ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే! | Motorola Moto M, Lenovo Vibe P2 to launch on November 8: Report | Sakshi
Sakshi News home page

ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!

Published Sun, Oct 30 2016 2:27 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే! - Sakshi

ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!

రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్తో రాబోతున్న మోటోరోలా మోటో ఎమ్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది.

మోటోరోలా కొత్త స్మార్ట్ఫోన్ డివైజ్ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఇప్పటికే పలు రిపోర్టులు నివేదించాయి. దాని పేరు మోటో ఎమ్ అని, ఆ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో హల్చల్ చేశాయి. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్తో రాబోతున్న ఈ ఫోన్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది. వైబ్ పీ1 విజయం సాధించడంతో, వైబ్ పీ2ను లెనోవా ఆవిష్కరిస్తుందని టెక్డ్రాయిడర్ తెలిపింది. ఆండ్రాయిడ్ సోల్ ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లను పోస్టు చేసింది. 
 
లెనోవా వైబ్ పీ2 ఫీచర్లు
5100 ఎంఏహెచ్ బ్యాటరీ
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్
3జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
4జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్
 
ఇక మోటోరోలా మోటో ఎమ్ ఫీచర్లను పరిశీలిస్తే...
5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
2.1 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నెల్ మెమరీ
3,000ఎంఏహెచ్ బ్యాటరీ
16 ఎంపీ ప్రైమరీ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement