US election
-
ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు
న్యూయార్క్: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణలు తెస్తూ బుధవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇన్నాళ్లూ స్వీయప్రకటిత పత్రాన్ని సమర్పించి ఓటింగ్ కేంద్రంలో పౌరులు ఓటేస్తుండగా ఇకపై ఏదైనా అదీకృత గుర్తింపు పత్రం/కార్డును చూపించి అమెరికా పౌరుడిగా నిరూపించుకున్నాకే ఓటేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. దీంతో పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన, సరైన డ్రైవింగ్ లైసెన్స్, కొత్త పాస్పోర్ట్లేని అమెరికా పౌరులకు ఓటింగ్ కష్టాలు మొదలుకానున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే ‘ఓటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు’ విధానాన్ని అవలంబిస్తుండగా ట్రంప్ సైతం అమెరికాను ఇదే బాటలో పయనింపజేయాలని నిశ్చయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకంచేశారు. అయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ మేరకు సమగ్రస్థాయిలో అమలవుతుందో తేలాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును కొన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్‌చేసే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు తప్పనిసరి ఇన్నాళ్లూ ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు ఓటేసేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి భారత్‌లో మాదిరి ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. పాస్ట్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అ«దీకృత గుర్తింపు పత్రం/కార్డును ఓటింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను బహిష్కరిస్తూ, స్వదేశాలకు తరలిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను అధికార రిపబ్లికన్ పార్టీ స్వాగతిస్తోంది. దీంతో నాన్–అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. వీరిలో ఓటేసే అవకాశమున్న వాళ్లు విపక్ష డెమొక్రటిక్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు, నాన్–అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. పౌరులుకాని వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు, తొలుత వారిని గుర్తించేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్మెంట్లు అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ జాబితాను అందజేయనున్నాయి. వ్యతిరేకిస్తున్న హక్కుల సంఘాలు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామనడం ఓటింగ్ హక్కును కాలరాయడమేనని ఓటింగ్ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ‘‘ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలుచేస్తే ఓటర్ల జాబితాలోని నాన్–సిటిజన్లు కొద్దిమంది మాత్రమే ఓటింగ్‌ను కోల్పోరు. సరైన పత్రాలు లేని లక్షలాది మంది అమెరికా పౌరులు సైతం తమ ఓటు హక్కుకు దూరమవుతారు. ఇది ఓటింగ్ శాతంపై పెను ప్రభావం చూపుతుంది. గెలుపుపైనా ప్రభావం పడొచ్చు’’ అని లాస్ఏంజెలెస్లోని కాలిఫోరి్నయా యూనివర్సిటీలో ఎన్నికల చట్టాల నిపుణుడు రిచర్డ్ హేసన్ అభిప్రాయపడ్డారు. ‘‘మహిళల బర్త్ సర్టిఫికెట్లో అసలైన పేరు ఉంటుంది. పెళ్లయ్యాక లాస్ట్‌నేమ్ మారుతుంది. పెళ్లయ్యాక తీసుకున్న పత్రాలు, బర్త్ సర్టిఫికెట్ ఒకలా ఉండవు. ఇలాంటి వాళ్లు ఓటేయడ కష్టమే’’ అని ఆయన ఉదహరించారు. 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు పబ్లిక్ సిటిజన్ అనే సంస్థ గణాంకాల ప్రకారం అమెరికన్ పౌరుల్లో దాదాపు 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు. ఓటింగ్‌కు పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్‌నే అనుమతించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘‘ట్రంప్ అతి చర్యల కారణంగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో పేరు సరిపోలిన వాళ్లు మాత్రమే ఓటేసేందుకు అర్హులవుతారు. ఇంటి పేరు మారిన మహిళలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదల్లో ఇళ్లు కాలిపోయి డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వాళ్లు ఇకపై ఓటు హక్కును వినియోగించుకోవడం అసాధ్యం’’ అని డెమొక్రటిక్ నేత, దిగువసభ సభ్యురాలు జాస్మిన్ ఫెలీసియా క్రోకెట్ ఆందోళన వ్యక్తంచేశారు. తర్వాత వచ్చే బ్యాలెట్ ఓట్లను పరిగణించరు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించబోరు. ఓటింగ్ తేదీకి ముందే మార్కింగ్ చేసి పోస్ట్‌లో పంపినట్లు రుజువైతే మాత్రమే తర్వాతి తేదీన అందినా అనుమతిస్తారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలు, ప్యూర్టోరీకో మాత్రమే తర్వాత తేదీ నుంచి వచి్చనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతిస్తున్నాయి. అత్యధిక ఓటర్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకంగా ఏడు రోజుల తర్వాత కూడా అనుమతిస్తారు. ఎన్నికల విరాళాల మీదా ఆంక్షలు! రాజకీయ పార్టీలకు వ్యక్తులు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం లేదు. పొలిటికల్ యాక్షన్ కమిటీలను ఏర్పాటుచేసి వాటికి విరాళాలు అందించి వాటి ద్వారానే ఎన్నికల ఖర్చులకు సాయపడొచ్చు. ఈ ఎన్నికల విరాళాలపైనా కఠిన నియమాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరులుగాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనల్లో విఫలమయ్యాం: ట్రంప్ ‘‘సుపరిపాలనలో మనం ఎన్నో దేశాలకు ఆదర్శంగా ఉన్నాం. కానీ ఎన్నికల ప్రాథమిక నిబంధనల పటిష్ట అమలులో విఫలమయ్యాం. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ముందున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల జాబితాను బయోమెట్రిక్ డేటాబేస్‌తో పోలి్చచూస్తూ ముందంజలో ఉంటే మనం ఇంకా సెల్ఫ్–అటెస్టేషన్ స్థాయిలోనే ఆగిపోయాం. జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్లను అందరి సమక్షంలో లెక్కిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వడం లేదు. మనం వేర్వేరు రకాల ఓటింగ్ విధానాలను అవలంభిస్తూ సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియలో మునిగిపోయాం. మెయిల్–ఇన్ ఓట్ల విషయంలో డెన్మార్క్, స్వీడన్ ముందున్నాయి’’.బ్రెనాన్ సెంటర్ ఫర్ జస్టిస్ గణాంకాల ప్రకారం ఓటింగ్ వయసున్న అమెరికా పౌరుల్లో 9 శాతం మందికి, అంటే 2.13 కోట్ల మందికి పౌరసత్వాన్ని నిరూపించుకునేఎలాంటి గుర్తింపు పత్రాలూ లేవు! -
డొనాల్ట్ ట్రంప్ ఓడిపోయి ఉంటేనా..
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ నివేదిక రిలీజ్ చేసింది.స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్ కౌన్సల్ జాక్ స్మిత్ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు. ట్రంప్‌పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్ కిందటి ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. జాక్ స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్ మీద స్మిత్ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్‌పై నమోదైన రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను ఆయనే పర్యవేక్షించారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్‌పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం. -
స్పందించిన బెజోస్.. రిప్లై ఇచ్చిన మస్క్: ట్వీట్స్ వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతారని ఊహించినందున.. తమ టెస్లా, స్పేస్ఎక్స్ స్టాక్లను విక్రయించమని అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రజలకు సలహా ఇచ్చారని 'ఇలాన్ మస్క్' (Elon Musk) చేసిన వాదనపై జెఫ్ బెజోస్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మస్క్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది వంద శాతం తప్పు అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. సరే, నేను సరిదిద్దుకున్నాను అంటూ.. మస్క్ స్మైల్ ఎమోజీని యాడ్ చేశారు.అంతే కంటే ముందు నవంబర్ 6న జెఫ్ బెజోస్ తన ఎక్స్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించారు. మా 47వ అధ్యక్షుడికి శుభాకాంక్షలు అంటూ.. మనమందరం ఇష్టపడే అమెరికాను నడిపించడంలో ట్రంప్ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జెఫ్ బెజోస్ కమలా హారిస్‌కు సపోర్ట్ చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..రూ.28 లక్షల కోట్లకు చేరిన మస్క్ సంపదఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.Nope. 100% not true.— Jeff Bezos (@JeffBezos) November 21, 2024Well, then, I stand corrected 😂— Elon Musk (@elonmusk) November 21, 2024 -
ఎక్స్‌కు బై చెబుతున్న యూజర్లు.. మస్క్ వైఖరి మారిందా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ విజయం ఖరారు అయినప్పటి నుంచి క్రమంగా ఇలాన్‌మస్క్ ఆధ్యర్యంలోని ఎక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే అందుకు మస్క్ అవలంభిస్తున్న విధానాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే తయారు చేసిన ‘బ్లూస్కై’ వినియోగదారులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.డొనాల్డ్ట్రంప్ విజయానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. రిపబ్లికన్ పార్టీకి తన వంతుగా దాదాపు రూ.900 కోట్లకు పైనే విరాళం అందించారు. ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ తటస్థతపై ప్రశ్నలొస్తున్నాయి. 2022లో ట్విటర్ చేజిక్కించుకున్న సమయంలో మస్క్ మాట్లాడుతూ..‘ప్రజల్లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)పై విశ్వాసం పెరగాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అన్నారు. కానీ, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో తన వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుకు ముందు ‘ఈసారి తన పదవీకాలం ముగిసే సమయానికి ట్రంప్‌నకు 82 ఏళ్లు వస్తాయి. దాంతో ఏ కంపెనీకు తాను సీఈఓగా ఉండేందుకు వీలుండదు. తర్వాత అమెరికాకు సారథ్యం వహించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అన్నారు. మస్క్ ఎక్స్‌ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి అందులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందనే వాదనలున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.వారంలో 10 లక్షల వినియోగదారులు ఇదిలాఉండగా, ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కై యాప్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వీరి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఎన్నికల తర్వాత వారం రోజుల్లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త వినియోగదారులను సంపాదించినట్లు కంపెనీ ప్రతినిధి ఎమిలీ లియు తెలిపారు. వీరిలో అధికంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగ ప్రకటనలో వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపుబ్లూస్కై అంటే ఏమిటి?జాక్ డోర్సే 2019లో బ్లూస్కైను ప్రారంభించారు. ఇది ఎక్స్, ఫేస్బుక్ మాదిరిగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. 2022లో మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని ప్రచారాన్ని పెంచారు. ఈ ప్లాట్ఫామ్లో తాజాగా రాపర్ ఫ్లేవర్ ఫ్లావ్, రచయిత జాన్ గ్రీన్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, చస్టెన్ బుట్టిగీగ్, మెహదీ హసన్, మోలీ జోంగ్-ఫాస్ట్ వంటి ప్రముఖులు చేరారు. ప్రస్తుతం ఈ యాప్ 14.7 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్ ఎన్నికల తర్వాత అమెరికా, యూకేలో యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చార్ట్‌ల్లో తరచుగా ఇది అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్‌తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
ట్రంప్ అధ్యక్షుడైతే.. మరి కేసుల సంగతి!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎందుకంటే.. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ట్రంప్‌కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్ దొరికితే.. ఆయనపై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్ ట్రంప్ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!. -
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
-
30 రాష్ట్రాల్లో ట్రంప్ ప్రభంజనం..
-
డియర్ మస్క్ ఐ లవ్ యూ..!
-
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్‌తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్‌కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
ట్రంప్ కే పట్టం కట్టిన అమెరికన్లు
-
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
-
ట్రంప్ కి మోదీ విషెస్
-
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు
-
ట్రంప్ విక్టరీ.. చైనాకు బిగ్ షాక్..
-
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా
-
కమల పూర్వీకుల గ్రామంలో సందడి
కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్‌వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు. -
అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్‌లో ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ ఇంకా ఆసక్తికరంగా మారాయి.👉కాగా, అమెరికా దేశ పరిస్థితులపై 70 శాతం మంది ఓటర్లు తాము నిరాశాజనకంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.👉ఇక, ఎన్నికలపై ఫస్ట్ వేవ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అమెరికన్ ప్రజలు దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి.👉ఎన్నికలపై సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్స్ ప్రకారం అమెరికాలో 10 మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్య స్థితిని తమ మొదటి సమస్యగా పేర్కొన్నారు. అలాగే, ఐదు శాతం మంది ఓటర్లు అబార్షన్ చట్టంపై ఫోకస్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 10 మందిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతా అంశంగా ఎంచుకున్నారు.👉అలాగే, సీఎన్ఎన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దాదాపు మూడు వంతుల ఓటర్లు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఓటు వేసినట్టు చెప్పారు. ఇద్దరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయాన్ని చూపించారు. ఇదిలా ఉండగా..ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై పది మందిలో నలుగురు ఓటర్లు మెచ్చుకున్నారు. మిగిలిన ఆరుగురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 👉ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో తొమ్మిదో రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు.. కమలా హారీస్ ఒక్క చోట విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. -
US election 2024: ఫలితం తేలేదెప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి.అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్ రాష్ట్రాలు.వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తే.. అక్కడున్న ఎలక్టోరల్ ఓట్లన్నీ సదరు పార్టీ ఖాతాలో పడతాయి. ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజి ఓట్లుంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లు సాధించినా అధ్యక్షపదవి వరిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్టోరల్ ఓట్లే అధ్యక్షుడెవరనేది నిర్ణయిస్తాయి. 2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా... ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది. పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్ నెగ్గారని మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ట్రంప్ తొలుత 11 శాతం ఓట్ల ఆధిక్యం కనబర్చారు. తర్వాత రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమయ్యాక.. బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. వార్త సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తొలుత విజేతను ప్రకటిస్తూ వస్తోంది. 1848 నుంచి కచ్చితంగా విజేత ఎవరో తొలుత చెబుతోంది. 2016 ఎన్నికలు జరిగిన రోజు రాత్రే డొనాల్డ్ ట్రంప్‌ను అసోసియేటెడ్ ప్రెస్ విజేతగా ప్రకటించింది. అధికారిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబరు 11 కల్లా రాష్ట్రాలు ఫలితాలను ప్రకటించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Elections 2024: మరి ఓట్ల లెక్కింపు ఎలా?
యూఎస్ స్టేట్స్లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.బ్యాలెట్‌పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్‌గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి. -
ఓవైపు పోలింగ్.. మరోవైపు కంచెలేసి హైఅలర్ట్ పరిస్థితులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాయి.గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా. ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్‌లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్‌తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్‌జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్ గెలుస్తారా?మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్‌జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.అంచనాలకు భిన్నంగా చాట్‌జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్, హారిస్‌లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్‌జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్, హారిస్‌లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్‌జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్, రిపబ్లికన్ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్,హారిస్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా? -
హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
-
కుదేలైన స్టాక్ మార్కెట్
-
యూఎస్ ఎన్నికలు.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 24,107కు చేరింది. సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 79,022 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.28 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.8 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేపు (మంగళవారం 5వ తేదీ) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు దొంగిలిస్తున్నారు’.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్
వాషింగ్టన్ : రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయులు.. అమెరికన్ల ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారంటూ ప్రచారం చేశారు.మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (నవంబర్5) ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌లు ఎన్నికల ప్రచారంలో పోటీ పోటీగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.అయితే ట్రంప్ అందుకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారంలో భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో హీటెక్కిస్తున్నారు. అందుకు తన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)మీడియాను వినియోగిస్తున్నారు.తాజాగా మాగా మీడియా, ట్రంప్‌కు మద్దతు పలికిన పలు ఆర్థిక వేత్తలతో ట్రంప్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో గతేడాది అమెరికన్లు 8లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో విదేశీయులు 10లక్షల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబర్ మార్కెట్ విదేశీ కార్మికులు, ప్రభుత్వ బ్యూరోక్రాట్లకు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుందని మాగా మీడియా ఈవెంట్లో ట్రంప్ మద్దతు దారుడు, ఆర్ధిక వేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు. మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై అమెరికన్లో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫిన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ షీల్ మొహ్నోట్ మాట్లాడుతూ.. టెక్సాస్‌లో భారతీయులు సేవలందిస్తున్న ఓ బ్యాంక్‌పై విమర్శలు గుప్పించారు. వారందరూ వచ్చే ఏడాది భారతదేశానికి తిరిగి వెళతారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. మేము వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, వారందరినీ తిరిగి గుజరాత్‌కు పంపుతాము అంటూ విమర్శిస్తూ షేర్ చేసిన పలు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి. -
ట్రంప్, హారిస్ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్!
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్ విషయంలో ట్రంప్ బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చైనా, ఇరాన్‌లను ప్రోత్సహించారని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.చదవండి: అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం..? అందరికీ అర్థమయ్యే రీతిలో..!
వాషింగ్టన్ డిసి : ఏ ప్రజాస్వామ్య దేశమైన ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడుతారు అనే విషయం అందరికి విదితమే ! మరి ప్రజాస్వామ్య రాజకీయా వ్యవస్థల్లో ప్రజలే నిర్ణేతలు అయినప్పటికీ.. వోటింగ్ విధానం వివిధ దేశాల్లో విభిన్న రీతులలో ఉంటుంది! మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పురాతనమైన దేశం అంటే ఎన్నో దేశాలు పేర్లు వినిపిస్తాయి.. కానీ ప్రజల నానుడిలో ప్రజాస్వామ్య దేశాలలో పురాతనమైనదిగా అగ్రరాజం అమెరికా నిలువగా.. అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ దేశం నిలుస్తోంది. అందులో అగ్రరాజం అమెరికా ఎలక్షన్స్ అంటే ప్రపంచమంతా ఆశక్తిగా గమనిస్తుంది. మరి అగ్ర రాజ్యం ఎన్నికల విధానాన్ని ఎప్పుడు పరిశీలిద్దాం.ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువ ఓట్లు రావాలి.. ఇది అందరికీ తెలిసిన విషయమే..! కానీ ఎన్నికల్లో ఓట్లెక్కవ వచ్చినా ఓడిపోతారు అనే విషయం మీకు తెలుసా.. ! అవును అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లెక్కువ వచ్చినా.. గెలుస్తారనే ఏమీ లేదు. ఒట్లు తక్కువ వచ్చిన వారు కూడా ప్రెసిడెంట్ గా ఎన్నిక అవ్వచ్చు. అమెరికా చరిత్రలో అలా జరిగింది కూడా! మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! దీనికి కారణం… అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ! 2024 నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అగ్రదేశం కావడంతో అక్కడ ఎవరు ఓటు వేసేందుకు అర్హులు? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? సెనెట్ ఎలా కొలువుదీరుతుంది? ఇలాంటి అనేక అంశాలు సహా మొత్తం అమెరికా ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..!అమెరికాలో ఎన్నికలు టైమ్ అంటే టైమ్అగ్రరాజ్యంలో ప్రతి నాలుగేళ్ల ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో ఎన్నికలంటే ఆ దేశంలోని ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి దేశాధ్యక్షుడు ఎవరో తేలితే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని దేశాలు ముందే అంచనా వేసుకుంటాయి. ప్రపంచంలో ప్రధానంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ, స్విస్ సిస్టమ్, కమ్యూనిజం పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అమెరికన్లు అధ్యక్ష పాలనను ఎంచుకున్నారు. ఫలితంగా అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఎవర్నీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ ఉంటాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటనా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అంతటి శక్తిమంతుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది.అమెరికాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి..? ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి..? ఎప్పుడు ఫలితాలను ప్రకటించాలి..? ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి..? వంటివి అన్నీ ముందే ఫిక్స్ చేస్తారు. అమెరికాలో టైమ్ అంటే టైమ్.. 2024లో ఎన్నికలు జరగాలంటే.. ఆ ప్రకారం నిర్వహిస్తారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎలాంటి ఆటంకమూ ఏర్పడలేదంటే మీరే అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో ఏడాది పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్‌లో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం రోజే ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.అధ్యక్ష అభ్యర్థులను ఎలా నామినేట్ చేస్తారు?అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. రిపబ్లిక్ పార్టీ మరియు డెమొక్రటిక్ పార్టీ. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్.. ఓటింగ్ ద్వారా తమ పార్టీల తరుపున ఎవరు పోటీ చేయాలో నిర్ణయిస్తారు. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు, కాకస్‌లను పార్టీలు నిర్వహిస్తాయి. ప్రైమరీల్లో అభ్యర్థులకు రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌లో చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే అభ్యర్థులుగా నిలుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఓ నెలపాటు జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వారు ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే చాన్స్ ఉంటుంది. ఇదంతా జరిగాక ఎన్నికల ప్రచారానికి రెండు నెలల సమయం ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ రెండు నెలల్లో ఎన్నికల ప్రచారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తారు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రికార్డు సాధించాయి.అధ్యక్ష అభ్యర్థిపై అధికారిక ప్రకటనఅధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడానికీ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయా పార్టీల జాతీయ సమావేశాల్లోనే వారిని అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధుల కేటాయింపు విధానం రెండు పార్టీలకు వేర్వేరుగా ఉంటుంది. డెమొక్రాట్లు అయితే ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్లు, మద్దతుదారుల నిష్పత్తి ఆధారంగా వారికి ప్రతినిధులను కేటాయిస్తారు. రిపబ్లికన్లలో అయితే నిష్పత్తి విధానంతోపాటు ‘విజేతకే మొత్తం ప్రతినిధులు’ అన్న విధానాన్ని కూడా అనుసరిస్తారు. అంటే ప్రైమరీలు, కాకస్‌లలో ఎక్కువ ఓట్లు సాధించిన వారికే మొత్తం ప్రతినిధులను కేటాయిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ విధానం మారుతుంది.నేషనల్ కన్వెషన్లో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారిని డెలిగేట్స్.. సూపర్ డెలిగేట్స్ అంటారు. అంటే పార్టీ అధ్యక్షులు , మాజీ అధ్యక్షులు అన్నమాట. వీరు నేషనల్ కన్వెన్షన్‌లో ఫైనల్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఇందులోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడాలి? రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉండాలి? అని డిసైడ్ చేస్తారు. ఈ నేషనల్ కన్వెన్షన్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఏర్పాటవుతుంది.రిపబ్లిక్ పార్టీలో డానాల్డ్ ట్రంప్ కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే అధ్యక్ష బరిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్లపై ఆంక్షలు మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.డెమొక్రటిక్ తరుపున ముందుగా జో బైడెన్ అనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆయనే తప్పుకోవడంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.ప్రస్తుతం అధ్యక్ష బరిలో రిపబ్లిక్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ నుంచి కమలాహారీస్ పోటీ చేస్తున్నారు . ఎన్నికలు అనగానే భారతదేశంలో జరిగినట్టు ఇంటింటి ప్రచారాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బహిరంగ సభలు అమెరికాలోనూ ఉంటాయేమోనని చాలామంది అనుకుంటారు. కానీ.. భారత ఎన్నికల వ్యవస్థతో పోల్చతే అమెరికా అధ్యక్ష ఎన్నికల స్వరూపం పూర్తిగా భిన్నమైంది. కేవలం టీవీల్లోనే డిబేట్లు జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులూ లైవ్ టీవీ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది.ఎలక్టోరల్ కాలేజ్అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఇక్కడ ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. రాజధాని వాషింగ్టన్లో ముగ్గురు ఉంటారు. మొత్తం 103 మంది. వీరు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్ట్రోరల్ కాలేజీలో ఓటేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. ఇవన్నీ కలిస్తే మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు అన్నమాట. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ప్రజలు ఓటు వేసేది ఈ ఎలక్టర్లకే..!మరొక విషయం.. ఇక్కడ పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే.. విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు.ఉదాహరణకు… కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్ సీట్లుండగా... తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి.నవంబరు 5న ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు అనేవి ఖరారవుతాయి. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. అర్థం అవ్వలేదా..! సరే మీకు ఒక Example చెబుతాను..కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో ట్రంప్ కు కమలా హారిస్ కంటే ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చాయి అనుకుందాం..! కమలా హారిస్‌కు పాపులర్ ఓట్లు తక్కువ వచ్చినా.. 28 ఎలక్టోరల్ సీట్లు వస్తే మాత్రం.. ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందా.. దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే… 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావటం అధ్యక్ష పీఠానికి అత్యవసరం!ఇక్కడ మీకు ఓ డౌట్ రావచ్చు..! 28 ఎలక్టోరల్ సీట్లు గెలిచిన డెమోక్రాటిక్ ప్రతినిధులు కమలా హారిస్ కు ఓటు వేస్తారు.. కానీ 26 ఎలక్టోరల్ సీట్లు గెలిచిన రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు కమలా హారిస్ ఎందుకు ఓటు వేయాలి అని.అంటే కాలిఫోర్నియాలోని 54 ఎలక్టర్లంతా.. సగం కంటే ఎక్కవగా గెలిచిన డెమోక్రాటిక్ పార్టీ కమలా హారిస్‌కే కచ్చితంగా ఓటేయాలన్న రాజ్యాంగ నిబంధనేదీ లేదు. కానీ ఎలక్టోరల్ ప్రతినిధులుగా ఉన్నవారు నమ్మక ద్రోహానికి పాల్పడటం చాలా అరుదు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరైనా ఒకవేళ విశ్వాసాన్ని వమ్ముచేస్తే వారిపై ఆయా రాష్ట్రాలు కఠిన శిక్ష విధించాలని అమెరికా సుప్రీంకోర్టు 2020లో ఆదేశించింది.అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయొచ్చు. అమెరికాలో దూర ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఆన్ లైన్ లోనూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నట్లు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2024 నవంబరు 5న ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు.అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పే స్వింగ్ స్టేట్స్ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. పార్టీలు ఈ సింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తారు.2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది భావన! అందుకే వాటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు.ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైనా ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకుగాను… 270 మద్దతు లభించినవారు అధ్యక్షులవుతారు. ఎక్కువ ఓట్లు వచ్చినా ఓడిపోతారుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల ఓట్లు ఎక్కువగా పడ్డా అంటే పాపులర్ ఓటు సాధించినప్పటికి.. ఎలక్టోరల్ కాలేజీలో దెబ్బతిని కొంతమంది అభ్యర్థులు అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. 1824లో జాన్ క్విన్సీ ఆడమ్స్ పాపులర్ ఓటు గెల్చుకున్నా .. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. 2000 సంవత్సరంలో ఆల్ గోర్‌కు, 2016లో హిల్లరీ క్లింటన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంది.అల్‌గోర్‌కు జార్జ్ బుష్ కంటే 5లక్షలకు పైగా ఓట్లు వచ్చినా ఓడిపోయారు. 2016లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌కు 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ… ఎలక్టోరల్ కాలేజీకి అవసరమైనన్ని రాలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నిక హోరాహోరాగా సాగుతున్న నేపథ్యంలో… ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ 269 చొప్పున ఓట్లు వచ్చి.. టై అయితే పరిస్థితి ఏంటీ.? 1824లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నలుగురు అభ్యర్థులకూ ఎలక్టోరల్ కాలేజీలో సమానంగా ఓట్లు వచ్చాయి.అమెరికా రాజ్యాంగం ప్రకారం..ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం కుదరకపోతే.. అధ్యక్షుడిని.. కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభ అయినా ప్రతినిధుల సభ ఎన్నుకుటుంది. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ అయినా సెనెట్ ఎన్నుకుంటుంది.అమెరికా అధ్యక్షుడిని ప్రజల పాపులర్ ఓటు ద్వారా ఎంపిక చేయాలా.. కాంగ్రెస్ ద్వారానా అనే చర్చలో భాగంగా.. ఈ ఎలక్టోరల్ కాలేజీ పద్ధతి ఆవిర్భవించింది. అన్ని రాష్ట్రాల, అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం ఉండాలన్న అమెరికా రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీన్ని మార్చాలని, రద్దుచేయాలని ఇప్పటిదాకా దాదాపు 700సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు.అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారు?2024 నవంబర్5న అమెరికా ప్రెసిడెంట్ ఎవరనేది దాదాపు ఖరార్ అవుతుంది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే సదరు వ్యక్తులు బాధ్యతలు స్వీకరించలేరు. కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండున్నర నెలలు గడువు ఇస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత 2025 జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ ..అమెరికా కాంగ్రెస్ భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి ఎన్నికైన ప్రెసిడెంట్ వైట్‌హౌస్‌కి వెళతారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం ప్రెసిడెంట్ కి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.ఇంకా ఎవరెవరు ఎన్నికవుతారు?ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అలాగే కాన్సిలర్ల ఎన్నిక, గవర్నర్ల పోస్టుకు ఎన్నిక అన్నీ జరుగుతాయి. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ), సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి. ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి. ప్రతినిధుల సభకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్ష ఎన్నికలతో కలిపి ఒకసారి, రెండేళ్లు పూర్తయ్యాక మరోసారి నిర్వహిస్తారు. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనేట్ లో 100 స్థానాలున్నాయి. సెనేట్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. సెనేట్‌లో దాదాపు 35 స్థానాలకు 2024 నవంబర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు. మొత్తంగా ఎవరైతే 270 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తారో, వారు అధ్యక్షులుగా గెలుపొందుతారు. -సింహబలుడు హనుమంతు -
తైవాన్ విషయంలో చైనాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇరుపార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా.. తైవాన్ జోలికి వెళ్లితే ఆ దేశంపై అదనపు సుంకాలను విధిస్తానన్నారు.‘‘నేను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే చైనా.. తైవాన్ జోలికి వెళితే. నేను మీకు 150 శాతం నుంచి 200 శాతం వరకు పన్ను విధిస్తాను’’ అని అన్నారు. తైవాన్‌పై చైనా చేసే.. ఆక్రమణకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ఉపయోగిస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇప్పటివరకు అయితే.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తనను గౌరవిస్తున్నారని, అటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.Republican presidential candidate Donald Trump said he would impose additional tariffs on #China if China were to "go into #Taiwan," the Wall Street Journal reported. https://t.co/muSDebjnxH— William Yang (@WilliamYang120) October 19, 2024ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాల విషయంపై స్పందిస్తూ.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని అన్నారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని అన్నారు.చదవండి: తైవాన్ను దిగ్బంధించిన డ్రాగన్ -
నా పాలన బైడెన్‌కు కొనసాగింపుగా ఉండదు: కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.Kamala Harris on what she would do differently from Biden’s presidency: “Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024 ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్ -
‘కమల మార్క్ పాలన వేరు’.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు. .. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు. ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు -
ట్రంప్ ర్యాలీకి సమీపంలో కలకలం.. గన్లతో వ్యక్తి సంచారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్లతో సంచరించటం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్‌గన్ , లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది.A man was arrested near Trump's rally in Coachella, California, on Saturday and charged with illegal possession of a loaded firearm and high-capacity magazine, according to the Riverside County Sheriff. pic.twitter.com/xFPVdUyMeo— ANI (@ANI) October 14, 2024 ఈ విషయంపై తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. తాము వెంటనే అప్రమత్తమయ్యాయని, ట్రంప్‌నకు, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. గన్లను పట్టుకొని సంచరించిన నిందితుడిని లాస్‌వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. ట్రంప్‌పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.‘‘ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులను రక్షించే కల్పించే ఎఫ్‌బీఐ, యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లాస్ వెగాస్‌కు చెందిన 49 ఏళ్ల వెమ్ మిల్లర్ బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణను ఎదుర్కొంటాడని షెరీఫ్ బృందం తెలిపింది. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ చెవికి తగులుతూ పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా సెప్టెంబరులో ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆయన్ను హత్య చేయడానికి 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ వ్యక్తి రైఫిల్‌తో సంచరించినట్లు గుర్తించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్ -
కమలా హారిస్ హెల్త్‌పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్‌కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్‌తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు. -
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. పెరుగుతున్న ఉత్కంఠ
US presidential elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఉత్కంఠ నానాటికీ పెరిగిపోతోంది. ఎన్నికలకు మరో నెల రోజుల సమయమే మిగిలి ఉంది. నవంబర్ 5న జరిగే ఎన్నికలపై ప్రపంచ దేశాలన్నీ అమితాసక్తి చూపుతున్నాయి. కాబోయే అగ్రరాజ్యాధిపతి ఎవరు? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. రకరకాల సర్వేలు, అంచనాలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వస్తారా? లేక డొనాల్డ్ ట్రంప్ మరోసారి రాజ్యమేలుతారా? అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హారిస్ ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలై నెలాఖరులో కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. పోటీ నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో హారిస్‌కు మార్గం సుగమమైంది. జూలై నెలాఖరు నుంచి ఇప్పటిదాకా వివిధ ముఖ్యమైన సర్వేల్లో నేషనల్ పోలింగ్ సగటును పరిగణనలోకి తీసుకుంటే ట్రంప్ కంటే హారిస్‌కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కమలా హారిస్‌కు 49 శాతం, ట్రంప్‌నకు 46 శాతం ప్రజాదరణ కనిపిస్తోంది. ఇరువురు నేతల మధ్య వ్యత్యాసం స్పల్పంగానే ఉంది. మరో నెల రోజుల్లో ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ 👉 ట్రంప్, హారిస్ మధ్య సెప్టెంబర్ 10న కీలకమైన డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించారు. ఆ రోజు ఆమె ప్రజాదరణ 2.5 పర్సంటేజీ పాయింట్లు పెరగా, మరో వారం తర్వాత 3.3 పాయింట్లు పెరిగింది. ట్రంప్ పట్ల ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. 👉 ఎన్నికల్లో ఎవరెక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారిదే విజయం. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలోని జనాభాను బట్టి ఆ రాష్ట్రానికి ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. 👉మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538. విజయానికి కావాల్సింది 270. 👉 దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేవి మాత్రం కొన్నే ఉన్నాయి. వీటినే స్వింగ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడ ఎవరు పాగా వేస్తే వారిదే అధికారం. 👉 మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. అవి నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనా, విస్కాన్సిన్, మిషిగాన్. 👉 ఇందులో నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనాలో ట్రంప్ వైపు మొగ్గు కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో కమలా హారిస్‌కు జనం జేజేలు పలుకున్నారు. 👉 ఇద్దరి మధ్య ఈ ఏడు రాష్ట్రాల్లో హోరాహోరీ పోటీ తథ్యమని చెప్పక తప్పదు.చదవండి: కమలా హారిస్‌కు అండాదండా ఆమే! 👉స్వింగ్ రాష్ట్రాల్లో ఇరువురు నేతల నడుమ ప్రజాదరణలో వ్యత్యాసం 2 శాతం లోపే ఉండడంగమనార్హం. ఈ స్వల్ప వ్యత్యాసం నెల రోజుల్లో తారుమారు కావడం పెద్ద విశేషం కాదు. 👉అందుకే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఎన్నికల పరిశీలకులు కచి్చతంగా అంచనా వేయలేకపోతున్నారు. 👉 మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ, 2016లో అక్కడి ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. 👉2020లో మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఆదరణ లభించింది. ఈసారి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్ పట్ల ఆదరణ కనిపిస్తోంది. -
కమలా హారిస్‌కు అండాదండా ఆమే!
Laurene Powell Jobs: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకున్నాక ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న కమలా హారిస్ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగుతోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హారిస్‌పై నమ్మకం నిలుపుకున్న ఏకైక వ్యక్తి లారెన్ పావెల్ జాబ్స్. వాళ్లది 20 ఏళ్ల స్నేహం. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన కాలం నుంచి ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగడం దాకా హారిస్‌కు చోదకశక్తిగా ఉన్నది లారెన్ పావెల్ అని చాలా మందికి తెలీదు. హారిస్‌కు ఆర్థిక, హార్దిక బలమూ ఆమే. ఆడదానికి ఆడదే శత్రువనే మూస ప్రచారాలను వెనక్కు నెట్టి ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల మరెంతో మంది మహిళలకు బాసటగా నిలుస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళిద్దరి స్నేహం.ఎవరీ లారెన్ పావెల్? 60 ఏళ్ల లారెన్ పావెల్ జాబ్స్... ఎమర్సన్ కలెక్టివ్ అనే దాతృత్వ, పెట్టుబడి సంస్థ వ్యవస్థాపకురాలు. ది అట్లాంటిక్ మేగజైన్లో పెద్ద వాటాదారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి ఈమె. పావెల్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఇక్కడే 1989లో స్టీవ్ జాబ్స్‌ను కలిశారు. 1991లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు రీడ్, ఎరిన్, ఈవ్. స్టీవ్‌జాబ్స్ మరణానంతరం ఆపిల్, డిస్నీ సంస్థల్లో వాటాలను ఆమె వారసత్వంగా పొందారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, పావెల్ ప్రస్తుత నికర విలువ 11.5 బిలియన్ డాలర్లు. ఆమె సిలికాన్ వ్యాలీలో అత్యంత సంపన్న మహిళగా పేరొందారు.హారిస్, లారెన్ స్నేహం.. ప్రజాజీవితం గడుపుతూ రాజకీయాలు, కళలు, సంస్కృతి పట్ల ఇద్దరూ ఒకే అభిరుచి కల్గిఉండటం ఇద్దరినీ స్నేహితులుగా మార్చింది. హారిస్‌కు నిధులు, సలహాలు అందించడమే కాకుండా ప్రజల్లో ఆదరణ పెరగడానికి లారెన్ దోహదపడ్డారు. లారెన్ కొన్నేళ్లుగా డెమొక్రటిక్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారు. 2020 నుంచి డెమొక్రటిక్ నామినీలకు, పార్టీకి దాదాపు రూ.29 కోట్ల విరాళం ఇచి్చనట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన సమయం నుంచే లారెన్.. హారిస్ వెన్నంటి ఉన్నారు. ఆ సమయంలో పావెల్ 500 డాలర్లు విరాళం ఇచ్చారు.తర్వాతి ఏడాది బే ఏరియాకు చెందిన ఇతర మహిళా నాయకులతో కలిసి వాషింగ్టన్లో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ ఉమెన్స్ లైవ్స్’లో ఇద్దరూ పాల్గొన్నారు. హారిస్ కోసం లారెన్ అనేక నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. గత ఏడాది కమల ప్రచారానికి ఆమె దాదాపు రూ.8.37 కోట్ల విరాళాలు ఇచ్చారు. 2017లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి లారెన్‌ను ప్రశ్నించగా.. ‘‘నా ఓటు హారిస్‌కే’ అంటూ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న తన స్నేహితురాలు హారిస్‌ను చూపించారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న చీలికలుహారిస్ను తెరపైకి తెచ్చి.. వాస్తవానికి జూన్‌లో బిగ్ డిబేట్ తర్వాత ప్రభ కోల్పోయిన బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించడానికి తెరవెనుక నుంచి లారెన్ పనిచేశారని అప్పట్లో వదంతులు వినిపించాయి. డిబేట్లో బైడెన్ పేలవ ప్రదర్శన చూశాక ట్రంప్‌ను ఓడించలేమేమో అని డెమొక్రటిక్ పార్టీ ప్రధాన దాతల వద్ద లారెన్ అభిప్రాయం వ్యక్తించేశారని వార్తలొచ్చాయి. పోటీలో కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టడంతో హారిస్ సలహాల కోసం లారెన్‌ను సంప్రదించినట్లు సమాచారం. హారిస్‌కు మద్దతుగా ఇతర మహిళా టెక్ నాయకుల మద్దతు కూడగట్టే బాధ్యతను లారెన్ తన భూజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ గెలిస్తే డెమొక్రాట్ల పాలనలో లారెన్ ఏదైనా పాలనా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారిక పదవిలో లేకపోయినా ‘ఇన్సైడర్’గా ఉంటారని తెలుస్తోంది. -
US ELECTION: సర్వేల్లో హారిస్ ముందంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ కాస్త ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పన అనే కీలక అంశాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టేసినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్‌సర్వే సోమవారం(సెప్టెంబర్23)తో ముగిసింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 40.48శాతం అనుకూలత రాగా కమలకు 46.61శాతం అనుకూల ఓట్లు వచ్చాయి.సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే కమల ఒక శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. దేశవ్యాప్త ట్రెండ్‌ను అంచనా వేయడంలో కీలకంగా భావించే పోల్సర్వేల్లో రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ఒకటి కావడం గమనార్హం. నవంబర్5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్‌కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్‌కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్‌కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్ఎస్లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం -
హారిస్‌తో మళ్లీ డిబేట్.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో మళ్లీ డిబేట్లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్ అవసరమని అడుగుతారని కమలాహారిస్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్టు చేశారు. ‘కామ్రేడ్ హారిస్‌తో డిబేట్లో నాదే పైచేయి అని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆమె డిబేట్లో ఓడిపోయారు. ఓడిపోయినందునే ఆమె మరో డిబేట్ కావాలని అడుగుతున్నారు. ఆమెతో రెండో డిబేట్ అనేది ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, డిబేట్లో తనదే పైచేయి అని ట్రంప్ ఉటంకించిన సర్వేలన్నీ పెద్దగా పేరులేని, ఎవరికీ తెలియని సంస్థలు వెల్లడించినవి కావడం గమనార్హం. సీఎన్‌ఎన్‌లాంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మాత్రం హారిస్, ట్రంప్ డిబేట్ వీక్షించిన 63 శాతం మంది ప్రజలు హారిసే విజయం సాధించారని భావిస్తున్నట్లు వెల్లడించడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అభ్యర్థులు ట్రంప్, హారిస్‌ల మధ్య మంగళవారం ఫిలడెల్ఫియాలో బహిరంగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఇదీ చదవండి.. మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం -
US ELECTION: టిమ్వాల్జ్కు తప్పిన ప్రమాదం
మిల్వాకీ: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్వాల్జ్కు ప్రమాదం తప్పింది. సోమవారం(సెప్టెంబర్2) మిల్వాకీలో లేబర్ డే కార్యక్రమానికి వెళ్తుండగా టిమ్వాల్జ్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాల్జ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనశ్రేణిలో ఉన్న పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు.తమ వాహనాలను కాన్వాయ్‌లో వెనుక వచ్చే వాహనాలు బలంగా ఢీకొన్నాయని మీడియా సిబ్బంది తెలిపారు. ప్రమాదం అనంతరం టిమ్వాల్జ్తో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిమ్వాల్జ్ ప్రస్తుతం మిన్నెసోటా గవర్నర్‌గా ఉన్నారు. -
ట్రంప్‌కు రష్యా షాక్.. హారిస్ వైపే మొగ్గు!
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా తాజా వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి విషయంలో పుతిన్‌ను సమర్థించే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌వైపు కాకుండా డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్వైపు రష్యా మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయమై తాజాగా ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పోరులో తలపడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్ కంటే కమలాహారిసే అంచనా వేయదగ్గ వ్యక్తని చెప్పారు. అయితే తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే రష్యా, ఉక్రెయిన్ సమస్య పరిష్కరిస్తామని ట్రంప్ ఇస్తున్న హామీని పెస్కోవ్ కొట్టిపారేశారు. రష్యా,ఉక్రెయిన్ సమస్య టక్కున పరిష్కరించేందుకు ట్రంప్ దగ్గర మంత్రదండమేమీ లేదన్నారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. ట్రంప్ కంటే బైడెనే బెటరని ఓసారి ట్రంప్‌ను కోర్టులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఓటమి భయంతో ట్రంప్‌కు నిద్ర పట్టడం లేదు: ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ రంగంలోకి దిగుతుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో కమలాకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ జాతీయ సదస్సుకు రెండోరోజైన మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యూఎస్ ఎన్నికల్లో గట్టిపోటీ ఉండబోతుందని, అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కమలా చేతిలో ఓడిపోతాననే భయం ట్రంప్‌లో కనిపిస్తోందని, దీంతో అతనికి నిద్ర కూడ పట్టడం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు.అమెరికా అధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే ప్రజల సమస్యలపై దృష్టిపెడతారని తెలిపారు. ఆమెను అధ్యక్షరాలిగా పిలవడం గర్వంగా ఉందని కొనియాడారు. అధ్యక్షురాలిగా, ఆమె ఎల్లప్పుడూ మనకువెన్నుదన్నుగా ఉంటుంది. హారకు ఒక పోరాట యోధురాలు. కష్టపడి పనిచేసే కుటుంబాల కోసం ఆమె పోరాడుతుంది, మంచి జీతంతో కూడిన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తుంది’ అని తెలిపారుఒబామా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కూడా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేయడానికి హారిస్ సిద్దంగా ఉన్నారని, దేశం కోసం తన సొంత ఆశయాలను పక్కన పెట్టిన వ్యక్తిగా అభివర్ణించాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించిన అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ చరిత్రలో గుర్తుండిపోతాడని అన్నారు. అతన్ని తన స్నేహితుడు, అధ్యక్షుడిగా అని పిలవడం గర్వంగా ఉందన్నారు,అంతకముందు జో బైడెన్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ అనేక కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని, అతనిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైందని విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను ఒక లూజర్(ఓడిపోయిన వ్యక్తిగా) అభివర్ణించాడు."ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ఓడిపోయిన వారుగా ట్రంప్ పేర్కొన్నాడు. తనకు తను ఏమని అనుకుంటున్నాడు? అదే ట్రంప్ వ్లదిమిర్ పుతిన్‌కు వంగి వంగి దండాలు పెడతాడు. ఆ పని నేను ఎప్పుడూ చేయలేదు.. నేనే కాదు కమలా హారిస్ కూడా ఎప్పటికీ చేయదు’ అని బిడెన్ అన్నారు. -
ట్రంప్ టీమ్ ఈ మెయిళ్లు హ్యాక్.. ఇరాన్ పనే?
వాషింగ్టన్: తమ ఈమెయిళ్లు హ్యాకయ్యాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ వెల్లడించింది. ఇది ఇరాన్ పనేనని ఆరోపించింది. కీలక అంతర్గత సమాచారాన్ని దొంగిలించి బహిర్గతం చేశారని పేర్కొంది. అయితే ఇందుకు కచ్చితమైన ఆధారాలను మాత్రం ట్రంప్ బృందం వెల్లడించలేదు. అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని మైక్రోసాఫ్ట్ తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే ట్రంప్ ప్రచార బృందం మెయిళ్లు హ్యాకవడం గమనార్హం. ట్రంప్ టీమ్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ టీమ్ ఆరోపణలను ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపింది. కాగా, అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఇరాన్ ఆన్లైన్ కార్యకలాపాలు పుంజుకున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో తెలిపింది. -
కమలాహారిస్‌తో డిబేట్‌కు రెడీ: ట్రంప్
ఫ్లోరిడా: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఏబీసీ టీవీచానల్‌లో చర్చకు రెడీ అని తెలిపారు. ఫ్లోరిడాలోని తన పామ్‌బీచ్ ఎస్టేట్‌లో ట్రంప్ గురువారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ముందు చర్చలు జరగడం చాలా ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. డెమొక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టిమ్ వాల్జ్ రాడికల్ లెఫ్ట్ భావాలున్న వ్యక్తని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ డిబేట్ ప్రతిపాదనపై కమలాహారిస్ క్యాంపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాను ఏబీసీ చానాల్లో చర్చకు రానని సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది రోజులకే మాట మార్చి అందులోనే చర్చకు వస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
కమలా హారిస్ జోరు.. వారంలోనే భారీగా విరాళాలు
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ స్థానంలో పోటీలోకి వచ్చిన ఆమె కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు.ఓ వైపు డెమొక్రాట్లలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో పాటు ట్రంప్ తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. ఎన్నికల రేసులో కమల దూసుకెళ్తున్నప్పటికీ అధ్యక్ష కుర్చీ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని ఆమె ప్రచార టీమ్ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లోని అతి తక్కువ ఓటర్లే విజేతను నిర్ణయించే విషయంలో కీలకంగా మారనున్నారని వారు చెబుతున్నారు. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..?
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..? సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీమ్‌కు చెప్పిందా..? ట్రంప్ టీమ్‌కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్ టీమ్‌కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది. ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్‌కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. -
‘వాన్స్’ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి: వివేక్‌రామస్వామి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికపై భారత సంతతి బిలియనీర్ వివేక్‌రామస్వామి స్పందించారు. ‘నా స్నేహితుడు వాన్స్‌ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్మేట్. లాస్కూల్‌లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. వాన్స్ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్‌రామస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ పోటీ పడుతున్నారు. ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను తాజాగా ఎంపిక చేసుకున్నారు. -
‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్లోని మివాకీ పట్టణానికి చేరుకున్నారు. మివాకీలో సోమవారం(జులై 15) నుంచి నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశాల్లోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు. కాల్పుల నేపథ్యంలో మివాకీ సమావేశాల వేదిక వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పెన్సిల్వేనియాలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలి రక్తం చిందింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను అక్కడినుంచి తరలించారు. దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
కాల్పులపై తొలిసారి స్పందించిన ట్రంప్
న్యూయార్క్: ఎన్నికల ర్యాలీలో తన మీద జరిగిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ‘ఊహించనిది జరగకుండా ఆ దేవుడు మాత్రమే కాపాడాడు. అమెరికన్లందరూ ఒక్కటి కావాలి. ధృడనిశ్చయంతో నిలబడాలి. చెడు విజయం సాధించకుండా అడ్డుపడాలి’అని పిలునిచ్చారు. ఈ మేరకు ఆదివారం(జులై 14) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. కాగా, శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కాల్పలు జరిపిన దుండగుడిని మట్టుబెట్టి ట్రంప్‌ను అక్కడి నుంచి తరలించారు. ఘటన తర్వాత ట్రంప్ తన ప్రైవేట్ విమానం ట్రంప్ ఫోర్స్‌లో నుంచి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,రిపబ్లికన్ల తరపున ట్రంప్ హోరాహోరీ తలపడుతున్నారు. -
ట్రంప్‌పై కాల్పులు.. వివేక్‌రామస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి ఎక్స్(ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌పై కాల్పులు జరగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్‌ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగాలేదని వివేక్‌రామస్వామి విమర్శించారు.‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్‌ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ ఎడమచెవికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు. -
Us Elections: ట్రంప్‌కు మస్క్ భారీ విరాళం!
న్యూయార్క్: పాపులర్ బిలియనీర్, టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విరాళమిచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేస్తున్న అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఎ ప్యాక్)కు మస్క్ డొనేట్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ ఒక కథనం ప్రచురించింది.అయితే సరిగ్గా ఎంత మొత్తం మస్క్ విరాళంగా ఇచ్చారనేది తెలియరాలేదు. ఎ ప్యాక్ తమ గ్రూపునకు విరాళమిచ్చిన వారి జాబితాను జులై 15న అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఎన్నికల్లో తాను బైడెన్, ట్రంప్‌లలో ఎవరి తరపున ఖర్చు పెట్టబోనని మస్క్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మస్క్ ట్రంప్‌నకు విరాళమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోసం ధనవంతుల నుంచి ప్రచార నిధుల సేకరణలో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మస్క్ కూడా ట్రంప్‌నకు విరాళమివ్వడం గమనార్హం.ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌లలో మస్క్ ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. -
USA: ఎన్నికల్లో పోటీ.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కవవుతోంది. సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌పై అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించినప్పటి నుంచి బైడెన్ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం(జులై 12) డెట్రాయిట్లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ‘రేసులో నేను పరిగెడుతున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు, అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి. నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తేనే ఇవి సాధ్యమవుతాయి’అని బైడెన్ తెలిపారు. ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
మళ్లీ తడబడ్డ బైడెన్.. ట్రంప్‌కు వైస్ ప్రెసిడెంట్ పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ వెనుకబడ్డ విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలో బైడెన్ తాజాగా మరోసారి తన వృద్ధాప్యాన్ని చాటుకున్నారు. వాషింగ్టన్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ పెద్ద పొరపాటే మాట్లాడారు. ఈసారి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్, ప్రత్యర్థి ట్రంప్ పేరును కలిపేశారు.వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని అన్నారు ‘వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు అధ్యక్ష పదవి చేపట్టే అన్ని అర్హతలున్నాయి. అందుకే నేను ఆమెను వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశాను’అని కమలాహ్యారిస్ గురించి చెబుతూ ఆమె పేరుకు బదులు ట్రంప్ పేరు పలికారు.దీంతో బైడెన్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. రిపబ్లికన్లు ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
USA: డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జూన్27న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు. తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు. -
బైడెన్, ట్రంప్ మధ్యేనా పోరు?
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బైడెన్, ట్రంప్ మధ్యే పోరు ఉండబోతున్నట్టు కనబడుతోంది. ఆ ఇద్దరిలోనూ ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సర్వేలు ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. నవంబర్ నాటికి ఇది తలకిందులవుతుందని బైడెన్ వర్గం నమ్ముతోంది. ఎవరు గెలిచినా, అమెరికాకు ప్రధాన పోటీదారుగా చైనాను నిలపడంలో, అమెరికాకు ప్రయోజనం చేకూర్చని వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇరువురిదీ ఒకే బాట. కాకపోతే వాతావరణ విధానం, వలసలు, సుంకాలు, ప్రజాస్వామ్యం వంటి అంశాల్లో ముఖ్యమైన తేడాలు ఉంటాయి. వాణిజ్యం, వలసల విషయంలో భారత్ నాటకీయ మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది; అదే సమయంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది. భారతదేశం ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో, అమెరికాలో కూడా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికైతే అధ్యక్ష అభ్యర్థులుగా ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ అయిన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అయిన డోనాల్డ్ ట్రంప్ ఉండేట్టే కనబడుతోంది. బైడెన్ వృద్ధాప్యం సహా, ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా విధానంపై ఆయన తీరు మీద ఓటర్లు అసంతృప్తిగా ఉండటంతో, ప్రజాభిప్రాయ సర్వేలు ప్రస్తుతానికి ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ ఉన్నట్టు చూపుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, తక్కువ నిరుద్యోగం, రుణ విముక్తి, చట్టపరంగా ట్రంప్ ఎదుర్కొంటున్న కష్టాలు వంటివి... నవంబర్ నాటికి ప్రజలు ఎన్నికలకు వెళ్లే సమయా నికి ఆటుపోట్లను తిప్పికొట్టగలవని బైడెన్ వర్గం నమ్ముతోంది. ఈ ప్రారంభ దశలోనే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం నిష్ఫలమే అవుతుంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రా లలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఫలితం ఇప్పటికే తేలినట్టయింది. ఇక మొత్తం ఫలితం దాదాపు ఆరు కీలకమైన ‘స్వింగ్ స్టేట్స్’(ఊగే రాష్ట్రాలు) ద్వారా, పది లక్షల కంటే తక్కువ ఓట్ల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. పరిశీలకులు విధానపరమైన చిక్కు లను అంచనా వేయడం ప్రారంభించడం వివేకం. అయితే విధాన పరమైన నిర్ణయాలు అలాగే కొనసాగవచ్చు, కాకపోతే వాణిజ్యం, వలస విధానంలో కొన్ని నాటకీయ మార్పులు ఉండవచ్చు. అనేక అంశాల విషయంలో– ట్రంప్, బైడెన్ హయాంలు రెండింటిలోనూ గత ఎనిమిది సంవత్సరాలుగా గణనీయమైన కొనసాగింపు ఉంది. ఒకటి: అమెరికా అగ్రగామి వ్యూహాత్మక పోటీదారుగా చైనా ఉంటుందని చాలావరకు అర్థమైపోయింది. దీనివల్ల ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దేశీయ, ఆర్థిక, భద్రతా విధానాలలో మార్పు లకు దారితీసింది. రెండు: నయా ఉదారవాదం లేదా ప్రపంచీకరణ స్ఫూర్తితో ఇకపై పరస్పర సంబంధం లేని మార్కెట్ ప్రాప్యతను అందించకూడదని అమెరికా విశ్వసిస్తోంది. అమెరికాకు అనుకూలంగా క్రీడా మైదానాన్ని మార్చని వాణిజ్య ఒప్పందాలు ఇకపై కుదిరే ప్రశ్నే లేదు. మూడు: అమెరికా పాలకవర్గం ప్రత్యక్ష, బహిరంగ సైనిక యాత్రలకు వ్యతిరేకంగా ఉంది. దీనిని విమర్శకులు ‘ఎప్పటికీ సాగే యుద్ధాలు’గా అభివర్ణిస్తున్నారు. నాలుగు: సమస్యలు ఉన్నప్పటికీ, చాలావరకు ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలకు అమెరికా మద్దతుగా స్థిరంగా ఉంది. కీలకమైన తేడాలు అయితే పొత్తులు, వాతావరణ విధానం, వలసలు(ఇమ్మిగ్రేషన్), టారిఫ్‌లు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై బైడెన్, ట్రంప్ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ట్రంప్, అమెరికా మిత్రదేశాలను ఫ్రీలోడర్లుగా (ఇతరుల ఔదార్యాన్ని అవకాశంగా తీసుకునేవారు) విమర్శిస్తున్నప్పటికీ, బైడెన్ మాత్రం యూరప్, ఇండో–పసిఫిక్‌లో మిత్రులే ఫస్ట్ అనే విధానాన్ని అవలంబించారు. ట్రంప్ విజయం ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో), ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు విషయంలో ప్రత్యేక చిక్కులను కొనితెస్తుంది. డెమొక్రాటిక్ పునాదికి ముఖ్యమైన వాతావరణం, పర్యావరణ విధానాలపై బైడెన్ దేశీయ పరిశ్రమకు, క్రియాశీల వాతావరణ దౌత్యం కోసం భారీ రాయితీలకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ ఆ సబ్సిడీలను రద్దు చేయక పోవచ్చు (ఇది రిపబ్లికన్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరు స్తుంది) కానీ ఆయన కచ్చితంగా అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటారు. వ్యత్యాసం ఉన్న మరొక అంశం వలసలు. వీటిని రిపబ్లికన్లు అడ్డుకోవాలని కోరుకుంటారు. కానీ డెమొక్రాట్లు సులభతరం చేయా లని ఆశిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దులో అక్రమ వలసలను అరికట్ట డానికి రిపబ్లికన్ పాలనాయంత్రాంగం ఉద్దేశపూర్వకంగా క్రూరమైన విధానాన్ని అవలంబిస్తుంది. వాణిజ్య అసమతుల్యతలను ఎదుర్కోవ డానికీ సుంకాలు, ఇతర చర్యలను అమలు చేయడానికి ట్రంప్ సుము ఖత వ్యక్తం చేశారు. చివరగా, బైడెన్ తన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వాలను చూపుతుండగా, ట్రంప్ పాలనాయంత్రాంగం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి తక్కువ శ్రద్ధ చూపుతుంది. ఆసియాతో సహా కొన్ని అమెరికన్ మిత్రదేశాలు, భాగస్వాములు ఇప్పటికే రెండవసారి ట్రంప్ అధ్యక్ష పదవికి సంబంధించిన చిక్కు లను అంచనా వేస్తున్నారు. తన ఎజెండా విషయంలో ట్రంప్, ముఖ్యంగా సైనిక సహాయం, వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్‌పై ఎక్కువ నిబ ద్ధతతో ఉంటారు; వాటి అమలులో గొప్ప వృత్తిపరతత్వం కూడా కన బరుస్తారు. 2016లో, ట్రంప్ ఏమాత్రం సన్నద్ధత లేకుండా ఎన్ని కలలో విజయం సాధించడం పట్ల తనకు తానే ఆశ్చర్యపోయినట్లు కాకుండా, మళ్లీ అధికారంలోకి తిరిగి వచ్చినప్పుడు తన విజన్‌ని అమలు చేయడంలో మరింత నైపుణ్యం కలిగిన కార్వ నిర్వహణ ఉండ నుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా శ్రేణులు ఆయన వెనుకే ఉంటారు. మాజీ వాణిజ్య సంధానకర్త రాబర్ట్ లైట్ థైజర్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ’బ్రియన్, దేశీయ విధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్... వాణిజ్యం, విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్రలు పోషిస్తున్న వారిలో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కేటా యించాల్సిన చాలా ప్రభుత్వ కీలక పదవులకు సన్నాహాలు జరుగు తున్నాయి. సొంత పార్టీలోని ట్రంప్ విమర్శకులు సైతం పాలనా యంత్రాంగంలో చేరే అవకాశం గురించి ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఇండియాపై ప్రభావం ఉంటుందా? ఎన్నికల ఫలితాల వల్ల భారతదేశానికి ఎలాంటి చిక్కులు ఎదుర వుతాయి? రక్షణ లేదా సైనిక సహాయం కోసం వాషింVýæ్టన్పై ఆధారపడే అమెరికా మిత్రదేశాలు లేదా అమెరికన్ మార్కెట్ ప్రాప్యతపై ఆధార పడే ప్రధాన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే, ఎన్నికల ఫలితం న్యూఢిల్లీపై కాస్త తక్కువగానే ఉంటుంది. అనేక అంశాలలో, భారత దేశం తనను తాను భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్న భాగ స్వామిగా చూపించుకుంటూ, 2017–2021ల మధ్యలానే ట్రంప్ లావాదేవీలకు తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ, న్యూఢిల్లీ కనీసం రెండు అంశాలలో– వాణిజ్యం, వలసల విషయంలో నాటకీయ మార్పులను ఎదుర్కో వాల్సి ఉంటుంది. అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు దృష్ట్యా, సుంకాలను అంచనా వేయవలసి ఉంటుంది. పైగా కొన్ని కఠినమైన చర్చలు అనివార్యం అవుతాయి. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూనే, చైనా నుండి రిస్క్ లేకుండా చూసుకోవడం గురించిన భాగస్వామ్య అవగాహన, ఇప్పటికే ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, జపాన్, బ్రిటన్, యూరప్‌ల మధ్య చర్చలను రేకెత్తిస్తోంది. భారత్ విషయంలో వలస సమస్య మరింత నాటకీయంగా ఉంటుంది. చట్టపరమైన వలసదారులు– శాశ్వత నివాసితులు, అధిక నైపుణ్యం కలిగిన నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపార వేత్తల ప్రాసెసింగ్‌లో మందగమనం కొనసాగవచ్చు. ఎక్కువ తనిఖీ లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కఠినమైన నిర్బంధాలను ఎదుర్కొనే పత్రాలు లేని వలసదారుల సంఖ్య పెరగవచ్చు. ట్రంప్ విధానాల రూపురేఖలను ఇప్పటికే ఊహించవచ్చు. అయినప్పటికీ, ఆయన విజయం సాధించిన పక్షంలోనూ భారతదేశం చాలా ఇతర దేశాల కంటే ప్రత్యక్షంగా తక్కువ ప్రభావితం కావచ్చు. ధ్రువ జయ్శంకర్ వ్యాసకర్త ‘ఓఆర్ఎఫ్ అమెరికా’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డొనాల్డ్ ట్రంప్‌నకు జాక్‌పాట్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయనకు చెందిన ఒక కంపెనీ డీల్ ఇటీవల పూర్తయింది. దాంతో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా తాజా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.54 వేల కోట్లు) చేరింది. గతంలో ఎప్పుడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయికి చేరలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇది దాదాపు 29 నెలలుగా సాగుతూ వస్తోంది. మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. దాంతో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాస్డాక్లో డీజేటీ పేరిట ట్రేడింగ్ కానుంది. ఇదీ చదవండి: రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ ఆస్తులు పెరగడంతోపాటు ట్రంప్‌నకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. తన సంపదకు సంబంధించి గతంలో తప్పుడు లెక్కలు చెప్పినట్లు అభియోగాలు వచ్చాయి. దాంతో విచారణ జరిపిన అమెరికా కోర్టు ఆయనకు రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) జరిమానా విధించింది. ట్రంప్ తనపై వచ్చిన అభియోగాలను, దిగువ కోర్టు విధించిన జరిమానాను సవాలు చేస్తూ పై కోర్టును ఆశ్రయించారు. ఇటీవల దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి అప్పీల్స్ న్యాయస్థానం ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేస్తే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలిపేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. దాంతో ట్రంప్‌నకు భారీ ఊరట లభించినట్లైంది. -
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్‌కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్‌ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్‌గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్‌ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
USA: ‘ఈసారి నేను గెలవకపోతే’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్‌తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Here’s the whole clip of Donald Trump talking about the bloodbath. pic.twitter.com/pu8M35B5MR — Molly Pitcher (@AmericanMama86) March 17, 2024 ‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బైడెన్ క్యాంపెయిన్ టీమ్ స్పందించింది. ‘ట్రంప్ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్‌లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్ టీమ్ ఎక్స్(ట్విటర్) పోస్టు చేసింది. Biden-Harris campaign statement on Trump tonight promising a “bloodbath” if he loses pic.twitter.com/8mBYh4QKnf — Biden-Harris HQ (@BidenHQ) March 17, 2024 కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా -
USA: ‘నేను మళ్లీ గెలిస్తే’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్‌పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్‌నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
USA: అమెరికాలో ‘టిక్‌టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్‌టాక్ షార్ట్ వీడియో యాప్‌పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్‌టాక్‌పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్‌టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్‌టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్‌టాక్‌లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్‌బుక్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు వి చాట్‌ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్‌టాక్‌పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్‌ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్‌టాక్‌కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్‌టాక్ యాప్ యాజమాని బైట్‌డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్‌పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
USA: వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్
వాషింగ్టన్: అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్ తన వయసుపై తానే జోకులు వేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున బైడెన్ మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా షూట్ చేసిన ఒక టీవీ ప్రకటనలో బైడెన్ తనపై తానే జోకులు వేసుకున్నారు. ‘చూడండి.. నేను యువకుడిని కాదు. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే అమెరికా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు’ అని కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ బైడెన్ యాడ్‌లో చెప్పడం ఆసక్తిరేపింది. ఆ తర్వాత తాను కరోనాను ఎలా నియంత్రించాను, వృద్ధులకు ఇన్సులిన్ ధరలను ఎలా తగ్గించాను, మౌలిక సదుపాయాల చట్టం, గర్భం ధరించే విషయంలో మహిళలకు స్వేచ్ఛ లాంటి విషయాల్లో తన విజయాలను వీడియోలో బైడెన్ ప్రజలకు వివరించారు. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత యాడ్‌లో వన్ మోర్ టేక్ అనే వాయిస్ వినిపిస్తుంది. దీనికి ‘చూడు. నేను చాలా యంగ్, ఎనర్జిటిక్, అందగాడిని. నేనేం తప్పు చేశాను’ అని ముఖంలో కాస్త కోపంతో బైడెన్ అనడంతో యాడ్ బాగా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో బైడెన్ పలు విషయాలను మర్చిపోయి ప్రవర్తించిన ఉందంతాలు వెలుగు చూశాయి. తాజాగా జార్జియాలో హత్యకు గురైన నర్సింగ్ విద్యార్థిని లేకెన్ రిలే విషయం మాట్లాడుతూ ఆమె పేరును లింకన్ రిలే అని ఉచ్చరించడంతో బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడినట్లయింది. ఇదీ చదవండి.. లెబనాన్‌లో ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు మృతి -
US: అధ్యక్షపోరులో మళ్లీ ఆ ఇద్దరే..! ‘సూపర్ ట్యూస్డే’లో వారిదే హవా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ‘సూపర్ ట్యూస్డే’ ప్రైమరీ బ్యాలెట్ పోరులో ఎగ్జిట్ పోల్ అంచనాలతో పాటు అందరూ ఊహించిందే నిజమైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఇటు అధికార డెమొక్రాట్లు, అటు రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తలపడటం ఖాయమైంది. సూపర్ ట్యూస్డే(మార్చ్ 6) నాడు జరిగిన 16 రాష్ట్రాల ప్రైమరీల్లో డెమొక్రాట్లకు సంబంధించి బైడెన్ ముందంజులో ఉండగారిపబ్లికన్ల ప్రైమరీల్లో ఇప్పటివరకు వెలువడ్డ రాష్ట్రాల ఫలితాల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. వర్జీనియా, వెర్మాంట్, నార్త్ కరోలినాల్లో, అయోవా, టెన్నెస్సీ, అర్కాన్సాస్, టెక్సాస్, ఓక్లహామా, అలబామా, కొలరాడో, మసాచూసెట్స్, మిన్నెసోటా డెమొక్రాటిక్ ప్రైమరీల్లో బైడెన్ విజయ ఢంకా మోగించారు. అమెరికన్ సమోవాలో మాత్రం బైడెన్ పరాజయం పాలయ్యారు. ఇటు రిపబ్లికన్ల ప్రైమరీల్లో ట్రంప్ వర్జీనియా, నార్త్ కరోలినా, టెన్నెస్సీ, అర్కాన్సాస్, టెక్సాస్, అలబామా, మిన్నెసోటా, కొలరాడో, మసాచూసెట్స్, ఓక్లహామాలలో విజయం సాధించారు. నార్త్ కరోలినాలో మాత్రం ట్రంప్ అతి తక్కువగా 9 శాతం ఆధిక్యంతో బయటపట్డారు. మొత్తం 16 రాష్ట్రాల్లో మంగళవారం ఒకే రోజు ప్రైమరీ బ్యాలెట్ పోరు జరిగింది. ప్రైమరీ బ్యాలెట్లతో పాటు టెక్సాస్, కాలిఫోర్నియా, అలబామా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేట్, హౌజ్, గవర్నర్ అభ్యర్థులను కూడా డౌన్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. Trump wins the Arkansas primary! Fox News called this awhile ago, and that made sense, but the AP took its time (go figure). No matter, it's victory number nine, number nine, number nine for Trump on Super Tuesday. 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆 pic.twitter.com/mmHmGYqyIx — Julia 🇺🇸 (@Jules31415) March 6, 2024 16 రాష్ట్రాల్లో మొత్తం 854 మంది రిపబ్లికన్ ప్రతినిధుల మద్దతు కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ(జీవోపీ) అభ్యర్థులు పోటీ పడతారు. ఇందుకే దీనిని సూపర్ ట్యూస్డే గా పిలుస్తారు. సూపర్ ట్యూస్‌డేలో విజయం సాధించిన పార్టీల అభ్యర్థులే ఆయా పార్టీల తరపున అధ్యక్ష అభ్యర్థులుగా తుదిపోరుకు నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరు పార్టీల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మిగతా అభ్యర్థులు పోటీలో నుంచి తప్పుకుంటారు. కాగా, కేవలం సూపర్ ట్యూస్డే ప్రైమరీలు కాకుండా ఇటీవల జరిగిన మిగతా ప్రైమరీ బ్యాలెట్లలోనూ డెమొక్రాట్లలో బైడెన్ పైచేయి సాధించగా ఇటు రిపబ్లికన్లలో ట్రంప్ దూసుకుపోయారు. అయితే వాషింగ్టన్ ప్రైమరీలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హాలే ప్రైమరీల చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ప్రైమరీలు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ కోల్పోయింది వాషింగ్టన్ ప్రైమరీ ఒక్కటే కావడం గమనార్హం. ఇదీ చదవండి.. విమానంలో మహిళకు డెలివరీ చేసిన పైలట్ -
Us Elections: ప్రైమరీల్లో ట్రంప్ హవా.. ఖాతాలో మరో మూడు విజయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేందుకు జరుగుతున్న పార్టీ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన ఇదాహో, మిస్సోరి, మిచిగన్ రిపబ్లికన్ ప్రైమైరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్‌నకు మద్దతుగా ఇప్పటి వరకు 244 డెలిగేట్లు ఉండగా ప్రత్యర్థి నిక్కీ హాలేకు మద్దతుగా కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేట్ అవ్వాలంటే మొత్తం 1215 డెలిగేట్ల మద్దతు అవసరం. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద ఈవెంట్‌గా చెప్పే మార్చి 5 (సూపర్ ట్యూస్డే) మంగళవారం రోజు ఏకంగా 16 రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రైమరీ బ్యాలెట్ పోరు జరగనుంది. రెండు పార్టీల్లో సూపర్ ట్యూస్డే విజేతలు దేశ తుది అధ్యక్ష పోరులో తలపడతారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల తరపున గతంలో తలపడ్డ అభ్యర్థులు జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారనేది దాదాపు ఖాయమైంది. ఇటు బైడెన్ విషయంలో అధిక వయసు, మతిమరుపు వంటి అంశాలు, అటు ట్రంప్‌ను వేధిస్తున్న న్యాయపరమైన కేసుల చిక్కులు ఉన్నప్పటికీ ఇద్దరే మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం -
South Carolina Primary: హాలేపై ట్రంప్ ఘన విజయం
కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ట్రంప్‌నకు 63 శాతం ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. హాలేకు ఇది అవమానకరమైన ఓటమిగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. హాలేకు సౌత్ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం చాలా ఐక్యంగా ఉందని సౌత్ కరోలినా ప్రైమరీ పోలింగ్ ముగిసిన తర్వాత సౌత్ కరోలినా రాజధాని కొలంబియాలో ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌత్ కరోలినాలో ఓటమి తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి నిక్కీ హాలే తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే తాను రేస్ నుంచి తప్పుకోనని హాలే ప్రకటించారు. మార్చి5 మంగళవారం(సూపర్ ట్యూస్డే)నాడు జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, ట్రంప్ ఇప్పటివరకు 5 ప్రైమరీల్లో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరూ అందుకోలేనంత ముందంజలోకి వెళ్లారు. ప్రైమరీలు ముగిసిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమొక్రాట్ల ప్రైమరీల్లో ప్రస్తుత దేశ అధ్యక్షకుడు జో బైడెన్ రేసులో ముందున్నారు. ఇదీ చదవండి.. న్యూయార్క్ అపార్ట్మెంట్లో మంటలు.. భారత యువకుడి మృతి -
అలెక్సీ నావల్నీ మరణం.. చిక్కుల్లో ట్రంప్!
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కరడుగట్టిన విమర్శకుడిగా పేరొందిన అలెక్సీ నావల్నీ మృతి.. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. నావల్నీ మృతిపై.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో పుతిన్ వింగ్ (పుతిన్ అనుకూల వర్గం) పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్‌ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిజ్ చెనే హెచ్చరించారు. అలాంటివారిని వైట్‌హౌజ్‌లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్ ట్రంప్ సరైన రీతిలో స్పందించలేదు. చట్టానికి అతీతులుగా వ్యవహరించడంలో ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ ఇద్దరే. నాటో దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, బ్రిటన్ల భద్రతను ప్రమాదంలో పడేస్తాయి’అని చెనే తెలిపారు. కాగా, నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని.. ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి.. సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్ -
US: ట్రంప్‌ను తెగ తిట్టిన తండ్రి ఆత్మ.. ఏఐ వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ పడేవారిని ఎన్నుకునేందుకుగాను రెండు ప్రధాన పార్టీల ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రచారంలో డీప్ ఫేక్ ఆడియో, వీడియోల బెడద అభ్యర్థులకు ఎక్కువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సృష్టించే ఈ ఫేక్ ఆడియో, వీడియోల ట్రెండ్‌ను తమకు అనుగుణంగా మలుచుకునే నేతలు కూడా లేకపోలేదు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన ఆడియో, వీడియోలను కూడా డీప్ ఫేక్ అని తప్పించుకునే నేతలూ ఉన్నారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంటారు. అయితే తాజాగా యాంటీ ట్రంప్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన లింకన్ ప్రాజెక్ట్ రూపొందించిన ఆసక్తికర ఏఐ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ట్రంప్ నాన్న ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ తన కొడుకు డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న అవలక్షణాలన్నింటినీ చెబుతూ తిడుతుంటుంది. ఫ్రెడ్ ట్రంప్ తిడుతుండగా డొనాల్డ్ ట్రంప్ జీవితంలోని పలు సందర్భాలకు చెందిన వీడియో క్లిప్పులు ప్లే అవుతుంటాయి. ‘డొన్నీ(డొనాల్డ్ ట్రంప్) నువు చేసిన వ్యాపారాలన్నీ చెత్త. కనీసం క్యాసినో ఆడి కూడా నువు డబ్బులు సంపాదించలేకపోయావ్. ఎన్నోసార్లు దివాళా తీసిన నిన్ను నేనే బయటపడేశాను. నువ్వు నా పేరు పెట్టుకున్నందుకు నేను సిగ్గు పడుతున్నాను. నువ్వొక బోరింగ్ మనిషివి. ఆడవాళ్లు నిన్ను ఎందుకు వదిలేస్తారో అందరికీ తెలుసు. పోర్న్ స్టార్లకు డబ్బులిస్తావు. నీ పిల్లలు కూడా నిన్ను అసహ్యించుకుంటారు. నేను సృష్టించిన ట్రంప్ బ్రాండ్ నీ వల్ల చెత్తగా మిగిలిపోయింది. అసలు నా కొడుకు ఇంత దారుణంగా ఎలా తయారయ్యాడు. నువ్వు ఇప్పటివరకు జైలుకు వెళ్లకుండా బయట ఉన్నావంటే అది నీ అదృష్టమే. నేను చనిపోయి 30 ఏళ్లయింది. ఇప్పటికీ నిన్ను చూసి సిగ్గు పడుతున్నాను’ అని ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ కొడుకు ట్రంప్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఈ వీడియో ఏఐ ద్వారా సృష్టించిందని లింకన్ ప్రాజెక్ట్ బహిరంగంగానే ఒప్పుకుంది. ఈ వీడియో సరికాదని ట్రంప్ ఇప్పటికే ఖండించారు. ఇదీ చదవండి.. పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం -
Us: బైడెన్ వయసు.. హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమస్య వైట్ హౌస్ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించారు. ఇదీ చదవండి.. అమెరికాలో చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది -
నిక్కీ హేలీ భర్తపై ట్రంప్ వ్యాఖ్యలు.. త్యాగం తెలియదంటూ ఫైర్
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అయితే నెవడా రాష్ట్రంలో ట్రంప్‌కు గట్టిపోటి ఇస్తున్న మరో నేత నిక్కీ హేలీ పోటీకి దూరంగా ఉండటంతో ట్రంప్ గెలుపొందారు. తాజాగా ట్రంప్ చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ప్రచారంలో నిక్కీ హేలీ భర్త కనించడం లేదు? ఆయన ఎక్కడ? ఆయనకు ఏమైంది? అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిక్కీ హేలీ స్పందించారు. ఇలాంటీ ప్రశ్నలు ప్రత్యక్షంగా డిబేట్లో పాల్గొన్నప్పుడు అడగాలని.. కానీ ఇలా తన వెనకాల ప్రచారంలో విమర్శ ఏంటని ట్రంప్‌పై మండిపడ్డారు. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే.. సూటిగా చెప్పాలి. కానీ.. వెనకాల విమర్శలు చేయోద్దు. స్టేజ్ మీదకు వచ్చి డిబేట్లో నా ముందు మాట్లాడాలి’ నిక్కీ హేలీ దుయ్యబట్టారు. ‘నా భర్త మైఖేల్ దేశానికి సేవలు అందించారు. దాని గురించి నీకు ఏం తెలియదు(డొనాల్డ్). మైకేల్ సేవలకు నేను గర్విస్తున్నా. ప్రతి మిలిటరీ కుటుంబానికి తెలుసు మిలిటరీలో పనిచేసినవారి త్యాగం గురించి. మిలిటరీ బలగాల త్యాగం తెలియని వాళ్లు అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించే అర్హత ట్రంప్‌కు లేదు. మిలిటరీ బలగాల త్యాగాలను కించపరిచే వ్యక్తి (డొనాల్డ్ ట్రంప్) మిలిటరీ డ్రైవర్ లైసెన్స్ పొందడానికి కూడా అర్హుడు కాదు’ అని భారత సంతతి మహిళా నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నిక్కీహేలీ భర్త మైఖేల్ హేలీ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘ఇదే మనుషులు, జంతువుల మధ్య తేడా?జంతువులు ఎప్పుడూ మూగ జంతువుకు సారథ్యం వహించడానికి అనుమతి ఇవ్వవు’ అని ఎద్దేవా చేశారు. చదవండి: మా ఇద్దరిలో ఒకరికి అధ్యక్షపీఠం: నిక్కీ హేలీ! -
ట్రంప్ ఎన్నికల రేసులో ఉంటారా ?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన ఉంటారా లేదా అన్నదానిపై అమెరికా సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. 2020అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 3వ సెక్షన్ ప్రకారం ఏదైనా పదవీ ప్రమాణం చేసి తిరుగుబాటుకు పాల్పడిన వారు తిరిగి ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టేందుకు వీలు లేదు.ఇదే సెక్షన్ ఆధారంగా ఇప్పటికే కొందరు ఓటర్లు కొలరాడో సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఇప్పటికే ట్రంప్‌ను కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో పోటీ నుంచి తొలగించారు. అయితే తాజగా అప్పీల్ కోర్టులో రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ట్రంప్‌నకు వర్తిస్తుందా లేదా అనేది తేల్చడంతో పాటు కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పుపైనా విచారణ జరగనుంది. మొత్తం 80 నిమిషాల పాటు ట్రంప్ న్యాయవాదులతో పాటు అవతలి పార్టీ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అనంతరం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తీర్పుతో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయా లేదా అన్నది తేలిపోనుంది. కాగా, ట్రంప్ ఇప్పటికే ప్రారంభమైన ప్రైమరీ ఎన్నికల్లో అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ నుంచి ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ రేసులో హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీ చదవండి.. మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం -
బైడెన్ మళ్లీ నెగ్గుతారా?.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన గాల్లప్ పోల్‌లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం 38 శాతం మాత్రమే అంగీకరిస్తున్నట్లు పోల్‌లో వెల్లడయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. బైడెన్ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించకపోవడం గమనార్హం. వయసుతో పాటు మెక్సికోతో బోర్డర్ వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్‌తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే గతంలో గాలప్ పోల్స్ అంచనాలు చాలాసార్లు మిస్సయ్యాయి. ఇదీచదవండి.. న్యూజిలాండ్‌లో భారత విద్యార్థి మృతి -
అతనికి ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేయలేదు: ట్రంప్ క్యాంపు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లికన్ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు. అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవకి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను అడినట్లు కెన్నెడీ ధృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్ రన్నింగ్మేట్గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. Although Trump denies it, RFK Jr says Team Trump did reach out to him to see if he would be Trump’s running mate, and he turned it down. pic.twitter.com/oUhqUD8eJH — Ron Filipkowski (@RonFilipkowski) January 29, 2024 ట్రంప్ సీనియర్ అడ్వైజర్ క్రిస్ లాసివిటా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ట్రంప్ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సంప్రదించలేదని తెలిపారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ అడిగారని కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ సోదరుడు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్ అయిన రాబర్ట్ కెనెడీ(అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు) తనయుడే ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. This is 100% FAKE NEWS - NO ONE from the Trump Campaign ever approached RFK jr (or ever will) - one of the most LIBERAL and radical environmentalists in the country. For all the fake news- update your stories. https://t.co/HYBJLqSux0 — Chris LaCivita (@LaCivitaC) January 28, 2024 ఇదీచదవండి.. సైనీ హత్యను ఖండించిన భారత్ -
ట్రంప్ హవా.. అక్కడ కూడా గెలవబోతున్నారా..!
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 24న జరిగే సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లోనూ ట్రంప్ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. అమెరికన్ ప్రామిస్,టైసన్ గ్రూపు చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్‌కు 58 శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతుండగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హాలేకు 31 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. 2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీకి ఇక్కడి ప్రైమరీలో గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. అయితే సర్వేలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే నిక్కీ పోటీలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధిస్తే మాత్రం ఇక రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్‌కు తిరుగుండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఇదీచదవండి.. గాజాలో పౌరుల మరణాలను నివారించాలి -
నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు తెర తీశారు.అయోవా ప్రైమరీ బ్యాలెట్లో విజయం సాధించి ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాలేపై ట్రంప్ తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. నిక్కీపై ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో అనుచిత పోస్టులు పెట్టారు. నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం లేదని, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆమె పేరులోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీ ఎక్స్‌లో ధీటైన సమాధానమిచ్చారు. ‘ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు అభద్రతాభావం,భయానికి గురైనపుడు ట్రంప్ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారు. ఈ విషయంపై దృష్టి పెట్టి నా శక్తిని నేను వృథా చేసుకోను’అని హాలే పోస్టు చేశారు. గతంలో ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు కూడా ఆయన అమెరికన్ కాదని జాతి వివక్ష ప్రచారాన్ని ట్రంప్ విస్తృతంగా నిర్వహించారు. ఈ నెల 15న జరిగిన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా రన్నరప్‌గా నిలిచిన డిశాంటిస్ ట్రంప్ దరిదాపుల్లో కూడా లేరు. నిక్కీ డిశాంటిస్ కన్నా వెనుకబడడం గమనార్హం. ఇదీచదవండి.. అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా -
US: ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలేంటి ? ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ
వాషింగ్టన్: ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అవడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. తాజాగా జరిగిన అయోవా స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ తిరుగులేని విజయం నమోదు చేసుకున్నారు. అయోవాలోనే 51 శాతం ఓట్లతో ట్రంప్ విజయభేరి మోగించారంటే మిగిలిన చోట్ల ట్రంప్ గెలుపు సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ట్రంప్ తాజాగా ఓ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. బుధవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఒక డిఫమేషన్ కేసులో కోర్టుకు వచ్చినపుడు అక్కడున్న మద్దతుదారుల వైపు చూస్తూ ట్రంప్ చేయి ఊపారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలున్నాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ చేతిపై ఉన్న రెడ్ స్పాట్స్‌కు నెటిజన్లు తమకు తోచిన విధంగా కారణాలు చెబుతున్నారు. కొందరు ఆ మచ్చలు కెచప్ తిని చేయి శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చాయంటుంటే మరికొందరు అయోవాలో గడ్డకట్టించే చలి వల్ల వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. What happened to Trump’s hand? It wasn’t like this in New Hampshire. pic.twitter.com/B4TlPxEmDV — PatriotTakes 🇺🇸 (@patriottakes) January 17, 2024 ఇదీచదవండి.. రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే -
ట్రంప్ వైపే ‘అయోవా’!
అమెరికాలోని అయోవా రాష్ట్రం అందరి భయాలనూ నిజం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఆ రాష్ట్రంలోని పార్టీ ప్రతినిధులు పట్టం కట్టారు. దేశానికి ట్రంప్ బెడదను నివారించటంలో అయోవా రిపబ్లికన్లు తోడ్పడితే బాగుణ్ణని చాలామంది పెట్టుకున్న ఆశలు తలకిందయ్యాయి. ఇదే రేస్‌లోవున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అయోవాలో తగినన్ని ఓట్లు రాబట్టలేక పోటీకి స్వస్తిచెప్పారు. మెరుగ్గా ఓట్లు పడకపోతే పోటీ నుంచి తప్పుకుంటారేమోనని వివేక్ మద్దతుదారులు భయపడ్డారు. చివరకు అదే జరిగింది. మున్ముందు ఏమవుతుందన్నది పక్కనబెడితే అయోవాలో ట్రంప్ సాధించిన విజయం అనేక విధాల కీలకమైనది. ఇదే రాష్ట్రంలోని రిపబ్లికన్లు ఎనిమిదేళ్లక్రితం అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ను పట్టించుకోలేదు. అప్పట్లో ఆయనకు కేవలం 21 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేల్లో సైతం రిపబ్లికన్లలో అనేకులు విముఖంగానే వున్నట్టు తేలింది. కేవలం కార్మికవర్గ ఓటర్లు మాత్రమే ఆయన వైపు మొగ్గుచూపుతున్నారని, పార్టీలోని కాలేజీ గ్రాడ్యుయేట్స్‌లో అత్యధికులకు ట్రంప్ పోకడలు నచ్చటం లేదని ఆ సర్వేలు తెలిపాయి. వేరేచోట్ల ముందంజలోవున్న ట్రంప్‌ను అయోవాలో అడ్డుకోగలిగితే పార్టీ తరఫున దేశాధ్యక్షుడిగా పోటీ చేయటానికి తన అవకాశాలు మెరుగుపడతాయని డీశాంటిస్ లెక్కలేశారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. విధానాలకూ, నిబంధనలకూ కట్టుబడి ఉండటం ముఖ్యమా... లౌక్యంగా పోవటం మంచిదా అన్న మీమాంస చాలా పాతది. డోనాల్డ్ ట్రంప్ ఒక నీలి చిత్రాల నటి నోరునొక్కేందుకు తన న్యాయవాది ద్వారా ముడుపులు చెల్లించారన్న అభియోగం విచారణార్హమైనదేనని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నిర్ధారించినప్పుడు అనేకులు లబలబలాడారు. కేసులు పెడితే సానుభూతి వెల్లువెత్తుతుందని, ఆయన బలపడతాడని హెచ్చరించారు. కానీ డెమాక్రాట్లు వినలేదు. ఇక 2020నాటి అధ్యక్ష ఎన్నికల వ్యవహారం సరేసరి. ఓటమి తప్పదని గ్రహించిన ట్రంప్ వాటిని తారుమారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు ఓట్ల లెక్కింపును అడ్డుకోవటం కోసం కేపిటల్ హిల్ భవననానికి తరలిరావాలంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టారు. పర్యవసానంగా భారీయెత్తున హింస చోటుచేసుకుంది. పలువురు మరణించారు. ఈ ఉదంతాల్లో ట్రంప్‌పై కేసులున్నాయి. అదిగాక తనకు ప్రధాన పోటీదారు కాబోతున్న డెమాక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై విచారణకు ఆదేశించాలని 2019లో ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలో ఒకసారి... ఓట్ల లెక్కింపు సమయంలో మద్దతుదార్లను హింసకు ప్రేరేపించారన్న అభియోగంలో మరోసారి ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించింది. రెండుసార్లూ తమకు బలంవున్న సెనేట్‌లో రిపబ్లికన్లు ట్రంప్‌ను నిర్దోషిగా బయటపడేశారు. చివరకు జరిగేదేమిటో తెలిసి నప్పుడు ట్రంప్‌పై ఇదంతా అవసరమా అన్నది విశ్లేషకుల వాదన. కానీ డెమాక్రాట్లకు ఇదంతా పట్టలేదు. నిజానికి సానుభూతే అయోవాలో కొత్త ఓటర్లను ఆయనవైపు మళ్లించిందని తేలింది. తాజా ఎన్నికకు ముందు జరిగిన సర్వేల్లో ప్రత్యర్థుల కన్నా ట్రంప్ చాలా ముందున్నారు. ట్రంప్‌పై పెట్టిన కేసులన్నీ బోగస్‌వేనని పార్టీ ఓటర్లు చెప్పడం గమనించదగ్గది. నిజానికి అయోవాపై ట్రంప్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. 2016లో పార్టీలో తనపై పోటీచేసిన సెనెటర్ టెడ్ క్రజ్ రిగ్గింగ్‌తో గెలిచారని అప్పట్లో ఆయన గొడవ చేశారు. ఈసారి అదే పని డీశాంటిస్ చేయ బోతున్నారని గగ్గోలు పెట్టారు. కానీ అందుకు భిన్నంగా కార్మికవర్గ ఓటర్లతోపాటు గ్రాడ్యుయేట్లు కూడా ట్రంప్‌ను బలంగా సమర్థించారని తేలింది. ఇక్కడ డీశాంటిస్‌కు గట్టి మద్దతుందని అంచనా వేసిన నిక్కీ హేలీ ఆయనకు వ్యతిరేకంగా భారీయెత్తున ఖర్చుచేశారు. పైగా డెమాక్రటిక్ ఓటర్లు కొందరు హేలీ కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి, ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు. బహుశా అందుకే కావొచ్చు...డీశాంటిస్ కన్నా కాస్త మెరుగ్గా ఓట్లు సాధించి ఆమె ద్వితీయ స్థానంలో నిలిచారు. అయోవాతో మొదలైన రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వచ్చే జూన్ 4తో ముగుస్తుంది. పార్టీలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక కూడా రిపబ్లికన్లకు ట్రంపే నాయకుడిగా కొనసాగుతున్నారు. నోటి దురుసుతనం, ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకు పడటం లాంటివి ఆయనకు తోడ్పడుతున్నాయో... ఆ పార్టీయే అటువంటివారిని నెత్తినపెట్టుకునే స్థాయికి దిగజారిందో అనూహ్యం. ట్రంప్‌ను విమర్శిస్తే ఆయన మద్దతుదార్లు దాడి చేస్తారని పార్టీ లోని ప్రత్యర్థులే బెంబేలెత్తటం గమనించదగ్గది. ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. వలసదారులు దేశాన్ని విషపూరితం చేస్తున్నారని, వారిని తరిమికొట్టడమే తన ధ్యేయమని ఆ మధ్య ప్రకటించారు. తాను మళ్లీ అధికారంలోకొస్తే నియంతగా మారి వ్యతిరేకులందరినీ తుడిచిపెడతానని, అసమ్మతిని అణిచేస్తానని హెచ్చరించారు. పార్టీలో ఆయనతో పోటీపడుతున్నవారిదీ అదే బాణీ. తాను గెలిస్తే ఎఫ్‌బీఐని రద్దుచేస్తానని, ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఇంటికి పంపుతానని వివేక్ ఎలుగెత్తారు. ఉన్నంతలో నిక్కీ హేలీ కన్నా డీశాంటిస్ మెరుగే అయినా ట్రంప్ ముందు ఆయన నిలబడలేరని తాజా ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇటు డెమాక్రాట్లు సైతం 81 ఏళ్ల జో బైడెన్‌ను మించి మరెవరినీ ఎంపిక చేసుకోలేక ట్రంప్ సునాయాస విజయానికి పరోక్షంగా బాటలు పరుస్తున్నారు. -
US: ట్రంప్ కేసులో శృంగార తార స్టార్మీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ఘన విజయం సాధించారు. దీంతో వివేక్ రామస్వామి లాంటి ప్రత్యర్థి ఏకంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ పోటీ నుంచే తప్పుకున్నారు. ఇదిలాఉంటే ట్రంప్‌కు తాజాగా మరో న్యాయపరమైన తలనొప్పి వచ్చి పడింది. శృంగార స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో మార్చిలో మన్‌హట్టన్ కోర్టు ముందు హాజరవుతానని చెప్పింది. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు ట్రంప్ అక్రమ పద్ధతిలో పేమెంట్ ఇచ్చారని, ఇందు కోసం ఆయన తన బిజినెస్ రికార్డులను తారుమారు చేశారని స్టార్మీ ఆరోపిస్తోంది. తనకు ట్రంప్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని గతంలోనే ఆరోపణలు చేసి స్టార్మీ సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కోర్టుకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏం చెబుతుంది దాని పరిణామాలేంటన్నదానిపై ట్రంప్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇదే కేసులో ట్రంప్ తరపున వాదిస్తున్న అగ్రశ్రేణి న్యాయవాది జో టాకోపినా తాను ఇక ఆయన తరపున వాదించనని సోమవారం కోర్టుకు తెలిపారు. ఒక పక్క అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేసుల తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఇదీచదవండి.. బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు -
US Elections: గన్ కల్చర్‌కు మానసిక రుగ్మతలే కారణం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు. అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు. ‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు. కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి.. కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత -
US Elections: ట్రంప్ పోరాటం వాటితోనే !
వాషింగ్టన్: కొత్త ఏడాదిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలని భావిస్తున్న దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు కేసులు ప్రతిబంధకం కాకుండా ఎంత ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ ట్రంప్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా అంతే గట్టిగా కేసులు వాదిస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించిన కేసుకు సంబంధించి తాజాగా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు చేసింది. ట్రంప్‌కు క్రిమినల్ కేసుల నుంచి ఎలాంటి ప్రత్యేక రక్షణ ఉండదని కోర్టుకు తెలిపింది. తాను అధ్యకక్షుడిగా ఉన్నపుడు పాల్పడిన చర్యలకు క్రిమినల్ చట్టాలు వర్తించవని ట్రంప్ బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ వాదనను కొలంబియా కోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన అప్పీల్‌కు వెళ్లారు. ఈ కేసులో జనవరి 9న కొలంబియా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇరుపక్షాల వాదనలు విననుంది. ఒకవేళ ట్రంప్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరిస్తే ఈ కేసులో మార్చి నుంచి ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభిస్తుంది. అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలనుకుంటున్న ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. 2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా జనవరి 15 నుంచి ప్రైమరీలు ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి..పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్ -
US Elections: అవి హిట్లర్ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్
వాషింగ్టన్: అక్రమ వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన పుస్తకం ‘మెయిన్ కంఫ్’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యల వెనుక హిట్లర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్ గురించి ఏమీ తెలియదు. హిట్లర్ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్ కొట్టిపారేశారు. నేషనల్ పల్స్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్ పాయిజనింగ్ ద బ్లడ్ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్లో న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇవి హిట్లర్ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీచదవండి..ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు -
US Elections : ట్రంప్ పోటీ పై కోర్టు సంచలన తీర్పు
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న కొలరాడో ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూపు ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్‌కు అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కొలరాడో కోర్టు వెల్లడించింది. ఈ డిస్క్వాలిఫికేషన్ తీర్పు మార్చి 5న జరగనున్న ప్రైమరీ బ్యాలెట్‌కు మాత్రమే వర్తించనుంది. డిస్క్వాలిఫికేషన్ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ కార్యాలయం తెలిపింది. తీర్పుపై అప్పీల్‌కు జనవరి 4 దాకా కోర్టు అవకాశమిచ్చింది. దేశంలో తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవిలో ఉండడానికి వీలు లేదని అమెరికా రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఈ నిబంధన ఆధారంగానే కొలరాడో కోర్టు ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేసింది. కొలరాడో కోర్టు తీర్పును ట్రంప్ యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నారు. ట్రంప్ ఉంటేనే పోటీలో ఉంటా : వివేక్ రామస్వామి కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీలో ఉంటేనే తాను పోటీ చేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వివేక్ రామస్వామి తెలిపారు. వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త. ఈయన అమెరికాలో ఫార్మాసుటికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ -
ఇది తెలివైన పనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరం చేశారని కోర్టు అంగీకరించవచ్చు. ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున మరోసారి పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ ఈ కేసు తెరమీదకు రావడం గమనార్హం. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు. ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభేదించేవాళ్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం. ‘యూగవ్’ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది అమెరికన్ ఓటర్లు ఆయనకు మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టు విచా రణ చేపట్టడం న్యాయపరంగా బాగానే కనిపిస్తుంది కానీ రాజకీయంగా అంత తెలివైన పనేనా? ఈ విచారణ ఆయనకు మద్దతిచ్చేవారి సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. గత వారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. కారణం? ఆయన నేరానికి పాల్పడటమే. ఈ విషయం కోర్టు అంగీకరించవచ్చు... ఫలితంగా ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ట్రంప్ ఇంకో సారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశమే ఉండదు. బాగానే ఉంది కానీ, రాజకీయంగా చూస్తే ఇదేమంత తెలివైన విషయంగా కనిపించదు. యాదృచ్ఛికమేనా? అమెరికా న్యాయవ్యవస్థ రాజకీయమైందేమీ కాదు కానీ చేసేందుకు అవకాశాలెక్కువ. డోనాల్డ్ ట్రంప్‌పై ఏ అంశంపై శిక్ష పడుతుందన్నది స్పష్టంగా తెలియదు. ‘పోర్న్ స్టార్’ స్టార్మీ డేనియల్స్‌కు అక్రమంగా డబ్బులిచ్చి ఆ విషయాన్ని దాచడంపై అని చాలామంది అనుకుంటున్నారు. అల్విన్ బ్రాగ్ అనే డెమోక్రటిక్ జిల్లా న్యాయవాది ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అది కూడా నేరం జరిగిందన్న కాలానికి ఆరేళ్ల తరువాత! పైగా 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ కావడం గమనార్హం. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయంటే నమ్మడం కష్టమే.రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం, ట్రంప్ కథ దాదాపుగా ముగిసిపోయినట్లే. ఆయన ర్యాలీలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ప్రసంగాలు కూడా చప్పగా ఉంటున్నాయి. ఫ్లోరిడాకు చెందిన రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రిపబ్లికన్ల కొత్త ఆశల్లా కనిపిస్తున్నారు. 2020లో పోటీ నుంచి తప్పుకొని ట్రంప్‌ను వీరు నేరుగా విమర్శించారు కూడా! ప్రజాదరణ ట్రంప్‌కే ఎక్కువ ట్రంప్ కేసును న్యాయపరంగా విశ్లేషించినప్పుడు ఆయన జైలుకెళ్లే అవకాశాలు తక్కువే అన్నది స్పష్టమవుతుంది. అకౌంట్లను తారుమారు చేసిన నేరానికి రకరకాల ఉపశమన మార్గా లున్నాయని మాజీ ప్రాసిక్యూటర్, న్యాయశాస్త్ర అధ్యాపకుడు జెఫ్రీ బెల్లిన్ అంటున్నారు. ఈ పరి స్థితుల్లో దేశ మాజీ అధ్యక్షుడిని జైల్లో పెట్టడం ఎంత అసాధ్యమో, రాజకీయంగా ఎంత ప్రమాదకరమో జ్యూరీ సభ్యులకూ, న్యాయమూర్తులకూ తెలుసు. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు మరి! ఒకవేళ ట్రంప్ జార్జియా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నాడనో, కాపిటల్‌పై దాడికి మూకను ఉసిగొల్పాడనో విచారణ జరిపితే పర్యవసానాలు వేరుగా ఉండేవేమో! ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభే దించే రిపబ్లికన్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం. ఇదిలా ఉంటే, ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని సంబరంగా ఉన్నారు. ట్రంప్‌పై నమ్మకం ఎప్పుడో సన్నగిల్లినప్పటికీ రిపబ్లికన్ నాయ కులు మైక్ పెన్స్, రాన్ డిశాంటిస్ కూడా ఈ కేసు అక్రమమని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులోని పార్టీ నేత లందరూ ఇదే మాట చెబుతూండటం దీనికి కారణం. కానీ ట్రంప్ విషయంలో ప్రజాభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. యూగవ్ వెబ్సైట్ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు. డిశాంటిస్ విషయంలో ఇది కేవలం 31 శాతం మాత్రమే. హార్వర్డ్ సీఏపీస్/హ్యారిస్ పోల్‌లో ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే నాలుగు పాయింట్లు ముందుండటం గమనార్హం. డెమోక్రాట్లు తమ రాజకీయం కోసం న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజ ల్లోనూ వ్యక్తమైంది. స్టాలిన్ కాలపు హార్రర్ షో... మధ్య అమెరికా ప్రాంతంలోని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నినింపడం... న్యూయార్క్, వాషింగ్టన్లకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు, లిబరల్స్‌ను బూచిగా చూపడం ట్రంప్ రాజకీయంగా ఎదిగేందుకు కారణమైన అంశాలు. సాధారణ ప్రజలకు రక్షకు డిని తానేనని, వారి కోసం పోరాడేదీ తానేనని చెప్పుకొనే వాడు. అలాగే 2020లో తాను ఎన్నికల్లో ఓడిపోయేందుకు ‘వాళ్లు’ కార ణమని నమ్మించగలిగాడు. 2024లోనూ వాళ్లు తనను ఓడిస్తారని చెబుతున్నాడు. అందుకే ట్రంప్‌కు ఈ కేసు రష్యా నియంత స్టాలిన్ కాలం నాటి దమనకాండ మాదిరిగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు ఇప్పుడు నమ్మాల్సిన విషయం ఒకటే. ఎలాగోలా ట్రంప్‌కు కోర్టు ద్వారా నష్టం జరగాలి అని! ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇదెలాగూ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విచారణను పూర్తిగా వాడుకోవడం ద్వారా రిపబ్లికన్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న డిశాంటిస్‌కు ఎంతో కొంత ఆదరణ పెరిగేలా చేయడం... కానీ అది జో బైడెన్ తో పోటీలో గెలిచేంత కాకుండా చూడటం డెమోక్రాట్లకు అత్యవసరం అవుతోంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్నికలకు ఉన్న 18 నెలల కాలాన్ని ట్రంప్ వ్యక్తిత్వంపై దాడికి వాడుకోవాలి. ప్రపంచ స్థాయి వాణిజ్య పోరాటాలు, మరింత జటిలమవుతున్న ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను పట్టించుకోకుండా ట్రంప్‌పైనే దృష్టి పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమతో విభేదించే వారి అడ్డు తొలగించుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి. ప్రజల విషయంలో ఇది మరీ ముఖ్యమవుతుంది. అమెరికన్లలో చాలామంది డోనాల్డ్ ట్రంప్‌ను ఇష్టపడుతున్నారు. నమ్ముతున్నారు కూడా! న్యూయార్క్‌లోని జడ్జి మీద కంటే ఈ విశ్వాసం, ఇష్టం ఎక్కువ. ఈ ధోరణి ప్రమాదకరమైంది కూడా! ఆశ్చర్యకరంగా ఇది అమెరికాతో పాటు పశ్చిమ దేశాల రాజకీయాలన్నింటిలోనూ వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇది నాయకత్వ సంక్షోభానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. సైమన్ జెన్కిన్స్ వ్యాసకర్త కాలమిస్ట్, రచయిత (‘ద గార్డియన్ ’ సౌజన్యంతో) -
2024 US Presidential Election: ఎందుకు పోటీ చేస్తున్నానంటే...
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈసారి భారత సంతతీయుల సందడి ఎక్కువగా ఉండేట్టుంది. ఇప్పటికే ఆంట్రప్రెన్యూర్, రచయిత వివేక్ రామస్వామి తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికిగానూ ముందు తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఏమైనా నిండా నలభై ఏళ్లు లేని, కేరళ మూలాలున్న వివేక్ రామస్వామి ఇంత పెద్ద పదవికి పోటీ పడాలని అనుకోవడమే విశేషం. ‘ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి నేను రాజకీయ ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నారు. అమెరికా ప్రస్తుతం జాతీయ అస్తిత్వ సంక్షోభంలో ఉంది. విశ్వాసం, దేశభక్తి, కఠిన శ్రమ వంటివి కుప్పగూలుతున్న క్షణంలో మనం ఒక పరమార్థం కోసం తపిస్తున్నాం. అవగాహనకు సంబంధించిన మన అవసరాలను సంతృప్తిపర్చుకునేందుకు వాతావరణతత్వం, కోవిడ్ తత్వం, జెండర్ భావజాలం వంటి లౌకిక మతాలను కౌగిలించుకుంటున్నాం. కానీ అమెరికన్ అంటే అర్థం ఏమిటనే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు. ఈ మేలుకొలుపు వాదాన్ని (వోక్ ఎజెండా) పలుచన చేసి దాని ప్రాసంగికతను నిర్వీర్యం చేయడం, ఆ శూన్యాన్ని ఉత్తేజకర జాతీయ అస్తిత్వంతో భర్తీ చేయడం రిపబ్లికన్ పార్టీ ప్రథమ ప్రాధాన్యం కావాలి. కానీ దీనికి బదులుగా చాలామంది అగ్రశ్రేణి రిపబ్లికన్లు 1980లలో కంఠస్థం చేసిన నినాదాలను వల్లెవేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించకుండానే వామపక్ష సంస్కృతిని విమర్శిస్తున్నారు. అమెరికాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు, అమెరికా అంటే ఏమిటి అని మనం కొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి రాజకీయ ప్రచారాన్ని మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. 37 సంవత్సరాల ఒక రాజకీయ ఔట్‌సైడర్ భూమ్మీద అత్యున్న తమైన అధికారాన్ని సాధించాలనుకోవడం అహంకారంగానే కనిపించవచ్చు. కానీ, నేను మన జాతి కోసం, అమెరికన్ జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రతిభను పునరుద్ధరించగలిగే జాతి కోసం దార్శని కతలో భాగంగా పోటీ చేస్తున్నాను. మనం ప్రతిభను పునరుద్ధరించాలి. నా తల్లిదండ్రులు ఈ దేశానికి చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, వేలాది అమెరికన్ల జీవితా లను మెరుగుపర్చిన వ్యాపార సంస్థలను రూపొందించిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవేశిస్తున్న వారికి బదులుగా మా తల్లిదండ్రుల వంటి వలస ప్రజలు అవసరం. ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా అమెరికా సరిహద్దులకు భద్రత కల్పించడం, ప్రతిభా ప్రవేశాలకు అనుకూలంగా లాటరీ ప్రాతి పదికతో కూడిన వలస విధానాన్ని నిర్మూలించడం అవసరం. అమెరికాకు వచ్చి విజయాలు పొందినవారి ప్రతిభను మనం తప్పక ప్రోత్సహించాలి. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 20 శాతం మందిని నియమిస్తున్న ఫెడరల్ కాంట్రాక్టర్లు జాతి ప్రాతిపదికన నియామకాలను చేపట్టడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా పూర్వ అధ్య క్షుడు లిండన్ బి. జాన్సన్ కార్యనిర్వాహక ఆదేశం 11246 జారీ చేశారు. దీనివల్ల నల్లజాతి, హిస్పానిక్(స్పానిష్ దేశాలు) ఉద్యోగుల పట్ల అగ్రశ్రేణి కంపెనీలు ఎక్కువ అక్కర చూపుతూ– శ్వేత జాతి లేదా ఆసియన్ అమెరికన్లుగా ఉంటున్న అర్హత కలిగిన అభ్యర్థుల పట్ల అనిష్టం ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి కార్యనిర్వాహక ఆదేశాన్ని రద్దు చేయటమే కాకుండా, అక్రమమైన జాతి ప్రాతిపదిక ప్రాధాన్యాలపై విచారణ జరిపించాలని న్యాయ శాఖను ఆదేశిస్తాను. ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎంపికైనవాళ్లు వాస్తవంగా ప్రభు త్వాన్ని నిర్వహించాలి. కాన్నీ ఎన్నికలలో పాల్గొనని ఆంథోనీ ఫాచీ (అమెరికా ముఖ్య వైద్య సలహాదారు), మెర్రిక్ గార్లండ్ (అమెరికా అటార్నీ జనరల్) వంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరి ప్రవర్తించారు. ఇంకోసారి ఇలాంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరినప్పుడు ఒక అధ్యక్షుడికి రాజ్యాంగం కల్పించిన సాధికారతను నేను తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధత వహిస్తాను; వారిని తొలగిస్తాను. ఫెడరల్ ఉద్యోగులకు కల్పించిన సివిల్ సర్వీస్ సంరక్షణలను అవస రమైతే కార్యనిర్వాహక ఆదేశం ద్వారా రద్దు చేస్తాను. వీటికి బదులుగా నిర్దిష్టకాలం మాత్రమే రక్షణ కల్పించే మేనేజీరియల్ నిబంధనలను తీసుకొస్తాను. దేశాధ్యక్షుడు ఎనిమిదేళ్లకు మించి అధికారంలో ఉండ నప్పుడు,›బ్యూరోక్రాట్లకు కూడా దాన్నే వర్తింప జేయాలి. డబ్బును వృథా చేస్తున్న లేదా కాలం చెల్లిన సంస్థలకు నిధులను నిలిపివేసేలా– 1974 నాటి ‘ఇంపౌండ్‌మెంట్ కంట్రోల్’ చట్టాన్ని రద్దు చేయాలని లేక సవరించాలని అమెరికన్ కాంగ్రెస్‌ను కోరతాను. సంస్కరించడానికి సాధ్యం కాని సంస్థలను మూసివేస్తాను. వాటి స్థానంలో పునాదుల నుంచి కొత్త సంస్థలను నిర్మిస్తాను. ఏ భావాలనూ సెన్సార్ చేయనప్పుడే ఉత్తమ ఆలోచనలు పుట్టుకొస్తాయి. తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రసంగాలను సెన్సార్ చేయడంపై మన ప్రభుత్వం టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అవి అలా చేసేట్టుగా ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది. రాజ్య శక్తులతో కలిసి పనిచేసేలా ఇంటర్నెట్ కంపెనీలు అమెరికన్ రాజ్యాంగ తొలి సవరణకు కట్టుబడి ఉండాలి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో చేసినట్టుగా, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ‘స్టేట్ యాక్షన్ ఫైల్స్’ను బహిర్గత పరుస్తాను. రాజ్యాంగం నిషేధించిన కార్య కలాపాలను చేపట్టేలా కంపెనీలను బ్యూరోక్రాట్లు తప్పుడు పద్ధతుల్లో ఒత్తిడిపెట్టినట్టు తెలిపే ప్రతి ఉదంతం దీని ద్వారా బయటికొస్తుంది. ఇంటర్నెట్‌ని దాటి మన ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అభిప్రాయాల సెన్సార్షిప్ విస్తరించింది. నల్లజాతి, గే లేదా ముస్లింగా ఉంటున్నందుకు మీరు ఎవరినైనా ఉద్యోగం లోంచి తొలగించలేనట్లయితే, రాజ కీయ ప్రసంగం కోసం కూడా మీరు ఎవరినీ ఉద్యోగం లోంచి తొలగించకూడదు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తగా రాజకీయ వ్యక్తీకర ణను ప్రతిష్ఠించడానికి నేను అమెరికన్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాను. విభేదించే అభిప్రాయాలను కలిగివుండే కార్మికులను వివక్ష నుంచి కాపాడటానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న పౌర హక్కులను అమలు చేస్తాను. మత పరమైన వివక్షపై ఉన్న ఫెడరల్ ప్రభుత్వ నిషేధం ఉద్యోగులను ఏ మతానికీ లోబడనీయకుండా యజమానులను కట్టడి చేస్తోంది. కార్పొరేట్ అమెరికాలో వ్యాపించివున్న మేలుకొలుపు వాదానికి ఇది సరిగ్గా సరిపోయేట్టుగా ఉంది. పరస్పరం పంచుకునే సూత్రాల చుట్టూ మన జాతీయ అస్తి త్వాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత, అమెరికాకు అతి పెద్ద విదేశీ ప్రమాదంగా ఉన్న కమ్యూనిస్టు చైనా వికాసాన్ని ఓడించడానికి అవసరమైన దృఢత్వాన్ని సమకూర్చుకోగలం. 1980లలో సోవియట్ యూనియన్ లాగా కాకుండా, చైనా నేడు ఆధునిక అమెరికన్ జీవన శైలికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది. అందుకే మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలి. చైనాను కనీసం తాకకుండా, అమెరికాను వణికిస్తున్న సరికొత్త వాతావరణ మతం చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకించడం ద్వారా మనం ప్రపంచ ఇంధన నాయకత్వాన్ని తిరిగి పొందాలి. తైవాన్ను ఏ విధంగానైనా సరే కాపాడుతూనే సెమీ కండ క్టర్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలి. 16 సంవత్సరాల లోపు పిల్లలు టిక్ టాక్ ఉపయోగించకుండా నిషేధం విధించాలి. కోవిడ్–19ను వ్యాప్తి చెందించడంపై చైనాను జవాబుదారీని చేయ డానికి మనం ఆర్థిక తులాదండాన్ని తప్పకుండా ఉపయోగించాలి. చౌర్యం, వ్యాపారమయ ఎత్తుగడలను చైనా ప్రభుత్వం నిలిపి వేసేంతవరకు అవసరమైతే చైనాలోకి అమెరికన్ కంపెనీలు విస్తరించడాన్ని నిషేధించడానికి కూడా మనం సిద్ధపడాలి. మనం నిజంగా ఎవరం అని తిరిగి ఆవిష్కరించుకున్నట్లయితే మళ్లీ కాలానికి తగినట్టుగా మనం ఎదగగలం. అమెరికా బలం మన భిన్నత్వం కాదు, ఆ భిన్నత్వానికి అతీతంగా మనల్ని ఐక్యం చేస్తున్న ఆదర్శాలే మన బలం. ఈ ఆదర్శాలే అమెరికన్ విప్లవాన్ని గెలిపించాయి, అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని ఐక్యపరిచాయి, రెండు ప్రపంచ యుద్ధాలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలిపించాయి. ఈ ఆదర్శాలు ఇప్ప టికీ స్వేచ్ఛాయుత ప్రపంచం పట్ల ఆశను కలిగిస్తున్నాయి. వీటిని మనం పునరుద్ధరించినట్లయితే మనల్ని ఏ శక్తీ ఓడించలేదు. వివేక్ రామస్వామి వ్యాసకర్త అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడనున్నారు (‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సౌజన్యంతో) -
బైడెన్‌పై మాజీ ఫిజీషియన్ సంచలన వ్యాఖ్యలు.. ‘బైడెన్ ఇక కష్టమే..’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైట్‌హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. బైడెన్ అధ్యక్ష కాలాన్ని పూర్తి చేసుకోలేక మధ్యలోనే వైదొలుగుతారని జోస్యం చెప్పారు. బైడెన్ మైండ్ ఎక్కడికో వెళ్లిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోనీ. ఆయన పదవీ కాలన్ని పూర్తి చేసుకోలేరని అందరికీ తెలుసని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకూడదని, బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు అమెరికా మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఫిజీషియన్‌గా సేవలందించారు రోనీ. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే బైడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు చూసి బరాక్ ఒబామా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ మీడియా ఛానల్‌కు రోని వెల్లడించారు. శ్వేతసౌధంలో గొప్ప బాధ్యతలు నిర్వహించి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సబబు కాదన్నారని చెప్పారు. రోనీ ప్రస్తుతం టెక్సాస్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: ఎన్నో దేశాలను సాయం అడిగాం.. భారత్ మాత్రమే ఆదుకుంది -
జాక్‌పాట్!! అమెరికా ప్రెసిడెంట్‌గా ఎలన్ మస్క్?
ప్రపంచ దేశాలు ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించే చర్చించుకుంటున్నాయి. యూరప్ దేశాల్ని రూల్ చేయాలనే కాంక్షతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ గెలవాని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆ ఎన్నికల్లో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ను అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుందామానే పోల్ నడుస్తోంది. @elonmusk Run for President 2024 The entire World need you !! — J. Sibrian (@JlSibrian) March 6, 2022 ఉక్రెయిన్-రష్యా దేశాల సంక్షోభం సమయంలో ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించి పోవడంతో ఆదేశ ప్రజల్ని ఆదుకునేందుకు ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. యుద్ధంతో ధ్వంసమైన ఉక్రెయిన్ కు చెందిన నగరాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తామని హామీ ఇచ్చారు. Still feel like @elonmusk should run for President. — Presley Johnson (@Presley39873110) March 6, 2022 ఈ యుద్ధం ఓ రకంగా ఎలన్ మస్క్‌కు లాభాల్ని తెచ్చిపెట్టేదనే చెప్పుకోవాలి. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ఇతర దేశాలతో పాటు అమెరికాలో చమరు,గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు అనుగుణంగా ఎలన్ మస్క్ బిజినెస్ చేసి ఉంటే భారీ ఎత్తున లాభాల్ని గడించే వారు. కానీ ఎలన్ మాత్రం లాభపేక్షకు పోకుండా అమెరికా తక్షణమే చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ ట్వీట్ చేశారు. దీంతో పాటు తదితర అంశాలు ఎలన్ మస్క్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిని చేద్దామనే స్థాయిలో ట్విట్టర్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. చదవండి: 'బాబూ పుతిన్..మనదగ్గర బేరాల్లేవమ్మా' -
సొంత ప్రాంతం వీడుతూ జో బైడెన్ భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ బుధవారం వాషింగ్టన్ బయల్దేరారు. అమెరికాలోని డెలావర్ నుంచి వాషింగ్టన్కు పయనమయ్యారు. అంతకుముందు డెలావర్‌లోని విల్మింగ్టన్లో ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సభలో జో బైడెన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి అధ్యక్షుడిని చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు. కరోనాతో మరణించిన వారికి మంగళవారం రాత్రి బైడెన్ దంపతులతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ దంపతులు నివాళులర్పించారు. 4 లక్షల మంది అమెరికా పౌరులను కరోనా వలన కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బైడెన్ ప్రమాణానికి వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనం ముస్తాబైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. -
పట్టు వీడిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తాను పట్టిన పట్టు వీడారు. అధ్యక్ష ఎన్నికల్లో తనపై నెగ్గిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించడానికి అంగీకరించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికార మార్పిడి ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన వైట్ హౌస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికార బదలాయింపులో అత్యంత కీలకంగా వ్యవహరించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి బైడెన్ బృందంతో కలిసి పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ముర్ఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశం పట్ల ఆమెకున్న అంకిత భావం, విశ్వాసానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ ఎన్నికల ఫలితాల అంశంలో తన పోరాటం కొనసాగుతుందన్నారు. ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించడాన్ని బైడెన్ బృందం స్వాగతించింది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికైనట్టు జీఎస్ఏ గుర్తించి, ప్రభుత్వ వనరుల్ని వినియోగించుకోవడానికి అనుమతినివ్వడం అధికార మార్పిడికి ముందడుగు అని బైడెన్ బృందం పేర్కొంది. విమర్శలు ఆపేద్దాం : బైడెన్ దేశంలో ఎన్నికలు ముగిశాయని.. విభేదాలను, ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడాన్ని ఆపేయాల్సిన సమయం వచ్చిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అన్నారు. అధికార బదిలీ ప్రక్రియను ట్రంప్ ప్రారంభించిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ ఏకం కావాల్సిన సమయం ఇదేనని అన్నారు. విభజించేందుకుగాక, ఏకం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడిగా తనను తాను వర్ణించుకున్నారు. తాను రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని చూడనని చెప్పారు. అందరి విశ్వాసాన్ని పొందుతూ పని చేస్తానని చెప్పారు. -
ట్రంప్ చర్యలతో మరింత ప్రాణనష్టం: బైడెన్
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సరైన సహకారం అందకపోతే చాలా మంది అమెరికన్లు చనిపోయే అవకాశముందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తిరస్కరించిన విషయం తెలిసిందే. కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని యుఎస్ కాంగ్రెస్‌ను జో బైడెన్ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు ,కార్మిక నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ‘మనము డార్క్ వింటర్‌లోకి వెళ్తున్నాము. కొన్ని విషయాలు సులభతరం అయ్యే ముందు కఠినంగానే ఉంటాయి’ అని బైడెన్ అన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగ నష్టాలను చవిచూసిన ఆర్థిక వ్యవస్థను జో బైడన్ రాబోయే కాలంలో వాటి భారాన్నిమోయనున్నారు.ఇప్పటికే అమెరికాలో 2,46,000 మందికి పైగా మరణించారు. రోజువారీగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 20 న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని వీడడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్లు వేస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటన తరువాత,‘మరొక టీకా ఇప్పుడే ప్రకటించారు. ఈసారి మోడెర్నా95% ప్రభావవంతంగా పనిచేస్తుంది. చరిత్రకారులారా గుర్తుంచుకోండి.. చైనా మహమ్మారిని అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా పాలనలోనే బయటకు వచ్చాయి. ’ అని ట్రంప్ అన్నారు. -
వైరల్ ట్వీట్.. తప్పులో కాలేసిన ట్రంప్ కుమారుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ప్రస్తుత అధ్యకుడు డొనాల్ట్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్సెసోటాలోని ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎరిక్ మంగళవారం ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎరిక్ చేసిన తాజా ట్వీట్ అతన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు ఎరిక్ ఓటు వేయాలని కోరడం ఏంటని కొంతమంది నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల రోజు కూడా ఎరిక్ ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ట్వీట్ శారు. ఒకవేళ సాంకేతిక లోపం కారణంగా ఆ ట్వీట్ ఇప్పడు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ఏదేమైనప్పటికీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి తమ అకౌంట్లలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా But of course Eric Trump scheduled an Election Day tweet for the wrong week... pic.twitter.com/a4tL0UYRm8 — Rex Chapman🏇🏼 (@RexChapman) November 10, 2020 Proof Eric Trump is Internet Explorer (yes this is real) pic.twitter.com/YiJaPl6aeN — Bizarre Lazar 🏴☠️ (@BizarreLazar) November 11, 2020 You are a 🤡 do you know what day it is? — Antonio Gianola (@antoniogianola) November 10, 2020 Now I am not an expert, but I think @EricTrump just told Minnesota to commit voter fraud. pic.twitter.com/5AOOxew1xn — Kyle (@wylekolfe) November 11, 2020 -
దైవమిచ్చిన భార్య
ప్రథమ మహిళలు ప్రత్యేకమైనవారు. జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ మరీ మరీ ప్రత్యేకమైనవారు. వ్యక్తిగా తనకు తాను ప్రత్యేకం. భార్యగా జో బైడెన్‌కు ప్రత్యేకం. కొత్త హోదాలో కూడా టీచర్‌గానే ఆమెఎప్పటిలా రోజూ కాలేజ్‌కి వెళ్లనున్నారు! జో బైడెన్‌కు ఆమె ప్రత్యేకం దేనికంటే.. తల్లిలేని తన పిల్లల కోసం, తన కోసం.. దైవం పంపిన భార్య.. జిల్ బైడెన్! జిల్ బైడెన్ అమెరికా కొత్త ప్రథమ మహిళ! 2009–2017 మధ్య ఆమె అమెరికా ‘ద్వితీయ మహిళ’. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆ సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉండటంతో బైడెన్ భార్య అయిన జిల్ బైడెన్ ద్వితీయ మహిళ అయ్యారు. ఈ ప్రథమ, ద్వితీయాలను పక్కన ఉంచితే, ఆమెకై ఆమెగా జిల్ ట్రేసీ జాకబ్స్ బైడెన్ (జిల్ పూర్తి పేరు)కు అనేక గుర్తింపులు ఉన్నాయి. ‘జాకబ్స్’ అనేది ఆమెకు తండ్రి నుంచి సంక్రమించిన పేరు. పెళ్లయ్యాక జాకబ్స్ పక్కన ‘బైడెన్ ’ వచ్చి చేరింది. జిల్ బైడెన్ జో బైడెన్ రెండో భార్య. జో బైడెన్ జిల్ బైడెన్‌కు రెండో భర్త. వాళ్లిద్దరి ఏకైక సంతానం.. కూతురు యాష్లీ. జిల్కి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌కీ ఏ మాత్రం సంబంధం లేని రెండు సంబంధాలు ఉన్నాయి! జిల్ బైడెన్ తండ్రి పేరు డొనాల్డ్ కార్ల్ జాకబ్స్. ఆ పేరులో డొనాల్డ్ అని ఉండటం ఒకటి. డొనాల్డ్ ట్రంప్‌కు గత ఎన్నికల విజయంలో, ఈ ఎన్నికల అపజయం లో కీలకంగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలోనే జిల్ బైడెన్ చిన్నతనం అంతా గడవడం ఇంకొకటి. జిల్ పుట్టింది మాత్రం న్యూజెర్సీలోని హ్యామన్టన్లో. ఇంట్లో అంతా ఆడపిల్లలే. ఐదుగురు సంతానంలో పెద్దమ్మాయి జిల్ ట్రేసీ. తండ్రి బ్యాంకర్. తల్లి బోనీ గృహిణి. ‘మమ్మీ మనకోసం పంపింది’ 69 ఏళ్ల జిల్ బైడెన్ స్కూల్ చదువు 1969 లో పూర్తయింది. తర్వాత కాలేజీ, మోడలింగ్, ఆ సమయంలోనే మొదటి భర్తతో పరిచయం, ప్రేమ, పెళ్లి, ఐదేళ్లకు విడాకులు, ఆ తర్వాత రెండేళ్లకు 1977లో జో బైడెన్‌తో వివాహం. మొదటి భర్తతో పెళ్లయ్యే నాటికి జిల్ ట్రేసీకి పందొమ్మిదేళ్లు. వాళ్లిద్దరికీ పిల్లల్లేరు. జో బైడెన్ సోదరుడు ఫ్రాంక్ ద్వారా జోకి, జిల్కి పరిచయం. జోకి, జిల్కి పెళ్లయ్యేనాటికే జో రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ప్రభుత్వ టీచర్. తొలి చూపుల ప్రేమ తర్వాత ఇద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ‘ఎ మ్యాన్ అండ్ ఎ ఉమన్’. సినిమా అయ్యాక ఆమెను ఇంట్లో దింపుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ‘గుడ్ నైట్’ చెప్పారు జో. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆమె పెద్దగా అరిచి తల్లితో చెప్పిన మాట ‘మామ్.. ఐ ఫైనల్లీ మెట్ ఎ జంటిల్మన్’.. అని. ‘జంటిల్మన్’ అని చెప్పనైతే తల్లికి చెప్పిందే కానీ, జో ఐదుసార్లు ప్రపోజ్ చేశాక గానీ పెళ్లికి జిల్ ట్రేసీ ఓకే చెప్పలేదు. జో మొదటి భార్య, కూతురు అప్పటికి ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జో బైడెన్‌కి చనిపోయిన ఆ కూతురుతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వాళ్లిద్దరికీ జిల్ ట్రేసీనే తల్లయింది. ‘‘మమ్మీ మన కోసం జిల్‌ని పంపింది’’అని పిల్లలతో చెప్పేవారు జో బైడెన్. తర్వాత ఈ దంపతులకు యాష్లీ పుట్టింది. భర్తని, పిల్లల్ని చూసుకుంటూనే సైకియాట్రి ఆసుపత్రిలో పని చేస్తూ.. రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశారు జిల్ బైడెన్. ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ చేశారు. బోధన ఆమెకు ఇష్టమైన వృత్తి. చిన్న పిల్లల కోసం ఆమె ‘డోంట్ ఫర్గెట్, గాడ్ బ్లెస్ అవర్ ట్రూప్స్’ అని ఒక పుస్తకం రాశారు. మిలటరీలో పని చేస్తూ, బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోయిన జో పెద్ద కుమారుడు బ్యూ బైడెన్ కుమార్తె నటాలీ (మనవరాలు) కోణంలో జిల్ ఈ పుస్తకం రాశారు. ఆమె రాసిన రెండో పుస్తకం ‘జోయీ : ది స్టోరీ ఆఫ్ జో బైడెన్’. తన భర్త చిన్ననాటి ఫొటోల పిక్చర్ బుక్ అది. జోయీ అంటే పిల్లాడు అని. అంత ప్రేమ ఆమెకు భర్త అంటే. పవర్ గర్ల్.. జిల్ ట్రేసీ న్యూజెర్సీ నుంచి టీనేజ్‌లో ఫిలడెల్ఫియా రాగానే జిల్ ట్రేసీ ‘ఫిల్లీ గర్ల్’ అయింది. ఫిల్లీ గర్ల్ అంటే.. ఫిలడెల్ఫియా పవర్ గర్ల్ అని. పదహారేళ్ల వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్ టీమ్‌లోని కళ్లన్నీ జిల్ ట్రేసీ మీద పడ్డాయి. అబ్బాయిల ప్లేబాయ్ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని మృదువైన నిరాకరణ నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ట్రేసీలోని ఆకర్షణ. కటువుగా ఉండేది ఆమె. ఆ కటుత్వాన్ని అబ్బాయిలు ఇష్టడ్డారు. ‘టఫ్ కుకీ ఫిల్లీ గర్ల్’ అని పేరు కూడా పెట్టేశారు. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్‌గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్ యాసలో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్‌కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టేవారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది. పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. డిగ్రీ అవగానే పెళ్లి చేసుకుంది. బిల్ స్టీవెన్సన్ అతడి పేరు. ఫుట్‌బాల్ ప్లేయర్. ఫిలడెల్ఫియా స్పోర్ట్ టీమ్‌లో ఆమె మనసును గెలిచినవాడు. మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! అతడితో విడిపోయాక.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో జో బైడెన్, జిల్ ట్రేసీల పెళ్లి జరిగింది. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్‌కు 34 ఏళ్లు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. చిన్న కొడుకు హంటర్ బైడెన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్. కూతురు ఆష్లీ సోషల్ వర్కర్. ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్ కౌంటీ కౌన్సిల్ సభ్యుడు. ఈ నలభై మూడేళ్ల కెరీర్ లో మొన్నటి వరకు అతడి అత్యున్నత స్థాయి.. అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయ్యారు! జిల్ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లోనే ఉండిపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్‌రోబ్‌లో పడేసి, రోజూ కాలేజ్‌కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది. ప్రస్తుతం ఆమె నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్. బైడెన్ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా తృణీకరించిన విధంగానే వైట్ హౌస్ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్ ప్రొఫెసర్ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడింది. విన్నింగ్ మేట్ జో బైడెన్ తన డెమోక్రాటిక్ పార్టీ వైస్–ప్రెసిడెంటుగా (రన్నింగ్ మేట్) భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ని ప్రకటించినప్పుడే ఆమె గెలుపు ఖాయమైంది! శనివారం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ మరొకసారి చరిత్రను సృష్టించబోతారని ఇప్పటినుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. తండ్రి జమైకన్ అయినందు వల్ల అమెరికాలోని ఆఫ్రికన్ సంతతి వారి ఓట్లు రెండో మాట లేకుండా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కూడా కమలకే పడతాయని విశ్లేషకుల అంచనా. బాధితులైన స్త్రీలు, పిల్లల తరఫున కేసులు వాదించే న్యాయవాదిగా కూడా కమలకు అమెరికా అంతటా మంచి గుర్తింపు ఉంది. విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకురాలు అని కూడా. ఇవి చాలు అమెరికా తన అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను ఎన్నుకునేందుకు. -
అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు!
వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయినా ఆ విషయాన్ని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నిరాకరిస్తున్నారు. కొత్తగా పగ్గాలు చేపట్టాల్సిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. అటార్నీ జనరల్ విలియం బార్ ఓటింగ్ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ ఒకవైపు పెంటగన్ అధ్యక్షుడిని తప్పించారు. కరోనా కట్టడి కోసం బైడెన్ ఏర్పాటు చేయదలచుకున్న నిపుణుల బృందానికి ప్రభుత్వ విభాగాల ద్వారా ట్రంప్ నో చెప్పించారు. ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలని పలువురు రిపబ్లికన్ సెనేటర్లు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తదితరులు ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం శూన్యం. రిపబ్లికన్ పార్టీ ముఖ్యులు కొందరు ట్రంప్‌వైపే నిలబడ్డారు. పార్టీలో తనకు మద్దతుగా నిలవని వారిని పదవుల నుంచి తప్పించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెంటగన్ చీఫ్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌ను పదవి నుంచి తొలగించగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్, సీఐఏ అధ్యక్షుడు గినా హాస్పల్, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీలను ఇంటిదారి పట్టించే అవకాశముందని తెలుస్తోంది. తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా ర్యాలీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను ముందుంచి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది ట్రంప్ ఆలోచన అని, తాను అజ్ఞాతంలో ఉండే అవకాశముందని సమాచారం. -
అమెరికా అడకత్తెరలో భారత్
‘‘నేను యునైటెడ్ స్టేట్స్ (అమెరికా సంయుక్త రాష్ట్రాల)కు అధ్యక్షున్ని. నాకు ఓటే సిన వారికోసమే కాదు, వేయనివారి కోసం కూడా పని చేస్తా. ప్రపంచానికే అమెరికా ఒక ఆదర్శంగా నిలవాలి. విద్వేషాన్ని విభజనను కోరుకోని. ఐక్యతను కాంక్షించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నా, రిపబ్లికన్ పార్టీ ఆధి క్యతలో ఉన్న రాష్ట్రాలను ‘రెడ్ స్టేట్స్’గానూ, డెమొక్రాటిక్ పార్టీ మెజారిటీలో ఉన్న రాష్ట్రా లను ‘బ్లూ స్టేట్స్’గానూ వివక్షతో విభజించి చూసే నేతగా కాకుండా యావత్తు అమెరికాను సమైక్య దేశంగా పరిగణించే యునైటెడ్ స్టేట్స్కు మాత్రమే అధ్యక్షునిగా ఉంటాను’’ – డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా దేశ అధ్యక్ష స్థానానికి ఎన్నికైన 77 ఏళ్ల మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటన (8–11–2020) ‘‘రవి అస్తమించని సామ్రాజ్యం’’గా భావించిన బ్రిటిష్ సామ్రాజ్య దురాక్రమణ శక్తి దేశదేశాల ప్రజానీకం, అణగారిన ప్రజల తిరుగు బాట్ల ముందు నేలకు ఒరిగిపోయినట్టే, తరువాత దాని స్థానంలో అవతరించిన నూతన సామ్రాజ్య శక్తి అమెరికా క్రమంగా ఆఖరి గడియలలో శ్వాసకోసం ఇబ్బంది పడుతున్న సమయంలో అధ్యక్షుడైన వాడు రిపబ్లికన్ల ‘పిలక తిరుగుడుపువ్వు’ డొనాల్డ్ ట్రంప్! అయితే ఇంతకూ రిపబ్లికన్లు, డెమొక్రాట్లలో ఎవరు అమెరికాకు గానీ, ప్రపంచ దేశాలకు ముఖ్యంగా వర్తమాన దేశాలకు గానీ ఎక్కువ ప్రయోజనాన్ని, మంచిని.. యుద్ధాలు, దురాక్రమణ యుద్ధాలు లేని మహోన్నత సమాజాన్ని, శాంతిని ప్రసాదించగల వారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు! ఎందుకంటే మన అభిప్రాయం కాదు. అమెరికాలోని అసంఖ్యాక పేద, మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా దేశ జనాభాలో శ్వేత (తెల్ల) జాతీయుల సంఖ్యకు కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్న నల్లజాతులు, లాటినో ప్రజాబాహుళ్యం, వీరందరితో కూడిన కోట్లాది ఉద్యోగ, కార్మిక వర్గ ప్రజల దృష్టిలో రిపబ్లికన్లకు, డెమొక్రాట్స్‌కు ఆ పార్టీలకు మధ్య ఆచరణలో చెప్పుకోదగినంత గణ నీయమైన తేడా లేదు. అందుకనే వారు ఈ రెండు పార్టీలను ధనికవర్గ రాజకీయ పక్షాలుగానే ‘దొందు దొందు’గానే పరిగణించి రెంటికీ కలిసి ఒకే బిరుదు’ను ‘డెమో–పబ్లికన్స్’(డెమొక్రాట్స్ రిపబ్లికన్స్) అని ప్రసా దించారు! పైగా రిపబ్లికన్స్ అనగానే బానిసల విమోచన ప్రదాత అబ్రహం లింకన్ నాయకత్వం వహించిన నాటి రిపబ్లికన్స్ పార్టీ అని భ్రమించే ప్రమాదం ఉంది. లింకన్ నాటి అమెరికా దశాగతి దిశాగతి 360 డిగ్రీలు దాటిపోయి ఆ తరువాత రంగంలోకి పేరుకు ఉనికిలోనికి వచ్చిన డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య తేడాపాడాలు క్రమంగా మసకబారిపోయి పోయాయి. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా వలస లుగా ఉన్న ప్రపంచదేశాలకు, ఆ తరువాత అశేష త్యాగాల ద్వారా అవ తరించిన వర్ధమాన దేశాలకు, వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పెను ప్రమాదకర పాలనా శక్తులుగా ఆ రెండు పార్టీలలో ఎవరు అధికా రంలో ఉన్నా తయారయ్యాయి. లేటుగా మేల్కొన్న అమెరికన్లు ఈ దశ ఐసన్‌హోవర్, రేగన్, కెన్నడీ, నిక్సన్, ఒబామా, క్లింటన్, హిల్లరీ క్లింటన్, జార్జిబుష్ (సీనియర్), జూనియర్ బుష్, నిన్నటి ఉన్మాది డొనాల్డ్ ట్రంప్ దాకా కూడా తప్పలేదు! పైగా ట్రంప్ కుటుంబ పెద్దలలోని జ్ఞాతి సోదరి మేరియల్ ట్రంప్ ‘మా వాడు ట్రంప్, కుటుంబానికే కాదు, మొత్తం ప్రపంచానికే ప్రమాదకారి’ అని హెచ్చరించిన తరువాత గానీ, తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి దాకా ప్రజలు గుర్తించలేదు. ఇండియా లాంటి దేశాల పాలకులు గాఢ నిద్రలోనే ఉన్నారు! ‘కుక్కతోక పుచ్చుకుని గోదావరి ఈదుకు’ వచ్చే ప్రయత్నమంటే ఇదే మరి! అమెరికా ప్రతినిధుల సభకు ఎంపిక కావ లసిన అభ్యర్థులను ప్రత్యక్షంగా ఎన్నుకొనడానికి వీలులేని, ప్రచ్ఛన్న ఎన్నికల వ్యవస్థను అక్కడి పాలకులు అప్పనంగా సాకుతున్నారు. దీనికితోడు వివిధ ఖండాలలోని స్వతంత్ర, అస్వతంత్ర పేద, వర్ధ మాన దేశాలను ఆర్థికంగా, కొత్త వలసలుగా వాటి అపారమైన వన రులను దోచుకోవడానికి అనువైన సైనిక–పారిశ్రామిక జమిలి వ్యవస్థను ‘పెంటగన్’ మిలటరీ వ్యూహ రచనా కేంద్రం ద్వారా ఎలాంటి తేడా లేకుండా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్స్ పార్టీ పాలకులు సాకుతూ వస్తున్నారని మరచిపోరాదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండ దేశాలు తమ అపారమైన సహజ వనరులను పూర్తిగా అనుభవించనివ్వకుండా ఆర్థిక సహాయం ముసుగులో జోక్యందారీ విధానాన్ని అమెరికన్ ‘డెమోపబ్లికన్లు’ యథేచ్ఛగా ఈ క్షణందాకా అమలు జరుపుతూనే ఉన్నారు. విదేశీ సైనిక సాయానికి ఇంతగా అర్రులు చాచాలా? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా పతనమవుతున్న అమెరికా సామ్రాజ్య దురాక్రమణ వ్యవ స్థను కాపాడటానికి డెమోపబ్లికన్స్ పాలకులే కాదు, తమ దేశాల జాతీయోద్యమాలలో అసంఖ్యాక ప్రజల అకుంఠిత త్యాగాలను వమ్ముచేస్తూ వారు పెట్టిన స్వాతంత్య్ర భిక్షమీద బతుకుతూ పాలకులైన వర్ధమాన దేశాలలోని కొందరు రాజకీయ నాయకులు కూడా అమెరికన్ మిలటరీ పారిశ్రామిక వ్యవస్థ బతక డానికి కారకులవుతున్నారు. దీనికితోడు అనేక ప్రజా త్యాగాల ద్వారా సాధించుకున్న స్వాతంత్య్రానంతరం రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక, విద్యా, పరిశోధనా కేంద్రాలను తామరతంపరగా వర్ధిల్లజేసుకుని సొంతకాళ్లపై నిలబడాలన్న తాపత్రయంగానీ, అందుకోసం ప్రణాళి కాబద్ధమైన పకడ్బందీ వ్యూహ రచనగానీ మన ఇటీవలి పాలకులకు లేకపోవడం దేశ దౌర్భాగ్య దశగా చెప్పక తప్పదు. ఈ ముందుచూపు మన దేశ అనంతర రాజకీయ పాలకులకు కొరవడినందుననే 74 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా విదేశీ సైనిక సహాయాల కోసం దేశం అర్రులు చాచవలసి వస్తోంది. తొలితరం శాస్త్రవేత్తలలో సర్ సీవీ రామన్, జగదీశ్ చంద్రబోస్ లాంటి హేమాహేమీలు నూతన ఆవిష్కరణ కోసం అదనపు పరిజ్ఞానం కోసం విదేశాలకు వెళ్లినా, అధ్యయనం పూర్తి కాగానే తిరిగి స్వదేశానికి వచ్చి తమ శాస్త్ర పరిశోధనలు ఇక్కడా కొనసాగించి దేశాభ్యుదయానికి దోహదం చేశారు. విదేశీ విద్యార్థుల పోటీపై ‘వెన్నుపోటు’ కానీ దేశీయంగా ఆ అనంతర పరిజ్ఞానాన్ని యువతరానికి అందిం చడానికి మనస్కరించని దేశీయ పాలకుల విధానాలవల్ల విదే శాలకు జ్ఞానార్థులైన యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు పొట్ట చేతపట్టు కుని ఆధునిక పరిశోధనలకు, పరిజ్ఞానాన్ని నూతన కోణాలలో కాపాడు కునేందుకు పరుగులుపెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు. వార క్కడ ఇమడలేని స్థితి, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో ఇమడ లేని స్థితి, వీసాలపై ఆంక్షల బెడదవల్ల, అక్కడి స్థానికంగా పెరిగి పోతున్న నిరుద్యోగులకు మన విద్యార్థుల పోటీని తమ ఉపాధికి ‘వెన్ను పోటు’గా భావించి దుర్భరమైన ఆంక్షలకు గురి కావాల్సి వస్తోంది. మన పిల్లల్ని అక్కడ స్థిరపడిన భారతీయ కుటుంబాల ఉనికికి ఎంత లేదనుకున్నా, ఆందోళనతో మానసిక స్థిమితం లేకుండా పోతోంది. ఇందుకు వర్ధమాన దేశాలు అమెరికా, బ్రిటన్ దేశాలపట్ల నిరసన తెలుపకూడదు. నిరసనలను, మూతి విరుపులను, ఆందోళనోద్యమా లను అణచివేయడానికే ఇండియా లాంటి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల చుట్టూ దాదాపు 90 దేశాలలో లేదా వాటి తీరాలలో అమెరికా సైనిక స్థావరాలను పహారాలో ఉంచిందని మరిచి పోరాదు! ఎవరు పీఠమెక్కినా మన పాలకులు పావు చెక్కలే! ఆ మాటకొస్తే ముదిమి దశలో అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ సైతం అమెరికా గతంలో భారత పాలకులతో కుదుర్చుకున్న అసమ అణ్వస్త్ర సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపిన డెమొక్రాట్ అని మరచి పోరాదు! బహుశా, అందుకే దౌత్య వ్యవహారాలపై ప్రసిద్ధ వ్యాఖ్యత సుహాసినీ హైదర్.. ‘ట్రంప్ ఇండో–పసిఫిక్ ప్రాంత రక్షణ (అదే ‘భక్షణం) విధాన రూపకర్త అయితే, దానికి పునాది వేసినది ఒబామా– బైడెన్ల జంటేననీ, 2015లో ఇండియా పర్యటన సందర్భంలో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు ఇండియాతో సమష్టి వ్యూహం పన్నాలని ఇందుకు ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై కేంద్రీకరిం చాలని ప్రతిపాదించారు. ఇందుకుగానూ బైడెన్ ఇండియాతో సైనిక వ్యూహానికి తగిన పునాదిగా మౌలిక ఒప్పందాలను సిద్ధం చేయాలని, సైనిక సహకారాన్ని అందించాలని, అమెరికా సైనిక సంబంధమైన అధునాతన యంత్రాల అమ్మకాల్ని ప్రోత్సహించాలని ఒబామా– బైడెన్ గత ప్రభుత్వం ప్రతిపాదించనే ప్రతిపాదించింది’ (7–11–20). ఇందుకుగానూ భారత ఐ.టి నిపుణుల అవసరాన్ని గుర్తించిన బైడెన్ ప్రస్తుతం ఇండియన్ అమెరికన్ సంతతి మహిళ కమలాహ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవిలోకి తీసుకురావడంలో మతలబు ఇది! ‘తలలు బోడు లైన తలపులు బోడులా’ అన్న వేమన మాటకు తిరుగుంటుందా ఏమన్నా?! అమెరికాలో ఎవరు పీఠం ఎక్కినా అడకత్తెరలో మన పాల కులు ‘పావు చెక్కలే’ అవుతారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుపొంది జోబిడెన్ అధ్యక్ష పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తం కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇదిలా వుండగా ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురయ్యింది. ఈసారి ట్విటర్ వేదికగా ట్రంప్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఓటమిని అంగీకరించాలని ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ సన్నిహితులు కూడా ఇంకా అంతా అయిపోయిందని ఓటమిని అంగీకరించాలని ట్రంప్‌కు హితవు పలుకుతున్నాయి. ఇక ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ గౌరవప్రదంగా వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్దాం అని ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయాన్ని ఆమె బహిరంగంగా వెలిబుచ్చలేదు. అయితే ట్రంప్ కుమారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తగ్గటానికి వీలు లేదని మొండిపట్టు మీద ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..! -
'ట్రంప్ ఓటమి: జోతిష్యుడు పేరు చెప్పనందుకు సంతోషం'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికపై గతంలో ఎప్పుడు లేని ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు శనివారం రాత్రి ఆ ఉత్కంఠకు తెరపడింది. డొమొక్రాట్ అభ్యర్థి జో బైడన్ 284 ఎలక్టోరల్ ఓట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నాడు. బైడెన్ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : వైరల్ : ట్రంప్‌దే విజయం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్) ఈ కోవలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే ట్రంప్ గెలుపు ఖాయమని ఒక జోతిష్యుడు చెప్పిన మాటలను మరోసారి ట్వీట్ చేశాడు. 'ఆ జోతిష్యుని పేరు బయటపెట్టనందుకు సంతోషంగా ఉంది. కానీ అతని ఉద్యోగానికి మాత్రం ప్రమాదం ఉండే అవకాశం ఉంది!' అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ మరోసారి వైరల్‌గా మారింది.(చదవండి : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్) కాగా ఫలితాలు రాకముందు అమెరికా అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకున్నారు. అందులో ఒక జోతిష్యుడు కూడా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమని చెప్పాడు. అంతేగాక ట్రంప్ గెలుపును సూచిస్తూ ఏవేవో లెక్కలు వేసి దానిపై ట్రంప్ పేరును రాసి ఒక చార్ట్‌ను రూపొందించాడు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ట్రంప్ గెలవడం ఖాయం అంటూ కుండబద్దలు కొట్టాడు ఆ జోతిష్యుడు. అయితే తాజాగా ట్రంప్ ఓటమితో జోతిష్యుడు పరిస్థితి ఏంటోనని నెటిజన్లు నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు. I’m glad I concealed his name. His job may now be at stake... ! https://t.co/NabWNsjpDr — anand mahindra (@anandmahindra) November 7, 2020 -
వివక్షతను తిరస్కరించిన అమెరికన్స్
సాక్షి, గుంటూరు : ‘ కొందరి వాడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికన్ ప్రజలు తిరస్కరించి అందరివాడైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షునిగా ఎన్నుకోవడం హర్షణీయం.జో బైడెన్ రాకతో హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు రద్దు అవుతాయి. ఒక కోటి 10 లక్షల మంది వలస వేతన జీవులకు అమెరికా పౌరసత్వం లభించే ఆస్కారం కలుగుతుంది. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం, తొలిసారిగా మహిళ ఉపాధ్యక్ష పదవి చేపట్టడం హర్షణీయం. ట్రంప్ అమెరికా సమాజాన్ని విడదీయగా జో బైడెన్ అందరినీ కలుపుకుని ఐక్యతా రాగాన్ని వినిపిస్తారు’ అని జన చైతన్య వేదిక చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ‘ట్రంప్‌ను ఓడించాలనే బలమైన కోర్కెతో అత్యధిక శాతం ఓటింగ్ జరిగింది. నల్ల జాతీయులు, మైనార్టీలు, ఆఫ్రికన్స్ ...ట్రంప్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అందరి అధ్యక్షునిగా జో బైడెన్ వివక్షతకు స్వస్తి పలుకుతారు. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయి. ప్రపంచ దేశాలందరికీ ఆవాసం కల్పిస్తున్న అమెరికా ఆ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అమెరికన్ ప్రజలను విభజించడం, వివక్షత చూపించడం, చిలిపి చేష్టలు, కరోనాను ఎదుర్కొన లేకపోవడం తదితర కారణాలతో ట్రంప్ ఓటమి చవి చూశారు. బైడెన్ నేతృత్వంలో అమెరికాలో వివక్షత తొలగిపోతుందని, భారత్‌తో సత్ సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాను.’ అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బైడెన్ కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారీటికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కాగా నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.(చదవండి : ట్రంప్ నుంచి చేజారిపోతున్న పెన్సిల్వేనియా) -
వైరల్:కెప్టెన్ అమెరికాగా బైడెన్, థానోస్‌గా ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు 2020 జరిగి ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జో బైడన్ గెలవడం లాంఛనమే అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ఎడిటర్ జాన్ హ్యాండెం పియెట్ ఒక వీడియోను ఎడిట్ చేసి రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘ఎవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాలోని పాత్రలను ఎడిట్ చేశారు. ఇందులో బిడెన్‌ను కెప్టెన్ అమెరికాగా, డొనాల్డ్ ట్రంప్‌ను థానోస్‌గా చూపించారు. ఈ వీడియోలో బిడెన్ ట్రంప్‌కు ఎదురుగా నిలుచున్నట్లు కనిపిస్తాడు. 2019 ఈ చిత్రం క్లైమాక్స్ యుద్ధంలో, కెప్టెన్ అమెరికా చూస్తుండగా ఆయనకు మద్దతుగా కొంత మంది వస్తారు. దీనిలో కూడా బైడెన్ చూస్తుండగా ఆయనకు మద్దతుగా కమలా హారిస్, బరాక్ ఒబామా వంటి వారు ఆయనకు సాయాన్ని అందించడానికి వస్తారు. వారు ఉన్న చోట జార్జియా అని రాసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో జార్జియా రాష్ట్రం ఎంత కీలకమో తెలిసేలా దానిని క్రియేట్ చేశారు. బైడెన్ నడుస్తుండగా ఆయన వెంట కమలా హారిస్ ఎగురుకుంటూ వస్తుంది. ఆమె తరువాత సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ , కోరి బుకర్, బెటో ఓ రూర్కే, పీట్ బుట్టిగెగ్లు కలిసి వస్తారు. అంతేకాకుండా ఈ వీడియోలో స్క్వాడ్ సభ్యులు అయన్నా ప్రెస్లీ, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, రషీదా తలైబ్, ఇల్హాన్ ఒమర్ ఉన్నారు. హిల్లరీ క్లింటన్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా పాపప్‌లో కనిపిస్తారు. ప్రతి ఓటు కీలకమే అంటూ కొంతమంది సైన్యం వెనకలా నినాదాలు చేస్తూ ఉంటుంది. మొత్తానికి పోటీపోటీగా జరిగిన అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సూపర్‌గా ఉందంటూ ఈ వీడియో చూసిన కొందరు కామెంట్ చేస్తుంటే, ఈ వీడియో చేసిన వారికి మొక్కాలి అని మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్ చీఫ్‌కు కరోనా -
ట్రంప్‌కు షాకిచ్చిన న్యూస్ ఛానళ్లు
-
తలకిందులవుతున్న ట్రంప్ ఆశలు..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో డొమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మరింత ముందుకు దూసుకెళుతున్నట్లుగా అనిపిస్తుంది. జార్జియాలో ఇప్పటికే ఆధిక్యంలోకి వచ్చిన జో బైడెన్ తాజాగా కీలకమైన పెన్సిల్వేనియాలోనూ ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.దీంతో పెన్సిల్వేనియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులవుతున్నాయి. (చదవండి : జార్జియా, నెవెడాలో దూసుకుపోతున్న బైడెన్) ఇక డొనాల్డ్ ట్రంప్ చేతిలో కేవలం నార్త్ కరోలినా, అలస్కా రాష్ట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ కౌంటింగ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం జో బైడెన్‌కు 300 ఎలక్టోరల్ ఓట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే బైడన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538 కాగా.. మెజారిటీకి 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటికే అనధికారికంగా బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకునే అవకాశం ఉంది. -
అరిజోనాలో బైడెన్ ముందంజ
-
వైరల్ : ట్రంప్‌దే విజయం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రపంచ చరిత్రలో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ట్రంప్, జో బిడెన్ ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నారు. ఇద్దరిలో విజేత ఎవరన్నది చెప్పడం కొంచెం కష్టంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ 270కి ఇద్దరు దగ్గరగా ఉండడంతో ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఇలాంటి సందర్భంలో అమెరికా అధ్యక్ష ఎన్నికపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?) 'ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మాత్రం ఒక వ్యక్తి పాపులర్ అవుతారు. ట్రంప్ గెలుస్తాడని ఆ జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, చివరికి గెలిచేది ట్రంపే అని జోతిష్యుడు చెప్పాడు. అయితే ట్రంప్‌కు జో బిడెన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని అయినా ట్రంప్ గెలుస్తాడని ఆ జోతిష్యుడు ధీమా వ్యక్తం చేశాడు. అయితే నేను ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు పేరును చెప్పదలచుకోలేదు. కానీ ఆ జోతిష్యుడు గీసిన జోతిష్యం మాత్రం మీ ముందు ఉంచుతున్నా అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జ్యోతిష్యుడు ఎవరో కానీ ట్రంప్‌పై వేసిన జోతిష్యం నిజమవుతుందో లేదో చూడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. This astrologer’s forecast was doing the messaging circuit last week. (Have concealed the name & address for the sake of privacy) If President Trump retains office, this astrologer will be rather popular, to put it mildly. 😊 pic.twitter.com/m2H4jFRBQ3 — anand mahindra (@anandmahindra) November 4, 2020 -
యూఎస్ ఎన్నికలు- ఐటీ షేర్లు గెలాప్
యూఎస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 3 శాతం ఎగసింది. యూఎస్ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. లేదా డెమొక్రటిక్ బైడెన్ గెలిచినాగానీ దేశీ ఐటీ రంగానికి మేలే జరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్ విజయం సాధిస్తే హెచ్1బీ వీసాల నిబంధనల సడలింపు ద్వారా దేశీ ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదేవిధంగా ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ పదవి చేపడితే.. యూఎస్ డాలరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశీ ఐటీ కంపెనీలు అధిక శాతం ఆదాయాలను ఉత్తర అమెరికా నుంచి సాధించే విషయం విదితమే. దీంతో డాలరు బలపడితే ఐటీ రంగ మార్జిన్లు మెరుగుపడే వీలుంటుంది. వెరసి రెండు విధాలా దేశీ ఐటీ కంపెనీలకు ప్రయోజనమేనని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పలు బ్లూచిప్, మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్లు హుషారుగా కదులుతున్నాయి. కోఫోర్జ్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 2,222ను తాకగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 3.5 శాతం పెరిగి రూ. 3,039కు చేరింది. ఈ బాటలో ఇన్ఫోసిస్ 3.4 శాతం ఎగసి రూ. 1,099 వద్ద, విప్రో 3.1 శాతం బలపడి రూ. 346 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో టీసీఎస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2691కు చేరగా.. మైండ్‌ట్రీ 2.2 శాతం లాభంతో రూ. 1,346 వద్ద, టెక్ మహీంద్రా 2.1 శాతం వృద్ధితో రూ. 825 వద్ద కదులుతున్నాయి. ఇదేవిధంగా ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,383ను తాకగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.3 శాతం అధికంగా రూ. 825 వద్ద ట్రేడవుతోంది. -
అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గతంలో లాగా మరోసారి వివాదం తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 సంవత్సరంలో జార్జి డబ్లూ బుష్, అల్ గోరే మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య పునరావతం కావచ్చు. అమెరికా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్, బైడెన్ల మధ్య హోరాహోరీగా సాగుతోన్న ఎన్నికల పోరులో పోస్టల్ బ్యాలెట్ పత్రాలే ఈసారి విజేతను తేల్చనున్నాయి. బ్యాలెట్ పత్రాల వల్ల తాను ఓటమికి గురయిన పక్షంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. (చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!) ఆయన ఆది నుంచి పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ‘ఇది మన దేశానికి ఎంతో ప్రమాదకరం’, ‘ఓ ప్రళయం’ అని ఆయన అవకాశం దొరకినప్పుడల్లా పోస్టల్ బ్యాలెట్లపై విరుచుకు పడుతున్నారు. ‘2020 ఎన్నికలు చరిత్రలోనే గొప్ప రిగ్గింగ్‌గా నిలిచిపోతాయి’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్ ఒకటవ తేదీ నాటికి అమెరికాలో 24 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. వారిలో ఇప్పటికే 9.30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60 శాతం మంది డెమోక్రాట్ల మద్దతుదారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఇప్పటికే పలు సర్వేలు తెలియజేశాయి. అందుకే బ్యాలెట్ పత్రాలపై ట్రంప్ మండిపడుతున్నట్లున్నారు. ప్రతి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారంలో ఉన్న ట్రంప్ తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిలో ఎక్కువ బ్యాలెట్ పత్రాలను ట్రంప్ సవాల్ చేసే అవకాశం ఉంది. వివిధ సాంకేతిక కారణాల వలన 1.3 శాతం అంటే లక్షా పదివేల పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించే అవకాశం ఉంది. (చదవండి : అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్) 2000 సంవత్సరంలో జార్జిబుష్, అల్ గోరే మధ్య జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడాలో బుష్‌కు 537 ఓట్లు ఎక్కువ రావడంతో ఆ రాష్ట్రానికి చెందిన మొత్తం 25 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బుష్ పక్షాన వెళ్లిన విషయం తెల్సిందే. పోస్టల్ బ్యాలెట్ పత్రాల లోపాలను పట్టుకునేందుకు ట్రంప్ న్యాయవాదులు అప్పుడే రంగంలోకి దిగారు. బ్యాలెట్ ఓటు వేసే నాటికి అందులో పేర్కొన్న చిరునామాకు, ఉంటున్న చిరునామాకు ఏ మాత్రం తేడాలు ఉన్నా, జోసఫ్ బదులు జో అని, రిచర్డ్ బదులు రికీ అనే షార్ట్ నామధేయాలున్నా, సంతకాల్లో ఏ మాత్రం తేడాలున్నా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సవాల్ చేసే అవకాశం ఉంటుంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీకి డిసెంబర్ 8వ తేదీ నాటికి ఇంకా 538 మంది ఓటర్లను ఎన్నుకోవాల్సి ఉంది. వారంతా దేశాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబర్ 8వ తేదీన సమావేశం కానున్నారు. సాధారణంగా అమెరికా ప్రజలతోపాటు ప్రపంచ ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని పాపులర్ ఓటు ద్వారా ఎన్నిక కావాలని కోరుకుంటారు. అయితే అలా జరుగుతుందనే గ్యారంటీ లేదు. దీనికి సంబంధించి అమెరికా రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ టూ, సెక్షన్ వన్‌లో స్పష్టత లేదు. ఈ సారి ఎన్నికలపై వివాదం తలెత్తితే అమెరికా అధ్యక్షుడు సంప్రదాయబద్దంగా వచ్చే జనవరి 20వ తేదీన అమెరికా వాషింఘ్టన్ డీసీలోని కాపిటల్ భవన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ లోపల సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం లేదు. -
అమెరికా ఎన్నికలు 2020
-
కమలా హారిస్ పట్ల వారికి ఎందుకు కోపం?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పాకిస్థాన్–అమెరికన్లు, ట్రంప్ ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేయాలనుకుంటున్నారు. వలసవాదులకు, మైనారిటీలకు, మహిళలకు ట్రంప్ వ్యతిరేకం కనుక వారు బైడెన్‌కు ఓటు వేయాలనుకుంటున్నారు. అయితే అదే డెమోక్రట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న సెనేటర్ కమలా హారిస్‌కు ఓటు వేసే విషయంలో పాకిస్థాన్–అమెరికన్లు సంశయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కమలా హారిస్ ఆఫ్రికన్–అమెరికన్ అవడం ఒకటైతే, మరోటి ఆమె తల్లి భారతీయ మహిళ అవడం. భారత్ విషయంలో ముఖ్యంగా కశ్మీర్ అంశం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని కమలా హారిస్ సమర్థించే అవకాశం ఉందన్నది పాక్–అమెరికన్ల ఆందోళన. వాస్తవానికి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన జో బైడెన్, కశ్మీర్ విషయంలో 370 అధిరణాన్ని రద్దు చేయడాన్ని, పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఆయన పట్ల వ్యక్తం చేయని అభ్యంతరాలను పాక్–అమెరికన్లు ఎక్కువగా కమలా హారిస్ విషయంలో వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం కశ్మీర్ విషయంలో ఆమె నేరుగా జోక్యం చేసుకోవడమే. ‘ప్రపంచంలో కశ్మీరీలు ఎప్పటికీ ఒంటరి వారు కాదు, వారి సమస్యలను మేము ఎప్పటికప్పుడు తెలసుకుంటూనే ఉన్నాం’ కమలా హారిస్ వ్యాఖ్యానించడం పట్ల పాక్–అమెరికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని ఆమె సమర్థించాలిగానీ కశ్మీర్ స్వతంత్రాన్ని కాదన్నది వారి వాదన. (అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా కరోనా వాక్సిన్) -
నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్
వాషింగ్టన్: తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వాక్సిన్ అందిస్తానని డెమొక్రాటిక్ అభ్యర్ధి జోబైడెన్ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం డెలావర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కరోనాను ట్రంప్ కట్టడి చేయలేకపోయారని, అందుకే 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని విమర్శించారు. ట్రంప్ కారణంగా ఎకానమీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. ట్రంప్ చెప్పినట్లు అమెరికన్లు కరోనాతో జీవించడం నేర్చుకోలదని, మరణించడం నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కరోనాకు సురక్షితమైన వాక్సిన్ తయారు కాగానే, తాను ఎన్నికయిన తర్వాత అందరికీ ఉచితంగా అందిస్తానని వాగ్దానం చేశారు. అధ్యక్షుడు కాగానే కరోనా వాక్సిన్ను కావల్సినన్ని డోసులు కొనేలా ఆదేశాలిస్తానని, అప్పుడే దేశంలో ఇన్సూ్యరెన్స్ లేని వాళ్లకు కూడా వాక్సిన్ అందుతుందని చెప్పారు. కరోనా ఇప్పట్లో మాయమయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదన్నారు. ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ వద్ద సరైన ప్రణాళికే లేదని దుయ్యబట్టారు. అధ్యక్షుడిగా ఇంకా ట్రంప్ కొనసాగితే మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడని విమర్శించారు. అధ్యక్షుడయ్యాక జనవరి కల్లా చట్టసభల్లో కరోనా నివారణ, ఎకానమీ పునరుజ్జీవన సంబంధిత బిల్లులు తీసుకువస్తానని బైడెన్ చెప్పారు. ప్రతి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి అక్కడ ప్రజలు మాస్కు తప్పక ధరించేలా చూడమని కోరతానన్నారు. ఒక అధ్యక్షుడిగా అన్ని వేళల్లో మాస్కు ధరించడాన్ని తాను తప్పనిసరి చేస్తానన్నారు. మాస్కు ధరించడం ప్రాణాలు కాపాడుతుందని చెప్పారు. అదేవిధంగా తాను ఎన్నికైతే దేశమంతా వర్తించే ఒక జాతీయ పరీక్షా ప్రణాళిక రూపొందించి అందరికీ టెస్టులు జరిపే ఏర్పాట్లు చేస్తానన్నారు. సైన్సుపై నమ్మకం ఉంచి అందరం కలిసికట్టుగా కదిలితే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: పెద్దన్న ఎన్నిక ఇలా.. -
ట్రంప్‌కు షాక్ ఇవ్వనున్న భారతీయులు!
వాషింగ్టన్: నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికలపై సర్వే చేసిన ఒక సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలే విషయాన్ని వెల్లడించింది. ఎన్నికల వేళ ఎక్కవ ఓట్ల శాతం ఉన్న భారతీయ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం 22 శాతం భారతీయ ఓటర్లు మాత్రమే రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. 72 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బిడెన్‌ను అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడయ్యింది. ఇక మిగిలినవారిలో మూడు శాతం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండగా, 3 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి ఇష్టపడటం లేనట్లు తెలిసింది. ఇక డెమొక్రటిక్ పార్టీ తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి కమలహారిస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కవ మంది భారతీయులు ఆ పార్టీవైపు మళ్లినట్లు తెలుస్తోంది. కమలాహారిస్ ద్వారా భారత్- అమెరికా బంధం మరింత బలోపేతమవుతుందని వారు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వే వెల్లడించిన విషయాలతో ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్లయ్యింది. నాలుగేళ్లు పరిపాలన అందించి కూడా డెమోక్రటిక్ పార్టీ ఓట్లను పెద్దగా ట్రంప్ తన ఖాతాలో వేసుకోలేకపోయారని సర్వే ద్వారా తేటతెల్లమయ్యింది. చదవండి: ‘నేనిప్పుడు శక్తిమాన్’ -
అధ్యక్ష ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్
-
ట్రంప్ కోలుకోకపోతే డిబేట్ ప్రసక్తే లేదట..!
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఆయనతో తాను డిబేట్(అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి)లో పాల్గొనబోనని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా బరిలోకి దిగుతున్న జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన ట్రంప్-బైడెన్ల రెండో డిబేట్ జరగాల్సి ఉంది. ఈక్రమంలో ఇవాళ బైడెన్ కీలక ప్రకటన చేశారు. 'పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రెండో డిబేట్‌ను నిర్వహించాలనుకున్నాం. కానీ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పుడు డిబేట్ నిర్వహించకపోవడమే మేలు అనిపిస్తోంది' అని ఆయన అన్నారు. కోవిడ్ నుంచి ట్రంప్ పూర్తిగా కోలుకోని పక్షంలో అసలు డిబేట్ నిర్వహించడం సరికాదని బైడెన్ అభిప్రాయపడ్డారు. (చదవండి: డిబేట్ తర్వాత పెరిగిన బైడెన్ ఆధిక్యం!) మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ట్రంప్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. మయామీలో జో బైడెన్‌తో రెండో డిబేట్‌కు తాను రెడీగా ఉన్నానని ట్రంప్ సైతం ప్రకటించారు. కానీ.. ట్రంప్ సలహాదారులు, అధికారుల్లో చాలామందికి కోవిడ్ సోకింది. డిబేట్లో వాళ్లు కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డిబేట్ నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి పలు దఫాలు జరుగుతుంది. తొలి డిబేట్ సెప్టెంబర్ 30న జరిగింది. (చదవండి: ట్రంప్ మరో ప్రధాన సలహదారుడుకి పాజిటివ్) -
హారిస్ Vs పెన్స్
-
బిగ్ డిబేట్
-
అమెరికా ఎన్నికలు
-
డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడి, ప్రజలంతా క్షేమంగా బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదన్నారు. కాగా నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. (వైస్ ప్రెసిండెంట్ అభ్యర్ధిగా కమలా హారిస్!) కాగా ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరు చేస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మొదటితో పోలిస్తే వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్ ఓటింగ్‌కు ట్రంప్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. (వీసాల నిలిపివేత : ట్రంప్‌నకు భారీ షాక్) రాజ్యాంగంలో ఏముంది? అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారం నాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరమైన అంశం. నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ట్వీట్ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. ప్రపంచ యుద్ధాలు లాంటి గడ్డు పరిస్థితులను నేరుగా ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. కానీ అంతకుమించిన విపత్తును కరోనా వైరస్ వల్ల ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. -
ఫలితాలు, భౌగోళిక పరిణామాలదే కీలక పాత్ర
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయ ఈక్విటీ మార్కెట్లను ఈ వారంలో కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాల ధోరణి, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు గత వారం అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు.. వీటికితోడు దేశీయంగా కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కనిష్టాల నుంచి గణనీయంగా ర్యాలీ చేసిన నేపథ్యంలో స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ వారంలో కోటక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర ముఖ్యమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. గత వారం సెన్సెక్స్ నికరంగా 1,109 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు లాభపడడం గమనార్హం. ఇన్ఫోసిస్‌లో శిభూలాల్ వాటాల విక్రయం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్డీ శిభూలాల్ కుటుంబ సభ్యులు కంపెనీలో 85 లక్షల షేర్లను ఈ నెల 22–24 తేదీల మధ్య విక్రయించినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల డేటా తెలియజేస్తోంది. వీటి విలువ రూ.777 కోట్లు. దాతృత్వ కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు వారు తెలిపారు. -
అమెరికా ఎన్నికల రేసులో హాలీవుడ్ ర్యాపర్
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త మలుపులు తిరిగాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉండగా.. హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని అయిన కాన్యే అధ్యక్ష పదవి రేసులో పాల్గొననున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం వెల్లడించారు. "నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. దేవున్మి విశ్వసిస్తూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలను నెరవేర్చుకుందాం" అని రాసుకొచ్చారు. దీంతో ఆయన ట్రంప్, జో డిబేలకు ప్రత్యర్థిగా గట్టి పోటీనివ్వనున్నారు. తన పోటీకి సంబంధించి క్యానే ఎన్నికల బ్యాలెట్‌కు ఏదైనా పత్రాలను దాఖలు చేశారా అనే విషయం తెలియరాలేదు. (రాయని డైరీ : జో బైడెన్ (ట్రంప్ ప్రత్యర్థి)) కాగా 2018లో ట్రంప్ ఎన్నిక తర్వాత వెస్ట్ తన భార్య, పాపులర్ మోడల్ కిమ్ కర్దాషియాన్‌తో కలిసి ఓ సారి వైట్ హౌస్‌ను సైతం సందర్శించారు. మరోవైపు ప్రముఖ టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కాన్యే ఎన్నికల్లో పాల్గొనడంపై ఆసక్తి కనబర్చారు. కాన్యే ఎన్నికల్లో పోటీ చేస్తే తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించడం కొత్త చర్చను లేవనెత్తింది. మరోవైపు ట్రంప్ తన పీఠాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే దిశగా వరాలు కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ట్రంప్ ఏడాది పాటు రద్దు చేసిన హెచ్-1 బీ వీసాల నిషేధాన్ని ఎత్తివేస్తామని తెలిపారు. (భార్యకు కళ్లుచెదిరే గిఫ్ట్ ఇచ్చిన ర్యాపర్) -
హెచ్–1బీపై నిషేధం ఎత్తివేస్తా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఐటీ ఉద్యోగులపై హామీల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికా సహజ భాగస్వామి భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత దృఢతరం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. ఇంకా, హెచ్–1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు ఇమిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఒక టౌన్‌హాల్ సమావేశంలో బిడెన్ ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్లతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ట్రంప్ హెచ్–1బీ వీసాలను ఈ ఏడాది మొత్తానికి రద్దు చేశారు. నా ప్రభుత్వంలో మాత్రం ఇలా జరగదు’’అని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కంపెనీల వీసాలపై అమెరికా వచ్చిన నిపుణులు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపడితే వంద రోజుల్లో వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని అన్నారు. ‘‘తొలిరోజే (అధికారం చేపట్టిన తరువాత) ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తా. దేశంలో తగిన పత్రాలు లేని కోటీ పదిలక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరతా. ఇందులో 17 లక్షల మంది ఏసియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్లు ఉంటారు’’అని బిడెన్ వివరించారు. ముస్లింల ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు సుదీర్ఘమైన అమెరికా విలువల పునరుద్ధరణలో భాగంగా దేశంలోకి మళ్లీ శరణార్థులను తీసుకుంటామని చెప్పారు. గ్రీన్‌కార్డుల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అమెరికా, భారత్‌లు సహజ భాగస్వాములు అమెరికా భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉండటం అమెరికన్ల భద్రతకు చాలా ముఖ్యమని జో బిడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో తాను గతంలో భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకు అధిక ప్రాధాన్యమిచ్చామని అధ్యక్షుడిగా ఎన్నికైతే అదే పంథా కొనసాగిస్తానని చెప్పారు. కరోనా వైరస్ వ్యవహారంలో ట్రంప్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. -
ట్రంప్‌పై బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్ : ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య సంబంధాలు అంతగా బాగాలేవనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌కు పరోక్షంగా చైనానే కారణమంటూ పదే పదే ఆరోపించడం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ట్రంప్‌ను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో జి-20 సమావేశంలో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచేందుకు సహాయం అందించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను విజ్ఞప్తి చేశారంటూ పేర్కొన్నారు. బోల్టన్ తాను రాసిన రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్ పుస్తకం ప్రివ్యూలో భాగంగా అమెకరికన్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయాన్ని ట్రంప్ కోరినట్లు ఆయన ఆరోపించారు. అమెరికా రైతులకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు బోల్టన్ తన పుస్తకంలో తెలిపారు. శ్వేతసౌధాన్ని ఎలా నడుపాలన్న దానిపై ట్రంప్‌కు ఎటువంటి క్లారిటీ లేదన్నారు. (భారత్-చైనా మధ్య కీలక చర్చలు) ఒసాకాలో జూన్ 29, 2019న జరిగిన జి-20 సమావేశంలో వాణిజ్య అంశాలకు సంబంధించి ఇద్దరు దేశాధినేతలు సమావేశమై చర్చించారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ఈ అంశం వచ్చిందని పేర్కొన్నారు. ట్రంప్ వాణిజ్య అంశాలను చర్చిస్తూనే ఆశ్చర్యకరంగా రాబోయే యుఎస్ అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంభాషణను మార్చారు. చైనా యొక్క ఆర్ధిక సామర్థ్యాన్ని సూచిస్తూనే తాను గెలవడానికి పరోక్షంగా సహకరించాలంటూ జిన్‌పింగ్‌తో విజ్ఞప్తి చేసినట్లు బోల్టన్ పుస్తకంలో రాసుకొచ్చాడు. అంతేగాక ట్రంప్ జిన్‌పింగ్‌ను చైనాలోనే అత్యంత శక్తివంతమైన నేతగా అభివర్ణించాడంటూ పేర్కొన్నారు. దీనిపై డొమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ స్పందిస్తూ..' పుస్తకంలో పేర్కొన్నట్టుగా ట్రంప్ ఆ వాఖ్యలు చేసుంటే నిజంగా క్షమించరానిది. ఇది నైతికంగా అవాస్తవమే కాక అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు విలువలను కాపాడుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారు.' అంటూ చురకలంటించారు. కాగా రానున్న నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డొమొక్రాటిక్ తరపున జో బిడెన్ ట్రంప్‌తో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వ జాతీయ సలహాదారుడిగా బోల్టన్.. ఏప్రిల్ 2018 నుంచి ఆ ఏడాది సెప్టెంబర్ వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ట్రంప్ విధానాలను వ్యతిరేకించిన బోల్టన్.. శ్వేతసౌధాన్ని విడిచి వెళ్లారు. కానీ బోల్టన్‌ను తానే సాగనంపినట్లు ట్రంప్ చెబుతున్నారు. బోల్టన్ చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే ఆయన్ను తొలగించినట్లు ట్రంప్ తెలిపారు. బోల్టన్ రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయకుండా ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోల్టన్ రాసిన రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్ అనే 577 పేజీల పుస్తకం జూన్ 23(మంగళవారం) మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. -
బిడెన్ వైపే డెమొక్రటిక్ మొగ్గు
కరోనా వైరస్ సంక్షోభాన్ని, నల్లజాతీయుల ఉద్యమాన్ని చూపి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మార్షల్ లా విధిస్తారని, ఆ వంకన అధ్యక్ష ఎన్నికలను నిలిపివేసే అవకాశం కూడా లేకపోలేదని వూహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఆయన ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుంచి దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇందుకు సంబంధించిన లాంఛనప్రాయమైన ప్రకటన ఆగస్టులో వెలువడుతుంది. తాను అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొన్న ఏప్రిల్‌లో బెర్నీ సాండర్స్ ప్రకటించినప్పుడే బిడెన్ అభ్యర్థిత్వం ఖాయమైంది. నామమాత్రం పోటీయే అయినా రంగంలో మరికొందరు అభ్యర్థులు వుండటం, అభ్యర్థిత్వం సొంతం చేసుకోవడానికి కనీసం 1,991 ఓట్లు రావాలి గనుక ఆయన వేచివుండాల్సి వచ్చింది. ఈమధ్య ఏడు రాష్ట్రాలలో జరిగిన ప్రైమరీల్లో సైతం ఆయన విజయం సాధించారు. దాంతో ఆయనకే పార్టీ అభ్యర్థిత్వం దక్కినట్టయింది. బిడెన్‌కు మొత్తంగా 1,995 మంది ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తికావాల్సివుంది. అత్యంత గడ్డు పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలకు వెళ్లబోతోంది. ఒకేసారి మూడు సంక్షోభాలు– కరోనా వైరస్, దాని పర్యవసానంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ, దేశవ్యాప్తంగా సాగుతున్న నల్లజాతీయుల ఉద్యమం ఆ దేశానికి ఊపిరాడనివ్వడం లేదు. ఆర్థిక మాంద్యంనాటి పరిస్థితులను తలపిస్తూ నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ఇవన్నీ అమెరికాను ప్రస్తుతం కుదిపేస్తున్నాయి. ఆ దేశ చరిత్రలో 60వ దశకం తర్వాత ఈ స్థాయిలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశానిస్పృహల్లో వున్న అమెరికా పౌరులు డోనాల్డ్ ట్రంప్‌ను వదుల్చుకోవాలని కృతనిశ్చయంతో వున్నట్టు ఇటీవలి సర్వే చెబుతోంది. కనుక ఆయన ఎన్నిక ఖాయమని డెమొక్రాట్లు భావిస్తున్నారు. అదే జరిగితే ఆ పదవికి ఎన్నికైన తొలి వయోధిక నేత ఆయనే అవుతారు. అధ్యక్ష పదవి చేపట్టేనాటికి బిడెన్‌కు 78 ఏళ్లు వస్తాయి. అటు ట్రంప్ నెగ్గినా అదే రికార్డు నెలకొల్పుతారు. అప్పటికి ఆయన వయసు కూడా 74 అవుతుంది. అయోవా, న్యూ హాంప్షైర్లలో ప్రచార పర్వం మొదలెట్టేనాటికి బిడెన్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ట్రంప్ సైతం బిడెన్‌ను తేలిగ్గా తీసుకున్నారు. పార్టీలో ఆయనకన్నా సాండర్స్ వైపే బాగా మొగ్గు కనబడింది. కానీ నల్లజాతీయులు అధికంగా వున్న సౌత్ కరోలినాలో అత్యధికులు బిడెన్‌కు అనుకూలంగా ఓటేయడం దీన్నంతటినీ మార్చింది. ఉపాధ్యక్షుడిగా వున్నప్పుడు బిడెన్ తీసుకొచ్చిన నిర్బంధ చట్టాలు తమపై మరింత అణచివేతను పెంచాయన్న అభిప్రాయం నల్లజాతీ యుల్లో బలంగా వుంది. కనుక వారంతా తనవైపే వుంటారని సాండర్స్ నమ్మారు. అయితే ట్రంప్ వంటి బలమైన నేతను ఓడించడం సాండర్స్‌కు అసాధ్యమని వారు బిడెన్ వైపు మొగ్గారు. ఇప్పటిలా రెండు నెలలక్రితం నల్లజాతి ఉద్యమం వుంటే పరిస్థితి వేరుగా వుండేది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల ఏలుబడిలో నల్లజాతీయులకు జరిగిన అన్యాయాలేమిటో ఇప్పుడు విస్తృతంగా చర్చకొస్తున్నా యి. అయితే ప్రస్తుతం ట్రంప్ అణచివేత విధానాలను బిడెన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దేశ చరిత్రలో ఇదొ క క్లిష్ట సమయమని, ఇలాంటి సమయంలో ట్రంప్ రెచ్చగొట్టేలా, విద్వేషపూరితంగా మాట్లాడ టం ప్రమాదకరమని ఆయనంటున్నారు. అయితే అలవాటులో పొరపాటుగా నోరు జారి నల్లజాతీ యుల నుంచి బిడెన్ నిరసనలు చవిచూడక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్‌కు ఓటేద్దామని నల్లజాతీయుల్లో ఎవరైనా అనుకుంటే వారు నల్లజాతీయులే కాదని బిడెన్ అనడం ఆ వర్గంవారిలో కోపం తెప్పించింది. దాంతో బిడెన్ క్షమాపణ చెప్పారు. మహిళల పట్ల ఆయన గతంలో వ్యవహరించిన తీరు సరేసరి. 1993లో ఆయన వద్ద స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు తనపై లైంగిక దాడి చేశారని ఒక మహిళ ఆరోపించింది. దీన్ని బిడెన్ తోసిపుచ్చినా, అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఆరోపణ ఆయన్ను వెన్నాడటం ఖాయం. పౌరులందరికీ వైద్య బీమా వుండాలన్న ప్రతిపాదనకు ట్రంప్ మాదిరే బిడెన్ వ్యతిరేకి. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం కోసం అనుసరించాల్సిన విధానాల విషయంలోనూ బిడెన్ ట్రంప్‌కు దరిదాపుల్లో వుంటారు. కానీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఈ అంశాల్లో ఆయన తన వైఖరిని సడలించుకుంటున్నారు. కరోనా వైరస్ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా జరపాలని ఈమధ్య ఆయన డిమాండ్ చేశారు. ప్రగతిశీలుర ఓట్లు రాబట్టాలంటే ఇంతకన్నా గత్యంతరం లేదని ఆయన అనుకుంటున్నట్టున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర అంశాలతోపాటు ఇజ్రాయెల్ కూడా ఎప్పుడూ చర్చకొస్తుంది. ఎన్నిక కాబోయేవారు ఆ దేశం పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో వుంటుంది. ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అంతర్జాతీయ ఒడంబడికలను సైతం బేఖాతరు చేసి ఏకపక్షంగా ఇజ్రాయె ల్కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. బిడెన్ విషయానికొస్తే ఆయన 2007లోనే తాను జియోనిస్టునని చెప్పుకున్నారు. అప్పటినుంచీ పలు సందర్భాల్లో ఇజ్రాయెల్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. మూడేళ్లక్రితం ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించి అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి అక్కడికి తరలించారు. ఆ నిర్ణయాన్ని తిరగదోడే ఉద్దేశం లేదని ఈమధ్యే బిడెన్ తెలిపారు. ఇలా పలు అంశాల్లో ఆయన ట్రంప్ విధానాలకు భిన్నంగా ఏమీ లేరు. ఆ సంగతి డెమొక్రటిక్ పార్టీకి కూడా తెలుసు. కానీ సంక్షేమ విధానాలను ప్రతిపాదించే సాండర్స్ కంటే బిడెన్ మెరుగని ఆ పార్టీని సమర్థించే బలమైన కార్పొరేట్ లాబీలు, పార్టీ ప్రతినిధులు భావించారు. ఈ నేపథ్యంలో బిడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం ఎలా సాగుతుందో, ట్రంప్‌ను ఏమేరకు ఎదుర్కొని విజయం సాధించగలరో చూడాలి. -
కమలా హ్యారిస్‌పై ట్రంప్ ట్వీట్.. కౌంటర్
వాషింగ్టన్ : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి నిష్క్రమిస్తూ డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్(54) తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘ అయ్యో పాపం. మిమ్మల్ని మిస్సవుతాం కమలా!’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇందుకు వెంటనే బదులిచ్చిన కమలా హ్యారిస్.. ‘ అంతగా బాధ పడకండి మిస్టర్ ప్రెసిడెంట్. మిమ్మల్ని విచారణలో కలుస్తాను’ అంటూ ట్రంప్ అభిశంసన తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాగా డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి తొలగించేలా అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అధికార రిపబ్లికన్ల కంటే ప్రతిపక్ష డెమోక్రాట్లదే పైచేయిగా ఉన్న ప్రతినిధుల సభలో గురువారం 232-196 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ.. నిధుల మంజూరును సాకుగా చూపి ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపించి, అధ్యక్షుడిని అభిశంసించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. (చదవండి : నా దగ్గర డబ్బు లేదు.. అందుకే: కమలా హ్యారిస్) ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి తన వద్ద కావాల్సినంత డబ్బు లేదని పేర్కొంటూ డెమొక్రటిక్ సభ్యురాలు, కాలిఫోర్నియా సెనెటర్ కమలా హ్యారిస్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా ఉన్న కమల.. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను విమర్శిస్తూ పతాక శీర్షికల్లో నిలిచారు. ఆఫ్రికన్- ఆసియా(భారత్) మిశ్రమ సంతతికి చెందిన కమలను తోటి సభ్యులు ఫిమేల్ ఒబామాగా అభివర్ణిస్తారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు ప్రకటించి... ఈ ఏడాది ప్రారంభంలో ఘనంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవిని అలంకరించే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారంటూ కమల మద్దతుదారులు ఆశించారు. అయితే ఆదాయ వనరుల కారణంగా కమల అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమించడంతో వారు నిరాశలో మునిగిపోయారు. కాగా పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే కమల.. 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోవడంతో ఈ మేరకు ప్రకటన చేశారు. Don’t worry, Mr. President. I’ll see you at your trial. https://t.co/iiS17NY4Ry — Kamala Harris (@KamalaHarris) December 3, 2019 -
నా దగ్గర డబ్బు లేదు.. అందుకే: కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ మంగళవారం ప్రకటన చేశారు. ఈ మేరకు...‘నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందుకోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’అంటూ తన మద్దతుదారులు, విలేకర్లకు ఇ-మెయిల్ పంపించారు. కాగా ఈ ఏడాది జనవరిలో కమలా హ్యారిస్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఫర్ ద పీపుల్.. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి కమలా హ్యారిస్.. ‘ఫర్ ద పీపుల్’ అనే నినాదంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె తన ప్రచారంలో ప్రస్తావించారు. అయితే హెల్త్‌కేర్ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టతనివ్వకపోవడంతో కమల ప్రచార పర్వంలో వెనుకబడ్డారు. ఈ క్రమంలో పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె వైదొలిగారు. ఇక ఈ విషయంపై స్పందించిన కమల సహ సభ్యులు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నల్లజాతి అభ్యర్థి కోరీ బూకర్...‘ తన ప్రచారం హద్దులన్నింటినీ చెరిపివేసింది. ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. లవ్ యూ సిస్టర్’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కమల నిర్ణయంపై ఆమె మద్దతుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమల కంటే ముందు మెంటానా గవర్నర్ స్టీవ్ బుల్లోక్, మాజీ కాంగ్రెస్ సభ్యులు జో సెస్టాక్ అధ్యక్ష బరి నుంచి తప్పుకొన్నారు. (చదవండి : ‘నేను పోటీ చేస్తున్నా.. నాతో కలిసి రండి’) ఫిమేల్ ఒబామా.... 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. ఆమె తల్లి తమిళనాడులోని చెన్నైకి చెందినవారు కాగా.. తండ్రి ఆఫ్రికన్. ఈ క్రమంలో ఆఫ్రికా, ఆసియా సంస్కృతుల మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి కమల న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రచార కార్యక్రమాల్లో ఆయన శైలిని ఎండగట్టారు. అయితే అనూహ్యంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్నారు. -
అమెరికా ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన అజెండా
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన ఎజెండా అవుతుందని, త్వరలో భారత రాజకీయాల్లో కూడా కీలక అంశంగా మారుతుందని పర్యావరణ పరిశోధకుడు అట్లాంటిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ పేర్కొన్నారు. సంప్రదాయ ఇంధన వనరుల మితిమీరిన వినియోగం వల్ల భూమిపై వేగంగా సహజ వనరులు తరిగిపోతున్నాయని, వ్యవసాయం, పర్యావరణం దెబ్బతిని కరువు, విపత్తులు సంభవిస్తాయని, మానవాళి మనుగడకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై మంగళవారం ఆయన హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో బావుంది హైదరాబాద్ నగరం బావుందని, రవాణా వ్యవస్థలో మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు రావడం శుభపరిణామమని లివింగ్స్టన్ పేర్కొన్నారు. పర్యావరణహితంగా స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయని, ఇవి మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. బొగ్గు, డీజిల్, పెట్రోల్ లాంటి స్థానంలో వీలైనంత త్వరగా హైడ్రోజన్, విద్యుత్, న్యూక్లియర్ వంటి ఆధునిక ఇంధనాలు రావాలన్నారు. అమెరికా పర్యావరణంపై ప్రజల్లో, స్థానిక ప్రభుత్వాల్లో పర్యావరణమార్పులపై అనేక ఆందోళనలు ఉన్నాయని, ప్రకృతి విపత్తులతో జరుగుతున్న ఆస్తి, ప్రాణనష్టాల నేపథ్యంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన ఎజెండా అవుతుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో కాలుష్య తీవ్రత పెరిగిపోయిన దరిమిలా.. వచ్చే ఎన్నికల్లో భారత రాజకీయాల్లోనూ పర్యావరణం కీలకాంశంగా ఉంటుందని అన్నారు. ఇండియాలో సౌర విద్యుత్తు పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే..మరింత ఎక్కువ మంది వినియోగదారులు చేరతారని అభిప్రాయ పడ్డారు. పవన, సౌర టర్బైన్ల నిర్వహణ వివిధ శీతోష్ణస్థితుల వద్ద కష్టంగా మారుతోందని, దీన్ని అధిగమించేందుకు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించుకోవచ్చని వివరించారు. లిథియం, కోబాల్ట్ మినరల్స్‌పై దృష్టి భవిష్యత్తులో సౌర, పవన, తదితర పద్ధతుల్లో ఇంధనాన్ని ఉత్పత్తి చేసినా..వాటిని నిల్వ చేయడం సవాలుగా మారుతుంద న్నారు. అందుకే, ప్రస్తుతం బ్యాటరీలో వాడుతున్న లిథియం, కోబాల్ట్ మినరల్స్‌పై దేశాలు దృష్టి సారించాలని సూచించారు. వచ్చేవారం అమెరికా విదేశాంగ మంత్రితో భారత ప్రభుత్వం ఇదే విషయమై జరపనున్న చర్చల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కర్బన ఉద్గారాలు వెలువరించే వాహనాలు, పరిశ్రమలపై కఠినమైన చలానాలు విధించడం ద్వారా స్వీడన్ ప్రపంచంలోనే సంప్రదాయేతర ఇంధనాల వినియోగంలో మొదటి స్థానంలో ఉందని, ప్రపంచమంతా ఈ బాటలో నడవాలని సూచించారు. జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా వివిధ వాహనాలు, పరిశ్రమల్లో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలను అరికట్టకపోతే భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు, సునామీలు, తుపాన్లు, కరువు, వ్యవసాయ ఉత్పత్తి మందగించడం, వలసలు, దేశాల మధ్య కలహాలు రేగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాయన్నారు. అందుకే, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఇండియా– అమెరికా కలసి నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. -
అమెరికా ఎన్నికలు : ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల హవా
న్యూయార్క్ : అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యానికి గండికొట్టేలా వెలువడుతున్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రటీ పార్టీ అభ్యర్థులు మెజార్టీ దిశగా సాగుతుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు సెనేట్‌లో సత్తా చాటుతున్నారు. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ పేరుతో వ్యవహరిస్తారు. కాగా, ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు ఎన్నిక జరిగింది. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్లు సహా పలు పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు మరో 23 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రతినిధుల సభలో వీరు పైచేయి సాధిస్తారు. వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా, కొలొరాడో వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్లపై డెమోక్రాట్లు విజయం సాధించారు. మరోవైపు సెనేట్‌లో నార్త్ డకోటా, ఇండియానా స్థానాల్లో రిపబ్లికన్లు గెలుపొందారు. టెక్సాస్ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ క్రుజ్ విజయం సాధించారు. ట్రంప్ దూకుడుకు బ్రేక్.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుకు రెఫరెండంగా పరిగణిస్తున్నారు. ఇక మధ్యంతర ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామని డొనాల్డ్ ట్రంప్ ట్విట్ చేయడం గమనార్హం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధించిన ట్రంప్, కాంగ్రెస్‌లో సంఖ్యాబలం అండతో ఏకపక్ష నిర్ణయాలతో చెలరేగారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గణనీయంగా ఎన్నికవడంతో ట్రంప్ దూకుడుకు బ్రేక్ పడనుంది. -
అమెరికా ఎన్నికల్లో మళ్లీ రష్యా జోక్యం ?
అమెరికాలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్లను తప్పుదారి పట్టించడానికి ఫేస్బుక్ వేదికగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆ సంస్థ గుర్తించింది. రాజకీయ ప్రచారాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 32 పేజీల అకౌంట్లను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కేంబ్రిడ్జి ఎన్లైటికా వ్యవహారంతో తలబొప్పి కట్టిన ఫేస్బుక్ అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యం నివారించడానికి ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఆర్మ్స్ రేస్ పేరుతో రాజకీయపరమైన ట్రాల్స్ను ఇప్పటికే ఫేస్బుక్ జల్లెడ పడుతోంది. ఫేస్బుక్ తొలగించిన ఆ 32 పేజీలలో ప్రధానంగా వామపక్ష భావజాలపరమైన అంశాలు, జాతి వివక్ష, లింగ వివక్షల్ని రెచ్చగొట్టే అంశాలు, వలసదారుల సమస్యలు, మానవ హక్కులు వంటి అంశాలపై ప్రచారాలు కొనసాగుతున్నాయి. అజ్ట్లాన్ వారియర్స్, రెసిస్టర్స్, బ్లాక్ ఎలివేషన్ వంటి పేజీలు ఫేస్బుక్ తొలగించిన వాటిలో ఉన్నాయి. ప్రధానంగా వాషింగ్టన్లో వచ్చేవారం జరగనున్న హక్కుల ఐక్య ర్యాలీకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఫేస్బుక్లో పేజీలు క్రియేట్ అయ్యాయి. అమెరికా వలస విధానాల్ని లక్ష్యంగా చేసుకొని ఐసీఈ రద్దు హ్యాష్‌ట్యాగ్‌తో కూడా ప్రచారం సాగుతోంది. 2 లక్షల 90 వేల మందికి పైగా వినియోగదారులు ఈ ఫేస్బుక్ పేజీలను ఫాలో అవుతూ ఉంటే, ఆ పేజీల్లో ప్రకటనల కోసం 11 వేల డాలర్లు ఖర్చు చేశారు. ఈ ప్రచారాల వెనుక విదేశీ హస్తం ఉందన్న అనుమానంతో ఫేస్బుక్ వాటిని తొలగించింది. ఇటీవల జరిగిన ట్రంప్, పుతిన్ భేటీ అనంతరం అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదన్న పుతిన్ ప్రకటన నమ్మశక్యంగా ఉందని ట్రంప్ అంగీకరించిన నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత లభించింది. ఇదంతా రష్యా పనే : అమెరికా సెనేటర్ అమెరికా ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రచారాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రయత్నించిందో ఫేస్బుక్ వెల్లడించలేకపోయినప్పటికీ, నవంబర్‌లో జరిగే ఎన్నికల్ని కూడా ప్రభావితం చేయడానికి రష్యాయే ప్రయత్నిస్తోందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా ప్రజల్లో చీలిక తెచ్చేలా తప్పుడు ప్రచారాలన్నీ సాగుతున్నాయి. ఇదంతా రష్యా చేస్తున్న పనే. ఫేస్బుక్ కొంతవరకైనా అడ్డుకోవడం అభినందనీయం‘ అని సెనేటర్ మార్క్ వార్నర్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం ఫేస్బుక్ ప్రచారం వెనుక రష్యా హస్తం ఉందని చెప్పడానికి తగినన్ని ఆధారాలు ఇంకా లభించలేదని అంటున్నారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా చేసిన ప్రచారం మాదిరిగానే, అదే లక్ష్యంతో, అదే రకమైన భాషతో మళ్లీ సరికొత్త ప్రచారం ఫేస్బుక్లో మొదలైందని వారు అంగీకరిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక రష్యాకు చెందిన ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ హస్తం ఉందన్న అనుమానాలైతే ఉన్నాయి. గత రెండేళ్లలో ఫేస్బుక్లో రష్యా మద్దతు పలికే రాజకీయ పరమైన అంశాలను 12.6 కోట్ల మంది అమెరికన్లు ఫాలో అయ్యారని ఒక అంచనా.. 1.6 కోట్ల మంది అమెరికన్ల సమాచారం ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్ ద్వారా రష్యాకు చేరి ఉంటుందని అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఫేస్బుక్ వినియోగదారుల ఆలోచనల్ని ప్రభావితం చేసే ఎలాంటి ప్రచారాన్నయినా అడ్డుకుంటామని ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెర్లీ శాండ్ బర్గ్ స్పష్టం చేశారు. వినియోగదారుల డేటా భద్రత కోసం ఫేస్బుక్ 20 వేల మంది ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించింది. -
ఎన్నికల్లో రష్యా జోక్యం నిజమే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. ఎన్నికలకు అంతరాయం కలిగించే కుట్రతో పాటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను గెలిపించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారని ఆరోపిస్తూ 13 మంది రష్యన్లు, 3 సంస్థలపై (రష్యా ప్రభుత్వ మద్దతున్న ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్నీ–ట్రోల్ ఫామ్’ సహా) నేరారోపణలు నమోదయ్యాయి. అమెరికా వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా వారంతా కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు. రష్యా జోక్యంపై స్పెషల్ కౌన్సెల్‌గా విచారణ జరుపుతున్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ ఈ మేరకు శుక్రవారం ఫెడరల్ ప్రభుత్వం తరఫున ఆరోపణలు నమోదు చేశారు. కాగా, ‘ప్రచారంలో మా బృందం ఎలాంటి తప్పులు చేయలేదు. ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు’ అని అధ్యక్షుడు ట్రంప్ ట్వీటర్లో అన్నారు. -
ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ!
అలబామా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూర్‌ను ఓడించి.. డౌగ్ జోన్స్ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి మూర్ ససేమిరా అంటుండటం గమనార్హం. హోరాహోరీ పోరు..! సంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25 ఏళ్లలో ఒక డెమొక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే, ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రాయ్ మూర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగిక వేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్ ఓటర్ల అండ లభించడంతో డౌగ్ జోన్స్ విజయం సాధించినట్టు భావిస్తున్నారు. అలబామాలో డెమొక్రాట్ విజయం.. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయంతో అమెరికా సెనెట్ పెద్దలసభ (అప్పర్ చాంబర్)లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 51-49కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. అధ్యక్షుడు ట్రంప్ అజెండా అమలుకు సెనెట్ ఆమోదం లభించడం కష్టమే. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అమెరికా
హనోలులు: ఎన్నికల ప్రచారంలో హ్యాకింగ్ కు పాల్పడిన రష్యాపై గురువారం అమెరికా చర్యలు తీసుకుంది. రష్యా స్పై ఏజెన్సీలు, 35 మంది డిప్లొమాట్స్ పై కొరడా ఝుళిపించింది. రష్యా చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుందని అమెరికా పేర్కొనగా.. ఒబామా దద్దమ్మ పాలన చేస్తున్నారని తమ డిప్లొమాట్స్ ను తొలగించడంపై ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా పేర్కొంది. దీంతో ఇరు దేశాల అంతర్జాతీయ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఎన్నికల్లో ట్రంప్ అనుకూలంగా రష్యా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు పనిచేశాయని ఒబామా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఒబామా తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. రష్యా వాడిన సైబర్ ట్రిక్కుల గురించి మరింతగా వివరించాలని ఐదు ఫెడరల్ ఏజెన్సీలను ఒబామా ప్రభుత్వం కోరింది. ఇప్పటికీ అమెరికాపై కుట్రపూరిత దాడికి పాల్పడేందుకు రష్యా చూస్తోందని ఒబామా పేర్కొన్నారు. అలాంటి దాడులకు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడితో ఈ విషయం ముగిసిపోదని చెప్పిన ఒబామా.. అమెరికా రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నారు. కాగా, అమెరికాలోని రష్యా ఎంబసీలో పని చేస్తున్న వారిని విధుల్లో నుంచి తొలగించిన యూఎస్.. వీరు రష్యా ఇంటిలిజెన్స్ కు చెందిన వారని ఒబామా చెప్పారు. న్యూయార్క్, మేరిల్యాండ్ లలోని రష్యా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. రష్యాలోని అమెరికా ఎంబసీలోని అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో తమ జోక్యం ఉందనే ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది. సైబర్ అటాక్స్ పై ఒబామా నాయకత్వంలో అమెరికా తీసుకున్న బలమైన నిర్ణయం ఇదే. గత ఏడాది సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను హ్యక్ చేసిన ఉత్తర కొరియాపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. -
అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్వింగ్ రాష్ట్రాల్లో హ్యాకింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియా ఎన్నికల్లో హ్యాంకింగ్ జరిగిందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఆ దేశానికి చెందిన ప్రముఖ డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ మూడు స్వింగ్ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కాగా, సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదుల ఆధారాలతో రీకౌంటింగ్ చేపట్టాలని గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జిల్ స్టెయిన్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఓ ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ పేజీని ప్రారంభించి ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను సేకరించారు. ఎన్నికల ఫలితాలను పునఃసమీక్షించేలా చేయడానికే నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల సమాచారం, పార్టీల డేటా బేస్ లు, కొంత మంది ఈ-మెయిల్ అకౌంట్లు ఎన్నికల సందర్భంగా హ్యాకింగ్ కు గురయ్యాయని అన్నారు. 2016 ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి పదవిని చేపట్టకముందే హ్యాకింగ్ పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. జిల్ స్టెయిన్ వ్యాఖ్యలపై స్పందించిన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ప్రతినిధి హేమా అబెదిన్ ఎన్నికల హ్యాకింగ్ పై జస్టిస్ డిపార్ట్ మెంటు ద్వారా స్వతంత్ర విచారణ జరగాలని ప్రజలు కోరాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దాదాపు 2 మిలియన్ల పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టం వల్ల ఎన్నికల్లో ఓడిపోయారు. మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియాల్లో హ్యాకింగ్ కారణంగానే క్లింటన్ ఓడిపోయారని సైంటిస్టులు అంటున్నారు. ఎన్నికల్లో 70శాతం పేపర్ బ్యాలెట్లు(బ్యాకప్ కోసం) ఉపయోగించినా వాటిని సరిగా చెక్ చేయలేదని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రొ.జే అలెక్స్ హాల్డర్ మ్యాన్ అన్నారు. అంతేకాకుండా ఓటింగ్ మెషీన్లు అన్నింటిలో సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగి ఉంటే రిగ్గింగ్ కు ఆస్కారం ఉండేది కాదని అన్నారు. మూడు స్వింగ్ రాష్ట్రాల్లోని నాయకులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించక తప్పదని చెప్పారు. ఎన్నికల ఓట్లు రీ కౌంటింగ్ కు చివరి అవకాశం ఈ శుక్రవారం నుంచి బుధవారం వరకూ మాత్రమే ఉంది. ట్రంప్ కు పెన్సిల్వేనియాలో 20, మిచిగాన్ లో 16, విస్కన్సిన్ లో10 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన ఆధిక్యంతోనే అధ్యక్ష పదవికి అవసరమయ్యే 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ట్రంప్ కైవసం చేసుకున్నారు. -
అమెరికా ఎన్నికల్లో మనోళ్ల హవా
అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా.. ఆరుగురు భారత సంతతివారు ఎన్నికయ్యారు. విజేతలకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అభినందనలు తెలిపారు. రాజా కృష్ణమూర్తి, పరిమళా జయపాల్, రో ఖన్నా, అమి బెరా, తులసీ గబ్బర్డ్, కమలా హ్యారిస్ ఈసారి ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయాలలో ఉన్న భారత సంతతి అమెరికన్లు రెండు దేశౄల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఐఏఎఫ్‌సీ వారితో కలిసి కృషిచేస్తుంది. పార్టీలతో సంబంధం లేకుండా భారతీయ అమెరికన్లు ఎన్నికల్లో గెలిచేందుకు కూడా కృషిచేస్తుంది. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. రాజా కృష్ణమూర్తి (43) : ఢిల్లీలో పుట్టిన ఈయన.. ప్రిన్స్టన్ యూనివర్సిటీతో పాటు హార్వర్డ్ లా స్కూల్లో చదివారు. శివానందన్ ల్యాబొరేటరీస్, ఎపిసోలార్ ఇన్కార్పొరేటెడ్ సంస్థలకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇల్లినాయిస్ ఎనిమిదో కాంగ్రెషనల్ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు ఈయన ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేసిన ఈయనకు 58 శాతం మెజారిటీ వచ్చింది. పరిమళా జయపాల్ (51) : చెన్నైలో పుట్టిన ఈయన.. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో చదివారు. ఫైనాన్షియల్ అనలిస్టు అయిన ఈయన.. వాషింగ్టన్ ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీచేసి తొలిసారి గెలిచారు. ఈయనకు తన రిపబ్లికన్ ప్రత్యర్థిపై 57 శాతం మెజారిటీ వచ్చింది. రో ఖన్నా (40) : ఫిలడెల్ఫియాలో పుట్టిన ఈయన.. యేల్ లా స్కూలు నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయన ఖన్నా, కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున 60 శాతం మెజారిటీతో నెగ్గారు. డాక్టర్ అమి బెరా (61) : లాస్ ఏంజెలిస్‌లో పుట్టిన బెరా కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన కాలిఫోర్నియా ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీ చేసి, మూడోసారి డెమొక్రాటిక్ అభ్యర్థిగా 51 శాతం మెజారిటీతో నెగ్గారు. తులసీ గబ్బర్డ్ (35) : అమెరికాలోని లెలోవాలోవాలో పుట్టిన ఈమె.. హవాయి పసిఫిక్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు. తులసికి భారతీయ మూలాలు లేకపోయినా.. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి హిందువు ఈమె. కమలా హ్యారిస్ (52) : కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో పుట్టిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పట్టభద్రురాలయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ అయిన ఈమె.. కాలిఫోర్నియా సెనేటర్‌గా తొలిసారి పోటీచేసి 63 శాతం మెజారిటీతో నెగ్గారు. ఈమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ భారతీయురాలు. ఆమె రొమ్ము కేన్సర్ నిపుణురాలు. తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ పౌరుడు. ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ -
అందరినీ కలుపుకుపోతాం
అమెరికా పునర్నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామే సహజ ధోరణికి విరుద్ధంగా ట్రంప్ ప్రసంగం నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని న్యూయార్క్: విజయంతో వచ్చిన వినయం ట్రంప్‌లో స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలకు దీటైన జవాబిచ్చిన ట్రంప్.. విజయోత్సవ వేడుకల్లో మాత్రం చాలా బాధ్యతగా స్పందించారు. తనకు సహకరించిన వారినీ, వ్యతిరేకించిన వారినీ కలుపుకుని ముందుకెళ్తానని స్పష్టం చేశారు. విమర్శలను పక్కనపెట్టి అమెరికా కోసం అందరం ఒక్కటిగా ముందుకెళ్లాలన్నారు. అనూహ్య విజయం తర్వాత తన ప్రచార ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విజయోత్సవ వేదికపైనుంచి తొలిసారి మద్దతుదారులను, అమెరికన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, స్వతంత్రులు అందరూ అమెరికన్లే’ అని అన్నారు. ప్రసంగాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన ట్రంప్.. అందరికీ ధన్యవాదాలు చెబుతూనే.. ‘పెన్సిల్వేనియా ఫలితం తేలగానే.. ఇంతకుముందే సెక్రటరీ(విదేశాంగ మంత్రి) హిల్లరీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన క్లింటన్‌కూ శుభాకాంక్షలు తెలిపాను’ అన్నారు. హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దేశానికి ఆమె చేసిన సేవలకు మేం రుణపడి ఉన్నాం’ అని అన్నారు.‘ఈ విజయం నాకు చాలా కీలకం. నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని. విభేదాలు పక్కనపెట్టి అమెరికన్లందరం ఒక్కటిగా ముందుకెళదాం’ అని అన్నారు. ‘మొదటినుంచి చెబుతున్నట్లుగానే మేం చేసింది ప్రచారం కాదు. ఉద్యమం. అమెరికాలోని అన్ని జాతులు, మతాలు, భిన్నరంగాల వారు, వివిధ విశ్వాసాల వాళ్లు ఇందులో భాగస్వాములు. వీరంతా తదుపరి వచ్చే ప్రభుత్వం ప్రజలకు సేవచేయాలనుకున్నారు. దేశాన్ని ప్రేమించే లక్షల మంది స్త్రీ, పురుషులు వారి కుటుంబం, దేశం ఉన్నతంగా, ఉజ్వలంగా ఉండాలని పరితపించారు. అదే ఈ ఫలితం’ అని అన్నారు. కలసి పనిచేయటమనేది జాతి పునర్నిర్మాణంలో, అమెరికన్ల ఆశలు నెరవేర్చటంలో తమ తొలి అత్యవసర పని అన్న ట్రంప్ అమెరికన్ల శక్తి సామర్థ్యాలు చాలా మెండుగా ఉన్నాయనే విషయం తనకు అవగతమైందన్నారు. మౌలిక వసతుల నిర్మాణంలో ప్రతి అమెరికన్‌ను భాగస్వామిని చేస్తామని తెలిపారు. ‘ఈ 18 నెలల్లో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. దేశాభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. మా వద్ద గొప్ప ఆర్థిక ప్రణాళికలున్నారుు.వృద్ధిని రెండింతలు చేస్తాం. అన్ని దేశాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అన్నారు. తల్లిదండ్రులకు గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతల కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రంప్ వారి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. చెల్లెల్లు మర్యానే, ఎలిజబెత్, సోదరులు రోబర్ట్, ఫ్రెడ్ (దివంగత) లకూ ధన్యవాదాలు తెలిపారు. గొప్ప తల్లిదండ్రులు, సోదర, సోదరీమణులు తనకున్నందుకు అదృష్టవంతుడినన్నారు. ‘భార్య మెలానియా, కూతురు ఇవాంకా, ఎరిక్, టిఫానీ, బారన్, లారా, వెనెస్సా.. కష్ట సమయంలో మీరందించిన ప్రోత్సాహం వల్లే ఈ విజయోత్సవం జరుగుతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. మా బృందంలోని కెల్యానే, క్రిస్, రూడీ, స్టీవ్, డేవిడ్ (వీరందరూ ట్రంప్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేశారు)అందరికీ ధన్యవాదాలు.. రెండు, మూడేళ్లు, నాలుగేళ్ల తర్వాత.. ఎనిమిదేళ్ల తర్వాతైనా కావొచ్చు. మీరంతా అధ్యక్షుడంటే గర్వపడేలా పనిచేస్తా. ప్రచారం అరుుపోరుుంది. పని ప్రారంభించటమే మిగిలుంది’ అని అన్నారు. 1820 తర్వాత మళ్లీ... న్యూయార్క్: ట్రంప్ గెలుపుతో భార్య మెలానియా అమెరికా ప్రథమ మహిళ కానున్నారు. అరుుతే ఆమె జన్మతః అమెరికన్ కాకపోవడంతో.. 1820 తర్వాత విదేశాల్లో పుట్టి ప్రథమ మహిళగా హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కనున్నారు. 1825-29 మధ్య అమెరికా ఆరో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా లండన్‌లో జన్మించారు. దాంతో జన్మతః అమెరికన్ కాకుండా ప్రథమ మహిళ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. మాజీ మోడల్ అయిన 46 ఏళ్ల మెలానియా 1970లో నాటియుగొస్లావియాలో జన్మించారు. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ వృత్తిలోకి ప్రవేశించిన మెలానియా.. స్లోవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడగలరట. 1998లో ఆమె న్యూయార్క్‌లో ఓ ఫ్యాషన్ పార్టీలో ట్రంప్‌ను కలుసుకున్నారని, 2005లో ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నారని సమాచారం. 1998లో అప్పటికే ట్రంప్ రెండో భార్యనుంచి విడాకులు తీసుకున్నారని అంటారు. వివాదాల ముద్దుబిడ్డ అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్‌కు తొలినుంచీ వివాదాలతోనే సహజీవనం. అరుుతే అనుకున్నది సాధించటంలోనూ ట్రంప్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తారనే పేరుంది. యువకుడిగా ఉన్నప్పుడే తండ్రి దగ్గర్నుంచి అప్పుతీసుకుని వ్యాపారం మొదలుపెట్టి.. తర్వాత మళ్లీ తండ్రి కంపెనీలోనే ఉద్యోగిగా చేరారు. తర్వాత అమెరికాలోనే, ప్రపంచంలోనే ఉత్తమ నివాససముదాయాల ప్రాజెక్టులను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు.సినిమారంగంపై మక్కువ, సెలబ్రిటీలతో పరిచయం, టీవీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా వివాదాలతో నూ సావాసం మొదలైంది. 1977లో తొలి వివాహం, తర్వాత గ్లామర్ ప్రపంచంలో పరిచయాలతో రెండు, మూడో పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుత భార్య మెలానియా.. స్లోవేకియా మోడల్. ఈమె వర్క్ వీసాపై వచ్చి ఇక్కడ సెటిలైందనే విమర్శలున్నారుు. ట్రంప్ కంపెనీలో పనిచేసే చాలా మంది అమ్మాయిలు ఇలాగే వచ్చామని వెల్లడించారు. మహిళల విషయంలో ట్రంప్‌పై చాలా వివాదాలున్నారుు. తనకు 13 ఏళ్ల వయసులో పలుమార్లు ట్రంప్ అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల తర్వాత ఇటీవల ఓ మహిళ ఆరోపించింది. అంతే కాదు సొంత కూతురిపైనా పచ్చిబూతులు మాట్లాడిన వీడియో ఒకటి ఎన్నికలకు ముందు విడుదలవటం.. దీనిపై ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేయటం తెలిసిందే. అటు రాజకీయ పరంగానూ ట్రంప్ రూటే సెపరేటు. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ప్రగాఢమైన కాంక్షతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లోకి పలుమార్లు మారారు. రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పరిచయం ఉన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారానే అమెరికన్లకు బాగా సుపరిచితుడైన ట్రంప్ మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తాడని ప్రత్యర్థి జట్టు బలంగా ప్రచారం చేసింది. ఈయన వివాదాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి విపరీతంగా ప్రచారం చేసింది. కానీ.. ఇవేవీ ట్రంప్ విజయాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. వివాదాలెన్నున్నా.. ఈయన్ను శ్వేతసౌధానికి పంపించారు అమెరికన్లు. -
హాలీవుడ్ నటుల్ని వణికిస్తున్న ట్రంప్
లాస్ ఎంజెల్స్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన విజయం కొంతమంది హాలీవుడ్ నటుల్లో భయం పుట్టిస్తోంది. ముఖ్యంగా ఖేర్, క్రిస్ ఇవాన్స్ వంటి నటులు ట్రంప్ విజయంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే భయపడుతున్నామని, ట్రంప్ గెలిచాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చెప్పారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో హాలీవుడ్‌లోని చాలామంది నటులంతా హిల్లరీకే బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ, ఎన్నికల ఫలితాలు తారుమారవ్వడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిస్ ఇవాన్స్ అనే హాలీవుడ్ నటుడు స్పందిస్తూ ఇది అమెరికాకు చాలా కలవరాన్ని పుట్టించిన రాత్రి అన్నారు. విద్వేషాలను ప్రోత్సహించే ఓ వ్యక్తికి తమ గొప్ప దేశాన్ని అప్పగించాల్సి వచ్చిందన్నారు. జెస్సీ టైలర్ ఫెర్గూసన్ అనే నటుడు స్పందిస్తూ ముస్లింలు, మహిళలు, వలసదారులు, ఎల్జీబీటీ కమ్యునిటీ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కానీ, భవిష్యత్తులో వారి తరుపున పోరాడేందుకు తాను సిద్ధమని అన్నారు. ఖెర్ అనే మ్యూజిక్ ఆర్టిస్టు స్పందిస్తూ 'ట్రంప్ అసలు ఈ విజయం సాధించాడు? అతడిని జైలులో వేసి తాళం పడేయాలి. అమెరికాలో ఈ రాత్రిని మించిన హాస్యం మరొకటి లేదు' అని అన్నారు. అలాగే, అలెక్ బల్ద్విన్, బ్యూ విల్లీమాన్, షోండా రైమ్స్ కూడా ట్రంప్ విజయం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. -
ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?
న్యూయార్క్: డోనాల్డ్ జాన్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. మంగళవారం రాత్రి నుంచి వెలువడుతున్న ఫలితాలలో ట్రంప్ టోర్నడోను చూసి ‘ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఇతనేనా గెలిచింది?’ అని విస్తుపోయిన చాలామంది.. నిదానంగా చేదు నిజాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2008 నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా 2016లో ట్రంప్ భారీ మెజారిటీ సాధించాడు. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఏకంగా 300 పైచిలుకు స్థానాలను ఖాతాలోవేసుకున్నాడు. అయితే అధ్యక్షుడు కావాలనే ట్రంప్ కల ఈనాటిదికాదు.. 2000 సంత్సరంలో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ జీవితానికి సంబంధించిన సాధారణ, ఆసక్తికర విషయాలే ఈ ‘ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?’ కథనం.. ‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు. ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్లు నిర్మించిన ట్రంప్.. అనతికాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకుమించి భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్’ను పెద్ద బ్రాండ్ గా మార్చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు. ట్రంప్ ఆస్తుల విలువ ఎంతంటే.. రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్ ఖరారు కాకముందే ప్రయత్నాలను విరమించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తనకు విరాళాలు అవసరంలేదని(మొదట్లో) ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. (ఆ తర్వాత ఆయన విరాళాలు ఎలాగూ స్వీకరించారనుకోండి). అసలింతకీ ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు. మధ్యవయస్కుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్న ట్రంప్ 70వ పడిలోగానీ.. 2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తా’అని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ప్రారంభమైన ట్రంప్ ప్రస్థానం.. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేలా చేశాయి. ట్రంప్ నోటి దురుసును, రాజకీయ అనుభవలేమిని ప్రశ్నిస్తూ సాక్షాత్తూ రిపబ్లికన్ పార్టీ పెద్దలే అతని అభ్యర్థిత్వాన్ని సవాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ స్పీకర్ సైతం ట్రంప్ గెలుపును అంగీకరించబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను తెలివిగా ఎదుర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకుని, అమెరికన్ల మనసులు గెలుచుకుని ఆ దేశానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ వ్యక్తిగత జీవితం.. 1977లో ఇవాంకా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. జనవరిలో అమెరికా ప్రథమ మహిళగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోయేది ఈవిడే. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫ్పనీ, బరూన్ లు. తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై(1981లో) చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని, అప్పటి నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. -
ట్రంప్ విజయంపై దిగ్భ్రాంతి.. ఆగ్రహం
న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంపట్ల సామాజిక మీడియాలో ఆసక్తికరమైన ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ట్రంప్ విజయాన్ని చూసి కొంతమంది విస్మయానికి మరికొందరు దిగ్బ్రాంతికి గురైనట్లు చెప్పగా ఇంకొందరు మాత్రం గొప్ప విజయం అని అభివర్ణించారు. 'నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను' అంటూ నైలా అహ్మద్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా.. ఇది చాలా గొప్ప విజయం.. దీని తర్వాత నేను ఎంతో ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా నుంచి డీజే బుసాంగ్ అనే ట్విట్టర్ర్ యూజర్ స్పందిస్తూ ట్రంప్ సాధించిన విజయాన్ని సెప్టెంబర్ 11 దాడితో పోల్చాడు. మరోనాలుగేళ్లపాటు అమెరికా దెయ్యాల పండుగ(హలోవీన్) జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అమెరికా ఏ విధంగా పతనం అవుతుందో అని భయమేస్తుందని, తామంతా చచ్చిపోతామా అన్న ఆందోళన పుడుతోందని కూడా ఇంకొందరు ట్వీట్లు చేశారు. అసలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేయాలంటేనే కోపం వస్తుందని మరికొందరు స్పందించారు. -
ట్రంప్‌కు మోదీ, పుతిన్ అభినందనలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. అమెరికా-భారత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో భారత్‌తో ఉన్న అనుభందాన్ని స్నేహాన్ని ప్రస్థావించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. అలాగే, మరో అగ్ర రాజ్యం రష్యా అభినందనలు తెలియజేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ట్రంప్‌కు టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని తాను ఆశిస్తున్నట్లు అందులో పుతిన్ పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి సాగాలని తాము భావిస్తున్నామన్నారు. అంతేకాదు.. రష్యాలోని మేజర్ పార్టీలన్నీ కూడా ట్రంప్‌కు అభినందనలు తెలియజేశాయి. రష్యాకు అనుకూలంగా ప్రచారం సమయంలో ట్రంప్ మాట్లాడటాన్ని అదనుగా చేసుకొని హిల్లరీ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు రష్యాతో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకే పుతిన్‌కు అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నారని ఆమె ఆ సమయంలో ఆరోపించారు కూడా. -
‘అమెరికా ఉపాధ్యక్షుడు’ మైక్ పేన్స్తో కేటీఆర్..
హైదరాబాద్: ఇకపై ఆయనను కలవాలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే. అవును. అమెరికా ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలో కీలక పాత్రధారి, ట్రంప్ సహచరుడు, అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ అపాయింట్మెంట్ అంత తేలికైనా వ్యవహారమేమీ కాదు. ఈ తరుణంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు(కేటీఆర్).. మైక్ పేన్స్ తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మే చివరి వారంలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. మే 25-25 తేదీల్లో ఇండియానా గవర్నర్ మైక్ పేన్స్ ను కలుసుకున్నారు(అప్పటికే పేన్స్ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు) ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే ’సిస్టర్ సిటీస్ కమ్యూనిటీ’లో భాగంగా కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. నాటి సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ బుధవారం తన ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ’ప్రపంచమంతా కొన్ని గంటలుగా ఉత్సుకతతో ఊగిపోతోంది. అమెరికాలో ట్రంఫ్ థండర్.. ఇండియాలో మోదీ సంచలన నిర్ణయం.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. మున్ముందు కూడా ఇలాంటి స్వీట్ షాక్ లు తప్పక చవిచూడాల్సిఉంటుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఆయన సహచరుడు మైక్ పేన్స్ విజయంతో అమెరికా, భారత్ ల బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. The world has become so much more exciting in last several hours. Trump's triumph & Modi's surprise move!! More excitement ahead I am sure.. — KTR (@KTRTRS) 9 November 2016 Many congratulations VicePresident elect @mike_pence Glad to have met you earlier this year. Hope USA & India relations grow more stronger pic.twitter.com/R0KYN072Px — KTR (@KTRTRS) 9 November 2016 -
'మోదీ విజయంలాంటిదే ట్రంప్ గెలుపు'
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో తాను ముందుగా చెప్పిందే జరిగిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొని అవాక్కయ్యే ఆశ్చర్యంలో ముంచెత్తారని తెలిపారు. ట్రంప్ విజయం 2014 ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయంలాంటిదని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయనను ఓ మీడియా స్పందన కోరగా ఈ విధంగా స్పందించారు. 'హిల్లరీ ప్రచారంలో ట్రంప్‌ను ఏమాత్రం పోటీకి యోగ్యుడుకాడని, చెత్త అభ్యర్థి అని ఆరోపించింది. కానీ, ఆ మాటలేవి ట్రంప్ ముందు నిలబడలేదు. బిల్ క్లింటన్ ఇంకా చాలా చెడ్డవాడు. నేను ట్రంప్ గెలుస్తాడనే అనుకున్నాను' అని స్వామి అన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చినంత మాత్రాన భారత్-అమెరికా సంబంధాలకు ఎలాంటి విఘాతం కలగబోదని చెప్పాడు. హిందువులకోసం ట్రంప్ ప్రత్యేకంగా ఓ సదస్సు నిర్వహించాడని, ఆయన కుమారుడు, కుమార్తె దేవాలయాలు కూడా సందర్శించారని గుర్తు చేశారు. అయితే, ట్రంప్ భారత్‌ను సమభాగస్వామిగా భావించాలే తప్ప.. జూనియర్ భాగస్వామిగా భావించవొద్దని అన్నారు. -
ట్రంప్ కొడుకు చట్టాన్ని అతిక్రమించాడా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్న ఎరిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సుపుత్రుడు ఎరిక్ ట్రంప్, న్యూయార్క్ రాష్ట్ర చట్టాన్ని అతిక్రమించినట్టు తెలుస్తోంది. ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం ఎరిక్, తన తండ్రి పేరుకు పైన వేసిన ఓవెల్ బ్యాలెట్ ఫోటోను, ఓ ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ' నా తండ్రికి ఈ ఓటు ఒక అద్భుతమైన గౌరవం!, అమెరికాకు ఆయన గ్రేట్ జాబ్ నిర్వహిస్తారు'' అని ఎరిక్ ట్వీట్ చేశారు. అనంతరం ఆ పోస్టును ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. అయితే న్యూయార్క్ చట్టాల ప్రకారం ఓటర్లు వారు మార్క్ చేసిన బ్యాలెట్లను ఇతరులకు చూపించడం నిషేధం. ఈ చట్టాలు సోషల్ మీడియా పోస్టులకు కూడా వర్తిస్తాయని ఫెడరల్ జడ్జి గతవారమే తీర్పు కూడా ఇచ్చారు. కానీ ఎరిక్ ఆ చట్టాలను అతిక్రమించి బ్యాలెట్‌తో కూడిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్ లో పోస్టు చేసినట్టు తెలుస్తోంది. ఎరిక్ ట్రంప్ ప్రతినిధులు కానీ, న్యూయార్క్ సిటీ బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ కానీ దీనిపై స్పందించడం లేదు. కాగ, ఎరిక్ మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఎన్నడూ లేనంతగా ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు తమ ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. -
అమెరికా ఎన్నికలపై.. ఉత్కంఠ
ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తమిళనాడులోనూ ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా, గెలుపు ఎవరికి దక్కేనో అన్న చర్చే. తమిళ మీడియా సైతం ఈవార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, చాణక్య చేపల జోస్యం ట్రంప్ వైపుగా మల్లడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. సాక్షి, చెన్నై : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీల మధ్య సమరం హోరాహోరీగా మారి ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికలు జరగడం, బుధవారం ఫలితాల వెల్లడి కానునడంతో ప్రపంచ దేశాలు అమెరికా వైపుగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఆ ఎన్నికలపై ఆసక్తి మరింతగా పెరిగి ఉన్నది. అమెరికాలో ఉన్న తమిళుల మద్దతు హిల్లరీకే అన్నట్టుగా పలు తమిళ మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, ఆ వార్తలకు ప్రాధాన్య ఇచ్చే పనిలో పడా ్డరుు. ఓ మీడియా అయితే, ఏకంగా అమెరికాకు ప్రతినిధుల్ని పంపించి , తమిళుల అభిప్రాయాల్ని లైవ్‌లో ప్రసారం చేస్తుండడంతో జనంలో ఫలితాల ఆసక్తి మరింతగా పెరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడు గంటల నుం చి ఫలితాల వెల్లడి కానున్నడంతో అందరి దృష్టి గె లుపు ఎవరిదో అన్న అంశం మీద పడింది. ఎక్కడ చూసినా గెలుపు హిల్లరీ కే అంటూ కొందరు, ట్రం ప్కే అంటూ మరి కొందరు చర్చించుకుంటుం డటం గమనించాల్సిన విషయం. ఇక, ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే విధంగా చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు జరగడం విశేషం. అడయార్‌లోని ఓ హోటల్లో ఫలితాల ప్రకటన, ప్రతినిధులతో చర్చ, వంటి కార్యక్రమాలు ఉదయం నుంచి సాగనున్నది.దీంతో ఫలితాల కోసం ఆత్రూతగా ఎదు రు చూసే జనం ఎక్కువే. తమిళనాడుతో హిల్లరికి ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆమే పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఎదురు చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో చెన్నైతో పాటుగా రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటన సాగించి ఉండటం గమనార్హం. ట్రంప్ వైపు చాణక్య చూపు.. ట్రంప్, హిల్లరి మధ్య సమరం హోరాహోరీ అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చాణక్య చూపు ట్రంప్ వైపుగా మళ్లి ఉన్నది. ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యువో) ఆధ్వర్యంలో అన్నాగనర్‌లోని ప్రధాన కార్యాలయంలో చాణక్య జోస్యం కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. అక్వేరియంలో చాణక్య చేపను వదలిపెట్టారు. ట్రంప్, హిల్లరీ ఫొటోలను ఉంచారు. అయితే, చాణక్య చేప ట్రంప్ ఫొటోను తాకడంతో, ఆయన వైపు గెలుపు ఉండొచ్చన్నట్టుగా నిర్వాహకులు జోస్యం చెప్పారు. ఈవిషయంగా ఐసీడబ్ల్యువో వ్యవస్థాపక కార్యదర్శి ఏజే హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ, క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీ వంటి సమయల్లో చాణక్య చేప ద్వారా ముందస్తుగా ఫలితాలను తాము జోస్యంగా తెలుసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ చేప ఇచ్చే ఫలితాలు 90 శాతం మేరకు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా చాణక్య ట్రంప్ వైపుగా తన చూపును మరల్చి ఉన్నదన్నారు. -
అమెరికా డిసైడ్స్
-
పోలింగ్ వద్దకు రావొద్దన్న అమెరికా.. రష్యా ఫైర్
మాస్కో: అమెరికాపై రష్యా మండిపడింది. తమ దేశానికి చెందిన దౌత్య ప్రతినిధులను అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలను పరిశీలించకుండా అడ్డుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యంకాని చర్య అని పేర్కొంది. కాగా, మాస్కోలో ఉన్న అమెరికా రాయబారులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేశారు. మేం ఏ రష్యా ప్రతినిధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తమ దేశ దౌత్య ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని అమెరికా అధికారులు ఇప్పటికే ఆదేశించారని, ఇది కొన్ని దేశాల్లో దౌత్య వేత్తలకు చేసే బెదిరింపు చర్యల మాదిరిగానే ఉన్నాయని, రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఫేస్బుక్లో పేర్కొన్నాడు. ఇక హ్యూస్టన్‌లో అయితే, ఏకంగా హాలీవుడ్ సినిమా పద్ధతిలో కట్టుదిట్టంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, తమ దేశ జనరల్ కాన్సులేట్ కు చెందిన అధికారి కారును నిలిపేసి మరి అడ్డుకున్నారని ఆరోపించారు. వీటినే అమెరికా కొట్టి పారేసింది. -
ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా?
న్యూయార్క్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు విజయం సాధించినా పేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారానికి భారీగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించే విధాన నిర్ణయాలనే దేశాధ్యక్షులు అమలు చేయాల్సి ఉంటుంది. ఇతర వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే స్వేచ్ఛ అమెరికా అధ్యక్షులకు పరిమితంగానే ఉంటుంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఈ రోజు వరకు 250 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టారు. అందులో దాదాపు 130 కోట్ల డాలర్లను హిల్లరీ విరాళాల రూపంలో సమీకరించగా, ట్రంప్ దాదాపు వందకోట్ల డాలర్లను విరాళాలుగా సేకరించినవే. విరాళాలిచ్చే ముందు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అధ్యక్ష అభ్యర్థులతో తమ ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఆ ప్రయోజనాలను పరిరక్షించేవారికి ఎక్కువ విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. ఈ నిర్ణయాలు, సమావేశాలు పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్ ప్రతినిధుల మధ్య రహస్యంగా జరిగిపోతాయి. ఈసారి కూడా ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. కానీ ఇదంతా పారదర్శకంగా కనిపించడం కోసం విరాళాల దాతలతో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా చర్చా సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికాలో అతిపెద్ద పొగాకు కంపెనీ ఆల్ట్రియా 5,40,000 డాలర్లు, రెండవ పెద్ద పొగాకు కంపెనీ రెనాల్డ్స్ అమెరికన్ కంపెనీ ఏకంగా 9,90.000 డాలర్లను రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపకు విరాళంగా ఇచ్చాయి. అమెరికన్ రెస్టారెంట్ అసోసియేషన్, అమెరికా పారిశ్రామిక మండలి కూడా ఎన్నికల్లో ట్రంప్‌కు భారీగానే విరాళాలు ఇచ్చాయి. ఇక హిల్లరీకి వైద్య పరికరాల సరఫరా కంపెనీలు, ఎంటర్ టైన్మెంట్ సంస్థలు, విద్యా సంస్థలు, టీచర్ల సంఘాలు, మీడియా గ్రూప్‌లు. హాలివుడ్ సినీ పరిశ్రమ వర్గాలు, ఆర్థిక, సామాజిక సమానత్వం కోరుకునే సంస్థలు, కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. కొన్ని కంపెనీలు ఎందుకైనా మంచిదని ఇద్దరు అభ్యర్థులకు విరాళాలు ఇచ్చాయి. అయితే అలాంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. తమకు ఎవరు అనుకూలంగా ఉన్నారనుకున్నారో వారికి ఎక్కువ విరాళాలు ఇచ్చి, ప్రత్యర్థికి తక్కువ విరాళాలు ఇచ్చాయి. తమ యజమానులైన కార్పొరేట్ సంస్థలతో పోటీ పడాలంటే కార్మిక సంఘాలు కూడా విరాళాలు ఇచ్చుకోవాల్సిన అవసరం అమెరికాలో ఏర్పడటం విచిత్రం. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలనుకుంటున్న సామాజిక కార్యకర్తలు కూడా అధ్యక్ష ఎన్నికలకు విరాళాలు ఇవ్వడం మరింత ఆశ్చర్యకరం. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా పెరిగిపోతోందని, తుపాకులను నియంత్రించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో అమెరికా గన్ అసోసియేషన్ (తుపాకీ తయారీ కంపెనీల సంఘం) కూడా అధ్యక్ష ఎన్నికలకు భారీగా విరాళాలు ఇచ్చాయి. కార్పొరేట్ సంస్థలు ఒక్క దేశాధ్య ఎన్నికలకే కాకుండా విధాన నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేలా వివిధ రాష్ట్రాలకు కూడా విరాళాలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వంత చట్టాలను కలిగిఉండే స్వేచ్ఛ ఉండడంతో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. విరాళాలు, లాబీయింగ్ ప్రభావం విధాన నిర్ణయాలపై ఎలాంటి ఉంటుందో రాష్ట్ర చట్టాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అమెరికా రాష్ట్రాలు చట్టాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజల ఓటింగ్‌ను నిర్వహిస్తుంటాయి. ఒహాయోలో ఏడాదిక్రితం కార్మికుల కనీస వేతనాలపై ఓటింగ్ నిర్వహించారు. ఆ చట్టం కఠినంగా ఉండకుండా ఉండేందుకు కార్పొరేట్ సంస్థలు ఆ రాష్ట్ర ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ (రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తర్వాతి పోస్ట్, భారత్‌లోని చీఫ్ సెక్రటరీ లాంటి పోస్ట్)అధికారితో భారీగా లాబీయింగ్ జరిపాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ల్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నియమిస్తారు. వీరికి పదోన్నతి వస్తే లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు అవుతారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఫైల్ ఈ అధికారుల ఆధీనంలోనే ఉంటుంది. నేవడా రాష్ట్రంలో తుపాకీ నియంత్రణా చట్టాన్ని మరింత కఠినంతరం చేయాలన్న ప్రతిపాదన ప్రజల నుంచి వచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించి చట్టంలో మార్పులు తీసుకరావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓటింగ్‌కు బిల్లును రూపొందించాల్సిన బాధ్యతు ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ కావడంతో ఆ బాధ్యత సదరు వ్యక్తికి అప్పగించారు. చట్టం కఠినమైతే తుపాకులు అమ్ముకోవడం కష్టమవుతుందని భావించినా గన్ అసోసియేషన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో లాబీయింగ్ జరిపింది. తుపాకీని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసేటప్పుటు ఆ తుపాకీని తీసుకొనే వ్యక్తి నేర చరిత్రను సమగ్రంగా తనిఖీ చేయాలంటూ ప్రతిపాదన తయారైంది. వాస్తవానికి ఏ వ్యక్తికైనా తుపాకీ అమ్మేటప్పుడు ఆ వ్యక్తి నేరచరిత్రతోపాటు ప్రవర్తన తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలనే ప్రతిపాదన చట్టంలో తీసుకరావాల్సి ఉండింది. కంపెనీల లాబీయింగ్‌తో చట్టం సవరణ ప్రతిపాదన రూపమే మారిపోయింది. వచ్చే నెలలో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరుగనుంది. ‘ది కీ టు ఎనీ బ్యాలెట్ మెజర్ ఈజ్ రైట్ లాంగ్వేజ్, కంపెనీ గీవ్స్ ది కాన్సెప్ట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ రైట్స్ ది లాంగ్వేజ్’ అని వాల్‌మార్ట్, ఫిలిప్ మోరిస్, ఇంటర్నేషనల్ విన్ రిసార్ట్స్ లాంటి పెద్ద సంస్థలను కస్టమర్లుగా కలిగిన అమెరికాలోని లింకన్ స్టాటజీ గ్రూప్ మేనేజింగ్ పార్టనర్ నాథన్ స్ప్రౌల్ ఓ రహస్య సమావేశంలో చేసిన వ్యాఖ్య రాజకీయ నాయకులకు, కార్పొరేట్ సంస్థలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలియజేస్తోంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారా, హిల్లరీ గెలిచారా అన్నది ముఖ్యం కాదు. వారికి విరాళాలు ఎలాంటి సంస్థలు, ఎలాంటి కంపెనీలు విరాళాలు ఇచ్చాయన్నది ముఖ్యం. -
ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య'
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తుందని సర్వేలన్నీ వెల్లడిస్తుంటే 'చాణక్య' మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని జోస్యం చెప్పింది. 'చాణక్య' అంటే మనిషి కాదు. బుల్లి చేప. మత్స్య ప్రేమికుడు ఆర్. వరుణ్ దీనిని పెంచుకుంటున్నారు. గతంలో చాణక్య చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో దీని జోస్యంపై జనానికి గురి కుదిరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చాణక్య జోస్యం ఆసక్తికరంగా మారింది. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచారు. ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని చాణక్య జోస్యం చెప్పింది. అయితే అమెరికా నుంచి వెలువడుతున్న ఫలితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. కాగా, ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. యూరో కప్ లో భాగంగా జూన్18న క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ విజయం సాధిస్తుందని అది కరెక్టుగా అంచనా వేసింది. తర్వాత రోజు జరిగిన మ్యాచుల్లో చాణక్య చెప్పిన జోస్యం నిజమైంది. 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. -
హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు!
ఇదీ.. మార్కెట్ల తాత్కాలిక వైఖరి రేపు మార్కెట్ల ఆరంభంకల్లా తొలి ఫలితాలు ఫలితమేదైనా తక్షణ స్పందన దూకుడుగానే! మధ్య, దీర్ఘకాలంలో దేశీ మార్కెట్లు పటిష్ఠమే హిల్లరీ గెలిస్తే డిసెంబర్లో ఫెడ్ రేటు పెంపు చాన్స్ మన మార్కెట్లకు ట్రంప్ కన్నా పెద్ద సమస్య ఫెడ్ రేటే మెల్లగా డాలరు నిధులు తరలిపోయే అవకాశం ట్రంప్ గెలిస్తే తక్షణం బారీ పతనానికి అవకాశం ఫెడ్ రేటు మాత్రం పెరగకపోవచ్చు... సాక్షి, బిజినెస్ విభాగం : హిల్లరియా.. ట్రంపా? మరో 24 గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం రావచ్చు. కానీ ఆ సమాధానం వచ్చాక మన మార్కెట్ల పరిస్థితేంటి? ఎగబాకుతాయా? పడిపోతాయా? మామూలుగా ఉంటాయా? ఇవే ఇపుడు ఇన్వెస్టర్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజంగా అమెరికా ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికా అందుకు అతీతమేమీ కాదు. గెలుపోటములు ఇద్దరి మధ్యా ఎలా దోబూచులాడుతున్నాయో... గత 10 రోజులుగా మార్కెట్లలో హెచ్చుతగ్గులూ అలాగే ఉంటున్నారుు. దాదాపు 7-8 రోజులపాటు మన మార్కెట్ దాదాపు 5 శాతం పతనంకాగా, సోమవారం 1.2 శాతం వరకూ ర్యాలీ జరిపింది. డొనాల్డ్ ట్రంప్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో సహా వివిధ అంశాలపై చేస్తున్న ప్రకటనలతో ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఏదో ఒరిగిపోతుందన్న భావన లేనప్పటికీ, ప్రస్తుత విధానాలు కొనసాగుతాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు స్థిమితంగా ఉన్నారు. ట్రంప్ గెలిస్తే ప్రపంచ మార్కెట్లు మరో 3-5% మధ్య క్షీణించవచ్చని సిటీ గ్రూప్ అంచనావేస్తుండగా, హిల్లరీ విజయం సాధిస్తే... మార్కెట్లు ఇప్పటివరకూ చవిచూసిన నష్టశాతాన్ని పూడ్చుకోవొచ్చన్న అంచనాలున్నాయి. 2-4% మధ్య పెరగవచ్చు. హిల్లరీ గెలిస్తేనే ఫెడ్ రేటు పెంపు!! విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే... గెలుపోటములు వెల్లడైన ఒక్కరోజులో ఏమీ జరిగిపోదు. కానీ మార్కెట్ల స్పందన తాత్కాలికమే అ యినా ఆ రోజు దూకుడుగానే ఉంటుంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం క్లింటన్ గెలిస్తే డిసెంబర్లో ఫెడ్ తన ఫండ్ రేటును పెంచే అవకాశాలుంటాయి. రేట్ల పెంపునకు అనువైన దిశగా అక్కడి జాబ్స్ మార్కెట్ మెరుగుపడటం, ద్రవ్యోల్బణం పెరగడం జరుగుతోంది. దీంతో ఆ నెలలో రేట్ల పెంపునకు 80% వరకూ అవకాశాలున్నట్లు అక్కడి ఫెడ్ ఫండ్స ఫ్యూచర్స్‌లో జరుగుతున్న ట్రేడింగ్ సూచిస్తోంది. అందుకే హిల్లరీ అనుకూల ప్రీపోల్ సర్వే ప్రభావంతో సోమవారం డాలరు ఇండెక్స్ భారీగా పెరిగింది. మరోవైపు బంగారం ధర పడిపోయింది.అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లకంటే పెద్ద ర్యాలీ జరుపుతున్నాయి. అక్కడ వడ్డీ రేట్ల పెంపు భారత్‌లాంటి వర్థమాన మార్కెట్లకు ముప్పుగానీ, అమెరికాకు కాదు. ఇతర దేశాల్లోకి తరలివెళ్లిన డాలరు పెట్టుబడులన్నీ మళ్లీ స్వదేశానికొచ్చే అవకాశాలుండటమే ఇందుకు కారణం. అరుుతే ట్రంప్ గెలిస్తే ఫైనాన్షియల్ మార్కెట్లు తాత్కాలికంగా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. రష్యా వంటి ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ కరెక్షన్కు గురవుతారుు. పరిస్థితులు దిగజారుతాయి కనక డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో డాలరు బలహీనపడుతుంది. బంగారం ధర పెరుగుతుంది. కానీ ఇది భారత్ స్టాక్ మార్కెట్‌కు దీర్ఘకాలంలో అంత సమస్యాత్మకమేమీ కాదని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే భారత్, ఇండోనేషియా వంటి మార్కెట్లు సొంత వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయని, అందుకని వీటికి సమస్యలొచ్చినా అవి తాత్కాలికమేనని వారు చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదలే పెద్ద రిస్క్.... గతేడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచాక రెండు నెలలపాటు మన మార్కెట్ 20 శాతం వరకూ పడిపోరుుంది. ఇక్కడి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40,000 కోట్లకుపైగా నిధుల్ని ఉపసంహరించుకోవటమే ఇందుకు కారణం. ఈ డిసెంబర్లో రేట్లు పెరిగితే మరింత భారీగా నిధులు మన మార్కెట్ నుంచి తరలివెళ్లే అవకాశాలుంటాయి. విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లుగా ఇండియాలో ఈక్విటీ కంటే డెట్ మార్కెట్లోనే అత్యధికంగా పెట్టుబడి పెట్టారు. అమెరికాలో రేట్లు పెరిగితే... వారికి ఇక్కడ బాండ్ల నుంచి వచ్చే కరెన్సీ రిస్క్‌తో కూడిన 7-8 శాతం రాబడి ఆకర్షణీయంగా కనిపించదు. పైగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతారుు. దాంతో ఇక్కడి డెట్ మార్కెట్ నుంచి డాలరు నిధుల్ని వారు తరలించుకుపోయే ప్రమాదం ఉటుంది. . కానీ ట్రంప్ గెలిస్తే ఫెడ్ రేట్ల పెంపు భయం ఉండదని, దాంతో తాత్కాలికంగా స్టాక్ మార్కెట్ పడిపోరుునా, మధ్యకాలికంగా తిరిగి పుంజుకుంటుందని, నిధులు తరలివెళ్లే ప్రమాదం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు గెలిస్తే ఏమవుతుందో.. అమెరికన్ స్టాక్స్ ట్రంప్ గెలిస్తే: పతనం కావచ్చు. హెచ్చుతగ్గులు పెరుగుతాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ దెబ్బతింటాయి. దీర్ఘకాల ఇన్ఫ్రా షేర్లు బాగుంటాయి. హిల్లరీ గెలిస్తే: ఈ మధ్య జరిగిన పతనాన్ని పూడుస్తూ ర్యాలీ జరగొచ్చు. బ్యాంకులు, ఫార్మా సంస్థలు నియంత్రణ భయాలతో దెబ్బతినొచ్చు. అమెరికన్ డాలర్ ట్రంప్: రక్షణాత్మక వాదం కారణంగా అభివృద్ధి చెందిన స్విస్ ప్రాంక్, జపాన్ యెన్ వంటి కరెన్సీలతో పోలిస్తే పడిపోవచ్చు. కానీ పన్ను రాయితీలు, వ్యయం పెరిగితే మెల్లగా కోలుకోవచ్చు. హిల్లరీ: అభివృద్ధి చెందిన కరెన్సీలతో పోలిస్తే పెరగొచ్చు. రూపాయి వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే పెద్దగా మార్పు ఉండదు. కమోడిటీలు ట్రంప్: అందరూ ఇటే చూస్తారు కనక బంగారం, ఇతర విలువైన లోహాలు బాగా పెరుగుతాయి. ఇరాన్ వ్యతిరేక వైఖరితో చమురు ధరలు స్థిరంగా ఉండొచ్చు. బొగ్గుకు అనుకూల వైఖరి గ్యాస్‌కు మంచిదికాదు. హిల్లరీ: చమురు, బొగ్గుకు హిల్లరీ విధానాలు ఏమంత అనుకూలం కావు. సంప్రదాయేతర ఇంధన వనరులకు మంచి రోజులొస్తారుు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ట్రంప్: వాణిజ్య ఒప్పందాలపై దాటవేత వైఖరి వల్ల రష్యాకు తప్ప ఇతర దేశాల మార్కెట్లకు ప్రతికూలమే. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థల కారణంగా ఇండియా వంటి మార్కెట్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. హిల్లరీ: రిస్కుతో కూడిన ఇన్వెస్ట్మెంట్లవైపు మరిన్ని అమెరికన్ కంపెనీలు మొగ్గు చూపుతాయి. విదేశీ మార్కెట్లలో సానుకూల పరిస్థితి ఉంటుంది. -
పోలింగ్‌కు ముందు రోజు అమెరికాపై దాడులు!
-
ట్రంప్ ను ముద్దాడిన 'మంకీ కింగ్'
షాంఘై: 2010 ఫుట్ బాల్ ప్రపంచకప్ విజేతను ముందుగానే చెప్పిన ఆక్టోపస్ 'పాల్' మీకు గుర్తుంది కదూ. అచ్చు అలానే చైనాకు చెందిన ఓ కోతి అమెరిక అధ్యక్ష ఎన్నికల విజేతపై జోస్యం చెప్పింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికౌతారని చైనాలోని మంకీ కింగ్ 'గెడా' చెప్పిందటా. జూ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇరువురి నేతల వైపు కొంత సేపు తీక్షణంగా చూసిన గెడా ట్రంప్ కటౌట్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ కటౌట్ ను కౌగిలించుకుని ఆయన పెదవులను గెడా ముద్దాడినట్టు పేర్కొన్నారు. గెడా ఈ ఏడాది జరిగిన యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ విజేతను ముందుగానే చెప్పింది. యూరోపియన్ చాంపియన్ షిప్ ఫైనల్ కు పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు దూసుకెళ్లిన తర్వాత ఫైనల్లో పోర్చుగల గెలుస్తుందని చెప్పింది. అది ఎలా అంటే.. పోర్చుగల్, ఫ్రాన్స్ జాతీయ జెండాల వద్ద అరటి పండును ఉంచారట. ఆ తర్వాత గెడాను ఆ జెండాల ముందు వదిలేశారు. కొద్ది సేపు ఆలోచించుకున్న గెడా పోర్చుగల్ వద్ద ఉన్న అరటిపండును తీసుకుని ఆరగించినట్లు జూ నిర్వహకులు తెలిపారు. ప్రస్తుతం చైనాలోని షియాన్హూ ఎకోలాజికల్ టూరిజం పార్కులో మంకీ కింగ్ 'గెడా' ఉంటోంది. -
పోలింగ్‌కు ముందు రోజు అమెరికాపై దాడులు!
వాషింగ్టన్: ఎన్నికల వేళ అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందటూ ప్రముఖ మీడియా సంస్థ శుక్రవారం బాంబు పేల్చింది. అధికారులంతా ఎన్నికల నిర్వహణలో తనమునకలైనవేళ అల్ కాయిదా ఉగ్రవాదులు దాడులకు దిగబోతున్నారని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) శుక్రవారం ఒక రిపోర్టును ప్రచురిచంది. దీంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడ్డట్లైంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందు (సోమవారం) అల్ కాయిదా దాడులకు దిగనుందని, కీలకమైన న్యూయార్క్ టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో ముష్కరులు విరుచుపడే అవకాశాలున్నాయని సీబీఎస్ తన రిపోర్టులో పేర్కొంది. ఈమేరకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికే స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీచేశారని కూడా సీబీఎస్ పేర్కొంది. అయితే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బీఐ) మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. అలాగని తిరస్కరించనూలేదు. ఉగ్రవాద నిరోదక విభాగం, దేశీ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, అనుకోని ఉపద్రవం ఎదురైతే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్ బీఐ సమాధానం ఇచ్చినట్లు సీబీఎస్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో రిగ్గింగ్, ఎన్నికల సరళికి సంబంధించిన వెబ్ సైట్ల హ్యాకింగ్ తదితర రూపాల్లోనూ దాడులు జరిగే అవకాశాలున్నట్లు సీబీఎస్ అభిప్రాయపడింది. -
వైట్‌హౌస్ టైట్ ఫైట్ -మార్కెట్లు కుదేలు
వైట్ హౌస్ పగ్గాలకోసం అమెరికాలో హోరా హోరీ పోరు నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో క్షణానికోసారి అంచనాలు తారుమారవుతున్నాయి. ఇప్పటివరకూ డొమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, తాజా సర్వేలో అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందుకు దూసుకు వచ్చారు. దాదాపు 1-2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో అమెరికా సహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. వాల్ స్ట్రీట్ 4 నెలల కనిష్టం వద్దముగిసింది. చైనా షాంఘై o.6శాతం ఆసియా పసిఫిక్ 0. 4 శాతం, జపాన్ నిక్కి 1.1 శాతం నష్టపోయింది. అలాగే ఆరంభంలోనే భారీ నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్‌మార్కెట్లలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లు పైగా పతనమయ్యాయి. ముఖ్యంగా పీఎస్ యూ, ఆయిల్ అండ్ గ్యాస్,రియల్టీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రభుత్వ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఓన్ జీసీ, ఎస్ బీఐ, సన్ ఫార్మా, ఎం అడ్ ఎం లాంటి దిగ్గజాలు నేల చూపులు చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ లో పీఎన్బీ, ఓబీసీ, బీవోఐ, కెనరా, ఐడీబీఐ, బీవోబీ, సిండికేట్, స్టేట్‌బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యూనియన్, అలహాబాద్ బ్యాంక్ 4-3 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ప్రయివేట్ బ్యాంకు షేర్లలోనూ ఫెడరల్, యస్ బ్యాంక్, కరూర్ వైశ్యా, ఐసీఐసీఐ, ఐడిఎఫ్సీ, యాక్సిస్ తదితర షేర్లలోనూ ఇదే ధోరణి నెలకొంది. అటు ఫెడ్ అంచనాలతోడాలర్ బలహీనత కొనసాగుతుండగా, ఇటు దేశీయ కరెన్సీ 7 పైస లనష్టంతో 66.79 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు మాత్రం ఒక నెల గరిష్టాన్నినమోదు చేశాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 200 రూపాయల లాభంతో రూ. 30485 వద్ద బలంగా ఉంది.