తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వారికి సాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ సంస్థలు సంయుక్తంగా కలిసి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) సభ్యులను ఆదుకునే విధంగా రూ. 12 కోట్లను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఫెఫ్సీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖుషీతో, నటుడు ప్రభు సహకారంతో సోనీ టీవీ, కల్యాణి జువెలర్స్ సంస్థలు ఫెఫ్సీకి రూ. 12 కోట్లను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ. 2 కోట్ల 70 లక్షలను సినీ కార్మికుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సంఘ సభ్యులు 1800 మందికి తలా రూ. 1,500 విలువ చేసే బిగ్ బజార్ కూపన్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య కార్యదర్శి, దర్శకుడు ఉన్నికృష్ణన్‌కు కల్యాణి జువెలర్స్, సోనీ టీవీ సంస్థలకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment