లెనోవో విడుదల చేసిన ఫిట్‌నెస్ బ్యాండ్‌లు
న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవా భారత మార్కెట్లోకి హెచ్‌ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా, హెచ్‌ఎక్స్03 కార్డియో పేరుతో మరో రెండు ఫిట్‌నెస్ బ్యాండులను విడుదల చేసింది. వీటిలో హెచ్‌ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా రూ.2,299 ధరకు లభిస్తుండగా , హెచ్‌ఎక్స్03 కార్డియో ధర 1,999గా నిర్ణయించారు. హెచ్‌ఎక్స్03 కార్డియో ప్రస్తుతం అందుబాటులో ఉండగా..హెచ్‌ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫిట్‌నెస్ బ్యాండుల్లో ఓఎల్‌ఈడీ, టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉందని కంపెనీ పేర్కొంది. డైనమిక్ హార్ట్‌రేట్ మానిటర్, మూవ్‌మెంట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ తదితర ఫీచర్లు ఈ బ్యాండుల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ప్రతి 15 నిమిషాల కొకసారి ఆటోమేటిక్‌గా వినియోగదారుడి హార్ట్ రేట్‌ను మానిటర్ చేస్తుందని వివరించింది. ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌కు సింక్ అయితే వీటికి సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, టెక్ట్స్ మెసేజెస్, నోటిఫికేషన్ అప్‌డేట్స్ ఆటోమాటిక్‌గా అందుతాయని కంపెనీ తెలిపింది. 2018లో ఫిట్‌నెస్ బ్యాండుల విపణిలో 20 శాతం వాటా దక్కించుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు లెనోవా ఎంబీజీ ఎకోసిస్టం హెడ్ సెబాస్టియన్ పెంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment