Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది.
దీనికి తోడు రియల్‌మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్‌లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్‌ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?)
ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి.
హానర్ 90 ఫీచర్లు అంచనాలు
6.7 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ
200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా
50ఎంపీ సెల్పీ కెమెరా
5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్
కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్‌లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ.
Comments
Please login to add a commentAdd a comment