మార్కెట్‌లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి.
మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్‌లు గతేడాది జూన్‌లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్‌లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.
రూ.20,000 తగ్గింపు
మోటరోలా భారత్‌లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.
మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం
- 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం
- 4200 mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం
- 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం
- వైర్‌లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment