![Aditya Narayan Announces Online Auditions For Indian Idol aSeason 12 On Sony Tv - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/14/idian-idiol.jpg.webp?itok=IGjeDnvn)
ముంబై: సోని చానెల్ నిర్వహించే రియాల్టి మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ‘ఇండియన్ ఐడల్-12’ సీజన్ ఆడిషన్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు సోని చానెల్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో వీడియోను సోని టీవీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇడియన్ ఐడల్ ఈజ్ బ్యాక్! ఇండియన్ ఐడల్-12 ఆడిషన్స్‌ను సోని లైవ్ యాప్ ద్వారా జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నాము. రెడీగా ఉండండి’ అని క్యాప్షన్ కూడా జత చేసింది.
సోని లైవ్ యాప్ ద్వారా ఆసక్తి గల గాయకులు తమ పాటలకు సంబంధించిన వీడియోను పంపించాలని రియాల్టీ షో హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు. నూతన గాయని, గాయకులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఆడిషన్స్‌లో ఎంపికైన వారికి ముంబైలో మరో ఆడిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది కూడా రియాల్టి మ్యూజిక్ షోకి సింగర్ నేహా కక్కర్, బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా, విశాల్ దడ్లాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన సన్నీ హిందూస్థానీ ఇండియన్ ఐడల్ సీజన్-11 టైటివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment