హానర్‌ 20 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ | Honor 20 Pro  Honor 20 and Honor 20i  launched  India | Sakshi
Sakshi News home page

హానర్‌ 20 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

Published Tue, Jun 11 2019 12:28 PM | Last Updated on Tue, Jun 11 2019 12:43 PM

Honor 20 Pro  Honor 20 and Honor 20i  launched  India - Sakshi

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ హానర్‌ 20 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్‌లో తాజాగా స్మార్ట్‌ఫోన్లను  ఆవిష్కరించడం గమనార్హం. హానర్‌ 20, హానర్‌ 20 ప్రొ, హానర్‌ 20 ఐ పేర్లతో వీటిని లాంచ్‌ చేస్తోంది.  క్వాడ్‌ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, బడ్జెట్‌ ధరలో హానర్‌ 20ఐ ని లాంచ్‌ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం  ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా,  డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒ​కేలా ఉంచింది.  అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ  స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలతో లాంచ్‌ చేసింది. 


హానర్‌ 20 ప్రొ ఫీచర్లు 
6.26 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్‌ రిజల్యూషన్‌ 
6/8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌ 
7ఎన్‌ఎం కిరిన్‌ 980 ప్రాససర్‌
48+16+2+ ఎంపీ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీకెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు 
హానర్‌ 20 :  ధర రూ. 32,999
జూన్‌ 25నుంచి  లభ్యం.

హానర్‌ 20 ప్రొ : ధర రూ. 39,999
కమింగ్‌ సూన్‌

హానర్‌ 20ఐ
రూ.14, 999
 జూన్‌18 నుంచి లభ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement