లెనొవొ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే..
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా 'కె3 నోట్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని కోసం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్‌ఫోన్ ధర రూ.9,999.
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం నుంచి ప్రారంభమయ్యింది.