Launches
-
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఆటో భారత్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్‌లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్‌గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్‌ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్‌ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్‌కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్‌ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్‌తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్‌లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
గోద్రెజ్ కొత్త రకం డిజిటల్ స్మార్ట్ లాక్ ప్రారంభం
గోద్రెజ్ (Godrej) ఎంటర్ప్రైజెస్ గ్రూప్ వ్యాపార విభాగం అయిన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ తమ అడ్వాంటిస్ ఐఓటీ9 (Advantis IoT9) స్మార్ట్ లాక్‌ను తెలుగురాష్ట్రాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అడ్వాంటిస్ IoT9 స్మార్ట్ లాక్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ స్మార్ట్ లాక్ శ్రేణి ఇంటికి మెరుగైన భద్రతను అందిస్తుంది. డిజిటల్ లాక్‌లలో IoT9ని పరిచయం చేసిన మొదటి బ్రాండ్ ఇదే. ఈ డిజిటల్ లాక్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో 100 కుపైగా రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌లో భాగమైన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్యామ్ మోత్వాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అడ్వాంటిస్ IoTని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని, ఈ నగరం డిజిటల్ లాక్‌లకు కీలకమైన మార్కెట్‌గా ఉద్భవించిందని పేర్కొన్నారు.అడ్వాంటిస్ ఐఓటీ9 ముఖ్య ఫీచర్లుబ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్సీ, స్మార్ట్‌వాచ్‌లు, ఫింగర్‌ప్రింట్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్‌లు, పాస్కోడ్లు, మెకానికల్ కీ లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ లాక్‌ను అన్‌లాక్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీతోపాఉట ప్రాంతీయ భాషలలో వాయిస్-గైడెడ్ ఆదేశాలతో పని చేస్తుంది. లాక్ చేయకుండా సౌకర్యవంతమైన కదలిక కోసం పాసేజ్ మోడ్ ఉంది. అత్యవసర సమయంలో ఫైర్ అలారం మోగుతుంది. ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే మూడు తప్పు ప్రయత్నాల తర్వాత యాప్ నోటిఫికేషన్లను పంపుతుంది. దేశంలోనే హోస్ట్ చేసే ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ స్టోరేజ్ వినియోగదారు డేటా భద్రతను నిర్ధారిస్తుంది. -
లాంచీ సర్వీసుల లాంచింగ్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు. -
‘డ్రీమ్’ మిషన్‌ను లాంచ్ చేసిన చైనా
బీజింగ్: చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈరోజు (బుధవారం)తెల్లవారు జామున 4.27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.ఈ మిషన్‌లో భాగంగా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్‌తో సహా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల అనంతరం ఆ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ వెల్లడించింది. Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024ఈ షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్‌లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్‌గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్ ఏజెన్సీ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
వస్త్రం బై సింఘానియాస్ను ప్రారంభించిన ఏపీ మిస్ యూనివర్స్ (పోటోలు)
-
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్‌ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్‌ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్‌హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్‌ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్‌లను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
ఎల్ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్ఎఫ్వో) వివరాలను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. -
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్‌జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌తో కలిసి రూమీ–1 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్‌జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్‌ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌ను తయారు చేసినట్లు స్పేస్‌జోన్ కంపెనీ వెల్లడించింది. -
హైదరాబాద్‌లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
-
‘ఆప్ కా రామ్‌రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి
బాబీ సింహా, వేదిక, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, అనుష్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘రజాకార్’. ‘సైలెంట్ జెనొసైడ్ ఆఫ్ హైదరాబాద్’ (హైదరాబాద్‌లో జరిగిన నిశ్శబ్ద మారణహోమం) అనేది ట్యాగ్‌లైన్. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మార్చి 1న విడుదల కానుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలన, సామాన్య ప్రజలపై రజాకార్ల క్రూరమైన చర్యలు, నిజాం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేలా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు వంటి అంశాల నేపథ్యంతో ‘రజాకార్’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి–దర్శక–నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘రజాకార్’ సినిమా పట్ల చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావం, తపన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన ఓ అధ్యాయాన్ని ‘రజాకార్’ సినిమాగా తీశాం. 15 ఆగస్టు 1947–17 సెప్టెంబరు 1948ల మధ్య నిజాం పాలనలో ఏం జరిగింది? అనే అంశాలు ఈ తరం యువతీ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. ‘‘నిరంకుశత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వారి పరాక్రమాన్ని ఈ సినిమాలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు యాటా సత్య నారాయణ. -
ఆన్లైన్ ద్వారా సమ్మక్క–సారలమ్మలకు ‘బంగారం’
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం) సమరి్పంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం.. అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం తన మనవడు రియాన్‡్ష పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ సందర్భంగా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా అమ్మవార్లకు సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మేడారంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ పోస్టర్ మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని భక్తులను కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. -
కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్ల సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్‌ల స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అందిస్తున్నాం.. వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series) వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్‌లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్‌ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు. కెమెరా పరంగా వన్‌ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్‌ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series) షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్‌ను జనవరి 4న భారత్‌లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు. కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series) ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో పాటు వివో V3 చిప్‌తో వస్తాయని భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్‌తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. -
మైగ్రేన్ తలనొప్పి నివారణ పరికరం..
-
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ఇస్రో గగన్ యాన్ ప్రయోగం..దూసుకెళ్లిన TV-D1 రాకెట్
-
రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా’ రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘‘ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారు’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’ -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కుటుంబంలో మహిళా పెద్దకు రూ.2000
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి పథకంతో ఘణంగా వేడుకను జరుపుకుంది. ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఒక మహిళా పెద్దకు రూ.2000 అందించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్య స్వస్థలం మైసూర్లో జరిగింది. కేంద్రం నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మళ్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా కార్యక్రమానికి వచ్చారు. నేడు 50 శాతం మందికి అందాల్సిన రూ.1.08 కోట్ల లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన లబ్దిదారుల అకౌంట్లలో రేపు జమ అవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు.. తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై తన పిల్లల స్కూల్ ఫీజులు సులభంగా చెల్లించవచ్చని అన్నారు. Congress has always delivered as promised. Guarantee schemes guaranteed for the welfare of people. Gruha Lakshmi is launched to provide Rs 2000 for every woman head of the family.#CongressGuarantee pic.twitter.com/8nVz2uQJ1Q — Siddaramaiah (@siddaramaiah) June 2, 2023 ఫెరిఫికేషన్‌పై అభ్యంతరాలు.. జీఎస్టీ రిటర్న్‌లు ఫైల్ చేయని కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. అయితే.. ఈ పథకం అమలు తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా వారి జీఎస్టీ వివరాలు సేకరిస్తామని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ తెలిపారు. కుటుంబ సాఫ్ట్వేర్ ఆధారంగా వివరాలు భద్రపరుస్తామని పేర్కొన్నారు. అయితే.. డేటా భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు మహిళలకు స్కీం వర్తించకుండా జాగ్రత్తలు పాటించామని మంత్రి తెలిపారు. కానీ మరణించినవారి పేరుపై ఉన్న రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో ఈ వివరాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ.. -
మంచు విష్ణు భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ లాంఛ్ ఫొటోలు
-
అన్ని రోజులూ బ్యాంక్ సేవలు!
దేశంలోని బ్యాంకులు ప్రస్తుతం వారానికి 6 రోజులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్‌లో బ్యాంకులు మూతపడతాయి. రానున్న రోజుల్లో వారానికి 5 రోజులే పనిదినాలు ఉండేలా ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు బ్యాంక్ హాలిడేస్ గురించి ఆందోళన చెందుతుంటారు. దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) కస్టమర్ల కోసం అన్ని రోజులూ సేవలు అందించనుంది. ఇందుకోసం వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. దేశంలో 24x7 లైవ్ వీడియో బ్యాంకింగ్ సేవను ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ నిలిచింది. తాము తీసుకొచ్చిన 24x7 వీడియో బ్యాంకింగ్ సదుపాయం బ్యాంక్ బ్రాంచ్‌లు అందుబాటులో లేనివారికి, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారికి, బిజీగా ఉండే ప్రొఫెషనల్‌లకు, సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 24x7 వీడియో బ్యాంకింగ్ ఫీచర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు నేరుగా బ్యాంకు సిబ్బందితో వీడియో కాల్లో మాట్లాడవచ్చు. అన్ని రోజులూ ఎప్పుడైనా వీడియో కాల్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఈ బ్యాంక్ గతంలోనే వీడియో బ్యాంకింగ్ సదుపాయం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు దాన్ని 24x7 కస్టమర్లకు సేవలు అందించేలా విస్తరించింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు డెమోగ్రాఫిక్ అప్డేట్లు చేయించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. కొత్త ఖాతాలను తెరవవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్‌లు, లోన్లపై విచారణతోపాటు ఇతర బ్యాంకింగ్ సమస్యలు ఉన్నా రియల్ టైమ్ సేవలు పొందవచ్చు. భద్రత, ఇతర ప్రయోజనాలు వీడియో బ్యాంకింగ్ సేవల ద్వారా డేటా లీక్ అవుతుందని, మోసాలు జరుగుతాయని కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెబుతోంది. కస్టమర్ల సమాచారాన్ని, లావాదేవీలను రక్షించడానికి ఎన్క్రిప్షన్, ఫేషియల్ రికగ్నిషన్, ఓటీపీ, వీడియో ధ్రువీకరణ వంటి అధునాతన చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంక్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
Dil Raju : గద్వాల్లో దిల్ రాజు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం (ఫొటోలు)