హానర్‌ తొలి ల్యాప్‌టాప్‌ వచ్చేసింది | Honor MagicBook15 Launched in India | Sakshi
Sakshi News home page

హానర్‌ తొలి ల్యాప్‌టాప్‌ వచ్చేసింది

Published Fri, Jul 31 2020 3:03 PM | Last Updated on Fri, Jul 31 2020 3:36 PM

Honor MagicBook15 Launched in India - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా కాలంలో  ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో హానర్‌ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 పేరుతో శుక్రవారం తన తొలి ల్యాపటాప్‌ను భారత దేశంలో లాంచ్‌ చేసింది. విండోస్‌ ముందే ఇన్‌స్టాల్  చేసిన ఈ  ల్యాపటాప్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు,  వేగా గ్రాఫిక్‌  లాంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ కలర్ వేరియంట్‌లో లభ్యం. ఇది ఆగస్టు మొదటి వారం నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది.  లాంచింగ్‌ ఆఫర్‌ గా రాయితీ ధరను హానర్‌ ప్రకటించింది. 

ధర, లభ్యత 
హానర్ మ్యాజిక్‌ బుక్‌ 15  ధర  42,990 రూపాయలు. మిస్టిక్ సిల్వర్ కలర్‌లో ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే లభ్యం. గ్లోబల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో లాచ్‌ అయిన సంగతి తెలిసిందే. 


హానర్ మ్యాజిక్‌ బుక్‌15 స్పెసిఫికేషన్లు
విండోస్ 10 హోమ్ (ప్రీ లోడెడ్‌గా) 
15.6-అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
1920x1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 
 8 జీబీ ర్యామ్‌   256జీబీస్టోరేజ్‌ 

టైప్-సీ పోర్ట్‌, 65 వాట్స్ చార్జర్‌ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ ‌అవుతుందనీ, వీడియోలను నిరంతరం చూసినా  బ్యాటరీ సమయం 6.3 గంటలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సెక్యూరిటీ కోసం టూ-ఇన్-వన్ ఫింగర్‌ ప్రింట్‌ పవర్‌ బటన్‌  పాప్-అప్ వెబ్‌ క్యామ్‌ను కూడా  జోడించింది. ఇంకా వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి 3.0, హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement