Motorola
-
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్
-
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. -
భారత్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్‌లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్‌లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
స్మార్ట్ ఫోన్ చేతికి చుట్టేసుకుంటే.. (ఫొటోలు)
-
బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?
Motorola Launched 'moto e13' మోటరోలా సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఆగస్టు 16 నుండి ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లు బడ్జెట్ ధరలో లభించ నుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ అనే మూడు రంగుల్లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన టెక్నాలజీ, పెర్ఫామెన్స్‌తో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ లోని ఏఐ పవర్డ్ కెమెరా "ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్‌తో పర్ఫెక్ట్ షాట్‌ను తీయడంతోపాటు, ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ మీ ఫోటోలను స్వయంచాలకంగా మెరుగుపరుస్తాయని స్మార్ట్‌ఫోన్ మేకర్ వెల్లడించింది. మోటో ఈ13 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ Dolby Atmos ఆడియో 13 ఎంపీ ఏఐ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ -
మోటో జీ14: ఫీచర్లు అదుర్స్! ధర తెలిస్తే వదిలిపెట్టరు!
Moto G14 : మెటరోలా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 14 కొనుగోలుకు లభిస్తోంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్ లాంటి అదిరే ఫీచర్స్‌తో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. మోటో జీ 14 ధర, ఆఫర్ మోటో జీ 14 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (సింగిల్) వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ధరతో లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే ఆఫర్లకు అర్హులు. ఫోన్‌పై తక్షణం రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు రూ. 3,200 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌కు అర్హులు. స్టీల్ గ్రే , స్కై బ్లూ రంగులలో లభ్యం. (‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు) మోటో జీ 14 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ డిస్ప్లే 2GHz క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ డ్యుయల్రియర్కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్, 8ఎంపీ సెల్ఫీకెమెరా 5,000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్ -
కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్‌లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి. -
మోటరోలా ఎన్విజన్ఎక్స్ 4కే టీవీ
బెంగళూరు: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్ ఎక్స్’ పేరుతో 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. ఎన్విజన్ ఎక్స్ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్ఈడీ డిస్ప్లే క్వాంటమ్ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది. -
మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్ వేరియంట్ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లకు కాస్త అటూఇటుగా ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్ మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టేరేజ్ 50 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, త్వరలో ఆండ్రాయిడ్ 14 స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి. -
భారత్‌లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏదో తెలుసా?
ముంబై: దేశీయంగా ఉత్తమ 5జీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా మోటరోలా నిల్చింది. టెక్నాలజీ రీసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ టెక్ఆర్క్ రూపొందించిన సర్వే రూ. 10,000–30,000 ధర శ్రేణిలోని ఫోన్ల కేటగిరీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రధానంగా కనెక్టివిటీ, కవరేజీ, సామర్థ్యాలు అనే మూడు కీలక అంశాల ప్రాతిపదికన ఈ సర్వేలో ర్యాంకులను కేటాయించినట్లు మోటరోలా తెలిపింది. ఈ మూడు విభాగాల్లోనూ తమ స్మార్ట్ఫోన్లు మెరుగైన పనితీరు కనపర్చినట్లు వివరించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ జీ సిరీస్‌లో భాగంగా జీ13 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని మోటరోలా ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ క్వాడ్ పిక్సల్ కెమెరా సిస్టమ్ ఉండగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 6.5 అంగుళాల, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన మొబైల్ లాంచ్.. ధర కూడా తక్కువే!
ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలవుతోంది. ఇందులో భాగంగానే మోటోరోలా కంపెనీ జీ సిరీస్‌లో మరో బడ్జెట్ 5జీ ఫోన్ విడుదల చేసింది. ఈ కొత్త మొబైల్ కేవలం ఒకే వేరియంట్లో రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కొత్త మోటో జీ73 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ల్యుసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలని అందుబాటులో ఉంటుంది. కార్డు ఆఫర్ ద్వార కొనుగోలు చేసేవారు రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా వినియోగించుకోవచ్చు. మోటో జీ73 5జీ మొబైల్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎల్సీడీ డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్‌కు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ వస్తుందని మోటోరోలా తెలిపింది. (ఇదీ చదవండి: బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?) లేటెస్ట్ మోటో జీ73 5జీ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా పొందుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో పొందవచ్చు. -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
మోటరోలా బడ్జెట్ ఫోన్ వచ్చేసింది..ధర చూస్తే పండగే!
సాక్షి, ముంబై: మోటరోలా కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో ఈ 22 ఎస్ పేరుతో దీన్ని సోమవారం తీసుకొచ్చింది. MediaTek చిప్సెట్తో రూ. 10,000 ధరలోపే దీన్ని తీసుకు రావడం విశేషం. (వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్) మోటో ఈ 22 ఎస్ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. అక్టోబర్ 22 నుండి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. 64 జీబీ వేరియంట్లో ఆర్కిటిక్ బ్లూ , ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోఉంటుంది. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ ) మోటో ఈ 22 ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల IPS LCD డిస్ప్లే Android 12, 1600x720 రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ఇదీ చదవండి: రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్ -
సంచలనం, భారత్‌లోకి మొదటి 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే!
అమెరికా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా (Motorola) అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్‌ని భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు సెప్టంబర్ 13న ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కావడం.. ఈ ఫోన్ ప్రత్యేకతని చెప్పచ్చు. మరోరకంగా చెప్పలంటే ఇంత భారీ స్థాయిలో పిక్సల్ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ కూడా ఇదే. అదిరిపోయే దీని ప్రత్యేకతలు, ఫీచర్లను ఓ లుక్కేద్దాం. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు ►క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్. ►ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ సెన్సార్. ముందు భాగంలో, 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►6.67-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ►4,160mAh బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు ►స్నాప్‌డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon) ప్రాసెసర్, ►6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ pOLED డిస్ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్. ►Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరా పరంగా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►4,400mAh బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్ 30 ప్యూజన్ ఐరోపాలో 600 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 48,000) ఉంటుందని అంచనా. ఇది ఫ్యూజన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్‌లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 72,900) ఉంటుందని అంచనా. ఈ మొబైల్ స్టార్‌లైట్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది. చదవండి: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
సంచలనం: ప్రపంచంలోనే తొలి 200 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే!
అమెరికా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ప్రపంచంలో తొలిసారి 200ఎంపీ మెగా ఫిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. మోటో ఎక్స్ 30 ప్రో పేరుతో ఈ ఫోన్ ఆగస్ట్ 2న చైనాలో విడుదల కానుంది. చైనా మీడియా కథనాల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ప్రాసెసర్, 125 డబ్ల్యూ జెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ 12జీబీ ర్యామ్ సౌకర్యం ఉందని పేర్కొన్నాయి.ఇక ఈ ఫోన్లో డ్రమెటిక్ బ్యాగ్ గ్రౌండ్ ఇమేజెస్ తీసుకునేందుకు 85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్ ఫోకల్ లెగ్త్ సెన్సార్లు ఉన్నాయి. దీంతో పాటు క్లోజప్, పోట్రేట్ షాట్స్, 50 ఎంఎం లెన్స్‌తో స్టాండర్డ్ వ్యూయింగ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవచ్చు. 35 ఎంఎం లెన్స్ తో క్లోసెస్ట్ వ్యూయింగ్ యాంగిల్లో సైతం ఫోటోల్ని ఫోన్లో క్యాప్చర్ చేయొచ్చు. మోటో ఎక్స్ 30 ప్రో స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ 30 ప్రో హెచ్‌డీప్లస్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
షావోమి 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్ త్వరలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 120Hz డిస్ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది. కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్ఫోన్లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్‌గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. -
మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. తాజాగా మోటో జీ సిరీస్‌లో భాగంగా మోటో జీ52 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూరోప్ మార్కెట్లలోకి పరిచయం చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో కి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం. మోటో జీ52 సంబందించిన పలు ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇక మోటో జీ 52 ఇండియా వెర్షన్ స్మార్ట్ ఫోన్ పీఓఎల్ఈడీ (pOLED) డిస్ప్లేతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తేలికైన, సన్నని స్మార్ట్‌ఫోన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోటో జీ 52 స్మార్ట్ ఫోన్ కొద్ది రోజుల క్రితం లాంచ్ ఐనా.. మోటో జీ 51 కి కొనసాగింపుగా రానుంది. యూరప్ లో మోటో జీ 52 249 యూరోలు (దాదాపు రూ. 20,600)గా నిర్ణయించారు. ఇక భారత మార్కెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ధర 20 వేల కంటే తక్కువ ధరలో వుండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ చార్కోల్ గ్రే, పింగాణీ వైట్ (Porcelain White) కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. మోటో జీ52 స్పెసిఫికేషన్ (అంచనా) 6.6-అంగుళాల FHD+ pOLED డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.549లకే స్మార్ట్ ఫోన్..! అదిరిపోయే ఫీచర్లతో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ నేటి నుంచి సేల్స్ ప్రారంభించింది. అయితే ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు అతి తక్కువ ధర అంటే కేవలం రూ.549కే స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మోటో జీ22 ఫీచర్లు బుధవారం నుంచి మోటరోలా కొత్త ఫోన్ మోటో జీ22ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా రూ. 549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ డిస్ ప్లే 6.5 అంగుళాల హెచ్‌డీపీ ప్లస్ ఐపీఎల్ ఎల్సీడీ, 5,000ఎంఏహెచ్, 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీంతో పాటు మెయిన్ కెమెరా 50 ఎంపీ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ హీలియా జీ37 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై స్పెషల్ ఆఫర్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.13,999 ఉండగా..ఈ ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అందించే 21 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999కే కొనుగోలు చేయోచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై వెయ్యి తగ్గింపుతో రూ. 9,999 వద్దకు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్తో రూ. 549 ధరకే కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ కొనుగోలుపై బ్యాంకు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు! -
అలర్ట్..మార్చి 31 డెడ్‌లైన్...! ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. యూజర్లకు అద్బుతమైన ఫీచర్స్‌ను అందుబాటలోకి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ను వాట్సాప్ ఇస్తుంది. ఈ అప్డేట్స్ కేవలం సదరు ఆండ్రాయిడ్, ఐవోఎస్ అపరేటింగ్ సిస్టమ్స్‌కు మాత్రమే మద్దతు ఇస్తాయి. పాత ఆపరేటింగ్ సిస్టం కల్గిన స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవు. తాజాగా మార్చి 31 (గురువారం) నుంచి పలు స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సమాచారం. పాత Android, iOS, KaiOS వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను కల్గిన వాటిలో వాట్సాప్ సేవలు నిలిపివేయబడతాయి. వాట్సాప్ పనిచేయని స్మార్ట్ఫోన్ల జాబితాలో షావోమీ, శాంసంగ్, ఎల్జీ, మోటరోలా కంపెనీ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. మార్చి 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు ఆండ్రాయిడ్ ఫోన్లు : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ లేదా అంతకంటే కొత్త వెర్షన్ లేకపోతే, వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది. iOS ఫోన్లు : iOS 10 లేదా ఆ తర్వాత వెర్షన్లో ఉన్న iPhone వినియోగదారులు మాత్రమే తమ పరికరంలో వాట్సాప్‌ను ఉపయోగించగలరు. అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న యాపిల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. KaiOS : మీ స్మార్ట్‌ఫోన్ KaiOS ప్లాట్‌ఫాంతో పనిచేస్తే... KaiOS వెర్షన్ 2.5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తోంది. వాట్సాప్ సపోర్ట్ చేయని స్మార్ట్ఫోన్ల జాబితా ఇదే..! ఎల్జీ LG Optimus F7, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5 II, Optimus L5 II Dual, Optimus L3 II, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, LG Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II , Optimus L2 II, Optimus F3Q మోటరోలా Motorola Droid Razr షావోమీ Xiaomi HongMi, Mi2a, Mi2s, Redmi Note 4G , HongMi 1s హువావే Huawei Ascend D, Quad XL, Ascend D1, Quad XL , Ascend P1 S శాంసంగ్ Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..! -
అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా
అమెరికాలో మూడో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా మోటరోలా రికార్డు సృష్టించింది. ప్రముఖ మార్కెట్ ఎనాలసిస్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2021 ఏడాదికి సంబంధించి యాపిల్, శామ్సంగ్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది మోటరోలా. అమెరికా మార్కెట్లో ఆది నుంచి యాపిల్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానం కోసం శామ్సంగ్, బ్లాక్‌బెర్రీ, ఎల్జీ, సోనీ, మోటరోలా కంపెనీలు పోటీ పడ్డాయి. ఆండ్రాయిడ్ రాకతో బ్లాక్‌బెర్రీ ఈ రేసు నుంచి తప్పుకోగా మిగిలిన కంపెనీలు ఈ పరుగులో పోటీ పడ్డాయి. అయితే సోని, ఎల్జీ కంపెనీలు మార్కెట్లో ఆటుపోట్లను ఎదుర్కొలేక క్రమంగా స్మార్ట్‌ఫోన్ తయారీ నుంచి తమ ప్రయత్నాలను విరమించుకోవడం లేదా నామామాత్రంగా మిగలడమో జరిగింది. మోటరోలా విషయానికి వస్తే గూగుల్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత మోటరోల దశ తిరుగుతుందని భావించారు. కానీ అటువంటి అద్భుతాలేమీ జరగకపోవడంతో మోటరోలాని లెనోవోకి అమ్మేసింది గూగుల్. ఇక లెనోవో చేతికి వెళ్లిన తర్వాత బడ్జెట్ ఫోన్లపై ప్రధానంగా ఫోకస్ చేసింది మోటరోలా. ఇప్పుడదే ఆ కంపెనినీ గట్టెక్కించింది. అమెరికా మార్కెట్లో 400, 300 డాలర్ల రేంజ్ ధరలో మోటరోలా సుస్థిర స్థానం సాధించింది. ముఖ్యంగా మోటోజీ స్టైలస్, మోటోజీ పవర్, మోటోజీ ప్యూర్ మోడళ్లు ఆ కంపెనీని అమెరికాలో తిరిగి నిలబెట్టాయి. దీంతో గతేడాది ఆ కంపెనీ మార్కెట్ ఏకంగా 131 శాతం వృద్ధిని కనబరిచింది. అమెరికా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను పరిశీలిస్తే 58 శాతం మార్కెట్‌తో యాపిల్ ప్రథమ స్థానంలో ఉండగా 22 శాతం మార్కెట్‌తో శామ్సంగ్ రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ఉన్న కంపెనీలే 80 శాతం మార్కెట్‌ని కైవసం చేసుకున్నాయి. పది శాతం మార్కెట్‌తో మోటరోలా తృతీయ స్థానంలో నిలిచింది. చైనా కంపెనీలు అమెరికా మార్కెట్ పోటీలో నిలవలేకపోయాయి. చదవండి: వచ్చేస్తోంది..వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..? -
5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్ అంట!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ51 5జీ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ధర రూ.14,999 ఉంది. 12 రకాల 5జీ బ్యాండ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. రూ.15 వేల లోపు ధరల విభాగంలో దేశంలో ఈ స్థాయి మోడల్ ఇదొక్కటేనని కంపెనీ తెలిపింది. భారత్‌లో తొలిసారిగా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌తో తయారైంది. 120 హెట్జ్ 6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ సొల్యూషన్ థింక్‌షీల్డ్, 50 ఎంపీ క్వాడ్ కెమెరా, 20 వాట్ టర్బోపవర్ చార్జర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం 4జీ4 మిమో, 3 క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత జోడించారు. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 16 నుంచి లభిస్తుంది. చదవండి:ఐఫోన్ 13 ఉచితం ! ఎక్కడ? ఎప్పుడు? ఎలా? -
200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే?
గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం వరకు బ్యాటరీ మీద జరిగిన పరిశోదనలు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్ కెమెరా అభివృద్ది మీద జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచార ప్రకారం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా 200 మెగా పిక్సల్ కెమెరాతో మొబైల్ ఫోన్ తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శాంసంగ్, రియల్ మీ, షియోమీ, మోటోరోలా 108 ఎంపీ సామర్ధ్యం గల మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇప్పుడు,మోటరోలాతో పాటు శాంసంగ్, షియోమీ కూడా 200 మెగా పిక్సల్ రియర్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేయాలని యోచిస్తున్నాయి. అయితే, చైనా షియోమీ కంపెనీ దీనిని 2022 ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు. శాంసంగ్ కంపెనీకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 2023లో శామ్ సంగ్ తన 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ ను తీసుకువస్తుందని పేర్కొంది. మోటోరోలా ఈ కెమెరాలో ఐఎస్ఓఎల్ఈఎల్ఎల్ హెచ్‌పీ1 అనే శాంసంగ్ లెన్స్‌ను ఉపయోగించింది. ఇది కొత్త పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ లెన్స్‌తో 30ఎఫ్పిఎస్ రేట్‌తో 8కే వీడియోలను, 12ఎఫ్పిఎస్ రేట్‌తో 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు. (చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..!) వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను విడుదలచేయాలని మోటోరోలా కంపెనీ భావిస్తోంది. మోటోరోలా ఇప్పటికే 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో మోటో జీ60, మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ప్యూజన్, మోటో ఎడ్జ్ 20ప్రో మోడల్ ఫోన్లను విడుదల చేసింది. మోటోరోలా తన తాజా మోటో జి31 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 29న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డివైస్ 50 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలీయో జీ85 ప్రాసెసర్ సహాయం చేత పనిచేస్తుంది. -
మోటరోలా నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా సరికొత్త మోటో జీ పవర్ 2022 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్‌గ్రేడ్‌గా రానుంది. 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటుచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు సుమారు రూ. 14 వేల నుంచి 18 వేల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లలోకి వచ్చే ఏడాదిలో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11తో పనిచేయనుంది. మోటో జీ పవర్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే మీడియా టెక్ హెలియో జీ37 ప్రాసెసర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 50ఎమ్పీ ప్రైమరీ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 11 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టైప్ సీ సపోర్ట్ చదవండి: భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..! -
ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే?
న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అత్యాధునిక మెష్ సిస్టమ్ ‘ఎంహెచ్7020’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని హోల్ హోమ్ వైఫై సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. వైఫై రూటర్, వైఫై శాటిలైట్, పవర్ అడాప్టర్లతో ఈ ప్యాక్‌లు లభిస్తాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిలో అన్ని ప్రాంతాలకు వైఫై కవరేజీ వేగవంతంగా, నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికితోడు అధిక భద్రత కూడా లభిస్తుందని పేర్కొంది. ఒక మెష్రెడీ రూటర్, ఒక అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, క్విక్స్టార్ట్ ఫ్లయర్, మోటోమ్యానేజ్ యాప్ ప్యాక్ ధర రూ.7,999గా నిర్ణయించింది. ఒక హోల్హోమ్ వైఫై రూటర్, ఒక వైఫై శాటిలైట్, రెండు పవర్ అడాప్టర్లు, రెండు ఎథర్నెట్ కేబుళ్లతో కూడిన ప్యాక్ రూ.13,999గాను, ఒక హోల్హోమ్ వైఫై రూటర్, 2 శాటిలైట్లు, మూడు పవర్ అడాప్టర్లు, మూడు ఎథర్నెట్ కేబుళ్ల ప్యాక్ ధర రూ.19,999గా నిర్ణయించింది. చదవండి: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే.. -
మార్కెట్లలోకి సరికొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో కంపెనీకి చెందిన మోటరోలా భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 20. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లలోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు అమ్మకాలను జరపనుంది. మోటరోలా ఎడ్జ్ 20 ను ఆగస్టు 24 న, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ను ఆగస్టు 27న సేల్ చేయాలని మోటరోలా భావించింది. కాగా ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఓకే రోజున ఆగస్టు 24 రోజున ఫ్లిప్‌కార్ట్‌లో ప్రి-బుకింగ్స్ జరిపేందుకు మోటరోలా నిర్ణయం తీసుకుంది. మోటరోలా ఎడ్జ్ 20( 8GB RAM + 128GB) ధర రూ. 29,999గా, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (6GB RAM + 128GB) ధర రూ. 21,499 గా నిర్ణయించింది. చదవండి: Google: ఆ స్మార్ట్ఫోన్లు ఇకపై కనిపించవు...! మోటరోలా ఎడ్జ్ 20 స్పెసిఫికేషన్లు ఆండ్రాయిడ్ 11 విత్ మైయూఎక్స్ సపోర్ట్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్డీ+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ మాక్స్ విజన్ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 778జీ 8జీబీ ర్యామ్+128 జీబీస్టోరేజ్ ట్రిపుల్ రియర్ కెమెరా (108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్,+8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్+16 మెగాపిక్సెల్ సెన్సార్) 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 30 వాట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ సపోర్ట్ టైప్ సీ చార్జింగ్ చదవండి: గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల.. -
బడ్జెట్ ఫోన్లు.. 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా
న్యూఢిల్లీ: మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్లో రెండు జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. మోటో జీ60: 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అల్ట్రా పిక్సల్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే రకం ఇందులో అందుబాటులో ఉంటుంది. మోటో జీ40 ఫ్యూజన్ ఇందులోనూ 120 గిగాహెర్జ్ 6.8 అంగుళాల హెచ్డీఆర్ 10 డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కమెరాగా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. జీ40 ఫ్యూజన్ 4జీబీ/64జీబీ రకం ధర రూ.13,999. 6జీబీ/128జీబీ ధర రూ.15,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. మోటో జీ60 ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభ విక్రయాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసిన వారికి అప్పటికప్పుడే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. -
మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
మోటో ఈ7 పవర్ ను ఫిబ్రవరి 19న ఇండియాలో తీసుకొనిరానున్నట్లు మోటోరోలా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హెలియో పీ22 ప్రాసెసర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ7 పవర్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. మోటో ఈ-సిరీస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన మోటో ఈ7 ప్లస్‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. లెనోవా యాజమాన్యంలోని సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మోటో ఈ7 పవర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.5 హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ ర్యామ్: 4జీబీ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ22 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
లీకైన మోటరోలా 'నియో' ఫీచర్స్
మోటరోలా 'నియో' అనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ ఇంటర్ నెట్ లో లీక్ అయ్యాయి. మోటరోలా 'నియో' లీకైన చిత్రాలు మొదట వీబోలో కనిపించాయి. మోటరోలా 'నియో' పిక్స్ కొన్ని వాయిస్‌లో నిల్స్ అహ్రెన్స్మీర్ లీక్ చేసారు. వాయిస్ పోస్ట్ ప్రకారం మోటరోలా నియో 'బెరిల్' కలర్ వేరియంట్ లో లభించనుంది. లీకైన చిత్రాలు మోటరోలా నియోలో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఫేస్బుక్లో లైక్ బటన్ కనిపించదు) మోటరోలా నియో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉండనుంది. ఇది క్వాల్కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ రెండు మెమరీ వేరియంట్లు లభించనున్నాయి. మోటరోలా నియో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ కెమెరా, 2ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. -
నాలుగు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన మోటొరోలా
అమెరికా: మోటొరోలా సంస్థ ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్లను అమెరికాలో లాంచ్ చేసింది. అవి మోటో జీ స్టైలస్(2021), మోటో జీ పవర్(2021), మోటో జీ ప్లే(2021), మోటొరోలా వన్ 5జీ స్మార్ట్ ఫోన్లు. ఈ నాలుగు ఫోన్లూ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనున్నాయి. ఈ నాలుగు ఫోన్ల అమ్మకాలు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మొబైల్స్ మనదేశంలో లాంచ్ అవుతాయో లేదో కంపెనీ తెలపలేదు.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?) మోటో జీ స్టైలస్ (2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 4జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 678 ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ+ 8ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: అరోరా బ్లాక్, అరోరా వైట్ కలర్ ధర: 299 డాలర్లు(సుమారు రూ.22,000) మోటో జీ పవర్(2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 3 జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ+ 2 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: ఫ్లాష్ గ్రే కలర్ ధర: 3+32జీబీ 199 డాలర్లుగా(సుమారు రూ.14,700) 4+64 జీబీ 249 డాలర్లుగా(సుమారు రూ.18,300) మోటో జీ ప్లే(2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 3 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: మిస్టీ బ్లూ కలర్ ధర: 169 డాలర్లు(సుమారు రూ.12,500) మోటొరోలా వన్ 5జీ ఏస్ ఫీచర్స్: డీస్ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 6 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 5జీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: మిస్టీ బ్లూ కలర్ ధర: 399.99 డాలర్లు(సుమారు రూ.29,500) -
లీకైన మోటో జీ స్టైలస్ ఫీచర్స్
ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీల మాదిరిగానే మోటరోలా కూడా ఈ ఏడాది తన కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా తన మార్కెట్ ను విస్తరించుకోవాలని చూస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, మోటరోలా త్వరలో మోటో జీ స్టైలస్ 2021 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ 2020 మొదటి త్రైమాసికంలో ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్లో లాంచ్ చేసిన మోటో జీ స్టైలస్ వారసురాలుగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మాక్స్ విజన్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?) మోటో జీ స్టైలస్ 2021 6.8-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ మాక్స్ విజన్ డిస్ప్లే కలిగి ఉంది. మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ వెనుకవైపు నాలుగు కెమెరాలతో వస్తుంది. 48 ఎంపీ మెయిన్ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. మోటో జీ స్టైలస్ 2021 స్నాప్‌డ్రాగన్ 675 చిప్సెట్తో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఇందులో 4000ఎంఏహెచ్ బ్యాటరీని తీయాసుకు రానున్నారు. దీనిలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ తీసుకురావడం లేదని సమాచారం. -
గీక్‌బెంచ్‌లో మోటరోలా కొత్త మొబైల్
2021లో ప్రతి మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మోటరోలా కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక మోటోరోలా మొబైల్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ తో రాబోయే నియో మొబైల్ కావచ్చు అని తెలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే 14 స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటరోలా కూడా ఉంది. రూట్మైగలాక్సీ ప్రకారం.. “నియో” అనే కోడ్ పేరుతో పిలిచే మోటరోలా ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో రానుందని లిస్టింగ్ వెల్లడించింది. మిగతా కంపెనీలన్నీ స్నాప్‌డ్రాగన్ 888తో ఫోన్లను లాంచ్ చేస్తుండగా మోటరోలా మాత్రం ఈ ఫోన్ లో పాత ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు, మోటరోలా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో ఎడ్జ్ ప్లస్‌ను విడుదల చేసింది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల) మోటరోలా నియో ఫీచర్స్: మోటరోలా నియో 8 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11తో రాబోయే మొట్టమొదటి మోటరోలా ఫోన్ నియో అవుతుందని లిస్టింగ్ వెల్లడించింది. అయితే, గీక్‌బెంచ్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాదు. గీక్‌బెంచ్‌లో స్కోరు విషయానికొస్తే మోటరోలా నియో సింగిల్-కోర్ పరీక్షలో 958 మరియు మల్టీ-కోర్ పరీక్షలో 2969 స్కోర్లు సాధించింది. ఎక్కువ స్కోరు ప్రాసెసర్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ జాబితా డిసెంబర్ 29, 2020న కనిపించింది. 2021 ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1,080x2,520 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుందని తెలుస్తుంది. మోటరోలా నియోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో రావచ్చు. సెల్ఫీ కోసం ఇందులో ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. -
ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్
మోటోరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకోబోయే ఫోన్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే) -
మోటోరోలా బడ్జెట్ మొబైల్ వచ్చేసింది
మోటోరోలా మొబైల్ వినియోగదారుల కోసం మరో బడ్జెట్ మొబైల్ ని తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మోటో జీ9కి తదుపరి మోడల్ గా మోటో జీ9 పవర్ తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ మొబైల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపి ట్రిపుల్ కెమెరాలు మరియు స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ తో 6.8-అంగుళాల హెచ్డి + డిస్ప్లేను తీసుకొచ్చారు. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ లో మొబైల్స్ పై భారీ తగ్గింపు) మోటో జీ9 పవర్ ఫీచర్స్ & ధర: మోటో జీ9 పవర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. మోటో జీ9 పవర్ 6.8-అంగుళాల హెచ్ డీ ప్లస్ (720 x 1,640 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఆన్‌బోర్డ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించడం ద్వారా 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ 9 పవర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ కెమెరా ఎఫ్/1.79 లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్ వెనుక-ఫింగర్ ప్రింట్ మౌంటెడ్ స్కానర్ మరియు 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తుంది. కనెక్టివిటీ కోసం మోటో జీ 9 పవర్ 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంది. భారతదేశంలో మోటో జీ9 పవర్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .11,999. ఎలక్ట్రిక్ వయొలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 15వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. -
బిగ్ బ్యాటరీతో రానున్న మోటో జీ9 పవర్
మోటో జీ9 పవర్ మొబైల్ ను డిసెంబర్ 8న భారతదేశంలో తీసుకురానున్నట్లు తెలిపింది. ట్విట్టర్ లో ‘మోటోరోలా నుండి మరో కొత్త ఫోన్ రాబోతుంది. దాని పేరు మోటో జీ9 పవర్. డిసెంబర్ 8, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ వేదికగా మొబైల్ లాంచ్ అవుతోంది. అప్పటి వరకు వేచి చూడండి’అని మోటోరోలా తెలిపింది. దీనికి సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా షేర్ చేసింది. ఈ మొబైల్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేశారు. ఫోన్ ధర రూ.17,400 (199 యూరోలు) అని తెలుస్తోంది.(చదవండి: ఐఫోన్11కు స్క్రీన్ల రీప్లేస్మెంట్) మోటో జీ9 పవర్ ఫీచర్స్: మోటో జీ9 పవర్ ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. దీనిలో 6.8-అంగుళాల హెచ్డి + (720x1,640 పిక్సెల్స్)ఐపిఎస్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. దీనిలో స్టోరేజ్ వచ్చేసి 128జీబీ, మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ9 పవర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ఎఫ్/1.79 లెన్స్‌తో, 2 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్‌తో మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్‌తో కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది. మోటరోలా మోటో జీ9 పవర్‌ను 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు 4జీ ఎల్‌టిఇ ఉన్నాయి. ఫోన్ బరువు 221 గ్రాములు మరియు 9.66 మిమీ మందంగా ఉంటుంది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ వయిలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో లభిస్తుంది. -
నేడే మోటో బడ్జెట్ 5జీ మొబైల్ లాంచ్
న్యూఢిల్లీ: మోటోరోలా తన మోటో జీ 5జీ మొబైల్ ని భారతదేశంలో నేడు(నవంబర్ 30) లాంచ్ చేయబోతుంది. ఈ కొత్త మోటరోలా మొబైల్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నట్లు మోటోరోలా తెలిపింది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది. ఇండియాలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750 జీ ప్రాసెసర్‌తో రాబోతున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 జీ. మోటరోలా మోటో జీ 5 జీ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియెంట్ ని అంతర్జాతీయ మార్కెట్లలో యూరో 299.99 (సుమారు రూ.26,200)కు విడుదల చేసింది. అయితే, భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో లభిస్తుందని కంపెనీ ట్విట్టర్ పోస్ట్ తెలిపింది.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్) మోటో జీ 5 జీ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. దీనిని మైక్రో ఎస్ డీ కార్డ్ 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సెన్సార్లు కూడా ఉండనున్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేక బటన్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఎన్ఎఫ్సీ సపోర్ట్‌ను కూడా ఇందులో అందించనున్నారు. మోటో జీ 5 జీలో కనెక్టివిటీ కోసం జిపిఎస్, బ్లూటూత్ 5.1, వై-ఫై 802.11ఏసి, యుఎస్ బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీని యొక్క ధరను నేడు లాంచ్ ఈవెంట్ లో తెలియజేయనున్నారు. -
బడ్జెట్లో మోటో 5జీ ఫోన్
మోటరోలా చివరకు తన మోటో జి 5జీని త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని మోటొరోలా ట్వీటర్ ద్వారా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో 5జి ఫోన్‌ను లాంచ్ చేయాలని మోటోరోలా చాలాకాలంగా ఎదురుచూస్తుంది. ఈ ఫోన్ గతంలోనే యూరోప్‌లో లాంచ్ అయింది. మోటో జి 5జీ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ యొక్క ధర యూరప్‌లో 299.99 యూరోలు(సుమారు రూ.26,300)గా నిర్ణయించింది. ట్విట్టర్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో యూరప్ కంటే కొంచెం తక్కువ ధరకే తీసుకురానుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్) మోటో జి 5జీ స్పెసిఫికేషన్స్ మోటో జీ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై మోటో జీ 5జీ పనిచేయనుంది. దీని ర్యామ్ 4జీబీ కాగా, 64జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవడం ద్వారా 1టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జి 5జీ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ తర్వాత మరో కొత్త సేల్ తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ యొక్క బ్లాక్ ఫ్రైడే సేల్ నేటి నుండి నవంబర్ 30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు గత సేల్ లో ఆఫర్లు, డిస్కౌంట్లను కోల్పోయినట్లయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మళ్ళి మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ ను పొందటానికి మరొక అవకాశాన్ని కల్పించింది. ఈ-కామర్స్ దిగ్గజం ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇఎంఐ లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బ్లాక్ ఫ్రైడే అమ్మకం సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తున్నాం. (చదవండి: మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్) ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఇవే.. ► ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకం సమయంలో రూ. 38,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఎక్స్ఆర్ను అసలు ధర కన్నా రూ.10,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. దీని యొక్క అసలు ధర రూ .47,900. మీ దగ్గర కనుక పాత ఐఫోన్ ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రూ.14,100 వరకు తగ్గింపును పొందవచ్చు. ► ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలలో భాగంగా మోటో జి9 రూ.9,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 662 చిప్సెట్ మరియు 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పనిచేస్తుంది. ► ఫ్లిప్‌కార్ట్ కొన్ని రియల్మీ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో 20 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హిలియో జి95 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇది 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. దీని వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ► శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 + ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ. 49,999కు లభిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ► గూగుల్ పిక్సెల్ 4ఎ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకంలో భాగంగా రూ.31,999కు లభిస్తుంది. ఇది 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 5.81-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. పిక్సెల్ 4ఎలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ► శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ను ప్రస్తుతం రూ.54.999కి అందిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ అసలు ధర రూ. 79,999కు లభిస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ డీల్. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభిస్తుంది. ► ఐఫోన్ SE 2020 మీరు ఐఫోన్ కొనాలనుకుంటే, ఇది ఉత్తమ సమయం. ఐఫోన్ SE 2020ను రూ. 32,999కు కొనుగోలు చేయవచ్చు. దీని 64 జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర. 42,500 రూపాయల నుండి తగ్గింది. ఈ ఐఫోన్‌పై మీకు 9,501 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది. -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. “క్విక్ వ్యూ” డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్ ప్రధాన ఫీచర్లుగా ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా రేజర్ 5జీ ధర, లాంచ్ ఆఫర్లు భారతదేశంలో మోటరోలా రేజర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 1,24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. గ్రాఫైట్ కలర్ ఆప్షన్లో లభ్యం. ఈ రోజు నుండి ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ లావాదేవీలపై 10,000 తక్షణ తగ్గింపు. జియో కస్టమర్లు రూ. 4,999 వార్షిక ప్రణాళికలో డబుల్ డేటా ఆఫర్ చేయనుంది. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఓఎల్ఈడీ ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ : ధర?
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కెమరాల్లో మార్పులు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో ముందు మొబైల్ కంటే చాలా చౌకగా దీన్ని విడుదల చేసింది. అలాగే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11కి అప్‌గ్రేడ్ చేయవచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు రూ .102,600 ధరతో లాంచ్ చేసింది. (మోటో రేజర్ ధర రూ.1,24999). గ్రాఫైట్, బ్లష్ గోల్డ్ లిక్విడ్ మెర్క్యురీ మూడు రంగుల్లో లభ్యం. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రస్తుతానికి చైనా, యూరోపియన్ మార్కెట్లో లభించనుంది. ఇండియాలో లాంచింగ్ తేదీని మోటరోలా ఇంకా ప్రకటించలేదు. -
బడ్జెట్ ధరలో మోటో జీ 8 పవర్ లైట్
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్‌లో భాగంగా మోటోరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ8 పవర్ లైట్ పేరుతో బడ్జెట్ ధరలో గురువారం తీసుకొచ్చింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన పవర్ ప్రధాన ప్రత్యేకతలుగా ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో విడుదలైన ఈ ఫోన్ ధరను రూ.8999గా ఉంచింది. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది. రెండు కలర్స్ లో లభ్యం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. మోటరోలా జీ8 పవర్ లైట్ ఫీచర్స్ 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి : జియోలో కేకేఆర్ పెట్టుబడులు : మరో మెగా డీల్? బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే? The all-new Moto g8 power lite packs the #UltimatePower of a 5000mAh battery, 4GB RAM + 64GB storage, 16MP triple camera system & more. Are you ready to experience the #UltimatePower? Available on @Flipkart at just ₹8,999 starting 29 May, 12 PM onwards! https://t.co/v2Tn740HBT pic.twitter.com/djdG112iZ8 — Motorola India (@motorolaindia) May 21, 2020 -
మోటరోలా జి 8 పవర్ లైట్ రేపే లాంచింగ్: ధర?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్డౌన్ ఆంక్షల్లో క్రమంగా సడలింపుల నేపథ్యంతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త ఉత్పత్తుల లాంచింగ్ సిధ్దపడుతున్నాయి. ముఖ్యంగా మోటరోలా తన ఎడ్జ్ + ఫ్లాగ్‌షిప్‌ను భారత మార్కెట్లో రేపు (గురువారం) లాంచ్ చేయనుంది. మోటో జి సిరీస్‌లో భాగంగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. జీ 8 పవర్ లైట్ పేరుతో తీసుకొస్తున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన డిజైన్ తో రానుందని కంపెనీ చెప్పింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించనుంది. బడ్జెట్ ధరలో రానున్న ఇది రెడ్ మి 8, రియల్ మి నార్జాలకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. మోటరోలా జీ8 పవర్ లైట్ ఫీచర్స్ 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.10,000 -
మోటో ‘వన్ విజన్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మోటరోలా తాజాగా ‘వన్ విజన్’ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 27 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.19,999. 48 మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా, 25ఎంపీ ఫ్రెంట్ కెమెరా, 6.3 అంగుళాల డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలతో ఈ ఫోన్ మార్కెట్లోకిరానుంది. -
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. వచ్చే నెలలోనే
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఫోల్డబుల్ డివైస్‌లపై భారీ ఆసక్తి నెలకింది. మరోవైపు మొబైల్ దిగ్గజాలు శాంసంగ్,ఎల్జీ, హువావే లాంటివి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్లపై యూజర్లను ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్ మోడల్ మొబైల్‌ను మళ్లీ తీసుకురాబోతోందన్న అంచనాలు మార్కెట్లో భారీగా వ్యాపించాయి. అత్యుత్తమ ఫీచర్స్‌తో తన పాపులర్ మోడల్ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. అదీ ఫోల్డబుల్ డిస్ప్లేతో. ప్రీమియం ధరలో వచ్చే నెలలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. అద్భుత ఫీచర్లతో పూర్తిగా పునరుద్ధరించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలుగా ఉండనుందని అమెరికా టెలికాం దిగ్గజం వెరిజాన్ నివేదించింది. అయితే ఈ వార్తలను మోటరోలా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే అల్ట్రా థిన్ స్టయిలిష్ డిజైన్‌తో మోటరోలా రాజర్ వి3 ను 2004లో మొదటిసారిగా తీసుకొచ్చి, యంగ్ మొబైల్ యూజర్లలో ట్రెండ్‌సెట్ చేసింది. దాదాపు నాలుగేళ్లలో 130 మిలియన్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మధ్యలో కొంత ప్రాభవాన్నికోల్పోయిన మోటరోలా 2011, 2012 సంవత్సరాల్లో మళ్లీ ప్రపంచంలోనే పలుచనైన మొబైల్గా డ్రాయిడ్ రాజర్ పేరుతో విడుదల చేసింది. ఇపుడిక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా మరోవైపు ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఫ్లెక్స్‌పై'ను తీసుకొచ్చిన ఘనతను స్టార్టప్ కంపెనీ రాయొలే కార్పొరేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవోకు చెందిన మొబైల్ మేకర్ మోటరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం లాంచ్ చేసింది. మోటరోలా వన్ పవర్ పేరుతో భారతదేశ మార్కెట్లోకి మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబరు 5వ తేదీన ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ద్వారా ప్రీ బుకింగ్ కోసం ఈ రోజునుంచే అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇది డఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, భారీ స్క్రీన్, 15 వాట్స్ టర్బోచార్జర్, మెటల్ డిజైన్, టాప్ ఫీచర్స్‌గా కంపెనీ చెబుతోంది. మోటరోలా వన్ పవర్ 6.2 అంగుళాల డిస్ప్లే విత్ నాచ్ 1.8 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ -
‘మోటో జీ6 ప్లస్’ @ 22,499
న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా మార్కెట్లో ఆవిష్కరించింది. ‘మోటో జీ6 ప్లస్’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్.. 6జీబీ ర్యామ్, 64 అంతర్గత మెమరీ, 5.9 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉన్నట్లు మోటరోలా వెల్లడించింది. వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లెన్స్ అనుసంధానించటం వల్ల ఫొటోల్లో మరింత స్పష్టత, ల్యాండ్‌మార్క్ గుర్తింపు నాణ్యత ఉంటుందని వివరించింది. 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టర్బోవపర్ చార్జర్ ఉన్న ఈ ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుందని తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద పేటీఎం మాల్, మోటో హబ్, అమెజాన్‌లో పలు ఆఫర్లను ఇస్తున్నట్లు లెనోవో అనుబంధ సంస్థ మోటొరోలా ప్రకటించింది. -
మోటరోలా 2 కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా మోటో జీ6, మోటో జీ6 ప్లే పేరిట రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిలో మోటో జీ6 ప్లే ధర రూ.11,999. మోటో జీ6 ధర రూ.13,999 నుంచి ప్రారంభమౌతోంది. మోటో జీ6లో 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే (18:9 రేషియో), క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 12 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్–32 జీబీ మెమరీ/ 4 జీబీ ర్యామ్–64 జీబీ మెమరీ, ఓరియో 8.0 ఓఎస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇక మోటో జీ6 ప్లేలో 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే (18:9 రేషియో), 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. మోటో జీ6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో, మోటో జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. -
లెనోవో, మోటోరోలా ఫోన్లకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్, లెనోవో, మెటోరోలా 4జీ స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీలకు చెందిన ఎంపిక చేసిన 4జీ స్మార్ట్ఫోన్లపై 2వేల రూపాయల వరకుక్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. పాపులర్ మోడల్స్ అయిన మోటొరోలా మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా మోటో సీ స్మార్ట్‌ఫోన్ రూ.3,999కే లభ్యంకానుంది. అలాగే మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్ 6,499 రూపాయలకి, లెనోవో కే8 నోట్ స్మార్ట్‌ఫోన్ 10,999 రూపాయలకి కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 4జీ స్మార్ట్ఫోన్లను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు మోటోరోలాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాని వెంకటేశ్ తెలిపారు. '' ఎయిర్టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది మంచి అవకాశం. మోటోరోలా, లెనోవో స్మార్ట్ఫోన్లతో ఈ అనుభవాన్ని ఎంజాయ్ చెయ్యండి'' అని మోటోరోలా మొబిలిటీ ఇండియా, లెనోవో ఎంబీజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధిన్ మాథుర్ అన్నారు. -
ఆ ఫోన్లపై ఎయిర్టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్
న్యూఢిల్లీ : ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ ప్లాన్ ప్రచారంలో భాగంగా మోటరోలా, లెనోవా 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్ ఆఫర్‌ను ప్రకటించింది. మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ మొబైళ్లకు మాత్రమే ఈ క్యాష్‌బాక్ వర్తిస్తుంది. క్యాష్‌బాక్ ఆఫర్లో భాగంగా మోటో సీ మొబైల్ రూ.3,999 , మోటో ఈ4 మొబైల్ రూ.6,499, లెనోవో కే8 నోట్ రూ.10,999 లకే లభిస్తుంది. స్మార్ట్ఫోన్లు అత్యంత దిగువస్థాయి కస్టమర్లకు కూడా లభ్యమయ్యేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేశ్ తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్ సేల్కు తెరలేసింది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంలో మోటోరోలా మూడు రోజుల పాటు ఈ ప్రమోషనల్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు జరుగనుంది. మోటో డేస్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోటోరోలా ఫోన్లు మోటో ఈ4 ప్లస్, మోటో ఎక్స్4, మోటో జెడ్2 ప్లే స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్లో లభించనున్నాయి. మోటో డేస్ ఫ్లిప్‌కార్ట్ సేల్... మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.9,499కి లిస్టు చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.9,999. అదనంగా ఈ ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.2000 తగ్గింపును ఇస్తోంది. దీంతో మొత్తంగా మోటో ఈ4 ప్లస్ ధర రూ.7,499కు దిగొచ్చింది. అయితే ఈ ఎక్స్చేంజ్ కూడా ఎంపిక చేసిన ఫోన్లపైనే ఇస్తారు. ఫైన్ గోల్డ్, ఐరన్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ఈ ఆఫర్ కింద లిస్టు అయి ఉంది. కొత్తగా లాంచ్ అయిన మోటో ఎక్స్4 ధరను కూడా ఫ్లిప్‌కార్ట్ రూ.20,999 నుంచి రూ.18,999కు తగ్గించింది. అదనంగా ఎక్స్చేంజ్పై మరో రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. మోటో జెడ్2 ప్లేను కంపెనీ గతేడాది లాంచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఫోన్‌గా పేరొందింది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.27,999 కాగ, ప్రస్తుతం దీన్ని ఫ్లిప్‌కార్ట్ రూ.22,999కే అందుబాటులోకి తెచ్చింది. అదనంగా ఈ ఫోన్‌పై కూడా రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. -
మోటో జీ5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్: రేపే ఆఖరు
సాక్షి, ముంబై: మోటో జీ 5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా..మోటో జీ సిరీస్‌లో భాగంగా గత ఏడాది లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇపుడు రూ.5వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 20 మొబైల్స్, 18 బొనాంజా పేరుతో జనవరి 3-5వరకు పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తాజా తగ్గింపుతో మోటరోలా ట్విట్టర్ సమాచారం ప్రకారం ఐదో జనరేషన్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 ప్లన్ ఇపుడు రూ 9,999 లభ్యం. ఈ ఆఫర్ జనవరి 5వ తేదీవరకుమాత్రం అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లో సమాచారం 32జీబీ స్టోరేజ్ మోటో జీ 5 ప్లన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7వేల తగ్గింపుతో 9,999కే అందిస్తోంది. దీని అసలు ధరను రూ.16,999. మోటో జీ 5 ప్లన్ ఫీచర్లు 5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ 2 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న మోటో ఈ4 ప్లస్ అమెజాన్లోకూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. #Uncompromise this #NewYear with #motog5plus at a price off of Rs. 4000/- Valid till 5th Jan only! https://t.co/qDphPu5i0p — Motorola India (@motorolaindia) January 4, 2018 -
బిగ్‌సి మొబైల్స్‌తో మోటోరోలా ఒప్పందం
-
లాంచింగ్‌కు సిద్ధమైన మోటో ఎక్స్4, ఫీచర్లివే!
మోటోరోలా మోటో ఎక్స్ లైనప్‌లో ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2న మార్కెట్లోకి రాబోతుంది. మోటో ఎక్స్4 విడుదల తేదీను మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. మోటోరోలా ఫిలిప్పీన్స్ ఫేస్బుక్ పేజీలో తాజాగా పోస్టు చేసిన పోస్టర్లో లాంచ్ ఈవెంట్ సాయంత్రం ఆరు గంటలకు ఉండబోతుందని మోటోరోలా తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో ''హలోమోటోఎక్స్'' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు సుమారు 26వేల రూపాయలుగా ఉంబోతుందని టాక్. రెండు వేరియంట్లలో ఇది విడుదల కాబోతుంది. మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 12 ఎంపీ రియర్ కెమెరాలు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో డబుల్ ధమాకా: జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్
మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ5ఎస్ ప్లస్' ను స్పెషల్ ఎడిషన్‌గా లాంచ్ చేసింది. తన జీ సిరీస్‌లోని కొత్త డివైస్‌లను మంగళవారం విడుదల చేసింది. ఎఫర్డబుల్ ధరలతో, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను తమ కస్టమర్లకు అందించనున్నట్టు మోటో ఎండీ మధురుసూదిన్ పేర్కొన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో ఈ క్వార్టర్లో 100 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఈ రాత్రి 11.59 ని.ల నుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా లభించనుంది. దీంతోపాటు మిగతా ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులోఉంటుంది. జీ5 ఎస్ రూ.11,990లోనూ, స్పెషల్ ఎడిషన్‌గా లాంచ్ చేసిన జీఎస్ 5 ప్లస్ ఫోన్ ధరను 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 15,999గా నిర్ణయించింది.మోటో డివైస్ ద్వారా రూ.1000 ఎక్సేంజ్ ఆఫర్, జియో 50జీబీ 4జీ అదనపు డేటా , నో ఇఎంఐ కాస్ట్ తదితర లాంచింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. మోటో జీ5ఎస్ ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్ టర్బో చార్జింగ్ మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు 5.5 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1. 1 2.0 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 13 ఎంపీ పిక్సెల్ రెండు రియర్ కెమెరాలు ఎల్ఈడీ ఫ్లాష్ , ప్రో అండ్ పనోరమా మోడ్ సెల్పీ కెమెరా 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సౌలభ్యం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ రూ. 15,999 ధరలో ఇది బ్లష్ గోల్డ్, లూనార్ గ్రే లో అందుబాటులో ఉండనుంది. ఇది బ్లష్ గోల్డ్, లూనార్ గ్రే కలర్స్‌లో విక్రయానికి రానుంది. The #MotoG5S is available on @amazonIN & retail stores tonight from 11:59 pm at a special price of 11,999! Get your very own device tonight! pic.twitter.com/FjUXx6USPl — Motorola India (@motorolaindia) August 29, 2017 -
మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఎప్పటికీ పగలదు.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది రూపాయిలు పోసి స్మార్ట్‌ఫోన్ కొంటాం. ఒక్కోసారి ప్రమాదవశాత్తూ కింద పడితే పగిలితే అంతే సంగతులు. వాటికి కొత్త స్క్రీన్ వేయించాలంటే వేలాది రూపాయలు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి మారనుంది. 'షేప్ మెమోరీ పాలిమర్' అనే సరికొత్త టెక్నాలజీని మొబైల్ దిగ్గజం మోటొరోలా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. మొటోరోలా తన మొబైల్ స్క్రీన్ తయారీలో ఈనూతన టెక్నాలజీని ఉపయోగించే పనిలో ఉంది. ఇందులో ఫోన్ కిందపడి స్క్రీన్ పగిలిపోయినా, గీతలు పడినా ఆటోమేటిక్‌గా బాగుచేసుకొనే విధంగా ఈ కొత్త మొబైల్స్‌ను తీసుకురానుంది. స్క్రీన్ పగిలిపోయినా, గీతలు పడిన వెంటనే వాటిని మాయం చేయడానికి అవసరమైన వేడిని పుట్టించడం ద్వారా మొబైల్ స్క్రీన్ తనంతట తానుగా మరమ్మత్తులు చేసుకొని సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఈటెక్నాజిని వాడే పేటెంట్ హక్కులు మోటారోలాకు మాత్రమే ఉన్నాయి. ఈ తరహా స్మార్ట్ఫోన్లను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. -
మోటో కొత్త ఫోన్, ధరెంతో తెలుసా?
అద్బుతమైన ఫీచర్లతో సరితూగ తగ్గ ధరలతో మోటోరోలా ఇటీవల సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నద్ధమవుతోంది. ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కావడానికి ముందే ధర, ఫీచర్లు లీకయ్యాయి. టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ అనే వ్యక్తి దీని ధర వివరాలను ఆన్లైన్లో లీక్ చేశారు. మోటోరోలా తీసుకురాబోతున్న అప్‌కమింగ్ డివైజ్ మోటో ఎక్స్4, 32జీబీ వేరియంట్ ధర తూర్పు యూరోపియన్ మార్కెట్లో 350 యూరోలు అంటే సుమారు రూ.26,300 వరకు ఉండొచ్చని లీక్చేశారు. ఈ ఫోన్ ధర మోటోరోలా తీసుకొస్తున్న మోటో-ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలకు తగ్గట్టే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మోటోరోలా 2015 నుంచి తీసుకొస్తున్న ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.27వేల మధ్యలో ఉన్నాయి. అంతేకాక ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ఇతర వేరియంట్లను కూడా మోటోరోలా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు క్వాండ్ట్ తెలిపారు. ఈ ఫోన్‌ను ఈ వారం మొదట్లో లాంచ్‌చేసిన మోటో జెడ్2 ఫోర్స్ ఈవెంట్లోనే తీసుకొస్తారని టెక్ వర్గాలు అంచనావేశాయి. కానీ కేవలం మోటో జెడ్2 ఫోర్స్‌ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది. మోటో ఎక్స్ 4 ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయట... అల్యూమినియం బాడీ డ్యూయల్ కెమెరా సెటప్ 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో రియర్ కెమెరా ఐపీ68 వాటర్ప్రూఫింగ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్సెట్ 32జీబీ లేదా 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ నోగట్ -
మార్కెట్లోకి ‘మోటో ఈ4’ స్మార్ట్‌ఫోన్స్
ధర శ్రేణి రూ. 8,999–రూ. 9,999 న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ తాజాగా తన ‘ఈ’ సిరీస్‌లో నాల్గవ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘మోటో ఈ4’ స్మార్ట్‌ఫోన్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.8,999. ‘మోటో ఈ4 ప్లస్’ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ధర రూ.9,999. ఈ4ప్లస్‌లో 5.5 అంగుళాల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో విక్రయించే హ్యాండ్సెట్స్ ధరలను తగ్గిస్తామని లెనొవొ ప్రకటించింది. -
మోటో స్మార్ట్ఫోన్లు లాంచ్, స్పెషల్ ఆఫర్స్
మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఈ4 ప్లస్ ను విడుదల చేసింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటోఈ సిరీస్ స్మార్ట్ఫోన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. మెటల్ బాడీ యూనిక్ డిజైన్‌తో బడ్జెట్ ధరల్లో మోటో ఈ4, ఈ4 ప్లస్‌లను విడుదల చేసింది. అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో ఈ4 ప్లస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈ4 ప్లస్ ధర రూ.9,999లకు, మోటో ఆ4 రూ. 8999 ధరకే అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బుధవారం అర్థరాత్రినుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ప్రీమియం మెటల్ బాడీతో డిజైన్ చేసిన ఈ 4 ప్లస్ ఐరన్గ్రే, ఫైన్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం కానుంది. మోటా ఈ 4 విషయానికి వస్తే 5 అంగుళాల డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాఫింగర్ ప్రింట్ సెన్సర్, 2800 బ్యాటరీ సామర్ధ్యం ఫీచర్లతో బ్లూయిష్ గోల్డ్ కలర్లో లాంచ్ చేసింది. గత మూడేళ్లుగా ఎన్నో మైలురాళ్లను అధిగమించినట్టు మోటో ఎండీ మాధుర్ సూదిన్ ప్రకటించారు. ఆకర్షణీయ ధరల్లో అద్భుత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా తన ప్రస్థానం కొనసాగుతుందన్నారు. లాంచింగ్ ప్రత్యేక ఆఫర్లు మోటో హెడ్‌ఫోన్స్ పై రూ .649డిస్కౌంట్ 2 నెలల ప్రీమియం హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం ఐడియా సెల్యులార్ వినియోగదారులకు రూ. 443 రీఛార్జిపై 3 నెలల పాటు 84జజీబీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మోటోఈ4 కొనుగోలుపై రూ. 9,000వరకు ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ4 ప్లస్ కొనుగోలుదారులు రూ.4వేల బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్ రిలయన్స్జియో ప్రైమ్ కస్టమర్లు 4జీబీ 30జీబీ అదనపు డేటా -
మార్కెట్లోకి ‘మోటో సీ ప్లస్’ ధర రూ.6,999
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా ‘మోటో సీ ప్లస్’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్ నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ‘మోటో సీ ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లో ఐదు అంగుళాల స్క్రీన్, 1.3 గిగాహెర్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మొమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ స్మార్ట్ఫోన్లు జూన్ 20 నుంచి కేవలం ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. -
మోటో సీ ప్లస్ వచ్చేసింది...ధర ఎంతంటే
లెనోవా బ్రాండ్ మోటోరోలా సంస్థ మోటో సీ ప్లస్ పేరిట ఓకొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (సోమవారం) విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈస్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్న విషయాన్ని సంస్థ ట్విట్టర్లో వెల్లడించింది. మధ్నాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్వీట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 12గం.నుంచి ఫ్లిప్‌కార్ట్ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ డివైస్ ధరను రూ. 6,999గా నిర్ణయించింది. రెండు నానో సిమ్ లతో కలిపి మొత్తం మూడు స్లాట్లతో దీన్ని లాంచ్ చేసింది. మోటో సీ ప్లస్ ఫీచర్లు... 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. అంతకంతకూ పుంజుకుంటున్న డేటా వినియోగం , పడిపోతున్న డేటా ధరల నేపథ్యంలో ఫీచర్ ఫోన్వినియోగదారులు పెద్ద సంఖ్యలో సరసమైన ధరలో లభించే స్మార్ట్‌ఫోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. So, set your reminders & grab your #MotoCPlus on the 20th June, starting 12 noon! Remember, it’s a limited stock sale, only on @Flipkart! pic.twitter.com/0IlihrB62u — Moto India (@Moto_IND) June 19, 2017 -
మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి జోరుమీదున్న మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మోటో జెడ్2 ప్లే పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ జూన్ 8న భారత్ లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసింది. ప్రీ-ఆర్డర్లు కూడా ఆ రోజు నుంచే ప్రారంభించనున్నట్టు మోటో ఇండియా ఆదివారం ఓ ట్వీట్ చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన మోటో జెడ్ ప్లేకు సక్సెసర్ గా దీన్ని ప్రవేశపెడుతున్నారు. మెరుగుపరిచిన కెమెరా, ప్రాసెసర్, స్పెషిఫికేషన్లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయి. '' భారీ ఫోన్ కు ఇక గుడ్ బై చెప్పండి. నున్నగా ఉండే రీ-డిఫైన్డ్ మోటో జెడ్2 ప్లేకు హలో చెప్పండి!'' అంటూ కంపెనీ ఆదివారం ఓ ట్వీట్ చేసింది. అమెరికాలో ఈ ఫోన్ 499 డాలర్లు కాగ, భారత్ లో దీని ధర 25వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఫోన్ ను ఎక్కడ అందుబాటులో ఉంచుతుందో తెలుపలేదు. ఇక ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వస్తే... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 32జీబీ/64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు 2టీబీ వరకు విస్తరణ మెమరీ 12ఎంపీ ప్రైమరీ కెమెరా 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గతవారమే మోటోరోలా మోటో సీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఈ4, మోటో ఈ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుందని టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. Bid Goodbye to a bulky phone & Say Hello to re-defined sleekness on the #MotoZ2Play! For pre-booking offers, visit: https://t.co/Jzch7gqsKv pic.twitter.com/EfDwV2nLTu — Moto India (@Moto_IND) June 4, 2017 -
మోటో ఈ 4ప్లస్, అతిపెద్ద బ్యాటరీ
మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4 ప్లస్ ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోలో నెట్ లోచక్కర్లు కొడుతున్నాయి. మొదట యూరోప్ జోన్ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో దీన్ని వినియోగదారులకు అందించనుంది.మొదట యూరోప్‌లోనే ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ లాంచ్ చేయనుందట. రిమూవబుల్ బ్యాక్ కవరతోరానున్న ఈ డివైస్ ధర సుమారు రూ.13,305గా నిర్ణయించవచ్చని అంచనా. ఇకపోతే మోటో ఈ ప్లస్ 4 ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా వున్నాయి. 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటొరోలా జీ5 వచ్చేసింది
ధర రూ.11,999 న్యూఢిల్లీ: మోటొరోలా కంపెనీ మోటో జీ సిరీస్‌లో ఐదవ తరం ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. మోటొ జీ5 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.11,999 గా నిర్ణయించామని మోటొరోలా మొబిలిటీ ఇండియా ఎండీ సుధిన్ మాధుర్ చెప్పారు అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. షావొమి, మైక్రోమ్యాక్స్, లెనొవొ కంపెనీలకు చెందిన ఈ రేంజ్ ధర ఉన్న స్మార్ట్ఫోన్లకు ఈ మోటొ జీ5 గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఆండ్రాయిడ్ నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని మాధుర్ చెప్పారు. ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.4 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా–కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 128 జీబీ వరకూ ఎక్స్పాండ్ చేసుకోగల మెమరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. -
మోటో డేస్: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు
మోటో ఉత్పత్తుల భారత్‌లోకి ప్రవేశపెట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లెనోవో ఘనంగా మోటోరోలా కంపెనీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు 'మోటో డేస్ ఆఫర్స్' పేరుతో ఈ వేడుకలను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ ఫామ్‌పై సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మోటో స్మార్ట్ ఫోన్లపై బపర్ ఆఫర్లు ప్రకటించింది. సెలబ్రేషన్స్ లో భాగంగా మోటో జెడ్, జెడ్ ప్లే స్మార్ట్ ఫోన్లపై రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను, కొనుగోలుపై రూ.2000 డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. మోటో జీ టర్బో ఎడిషన్, మోటో ఎం వంటి డివైజ్ లకు ఫ్లాట్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే 10 శాతం డిస్కౌంట్ ను కూడా ఇది ఆఫర్ చేయనుంది. మోటో జెడ్ ఫోన్ అసలు ధర రూ.39,999. మోటో జెడ్ ప్లే అసలు ధర రూ.24,999. ఈ సేల్ నేపథ్యంలో మోటోరోలా తయారుచేసిన నెక్సస్ 6ను డిస్కౌంట్ ధరకు విక్రయించనుంది. 32జీబీ వేరియంట్ రూ.19,999కు, 64జీబీ వేరియంట్ రూ.25,999కు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా మోటో జీ(రెండవ తరం) 16జీబీ వేరియంట్ రూ.6,999కు, మోటో జీ (3వ తరం) 8జీబీ వేరియంట్ ఫోన్ రూ.7,999కు కంపెనీ విక్రయించనుంది. -
వాలెంటైన్స్ డేకి కంపెనీలు స్పెషల్ ఆఫర్లు
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, ప్రొడక్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లతో వినియోగదారులు ముందుకొచ్చాయి. ఆపిల్, మోటోరోలా, శాంసంగ్, అమెజాన్ వంటి కంపెనీలు క్యాష్ బ్యాక్, ఉచిత మూవీ టిక్కెట్ ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీతో జతకట్టిన ఆపిల్, ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ క్యాష్ బ్యాక్ కస్టమర్ అకౌంట్లోకి అదేరోజు లేదా కొనుగోలు చేసిన 90రోజుల్లో క్రెడిట్ కానున్నాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 14 వరకే అందుబాటులో ఉండనుంది. తర్వాత ఐఫోన్ 5ఎస్ కొనుగోలు చేసిన వారికి ఇది వర్తించదు. కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపైనే కాకుండా మిగతా బ్యాంకు కార్డులపై కూడా ఆపిల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా బ్యాంకు కార్డుదారులకు రూ.2000లనే ఆఫర్ చేయనుంది. ఈ బ్యాంకుల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టెడ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు దీనిలో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా తన ప్రొడక్ట్లన్నింటిపై కపుల్ పీవీఆర్ టిక్కెట్లను అందిస్తోంది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో మోడ్స్, మోటో ఎం, మోటో జే4 ప్లే, మోటో ఈ3 పవర్, మోటో ఎక్స్ ఫోర్స్‌లను ఫిబ్రవరి 14కు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే ఈ టిక్కెట్లను పొందవచ్చు. లీ ఎకో కూడా మరో సేల్‌ను ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం మధ్యలో లీమాల్.కామ్‌లో తమ స్మార్ట్‌టీవీ సూపర్3 ఎక్స్55 ఆల్ట్రా హెచ్డీవీని కొనుగోలు చేసిన వారికి అన్ని డెబిల్, క్రెడిట్ కార్డులపై రూ.4000 క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. మరో రూ.1500 నగదు బహుమతిని గెలుచుకునే ఆఫర్ ను అందిస్తోంది. -
ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!
మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ డివైజ్ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఇప్పటికే పలు రిపోర్టులు నివేదించాయి. దాని పేరు మోటో ఎమ్ అని, ఆ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో హల్చల్ చేశాయి. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో రాబోతున్న ఈ ఫోన్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది. వైబ్ పీ1 విజయం సాధించడంతో, వైబ్ పీ2ను లెనోవా ఆవిష్కరిస్తుందని టెక్డ్రాయిడర్ తెలిపింది. ఆండ్రాయిడ్ సోల్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను పోస్టు చేసింది. లెనోవా వైబ్ పీ2 ఫీచర్లు 5100 ఎంఏహెచ్ బ్యాటరీ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ ఇక మోటోరోలా మోటో ఎమ్ ఫీచర్లను పరిశీలిస్తే... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.1 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమరీ 3,000ఎంఏహెచ్ బ్యాటరీ 16 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే
దిగ్గజ కంపెనీ మోటోరోలా మంగళవారం రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జడ్, మోటో జడ్ ప్లేలను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ నెల 17నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ స్టోర్లలో రెండు మోడళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మోడళ్ల ఫోన్ల కోసం మోటోరోలా ప్రత్యేకంగా మోటో మోడ్స్ పేరుతో మొబైల్ బ్యాక్ ప్యానళ్లను విడుదల చేసింది. ఈ ప్యానళ్లలో జేబీఎల్ స్పీకర్లు, జూమ్ కెమెరా, ప్రొజెక్టర్, ఇన్సిపియో ఆఫ్ గ్రిడ్ పవర్ ప్యాక్ లను ఉంచింది. వీటితో సంబంధం లేకుండా వివిధ మోడళ్లలో ప్యానళ్లను తెచ్చింది. మోటో జడ్ ఫీచర్లు 5.5 ఇంచ్ ల క్వాడ్ హెచ్ డీ అమోలెడ్ స్క్రీన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ర్యామ్: 4జీబీ రీర్ కెమెరా: 13 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్ బ్యాటరీ: 2,600ఎంఏహెచ్ 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2టీబీ వరకూ ఎక్సటర్నల్ మెమరీని పొడిగించుకునేందుకు అవకాశం ఉంది. మోటో జడ్ ప్లే 5.5 ఇంచ్ ల ఫుల్-హెచ్ డీ సూపర్ అమోలెడ్ స్ర్కీన్ 2 జీహెచ్ జీ ఆక్టా కోర్ ప్రాసెసర్ ర్యామ్: 3జీబీ బ్యాటరీ: 3,510ఎంఏహెచ్, టర్బో పవర్ చార్జింగ్ రీర్ కెమెరా: 16 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్ కాగా, మోటో జడ్ ధర రూ.39,999లు, మోటో జడ్ ప్లే రూ.24,999లుగా కంపెనీ తెలిపింది. -
అదిరే ఫీచర్లతో మోటోరోలా కొత్త ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ తయారీదారుల్లో ప్రముఖ కంపెనీగా ఉన్న మోటోరోలా, భారత మార్కెట్లోకి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో ఈ3 పవర్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారానే అందుబాటులో ఉండనుంది. అన్ని మోటోరోలా స్మార్ట్ఫోన్ల కంటే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ ఫోన్ అమ్మకాలను మోటోరోలా చేపట్టనుంది. ప్రవేశ ఆఫర్ కింద ఈ ఫోన్ ధరపై రూ.1,000 తగ్గింపును కంపెనీ ఒక్క రోజు చేపడుతోంది. మోటో ఈ3 పవర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు.. 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సెల్ రెజుల్యూషన్ 1గిగి హెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ డ్యుయల్ సిమ్ సపోర్టు -
మోటో జడ్ ఫోన్ ఫీచర్లు ఇవే...
శాన్ ఫ్రాన్సిస్కో : మోటోరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. శాన్ ఫ్రాన్సిస్కో ఈవెంట్ గా మోటో జడ్, మోటో జడ్ ఫోర్స్ స్మార్ట్ ఫోన్లను గురువారం రాత్రి మోటోరోలా ప్రవేశపెట్టింది. హై ఎండ్ ఫోన్లగా వీటిని తీసుకొచ్చింది. మోటో జడ్ ను సెప్టెంబర్ తర్వాతి నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. మొదట అమెరికాలో అమ్మకాలు నిర్వహించాక, అనంతరం గ్లోబల్ మార్కెట్లో తీసుకొస్తామని తెలిపింది. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం ప్రకటించలేదు. మోటో జడ్ ఫోర్స్ ను ఎక్స్ క్లూజివ్ గా అమెరికాలో అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. కానీ దాన్ని ధరను కూడా తెలుపలేదు. మొత్తం మెటల్ బాడీ, ప్యూర్ ఆండ్రాయిడ్ తో పనిచేయడం, వాటర్ రిపెలెంట్ కోటింగ్, మోడ్యులర్ డిజైన్ ఈ ఫోన్ల స్పెషల్ ఫీచర్లు. మోటో జడ్ చాలా థిన్ డిజైన్ ను కలిగి ఉండగా.. మోటో జడ్ ఫోర్స్ షట్టర్ ఫ్రూప్ స్క్రీన్ కలిగిఉంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన థినెస్ట్, పవర్ ఫుల్ ఫోన్లలో మోటో జడ్ ఒకటిగా ఉంది. మోటో జడ్, మోటో జడ్ ఫోర్స్ స్మార్ట్ ఫోన్లు 16 మోటో మోడ్స్ తో వచ్చాయి. ఈ మోడ్స్ వల్ల మరింత శక్తివంతమైన కెమెరా లేదా స్టీరియో వంటి కొత్త సామర్థ్యాలను ఫోన్లకు జోడించవచ్చు. మోటో జడ్ ఫోన్ ఫీచర్లు... క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ 4జీబీ తక్కువ పవర్ డీడీఆర్4 ర్యామ్ 32, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు 2టీబీ మైక్రోఎస్డీ కార్డు 5.5 అంగుళాల స్క్రీన్ 13 మెగాపిక్సెల్ ముందు కెమెరా 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 136 గ్రాములు ఆండ్రాయిడ్ 6 అకా మార్ష్ మాలో 2600 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో చార్జింగ్ మోటో జడ్ ఫోర్స్ స్పెషల్ ఫీచర్లు.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ 4జీబీ తక్కువ పవర్ డీడీఆర్4 ర్యామ్ 32, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు 2టీబీ మైక్రోఎస్డీ కార్డు 5.5 అంగుళాల స్క్రీన్, షట్టర్ ఫ్రూప్ స్క్రీన్ ను ఈ ఫోన్ కలిగిఉంది. 21 మెగాపిక్సెల్ ముందు కెమెరా 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 163 గ్రాములు ఆండ్రాయిడ్ 6 అకా మార్ష్ మాలో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో చార్జింగ్ -
మోటో రాజర్ రిటర్న్స్?
ఐఫోన్ రాకముందు.. అంటే 2004 సంవత్సరంలో ఎవరి చేతిలో చూసిన మోటోరోలా రాజరే ఫ్యాషన్ ఐకాన్ గా ఉండేది. మోటుగా కనిపించే నోకియాలకు భిన్నంగా విప్లవాత్మకమైన డిజైన్ తో ప్రపంచానికి రాజర్ ఫోన్ ను పరిచయం చేసింది మోటోరోలా. ప్రపంచంలోనే అత్యధిక అమ్ముడుపోయిన ఈ ఫోన్, 10 ప్రముఖ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ లోకంగా మారాక, ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్న రాజర్ ఫోన్ కనుమరుగైంది. మోటోరోలా సైతం స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారించడం ప్రారంభించింది. అయితే అప్పట్లో 2.2 అంగుళాలతో చిన్నగా, క్యూట్ గా ఉన్న రాజర్ ఫోన్లు మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నాయట. అమెరికన్ హైస్కూల్ పిల్లలతో "06.09.2016" అనే టైటిల్ తో రూపొందించిన ఓ టీజర్ వీడియోను మోటోరోలా యూట్యూబ్ లో పోస్టు చేసింది. నిన్నటి రాజర్ కాలాన్ని వెనక్కి తీసుకు రాబోతున్నామని, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండడి అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఉంది. వీడియో చివరి అక్షరాలుగా టీటీవైఎల్(టెస్ట్ పార్లెన్స్ ఫర్ టాక్ టూ యూ లేటర్ అంటే టెస్ట్ పరిభాషకోసం మీతో తర్వాత చర్చిస్తాం) అనే సందేశాన్ని ఇచ్చాయి. మోటోరోలా ఈ ఈవెంట్ ను జూన్ 9న చేపట్టబోతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. జూన్ లో ఓ ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎక్స్ ను కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ఫోన్ ఇప్పటివరకూ వచ్చిన రెక్టాగ్యులర్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కాకుండా.. కొత్తగా ఉండబోతుందని మార్కెట్ వర్గాల టాక్. 2011లో వచ్చిన రాజర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ఈ ఫోన్ తీసుకురావొచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల వస్తున్న స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ స్క్రీన్ తో, అన్ని యాప్స్ సపోర్టు చేయని విధంగా రాజర్ ఉన్నప్పటికీ, స్మార్ట్ ఫోన్లకు ఎదురవుతున్న ఎదురుదెబ్బలే రాజర్ రిటర్న్ కు మార్కెట్ ను సృష్టించబోతాయని తెలుస్తోంది. ఆ ఫోన్ సరళతే దాని మార్కెట్ కు దోహదంచేస్తుందని టాక్. -
మోటరోలా ‘మోటో షాప్’ బోటిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ మోటరోలా ఆఫ్‌లైన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి రిటైల్ స్టోర్ ‘మోటో షాప్’ను యూఎస్‌లోని చికాగో నగరంలో శనివారం ప్రారంభిస్తోంది. ‘స్మార్ట్‌ఫోన్స్, వేరబుల్స్‌ను శక్తివంతమైన టెక్నాలజీతో రూపొందించాం. నిజ జీవితంలో స్టోర్‌కు వెళ్లి, వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందాల్సిందే. షాపింగ్ అనుభూతి మరింత వ్యక్తిగతంగా మలిచాం’ అని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇతర గ్యాడ్జెట్ స్టోర్లకు భిన్నంగా మోటో షాప్‌ను తీర్చిదిద్దారు. ఉపకరణాల తయారీలో వాడిన విడిభాగాలన్నీ స్టోర్‌లోని మోటో మేకర్ టూల్లో అందుబాటులో ఉంటాయి. -
మోటరోలా నుంచి ‘మోటో ఎక్స్ ప్లే’ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: మోటరోలా తాజాగా ‘మోటో ఎక్స్ ప్లే’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 21 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 3,630 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధరలు రూ.18,499 (16 జీబీ). రూ.19,999 (32 జీబీ). -
మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్
ధర రూ.6,999 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా, 3జీ వెర్షన్ ‘మోటో-ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్లో 4.5 అంగుళాల స్క్రీన్, 2390 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరా, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సామర్థ్యం ఉన్న క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.6,999. ఈ స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. ఎప్పటి నుంచో ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తూ ఇప్పుడిప్పుడే స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్న వినియోగదారుల కోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చామని మోటరోలా జనరల్ మేనేజర్ (ఇండియా) అమిత్ బోని ఈ సందర్భంగా చెప్పారు. మే నాటికి 4జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్ లెనోవో (ఏ6000), జియోమి (రెడ్మి), మైక్రోమాక్స్ (యురేకా) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి మోటరోలా సిద్ధమైంది. ఈ కంపెనీ వచ్చే మే నెల నాటికి రూ. 10,000 లోపు ధరలలో 4జీ వెర్షన్ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. -
రెండో తరం మోటో ఎక్స్ వచ్చేసింది...
అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తాజా ఉత్పత్తి ‘మోటో ఎక్స్’ భారత్‌లో విడుదలైంది. విదేశీ మార్కెట్లతో పోలిస్తే రెండు వేల రూపాయలు తక్కువకే అంటే రూ.29,999లకు దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక దీని ఫీచర్ల సంగతికొస్తే.. మోటోఎక్స్ ముఖ్యమైన ఫీచర్ దాని ప్రాసెసర్ వేగమే.. దాదాపు 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే, నాలుగు కోర్లున్న క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్క్రీన్ సైజు 5.2 అంగుళాలు. కేవలం 9.9 మిల్లీమీటర్ల మందముండే మోటో ఎక్స్‌లో రెండు జీబీల ర్యామ్, 16 జీబీల మెమరీని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 144 గ్రాములు మాత్రమే. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 ఎంపీ, సెల్ఫీ కెమెరా 2 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. త్రీజీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ ఫోన్ 2300 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. -
మోటో ఎక్స్.. 32 జీబీ వేరియంట్
ధర రూ. 32,999 ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం న్యూఢిల్లీ: మోటొరోలా మొబిలిటీ సంస్థ మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్లో 32 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని, ధర రూ.32,999 అని కంపెనీ పేర్కొంది. దీంట్లో వుడ్ ఫినిష్, లెదర్ జాకెట్‌తో కూడిన మోడల్ ధర రూ.34,999 అని వివరించింది. ఈ మోడల్లో 16 జీబీ వేరియంట్ ధరను రూ.2,000 తగ్గించి రూ.29,999కే అందిస్తున్నామని తెలిపింది. 16 జీబీ వేరియంట్లో కూడా వుడ్ ఫినిష్, లెదర్ జాకెట్‌తో కూడిన మోడల్‌ను అందిస్తున్నామని, ధర రూ.31,999 అని పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్... ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్‌ను ఆండ్రాయిడ్ లాలిపాప్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లో 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 2.5 గిగా హెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. క్రిస్మస్ సందర్భంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను ఇస్తున్నామని పేర్కొంది. వినియోగదారులు ఎవరైనా తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని, మోడల్‌ను బట్టి పాత స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారులు రూ.6,000 పొందవచ్చని వివరించింది. -
ప్లాన్ వర్కవుటైంది, ప్రత్యర్ధులు కూడా అదేబాటలో...
న్యూఢిల్లీ: వినూత్న పద్తతుల్లో అమ్మకాలు చేపట్టాలని తాము చేపట్టిన ప్రణాళిక వర్కవుటైందని మోటరోలా కంపెనీ వెల్లడించింది. రెగ్యులర్ గా మొబైల్ షాపుల్లో అమ్మకాలు చేపట్టడానికి బదులు ఆన్ లైన్ లో ఈ కామర్స్ ద్వారా మొబైల్ ఫోన్లను అమ్మాలని తాము తీసుకున్న నిర్ణయానికి భారీ స్పందన లభిస్తోందని మోటరోలా కంపెనీ తెలిపింది. తాము అనుసరించిన పద్దతినే తమ పోటీదారులైన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు ఎంచుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రతినిధులు అన్నారు. మోటో జి అనే మొబైల్ ఫోన్ ను తొలిసారి కేవలం ఆన్ లైన్ లోనే అమ్మకాలను ప్రారంభించింది. ఆ తర్వాత మోటో ఈ, మోటో ఎక్స్ లాంటి మొబైల్స్ ను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తోంది. ఆతర్వాత షియోమీ మొబైల్ ను ఫిప్ కార్ట్, అసుస్, అల్కాటెల్ మొబైల్స్ ను స్నాప్ డీల్ ఈ పద్దతినే విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
శామ్సంగ్ను మించిన మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: శామ్సంగ్, నోకియా వంటి విదేశీ దిగ్గజాలకు గట్టిపోటీనిస్తున్న దేశీ సంస్థ మైక్రోమ్యాక్స్...తాజాగా వాటిని అధిగమించింది. ఏప్రిల్-జూన్ కాలానికి దేశీయంగా మార్కెట్వాటాలో శామ్సంగ్ను, ఫీచర్ఫోన్స్ విక్రయాల్లో నోకియాను దాటేసింది. అటు అంతర్జాతీయంగా అతి పెద్ద హ్యాండ్సెట్ బ్రాండ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివరాలు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా మొబైల్స్ విక్రయాల్లో 16.6 శాతం మా ర్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో నిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో శా మ్‌సంగ్ (14.4 శాతం వాటా), నోకియా (10.9%) కార్బన్ (9.5%)లు నిలిచాయి. ఇక ఫీచర్‌ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోయింది. నోకియా 14.7% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. కార్బన్, శామ్సంగ్, లావా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోమ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నప్పటికీ 19% మార్కెట్ వాటాతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25.3% వాటాతో శామ్సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. -
చేత్తో రెండు సార్లు విదిలిస్తే ఫోను కెమెరా అయిపోతుంది
ఒకప్పుడు పేజర్లు, తరువాత మొబైల్ రంగంలో బాణంలా దూసుకుపోయిన మోటరోలా తరువాత చతికిలబడిపోయింది. చాలా రోజులు కనిపించని, వినిపించని మోటరోలా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త సంచలనం మోటో ఎక్స్ తో మళ్లీ ముందుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది షాపుల్లో దొరకదు. దీన్ని కావాలంటే ఈ కామర్స్ రారాజు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసి తెప్పించుకోవాల్సిందే. దీని ధర రూ. 23,999. మోటో ఎక్స్ నలుపు, తెలుపు, టర్కోయిజ్, నీలి, ఎరుపు రంగుల బ్యాక్ పానెల్స్ తో లభిస్తాయి. ఇవే కాక వుడ్ ఫినిష్ తో (వాల్ నట్, టేకు) కూడా బ్యాక్ పానెల్ కూడా లభిస్తున్నాయి. అయితే వుడ్ ఫినిష్ వెరైటీల ధర మాత్రం రూ. 25,999. ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ వద్ద తెలుపు, నలుపు రంగుల బ్యాక్ పానెల్స్ ఉన్న మోటో ఎక్స్ మాత్రమే లభ్యమౌతోంది. మిగతా రంగులు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఏప్రిల్ రెండో వారానికి చేతికి అందుతాయి. ఫ్లిప్ కార్ట్ వాయిదాలపై ఈ ఫోన్ ను కొనేవారికి వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. దీంతో పాటు బాడీ కేసుల పై 70 శాతం కూడా ఇస్తోంది. మోటో ఎక్స్ హార్డ్ వేర్ షోకుల్ని చూపించకుండా వాడకంలో అనుభవాన్నే తన అమ్మకానికి ప్రాతిపదికగా ఎంచుకుంది. ఈ ఫోన్ కి 4.7 అంగుళాల హెచ్ డీ స్క్రీన్, 1.7 జీ హెచ్ జడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 10 మెగాపిక్సెల్ కెమెరా, 2 జీబీ ర్యామ్ లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీనికి వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది హ్యాండ్ సెట్ ను వాడకున్నా మనం నోటితో ఆదేశాలిస్తే పాటిస్తుంది. కెమెరాకి వెళ్లాటంటే ఫోన్ ను రెండు సార్లు విదిలిస్తే చాలు. మెయిల్స్, మిస్డ్ కాల్స్ కోసం యాక్టివ్ డిస్ ప్లే ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు ఇది నోకియా లూమియా 1320, సోనీ ఎక్స్‌పీరియా టీ అల్ట్రా, సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ వంటి ఫోన్లకు ఇది ప్రధాన పోటీదారు అవుతుంది. -
మార్కెట్లోకి మోటో జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మోటరోలా తమ కొత్త హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 జీబీ వెర్షన్ ధరను రూ. 12,499గాను, అలాగే 16 జీబీ వెర్షన్ రేటును రూ. 13,999గాను నిర్ణయించింది. గురువారం నుంచి ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి లభ్యమవుతాయని మోటరోలా మొబిలిటీ జీఎం మాగ్నస్ అల్క్విస్ట్ తెలిపారు. అమెరికాలో టెలికం సంస్థలతో కాంట్రాక్టు లేకుండా 8జీబీ ఫోన్ 179 డాలర్లకు (దాదాపు రూ. 11,200), 16 జీబీ ఫోన్ 199 డాలర్లకు (సుమారు రూ. 12,400) లభిస్తోంది. మోటో-జీ లో 4.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్‌తో పనిచేసే వీటిని 4.4 కిట్క్యాట్కి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నీరు చిందినా కూడా ఫోన్ పాడవకుండా ప్రత్యేకంగా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో మోటో జీని రూపొం దించారు. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 జీబీమేర ఉచితంగా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి. 2012లో గూగుల్ చేతికి వెళ్లినప్పట్నుంచి మోటరోలా భారత్‌లో కొత్త ఉత్పత్తులేవీ ప్రవేశపెట్టలేదు.