్యాట్రిక్‌పై కన్నేసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ సైతం తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి.అనేక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం ఉంది. ఉదయం నుంచీ సీఎం నాయబ్ సైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలువురు వీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే స్టార్ క్రీడాకారులు మనూ బాకర్, వినేష్ ఫోగట్ కూడా ఓటేసిన వారిలో ఉన్నారు.ఇవాళ జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో నాయబ్ సైనీ, భూపీందర్ హుడా, వినేష్ ఫోగట్ సహా దాదాపు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 20వేల623 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది.ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.హరియాణా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు.ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ డిప్యూటీసీఎం దుశ్యంత్ చౌతాాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్‌లో ఓటు వేశారు. -
కశ్మీర్ మూడో విడత పోలింగ్‌లో 68 శాతం ఓటింగ్
జమ్మూ/శ్రీశ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడో విడతలో మంగళవారం జరిగిన పోలింగ్‌లో 68.72 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు మించి జనం ఓటేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లో 66.78% ఓటింగ్ నమోదైంది. ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించే బారాముల్లా, సొపోర్ అసెంబ్లీ స్థానాల్లో 30 ఏళ్లలోనే అత్యధికంగా ఈసారి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఈసీ తెలిపింది.అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జమ్మూకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అత్యధికంగా సాంబాలో 73.45%, ఉధంపూర్‌లో 72.91% మంది ఓటేయగా, కథువా లో 70.53%, జమ్మూలో 66.79%, బందిపొరాలో 64.85%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.జమ్మూ జిల్లాలోని ఛాంబ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వివరించింది. సొపోర్ నియోజకవర్గంలో 41.44%, బారాముల్లా అసెంబ్లీ స్థానంలో 47.95% మంది ఓటు వేశారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని ఈసీ తెలిపింది. గతంలో ఇక్కడ తరచూ ఎన్నికలను బహిష్కరించే ఆనవాయితీ నడిచిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఓటింగ్ శాతం 63.45 అని ఈసీ పేర్కొంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, రీపోలింగ్ అవసరం కూడా లేదని వివరించింది. ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఇదే
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్ 5కు మార్పు చేసింది. తొలుత అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్‌తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించననుంది.బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్‌కు భారీగా తరలివస్తారు. దీంతో ఎన్నికల సంఘానికి జాతీయ, స్థానిక పార్టీలు.. అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ సాధించింది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. -
థాయిలాండ్ ప్రధాని పీఠంపై పేటోంగ్టార్న్!
బ్యాంకాక్: థాయిలాండ్ రాజకీయాల్లో షనవత్రల మరో కుటుంబ వారసురాలు ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రంగం సిద్ధమైంది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తరఫున అభ్యరి్థగా నిలబడిన నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర ఓటింగ్‌లో సాధారణ మెజారిటీకి కావాల్సిన 247 ఓట్లను దాటేశారు. దీంతో పేటోంగ్టార్న్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. దీంతో షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రులుగా చేశారు. 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపడుతున్న నేపథ్యంలో థాయిలాండ్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతి పిన్క వయసు్కరాలిగా, రెండో మహిళగా రికార్డ్నెలకొల్పనున్నారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి బుధవారం థాయిలాండ్‌లోని రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం విదితమే. -
థాయ్‌లాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ ఖరారు!
బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది. శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్టార్న్ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే.