Lenovo
-
భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉన్న బీజింగ్ కంపెనీ లెనోవో.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది. వీటిని పుదుచ్చేరి ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు.ఏటా 50,000 యూనిట్ల ఎంటర్ప్రైస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా సరుకును ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు.అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్ డిజైన్, డెవలప్మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్‌లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి. -
లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ
భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్మెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. (అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..) అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు. లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో 1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్ ఎం9: ధర రూ.15 వేల లోపే
సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 9 అంగుళాల IPS LCD డిస్ప్లే , 1,340 x 800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్‌లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది. జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
లెనోవో డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్.. ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ఇప్పటివరకు ఒకే స్క్రీన్ కలిగిన ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు స్క్రీన్స్ కలిగిన ల్యాప్‌టాప్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ని 'లెనోవో' కంపెనీ లాంచ్ చేసింది. దీనిని కంపెనీ వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. గతేడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 లాంచ్ చేసిన లెనోవో ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ హై-ఎండ్ ల్యాప్‌టాప్ ధర రూ. 1,94,990. కంపెనీ లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ 21:10 అల్ట్రా-వైడ్ రేషియోతో 17.3 ఇంచెస్ డిస్ప్లే కలిగిన మొదటి ల్యాప్‌టాప్. థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 8 ఇంచెస్ సెకండరీ టచ్-ఎనేబుల్డ్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఇది బండిల్ చేయబడిన డిజిటల్ పెన్‌తో లభిస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన టాబ్లెట్ మాదిరిగా కనిపిస్తుంది. డ్యూయెల్ స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ బరువు 2 కేజీలు. లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ ఐరిస్ గ్రాఫిక్స్ ఆన్‌బోర్డ్‌తో 16జిబి ర్యామ్ కలిగి, 1టిబి ఎస్ఎస్డి స్టోరేజీ కెపాసిటీ పొందుతుంది. వీటిని 32జిబి, 2టిబి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ యుఎస్బి-సి థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్బి-సి పోర్ట్, యుఎస్బి-ఏ పోర్ట్, హెచ్డిఎమ్ఐ పోర్ట్, 3.5 మిమీ జాక్, వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 11 గంటల వరకు బ్యాటరీ ఉంటుందని లెనోవా పేర్కొంది. -
గాడ్జెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్, లెనోవో అద్బుతమైన 5జీ ట్యాబ్ వచ్చేసింది!
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్‌తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర, లభ్యత 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్‌స్టాప్‌గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్‌డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ఆడ్రేనో 619 జీపీయూ 11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్‌స్క్రీన్ 7700ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్‌ని ఇన్సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్‌లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది. -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ వినియోగదారుల కోసం డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్‌పీ, షావోమీ, ఎంఎస్ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్ఈడీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్‌తో లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ అదనం. రెడ్‌మీబుక్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 28శాతం డిస్కౌంట్‌తో రూ. 42,990 ధరకే లభిస్తోంది రెడ్‌మీబుక్ ప్రో. దీని ఎంఆర్పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎంఎస్ఐ మోడ్రన్ 14 ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును 18,100 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభ్యం. -
వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం జాబ్రా..లెనొవొ జట్టు!
హైదరాబాద్: వేగవంతమైన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అందించే దిశగా జాబ్రా, లెనొవొ జట్టు కట్టాయి. ఇందులో జాబ్రా రూపొందించిన 180 డిగ్రీల కోణంలోని పనోరమిక్ 4కే ప్లగ్ అండ్ ప్లే వీడియో సొల్యూషన్ పానాక్యాస్ట్50, లెనొవొకి చెందిన థింక్స్మార్ట్హబ్ భాగంగా ఉంటాయి. 10 అంగుళాల థింక్స్మార్ట్ హబ్‌లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అప్లికేషన్ ప్రీ–లోడెడ్‌గా ఉంటుంది. సమావేశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ సొల్యూషన్ తోడ్పడగలదని ఇరు సంస్థలు తెలిపాయి. -
అదిరిపోయే ఫీచర్లతో!! యాపిల్ ఫోల్డబుల్ మాక్ బుక్, ఐపాడ్..విడుదల ఎప్పుడంటే?!
వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ టెక్ జెయింట్ 20 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే తో మ్యాక్ బుక్, ఐప్యాడ్లను టెక్ లవర్స్‌కు పరిచయం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..2026 నాటికి ఫోల్డబుల్ డిస్ప్లేతో ప్రొడక్ట్‌లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా యాపిల్ డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్‌బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్‌ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు. యాపిల్ కంటే ముందే లెనోవో యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్‌లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్‌గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ప్రొడక్ట్‌లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!
పముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గేమింగ్ ప్రియులకు మంచి శుభవార్త తెలిపింది. గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమింగ్ గాడ్జెట్లపై అనేక డీల్‌లు, ఆఫర్లను అందించడానికి అమెజాన్ ఈరోజు 'గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ని ప్రకటించింది. అమెజాన్ ఈ 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ని ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహిస్తుంది. Lenovo, Acer, Asus, LG, HP, Sony, Dell, Corsair, Cosmic byte, JBL వంటి మొదలైన ప్రముఖ బ్రాండ్ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు & మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డ్‌లపై మంచి డీల్‌లను అందిస్తుంది. వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు. Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్: Intel Core i5 11th gen ప్రాసెసర్‌తో పనిచేసే Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన 8జీబీ DDR4SD RAM, 512GB SSD, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hzగా ఉంది ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ₹62,490కి అందుబాటులో ఉంది. HP Victus FHD గేమింగ్ ల్యాప్‌టాప్: HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ R7-5800H ప్రాసెసర్, Nvidia RTX 3050 4GB DDR6 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ సహాయంతో పనిచేస్తుంది. ఆఫర్లో భాగంగా ఈ గేమింగ్ బీస్ట్ రూ.20,000 తక్కువతో ₹83,990కి లభిస్తుంది. ఇలా వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై భారీగా తగ్గింపును పొందవచ్చు. (చదవండి: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ ఇదేనేమో..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్‌ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ఫుల్ ర్యామ్..ఏకంగా 22జీబీ..! లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీతో లెనోవో లీజియన్ Y90 రానుంది. Lenovo Legion Y90 స్పెసిఫికేషన్(అంచనా) 6.92-అంగుళాల E4 శాంసంగ్ AMOLED డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ 22 జీబీ ర్యామ్+ 640 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64ఎంపీ+16ఎంపీ రియర్ కెమెరా 44-ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్ ఫ్యాన్స్ ఫర్ కూలింగ్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ 5,600mAh బ్యాటరీ చదవండి: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..! -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్..! భారీ తగ్గింపుతో లాంచ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ కె10మోడల్‌ను సోమవారం రోజున కంపెనీ విడుదల చేయగా...ఈ ట్యాబ్‌కు 7500ఎమ్ఎహెచ్ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లెనోవో లాంచ్ చేసిన ట్యాబ్ కే 10 ధర కంపెనీ వెబ్సైట్ లో రూ. 25000గా ఉండగా...ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో అతి తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది. 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, కాగా 3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా ఉంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 వోఎస్‌ను సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్ 12 వోఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చునని లెనోవో పేర్కొంది. చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్ లెనోవో ట్యాబ్ కే10 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 10.3-అంగుళాల ఫుల్-హెచ్డీ (1,920x1,200 పిక్సెల్స్) టీడీడీఐ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22టీ ప్రాసెసర్ లెనోవో యాక్టివ్ పెన్ సపోర్ట్ పవర్‌వీఆర్ జీఈ 8320 గ్రాఫిక్స్ ప్రసెసింగ్ యూనిట్ 4 జిబి ఎల్పిడిడిఆర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 8ఎమ్పీ రియర్ కెమెరా 5ఎమ్పీ ఫ్రంట్ కెమెరా డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్పీకర్ USB టైప్-C పోర్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 7,500mAh బ్యాటరీ చదవండి: వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్డేట్..! -
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్
ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్‌టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్‌టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్‌టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్‌టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్‌టీఈ ఒకటి. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
భారీ కెమెరాతో : మోటరోలా మరో అద్భుత స్మార్ట్‌ఫోన్
సాక్షి,వెబ్‌డెస్క్: చైనా టెక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటరోలా భారీ కెమెరాతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే 108 ఎంపీ బిగ్ కెమెరా ప్రధాన ఫీచర్‌గా ‘మోటోజీ 60’ ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా మరో డివైస్‌ను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి పోటీగా మిడ్ రేంజ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు ఒకటి అంతకంటే ఎక్కువ ఫోన్లను మార్కెట్లోకి తేవాలని లెనోవా భావిస్తోంది. టెక్నిక్ సంస్థ న్యూస్ ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ బెర్లిన్, మోటరోలా ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎ, మోటరోలా ఎడ్జ్ క్యోటో, మోటరోలా ఎడ్జ్ పిస్టార్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో లాంచ్ కానున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన మోటో ఎడ్జ్, మోటో ఎడ్జ్ + ఫోన్ల తరహాలో ఈ స్మార్ట్ఫోన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మోటో ఎడ్జ్ బెర్లిన్: స్పెసిఫికేషన్స్ టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్ మోడల్, నార్త్-అమెరికన్ మోడల్‌తో మోటో ఎడ్జ్ బెర్లిన్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 g soc తో పాటు 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 265 జీబీ వేరియంట్లతో రావచ్చు. మోటో ఎడ్జ్ బెర్లిన్, ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎలలో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్రధానంగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. యూరోపియన్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్, మూడు కెమెరా సెన్సార్లు ఉంటాయని అంచనా. నార్త్ అమెరికన్ మోడల్లో 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మూడు సెన్సార్లతో రానుంది. 32 ఎంపీ సెల్ఫీకెమెరాను జోడించినట్టు సమాచారం. మోటరోలా ఎడ్జ్ పిస్టార్: ఫీచర్స్ మోటరోలా ఎడ్జ్ పిస్టార్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ లేదంటే స్నాప్ డ్రాగన్ 870 సాక్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు 6GB + 128 GB, 8 GB + 265 GB తో సహా రెండు ర్యామ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. మోటో ఎడ్జ్ బెర్లిన్ మాదిరిగానే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్, ప్రైమరీ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 2 కెమెరా సెన్సాలతో భారత్ లో విడుదల కానుంది. చదవండి: పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే.. -
రూ. 25 వేలకే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్‌బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్
మోటోరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకోబోయే ఫోన్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే) -
లెనోవో K12 స్మార్ట్ ఫోన్- త్వరలో విడుదల!
ముంబై: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో.. కే12 బ్రాండుతో దేశీయంగా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోటో ఈ7 మోడల్ మొబైల్‌ను ఆధునీకరించి కే12గా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కే12ను యూరోపియన్ మార్కెట్లలో లెనోవో విడుదల చేసింది. చైనాలో ఇప్పటికే కే12 స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అయితే చైనీస్ మార్కెట్లో విడుదలైన ఫోన్ గతంలో విడుదలైన మోటో ఈ7 ప్లస్‌కు ఆధునిక వెర్షన్‌గా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గత మోటో ఈ7 మోడల్‌ను ఆధునీకరించి విడుదల చేయనున్న కే12 ఫోన్ దేశీ మార్కెట్లలో 120 యూరోలు(సుమారు రూ. 10,550)గా ఉండవచ్చని అంచనా. ఫోన్‌కు సంబంధించిన ఇతర టెక్నికల్ వివరాల అంచనాలు చూద్దాం.. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) 6.5 అంగుళాల తెర లెనోవో కే12 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ టచ్ స్ర్నీన్‌ను కలిగి ఉంటుంది. వెనుక 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్, 5 ఎంపీ షూటర్‌తో వెలువడనుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్(కెమెరా)ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియోస్ జీ25 చిప్సెట్తో పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్లో లభించవచ్చని అంచనా. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) -
బడ్జెట్లో మోటో 5జీ ఫోన్
మోటరోలా చివరకు తన మోటో జి 5జీని త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని మోటొరోలా ట్వీటర్ ద్వారా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో 5జి ఫోన్‌ను లాంచ్ చేయాలని మోటోరోలా చాలాకాలంగా ఎదురుచూస్తుంది. ఈ ఫోన్ గతంలోనే యూరోప్‌లో లాంచ్ అయింది. మోటో జి 5జీ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ యొక్క ధర యూరప్‌లో 299.99 యూరోలు(సుమారు రూ.26,300)గా నిర్ణయించింది. ట్విట్టర్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో యూరప్ కంటే కొంచెం తక్కువ ధరకే తీసుకురానుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్) మోటో జి 5జీ స్పెసిఫికేషన్స్ మోటో జీ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై మోటో జీ 5జీ పనిచేయనుంది. దీని ర్యామ్ 4జీబీ కాగా, 64జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవడం ద్వారా 1టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జి 5జీ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. -
లాక్డౌన్ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలయ్యాయి. దీంతో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లారు. అటు పలు కాలేజీలు, విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసెస్ విధానాన్నిఎంచుకున్నాయి. ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, టాబెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మార్కెట్ లీటర్ లెనోవో ల్యాప్‌లాప్‌లు, నోట్‌బుక్‌లకు భారీగా విక్రయించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలయిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం 45 రోజుల్లోనే దేశంలో 2.9 మిలియన్ పీసీలు అమ్ముడయ్యాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. వీటిలో డెస్క్‌టాప్‌లు, నోట్బుక్లు, టాబ్లెట్లు వర్క్స్టేషన్లు ఉన్నాయని ప్రకటించింది. ఇది నమ్మశక్యం కాని విషమయని కెనాలిస్ రీసెర్చ్ అనలిస్ట్ వరుణ్ కన్నన్ చెప్పారు. ఈ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ల్యాప్‌టాప్‌ల ఎగుమతి 33 శాతం తగ్గిందన్నారు. 8,18,000 పీసీలను విక్రయించిన లెనోవో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. టాబ్లెట్ విభాగంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించింది. త్రైమాసికంలో మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటాను ఈసమయంలో సాధించింది. 629,000 యూనిట్లతో హెచ్‌పీ రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో డెల్ వుంది. డెస్క్‌టాప్‌ల కంటే నోట్‌బుక్‌లకు ప్రాధాన్యత లభించినట్టు కెనాలిస్ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, లెనోవా మార్కెట్ వాటా 27.4 శాతం నుంచి 44.2 శాతానికి, హెచ్‌పి మార్కెట్ వాటా 17.3 శాతం నుంచి 23.2 శాతానికి పెరిగింది. డెల్ 10.0 శాతం నుంచి 12.7 శాతం వరకు పెరిగింది. ఎసెర్ మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోగా, శాంసంగ్ తన మార్కెట్ వాటా రెట్టింపు చేసుకుంది. గత ఏడాది 2.4 శాతం నుంచి 5.8 శాతానికి పుంజుకుంది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నారు. కోవిడ్-19 సంక్షోభంతో పలుటెక్ సంస్థలతో పాటు, చాలా కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చని, అలాగే రాబోయే త్రైమాసికాల్లో ఆన్లైన్ లెర్నింగ్‌కే ఎక్కువ మొగ్గుచూపే అవకాశ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బాగా క్షీణించిన పీసీ పరిశ్రమకు ఈ బూస్ట్ సరిపోదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను తాజాగా విడుదల చేసింది. సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్డి 116' పేరుతో ప్రస్తుతం అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ .2,499 గా వుంచింది. మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్‌పుట్, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ మేళవింపుతో తమ తాజా హెడ్‌ఫోన్స్ ఆకట్టుకుంటాయని షెన్జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో జిసేన్జు తెలిపారు. డ్యూయల్ ఈక్యూ మోడ్, (ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్‌బై సమయంతో 24 గంటల ప్లేయింగ్ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2019లో తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు -
లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు
న్యూఢిల్లీ: లెనోవో నూతన తరం థింక్‌ప్యాడ్, థింక్ సెంటర్‌పీసీలను మంగళవారం విడుదల చేసింది. వాణిజ్య ఐవోటీ, సెక్యూరిటీ సొల్యూషన్లలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. థింక్‌ప్యాడ్ టీ490, థింక్‌ప్యాడ్ ఎక్స్390, థింక్‌సెంటర్ నానో, థింక్‌సెంటర్ నానో ఐవోటీ ఆవిష్కరించిన వాటిల్లో ఉన్నాయి. సులభమై, భద్రతతో కూడిన, వేగవంతమైన, అధిక పనితీరు చూపించే పరికరాలను నేడు ఉద్యోగులు కోరుకుంటున్నారని, థింక్‌ప్యాడ్ ఈ అవసరాలను తీరుస్తుందని ఈ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా లెనోవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్ అగర్వాల్ పేర్కొన్నారు. కళ్లను సురక్షితంగా ఉంచే టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు వెల్లడించారు.