new smartphones
-
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్‌తో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 14 సిరీస్‌లో రెండు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్మీ 14 ప్రో ప్లస్ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్సెట్లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్ చేంజింగ్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3 (Snapdragon 7s Gen 3) చిప్సెట్తో నడుస్తుంది. ఇక రియల్మీ 14 ప్రోలో మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్మీ 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్సెట్లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.ధరలివే..భారత్‌లో రియల్మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్‌కు రూ.24,999, 8GB+256GB వేరియంట్‌కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇక రియల్మీ 14 ప్రో ప్లస్ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.ఈ ఫోన్ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్మీ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే.⇒ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 చిప్సెట్⇒ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీరియల్మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్⇒ వనిల్లా మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్⇒ GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాహై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్లుఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీకలర్ చేంజింగ్ ఫీచర్ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్మీ 14 ప్రో ప్లస్ 5G, రియల్మీ 14 ప్రో 5G ఫోన్లలో పెరల్ వైట్ వేరియంట్లలో రియల్మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది. -
అద్భుతమైన రియల్మీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదా!
Realme11 5G Realme11 X 5G: చైనా స్మార్గ్ఫోన్ దిగ్గజం రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్మీ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ (Realme 11 5G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) పేరుతో తాజాగా ఆవిష్కరించింది. వీటితో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్పోన్స్ని కూడా తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ ధరను రూ.20 వేల లోపు ధరను నిర్ణయించగా, రియల్మీ 11ఎక్స్ 5జీ మొబైల్ రూ.15 వేల బడ్జెట్ ధరగా నిర్ణయించడం గమనార్హం. రియల్మీ 11ఎక్స్ 5జీ,ధరలు, లభ్యత రియల్‌మి 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్స్‌లో లభ్యం.. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ 11ఎక్స్ 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 64+2ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 5000mAhబ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్‌మి 11 5జీ ధర, లభ్యత Realme 11 5G ప్రారంభ ధర రూ. 8 జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999. గ్లోరీ గోల్డ్ , గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం. ఆగస్ట్ 29 నుండిసేల్. రియల్మీ 11 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 132400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 108 ఎంపీ+2 ఎంపీ రియర్ డ్యూయల్కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమరా 8జీబీ స్టోరేజ్, 128, 256జీబీ స్టోరేజ్ 5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ బడ్స్ ఎయిర్5: రూ.200 తగ్గింపుతో కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. తొలి సేల్ ఆగస్టు 26, మధ్యాహ్నం 12 గంటలకు Experience the #realme11x5G and upgrade your style game. 🚀 With lightning-fast speed and unbeatable features, get ready to take the leap. Starting at ₹13,999/-* Early bird sale will be live today at 6PM. Know more: https://t.co/pfnyKqBsVD#LeapUpWith5G pic.twitter.com/nhroIFytf1 — realme (@realmeIndia) August 23, 2023 /> -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్‌లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
5జీ ఫోన్ల విక్రయాలపై శాంసంగ్ మరింత దృష్టి.. గెలాక్సీ ఎ54, ఎ34 విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు శాంసంగ్ ఇండియా జీఎం అక్షయ్ రావు తెలిపారు. ప్రస్తుతం విలువపరంగా వీటి వాటా 61 శాతంగా ఉందని 2023లో దీన్ని 75 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు గెలాక్సీ ఎ సిరీస్‌లో రెండు కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. వీటిలో ఎ54, ఎ34 మోడల్స్ ఉన్నాయి. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఎ34 ధర రూ. 30, 999–రూ. 32,999గా ఉండగా, ఎ54 రేటు రూ. 38,999–40,999గా ఉంటుందని అక్షయ్ రావు చెప్పారు. ఆఫర్ కింద రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 8జీబీ+128 జీబీ లేదా 256 వేరియంట్లలో లభించే ఈ ఫోన్లకు 4 వరకు ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లు పొందవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 25 స్మార్ట్ఫోన్లు ఉండగా .. వీటిలో 5జీ మోడల్స్ 16 ఉన్నాయని అక్షయ్ రావు పేర్కొన్నారు. వీటి ధర రూ. 14,000 నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకూ ఉందని చెప్పారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) -
అద్భుత ఫీచర్లు, ఐఫోన్ లాంటి డిజైన్: షావోమీ స్మార్ట్ఫ్లోన్లు వచ్చేశాయ్!
సాక్షి ముంబై: చైనా స్మార్ట్‌ఫోన దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా 13 సిరీస్ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఐఫోన్ మాదిరి డిజైన్‌లో ఆండ్రాయిడ్ 13 MIUI 14తో వీటిని తీసుకొచ్చింది. అలాగేవీటిల్లో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్ అవుతుందనేది స్పష్టత లేదు. (ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ) షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73అంగుళాల AMOLED డిస్ప్లే 3200x1440 రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ 50 ఎంపీ(వైడ్, అల్ట్రా, వైడ్ టెలిఫోటో)) ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా 4820ఎంఏహెచ్ బ్యాటరీ (ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?) షావోమీ 13 ప్రో ధర: ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు రెండూ వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. బేస్ వెర్షన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 60 వేల నుండి ప్రారంభం. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 74,500 షావోమి 13 ఫీచర్లు 6.36 అంగుళాల OLED డిస్ప్లే 1080 x 2400పిక్సెల్స్ రిజల్యూషన్ 4500ఎంఏహెచ్ షావోమి13 ధరలు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 574 డాలర్లు ( సుమారు రూ. 47,344) 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 617 డాలర్లు ( సుమారు రూ. 50891) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 660 డాలర్లు (రూ. 54438) 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 718 డాలర్లు (రూ. 59222) -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ మోడల్స్ , డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్4 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది. Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి. ఆఫర్లు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది. Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings! Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0 — Samsung India (@SamsungIndia) August 18, 2022 -
పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. జూన్ 23 సాయంత్రం వర్చువల్ ఈవెంట్లో పోకో ‘ఎఫ్ 4 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు పోకో ట్వీట్ చేసింది. ఫీచర్లు, అంచనాలు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు రెడ్మి కే40ఎస్కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్ కెమెరా, దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. A new thinnest #POCOF4 that's sure to make some big waves. Watch our global launch event on June 23rd for more. See you in two days. #AllTheStrengths pic.twitter.com/6umW3TrZti — POCO (@POCOGlobal) June 21, 2022 పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు 6.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Every action will feel a lot more magical when you record moments using Clone Mode on the POCO F4 5G. Get ready to create even cooler videos starting 23-06-2022 - https://t.co/k1MjtkjFVq pic.twitter.com/XZw58DHRaT — POCO India (@IndiaPOCO) June 21, 2022 -
సర్వే:ఈ పండుగ సీజన్లో జనం ఎక్కువగా కొనే వస్తువులు ఇవే?!
ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు స్థూలంగా 9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (జీఎంవీ) విక్రయించే అవకాశం ఉందని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో నమోదైన 7.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనపర్చే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి ఏడాదికి మొత్తం ఆన్లైన్ స్థూల జీఎంవీ 49–52 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండవచ్చని, గతేడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఈ–కామర్స్ పండుగ సీజన్ నివేదికలో రెడ్‌సీర్ అంచనా వేసింది. ఆర్డర్ల రద్దు, వాపసు చేయడం మొదలైన వాటిని తీసివేయడానికి ముందు, స్థూలంగా అమ్ముడైన ఉత్పత్తుల మొత్తం విలువను స్థూల జీఎంవీగా వ్యవహరిస్తారు. కోవిడ్ తరవాత పరిసథితుల నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరగడం.. అమ్మకాల వృద్ధికి దోహదపడగలదని రెడ్ సీర్ తెలిపింది. కొత్త మోడల్స్ ఆవిష్కరణల ఊతంతో మొబైల్స్ విక్రయాలు అత్యధికంగా ఉండగలవని, ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్..గృహోపకరణాలు మొదలైనవి ఉంటాయని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
అద్భుతఫీచర్లు, బడ్జెట్ ధర: రెండు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. మోటరోలా జీ సిరీస్‌లో మోటో జీ10పవర్, మోటో జీ 30పేర్లతో బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తాయనికంపెనీ తెలిపింది.అలాగే మాలావేర్,, ఫిషింగ్ ఇతరసైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను రక్షించే విషయంలో నాలుగు పొరల భద్రతను అందించే మొబైల్ టెక్నాలజీ కోసం థింక్‌షీల్డ్‌తో తీసుకొచ్చినట్టు మోటరోలా ప్రకటించింది. అలాగే బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మోటో జీ10 పవర్ 6.5 అంగుళాల మాక్స్ విజన్ హెచ్డీ + డిస్ప్లే. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ 48+ 8+ 2+2 రియర్ క్వాడ్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 1 టీబీ జీబీ వరకు విస్తరించుకునేఅవకాశం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో జీ 30 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 1 టీబీ జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+8+2+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు, లభ్యత మోటో జీ 10 పవర్ మార్చి 16, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకం. అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో లభ్యం. ధర రూ. 9,999. మోటో జీ 30 మార్చి 17, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. డార్క్ పెర్ల్, పాస్టల్ స్కై కలర్లలో లభ్యం. ధర రూ. 10,999 -
లెనోవా కొత్త స్మార్ట్ఫోన్లు
బీజింగ్: లెనోవా కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. లెనోవా కే 12 , లెనోవా కే 12 ప్రో పేరుతో మోటో ఈ 7 ప్లస్ , మోటో జీ 9 పవర్ ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లుగా చైనాలో తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ ఆక్టా-కోర్ ప్రాసెసర్లను పొందుపర్చింది. లెనోవా కె 12, లెనోవా కె 12 ప్రో: ధరలు లెనోవా కే 12 ( 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) ధర సుమారు రూ. 9,000 ఇది గ్రేడియంట్ బ్లూ మరియు గ్రేడియంట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెనోవా కె 12 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 11,300. ఇది పర్పుల్ , గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్ కోసం సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 12 నుండి అమ్మకాలు ప్రారంభం. ఇండియా తదితర మార్కెట్లో ఇవి ఎపుడు లభ్యమయ్యేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లెనోవా కే12 ఫీచర్లు 6.5-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460సాక్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 48+2 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లెనోవా కె 12 ప్రో ఫీచర్లు 6.8-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే 720x1,640 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 సాక్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 512 జీబీ స్టోరేజ్‌ను వరకు విస్తరించుకునే అవకాశం 64+ 2 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాటికి షాక్ : అతి తక్కువ ధరల్లో మైక్రోమాక్స్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ బ్రాండ్ పేరుతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. నోట్ 1, 1బీ పేరుతో స్మార్ట్న్లను మంగళవారం లాంచ్ చేసింది. మార్కెట్లో పోటీ ధరలకు భిన్నంగా బడ్జెట్ ధరల్లో తనకొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. గేమింగ్ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్1 బీ ఫీచర్లు 6.5 హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 13+2 ఎంపీ రియర్ ఏఐ కెమెరా 8 ఎంపీ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇన్ 1బీ ధరలు 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 6999 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 7999 ఫస్ట్ సేల్ నవంబరు 26 నుంచి ప్రారంభం ఇన్ నోట్ 1ఫీచర్లు 6.67హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) ఆండ్రాయిడ్ 11, 12 అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ 48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్ ఏఐ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వా (టైప్-సి) నోట్ 1 ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499 గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం. -
బడ్జెట్ ధరలో రియల్మీ క్యూ2 5జీ స్మార్ట్ఫోన్లు
సాక్షి,ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా 5 జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ క్యూ2, రియల్మీ క్యూ2 ప్రో, రియల్మీ క్యూ2ఐ అనే మూడు స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసింది. రియల్మీ క్యూ, రియల్మీ క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలోనూ, రియల్మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్నాయి. రియల్మీ క్యూ2 ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2 ప్రో ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2ఐ ఫీచర్లు 6.5 అంగుళాల డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్ ఆండ్రాయిడ్ 10 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక ధరల విషయానికి వస్తే రియల్మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200 రియల్మీ క్యూ2 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. రియల్మీ క్యూ2ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,000 -
మరో బడ్జెట్ ఫోన్ : మోటో ఈ7 ప్లస్
సాక్షి, ముంబై: మోటోరోలా కంపెనీ మోటో ఈ7 ప్లస్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. బిగ్ స్క్రీన్, బారీ కెమెరా, 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో పది వేల రూపాయల ధరలో దీన్ని అదుబాటులోకి తీసుకొచ్చింది. మోటో ఈ7 ప్లస్ ఫీచర్లు 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 48+ 2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ధర, లభ్యత: మోటో ఈ7 ప్లస్ ధర 9,499 రూపాయలు మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్స్ లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ✔️ 48 MP f/1.7 dual camera ✔️ Night Vision technology ✔️ Ultra-fast Snapdragon™ 460 with 4GB RAM ✔️ 5000 mAh battery ✔️ 6.5" HD+ display ✔️ Stock Android experience Get these & more in #motoe7plus. Available for ₹9,499 from 30th Sep, 12PM on @flipkart! https://t.co/7vqOwIiL6n pic.twitter.com/by6nbFYFuh — Motorola India (@motorolaindia) September 23, 2020 -
రియల్మీ నార్జో 20 సిరీస్ ఫోన్లు : ఫీచర్లు ఇవే
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దారు రియల్మీ నార్జో 20 సిరీస్ స్మార్ట్ఫోన్లను సోమవారం లాంచ్ చేసింది. రియల్మీ నార్జో 20,నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇప్పటికే రెండు బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేసి జోరుమీదున్న రియల్మీ తాజా ఫోన్లను కూడా బడ్జెట్ ధరల్లోనే తీసుకొచ్చింది. రియల్మీ నార్జో 20ఏ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే కాల్కం స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ 12+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3 జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర 8499 రూపాయలు. 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ మోడల్ 9499 రూపాయలు సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం రియల్మీ నార్జో 20 6.5 అంగుళాల స్క్రీన్ మీడియా టెక్ హీలియో జీ 85సాక్ 48+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ 10,499 రూపాయలు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 11,499 కు రూ సెప్టెంబర్ 28 న మధ్యాహ్నం 12:00 గంటలకు తొలి సేల్ రియల్మీ నార్జో 20 ప్రొ 6.5 అంగుళాల ఫుల్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే మీడియా టెక్ హీలియో జీ 95 చిప్ సెట్ 48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ 14,999 రూపాయలు 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ 16,999 రూపాయలు మొదటి అమ్మకం సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం 12:00 గంటలకు -
భారీ బ్యాటరీ, బడ్జెట్ ధర : రియల్‌మి స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: రియల్‌మి సంస్థ కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. రియల్‌మి సీ సిరీస్ లో కొనసాగింపుగా బడ్జెట్ ధరలో రియల్‌మి సీ 12, సీ15 ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. కోవిడ్ -19మహమ్మారి కారణంగా ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా వీటిని తీసుకొచ్చింది. వీటితోపాటు రియల్మిటీ షర్టులను, ఇయర్ బడ్స్ ను కూడా సంస్థ లాంచ్ చేసింది. స్మార్ట్ టీవీలను భారతదేశంలో స్థానికంగా నోయిడాలో తయారు చేయడం ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మి సీ15 ఫీచర్లు 6.5అంగుళాల మినీ-డ్రాప్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 35 సాక్ 13 + 8 + 2 + 2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6,000 ఎంఏహెచ్ 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. రియల్‌మి సీ15ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది.. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 9,999 రూపాయలు 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర 10,999 రూపాయలు ఆగస్టు 27 న ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో తొలిసేల్ ఆరంభం. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. రియల్‌మి సీ12 6.5అంగుళాల హెచ్డి + ఎల్సిడి డిస్ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ35 ప్రాసెసర్, 13 + 2 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 10 వాట్స్ చార్జింగ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రియల్‌మి సీ 12 సింగిల్ వేరియంట్లో తీసుకొచ్చింది. దీని ధరను (3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) 8,999 గా ఉంచింది. ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో దీని మొదటి అమ్మకం ఆగస్టు 24 న ప్రారంభం -
రియల్‌మి స్మార్ట్ ఫోన్లు : సూపర్ ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి ఎక్స్ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ ద్వారా లాంచ్ చేసింది. రియల్‌మి ఎక్స్ 3, రియల్‌మి ఎక్స్ 3 సూపర్‌జూమ్ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ధర, లభ్యత రియల్‌మి ఎక్స్ 3 రెండు వేరియంట్లలో లభ్యం. 6జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్,/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 25,999 రూపాయలు రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ లోయర్ వేరియంట్ 27,999 రూపాయలు 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 32,999 రూపాయలు ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మి వెబ్సైట్ ద్వారా జూన్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి. జూన్ 27వ తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు , ఈఎంఏ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ రియల్‌మి ఎక్స్ 3 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16+ 8-మెగాపిక్సెల్ డబుల్ సెల్పీ కెమెరా 64+8+12+2-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్ 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 32+8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వివాదం, చైనా దిగుమతులు, వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో రీ ఎంట్రీకి సిద్ధ మవుతోంది. తాజాగా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను దేశీయంగా విడుదల చేయాలని యోచిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా ఉన్న మైక్రోమాక్స్ చైనా ఫోన్ల కంపెనీల దూకుడుతో వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో బడ్జెట్ ఫోన్లతో వినియోగదారులను ఆకర్షించనుంది. మోడ్రన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ల ధర 10వేల రూపాయల లోపు ఉంటుందని అంచనా గత అక్టోబర్ లో సంస్థ లాంచ్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ ఐఓన్ నోట్. దీని ధర 8,199 రూపాయలు. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నామని మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. అంతర్గతంగా చాలా కృషి చేస్తున్నాం..త్వరలోనే ఒక బిగ్ లాంచింగ్ తో వస్తున్నాం...వేచి ఉండండి! అంటూ వినియోగదారుల్లో ఒకరికి మైక్రోమాక్స్ సమాధానం ఇచ్చింది. మేడ్ బై ఇండియన్, మేడ్ ఫర్ ఇండియన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. A device with premium features, thoroughly modern look and budget friendly, how does that sound Nani Kishor?🙂 Stay tuned. #Micromax #MadeByIndian #MadeForIndian — Micromax India (@Micromax_Mobile) June 18, 2020 -
అద్భుత కెమెరాలతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సరికొత్త డిజైన్ , అద్బుతమైన కెమెరాలతో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో ఎల్జీ వెల్వెట్ అని పేరుతో వీటిని లాంచ్ చేయనుంది. ఫోన్ డిజైన్ కి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఎల్జీ వెల్వెట్‌ను మే 7 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వీడియో టీజర్ ద్వారా ప్రకటించింది. తమ తాజా స్మార్ట్‌ఫోన్ డిజైన్ ప్రత్యర్థి స్మార్ట్ఫోన్లకు భిన్నంగా ఉంటుందని ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఎల్జీ పేర్కొంది. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్, 5జీ సపోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,ఎల్ఈడీ ఫ్లాష్ వెనుకవైపుమూడు కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నందున ఇది ముగిసిన తరువాత ఎల్జి వెల్వెట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యం కానుందని భావిస్తున్నారు. -
వన్‌ప్లస్ సర్ప్రైజ్; తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: వన్‌ప్లస్ తన లేటెస్ట్ స్టార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8 ప్రోలను ఇటీవల గ్లోబల్ మార్కెట్ల ధరలను ప్రకటించిన కొద్ది రోజుల తరువాత సోమవారం భారత్ లో వీటిలో ధరలను వెల్లడించిది. వన్ ప్లస్ బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్)ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. వీటి ధరను రూ. 1999గా వుంచింది. వన్‌ప్లస్ 8 సిరీస్ ధరలు రూ. 41,999 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ ప్రో ఫోన్ల అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ రెండు ఫోన్ల అమ్మకానికి ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించకపోయినప్పటికీ, బహుశా కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేసాక మే 3 తరువాతనుంచి అమ్మకాలకు అనుమతి లభించనుంది. ఆన్లైన్లో అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్‌లో లభిస్తాయి. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తాయి. అయితే వన్‌ప్లస్ 8, 6 జీబీ వేరియంట్ ఆన్లైన్లో అమెజాన్‌లో మాత్రమే లభిస్తుంది.(అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచ్) వన్‌ప్లస్ గ్లోబల్ లాంచ్ సందర్భంగా ప్రకటించని వన్‌ప్లస్ 8 స్పెషల్ వేరియంట్ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)ను కూడా భారతదేశంలో విక్రయించబోతోంది. అంతేకాదు భారతదేశంలో వన్‌ప్లస్ 8 ప్రో ధరలు ప్రపంచ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే తీసుకురావడం విశేషం. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .41,999గా వుంటుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ .44,999 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ .49,999 వన్‌ప్లస్ 8 ప్రో ధరలు వన్‌ప్లస్ 8 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ .59,999 గా ఉండబోతోంది. బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్) దరను రూ. 1999గా వుంచింది. -
అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త ఆక్సిజన్ ఓఎస్ ఫీచర్లు స్మూత్ బాటిల్ 2.0, న్యూ డార్క్ థీమ్, డైనమిక్ వాల్ పేపర్స్, లైవ్ క్యాప్షన్, అమెజాన్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్, అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ, యాప్ గ్యాలరీ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను అధునాతనంగా అందించినట్టు కంపెనీ వెల్లడించింది. 5జీ సపోర్ట్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ను మంగళవారం రాత్రి ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. భారతీయ మార్కెట్ల ధరలపై స్పష్టంగా ప్రస్తావించకపోయినప్పటికీ అందుబాటులో ధరల్లోనే వుంటాయంటూ వన్‌ప్లస్ ట్వీట్ చేసింది. వన్‌ప్లస్ 8 ఫీచర్లు 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ ఆండాయిడ్ 10 48+2మాక్రో లెన్స్+16 ఎంపీ టెర్టియరీ సెన్సార్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్. బ్యాటరీ సామర్థ్యం వన్‌ప్లస్ 8 ప్రో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 10, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ 1440x3168 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీర్యామ్,128 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+8+48+5 ఎంపీ క్వాడ్ రియర్ కెమరా 4510ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం భారత మార్కెట్లో వీటి ధరలపై అంచనా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.53,200 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60,800 వన్‌ప్లస్ 8 ప్రో ధరలు ప్రారంభ ధర రూ. 55,000 Good things come to those who w8 ⏰ pic.twitter.com/t7OrAPlNBR — OnePlus India (@OnePlus_IN) April 14, 2020 -
షావోమి మొబైల్స్ స్మార్ట్ ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్మి నోట్ 9 ప్రో పేరుతో వీటిని గురువారం భారతదేశంలో విడుదల చే సింది. భారీ బ్యాటరీతోపాటు, క్వాడ్ కెమెరాలు, హోల్-పంచ్ డిస్ప్లే రెండు ఫోన్లలోనూ అమర్చింది. రెడ్మి నోట్ 9 ప్రొ మ్యాక్స్ 6.67 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 32 ఎంపీ సెల్పీకెమెరా 64+8 +5+2మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ధరలు : 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ రూ. 16,999 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ రూ. 18,999 రెడ్మి నోట్ 9 ప్రొ 6.67 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+8+ 5+ 2-మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 5020 ఎంఏహెచ్‌బ్యాటరీ సామర్థ్యం ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 12,999 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ రూ. 15,999 ఈ రెండు ఫోన్లు ఔరా బ్లూ, గ్లేసియర్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం. రెడ్మి నోట్ 9 ప్రొ మార్చి 17 నుంచి, రెడ్ మి 9నోట్ ప్రొ మ్యాక్స్మార్చి 25 నుంచి కొనుగోలుకు అందుబాటులో వుంది. -
శాంసంగ్ ప్రభంజనం, అద్భుత ఫీచర్లు, ఫోటోలు
శాన్ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాలను విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగానే గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఎస్11కు బదులుగా శాంసంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత కెమెరాలు, 5 జీ టెక్నాలజీ, భారీ స్టోరేజ్ లాంటి అద్భుతమైన ఫీచర్లను జోడించి తన ఫ్లాగ్షిప్ ఫోన్లను ఆవిష్కరించింది. దీంతోపాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. మొత్తం సిరీస్‌లో స్టోరేజ్ పరంగా, డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా తీసుకొచ్చింది. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జి ఫీచర్‌ను ప్రధాన ఆకర్షణ. గెలాక్సీ ఎస్20 ఫీచర్లు 6.2 అంగుళాల డిస్ప్లే 64+12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ బ్లూ, పింక్, గ్రే కలర్స్‌లో లభ్యం గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఫీచర్లు 6.7 ఇంచుల క్వాడ్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే 64+12 +12,3ఎక్స్ ఆప్టికల్ జూమ్ క్వాడ్ రియర్ కెమెరా 10ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రెండు ఫోన్లను రెండువేరియంట్లలో లాంచ్ చేసింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం అలాగే ఈ ఫోన్లలో ఆయా దేశాల మార్కెట్లకు అనుగుణంగా స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్లు వినియోగదారులకు లభిస్తాయి. ఈ ఫోన్లలోఅందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ బిక్స్బీ, హెల్త్, శాంసంగ్ పే యాప్‌లు.. తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో యూజర్లు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా ఫీచర్లు 6.97 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ 3200 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 12/16 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్ 108+12 + 48 ట్రిపుల్ రియర్ కెమెరా 40 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు గెలాక్సీ ఎస్20 4జి -981 డాలర్లు రూ.69,980 గెలాక్సీ ఎస్20 5జి - 999 డాలర్లు సుమారు.రూ.71,325 గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జి 128జీబీ వేరియంట్ 1199 డాలర్లుసుమారు రూ.85,590 గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జి 512జీబీ - 1299 డాలర్లు సుమారు. రూ.92,720 గెలాక్సీ ఎస్20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ - 1399 డాలర్లు సుమారు రూ.99,840 గెలాక్సీ ఎస్20 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ - 1499 డాలర్లు సుమారు రూ.1,06,975 ఈ స్మార్ట్పోన్లు అన్నింటిలోనూ కెమెరాల ద్వారా యూజర్లు ఏకంగా 8కె రిజల్యూషన్‌తో అద్భుతమైన క్వాలిటీ వీడియోలను చాలా సులభంగా షూట్ చేసుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానుండగా, మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. అయితే ఈ ఫోన్లను భారత్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ, వాటి ధర వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. చదవండి: శాంసంగ్ జెడ్ ప్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ దిగొస్తున్న పుత్తడి ధర -
షావోమి రెండు స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి రెండ స్మార్ట్ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. రెడ్మి నోట్ 8, నోట్ 8 ప్రొ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. అక్టోబరు 21నుంచి అమెజాన్ ద్వారా ఇవి విక్రయానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. రెడ్మి నోట్ 8 సిరీస్‌లో రెడ్మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ డివైస్‌లను ఇప్పటికే చైనా మార్కెట్లోకి వీటిని తీసుకు వచ్చింది. రెడ్మి నోట్ 8 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 సాక్ 4 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 48+ 8 + 2 +2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4జీబీ/64జీబీ ధర రూ.9,999 6జీబీ/128జీబీ ధర రూ.12999 రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు 6.53 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ జీ90టీ ఆండ్రాయిడ్ 9 పై 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 4+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6జీబీ/64జీబీ ధర రూ.14999 6జీబీ/128జీబీ ధర రూ.15,999 8జీబీ/128జీబీ ధర రూ.17999 With the #RedmiNote8Pro and #RedmiNote8, we have completely refreshed the 8 series. Mi fans, you will notice that we have brought premium features to budget and mid-premium phones with the 8 series. pic.twitter.com/sPn8tYQSn2 — Redmi India for #MiFans (@RedmiIndia) October 16, 2019 -
ఆపిల్ ఫోన్లు లాంచింగ్ నేడే..
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన నూతన ఐఫోన్లను రోజు (సెప్టెంబరు 10, మంగళవారం) విడుదల చేయనుంది. స్టాటస్ సింబల్ గా భావించే, అందులోనూ కేంద్ర ప్రభుత్వ కొత్త ఎఫ్‌డీఐ నిబంధనల నేపథ్యంలో అందుబాటు ధరలో లభించనున్న ఈ కొత్త ఐఫోన్ల కోసం ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆ ఫోన్లకు గాను ఆపిల్ ప్రీ ఆర్డర్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ సారి మూడు కొత్త ఐఫోన్లను ఆపిల్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో లో ఎండ్ ఐ ఫోన్లు ముందుగా అందుబాటులోకి తీసుకురానుంది. తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 11, ఐఫోన్11 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ మోడళ్ళు రానున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఐఫోన్ 11, వాచ్‌లను విడుదల చేయనుంది. అంతేకాదు చౌకధరలో ఐఫోన్ ఎక్స్ ఎస్ మోడల్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా ఉన్నాయి ఐఫోన్ 11 ఫీచర్లు 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 3డీ టచ్ ఫార్మాట్ ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3110 ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు ధర: రూ. 53,700 ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు 5.8 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12+12 ఎంపీ రియర్ కెమరా 12ఎంపీసెల్పీ కెమెరా 3190 ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు సుమారు రూ.71,000 ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫీచర్లు 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12+12 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు ధర: రూ.78,800 -
జెడ్ 6 ప్రొ ఫీచర్లు అదుర్స్!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ లెనోవో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. లెనోవో జెడ్ 6 ప్రొ, లెనోవో కే 10 నోట్, లెనోవో ఏ6 నోట్ పేర్లతో వీటిని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ప్రధానంగా ప్రీమియం మోడల్ జెడ్ 6 ప్రొ లో 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను, 12 జీబీ ర్యామ్, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీతో పాటు, నాలుగు కెమెరాలను, 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అమర్చింది. లెనోవో జడ్ 6 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+16+ 8+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ. 33,999 లెనోవో కే 10 నోట్ ఫీచర్లు 6.30 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+ 8+5 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ.13,999 లెనోవో ఏ 6 నోట్ ఫీచర్లు 6.09 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియా టెక్ హీలియో పీ 22 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 7999 ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయానికి లభ్యం. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన ఆఫర్స్‌ను కంపెనీ అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. -
నాలుగు కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు
ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో బుధవారం తమ రెనో సిరీస్ లో 3 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రెనో 2, రెనో 2జెడ్, రెనో 2 ఎఫ్ పేరుతోతీసుకొచ్చింది. రెనో ఫోన్లకు కొనసాగింపుగా రెనో 2 సిరీస్‌లో వీటిని ఆవిష్కరించింది. రెనో మోడల్ లో 10ఎక్స్ జూమ్ అందరిని ఆకట్టుకోగా రెనో 2 మొబైల్స్ 20 ఎక్స్ జూమ్ ఏర్పాటు చేయడం విశేషం. అలాగే ఈ మూడు ఫోన్లలో నాలుగు రియర్ కెమెరాలు మరో ప్రత్యేకత. 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, 13 ఎంపీ టెలి ఫోటో సెన్సర్, 2 ఎంపీ బొకే ఎఫెక్ట్ సెన్సర్ వాడారు. రెనో 2 మోడల్ లో స్నాప్ డ్రాగన్ 730, రెనో 2 జెడ్ లో మీడియాటెక్ హిలియో పి90, రెనో 2ఎఫ్ లో మీడియాటెక్ హిలియో పీ 70 ప్రాసెసర్లను వాడింది. ఈ మూడింటిలోనూ 6.5 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చింది. అలాగే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వూక్ ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని పొందుపర్చింది. రెనో 2 ఫోన్ ప్రత్యేకతలు : అల్ట్రా డార్క్ మోడ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ షార్క్ ఫిన్ రైసింగ్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ కోసం అల్ట్రా స్టడీ మోడ్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్, ముందు, వెనక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, యూజర్ కంటి రక్షణకు బ్లూ లైట్ ఫిల్టర్. రెడ్ 2 జెడ్, 2 ఎఫ్ స్మార్ట్ఫోన్లలో పాప్ అప్ సెల్ఫీ కెమెరాను అమర్చింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో అధికారిక వెబ్సైట్ల ద్వారా లభించనున్నాయి. ధరలు : రెనో 2 ధర రూ. 36,990, రెనో 2 జెడ్ ధర రూ. 29,990. ఈ రెండు ఫోన్లు వరుసగా సెప్టెంబర్ 20, 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. అయితే, రెనో 2 ఎఫ్‌ను మాత్రం నవంబరు నుంచి లభ్యం కానుంది. ఒప్పో రెనో 2 ఫీచర్లు 6.55 అంగుళాల డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ పై 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+13+8+2 రియర్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో రియల్ మి ఎక్స్ లాంచ్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పొ సబ్ బ్రాండ్ రియల్ మి రియల్ మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్ మి ఎక్స్ ఫీచర్లు 6.53 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ డిస్ప్లే సెన్సార్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 710 ఎస్ఓసీ 48 +5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3765 ఎంఏహెచ్ బ్యాటరీ(ఫాస్ట్ ఛార్జింగ్) ధరలు 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ = సుమారు 16,999 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ = 19,999 పోలార్ వైట్, స్పేస్ బ్లూస్ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూలై 24 నుంచి లభ్యం కానుంది. -
హానర్ 20 సిరీస్ స్మార్ట్ఫోన్లు లాంచ్
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ 20 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో తాజాగా స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించడం గమనార్హం. హానర్ 20, హానర్ 20 ప్రొ, హానర్ 20 ఐ పేర్లతో వీటిని లాంచ్ చేస్తోంది. క్వాడ్ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, బడ్జెట్ ధరలో హానర్ 20ఐ ని లాంచ్ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా, డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒకేలా ఉంచింది. అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్ కెమెరాలతో లాంచ్ చేసింది. హానర్ 20 ప్రొ ఫీచర్లు 6.26 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ 6/8జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 7ఎన్ఎం కిరిన్ 980 ప్రాససర్ 48+16+2+ ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు హానర్ 20 : ధర రూ. 32,999 జూన్ 25నుంచి లభ్యం. హానర్ 20 ప్రొ : ధర రూ. 39,999 కమింగ్ సూన్ హానర్ 20ఐ రూ.14, 999 జూన్18 నుంచి లభ్యం. -
అద్భుత ఫీచర్లతో ఒప్పో రెనో...
సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ రెనో సిరీస్ లోరెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో, రెనో 10ఎక్స్ జూమ్ పేరుతో మంగళవారం వీటిని భారత మార్కెట్లో న్యూఢిల్లీలో విడుదల చేసింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటిఫీచర్లు వీటిల్లో జోడించింది. ఒప్పో రెనోను సింగల్ వేరియంట్‌గానే తీసుకురాగా, రెనో ఎక్స్ జూమ్‌ను రెండు వేరియింట్లలోలాంచ్ చేసింది. ఈ ఫోన్ వినియోగదారులకు జూన్ 7వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పే టీఎం మాల్, స్నాప్డీల్ద్వారా లభ్యం కానుంది. ఒప్పో రెనో ఫీచర్లు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై 48+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3765 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : 6జీబీర్యామ్/128జీబీ స్టోరేజ్ రూ.32,990 రెనో 10 ఎక్స్ జూమ్ ఫీచర్లు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్855 ప్రాసెసర్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ 48+13+8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4065 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు : 6జీబీర్యామ్/128జీబీ స్టోరేజ్ రూ.39,990 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ రూ.49,990 -
బడ్జెట్ ధరల్లో రియల్ మి స్మార్ట్ఫోన్లు
బీజింగ్ : ఒప్పో సబ్‌బ్రాండ్ రియల్ మి బడ్జెట్‌ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను గురువారం లాంచ్ చేసింది. రియల్ మి ఎక్స్ , రియల్ మి ఎక్స్ లైట్ పేరుతో రియల్ మి చైనాలో విడుదల చేసింది. త్వరలోనే వీటిని ఇండియా మార్కెట్లో కూడా లాంచ్ చేయనున్నామని రియల్ మి ఇండియా సీఈవో మాధవ సేథ్ దృవీకరించారు. రియల్ మి ఎక్స్ ఫీచర్లు 6.5 డిస్ప్లే స్నాప్ డ్రాగన్710 చిప్సెట్ 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 6/6జీబీ ర్యామ్ , 64/128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ సోనీ సెన్సర్ +5 ఎంపీ కెమెరా 16 ఎం పీ సెల్ఫీ కెమెరా 3765 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,300 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూప.15,400 రియల్‌మి ఎక్స్ లైట్ 6.3ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 16+5 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 4045 ఎంఏహెచ్‌బ్యాటరీ ధర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999 With Sky Li our global CEO and the amazing team! That marks the start of our journey in China. #RealmeX is coming soon to India :) #PopupCamera #48MP pic.twitter.com/uWdk19itvb — Madhav Sheth (@MadhavSheth1) May 15, 2019 -
స్మార్ట్ ఫీచర్స్, బడ్జెట్ ధర : నోకియా రెండు స్మార్ట్ఫోన్లు
మొబైల్స్ తయారీదారు నోకియా హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. మే 7న కొత్త నోకియా 4.2, నోకియా 3.2 పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ధర వివరాలను అధికారికంగారీవీల్ చేయనప్పటికీ బడ్జెట్ ధరలోనే వీటిని అందుబాటులోకి తేనుందని సమాచారం. నోకియా 3.1కి కొనసాగింపుగా 3.2, నోకియా 4 సిరీస్‌లో 4.2ను తీసుకొస్తోంది. నోకియా 4.2 ఫీచర్లు 5.71 ఇంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 పై 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 13+ 2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 3.2 ఫీచర్లు 6.26 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 429 2/3 జీబీ ర్యామ్,16/32 జీబీ స్టోరేజ్ 13 ఎంపి రియర్ కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ All your answers are a tap away. 4 days before you can #DoItAll Stay tuned! pic.twitter.com/r4Jwsxj744 — Nokia Mobile India (@NokiamobileIN) May 3, 2019 -
శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ : పాప్ అప్ కెమెరా ఫోన్
దక్షిణ కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌పై వేగం పెంచింది. ఇటీవల ఏ, ఎం సిరీస్‌లలో ఇటీవల గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్ వచ్చే నెలలో మరో శాంసంగ్ గెలాక్సీ బిగ్ ఈవెంట్ నిర్వహించనున్నామని వెల్లడించింది. ఏప్రిల్ 10న ఈ ఈవెంట్ జరగనుందంటూ శాంసంగ్ ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను గోప్యంగా ఉంచింది. అయితే ఈ ఈవెంట్‌పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రీమియం మిడ్ రేంజ్లో పాప్ అప్ కెమెరాతో ఏ90ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయనుంది. బ్యాంకాక్, మైలాన్, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ 20 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. దీంతోపాటు ఏ40, ఏ 20ఈ లను కూడా తీసుకురానుందట. ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఏ 30, ఏ 50, ఏ 10 స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Enter the era of live. April 10, 2019 - Live on https://t.co/kDIR3TcbZ5 #SamsungEvent pic.twitter.com/EqN8wF04Wd — Samsung Mobile (@SamsungMobile) March 18, 2019 -
శాంసంగ్ ఫోన్లు లాంచ్...సామ్ సందడి
సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ప్రతీ ఏడాది ఆరంభంలో ఎస్ సిరీస్ గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చే సంస్థ గెలాక్సీ వెర్షన్లో ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఈ మోడళ్లను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బిగ్ సి షోరూంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత లాంచ్ చేశారు. సినిమాటిక్ ఇన్ఫినిటీ ఓ- డిస్ల్పే, ఎన్హ్యాన్స్డ్ కెమెరా, ఇన్-డిస్ల్పే ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి అధునాతన ఫీచర్లు ఈ మోడల్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గెలాక్సీ ఎస్10ఈ కేవలం 128 జీబీ వేరియంట్లో మాత్రమే లభించనుంది. ప్రారంభ ధర. రూ. 55,900గా ఉంది. అలాగే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ యూజర్లకు అదనపు డేటా ప్రయోజనాలతో పాటు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. గెలాక్సీ ఎస్10 ఫీచర్లు 6.1 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్డ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్,128 స్టోరేజ్ 16 +12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ 128జీబీ, 512జీబీ స్టోరేజ్ రెండు రియంట్లలో లభ్యం. గెలాక్సీ ఎస్10 ప్లస్ 6.4 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్ 12+12+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 128జీబీ, 512జీబీ,1 టెర్రా బైట్ మూడు వేరియంట్లలో లభ్యం. 1 టీబీ వేరియంట్ ధర రూ. 1,17,900 512 జీబీ వేరియంట్ ధర రూ. 91,900 128 జీబీ వేరియంట్ ధర రూ. 73,900 గెలాక్సీ ఎస్10ఈ 5.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ కర్వ్డ్ డిస్ప్లే లేదు ఆండ్రాయిడ్ 9.0 పై 16+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 10ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ.55,900 బ్లాక్, సియాన్, బ్లూ, ఎల్లో రంగుల్లో లభ్యం. కాగా ఇప్పటికే ఈ మోడళ్లను శాన్ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 20న అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశీయ ప్రీమియం మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న యాపిల్ ఐఫోన్, గూగుల్ పిక్సెల్ మోడళ్లకు ఈ నూతన గెలాక్సీ మోడళ్లు గట్టి పోటీ ఇస్తాయని సంస్థ భావిస్తోంది. -
శాంసంగ్ ఏ50, ఏ30 స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీదారు శాంసంగ్ నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లను తీసుకు లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ30, ఏ50 పేర్లతో రెండు ఫోన్లను శాంసంగ్ నెదర్లాండ్స్‌లో తీసుకొచ్చింది. ఇండియా మార్కెట్ సహా మార్చి మధ్యలో గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15 వాట్స్ ఫాస్ట చార్జ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకతలుగా ఉన్నాయి. అధికారికంగా ధరలు వెల్లడికానప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ50 ధర : రూ. 28,500 శాంసంగ్ గెలాక్సీ ఏ50 ఫీచర్లు 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ/ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 25+5+8 ట్రిపుల్ రియర్ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఏ30 ఫీచర్లు 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 3జీబీ/ 4జీబీర్యామ్ 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ ఎస్10ప్లస్ ఓ గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆపిల్‌కు పోటీగా, ప్రీమియం ఫీచర్లతో తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ప్లస్ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది. ఎస్ సిరీస్‌లో శాన్ఫ్రాసిస్కోలో బుధవారం (ఫిబ్రవరి 10) ఆవిష్కరించిన ఎస్ 10ప్లస్, ఎస్ 10, ఎస్10ఈ డివైస్‌లను మార్చి 8న నుంచి దేశీయంగా అందుబాటులోకితీసుకొచ్చామని శాంసంగ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 1 టీబీ, 512 జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఎస్ 10 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.1,17,900, రూ. 91,900 రూ. 73,900గా ఉండనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ధర 128జీబీ వేరియంట్ రూ.66,900, 512 జీబీ వేరియంట్ ధర్ రూ. 84,900గా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ రూ. 55,900లకు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ లాంటి ఇతర రీటైల్ అవుట్ లెట్లలో మార్చి 5వ తేదీనుంచి ప్రీ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రీబుకింగ్ చేసుకున్న వారు మార్చి 6వ తేదీనుంచి ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. మార్చి 8నుంచి విక్రయాలు ప్రారంభం. అయితే శాంసంగ్‌కు చెందిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ భారత మార్కెట్లలో ఎపుడు లభించేది స్పష్టం చేయలేదు. గెలాక్సీ ఎస్10 ప్లస్ ఫీచర్లు 6.4 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్ 12+12+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ చైనా మార్కెట్ సహా, ప్రపంవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్న క్రమంలో ఆపిల్ సంస్థకు శాంసంగ్ తాజా స్మార్ట్ఫోన్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటర్ ప్రింట్ రీసెర్చ్ సమాచారం ప్రకారం భారతీయ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 2018లో 8శాతం వృద్ధిని నమోదు చేయగా, 34 శాతం మార్కెట్వాటా శాంసంగ్ సొంతం. అయితే ఆపిల్ 23 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
అదరగొడుతున్న శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ మొబైల్ తయారుదారు శాంసంగ్ మరోసారి తన ప్రత్యేకను చాటుకుంది. తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఫ్లాగ్షిప్ డివైస్‌లను ఒకేసారి ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్10ఇ, ఎస్10, ఎస్10 ప్లస్ పేరుతో స్మార్ట్ఫోన్లను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా డిస్‌ప్లేలోనే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, పంచ్ హోల్ ఇన్‌స్క్రీన్ డిస్ప్లే గెలాక్సీ ఎస్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. గెలాక్సీ ఎస్10 ఫీచర్లు 6.1 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్డ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్, 512 వరకు మెమరీ 16 +12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రారంభ ధర సుమారు రూ.64,000 గెలాక్సీ ఎస్10 ప్లస్ 6.4 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్ 12+12+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 128జీబీ, 512జీబీ,1 టెర్రా బైట్ మూడు వేరియంట్లలోలభ్యం. ప్రారంభ ధర సుమారు రూ.71,000 గెలాక్సీ ఎస్10ఈ 5.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ కర్వ్డ్ డిస్ప్లే లేదు ఆండ్రాయిడ్ 9.0 పై 16+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 10ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రారంభ ధర సుమారు రూ.53,000 బ్లాక్, సియాన్, బ్లూ, ఎల్లో రంగుల్లో లభ్యం. A next generation device in a size that’s just right for you. #GalaxyS10 #SamsungEvent Learn more: https://t.co/H4UtwA7l4B pic.twitter.com/U2WosF760h — Samsung Mobile (@SamsungMobile) February 20, 2019 -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు త్వరలో
సౌత్ కొరియాఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను తీసుకురానుంది. తద్వారా భారతీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో పాగావేసిన చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమిని సవాల్ చేయనుంది. ఎం సిరీస్ గెలాక్స్ ఫోన్లపై గత ఏడాది డిసెంబరులోనే న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదించడం గమనార్హం. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం’ (ఎం=మిలినియల్స్) సిరీస్‌లో ఫోన్లను లాంచ్ చేయనుంది. అంటే లక్షలమందిని కస్టమర్లను ఆకర్షించాలనేది ప్లాన్. ముఖ్యంగా గెలాక్సీ ఎం సిరీస్‌లో ఎం10, ఎం20, ఎం30 పేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఇన్ఫినిటీ వినాచ్ డిస్ప్లేతో ఈ నెలలోనే వీటిని లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఎం10ను (6 అంగుళాల డిస్ప్లే) రూ.9500, ఎం20 (6.3 అంగుళాల డిస్ప్లే), ఎం30 ధరతో సుమారు రూ.12 నుంచి రూ.15వేల ధరకు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎం30 డివైస్‌లో ట్రిపుల్ కెమెరా మెయిన్ ఫీచర్‌గా ఉండనుందట. భారత్‌లోనే గ్లోబల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం మరో విశేషం. శాంసంగ్ సొంత ఎక్సినాస్ 7885 ప్రాసెసర్‌తో పాటు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1ఓరియో, భారీ డిస్ప్లే, ఆకర్షణీయమైనకెమెరా, భారీబ్యాటరీతో ఈ ఫోన్లు మార్కెట్లో త్వరలోనే హల్చల్ చేయనున్నాయి. వీటి ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. ఎం10 : 6 అంగుళాల డిస్ప్లే, 8 ఎంపీసెల్పీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్; 7870 ఆక్టాకోర్ ప్రాససర్, ఆండ్రాయిడ్ ఓరియో, 3జీబీ ర్యామ్, 16/32జీబీ స్టోరేజ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 20 : 60.3 ఇంచెస్‌డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 32జీబీ/64 స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13+5 డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 30 : 6.3 ఇంచెస్‌డిస్‌ప్లే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 13+5+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లతో నాలుగు వోటో స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: వోటో మొబైల్స్ కంపెనీ వరుసగా నాలుగు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వి11, వి12, వి3, వి5ఎక్స్ పేరుతో, బడ్జెట్ ధరల్లో భారత మార్కెట్లో తాజాగా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ , డ్యుయల్ సెల్ఫీ కెమెరా లాంటి మంచి ఫీచర్లును వీటిల్లో పొందుపర్చింది. నాలుగు స్మార్ట్ఫోన్లను బ్లాక్, బ్లూ, రెడ్, షాంపైన్ కలర్స్‌లలో అందుబాటులోకి తెచ్చింది. అలాగే నాలుగు డివైస్‌లలో 128జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశాన్ని ఇచ్చింది. వోటో 11 5 అంగుళాల డిస్ప్లే 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 16 జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వోటో వి3 5.2 అంగుళాల డిస్ప్లే 13 ఎంపీ రియర్ కెమెరా 16 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వోటో వి12 5అంగుళాల డిస్ప్లే క్వార్డ్ కోర్ 1.3గిగా హెడ్జ్ ప్రాసెసర్ 720 x 1280 రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వోటో వి5 ఎక్స్ 5.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 16 జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ధరలు : వోటో వి11, వి12, వి3, వి5ఎక్స్ ఫోన్ల ధరలు రూ.4,999 - రూ.6,999 మధ్య ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఈస్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. -
అద్భుత ఫీచర్లతో ఒప్పో స్మార్ట్ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్ఎక్స్17 నియో, ఆర్ఎక్స్ 17 ప్రొ స్మార్ట్ఫోన్లను తాజాగా యూరప్ మార్కెట్లో విడుదల చేసింది. భారీ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర అద్భుత ఫీచర్లను వీటిల్లో జోడించింది. అయితే భారత మార్కెట్లో ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు. ఒప్పో ఆర్ఎక్స్17 నియో ఫీచర్లు 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 16 +2 మెగాపిక్సల్ డ్యుయ రియర్ కెమెరాలు 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3600 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 29వేలు ఒప్పో ఆర్ఎక్స్17 ప్రొ ఫీచర్లు 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 20+12 మెగాపిక్సల్ డ్యుయ రియర్ కెమెరాలు 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 49,800 -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్లను కొనాలనుకుంటున్నారా...
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్ స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ 3’, ‘పిక్సెల్ 3 ఎక్స్ఎల్’ లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్టెల్ తన ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్లను కొనాలనుకున్నారో వారు డౌన్పేమెంట్లు కట్టి ఈఎంఐ ప్లాన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడే డేటా, కాలింగ్, కంటెంట్ ప్రయోజనాలతో కూడిన పోస్టుపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ అందించనుంది. గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్(64జీబీ), పిక్సెల్ 3ఎక్స్ఎల్(128జీబీ) వేరియంట్ల డౌన్పేమెంట్లు రూ.17,000, రూ.20,000, రూ.29,000గా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 3(64జీబీ) వేరియంట్ అసలు ధర రూ.71వేల రూపాయలు, గూగుల్ పిక్సెల్ 3(128జీబీ) వేరియంట్ ధర 80వేల రూపాయలుగా ఉంది. ఇక గూగుల్ పిక్సెల్ 3ఎక్స్ఎల్ 64జీబీ వేరియంట్ ధర రూ.83వేలు కాగ, 128జీబీ మోడల్ ధర రూ.92వేలుగా ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 8ఎంపీ+8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు, వెనుకవైపు 12.2 ఎంపీ సింగిల్ సెన్సార్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్‌క్లూజివ్ ఇన్-కెమెరా గూగుల్ లెన్స్‌ను ఇది కలిగి ఉంది. -
అద్భుత ఫీచర్లతో హువావే స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లండన్‌లో లాంచ్ చేసింది. మొబైల్ టెక్నాలజీ మరో మెట్టు పైకి తీసుకెళుతూ హువావే మేట్ 20', 'హువావే మేట్ 20 ప్రొ’ పేరిట నూతన స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. హైసిలికాన్ కిరిన్ 980 లాంటి అధునాతన ప్రాసెసర్ తోపాటు, ప్రపంపంచలోనే తొలిసారిగా లైకా ట్రిపుల్ కెమెరాలని ఈ ఫోన్లనో ఏర్పాటు చేసింది. హువావే మేట్ 20 ధర సుమారు రూ. 67,910 హువావే మేట్ 20 ప్రొ ధర: సుమారు రూ.89,155 హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచెస్ ఫుల్ వ్యూ డిస్ప్లే(19.5:9) 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీర్యామ్,128జీబీ స్టోరేజ్ 40+20+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 24ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే మేట్ 20 ఫీచర్లు 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే(18:7:9) 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 4/6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం) 16+2+8 20ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి దూకుడు: 3 స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్
షావోమి రెడ్మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నేడు (సెప్టంబర్ 5, బుధవారం) నిర్వహించిన స్పెషల్ లాంచ్ ఈవెంట్లో భాగంగా రెడ్మి 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్మి 6, రెడ్మి 6 ప్రో, రెడ్మి 6ఏ మోడల్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఈ మూడు స్మార్ట్ఫోన్లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రెడ్మి 6 ఫీచర్లు 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 720x1440 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్ 32జీబి, 64జీబీ స్టోరేజ్ 256జీబి వరకు పెంచుకునే అవకాశం 12+ 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, బ్లూ కలర్స్‌లో లభ్యం. ధరలు 3జీబీ + 32జీబీ వేరియంట్ ధర రూ. 7,999 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 9,499 సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు పత్ర్యేక తగ్గింపు. ఫస్ట్ సేల్‌కే ఈ ఆఫర్ పరిమితం రెడ్మి 6ఏ ఫీచర్లు 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 720x1440 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం క్వాడ్-కోర్ 12 ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో ఏ22 సాక్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబి వరకు పెంచుకునే అవకాశం 13 ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా 5ఎంపీ సెల్పీకెమెరా 3,000ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ. 5,999 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 6,999 సెప్టెంబరు 19న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ రెడ్మి 6ప్రో ఫీచర్లు 5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్ 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం 12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, రెడ్, గోల్డ్, బ్లూ కలర్స్‌లో లభ్యం ధరలు 3జీబీ + 32జీబీ : ధర రూ.10,999 4జీబీ+ 64జీబీ : ధర రూ.12,999 సెప్టెంబర్ 11మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం -
నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ లాంచ్
నోకియా బ్రాండ్‌కున్న క్రేజే వేరు. స్మార్ట్ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్ మధ్యలో కొన్నేళ్లు తన వైభవం కోల్పోయినప్పటికీ.. తాను కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టి, కస్టమర్లను మళ్లీ తన సొంతం చేసుకుంది. నోకియా అంటేనే ప్రజల బ్రాండ్‌గా ముద్ర వేసుకుంది. మంగళవారం నోకియా రెండు తన గేమ్ చేంజర్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అవి ఒకటి నోకియా 6.1 ప్లస్, మరొకటి నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు. ఈ రెండు స్మార్ట్ఫోన్లను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. టాప్-నాచ్ డిస్ప్లే, ఐఫోన్ ఎక్స్ స్ఫూర్తితో వెనుకవైపు మొత్తం గ్లాస్, 5.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్, 2.5డీ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. నాచ్ డిస్ప్లేతో వచ్చిన తొలి నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1 ప్లసే. నోకియా 5.1 ప్లస్, నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు రెండూ డ్యూయల్ కెమెరాలతో వచ్చాయి. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు రెండూ నోకియా ఎక్స్6, నోకియా ఎక్స్5 స్మార్ట్ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లు. నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ 16 ఎంపీ, 5 ఎంపీ లతో వెనుకవైపు రెండు కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ధర : 15,999 రూపాయలు నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బాడీ, డ్యూయల్ లెన్స్ కెమెరా నాచ్ డిస్ప్లే 5.9 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ పీ60 చిప్సెట్ 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13 ఎంపీ, 5 ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా నోకియా 5.1 ప్లస్ ధర : సెప్టెంబర్‌లో రివీల్ చేయనున్నారు. -
నోకియా మూడు స్మార్ట్ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ: నోకియా మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. నోకియా 2.1, నోకియా 3.1(న్యూ వేరియంట్), నోకియా 5.1 పేరుతో మూడు డివైస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆగస్టు 2 ఈవెంట్‌కు హెచ్ఎండీ గ్లోబల్ మీడియా ఆహ్వానం నోకియా 6పై అంచనాలు కొనసాగుతుండగానే నోకియా అనూహ్యంగా మూడు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. పేటీఎం మాల్సహా ఇతర రీటైలర్స్‌తో పాటు ఆగస్టు 12 నుంచి ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వస్తున్న ఈ డివైస్లోత్వరలోనే ఆండ్రాయి్ 9 పై తోఅప్గ్రేడ్ అవుతాయని కంపెనీ వాగ్దానం చేసింది. మోస్ట్ ప్రీమియం వెర్షన్‌గా నోకియా 5.1ను, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో నోకియా 2.1 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే నోకియా 3.1లో 3జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఫీచర్ల విషయానికి వస్తే డిజైన్, స్టోరేజ్, కెమెరా పరంగా వీటిని మెరుగు పరిచింది. నోకియా 5.1 ఫీచర్లు, ధర 5.5ఫుడ్ హెచ్డీ డిస్ప్లే,18: 9 రేషియో 2160 x 1080 పిక్సల్స్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్ 3జీబీర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ రిటైల్ ధర రూ. 14,499 నోకియా 3.1 ఫీచర్లు, ధర 5.2-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ 6750 చిప్సెట్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2990 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: రూ. 11,999 నోకియా 2.1 ఫీచర్లు, ధర 5.5-అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 చిప్సెట్ 720x1280 1జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ. 6999 -
4 కెమెరాలతో హువావే కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. నోవా 3 సిరీస్‌లో నోవా 3, నోవా 3ఐ పేరుతో రెండు డివైస్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రధానంగా నాలుగు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో వీటిని న్యూఢిల్లీలో గురువారం విడుదల చేసింది. నాలుగు ఆర్టిఫిషియల్ క్వాడ్ కెమెరాలు, సొంతంగా 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి తమ డివైస్ల ప్రత్యేకత అని లాంచింగ్ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనున్నామని హువావే ఇండియా ప్రతినిధి అనుపమ్ యాదవ్ తెలిపారు. హానర్ నోవా 3 ఫీచర్లు 6.3 ఆంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3750 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 34,999 రూపాయలు నోవా 3ఐ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 20,990 రూపాయలు ప్రీ ఆర్డర్లు ఈ మధ్యాహ్నం రెండుగంటల నుంచి ప్రారంభం. హానర్ 3 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 23 నుంచి, హానర్ 3ఐ ఆగస్టు 7వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అలాగే 2 వేల రూపాయల ఎక్సేంజ్, రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు జియో యూజర్లకు ఉచిత డేటా లాంటి లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. -
రెడ్మికి సవాల్ : నోకియా స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ దిగువ, మధ్య తరగతి సెగ్మెంట్లో మూడు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను ప్రకటించింది. ముఖ్యంగా దేశీయంగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న షావోమి షియోమీరెడ్మీ ఫోన్లకు పోటీగా బడ్జెట్ ధరల్లో వీటిని అందుబాటులోకి తేనుంది. గత ఏడాది లాంచ్ చేసిన నోకియా 2, 3. 5 సిరీస్‌లో 2018 మోడళ్లను తీసుకొస్తోంది. నోకియా 2.1, నోకియా 3.1, నోకియా 5.1 పేర్లతో ఈ డివైస్‌లను విడుదల చేసింది. బ్లూ/కాపర్, బ్లూ/సిల్వర్, గ్రే/సిల్వర్ రంగు వేరియెంట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. నోకియా 2.1 సుమారు రూ.7,801గా ఉండనుందని అంచనా. జూలై నెలలో ఇవి వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నోకియా 2లో జోడించింది. మరోవైపు ఈ మూడు స్మార్ట్ఫోన్ల ధరలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు. నోకియా 2.1 ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 3.1 ధర సుమారు రూ. 10,900గాఉండనుందని అంచనా. 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. నోకియా 3.1 ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2జీబీ/16జీబీ స్టోరేజ్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2990 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 5.1 కూడా రెండు వేరియంట్లలో( 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్) లభ్యం కానుంది. ధర సుమారు రూ.14,800 నోకియా 5.1 ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2జీబీ/3జీబీ 16జీబీ/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16ఎంపీ రియర్‌కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
అదిరిపోయే ఫీచర్లతో సామ్సంగ్ కొత్త ఫోన్లు
-
శాంసంగ్ నాలుగు స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో నాలుగు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో అందుబాటు ధరల్లో ఇన్ఫినిటీ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లుగా సోమవారం వీటిని విడుదల చేసింది. జే 6, జే8, ఏ6, ఏ6ప్లస్ పేర్లతో ఈ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ నాలుగు డివైజ్‌లను ఆండ్రాయిడ్ ఓరియో ఆధారితంగా రూపొందించడం విశేషం. స్టైలిష్ డిజైన్ల కోసం ఎదురు చూసే వినియోగదారుల కోసం తాజా ఇన్నోవేషన్‌తో వీటిని అందుబాటులోకి తెచ్చామని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ ఏ6 5.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 16 ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కొత్తగా విడుదల చేసిన ఫోన్ల గురించి వివరిస్తున్న శాంసంగ్ ప్రతినిధి శాంసంగ్ గెలాక్సీ ఏ6 ప్లస్ 6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 దాకా విస్తరించుకునే అవకాశం 16+5 ఎంపీ రియర్‌కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3,500ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ జే6 5.6-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 13 ఎంపీ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ జే8 6అంగుళాలసూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 450 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 16+5 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3500ఎంఏహెచ్ బ్యాటరీ ఏ6, ఏ6ప్లస్, జే6 మే 22నుంచి అమెజాన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. అయితే జే 8మాత్రం జూలై తర్వాత అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ తెలిపింది. పేటీఎం మాల్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. ఇక ఈనాలుగు స్మార్ట్ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి. జే 6 ధర: రూ.13,990 జే 8 ధర: రూ. 18,990 ఏ6 ధర: రూ. 21,990 (4జీబీ/32 స్టోరేజ్), రూ. 22,990 4జీ/64జీబీ ఏ6ప్లస్ ధర : రూ. 25,990 -
ఈ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ ఇటీవల లాంచ్ చేసిన ‘పీ20 ప్రో, పీ 20లైట్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కస్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు 2 మే నుండి 7 మే, 2018 వరకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్తో కూడా కంపెనీ భాగస్వామ్యం ఉంది. కస్టమర్ సంతృప్తిపై తమకు పూర్తి విశ్వాసం వుందని హువావే ఇండియా-కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను కలిగి ఉన్న హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్. అంతేకాక వినియోగదారులకు 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారాకొనుగోల చేస్తే 1500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ . మరోవైపు వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్‌పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు. కాగా హువావే పీ 20 ప్రొ ,ప్రీ20 లైట్ లాంచింగ్ ధరలు వరుసగా రూ.64,999, ధర 19,999గా ఉన్నాయి. -
త్రిపుల్ బ్యాక్ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటి వరకు డ్యూయల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్లు మాత్రమే మనల్ని అలరించగా... ఇక నుంచి త్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కూడా మన ముందుకు రాబోతోంది. ప్రపంచపు తొలి త్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారి హువావే సిద్ధమవుతోంది. హువావే పీ20, హువావే పీ20 ప్రొ పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను హువావే భారత్‌లో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ఇమేజ్ను టీజ్ కూడా చేసింది. ‘కమింగ్ సూన్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌లైన్‌తో కంపెనీ దీన్ని పోస్టు చేసింది. దీనిలో పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు ట్రిపుల్ రియర్ కెమెరా ఉండబోతోంది. త్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఒకటి 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లో మోషన్ వీడియోను 720పీ రెజుల్యూషన్‌లో 960ఎఫ్‌పీఎస్ వద్ద రికార్డు చేస్తోంది. హువావే ఈ రెండు స్మార్ట్ఫోన్లను మార్చి 27న పారిస్‌లో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 8.0 ఓరియోను, కంపెనీ సొంత కిరిన్ 970 ప్రాసెసర్‌ను, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. హువావే పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. డ్యూయల్ సిమ్ కార్డులను కూడా కలిగి ఉంది. పీ20 స్మార్ట్‌ఫోన్ 5.8 అంగుళాల స్క్రీన్ కలిగి ఉండి, 20 ఎంపీ, 12 ఎంపీ సెటప్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వస్తోంది. దీని బ్యాటరీ 3400 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. హువావే పీ20 ప్రొ అంచనా ధర హువావే పీ20 ప్రొ అత్యధిక ధర 899 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.72000 ఉండొచ్చని అంచనా. ఈ ప్రొ వేరియంట్‌తోనే హువావే తొలిసారి రూ.70వేల ధర మార్కును క్రాస్‌చేస్తోంది. -
రూ. 2వేలకే ఈ స్మార్ట్ఫోన్లు
గెలాక్సీ ఎస్ 8 కి సక్సెసర్‌గా తాజాగా కొత్త ఫ్లాగ్షిప్ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది. కొత్త కెమెరా, డేటా రక్షణ, వర్చువల్ రియాలీటీ తదితర టాప్-ఎండ్ ఫీచర్లతో వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2018లోఆదివారం లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌పోన్ ప్రి ఆర్డర్స్ మార్చి 2న మొదలు కానున్నాయి. అయితే ఈ సందర్భంగా భారతీయ వినియోగదారులకు కంపెనీ ఒక ఆఫర్ కూడా ఇస్తోంది. కేవలం రూ.2వేల తో సంస్థ వెబ్సైట్ ద్వారా గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ డివైస్‌లను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని కంపనీ ప్రకటించింది. కాగా ఎంపిక చేసిన మార్కెట్లలో మార్చి 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 9 ఫీచర్లు 5.8కర్వ్డ్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీర్యామ్ 64జీబీస్టోరేజ్ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు 6.2 డిస్ప్లే 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 6జీబీ ర్యామ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9ప్లస్ లాంచ్!
శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను గెలాక్సీ ఎస్ 9, ఎస్9 ప్లస్‌ను ఫిబ్రవరి 25 ఆదివారం, లాంచ్ చేసింది. స్పెయిన్ ,బార్సెలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రారంభానికి ఒక్క రోజుముందు ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. మార్చి 2 ప్రి ఆర్డర్స్ మొదలు కానుండగా, 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్9 ప్లస్‌లో ద్వంద్వ రియర్ కెమెరాలను, అలాగే ఫేస్ రికగ్నిషన్, ఎఆర్ (అగ్‌మెంటెట్ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది. రెండు హ్యాండ్ సెట్లు మిడ్ నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్ టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్9 ధర సుమారు రూ .46,600, ఎస్9 ప్లస్ ధర సుమారు రూ .54,400గా ఉండే అవకాశం ఉంది. అలాడే రెండు స్మార్ట్ఫోన్లలోనూ ఇన్ఫినిటీ డిస్ప్లే, డాల్బీ సరౌండ్ స్టీరియో సౌండ్ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్ ఎక్స్ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది. గెలాక్సీ ఎస్ 9 ఫీచర్లు 5.8కర్వ్డ్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, గెలాక్సీ ఎస్ 9 ప్లస్ ఫీచర్లు 6.2 డిస్ప్లే 6జీబీ ర్యామ్ 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 64జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ డబుల్ రియర్ కెమెరాలు ప్రత్యేక ఫీచర్లుగా ఉండనున్నాయి. Words can't say what your face can. Tell volumes of your own stories with a camera that turns you into an emoji. #GalaxyS9. Learn more. https://t.co/1HCinmcKeR pic.twitter.com/vCBEXj2koq — Samsung Mobile (@SamsungMobile) February 25, 2018 -
రెడ్మీ కొత్తఫోన్ల విక్రయాలు నేటినుంచే
సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు, ఎల్ఈడీ స్మార్ట్ టీవీని తొలిసారిగా దేశంలో విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు(గురువారం)మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభించనుంది. రెడ్ మి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నరెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో ఇవి లభ్యంకానున్నాయి. రెడ్మి నోట్ 5, నోట్ 5 ప్రో కొనుగోలుదారులకు రిలయన్స్ జియోతో కలిసి డబుల్ డేటాతో పాటు రూ .2,200 తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో లభ్యం కానుంది. అలాగే అవే కలర్లలో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు లభ్యం కానుంది. షావోమీ రెడ్మీ నోట్ 5 ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమీ రెడ్మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రిలయన్స్ జియో 'ఫుట్‌బాల్ ఆఫర్'
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొలిసారి జియో నెట్వర్క్ యాక్టివేట్ చేసుకునే కొత్త స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. షావోమి, శాంసంగ్, మోటోరోలా, ఆసుస్, హువావే, ప్యానాసోనిక్, ఎల్జీ, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు జియో ఈ ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఫోన్ యాక్టివేషన్ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ ఓచర్ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్‌లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్ ఆఫర్ వర్తిస్తుంది. మైజియో యాప్ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్‌పైరి అయిపోతాయి. ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్‌బ్యాక్ ఓచర్లను మైజియో యాప్‌లో ''మై ఓచర్స్' సెక్షన్ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్‌లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ డివైజ్‌లకు ఇప్పటికే జియో తన ఫుట్‌బాల్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. అదనంగా కోమియో ఎస్1 లైట్, సీ1 లైట్ యూజర్లకు ఈ ఆఫర్‌కు అర్హులే. షావోమి రెడ్మి వై1, శాంసంగ్ ఆన్8, హానర్ 9ఐ, బ్లాక్‌బెర్రీ కీవన్, మైక్రోమ్యాక్స్ భారత్1 వంటి డివైజ్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. -
కొత్త ఏడాదిలో వచ్చేసిన సోని స్మార్ట్ఫోన్లు
కొత్త ఏడాదిలో సోని రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. లాస్ వేగాస్లోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2, ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు సోని ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గతేడాది ఎక్స్ఏ1, ఏక్స్ఏ1 ఆల్ట్రాలకు అప్‌గ్రేడెడ్‌గా మార్కెట్లోకి వచ్చాయి. బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌ను మెరుగుపరిచి వీటిని లాంచ్ చేసింది. మరో అతిపెద్ద డిజైన్ మార్పులో ఈ స్మార్ట్ఫోన్లకు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చడమే. అంతకముందు ఎక్స్ఏ1 స్మార్ట్ఫోన్లు మీడియోటెక్ ప్రాసెసర్లతో పనిచేయగా.. తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్లు ఎక్కువ శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌తో రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్‌ను, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్‌ను, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. అంతేకాక బ్యాటరీ సామర్థ్యం కూడా అంతకముందు వాటి కంటే ఎక్కువగా ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ను, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 3,580 ఎంఏహెచ్ను కలిగి ఉన్నాయి. ఆల్ట్రా-స్లిమ్ సైడ్ బెజెల్స్‌తో ఇవి రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లేతో, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మార్కెట్లోకి వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు 23ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 16 ఎంపీ, 8ఎంపీతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 23 ఎంపీ కెమెరాను కలిగి ఉన్నాయి. -
జియోని నుంచి ఒకే రోజు 8 స్మార్ట్ఫోన్లు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే రోజు ఎనిమిది స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌కు సిద్దమైంది జియోని. ఈ స్మార్ట్ఫోన్లన్నింటి హైలెట్ బెజెల్-లెస్ డిస్‌ప్లేలే. ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ తాజాగా రెండు టీజర్లను విడుదల చేసింది. ఆన్లైన్లో పోస్టు చేసిన ఈ టీజర్లలో అన్ని స్మార్ట్ఫోన్ల పేర్లను రివీల్ చేసింది. జియోని ఎం7 ప్లస్, ఎస్11, ఎస్11ఎస్, ఎఫ్205, ఎఫ్6, స్టీల్ 3, ఎం7 లుగా పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లను నవంబర్ 26న జియోని విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లపై వస్తున్న రూమర్ల ప్రకారం ఎం7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్షిప్ మోడల్స్‌లో ఒకటిగా తెలుస్తోంది. టీనా లిస్టింగ్‌లో ఎం7 ప్లస్ చాలా ప్రత్యేకమైన డిజైన్‌ను, మెటల్ ప్లేట్‌తో లెదర్ బ్యాక్‌ను, డ్యూయల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని వెల్లడవుతోంది. 6జీబీ ర్యామ్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందిందట. మరికొన్ని రూమర్ల ప్రకారం జియోని ఎస్11 కూడా వెనుక, ముందు వైపు రెండు కెమెరాలను ఉంటుందని టాక్. వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెనార్. ముందు వైపు 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఇది రూపొందిందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 5.99 అంగుళాల డిస్ప్లేను, 6జీబీ ర్యామ్‌ను, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. జియోని ఎఫ్205 స్మార్ట్‌ఫోన్... 5 అంగుళాల డిస్ప్లే, మీడియోటెక్ ఎంటీ6739 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా. జియోని ఎఫ్6కు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ ఎంటీ6739, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు, ఫ్రంట్ వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్లన్నీ నిజమో కాదో తెలుసుకోవడం కోసం నవంబర్ 26న చైనాలో జరుగబోయే ఈవెంట్ కోసం వేచిచూడాల్సిందే. -
ఫీచర్ ఫోన్ ధరలో ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్లు
ఎయిర్టెల్ గురువారం మరో రెండు కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. హ్యాండ్సెట్ తయారీదారి కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంలో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ''ఏ1 ఇండియన్'', ''ఏ41 పవర్'' పేర్లతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఫీచర్ ఫోన్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ1 ఇండియన్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,799కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట చిల్లర ధర 4,390 రూపాయలు. అదేవిధంగా ఏ41 పవర్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను 1,849 రూపాయలకు విక్రయానికి తెస్తోంది. దీని చిల్లర గరిష్ట ధర కూడా 4,290 రూపాయలు. జియో ఫీచర్ ఫోన్‌కు గట్టి పోటీగా ఈ రెండు స్మార్ట్ఫోన్లను రెండు వేల రూపాయల తక్కువకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ''మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్'' కార్యక్రమంలో భాగంగా ఈ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ప్రతి భారతీయుడు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి, డిజిటల్ సూపర్‌హైవేలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ఎయిర్టెల్-కార్బన్ భాగస్వామ్యం కింద అందుబాటులోకి వచ్చే అన్ని డివైజ్‌లు అమెజాన్ ఇండియాలో కూడా లభ్యంకానున్నాయి. ''మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్'' కింద తాము తీసుకొచ్చిన తొలి ఆఫర్‌కు మంచి డిమాండ్ ఉందని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ డైరెక్టర్-కన్జ్యూమర్ బిజినెస్ రాజ్ పుడిపెడ్డి తెలిపారు. నేడు లాంచ్ చేసిన రెండు డివైజ్‌ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి... ఏ1 ఇండియన్ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 1.1గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ వరకు విస్తరణ మెమరీ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 1500ఎంఏహెచ్ బ్యాటరీ 3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏ41 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ వరకు విస్తరణ మెమరీ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 2,300ఎంఏహెచ్ బ్యాటరీ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
సోనీ నుంచి జంట ఫోన్లు, మిడ్-రేంజ్‌లోనే
సోనీ ఇండియా శుక్రవారం రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్, ఎక్స్‌పీరియా ఆర్1 పేరుతో వీటిని తీసుకొచ్చింది. మిడ్-సెగ్మెంట్ కస్టమర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్టు సోనీ పేర్కొంది. ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్ ధర రూ.14,990కాగ, ఎక్స్‌పీరియా ఆర్1 ధర 12,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్, మేజర్ మొబైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్, ఆర్1 స్పెషిఫికేషన్లు... ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్‌కు 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఎక్స్‌పీరియా ఆర్కు 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 5.2 అంగుళాల హెచ్డీ టీఎఫ్టీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ డ్యూయల్ సిమ్ డివైజ్‌లు 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2620 ఎంఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ పోర్టు ఆండ్రాయిడ్ నోగట్తో రన్, కానీ ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ను కూడా కంపెనీ చేపట్టనుంది. -
కొత్త ఫోన్లపై శాంసంగ్ ఫోకస్
భారత్.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు అతి పెద్ద మార్కెట్. స్మార్ట్ ఫోన్ల కంపెనీల్లో రారాజుగా ఉన్న అటు శాంసంగ్ నుంచి అన్ని కంపెనీ చూపు భారత్ వైపే. దీంతో తన రారాజు స్థానాన్ని కొనసాగించడంతో పాటు, మార్కెట్ షేరును మరింత దోచేయడానికి భారత్ లో కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలపై శామ్ సంగ్ దృష్టిసారించేందుకు సిద్ధమైంది. వినూత్న లక్షణాలతో, తన స్థానాన్ని స్థిరంగా కొనసాగిస్తూ.. మార్కెట్ షేరును మరింత సొంతచేసుకోనుందని కంపెనీకి చెందిన టాప్ అధికారులు చెప్పారు. వివిధ ధరల్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే దృష్టిని కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇన్నోవేషన్ అనేది ప్రధానమైన అంశంగా.. వినూత్న లక్షణాలతో కొత్త ప్రొడక్ట్ లను భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్టు శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. 2015 జనవరిలో 35శాతం ఉన్న మార్కెట్ షేరును ప్రస్తుతం 48.3శాతానికి పెంచుకున్నామని ప్రకటించారు. కొత్త స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణతో గతేడాది నుంచి 10 శాతానికి పైగా మార్కెట్ షేరును దక్కించున్నామని వెల్లడించారు. 4జీ మార్కెట్లో శామ్ సంగ్ మార్కెట్ షేరు 60శాతానికి పైగానే ఉందని, స్మార్ట్, ఫీచర్ వంటి అన్నిరకాల ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ లో కూడా 30శాతం మార్కెట్ షేరును కలిగిఉంది. టర్బో స్పీడ్ టెక్నాలజీ(టీఎస్టీ), స్మార్ట్ గ్లో, తర్వాతి తరం కలర్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో శామ్ సంగ్ నుంచి కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. టీఎస్టీ టెక్నాలజీ డివైజ్ ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, డబుల్ ర్యామ్ డివైజ్ లకంటే 40శాతం వేగంగా నేటివ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారని శాంసంగ్ పేర్కొంది. -
లెనోవో నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ: మరో రెండు కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లు భారత్ మార్కెట్లోకి వచ్చాయి. చైనా కంపెనీ లెనోవో బుధవారం కొత్త మోడల్స్ వైబ్ పీ1, వైబ్ పీ1 ఎమ్ ను విడుదల చేసింది. వైబ్ పీ1 మొబైల్ ధర 15,999, వైబ్ పీ1 ఎమ్ ధర .7,999 రూపాయలు. వీటిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. వైబ్ పీ1ఎమ్ మోడల్స్‌ను వెంటనే ఆన్లైన్ విక్రయిస్తుండగా.. వైబ్ పీ1 ఫోన్లను వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. వైబ్ పీ1 మొబైల్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, యూఎస్బీ, పవర్ సేవ్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక వైబ్ పీ1 ఎమ్‌లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ తొందరగా ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. -
హువాయ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: హువాయ్ తన ఆనర్ శ్రేణిలో 4ఎక్స్, 6 ప్లస్ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.10,499, రూ.26,499గా ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యం అవుతున్నాయి. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘ఆనర్ 6 ప్లస్’ మొబైల్ 5.5 అంగుళాల తెర, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరి, 4జీ, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘4ఎక్స్’ మొబైల్లో 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరి, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐడీసీ ప్రకారం, హువాయ్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 6.25 శాతం వాటాతో నాల్గో స్థానంలో ఉంది. గతేడాది 3 లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించిన హువాయ్ ఈ ఏడాది 20 లక్షల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఐబాల్ కొత్త స్మార్ట్‌ఫోన్
ముంబై: ఐబాల్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, అండి 5.5ఎన్2ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ హ్యాండ్సెట్ ధర రూ.13,499. ఈ ఫోన్ లో 1.2 గిగా హెట్స్ క్వాడ్ కోర్ కోర్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 12 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. లావా ఐరిస్ 405 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లావా కంపెనీ ఐరిస్ 405 ప్లస్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.6,999. లావా ఐరిస్ 405 ఫోన్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ ఓఎస్, 1.3 గిగా హెట్స్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల డిస్ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభూతిని వినియోగదారులకు అందుబాటు ధరలో అందించడం లక్ష్యంగా ఈ ఫోన్‌ను తెచ్చామని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు.