sony tv
-
కుప్పకూలిన దిగ్గజ కంపెనీ స్టాక్..
-
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
సోనీ బ్రావియా కొత్త టీవీలు
విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్70ఎల్, బ్రావియా ఎక్స్75ఎల్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఎక్స్1 4కే ప్రోసెసర్, లైవ్ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్ ఫేస్ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్‌తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను కలిగిన గూగుల్ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్–ప్రొటెక్షన్ పీఆర్ఓ, వాయిస్ ఆధారిత రిమోట్–స్మార్ట్ రిమోట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఎక్స్ 75ఎల్ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్70ఎల్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో కేడి–43 ఎక్స్70ఎల్ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్70ఎల్ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్‌లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో, ఈ–కామర్స్ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది. -
కౌన్ బనేగా కరోడ్‌పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) అభిమానులకు గుడ్‌న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్‌పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని
ఇండియాలోనే అతి పెద్ద టీవీ, ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా చెప్పుకుంటున్న జీ - సోనీ విలీన ప్రక్రియలో మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్లు పట్టు వదిలేందుకు సిద్ధంగా లేరు. ఇన్వెస్కో లేఖ జీ లిమిటెడ్‌కి ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయోంకాను తొలగించడంతో పాటు ఆరుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ జీలో మేజర్ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఇన్వెస్కో జీ బోర్డును కోరింది. అందుకు గల కారణాలు వివరిస్తూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెరపైకి విలీనం ఇన్వెస్కో నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన జీ బోర్డు ఇద్దరు డైరెక్టర్లను తప్పించింది. అనంతరం సోనీతో చర్చలు ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో జీ విలీనం అవుతున్నట్టు భారీ డీల్‌ని సెప్టెంబరు 22న ప్రకటించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు సైతం పునీత్ గోయెంకానే ఎండీగా ఉంటాడని ప్రకటించింది. దీంతో వివాదం సమసిపోతుందని జీ భావించింది. ఇన్వెస్కో కోరినట్టు అత్యవసర సమావేశం నిర్వహించలేదు. న్యాయ పోరాటం జీలో మేజర్ షేర్ హోల్డర్‌గా తాము అభ్యంతరం చెప్పిన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా విలీన ప్రక్రియ జరపడం, ఆ తర్వాత పునీత్ గోయెంకానే తిరిగి ఎండీగా నియమించడం పట్ల ఇన్వెస్కో అసంతృప్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతుంది. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనికి చిక్కులు జీని విలీనం చేసుకోవడం ద్వారా ఒకే సారి అర్బన్, రూరల్ మార్కెట్లతో పాటు హిందీ, రీజనల్ లాంగ్వెజ్లలో మరింతగా విస్తరించాలనుకున్న సోనికి ఇన్వెస్కో వ్యవహరం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. జీ అంతర్గత సమస్యలు ఇప్పుడు సోనిని కూడా చుట్టుముట్టాయి నామ్‌కే వాస్తే సుభాష్ చంద్ర స్థాపించిన జీ మీడియాలో ప్రస్తుతం ఆయన వాటా కేవలం 5 శాతమే. చాలా మంది ఆ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. నిన్నా మొన్న సోనీతో విలీన ప్రక్రియ ముగిసే వరకు ఇన్వెస్కో సంస్థ జీలో మేజర్ పెట్టుబడిదారుగా ఉంది. చదవండి: సోనీకి ‘జీ’ హుజూర్! -
ఇండియన్ ఐడల్ 12 విన్నర్‌గా పవన్‌దీప్ రాజన్
సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది. ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు టైటిల్ ట్రోఫీతో పాటు, రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఇక గ్రాండ్ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్ అలీ. మనోజ్ ముంతాషిర్, మిల్కాసింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఎన్నో ఆశలతో ఫైనల్స్‌కు అడుగుపెట్టిన తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ టైటిల్ వేటలో అవకాశాన్ని చేజార్చుకుంది. -
పదేళ్లుగా ఆ పనిలోనే ఉన్నా!
‘‘నేను విజువల్ ఎఫెక్ట్ జాబ్ చేస్తూ, ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి వచ్చాను. వీలైనన్ని కొత్త కథల్ని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను... అది కమర్షియల్ అయినా, ఆర్ట్స్ వరల్డ్‌లో అయినా. అలాగే ఒక నటుడిగా నేను కొత్త పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకున్నాను. కమర్షియల్, యాక్షన్, అడ్వంచరస్, మైథాలజీ సినిమాలు చేయడం నాకిష్టం’’ అన్నారు రానా. సోనీ టెన్ 4 తెలుగు చానల్‌కి ‘ఫేస్’గా వ్యవహరిస్తున్నారు రానా. ఈ సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ఈ విధంగా... ► మా నాన్నగారు (నిర్మాత డి. సురేశ్‌బాబు), బాబాయ్ (నటుడు వెంకటేశ్) లకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్‌ను బాగా చూస్తారు. అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ చూడటానికి మా నాన్నగారు కొన్నిసార్లు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తారు. నా యంగ్ ఏజ్ నుంచీ స్పోర్ట్స్ మీద నాన్న, బాబాయ్‌లకు ఉన్న ఇంట్రస్ట్ చూడటం వల్ల నాకూ ఆసక్తి ఏర్పడింది. స్కూల్ టైమ్‌లో నాకు రెజ్లింగ్ అంటే చాలా ఆసక్తి ఉండేది. ఇప్పుడు సోనీ వారితో అసోసియేట్ అయి, తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ వ్యాఖ్యానం తెలుగులో కూడా వినిపిస్తుంది. ∙సాధారణంగా మనందరం క్రికెట్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యుంటాం. ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సినిమా, ఆర్ట్, స్పోర్ట్స్ అనేవి ప్రజలను ఏకం చేస్తాయి. ఎంటర్టైన్ చేస్తాయి. గేమ్‌లో ఎవరు గెలుస్తారో మనం ముందే ఊహించి చెప్పలేం. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారు. ► పెళ్లైన తర్వాత నా జీవితంలో కొత్త ఎనర్జీ వచ్చింది.. స్ట్రాంగ్‌గా ఉన్నాను. పర్సనల్‌గా ఓ మంచి బిగినింగ్. ఇక కరోనా లాక్డౌన్ వల్ల వచ్చిన గ్యాప్‌లో చాలా కథలు వినే సమయం కుదిరింది.. ఆసక్తికరమైన కథల్ని ఎంచుకున్నాను. వాటిలో ‘విరాటపర్వం’ ఒక్కటి. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత సూపర్ యాక్షన్ హీరో సినిమా చేస్తా. ► సినిమాల ద్వారా ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. వేరే భాషల్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం చాలా ఇష్టం. పదేళ్లుగా నేను అదే పనిలో ఉన్నాను. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఒక్కో ఇండస్ట్రీలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ► ‘బిగ్‌బాస్’కి హోస్ట్‌గా వెళ్లడం లేదు. ఒక ఫిల్మ్ మేకర్‌గా, ఒక ఆర్టిస్ట్‌గా చూస్తే ఓటీటీలో ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తోంది. ప్రస్తుత విపత్తు నుంచి ఓ ఆరునెలల్లో బయటపడతామనిపిస్తోంది. ఓటీటీ వచ్చాక కొత్త కథలకు అవకాశం ఉంటోంది. థియేటర్స్‌లో పెద్ద సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్, స్టార్స్ సినిమాలు వస్తుంటాయి. ఎక్కువగా డ్రామా అన్నది ఓటీటీలోకి వెళ్తుంది. ఫోన్లో, టీవీలో, థియేటర్లో చూసే కథలు వేర్వేరుగా ఉంటాయి. థియేటర్ అనేది పెద్ద అనుభూతిని పంచే ప్రదేశం. అందులోని క్వాలిటీ, సౌండ్ సిస్టమ్స్ మంచి అనుభూతిని ఇస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల థియేటర్స్‌కి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అభిరామ్ (రానా తమ్ముడు) నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. వాడి ప్రయాణం వాడిది. ఇది చెయ్, అది చెయ్, ఇలా వెళ్లు, అలా వెళ్లు.. అని మా ఇంట్లో చెప్పడం ఉండదు. ఏ పని చేసినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని నమ్ముతాం. వాడి బలం ఏంటో ప్రేక్షకులే చెప్పాలి. కచ్చితంగా తను కష్టపడి పని చేస్తాడనే నమ్మకం ఉంది. మా ఫ్యామిలీ ఆర్టిస్టులతో ‘మనం’ లాంటి సినిమా కాదు కానీ కొత్త జోనర్లో సినిమా ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో చూశాను. అద్భుతంగా ఉంది. రాజమౌళిగారి విజన్, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్.. రాజమౌళి... మంచి కాంబినేషన్. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. -
పెళ్లి తర్వాత నా లైఫ్ మారిపోయింది : రానా దగ్గుబాటి
నటుడిగా, ప్రతినాయకుడిగా, యాంకర్‌గా ఎన్నో పాత్రలు పోషించిన రానా ఇప్పుడు మరో కొత్త ఫ్లాట్ ఫాంలోకి అడుగుపెడుతున్నారు. భారత్, శ్రీలంక మ్యాచ్ దగ్గరనుంచి రెజ్లింగ్, టోక్యో 2021, ఒలంపిక్స్ దాకా జరిగే అన్ని అప్డేట్స్ని తెలుగులో పరిచయం చేయనున్నారు. ప్రముఖ ఛానల్ సోనీ టీవీ ఈ మేరకు రానాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి పలు అంశాల గురించి రానా 'సాక్షి'తో ముచ్చటించారు. క్రీడలు, సినిమాలు సహా పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత లైఫ్ చాలా మారిపోయిందన్న రానా త్వరలోనే బాబాయ్ వెంకటేష్, తమ్ముడు అభిరామ్‌లతో సినిమా చేస్తానని పేర్కొన్నారు. ఇక నారప్ప సినిమా ఓటీటీలో రావడం బాధగానే ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ టీజర్ బాగా నచ్చిందని ప్రశంసలు కురిపించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాల కోసం వీడియోను చూడండి. -
మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్!
వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ కొత్త టీవీని లాంచ్ చేసింది. సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ ఈడీ సిరీస్ కింద ఈ స్మార్ట్ టీవీని విడుదల చేస్తున్నట్లు సోనీ ప్రతినిధులు తెలిపారు. దీని ధర రూ.2.99లక్షలుగా నిర్ణయించారు. ఫీచర్స్ విషయానికొస్తే ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ఇంచెంస్ : 65 అంగుళాలు ఓఎల్ఇడి ప్యానెల్ ఎక్స్ ఆర్ కాగ్నిటీవ్ ప్రాసెసర్. ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్ ద్వారా ఎకౌస్టిక్ సర్ఫేస్ ఆడియోని 3డి సరౌండ్ అప్‌స్కేలింగ్‌తో జాగ్రత్త తీసుకుంటుంది. కొత్త బ్రేవియా టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేందుకు వీలుగా బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జె డిజైన్ చేసినట్లు, అందులో గేమ్ మోడ్, హెచ్డిఎంఐ 2.1 సపోర్ట్, 4 కె 120 ఎఫ్పిఎస్, విఆర్ఆర్, ఎల్ఎల్ఎం ఉన్నాయి. గేమ్‌ను ఆస్వాధించి, ధ్వనిని ఆప్టిమైజ్ చేసే యాంబియంట్ ఆప్టిమైజేషన్, లైట్ సెన్సార్,ఎకౌస్టిక్ ఆటో-కాలిబ్రేషన్ ఇందులో ఇమిడి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ , గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలెక్సా స్మార్ట్ పరికరాలు, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్కిట్లతో కూడా పనిచేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చా? నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడి లో ఉపయోగించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలర్, కాంట్రాస్ట్, తదితర ఫీచర్లు హుమన్ బ్రెయిన్ తరహాలో విశ్లేషిస్తుంది. ఈ ఏఐ వల్ల టీవీలో వచ్చే దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సందర్భంగా సోనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలో 77 అంగుళాల వేరియంట్‌తో సహా ఈ సిరీస్‌లో కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. చదవండి: Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?! -
జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం
దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న షణ్ముఖ ప్రియ కొంతకాలం పాటు టీవీషోలకు దూరంగా ఉంది. ఇప్పుడు వర్ధమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12 లో గోల్డెన్మైక్ సాధించి థియేటర్ రౌండ్‌కు చేరుకుంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆమెను ‘జాజ్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసించారంటే ఆమె గాత్ర మాధుర్యాన్ని. అందులోని విలక్షణతను అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 12వ సీజన్ లో ఇప్పటికే సోనీ టీవీ తన ప్రచార మాధ్యమాల ద్వారా ఈమె పాడిన పాటను ప్రోమోగా విడుదల చేసింది. ఈ వీడియోకు లక్షలాది మంది ప్రేక్షకాదరణ లభించింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పుట్టి, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెరిగి, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న పాటల ప్రియ జాతీయ స్థాయిలో తన గాత్ర మాధుర్యాన్ని అందరికీ రుచి చూపిస్తున్న షణ్ముఖ ప్రియను 12వ సీజన్ ఆడిషన్లో భాగంగా కలిసిన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్12లో పాడతానని ఊహించారా ? షణ్ముఖప్రియ : చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలని కోరిక ఉండేది. అనుకున్నట్టుగానే ఎంపికయ్యాను. ఈ సీజన్ 12 సెలక్షన్లకు ఆన్లైన్ ద్వారా కొన్ని వేల మంది హాజరయ్యారు.వారిలో 350మంది ఎంపిక చేసి పరిక్షించగా టాప్ 14లో నేను చోటు సంపాదించాను. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్లో గెలుపొందగలరని విశ్వాసం ఉందా? తప్పనిసరిగా... నాకు ఆ నమ్మకం ఉంది. న్యాయ నిర్ణేతల మెప్పు పొంది ముందుకెళ్తాను. ఇండియన్ ఐడల్‌లో ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ ఆలపించిన జోమ్రు యూడిలింగ్ పాటను ఆలపించాను. అంతేకాకుండా మధ్యలో ఒక ఆడిషన్‌ను జంప్ చేసి థియేటర్ ఆడిషన్‌కు నేరుగా నన్ను పంపించారు. సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు? తల్లిదండ్రులే నాకు స్పూర్తి. మా తల్లిదండ్రులు శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎ. పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు. బాలసుబ్రహ్మణ్యంతో, జానకితో... సాక్షి: మీ విజయం వెనక మీ తలిదండ్రుల కృషి ఏమైనా? మూడేళ్ల వయస్సులో నా ఆసక్తిని గుర్తించారు. అప్పటినుంచి నాకోసం మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి వద్దనే సంగీతం నేర్చుకున్నాను. ఎన్నో వ్యయప్రయాసలు భరించి మరీ నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. సాక్షి: గాయనిగా సాధించిన విజయాలు..? కర్ణాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన ‘సూపర్‌స్టార్ సింగర్’ పోటీలో టైటిల్ పొందాను. జీ తెలుగు సరిగమ లిటిల్ ఛాంప్స్ 2008 విజేతగా నిలిచాను. మా టీవీ సూపర్ సింగర్ 2009లో ఫైనల్‌కు చేరుకున్నాను. స్టార్ విజయ్ తమిళ జూనియర్ సూపర్ స్టార్స్ 2010పోటీల్లో విన్నర్‌గా నిలిచాను. 2013లో ఈటీవీ పాడుతా తీయగా పోటీలో ఫైనల్‌కు వచ్చాను. 2015లో మాటీవీ సూపర్ సింగర్ పోటీల్లో విజేతగా నిలబడ్డాను. జీ టీవీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్ 2017లో రన్నర్‌గా నిలిచాను. తమిళ సూపర్ సింగర్ జూనియర్ 3, స్టార్ ఆఫ్ ఏపీ, సరిగమప నువ్వానేనా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాను. సాక్షి: మీకు గుర్తింపు ఇచ్చిన పాటలేంటి? తమిళంలో ఇంజీఖరుపడగా... (సన్న జాజీ..), ఇందమిసీమినిక్ (ఈ ఎర్ర గులాబీ), కాదళ్ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో ‘గోపమ్మ చేతిలో గోరుముద్ద...’ ‘నిదురపోరా తమ్ముడు...’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ తదితర పాటలతో పాటు గులాం అలీ గజల్స్ ఉన్నాయి. ‘చాంగురే బంగారు రాజా...’ వంటి జానపద గీతాలు కూడా అప్పట్లో నాకు మంచి పేరు తెచ్చాయి. తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌కుమార్‌తో షణ్ముఖప్రియ సాక్షి: ప్రముఖుల ప్రశంసలు షణ్ముఖప్రియ: ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాను. నా పాటను మెచ్చి జాజ్ స్టార్‌గా ఎదుగుతావని మెచ్చుకున్నారు. మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావుతో పాటు చాలా మంది ప్రముఖులు అభినందించారు. ప్రముఖ గాయకులు ఆశాబోస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకీ, చిత్ర, మాల్గాడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ తదితరులు ఆశీర్వదించారు.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముందు ‘పాడుతా తీయగా’లో ‘వీణ వేణువైన..’ పాటతో ప్రస్థానం ప్రారంభించాను. ఆయనెన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడాయన ఉంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. మరాఠీలో సోను నిగమ్‌తో కలిసి డ్యూయట్ పాడాను. సాక్షి: మీ లక్ష్యమేంటి? అటు చదువులోనూ, ఇటు గాయనిగానూ ఎదగాలనుకుంటున్నాను. నేపథ్యగాయని కావడడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా ముందున్న లక్ష్యం. సాక్షి: గాయనిగా వచ్చిన గుర్తింపు మీకు ఏవిధంగా తోడ్పడుతోంది? వర్థమాన గాయనిగా రాణిస్తూనే, మరోవైపు చదువులో మంచి మార్కులు సాధించుకుని లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నాను. ఇంటర్ మొదటి సంవత్పరంలో 9.1, రెండో సంవత్సరంలో 9.7మార్కులు సాధించాను. బీఎస్సీ గణితం చదువుతూ ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాను. నా ప్రతిభను గుర్తించిన శ్రీ చైతన్య యాజమాన్యం నాకు ఉచితంగా చదువు చెబుతోంది. ఈ వయసులో అంతకన్నా మించి నాకు ఏం కావాలంటారు? సాక్షి: ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది? ఏ రియాలటీ షోలో పాల్గొన్నా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. నువ్వు బాగా పాడితే చాలు– మిగతాది మేము చూసుకుంటామంటూ వందల సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. అభినందనలు అందుతున్నాయి. అందరికీ సాక్షి వేదికగా నా ధన్యవాదాలు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ ఆన్లైన్లో..
ముంబై: సోని చానెల్ నిర్వహించే రియాల్టి మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ‘ఇండియన్ ఐడల్-12’ సీజన్ ఆడిషన్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు సోని చానెల్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్‌ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో వీడియోను సోని టీవీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇడియన్ ఐడల్ ఈజ్ బ్యాక్! ఇండియన్ ఐడల్-12 ఆడిషన్స్‌ను సోని లైవ్ యాప్ ద్వారా జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నాము. రెడీగా ఉండండి’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. View this post on Instagram Did you see this surprise coming your way? #IndianIdol is back! Online Auditions for Season 12 begin from 25th July only on Sony Liv App, so get ready for your #GharSeManchTak journey! @sonylivindia @adityanarayanofficial A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Jul 11, 2020 at 7:30am PDT సోని లైవ్ యాప్ ద్వారా ఆసక్తి గల గాయకులు తమ పాటలకు సంబంధించిన వీడియోను పంపించాలని రియాల్టీ షో హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు. నూతన గాయని, గాయకులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆన్లైన్ ఆడిషన్స్‌లో ఎంపికైన వారికి ముంబైలో మరో ఆడిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది కూడా రియాల్టి మ్యూజిక్ షోకి సింగర్ నేహా కక్కర్, బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా, విశాల్ దడ్లాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన సన్నీ హిందూస్థానీ ఇండియన్ ఐడల్ సీజన్-11 టైటివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఫెఫ్సీకి కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ రూ. 12 కోట్ల విరాళం
తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వారికి సాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ సంస్థలు సంయుక్తంగా కలిసి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) సభ్యులను ఆదుకునే విధంగా రూ. 12 కోట్లను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఫెఫ్సీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖుషీతో, నటుడు ప్రభు సహకారంతో సోనీ టీవీ, కల్యాణి జువెలర్స్ సంస్థలు ఫెఫ్సీకి రూ. 12 కోట్లను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ. 2 కోట్ల 70 లక్షలను సినీ కార్మికుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సంఘ సభ్యులు 1800 మందికి తలా రూ. 1,500 విలువ చేసే బిగ్ బజార్ కూపన్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య కార్యదర్శి, దర్శకుడు ఉన్నికృష్ణన్‌కు కల్యాణి జువెలర్స్, సోనీ టీవీ సంస్థలకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
ఇండియన్ ఐడల్‌గా బూట్ పాలిష్ కుర్రాడు
సన్ని హిందూస్తానీ ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. సిడీల్లో విని ప్రఖ్యాత సంగీతకారుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాటలు నేర్చుకున్నాడు. నుస్రత్ ఫతే అలీఖాన్ని తన గురువుగా భావించాడు. ఆయనకు భక్తుడిగా మారాడు. సన్ని హిందూస్తానీ పాడుతుంటే నుస్రత్ పోలికలు కనపడతాయి. ఫ్రెండ్స్ తమకు తోచినప్పుడల్లా అతని చేత పాడించుకునేవారు. కాని సన్నికి జీవితంలో ఏదైనా సాధించాలని ఉండేది. కాని ఎలా సాధిస్తాడు? 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఇంట్లో తల్లి, చెల్లెలు ఉంటారు.వారి పోషణ కోసం చదువు మానేసి బూట్ పాలిష్ చేస్తున్నాడు సన్ని. కాని కాలం ప్రతి ఒక్కరి కోసం కిరీటం మోసుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ కిరీటం దగ్గరకు తలను చేర్చాలంతే! సోనీ టీవీలో ‘ఇండియన్ ఐడల్11’ ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక ఫ్రెండ్ ద్వారా సన్నికి తెలిసింది. ముంబై వెళ్లాలంటే డబ్బులు కావాలి. వెళ్లి తల్లిని అడిగితే ఆమె కంగారుగా చివాట్లు పెట్టింది. ‘మనకు అవసరమా... అదేమైనా వచ్చేదా చచ్చేదా’ అన్నది. ‘ఇంట్లో రూపాయి లేదు’ అని కూడా అంది. దాంతో సన్ని మూడు వేల రూపాయలు అప్పు చేసి ముంబై చేరుకున్నాడు. కాని ఈ దేశం చాలా పెద్దది. ప్రతిభ ఉన్న వాళ్లు ఎప్పుడూ క్యూలో ఉండేలా చేయగలిగేది. ఇండియన్ ఐడల్‌లో సన్ని నంబర్ ‘1072’. అంటే వెయ్యి మందిలో మనవాడు ఒకడు. పిచ్చి టీషర్టు, స్లిప్పర్లు వేసుకొని లోపలికి వెళ్లిన సన్ని జడ్జిలుగా ఉన్న అనూ మలిక్, నేహ కక్కర్, విషాల్ దద్లానిలను మెప్పించాడు. అతడు పాడిన పాట ‘ఆఫ్రిన్.. ఆఫ్రిన్’. పోటీ కొనసాగింది. రాను రాను సన్నికి అభిమానులు పెరిగారు. భటిండా ఊరు మొత్తం ప్రతి వారం అతనికి ఓటు వేయడం మొదలుపెట్టింది. ఫైనల్స్‌లో మొత్తం ఐదు మంది గాయకులు మిగిలితే సన్ని హిందూస్తానీ విన్నర్‌గా నిలిచాడు. బహుమతిగా 25 లక్షల రూపాయలు, ఒక కారు దక్కాయి. ‘నా పేరు విజేతగా ప్రకటించిన క్షణాన మా అమ్మ ముఖంలో కనిపించిన చిరునవ్వు నాకెంతో సంతోషాన్నిచ్చింది’ అంటాడు సన్ని. అతడు తనకొచ్చిన డబ్బులో కొంత తల్లికోసం, కొంత చెల్లెలి కోసం ఉపయోగించనున్నాడు. నిజానికి సన్ని ఈ కాంటెస్ట్‌లో ఉండగానే సినిమా వాళ్ల దృష్టి పడింది. ‘గల్లీబాయ్’ సినిమాలో పాడే చాన్స్ వచ్చింది. ఇప్పుడు టి–సిరీస్‌తో కాంట్రాక్ట్ కుదిరింది. కలలు కంటే అవి తీరేదాకా పరిశ్రమించాలి అని సన్ని గెలుపు తెలియజేస్తోంది. -
‘ఛత్రపతి శివాజీకి అవమానం.. తీవ్ర విమర్శలు’
సాక్షి, ముంబై : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా సోనీ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు తగిన గౌరవం ఇవ్వలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనిటీవీ చానెల్‌ను, కేబీసీ కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. వివరాలు.. బుధవారం (నవంబర్ 6) నాటి కేబీసీ ఎపిసోడ్లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్‌కు సమకాలికుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. a)మహారాణా ప్రతాప్, b)మహారాజా రంజిత్ సింగ్, c)రాణా సంగా, d)శివాజీ. అయితే మొదటి ముగ్గురి రాజుల పేర్లకు ముందు వారి బిరుదులను చేర్చినట్టుగా శివాజీకి చేర్చలేదని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకున్న బిరుదుతో కలిపి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని ఆప్షన్ ఇవ్వకుండా అవమానించారని అంటున్నారు. హిందూ దేవాలయాలను కూల్చేసిన ఔరంగజేబుకు మెఘల్ సామ్రాట్ అనే బిరుదును ఎలా పెట్టారని ఒక నెటిజన్ విమర్శించగా.. ఔరంగజేబు చేత శివాజీ దక్షిణ భారత సింహం అనిపించుకున్నాడని, అదీ ఆయన గొప్పతనమని మరొకరు కామెంట్ చేశారు. హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించిన వీరుడిని అగౌరవపరచడం అవమానకరమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. #BoycottSonyTv, #BoycottKBC హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై తక్షణం స్పందించిన సోని టీవీ యాజమాన్యం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. మరుసటి రోజునే (గురువారం) కేబీసీ ప్రోగ్రాం సమయంలో క్షమాపణలు చెబుతూ స్క్రోలింగ్ రన్ చేసింది. -
'అమెరికాపై దాడి జరిగితే సోనీ టీవీలో చూస్తారు'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అడ్డుఅదుపు లేకుండా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చైనాతో సహా పలు దేశాలపై విమర్శలు చేసిన ఆయన తాజాగా జపాన్ పై విరుచుకుపడ్డారు. అమెరికాపై దాడి జరిగితే జపాన్ పండగ చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఐయొవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... 'నాటో'కు ఆర్థికంగా ఎటువంటి చెల్లింపులు లేనప్పటికీ జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అమెరికా రక్షణ పొందుగలుగుతున్నాయని అన్నారు. 'జపాన్ ను మనం ఎంతగా కాచుకుంటున్నామో తెలుసా. ఒకవేళ జపాన్ పై దాడి జరిగితే అమెరికా మొత్తం సైన్యాన్ని ఉపయోగించి ఆ దేశానికి అండగా నిలుస్తాం. మనమీద దాడి జరిగితే జపాన్ ఎటువంటి సాయం అందించదు. జపనీయులు ఇంట్లో కూర్చుని సోనీ టీవీ చూస్తార'ని ట్రంప్ వ్యాఖ్యానించారు. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియా ఇతర దేశాలను అమెరికా కాపాడుతోందని.. ఇందుకు ఆ దేశాలు ఎటువంటి పైకం చెల్లించడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ఉత్తర కొరియా నుంచి పొంచివున్న ముపును ఎదుర్కొనేందుకు జపాన్, దక్షిణ కొరియా సిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన
ఆ చిన్నారికి హిందీ రాదు. కానీ అద్భుతమైన గళంతో ఆమె పాడిన హిందీ పాటలకు ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా మైమరచిపోయారు. అంతే.. పదేళ్ల అంజనా పద్మనాభన్ 'ఇండియన్ ఐడల్ జూనియర్' మొట్టమొదటి టైటిల్‌ను గెలిచేసుకుంది. ముంబైలో పలువురు దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేలో అంజన విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో ఆమెతో పాటు నిర్వేష్ సుధాంశుభాయ్ దవే, దేవాంజన కర్మాకర్, అన్మోల్ జస్వాల్ పోటీపడ్డారు. కానీ, వాళ్లందరినీ తోసిరాజని అంజన బహుమతి కొట్టేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన అంజన.. తాను ఇది ఏమాత్రం ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని వచ్చీరాని హిందీలో ముద్దుముద్దుగా చెప్పింది. ఈ బహుమతి కింద అంజనకు ట్రోఫీతో పాటు 25 లక్షల రూపాయల నగదు పురస్కారం, ఓ నిసాన్ మైక్రా కారు కూడా అందించారు. ఇంకా... కోటక్ మహీంద్రా, హార్లిక్స్ కంపెనీల నుంచి 5 లక్షలు, 2 లక్షల చొప్పున గిఫ్ట్ చెక్కులు అందాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, సంగీత దర్శకులు విశాల్ దద్లానీ-శేఖర్ రావ్‌జియానీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా 'మేరే సాథ్ ఆవో మేరే దోస్తోం' అనే పాటను నలుగురు ఫైనలిస్టులతో కలిసి పాడారు. త్వరలో విడుదల కానున్న 'ఫటా పోస్టర్ నిక్లా హీరో' చిత్ర ప్రమోషన్ కోసం షాహిద్ కపూర్ కూడా వచ్చాడు. జంజీర్ జంట రామ్ చరణ్, ప్రియాంకా చోప్రా కూడా వేదికపై డాన్సు చేశారు. శ్రేయా ఘోషల్ ఆషికీ2 లోని తన సూపర్ హిట్ సాంగ్ 'సున్ రహా హైనా తూ', బర్ఫీలోని 'ఇత్నీ సీ హసీ' పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది.