వాషింగ్టన్ : రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయులు.. అమెరికన్ల ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారంటూ ప్రచారం చేశారు.
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (నవంబర్5) ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌లు ఎన్నికల ప్రచారంలో పోటీ పోటీగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
అయితే ట్రంప్ అందుకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారంలో భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో హీటెక్కిస్తున్నారు. అందుకు తన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)మీడియాను వినియోగిస్తున్నారు.
తాజాగా మాగా మీడియా, ట్రంప్‌కు మద్దతు పలికిన పలు ఆర్థిక వేత్తలతో ట్రంప్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో గతేడాది అమెరికన్లు 8లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో విదేశీయులు 10లక్షల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబర్ మార్కెట్ విదేశీ కార్మికులు, ప్రభుత్వ బ్యూరోక్రాట్‌లకు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుందని మాగా మీడియా ఈవెంట్‌లో ట్రంప్ మద్దతు దారుడు, ఆర్ధిక వేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు.
మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై అమెరికన్‌లో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫిన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ షీల్ మొహ్నోట్ మాట్లాడుతూ.. టెక్సాస్‌లో భారతీయులు సేవలందిస్తున్న ఓ బ్యాంక్‌పై విమర్శలు గుప్పించారు. వారందరూ వచ్చే ఏడాది భారతదేశానికి తిరిగి వెళతారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. మేము వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, వారందరినీ తిరిగి గుజరాత్‌కు పంపుతాము అంటూ విమర్శిస్తూ షేర్ చేసిన పలు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment