
విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్70ఎల్, బ్రావియా ఎక్స్75ఎల్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఎక్స్1 4కే ప్రోసెసర్, లైవ్ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్ ఫేస్ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్‌తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను కలిగిన గూగుల్ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్–ప్రొటెక్షన్ పీఆర్‌ఓ, వాయిస్ ఆధారిత రిమోట్–స్మార్ట్ రిమోట్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ఎక్స్ 75ఎల్ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్70ఎల్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో కేడి–43 ఎక్స్70ఎల్ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్70ఎల్ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్‌లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో, ఈ–కామర్స్ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment