Donations
-
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్‌కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్‌తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
‘ఎంఈఐఎల్’ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్‌టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు హైదరాబాద్‌లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రూ.కోటి చొప్పున.. సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. -
కమలా హారిస్‌కు ఒక్క నెలలో రూ.3,030 కోట్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది. తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్‌కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి. -
వరదల పేరుతో సర్కారు చందాల వేట
‘‘అందరికీ నమస్తే.. అమ్మా పక్కన పెట్టిన తీర్మానాన్ని ప్రతి గ్రూపులోని వారి పొదుపు ఖాతాల నుంచి సమాఖ్యలకు రూ.500 తగ్గకుండా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఈ మొత్తం అమౌంట్‌ను టీఎల్ఎఫ్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించాలి’’. .. ఇది డ్వాక్రా సంఘాలకు వీఓఏలు, ఆర్పీల నుంచి వస్తున్న మెసేజ్‌లు. ఈ తంతు అంతా ఏదో వారికి మేలు చేసేందుకో లేక ఆదుకునేందుకో కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమందించేందుకు చేస్తున్న నయా దందా ఇది. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, బాపట్ల/తాడికొండనిజానికి.. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు నష్టపోతే ఎక్కడైనా ప్రభుత్వాలు తక్షణం స్పందిస్తాయి. బాధితులను అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. పెద్దస్థాయిలో నష్టం జరిగితే ఆరి్థకంగా లేదా ఇతరత్రా పూర్తిస్థాయిలో సహాయం అందించి ఆదుకోలేకపోయినా.. తక్షణ సాయంతో ఉపశమనం కలిగించి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.. చేయగలిగినంత చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం సంగతి పక్కనబెట్టి దాని పేరున చందాలు వసూలుకు తెరలేపింది. దీనికి విరాళాలు అని ముద్దుపేరు పెట్టి చంద్రబాబు అండ్ కో వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో అమరావతి నిర్మాణానికి చందాలు, ఇటుకలు అంటూ చేస్తే ఇటీవల అన్న క్యాంటీన్లను ప్రారంభించి వాటికీ విరాళాలు వసూలుచేస్తున్నారు. ఇప్పుడు వరదల నేపథ్యంలో.. చందాలు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఏకంగా కలెక్టర్ల నెత్తిన పెట్టడంతోపాటు డ్వాక్రా సంఘాలనూ వసూలుచేసి ఇమ్మంటూ బెదిరింపులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో వరదలొచ్చి వారం గడిచినా ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిన పాపాన పోలేదు. పరిహారం కింద దేనికి ఎంతిస్తారో చంద్రబాబు నోరు విప్పడంలేదు. అసలిస్తారో లేదో తెలీడంలేదు. ఒక్కో ‘సంఘం’ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. మరోవైపు.. రాష్ట్రంలో దాదాపు 9 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఉండగా.. పది మంది సభ్యులుండే ఒక్కో సంఘం రూ.500 నుంచి రూ.1,000 వరకు వెంటనే ఫోన్‌పే ద్వారా లేదంటే నగదు రూపంలో గ్రామ సమాఖ్యలకు లేదా పొదుపు ఖాతాల్లో నుంచి ఎస్ఎఫ్ఎల్ ఖాతాల్లోకి తప్పనిసరిగా అందజేయాలని అధికారులు ఫోన్లలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పొదుపు సంఘాల మహిళలు గ్రూపుల వారీగా వాళ్ల గ్రామ సమాఖ్యకు.. గ్రామ సమాఖ్యల నుంచి జిల్లాల వారీగా జిల్లా సమాఖ్యలు, వారి నుంచి రాష్ట్ర సమాఖ్య ఒకే మొత్తంగా నిధులు పోగుచేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా సీఎం సహాయ నిధికి చెక్ రూపంలో సీఎంకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నుంచి అందిన సూచనల ప్రకారం.. సీఎం సహాయక నిధికి ఏయే పొదుపు సంఘాల్లో ఎవరెవరు ఇవ్వలేదో, వారి పేర్లను నమోదు చేసుకుంటామని, ఇవ్వనివారికి రిమార్కు రాస్తామంటూ అధికారులు ఫోన్లలోనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిమార్కులు రాస్తే భవిష్యత్‌లో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందిపడతారని కూడా హెచ్చరిస్తున్నట్లు మంగళగిరి మండలం నూతక్కి పొదుపు మహిళలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని 1,259 డ్వాక్రా గ్రూపుల నుంచి మొత్తం రూ.6,29,600 వసూలుచేసి ఇచ్చినట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఇక గత జులైలోనూ రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ పొదుపు సంఘాల మహిళల నుంచి బలవంతపు వసూళ్ల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.కలెక్టర్లకు చందాల బాధ్యతలు.. వరద పేరుచెప్పి ప్రజల నుంచి చందాలు వసూలుచేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను పురమాయించింది. దీంతో.. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ‘జిల్లా కలెక్టర్ రిలీఫ్ ఫండ్, బాపట్ల’ పేరుతో ఒక యూనియన్ బ్యాంకు ఖాతా (నంబర్ 003712010002548) తెరిచారు. ఈ నెంబర్‌కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చందాలు పంపాలని కోరారు. వ్యక్తిగతంగా లేదా స్వచ్ఛంద సంస్థలు చందాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిధులిస్తే ప్రజలకు సాయమందించాల్సిన కలెక్టర్‌కు జనం నుంచి చందాలు వసూళ్లు చేసే కార్యక్రమం కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహారం చూస్తే జిల్లాలో వచ్చే చందా వసూళ్లను బట్టి వరద బాధిత ప్రజలకు పరిహారం ఉంటుందేమోనన్న అనుమానాలు బాధితులు వ్యక్తంచేస్తున్నారు.గతంలో ఎప్పుడూ ఇలాలేదు..గతంలో రాష్ట్రంలో పలుమార్లు వరదలు వచ్చినా ఏనాడూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను చందాలు అడిగిన దాఖలాల్లేవని.. ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త రకం దందాకు తెరలేపడంపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూలీ నాలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్న పేద మహిళల దగ్గర బలవంతంగా వసూళ్లు చేయడమేమిటని మండిపడుతున్నారు. అయినా, ఫోన్‌పే నంబర్లకు నగదు వేయాలంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని మహిళలు ప్రశి్నస్తున్నారు. -
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాలకు వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.తాజాగా విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం సాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చాడు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్ రామ్ కలిశాడు. ఈ సందర్భంగా విరాళం అందజేశాడు. తన వంతు సాయంగా కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న నగదు రూ. 10వేలను వైఎస్ జగన్‌కు అందించాడు. వరద బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ డబ్బు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అభయ్ రామ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కాగా, అభయ్ ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్నాడు. విరాళం అందజేసిన సందర్భంగా బాలుడితో అభయ్ రామ్ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వైఎస్ జగన్‌ను కలిశారు.మరోవైపు.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్సార్సీపీ నేత కట్టా మహేష్ తన వంతు సాయంగా వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను వైఎస్ జగన్‌కు అందజేశారు. -
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
సినీ తారల వరదసాయం...
-
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
అభివృద్ధి, సంక్షేమం, అన్న క్యాంటీన్లు.. అన్నీ విరాళాలతోనే..
సాక్షి, అమరావతి: దాతలు, ప్రజల విరాళాలతో జన్మభూమి–2 ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చెప్పారు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధిలో పార్టీ అండగా ఉంటుందన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపించడానికి ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కారి్మకులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారని, ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పని చేశారని చంద్రబాబు అన్నారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయతి్నంచిన విధంగానే మదనపల్లెలో భూ కుంభకోణాల సాక్ష్యాలను తారుమారుకు కూడా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని చెప్పినట్లుగానే.. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్‌గా ప్రచారం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని అన్నారు. 13 లక్షలకు పైగా అసైన్డ్ భూములను కాజేశారని, 40 వేల ఎకరాలు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. 22ఏను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని అన్నారు. అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటుఅనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నరేగా, నీరు–చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్‌లో వచి్చన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్టు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, దోపిడీపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబు పొలిట్‌బ్యూరోలో వివరించినట్టు సమాచారం. -
కమలా హారిస్ జోరు.. వారంలోనే భారీగా విరాళాలు
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ స్థానంలో పోటీలోకి వచ్చిన ఆమె కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు.ఓ వైపు డెమొక్రాట్లలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో పాటు ట్రంప్ తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. ఎన్నికల రేసులో కమల దూసుకెళ్తున్నప్పటికీ అధ్యక్ష కుర్చీ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని ఆమె ప్రచార టీమ్ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లోని అతి తక్కువ ఓటర్లే విజేతను నిర్ణయించే విషయంలో కీలకంగా మారనున్నారని వారు చెబుతున్నారు. -
కమలా హారిస్‌కు మద్దతుగా ట్రంప్ విరాళం!.. జోరుగా సెటైర్లు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన ప్రతిపాదించడం, మద్దతు కూడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. అదే టైంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది.బైడెన్ వైదొలగిన తర్వాత హారిస్ ప్రచారం బృందం 24 గంటల్లో 81 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది. దీంట్లో 60 శాతం తొలిసారి దాతల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మరి కమలా హారిస్‌కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘కానుక’ సంగతి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు.2011 సెప్టెంబర్‌లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్నారు. ఆమె మళ్లీ పోటీ చేయడం కోసం ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ జరిగింది. ఆ సమయంలో ట్రంప్ తరఫున 6,000 డాలర్ల డొనేషన్ కమలా హారిస్‌కు వెళ్లింది. ఇందులో 5,000 డాలర్లను ట్రంప్ సంతకంతో కూడిన చెక్ డొనేషన్ రూపంలో ఆమెకు వెళ్లింది. మరో వెయ్యి డాలర్లు 2013 ఫిబ్రవరిలో ట్రంప్ పేరిట హారిస్ ఖాతాలోకి వెళ్లింది. ఇక.. 2014 జూన్‌లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రీ-ఎలక్షన్ కమిటీ సభ్యురాలైన ట్రంప్ కూతురు ఇవాంకా.. మరో 2,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంటే.. మొత్తంగా ట్రంప్ కుటుంబం 8,000 డాలర్లను డొనేషన్ రూపంలో కమలా హారిస్‌కు మద్దతుగా ఇచ్చిందన్నమాట. అయితే ఇది ఆ కుటుంబం కావాలని చేసిన పనేం కాదు. అప్పటి న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ఎరిక్ ష్నీడెర్మాన్ కమలా హారిస్ తరఫున ఫండ్ రైజర్‌గా ఉండగా.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రంప్ కుటుంబం అలా డొనేషన్లు ఇచ్చింది.ఇక ఇప్పుడు ఆ డొనేషన్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫ్లోరిడా డెమోక్రటిక్ సభ్యుడు జరెడ్ మోస్కోవిట్జ్ ఎక్స్ వేదికగా ‘‘తెలివైన పెట్టుబడి’’ అని చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించుకోలేరని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తారో అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.కొసమెరుపు ఏంటంటే.. శాక్రమెంటో బీ పత్రికా కథనం ప్రకారం.. 2020లో యూఎస్ సెనేట్‌కు కమలా హారిస్ పోటీ చేశారు. ఆ టైంలో ఆ 6 వేల డాలర్ల మొత్తాన్ని ఆమె సెంట్రల్ అమెరికాలోని ఓ పౌర హక్కుల సంస్థకు విరాళంగా ఇచ్చారట. -
Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్‌ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది. -
Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
సాక్షి, యాదాద్రి : ఆరు నెలల బాబుకు అలవికాని జబ్బు వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చిన్నారి వైద్యానికి రూ.16 కోట్లు అవసరం కాగా, విదేశాల నుంచి రూ.10 కోట్లు దాతల విరాళాలు అందాయి. మిగతా రూ.6 కోట్లు మన దేశంలోనే సమకూర్చుకోవాలని చెప్పడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి–యామిని దంపతులకు ఆరు నెలల వయస్సున్న భవిక్‌రెడ్డి స్పైనల్ మస్కలర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. లక్షల్లో ఒక్కరికి వచ్చే అత్యంత ప్రాణాంతకమైన జబ్బుగా పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు. భవిక్‌రెడ్డికి నరాల కండరాల బలహీనత ఎస్ఎమ్ఏ టైప్ –1 హైరిస్క్‌గా డాక్టర్లు నిర్ధారించారు. వ్యాధిని నయం చేసే ఇంజెక్షన్ ఇవ్వకపోతే చనిపోతాడని డాక్టర్లు అంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా అమెరికాలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు అని వైద్యం చేస్తున్న హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేశ్ కోణంకి పర్యవేక్షణలో బాబుకు వైద్యం జరుగుతోంది. రెయిన్బో ఆస్పత్రి సౌజన్యంతోనే విదేశాల నుంచి సుమారు రూ.10 కోట్ల విరాళాలు ఇప్పటికే సేకరించారు. మరో రూ.6 కోట్లు ఇక్కడే సమకూర్చుకోవాలని వైద్యులు చెప్పారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు దాతల సహకారం కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే కోసం : 9640160506, అకౌంట్ హోల్డర్ పేరు : కొలను దిలీప్‌రెడ్డి ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0021766, బ్యాంక్ అకౌంట్ నంబర్ : 42380569990 బ్యాంకు బ్రాంచ్: ఎస్బీఐ వలిగొండ. -
బాండ్లను డ్రాప్ బాక్స్‌లో పడేశారు..
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్ కాంగ్రెస్ స్పందించడం విశేషం. టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు. వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్ బయట ఒక డ్రాప్‌బాక్స్ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్ ఘోష్ చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎలక్టోరల్ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్‌కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేసింది. -
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్‌కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్‌పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
10 రోజుల్లో రూ. 12 కోట్లు.. బాలరాముని ఆదాయం!
అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్‌లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు. ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు?
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి విరాళాల రూపంలో ఇంతవరకూ ఎంత మొత్తం వచ్చిందనే ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. అలాగే ఎవరు అత్యధిక మొత్తంలో విరాళం సమర్పించారనే దానిపై కూడా చాలామంది ఆలోచించే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు మీడియా దగ్గరున్న సమాధానం తెలుసుకుందాం. అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని రామమందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 డిసెంబర్ ఆఖరువరకూ రామాలయ నిర్మాణానికి ఐదువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం విరాళాల రూపంలో అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీ బాపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అత్యధిక విరాళం అందించారు. మొరారీ బాపు నూతన రామాలయ నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. దీనికితోడు యూఎస్ఏ, కెనడా,యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అయోధ్యలోని రామాలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఉన్న రామభక్తుడు (పేరు వెల్లడించలేదు) ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్నిఅప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021, జనవరి 14న ప్రారంభించారు. రామ మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్. ఆయన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెక్కు రూపంలో రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ఇది కూడా చదవండి: నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేల కళాకారుల ప్రదర్శనలు! -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది.