
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ జీ సిరీస్‌లో భాగంగా జీ13 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని మోటరోలా ప్రకటించింది.
(హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!)
ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ క్వాడ్ పిక్సల్ కెమెరా సిస్టమ్ ఉండగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 6.5 అంగుళాల, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి.
(UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్‌పీసీఐ వివరణ)
Comments
Please login to add a commentAdd a comment