సాక్షి, ముంబై: రియల్‌మి సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. రియల్‌మి సీ సిరీస్ లో కొనసాగింపుగా బడ్జెట్ ధరలో రియల్‌మి సీ 12, సీ15 ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. కోవిడ్ -19మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా వీటిని తీసుకొచ్చింది. వీటితోపాటు రియల్‌మిటీ షర్టులను, ఇయర్ బడ్స్ ను కూడా సంస్థ లాంచ్ చేసింది. స్మార్ట్ టీవీలను భారతదేశంలో స్థానికంగా నోయిడాలో తయారు చేయడం ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.
రియల్‌మి సీ15 ఫీచర్లు
6.5అంగుళాల మినీ-డ్రాప్ డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 35 సాక్
13 + 8 + 2 + 2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
6,000 ఎంఏహెచ్
18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్.
రియల్‌మి సీ15ను రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది..
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 9,999 రూపాయలు
4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర 10,999 రూపాయలు
ఆగస్టు 27 న ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో తొలిసేల్ ఆరంభం. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
రియల్‌మి సీ12
6.5అంగుళాల హెచ్‌డి + ఎల్‌సిడి డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ35 ప్రాసెసర్,
13 + 2 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
10 వాట్స్ చార్జింగ్
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : రియల్‌మి సీ 12 సింగిల్ వేరియంట్‌లో తీసుకొచ్చింది. దీని ధరను (3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) 8,999 గా ఉంచింది. ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో దీని మొదటి అమ్మకం ఆగస్టు 24 న ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment