
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ స్థానంలో పోటీలోకి వచ్చిన ఆమె కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు.
ఓ వైపు డెమొక్రాట్లలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో పాటు ట్రంప్ తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. ఎన్నికల రేసులో కమల దూసుకెళ్తున్నప్పటికీ అధ్యక్ష కుర్చీ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని ఆమె ప్రచార టీమ్ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లోని అతి తక్కువ ఓటర్లే విజేతను నిర్ణయించే విషయంలో కీలకంగా మారనున్నారని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment