Honor
-
పారాలింపిక్స్ పతక విజేతలకు సన్మానం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రోత్సాహకాల్ని అందించింది. స్వర్ణ పతక విజేతకు రూ. 75 లక్షలు... రజత పతకం నెగ్గిన వారికి రూ. 50 లక్షలు... కాంస్య పతకం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ 2028 పారాలింపిక్స్ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు నెగ్గారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలున్నాయి. -
జీ20 సమ్మిట్: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం
ఢిల్లీ: ఢిల్లీ జీ-20 సదస్సులో మన తెలంగాణ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. సమ్మిట్‌లో 20 దేశాల డెలిగేట్స్ చొక్కాలకు బ్యాడ్డీలను మన కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులే తయారుచేశారు. కోణార్క్ సూర్యదేవాలయంలోని రథచక్ర నమూనాలో సిల్వర్‌తో బ్యాడ్జీలను తయారు చేశారు. జీ20 సందర్భంగా రెండు వందల బ్యాడ్జీలను భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. జీ-20 సమ్మిట్‌లో స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మన తెలంగాణ కళాకారులకు అనుమతి లభించింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో జీ-20లో స్టాల్ నిర్వహణ కొనసాగుతోంది. గతంలో ఇవాంకా ట్రంప్‌తో పాటు పలు దేశాల డెలిగేట్స్ పర్యటన నేపథ్యంలోనూ కరీంనగర్ ఫిలిగ్రీకి ఈ తరహా గౌరవం దక్కింది. దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇదీ చదవండి: జీ-20 సదస్సు... ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్ఫోన్లు ఇవే
టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఆ సిరీస్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, హానర్ 90, షావోమీ 13 టీ ప్రోలు లాంఛ్ చేయనున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న యాపిల్ షెడ్యూల్ ప్రకారం.. ‘వండర్లస్ట్’ ఫాల్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లు ఉన్నాయి. యూఎస్బీ-సీ పోర్ట్, పవర్ఫుల్ ఏ17 బయోనిక్ చిప్సెట్, లైనప్‌లో వినూత్నమన డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌కు పెరిస్కోపిక్ కెమెరా లెన్స్ డిజైన్ వంటి ఈ ప్రీమియం మోడల్‌కి ఉంటాయని అంచనా. హానర్ 90 సిరీస్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు హానర్ సంస్థ సిద్దమైంది. చైనా తయారీ సంస్థ హానర్ 2020లో భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఈ తరుణంలో హానర్ టెక్ పేరిట పున ప్రారంభం కానుంది. హానర్ 90 సిరీస్‌ను లాంచ్ చేసి భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తాము సైతం పోటీలో ఉన్నామని చెప్పనుంది. హానర్ కొత్త సిరీస్ విడుదలపై అమెజాన్ ప్రచారం ప్రారంభించింది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్నారు. హైఎండ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లకి పెద్ద మొత్తంలో ఖర్చ చేయకూడదనుకునే వారికి ఈ ఫోన్ మంచిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ విడుదల తేదీ అధికారంగా తెలియాల్సి ఉంది. షావోమీ 13టీ ప్రో ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1న లాంచ్ అవుతుందని గతంలో పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతుంది. షోవోమీ 13టీ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, 144హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సుదీర్ఘ కాలం తర్వాత శాంసగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లోని బడ్జెట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పేరుతో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఈ ఫోన్లో 50 ఎంపీ కెమెరా,ఎక్స్నాయిస్ 2200 లేదంటే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, 120 హెచ్‌జెడ్ స్మూత్ డిస్ప్లేతో పాటు యూజర్లు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. వన్ ప్లస్ ఓపెన్ వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలోకి వన్‌ప్లస్ ఓపెన్ అడుగుపెట్టనుంది. లాంచ్ తేదీ వెల్లడించనప్పటికీ ఇది 7.8-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్ప్లే ఉండొచ్చనే అంచనాలు నెకొన్నాయి. అంతేకాదు ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్‌టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్‌టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్‌మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!
Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది. దీనికి తోడు రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?) ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 90 ఫీచర్లు అంచనాలు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా 50ఎంపీ సెల్పీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ. -
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన పదవికి రాజీనామా వేశారు. సంస్థకు ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ ప్రముఖ బ్రాండ్‌గా నిలబెట్టిన మాధవ్ సేత్ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్‌ను మాధవ్ ట్వీట్ చేశారు. రియల్‌మీకి తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన మరపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్మీ తన స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్మెంట్కు తోడు "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్‌లు, పార్టనర్స్, ఇలా ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు. (Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే ) మాధవ్ సేత్ పయనం ఎటు? రియల్‌మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్‌లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. -
కూతురి ప్రేమ వ్యవహారం.. కుటుంబం పరువుపోతుందని..
పెబ్బేరు: కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన కూతురిని ఓ తండ్రి పొట్టనపెట్టుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారంతో కుటుంబం పరువుపోతుందని భావించి క్షణికావేశంలో ఆమెను పొడిచి చంపాడు. ఈ సంఘటన మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లిలో చోటుచేసుకుంది. పాతపల్లికి చెందిన బోయ రాజశేఖర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండోకూతురు గీత(15) పెబ్బేరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, గీత ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాజశేఖర్ తన కూతురిని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీపావళి పండుగకు కుటుంబసభ్యులతో కలసి గీత అమ్మమ్మ ఊరైన వనపర్తి మండలం చందాపూర్‌కు వెళ్లింది. సోమవారం సాయంత్రం తండ్రి, కూతురు పాతపల్లికి తిరిగి వచ్చేశారు. రాత్రి సమయంలో బయటికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చిన గీతను తండ్రి కొట్టాడు. మంగళవారం ఉదయం కూడా తండ్రి, కూతురు మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికిలోనైన రాజశేఖర్ చేతికి దొరికిన పదునైన ఆయుధంతో కూతురు గొంతు, చెవి, మెడ కింద భాగంలో పొడిచాడు. ఆ తర్వాత తన వ్యవసాయ పొలానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన గీత నానమ్మ శంకరమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న మనుమరాలిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వచ్చి రాజశేఖర్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట ఇన్చార్జ్ సీఐ కేఎస్ రత్నం, ఎస్ఐ రామస్వామి, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. తండ్రిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తానే నరికి చంపినట్లు అంగీకరించాడు. పోలీసులు గీత మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్(ఐఈటీఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐఆర్‌వో) గుర్తింపుతో 1953లో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. చదవండి: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది? ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్ సురేష్‌ను ఐఈటీఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరింది. డాక్టర్ సురేష్ కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ అందుకున్నారు. -
హానర్ హోమ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హానర్ హోమ్స్ తాజాగా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను నియమించుకుంది. కొత్తగా ’రిచ్‌మాంట్’ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది. ఏడేళ్ల క్రితం హానర్ ప్రస్థానం ప్రారంభమైందని, ఇది తమకు మూడో ప్రాజెక్టని ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ ఎం బాలు చౌదరి తెలిపారు. హానర్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన తమతో జట్టు కట్టడం సంతోషకరమని సంస్థ ఎండీ వై స్వప్న కుమార్ పేర్కొన్నారు. దాదాపు 28.4 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో అధునాతన సదుపాయాలతో 142 ఫ్లాట్లు ఉంటాయని సంస్థ వర్గాలు తెలిపాయి. -
సంచలనం..భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్‌కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ కార్యకాలాపాల్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్ చేస్తూ భారత్‌లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈడీ దెబ్బ.. హువావే అబ్బా ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో సైతం 2018లో హానర్ భారత్‌లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్‌లో తన హానర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది. -
యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్ ల్యాబ్ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు. మరో రూ.50 లక్షలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. స్వర్ణతాపడానికి బంగారం అందజేత యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం
-
ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లలోకి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 3, హానర్ మ్యాజిక్ 3 ప్రో, హానర్ మ్యాజిక్ 3 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. అద్బుతమైన ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. హనర్ మ్యాజిక్ 3 మోడల్ ధరలు సుమారు రూ. 52,800 నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లలో రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్ఫోన్లు 8జీబీ, 12 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో మార్కెట్లలోకి రానుంది. హానర్ మ్యాజిక్ 3 బ్రైట్ బ్లాక్, డాన్ బ్లూ, గ్లేజ్ వైట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.76-అంగుళాలు (1344x2772) డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్ 13ఎంపీ ఫ్రంట్ కెమెరా రియర్ కెమెరా 50ఎంపీ వైడ్ సెన్సార్ + 64 ఎంపీమోనోక్రోమ్ సెన్సార్+ 64 ఎంపీ+ 64 ఎంపీ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4600mAh బ్యాటరీ టైప్ సీ పోర్ట్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.2 50వాట్స్ చార్జింజ్ సపోర్ట్ -
షాకింగ్ సేల్స్ : కేవలం నిమిషంలోనే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ విడుదల చేసిన హానర్ 50, హానర్ 50 సిరీస్ స్మార్ట్ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2జీ, 4జీ, ఇప్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్ బ్రాండ్ గా పేరొందిన హానర్ కంపెనీ చైనా కేంద్రంగా హానర్ 50, హానర్ 50ప్రో, హానర్ 50ఎస్ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర్డర్‌ను ప్రకటించింది. అలా ఆర్డర్ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్ 50 సిరీస్ ఫోన్లు అమ్ముడయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ హానర్ 50ప్రో ఫీచర్స్ విషయానికొస్తే 6.72అంగుళాలు 120 హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 12జీబీ ర్యామ్ తో 778జీ ప్రాసెసర్ 108 ఎంపీ - 8ఎంపీ-2ఎంపీ-2ఎంపీతో కెమెరా సెటప్ 32 ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది 50ప్రో ధర : ఇండియన్ కరెన్సీలో రూ. 42,380గా ఉంది. హానర్ 50 ఫీచర్స్ అండ్ ప్రైస్ హానర్ 50 సైతం 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 778జీ ఎస్ఓసీ 12జీబీ ర్యామ్ వేరియంట్ తో వస్తుంది క్వాడ్ రేర్ కెమెరా సెటప్ తో పాటు 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది 32ఎంపీ తో సింగిల్ సెల్ఫీ కెమెరా 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 30,922కే అందిస్తుంది. హానర్ 50ఎస్ఈ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ హానర్ 50ఎస్ఈ 6.78 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ నుంచి 128జీబీ వరకు స్టోరేజ్ 16 ఎంపీల సెల్ఫీ కెమెరా 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీల రేర్ కెమెరా సెటప్ 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 27,480కే అందిస్తుంది. -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
సాక్షి, తాడేపల్లి: ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం, శాలువాతో ప్రభుత్వం సత్కరించనుంది. ప్రకృతి వైపరీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నెల 13న గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చదవండి: ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని -
హానర్ 10ఎక్స్ లైట్.. ధర, ఫీచర్లు
సాక్షి,న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ మిడ్ రేంజ్ ల కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. హానర్ 10ఎక్స్ లైట్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరప్, రష్య, సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేది అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలో భారత మార్కెట్లో కూడా విడుదల కానుందని అంచనా. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.15,900 ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. హానర్ 10ఎక్స్ లైట్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం కిరిన్ 710 ప్రాసెసర్, 48+8+2+2 క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 256 జీబీదాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధరలో హానర్ స్మార్ట్ఫోన్లు
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ అందుబాటు ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లను భారతమార్కెట్లో లాంచ్ చేసింది. 9ఎస్, 9ఏ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఆగస్టు 6వ తేదీనుంచి తగ్గింపు ధరలో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. హానర్ 9 ఎస్ ఫీచర్లు 5.45-అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఐడీఎస్ ఆండ్రాయిడ్ 10 , మ్యాజిక్ యుఐ 3.1 మీడియాటెక్ ఎంటీ 6762 సాక్ 1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ 6,499 రూపాయలకు తీసుకొచ్చింది. లాంచింగ్ ఆఫర్‌గా 500 తగ్గింపుతో 5999 రూపాయలకు లభ్యం. హానర్ 9 ఏ ఫీచర్లు 6.3 అంగుళాల హెచ్డీ ప్లస్డిప్స్లే మీడియా టెక్ ఎంటీ 676ఆర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 13+5 + 2 ఎంపీ రియర్‌కెమెరా 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రూ. 11,999 వద్ద లాంచ్ చేసింది. అయితే ప్రారంభ ఆఫర్‌గా 8,999 కే అందుబాటులో ఉండనుంది. -
హానర్ తొలి ల్యాప్‌టాప్ వచ్చేసింది
సాక్షి, ముంబై: కరోనా కాలంలో ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో హానర్ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హానర్ మ్యాజిక్ బుక్ 15 పేరుతో శుక్రవారం తన తొలి ల్యాపటాప్ను భారత దేశంలో లాంచ్ చేసింది. విండోస్ ముందే ఇన్స్టాల్ చేసిన ఈ ల్యాపటాప్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఏఎంబీ రైజెన్ 3000 సిరీస్ సీపీయూలు, వేగా గ్రాఫిక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ కలర్ వేరియంట్లో లభ్యం. ఇది ఆగస్టు మొదటి వారం నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ గా రాయితీ ధరను హానర్ ప్రకటించింది. ధర, లభ్యత హానర్ మ్యాజిక్ బుక్ 15 ధర 42,990 రూపాయలు. మిస్టిక్ సిల్వర్ కలర్లో ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే లభ్యం. గ్లోబల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో లాచ్ అయిన సంగతి తెలిసిందే. హానర్ మ్యాజిక్ బుక్15 స్పెసిఫికేషన్లు విండోస్ 10 హోమ్ (ప్రీ లోడెడ్‌గా) 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 8 జీబీ ర్యామ్ 256జీబీస్టోరేజ్ టైప్-సీ పోర్ట్, 65 వాట్స్ చార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ అవుతుందనీ, వీడియోలను నిరంతరం చూసినా బ్యాటరీ సమయం 6.3 గంటలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సెక్యూరిటీ కోసం టూ-ఇన్-వన్ ఫింగర్ ప్రింట్ పవర్ బటన్ పాప్-అప్ వెబ్ క్యామ్‌ను కూడా జోడించింది. ఇంకా వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సి, యుఎస్బి 2.0, యుఎస్బి 3.0, హెచ్డిఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. -
హానర్ ఎక్స్ 10 లాంచ్ : ఫీచర్లు, ధర
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీదారు హానర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ ఎక్స్ 10 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ , ట్రిపుల్ రియర్ కెమెరా, పాప్ అప్ సెల్పీ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ లాంటి ప్రధాన ఫీచర్లను ఇందులో జోడించింది.. హానర్ ఎక్స్ 10 మూడు కలర్ ఆప్షన్లతో పాటు , స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. చైనా మార్కెట్లో మే 26 నుండి ఫోన్ అమ్మకానికి లభిస్తుండగా, అంతర్జాతీయంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టతలేదు. హానర్ ఎక్స్ 10 ఫీచర్లు 6.63 అంగుళాల డిస్ప్లే హై సిలికాన్ కిరిన్ 820 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా 40+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 20,200 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 23,400 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, ధరసుమారు రూ .25,500 -
హానర్ కొత్త ఫోన్ ‘30ఎస్’
బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ సంస్థ తన 30 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 30ఎస్ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. కిరిన్ 820 ప్రాసెసర్ 5జీ చిప్సెట్ కలిగిన మొదటి హానర్ ఫోన్ ఇదే. 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను చైనాలో ప్రీఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్ హువాయ్ మొబైల్ సర్వీసెస్(హెచ్ఎంఎస్)పై ఆధారపడుతుంది. ఇందులో గూగుల్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్ యాప్ ఉండదు. 30 ఎస్ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి, ఫుల్‌వ్యూ డిస్ప్లే కిరిన్ 820 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 64+8+8+8 ఎంపీ కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,500 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000 -
హానర్ పవర్ఫుల్ 5జీ స్మార్ట్ఫోన్లు లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ సంస్థ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను బీజింగ్‌లో లాంచ్ చేసింది. వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. అయితే అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆధారంగా వినియోగదారులు 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది. తమ హానర్ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందనీ హానర్ప్రెసిడెంట్ జార్జ్ జావో వెల్లడించారు. వ్యూ 30 ప్రో ఫీచర్లు 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్ప్లే 7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 40+12+8 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు : వ్యూ 30 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభించేనుంది. వీటి ధరలు వరుసగా 3,299 యువాన్లు (సుమారు రూ. 33,600). 3699 యువాన్లు ( సుమారు రూ. 37,700) వ్యూ 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.39,700) 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ. 42,800). వ్యూ 30 ప్రో డ్యూయల్ పంచ్ హోల్, 40వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27వా వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే డ్యుయల్ కెమరాల్లో 8ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. వీటితో పాటు, మ్యాజిక్‌బుక్14 , మ్యాజిక్‌బుక్15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది. -
మరో అద్భుతమైన హానర్ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, హువావే ఉపసంస్థ హానర్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం నాలుగు వేరియంట్లు ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో ఇది లభించనుంది. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం. వాటర్ డ్రాప్ నాచ్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, రియర్ ట్రిపుల్ కెమెరా. సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, పొర్ ట్రెయిట్ మోడ్ లాంటి ప్రధాన ఆకర్షణలో ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చారు. హానర్ 20 లైట్ ఫీచర్లు 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే 2400 × 1080 రిజల్యూషన్ కిరిన్ 710F ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై ఈఎంయూఐ 9.1.1 16 ఎంపీ సెల్పీకెమెరా 48 +8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.14 వేలు) 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.15 వేలు) 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ.17 వేలు) టాప్ ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర 1,899 యువాన్లు (సుమారు రూ.19 వేలు) -
ఏపీభవన్‌లో ఏపీ ఎంపీలకు ఘన సన్మానం
-
హానర్ 20 సిరీస్ స్మార్ట్ఫోన్లు లాంచ్
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ 20 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో తాజాగా స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించడం గమనార్హం. హానర్ 20, హానర్ 20 ప్రొ, హానర్ 20 ఐ పేర్లతో వీటిని లాంచ్ చేస్తోంది. క్వాడ్ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, బడ్జెట్ ధరలో హానర్ 20ఐ ని లాంచ్ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా, డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒకేలా ఉంచింది. అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్ కెమెరాలతో లాంచ్ చేసింది. హానర్ 20 ప్రొ ఫీచర్లు 6.26 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ 6/8జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 7ఎన్ఎం కిరిన్ 980 ప్రాససర్ 48+16+2+ ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు హానర్ 20 : ధర రూ. 32,999 జూన్ 25నుంచి లభ్యం. హానర్ 20 ప్రొ : ధర రూ. 39,999 కమింగ్ సూన్ హానర్ 20ఐ రూ.14, 999 జూన్18 నుంచి లభ్యం. -
ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా?
ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడే ఆ ఇంట్లో...‘‘ఊళ్లో అందరికీ పండగ మనకు ఎండగా. పైగా ఈ తోరాణాలు కూడా ఎందుకు దండగా’’ అసహనంగా అరుస్తుంది కమల.‘‘అబ్బా ఏమి రాక్షసివే!’’ అని విసుక్కున్నాడు ఆమె భర్త.ఈలోపు ‘కమలా...’ అనే పిలుపు వినబడింది. అది వెంకాయత్తమ్మ గొంతు.‘‘రండి వెంకాయత్తమ్మ’’ అని ఆవిడను ఇంట్లోకి ఆహ్వానించింది కమల.‘‘ఉగాది పండగంతా మీ ఇంట్లోనే ఉట్టిపడుతుంది’’ అన్నది వెంకాయమ్మ. అది నిజమో, వ్యంగ్యమో దేవుడెరుగు.‘‘ధర్మాంభ ఏది?’’ అనుకుంటూ ఆమె ఇంట్లోకి వచ్చింది.‘‘ఇవ్వాళ మా చిట్టమ్మ పుట్టినరోజు పండగ. నువ్వేమో ఎక్కడికీ రావు. తప్పకుండా రావాలి సుమా. కావాలంటే మీ వారి ఉత్తర్వు అడుగుతాను’’ అన్నది వెంకాయమ్మ.‘‘అక్కర్లేదు అత్త. నేనూ అక్క వస్తాము’’ అన్నది ధర్మాంభ సౌమ్యంగా.‘‘అందరికీ మల్లే పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే రాత రాసి ఉంటే నేను ఇలా ఎందుకు ఉంటాను!’’ మూతి ముడిచింది కమల. ‘‘వెళ్లి ఆ విగ్రహాల మెడలో ఉన్న నగలు ఇట్లా తీసుకురా. అవైనా వేసుకొని గౌరవంగా వాళ్ల ఇంటికి వెళ్తొస్తా’’ తోడికోడలితో అన్నది కమల.‘‘పండగరోజు దేవుడి నగలు ఎందుకు అక్కయ్యా తీయడం’’ అన్నది ధర్మాంభ సున్నితంగానే.ఈమాత్రం దానికే కమల అంతెత్తున లేచింది...‘‘ఏమన్నావ్? దేవుడి నగలా! ఆహా....అందాక వచ్చావు. ఇవ్వాళ దేవుడి నగలు అంటావు రేపు నా నగలు అంటావు’’ అని తోడికోడలిని దెప్పి పొడించింది కమల.బయట ఏదో అలికిడి. ‘‘ఎవరండీ’’ అంటూ బయటకు వచ్చాడు కమల భర్త.‘‘త్యాగయ్యగారి ఇల్లు ఇదేనా?’’‘‘ఇదే... ఇదే దయచేయండి. త్యాగి నా తమ్ముడే’’ అంటూ వారిని లోనికి ఆహ్వానించాడు.‘‘ఈ బహుమానాలు మహారాజుగారు పంపించారు’’ అన్నాడు ఆయన.‘‘వెయ్యేళ్లు వర్ధిల్లాలి మహారాజుగారు’’ అని సంబరపడిపోతూ మహారాజు పంపిన ఈ బహుమతులను ఇంట్లోకి తీసుకెళ్లాడు తాగయ్య అన్నగారు. ఆ బహుమానాలను భార్యకు చూపుతూ....‘‘చూశావటే...కోరినన్ని బహుమానాలు పంపారు మహారాజుగారు’’ అన్నాడు సంబరపడిపోతూ.తమ్ముడి దగ్గరికి వెళ్లి... ‘‘సంస్థానం నుంచి నీకోసం వచ్చార్రా’’ అన్నాడు. ‘‘నా కోసమా! ఎందుకు?’’ ఆశ్చర్యపోయాడు త్యాగయ్య. ‘‘శ్రీశ్రీశ్రీ శరభోజీ మహారాజుగారు మీ గానం వినవలెనని చాలా కుతూహలపడుతున్నారు. వెంటనే వచ్చి మీ గానంతో సంతోషపరచగలరు’’ వర్తమాన్ని వినిపించాడు తంజావూరు సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ త్యాగయ్యలో ఎలాంటి చలనం లేదు.‘‘చూడరా త్యాగు, ఎందరో విద్వాంసులు ఎదురుచూసే గౌరవం కోరకుండానే మన ఇంట్లోకి వచ్చింది. అంగీకరించానని చెప్పి వాళ్లను పంపిచు నాయనా!’’ అన్నారు అన్నగారు.మౌనంగా ఉన్నట్లే కనిపిస్తున్నాడుగానీ త్యాగయ్య మనసులో సుడిగుండాలు... ప్రశ్నలు!నిధి చాల సుఖమారాముని సన్నిధి సుఖమానిజముగ పల్కు మనసా’తమ్ముడి మౌనాన్ని చూసి విసుగెత్తిన అన్న...‘‘ఏమిట్రా ఈ తాత్సారం! వాళ్లు కాచుకున్నారు. ప్రయాణమెప్పుడో చెప్పరా!’’ అన్నాడు తొందర చేస్తూ.మళ్లీ ఇలా అన్నాడు...‘‘సరే బాగుంది. ఈ మౌనం అంగీకార సూచనమేనా? అదైనా చెప్పు’’అప్పుడు గొంతు విప్పాడు త్యాగయ్య...‘‘లేదన్నయ్యా... నేను అంగీకరించడం లేదు. నన్ను క్షమించండి. ఇవి బహుమతులు కాదు స్వర్ణబంధాలు. త్యాగయ్య జీవితం, సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ఈ ధనభారాన్ని భరించలేనని చెప్పండి’’త్యాగయ్య మాటలు ఆయన వదినకు కోపం తెప్పించాయి. ‘‘అయిందా శృంగభంగం! నే చెబుతుంటే నా మాట విన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీ ముఖాన్నే కొట్టి చెప్పారు. చాలా!’’ అన్నది ఆమె కొరకొరలాడుతూ.‘‘అలా చూస్తారే! బయలుదేరండి. తమ్ముడు ఆ దారిన మీరు ఈ దారిన...భవతీ భిక్షాందేహీ అనుకుంటూ’’ ఇద్దరినీ చూసి ఈసడించింది కమల.‘‘నీ పంతం నెగ్గించుకున్నావయ్యా త్యాగయ్యా... తృప్తి అయిందా నీకు! మనం ఒక కడుపున పుట్టినందుకు, పెద్దవాడినైనందుకు నువ్వు నాకు మంచి మర్యాద చేశావు. నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనిఆశపడినందుకు తగిన బుద్ధి చెప్పావు. ఇక చాలాయ్యా చాలు. నీ ముష్ఠి సంపాదన నాకు అక్కర్లేదు. ఈరోజు నుంచి మీ కుండ మీది, మా కుండ మాది’’ కోపంగా అన్నాడు అన్నయ్య. ఆమాటలకు త్యాగయ్య కళ్లలో కన్నీళ్లు ధారలు కట్టాయి.‘‘తండ్రి తరువాత తండ్రి అంతటి వాడివి. మిమ్మల్ని నేను అవమానిస్తానా! ఈ ధనపిశాచికి లోబడి మనం విడిపోవద్దు అన్నయ్యా. ధనం లేకుండా ఇంతకాలం సుఖంగా జీవించలేదా! ధనంవతులందరూ సుఖంగా జీవిస్తున్నారా? నా మాట మన్నించడన్నయ్యా... పుట్టించినవాడు పోషించకపోడు... మన రెండు జీవితాలు ఇట్లాగే వెళ్లి పోనివ్వండి’’ అన్నాడు త్యాగయ్య. ఈమాటలతో అన్నయ్య కోపం నషాళానికి ఎక్కింది. ‘‘చాలు, నీతో ఉండి మేము పొందిన లాభాలు చాలు. నీ వేదాంతం చాలు. నన్ను ధిక్కరించడమే కాకుండా ప్రభువును కూడా ధిక్కరించడానికి నీకెంత ధైర్యం!’’ అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అన్నయ్య. తంజావూరు సంస్థానం.‘‘అద్వితీయులైన విద్వాంసులు గానం చేసిన మా సభ త్యాగయ్యకు రుచించలేదు కాబోలు. పాపం! రాజులకు నిగ్రహానుగ్రహములు సమానములని ఎరుగరు’’‘‘ప్రభువులు తలచుకుంటే తాగయ్యగారిని ఇక్కడికి రప్పించలేరా?’’‘‘నిరభ్యంతరంగా రప్పించగలరు. కాని ప్రభువులు కోరింది త్యాగయ్య సంగీతాన్ని కాని శరీరాన్ని కాదు’’‘‘మనలాంటి వాళ్లు ఎందరో మహాప్రభువు అనుగ్రహం కోసం అహోరాత్రాలు కష్టపడుతుంటే, ప్రభువులే కోరి కల్పించిన అవకాశాన్ని నిరాకరించాడు త్యాగయ్య. అందరూ ఆశించే ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని వదులుకున్నాడు. గుణదోషములను సూక్ష్మదృష్టితో చూసుటప్రభువుల వారికే తెలుసు. స్వేచ్ఛాగానం విని ఆనందించే మహారాజు ఒక స్వేచ్ఛాజీవిని నిర్బంధించి సంగీతం పాడించదలుచుకుంటారా!’’‘‘నిజం! మరి త్యాగయ్యగారి గానం వినే మార్గం?’’‘‘మహాప్రభువులు సంకల్పసిద్ధులు. మహారాజులు జ్ఞానులను దర్శించుకోడానికి స్వయంగా వెళ్లేవారట’’‘‘మనమే స్వయముగా తిరవయ్యారు పోవలెనని కదా సంకల్పం’’ ప్రభువుల వారికి కాస్త ఆలస్యంగానైనా నిజం బోధపడింది!పై దృశ్యాలు చిత్తూరు నాగయ్య నటించి, దర్శకత్వం, సంగీత దర్శకత్వం చేసిన సినిమాలోనివి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం. -
హానర్ ఫోన్ పోయింది..ఇస్తే రూ.4 లక్షలు
సామాన్య మానవుడు విలువైన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకోవడం అంటే చెప్పలేని బాధ. మరి అలాంటిది టెక్ జెయింట్ పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను కోల్పోతే.. ధర పరంగా పెద్దగా బాధపడకపోయినా.. ఇంకా లాంచ్ కావాల్సిన స్మార్ట్‌ఫోన్ మిస్ అయితే మాత్రం కష్టమే. జర్మనీకి చెందిన మొబైల్ మేకర్ హువావే సబ్బ్రాంబ్ హానర్‌కు చెందిన ఉద్యోగి ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. దీంతో ఆ ఫోన్‌ను తెచ్చి ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. సురక్షితంగా హానర్ మొబైల్ తెచ్చి ఇస్తే.. సుమారు రూ. 4 లక్షల బహుమానం ఇస్తానని ట్విటర్ ద్వారా వెల్లడించింది. హానర్ ఉద్యోగి ఏప్రిల్ 22న జర్మనీలోని మ్యూనిచ్‌కి రైల్లో వెళుతుండగా హానర్ మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో అప్‌కమింగ్ ప్రోటో టైప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హువావే విజ్ఞప్తి చేసింది.గ్రే ప్రొటక్టివ్ కవర్‌తో ఉన్న హానర్ మొబైల్‌ను సురక్షితంగా రిటన్ చేసిన వారికి 5 వేల యూరోలు (రూ. 4లక్షలు) నజరానా ఇస్తానని హానర్ ట్వీట్‌చేసింది. కాగా మే 21 లండన్‌లో నిర్వహించనున్న ఒక ఈవెంట్లో హానర్ 20సిరీస్‌లో భాగంగా హానర్ 20 ప్రొ, హానర్ 20ఏ, హానర్ 20సీ, హానర్ 20 ఎక్స్ తదితర స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. పోయిన స్మార్ట్‌ఫోన్ వీటిల్లో ఒకటి కావచ్చని పలు అంచనాలు నెలకొన్నాయి. ⚠️Bitte helft uns ⚠️ Hinweise an de.support@hihonor.com oder jeden Servicemitarbeiter der Deutschen Bahn! 😔🙏 pic.twitter.com/vI5ZjDOlpN — HonorDE (@HonorGermany) April 22, 2019 -
హానర్ గాలా ఫెస్టివల్ సేల్ : నేటి నుంచే
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ మేకర్ హానర్ ఫెస్టివ్‌సేల్ సోమవారం ప్రారంభమైంది. చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్లను అందిస్తోంది. నేటి (ఏప్రిల్ 8) నుంచి 12 వరకు సాగనుంది. ఈ కామర్స్ దిగ్గజాలు, అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా హానర్ గాలా ఫెస్టివ్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్ లో దాదాపు 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. హానర్ 9 ఎన్, హానర్ 9లైట్, హానర్ 7ఏ, హానర్ 10 లైట్ తదితర ఫోన్లతోపాటు టాబ్లెట్లు, తదితర ఉత్పత్తులపై ఈ తగ్గింపు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం రూ. 50 కోట్ల మేర ఈ ఆ ఫర్లను అందిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ధరలు : హానర్ 9 ఎన్ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ను రూ. 9,499లకే అందిస్తోంది. అసలు ధర : రూ.13999. హానర్ 9 లైట్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. అసలు ధర రూ. 14,999 హానర్ 9 ఐ (4జీబీ/64జీబీ) వేరియంట్ ను రూ.10, 999లకే అందిస్తోంది. అసలు ధర రూ. 17999 అమెజాన్ ధరలు హానర్ ప్లే (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 13,999 లు. అసలు ధర 19,999 హానర్ 8 ఎక్స్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 12, 999లు. అసలు ధర 14,999 Celebrating 5 years of ‘Best Quality, True Price’ with #HONORGala. Sale Live on @Flipkart now - https://t.co/HbXIF9DLhw. Hurry! pic.twitter.com/EtHEbp5A7z — Honor India (@HiHonorIndia) April 8, 2019 -
హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హువావే నూతన స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవర్ సెగ్మెంట్లో బడ్జెట్ ధరలో హానర్ 10ఐ ని విడుదల చేసింది. వీటితో పాటు నోవా 4 ఇ, పి స్మార్ట్ ప్లస్ స్మార్ట్ఫోన్లను కూడా పరిచయం చేసింది. 3డీ,గ్రాడియంట్ ఫినిష్, ట్రిపుల్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే ధరను ఇంకా రివీల్ చేయలేదు. హానర్ 10ఐ ఫీచర్లు 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 పై 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 24 + 2+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
మహిళా సర్పంచ్‌లకు సన్మానం
సాక్షి, మునిపల్లి(అందోల్): నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు మగవారితో పోటీ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు. కానీ మండలంలో తాము రాజకీయంగా మాత్రం రాణించలేకపోతున్నామని కొందరు మహిళల్లో ఆందోళన వ్యక్తమవడంతో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరారు. మగవారికన్నా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఈ నెల 2వ తేదీన మునిపల్లి మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మునిపల్లి మండలంలో 12 మంది ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో ఆరుగురు మహిళలకు రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 30 మంది సర్పంచ్‌లకు గాను 18 మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన ఆయా గ్రామాల మహిళా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారే సక్రమంగా అన్ని పనులు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలందరూ స్వతంత్రంగా వారే నిర్ణయాలు తీసుకునేవిధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మహిళా ప్రజాప్రతినిధులే పాల్గొనాలని, వారి భర్తలు పాల్గొనకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితమన్న మాట మర్చిపోయి మగవారితో సమానంగా రాజకీయాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నప్పటికీ రాజకీయాలలో రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మహిళా దినోత్సవాలను జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కానీ ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నికైనప్పటికీ పూర్తి స్థాయిలో అధికారం చేయలేకపోతున్నామని వాపోతున్న సంఘటనలున్నాయి. మహిళలకు 65 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధుల హక్కులు, విధులను మహిళలే నిర్వహించుకునే విధంగా చూడాల్సిన అవసరం కేంద్ర, రాష్త్ర్‌ట ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ ఈశ్వరమ్మ -
హానర్ కొత్త ఫోన్.. ‘వ్యూ20’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ దిగ్గజం హువావే.. ‘హానర్’ బ్రాండ్‌లో ‘వ్యూ20’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. హైఎండ్ పోర్టిఫోలియోలో భాగంగా 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ హ్యండ్‌సెట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.37,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా హువావే వైస్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాల మేరకు ఈ మొబైల్‌ను విడుదలచేశామని, వినియోగదారుల అంచనాలను అందుకోగలదన్నారు. -
అద్భుత ఫీచర్లతో హానర్ వీ 20 లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: హువావే బ్రాండ్ కింద హానర్ తన సరికొత్త మొబైల్ హానర్ వ్యూ 20ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే ఐఏ ఆధారిత 48 మెగా పిక్సెల్ భారీ కెమెరాతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఊరిస్తున్న హానర్ వీ 20ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ల ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. పంచ్ హోల్ డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ డివైస్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటర్ రెడ్ రంగుల్లో, రెండు వేరియొంట్లలో విడుదలైన హానర్ వీ 20 ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా రేపలినుంచి (30 జనవరి) లభ్యం. హానర్ వీ20 ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ పై 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ కిరిన్ 980ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48ఎంపీ రియర్ కెమెరా మెగాపిక్సెల్ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో చార్జర్ ధరలు 6జీబీ+128జీబీ- రూ.37,999 8జీబీ+256జీబీ- రూ.45,999 -
హానర్ 10 లైట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీలలో షావోమి తరువాత హువావే బ్రాండ్‌కింద హానర్ స్మార్ట్ఫోన్లు భారతీయ కస్టమర్లను పలకరిస్తున్నాయి. అద్భుత ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా హానర్ 10 లైట్ అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో కంపెనీ విడదల చేసింది హానర్. హానర్ 8 లైట్, 9 లైట్ డివైస్ల వరుసలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. డ్యూ డ్రాప్ డిస్ప్లే, ఏఐ ఆధారిత 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ధరలు 13,999 రూపాయల నుంచి ప్రారంభం. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ జనవరి 20నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి లభ్యం. అలాగే జియో నుంచి 2200 క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.2800 క్లియర్‌ట్రిప్ వోచర్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. హానర్ 10 లైట్ ఫీచర్లు 6.21 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ పై9 ఆక్టాకోర్ కిరిన్710 ప్రాసెసర్ 4జీబీ/6జీబీ ర్యామ్ 64జీబీస్టోరేజ్/ 13+2 ఎంపీ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువావే సబ్ బ్రాండ్ హానర్ భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 48ఎంపీ సోనీ ఐఎంఎక్స్589 సెన్సర్‌తో హానర్ వ్యూ 20 / హానర్ వి 20 పేరుతో జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. హానర్ వి 20 ఫీచర్లు 6.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2130x1080 రిజల్యూషన్ హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9 6జీబీ/8జీబీ ర్యామ్,128జీబీ/256 స్టోరేజ్ 48ఎంపీ రియర్‌కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 30వేలు హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35వేలు -
జలాధిపత్యం
ఏ విధంగా సాయి పంచభూతాల్లోని ఆ పృథ్విని అంటే భూమాతని వినయంతో.. గౌరవంతో.. భక్తితో.. తనదానిగా చేసుకుని ఆమెని తన అధీనంలో ఉండేలా చేసుకోగలిగాడో వివరించుకున్నాం. ఆమె కూడా ఎందుకు అలా సాయికి అధీనురాలుగా అయిపోయిందో ఆ కారణాన్ని కూడా తెలుసుకున్నాం గత భాగంలో.ఆ క్రమంలో ఇప్పుడు పంచభూతాల్లోనూ 2,3,4,5గా గల నీరు, తేజస్(వేడిమి), వాయువు, ఆకాశం అనే వాటిని కూడా ఎలా తన అధీనంలో ఉండేలా వినయధోరణితో చేసుకోగలిగాడో తెలుసుకుందాం! నీటి దీపాలు ప్రతిరోజూ సాయికి తానున్న మసీదు నిండుగా దీపాలని వెలిగించి ఉంచడం ఇష్టం. అదొక ఆనవాయితీ కూడా. అది శీతకాలం కావచ్చు, వర్షకాలం కావచ్చు. దీపాల వేడిమి కారణంగా మసీదంతా ఉష్ణమయం అయిపోయే వేసవికాలం కావచ్చు. దీపాలు వెలగాల్సిందేననేది ఆయన అభిమతం.ఆ నూనె కోసం ఎందరో భక్తులిచ్చే దక్షిణలని దాదాపుగా ఉపయోగించేవారు కాదు. షిర్డీ గ్రామంలో ఉండే వర్తకుల వద్దకి సాయే స్వయంగా వెళ్లి నూనెని అడిగి మరీ తెచ్చుకుంటూండేవారు. లోకరీతి ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అందరూ కలిసి ఓసారి అనుకున్నారు. ఎప్పుడో ఒకసారంటే అడగడం, ఇయ్యడమనే దానిలో అర్థముంది కానీ నిత్యం ఇదేపనా? అయినా భక్తుల నుంచి అంతంత దక్షిణ వస్తూంటే.. అది చాలదన్నట్టుగా దబాయించి ‘ఇంత ఈయవలసిందే’ అంటూ దక్షిణలని తీసుకుంటున్న ఈయనకి వర్తకులమైన మనం ఎందుకు ఉచితంగా ప్రతిరోజూ నూనెనియ్యాలి? ఆయనే తలుచుకుని ఈ సంవత్సరమంతా నూనె ఖర్చు నీదే! అంటూ ఎవరినైనా శాసిస్తే కాదనేవాడు లేనేలేడు గదా! మనల్ని పీడించడం దేనికి? అయినా ఏదో ఒకటో రెండో దీపాలు చాలవా? మసీదంతా వెలుగులమయం కావాలా? ఇంతకు వెనుకకాలంలో ఒక్క దీపమే కదా ఉండేది అంత పాడుబడ్డ మసీదు మొత్తానికీ? ఏదో మనం ఇస్తున్నాం కాబట్టి వెలిగించడమా? అంటూ వ్యక్తికో అభిప్రాయం చొప్పున సామూహికంగా తెలియజేసుకుంటూ సాయి రాగానే అందరూ కలిసిగట్టుగా ఒకే మాట మీద నిలబడి నూనె లేనేలేదని చెప్పాలని నిశ్చయించుకుని నూనెని ఈయనేలేదు.ఎక్కడో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో.. ఏ ప్రవర్తనతో ఉన్నాడో.. ఏ వెనుకకాలంలో తనకి ఎంత రుణమున్నాడో కూడా తన అతీంద్రియశక్తితో గ్రహించగలిగిన సాయికి.. ఈ వర్తకులంతా లోపలేమనుకున్నారో.. ఏ తీరుగా ప్రవర్తించారో.. పైకి ఏమని చెప్తున్నారో తెలియదా? కానీ వీళ్లంతా ‘ఆయనకి ఈ లో–సమాచారం తెలియదు గదా!’ అని తెలిసినతనంతో తాము ప్రవర్తిస్తున్నామని అనుకున్నారు. సాయి నిరుత్సాహపడలేదు. మౌనంగా లోపల బాధపడ్డాడు. దానికి కారణం.. ‘ఏ మసీదులో దీపాలని వెలిగించి ఆ జ్యోతి వెలిగించిన కారణంగా వచ్చే పుణ్యఫలాన్ని ఆ వర్తకులందరికీ ఆయన పంచదలిచాడో ఆ భాగ్యం వాళ్లకి లేకపోయింది గదా! వాళ్లకి చెందకుండా చేసుకుంటున్నారు కదా!’ అని అనుకోవడమే.భాగవతంలో కుచేలుని భార్య తన భర్తతో తమ మిత్రుడైన శ్రీకృష్ణుని వద్దకి వెళ్లి.. కొంత ధనాన్ని యాచించి.. ప్రస్తుతమున్న ఆర్థికమైన గడ్డు పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడే ఉపాయాన్ని వెదకవలసిందని చెప్పింది. అలాగేనన్న కుచేలుడు ఆమెతో ‘వెళ్తాను. మహానుభావుడైన కృష్ణుడ్ని దర్శిస్తాను. అయితే ఆయనకి ఏమియ్యాలో దాన్ని సమకూర్చు!’ అన్నాడు.అయ్యవారి నట్టిల్లెలా ఉంటుందో ఎంత ఐశ్వర్యంతో ఉందో ఆయనకి తెలియదా? ఎందుకడిగినట్లు?పోనీ! ఆయనడిగాడే అనుకుందాం! ఈమె వెంటనే సమాధానమిస్తూ మనకే లేక దుఃఖిస్తూ ఉంటే ఏమియ్యగలను? అంటూ వ్యతిరేకించి వివాదపడలేదు. ఆ చుట్టుపక్కల నలుగురి ఇళ్లకి వెళ్లి (యాచిత్వా ముష్టీ శ్చతస్రః) నాలుగిళ్ల నుండీ కొంత కొంత చొప్పున బియ్యపుముక్కలు (నూకలు) తెచ్చింది. అంతరార్థమేమంటే.. ఆ నలుగురికీ ఈ కృష్ణదర్శన పుణ్యంలో భాగాన్ని పంచిపెట్టాలనీ, ఈ నలుగురి వైపు నుంచీ తన భర్తని పంపి అలా పట్టుకెళ్లిన పుణ్యాన్ని భర్తకి అందించాలనీనూ. ఈ రహస్యం ఆ దంపతులకి తెలుసుకాబట్టే ఈయన.. ఏదైనా ఈయవలసిందని అనడం, ఆమె కసురుకోకుండా ఆ నూకలని యాచించి ఈయనకి ఇయ్యడమూ జరిగింది.ఈ తీరు జ్ఞానం లేని కారణంగా వర్తకులంతా వ్యతిరేకించారు. సాయి మాత్రం వాళ్లందరికీ పుణ్యఫలాన్ని అందించదలిచినా వాళ్లంతా మేం ఆ పుణ్యానికి అర్హులంకాదంటూ తేల్చేసుకున్నారు నూనెని ఇయ్యకుండా. సాయి దుఃఖమంతా వీళ్ల దురదృష్టాన్ని పోగొట్టదలిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారా? అనేదే!సరే! తర్వాతి కథ మనకి తెలిసినదే! ఆ నూనెడబ్బాని కడిగి దాన్ని తానే స్వయంగా తాగి, ఆ డబ్బానిండుగా నీటిని నింపి అందరూ చూస్తూండగా దీపాలని వెలిగించడం! నీటిని వశం చేసుకోవడం! తర్కశాస్త్రాన్ని మనకి అందించిన అన్నంభట్టనే పండితుడు నీటికి నిర్వచనాన్నీ లక్షణాన్నీ చెప్తూ శీత స్పర్శవత్య ఆపః – చల్లనిదనమే తమ స్వభావంగా కలిగినవీ స్పృశించడానికి వీలైనవీ (ఆకాశాన్ని స్పృశించలేము కదా! అలా కాకుండా) నీళ్లు – అన్నాడు. లోకంలోని ప్రతివస్తువుకీ ఓ ధర్మం(లక్షణం) ఉండి తీరుతుంది. దాన్నిబట్టే ఆ వస్తువు ఏదో దాన్ని గుర్తించగలుగుతాం. ఉదాహరణకి రాయి ఉందనుకుందాం! దానికి జ్ఞానం (తాను దొర్లిపడితే ఎవరికైనా గాయమవుతుందనే జ్ఞానం) ఉండదు. ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. పెద్ద ప్రవాహం వచ్చి తనని కొట్టుకుపోయేలా చేస్తే వెళ్లిపోవడమే తప్ప అభిమానమంటూ ఉండదు. కనీసం మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉందామనే ఆలోచనా ఉండదు. ఇదంతా దాని ధర్మం. అందుకే ఇలాంటి అజ్ఞాన నిరభిమాన లక్షణాలున్నవాడ్ని ‘వాడో బండరాయి’ అని రాతితో పోలుస్తాం! అలా ఆలోచిస్తే నీటికుండే సహజధర్మం చల్లగా ఉండటం అనేదే. సాయి ఈ నీటితో దీపాలని వెలిగించాడనేది అందరికీ కనిపించిన సత్యం.దీపానికి అతిముఖ్యమైనది నిప్పు. అంటే అగ్ని. అగ్నికుండే లక్షణాన్ని వివరిస్తూ తర్కశాస్త్ర పండితుడైన అన్నంభట్టు చెప్పింది అదే. ‘ఉష్ణ స్పర్శవ త్తేజః’ అని. వేడిగానే ఉంటూ ఉండటం, స్పృశించగల అవకాశాన్ని కలిగి ఉండటం తేజస్సు (వేడిమి–అగ్ని) లక్షణమని. అందుకే ఏ సూర్యుడున్నాడో ఆయన ఎంతో దూరంలో ఉండి ప్రకాశిస్తున్నా మన శరీరాలు ‘చుర్రు’మంటూ ఉంటాయి ఒక స్థాయి వేడిమి దాటితే. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే.. నీటికున్న గుణం చల్లగా ఉండటం. అగ్నికున్న గుణం వేడిమితో ఉండటం. నీటికున్న చల్లదనమనే గుణాన్ని తొలగించడం అనే పనిని చేయడమే బహుకష్టం. మరో విశేషం ఉంది. చంద్రునికున్న చల్లదనం ఆకర్షణీయగుణం కారణంగానే ఆయన చంద్రుడవుతున్నాడు(చది ఆహ్లాదనే – చంద్రః) ఆ గుణమే ఆయనలో లేకుంటే ఆయన చంద్రుడు కాకుండాపోతాడు. అలాగే హిమవంతుడున్నాడు. నిరంతరం మంచుని కురిపిస్తూ.. ప్రవహింపజేస్తూ.. మళ్లీ అంతలోనే మంచుని కలిగి ఉండటం హిమవంతుని లక్షణం. ఆ హిమలక్షణం లేకుంటే ఆయన హిమవంతుడే కాలేడు.అదే తీరుగా సముద్రమనేదానికి – ‘అ వేల’ అని పేరు. వేల అంటే ఒడ్డు అని అర్థం. అవేల అంటే ఒడ్డు అనేదే లేనిదని భావం. మనం స్నానం చేసే స్థలం రేవు అవుతుంది తప్ప ఒడ్డు కానే కాదు. నాలుగు వైపులా సముద్రం ఉన్న కారణంగానూ ఆ నాలుగిటి మధ్య భూమి ఉన్న కారణంగానూ (చతురీపమ్ చతుస్సముద్ర వేలా వలయితమ్) సముద్రానికి ఒడ్డు అనేది లేనే లేదు. ఉండదు కూడా. అలా ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉన్న కారణంగా అవి ఆయాపదార్థాలుగా గుర్తింపుని పొంది ఉన్నాయి లోకంలో. ఈ పరిస్థితిలో నీటికుండే సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించినట్లయితే అది ‘నీరు’గా పిలువబడకూడదు. సాయి చేసిందిదే. నీటికుండే సహజ ధర్మమైన చల్లదనాన్ని తొలగించివేయడమనే పనినే. ఇప్పుడు నీరు కాస్తా ఏమయింది? ముడిపదార్థంగా మారిపోయింది. ఉదాహరణకి ఒక వ్యక్తికి ధర్మరాజుగా వేషాన్ని వేశాం. ఆ ఆహార్యాన్ని తొలగిస్తే అతడు మళ్లీ మనలో ఒక వ్యక్తిగా ‘ఫలాని పేరుగల వ్యక్తిగా’ అయిపోతాడు. మళ్లీ అతనికే మరో దశరథుని వేషం వేస్తే ఇదే ‘ఫలాని వ్యక్తి కాస్తా’ ఆ దశరథుడైపోతాడు.అదే తీరుగా సాయి నీటికున్న సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించి నీటిని ఓ ముడిపదార్థంగా మార్చడమే కాకుండా ఆ ముడిపదార్థానికి ఇందాక ధర్మరాజు వేషాన్ని తొలగించి దశరథుని వేషం వేసినట్లుగా తేజస్సుకుండే సహజధర్మమైన వేడిమిని కలిగించి ఆ వేడిమితనం నీటి ద్వారా వత్తికి ప్రవహించేలా చేసి రాత్రిరాత్రంతా దీపాలన్నీ వెలిగే ఏర్పాటు చేశాడు సాయి.‘ఆయన దేవుడు కాబట్టి వెలిగించగలిగాడు’ అంటూ ఒకే ఒక్క వాక్యం ఈ సంఘటనకి ముగింపు పలకడం సరికాదు. ఎలా వెలిగించగలిగాడు? దానిలో దాగిన మూల రహస్యం ఏమై ఉంటుందని ఆ తీరుగా పరిశీలిస్తే సాయి మహత్త్వం (గొప్పదనం) ఏమిటో.. ఎంతదో.. మనకి అర్థమై మన హృదయంలో కనిపించే సాయిచిత్రం మరింత చిక్కగా కనిపించేంత దట్టంగా కనిపిస్తుంది.‘ఉపనిషత్తు చెప్పేది – అగ్నే రాపః’ అని. అగ్ని నుండి నీరు పుడుతుందని. సాయి నీటి నుండి నిప్పు పుట్టేలా (వేడిమి) చేయగలిగాడంటే అది మరింత సిద్ధశక్తికి ఉదాహరణం కదా! సాయి ఇక్కడ మాత్రమే నీటిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడనుకోవడం సరికాదు.తన జీవితంతో.. శరీరంతో.. ప్రాణంతో.. సమానంగా పెంచుకున్న గుర్రం చాంద్పాటిల్కి కనిపించక పిచ్చిపట్టిన వానిలా తిరుగుతున్న వేసవి సమయంలో.. సాయి చెట్టునీడన కూర్చుని చాంద్పాటిల్కి గుర్రపు జాడని చెప్పి సంతోషపెట్టి – హుక్కా తాగుదువు గాని రా! అంటూ తన సటకాతో నేలమీద కొట్టి నీటినీ.. మళ్లీ అదే సటకాతో అదే నేల మీద కొట్టి నిప్పునీ.. రప్పించి ఆ నీటితో హుక్కాగొట్టాన్ని తడిపి ఆ నిప్పుతో పొగాకు రజనుని వెలిగించుకున్నాడు. ఇది చూసినచాంద్పాటిల్కి ఆశ్చర్యమనిపించి ‘సాయి’ మహిమ తెలిసిందనుకున్నాం లోగడ!ఉపనిషత్తు చెప్పింది– ‘అబ్భ్యః పృథ్వి – నీళ్ల నుండి పుడుతుంది భూమి’ అని. మరి సాయి విషయంలో చూస్తే భూమి నుండి కదా నీటిని రప్పించాడాయన. ఇదేమిటి? ఎందుకింతగా నీరు ఆయనకి స్వాధీనమయింది? ఆలోచిద్దాం! ఇదీ కారణం! నీటిశక్తినీ స్వభావాన్నీ నిరోధించడమనేది భాగవతాది ఇతిహాసాల్లో కనిపిస్తుంది. దేవకీ, వసుదేవులకి పుట్టిన శ్రీహరి రూపంలో దర్శనమిచ్చిన బాలుడ్ని వసుదేవుడు తీసుకువెళ్తూంటే యమునానది తనకు తానుగా రెండుగా చీలి వసుదేవునికి నడిచేందుకు వీలుగా త్రోవనిచ్చింది. ఆంజనేయుడు సముద్రమ్మీద ఎగురుతూంటే సముద్రం తన కెరటాల ఎత్తునీ, ఉద్ధృతినీ తగ్గించి సహకరించింది. అగస్త్యుడు సముద్రాన్ని మూడు మార్లు ఆచమనం చేసి తనలో ఉంచేసుకున్నాడు. జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని వరదనీటితో ధ్వంసం చేస్తున్న భాగీరథీ (గంగ)ని ఆపోశనపట్టి ఆ గంగ ప్రార్థన మీద చెవి నుండి విడిచి పుచ్చాడు. అప్పటి నుండే గంగకి ‘జాహ్నవి’ అనే పేరొచ్చింది. కాబట్టి నీటిని నిరోధించడం, తమ శక్తితో ఆ నీటిని లోకోపకారం కోసం వినియోగించడమనే విధానం ఎప్పుడూ ఉండనే ఉందని అర్థమవుతోందిగా! ప్రాణాయామవిద్యతో దుర్వాసోమహర్షి యమునానదిలో ఉండిపోవడం వేరు – అలాంటి విద్యాప్రదర్శనమేమీ లేకుండా సహజసిద్ధవిధానంతో నీటిని వశం చేసుకోవడం లేదు. సరే!నీళ్లెందుకు సాయి అధీనంలోకి వచ్చేసాయి? అనేది కదా ప్రశ్న! వేదంలో నీళ్లని స్తుతించిన మంత్రాలున్నాయి. ‘ఆ పోహిష్ఠామయోభువః తాన ఊర్జే దధాతన... ఆపో జనయధా చనః’ అని కనిపిస్తాయి. ఇవి ప్రతినిత్యం మనం ఏ పూజని చేయదలిచినా ముందుగా చదువబడే మంత్రాలే.నీళ్లు లౌకిక సుఖాన్ని (స్వేదం మొదలైన వాటిని తొలగించి శారీరకమైన ఆనందాన్ని) కలిగిస్తాయి. ముఖవర్చస్సుని పెంచుతాయి. వ్యక్తికి శక్తినిస్తాయి. నీరు ఏ మాత్రం తాగవీల్లేదని వైద్యుడు చెప్తూ ఫలాని తేనెని లేదా ఔషధాన్ని ఇంతమాత్రపు నీటితో తాగవలసిందని చెప్తాడు. వేసవిలో నీటిశాతం శరీరంలో తగినంత ఉండని పక్షంలో వ్యక్తి మరణానికి చేరువౌతాడు. ఏయే పదార్థానికి (ఖర్జూరం, తేనె, బెల్లం, పంచదార, ద్రాక్ష, పటికబెల్లం..) ఏ తీరు తీపిదనముందో తెలిపేందుకు ఈ అన్నింటితో ఉన్న తీపినీ కలిపి రుచి చేసేందుకు అవసరమైనది జలం. నీటిలో చక్కని రుచి గుణాన్ని ఏర్పాటు చేసేది, పంటలని పండించేందుకు కావలసిన రాసాయనిక ఉత్పాదక శక్తినీ ఇచ్చేది నీరే.. అంటూ పై మంత్రం చెప్తుంది వివరంగా.ఇంత గొప్పవి నీళ్లు కాబట్టే పుష్కరాలు పేరిట 12 రోజుల పాటు పుణ్యస్నానాలని చేస్తాం. పాపభారాన్ని తొలగించుకుని కొంతలో కొంత పుణ్యాన్ని పొందుతాం!ఈ నేపథ్యాన్ని బాగా పరిశీలించుకుని చూస్తే... ఏ నీళ్లు అనేవి వ్యక్తుల పాపాలన్నింటినీ హరించే శక్తి కలిగి ఉన్నాయో ఆ పనిని సాయి కూడా చేస్తూ వ్యక్తులకి హితబోధ చేస్తూ పాపం పట్ల విముఖతా పుణ్యంపట్ల ఆత్రుతా కలిగేలా ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టే తాను చేస్తున్న పనినే చేస్తున్న సాయికి జలాలు స్వాధీనం కావాలని నిర్ణయించుకుని ఆయన వశం అయిపోయాయి.పుష్కరాల్లో మనం స్నానం చేసేది ఎందుకంటే ఆ మన పాపాలన్నీ నదిలో విడిచేసేందుకు. మరి ఇందరి పాపాలని (కొన్ని లక్షలమందికి చెందిన వివిధ వివిధ పాపాలని) తీసుకున్న ఆ పుష్కర నది మహాపాపి కాదా? అంటే ఆ నది ఎదురు చూస్తుంది. ఒక్క పతివ్రత చాలు తనలో స్నానం చేస్తే మొత్తం పాపసమూహమంతా తొలగిపోతుంది అని. (అపి మాం పాపయే త్సాధ్వీ స్నాత్వేతీచ్ఛతి జాహ్నవీ జనకతనయా స్నానపుణ్యోదకేషు) ఏ నీళ్లు వ్యక్తుల పాపాలని హరించే ప్రయత్నం చేస్తోందో అలాగే సాయి కూడా పాపులందరికీ తమతమ పాపాలేమిటో వివరించి ఇక ఆ పాపాలని తిరిగి చేయాలనే దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాడు. ఇది ఒక కారణం. శ్రీరామనవమి ఉరుసు చందనోత్సవం అనే మూడు పండుగలూ ఒకే రోజున జరుపవలసివస్తే ఎందరో జనులకి స్నానపానాదులకి నీళ్లు సరిపోతాయా? అనే చర్చలో జనులుంటే సాయి ఉప్పగా సముద్రజలంలా ఉండే నడబావి (4మార్గాలు కలిసే కూడలిలో ఉన్న నుయ్యి)లో మంత్రించిన పుష్పాలని వేసి పూర్తి తీపి జలంగా మార్చేసాడు. అలా జలం వశం కావడానికి కారణం ఎందరొస్తున్నారో ఆ ఉత్సవానికి. అలా వచ్చే అందరిలోనూ జాతి వర్గ మత కుల స్త్రీ బ్రాహ్మణ వృద్ధ, బాల, వితంతు... ఇలాంటి భేదాలు లేకుండా ఉండే తీరు సత్బుద్ధివిత్తనాలని నాటాడు. నాటుతూ ఉండేవాడు కాబట్టి.‘ఆపశ్శుంధంతు మై నసః’ ఓ జలములారా! నాకు నా పాపాలనుండి తొలగే శక్తిని ప్రసాదించవలసిందని ఈ మంత్రానికి అర్థం. దాంతో ఏదైనా పాపాన్ని చేస్తున్నానేమో? అనే బుద్ధివిచక్షణ ప్రతిక్షణమూ ప్రతివ్యక్తికీ కలుగజేస్తుంది ఆ మంత్రం. తన వద్దకొచ్చే అందరికీ ఈ పాప పుణ్య దృష్టీ ఆలోచనా అనేవాటిని నిరంతరం బోధిస్తూ ఉండేవాడు సాయి. అపవిత్రత తొలగి పవిత్రత రావాలంటే (అపవిత్రః పవిత్రోవా..) నీళ్లని శిరసున చల్లుకోవాలని మంత్రం చెప్తుంది. నీళ్లు ఏం చేయడానికి సృష్టింపబడ్డాయో, అదేపనిని సాయి కూడ చేస్తూ తనకి సహకరిస్తున్నాడనే ఉద్దేశ్యంతో జలం కూడా సాయికి స్వాధీనం అయింది. ఇక ‘తేజస్సు’ ఎలా సాయి అధీనానికి వెళ్లిందో, కారణమేమిటో తెలుసుకుందాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
హానర్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా స్మార్ట్‌పోన్లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రోజులు హానర్ డే సేల్ రేపటినుంచి (మంగళవారం సెప్టెంబర్18నుంచి) శుక్రవారం వరకూ కొనసాగనుంది. వీటిల్లో హానర్ 9 లైట్, హానర్ 10, హానర్ 9ఎన్ హానర్ 9ఐ ఉన్నాయి. అలాగే హానర్ 9 ఎన్ లో కొత్త కలర్ ఆప్షన్స్‌లో లావెండర్ పర్పుల్ , రాబిన్ ఎగ్ బ్లూ లో తీసుకొస్తున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. హానర్ 10 పై రూ. 5 తగ్గింపు. అలాగే హానర్ 9 ఐ పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. హానర్ 9 లైట్ 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 14,999 దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 3,000. హానర్ 10 6జీబీ ర్యామ్ /128జీబీ నిల్వ వేరియంట్ 5,000 రూపాయలు తగ్గింపు తరువాత రూజ 27,999 లభ్యంకానుంది. దీని అసలు ధర రూ. 32.999. నాలుగు కెమెరా సెటప్ కలిగిన హానర్ మొట్టమొదటి స్మార్ట్‌పోన్ హానర్ 9ఐ రూ. 16,999 కు అందుబాటులో ఉంటుంది. అసలు దర ధర రూ .17,999 వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో హానర్ 9 ఐ (3జీబీ /32జీబీ నిల్వ వేరియంట్) రూ. 11,999 లకు, 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 13,999 లకు లభ్యం. -
రూ.1 కే హానర్ 9ఎన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా దిగ్గజం హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. హానర్ భారతీయ వినియోగదారులకోసం ఫ్లాష్ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్ 9ఎన్ (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది. హానర్ 9ఎన్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర. రూ. 11,999గా ఉంది. సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే హానర్ ఆన్లైన్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి. అలాగే ఆన్లైన్ చెల్లింపులకు మాత్రమే అనుమతి. దీంతోపాటు ఈ ఫ్లాష్ సేల్ ద్వారా హానర్ 7ఎస్, హానర్ 9ఎన్, హానర్ ప్లే ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. -
హానర్ 7ఎస్ వచ్చేసింది..
సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్‌బ్రాండ్ హానర్ మరో నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎస్ ను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేసింది. ఇప్పటికే 7ఎస్ టీజర్‌ను రిలీజ్ చేసిన కంపెనీ, ఇండియా మార్కెట్లో లాంచింగ్‌ను కూడా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మాత్రమే లభ్యం కానుంది. మూడు రంగులు బ్లూ, బ్లాక్, గోల్డ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. హానర్ 7ఎస్‌ను మే నెలలో పాకిస్తాన్, చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హానర్ 9ఎన్ (3జీబీ, 32 జీబీ స్టోరేజ్) ధర. 11,999లు సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకంగా ప్రారంభించింది. హానర్ 7ఎస్ ఫీచర్లు 5.45 ఇంచ్ డిస్ప్లే, 18.9 యాస్పెక్ట్ రేషియో 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
రామ్ చరణ్ చేతుల మీదుగా సన్మానం
పాలమూరు మహబూబ్‌నగర్ : ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శిల్పారామంలో పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 131 సార్లు రక్తదానం చేసిన మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్‌ను సినీ హీరో రామ్‌చరణ్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. -
హానర్ 9ఎన్ ఫ్లాష్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ స్మార్ట్ఫోన్లకోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గ్రేట్ న్యూస్. హానర్ లేటెస్ట్ మొబైల్ హానర్ 9 ఎన్ ఫ్లాష్ సేల్ మళ్లీ ప్రారంభం కానుంది. నేడు(ఆగస్టు 21, మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు మూడు ఫ్లాష్ సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మంచి విక్రయాలనే నమోదు చేసింది. నాలుగో విడత ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. స్మార్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, బ్యూటీ ఆల్ అరౌండ్ , అమేజింగ్ కలర్ ఆప్షన్స్ అంటూ హువావే ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్ 3/4 జీబీ ర్యామ్, 32, 64 జీబీ స్టోరేజ్, 4జీబీ/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో అందుబాటులోఉంది. వీటి ధరలు వరుసగా రూ.11,999, రూ.13,999, 4జీబీ 64 జీబీ స్టోరేజ్ రూ.17,999గా ధరలకు లభించనుంది. హానర్ 9ఎన్ ఫీచర్లు 5.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080 x 2280 రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 3/4 జీబీ ర్యామ్ 32/64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వడిచర్లకు అరుదైన గౌరవం
బొంరాస్‌పేట, బషీరాబాద్: ‘శ్రీపద’ కలం పేరుతో రచనలు చేస్తున్న ప్రముఖ వర్ధమాన తెలుగు కవి, కవిరత్న బిరుదు గ్రహీత వడిచర్ల సత్యం రూపొందించిన ‘మణిపూసలు’ కవితా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈయన రాసిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ తెలుగు రాష్ట్రాల సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలుగు సాహిత్య కళాపీఠం మంగళవారం కవి సత్యంను సన్మానించనుంది. సత్యం తనదైన ముద్రతో తెలుగుభాషకు వర్ధమాన సాహితీప్రియులను పరిచయం చేస్తున్నారు. గురజాడ అప్పారావు అందించిన ‘ముత్యాలసరాలు’ వంటి నూతన మాత్ర చంధస్సు నియమాలతో ‘మణిపూసలు’ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను సృష్టించిన మాత్ర నియమాలు, అంత్యప్రాయలతో కూడిన మణిపూసలపై సామాన్యులు సైతం ఆదరాభిమానాలు చూపుతున్నారు. దీంతో గత మూడు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 125 మంది మణిపూసలు ఆధారంగా సులభ వ్యాకరణంతో కవితలు, పద్యాలు రాయడంతో ఇది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిం ది. చిక్కడపల్లిలోని లలితకళా వేదిక, త్యాగరాయగాన సభలో జరిగే సత్యం సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ్మరెడ్డి, పలువురు తెలుగు సాహిత్య రచయితలు హాజరవనున్నట్లు తెలుగు సాహిత్య పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా వడిచర్ల సత్యంకు దక్కిన అరుదైన గౌరవానికి తాండూరు కాగ్నా కళా సమితి ప్రతినిధులు శివకుమార్, కార్యదర్శి మెట్లుకుంట రాములు, పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
మూడుసార్లు సిద్దిపేటకు వచ్చిన వాజ్‌పేయి
సిద్దిపేటజోన్ : దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి మరణవార్త సిద్దిపేట ప్రాంత బీజేపీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ సందర్భంగా ఆయనకు సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా వాజ్‌పేయి మూడుసార్లు సిద్దిపేటను సందర్శించారు. మొదటిసారి 1975 ఏప్రిల్ 14న పార్టీకి నిధుల సేకరణ, పార్టీ శ్రేణుల జాగృతిలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పాతగంజిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అప్పట్లో పార్టీ స్థానిక నాయకులు వంగ రాంచంద్రారెడ్డి.. వాజ్‌పేయికి స్వాగతం పలికారు. సిద్దిపేటలో పార్టీ అభిమానుల గురించి ఆ రోజుల్లోనే వాజ్‌పేయి ఆరా తీశారు. అదే విధంగా 1983లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహారెడ్డి తరఫున సిద్దిపేటలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. చివరిగా 1988లో కరీంనగర్లో జరిగే పార్టీ కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆగిన వాజ్‌పేయిని కార్యకర్తలు సన్మానించారు. మరోవైపు సిద్దిపేట నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, చొప్పదండి విద్యాసాగర్‌లు 1998లో వాజ్‌పేయిని ఘజియాబాద్‌లో కలిసి ఉమ్మడి జిల్లా ప్రగతి కోసం నివేదికను అందించారు. పలువురి సంతాపం దేశ ప్రధానిగా, బీజేపీ పార్టీ అగ్రనేతగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు అనిర్వచణీయమని.., ఆయన మరణం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, జిల్లా నాయకులు అంబడిపల్లి శ్రీనివాస్‌లు సంతాపం వ్యక్తం చేశారు. -
సూపర్ సేల్ : రూ.1కే హానర్ 8 ప్రొ
హానర్ ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హానర్ సూపర్ సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే అందించింది. హానర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ రోజు (మంగళవారం) ఉదయం 11.30 నిమిషాలకు ఈ సూపర్ సేల్ మొదలు కానుందని ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకే ఈ అవకాశంమని తెలిపింది. హానర్ 8 ప్రొ వాస్తవ ధర రూ.29,999 అంటే రూ.29,998ల భారీ డిస్కౌంట్ అన్నమాట. హానర్ అధికారిక వెబ్సైట్లో సూపర్ సేల్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అన్న డైలాగ్ కస్టమర్లను వెక్కిరించడం గమనార్హం. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్ని స్మార్ట్ఫోన్లను తమ కస్టమర్లకు అందించిందనే లెక్కలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సివుంది. -
హానర్ 9ఎన్ : లాంచ్ ఆఫర్లు, స్పెషిఫికేషన్లు
న్యూఢిల్లీ : హానర్ బ్రాండులో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. హువావే సబ్‌బ్రాండ్ హానర్, తన లేటెస్ట్ హ్యాండ్సెట్ హానర్ 9ఎన్ ను న్యూఢిల్లీ వేదికగా లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్రయించనున్నారు. ఈ ఫోన్ కీ ఫీచర్లు ‘నాచ్ ఫుల్‌వ్యూ’ డిస్ప్లే, 19:9 యాక్సెప్ట్ రేషియోతో బెజెల్-లెస్ డిస్ప్లేను, 12 లేయర్ ప్రీమియం గ్లాస్ డిజైన్‌ను ఇది కలిగి ఉంది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన హానర్ 9ఐ(2018) మోడల్‌కు భారత్ వేరియంట్ ఈ హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్. హానర్ 9ఐ 2017 అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చింది. దీనికి సక్సెసర్‌గా.. మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా దీన్ని కంపెనీ ప్రకటించింది. హానర్ 9ఎన్ ధర, లాంచ్ ఆఫర్లు హానర్ 9ఎన్(2018) 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగ, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999 రూపాయలు. ఇక 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, హాయ్హానర్స్టోర్ల ద్వారా జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వస్తుంది. లావెండర్ పర్పుల్, రాబిన్ ఎగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్ జియో రూ.2200 క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. 100 జీబీ అదనపు డేటా, 1200 మింత్రా ఓచర్లు కూడా పొందనున్నారు. హానర్ 9ఎన్ స్పెషిఫికేషన్లు... ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 5.84 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ ఫుల్‌వ్యూ ఐపీఎస్ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ 2.36 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 256 జీబీ వరకు విస్తరణ మెమరీ రియర్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వనజీవి రామయ్యకు సన్మానం
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరుపొందిన రామయ్యను ఆదివారం జిల్లా కేంద్రంలోని జెజెనగర్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సన్మానించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు పేటలో పలువురు ఘనస్వాగతం పలికి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలోరైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ గుడిపూడి వెంకటేశ్వర్రావు, సందీప్ పాల్గొన్నారు. -
హానర్ 10జీటీ: కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: హువావే బ్రాండ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. జాంటర్ వేరియంట్ గా హానర్ 10జీటీని చైనాలో ప్రకటించింది. జీపీయూ టర్బో టెక్నాలజీ, 8జీబీ ర్యామ్‌తో దీన్ని విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన హానర్ 10 ను మాదిరి ఫీచర్లనే పోలి వున్న హానర్ 10జీటీ ఫీచర్లు ఇలా ఉన్నాయి. హానర్ 10జీటీ ఫీచర్స్ 5.84అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే,19: 9 కారక నిష్పత్తి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1080x2160పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 24+16 ఎంపి డ్యుయల్రి యర్ కెమెరా విత్ AI ఫోటోగ్రఫీ మోడ్ 24 ఎంపీ సెల్పీ కెమెరా 3400ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు 26,800 రూపాయలు -
హానర్ 7ఎస్ లాంచ్..
దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 7ఎస్ పేరుతో తాజా డివైస్‌ను పాకిస్తాన్లో విడుదల చేసింది. ఇండియన్ కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 8,430 రూపాయలు. అయితే గ్లోబల్ వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ ఫోన్ భారత్ సహా, ఇతర మార్కెట్ల వినియోగదారులకు ఎపుడు లభ్యం కానుందీ స్పష్టత లేదు. హానర్ 7ఎస్ ఫీచర్లు 5.45 ఇంచ్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీరియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేహా ధుపియా : హానర్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్-బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరల్లో హానర్ 7ఏ, 7సీ పేరుతో ఇండియాలో ప్రారంభించింది. గత నెల చైనాలో లాంచ్ చేయగా మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖనటి నేహా ధుపియా మీదుగా ఈ రెండు డివైస్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి లభ్యం. ముఖ్యంగా షావోమికి చెందిన రెడ్ మీ 5, 5ఏకు పోటీగా ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా వీటిని లాంచ్ చేసింది. భారత వినియోగదారుల కోసం పేటీఎం ఫీచర్‌తోపాటు రైడర్స్ సౌకర్యంకోసం రైడ్‌మోడ్ అనే ఫీచర్‌ను యాడ్ చేశామని హానర్ ఇండియా ప్రతినిధి సుమీత్ అరోరా తెలిపారు. ఇండియా టాప్ 5 బ్రాండ్‌గా హానర్ నిలిచిందని పేర్కొన్నారు. షావోమీ, వన్‌ప్లస్‌తో పోలిస్తే 146 శాతం హయ్యస్ట్ గ్రోత్ సాధించామని సుశీల్ తారిఖ్ హువావే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రకటించారు. జియో భాగస్వామ్యంతో మోర్ డేటా, మోర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నామని హానర్ తెలిపింది. హానర్ 7ఏ ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x 1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్ లో లభ్యం హానర్ 7సీ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్ 3జీబీ/4జీబీ ర్యామ్ 32జీబీ/64జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు: 7ఏ ధర 8,999 రూపాయలు నిర్ణయించింది. ఇది మే29 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉంటుంది. కాగా 7 సీ ధర రూ.9,600, 11,999 రూపాయలు ఉంది. ఇది అమెజాన్ ద్వారా మే31న విక్రయానికి లభ్యం. -
హానర్ ప్లే 7 స్మార్ట్‌ఫోన్: ధర, ఫీచర్లు
బీజింగ్: హానర్కంపెనీ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ ప్లే 7 పేరుతో ఈ డివైస్‌ను చైనా మార్కెట్లో అధికారింగా విడుదల చేసింది. సుమారు 6,400 రూపాయలుగా దీని ధరను నిర్ణయించింది. అయితే భారత మార్కెట్లో లాంచింగ్, ధర తదితర అంశాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. కళ్లకు రక్షణకోసం బ్లూ లైట్ ఫిల్టర్, స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్, త్రి ఫింగర్ స్క్రీన్ షాట్ ఫీచర్లు ప్రధానమైనవిగా కంపెనీ చెబుతోంది. హానర్ ప్లే7 ఫీచర్లు 5.45 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 720x1440 పిక్సెల్ రిజల్యూషన్ క్వాడ్ మీడియాటెక్ ఎంటీ 6739 ఎస్వోసీ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3020ఎంఏహెచ్ బ్యాటరీ -
మహేశ్ భగవత్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మహిళల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినందుకు ఇప్పటికే అమెరికా కు చెందిన రియల్ హీరో అవార్డు అందుకున్న మహేశ్ భగవత్ తాజాగా కెనడాకు చెందిన ‘అసెంట్ కంప్లైన్సీ’సంస్థ నిర్వహించిన టాప్ 100 హ్యుమన్ ట్రాఫికింగ్ అండ్ సాల్వరీ ఇన్ఫ్లూయెన్స్ లీడర్లలో 47వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 13 ఏళ్లుగా మహిళల అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకిలించి వందలాది మంది మహిళలను ఆ వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురాగలిగారని ఆ సంస్థ ప్రశంసించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, పౌర సేవా సంస్థలతో కలసి తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మహిళల అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించగలిగారని పేర్కొంది. -
విలేకరులకు సన్మానం
కొరాపుట్/జయపురం : ప్రపంచ మీడియా దినోత్సవం సందర్భంగా కొరాపుట్ జిల్లాలో పలువురు పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను శనివారం సన్మానించారు. కౌన్సిల్ ఫర్ మీడియా అండ్ శాటిలైట్ బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ ఆధ్వర్యంలో కొరాపుట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కె.సుధాకర్ పట్నాయక్, ఓటీవీ జయపురం బ్యూరో ఛీప్ టి.గౌరీ శంకర్, ప్రముఖ ఒడియా దినపత్రిక సమాజ్ జిల్లా ప్రతినిధులు దిలీప్ మహంతి, పతిత పావన సాహు, సూర్యనారాయణ పండాలను సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు సీఎంసీబీ జిల్లా అధ్యక్షుడు నిసాపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొరాపుట్ విశ్వ విద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరవ్ గుప్తా మాట్లాడుతూ..పాత్రికేయులు కచ్చితమైన ప్రమాణాలతో వార్తలు రాయడం సమాజానికి మేలు చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పత్రికలు, పాత్రికేయుల రక్షణ కోసం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1948లో ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. పాత్రికేయుల రక్షణ కోసం చట్టాలున్నప్పటికీ వారిపై ఎక్కడికక్కడ దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారన్నారు. సుమారు 13 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడులు చేసిన దోషులు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి శిక్షించారన్నారు. స్వేచ్ఛ ఉన్న నాడు సక్రమంగా కర్తవ్యం ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతలను వివరించారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉన్న నాడే వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలరని, అయితే నేడు అనేక సందర్భాల్లో జర్నలిస్టులపై దాడులు జరుగాయన్నారు. వారికి భద్రత లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని వక్తలు కోరారు. కొరాపుట్ జిల్లా సమాచార ప్రజా సంబంధాల అధికారి జగన్నాథ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌సీఎంఏ ప్రాంతీయ డైరెక్టర్ వేణు ధర్ సాహు, సీఎంఎస్బీ అధ్యక్షుడు వీ.కె. బంగారి, ప్రముఖ భూదాన ఉద్యమ నేత కృష్ణ సింగ్, కేంద్రీయ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ సౌరవ్ గుప్త , సమాజ్ దినపత్రిక బ్యూరో చీఫ్ సమరేందు దాస్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో హానర్ 10
హువావే సబ్ బ్రాండు హానర్ గురువారం కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10ను చైనాలో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లే డిజైన్‌తో హానర్ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. బ్లాక్, గ్రే, మిరేజ్ బ్లూ, మిరేజ్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్ వేరియంట్ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. ఇటీవలే హువావే పీ20, పీ20 ప్రొ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. హానర్ 10 స్పెషిఫికేషన్లు... 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే ఇన్-హౌజ్ కిరిన్ 970 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వెనుకవైపు 16 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు ముందు వైపు 24 మెగాపిక్సెల్ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు -
హానర్ 9లైట్: అద్భుతమైన ఫీచర్
సాక్షి, ముంబై: హువాయి సబ్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఆసక్తికరమైన అప్‌గ్రేడ్‌ను అవిష్కరించింది. హోటా (హూవాయ్ ఓవర్ ది ఎయిర్) ద్వారా "రైడ్ మోడ్" ఫీచర్‌తో హానర్ 9 లైట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో విడుదల చేసింది. బైక్ నడిపేటపుడు ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానంగా యువతే టార్గెట్‌గా ఈ ఫీచర్‌ను జోడించింది. తమ సరికొత్త రైడ్ మోడ్ ఫీచర్ లక్షలాది కస్టమర్లకు డ్రైవింగ్ సమయంలో సురక్షితమైన స్మార్ట్‌ఫోన్ వినియోగ బాధ్యతను గుర్తు చేస్తుందని హువాయ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పి. సంజీవ్ వెల్లడించారు. రైడ్ మోడ్ యాక్టివేషన్ హానర్ 9 లైట్ కొత్తగా తీసుకొస్తున్న ఈ రైడ్‌మోడ్ ఫీచర్‌ను మెనూలోంచి డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకుకోవడంద్వారా గాని యాక్టివ్టే చేసుకోవచ్చు. లేదా ఫోన్ సెటింగ్స్‌లో రైడ్‌మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. దీంతో యూజర్ బైక్ రైడింగ్‌లో ఉన్నపుడు ఎవరైనా కాల్ చేస్తే.. వినియోగదారుడు ప్రస్తుతం డ్రైవింగ్‌లో ఉన్నారనీ...కాల్ ఆన్సర్ చేయలేరనే మెసేజ్ కాలర్స్‌కి అందుతుంది. అంతేకాదు ఒక వేళ అత్యవసరమైతే.. 1 నెంబర్ ప్రెస్ చేస్తే..కాల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. ఈ సదుపాయం మార్చి చివరినాటికి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంజీవ్ చెప్పారు. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో కిరిన్ 659 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటెర్నెల్ మెమొరీ 256 జీబీ ఎక్స్టర్నల్ మెమొరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 13 ఎంపీ +2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 13 ఎంపీ +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. అయితే నాలుగు కెమెరాలతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టిన ఆరు నిమిషాల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. -
బిగ్ స్క్రీన్, డ్యుయల్ రియర్ కెమెరా, బడ్జెట్ ధర
బీజింగ్: హువాయి తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. హానర్ సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను హానర్ 7సీ పేరుతో ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా లాంచ్ చేసింది. చైనామార్కెట్లో మార్చి 13నుంచి విక్రయానికి లభ్యం. అయితే గ్లోబల్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉండేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు వేరియట్లలో ఇది లాంచ్ కాగా 3జీబీ/32 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.9000 గాను, 4జీబీ/64జీబీవేరియంట్ సుమారు ధర రూ. 13,400 గా ఉండనుంది. హానర్ 7సీ ఫీచర్లు 5.99 అంగుళాల డిస్ప్లే 18.9 యాస్పెక్ట్ రేషియో 1.8 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే సదుపాయం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
తరాలు కొనసాగే సంపద
ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు. ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఊరి మర్రిచెట్టు కింద కూర్చుని, వచ్చిపోయేవారికి తన బోధనలు చేస్తున్నాడు. సాధువుల పట్ల గౌరవం ఉన్న ఒకాయన ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు దానికి ఎంతో సంతోషించాడు. ఇంట్లోంచి సెలవు తీసుకునేముందు ఏమైనా కోరుకొమ్మని గృహస్థును అడిగాడు. దానికా గృహస్థు, తరతరాలకు కొనసాగే అసలైన సంపద ఏదైనా ఉంటే అది ప్రసాదించమని అడిగాడు. సాధువు చిరునవ్వి, ‘తండ్రి మరణిస్తాడు, కొడుకు మరణిస్తాడు, మనవడు మరణిస్తాడు’ అని పలికాడు. దాంతో ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు. ‘నాయనా, నా మాటల్లో పరిహాసం ఏమీలేదు. నీవుండగానే నీ కుమారుడు మరణిస్తే నీకు మిగిలేది శోకమే. నీవూ, నీ కుమారుడూ ఉండగానే నీ మనవడు మరణిస్తే మీ ఇద్దరికీ కలిగేది అమితమైన దుఃఖమే. అలా కాకుండా, ముందు నువ్వు వెళ్లిపోయి, తర్వాత నీ కుమారుడు, అటుపై నీ మనవడు నిష్క్రమిస్తే... అది ఒక సహజ క్రమం. మీ తరతరాల్లోనూ ఇలాగే జరిగితే ఇంతకంటే సంపద ఏముంటుంది?’ అని వివరించాడు సాధువు. అందులోని ఆంతర్యం అర్థమైన ఆ గృహస్థు వినమ్రంగా సాధువుకు నమస్కరించాడు. -
తెలుసుకో మిస్టర్!
భార్యకు గౌరవం... భర్త ఇవ్వక్కర్లేదు ఒకరు ఇవ్వాలనుకుని ఇస్తే వచ్చేది కాదు గౌరవం గౌరవం మనసులో ఉంటే అది మాటలో వినిపిస్తుంది ఎక్కడైతే గౌరవం ఉండదో...అక్కడ ప్రేమ లేమి ఉన్నట్లే మరి భార్యను గౌరవించకపోతే... ఆ భార్య ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? విడిపోకుండా ఉండడానికి... మార్గం ఏదన్నా ఉందా? ఉంది! ‘‘ఏంటీ! పంటి నొప్పా. రోజూ ఏదో ఒక న్యూసెన్స్’’ విసుక్కుంటూ, భార్య మీద ధుమధుమలాడుతూ హాస్పిటల్‌కి వెళ్లి పోయాడు డాక్టర్ రాజేశ్. భార్య పడుతున్న బాధకు భర్తగా హృదయంతో స్పందించలేదు, పోనీ ఒక డాక్టర్‌గా కూడా రెస్పాండ్ కాలేదతడు. మౌనంగా బాధను అదిమి పెట్టింది స్వప్న పంటిబాధతోపాటు మనసు బాధను కూడా. ఇలాంటి మనిషి కోసమా డాక్టర్‌గా తన కెరీర్‌ను వదులుకున్నది. రాజేశ్ పీజీ చేస్తానంటే తాను ఉద్యోగం చేస్తూ అతడిని చదివించింది. ఆ సంగతులేవీ గుర్తులేవు కాబోలు. పిల్లల కోసం తాను కెరీర్‌కి దూరమైంది. ఇవేవీ అతడికి పట్టడమే లేదు. రాజేశ్ వెళ్లి పోయిన తర్వాత మెల్లగా లేచి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది స్వప్న. పిల్లలకు స్కూలు వదిలేలోపు పన్ను తీయించుకుని, వాళ్లను స్కూలు నుంచి ఇంటికి తీసుకురావాలి. అందుకే ఆమె భోజనం కూడా చేయకుండా కదిలింది. ‘రూట్ కెనాల్ చేయాలి’ అన్నాడు పంటిని పరీక్షించిన డెంటిస్ట్. ‘పన్ను తీసేయండి’ అన్నది స్వప్న నిర్లిప్తంగా. డెంటిస్ట్ తలెత్తి ఆమెను చూశాడు, తాను విన్నది నిజమేనా అన్నట్లు. మెల్లగా ‘పన్ను తీయాల్సిన అవసరం లేదు’ రూట్‌కెనాల్ చేసి క్యాప్ వేసి పంటిని కాపాడుకోవచ్చు’ వివరించాడు. ‘పన్ను తీసేయండి డాక్టర్’ అన్నది స్వప్న. మరో మాటకు తావులేదన్నట్లు. ‘మీరు చెప్పిన ట్రీట్మెంట్కి కావలసినంత డబ్బు నా భర్త ఇవ్వడు’ అని చెప్పలేక. ‘నేనూ డాక్టర్నే, నాకూ తెలుసు’ అని చెప్పుకోలేక. కుటుంబం కోసం చేజేతులా తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌ని జారవిడుచుకుంది. ఆ త్యాగమే ఇప్పుడు తనను చూసి నవ్వుతోంది. ‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పన్ను ఠాప్ మని విరిగిన శబ్దం. తీసిన పంటిని ట్రేలో పెట్టి, ఖాళీలో దూదిని నింపి దవడను పైకి అదుముతూ ‘అదిమి పట్టుకో’మని చెప్పాడు డాక్టర్. ‘‘పిల్లలిద్దరూ చిన్నవాళ్లు, ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టడం, ఉద్యోగంలో చేరడం రెండూ కష్టమే. ఆలోచించుకో’’ స్వప్నకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆమె తల్లి. ‘‘నా అవసరాలను మానుకున్నాను, పిల్లల అవసరాలు తప్పవు కదా. అతడు చికాగ్గా విదిలించే డబ్బుతో ఎన్నాళ్లని’’ నిలదీసినట్లే ఉంది స్వప్న మాట. ‘‘ఆ ప్రాక్టీసో, ఉద్యోగమో ఏదైనా నీ భర్తతో కలిసి ఉంటూనే చేసుకోవచ్చుగా’’ ప్రత్యామ్నాయం ఆలోచించు అన్నట్లుగా ఉందామె మాటలో అర్థింపు. ‘‘ఆయనకు అమర్చి పెట్టి, పిల్లల పనులు చూసి, వాళ్లను స్కూల్లో దించి, స్కూలు నుంచి తీసుకువచ్చి... కెరీర్లో కొనసాగడం అయ్యే పని కాదమ్మా. అన్నీ అయ్యాక నాకు ఉద్యోగానికి మిగిలేది మూడు గంటలే’’ పుల్ల విరుపుగానే ఉన్నాయి స్వప్న మాటలు. స్వప్న విసిగిపోయి ఉందని అర్థమవుతోంది. కన్నీళ్ల కాపురాన్ని కూతురు వద్దనుకున్నంత సులువుగా తల్లి అనుకోలేదు, చక్కదిద్దాలని చూస్తుంది. ‘‘స్వప్నా! నేనూ హైదరాబాద్‌కి వస్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది. ‘‘బాబూ రాజేశ్! స్వప్నకి ఒంట్లో బాగోలేదు. పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వు హాస్పిటల్‌కి వెళ్తూ స్కూల్లో దింపి వెళ్లాలి’’ అన్నది అత్తగారు. ‘‘అలాగే అత్తయ్యగారూ’’ అన్నాడు చికాకును అణుచుకుంటూ.ఇద్దరు పిల్లలు, రెండు స్కూలు బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్‌ల బాస్కెట్లు రెండు. ‘‘నాకేమైనా ఆరు చేతులున్నాయా’’ నోటి దాకా వచ్చింది రాజేశ్‌కి. ఎదురుగా ఉన్నది స్వప్న కాదు అత్తగారు. స్కూల్ బ్యాగ్‌లు బైక్ హ్యాండిల్‌కి తగిలించాడు. అత్తగారు పిల్లల్ని ముందు ఒకరిని వెనుక ఒకరిని కూర్చోబెట్టింది. ఇక లంచ్ బాస్కెట్లు ఎలా? రాజేశ్ కళ్లలో అసహనం కనిపిస్తోంది కానీ అదేమీ పట్టనట్లు అల్లుడి చేతికి అందించిందామె. ‘‘హే... నాన్న బైక్‌లో తీసుకెళ్తున్నాడు’’ కేరింతలతో పిల్లలు ముఖాలు వెలిగిపోతున్నాయి. ‘‘స్కూలు వదిలే టైమ్‌కి మీరు వెళ్తారు కదా’’ బలవంతంగా వినయాన్ని పలికించాడు గొంతులో. ‘‘నాకు మోకాళ్ల నొప్పులు. పైగా ఇంత బరువుతో అడుగు వేయలేను. స్వప్నకు ఓపిక వస్తే వెళ్తుంది. అమ్మాయి లేవలేకపోతే మీకు ఫోన్ చేస్తాను’’ అందామె. ఆమె మాటల్లో అర్థం సహేతుకంగా ఉన్నప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ‘నీ చావు నువ్వే చావు’ అన్నట్లుగా అర్థమవుతోంది రాజేశ్‌కి. బైక్ కదిలించాడు. ‘‘నాన్నా! అమ్మకు స్కూటీ కొనివ్వు నాన్నా! మమ్మల్ని రోజూ ఇలాగే స్కూల్‌కి తీసుకెళ్తుంది’’ అడిగింది వెనుక నుంచి రాజేశ్‌ని చుట్టుకుని కూర్చున్న పాపాయి. ‘‘అమ్మ స్కూటీ అడిగితే నువ్వు కొననన్నావు కదా’’ రాజేశ్‌కి ముందు కూర్చున్న కొడుకు మాటల్లో ‘నువ్వింతే’ అనే ఆరోపణ ధ్వనిస్తోంది. ‘స్వప్న వీటన్నింటినీ ఎలా పట్టుకునేది’ ఆలోచన మెదిలిందే తడవుగా పాపాయిని అడిగాడు. ‘‘అమ్మ ఈ బ్యాగ్‌లను వీపుకు తగిలించుకుని, ఒక చేతిలో బాస్కెట్లను పట్టుకుని మరో చేత్తో తమ్ముడిని పట్టుకుంటుంది. చేయి వదిలితే వాడు రోడ్డు మీదకు పరుగెత్తుతాడు. నేను అమ్మ పక్కనే నడుస్తాను’’ పాపాయి చెప్తుంటే రాజేశ్‌కి గుండె మెలిపెట్టినట్లయింది. ‘‘మన కాలనీలో ఉన్న పాలీక్లినిక్‌లో జాయిన్ అవుతున్నాను. మా అమ్మ వచ్చి మూడు వారాలైంది. ఊరికి వెళ్తానంటోంది’’ అన్నది స్వప్న కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెడుతున్న రాజేశ్‌తో.స్వప్న క్లినిక్‌లో చేరడానికి, అత్తగారు ఊరికి వెళ్లిపోవడానికి మధ్య లింక్ ఎక్కడో ఏమీ తెలియలేదతడికి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.‘‘నిన్ననే అత్తయ్యకు చెప్పాను. రోజంతా ఇంట్లో ఉండి పిల్లల పనులు, వంట చేసి పెట్టడానికి మనిషిని చూసి పంపించమని’’ అని స్వప్న చెబుతుండగానే రాజేశ్‌కి పై మొదటి రెండు స్టేట్మెంట్ల లింక్ దొరికింది.‘‘జీతం ఎంత’’ రాజేశ్ జీతమొక్కటే అడిగాడు కానీ ఊరి నుంచి వచ్చినామెకి గది ఇవ్వాలంటే పెద్ద ఇంటికి మారాలి. ఆమెకి మూడు సార్లు భోజనం ఆ పైన జీతం... అంకెలు వేలల్లో తిరుగుతున్నాయి.‘‘పది వేలు ఇవ్వందే రారు. ఊరిని వదిలి రావాలి కదా. అత్తయ్యకు వీలు కాకపోతే మా ఊరి నుంచి పంపించమని అమ్మకు చెబుతాను’’ రాజేశ్‌కి మరో మాటకు చోటివ్వకుండా లోపలికి వెళ్లిపోయింది. ‘‘స్వప్నకు కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చిన మాట నిజమే. మరో రెండేళ్లు టైమివ్వండి. పిల్లలు కొంచెం పెద్దవుతారు’’ స్వప్న పిల్లలను స్కూలుకి తీసుకెళ్లిన గ్యాప్ చూసి అత్తగారిని అడిగాడు రాజేశ్. ‘‘వంద, రెండొందలకు చేయి చాస్తూ బతకడం తనకూ కష్టమే. ఇంత చదివించి మా అమ్మాయి డాక్టర్ అని గర్వంగా చెప్పుకున్న, మాక్కూడా అమ్మాయి ఇలా చేయి చాచాల్సి రావడం కష్టంగానే ఉంటుంది. రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కి చేతిలో డబ్బులేక పన్ను పీకించుకుందని వాళ్ల నాన్నకు తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది’’ ఆమె మెల్లగానే అంటున్నప్పటికీ సూటిగానే తగులుతున్నాయి రాజేశ్‌కి.పిల్లల్ని స్కూల్లో వదిలి ఇంటికొచ్చిన స్వప్న... రాజేశ్ హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఉండడంతో విచిత్రంగా చూసి గదిలోకి వెళ్లిపోయింది.స్వప్నతోపాటు గదిలోకి వెళ్లి ‘సారీ స్వప్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ. హాస్పిటల్‌కి వెళ్తున్నాను. ఈవెనింగ్ మాట్లాడుతాను’ అని అంతే వేగంగా ఇంట్లో నుంచి బయట పడ్డాడు.‘‘ఏమైంది’’ హాల్లోకి వచ్చి తల్లిని అడిగింది.‘‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ అని నువ్వన్నప్పుడు నేనేమన్నాను?’’ కూతుర్ని ప్రశ్నించింది.‘‘ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నావు’’ ‘‘ఇప్పుడు జరిగింది అదే’’ అని వంటగదిలోకి వెళ్లింది స్వప్న తల్లి. కష్టమేంటో తెలిసేలా చేస్తే... గౌరవం లేని చోట చూరుపట్టుకుని వేళ్లాడ్డం ఎవరికైనా కష్టమే. ఈ డాక్టర్ల విషయంలో భర్త బయట ప్రెషర్స్‌తో సున్నితత్వాన్ని కోల్పోయాడు, భార్య ఇంట్రావర్ట్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడవుతుందని విడాకులు తీసుకుని పిల్లలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం... ‘తాము పడుతున్న ఆవేదన, కష్టం ఎదుటి వారికి ఆచరణలో తెలిసేలా చేయడమే’. స్వప్న విషయంలో ఆమె తల్లి ఆ పని చేసింది. భార్యాభర్తలిద్దరితో విడి విడిగా మాట్లాడడం వల్ల మనసులో గూడు కట్టుకున్న ఆవేదన బయటకు వస్తుంది. భర్త కోసం భార్య పడిన శ్రమ, భార్య కోసం భర్త చేసుకున్న సర్దుబాట్లు తెలిశాక... ఇద్దరూ ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచిస్తారు. ఈ సూత్రం... కరడు గట్టిన వాళ్లకు పని చేయదు, కానీ చాలా మందిలో గ్యాప్‌ను పూరిస్తుంది. స్వప్న మళ్లీ కెరీర్ ప్రారంభించే వరకు ఆమె అకౌంట్లో నెలనెలా డబ్బు వేశాడు రాజేశ్. అంతకంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య గ్యాప్ తొలగిపోయింది. పదేళ్లు ఉనికి కోసం పోరాడిన స్వప్న ఇప్పుడు తన ప్రయారిటీస్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. – చెరువు వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ – మంజీర -
హానర్ 7ఎక్స్ రెడ్ వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: హువాయి బ్రాండ్ బడ్జెట్ ఫోన్‌కు చెందిన కొత్త వెర్షన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. హానర్ 7ఎక్స్ రెడ్ వేరియంట్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను 12,999 రూపాయలుగా ప్రకటించింది. ఎప్పటినుంచి లభ్యం అనేది స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. హానర్ 6ఎక్స్ డివైస్‌కి సక్సెసర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది డిసెంబర్లో తీసుకొచ్చింది. మెరుగుపర్చిన డిజైన్, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో దీన్ని లాంచ్ చేసింది. 32జీబీ వేరియంట్ ధర రూ.12,999గాను 64జీబీ వేరియంట్ ధరను రూ.15,999 గానూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. హానర్ 7ఎక్స్ రెడ్ ఫీచర్లు 5.93ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 4జీబీ ర్యామ్ 32 జీబీ/64జీబీ స్టోరేజ్ 16ఎంపీ+2 ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
టాప్ ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలుసా..?
న్యూఢిల్లీ: చైనాలో 2017 సంవత్సరానికి గానూ ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండుగా హువాయి హానర్ నిలించింది. దాదాపు 55 మిలియన్ పరికరాలను(మొబైల్స్, టాబ్లెట్స్) విక్రయించి, 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిందని మార్కెట్ పరిశోధన సంస్థ సినో-మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. అమ్మకాల ఆదాయంలో పోటీదారు షావోమిని హానర్ అధిగమించింది. కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో విడుదలైన హానర్ వ్యూ10 మొబైల్ సంచలనమే సృష్టించింది. విడుదలైన ఒక్క నవంబర్ నెలలో 400-650 డాలర్ల ధరల శ్రేణిలో 10 శాతానికి పైగా వాటాని చేజిక్కించుకుంది. అలాగే హానర్ ఎక్స్ సిరీస్‌లోని హానర్ 4ఎక్స్, హానర్ 7ఎక్స్ మొబైళ్లు కూడా మంచి అమ్మకాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ మొబైళ్లు అమ్ముడు పోయాయి. గత సంవత్సరం నవంబర్ 11న చైనాలో సింగిల్ డే సేల్స్‌లో భాగంగా 160-320 డాలర్ల ధరల శ్రేణిలో హానర్ 7ఎక్స్ టాప్‌లో నిలిచింది. ఇండియాలో కూడా 20 వేల యూనిట్ల అమ్మకాలు ఒక్క గంటలో నమోదయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. క్వాడ్-లెన్స్ సిస్టమ్‌తో హవాయి సంస్థ ఈ నెల ఆరంభంలో హానర్ 9 లైట్‌ని ఇండియాలో విడుదల చేసిన సంగతి తెల్సిందే. -
సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి సన్మానం
కాశీబుగ్గ : ఆల్ ఇండియా సివిల్స్ ప్రథమ ర్యాంకర్, కేరళకు చెందిన నందినికి పలాసలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలి టీ పరిధిలో పారసాంబ గ్రామానికి యువ ఐఏఎస్‌లు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం గ్రామంలో బస చేసిన ఆమెకు స్థానికులు, పట్టణ వాసులు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన 19మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పశ్చిమబెంగాల్ నుంచి విశాఖ నేవల్ డాక్‌యార్డుకు చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యం లో పలాస వచ్చారు. ఐఏఎస్ శిక్షణలో భాగంగా భారత దర్శిని పేరుతో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ బృందాన్ని సివిల్స్ 3వర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ ఆ హ్వానించడంతో ఆయన ఇంటికి చేరుకుని బస చేశారు. ఆరుబయట నేలపై కూర్చుని భోజన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మిగిలిన ఐఏ ఎస్ అధికారులు, టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు కెమెరాల హానర్ 9 లైట్..
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ కొత్త మొబైల్‌ను లాంచ చేసింది. ఆర్టీఫిషీయల్ ఇంటిలిజెన్స్ వ్యూస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను అందించిన వెంటనే కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన వాటి ధరలు ఇలా ఉన్నాయి. 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా, 64జీబీ వేరియంట్ రూ.14,999 గా నిర్ణయించింది. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా ఇది విక్రయానికి లభిస్తుంది. గ్రే, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఇది లభ్యం. కాంపాక్ట్ బాడీ, డ్యుయల్ కెమెరా 0.25 సెకన్లలో అన్‌లాక్ అయ్యే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత రియల్-టైమ్ సెన్స్ఆబ్జెక్ట్ రికగ్నిషన్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ ప్రకటించింది. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల ఫుల్ హెచ్డీ బెజెల్ లెస్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 కిరిన్ 695 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3 జీబీ/4జీబీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ కెమెరా 13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 256 జీబీ దాకా విస్తరించుకునే సౌలభ్యం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 9 Lite With Launched in India -
ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు
న్యూఢిల్లీ : హువావే బ్రాండ్ హానర్, న్యూఢిల్లీ వేదికగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను నేడు(బుధవారం) లాంచ్ చేసింది. క్వాడ్-కెమెరాతో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హానర్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే జనవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది. ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు మాత్రమే కాక, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆధారిత లేటెస్ట్ ఈఎంయూఐ 8.0తో రన్ కావడం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. హానర్ 9 లైట్ ధర, లాంచ్ ఆఫర్లు 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర 14,999 రూపాయలు. ఈ రెండు వేరియంట్లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో, హానర్ ఇండియా స్టోర్‌లో ఫ్లాష్ సేల్ ద్వారా లభ్యం కానున్నాయి. తొలి ఫ్లాష్ సేల్ జనవరి 21 అర్థరాత్రి 12 గంటలకు, రెండో ఫ్లాష్ సేల్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. ఆ సేల్స్ అనంతరం మరో రెండు సేల్స్ జనవరి 22, 23 తేదీల్లో మధ్యాహ్నం జరుగనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద 10 శాతం హానర్ ఆఫర్ చేయనుంది. హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్లు... డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 5.65 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టాకోర్ హువావే హాయ్సిలికాన్ కిరిన్ 659 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 256జీబీ వరకు విస్తరణ మెమరీ మొత్తం నాలుగు కెమెరాల ముందు, వెనుక 13 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ వి 10 లాంచ్..ధర, ఫీచర్లు
హానర్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ వి(వ్యూ) 10పేరుతోమ దీన్ని గురువారం విడుదల చేసింది. అమెజాన్ ఇండియాద్వారా జనవరి 8నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి వినియోగదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈరోజునుంచి ప్రారంభించింది. దీని ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. భారత్ మార్కెట్లో కంపెనీ నిబద్ధతను అనుసరిస్తూ, గ్లోబల్ వేరియంట్ కన్నా తక్కువ ధరకే అందిస్తున్నామని హానర్ ఇండియా-కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పి సంజీవ్ చెప్పారు. హానర్ వి 10 ఫీచర్లు 5.99-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే(18: 9 రేషియో) 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 16 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సా, 20 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ f / 1.8 ఎపర్చరు 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
శభాష్.. సుంకన్న
హైదరాబాద్, సనత్‌నగర్: అసలే మంగళవారం...బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఉన్నాయి. దేవాలయ సమీపంలోని భక్తుల విడిది కేంద్రంలో గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు పది అడుగుల మేర మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా అక్కడి వారంతా భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. సిలిండర్ పేలితే పరిస్థితి ఏమిటోనని బతుకుజీవుడా? అంటూ బయటకు లంఘించారు. అయితే అక్కడ చెత్తను ఎత్తే వ్యక్తి ధైర్యం చేసి సిలిండర్ నుంచి వస్తున్న మంటలపై మందమైన బట్టను వేసి అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ లోగా ఫైర్‌ఇంజన్, పోలీసు లు అక్కడికి చేరుకుని పూర్తిగా మంటలను ఆర్పివేశారు. మంటల ఉధృతికి ఒకవేళ సిలిండర్ పేలితే పరిస్థితి ఊ హించని విధంగా ఉండేది. హస్తినాపురం ప్రాంతానికి చెందిన బ్రాహ్మచారి మంగళవారం ఎల్లమ్మతల్లికి మొక్కు తీర్చు కునేందుకు ఆలయానికి వచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి దేవాలయం వెనుక వైపు ఉన్న ప్రైవేటు విడిది గదిని అద్దెకు తీసుకున్నాడు. వంటలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. అక్కడే చెత్తను తొలగించే పెద్ద సుంకన్న సిలిండర్ నుంచి వస్తున్న మంటలను గమనించి కార్పెట్‌ను తడిపి సిలిండర్‌పై వేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సిలిండర్‌ను మంటలను ఆర్పిన సుంకన్నను ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్, ఎస్ఐ నవీన్‌లు నగదు ప్రోత్సాహంతో సత్కరించారు. -
హానర్ 7ఎక్స్ వచ్చేసింది..హైలైట్ ఏంటి?
హువావే బ్రాండ్‌లో హానర్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 7 ఎక్స్ పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్ప్లే , డ్యూయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. స్టోరేజ్ పరంగా రెండు వేరియంట్లలో ఇది లభ్యంకానుంది. 32జీబీ వేరియంట్ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్ ధరను రూ. 15,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్‌లో డిసెంబర్ 7వ తేదీ మధ్నాహ్నం 12గంటలకు కొనుగోలుకు లభ్యం. హానర్ 7ఎక్స్ ఫీచర్లు 5.93 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ -
త్వరలో ‘తల్లి పాదాలకు వందనం’ : చంద్రబాబు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): త్వరలో ‘తల్లి పాదా లకు వందనం’ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లులను పాఠశాలకు పిలిపించి వారి పిల్లలతో పాదాభివందనం చేయించి, తల్లిని, మహిళలను గౌరవించడం నేర్పిస్తామని వివరించారు. సోమవారం సాయంత్రం విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ‘అమరావతి డిక్లరేషన్’ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించి, సాధ్యమైనన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, బి.అఖిలప్రియ, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ మహిళలను పూజించిన ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతీ బట్టాచార్య, వడయార్ క్యాన్సర్ ఇనిస్సిట్యూట్ డైరెక్టర్ వి.శాంత, పద్మావతి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ దుర్గాభవాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పి.అనురాధ, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సభా ప్రాంగణంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఘంట శాల పవన్‌కుమార్ తన శిష్య బృందంతో ‘జగతికి మగువే జనని’ పాటకు చేసిన నృత్యాలు అలరిం చాయి. చెట్టు గొప్పదనం నుంచి చిన్నారి నూతలపాటి శ్రీవైష్ణణి పాడిన పాట ఆలోజింపచేసింది. సప్ప శివకుమార్ శిష్యబృందం అన్నమయ్య కీర్తనలకు నృత్యంచేశారు. కార్యక్రమం మధ్యాహ్నం 3 గంట లకు అంటూ విద్యార్థులను తరలించి ఏడు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో ఐదు గంటలకే వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వచ్చాక కూడా స్వాగత నృత్యాలతో గంట సేపు గడిపారు. ముఖ్యమంత్రి ప్రసంగించే సమయానికి బిషఫ్ హజరయ్య స్కూల్ నుంచి విద్యార్థులను రప్పించారు. వెనుక ఉన్న కూర్చిలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సీఎం రాక సందర్భంగా టిక్కిల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో వాహన చోదకులు అవస్తలు పడ్డారు. -
గుండెల్లో గోదారి
మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం పసలపూడి గ్రామంలో కొన్ని నెలల పాటు ఉండి.. సిరిసిరిమువ్వ సినిమాను కళాత్మకంగా తీసేందుకు దర్శకుడు కె.విశ్వనాథ్ పడిన తపనను.. ఆయన మహోన్నతికి వెన్నంటి ఉండి సహకరించిన జిల్లావాసులపై.. వల్లమాలిన అభిమానాన్ని విశ్వనాథ్ ఉద్వేగంతో చెప్పేసరికి.. ఆహూతులు పులకరించిపోయారు. మాటలకు అందని ఆనందం అందరిలో కలిగింది. మండపేటలో జరిగిన సత్కార సభలో కృతజ్ఞతాపూర్వకంగా.. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, సినీ దర్శకుడు జంధ్యాలతో ఆత్మీయతను నెమరువేసుకున్నారు. అందుకేనేమో.. నడవలేని స్థితిలో ఉన్నా సరే.. గోదావరి గడ్డపై నిర్వహించే కార్యక్రమానికి ఓపిక చేసుకుని కళాతపస్వి విశ్వనాథ్ వచ్చారు. మండపేట: జిల్లాతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, పద్మశ్రీ, కె.విశ్వనాథ్ అన్నారు. జంధ్యాల లేని ఈ సభ.. ఆలయం లేని ధ్వజస్తంభాన్ని తలపిస్తోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం ఆదివారం ఘనంగా సత్కరించిం ది. స్థానిక సీతారామ కమ్యూనిటీ హాలు వద్ద నిర్వహిం చిన కార్యక్రమానికి విశ్వనాథ్, ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని కళాతపస్వి నెమరువేసుకున్నారు. సిరిసిరిమువ్వ చిత్రం షూటింగ్ పసలపూడిలో తీస్తున్నప్పుడు జంధ్యాలతో కలిసి ఈ ప్రాంతమంతా పర్యటించానని, జంధ్యాల అత్తవారి గ్రామం నర్సిపూడి వెళ్లేవారమని చెప్పారు. జంధ్యాలతో అనుబంధాన్ని, జంధ్యాల మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పసలపూడికి చెందిన సినీ నిర్మాత కర్రి రామారెడ్డి, భాస్కరరెడ్డి తదితరులతో ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందరం కలిసి విందు భోజనాలు చేసేవారమన్నారు. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని, నడవలేకున్నా తనను పట్టుబట్టి తీసుకువచ్చి, జీవితంలో ఓ మధుర జ్ఞాపకాన్ని నింపారంటూ బ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు విశ్వనాథ్‌కు ఘన సత్కారం బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు పిడపర్తి భీమశంకరశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, సంఘ నాయకులు అవసరాల వీర్రాజు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. మండపేటలోని ఐఎస్డీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యినపకోళ్ల సత్యనారాయణ (ఐఎస్ఎన్), ఆలిండియా ఆర్యవైశ్య మహాసభ జాతీయ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు తదితరులు కూడా ఆయనను సత్కరించారు. అనంతరం జంధ్యాల సతీమణి అన్నపూర్ణను ఘనంగా సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి మండపేట వచ్చిన విశ్వనాథ్‌కు మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం సీతారామ మందిరంలో జరిగిన బ్రాహ్మణ కార్తిక వన సమారాధనలో విశ్వనాథ్ పాల్గొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్, సంఘ నాయకులు పేరి కామేశ్వరరావు, రాణి శ్రీనివాసశర్మ, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, కందర్ప హనుమాన్, కళ్లేపల్లి ఫణికుమార్, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. -
హానర్ 9ఐ: నాలుగు కెమెరాలతో
సాక్షి, ముంబై: ఇప్పటి దాకా డబుల్సిమ్, డబుల్ కెమెరా ,డబుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ల హవా నడిచింది. ఇక రెండు కెమెరాలు కాదు.. నాలుగుకెమెరాలు అంటోంది ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ హువాయి. ఈ తరహా ఆప్షన్‌తో ఆకర్షణీయమైన సరికొత్త స్టార్మ్ఫోన్ను లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన నాలుగు కెమెరాల ఫీచర్‌తో హానర్ 9ఐ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. మేకర్. మధ్య ఒప్పో, వివో , అసుస్ లాంటి కంపెనీలు సెల్ఫీ స్పెషల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే.. ఇపుడు ఏకంగా నాలుగుకెమెరాలతో వాటికి సవాల్ విసురుతోంది హువాయి. 16 ఎంపీ , 2 ఎంపీ రియర్ కెమెరాలను ఈ డివైస్‌లో అమర్చింది. ఇకసెల్ఫీ కెమెరానికి విషయానికి 13ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 2 ఎంపీ సామర్ధ్యంతో మరో ఫ్రంట్ కెమెరాను అదనపు ఫీచర్‌గా జోడించింది. మెటల్ బాడీ డిజైన్, బెజెల్ లెస్ డిస్ప్లే తో రూపొందించిన ఈస్మార్ట్‌ఫోన్ ధరను రూ.17,999గా నిర్ణయించింది. మూడురంగుల్లో ఇది మార్కెట్లో లభిస్తోంది. హానర్ 9ఐ ఫీచర్స్ 5.9 డిస్ప్లే 2160 x 1080 పిక్సెల్స్‌రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 3340 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ కొత్త ఫోన్ : టార్గెట్ వారే
హువాయ్‌కి చెందిన టెర్మినల్ బ్రాండు హానర్ గురువారం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హానర్ హోలీ 4 ప్లస్ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌లో లాంచ్ చేసిన హానర్ హోలీ 4కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ ఫోన్ ధర 13,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని హానర్ పార్టనర్ స్టోర్లలో ఇది విక్రయానికి రానుంది. యంగ్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని ఇది మార్కెట్లోకి వచ్చింది. హానర్ హోలీ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... మెటల్ బాడీ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్ 32జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటు -
క్రికెటర్ మిథాలీరాజ్‌కు సత్కారం
విజయవాడ స్పోర్ట్స్ :భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ అరుణ్‌కుమార్ జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. ప్రతి ఏడాది ఏదైనా అంతర్జాతీయ టూర్‌కి వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ఏసీఏ కోచ్ జె.కృష్ణారావు వద్ద శిక్షణ తీసుకోవడం ఆనవాయితీ. వరల్డ్ కప్ పోటీలకు వెళ్లే ముందు కూడా మిథాలీరాజ్ మంగళగిరి ఏసీఏ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. కాగా, త్వరలో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి మంగళగిరిలో మిథాలీరాజ్ శిక్షణ తీసుకున్నారు. అయితే, మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చివరి రోజున మాత్రం జ్ఞాపిక ఇస్తున్నట్లు ఫొటోతో ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. జ్ఞాపిక ఇస్తున్న కార్యక్రమంలో ఏసీఏ ప్రధాన కార్యదర్శితో పాటు మీడియా మేనేజర్ సీఆర్ మోహన్, మిథాలీరాజ్ తండ్రి దొరై రాజ్ పాల్గొన్నారు. -
మనసు విప్పి మాట్లాడేందుకు వచ్చా.
గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి కామినేనికి సన్మానం గుంటూరుమెడికల్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు ఆదివారం రాత్రి గుంటూరు వైద్య కళాశాలలో ఘన సన్మానం జరిగింది. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని మాట్లాడుతూ తాను సన్మానం కోసం రాలేదని, వైద్యులతో మనస్సు విప్పి మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు. వైద్య వ్యవస్థ ఉంది రోగి కోసమేనని, రోగికి నమ్మకం కల్పించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యులు సమాజానికి, వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. మనం నిజాయితీగా ఉండి ఏది చెప్పినా సిబ్బంది వింటారన్నారు. ప్రభుత్వ వైద్యులు సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకోవటాన్ని తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ యూనివర్శిటీలో పరిశోధనలు జరగాలని, అందుకోసం వైజాగ్ విమ్స్‌ను యూనివర్శిటికి అనుబంధం చేస్తున్నామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరలోనే బస్సులను కొనుగోలు చేసి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ బాబ్జి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావు, ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు, వైద్యుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డీఎస్ఎస్ శ్రీనివాసప్రసాద్, కన్వీనర్ డాక్టర్ జయధీర్‌బాబు, హంస సంఘం అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ లక్ష్మీపతి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నర్సుల సమస్యలు పరిష్కరించాలి... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు వేతనాలు పెంచాలని, నిబంధనల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కామినేనికి నర్సుల సంఘం నేతలు అందజేశారు. నర్సుల సమస్యలపై చర్చించేందకు 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలు విజయ, జిల్లా అధ్యక్షురాలు తిరుపతమ్మ, సెక్రటరీ ఆశాలత తదితరులు ఉన్నారు. -
నేడు వెంకయ్యకు పౌరసన్మానం
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. అనంతరం దిల్కుషా అతిథి గృహం ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. -
శ్రీకాంత్ బుల్లెట్లా దూసుకొచ్చాడు
♦ క్రీడల్లో రాణిస్తే ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్ ఉంటుంది ♦ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ అభినందన సభలో సీఎం చంద్రబాబు ♦ క్రీడలను కెరీర్‌గా మలుచుకోండి సీఎం చంద్రబాబు నాయుడు ♦ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం విజయవాడ స్పోర్ట్స్: క్రీడల్లో ఆడడాన్ని గర్వకారణంగా భావించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు అన్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిల్ విజేత కిదాంబి శ్రీకాంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. రాష్ట్ర ప్రతిష్టతను చాటిన శ్రీకాంత్ అందరికీ స్ఫూర్తి కావాలని చెప్పారు. ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం తనకెంతో నచ్చిందన్నారు. బులెట్లా దూసుకొచ్చాడని పేర్కొన్నారు. శ్రీకాంత్ గుంటూరు వాసి కావడడం మనకెంతో గర్వకారణమన్నారు. చదువుకుంటే కేవలం ఉద్యోగంతో స్థిరపడతారని, అదే క్రీడలను కెరీర్‌గా చేసుకొని రాణిస్తే ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చని చెప్పారు. సమాజం, ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్నారు. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టతను చాటే ఏ క్రీడాకారుడికైనా నగదు నజరానాతోపాటు గ్రూపు–1 ఆఫీసర్ పోస్టు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం శ్రీకాంత్ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఆడాలనుకున్నా ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం పునరుద్ఘటించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో రాష్ట్ర, దేశ ఖ్యాతిని చాటిన శ్రీకాంత్ అమరావతి వాసి కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో తొలుత క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియం, రన్నింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఉంటాయని వెల్లడించారు. నెదర్లాండ్ దేశం రాష్ట్ర క్రీడాభివృద్థిలో భాగం పంచుకునేందుకు ముందుకొచ్చిందన్నారు. సన్మానం అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి కారణం కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉందని చెప్పారు. ఆనాడు గోపిచంద్ అకాడమీకి స్థలం ఇవ్వడం వల్లే తనలాంటి ఎంతో మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద మాట్లాడుతూ పిల్లల్ని క్రీడల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, జిల్లా అ«ధ్యక్షుడు కె.పట్టాభి, శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, క్రీడా సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమానికి మాజీ డీఎస్డీవో బీవీ ప్రసాద్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన రాకెట్‌ను సీఎం చంద్రబాబుకు శ్రీకాంత్ బహూకరించారు. అనంతరం వీరిద్దరూ వేదికపై బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. గుంటూరులో అభినందనలు గుంటూరు స్పోర్ట్స్: యువ క్రీడాకారుడు శ్రీకాంత్ భారత దేశ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పాడని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి రంగారావు అన్నారు. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌ను అయన నివాసంలో కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన దుశ్శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శ్రీకాంత్ తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుడు సంపత్ కుమార్ పాల్గొన్నారు. -
జడ్జిలకు సన్మానం
అనంతపురం మెడికల్ : నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాల్లో సోమవారం రాత్రి పలువురు జడ్జిలకు ‘స్నేహ’ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇటీవల జిల్లా జడ్జిగా ఉద్యోగ విరమణ చేసిన కిష్టప్పతో పాటు అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉంటూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన రామచంద్రుడు, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న కుమార్తె జ్యోతిలకు అభినందనలు తెలియజేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్నేహ క్లబ్ జిల్లా గవర్నర్ రామాంజనేయులు, మాజీ గవర్నర్ క్రిష్ణమూర్తి, ఎస్కేయూ ప్రొఫెసర్ బాల సుబ్రమణ్యం, ఏఆర్ ఎస్ఐ నీలకంఠప్ప మాట్లాడారు. డిప్యూటీ మేయర్ గంపన్న, స్నేహ క్లబ్ సభ్యులు బాలనరసింహులు, వన్నూరప్ప, ప్రకాశ్‌బాబు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రులను కాపాడితే సన్మానం
కర్నూలు (హాస్పిటల్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షిస్తే వారిని జిల్లా పోలీసులచే సన్మానిస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రకటించారు. మంగళవారం శాంతిభద్రతల దృష్ట్యా రహదారి భద్రతపై కమాండ్ కంట్రోల్ రూములో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ర్యాలీలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు కంటికి సంబంధించిన మెడికల్ చెకప్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులు ఆస్పత్రిని ఆశ్రయిస్తే వారిని కేసుల పరమైన విచారణలు చేయకుండా ఆస్పత్రిలో త్వరగా చేర్చుకొని చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాలను కోరారు. ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందించకపోతే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, జె.బాబుప్రసాద్, మురళీధర్, అబ్దుల్ సలాం, రంగయ్య, సీఐలు సుబ్రమణ్యం, ఆదిలక్ష్మి, ఆర్ఐలు రామకృష్ణ, జార్జ్, రంగముని, ఆర్ఎస్ఐ, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరాధించిందే తప్ప ఆరడి పెట్టలేదు..
స్త్రీకి సమున్నత స్థానమిచ్చిన భారతదేశం విశిష్ట మహిళల సత్కార సభలో ‘భారతీయం’ సత్యవాణి రాజమహేంద్రవరం కల్చరల్ : ‘భారతదేశం స్త్రీని ఆరాధించిన దేశం.. ఆరడి పెట్టిన దేశం కాదు. ఈ దేశం స్త్రీని ఏనాడూ అణగదొక్కలేదు’ అని ‘భారతీయం’ సత్యవాణి అన్నారు. వివిధ రంగాలలో విశిష్టసేవలందించిన మహిళలను లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం రివర్‌బే సమావేశమందిరంలో సత్కరించారు. ప్రధాన వక్తగా సత్యవాణి మాట్లాడుతూ త్రేతాయుగం నుంచీ స్త్రీ పక్కన ఉంటేనే పురుషునికి యజ్ఞయాగాలు చేసే అవకాశం లభిస్తోందన్నారు. బ్రహ్మ నాలుకపై సరస్వతి, విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవి, శివుని అర్ధశరీరంగా పార్వతి ఉన్నారన్నారు. పురుషుడికి ఈ దేశం ఇచ్చిన వరం ఏకపత్నీవ్రతమని, స్త్రీ చేసే వ్రతాలన్నీ కుటుంబసౌభాగ్యం కోసమేనని తెలిపారు. దైనందిన కార్యక్రమాల నిర్వహణకు మొట్టమొదట లేచేది ఆడది, అందరికన్నా చివర్న నడుం వాల్చేది కూడా ఆడదేనని అన్నారు. ‘స్త్రీని సర్దుకు పొమ్మని ఏ శాస్త్రమూ చెప్పలేదు.భారతంలో ద్రౌపది ‘ధర్మజుడు తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా’ అని ప్రశ్నించడం, తాను ఎవరో తెలియదని దుష్యంతుడు అన్నప్పుడు శకుంతల చెప్పిన ధర్మాలు, వనవాసానికి రావద్దని నచ్చచెబుతున్న రామునితో సీత మాట్లాడిన తీరు చూస్తే స్త్రీకి సర్దుకుపోవడం కాదు, ప్రశ్నించడం నాటి రివాజు అని అర్థమవుతుందన్నారు. తల్లితండ్రులు కుదిర్చిన వివాహ బంధంలో ముక్కూమొహం తెలియని వాడి చిటికెనవేలు పట్టుకుని కొత్త ఇంటిలోకి అడుగుపెట్టే స్త్రీ ఈ జాతి ఔన్నత్యానికి మచ్చుతునకన్నారు. ఎవరో పార్టీ పెట్టి మనకు 33 శాతం సీట్లు ఇస్తాననడం కాదు, మనమే పార్టీ పెట్టి 33 శాతం సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. తాగుబోతుతో జీవించే ఓర్పు స్త్రీకి ఉన్నట్టే, గయ్యాళితో జీవించే నేర్పు భర్తకు ఉంటుందని, తాను పురుషులను తక్కువ చేయడం లేదని అన్నారు. సభకు పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షత వహించారు. సరసకవి ఎస్వీ రాఘవేంద్రరావు స్త్రీ ఔన్నత్యంపై స్వీయపద్యాలను వినిపించారు. వివిధ రంగాలలో నిష్ణాతులను సత్యవాణి చేతుల మీదుగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి అధ్యక్షురాలు నేరెళ్ళ జయశ్రీ, ఘంటసాల శ్యామలాకుమారి, కలపటపు అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
సాగులో ప్రతిభకు సత్కారం
- ఇద్దరు రైతుకు రాష్ట్రస్థాయి రైతు రత్న అవార్డులు - సీఎం చేతులు మీదుగా విజయవాడలో ప్రదానం కర్నూలు(అగ్రికల్చర్)/మహానంది: జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు వ్యవసాయంలో అద్భుత ప్రతిభ కనబరిచి సీఎం చంద్రబాబునాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి రైతు రత్న అవార్డు అందుకున్నారు. ఇందులో మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రమణయ్య వరి పంట సాగు చేసి ఎకరాకు 59 బస్తాల దిగుబడి సాధించగా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్‌బాషా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1.5 ఎకరా పొలంలో సాగు చేసిన పచ్చిమిరప నుంచి రూ. 31 వేల పెట్టుబడితో ఆరు కోతల్లో రూ.1.42 లక్షల రాబడి సాధించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాల్లో వీరిద్దరిని రూ. 15వేల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంస పత్రాలతో సీఎం సత్కరించారు. -
బదిలీపై వెళ్లాలని ప్రయత్నించా.. సాధ్యం కాలేదు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై వెళ్లాలని ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు అని జిల్లా కలెక్టర్ తన మనోగతాన్ని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఇటీవల జిల్లా అధికారులకు కార్తీక వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులు కలెక్టర్‌ను సత్కరించారు. మీరు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా అధికారులందరికీ మానసిక ఆనందం కలిగేలా వనమహోత్సవాన్ని నిర్వహించినందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నామంటూ జిల్లా అధికారులు కలెక్టర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తాను నిక్కచ్చిగా ఉంటానని.. అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నదే తన తాపత్రయం అని, ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. విధి నిర్వహణలో భాగంగానే తాను ఎవరి మనసునైనా నొప్పించి ఉండవచ్చన్నారు. బదిలీపై వెళ్లాలని ప్రయత్నించినా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, సీపీఓ ఆనంద్ నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పారాలింపియన్లకు సన్మానం
నగదు బహుమతులు అందజేసిన ‘సుమధుర’ గ్రూపు హైదరాబాద్: రియో పారాలింపిక్స్ పతక విజేతలను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. బంగారు పతకాలు గెలిచిన దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హైజంప్)తో పాటు కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటి (హైజంప్)లను ‘సుమధుర’ అక్రొపొలిస్ గ్రూప్ ఘనంగా సన్మానించింది. శనివారం పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా, గౌరవ అతిథిగా ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. మంత్రి మహేందర్, వేణుగోపాలాచారి చేతుల మీదుగా విజేతలకు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. తంగవేలు కోచ్ సత్యనారాయణకు రూ. 4 లక్షలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూపు చైర్మన్ జి.మధుసూదన్, వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యాన్ని లెక్కజేయకుండా పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారంటూ అథ్లెట్లపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు. -
రేపు వడుప్సా కరస్పాండెంట్లకు సన్మానం
విద్యారణ్యపురి : వడుప్సా ఏర్పా టు 36 ఏళ్లయిన సందర్భంగా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 25న హన్మకొండలోని అలకనంద గార్డెన్ లో నిర్వహించనున్నామని వడుప్సా జిల్లా అధ్యక్షు డు బుచ్చిబాబు వెల్లడించారు. శుక్రవారం హన్మకొండలోని వడు ప్సా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడుతూ ఆదివారం టీచర్స్‌డేను కూడా జరుపుకుంటున్న సందర్భంగా ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. వడుప్సా చేపట్టిన కార్యక్రమాలు, సమస్యలపై చర్చించడంతో పాటు కార్యాచరణపై సమావేశంలో తీర్మానించనున్నట్లు పేర్కొన్నారు. వడుప్సా జిల్లా జనరల్ సెక్రటరీ దేవేందర్‌రెడ్డి, శ్రీధర్, బాధ్యులు చక్రపాణి, రామచంద్రమూర్తి, పాల్గొన్నారు. -
మండలి చీఫ్‌విప్ ‘పాతూరి’కి సన్మానం
కరీంనగర్ : శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎంపికై మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాతూరి సుధాకర్‌రెడ్డిని మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మొదటి నుంచి ప్రజల మనిషి అని, మండలిలో స్వపక్ష సభ్యుడైనప్పటికీ విపక్ష పాత్ర పోషిస్తాడని చమత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని, పదవులు వస్తే ప్రశ్నించలేమనే సందేహాలు వద్దని అన్నారు. పీఆర్సీ బకాయిల విడుదల, సర్వీస్‌రూల్స్, భాషా పండితుల అప్‌గ్రేడేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పీఆర్టీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాతూరి రాజిరెడ్డి, చోల్లేటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గోనే శ్రీనివాస్, బాలసంకుల అనంతరావు, తిరుపతిరెడ్డితో పాటు డిప్యూటీ ఈఓ కట్టా ఆనందం పాల్గొన్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డిని గజమాలలతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జూనియర్, డిగ్రీ లెక్చరర్ల సంఘం, మోడల్ స్కూల్ అసోసియేషన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సన్మానించారు. -
తెయూలో ఘనంగా గురుపూజోత్సవం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రేరణ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. తెయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సత్యనారాయణచారి, అధ్యాపకులు అంజనేయులు, కైసర్ మహ్మద్, అపర్ణ, వాణి లను విద్యార్థులు సత్కరించారు. విద్యార్థి నాయకులు సంతోష్ నాయక్, రాజు, ఉదయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు రూ. 10 లక్షల విరాళం
మాక్లూర్ : పాఠశాలల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ఇవ్వడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీఈవో లింగయ్య పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం గొట్టుముక్కుల మాజీ సర్పంచ్ బీరెల్లి రాజేశ్వర్‌రావు రూ. 10,00,501 చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాజేశ్వర్‌రావు గొట్టుముక్కుల గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ. 9 లక్షలు, రాంపూర్, మాందాపూర్, ధర్మోరా, మెట్పల్లి, గొట్టుముక్కుల, బొంకన్పల్లి ప్రాథమిక పాఠశాలలకు రూ. 1,00,501 అందించారన్నారు. దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, డిప్యూటీ ఈవో కృష్ణారావు, హెచ్ఎం రాజేశ్వర్‌గౌడ్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మండల అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. -
నూర్‌బాషా తపన అందరికీ ఆదర్శం
ఒంగోలు: - కలెక్టర్ సుజాతశర్మ డీఆర్వోగా పనిచేసి రిటైరైన నూర్‌బాషా విధి నిర్వహణలో పడిన తపన అందరికీ ఆదర్శం అని కలెక్టర్ సుజాతశర్మ అన్నారు. ఆదివారం స్థానిక రాంనగర్ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నూర్‌బాషాకు పదవీ విరమణ సన్మానసభ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ పదవీ విరమణ కార్యక్రమాన్ని జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మిత్రులు, ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజానీకం కూడా తరలి వచ్చారని, ఇందుకు ఆయన అందించిన సేవలే కారణమన్నారు. జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, జేసీ–2 ప్రకాష్కుమార్లు మాట్లాడుతూ నూర్‌బాషాను దగ్గర నుంచి తాము చూసిన దాని కన్నా ఆయన పని చేసిన ప్రాంతం నుంచి వచ్చిన జనం చెబుతున్న విషయాలు వింటుంటే ఎనలేని సంతోషం కలుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు, వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ సత్యన్నారాయణ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడుగు బాబూరావు తదితరులు మాట్లాడుతూ పేదవాడు నివసించేందుకు కనీసం జాగా అయినా చూపించాలనే ఉద్దేశంతో నూర్‌బాషా పనిచేశారన్నారు. రిటైర్డ్ డీఆర్వో మేకా రవీంద్రబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో శ్రీకాకుళంలో ఆయన ముందస్తుగా చెప్పిన సర్వే నూటికి నూరుపాళ్లు నిజమైందన్నారు. అనంతరం డీఆర్వోకు, ఆయన సతీమణికి సంయుక్తంగా ఘన సన్మానం నిర్వహించారు. సన్మానగ్రహీత, పదవీ విరమణ చేసిన నూర్‌బాషా ఖాశిం మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లా వాసిని అయినప్పటికీ ఈ జిల్లాలో తొలుత తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించానని, చివరకు ప్రకాశం జిల్లాలోనే పదవీ విరమణ చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. విధి నిర్వహణలో తనకు అండదండలగా ఉంటూ అందరికీ కృతజ్ఞతలు ప్రకటించారు. రిటైర్డ్ అదనపు జేసీ నీలకంఠం, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, జెడ్పీ సీఈవో టి.బాపిరెడ్డి, డీఎస్వో టి.వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ మురళి, రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరశింహారావు , ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య పాల్గొన్నారు. -
రాములు సేవలు చిరస్మరణీయం
కోహీర్: వీఆర్వోగా రాములు మండల ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. కోహీర్ పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశంలో ఆయనను శాలువాలు పూలమాలలతో సన్మానం చేశారు. తహశీల్దార్ బి.గీత మాట్లాడుతూ రాములు అకింతభావంతో పనిచేసి ఇతర వీఆర్వోలకు ఆదర్శవంతంగా నిలిచారని పేర్కొన్నారు. ఎంపీపీ జంపాల అనిత మాట్లాడుతూ విధుల విషయంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కోహీర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాములు ఆయన పూర్తి కాలం మండల ప్రజలకు సేవలు అందించి ఇక్కడే పదవి విరమణ పొందడం అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు ఎస్కే జావేద్, కోఆప్షన్ సభ్యులు అశ్రఫ్, మాజీ జెడ్పీటీసీలు అరవింద్‌రెడ్డి, నర్సింహులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, కోహీర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంశీర్ అలీ, సర్పంచ్‌లు అడివి రెడ్డి, రాందాస్, అంజయ్య, ఎంపీటీసీలు రాజు, సురేందర్, సీనియర్ నాయకులు బస్వరాజ్ పాటిల్, గోవర్ధన్‌రెడ్డి, సాయిలు, సురేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, రెవెన్యూ సంఘాల నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మిస్టర్ వరల్డ్‌కు ఘన సత్కారం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మిస్టర్ వరల్డ్ రోహిత్ కన్డెల్వాల్ను చిక్కడపల్లి అరోరా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఆయన ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఏసీపీ జె.నర్సయ్య, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం బులుసు, రోహిత్ అన్న రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదీ మా పనితీరు.. మీ సూచనలేంటి?
♦ సలహాలు, సూచనలు ఆహ్వానించిన సీఎం ♦ లేఖ రాసినా పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడి ♦ గవర్నర్ సూచనలతో ప్రత్యేక సభ ♦ సాక్షి కార్టూనిస్ట్ శంకర్ సహా 64 మందికి సన్మానం సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది గా వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేదిక మీదుగా ఈ మేరకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పరేడ్ మైదానంలో ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ఐసీసీలో కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ సీఎం, గవర్నర్ నరసింహన్ తదితరులు మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. ఆ తర్వాత సభ మొదలైంది. వివిధ జిల్లాల నుంచి మూడు వేల మంది ఇందులో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం చేస్తున్న పనితీరును సీఎం సభికుల ముందుంచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి ఫలితాలను వివరించారు. ఇంకేచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ కోరారు. లేఖ రాసినా తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. ఇది తనకు గవర్నర్ నరసింహన్ ఇచ్చిన సలహా అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా ఈ కార్యక్రమం తన సూచన మేరకే జరిగిందన్నారు. 64 మందికి సన్మానం.. అంతకుముందు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 64 మందికి రూ.లక్ష నూటపదహార్ల నగదు పురస్కారం, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. పాత్రికేయ విభాగంలో ‘సాక్షి’ పత్రిక కార్టూనిస్టు శంకర్‌ను సీఎం, గవర్నర్ సత్కరించారు. సన్మాన గ్రహీతలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడంతో ప్రాంగణం కళకళలాడింది. ఇటీవల లాస్వేగాస్లో జరిగిన యూఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నగర యువతి సయదా ఫలక్‌కు రూ.50 లక్షల పురస్కారం అందించి సత్కరించారు. అంతకు ముందు సాంస్కృతిక సారథి బృందం సభ్యులు నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. సభ మొదలయ్యాక సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తోపాటు ప్రభుత్వ సంగీత కళాశాల ఆచార్యులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. 64 మందికి సన్మానం తర్వాత కాస్త గందరగోళం నెలకొంది. కరాటే ఛాంపియన్ సయదా ఫలక్ను అప్పటికి వేదికపైకి ఆహ్వానించకపోవటంతో సీఎం కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను పిలిపించి దీనిపై ప్రశ్నించారు. అప్పటి వరకు సన్మాన గ్రహీతలను ఆహ్వానించిన దేశపతి శ్రీనివాస్ సభికుల్లోకి వచ్చి కూర్చోవటంతో గందరగోళం నెలకొంది. ఇదే కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చివర్లో అందరికీ అక్కడే పసందైన విందు ఏర్పాటు చేశారు. -
లక్ష్మణ్ ను అభినందించిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌ను మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సన్మానించారు. లక్ష్మణ్ నేతృత్వంలో రాష్ట్రంలో పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. శేషగిరిరావుపై కోతుల దాడి: బీజేపీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ ఎస్.వి.శేషగిరిరావుపై కోతులు దాడి చేశాయి. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఇటీవల కోతులు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నగరంలో కోతుల బెడదను అరికట్టాలని గతంలో చాలాసార్లు లేఖలు రాసినా చలనం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. -
యడ్యూరప్పకు సన్మానం
సింధనూరు టౌన్ : రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బీఎస్ యడ్యూరప్ప నియమితులైన సందర్భంగా ఆదివారం బెంగళూరులోని ఆయన నివాసంలో కొప్పళ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈసందర్భంగా కొప్పళ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణ, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, ఎన్.శంక్రప్ప, ప్రముఖులు కొల్లా శేషగిరిరావు, జెడ్పీ సభ్యుడు అమరేగౌడ విరుపాపుర, వెంకనగౌడ మల్కాపుర, ఆర్.బసనగౌడ తుర్విహాళ, చంద్రశేఖర్, ఎం.రంగనగౌడ, మధ్వరాజాచార్, యువ నాయకుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లంఘనులకు సన్మానం
♦ హెల్మెట్ పెట్టుకోకుంటే పూలదండ వేసి సెల్యూట్ ♦ ట్రాఫిక్ పోలీసుల గాంధీగిరి నిజామాబాద్ క్రైం: ద్విచక్ర వాహనదారులు.. తస్మాత్ జాగ్రత్త! హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే నడిరోడ్డుపై ‘సన్మానం’ తప్పదు! వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా చర్యలు చేపట్టనున్నారు. ఇక నుంచి హెల్మెట్ లేకుండా వెళ్లే వారిని పట్టుకొని రోడ్డుపై సత్కరించనున్నారు. హైదరాబాద్‌లో అమలవుతోన్న ఈ విధానాన్ని రెండు, మూడ్రోజుల్లో ఇక్కడా అమలు చేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో సత్కరిస్తున్నారు. హెల్మెట్లు ధరించని వారి మెడలో పూలదండలు వేసి, సెల్యూట్ చేసి అభినందిస్తున్నారు. నడిరోడ్డుపై ఈ తరహా ‘సన్మానం’ వల్ల వాహనదారుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలో కూడా ఈ తరహాలోనే గులాబీ పూలతో సత్కరించారు. ఉల్లం‘ఘనులపై’ కొరఢా. హెల్మెట్ల వాడకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ట్రాఫిక్ సిబ్బందికి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన రోడ్డు ప్రమాద నివారణ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముందు పోలీసులే తప్పకుండా హెల్మెట్లు వాడాలని ఆయన సూచించారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 18 వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,417 కేసులు నమోదు చేసి, రూ. 4.95 లక్షల మేర జరిమానా విధించారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై పోలీసులు వాహనదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. కూడళ్లలో మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకే పరిమితం.. అయితే, పోలీసుల తనిఖీలు జిల్లా కేంద్రంలో రెండు, మూడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎన్టీఆర్ చౌరస్తా (ధర్నాచౌక్), బస్టాండ్ ఎదుట, పూలాంగ్ చౌరస్తాలలో మాత్రమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ రోడ్డు, వినాయక్‌నగర్, వర్ని రోడ్డు, మాలపల్లి, బోధన్ రోడ్డు, అర్సపల్లి ప్రాంతాలలో తనిఖీలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తే వాహనదారుల్లో మార్పు వచ్చే అవకాశముంది. రోడ్డుపై ‘సత్కరిస్తాం..’! ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలై ఎక్కువ మంది చనిపోతున్నారు. హెల్మెట్లు ధరిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. ఈ మేరకు వారిలో మార్పు రావాలి. ఇక నుంచి హెల్మెట్లు లేకుండా తిరిగే వారిని పట్టుకొని రోడ్డుపైనే అందరి ముందు సత్కరిస్తాం. - శేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
టమాటా వెంకట్ రెడ్డి వీర సాగు గాధ
♦ కూలీ నుంచి రైతుగా ఎదిగి.. ఆరు బోర్లు విఫలం... ♦ అయినా ఆగని భగీరథ ప్రయత్నం ♦ నాలుగు ఎకరాల నుంచి... పది ఎకరాల యజమానిగా... ♦ వృద్ధ దంపతులకు కేంద్రం ప్రభుత్వం సన్మానం ♦ సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పొద్దుతిరుగుడు తోటలో.. ఆ పూలతో పాటుగా వినయంగా తలవంచి నిల్చున్న ఆయన పేరు కొమ్మిడి వెంకటరెడ్డి. కానీ టమాటా వెంకటరెడ్డి అంటేనే అందరూ ఠక్కున గుర్తుపడతారు. ఆ పూల మాదిరిగానే ఆయనా కాలానుగుణంగా వ్యవహరిస్తారు. వయసు మీద పడ్డా కాలంతో పాటు పరుగెత్తడం.. ఒక్కోసారి ఎదురీదడం ఆయనకు కొత్త కాదు. ఒకానొకప్పుడు ఆయనుండే రాఘవాపూర్‌లో కరువు తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న వెంకటరెడ్డి కుటుంబం రోడ్డున పడే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ఊతమై నిలిచింది. భార్య రత్నమ్మతో కలిసి 2011లో కూలీలు (జాబ్ కార్డు నెంబరు 101121)గా పనిలో చేరారు. అందరూ తమకు అప్పగించిన పనులు చేస్తుంటే వెంకటరెడ్డి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. ఉపాధి హామీ పథకం కింద ఓ బావిని మంజూరు చేయించుకుంటే తానే పది మందికి ఉపాధి కల్పించవచ్చని తలిచారు. అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అనేక ప్రయత్నాల తరువాత.. 16 గజాల లోతున బావి తవ్వుకునేందుకు అనుమతి లభించింది. వెంటనే వెంకటరెడ్డి పనులు ప్రారంభించారు. కొద్ది లోతుకు వెళ్లగానే నీళ్లు పడ్డాయి. ఆ నీటితో దంపతులిద్దరూ పండించిన పంటలు సిరులను కురిపించాయి. ప్రస్తుతం 26 గజాల లోతు గల ఆ బావి నుంచి ఎంత తోడినా నీళ్లు తగ్గడం లేదు. కృషితో ఆయన నాలుగెకరాల నుంచి పదెకరాల రైతయ్యారు. ఈ దంపతుల భగీరథ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీకి పిలిచి ఘనంగా సత్కరించింది. -సిద్దిపేట రూరల్ సిద్దిపేట రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం.. పేద కుటుంబంలో వెలుగును నింపింది. నాడు కూలీగా పని చేస్తూ... నేడు రైతుగా మారి పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో బీడు భూముల్లో పంట సిరుల కోసం తపించి చేసిన భగీరథయత్నం ఫలించింది. కష్టాన్నే నమ్ముకుని నాలుగెకరాల భూమిలో సిరులు పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు దంపతులు. వారే సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్‌రెడ్డి రత్నమ్మల జంట. ఇటీవల కేంద్రప్రభుత్వం ఆ దంపతుల భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి ఘనంగా సత్కరించింది. దీంతో రాఘవాపూర్ గ్రామ కీర్తిని ఢిల్లీలో చాటినందుకు గాను గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితుల్లో ఉపాధి హామీ వారి ఊతమిచ్చింది. ఈ క్రమంలో కొమ్మిడి వెంకట్‌రెడ్డి, భార్య రత్నమ్మ దంపతులు 2011లో ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు నెంబరులో కూలీలుగా పనిలో చేరారు. కొంత కాలంగా ఉపాధి హామీలో దంపతులిద్దరు కూలీగా పని చేశారు. తనకు ఉపాధి హామీలో బావిని మంజూరు చేయించుకుంటే ఏలా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు సాగాడు. దీంతో ఒక బావి తవ్వించాలని అధికారులకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు స్పందించి జాతీయ ఉపాధి హామీ పథకం కింద బావి తవ్వేందుకు 16 గజాల వరకు బావి మంజూరు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద బావి తవ్వడం ప్రారంభించారు. బావి కొన్ని గజాల లోతుకు వెళ్లగానే నీళ్లు ఊటల ద్వారా పుష్కలంగా లభించాయి. నాడు కూలీగా పని చేస్తూ.. ఇబ్బందులు పడ్డ రైతు వెంకట్‌రెడ్డి నేడు తన పొలం సాగు చేసుకుంటూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దీంతో రెక్కల కష్టాన్ని నమ్ముకుని తనకున్న నాలుగెకరాల భూమిని దశలవారీగా పదిఎకరాలుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డికి ఉన్న పొలంలో వరి, పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. రైతు బుక్కెడు బువ్వ తింటూ మరో పది మందికి బువ్వ పెడుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. రైతు వెంకట్‌రెడ్డి ఎడ్లతోనే వ్యవసాయాన్ని చేస్తున్నారు. వృద్ధాప్య దశకు చేరుతున్నప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టపడ్డారు. గత వర్షాకాలంలో వ్యవసాయ సాగులో రూ. 50వేలు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పోనూ రూ. 1.50లక్షలు ఆదాయం వచ్చింది. రబీలో (ప్రస్తుతం) ఉన్న భూమిలో పొద్దు తిరుగుడు, వరిని సాగు చేస్తున్నారు. పొద్దస్తమానం.. వెంకట్‌రెడ్డి దంపతులు బావి వద్దనే ఉంటూ, పని తీవ్రతను బట్టి అవసరమైన మేర కూలీలతో పని చేయించుకుంటూ ఉపాధి చూపుతున్నారు. దీంతో రైతు వెంకట్‌రెడ్డి పలువురికి అండగా నిలుస్తున్నారు. కుటుంబ నేపథ్యం... సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్‌రెడ్డి, భార్య రత్నమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య భర్తలు కష్టించి పని చేస్తేనే పూట గడిచే రోజులు. ఆ రోజుల్లోనే ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేశారు. కొడుకును మంచి చదువులు చదివించడంతో ప్రస్తుతం ఓ ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వెంకట్‌రెడ్డి ఇంటి పేరుగా మారిన ‘టమాటా’.... వెంకట్‌రెడ్డికి ఇరవై ఏండ్ల క్రితం నాలుగెకరాల పడావుపడ్డ భూమి ఉండేది. అది కూడా రాళ్లు రప్పలతో కూడినది. పాడుబడిన పాతబావి ఉండగా అది కూడా ఎండిపోయింది. ఆ కాలంలో ఆరు బోర్లు వేస్తే నీళ్లు రాలేదు. పంట సాగు చేసుకుందామన్న గుడ్డం సరిగ్గా లేకుండే, అప్పటి పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో పంటలు పండించేవారు. అందులో ఎక్కువగా టమాటా సాగు చేసి, వాటిని ఎడ్ల బండి మీద ప్రతి రోజూ సిద్దిపేటకు వచ్చి అమ్మేవారు. ఇలా దాదాపు ఐదు సంవత్సరాల పాటు టమాటా సాగు చేసి కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. దీంతో వెంకట్‌రెడ్డిని రాఘవాపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల వాళ్లు కూడా ‘టమాటా వెంకట్‌రెడ్డి’ అని పిలుస్తారు. కష్టాన్ని నమ్ముకున్నా.. ఇరువై ఏళ్ల నుంచి కుటుంబాన్ని పోషించడం కష్టమైంది. అప్పటి నుంచి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నా. మొదట ఉపాధి హామీ పథకంలో నా భార్యరత్నమ్మ, నేను కూలీగా వెళ్లాం. కొన్ని రోజులు పని చేశాను. కొద్ది రోజుల తర్వాత ఉపాధి హామీ పథకంలో బావిని తవ్వుకున్న. బాగా నీళ్లు వచ్చినయి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా ఊరోళ్లకు పది మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఇది గుర్తించి అధికారులు నన్ను ఢిల్లీకి తీసుకెళ్లడం సంతోషాన్నిచ్చింది. - వెంకట్‌రెడ్డి, రైతు మా ఊరికి పేరొచ్చింది... రాఘవాపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి దంపతులు ఢిల్లీకి వెళ్లి సన్మానం అందుకోవడం సంతోషకరమైంది. వెంకట్‌రెడ్డిని ఉత్తమ రైతుగా గుర్తించడంతో రాఘవాపూర్ గ్రామానికి మంచి పేరు వచ్చింది. గ్రామస్తులంతా రైతు వెంకట్‌రెడ్డిని అభినందిస్తున్నారు. ఇప్పుడు గ్రామానికి పేరు రావడం సంతోషంగా ఉంది. - రామగాని సత్తయ్యగౌడ్, సర్పంచ్, రాఘవాపూర్ -
దుబాయిలో తెలుగు మహిళకు సత్కారం
దుబాయి: దుబాయి ఏమిరేట్‌లో తెలుగు ప్రవాసీయులకు సహాయక సహకారాలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు మహిళను దుబాయి పోలీసులు సత్కరించారు. దుబాయిలోని ప్రముఖ సామాజిక కార్యకర్త పాడే ఉమా ప్రవాస భారతీయ కార్మికులకు తరుచుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. అనేక కేసులలో దుబాయి పోలీసులకు, భారతీయ కాన్సులేటుకు కూడా తోడ్పాటు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో దుబాయి పోలీసులు సోమవారం ఉమను సత్కరించి సన్మానించారు. ఈ మేరకు దుబాయి పోలీస్ అధికారి మేజర్ మజీద్ స్వేది ...ఆమెకు ప్రశంస పత్రంతో పాటు ఓ విలువైన బహుమతిని బహుకరించారు. కాగా హైదరాబాద్‌కు చెందిన ఉమ దుబాయిలో స్థిరపడ్డారు. అరబ్బీ భాష మాట్లాడే ఆమె భారతీయ కార్మికుల పక్షాన తరచుగా పోలీసులు, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలలో వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళుతుంటారు. దుబాయి పోలీసుల సత్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఉమ అన్నారు. -
ఆలిండియా టాపర్లకు సన్మానం
హైదరాబాద్: సీఏ-సీపీటీ-2015 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీచైతన్య సీఏ అకాడమీ విద్యార్థి ఎం.నరేష్కుమార్, 9వ ర్యాంకు సాధించిన పి.జశ్వంత్రెడ్డిలను ఘనంగా సన్మానించినట్లు ఆ విద్యా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో మూసాపేట్‌లోని శ్రీచైతన్య సీఏ అకాడమీ క్యాంపస్‌లో వారికి అభినందన కార్యక్రమం నిర్వహించినట్లు అకాడమీ స్టేట్ కో-ఆర్డినేటర్లు ఐ.వి.రామయ్య, రాజనాల చంద్రశేఖర్ చెప్పారు. పటిష్టమైన ప్రోగ్రామ్, అద్భుత మెటీరియల్, ఉత్తమ అధ్యాపక బృందం వల్లే శ్రీచైతన్య ఈ స్థాయి ఫలితాలను సాధించిందని, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. -
గాన గంధర్వుడికి సన్మానం
-
ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం
కరీంనగర్ క్రైం : జిల్లా పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను జిల్లా ఎస్పీ శివకుమార్ మంగళవారం శాలువాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో డీసీఆర్బీ డీఎస్పీ సంజీవ్‌రావు, ఎఆర్ ఎస్సైలు కె.దేవేందర్‌రెడ్డి, జియా ఉల్ షరీఫ్(ఏఆర్- కరీంనగర్), ఏఎస్సై సత్యానారాయణ(ట్రాఫిక్- కరీంనగర్ పీఎస్), హెడ్‌కానిస్టేబుల్ షేక్ అబ్దుల్బ్(్రఏఆర్- కరీంనగ ర్) ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు కుటుంబసభ్యులను ఎస్పీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈకార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయిడు, డీఎస్పీలు ప్రభాకర్, కోటేశ్వర్రావు, ఆర్ఐలు గంగాధర్, సెక్షన్ అధికారి రాధాకృష్ణారెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, రవికాంత్, మల్లయ్య, లింగమూర్తి పాల్గొన్నారు. -
హువాయ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: హువాయ్ తన ఆనర్ శ్రేణిలో 4ఎక్స్, 6 ప్లస్ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.10,499, రూ.26,499గా ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యం అవుతున్నాయి. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘ఆనర్ 6 ప్లస్’ మొబైల్ 5.5 అంగుళాల తెర, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరి, 4జీ, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘4ఎక్స్’ మొబైల్లో 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరి, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐడీసీ ప్రకారం, హువాయ్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 6.25 శాతం వాటాతో నాల్గో స్థానంలో ఉంది. గతేడాది 3 లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించిన హువాయ్ ఈ ఏడాది 20 లక్షల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇదేం న్యాయం?
సాక్షి, కడప : కడప రిమ్స్‌లో చదువుతున్న విద్యార్థులకు గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెమ్యునరేషన్‌ను పెంచి ఇస్తుండగా, ఒక్క కడప రిమ్స్‌లో మాత్ర ం జీఓ రాలేదనే నెపంతో గౌరవ వేతనాన్ని పెంచలేదు. కడప రిమ్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. 2009లో విడుదల చేసిన జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి 15 శాతం చొప్పున గౌరవ వేతనం పెంచాలనే నిబంధన ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లకు ప్రస్తుతం రూ.10,580 ఇవ్వాల్సి ఉండగా రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రూ.23 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.18 వేలు, సెకండియర్ చదువుతున్న వారికి రూ.25 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.19 వేలు ఇస్తున్నారు. విద్యార్థుల ఆందోళన తమకు అన్యాయం జరుగుతున్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని రిమ్స్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మెడిసిన్ చదువుతున్న వారికి స్టయిఫండ్ పెంచి ఇవ్వడం, రిమ్స్‌లో చదువుతున్న వారికి పెంచకుండా ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటోనని వారు ప్రశ్నిస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను కలిసి ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు విన్నవించారు. బయో మెట్రిక్ పేరుతో కూడా స్టయిఫండ్‌లో కోత పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెడికోల గౌరవ వేతనంలో కోత పెట్టి.. డెరైక్టర్, ఉన్నతాధికారులకు మిగులు బడ్జెట్ చూపించారని విద్యార్థులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే డీఎంఈ అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే ఎక్కడో మిగతా జిల్లాల్లో తప్పు జరిగిందని ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జీఓ వస్తే గౌరవ వేతనం పెంచుతాం : డీఎంఈ, రిమ్స్ డెరైక్టర్ మెడికోల గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వానికి మూడు, నాలుగుసార్లు ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం జీఓ విడుదల చేస్తే వెంటనే పెంచిన వేతనాన్ని ఇస్తామని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వెంకటేశ్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ తెలియజేశారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ‘సాక్షి’ వారి దృష్టికి తీసుకెళ్లగా.. పై విధంగా స్పందించారు. బయో మెట్రిక్కు సంబంధించి ఒకరోజంతా హాజరు కాకుండా ఉన్న విద్యార్థులకు మాత్రమే గౌరవ వేతనంలో కొంత కోత పెట్టామని చెప్పారు. అర గంట, గంట ఆలస్యంగా వచ్చిన వారికి స్టయిఫండ్‌లో కోత పెట్టలేదని స్పష్టం చేశారు. నిధులు మిగిలిపోయినందునే ప్రభుత్వానికి వెనక్కి పంపామని చెప్పారు. విద్యార్థుల స్టయిఫండ్‌లో కోతపెట్టి డబ్బు మిగిల్చామనడం సరికాదన్నారు. స్టయిఫండ్ పెంచినట్లు జీఓ రాగానే అమలు చేస్తామన్నారు. ఎందుకీ అన్యాయం? అన్ని జిల్లాల్లో మెడికోలకు స్టయిఫండ్ పెంచి ఇస్తున్నారు. ఒక్క రిమ్స్‌లో మాత్రం పెరిగిన మొత్తాన్ని ఇవ్వడం లేదు. బయో మెట్రిక్ పేరుతో కూడా కొంత కట్ చేస్తున్నారు. ఎన్నోసార్లు రిమ్స్ పెద్దలను కలిసి చెప్పినా స్పందించడం లేదు. ఏమైనా అంటే ఉన్నతాధికారులతో మాట్లాడండి అంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. - జీఎండీ రాసిక్ ఉలేమాన్, హౌస్ సర్జన్, రిమ్స్ -
ప్రముఖ మహిళలకు సీఎం సత్కారం
నెల్లూరు (రవాణా): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు మహిళలను ఆదివారం ప్రభుత్వం సత్కరించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖ మహిళలను సీఎం శాలువాతో సత్కరించారు. సత్కారం పొందిన వారు... 1. జయా ఫిలిప్స్ (అనాథలకు చేయూత), 2. చెన్నుపాటి విద్య (అనాథలకు చేయూత), 3. డి.సుశీల (మహిళల అభివృద్ధి), 4. రోజిలిన్ (మహిళల అభివృద్ధి), 5. షావుకారు జానకి (సినీనటి), 6. ఎల్.ఆర్.ఈశ్వరి (గాయని), 7. సునీత (గాయని), 8. ఓల్గా (రచయిత్రి), 9. విజయలక్ష్మి (నాటకరంగం), 10. లలితాదాస్ (అంతర్జాతీయ పెయింటర్), 11. లలితా కామేశ్వరి (నేత్రావధానం), 12. రమాకుమారి (నేత్రావధానం), 13. శైలజాకిరణ్ (వ్యాపార రంగం), 14. విజయదుర్గ(న్యూస్‌రీడర్ ), 15. నల్లాని ఈశ్వరి(పేద విద్యార్థులకు చేయూత), 16. హారిక (చెస్ క్రీడాకారిణి). -
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ దేవరాజరెడ్డికి సన్మానం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎం.దేవరాజరెడ్డికి ఆదివారంనాడిక్కడ ఘనంగా సన్మానం జరిగింది. ఐసీఏఐ హైదరాబాద్ చైర్మన్ కె.మతేష్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐసీఏఐ 65 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి ఈ పదవి దక్కించుకోవడం ఇదే మొదటి సారి. కాగా, 2016 నుంచి దేవరాజరెడ్డి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిపరమైన అభివృద్ధి, ఆడిటింగ్, నైతిక ప్రమాణాలను మెరుగు పరచి ప్రపంచవ్యాప్తంగా సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన ఐసీఏఐకు దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం గర్వించదగ్గ విషయమని మతేష్ రెడ్డి అన్నారు. -
సింధు, మిథాలీలకు ఘనసన్మానం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న పలువురు క్రీడాకారులు, వెటరన్ ఆటగాళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఘనంగా సన్మానించింది. ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు, భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్‌లతో పాటు అథ్లెట్ జె.జె.శోభ, కబడ్డీ క్రీడాకారిణులు తేజస్విని బాయి, మమతలు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. వెటరన్ వాలీబాల్ ప్లేయర్, సింధు తండ్రి అయిన పి.వి.రమణ, రవికాంత్ రెడ్డిలను కూడా సత్కరించారు. సికింద్రాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ క్రీడాకారులను సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు. భవిష్యత్తులోనూ భారత క్రీడాకారులు దేశానికి ఘనవిజయాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో రైల్వే శాఖ ముందుందని, ఉద్యోగాలు, పదోన్నతులతో సత్కరిస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, వాలీబాల్ మాజీ ఆటగాడు శ్యామ్‌సుందర్ రావు, రైల్వే ఉన్నతాధికారులు ఎస్.కె.అగర్వాల్, గజానన్ మాల్యా, రాకేశ్ అరోణ్, శివప్రసాద్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం
మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు కన్నడ సంప్రదాయలో సన్మానం ఉన్నతచదువులకు సాయం చేస్తామన్న ప్రవాసాంధ్రులు బెంగళూరు : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తెలుగు తేజాలు పూర్ణ (15), ఆనంద్ కుమార్ (18)లకు ఇక్కడి జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్దం నారయ్య అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లను కర్ణాటక సాంప్రదాయం ప్రకారం శాలువా, మైసూరు పేటతో సత్కరించి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమానికి పలు తెలుగు ప్రముఖులతో పాటు ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాలవత్పూర్ణ, ఆనంద్ మాట్లాడుతూ తాము ఈ సన్మానాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమాని హాజరైన మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... మైనస్ 30 డిగ్రీలు ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం దేశానికి వారు గర్వకారణమని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ఐపీఎస్ అధికారి తూకివాకం సునీల్ కుమార్ మాట్లాడుతూ విజేతలు భవిష్యత్తులో ఐపీఎస్ చదువుతామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ. రాధకృష్ణరాజు మాట్లాడుతూ... పూర్ణ, ఆనంద్ కుమార్‌లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ ఎవరెస్ట్ విజేతలకు ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 5,116 చొప్పున అందజేశారు. కార్యక్రమానికి బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రమేష్, ఐఆర్ఎస్ అధికారిణి చంద్రిక, లోకాయుక్త డీఎస్పీ నారాయణ, ఎవరెస్ట్ విద్యార్థుల కోచ్ శేఖర్‌బాబుతో పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిద్దం నారయ్య, పత్తిపాటి ఆంజనేయులు, హెచ్ఏఎల్ తెలుగు సాహిత్య సమితి అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు తదితరులు మాట్లాడారు. అంతకు ముందు కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనంతమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు బీ.కుపేంద్రరెడ్డి రూ. 50 వేలు, చామరాజపేట శాసన సభ్యుడు ఆర్.వీ. దేవరాజ్ రూ. 50 వేలు చొప్పున మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లకు అందించారని డీఎస్పీ నారాయణ తెలిపారు. తెలంగాణ శిఖరాలు : తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన అమానత్పూర్ణ, ఖమ్మం జిల్లా ధర్మమండలం సమీపంలోకి కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్‌లు తొమ్మిది నెలల పాటు డార్జిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇదే ఏడాది మే 25న వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
ఆయనే నాకు స్ఫూర్తి!
మా ఆయన బంగారం ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రోత్సహించడంలో షారుక్‌ఖాన్ ముందుంటారు. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి నన్ను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తారు. అవసరమైన సలహాలు ఇస్తారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు షారుక్. సమాజసేవ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి. క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తన సక్సెస్మంత్రగా చేసుకున్నారు షారుక్. బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎంత కష్టాన్నయినా తేలికగా తీసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం చిన్న విషయాలకు భావోద్వేగాలకు గురవుతారు. ‘‘కొత్తవాళ్ల ముందు మాట్లాడడానికి నాకు బెరుకు’’ అంటారుగానీ ఒక్కసారి వాళ్లకు దగ్గరైతే చాలు సన్నిహితమైపోతారు. వాళ్ల కష్టసుఖాల్లో భాగం అవుతారు.పిల్లలకు మించిన బెస్ట్‌ఫ్రెండ్స్ అతనికి ఈ లోకంలో ఎవరూ లేరు. మౌనంగా ఉండడం షారుక్‌కు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరూ లేకపోతే పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్లి మరీ ముచ్చటపెడతారు! - గౌరీఖాన్ -
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
జోగిపేట,న్యూస్‌లైన్: ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చానని అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఆయనను వివిధ కుల సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదాన ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందుకే తన విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఎదుటి పార్టీ వారు తనను అవమాన పరిచే విధంగా ప్రకటనలు చేశారన్నారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తన విజయానికి కృషి చేశారన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా తన విజయానికి తోడ్పడ్డాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను పలకరించాలనుకున్నానని, అయితే ఈ లోగానే కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ రావడం తనకు బాధ కల్గించిందన్నారు. అందుకే పెళ్లిళ్లకు హాజరవుతూ ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకుంటున్నానన్నారు. దండలు, శాలువాలు తేవద్దు తాను నియోజకవర్గంలో పర్యటించేప్పుడు శాలువాలు, పూలదండలు తీసుకరావద్దని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. తాను గ్రామాలకు వచ్చినప్పుడు కేవలం సమస్యలు చెబితే చాలునన్నారు. అనవసరంగా డబ్బులు వృధా చేయవద్దని కోరారు. డాకూర్‌లో సన్మానం డాకూర్ గ్రామంలో బాబూమోహన్, మాజీ ఎంపీ పి.మాణిక్రెడ్డిలకు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ ఏ.శంకరయ్య, మాజీ సర్పంచ్ తమ్మళి శ్రీనివాస్, కురుమ సహకార సంఘం చైర్మన్ రొడ్డ క్రిష్ణయ్య తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జి.లింగాగౌడ్, డీబీ నాగభూషణం, పిట్ల లక్ష్మణ్, సీహెచ్.వెంకటేశం, జగదీశ్, జి.రవీందర్‌గౌడ్, డాకూరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా గెలుపు ప్రజలకే అకింతం అల్లాదుర్గం రూరల్: తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అందోల్ ప్రజలకే తన విజయాన్ని అకింతమిస్తున్నట్లు ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అల్లాదుర్గం మండలంలో పోతులబోగుడలలో ఓ వివాహనికి ఆయన హాజరయ్యారు. అనంతరం వట్పల్లి వెంకట ఖాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, వారికి సేవలందించి కృతజ్ఞతతో ఉంటానన్నారు.అలాగే అవినీతి లేని పాలన అందిస్తానన్నారు. మరో సారి సేవ చేయడానికి అవకాశం కల్పించిన అందోల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వట్పల్లి టీఆర్ఎస్ నాయకులు బాబుమోహన్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మాజీ ఎంపీపీ కాశీనాథ్, మరవెళ్లి ఎంపీటీసీ సభ్యులు భిక్షపతి, శివాజీరావు, ఉదయ్‌కిరణ్, నాయకులు సుభాష్రావ్, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, కుత్బుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, ఖాజాపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల మనసు
పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి. కొందరు పైకి మురికోడుతుంటారు. మరి కొందరు లోపల మురికోడుతుంటారు. కొందరు చూడటానికి మల్లెపువ్వులా అందంగా వుంటారు. కానీ మనసంతా ముళ్లకంపే! కొందరు అందవికారంగా వుంటారు. కానీ మనసుమాత్రం వెన్నముద్దలా వుంటుంది. పారిజాతంలా స్వచ్ఛంగా వుంటుంది. అష్టావక్ర మహర్షి అంటాడు - మనిషి వంకరగా వున్నా ఫరవాలేదు. మనసు మాత్రం వంకరగా వుండకూడదని. మనిషి పుట్టాక విధిగా కొన్ని ధర్మాలు పాటించాలి. అందులో ‘శౌచం’ కూడా ఒకటి. శౌచం అంటే పరిశుభ్రత. ఇంగ్లిష్‌లో క్లీన్లీనెస్ అని అంటారు. ఇది బాహ్యమూ, అంతరమూ కూడా. అంతర్ శౌచమే అన్నింటికంటే ముఖ్యం. ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు, కుళ్లూకుత్సితాలూ లేకుండా మనసు మంచిది కావాలి. మనసుబట్టే మాటలు. మనసు మంచిదైతే మాటా మంచిదవుతుంది. పలికే వారి మనసును బట్టే మాట చల్లగా ఉండడమో, తియ్యగా ఉండడమో, వాడిగా ఉండడమో, వేడిగా ఉండడమో జరుగుతుంది. అయితే ఇవేవీ కావన్నట్లు ఒళ్లంతా చందన గంధాలు పూసుకొని మేము స్వచ్ఛంగా, శుభ్రంగా ఉన్నామనుకుంటే సరిపోదు. శౌచం శరీరానికీ మనస్సుకే కాదు, అన్నింటికీ కావాలి. అలాగే డబ్బు కూడా. సంపాదించే డబ్బు సక్రమమైనదై వుండాలి. ధర్మమార్గంలో సంపాదించినదై వుండాలి. అప్పుడే దానికి యోగ్యత, గౌరవం. అర్థ శౌచమంటారు దీన్ని. అంతర్ శౌచం ఎంతముఖ్యమో, అర్థ శౌచం కూడా అంతే ముఖ్యం. శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువులు అయిన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఒకసారి అనార్యుల ధనం, అసత్పరుషుల ధనం గురించి మాట్లాడుతూ - ద్రవ్యం న్యాయార్జితమై ఉండాలి. అప్పుడే అది దానానికీ, ధర్మానికీ పనికొస్తుందని సోదాహరణంగా చెప్పారు. ఒక వృద్ధుడు క్రయ, విక్రయ దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగించే వాడు. ఎంత భారీ ఆస్తి అయినా దానికి సంబంధించిన డాక్యుమెంటు రాయవలసి వస్తే 2 రూపాయలు మాత్రమే ఆయన వసూలు చేసేవారట. ఒకసారి ఆయన స్నేహితుడు ‘అదేమిటోయ్, 10,000 రూపాయల డాక్యుమెంటైనా, లక్ష రూపాయల డాక్యుమెంటైనా రెండు రూపాయలే తీసుకుంటావు. ఇదేం న్యాయం’? అని అడిగాడు. దస్తావేజు విలేఖరి నవ్వుతూ ‘న్యాయం కాక ఇంకేముంది? పదివేల రూపాయల దస్తావేజైనా, లక్షరూపాయల దస్తావేజైనా ఒకే విధంగా రాస్తాను. కాకపోతే లక్ష రూపాయల డాక్యుమెంటులో ఒక సున్నా ఎక్కువ పెడతాను. ఆ ఒక్క సున్నా కోసం ఎక్కువ వసూలు చేయడం న్యాయమంటావా’? అని ప్రశ్నించాడు. దానికి మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అదీ అర్థశౌచమంటే! పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. అయితే ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. ఇంకోమాట చెబుతాను - సంపాదించింది మనమొక్కరిమే అనుభవించటం కాదు. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి. ఇస్తే తరిగిపోతుందనుకుంటాం. కానీ అది సరికాదు. నూతిలో తోడుతూంటేనే నీరు ఊరుతూ ఉంటుంది. అదీ భారతీస్వామి చెప్పిన రహస్యం. - ప్రయాగ రామకృష్ణ. -
నారాయణ గుప్తాకు సన్మానం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: చెన్నై టీటీడీ సమాచార కేంద్రం, సలహా మండలి సభ్యులుగా నియమితులైన ఎం.వి.నారాయణగుప్తాకు తెలుగు ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నారాయణగుప్తా సేవలు ప్రశంసనీయమైనవని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కితాబిచ్చారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఎం.వి.నారాయణగుప్తాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు కలసి సన్మానం చేశారు. సభ కన్వీనర్, జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ టి.రాజశేఖర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో నారాయణగుప్తా దంపతులను నిలువెత్తు పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా చెన్నై టీటీడీ సమాచారకేంద్రం ఏఈవో పి ప్రభాకర రెడ్డి, గౌరవ అతిథులుగా వివేక్ అధినేత బిఏ చంద్ర, శేఖర్ శెట్టి, గోపురం పసుపు అధినేత వై.వి.హరికృష్ణ, అజంతా శంకరరావు, అఖిల భారత తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సిఎంకె రెడ్డి, తెలుగు తెర అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ హాజరయ్యారు. పి.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ కార్యదీక్ష, సమయపాలన, సేవాతృష్ణ కలిగిన నారాయణగుప్తా సలహా మండలి సభ్యులుగా నియమితులు కావటం సంతోషంగా ఉందన్నారు. జనవరిలో 24 మందితో కొత్త కమిటీ ఏర్పడిందని అందులో ఎం.వి.నారాయణగుప్తా సభ్యులు కావటం అభినందనీయమన్నారు. ఆయన సలహాలు విలువైన సూచనలు టీటీడీకి ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పాండిచ్చేరి, కన్యాకుమారిలో వెంకన్న దేవస్థానం ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నాయని అన్నారు. చెన్నై నగరంలోని భక్తులకు వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 16న ముప్పెరం విళా అనంతరం గౌరవ అతిథి సిఎంకె రెడ్డి మాట్లాడుతూ మార్చి 16న ముప్పెరం విళా పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానికి తెలుగు వారందరూ హాజరు కావాలని కోరారు. తెలుగువారి సంఖ్యను పాలక ప్రజలకు తెలిపేలా తెలుగు వారి సమస్యలను పరిష్కరించుకునేలా ముప్పెరం విళాకు హాజరు కావాలని కోరారు. అజంతా శంకరరావు, వై.వి.హరికృష్ణ, టంగుటూరి రామకృష్ణ, బిఎ చంద్రశేఖర్ శెట్టిలు మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే ఎం.వి.నారాయణ గుప్తా సలహా మండలిలో సభ్యులయ్యారని అన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సేవా కార్యక్రమంలో కృషి చేస్తున్న ఎం.వి.నారాయణగుప్తా మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు, ఆర్య వైశ్య సంఘాల ప్రముఖులు హాజరై ఎం.వి.నారాయణగుప్తా దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.