Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CBN And Yellow Media1
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్‌ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్‌ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్‌సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్‌ టైం మానిటరింగ్‌ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్‌ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్‌ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025

Key Cabinet decisions taken in meeting chaired by CM Revanth Reddy2
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్‌ చట్టం–2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్‌.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీతో పాటు కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించడాన్ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి, గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. సీఎం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పలువురు కేంద్రమంత్రులు, సంబంధిత అధికారులతో దీనిపై అనేకసార్లు చర్చించినా కొర్రీలు వేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీకి అడ్వొకేట్‌ జనరల్‌ను కూడా ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకుని, న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలకు ఇబ్బందులు ఎదురవకుండా రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి ఇప్పటికే రాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌ నిబంధన దేశంలో ఎప్పుడో పోయిందని అన్నారు. కేబినెట్‌ నిర్ణయాలు 96% అమలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి ముందు వరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తాజాగా జరిగిన 19వ సమావేశంలో ఆ నిర్ణయాల అమలులో పురోగతిపై విస్తృతంగా చర్చించామని, 96 శాతం అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసి అమలు దశకు తీసుకెళ్లినట్టు తేలిందని చెప్పారు. కాగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు మళ్లీ ఈ నెల 25న మంత్రివర్గ భేటీ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఆ కాల వ్యవధిలో జరిగే ఆరు కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరవేసే వ్యవస్థ పనితీరును మళ్లీ కేబినెట్‌లోనే ఇలా సమీక్షించడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు రాష్ట్రంలోని అమిటీ, సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ విద్యా సంస్థలకు వర్సిటీలుగా గుర్తింపు కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 15 ఉత్తమ వర్సిటీల్లో అమిటీ 11/12వ స్థానంలో ఉందన్నారు. సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ సైతం అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌ చొరవతో ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడానికి ఆ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నం చెప్పారు. ఇక కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జాబ్‌ కేలెండర్‌ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించామన్నారు. ఎస్సీల వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ⇒ రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అనంతరం ఆ ప్రాజెక్టుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. ⇒ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 4 చోట్ల అత్యాధునిక గోశాలలు రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కమిటీ వచ్చే కేబినేట్‌ సమావేశంలోపు తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. కగా హైదరాబాద్‌లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజి్రస్టేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటల్లో 80–110 మి.మీ. సైజు గల 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు సంస్కరణలు ⇒ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ⇒ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమరి్పంచాలని కమిటీని ఆదేశించింది.

Tennis player Radhika Yadav Died by her father over Insta reel3
ఇన్‌ స్టాల్‌ రీల్స్‌ చేసిన టెన్నిస్‌ ప్లేయర్‌.. హత్య చేసిన తండ్రి!

గురుగ్రామ్‌: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌ స్టా రీల్స్‌ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్‌ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్‌ సుశాంక్‌ లోక్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్‌ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్‌ స్టా రీల్‌ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్‌ ఖేలో డాట్‌ కామ్‌ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్‌.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Bhumana Karunakar Reddy Slams TDP Alliance Government4
వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్‌.. కడుపు మంటతో ఎల్లో మీడియా..

సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు. ..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్‌ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్‌రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్‌.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్‌ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు. ..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది. ..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్‌ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్‌ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్‌ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది. ..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్‌ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్‌ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా? ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు..వైఎస్ జగన్‌ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది.

BRS Working President KTR Tweets PM Modi5
మా చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం?: ప్రధాని మోదీకి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం ఏంటని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణమన్నారు కేటీఆర్‌. ఇలా తమ చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం? అని నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కేటీఆర్‌. ఈ మేరకు పలు పశ్నలు సంధించారే కేటీఆర్‌. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.Honourable PM @narendramodi ji,We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position - TELANGANAToday, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i— KTR (@KTRBRS) July 10, 2025

How MK Stalin Resolve Dispute Between Maran Brothers Over Sun TV6
స్టాలిన్ చాణ‌క్యం.. ఏక‌మైన‌ మార‌న్ బ్ర‌ద‌ర్స్!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత‌ ఎంకే స్టాలిన్ మ‌రోసారి చ‌క్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు త‌ల‌నొప్పిగా మారిన కుటుంబ వివాదాన్ని చ‌క్క‌దిద్దారు. డీఎంకే పార్టీకి ఇబ్బందిక‌రంగా మారిన మార‌న్ సోద‌రుల ఆస్తి గొడ‌వ‌కు ముగింపు ప‌లికారు. స‌రైన స‌మ‌యంలో క‌ల్పించుకుని అన్న‌ద‌మ్ముల వివాదాన్ని ప‌రిష్క‌రించారు. త‌మ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, హిందూ దినపత్రిక మాజీ సంపాద‌కుడు ఎన్ రామ్ సహాయంతో మార‌న్ సోద‌రుల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చారు. మార‌న్ కుటుంబంతో పాటు డీఎంకేలోనూ అల‌జ‌డి రేగ‌కుండా కాచుకున్నారు.భారీగా ద‌యా'నిధి'ఆస్తుల్లో త‌న‌కు రావాల్సిన‌ వాటా కోసం అన్న క‌ళానిధి మార‌న్‌పై కోర్టుకెక్కిన డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్‌కు భారీగానే నిధి ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల నగదు.. అంతే విలువైన‌ చెన్నైలోని ఎలైట్ బోట్ క్లబ్ ప్రాంతంలో ఎకరం భూమిని పొందారని మారన్ కుటుంబం, డీఎంకే ఉన్న‌త వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్టు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. మొత్తానికి ద‌యానిధి మార‌న్ (Dayanidhi Maran) తాను అనుకున్న‌ది సాధించార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు గుస‌గ‌స‌లాడుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల వివాద ప‌రిష్కారానికి త‌న‌కు రూ. 1500 కోట్లు ఇవ్వాల‌ని అంత‌కుముందు ఆయ‌న డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది.అస‌లేంటి గొడ‌వ?తన అన్నయ్య కళానిధికి జూన్ ప్రారంభంలో ద‌యానిధి లీగల్ నోటీసు పంప‌డంతో మారన్ సోదరుల వివాదం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. సన్ టీవీ నెట్‌వర్క్ షేర్ల‌ను అక్ర‌మంగా త‌న పేరు మీద బ‌ద‌లాయించుకున్నార‌ని ద‌యానిధి ఆరోపించారు. సన్ టీవీ నెట్‌వర్క్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు.. మోసపూరిత వాటా కేటాయింపులు, కార్పొరేట్ దుష్పరిపాలన, ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అన్న‌పై దావా వేశారు. అయితే దయానిధి రూ.1500 కోట్లు చెల్లించాలని కోరగా, కళానిధి రూ.500 కోట్లు మాత్రమే ఇస్తాన‌ని చెప్ప‌డంతోనే ఆస్తుల గొడ‌వ ర‌చ్చకెక్కింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా, త‌నపై త‌మ్ముడు చేసిన ఆరోప‌ణల‌ను క‌ళానిధి కొట్టిపారేశారు. జూన్ 20న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అధికారికంగా వివ‌ర‌ణ ఇచ్చారు. పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు స‌న్ నెట్‌వ‌ర్క్ కంపెనీకి చెందిన లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జ‌రిగాయ‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌తంగానే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని పేర్కొన్నారు.స్టాలిన్ చొర‌వ‌.. స‌మసిన గొడవ‌మార‌న్ సోద‌రుల మ‌ధ్య ఆస్తుల వివాదం ముదిరి పాకాన ప‌డ‌క ముందే ప‌రిష్కరించాల‌ని భావించిన సీఎం స్టాలిన్.. వారిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి స్వ‌యంగా రంగంలోకి దిగారు. తాను చేసిన ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో ఆయ‌న రూటు మార్చారు. త‌మ కుటుంబానికి అత్యంత స‌న్నిహితులైన వీర‌మ‌ణి, ఎన్‌. రామ్‌ల‌తో మంత్రాంగం న‌డిపించారు. ఇందులో భాగంగా మూడు ద‌ఫాల చ‌ర్చ‌లు జరిగాయని.. వాటిలో రెండు వ్యక్తిగతంగా, ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. అయితే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ చర్చలు జరిగిన‌ట్టు విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. 'మొదట మారన్ కుటుంబానికి వీరమణి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. వివాదం గురించి ఇరు వ‌ర్గాలు మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, స‌మ‌స్య ప‌రిష్కార దిశ‌గా ముందుకు సాగాలని మ‌ధ్య‌వ‌ర్తులు సూచించార‌'ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం కారణంగా డీఎంకే, మారన్ కుటుంబానికి ప్రతిష్టకు కలిగే భంగం.. ఎక్కువ‌ కాలం వ్యాజ్యం కొనసాగడం వల్ల కలిగే న‌ష్టం, కోర్టు ఖర్చుల గురించి కూడా చర్చల్లో పెద్ద‌లు ప్రస్తావించిన‌ట్టు స‌మాచారం.వారిద్ద‌రే ఎందుకు?మార‌న్ సోద‌రుల ఆస్తుల గొడ‌వ ప‌రిష్కారానికి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ కురువ‌`ద్ధుడైన వీరమణి, ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్ట్ ఎన్‌. రామ్‌ల‌ను ఎంచుకున్నారు. ఈ డిసెంబర్‌లో 93వ ఏట అడుగుపెట్ట‌నున్న వీర‌మ‌ణి త‌మిళ రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు. అంతేకాదు ద్రవిడ ఉద్యమంలో గౌరవనీయమైన వ్యక్తిగా ఆయ‌న గుర్తింపు ఉంది. ఇంకో కీల‌క అంశం ఏమిటంటే స‌న్ నెట్‌వ‌ర్క్‌తో ఆయ‌న ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. స్టాలిన్ కుటుంబానికి మాత్రం ఇందులో 20 శాతం వాటా ఉంది. మారన్ కుటుంబానికి బంధువైన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ (N Ram) సైద్ధాంతికంగా డీఎంకేకు దగ్గరగా ఉన్నారు. మీడియాలో విశ్వ‌స‌నీయ‌త ఆధారంగా మధ్యవర్తిత్వానికి ఆయ‌న‌ను స్టాలిన్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో ఈ వివాదం పార్టీకి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న‌తో పరిస్థితిని చక్కదిద్దడానికి స్టాలిన్ జోక్యం చేసుకున్నారని డీఎంకే నేత ఒక‌రు వెల్ల‌డించారు.వేర్వేరు రంగాల్లో..కళానిధి, ద‌యానిధి తండ్రి దివంగత మురసోలి మారన్ (Murasoli Maran) కరుణానిధి మేనల్లుడు. డీఎంకే పార్టీ అండ‌తో ఆయ‌న ప‌లు ప‌ర్యాయాలు కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న బ‌తికున్నంత కాలం మార‌న్ కుటుంబంలో ఎటువంటి పొర‌పొచ్చాలు లేవు. ఇద్ద‌రు కుమారులు వేర్వేరు రంగాల్లోకి ప్ర‌వేశించి ముందుకెళ్లారు. కళానిధి 1993లో స‌న్ టీవీని ప్రారంభించి ప్రాంతీయ టెలివిజన్ మార్కెట్‌లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ద‌యానిధి మార‌న్ తండ్రి వారసత్వాన్ని ఉప‌యోగించుకుని రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి 2000లో కేంద్ర టెలికాం మంత్రి అయ్యారు.అక్క‌డి నుంచే మొద‌లు..మారన్ కుటుంబ వార్తాపత్రిక దినకరన్ కార్యాల‌యంపై 2007లో డీఎంకేలోని ఎంకే అళ‌గిరి (MK Alagiri) మ‌ద్ద‌తుదారులు దాడికి పాల్ప‌డ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. స్టాలిన్‌ను కరుణానిధి రాజకీయ వారసుడిగా పేర్కొంటూ దినకరన్ పేప‌ర్‌లో రావ‌డంతో కోపోద్రిక్తులైన అళగిరి మద్దతుదారులు హింసాత్మకంగా స్పందించారు. పెద్ద కొడుకునైన త‌న‌ను కాద‌ని స్టాలిన్‌ను రాజ‌కీయ వార‌సుడిగా వ‌ర్ణించ‌డంతో అళగిరి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య దూరం కొన‌సాగుతోంది. తాజాగా మార‌న్ సోదరులు ఆస్తుల కోసం కోర్టుకెక్క‌డం త‌మిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. చ‌ద‌వండి: ఇందిరా గాంధీపై శ‌శిథ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

India Vs England 3rd Test Day 1 Match Highlights And Full Scorecard7
IND vs ENG 3rd Test: ఆస‌క్తిక‌రంగా మొదలైన లార్డ్స్ టెస్టు..

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య మూడో టెస్టు ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(99), బెన్ స్టోక్స్‌(39) ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జ‌స్ప్రీత్ బుమ్రా, జ‌డేజా త‌లా వికెట్ సాధించారు.

Bill Gates says AI wont replace this job even in 100 years8
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్‌గేట్స్‌

విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్‌ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్‌ టైమ్స్‌తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్‌ గేట్స్‌ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్‌గేట్స్‌ మాట్లాడారు. ఆర్టిపీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్‌ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Anchor Udaya Bhanu Comments on Syndicate in Tollywood9
యాంకరింగ్‌లో సిండికేట్‌.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను

ఉదయభాను (Udaya Bhanu).. ఒకప్పుడు తెలుగులో టాప్‌ యాంకర్‌. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆవిడ హడావుడే కనిపించేది. బుల్లితెరపై సెటిలవ్వడానికి ముందు సినిమాలు కూడా చేసింది. అప్పట్లో టాలీవుడ్‌లో తోపు యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తర్వాత సడన్‌గా తెరపై కనుమరుగైపోయింది.తొక్కేశారంటూ భావోద్వేగంగతేడాది ఓ సభలో తన కెరీర్‌ను తొక్కేశారని ఎమోషనలైంది. టీవీలో కనిపించి ఐదు సంవత్సరాలైందని పేర్కొంది. అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయభాను. సుహాస్‌ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. టీవీ ఇండస్ట్రీలో సిండికేట్‌ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్‌ కనకమేడల.. యాంకర్‌ను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాడు. అదే విషయం మైక్‌ అందుకుని మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్‌ చేస్తున్నారు. థాంక్యూ అన్నాడు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్‌ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆరోజు వచ్చాక ఈవెంట్‌ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్‌ ఎదిగింది.ఉన్నదున్నట్లు చెప్తా..నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్‌ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదయభానుకు యాంకరింగ్‌ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? తనవరకు అవకాశాలను వెళ్లనివ్వడం లేదా? అని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్‌ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలనే టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్‌ చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: మాజీ డిప్యూటీ కలెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి

Manickam Tagore hits out at Shashi Tharoor over Emergency comments10
శశిథరూర్‌ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై.. ఆ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ పేరు ప్రస్తావించడకుండా సెటైర్లు వేశారు. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ప్రాజెక్ట్‌ సిండికేట్‌లో ఎంపీ శశిథరూర్‌ గెస్ట్‌కాలమ్‌ రాశారు. అందులో ఇందిరా గాంధీ పాలనలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్, స్లమ్ తొలగింపు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ ‘పక్షి చిలుకైందే’ అంటూ శశి థరూర్ బీజేపీ లైన్‌ను అనుసరిస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.When a Colleague starts repeating BJP lines word for word, you begin to wonder — is the Bird becoming a parrot? 🦜Mimicry is cute in birds, not in politics.— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 10, 2025 ‘పక్షి చిలుకైందే’ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. ఇతరుల మాటలు యథాతథంగా పలికే చిలుకలా మారింది. పక్షులు ..చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా పేర్కొన్న శశిథరూర్‌ నాటి దుర్భుర పరిస్థితుల్ని గెస్టు కాలంలో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించారు.పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయడం, న్యూఢిల్లీలాంటి నగరాల్లో మురికి వాడల్లో నివాసాల్ని కూల్చివేయడం, అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. ఫలితంగా వేలాది మంది నిట్ట నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025ఇలా ఇప్పుడే గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ శశిథరూర్‌ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవీ.. ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆకాశం ఏ ఒక్కరిది కాదని ట్వీట్‌ చేశారు.అందుకు మాణిక్యం ఠాకూర్‌ మరో ట్వీట్‌లో ఎగిరేందుకు అనుమతి అడగొద్దు.‘పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు.. కానీ ఈ రోజుల్లో, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగల్స్ ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు. ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు’బదులిచ్చారు. Don’t ask permission to fly. Birds don’t need clearance to rise…But in today even a free bird must watch the skies—hawks, vultures, and ‘eagles’ are always hunting.Freedom isn’t free, especially when the predators wear patriotism as feathers. 🦅🕊️ #DemocracyInDanger… pic.twitter.com/k4bNe8kwhR— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 26, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement