New smart phone
-
మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్లు
మార్కెట్లోకి నిత్యం కొత్త మొబైళ్లు వస్తున్నాయి. టెక్నాలజీ, కెమెరా, ఓఎస్‌లో అడ్వాన్స్డ్ ఫీచర్లు..వంటి చాలా విభాగాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. దాంతో వినియోగదారులు ఇప్పటికే మొబైల్ వాడుతున్నా కొత్తవాటిపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.గూగుల్ పిక్సెల్ 9డిస్ప్లే: 6.30 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2424 పిక్సెల్స్∙ ఓఎస్: ఆండ్రాయిడ్ 14మెమోరీ: 128జీబీ 12జీబీ ర్యామ్, 256జీబీ 12జీబీ ర్యామ్ వేరియంట్లు.బరువు: 198 గ్రా. బ్యాటరీ: 4700 ఎంఏహెచ్వివో వి 40డిస్ప్లే: 6.78 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 50 ఎంపీరిజల్యూషన్: 2800*1260 పిక్సెల్స్ రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్ర్యామ్: 8జీబీ, 12 జీబీ స్టోరేజ్: 256జీబీ, 512జీబీ బ్యాటరీ: 5500 ఎంఏహెచ్ బరువు: 192 గ్రా.పోకో ప్యాడ్ 5జీడిస్ప్లే సైజ్: 12.1 అంగుళాలువోఎస్: ఆండ్రాయిడ్ 14రిజల్యూషన్: 1600*2560 పిక్సెల్స్బరువు: 568 గ్రా. ఇంటర్నల్ మెమొరీ: 128జీబీ 8జీబీ ర్యామ్/ 256జీబీ 8జీబీ ర్యామ్; బ్యాటరీ: 10000 ఎంఏహెచ్ కలర్స్: డార్క్ గ్రే, బ్లూ -
కొత్త ఫోన్: ప్రీమియం కెమెరా ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్‌లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్‌కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్‌ను జోడించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.Poco M6 Plus స్పెసిఫికేషన్స్ » స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) » గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ » అదనంగా 8GB వర్చువల్ ర్యామ్» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్» 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ » సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5030mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్Poco M6 Plus ధర, లభ్యతపోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. -
రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!
ఐకూ (iQoo) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)ని ఈరోజు భారత్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, డ్యూయల్ కెమెరాలతో ఉన్న ఈ ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ ఉన్నాయి.ఐకూ జెడ్9 లైట్ 5జీ 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.10,499. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 11,499. ఈ స్మార్ట్ఫోన్లు ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి విక్రయాలు అమెజాన్‌తోపాటు ఐకూ వెబ్సైట్లో జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలతో రూ. 500 అదనపు తక్షణ తగ్గింపును ఐకూ అందిస్తోంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లు» 6.56-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే » మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్» 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ » సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా» ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14» 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
HyperOS: ఈ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే..
హైపర్ ఓఎస్ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లోకి తొలి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్ దీన్ని లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్ 14తో కూడిన హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది. పోకో తన ఎక్స్ సిరీస్‌ను రెండు కొత్త స్మార్ట్ఫోన్లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో మోడల్‌లు వచ్చే వారంలో భారత్‌లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్ఫోన్లకు సంబంధించిన కొన్ని స్పెక్స్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్6 సిరీస్‌కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోకో షేర్ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్ఓఎస్తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు. More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS. Global launch on 11th Jan, 5:30 PM on @flipkart. Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y — POCO India (@IndiaPOCO) January 5, 2024 పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే.. పోకో ఎక్స్6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్మెంట్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్ ఉన్నాయి. ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్ 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్6 సిరీస్ మోడల్‌లు 120Hz డిస్ప్లేతో వస్తున్నాయని రూమర్స్ వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు 64MP మెయిన్ కెమెరా, 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. -
ఐకూ నుంచి జెడ్7 ప్రో 5జీ, కమింగ్ సూన్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్తగా జెడ్7 ప్రో 5జీ ఫోన్‌ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మొబైల్ ప్లాట్‌ఫాం, 3డీ కర్వ్డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో లభ్యం. ఫీచర్లు 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది కూడా చదవండి: గుడ్ఇయర్ భాగస్వామ్యంతో అష్యూరెన్స్ బ్యాటరీలు న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!
Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది. దీనికి తోడు రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?) ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 90 ఫీచర్లు అంచనాలు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా 50ఎంపీ సెల్పీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ. -
బైపాస్ చార్జింగ్: కొత్త ఫీచర్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. స్పెసిఫికేషన్లు ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్ల వరకు గరిష్ట బ్రయిట్నెస్తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్ హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్లు ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా. JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ. గేమర్లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్. 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు. Time to live life in the fast lane with Note 30 5G, thanks to India's first MediaTek Dimensity 6080 Processor, a smooth 120Hz Display, up to 16GB* RAM, and 256 Storage! Sale starts 22nd June, 12PM, only on Flipkart. Click here to know more: https://t.co/6DNmOKpB2z#ChangeTheGame pic.twitter.com/HVXgXOlDtB — Infinix India (@InfinixIndia) June 14, 2023 -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్‌లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్‌కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్‌లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్‌ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్‌ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్‌లో, అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్‌లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
Realme Narzo N53 లాంచ్ : స్పెషల్ ఆఫర్ రూ. 9వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలస్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ తాజగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్మీ నార్జో ఎన్53 పేరుతో రెండు వేరియంట్లలో 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, ధర రూ. 8,999, 6జీబీ ర్యామ్+ 125 జీబీ స్టోరేజ్ ధర రూ. 10,999 వద్ద లభ్యం. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!) ఈ స్మార్ట్‌ఫోన్ మే 24 నుంచి రియల్మీ, Amazon సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభ్యం. పరిచయ ఆఫర్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై రూ. 1,000 వరకు తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో ఎన్53 ఫీచర్లు 6.74-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్. . ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. Unisoc T612 SoC చిప్సెట్ , ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ ఉంది. f/1.8 ఎపర్చరు, 5P లెన్స్ ,LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ అందిస్తోంది ఇందులో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, స్లో మోషన్ , బోకె ఎఫెక్ట్ కంట్రోల్ లాంటివి ఉన్నాయి. 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ మరిన్ని టెక్ న్యూస్, గాడ్జెట్స్ వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి : Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్ వేరియంట్ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లకు కాస్త అటూఇటుగా ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్ మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టేరేజ్ 50 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, త్వరలో ఆండ్రాయిడ్ 14 స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి. -
లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్
సాక్షి,ముంబై: స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ లావా మొబైల్స్ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోలాంచ్ చేసింది. Lava Blaze 1X 5G పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. గత ఏడాది తీసుకొచ్చి బ్లేజ్ 5జీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. లావా బ్లేజ్ 1 ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల IPS LCD డిస్ప్లే 1600 × 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చిప్సెట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ f/1.8 ఎపర్చర్ 50+2+వీజీఏ రియర్ ట్రిపుల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 12W ఛార్జర్, ధర: రూ.11,999. ఇది గ్లాస్ గ్రీన్ , గ్లాస్ బ్లూ రంగులలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. -
తక్కువ ధరకు రియల్మీ ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
రియల్మీ నార్జో ఎన్55(Realme Narzo N55) అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. బడ్జెట్ కేటగిరీ ఫోన్ అయిన దీని ప్రారంభ ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్, రియల్మీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్మీ నార్జో ఎన్55 రెండు రకాల ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్‌తో 64బీజీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.10,999. మరో వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.12,999. పరిచయ ఆఫర్లో భాగంగా 4జీబీ ర్యామ్ వేరియంట్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును ప్రకటించింది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. Realme Narzo N55 ఫీచర్లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే ముందు భాగంలో పంచ్ హోల్ కెమెరా కటౌట్, ఫ్రంట్ కెమెరా MediaTek Helio G88 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ 2MP డెప్త్ సెన్సార్‌తో 64MP మెయిన్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా 5,000 mAh బ్యాటరీ, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ -
రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్మీ భారత మార్కెట్లో సి–55 మోడల్‌ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు ఉంది. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) -
మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ జీ సిరీస్‌లో భాగంగా జీ13 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని మోటరోలా ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ క్వాడ్ పిక్సల్ కెమెరా సిస్టమ్ ఉండగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 6.5 అంగుళాల, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
వన్‌ప్లస్ ఫోన్ స్పెసిఫికేషన్లు సూపర్! విడుదలకు ముందే వివరాలు లీక్!
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్(OnePlus) భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite)ని వన్‌ప్లస్ నార్డ్ బడ్స్2 (OnePlus Nord Buds 2)తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇదీ చదవండి: మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్! ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3’ స్పెసిఫికేషన్లు (అంచనా): 6.7అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్( Qualcomm Snapdragon) 695 5G ప్రాసెసర్ 8GB ర్యామ్ 128GB వరకు పెంచుకునే స్టోరేజీ సామర్థ్యం. 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డ్యూయల్ కెమెరా. 5,000 mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రారంభ ధర ₹ 19,999. కొత్త గ్రీన్ కలర్ వేరియంట్ (పాస్టెల్ లైమ్). ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... -
తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు!
రియల్మీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల శ్రేణిని విస్తరించింది. తాజాగా భారత్‌లో రియల్మీ C33 2023 ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇంతకు ముందు వచ్చిన రియల్మీ C33కి ఇది మెరుగైన వెర్షన్. HD+ డిస్ప్లే, Unisoc చిప్సెట్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మరొకటి 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. వీటిలో మొదటి వర్షన్ ధర రూ. 9,999 కాగా మరొకటి రూ.10,499. ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్లలో లభిస్తాయి. రియల్మీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు . రియల్మీ C35 ఫోన్ విడుదలను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది దేశంలో మార్చి 21 న విడుదల కానుంది. రియల్మీ C33 2023 స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్టాకోర్ (octa-core) Unisoc T612 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ప్రాథమిక సెన్సార్ 50 ఎంపీ లెన్స్, సెకండరీ AI సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
పోకో ‘ది 5జీ ఆల్ స్టార్’ లాంచ్: ఆఫర్ ఎంతంటే?
సాక్షి, ముంబై: పోకో ఎక్స్ 5 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా తన రెండో ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో ప్రారంభ ఆఫర్‌గా 2 వేల రూపాయల తగ్గింపుతో పోకో ఎక్స్ 5 5జీ రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎక్స్5 5జీ ధర మార్చి 21 మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart ద్వారా సేల్. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 2,000 తక్షణ తగ్గింపు లేదా రూ. 2000 చేంజ్ బోనస్ తొలి రోజు సేల్‌లో నో-కాస్ట్ EMI ఈ ఆఫర్‌తో, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 16,999 , టాప్-ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను 18,999 అందిస్తోంది.సూపర్నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ , జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం పోకో ఎక్స్5 5జీ స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 695 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 48+8 + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ Give us a better definition of an “All-Star”, we’ll wait! The POCO X5 5G comes with 7 5G bands, Snapdragon 695, and a 120Hz Super AMOLED Display… ...the list can go on and on! The POCO X5 5G goes on sale on 21st March on @Flipkart at a special price.#The5GAllStar pic.twitter.com/orx2kNRW35 — POCO India (@IndiaPOCO) March 14, 2023 -
Realme GT3: మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్.. ధర మాత్రం...
రియల్మీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రియల్మీ జీటీ3 (Realme GT3) స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 9.5 నిమిషాలు పడుతుంది. దీని ప్రారంభ ధర 649 యూఎస్ డాలర్లు (రూ. 53,543). realme GT3 Global Launch Event | Speed to the Max https://t.co/0cGd4NBHku — realme (@realmeglobal) February 28, 2023 Realme GT3 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 2,772 x 1,240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్ప్లే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ 240 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్. ఆండ్రాయిడ్ 13 ఓఎస్, అంతర్గత Realme UI, డాల్బీ అట్మోస్. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50ఎంపీ ప్రైమరీ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మైక్రోస్కోప్ లెన్స్). (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) -
పవర్ఫుల్ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్ఫుల్ చిప్సెట్తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా. షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 LPDDR5X UFS 4.0 ఆండ్రాయిడ్ 13 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50+50 ట్రిపుల్రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. -
నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!
సాక్షి, ముంబై: నోకియా అద్భుతమైన ఫోన్‌ను పరిచయం చేసింది. రిపేరబుల్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది.రీసైకిల్ చేసుకునేలా ప్లాస్టిక్ బ్యాక్ కవర్, బ్యాటరీ మార్చుకునే అవకాశంతో తీసుకొస్తోంది. ఐఫిక్స్ట్ భాగస్వామ్యంతో టూల్స్, రిపేర్ గైడ్‌తో సహా అందిస్తోంది. తద్వారా యూజర్ ఫోన్ వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్ ఛార్జింగ్ పోర్ట్‌ను రిపేర్ చేసుకోవచ్చు. డిస్ప్లే పాడైపోయినా, ఛార్జింగ్ పోర్ట్ వంగిపోయినా, లేదా బ్యాటరీ పాడైపోయినా, సరసమైన ధరల్లో సొంతంగా యూజర్లే మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. రిపేర్ గైడ్ సాయంతో ఇంట్లోనే మరమ్మతులు చేయడానికి రూపొందించిన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇది అని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ22 పేరుతో శనివారం బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ముందు లాంచ్ చేసింది. జీ22లో ఆటో క్లీనప్ అని పిలువబడే ఆప్టిమైజేషన్ అసిస్టెంట్‌ను కూడా జోడించింది. నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ ప్రొఫెషనల్ రిపేర్ ఆప్షన్లతో పాటు ఫిక్సిట్ ద్వారా ఐదేళ్లపాటు "క్విక్ ఫిక్స్" రిపేర్ గైడ్స్, ఇతర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుతుందని HMD గ్లోబల్ ప్రొడక్షన్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ అన్నారు. ఇందులోని బిగ్ బ్యాటరీ లైఫ్ మూడు రోజులట. Get to know the #NokiaG22 in just 30 seconds 👇 🔗 https://t.co/GSmtdWysKO pic.twitter.com/25adVyFTpD — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 మార్చి 8నుంచి యూకే లోసేల్స్ మొదలు. నోకియా జీ 22 ధర సుమారు రూ.15 వేలు (179.19 డాలర్లు) నోకియా జీ 22 ఫీచర్లు 6.53 అంగుళాల స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 128జీబీ స్టోరేజ్ 50+2+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 5,050mAh క్విక్ఫిక్స్ రిపేరబుల్ బ్యాటరీ మరో రెండు ఫోన్లు కూడా ఒకటి కాదు రెండుకాదు మూడు అంటూ నోకియా జీ22, సీ32, సీ 2 ఫోన్లను ట్విటర్లో షేర్ చేసింది. HMD గ్లోబల్ పత్రికా ప్రకటన ప్రకారం నోకియా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. నోకియా సీ 32 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 50+2 ఎంపీ రియర్ కెమెరా 5,000mAh బ్యాటరీ10 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చార్కోల్, ఆటం గ్రీన్ , బీచ్ పింక్ కలర్స్‌లో లభ్యం 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర £129.99 వద్ద ప్రారంభం (సుమారు రూ.13 వేలు) నోకియా సీ22 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 గో 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ 10W ఛార్జింగ్ సపోర్ట్ 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర £109.99 (సుమారు రూ. 11 వేలు) Say hello to not one, not two, but three new devices 🤩 👉 Nokia G22 👉 Nokia C32 👉 Nokia C22 pic.twitter.com/z2TpCZJVvZ — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 -
రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై100 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ వెనుక భాగం రంగులు మారడం ఇందులో ప్రత్యేకత. ఇందుకోసం ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. 64 మెగాపిక్సల్ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ప్రీమియంగా, తక్కువ బరువుతో ఉంటుందని వివో తెలిపింది. పసిఫిక్ బ్లూ , ట్విలైట్ గోల్డ్ - మరియు మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం.181 గ్రాముల బరువుతో ఉంటుంది. వివో వై100 ఫీచర్లు 6.38 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 7.73 ఎంఎం స్లీక్ బాడీ Android 13, FunTouch OS 13 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ ఫ్లాష్ చార్జర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. లభ్యత, ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లతోపాటు, రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. When change is the only constant, why stick to one color? Stay tuned for the Color Changing Glass Finish of vivo Y100. Stay tuned! To know more, visit https://t.co/5bNAoMyRiK#vivoY100 #ItsMyStyle #ColorMyStyle#ComingSoon #5G pic.twitter.com/wmuhn2Wj5B — vivo India (@Vivo_India) February 8, 2023 -
టెక్నో పాప్ 7ప్రో: ఫీచర్లు అదుర్స్! ధర మాత్రం రూ. 7వేల లోపే
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వరుసలో పాప్ 6 ప్రో తరువాత ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో, ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్లు, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో పాప్ 7ప్రో ఫీచర్లు 6.56 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0 12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ధర,లభ్యత 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ధర 6,799, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 7,299 ఫిబ్రవరి 22 నుండి అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. -
నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర విని షాక్ అవ్వకండి!
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్, ప్రకటించింది. దీని ధర రూ. 48999. నోకియా అధికారిక వెబ్సైట్లో ఫిబ్రవరి 20 అందుబాటులో ఉంటుంది. నోకియా ఎక్స్ 30 4జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ Android 12, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీజీ స్టోరేజ్ 50+13ఎంపిడ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,200ఎంఏహెచ్ బ్యాటరీ లాంచ్ ఆఫర్లు నోకియా వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు ఉచిత నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ విలువ రూ. 2,799 రూ. 2,999 33వాట్స్ ఛార్జర్ విలువ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 4000 తగ్గింపు -
సూపర్ ఫీచర్లతో వివో ఎక్స్90 సిరీస్ వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో కొత్త సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్80 సిరీస్‌కు కొనసాగింపుగా వివో ఎక్స్90 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్స్‌తో, ముఖ్యంగా నాలుగుపవర్ ఫుల్ కెమెరాలతో తీసుకొస్తోంది. వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ+ మూడు వేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. త్వరలోనే భారత మార్కెట్లలో కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్, బ్లాక్ కలర్లో ఇవి లభ్యం కానుంది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వైబోలో ఫోటోలు, ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో ఎక్స్90 ఫీచర్లు అంచనాలు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 క్వాల్‌కాం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ 50+50+ 64+48 రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్ 4,700mAh బ్యాటరీ ధర: ఈ రోజు (నవంబరు 22) సాయంత్రం లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, 800 డాలర్లు, సుమారు రూ. 65,315 ఉంటుందని అంచనా. -
జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్
ముంబై: రిలయన్స్ జియో మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై హింట్ ఇచ్చినప్పటికీ, అంతకుమించి వివరాలను వెల్లడించారు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని అంచనా.. జియో ఫోన్ 5జీ ధర: అంచనా 5జీ జియో ఫోన్ ధర సుమారు 12 వేల రూపాయల లోపునే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు విరివిగా ఉన్నాయి.గతంలో లాగానే ఈఫోన్ కొనుగోలు చేసినవారికి అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్ ఆఫర్లను అందించనుందట జియో.పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు సస్పెన్స్ తప్పదు.! జియో 5జీ ఫోన్ ఫీచర్లు 6.5 అంగుళాల HD డిస్ప్లే ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్+2 ఎంపీ డ్యూయల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా -
మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ మోటారోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో మోటో జీ62 5 జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే,స్నాప్‌డ్రాగన్ 695 SoCతో దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాలో నైట్ విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్ లాంటి ఫీచర్లను జోడించింది.అలాగే ఫ్రంట్ కెమెరా ఫేస్ బ్యూటీ , స్లో మోషన్ వీడియోలకు సపోర్ట్ చేసే సెల్ఫీకెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) భారతదేశంలో మోటో జీ62 5జీ ధర,ఆఫర్లు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. వీటి ధరలు ధర రూ.17,999, రూ. 19,999గా ఉంచింది. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 1500 తగ్గింపు. అంటే ఈ ఫోన్‌ను దీని తుది రూ. 16,499 సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కొనుగోలుదారులు రూ. 1,750 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మిడ్నైట్ గ్రే ,ఫ్రాస్టెడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 PM తొలి సేల్ ఉంటుంది. మోటో జీ62 5 జీ ఫీచర్లు 6.55 అంగుళాల పంచ్-హోల్ LCD డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డడ్రాగన్ 695 సాక్ 1 టీబీవరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 50+8 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ -
భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లపై కొత్త మోడళ్లతో దండయాత్ర చేయనుంది. మోటరోలా జీ సిరీస్‌లో భాగంగా ఏకంగా ఐదు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జీ200, జీ71, జీ51, జీ41, జీ31 స్మార్ట్ఫోన్లను మోటరోలా త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మోటో జీ200 స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రానుంది. అంతేకాకుండా 144హెర్జ్ డిస్ప్లే ర్రిఫెష్ రేట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది. అన్ని మోడల్‌లు 5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో రానున్నాయి. మోటో జీ200 స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌తో, మోటో జీ71 స్నాప్‌డ్రాగన్ 695, మోటో51 స్నాప్ డ్రాగన్ 480+తో మోటో జీ41 మీడియా టెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. మోటరోలా జీ200 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 37900, మోటో జీ71 ధర సుమారు రూ. 25,300, మోటో జీ51 సుమారు రూ. 19,372 కు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మోటో జీ41 ధర 21 వేలకు మోటో జీ 31 ధర రూ. 16,900 గా ఉండనుంది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ కార్..! ధర ఎంతంటే..? -
నోకియా 5.4 సేల్ షురూ : బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియాకు చెందిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ బుధవారం షురూ కానుంది. హెచ్ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మొదలు కానుంది. నోకియా 5.4 బేస్ వేరియంట్‌కు రూ .13,999 గా ఉంటుంది. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీ, క్వాడ్ కెమెరాతోపాటు ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వన్ ఆధారితంగా దీన్ని తీసుకొచ్చింది. నోకియా 5.4 ధర, ఆఫర్లు నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. పోలార్ నైట్, డస్క్ కలర్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ , నోకియా ఆన్లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ద్వారా చేసిన కొనుగోళ్లపై 5 శాతం తగ్గింపు లభ్యం. జియో కస్టమర్లకు ఏకంగా రూ .4,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జిపై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్, ఇతర భాగస్వాముల నుండి రూ .2,000 విలువైన వోచర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త, పాత జియో చందాదారులకు కూడా వర్తిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ .15,499 నోకియా 5.4 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48 + 2+ 5 + 2 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్ కెమెరా, 5జీ : ఎంఐ 10టీ ప్రొ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఎంఐ బ్రాండ్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఎంఐ10టీ, ఎంఐ 10టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్లను భారత్‌లో ఆవిష్కరించింది. 5జీ కనెక్టివిటీ, ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరలు, లభ్యత ఎంఐ 10టీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 6 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. ఎంఐ 10టీ ప్రో ఒక్క వేరియంట్లో మాత్రమే లభ్యం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. అక్టోబర్ 16 నుండి ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంటుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్ ద్వారా రూ.2000 అదనపు తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎంఐ 10టీ ప్రో ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 108+13+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఐ 10టీ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ 64+13+5ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51
సాక్షి, ముంబై: శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ లో దూకుడు మీద ఉంది. తాజాగా గెలాక్సీ ఎం సిరీస్ లో భారీ బ్యాటరీ సామర్ధ్యంతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51ను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర, లభ్యత, ఆఫర్ 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్ వేరియంట్ 26,999 రూపాయలు సెప్టెంబర్ 18 న మధ్యాహ్నం 12 గంటల నుండి (మధ్యాహ్నం) అమెజాన్, శాంసంగ్.కామ్ , ఇతర రిటైల్ దుకాణాలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 18-20 మధ్య అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 2,000 తగ్గింపు ఆఫర్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్లు 6.7అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ ఆండ్రాయిడ్ 10 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 6/ 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+12+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ లెన్స్‌తో సెల్ఫీ కెమెరా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్, షావోమికి పోటీ : ఒప్పో ఏ53
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ53 2020 పేరుతో రీలాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్ +64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఆవిష్కరించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ లాంటి ప్రత్యేకతలతో బడ్జెట్ ధరల స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్, షావోమిలకు గట్టి పోటి ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను 12,990 రూపాయలుగా ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000ఎంఏహెచ్ ఒప్పో పవర్ బ్యాంక్ 2 కూడా లాంఛ్ చేసింది ఒప్పో. దీని ధర 1299 రూపాయలు. అయితే ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి ఈ పవర్ బ్యాంక్ కొంటే 400 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రోజు (మంగళవారం)మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఔ, జీరో డౌన్-పేమెంట్ అవకాశం కూడా ఉంది. (చదవండి : షావోమి : కొత్త ఎంఐ టీవీ త్వరలో) ఒప్పో ఏ53 2020 ఫీచర్లు 6.5 అంగుళాలు డిస్ప్లే ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460ప్రాసెసర్ 13+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ 12,990 రూపాయలు 6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్15,490 రూపాయలు The faster and smoother #OPPOA53 is here! Packed with a 90Hz Punch-hole display, 18W Fast Charge, 16MP AI Selfie Camera and much more! Starting at just ₹12,990! Order yours now! Available now: https://t.co/Jxrk1l7LCU pic.twitter.com/vsse36CPmw — OPPO India (@oppomobileindia) August 25, 2020 -
బడ్జెట్ ధరలో హువావే స్మార్ట్‌పోన్
బీజింగ్: చైనాకుచెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంజాయ్ 10ఈ పేరుతో బడ్జెట్ సెగ్మెంట్ లోఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమరా లాంటి కీలకఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండువేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు లాంచ్ చేసిన స్పష్టత లేదు. హువావే ఎంజాయ్ 10ఈ ఫీచర్లు 6.3 ఇంచుల డిస్ప్లే 600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3జీబీ ర్యామ్ /64 జీబీ ధర సుమారు రూ.10,309 4జీబీర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.12,375 మిడ్నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో మార్చి 5వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. -
రియల్‌మి, 5జీ ‘ఎక్స్50 ప్రొ’ వచ్చేస్తోంది
సాక్షి. న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి 5జీ స్మార్ట్ఫోన్ల రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. 5జీస్మార్ట్ఫోన్ల తయారీ సంస్థల మధ్య పోటీ ఊపందుకున్న నేపథ్యంలో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎక్స్50 ప్రొ’ పేరుతో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలో నేడు ( సోమవారం) మధ్నాహ్నం ‘ఎక్స్50 ప్రొ’ లాంచ్ చేయనుందని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. (చదవండి : స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ) కాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 60 +8+ 2 +2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ 8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను అమర్చినట్టు సమాచారం. అలాగే సరికొత్త క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించనుందని అంచనా. డ్యూయల్-మోడ్ 5 జి కనెక్టివిటీ, 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించపోయినప్పటికీ వూక్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ వల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ టీజర్ద్వారా అర్థం చేసుకోవచ్చు. ధర : సుమారు రూ. 50,000 Few hours before the launch of #realmeX50Pro! So guys can you tell us how many 'India First' features are we bringing with the #real5G? RT & reply with the correct number using #realmeX50Pro and stand a chance to win one. Livestream begins at 2:30PM.https://t.co/8pkvjxXwcl — Madhav 5G (@MadhavSheth1) February 24, 2020 -
అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ 71
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో కొత్త స్మార్ట్‌పోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ 70కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ 71ని ఆవిష్కరించింది. భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ 71. ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఫిబ్రవరి 24 నుండి శాంసంగ్ ఒపెరా హౌస్, శాంసంగ్.కామ్‌తో పాటు ప్రముఖ ఆన్లైన్ పోర్టల్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గెలాక్సీ ఎ 71 లో కొన్ని 'మేక్ ఇన్ ఇండియా' లక్షణాలను కూడా శాంసంగ్ అందిస్తోంది. గెలాక్సీ ఏ 71 సులభంగా చెల్లింపులను ప్రారంభించడానికి శాంసంగ్ పే ఇంటిగ్రేషన్‌తో ప్రీలోడ్ చేసింది. అంతేకాదు మెరుగైన భద్రత కోసం శాంసంగ్ నాక్స్ ఏఫీచర్‌ను కూడా జోడించింది. టెక్స్ట్ మెసేజింగ్ యాప్‌లో విజువల్ కార్డులు , రిమైండర్లు, ఆఫర్ల రూపంలో ఉంటాయి. స్థానిక భాషలకు మద్దతు ఇవ్వడానికి హ్యాండ్‌సెట్‌లో బహుభాషా టైపింగ్ సౌలభ్యం కూడా ఉంది. వినోదం, ఇ-కామర్స్, ఆహారం , ట్రావెల్ డొమైన్లలో కంటెంట్ కోసం శోధించేందుకు వీలుగా ఫైండర్, అలాగే సింగిల్ ట్యాప్‌తో స్క్రీన్‌షాట్‌సేవ్, స్మార్ట్ క్రాప్ ఫీచర్స్ అందిస్తోంది. వివో వి 17 ప్రో, ఒప్పోరెనో, రెడ్మి కె 20 ప్రో, వన్‌ప్లస్ 7 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 71 ఫీచర్లు 6.70 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స రిజల్యూషన్ 8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జిబి వరకు విస్తరించుకునే అవకాశం 32 ఎంపీ సెల్ఫీకెమెరా 64+ 12+ 5+ 5 ఎంపీ రియర్ క్వాడ్‌కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
అద్భుత ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్, భారీ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ వివో మిడ్ రేంజ్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో వై19 పేరుతో భారతీయ మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రూ. 13990లకు వై 19 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రూపొందించినట్టుగా భావిస్తున్న దీన్ని మాగ్నెటిక్ బ్లాక్, స్ప్రింగ్ వైట్ కలర్ వేరియంట్లలో తీసుకొచ్చింది. నవంబర్ 20 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, పేటిఎమ్, టాటా క్లిక్‌లతో సహా అన్ని ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. వై 19 ఫీచర్లు 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి + హాలో ఫుల్‌వ్యూ డిస్ప్లే 1080 x 2340 పిక్సెల్రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై 4జీబీ ర్యామ్, 28 జీబీ స్టోరేజ్ 16ఎంపీ + 8ఎంపీ+ 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీ కెమెరా ఏఐ ఆధారిత ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ 18 వాట్స్ డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా, భారీ బ్యాటరీ, మెరిసే డిజైన్, అల్ట్రా-గేమ్ మోడ్ లాంటి అధునాతన ఫీచర్లతో తాజా స్మార్ట్‌ఫోన్ వై 9 ద్వారా తాము మరింత బలోపేతం చేస్తున్నామని వివో ఇండియా డైరెక్టర్ నిపున్ మారియా ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు యూ 20పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22న లాంచ్ చేయనుంది. అంతేకాదు భారత మార్కెట్లో కాలిడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులను ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తోంది. నవంబరు 30 వతేదీవరకు క్యాప్బ్యాక్స్, ఎక్స్జంజ్ ఆఫర్ తదితర ఆఫర్లను ప్రకటించింది. With a 6.53 Halo FullView FHD+ Display never compromise on your fun and watch your favourite series on the all-new #vivoU20 with #UnstoppablePerformance. Launching on 22nd November.@amazonIN Know More: https://t.co/E6ODTs44qn or https://t.co/Vyx4q6BVZL : https://t.co/71o65sLTA9 pic.twitter.com/F2lQm8dD4D — Vivo India (@Vivo_India) November 17, 2019 We've completed 5 years in India and we would like to celebrate this with you by our side. From 12th to 30th November, get unexpected cashbacks, interesting exchange offers, and lots of great deals with @vivo_india. Powered by @Cashify_. Know more: https://t.co/spKYcYZU4X pic.twitter.com/uOOSNuwxwJ — Vivo India (@Vivo_India) November 15, 2019 -
షావోమి సంచలనం : కొత్త శకం
చైనా మొబైల్ దిగ్గజం షావోమి సరికొత్త రికార్డు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా , దేశంలో నెంబర్ 1 బ్రాండ్‌గా కొనసాగుతున్న షావోమి మరో సంచలనానికి నాంది పలకనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.. ఈ మేరకు ట్విటర్లో ఫోటోను షేర్ చేసింది. ఎంఐ నోట్ 10, ఎంఐ నోట్ 10 ప్రొ (ఎంఐ సీసీ9 ప్రొ) పేరుతో స్మార్ట్ఫోన్లను తీసుకు రానుందని తెలుస్తోంది. విభిన్న ప్రాసెసర్లతో, అద్భుతమైన ఫీచర్లతో ఇవి ఆకట్టుకోనున్నాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా ట్వీట్ చేయడం విశేషం. స్మార్ట్ఫోన్ల కెమెరాల యుగంలో ఒక కొత్త శకం ప్రారభం కానుందని ట్వీట్ చేసింది. చైనాలో ఎంఐ సీసీ9 ను నవంబరు 5న లాంచ్ చేయనున్నామంటూ టీజర్‌ను వదిలింది. కాగా ఇప్పటికే ఆన్లైన్లొ లీకైన వివరాల ప్రకారం ఎంఐ సీసీ 9 ప్రొ స్నాప్‌డ్రాగన్ 730 జి ప్రాసెసర్‌ను కలిగి ఉండగా, ఎంఐ నోట్ 10 ఫ్లాగ్షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 సాక్ ప్రాససర్‌ను అమర్చినట్టుతెలుస్తోంది. Introducing the world's FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL — Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019 -
అద్భుత ఫీచర్లతో రెడ్మి 8 లాంచ్
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమిసరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. ‘రెడ్మి 8’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. రెడ్మి 7కి అప్డేట్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఏఐ డ్యూయల్ కెమెరాలతో 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్ 363 సెన్సర్, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే స్పీడ్ చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ చార్జర్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిజైన్ పెద్ద డిస్ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది. "అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో రెడ్ , బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లో "ఆరా మిర్రర్ డిజైన్" తో దీన్ని ఆవిష్కరించింది. ఎంఐ .కామ్, ఎంఐ సోర్స్,ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ 12నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. రెడ్మి 8 ఫీచర్లు 6.22 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 439 సాక్ ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+2 ఎంపీ ఏఐ రియల్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ రూ. 8,999 -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఎస్ 1
సాక్షి, ముంబై : వివో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎస్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా వివో ఎస్1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అంతేకాదు దేశంలో వివో ఎస్ సిరీస్‌కు నటుడు సారా అలీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివో ప్రొడక్ట్ మేనేజర్ అంకిత్ మల్హోత్రా ప్రకటించారు. వివో ఎస్ 1లో 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 499 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 ఎంపీ సెకండరీ సెన్సార్ 5 ఎంపీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చింది. స్మార్ట్ బటన్ కూడా ఉంది, ఇది సింగిల్ ట్యాప్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను, డబుల్ ట్యాప్ జోవి ఇమేజ్ రికగ్నిజర్ను ఓపెన్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్/ 128 జీబీస్టోరేజ్, 6జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్,/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనుంది. అయితే 4 జీబీ వేరియంట్ గురువారం నుంచే అమ్మకానికి సిద్ధం. వివో ఎస్ 1 ఫీచర్లు 6.80 అంగుళాల స్క్రీన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 65 సాక్ 19.5: 9 కారక నిష్పత్తిసూపర్ అమోలెడ్ ప్యానల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 32 ఎంపీ సెల్పీ కెమెరా 16+ 8+ 5 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4 500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ వేరియంట్ ధర రూ. 17,990 6 జీబీ ర్యామ్, 64/జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,990 , 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 19,990 -
64 ఎంపీ రెడ్మి స్మార్ట్‌ఫోన్
బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి అనుబంధ సంస్థ రెడ్మి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అవిష్కరించనుంది. ఈమేరకు చైనా తన అధికారిక సోషల్‌మీడియా వైబో ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 64 ఎంపీ కెమెరా సెన్సార్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇంతకుమించి ఇతర ఫీచర్ల వివరాలను రెడ్మి వెల్లడించలేదు. కానీ అంచనాలు మాత్రం భారీగా వ్యాపిస్తున్నాయి. వీటి పేర్లు రెడ్మి నోట్ 8 లేదా రెడ్మి కే30గా ఉండొచ్చనేది ప్రధాన అంచనా. ఐసోసెల్ బ్రైట్ జిడబ్ల్యు 1 తీసుకురానున్న శాంసంగ్ కొత్త ఫోన్‌కు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. -
బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ
సాక్షి, ముంబై:చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో రియల్‌మి స్మార్ట్ఫోన్లను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియం ధరల్లో రియల్మిఎక్స్ను ఆవిష్కరించగా, బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ అనే స్మార్ట్ఫోన్నుకూడా తీసుకొచ్చింది. . 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధరను రూ.7,999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 9999గా ఉంచింది. జూలై 23నుంచి కొనుగోలుకు లభ్యం. రియల్‌మి 3ఐ ఫీచర్లు 6.20 అంగుళాల డిస్ప్లే మీడియా టెక్ హీలియో పీ 60ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ 3/4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్256 దాకా విస్తరించుకనే అవకాశం 13 ఎంపీ సెల్ఫీకెమెరా 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ -
సూపర్ ఫీచర్లతో మోటరోలా వన్ విజన్ లాంచ్
సాక్షి, ముంబై : మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియామార్కెట్లోలాంచ్ చేసింది. ఇటీవల గ్లోబల్ గా లాంచ్ చేసిన ‘వన్ విజన్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇక్కడ విడుదలచేసింది. దీని ధరను రూ. 19,999 గా నిర్ణయించింది. ఆధునిక ఫీచర్లు, ప్రధానంగా సినిమా విజన్ డిస్ప్లే, నైట్ విజన్ ఫీచర్‌తో 48, 5 మెగా పిక్సెల్ సామర్ధ్యం గల డబుల్ రియర్ కెమెరా లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటరోలా వన్ విజన్ ఫీచర్లు 6.3 ఇంచ్ డిస్ప్లే శాంసంగ్ ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 1080x2520 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+5 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆధునిక ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్
మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ‘వన్ విజన్’ పేరుతో ను ఈ నెల 15వ తేదీన బ్రెజిల్ సావోపోలోలో జరగనున్న ఓ ఈవెంట్లో విడుదల చేయనుంది. ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో సుమారు రూ.23,400 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ప్రధానంగా హోల్ పంచ్ డిస్ప్లే, 48, 5 మెగా పిక్సెల్ సామర్ధ్యం గల డబుల్ రియర్ కెమెరా లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది. దీంతో పాటు మోటో ఈ6 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే వన్ విజన్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫోటోల లీకులు హల్ చల్ చేస్తున్నాయి. మోటరోలా వన్ విజన్ ఫీచర్లు 6.3 ఇంచ్ డిస్ప్లే ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 1080x2520 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+5 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4132 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుతమైన పాప్అప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వి15 ప్రొ బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి పాపప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో పేర్కొంది. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను ధర రూ.28,990లుగా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా మార్చి 6వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది. వివో వి15 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ -
పరిశ్రమ తలకిందులే..
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారతమార్కెట్లో త్వరలోనే లాంచ్ చేయనుంది. రెడ్మీ నోట్7 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నామని ట్విటర్ ద్వారా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ వెల్లడించారు. 48 మెగా పిక్సల్ కెపాసిటీతో..అద్భుతమైన డివైస్ వస్తోందని ట్వీట్ చేశారు. అంతేకాదు పరిశ్రమను తలకిందులు చేయనున్నామంటూ కంపెనీ సీఈవో లీ జూన్‌తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే కచ్చితమైన సమయాన్ని జైన్ ప్రస్తావించకపోయినప్పటికీ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని అంచనా. బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్స్ ఆప్షన్లలో, మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.10,390గా, 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 12,459, 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 14,537గా ఉండనుందని అంచనా. రెడ్మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48+ 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0. ˙sᴉ sᴉɥʇ ʇɐɥʍ ʍouʞ noʎ ɟᴉ ┴R ¡ƃuᴉɯoɔ sᴉ #ԀW8ᔭ ƃuᴉzɐɯ∀ ˙uʍop ǝpᴉsdn ʎɹʇsnpuᴉ sᴉɥʇ uɹnʇ ɐuuoƃ ǝɹ,ǝM pic.twitter.com/ojvMXWPTUt — Manu Kumar Jain (@manukumarjain) January 24, 2019 -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో తమ కస్టమర్లను పలకరిస్తోంది. వై సిరీస్‌లో భాగంగా వివో వై 93 పేరుతో నూతన డివైస్‌ను తీసుకొచ్చింది. డ్యుయల్ కెమెరా, కర్వడ్ గ్లాస్, భారీ బ్యాటరీతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,990గా నిర్ణయించింది. అమెజాన్‌తో పాటు, ఇతర ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. వివో వై 93 ఫీచర్లు 6.22 ఇంచెస్ ఫుల్‌వ్యూ హెచ్డీ డిస్ప్లే 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 256 దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 13+2 డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 6ప్రో లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న చైనా మొబైల్ దిగ్గజం షావోమి నాలుగు(క్వాడ్) కెమెరాలతో సరికొత్త ఫోన్నున విడుదల చేసింది. నోట్ సిరీస్‌లో భాగంగా రెడ్మి నోట్ 6ప్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రేపు (నవంబరు23) మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా తొలి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సందర్భంగా మొదటి రోజున కస్టమర్లకు బంపర్ఆఫర్ ఇస్తోంది. అసలు ధరపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.500 తక్షణ క్యాస్‌బ్యాక్ లభించనుంది. అంతేకాదు ట్విటర్లో సెలబ్రిటీల ఫోటోలతో సందడి చేసింది ఎంఐ. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4+64 జీబీ ధర 12,999 (మొదటి రోజు మాత్రమే) 6+64 జీబీ ధర 14,999 (మొదటి రోజు మాత్రమే) -
మార్కెట్లోకి మరో కంపెనీ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్స్ షావోమి, ఒప్పో, వివో, లెనోవో లాంటివి ఇప్పటికే భారత మొబైల్ మార్కెట్‌ను శాసిస్తుండగా, మరో చైనా మొబైల్ తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్‌టామ్ దేశీయస్టార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్ సెగ్మెంట్లో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతోపాటు, రెండు సార్లు స్ర్కీన్ రీప్లేస్మెంట్ ఆఫర్కూడా అందిస్తోంది. హెచ్1, హెచ్ 3, హెచ్ 5 డివైస్‌లను విడుదల చేసింది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్‌ఫోన్ విఫణిలో మూడు నుండి ఐదు శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోమ్టామ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ నిఖిల్ భూటాని చెప్పారు. హెచ్1 స్మార్ట్‌ఫోన్: 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో 640x1280 రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 13+2 ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరః రూ .7,499, హెచ్3 స్మార్ట్‌ఫోన్: 5.5అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో, 720x1440 రిజల్యూషన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఎంటీకే 1.3 గిగాహెడ్జ్ బిట్64 , 13+2 ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లు, ధర రూ .9,990 ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అమర్చింది. హెచ్ 5 స్మార్ట్‌ఫోన్: 5.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 720x1440 రిజల్యూషన్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16 + 2 రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, ధర: రూ .10,990. ఈ మూడు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేస్తాయి. -
షావోమి ఎంఐ ఏ2 లాంచ్ : లాంచింగ్ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంఐ ఏ2 పేరుతో రెండవ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ డివైస్‌ను ప్రస్తుతం లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా ఎంఐ, అమెజాన్ ద్వారా ప్రీ ఆర్డర్లు రేపు మధ్యాహ్నంనుంచి మొదలవుతాయి. ఆగస్టు 16నుంచి తొలి విక్రయాలు ప్రారంభం. త్వరలోనే 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. దీని ధర రూ.22,000గా ఉండనుంది. ఎంఐ ఏ 2 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 18:9 రేషియో, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ, ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ 12+20 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ ఫ్రంట్ కెమెరా 3010ఎంఏహెచ్ బ్యాటరీ ఇక లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే రిలయన్స్ జియో ద్వారా రూ.2200 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీంతోపాటు 4.5 టీబీ డేటా కూడా ఉచితం. -
అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్’
బీజింగ్: హువావే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో v సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ స్క్రీన్, 18:9 బెజెల్ లెస్ డిస్ప్లే, నాలుగు కెమెరాలు(డబుల్ రియర్, సెల్పీ కెమెరా) లాంటి అద్భుత ఫీచర్లతో 'నోవా 2ఎస్' పేరుతో తాజా స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4జీబీ వేరియంట్ ధర సుమారు రూ.26,300గాను, 6జీబీ ధరను సుమారు రూ.29, 300గాను ఉండనుంది. అంతేకాదు రూ.33,100 ధరలో మరో స్పెషల్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. హువావే నోవా 2ఎస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+20 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20+2 మెగాపిక్సెల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
లెనొవొ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే..
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా 'కె3 నోట్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని కోసం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్‌ఫోన్ ధర రూ.9,999. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం నుంచి ప్రారంభమయ్యింది. -
లావా కొత్త ఐరిస్ ఫోన్
ఐరిస్ ఫ్యూయల్ 60@ రూ.8,888 అధిక బ్యాటరీ లైఫ్ ఈ మొబైల్ ప్రత్యేకత... ఆండ్రాయిడ్ లాలిపాప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయ మొబైల్ కంపెనీ లావా ఐరిస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్-ఐరిస్ ఫ్యూయల్ 60ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.పదే పదే చార్జింగ్ చేయకుండానే ఎక్కువ గంటల పాటు ఈ ఫోన్‌ను వాడుకోవచ్చని లావా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (ప్రోడక్ట్) నవీన్ చావ్లా చెప్పారు. ఈ డివైస్ ధర రూ.8,888 అని పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లు రోజువారీ దినచర్యలో ఒక భాగం అయ్యాయని, అయితే బ్యాటరీ లైఫ్ ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి ఐరిస్ ఫ్యూయల్ 60ను అందిస్తున్నామని వివరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెర్ట్స్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 10 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని, ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ అయిన లాలిపాప్ ఓఎస్‌కు ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 32 గంటల టాక్‌టైమ్(2జీ) వస్తుందని పేర్కొన్నారు. క్విక్ చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించామని, దీంతో చార్జింగ్ టైమ్ 3గంటల 15 నిమిషాలకు తగ్గిందని వివరించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో విడి భాగాలను ఒకదానినొకటి అనుసంధానం చేయడానికి సోల్డరింగ్ చేస్తారని, కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోల్డరింగ్తో కాకుండా కనెక్టర్స్ ద్వారా ప్రతి విడిభాగాన్ని పీసీబీఏ(ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లి)కు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఫలితంగా లోపాలు తక్కువగా ఉంటాయని, రిపేర్లు సులభంగా చేయవచ్చని వివరించారు.