అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం..? అందరికీ అర్థమయ్యే రీతిలో..! | Details on The Election Process of the US President | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం..? అందరికీ అర్థమయ్యే రీతిలో..!

Published Fri, Oct 25 2024 7:26 PM | Last Updated on Tue, Oct 29 2024 9:19 AM

Details on The Election Process of the US President

వాషింగ్టన్ డిసి : ఏ ప్రజాస్వామ్య దేశమైన ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడుతారు అనే విషయం అందరికి విదితమే ! మరి ప్రజాస్వామ్య రాజకీయా వ్యవస్థల్లో ప్రజలే నిర్ణేతలు అయినప్పటికీ.. వోటింగ్ విధానం వివిధ దేశాల్లో విభిన్న రీతులలో ఉంటుంది! మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పురాతనమైన దేశం అంటే ఎన్నో దేశాలు పేర్లు వినిపిస్తాయి.. కానీ  ప్రజల నానుడిలో ప్రజాస్వామ్య దేశాలలో పురాతనమైనదిగా  అగ్రరాజం అమెరికా నిలువగా..  అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ దేశం నిలుస్తోంది. అందులో అగ్రరాజం అమెరికా ఎలక్షన్స్ అంటే ప్రపంచమంతా ఆశక్తిగా గమనిస్తుంది. మరి అగ్ర  రాజ్యం ఎన్నికల  విధానాన్ని  ఎప్పుడు  పరిశీలిద్దాం.

ఎన్నికల్లో  గెలవాలంటే ఎక్కువ ఓట్లు రావాలి.. ఇది అందరికీ తెలిసిన విషయమే..! కానీ ఎన్నికల్లో ఓట్లెక్కవ వచ్చినా ఓడిపోతారు అనే విషయం మీకు తెలుసా.. !  అవును అగ్రరాజ్యం అమెరికా  అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లెక్కువ వచ్చినా..  గెలుస్తారనే  ఏమీ లేదు. ఒట్లు తక్కువ వచ్చిన వారు కూడా ప్రెసిడెంట్ గా ఎన్నిక అవ్వచ్చు.  

అమెరికా చరిత్రలో అలా జరిగింది కూడా! మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! దీనికి కారణం… అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్‌ కాలేజీ!   2024 నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అగ్రదేశం కావడంతో అక్కడ ఎవరు ఓటు వేసేందుకు అర్హులు? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? సెనెట్ ఎలా కొలువుదీరుతుంది? ఇలాంటి అనేక అంశాలు సహా మొత్తం అమెరికా ఎన్నికల ప్రాసెస్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..!

అమెరికాలో ఎన్నికలు టైమ్ అంటే టైమ్
అగ్రరాజ్యంలో ప్రతి నాలుగేళ్ల ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో ఎన్నికలంటే ఆ దేశంలోని ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి దేశాధ్యక్షుడు ఎవరో తేలితే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని దేశాలు ముందే అంచనా వేసుకుంటాయి. ప్రపంచంలో ప్రధానంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ, స్విస్ సిస్టమ్, కమ్యూనిజం పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అమెరికన్లు అధ్యక్ష పాలనను ఎంచుకున్నారు. ఫలితంగా అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఎవర్నీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ ఉంటాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటనా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అంతటి శక్తిమంతుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది.

అమెరికాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి..? ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి..? ఎప్పుడు ఫలితాలను ప్రకటించాలి..? ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి..? వంటివి అన్నీ ముందే ఫిక్స్ చేస్తారు. అమెరికాలో టైమ్ అంటే టైమ్.. 2024లో ఎన్నికలు జరగాలంటే.. ఆ ప్రకారం నిర్వహిస్తారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎలాంటి ఆటంకమూ ఏర్పడలేదంటే మీరే అర్ధం చేసుకోవచ్చు.  అమెరికాలో ఏడాది పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.  నవంబర్‌లో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం రోజే ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.

అధ్యక్ష అభ్యర్థులను ఎలా నామినేట్ చేస్తారు?
అమెరికాలో  రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. రిపబ్లిక్ పార్టీ మరియు డెమొక్రటిక్ పార్టీ.  రాష్ట్ర ప్రైమరీలు, కాకస్..  ఓటింగ్ ద్వారా తమ  పార్టీల తరుపున ఎవరు పోటీ చేయాలో  నిర్ణయిస్తారు. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు, కాకస్‌లను పార్టీలు నిర్వహిస్తాయి. ప్రైమరీల్లో అభ్యర్థులకు రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌లో చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే అభ్యర్థులుగా నిలుస్తారు.  ఈ మొత్తం ప్రక్రియ ఓ నెలపాటు జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వారు ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే చాన్స్ ఉంటుంది. ఇదంతా జరిగాక ఎన్నికల ప్రచారానికి రెండు నెలల సమయం ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ రెండు నెలల్లో ఎన్నికల ప్రచారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తారు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రికార్డు సాధించాయి.

అధ్యక్ష అభ్యర్థిపై అధికారిక ప్రకటన
అధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడానికీ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయా పార్టీల జాతీయ సమావేశాల్లోనే వారిని అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధుల కేటాయింపు విధానం రెండు పార్టీలకు వేర్వేరుగా ఉంటుంది. డెమొక్రాట్లు అయితే ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్లు, మద్దతుదారుల నిష్పత్తి ఆధారంగా వారికి ప్రతినిధులను కేటాయిస్తారు. రిపబ్లికన్లలో అయితే నిష్పత్తి విధానంతోపాటు ‘విజేతకే మొత్తం ప్రతినిధులు’ అన్న విధానాన్ని కూడా అనుసరిస్తారు. అంటే ప్రైమరీలు, కాకస్‌లలో ఎక్కువ ఓట్లు సాధించిన వారికే మొత్తం ప్రతినిధులను కేటాయిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ విధానం మారుతుంది.

నేషనల్ కన్వెషన్‌లో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారిని డెలిగేట్స్.. సూపర్ డెలిగేట్స్ అంటారు. అంటే పార్టీ అధ్యక్షులు , మాజీ అధ్యక్షులు అన్నమాట. వీరు నేషనల్ కన్వెన్షన్‌లో ఫైనల్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఇందులోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడాలి? రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉండాలి? అని డిసైడ్ చేస్తారు. ఈ నేషనల్ కన్వెన్షన్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఏర్పాటవుతుంది.

రిపబ్లిక్ పార్టీలో డానాల్డ్ ట్రంప్ కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే అధ్యక్ష బరిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్‌లపై  ఆంక్షలు  మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.

డెమొక్రటిక్ తరుపున ముందుగా జో బైడెన్ అనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆయనే తప్పుకోవడంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.

ప్రస్తుతం అధ్యక్ష బరిలో రిపబ్లిక్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ నుంచి కమలాహారీస్ పోటీ చేస్తున్నారు .  

ఎన్నికలు అనగానే భారతదేశంలో జరిగినట్టు ఇంటింటి ప్రచారాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బహిరంగ సభలు అమెరికాలోనూ ఉంటాయేమోనని చాలామంది అనుకుంటారు. కానీ.. భారత ఎన్నికల వ్యవస్థతో పోల్చతే అమెరికా అధ్యక్ష ఎన్నికల స్వరూపం పూర్తిగా భిన్నమైంది. కేవలం టీవీల్లోనే డిబేట్లు జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులూ లైవ్ టీవీ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఎలక్టోరల్ కాలేజ్
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక  కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఇక్కడ ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. రాజధాని వాషింగ్టన్‌లో ముగ్గురు ఉంటారు. మొత్తం 103 మంది. వీరు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్ట్రోరల్‌ కాలేజీలో ఓటేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు.  ఇవన్నీ కలిస్తే మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లు అన్నమాట. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ప్రజలు ఓటు వేసేది ఈ ఎలక్టర్లకే..!

మరొక విషయం.. ఇక్కడ పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే..  విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు.

ఉదాహరణకు… కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్‌ సీట్లుండగా... తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి.

నవంబరు 5న ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్‌ సీట్లు అనేవి ఖరారవుతాయి. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. అర్థం అవ్వలేదా..! సరే మీకు ఒక Example చెబుతాను..

కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి. ఆ రాష్ట్రంలో  ఈసారి ఎన్నికల్లో ట్రంప్ కు  కమలా హారిస్‌ కంటే ఎక్కువ  పాపులర్ ఓట్లు వచ్చాయి అనుకుందాం..!  కమలా హారిస్‌కు  పాపులర్ ఓట్లు తక్కువ వచ్చినా..   28 ఎలక్టోరల్‌ సీట్లు వస్తే మాత్రం.. ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్‌ పార్టీ ఖాతాలో పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందా..  దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే… 270 ఎలక్టోరల్‌ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావటం అధ్యక్ష పీఠానికి అత్యవసరం!

ఇక్కడ మీకు  ఓ డౌట్ రావచ్చు..!  28 ఎలక్టోరల్‌ సీట్లు గెలిచిన  డెమోక్రాటిక్‌  ప్రతినిధులు  కమలా హారిస్ కు ఓటు వేస్తారు.. కానీ 26 ఎలక్టోరల్‌ సీట్లు  గెలిచిన రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు కమలా హారిస్ ఎందుకు ఓటు వేయాలి అని.

అంటే కాలిఫోర్నియాలోని 54 ఎలక్టర్లంతా..  సగం కంటే ఎక్కవగా గెలిచిన  డెమోక్రాటిక్‌ పార్టీ  కమలా హారిస్‌కే కచ్చితంగా ఓటేయాలన్న రాజ్యాంగ నిబంధనేదీ లేదు. కానీ ఎలక్టోరల్‌ ప్రతినిధులుగా ఉన్నవారు నమ్మక ద్రోహానికి  పాల్పడటం చాలా అరుదు. ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ఎవరైనా ఒకవేళ  విశ్వాసాన్ని  వమ్ముచేస్తే వారిపై ఆయా రాష్ట్రాలు కఠిన శిక్ష విధించాలని అమెరికా సుప్రీంకోర్టు 2020లో ఆదేశించింది.

అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయొచ్చు. అమెరికాలో దూర ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఆన్ లైన్ లోనూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నట్లు..  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2024  నవంబరు 5న ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు.

అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పే స్వింగ్ స్టేట్స్
ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. పార్టీలు ఈ సింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తారు.

2024 ఎన్నికల్లో స్వింగ్‌ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది భావన! అందుకే వాటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్‌ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు.

ఎలక్టోరల్‌ కాలేజీకి ఎంపికైనా  ప్రతినిధులు (ఎలక్టర్లు )  డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ సీట్లకుగాను… 270 మద్దతు లభించినవారు అధ్యక్షులవుతారు.  

ఎక్కువ ఓట్లు  వచ్చినా ఓడిపోతారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల ఓట్లు ఎక్కువగా పడ్డా అంటే పాపులర్‌ ఓటు సాధించినప్పటికి..  ఎలక్టోరల్‌ కాలేజీలో దెబ్బతిని కొంతమంది అభ్యర్థులు అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. 1824లో జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌ పాపులర్‌ ఓటు గెల్చుకున్నా .. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. 2000 సంవత్సరంలో ఆల్‌ గోర్‌కు, 2016లో హిల్లరీ క్లింటన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంది.

అల్‌గోర్‌కు జార్జ్‌ బుష్‌ కంటే 5లక్షలకు పైగా ఓట్లు వచ్చినా ఓడిపోయారు. 2016లో ట్రంప్‌  కంటే హిల్లరీ క్లింటన్‌కు 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ… ఎలక్టోరల్‌ కాలేజీకి అవసరమైనన్ని రాలేదు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నిక హోరాహోరాగా సాగుతున్న నేపథ్యంలో… ఎలక్టోరల్‌ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ 269 చొప్పున ఓట్లు వచ్చి.. టై అయితే పరిస్థితి ఏంటీ.?  1824లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.  నలుగురు అభ్యర్థులకూ ఎలక్టోరల్‌ కాలేజీలో సమానంగా ఓట్లు  వచ్చాయి.

అమెరికా రాజ్యాంగం ప్రకారం..ఎలక్టోరల్‌ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం కుదరకపోతే.. అధ్యక్షుడిని..  కాంగ్రెస్‌ (పార్లమెంటు)లోని దిగువ సభ అయినా ప్రతినిధుల సభ ఎన్నుకుటుంది. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ అయినా సెనెట్‌ ఎన్నుకుంటుంది.

అమెరికా అధ్యక్షుడిని ప్రజల పాపులర్‌ ఓటు ద్వారా ఎంపిక చేయాలా.. కాంగ్రెస్‌ ద్వారానా అనే చర్చలో భాగంగా..  ఈ ఎలక్టోరల్‌ కాలేజీ పద్ధతి ఆవిర్భవించింది. అన్ని రాష్ట్రాల, అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం ఉండాలన్న అమెరికా రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీన్ని మార్చాలని, రద్దుచేయాలని ఇప్పటిదాకా దాదాపు 700సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు.

అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారు?
2024 నవంబర్5న  అమెరికా ప్రెసిడెంట్ ఎవరనేది దాదాపు ఖరార్ అవుతుంది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే సదరు వ్యక్తులు బాధ్యతలు స్వీకరించలేరు. కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండున్నర నెలలు గడువు ఇస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత 2025 జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ ..అమెరికా కాంగ్రెస్ భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి ఎన్నికైన ప్రెసిడెంట్ వైట్‌హౌస్‌కి వెళతారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం ప్రెసిడెంట్ కి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.

ఇంకా ఎవరెవరు ఎన్నికవుతారు?
ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అలాగే కాన్సిలర్ల ఎన్నిక, గవర్నర్ల పోస్టుకు ఎన్నిక అన్నీ జరుగుతాయి. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ), సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి.  ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి.  ప్రతినిధుల సభకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. 

అధ్యక్ష ఎన్నికలతో కలిపి ఒకసారి, రెండేళ్లు పూర్తయ్యాక మరోసారి నిర్వహిస్తారు. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై   ఓటు వేసే  సెనేట్‌ లో 100 స్థానాలున్నాయి. సెనేట్‌ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. సెనేట్‌లో దాదాపు 35 స్థానాలకు 2024 నవంబర్ లో ఎన్నికలు  జరుగుతున్నాయి.  రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు.  మొత్తంగా ఎవరైతే 270 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు సాధిస్తారో, వారు అధ్యక్షులుగా గెలుపొందుతారు.  
-సింహబలుడు హనుమంతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement