ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌కు విశేష స్పందన | Special Response On Indian Idol Auditions In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌కు విశేష స్పందన

Published Thu, May 17 2018 10:04 AM | Last Updated on Thu, May 17 2018 10:04 AM

Special Response On Indian Idol Auditions In Hyderabad - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న ఇండియన్‌ ఐడల్‌–9 విజేత రేవంత్‌

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఐసీబీఎం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌లో బుధవారం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌లో ప్రసారం కానున్న ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి 1500 మంది ఔత్సాహిక గాయకులు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆడిషన్‌ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్‌ ఐడల్‌–9 విజేత ఎల్‌.వి.రేవంత్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులు పరిచయం కానున్నారన్నారు. 10 వ ఇం డియర్‌ ఐడియల్‌ హైదరాబాద్‌తో పా టు వై జాగ్‌లలో ఆడిషన్స్‌ను నిర్వహించనుందన్నా రు. గతంలో కంటే ప్రస్తుతం నిర్వహిస్తు న్న ఆ డిషన్స్‌కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నీరజ్‌ కా లాకర్, మంగల్‌ మిశ్రాలు వ్యవహరించారు. ఆడిషన్స్‌ మేనేజర్‌ శర్మ మాట్లాడుతూ... మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇప్పటికి 22 వేల మందికి పైగా ఈ ఆడిషన్స్‌లో పాలుపంచుకున్నారన్నారు. మొత్తం 200 మందిని ఎం పిక చేసి ముంబాయిలో జరిగే ఆడిషన్స్‌కు ఎంపిక చేస్తామన్నారు. ప్రస్తుతం రెండు రౌం డ్లల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఈ ఆడిషన్స్‌కు పలువురు గాయకులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement