Realme
-
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్
-
రంగులు మార్చే రియల్‌మి ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల బ్రాండ్ రియల్‌మి పరిశ్రమలోనే తొలిసారిగా ఉష్ణోగ్రతలను బట్టి రంగు మార్చే కోల్డ్ సెన్సిటివ్ రియల్‌మి 14 ప్రో 5జీ, 14 ప్రో ప్లస్ 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఉష్ణోగ్రత 16 డిగ్రీల కన్నా దిగువకు పడిపోతే ఇవి ఒక దాన్నుంచి మరో రంగులోకి, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పూర్వ రంగులోకి మారతాయి. ఆఫర్ కింద 14 ప్రో 5జీ ఫోన్ల ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. 14 ప్రో ప్లస్ 5జీ ఫోన్లలో డీఎస్ఎల్ఆర్ స్థాయి సోనీ ఐఎంఎక్స్896 ఓఐఎస్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైనవి ఉంటాయి. వీటి ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్లపై నిర్దిష్ట డిస్కౌంట్లు లభిస్తాయి. 14 ప్రో సిరీస్ 5జీ ఫోన్ల విక్రయం జనవరి 23 నుంచి మొదలవుతుంది. అటు వైర్లెస్ ఇయర్‌బడ్స్ 5 ఏఎన్సీ ఉత్పత్తులను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,599గా ఉంటుంది. -
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్‌తో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 14 సిరీస్‌లో రెండు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్మీ 14 ప్రో ప్లస్ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్సెట్లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్ చేంజింగ్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3 (Snapdragon 7s Gen 3) చిప్సెట్తో నడుస్తుంది. ఇక రియల్మీ 14 ప్రోలో మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్మీ 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్సెట్లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.ధరలివే..భారత్‌లో రియల్మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్‌కు రూ.24,999, 8GB+256GB వేరియంట్‌కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇక రియల్మీ 14 ప్రో ప్లస్ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.ఈ ఫోన్ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్మీ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే.⇒ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 చిప్సెట్⇒ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీరియల్మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్⇒ వనిల్లా మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్⇒ GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాహై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్లుఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీకలర్ చేంజింగ్ ఫీచర్ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్మీ 14 ప్రో ప్లస్ 5G, రియల్మీ 14 ప్రో 5G ఫోన్లలో పెరల్ వైట్ వేరియంట్లలో రియల్మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది. -
భారత్‌లో భారీ వృద్ధి లక్ష్యం
చైనాకు చెందిన స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ రియల్మీ(Realme) వినూత్న ఉత్పత్తుల డిజైన్, విస్తృత శ్రేణి, రిటైల్ విస్తరణతో 2025లో భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో 18 శాతం వాటా(market share)ను అందుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ఉత్పత్తుల మెరుగైన పనితీరు, అత్యుత్తమ డిజైన్, మధ్య నుంచి అధిక–శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వెల్లడించింది.కంపెనీకి భారత్ అతిపెద్ద విపణిగా ఉంది. 2024లో దేశీయ స్మార్ట్‌ఫోన్ విపణిలో రియల్మీ 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్కెట్ వాటాలో 50 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్మీ వైస్ ప్రెసిడెంట్, సీఎంవో చేస్ షూ వెల్లడించారు. 2025 ప్రారంభంలో విడుదల కానున్న రియల్మీ 14 ప్రో డిజైన్(Design)ను ఆవిష్కరించిన సందర్భంగా చేస్ మీడియాతో మాట్లాడారు.ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?ఆఫ్‌లైన్ కోసం ప్రత్యేకంగా..భారత్‌లో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంది. కానీ చాలా మంచి ఫలితాలతో 2024 ముగించాం అని చేస్ వివరించారు. ‘ధర సున్నిత అంశమైన భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచడానికి ప్రధాన ఈ–కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025లో ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్ వన్‌గా, అమెజాన్ వేదికగా మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువ కస్టమర్లను ఆకట్టుకునేలా మరిన్ని కలర్ ఆప్షన్స్‌తో భారత్ కోసం ప్రత్యేక డిజైన్స్ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆఫ్‌లైన్ నెట్వర్క్, సర్వీస్ సెంటర్లను విస్తరిస్తాం. మార్కెట్ వాటాను పెంచడానికి ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడళ్లను తీసుకొస్తాం’ అని వివరించారు. -
సరికొత్త 'రియల్మీ జీటీ 7 ప్రో' వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారతీయ మార్కెట్లో 'జీటీ 7 ప్రో' లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందుతుంది.కొత్త రియల్మీ జీటీ 7 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.56,999), రెండు 16 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ. 62,999). ఇవి రెండూ నవంబర్ 29నుంచి కంపెనీ వెబ్సైట్లో, అమెజాన్ ఈ-కామర్స్ సైట్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం.మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభించే రియల్మీ జీటీ 7 ప్రో.. హై పర్ఫామెన్స్డ్ స్మార్ట్‌ఫోన్. ఇది 1.5కే రిజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాకుండా.. వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకునిజీటీ7 ప్రోలో.. సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం మరో 50MP Sony IMX906 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా &16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా వీడియో రీకరింగ్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి. పోర్ట్రెయిట్, నైట్, అండర్ వాటర్ వంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్లు ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..రియల్మీ జీటీ 7 ప్రో 5800mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐపీ69 నీరు & ధూళి నిరోధకతను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా మన్నికైనది, ఏ వాతావరణనైకైనా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 222.8 గ్రాములు.. పొడవు 162.45 మిమీ పొడవు, వెడల్పు 76.89 మిమీగా ఉంది.The #realmeGT7Pro is now more accessible!Get the flagship 12GB RAM + 512GB storage for just ₹56,999 & the 16GB RAM + 512GB storage for ₹62,999 with 50MP Periscope, IP69, AI features & more!#ExploreTheUnexploredJoin the Livestream: https://t.co/6E90cRlxyy pic.twitter.com/KYTnXPO6pa— realme (@realmeIndia) November 26, 2024 -
Realme 12 సిరీస్ 5G ను అన్ బాక్స్ చేసిన సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
త్వరలో.. భారత్‌లో రియల్మీ 12 సిరీస్ విడుదల, ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ భారత్‌లో మిడ్ రేంజ్ రియల్ మి 12 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థ ఫ్లాగ్షిప్ ఫోన్ జీటీ 5 ప్రో సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్‌లైన వన్‌ప్లస్ 12 తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ తరుణంలో భారత్‌లో సైతం ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు ధీటుగా రియల్మీ కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్లను మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తుందంటూ ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోచైనా నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా రియల్మీ ప్రో, రియల్మీ ప్రో ప్లస్ ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. రియల్మీ 12ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే? రియల్మీ 12 ప్రో క్వాల్కమ్ 7 4ఎన్ఎం ప్రాసెస్ జనరేషన్ 3 చిప్సెట్తో రానుంది. దీంతో పాటు 2ఎక్స్ ఆప్టికల్స్ జూమ్ చేసేలా 32 ఎంపీ ఐఎంఎక్స్ 709 టెలిఫోటోలెన్స్ సైతం ఈ ఫోన్లో ఉన్నాయి. అదే విధంగా రియల్మీ 12ప్రో ప్లస్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64 ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ64బీ లెన్స్ సపోర్ట్‌ను అందిస్తుంది. రియల్మీ 12 సిరీస్ ధరలు రియల్మీ 12ప్రో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రూ.25,000గా ఉంది. మొదట వచ్చే ఏడాది మార్చి లోపు ఈ ఫోన్ విడుదల చేసి.. ఆ తర్వాత గ్లోబుల్ మార్కెట్ యూజర్లకు పరిచయం చేస్తుంది. ఈ గ్లోబుల్ మార్కెట్లో భారత్ సైతం ఉంది. ఇక రియల్మీ 12 సిరీస్‌కి పోటీగా రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను న్యూయర్‌కి విడుదల చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం భారీ డిస్కౌంట్‌కే.. -
సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు
చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్మీ’లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో భారత్ టెలివిజన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంటే దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు ఈ రెండు సంస్థలు తమ దేశమైన చైనాలో ఇతర కంపెనీలకు చెక్ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. కాబట్టే భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ రెండు కంపెనీలు మరింత ముందుకు సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీలు అభివృద్ది పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. భారత్‌లో టీవీ అమ్మకాల జోరు నివేదిక ప్రకారం .. భారత్‌లో ఇంటర్నెట్ విస్తరణ, సరసమైన డేటా ధరల కారణంగా టెలివిజన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. దీన్ని మరింత క్యాష్ చేసుకునేందుకు వన్‌ప్లస్, రియల్‌మీలు టెలివిజన్ సేల్స్, బ్రాండింగ్ విషయంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ, అనూహ్యం భారత టీవీ మార్కెట్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. కారణం అదేనా భారతీయ టెలివిజన్ మార్కెట్లో ఎల్జీ, శాంసంగ్, సోనీ, ప్యానసోనిక్ వంటి బ్రాండ్లతో పాటు చైనా నుండి కొత్తగా అడుగు పెట్టిన షావోమీ, టీసీఎల్ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అదనంగా, దేశీయ బ్రాండ్లు వీయూ, థామ్సన్ (బ్రాండ్ లైసెన్సింగ్ కింద) మార్కెట్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. చివరిగా, రియల్ మీ, వన్ ప్లస్‌లు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయన్న నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
అద్భుతమైన రియల్మీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదా!
Realme11 5G Realme11 X 5G: చైనా స్మార్గ్ఫోన్ దిగ్గజం రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్మీ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ (Realme 11 5G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) పేరుతో తాజాగా ఆవిష్కరించింది. వీటితో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్పోన్స్ని కూడా తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ ధరను రూ.20 వేల లోపు ధరను నిర్ణయించగా, రియల్మీ 11ఎక్స్ 5జీ మొబైల్ రూ.15 వేల బడ్జెట్ ధరగా నిర్ణయించడం గమనార్హం. రియల్మీ 11ఎక్స్ 5జీ,ధరలు, లభ్యత రియల్‌మి 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్స్‌లో లభ్యం.. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ 11ఎక్స్ 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 64+2ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 5000mAhబ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్‌మి 11 5జీ ధర, లభ్యత Realme 11 5G ప్రారంభ ధర రూ. 8 జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999. గ్లోరీ గోల్డ్ , గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం. ఆగస్ట్ 29 నుండిసేల్. రియల్మీ 11 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 132400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 108 ఎంపీ+2 ఎంపీ రియర్ డ్యూయల్కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమరా 8జీబీ స్టోరేజ్, 128, 256జీబీ స్టోరేజ్ 5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ బడ్స్ ఎయిర్5: రూ.200 తగ్గింపుతో కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. తొలి సేల్ ఆగస్టు 26, మధ్యాహ్నం 12 గంటలకు Experience the #realme11x5G and upgrade your style game. 🚀 With lightning-fast speed and unbeatable features, get ready to take the leap. Starting at ₹13,999/-* Early bird sale will be live today at 6PM. Know more: https://t.co/pfnyKqBsVD#LeapUpWith5G pic.twitter.com/nhroIFytf1 — realme (@realmeIndia) August 23, 2023 /> -
రియల్‌మి ఏ2+ కొత్త వేరియంట్: ధర చూస్తే ఇంప్రెస్ అవుతారు!
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కాన్ఫిగరేషన్లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్అయింది. ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్రెడ్మి ఏ2+ వేరియంట్ ధర ఎంఐడాట్‌కామ్‌లో రూ.8,499గా ఉంది. అయితే ప్రస్తుతం పరిచయ ఆఫర్‌గా ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. రెడ్మి ఏ2+ స్పెసిఫికేషన్స్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ LCD డిస్ప్లే 1600 x 720 పిక్సెల్స్‌రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 5,000mAh బ్యాటరీ -
రియల్‌మీకి మరో షాక్: రాజీనామా చేసిన 12 మంది ఉన్నతోద్యోగులు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీకి మరో షాక్ తగలింది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా డజను మందికిపైగా ఉద్యోగులు రియల్మీ ఇండియా (Realme India) సంస్థకు రాజీనామా చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ సీఈఓ మాధవ్ సేత్ (Madhav Sheth) పెట్టిన కొత్త సంస్థ హానర్ టెక్‌లో చేరేందుకే ఆ ఉద్యోగులు రియల్‌మీని వీడినట్లు సమాచారం. రియల్మీ ఇండియా సంస్థకు చెందిన అత్యున్నత డైరెక్టర్లతో సహా పలువురు ఉద్యోగులు మాధవ్ సేత్ కొత్త కంపెనీ హానర్ టెక్‌లో చేరిన నేపథ్యంలో రియల్మీ ఇండియా సంస్థలో మరిన్ని సామూహిక రాజీనామా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మాజీ సేల్స్ డైరెక్టర్ దీపేష్ పునమియా కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హానర్ టెక్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. కాగా ఉద్యోగుల రాజీనామాల విషయంపై రియల్మీ సంస్థ నుంచి ఎంటువంటి స్పందనా లేదు. ఇదీ చదవండి ➤ Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి.. ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించడం కోసమని మాధవ్ సేత్ జూన్ నెలలో రాజీనామా చేశారు. అప్పటి వరకు కంపెనీలో ఆయన ఐదేళ్లు పనిచేశారు. రియల్మీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, రియల్మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్‌నకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. రియల్మీ ఫౌండర్ స్కైలీతో కలిసి మాధవ్ సేత్ 2018 మేలో అధికారికంగా బ్రాండ్‌ను స్థాపించారు. -
రూ.10వేలే.. 108మెగా ఫిక్సెల్ కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ రూ.10వేల ధరలో బడ్జెట్ ధరలో సీ53 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.9,999 బడ్జెట్ ధరలో విడుదలైన ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనక భాగంలో 108 ప్రైమరీ కెమెరాతో రానుంది. రియల్మీ సీ53 ధర రియల్మీ సీ53 4జీబీ ప్లస్ 128 జీబీ, 6జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్స్ ఫోన్లను అందించనుంది. జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు సమయంలో పరిచయ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. రియల్మీ సీ 53 ఫీచర్లు రియల్మీ సీ 53.. 6.74 అంగుళాల 90 హెచ్‌జెడ్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ టూ బాడీ రేషియో 90.3శాతం, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 108 ఎంపీ ఆల్ట్రా క్లియర్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, ఫోన్ ఫ్రంట్ సైడ్ 720 పీ/30 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నానోకార్డ్, మైక్రో ఎస్డీ స్లాట్లు ఉన్నాయి. బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లో లభ్యం కానుంది. -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్‌లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు. -
రియల్మీ నుంచి కొత్త సిరీస్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ 11 ప్రో సిరీస్ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఏర్పాటు ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 4గీ లాస్‌లెస్ జూమ్ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రోలైట్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది. ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది! -
రియల్మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ రియల్మీ ఫోన్లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. రియల్మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు. ‘రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్. వన్‌ప్లస్ బ్రాండ్ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు. Will hv this tested and checked @rishibagree copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023 -
బీ న్యూ స్టోర్లలో రియల్మీ 11ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్‌లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ, బీనౌ, క్లెవర్పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్‌తో పాటు రియల్మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్‌లు పాల్గొన్నారు. -
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన పదవికి రాజీనామా వేశారు. సంస్థకు ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ ప్రముఖ బ్రాండ్‌గా నిలబెట్టిన మాధవ్ సేత్ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్‌ను మాధవ్ ట్వీట్ చేశారు. రియల్‌మీకి తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన మరపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్మీ తన స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్మెంట్కు తోడు "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్‌లు, పార్టనర్స్, ఇలా ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు. (Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే ) మాధవ్ సేత్ పయనం ఎటు? రియల్‌మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్‌లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్మీ (Realme), రెడ్మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లను మే నెలలో లాంచ్ చేశాయి. రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో ఎన్53 Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్ ఉండటం. యాపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్ ఇందులో ఉంది. రియల్ ఏ2 ప్లస్ Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ (2GB/32GB) చాలు, ఫింగర్‌ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్ మోడల్. ఇందులో 2GB/64GB వేరియంట్ రూ.6,499, 4GB/64GB వర్షన్ రూ.7,499కి లభిస్తుంది. మోటరోలా జీ13 Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్ప్లే, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.డాల్బీ అట్మాస్ సౌండ్‌ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9,999. పోకో సీ51 Poco C51 భారత్‌లో ఏప్రిల్‌లోనే లాంచ్ అయింది. 4GB/64GB వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్ లాగే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర ఇటీవల రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్! -
Realme Narzo N53 లాంచ్ : స్పెషల్ ఆఫర్ రూ. 9వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలస్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ తాజగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్మీ నార్జో ఎన్53 పేరుతో రెండు వేరియంట్లలో 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, ధర రూ. 8,999, 6జీబీ ర్యామ్+ 125 జీబీ స్టోరేజ్ ధర రూ. 10,999 వద్ద లభ్యం. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!) ఈ స్మార్ట్‌ఫోన్ మే 24 నుంచి రియల్మీ, Amazon సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభ్యం. పరిచయ ఆఫర్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై రూ. 1,000 వరకు తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో ఎన్53 ఫీచర్లు 6.74-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్. . ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. Unisoc T612 SoC చిప్సెట్ , ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ ఉంది. f/1.8 ఎపర్చరు, 5P లెన్స్ ,LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ అందిస్తోంది ఇందులో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, స్లో మోషన్ , బోకె ఎఫెక్ట్ కంట్రోల్ లాంటివి ఉన్నాయి. 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ మరిన్ని టెక్ న్యూస్, గాడ్జెట్స్ వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి : Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్‌తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్‌తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్‌లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ డిస్కౌంట్‌తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ రూ.32,999కు ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్‌టాప్‌లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
తక్కువ ధరకు రియల్మీ ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
రియల్మీ నార్జో ఎన్55(Realme Narzo N55) అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. బడ్జెట్ కేటగిరీ ఫోన్ అయిన దీని ప్రారంభ ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్, రియల్మీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్మీ నార్జో ఎన్55 రెండు రకాల ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్‌తో 64బీజీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.10,999. మరో వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.12,999. పరిచయ ఆఫర్లో భాగంగా 4జీబీ ర్యామ్ వేరియంట్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును ప్రకటించింది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. Realme Narzo N55 ఫీచర్లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే ముందు భాగంలో పంచ్ హోల్ కెమెరా కటౌట్, ఫ్రంట్ కెమెరా MediaTek Helio G88 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ 2MP డెప్త్ సెన్సార్‌తో 64MP మెయిన్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా 5,000 mAh బ్యాటరీ, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ -
రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్మీ భారత మార్కెట్లో సి–55 మోడల్‌ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు ఉంది. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) -
తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు!
రియల్మీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల శ్రేణిని విస్తరించింది. తాజాగా భారత్‌లో రియల్మీ C33 2023 ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇంతకు ముందు వచ్చిన రియల్మీ C33కి ఇది మెరుగైన వెర్షన్. HD+ డిస్ప్లే, Unisoc చిప్సెట్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మరొకటి 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. వీటిలో మొదటి వర్షన్ ధర రూ. 9,999 కాగా మరొకటి రూ.10,499. ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్లలో లభిస్తాయి. రియల్మీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు . రియల్మీ C35 ఫోన్ విడుదలను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది దేశంలో మార్చి 21 న విడుదల కానుంది. రియల్మీ C33 2023 స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్టాకోర్ (octa-core) Unisoc T612 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ప్రాథమిక సెన్సార్ 50 ఎంపీ లెన్స్, సెకండరీ AI సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
రియల్మీ దూసుకొస్తోంది..దిగ్గజాలకు గట్టి షాకిస్తుందా?
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కూడా త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించ నున్నది. ఈ విషయాన్ని రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. తద్వారా ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో ఆకట్టు కుంటున్న శాంసంగ్, హువావే వివో, ఒప్పో, టెక్నో, మోటరోలా, షావోమీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సీఈవో మాధవ్ సేథ్ తమ ఫోల్డబుల్ ఫోన్ గురించి ట్వీట్ చేశారు రియల్మీఫోల్డ్, రియల్మీ ఫ్లిప్ ఈ రెండింటిలో ఏది కావాలి అని ప్రశ్నించారు. తద్వారా రియల్మీ ఫోల్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై కీలక సంకేతాలిచ్చారు. మరోవైపు 2022 నవంబరులోనే రియల్మీ చైనా వైస్ ప్రెసిడెంట్ జుక్వి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఎఫర్డబుల్ ఫోల్డబుల్‌పై పనిచేస్తోందని హింటిచ్చారు. ప్రతీ ఏడాది రెండు GT నియో-బ్రాండెడ్ ఫోన్లు, నంబర్ సిరీస్ ఫోన్లు రెండు, ఒక GT సిరీస్ మోడల్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ , Z ఫ్లిప్ తోపాటు, షావోమీ మిక్స్ ఫోల్డ్2, మోటరోలా రేజర్, ఒప్పో ఫైండ్ ఎన్2 ప్లిప్, టెక్నో పాంథమ్ వీ ఫోల్డ్ వంటి ఆప్షన్లతో ఫోల్డబుల్ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే వన్‌ప్లస్, పిక్సెల్ ఫోల్డబుల్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ఇకపై రియల్మీ కూడా చేరనుంది. What do you want next… #realmeFlip or #realmeFold? — Madhav Sheth (@MadhavSheth1) March 9, 2023 -
Realme GT3: మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్.. ధర మాత్రం...
రియల్మీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రియల్మీ జీటీ3 (Realme GT3) స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 9.5 నిమిషాలు పడుతుంది. దీని ప్రారంభ ధర 649 యూఎస్ డాలర్లు (రూ. 53,543). realme GT3 Global Launch Event | Speed to the Max https://t.co/0cGd4NBHku — realme (@realmeglobal) February 28, 2023 Realme GT3 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 2,772 x 1,240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్ప్లే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ 240 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్. ఆండ్రాయిడ్ 13 ఓఎస్, అంతర్గత Realme UI, డాల్బీ అట్మోస్. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50ఎంపీ ప్రైమరీ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మైక్రోస్కోప్ లెన్స్). (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) -
టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకొని కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫీచర్లు, ఫోల్డబుల్ ఫోన్లు, ఆకట్టుకునే కలర్స్ అంటూ రకరకాల ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే తొలిసారి 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాన్నీ ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వీలు కల్పిచ్చింది. సాధారణంగా ఛార్జింగ్ పెట్టుకోవాలంటూ కంపెనీని ఒక్కో ఫోన్ 2 లేదా 3 గంటలు పెడితేనే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. అయితే రియల్ ఫోన్‌ను కేవలం 10నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘రియల్మీ జీటీ నియో 5జీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌కు 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం నిమిషాల వ్యవధిలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ప్రకటించింది. 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే ఫోన్ ఇప్పటివరకు మార్కెట్లోకి రాలేదని.. తొలి 4 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుందని, 10 నిమిషాల్లోపే 100శాతం పూర్తయిందని రియల్మీ తెలిపింది. ఇక ఆఫోన్లో 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వీటితో 4కే, 1080పీ రెజల్యూషన్‌తో వీడియోలు తీసుకోవచ్చు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న రియల్మీ జీటీ నియో 5 ఫోన్ ధర సుమారు రూ.40వేల వరకు ఉండొచ్చని అంచనా -
రియల్మీ కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. అదిరే కలర్స్‌లో
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ కోకా-కోలాకంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రియల్మీ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కోకా -కోలా ఎడిషన్‌ను ఫిబ్రవరి 10న చేయబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్త కలర్స్‌లో, యూజర్ ఇంటర్ఫేస్లో (UI) కీలక మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. స్టోరేజ్ మార్పు తప్ప, మిగిలిన ఫీచర్లు గత ఏడాది నవంబర్‌లో లాంచ్ చేసిన మోడల్ మాదిరిగానే ఉండబోతున్నాయి. గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా కోకా కోలాతో జతకట్టింది. పరిమిత-ఎడిషన్ ఫోన్‌ను కోకాకోలా లోగోతో బ్లాక్ అండ్ రెడ్ డ్యుయల్ టోన్ కలర్స్‌లో ఆకర్షణీయంగా లాంచ్ చేస్తోంది. రియల్మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు (అంచనా) 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13, స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 108 ఎంపీ ప్రోలైట్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.20 వేల లోపే ఉండొచ్చని అంచనా. కాగా రియల్మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999. అలాగే రియల్మీ 10 ప్రో ప్లస్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999గాను, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.27,999గా ఉన్నాయి. -
రియల్మీ10 వచ్చేసింది.. 5జీ సపోర్ట్ ఉందా? లేదా?
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్మీ ఫ్యాన్స్‌ను నిరాశ పర్చింది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు 6.5అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్&వైట్ పొట్రయిట్ రియర్ డ్యుయల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ ఫస్ట్ సేల్, ఆఫర్, ధర ఈ స్మార్ట్‌ఫోన్ క్లాష్ వైట్ రష్ బ్లాక్ అనే రెండు రంగులలో లభ్యం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంటుంది. తొలి సేల్, జనవరి 15నుంచి రియల్ మీ, ఫ్లిప్‌కార్ట్ ఇతర ఆన్లైన్ స్టోర్లలో లభ్యం. రియల్మీ, ఫ్లిప్‌కార్ట్‌లో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. -
108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: రియల్మీ 10 ప్రో 5జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. రియల్మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్, నెబ్యూలా బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ కూడా మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు 6.72 ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 680నిట్స్ పీక్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్ ధరలు, ఆఫర్ రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ 14 నుంచి డిసెంబరు నుంచి ఫస్ట్ సేల్ షురూ అవుతుంది. కాగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. రియల్మీ 10 ప్రో 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.19,999 ధరతో వచ్చింది. డిసెంబరు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యంకానుంది. లభిస్తుంది. రియల్మీ అధికారిక వెబ్సైట్లోనూ ఈ మొబైల్ సేల్కు వస్తుంది. -
రియల్మీ10 ప్రొ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్, ధర తక్కువే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రియల్‌మి సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. చైనాలో రియల్‌మి 10 ప్రో సిరీస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. రియల్‌మి ప్రొ, రియల్‌మి ప్రొ ప్లస్ 5జీ రెండు వేరియంట్లలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ఫోన్లను భారత మార్కెట్లో తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఇవి స్టార్‌లైట్ గోల్డ్, నైట్ బ్లాక్, సీ బ్లూ రంగుల్లో లభ్యం. రియల్‌మి 10 ప్రో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+ 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు: 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సుమారు రూ. దాదాపు రూ. 18,300 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 21,700 రియల్‌మి 10 ప్రో ప్లస్ 5జీ 6.72 అంగుళాల ఫుల్హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్, Snapdragon 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 67 వాట్ ఛార్జింగ్ ధరలు 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 19,444 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 22,900 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 26,300 -
రియల్మీ 10 సిరీస్ లాంచ్..ఫీచర్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి తాజాగా రియల్‌మి 10 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. త్వరలో చైనా ఆ తర్వాత మిగిలిన దేశాల స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఫోన్‌ను పరిచయం చేయనుంది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రియల్మీ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌గా చెబుతున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుండగా.. వీటిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ హీలియా జీ 99 చిప్ సెట్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అమొలెడ్ డిస్ప్లేను డిజైన్ చేసింది. రియల్ మీ ప్రతినిధులు చెప్పినట్లుగా రియల్మీ 10లో గేమ్స్‌ను 9గంటల పాటు నిర్విరామంగా ఆడుకోవచ్చని తెలిపారు. ప్రత్యేకించి ఈ ఫోన్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 28 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నవంబర్ 17న రియల్ మీ నవంబర్ 17న రియల్ మీ 10 చైనా వెర్షన్‌ను అక్కడ పెద్ద ఎత్తున లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ఈవెంట్లో రియల్మీ 10 ప్రో, రియల్మీ ప్రో ప్లస్‌ను సైతం యూజర్లకు పరిచయం చేస్తుంది. ఇక ఈ లేటెస్ట్ రియల్ మీ సిరీస్ 10 ధరలు ఎంత ఉంటాయనే అంశంపై స్పష్టత లేనప్పటికీ.. గతేడాది రియల్మీ విడుదల చేసిన రియల్మీ 9 సిరీస్ తరహాలో బడ్జెట్లో ధరలు ఉంటాయని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. -
గ్రాండ్ లాంచ్‌కు రెడీగా రియల్మీ 10 సిరీస్.. ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో గ్రాండ్ లాంచ్క్ రెడీగా ఉంది. కంపెనీ రియల్మీ 10 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌పై పుకార్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. రాబోయే లైనప్‌లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్‌లు ఉన్నాయి. కంపెనీ రియల్మీ సిరీస్ డిజైన్, పెర్ఫార్మెన్స్, పనితీరును ట్విటర్ ద్వారా రివీల్ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది. ఫీచర్ల అంచనా.. Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ►4GB RAM, 128GB స్టోరేజ్ ►స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్ AMOLED FHD+ డిస్ప్లే ► అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ►స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సపోర్ట్ చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్? -
కస్టమర్లకు రియల్ మీ మరింత మెరుగైన సేవలు
న్యూఢిల్లీ: రియల్ మీ తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ‘రియల్ మీ కేర్ సర్వీస్ సిస్టమ్’ను ప్రారంభించింది. కంపెనీ రెండో దశ వృద్ధిలోకి అడుగు పెట్టిందని, దీంతో కస్టమర్ల అంచనాలకు మించి సేవలను అందించనున్నట్టు రియల్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కస్టమర్లు ఆన్లైన్, ఆఫ్‌లైన్ టచ్ పాయింట్ల ద్వారా, వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా, 1,000కి పైగా సర్వీస్ సెంటర్ల రూపంలో సులభంగా సేవలను పొందొచ్చని తెలిపింది. సోషల్ మీడియా, ఈమెయిల్, వాయిస్, వాట్సాప్, వెబ్ చాట్‌పై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు బంపరాఫర్
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. రియల్మీ అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 31వరకు ‘రియల్మీ ఫెస్టివ్ డేస్ సేల్’ పేరుతో ప్రత్యేకంగా అమ్మకాలు జరపనుంది. అయితే ఈ సేల్ నిర్వహణకు ముందే రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్లపై రూ.5వేల డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 8జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.49,999 ఉండగా రూ.44,999కే పొందవచ్చు. ఇక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై అదనంగా రూ.3వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 16తో ముగియనుంది. రియల్మీ జీటీ 2 ప్రో ఫీచర్లు,స్పెసిఫికేషన్లు రియల్మీ సంస్థ 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 1440*3216 పిక్సెల్స్ రెజెల్యూషన్‌తో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో రియల్మీ జీటీ 2 ప్రోను తయారు చేసింది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేటుతో డిస్ప్లే, ఫోన్ సురక్షితంగా ఉండేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్ తో 12జీబీ ర్యామ్,256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అంతేకాదు ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, ప్రపంచంలోనే తొలి బయోపాలిమర్ డిజైన్‌తో మార్కెట్‌కు పరిచయం చేసినట్లు రియల్మీ ప్రతినిధులు తెలిపారు. రియల్మీ జీటీ 2 ప్రోలో 3 కెమెరాలతో వస్తుండగా ఫోటోలు తీసేందుకు అనువుగా ఈ ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్, ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలు దిగేందుకు 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. వీటితో పాటు డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 65డబ్ల్యూ సూపర్ డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. రియల్మీ యూఐ 3.0 ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.2,జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ సౌకర్యం ఉంది. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
రియల్ మీ సరికొత్త ఫోన్ సీ30ఎస్ లాంచ్, లోబడ్జెట్ ధర
న్యూఢిల్లీ: రియల్మీ కంపెనీ సీ సిరీస్ నుంచి సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూనిసాక్ ఎస్సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ డిస్ప్లే 6.5 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రియల్మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5 ఇంచుల HD+ LCD డిస్ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 బేస్ట్ రియల్మీ యూఐ గో ఎడిషన్‌తో 64 జీబీదాకా విస్తరించుకును అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ధరలు,లభ్యత 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.7,499, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. స్ట్రిప్ బ్లాక్, స్ట్రిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. రియల్మీ సీ30ఎస్ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సందర్భంగా సెప్టెంబరు 23నుంచి సేల్కు రానుంది. -
రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ కొత్త 5జీ మొబైల్‌ని విడుదల చేసింది. Realme 9i పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 9ఐకి 5జీ వెర్షన్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. చదవండి : నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు ధరలు, లభ్యత, ఆఫర్లు 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 16,999 ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 24, మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీషోరూంలు, ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్‌గా రూ. 1000 తగ్గింపు ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది. అంటే ముందుగా కొనుగోలు చేసిన వారికి 13,999, 15999ల రేంజ్లో ఈ ఫోన్లను సొంతంచేసుకోవచ్చు. (చదవండి: ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) Realme 9i 5జీ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ప్లే, Dimensity 810 చిప్సెట్ 2,400×1,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 12 ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ చార్జర్ T100 ఇయర్ బడ్స్ Realme కొత్త 5G ఫోన్‌తో పాటు Realme Buds T100ని కూడా లాంచ్ చేసింది. T100 రూ. 1499 గాకంపెని నిర్ణయించింది. ఇవి మొత్తం 28 గంటల ప్లేబ్యాక్ సమయం, T100 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయని కంపెనీ తెలిపింది. రాకిన్ రెడ్, పాప్ వైట్, జాజ్ బ్లూ , పంక్ బ్లాక్ నాలుగు రంగుల్లో ఇవి లభ్యం. -
రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ, ఇంకా బోలెడు ఫీచర్లు!
హైదరాబాద్: రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో, 11 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్ప్లే, 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ డార్ట్ చార్జింగ్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వైఫై వెర్షన్ ధర రూ.19,999. ఇదే సామర్థ్యాలతో వైఫై, 5జీ సిమ్ సపోర్టెడ్ ట్యాబ్లెట్ ధర రూ.25,999. ఇందులో 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. అలాగే, రియల్మీ వాచ్3, ఒక ఫ్లాట్ మానిటర్, రియల్మీ బడ్స్ ఎయిర్3 నియో, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2ఎస్ ఉత్పత్తులను కూడా సంస్థ విడుదల చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
అతి తక్కువ ధరలో రియల్మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రియల్మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. సీ-సిరీస్‌లో రియల్మీ సీ30 పేరుతో ఎంట్రీ లెవల్ ఫోన్‌ను ఈ రోజు (జూన్ 20) మధ్యాహ్నం తీసుకొస్తోంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది గంటల్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. రియల్మీ సీ 30 ఫీచర్లు 6.6-అంగుళాల ఫుల్ హెచ్ + డిస్ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఆక్టా-కోర్ Unisoc T612 SoC 13 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీని 2 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో బ్యాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంటుందని అంచనా. -
బడ్జెట్ ధరలో రియల్మీ.. విడుదల ఎప్పుడంటే!
దేశీయ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు రియల్మీ శుభవార్త చెప్పింది. బడ్జెట్ ధరలో రియల్మీ సీ30ఫోన్‌ను ఈనెల 20న కొత్త ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ స్పెసిఫికేషన్‌తో పాటు ధర ఎంతో తెలుసుకుందాం. రియల్మీ సీ30 పేరుతో మార్కెట్‌కు పరిచయం కానున్న ఈ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రియల్మీ సీ30 ధర బడ్జెట్ ధరలో రియల్మీ సీ30 లభ్యం కానుంది. లైట్ వెయిట్, స్టెలిష్ లుక్ రానున్న ఈ ఫోన్ ధర 7వేలు ఉండొచ్చని అంచనా. -
జూన్‌లో స్మార్ట్ ఫోన్ల పండుగ, అదిరిపోయే ఫీచర్లతో 9 ఫోన్లు రిలీజ్!
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి సీజన్లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్ ఫోన్ సేల్స్ సైతం విపరీతంగా జరుగుతుంటాయి. అందుకే జూన్‌లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలైన ఒప్పో, వన్ ప్లస్, పోకో, రియల్ మీ, షావోమీ'లు ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. 1.రియల్మీ చైనా స్మార్మ్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ జూన్ 7న స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో రియల్ మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. 2.పోకో షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్తో పోకో ఎఫ్4 జీటీ స్మార్ట్ ఫోన్‌ను జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది 3.వన్ ప్లస్ మరో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ 90హెచ్ జెడ్ ఆమోలెడ్ డిస్ప్లే, 80 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్ ప్లస్ నార్డ్ 2టీని జూన్ నెలలో విడుదల చేయనుంది. 4.ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 5.షావోమీ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో షావోమీ 12ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సైతం జూన్ 15 తేదీ లోపు విడుదల చేయనుంది 6.మోటో జూన్ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మోటో ఈ32ఎస్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 7.శాంసంగ్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది. 8.వివో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్‌లో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 9.మోటరోలా మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్ ఫోన్‌ను జూన్ నెలలో విడుదల కానుంది. చదవండి👉ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్! -
తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లలోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొద్దిరోజుల క్రితమే రియల్మీ 9 సిరీస్‌లో భాగంగా రియల్మీ 9 5జీ, రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్మీ 9ఐ, రియల్మీ 9 ప్రో 5జీ, రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా రియల్మీ 9 సిరీస్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రియల్మీ 9 4జీ ను తీసుకువచ్చింది. ధర ఎంతంటే..? హైఎండ్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్మీ. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది. రియల్మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది. సన్ బరస్ట్ గోల్డ్, స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో రానుంది. రియల్ మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సందర్భంగా...హెచ్డీఎఫ్సీ కార్డుపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఏప్రిల్ 12న అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్, రీటైల్ స్టోర్ల కొనుగోలు చేయవచ్చును. రియల్మీ 9 4జీ స్పెసిఫికేషన్స్ 6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 108 ఎంపీ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8ఎంపీ సూపర్ వైడ్ కెమెరా + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్మీ జీటీ నియో 3(Realme GT Neo 3) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రియల్మీ జీటీ నియో 3 నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తోంది. ఇది కేవలం 5 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీను ఛార్జ్ చేయనుంది. గత ఏడాది చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్మీ జీటీ నియో 3ను తీసుకొచ్చింది. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ తొలుత చైనా మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా రియల్మీ జీటీ నియో 3 త్వరలోనే అందుబాటులోకి వస్తోందని రియల్మీ పేర్కొంది. థర్మల్ మేనెజ్మెంట్ కోసం డైమండ్ ఐస్ కోర్ కూలింగ్ ప్లస్ ఫీచర్ Realme GT Neo 3 సొంతం. ధర ఎంతంటే..! Realme GT Neo 3 రెండు విభిన్న బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్లలో వస్తుంది . 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ స్టోరేజ్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ స్టోరేజ్. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఇక రియల్మీ జీటీ నియో3 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 యువాన్లు (దాదాపు రూ. 24,000) గా ఉంది. 8GB ర్యామ్ + 256GB ఇంటర్నట్ స్టోరేజ్‌వేరియంట్ ధర CNY 2,299 యువాన్లు (దాదాపు రూ. 27,500) కాగా, 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,599 (సుమారు రూ. 31,200) యువాన్లుగా ఉంది. Realme GT Neo 3 150W వేరియంట్(8GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్) ధర CNY 2,599 యువాన్లు ఉండగా, 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర CNY 2,799 (దాదాపు రూ. 33,600) యువాన్లుగా ఉంది. సైక్లోనస్ బ్లాక్, సిల్వర్‌స్టోన్, లే మాన్స్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ 6.7-అంగుళాల 2K డిస్ప్లే HDR10+, DC డిమ్మింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 మీడియాటెక్ డిమెన్సిటీ 8100 5జీ ఎస్ఓసీ ప్రాసెసర్ 12జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 50 ఎంపీ ట్రిపుల్రియర్ కెమెరా 5జీ సపోర్ట్ 150 వాట్ ఛార్జింగ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ డాల్బీ ఆట్మోస్ స్పీకర్స్ చదవండి: వచ్చేశాయి..షావోమీ నయా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్...ఐఫోన్లలో వాడే టెక్నాలజీతో -
ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!!
మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3,099కే అందిస్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది. రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్‌పై ఆఫర్లు దేశీయ మార్కెట్ ప్రకారం..4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ధర రూ.16,099గా ఉంది. అయితే కొనుగోలు దారులు అతితక్కువ ధరకే సొంతం చేసుకునేలా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్ ధర కంటే భారీగా తగ్గనుంది. కొనుగోలు దారులు రియల్ మీ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో ఫోన్ ధర వెయ్యి తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.ఇక మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా మీ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఉంటే.. రియల్ మీ రూ.3వేలకే పొందవచ్చు. చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
అదిరిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్ ఫోన్..రేపటి నుంచే సేల్!!
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 21 నుంచి ఆన్లైన్ సేల్‌కి సిద్ధమైంది. ఫిబ్రవరి21 మధ్యాహ్నం 12:00 గంటల నుండి రియల్ మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నట్లు రియల్ మీ ప్రతినిధులు తెలిపారు. రేపు విడుదల కానున్న రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్ 6ప్లస్ 128జీబీ ధర రూ.24,999, 8ప్లస్ 128 జీబీ ధర రూ.26,999, 8ప్లస్ 256జీబీ ధర రూ.28,999గా ఉండనున్నాయి. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని రియల్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఫీచర్లు రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రియల్ మీ యూఐ 3.0తో అందిస్తుంది. ఇందులో సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్, మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, ఫోన్ 60డబ్ల్యూ ఛార్జర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రియల్ మీ 9 ప్రో ప్లస్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇందులో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. -
Flipkart TV Days Sale: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!
ప్రముఖ ఈ-కామర్స ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్‌తో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో భాగంగా వివిధ ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ టీవీ డేస్ సేల్ నేటి(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10, 2022వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వివిధ బ్రాండ్ల టీవీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటుగా యూజర్ నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ► శామ్ సంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25% తగ్గింపు లభిస్తుంది. దీని మీద నెలకు ₹1,899తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ టీవీతో కస్టమర్లు 20వాట్ స్పీకర్‌ను కూడా పొందుతారు. ► వన్ ప్లస్ వై సిరీస్ 80 సెం.మీ(32 అంగుళాల) హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ సేల్‌లో రూ.16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ వినియోగదారులకు 17% తగ్గింపుతో లభిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలో కస్టమర్లు 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. ► ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో 24 అంగుళాల కొడాక్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే లభిస్తోంది. ఇది కాకుండా, మీరు అడ్సున్ 24 అంగుళాల మోడల్ టీవీని రూ.7,290కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మార్క్యూ 24 అంగుళాల మోడల్ రూ.7,999కు లభిస్తోంది. ► రియల్ మీ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై 11 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అది వినియోగదారులకు రూ.15,999కి అందుబాటులో ఉంటుంది. ఈ టీవీలో 24వాట్ స్పీకర్ అవుట్‌పుట్ , 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. (చదవండి: ఇక పెట్టుబడికి సిద్దం కాండి.. దేశంలో డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడే..!) -
వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..!
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి జస్ట్ మూడేళ్లయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే అందిస్తూ రియల్మీ భారత్‌లో మరోసారి సత్తా చాటింది. క్యూ4లో నంబర్ 2 భారత్‌లో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ 2021గాను క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 17 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శాంసంగ్‌ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ రెండో కంపెనీగా రికార్డు సృష్టించింది. శాంసంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి నెంబర్ వన్..! ఇక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ మరోసారి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. భారత మార్కెట్లో ఒక వెలుగు వెలిగినా శాంసంగ్‌కు షావోమి భారీగానే గండి కొట్టింది. 2021 క్యూ4లో షావోమీ ఏకంగా 24 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్‌గా నిలిచింది. 2021లో టాప్ షావోమీ..! 2021గాను ఒవరాల్ చూసుకుంటే షావోమీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. చదవండి: గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్‌తో హిస్టరీ! -
రూ.15వేలకంటే తక్కువ ధరతో..అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ స్మార్ట్ ఫోన్!
Realme 9 Pro to launch in India Soon: కొత్త ఏడాది ప్రారంభంతో టెక్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో, తక్కువ బడ్జెట్‌తో 5జీ స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ' త్వరలో రియల్మీ 9 ప్రో, రియల్మీ 9 ప్రో ప్లస్ పేరుతో 5జీ స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి రానప్పటికీ.. లీకైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్‌లీక్స్ రిపోర్ట్ ప్రకారం.. రియల్ మీ 9ప్రో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదల కానుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే హోల్ పంచ్ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 6.59 అంగుళాల డిస్ప్లే, 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్‌తో రెండు స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్లు ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. మరోవైపు రియల్9 ప్రో ప్లస్ ఇలాంటి ఫీచర్లే ఉండగా..ఇందులో 65డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుందని నివేదికల్లో తేలింది. బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. జనవరి 22న అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64బీజీ స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999గా ఉండనుంది. -
ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే గడిచిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ 9ఐ'ని మార్కెట్‌కి పరిచయం చేయనుంది. జనవరి 18న రియల్ మీ' ఇండియాలో నిర్వహిస్తున్న ఈవెంట్లో రియల్ మీ 9ఐ ఫోన్ తో పాటు స్పెసిఫికేషన్ల గురించి ప్రకటన చేయనుంది. ఈ వారం వియాత్నంలో జరిగిన ఈవెంట్లో రియల్ మీ సంస్థ 'రియల్ మీ 9ఐ' విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధరతో పాటు ఫీచర్లు లీకయ్యాయి. అయితే ఇప్పుడు మనం లీకైన ఆ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు దాని ధరెంతో తెలుసుకుందాం. రియల్ మీ 9ఐ స్పెసిఫికేషన్స్ రియల్ మీ 9ఐ 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్సీడీ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ పంచ్హోల్తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ,పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్, పిక్సెల్ డెన్సిటీ 401పీపీఐ, పంచ్ హోల్‌తో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680, మోడెస్ట్ 4జీ ప్రాసెసర్. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌తో పాటు గరిష్టంగా 1టీబీ మైక్రో ఎస్ కార్డ్‌తో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్‌ను అందిస్తుంది. రియల్ మీ 9ఐ ఫోన్ వెనుక 50 మెగా ఫిక్సెల్తో మూడు కెమెరాలు, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 గాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ పోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. భారతదేశంలో రియల్ 9ఐ ఫోన్ ధర వియాత్నంలో రియల్ 9ఐ ఫోన్ ధర రూ.20,500 ఉండగా, భారత్‌లో ఈ వేరియంట్ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ధర భారత్‌లో ఎంతుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే! -
వైరల్: మరో ఫోన్ పేలింది..నా ఫ్రెండ్ ఫోన్‌కి ఇలా జరిగిందేంటి సార్ అంటూ ట్వీట్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్ మీకి చెందిన రియల్ మీ ఎక్స్‌టీ ఫోన్ పేలింది. ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి ఫోన్ పేలిందని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌పై రియల్ మీ యాజమాన్యం స్పందించింది. My friend's phone Realme XT blast in the evening today....@MadhavSheth1 please do something 🙏 pic.twitter.com/CrCnaOKnIK — Sandip Kundu (@SandipK75709658) December 28, 2021 డిసెంబర్ 28న ట్విట్టర్ యూజర్ సందీప్ కుండు తన స్నేహితుడు వారం రోజుల క్రితం కొన్న రియల్ మీ ఫోన్ పేలిందంటూ ట్వీట్ చేశాడు. రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేయడంతో పేలుడు ఘటనపై రియల్‌మి ఇండియా ట్విట్టర్ అఫీషియల్ సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది. అంతేకాదు బాధిత యూజర్ కాంటాక్ట్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. కొన్ని గంటల తర్వాత కంపెనీ స్పందిస్తూ.. పేలిన ఫొన్ భాగాలను తీసుకుని దగ్గరలోని అధికారిక రియల్ మి సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఆ ఫోన్ ఎందుకు పేలింది. ఆ ఫోన్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు -
వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...!
Realme GT 2 Pro to Get Three World First Innovations Company Claims: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ మరో అద్భుతమైన ఆవిష్కరణను నెలకొల్పనుంది. ప్రపంచంలోనే మొదటి ఇన్నోవేటివ్ ఫీచర్స్‌ను రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లను రియల్మీ అధికారిక యూట్యూబ్‌లో ఖాతాలో సోమవారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేసింది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫోటోగ్రఫీ, కమ్యూనికేషన్ విషయాల్లో వరల్ట్ ఫస్ట్ ఇన్నోవేషన్స్‌గా నిలుస్తోందని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో డిజైన్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో పేపర్ నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ కంపెనీ అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌కోసం ప్రఖ్యాత జపనీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa కంపెనీతో రియల్మీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ SABIC ద్వారా బయో-పాలిమర్ మెటీరియల్‌తో నిర్మించనుంది. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ నిష్పత్తి 21.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గనుంది. రియల్మీ జీటీ 2 ప్రో కెమెరా ఫీచర్ రియల్మీ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు న్యూ అల్ట్రావైడ్ సెన్సార్‌ను కూడా అందించింది. ఈ కొత్త సెన్సార్ 150-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూస్‌తో రానుంది. ప్రైమరీ వైడ్ సెన్సార్‌లోని 89-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ కంటే 273 శాతం ఎక్కువగా ఉంది. ఈ "అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్"తో ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీయవచ్చుని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో కమ్యూనికేషన్ ఫీచర్ కొత్త రియల్మీ జీటీ 2 ప్రోలో యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి "అల్ట్రా వైడ్ బ్యాండ్ హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్" సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో అన్ని దశల నుంచి ఒకే సిగ్నల్ బ్యాండ్లకు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఉత్తమ నెట్వర్క్ బ్యాండ్‌ని ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.యాంటెన్నా స్విచింగ్ సిస్టమ్‌తో పాటు, రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సామర్థ్యాన్ని పెంచేందుకు, 360-డిగ్రీ ఎన్ఎఫ్సీ మద్దతుతో రానుంది. చదవండి: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తే..! -
శామ్సంగ్కు రియల్మీ ఝలక్.. అమ్మకాల్లో మరో రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తోంది స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ. కేవలం మూడేళ్ల కిందట భారత మార్కెట్లో అడుగు పెట్టిన ఈ కంపెనీ బడా బ్రాండ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. నంబర్ 2 ఇండియాలో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అక్టోబరు గణాంకాలను విడుదల చేసింది. ఇందులో 18 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శామ్సంగ్ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ కలిగిన కంపెనీగా రికార్డు సృష్టించింది. శామ్సంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి వెంటే గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. షావోమి మార్కెట్‌కి గండి కొట్టేందుకు శామ్సంగ్, రియల్మీ, ఒప్పో, వివోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా అక్టోబరులో కూడా 20 శాతం మార్కెట్ వాటాతో షావోమినే నంబర్ వన్‌గా నిలిచింది. అయితే ఈ నంబర్ వన్ స్థానం కాపాడుకునేందుకు షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో మోడల్స్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ క్షణమైనా షావోమి ఆధిపత్యాని చెక్ పెట్టేందుకు రియల్మీ రెడీగా ఉంది. ఇక 13 శాతం మార్కెట్ వాటాతో వివో నాలుగో స్థానంలో ఉంది. అన్నింటినీ తోసిరాజని క్వార్టర్ 3 అమ్మకాలను అక్టోబరు అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు.. టాప్ 4లో ఉన్న మిగిలిన మూడు కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టగా కేవలం రియల్ మీ బ్రాండ్ మాత్రమే మార్కెట్ వాటాను పెంచుకుంది. షావోమీ 23 నుంచి 20 శాతానికి , శామ్సంగ్ 17 నుంచి 16 శాతానికి, వివో 15 నుంచి 13 శాతానికి మార్కెట్ వాటా పడిపోగా కేవలం రియల్మీ బ్రాండ్ ఒక్కటే మార్కెట్ వాటాను 15 నుంచి 18 శాతానికి పెంచుకోగలిగింది. వచ్చే ఏడాదిలో ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగడమే తమ తదుపరి లక్ష్యమని రియల్మీ ప్రతినిధులు అంటున్నారు. -
2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
2021 పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు బిజినెస్ ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’గా గడిచింది. మరికొన్ని కంపెనీలకేమో మూడు పువ్వులు ఆరుకాయలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటడాయి. అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత్ కాసుల వర్షాలను కురిపించాయి. 2021 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది. 2021లో వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ప్రముఖ టెక్ వెబ్సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. ఆయా స్మార్ట్ఫోన్ల పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ధరలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని గాడ్జెట్స్ 360 ఈ ఏడాది వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్ఫోన్లలో ఏ మోడల్స్ కూడా 10/10 స్కోర్‌ను సాధించలేకపోయాయి. గాడ్జెట్స్ 360 ఎంపిక స్మార్ట్ ఫోన్లలో యాపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ నిలిచాయి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! ►యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే పరంగా మిగతా స్మార్ట్ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది వ్యక్తులకే మాత్రమే పరిమితమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు అధికంగా ఉండడంతో 10/10 స్కోర్‌ను సాధించలేకపోయింది. ►రియల్మీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ జీటీ నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. యాపిల్ స్మార్ట్ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువగా ఉండడంతో రియల్మీ జీటీ అమ్మకాలు భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ►ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా నిలిచింది. శామ్సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది. ►భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి. ►కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. ►వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్‌ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్‌లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే.. -
మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులోకి ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై కొనుగోలు దారులకు ఆఫర్లతో పాటు సేవింగ్ డీల్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ప్రత్యేకంగా రియల్మీ స్మార్ట్ ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది. రియల్మీ జీటీ నియో2 పై రూ.4వేలు, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (ప్రీ-పెయిడ్)పై రూ.4వేలు, రియల్ మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8ఐ రూ.1,000, నార్జో 50ఏ పై రూ.1500, రియల్ మీ సీ25వై పై రూ.1,500, నార్జ్ 50ఐ, రియల్ మీ 50ఐ తోపాటు ఇతర స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8 పై ఫ్లిప్ కార్ట్, రియల్ మీ. కామ్ లో రూ.2 వేల డిస్కౌంట్, రియల్ మీ 8 5జీ రూ.1500 వరకు ఆఫర్‌ను పొందవచ్చు. రియల్ మీ సీ21వై ,రియల్ మీ సీ 21పై రూ.500, రియల్ మీ 50ఐ స్మార్ట్ ఫోన్ పై రూ.200 వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే?
గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం వరకు బ్యాటరీ మీద జరిగిన పరిశోదనలు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్ కెమెరా అభివృద్ది మీద జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచార ప్రకారం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా 200 మెగా పిక్సల్ కెమెరాతో మొబైల్ ఫోన్ తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శాంసంగ్, రియల్ మీ, షియోమీ, మోటోరోలా 108 ఎంపీ సామర్ధ్యం గల మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇప్పుడు,మోటరోలాతో పాటు శాంసంగ్, షియోమీ కూడా 200 మెగా పిక్సల్ రియర్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేయాలని యోచిస్తున్నాయి. అయితే, చైనా షియోమీ కంపెనీ దీనిని 2022 ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు. శాంసంగ్ కంపెనీకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 2023లో శామ్ సంగ్ తన 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ ను తీసుకువస్తుందని పేర్కొంది. మోటోరోలా ఈ కెమెరాలో ఐఎస్ఓఎల్ఈఎల్ఎల్ హెచ్‌పీ1 అనే శాంసంగ్ లెన్స్‌ను ఉపయోగించింది. ఇది కొత్త పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ లెన్స్‌తో 30ఎఫ్పిఎస్ రేట్‌తో 8కే వీడియోలను, 12ఎఫ్పిఎస్ రేట్‌తో 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు. (చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..!) వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను విడుదలచేయాలని మోటోరోలా కంపెనీ భావిస్తోంది. మోటోరోలా ఇప్పటికే 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో మోటో జీ60, మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ప్యూజన్, మోటో ఎడ్జ్ 20ప్రో మోడల్ ఫోన్లను విడుదల చేసింది. మోటోరోలా తన తాజా మోటో జి31 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 29న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డివైస్ 50 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలీయో జీ85 ప్రాసెసర్ సహాయం చేత పనిచేస్తుంది. -
కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే
అసలే మంత్ ఎండింగ్. చేతిలో సరపడా డబ్బులు లేవు. కానీ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ట్రై చేస్తున్నారు. అయితే మీ కోసం మార్కెట్లో రూ.10ల లోపు అదిరిపోయే ఫీచర్లతో బ్రాండెంట్ కంపెనీల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ మీ నార్జో 30ఏ రియల్ మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999. రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. 6.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట్రన్నల్ స్టోరేజ్‌తో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్‌తో యూఎస్బీ సీ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చు. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. మైక్రోమ్యాక్స్ నోట్ 1 'మేడ్ ఇన్ ఇండియా' మైక్రోమ్యాక్స్ నోట్ 1 బడ్జెట్ ధరలతో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోర్ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10,మీడియా టెక్ హాలియా జీ80 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో మరో రెండు సెన్సార్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఎస్ఓఎస్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉన్నాయి. వెనుక సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 9,499 ఉంది. మోటరోలా మోటో జీ10 పవర్ మోటో జీ 10..6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ (720×1,600 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ25 ఎస్ఓఎస్,13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. నోకియా సీ 20 ప్లస్ నోకియా సీ 20ప్లస్ 4,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, ఆక్టా కోర్ యూనిసోక్ ఎస్ఈ 9863ఏ ఎస్‌ఓఎస్‌తో పాటు 3జీబీ ర్యామ్‌తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, కెమెరా వెనుక డ్యూయల్ సెటప్ ఉంది. రెడ్మీ 9 ప్రైమ్ రెడ్మీ 9 ప్రైమ్ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్ఫోన్లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. (చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!) ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. (చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!) -
రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. రియల్మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో రియల్మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రూ. 27,999కే లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 31,999. చదవండి: మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే భారీగా ట్యాక్స్ బెన్ఫిట్స్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ. 4 వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రూ.21999కే లభించనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోన్న రియల్మీ సీ20 స్మార్ట్‌ఫోన్‌పై ఎప్పటిలాగనే రూ. 500 తగ్గింపుతో రూ.6999కు లభించనుంది. రియల్మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 తగ్గింపుతో రూ. 18499కే కొనుగోలుదారులకు లభించనుంది. రియల్మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ రూ.1000 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 10499కు రానుంది. చదవండి: టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..! -
మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు సూపర్, ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ క్యూ3టీ'ని మార్కెట్‌కి పరిచయం చేసింది. త్వరలో ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రియల్ మీ క్యూ3టీ ఫీచర్లు మార్కెట్లో విడుదలైన రియల్ మీ క్యూ3టీ సిరీస్ ఫోన్లు హ్యాండ్సెట్ నెబ్యులా, నైట్ స్కై బ్లూ కలర్స్‌తో అందుబాటులోకి రానుంది. 6.6 అంగుళాల పొడవు, పూర్తి హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ,(1,080x2,412 పిక్సెల్‌లు) 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. ఆండ్రాయి11 వెర్షన్ కు సపోర్ట్ చేస్తున్న ఈఫోన్లోతాజా క్యూ3 సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందిస్తుంది. 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైంది. రియల్ మీ క్యూ3టీ ధర 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ధర చైనాలో సీఎన్‌వై2,099 (భారత కరెన్సీలో దాదాపూ రూ. 24,300)గా నిర్ణయించబడింది. నైట్ బ్లూ,నైట్ స్కై బ్లూ కలర్స్‌తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో విడుదల చేయాలని రియల్ మీ ప్రతినిధులు భావిస్తున్నారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ 5జీ స్మార్ట్ఫోన్ల షిప్ మెంట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఊపందుకున్నాయి. సీఎమ్ఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్లు 22 శాతం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్ లభించడమే అని సీఎమ్ఆర్ తెలిపింది. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, శామ్ సంగ్, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల 5జీ ఎక్కువగా అమ్ముడయ్యాయి అని పేర్కొంది. "ఈ ఐదు బ్రాండ్లు కలిసి క్యూ3 2021 సమయంలో 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,227 కోట్ల)కు పైగా 5జీ స్మార్ట్ఫోన్లను రవాణా చేశాయి" అని సీఎమ్ఆర్ లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు షిప్రా సిన్హా చెప్పారు. 5జీ స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా భారీగా డిమాండ్ ఉంది. అందుకే, భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ పరంగా 47 శాతం త్రైమాసీకంలో(క్యూవోక్యూ) వృద్ధి చెందింది. ఉదాహరణకు.. షియోమీ 23 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. శామ్ సంగ్ 18 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంటే, ఆ తర్వాత వివో, రియల్ మీ ఒక్కొక్కటి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, యాపిల్ షిప్ మెంట్ పరంగా 32 శాతం వృద్ధి నమోదు చేసింది. సూపర్ ప్రీమియం(రూ.50,000- 1,00,000) విభాగంలో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా ఇతర ఐఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. (చదవండి: మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్!) -
జియో నెక్ట్స్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఇవి కూడా చూడండి!
దీపావళి పండుగా సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఎప్పుడో లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ, చిప్ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ వెంటనే అమ్మకానికి రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న జియో సంస్థ ఫోన్ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన ఫోన్ ధర రూ.6,499 చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అలాగే, ఈఎమ్ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడే చాలా మంది జియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ఈఎమ్ఐ ఆప్షన్ కింద ఎంచుకోవాలంటే ముందుగా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని వారు ఇచ్చిన ఈఎమ్ఐ ఆప్షన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11 కంటే ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంటున్నారు. (చదవండి: గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ) ట్విటర్ వేదికగా జియో సంస్థను ప్రశ్నిస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ కంటే ఈ రెండింటిలో ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెడ్మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. అదే రియల్మీ సీ11 ధర రూ.6799గా ఉంది. మీరు గనుక జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇవి దాని కంటే ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11, జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్: 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.6,499 రెడ్మీ 9ఏ ఫీచర్స్: 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,999 రియల్మీ సీ11: 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,799 -
ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ
భవిష్యత్తు రవాణా రంగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక గమ్య స్థానంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వాహన మార్కెట్లో ఉన్న దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. అలాగే, కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కూడా ఎలక్ట్రిక్ వాహానాల తయారీపై దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ కార్లను 2024 ప్రథమార్థంలో లాంచ్ చేయనున్నట్లు షావోమీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రిక్ మార్కెట్లోకి రియల్మీ తాజాగా వస్తున్న సమాచార ప్రకారం ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రియల్మీ, ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో రియల్మీ ఒకటి. కంపెనీ ఏప్రిల్ 2021లో ఒక మిలియన్ యూనిట్లను విక్రయించింది. 100 మిలియన్ స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా రియల్మీ నిలిచింది. ఈ ఘనతను కేవలం 37 నెలల వ్యవధిలో సాధించింది. చైనాతో పాటు భారతదేశంలో కూడా రియల్‌మీకి బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ కొద్ది రోజుల క్రితం 'రియల్మీ టెక్ లైఫ్' బ్రాండ్ పేరుతో మనదేశంలో ట్రేడ్ మార్క్ చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్(షెన్ జెన్)కో లిమిటెడ్ ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకుంది. (చదవండి: రేషన్ షాపుల్లో ముద్రా లోన్ సేవలు) ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ఈవీల ఉత్పత్తిలో చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. సమీప భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు భారతదేశం గమ్యస్థానంగా మారే అవకాశం ఉండటంతో రియల్మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వేహికల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ ఆలోచన చేస్తున్నట్లు ట్రేడ్ మార్క్ నిరుపిస్తుంది. కంపెనీ సొంతంగా వెళ్తుందా లేదా మరో మొబిలిటీ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పరిస్తుందా అనేది ఇంకా తెలీదు. రియల్మీ ప్రారంభంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. (చదవండి: ముఖేశ్ అంబానీ కూతురికి అరుదైన గౌరవం) -
రియల్ మీ నుంచి జీటీ నియో–2
న్యూఢిల్లీ: రియల్మీ తన జీటీ సిరీస్‌లో కొత్తగా జీటీ నియో 2 5జీ మొబైల్‌ను విడుదల చేసింది. ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ4 (మరింత ప్రకాశవంతంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే) అమోలెడ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ సూపర్‌డార్ట్ చార్జర్, వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ఏఐ ట్రిపుల్ కెమెరా, 7జీబీ డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ సదుపాయం ఇలా ఎన్నో ఫీచర్లున్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999. ఫ్లిప్‌కార్ట్ పోర్టల్, రియల్మీ పోర్టల్‌పై కొనుగోలు చేసేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అదే విధంగా రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్, రియల్మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, గేమింగ్ పరికరాలను సైతం విడుదల చేసింది. -
రియల్ మీ అదిరిపోయే ఆఫర్
స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్. రియల్ మీ ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఇందులో భాగంగా అక్టోబర్ 8,9 తేదీలలో ఎక్స్ క్లూజీవ్ ఆఫర్లు ప్రకటించింది. రియల్ మీ నిర్వహించే ఆఫర్లో రూపాయికే పలు గాడ్జెట్స్‌ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్‌ను విస్తరించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇండియన్ ఆన్లైన్ మార్కెట్లో షావోమీ 28 (క్యూ2) శాతం, శాంసంగ్ 18 శాతం, వివో 15 శాతం సేల్స్ తో రాణిస్తున్నాయి. 15 శాతం మార్కెట్ షేర్‌ను పెంచేందుకు రియల్ మీ ఆఫ్‌లైన్ మార్కెట్‌పై కన్నేసింది. గతేదాడి ఆగస్ట్ 20న రియల్ మీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ స్టోర్ల సంఖ్యను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 100 ఆఫ్‌లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఇండియా రియల్ మీ సీఈఓ మాధవ్ సేఠ్ ప్రకటించారు. టైర్ 2, టైర్ 3 సిటీస్ తో పాటు అదనంగా గుజరాత్లో ఫ్లాగ్ షిప్ స్టోర్(ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 300 రియల్ మీ స్టోర్లను ప్రారంభించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 2022నాటికి ఆ సంఖ్యను 1000 స్టోర్లకు పెంచుతామని తెలిపారు. Congratulations to the entire #realme family! We're launching 100 exclusive realme stores today. I am quite excited, and I hope that all the #realmeFans will enjoy visiting these unique stores as well.#Centurywithrealme pic.twitter.com/dv5iBsx6Zn — Madhav Sheth (@MadhavSheth1) October 8, 2021 ఆఫ్‌లైన్ స్టోర్లలో ఏముంటాయ్ రియల్ మీ లాంఛ్ చేయనున్న ఈ రియల్ మీ స్టోర్లలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, ట్యాబ్లెట్స్ తో పాటు ఇతర టెక్ గాడ్జెట్స్ ఉంటాయని మాధవ్ సేఠ్ వెల్లడించారు. ఆఫ్‌లైన్ మార్కెట్లో కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ రియల్మీ భారత మార్కెట్లో మరింత పురోగతిని సాధించేందుకు గృహోపకరణాల రంగంలోకి అడుగుపెట్టింది. గృహోపకరణాల విభాగంలో ప్రముఖ చైనీస్ సంస్ధ షావోమీ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షావోమీ పోటీగా భారత మార్కెట్లలోకి వాషింగ్మెషిన్లను, వాక్యూమ్ క్లీనర్స్‌ను, ఎయిర్ ఫ్యూరిఫైయర్, రోబోట్ వాక్యూమ్ గృహోపకరణాలను రియల్మీ లాంచ్చేసింది. చదవండి: AI స్వగతం: తప్పులు లేకుండా చెప్పే యాంకర్లు.. రైటర్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో కొనుగోలుదారులకు ఈ ఉపకరణాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ గృహోపకరణాలను లాంచ్ సందర్భంగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్, రియల్మీ ఇండియా, యూరోప్, అండ్ లాటిన్ సీఈవో మాధవ్ సేత్ మాట్లాడుతూ..‘భారతీయులకు టెక్లైఫ్ను అందించేందుకు రియల్మీ ఎప్పుడు ముందుఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ హోమ్ కేటగిరీని మెరుగుపరుస్తూ..భారత్‌లో రియల్మీ నెం.1 లైఫ్‌స్టైల్, టెక్లైఫ్ బ్రాండ్‌గా నిలిచేందుకు కంపెనీ కృషి చేస్తోంద’ని వెల్లడించారు. రియల్మీ గృహోపకరణాల ధరలు ఇలా ఉన్నాయి..! రియల్మీ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 1000 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ హ్యండ్హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 500 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధర రూ .24,999 అయితే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ .19,999 కే విక్రయించబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో రియల్మీ రెండు కొత్త టాప్-లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను కూడా విడుదల చేసింది. వాషింగ్ మెషీన్ల ధర రూ .12,990(7.5 కిలోలు ), రూ .15,990(8 కిలోలు). చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్
రియల్మీ తన జీటీ నియోను 2 సెప్టెంబర్ 22న చైనాలో విడుదలకు చేయడానికి సిద్దం అవుతుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇప్పటికే లాంఛ్ కు ముందు కొన్ని స్పెసిఫికేషన్లను బయటకు విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. రియల్మీ జీటీ నియో 2లో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తీసుకొనివస్తున్నారు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ శామ్ సంగ్ ద్వారా ఈ4 అమోల్డ్ ప్యానెల్ తో రానుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ గల డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ 6.62 అంగుళాల డిస్ ప్లే ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్ తో కలిగి ఉండనుంది. దీనిలో 65డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. జీటీ నియో 2, 64 ఎంపి సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుందని రియల్ మీ ధృవీకరించింది. ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ ర్యామ్ ఆప్షన్లతో కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే విషయంపై ఇంకా సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) -
రియల్మీ 5జీ ఫోన్‌పై రూ.6000 తగ్గింపు! ఎప్పుడు?ఎక్కడ ?
రియల్ మీ సంస్థ తన 5 జీ ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాలానికే ఈ ఆఫర్ వర్తిస్తుందని రియల్మీ చెబుతోంది. ఇంతకీ ఆఫర్ పొందడం ఎలా ? ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ? ఎక్స్ 7 మ్యాక్స్ బడ్జెట్ ధరలో హై ఎండ్ ఫీచర్లు అందిస్తూ మార్కెట్లో మంచి పట్టు సాధించిన రియల్మీ సంస్థ ఇటీవల ఎక్స్ 7 మ్యాక్స్ మోడల్ని మార్కెట్లో విడుదల చేసింది. రియల్మీ 5జీ ఫోన్‌గా ఈ మార్కెట్లోకి వచ్చిన ఎక్స్ 7 మ్యాక్స్ ప్రారంభ ధర రూ.29,999లుగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్టులో రూ. 26,9999కే లభిస్తోంది, తాజాగా ఈ ఫోన్‌పై మరో ఆఫర్‌ని రియల్మీ అందిస్తోంది. రూ. 6000ల తగ్గింపు రియల్ మీ ఎక్స్ 7 మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌పై రూ.6,000 ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్ కొనుగోలు సందర్భంగా క్యాష్ ఆన్ డెలివరీగా కాకుండా ముందుగానే క్రెడిట్ లేదా డెబిట్ ఉపయోగించి చెల్లింపులు జరిపితే ప్రత్యేకంగా రూ. 6000 తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు మరో ఎనిమిది రకాల ఆఫర్లను కూడా రియల్ మీ అందిస్తోంది. సెప్టెంబరు 13 వరకే ఎక్స్ 7 మ్యాక్స్ ఫోన్ కొనుగోలు సందర్భంగా ముందస్తు చెల్లింపులు చేసి రూ.6000 ప్రత్యేక తగ్గింపు పొందే ఆఫర్ సెప్టెంబరు 9 నుంచి 13 వరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఆఫర్‌ని పొందవచ్చు. ఎక్స్ 7 మ్యాక్స్ కీలక ఫీచర్లు - దేశంలోనే తొలిసారిగా డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు - 5జీ ప్లస్ 5జీ డ్యుయల్ సిమ్ స్టాండ్‌బై - ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై రియల్ మీ యూఐ 2.ఓతో పని చేస్తుంది - బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ - డాల్బీ ఆట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ - స్లెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ - 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్పీ కెమెరా - సోని 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా - ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమెల్డ్ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ చదవండి: ఐఫోన్ 13 రిలీజ్‌కి రెడీ.. ఎన్ని వెర్షన్లలో తెలుసా ? -
Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్‌సేల్స్!
న్యూఢిల్లీ: పండగ సీజన్‌గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్‌లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. ట్యాబ్లెట్ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్టాప్స్ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్‌లో 1.9 కోట్ల యూనిట్ల రియల్మీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. చిప్సెట్ల ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా చిప్సెట్ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్మీ స్పష్టం చేసింది. భారత్‌లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. భారత మార్కెట్ విషయంలో చిప్సెట్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రియల్మీ ప్యాడ్.. రూ.13,999 ధరలో రియల్మీ ప్యాడ్‌ను కంపెనీ గురువారం భారత్‌లో విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్మీ 8ఎస్ 5జీ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. చదవండి: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..! -
బడ్జెట్ ధరలో విడుదలైన రియల్మీ తొలి ట్యాబ్లెట్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ నేడు (సెప్టెంబర్ 9) తన తొలి ట్యాబ్లెట్ పరికరాన్ని బడ్జెట్ ధరలో భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్మీ కంపెనీ తొలి ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మోస్ సౌండ్, ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ వై-ఫై, వై-ఫై + 4జీ అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. ఈ రియల్ మీ ప్యాడ్ తో పాటు లాంచ్ సమావేశంలో రియల్ మీ కాబుల్, రియల్ మీ పాకెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ల కూడా లాంచ్ చేసింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట) భారతదేశంలో ఈ రియల్మీ ప్యాడ్ 3జీబీ + 32జీబీ స్టోరేజ్ వై-ఫై ఓన్లీ వేరియెంట్ ధర రూ.13,999గా ఉంది. అదే వై-ఫై + 4జీ వేరియెంట్ ధర రూ.15,999(3జీబీ + 32జీబీ), 4జీబీ + 64జీబీ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. రియల్ మీ ప్యాడ్ వై-ఫై + 4జీ మోడల్స్ సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, Realme.com, ప్రధాన ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి వస్తాయి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కార్డు లేదా ఈజీ ఈఎమ్ఐ లావాదేవీల ద్వారా రియల్ మీ ప్యాడ్ కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులకు కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు 10.4 అంగుళాల డబ్ల్యుఎక్స్ జీఏ+ (2,000ఎక్స్1,200 పిక్సెల్స్) డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ ఓఎస్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజీ 8 మెగాపిక్సెల్ కెమెరా (105 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ) 7,100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 18డబ్ల్యు క్విక్ చార్జర్ 440 గ్రాముల బరువు -
సెప్టెంబర్ 9న మార్కెట్లోకి వస్తున్న రియల్మీ ట్యాబ్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సెప్టెంబర్ 9న భారత మార్కెట్లోకి రియల్ మీ ప్యాడ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రత్యేక పేజీని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పేజీలో రియల్ మీ ప్యాడ్ కీలక స్పెసిఫికేషన్లను, డిస్ ప్లే వివరాలను వెల్లడించింది. ఇందులో రెండు కెమెరాలను తీసుకొస్తున్నారు. ఒకటి ముందు, మరొకటి వెనుక భాగంలో ఉండనుంది. ఈ ప్యాడ్ 2,000ఎక్స్1,200 రిజల్యూషన్, 82.5 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో 10.4 అంగుళాల ఫుల్ స్క్రీన్ డబ్ల్యుఎక్స్ జిఎ+ డిస్ ప్లే కలిగి ఉండనుంది.(చదవండి: ఈ వారంలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు) ఈ రియల్ మీ ప్యాడ్ ఒక మూలలో సింగిల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దీని ముందు, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా తీసుకొనిరావొచ్చు. ఈ రెండూ కూడా 1.36 అంగుళాల సెన్సార్లు కలిగి ఉండవచ్చు. దీనిలో ఎఫ్/2.8 అపెర్చర్, 2.8మిమి ఫోకల్ లెంగ్త్, ఇమేజ్ స్టెబిలైజేషన్, 65.3 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ(ఎఫ్ వోవి) ఉండవచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ అల్యూమినియం యూనిబాడీతో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇది యుఎస్ బి టైప్-సి పోర్ట్ తో రావచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్యాడ్ 3.5 మిమీ హెడ్ ఫోన్ జాక్ తో వచ్చే అవకాశం ఉంది. -
రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ చాలా తక్కువ ధరకే ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సీ21వైను నేడు(ఆగస్టు 23) మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త రియల్మీ స్మార్ట్‌ఫోన్ 20:9 డిస్ ప్లేతో వస్తుంది. ఈ సీ21వై స్మార్ట్‌ఫోన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అలాగే ఇది రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. మొత్తం మీద రియల్మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది. భారతదేశంలో రియల్మీ సీ21వై 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) రియల్మీ సీ21వై స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ యునిసోక్ టీ610 ఆక్టా కోర్ ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్) 3/32 జీబీ, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్) 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ వి5.0, జీపిఎస్/ ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్ బి, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు'
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు రియల్మీ, షియోమీ కొత్త యుద్ధానికి తెరలేపాయి. ఇన్నిరోజులు ఆదిపత్యం కోసం సైలెంట్ వార్‌ను కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఆ వార్‌ను బహిరంగంగా డిక్లేర్ చేశాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో స్మార్ట్ ఫోన్ సంస్థలు పోటీ పడుతుంటాయి. మార్కెట్లో తమ హవాను కొనసాగించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..ఇటీవల ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో షియోమీ 28 శాతం మార్కెట్ తో ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది. 15 శాతంతో నాలుగో స్థానంలో రియల్మీ..షియోమీని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ ఇండియాలో తొలి ల్యాప్‌ట్యాప్ తో పాటు జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. Our #LeapTo100Million calls for a celebration! Presenting the #realmeFanFestival, till 28th August where you can get offers like never before! Stay tuned for some real-ly amazing activities! #DareToLeap Know more: https://t.co/8FCGXjd6fd pic.twitter.com/boLohEshLI — realme (@realmeIndia) August 18, 2021 తాజాగా రియల్మీ ఇండియా 100 మిలియన్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుందని..ఇందులో భాగంగా ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 28 వరకు #realmefanfestival2021 ను నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతే ఆ ప్రకటనపై షియోమీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నిర్వహించే ప్రతి ఈవెంట్‌ను రియల్ మీ కాపీకొడుతుందని..ఆ సంస్థ ఇండియా బిజినెస్ డైరెక్టర్ స్నేహ తైన్వాలా ట్వీట్ చేశారు.'#copycatfanfestival' హ్యాష్ ట్యాగ్ తో మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' అంటూ రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్‌ను ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ దిగ్గజాల వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. "Mi Fan Festival" >> "#CopyCat Fan Festival" It has now stopped being funny. Kitna copy karoge @MadhavSheth1 sir? Waise event page mock up bhijwaon - will save your team some time🤣 https://t.co/CtGfsOhDvI — Sneha Tainwala (@SnehaTainwala) August 18, 2021 -
భారత్‌లోకి రియల్మీ బుక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ రంగ సంస్థ రియల్మీ తొలి ల్యాప్‌టాప్ రియల్మీ బుక్ (స్లిమ్) భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. 14 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 3:2 స్క్రీన్ రేషియో, 14.9 మిల్లీమీటర్ల మందం, 1.38 కిలోల బరువు, మెటాలిక్ బాడీ, 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3, ఐ5 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంది. డీటీఎస్ హెచ్డీ సౌండ్, హర్మాన్ బాస్, 11 గంటల బ్యాటరీ లైఫ్, 65 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్, డ్యూయల్ ఫ్యాన్ స్టార్మ్ కూలింగ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. రియల్మీ పవర్‌బ్యాంక్‌తో ల్యాప్‌టాప్‌ను చార్జ్ చేయవచ్చు. ధర 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ రూ.44,999 కాగా, 8 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్ రూ.56,999 ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్స్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120 హెట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 65 వాట్స్ సూపర్‌డార్ట్ చార్జ్‌తో జీటీ శ్రేణిలో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను కంపెనీ పరిచయం చేసింది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ 64 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో జీటీ 5జీ తయారైంది. 35 నిముషాల్లోనే చార్జింగ్ పూర్తి అవుతుంది. 7 జీబీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఏర్పాటు ఉంది. 8జీబీ, 128 జీబీ ధర రూ.37,999 ఉంది. 12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.41,999గా నిర్ణయించారు. 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపీ ప్రైమరీ కెమెరాను జీటీ మాస్టర్ ఎడిషన్‌కు పొందుపరిచారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.29,999 వరకు ఉంది. -
ఒకేసారి రెండు, అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ స్మార్ట్ ఫోన్లు
ఇండియా టాప్ ఫైవ్ స్మార్ట్ ఫోర్ బ్రాండ్లలో షియోమీ,శాంసంగ్, వివో, ఒప్పో,రియల్ మీ బ్రాండ్లు ఉన్నాయి. అయితే 16 శాతం మార్కెట్‌తో ఐదో స్థానంలో ఉన్న రియల్ మీ.. తన మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూజర్లు ఆకట్టుకునేలా ఇండియాలో తొలి 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో ల్యాప్ ట్యాప్ ను విడుదల చేసింది. విడుదలైన ఆ ల్యాప్ ట్యాప్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుండగా.. రియల్ మీ జీటీ 5జీ సిరీస్ లో 'రియల్ మీ జీటీ 5జీ, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5జీ' పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రియల్ మీ జీటీ 5జీ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ క్వాల్కమ్ 8 సిరీస్ ప్రాసెసర్, ఆకా 888 స్నాప్ డ్రాగన్, ఎల్పీడీడీఆర్5 12 జీబీ నుంచి 256జీబీ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, హీట్‌ను తగ్గించేందుకు వీసీ కూలింగ్ సిస్టంతో వస్తుంది. ఇక 6.43 అంగుళాల ఆమ్లోడ్ డిస్ ప్లే , 1080 రెజుల్యూషన్, 120జెడ్ హెచ్ రిఫ్రెష్ రేట్, ఫ్రంట్ ఎండ్ పంచ్ హోల్ కట్ అవుట్లో 16 మెగా పిక్సెల్ కెమెరా, వెనక భాగంలో 3 కెమెరాలు, 64 మెగా పిక్సెల్ లో ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మైక్రో సెన్సార్‌తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే..65 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఏఎంహెచ్ బ్యాటరీ, డ్యాయల్ స్టెరో స్పీకర్స్, హై రెజెల్యూషన్‌తో ఆడియో సపోర్ట్, హెడ్ ఫోన్ జాక్ , ఆండ్రాయిడ్ 11 బేస్డ్, యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆకట్టుకుంటుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ 6.43 అంగుళాల సూపర్ ఆమ్లోడ్ డిస్ ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కంట్ అవుట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్ నుంచి 256జీబీ స్టోరేజ్ తో యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లో అందుబాటులో ఉంది. అట్రాక్ట్ చేసేలా ఫోటోలు తీసేలా ఫ్రంట్ ఎండ్ 32మెగా పిక్సెల్ కెమెరా, 64మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో షూటర్‌ను అందిస్తుంది. 65 వాల్ట్‌లతో ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కేందుకు 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ధర త్రీ కాన్ఫిగరేషన్ తో 6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వస్తుండగా..6జీబీ/128జీబీ ప్రారంభ ధర రూ.25,999, 8జీబీ/128జీబీ ధర రూ.27,999, 8జీబీ/256జీబీ వెర్షన్ లో రూ.29,999కే అందిస్తున్నట్లు రియల్ మీ ఇండియా ప్రతినిధులు తెలిపారు. రియల్ మీ జీటీ 5జీ ధర రియల్ జీటీ 5జీ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 8జీబీ/128జీబీ,12జీబీ/256జీబీ తో వస్తుండగా 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ. 37,999, 12జీబీ/256జీబీ వెర్షన్ ధర రూ .41,999 వస్తుంది. రియల్ మీ జీటీ 5జీ ఆగస్ట్ 25 నుండి realme.com, Flipkart తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. -
అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ ఫస్ట్ ల్యాప్ ట్యాప్
కరోనా కారణంగా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ల వినియోగం బాగా పెరిగింది. ఓ వైపు స్కూల్స్, మరోవైపు ఆన్ లైన్ క్లాసులతో వెరసీ గాడ్జెట్స్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్జజం 'రియల్ మీ' ఇండియాలో 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో తొలి ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేసింది. రియల్ మీ బుక్ స్లిమ్ స్పెసిఫికేషన్స్ తక్కువ ధర, ఒకే సారి జామ్-ప్యాక్డ్ (ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసి వినియోగించేలా) సామర్ధ్యం, ఖరీదైన కాంపోనెంట్స్(ల్యాప్ ట్యాప్‌లోని భాగాలు)తో హైట్ 3:2, 14 అంగుళాల స్క్రీన్, 2160*1440 ఫిక్సెల్, 2కే రెజెల్యూషన్‌తో ఆకట్టుకుంటుంది. దీంతో పాటు ఇండియాలో డెల్ ఇన్ స్ప్రాన్, హెచ్‌పీ గేమిండ్, లెనోవో బీక్యూఐన్ లో వినియోగించే ఆమ్లోడ్ డిస్ ప్లే కాకుండా.. ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్స్, స్కెచ్ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్ డిజైనర్స్ వినియోగించే ఎల్సీడీ( లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే) ఐపీఎస్ ప్యానల్ టెక్నాలజీ, 90శాతం స్క్రీన్ రేషియో, ఇంటెల్ 11జనరేషన్, కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెస్, 8జీబీ లో పవర్ డబుల్ డేటా రేట్ మెమెరీ, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సౌకర్యం ఉండగా.. ఈ ల్యాప్ ట్యాప్ ప్రస్తుతం విండోస్ 10ను వినియోగించుకోవచ్చు. విండోస్ 11 విడుదలైతే ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. కనెక్టవిటీ కోసం సీ టైప్ 3.0 యూఎస్బీ పోర్ట్, టైప్ సీ యూఎస్బీ 4 థండర్ బోల్ట్ పోర్ట్, టైప్ ఏ యూఎస్బీ 3.0, హెడ్ ఫోన్ జాక్, వైఫై 6, స్టెరో స్పీకర్స్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 11గంటలు నిర్విరామంగా వినియోగించుకునేలా 54 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 65డబ్ల్యూ యూఎస్బీ సీ టైప్ ఛార్జర్, 30డబ్ల్యూ డ్రార్ట్ ఛార్జ్, రియల్ మీ ఫోన్ సాయంతో ల్యాప్ ట్యాప్ తో పాటు డెస్కెట్యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. రియల్ మీ బుక్ స్లిమ్ ధర ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తుండగా.. 8జీబీ ర్యామ్ అండ్ 256 స్టోరేజ్‌తో ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.46,999 ఉండగా కోర్ ఐ3 మోడల్ ల్యాప్ ట్యాప్ 8జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.59,999కే వస్తున్నట్లు రియల్ మీ ఇండియా తెలిపింది. -
మీ పాత ల్యాప్‌టాప్‌ను పగలకొట్టండి.. ప్రచారంలో కొత్త పంథా..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. రియల్మీ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 18 (బుధవారం) రోజున లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్మీ ల్యాప్‌టాప్ స్లిమెస్ట్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తోందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ల్యాప్‌టాప్ ఫుల్‌గా మెటల్ బాడీతో ఉండనున్నట్లు తెలుస్తోంది. రియల్మీ ల్యాప్‌టాప్ లాంచ్‌లో భాగంగా పలువురు టెక్నికల్ నిపుణులకు కంపెనీ ఆహ్వానం పలికింది. రియల్మీ ఆహ్వానం పలికిన విధానం చూస్తే మీరు ఔరా..! అనాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నికల్ ఎక్సపర్ట్ రంజిత్‌కు రియల్మీ ల్యాప్‌టాప్ లాంచింగ్ ఈవెంట్‌కు ఆహ్వానాన్ని పంపింది. ఆహ్వానంలో భాగంగా రంజిత్‌కు కంపెనీ భాష్ టూల్‌కిట్‌ను పంపింది. టూల్కిట్లో మీకు నచ్చిన టూల్‌తో ల్యాప్‌టాప్‌ను టెస్ట్ చేసుకోవచ్చునని రియల్మీ వెల్లడించింది. రంజిత్ ఈ విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. ఒక ప్రొడక్ట్ ఈ విధంగా లాంచ్ చేయడం ఎప్పుడు చూడలేదని రంజిత్ తెలిపారు. రియల్మీ ల్యాప్‌టాప్ ప్రచారంలో సరికొత్త పంథాను పాటిస్తుందని టెక్నికల్ నిపుణులు భావిస్తున్నారు. This has got to be the most crazy media invite I have got for a product! Got a Bosh toolkit box lol :) aka it's about the new upcomming Realme laptop. pic.twitter.com/KtBdmD8uQC — Ranjit (@geekyranjit) August 14, 2021 -
ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే
మీరు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.ఈ ఫోన్‌కు లేటెస్ట్గా ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్ విడుదలైంది.చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సీ3ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి బీటా వెర్షన్ జులైలో విడుదల చేసినా లేటెస్ట్గా ఆ ఫోన్ స్టేబుల్ వెర్షన్‌ను రియల్ మీ ప్రతినిధులు విడుదల చేశారు.ఈ అప్డేట్ ద్వారా ఫోన్లో టెక్నికల్ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్, ఈజీ మొబైల్ ఇంటర్ ఫేస్ ఆప్టిమైజేషన్,సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్ ఇలా ఒక్కటేమిటీ రియల్ సీ3 వెర్షన్ పూర్తిగా మారిపోతుంది. రియల్మీ సీ3 స్పెసిఫికేషన్లు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 89.8 పర్సెంట్ తో స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అందుబాటులోకి రాగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు హెచ్ డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మో, పొర్ ట్రెయిట్ మోడ్ ఫీచర్ తో పాటు హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లు ఉన్న 5 మెగా పిక్సెల్ సెల్ఫీల కెమెరా సౌకర్యం ఉంది. -
రూ.1000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ ఇవే..!
మనకు నచ్చిన సంగీతాన్ని వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏలాంటి డిస్టారెబెన్స్ లేకుండా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు. ఇయర్‌ఫోన్స్ ఒక్కింతా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్‌ఫోన్స్‌ను ఒకప్పుడు అందించేవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కస్టమర్లకు ఇయర్ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్ఫోన్లకు కొనాల్సిందే. ఇయర్ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి..? ఏంత ధరలో ఇయర్ఫోన్లను కొనాలి..? అనే ప్రశ్నలు మనందరికీ తొలచివేస్తుంది. ఇలా ఏ కంపెనీ ఇయర్ఫోన్లను కొనాలనే సందేహం ఉన్నవారి కోసమే.. ఈ వార్త! రూ.1000 కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే ఇయర్ఫోన్లను మీకోసం అందిస్తున్నాం... రూ.1000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవే..! 1.బోట్ బాస్‌హెడ్స్ 225 బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ ఉంటుంది. వీటి ధర రూ. 399 2. బోట్ బాస్ హెడ్స్ 242 ఈ ఇయర్‌ఫోన్స్ ఐపీఎక్స్4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర రూ. 399 3.జెబీఎల్ సీ200ఎస్ఐ సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది, ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749. 4. రియల్మీ బడ్స్ 2 నియో రియల్మీ స్మార్ట్‌ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్మీ బడ్స్ టీపీయూ మెటిరియల్తో తయారుచేశారు. రియల్మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399. 5. బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849. గమనిక: ఎక్కువసేపు ఇయర్ఫోన్లను చెవులకు తగిలించుకోవడం మంచింది కాదు. పై ధరలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో పేర్కొన్న ధరలు. -
ఫీచర్స్ లీకయ్యాయి, ఆపిల్ తరహాలో
టెక్ యుగంలో గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. దైనందిన జీవితంలో భాగమైన గాడ్జెట్స్‌ను విడుదల చేసేందుకు ఆయా స్మార్ట్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా చైనా సంస్థ రియల్ మీ టాబ్లెట్, రియల్ మీ ప్యాడ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలోపే విడుదల కానున్న ఈ గాడ్జెట్స్ ధర ఎంతో కన్ఫామ్ కాకపోయినప్పటికి వాటి ఫీచర్స్ లీకయ్యాయి. ఫీచర్స్ ఇలా ఉన్నాయి టిప్‌స్టెర్ కథన ప్రకారం రియల్మీ ప్యాడ్ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 45000ఏంఎంహెచ్ బ్యాటరీ తప్పనిసరిగా ఉండాలి.లుక్ వైజ్‌గా చూసుకుంటే రియల్మీ ప్యాడ్.. ఆపిల్ ఐప్యాడ్‌ను పోలి ఉంటుందని తేలింది. ఎందుకంటే అన్నీ వైపులా మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉంది. ప్యాడ్ వెనుక భాగంలో కేవలం ఒక కెమెరాను కలిగి ఉండడం మరో విశేషం. రెండర్లు బెజెల్స్ సన్నగా ఉండి బటన్ డిజైన్ తక్కువగా ఉంది. యూరోపియన్ మార్కెట్ కోసం తహతహలాడుతున్న రియల్ మీ ఈ ఏడాది జిటి 5జి లాంచ్ ఈవెంట్లో రియల్మీ ప్యాడ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. టాబ్లెట్ మాత్రమే కాదు రియల్మీ బుక్ అని పిలిచే ల్యాప్ ట్యాప్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఫీచర్స్ ఇలా ఉన్నా త్వరలో దాని ధరెంతో తెలిసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్ ఫీచర్లతో తొలి ఆండ్రాయిడ్ ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు రియల్మీ మరో సంచలనానికి తెర తీయనుంది. ఆపిల్ ఐఫోన్-12 ఫీచర్లు కల్గిన ఫోన్లను రియల్ మీ ఫ్లాష్ పేరిట టీజ్ చేసింది. మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా రియల్మీ ఫ్లాష్ అవతరిస్తుందని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్ శ్వేత్ పేర్కొన్నారు. రియల్మీ నుంచి వచ్చే కొత్త ఫోన్‌ను కంపెనీ సీఈఓ మాధవ్ శ్వేత్ ట్విటర్లో టీజ్ చేశాడు. బీబీకే బ్రాండ్ ఉత్పత్తుల్లో రియల్ మీ ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో పవర్ఫుల్ ఫోన్‌గా నిలుస్తోందని పుకార్లు వస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోయే రియల్మీ ఫ్లాష్ స్నాప్‌డ్రాగన్ 888ను అమర్చిన్నట్లు తెలుస్తోంది. రియల్మీ ఫ్లాష్ మొబైల్‌ను సపోర్ట్ చేసేందుకు వీలుగా రియల్ మాగ్‌డార్ట్ వైర్లెస్ ఛార్జర్‌ను కూగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ ఐఫోన్లకు మాగ్‌సేఫ్ పనిచేసినట్లుగానే ఈ రియల్ మీ మాగ్‌డార్ట్ పనిచేయనుంది. మాగ్‌డార్ట్ ఛార్జర్ కనీసం 15W ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రియల్ మీ ఫ్లాష్ మార్కెట్ రిలీజ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రియల్ మీ ఫ్లాష్ ఫీచర్లు క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 12 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీ కర్వ్డ్ స్క్రీన్ కార్నర్ పంచ్ హోల్ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా Meet realme Flash, World's 1st Android Phone with Magnetic Wireless Charging⚡ RT & reply with #realmeFlash if you are ready to experience its magnificent attraction. #realmeTechCharging #DareToLeap pic.twitter.com/6rZhk42Hgg — Madhav Sheth (@MadhavSheth1) July 27, 2021 -
మార్కెట్లోకి రియల్మీ బ్రాండ్స్, వాటి ధరెంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తాజాగా విస్తృత శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసింది. వీటిలో రియల్మీ వాచ్–2 ప్రో, వాచ్–2, బడ్స్ వైర్లెస్–2, బడ్స్ వైర్లెస్–2 నియో, బడ్స్ క్యూ2 నియో ఉన్నాయి. ధరల శ్రేణి రూ.1,299 నుంచి రూ.4,999 వరకు ఉంది. జూలై 26 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఉత్పాదననుబట్టి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. కొద్ది రోజుల్లో ఆఫ్లైన్లోనూ దొరుకుతాయి. -
రియల్మీ ల్యాప్‌ట్యాప్.. ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాల్సిందే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గణనీయమైన వాటా దక్కించుకున్న రియల్మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌పై గురి పెట్టింది. రియల్మీ బుక్ పేరుతో పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్లోకి తేనుంది. రియల్మీ తక్కువధరలో నాణ్యమైన ఫోన్లు అందించి మొబైల్ మార్కెట్లో మంచి వాటాను దక్కించుకుంది. ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో కానుంది. రూ.40,000 రేంజ్లో పవర్ఫుల్ ల్యాప్‌ట్యాప్ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్మీ బుక్ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రానుంది. యాంటీగ్లేర్ డిస్ప్లేను అమర్చారు. ఇక సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంటెల్ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్ 3, ఐ కోర్ 5 చిప్సెట్లను ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఫినీషింగ్ మధ్యలో కీబోర్డు చూడటానికి బాగుండెలా డిజైల్ చేశారు. ఈ రిలయ్‌మీ బుక్ ఇన్‌బిల్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్లలోకి ఆకట్టుకునే కొత్త రకం ఫీచర్‌గా లాప్ట్యాప్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది రియల్మీ. ఆగస్టులో రియల్మీ బుక్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.రియల్మీ బుక్‌లో యూఎస్బీ ఏ పోర్టు ఒకటి, యూఎస్బీ సీ టైప్ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఉన్నాయి. అయితే ఈ రియల్మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. -
రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్
ప్రముఖ చైనా తయారీ దిగ్గజం రియల్ మీ డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేరుతో రెండు ఫీచర్ ఫోన్లను భారతదేశంలో లాంఛ్ చేసింది. ఈ రెండు మోడల్స్ మూడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో కాన్ఫిగరేషన్ లో లభిస్తున్నాయి. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 ఫీచర్ ఫోన్లు కీప్యాడ్, చిన్న డిస్ ప్లేలతో వస్తున్నాయి. డిజో అనేది రియల్ మీ సబ్ బ్రాండ్. ఇది మొదట టీడబ్ల్యూఎస్ వైర్ లెస్, నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. డిజో స్టార్ 300 ధర రూ.1,299, డిజో స్టార్ 500 ధర రూ.1,799కు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. డిజో స్టార్ 300 ఫీచర్స్: 1.77 అంగుళాల క్యూవిజీఏ(160ఎక్స్120 పిక్సెల్స్) డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.08 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 2,550 ఎమ్ఎహెచ్ బ్యాటరీ డిజో స్టార్ 500 ఫీచర్స్ 2.8 అంగుళాల క్యూవిజీఏ(320ఎక్స్240 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.3 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 1,900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తయారీ సంస్థ రియల్ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఒకటో రెండో కాదని ఏకంగా 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే రియల్ మీ నార్జో5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 ఉండగా.. రాబోయే 5జీ స్మార్ట్ ఫోన్ రూ.7వేలకే అందిస్తామని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ 5జీ సమ్మిట్ వేదికగా మాధవ్ సేథ్ మాట్లాడుతూ " రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తాం. ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్ సంస్థల కంటే ముందుగా 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్ మీ పని చేస్తుందని" రియల్ మీ సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ చెప్పారు. 5 ప్రాడక్ట్లు + 1 స్మార్ట్ ఫోన్ దీపావళి ఫెస్టివల్ సందర్భంగా సేల్స్ కోసం రియల్ మీ 1 + 5 + టి స్ట్రాటజీని అప్లయ్ చేయనుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ హెడ్ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్ మీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. ఆ ఐదు వస్తువుల్నికొంటే ఒక స్మార్ట్ ఫోన్‌ను ఆఫర్ ప్రకటించనుంది. వీటితో పాటు రియల్‌మీకి చెందిన స్మార్ట్ హోమ్ పరికరాలైన గేమ్ కన్సోల్స్, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్‌లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను విడుదల చేయనుండగా.. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దిపావళి పండుగ సందర్భంగా కష్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్ మీ మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ నార్జో 30 స్మార్ట్ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ బడ్స్ క్యూ2, రియల్ మీ ఫుల్-హెచ్ డి స్మార్ట్ టీవీతో పాటు వర్చువల్ ఈవెంట్ లో రియల్ మీ ఈ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్ మీ నార్జో 30 5జీ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తే, రియల్ మీ నార్జో 30 మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ పనిచేస్తుంది. రెండు ఫోన్ లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రియల్ మీ నార్జో 30 5జీ 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ ధర రూ.15,999. మరోవైపు రియల్ మీ నార్జో 30 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.12,499, 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ రెండు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ రంగులలో లభిస్తాయి. నార్జో 30 5జీ మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. అదే రోజున కొన్నవారికి రూ.500 డిస్కౌంట్(రూ.15,499) లభిస్తుంది. అలాగే, రియల్ మీ నార్జో 30 జూన్ 29న అమ్మకానికి రానుంది. మొదటి రోజు కొంటే 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ పై కూడా రూ.500 తగ్గింపు(రూ. 11,999 సమర్థవంతమైన ధర) లభిస్తుంది. రెండు ఫోన్ లు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం అవుతాయి. రియల్ మీ నార్జో 30 5జీ ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ (ఎఫ్/2.4 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపెర్చర్) 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (ఎఫ్/2.1 అపెర్చర్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 18 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ రియల్ మీ నార్జో 30 ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 30 డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్ ఫోన్ -
Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?!
సాక్షి,వెబ్ డెస్క్: కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న స్మార్ట్ మార్కెట్ జోరందుకుంది. దేశంలో అన్‌లాక్‌తో ఆయా సంస్థలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తుండగా మరికొద్దిరోజుల్లో రియల్ మీకి రియల్-మి నార్జ్30 5జీ, నార్జో30 4జీ స్టార్ట్ఫోన్లతోపాటు, బడ్స్ క్యూ2, 32 అంగుళాల స్మార్ట్ టీవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిసారి రియల్ మీ మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ తాజాగా రియల్ మీ నార్జో30 సిరీస్ లోని నార్జో30 ప్రో, నార్జో30 ఎ అనే రెండు మోడళ్లు స్మార్ట్ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని రియల్-మి ఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేథ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ నార్జో 30ప్రో, నార్జో30 ఏ స్మార్ట్ ఫోన్లు మలేషియాలో రేసింగ్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్స్ లో విడుదలయ్యాయి. రియల్ మీ నార్జో30 5జిస్పెసిఫికేషన్లు స్పెసిఫికేషన్ల వారీగా రియల్మే నార్జో30 5జి, నార్జో30 4జి చిప్సెట్, ఇతర చిన్న స్పెసిఫికేషన్లు మినహాయిస్తే మిగిలిన ఫీచర్స్ అన్నీ ఒకేలా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్మీ నార్జో30 5జి ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ధర: 799 మలేషియన్ రింగెట్లుగా(సుమారు రూ.14,100) నిర్ణయించారు. భారత్ లో సైతం కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చనే అంచనా. నార్జో30 4జి స్పెసిఫికేషన్లు నార్జో30 4జి లో మీడియాటెక్ హెలియో జి 95 చిప్సెట్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్ ను అందిస్తాయి. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ క్వాలీటీ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ పై భాగంలో ఎడమ వైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11కు చెందిన రియల్మీ యుఐ 2.0తో పనిచేస్తుంది. రియల్ మీ నార్జో30 5జి స్పెసిఫికేషన్లు రియల్ మీ నార్జో30 5జిలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ చిన్న కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. మీరు ఫోన్లో నైట్స్కేప్ మోడ్, ఏఐని ఆపరేట్ చేయవచ్చు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అదే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న 4జి వేరియంట్లో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ను వినియోగించుకోవచ్చు. రియల్ మీ బడ్స్ క్యూ2 స్మార్ట్ టీవీ ఫీచర్స్ రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం... రియల్ మీ బడ్స్ క్యూ2.. రియల్ మీ బడ్స్2 నియో లాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే బడ్స్ క్యూ 2 యాక్టీవ్ సౌండ్స్‌ను కంట్రోల్ చేస్తే బడ్స్2 బయట నుంచి వచ్చే సౌండ్ ను కంట్రోల్ చేయగలదు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ పూర్తి హెచ్డి రిజల్యూషన్, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతోంది. ప్రస్తుతానికి దీని ధర మాత్రం అందుబాటులో లేదు. -
రియల్ మీ నుంచి రెండు స్మార్ట్ వాచెస్, సేల్స్ ప్రారంభం
లాస్ ఎంజెంల్స్ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ ఆన్ లైన్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా రియల్ మీ సంస్థ రియల్ మీ వాచ్ 2, రియల్ మీ వాచ్ 2 ప్రో స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. దీంతో పాటు రియల్ మీ జిటి 5 జి స్మార్ట్‌ఫోన్, రియల్మీ ప్యాడ్, రియల్ మీ బుక్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ వాచ్ 2 ప్రైస్, ఫీచర్స్ రియల్మే వాచ్ 2 స్మార్ట్ ఫోన్ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, ఫుల్ ఛార్జింగ్ పెడితే 12 రోజుల వినియోగించుకునేలా బ్యాటరి వస్తుంది. ఇది IP68 (ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కోడ్) డస్ట్ మరియు వాటర్-రెసిస్టెంట్ కోటింగ్ తో మరియు 90 స్పోర్ట్స్ మోడ్లతో లభ్యమవుతుంది. అంతేకాదు బ్లడ్, ఆక్సిజన్ మరియు హార్ట్ బీట్ రేట్ ను కౌంట్ చేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్ ఫీచర్లను కలిగి ఉంది.దీని ధర 54.99 యూరోలు (సుమారు 4,889) తో కొనుగోలు చేయోచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ వాచ్ 2 ప్రో ప్రైస్ 'స్మార్ట్' రియల్ మీ వాచ్ 2ప్రో 1.75 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ వాచ్ 2 మాదిరిగానే రియల్మీ వాచ్ 2 ప్రో ఐపి 68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ తో వస్తుంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్లు, 100 కి పైగా వాచ్ ఫేస్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్, మాగ్నెటిక్ ఛార్జింగ్ బేస్ ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ వాచ్ 2 ప్రో ధర 74.99 యూరోలకే (రూ. 6,889 సుమారు.) సొంతం చేసుకోవచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ రియల్ మీ చెందిన రియల్ మీ టెక్ లైఫ్ రోబో వాక్యూమ్ విడుదలైంది. స్మార్ట్ మ్యాపింగ్, నావిగేషన్ సిస్టమ్‌కు సహాయపడే లిడార్ సెన్సార్లతో సహా 38 ఇంటర్నల్ సెన్సార్లతో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌కు లిడార్ సెన్సార్ ఖచ్చితమైన రియల్ టైమ్ నావిగేషన్ మరియు ఖచ్చితమైన ఇన్-యాప్ రూమ్ మ్యాపింగ్ చేస్తుందని రియల్ మీ ప్రతినిథులు తెలిపారు. ఇక దాని పనితీరుకు సంబంధించి రియల్మీ టెక్లైఫ్ రోబోట్ సౌండ్ మోడ్‌లో శబ్దం స్థాయిలను 55dB కంటే తక్కువగా ఉంచుతుంది. 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 600 ఎంఎల్ డస్ట్ బిన్, 300 ఎంఎల్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. ఇది వాక్యూమ్ ఒకేసారి నేలని శుభ్రపరుస్తుంది మరియు తుడుచుకుంటుందని రియల్ మీ ప్రతినిధులు విడుదల సందర్భంగా చెప్పారు. చదవండి: Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! -
పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్మీ తన జీటీ 5జీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్మీ బుక్ ల్యాప్‌టాప్, రియల్మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో రియల్మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను చైనా సీఎన్‌వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,299 (రూ. 37,800). రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు: 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్) 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
రియల్మీ నుంచి ల్యాప్‌టాప్..ఆపిల్ మాక్‌బుక్‌ను పోలి ఉన్న ఫినిషింగ్..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. కాగా త్వరలోనే రియల్మీ నుంచి ల్యాప్‌టాప్ రిలీజ్ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ ట్విటర్లో పోస్ట్చేశాడు. 2008 లో స్టీవ్ జాబ్స్ మొదటి తరం మాక్‌బుక్ ఎయిర్‌ను ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పేపర్‌బ్యాగ్‌లో ఉన్న రియల్మీ ల్యాప్‌టాప్ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీకు చెందిన ల్యాప్‌టాప్‌లకు పోటీగా, రియల్మీ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేయనుంది. రియల్మీ కంపెనీ భారత్, యూరప్ సీఈవో మాధవ్శేత్ తన ట్విటర్ ఖాతా నుంచి హల్లో వరల్డ్ అనే ఒక క్రిప్టిక్ మెసేజ్‌ను తెలుపుతూ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. కాగా చిత్రంలో రియల్మీ ల్యాప్‌టాప్ ఆపిల్ మాక్‌బుక్ మాదిరిగానే ఫినిషింగ్ కల్గి ఉన్నట్లుగా తెలుస్తోంది.ల్యాప్‌టాప్ బాడీ అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో తయారుచేశారనే విషయంలో కాస్త అస్పష్టత నెలకొంది. 01001000B 01100101B 01101100B 01101100B 01101111B 00100000B 01010111B 01101111B 01110010B 01101100B 01100100B 00100001B 00000000B#realme new product category has a message for you! Can you decode it & guess the product name that will add up to your #TechLife? pic.twitter.com/PhPcvn0668 — Madhav Max 5G (@MadhavSheth1) June 9, 2021 చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..! -
5జీ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరోసారి వేడెక్కనుంది. 3జీ, 4జీ మొబైల్స్ విషయంలో చైనా కంపెనీల దూకుడుతో హేమాహేమీ బ్రాండ్లు కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ స్మార్ట్ఫోన్ల వంతు రాబోతోంది. ఈ విభాగంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న రియల్మీ రూ.10,000 లోపు ధరలో మోడళ్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ఇవి భారత్‌లో సాకారమవుతాయని రియల్మీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా, యూరప్ సీఈవో మాధవ్ సేథ్ 5జీ సమ్మిట్ సందర్భంగా వెల్లడించారు. క్రమంగా రూ.7,000 ధరలోనూ మోడళ్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చవక 5జీ స్మార్ట్ఫోన్లను అందించాలన్నది సంస్థ లక్ష్యం. పరిశోధనకు రూ.2,100 కోట్లు.. అంతర్జాతీయంగా 5జీ పరిశోధన, అభివృద్ధికై రూ.2,100 కోట్లకుపైగా వెచ్చించనున్నట్టు మాధవ్ వెల్లడించారు. భారత్ సహా వివిధ దేశాల్లో ఏడు ఆర్అండ్డీ సెంటర్లను ఈ ఏడాది నెలకొల్పనున్నట్టు తెలిపారు. 90 శాతం పరిశోధన బృందం ఈ విభాగంపైనే ఫోకస్ చేసిందన్నారు. ‘10–15 మార్కెట్లలో 5జీ నెట్వర్క్ పైలట్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకుంటాం. మూడు నాలుగేళ్లలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అభివృద్ధి రెండవ శకంలోకి అడుగుపెడుతుంది. ఆ సమయానికి ఉపకరణాలు చవకగా లభిస్తాయి. తొలి శకంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అధిక ధరల్లో లభించే ఫ్లాగ్షిప్ మోడళ్లకే పరిమితమయ్యాయి. 5జీ శ్రేణిని విస్తరిస్తాం. గతేడాది 22 దేశాల్లో 14 రకాల 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాం. మొత్తం మోడళ్లలో వీటి వాటా 40 శాతం. 2022 నాటికి 5జీ మోడళ్లు 20 దాటతాయి. తద్వారా వీటి వాటా 70 శాతానికి చేరుకుంటుంది’ అని వివరించారు. టెలికం కంపెనీలకు బూస్ట్.. నెట్వర్క్ అందుబాటులో లేనప్పటికీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. 5జీ సేవలు త్వరితగతిన ప్రవేశపెట్టేందుకు టెలికం కంపెనీలకు ఈ అంశం బూస్ట్‌నిస్తుందని క్వాల్కామ్ ఇండియా, సార్క్ వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాదియా తెలిపారు. 5జీ నెట్వర్క్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే సమయానికి అధిక మొత్తంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ దర్శనమిస్తాయని అన్నారు. ఆధునిక తరం సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన గేమింగ్, కెమెరా అనుభూతి ఇస్తాయని కస్టమర్లకు అవగాహన ఉందన్నారు. -
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్‌వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
Realme C21y : రియల్ మీ సిరీస్ ఫీచర్స్ ఇలా..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన కొత్త ఫోన్ రియల్ మీ సీ21 వైని మనదేశంలో లాంచ్ చేయనుంది. థాయిలాండ్ కు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ వెబ్ సైట్ లో రియల్‌మి సి 21వై త్వరలో విడుదల కానున్నట్లు ఇదే విషయాన్ని ధృవీకరించింది. రియల్ మీ సి25ఎస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు సూచించిన కొన్ని రోజులకే రియల్ మీ సి 21వై గురించి వెలుగులోకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఇక, త్వరలో భారత్ లో విడుదలయ్య రియల్ మీ సి 21వై ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రియల్ మీ సి21వై ఫీచర్స్ • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ • 18W ఫాస్ట్ ఛార్జింగ్ • యుఐ 2.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 11 ను రన్ • 4 జి ఎల్‌టిఇ కనెక్టివిటీ • స్కైర్ మోడల్ తో 3కెమోరాలు • ఎల్ ఈడీ ఫ్లాష్ కోసం ఫోర్ కటౌట్స్ • ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం థాయిలాండ్ టెలికాం సంస్థ స్మార్ట్ ఫోన్ అనుమతుల జాబితాలో రియల్ మీ సి21వై ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోన్ సంబంధించిన అతి కొద్ది ఫీచర్లు మాత్రమే వెలుగులోకి రాగా .. రియల్ మీ సి 25ఎస్ పేరుతో రియల్ మీ తన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం మలేషియాలో అధికారికంగా విడుదలైన ఈఫోన్ భారత్ లో విడుదల చేసేందుకు రియల్ మీ ప్రతినిధులు సిద్ధమయ్యాయరు. చదవండి : కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు రిలయన్స్ భారీ సాయం -
దేశంలో తొలిసారిగా విడుదలైన డ్యూయల్ సిమ్ 5జీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ.. డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో తొలిసారిగా డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌ను ఇందులో తీసుకొచ్చారు. డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై కూడా సపోర్ట్ చేస్తుంది. జూన్ 4 నుంచి అమ్మకానికి రానుంది. దీని గరిష్ఠ డేటా డౌన్లోడ్ వేగం సెకనుకు 4.7 గిగాబిట్ వరకు ఉంటుంది. రియల్మీ ఎక్స్ 7 మాక్స్ 5జీలోని మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మొబైల్ ప్రియులకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని రిరియల్మీఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ, 128జీబీ ధర రూ.26,999, అలాగే 12 జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.29,999 ఉంది. రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా(సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్) 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 50W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1 సపోర్ట్ చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
లీకైన రియల్ మీ 4కే స్మార్ట్ టీవీ ధరలు
రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ధర మే 31 విడుదలకు ముందే లీక్ అయ్యాయి. కంపెనీ మే 31న రెండు మోడళ్లను 43-అంగుళాల, 50-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్నట్లు కొద్దీ రోజుల క్రితం ప్రకటించింది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్స్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ 10 సహాయంతో పనిచేయనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫైలను కలిగి ఉంటాయి. రెండు మోడళ్లు 178-డిగ్రీల కోణాల్లో 4కే రిజల్యూషన్‌ను చూడవచ్చు అని సమాచారం. టిప్‌స్టర్ డెబాయన్ రాయ్ పంచుకున్న వివరాల ప్రకారం.. 43 అంగుళాల మోడల్ ధర రూ.28,000 - 30,000 ఉంటే, 50 అంగుళాల మోడల్ ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ టీవీ 10 సహాయంతో నడవనుంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్ తో 24వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ద్వారా ఆడియోను వినవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్బి పోర్ట్‌లు, ఎవి అవుట్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ట్యూనర్ పోర్ట్‌తో రావచ్చు. ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5 కూడా ఉంటాయి. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
కరోనా ఎఫెక్ట్: అమెజాన్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ సారి యువకులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ఇటీవలే ప్రైమ్ డే సేల్ పేరిట ఓ భారీ సేల్‌ను ప్రకటించింది. ప్రతి ఏడాది నిర్వహించే సేల్‌లో భాగంగా ఈ సారి కూడా అమెజాన్ ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెజాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రైమ్ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. గత ఏడాది సైతం కరోనా కారణంగా ఈ సేల్‌ను అమెజాన్ ఆగస్టు నెలలో నిర్వహించింది. కరోనా వ్యాప్తి, పలు చోట్ల లాక్ డౌన్ల నేపథ్యంలో డెలివరీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతోనే అమెజాన్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ సైతం కరోనా కారణంగా పలు స్మార్ట్ ఫోన్ల లాంఛ్ ఈవెంట్లను వాయిదా వేసింది. సంస్థ వార్షికోత్సవ వేడుకలను కూడా వాయిదా వేసినట్లు రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ తెలిపారు. చదవండి: లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్! -
ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీగా ఆఫర్లు
స్వదేశీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ పేరుతో మరో సారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా ఆపిల్, శామ్సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల వివిధ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ తీసుకువచ్చింది. టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ మరిన్ని ఇతర ఉత్పత్తులపై కూడా మంచి ఒప్పందాలు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. గూగుల్ ప్రముఖ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 4ఎ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 15 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దాని అసలు ధర రూ.31,999 కాగా ప్రస్తుతం ఆఫర్ కింద ధర రూ.26,999 లభిస్తుంది. శామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ. 2 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్ వాస్తవ ధర రూ. 14,999 కాగా, రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. మైక్రో మాక్స్ ఇన్ 1 మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ను కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈ పోన్ పై ఇంత వరకు ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 అంగుళాల ఎల్సీడీ రెటీనా డిస్ప్లే కలిగిన ఆపిల్ ఐఫోన్ 11 రూ.7,000 తగ్గింపుతో మీకు రూ.44,999 నుండి లభిస్తుంది. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ : సరసమైన ధరలో
సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా చవక 5జీ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. రియల్మీ 8 5జీ పేరుతో రెండు వేరియంట్లలో దీనిని అందుబాటులోకి తెచ్చింది. డ్యూయల్ 5జీ, డ్యూయల్ స్టాండ్‌బైతో భారత్‌లో తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. 8.5 మిల్లీమీటర్ల మందం, 6.5 అంగుళాల అల్ట్రా స్మూత్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 28 జీబీ ఇంటర్నల్ మెమరీ, డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ. ఉంది. 4జీబీ, 8 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం. భారత్‌లో ఇదే చవకైన 5జీ ఫోన్ అని రియల్మీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న మొబిఫ్లో ఎండీ మల్లికార్జున్ తెలిపారు. ధరలు 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 8 జీబీ ర్యామ్ ధర రూ.16,999 ఏప్రిల్ 28 నుంచి కొనుగోలు చేయవచ్చు రియల్మీ 8 5జీ ఫీచర్లు 6.50 అంగుళాల అల్ట్రా స్మూత్ స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 మీడియాటెక్ డైమెన్సిటీ 700ప్రాసెసర్ 16 ఎంపీ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ బ్యూటీ సెల్ఫీ కెమెరా 48+ 2+2-మెగాపిక్సెల్ 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
రియల్మీ బడ్జెట్ ఫోన్లు.. రూ.6,799కే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా సి–సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను రూపొందించింది. వీటి ధరలు రూ.6,799 నుంచి రూ.10,999 వరకు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ర్యామ్ 2–4 జీబీ, ఇంటర్నల్ మెమరీ 32–128 జీబీ, బ్యాటరీ 5000–6000 ఎంఏహెచ్ ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సి–సిరీస్‌లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెలిపారు. 10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021–22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్‌పే యూపీఐ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్‌పే గ్రూప్ అధ్యక్షుడు సుహైల్ సమీర్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. క రోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్‌పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్‌పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్ డాలర్ల టీపీవీ (టోటల్ పేమెంట్స్ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై బంపర్ అఫర్
రియల్ మీ మనదేశంలో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఈ ఐదు రోజుల సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ నార్జో 30 ప్రోతో పాటు మరిన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పతులపై అద్భుతమైన డిస్కౌంట్లను రియల్ మీ అందిస్తుంది. ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్ 7 ప్రో ధర రూ.29,999, అయితే మీరు ఈ సేల్ భాగంగా రూ.27,999 కు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ఆన్లైన్ స్టోర్‌లో బుక్ చేసిన ప్రీపెయిడ్ ఆర్డర్లకు మాత్రమే రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. దీని అర్థం మీరు ఎక్స్ 7 ప్రోను కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు చెల్లింపు చేస్తేనే ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే డిస్కౌంట్ అఫర్ లభించదు. అదేవిధంగా, రియల్ మీ ఎక్స్ 7, నార్జో 30 ప్రో మొబైల్స్ పై రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పే చేయవచ్చు. వాస్తవానికి రూ.19,999 ధర గల రియల్మే ఎక్స్ 7 డిస్కౌంట్ తర్వాత మీకు రూ.18,999కు లభిస్తుంది. రూ.16,999కు విక్రయించే నార్జో 30 ప్రో మీకు రూ.15,999కు లభిస్తుంది. ఈ సేల్ లో డిస్కౌంట్ అనేది స్మార్ట్ఫోన్ల పైన మాత్రమే కాకూండా స్మార్ట్ టెలివిజన్లు, వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, నెక్‌బ్యాండ్ ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బ్రీఫ్‌కేసులు మొదలైనవి వాటిపై ఉన్నాయి. చదవండి: రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్ -
రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. రియల్మీ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్ మీ8, 8 ప్రోలను గత నెలలో చైనాలో లాంఛ్ చేసింది. అతి త్వరలోనే వీటిలో 5జీ కనెక్టివిటీ అందించి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే, ఈ రెండు ఫోన్లు ఎఫ్‌సిసి, బిఐఎస్ సర్టిఫికేషన్‌ను సాధించడంతో అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో అందిస్తున్న స్పెసిఫికేషన్లు వివరాలను పరిశీలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. రియల్ మీ 8 స్పెసిఫికేషన్లు(అంచనా): 6.4-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 4 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.14,999 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.15,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.16,999 రియల్మీ 8ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా) 6.4 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 108 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.17,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.19,999 చదవండి: ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ -
రియల్మీ 8 ప్రో : సూపర్ కెమెరా ఫీచర్లు
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తొలిసారిగా 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్వాడ్ కెమెరాతో ఒక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. రియల్మీ8 ప్రో పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. క్వాడ్ కెమెరాతోపాటు ప్రపంచంలో తొలిసారిగా స్టారీ టైమ్ ల్యాప్స్ వీడియో, టిల్ట్ షిఫ్ట్ టైమ్ ల్యాప్స్ వీడియో ఫీచర్లను జోడించినట్టు కంపెనీ తెలిపింది. రియల్మీ8 ప్రో ఫీచర్లు 6.40 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 16 ఎంపీ సెల్పీ కెమెరా 108+ 8 + 2+ 2 ఎంపీ క్వాడ్ రియల్ కెమెరా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ వేరియంట్ ధర రూ.17,999 8 జీబీ వేరియంట్ రూ.19,999 -
10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్
సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్లో ఉండే బ్యాటరీ కెపాసిటీని బట్టి 1 నుంచి 2 గంటలు సమయం పడుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జర్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఛార్జింగ్ సమయం ఒక గంట లేదా అంతకన్నా తక్కువకు తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. అంతే కాకుండా, 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కానీ, చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీపై దృష్ట్టి సారించినట్లు సమాచారం. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్డ్, వైర్లెస్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో షియోమీ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే షియోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలో రాబోయే షియోమీ ఎంఐ 11 అల్ట్రాలో ఈ టెక్నాలజీ తీసుకోని రావచ్చు. -
ఫిబ్రవరి 24న రియల్మీ నార్జో 30 ప్రో 5జీ లాంచ్
రియల్మీ ప్రియులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా రియల్మీ నార్జో 30 ప్రో 5జీ విడుదల తేదీలను సంస్థ ప్రకటించింది. దీనితో పాటు రియల్మీ నార్జో 30ఎ, రియల్మీ బడ్స్ ఎయిర్ 2లను కూడా ఫిబ్రవరి 24న సంస్థ భారతదేశంలో విడుదల చేయనుంది. రియల్మీ గతేడాది రియల్మీ నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు వాటికీ కొనసాగింపుగా రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ ఫోన్లను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంది. రియల్మీ బడ్స్ ఎయిర్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ వీటి కోసం ఒక ప్రత్యేక పేజీని కూడా సృష్టించింది. రాబోయే రెండు ఫోన్ల డిజైన్ వివరాలతో పాటు రియల్మీ నార్జో 30ప్రో 5జీ ప్రాసెసర్ సమాచారం కూడా వెల్లడించింది. రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 6.5 అంగుళాల డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొనిరావచ్చు అని సమాచారం. ఇక రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలియాలంటే ఫిబ్రవరి 24న రిలీజ్ వరకు ఆగాల్సిందే. -
రూ.13వేలకే రియల్మీ ఎక్స్7 ప్రో
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ ఇటీవలే ప్రీమియం రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. రియల్మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. కొద్దీ రోజుల క్రితం ఫస్ట్ సేల్ కి వచ్చిన అవుట్ అఫ్ స్టాక్ వెళ్లింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్ఛేంజ్ కింద రూ.30వేలు విలువైన రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.16,500 తగ్గిస్తే మీరు చెల్లించాల్సింది రూ.13,499 మాత్రమే. మీ దగ్గర యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 7 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.13,499 ధరపై 5 శాతం అంటే రూ.674 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ లెక్కన మీకు రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,000 లోపే కొనవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బట్టి ఎక్స్ఛేంజ్ రేటు మారే అవకాశం ఉంది. అందుకే కొనే ముందు ఒకసారి మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ ఎంత వస్తుందో ఓసారి చెక్ చేసుకోండి. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన ఎక్స్7ప్రో 5జీ మొబైల్ ను కొద్దీ రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా రియల్ మీ ఎక్స్7 ప్రో ఫ్లిప్ కార్టులో ఫస్ట్ సేల్ కి వచ్చింది. రియల్ మీ ఎక్స్7 సిరీస్ లో రెండు మొబైల్స్ తీసుకోని వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లనే దీనిలో అందించారు. రియల్ మీ ఎక్స్7 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ప్రస్తుతం 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను రూ.30,000కు తీసుకొనివచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫీచర్స్: డిస్ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ బ్యాటరీ: 4,500 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ బ్యాక్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్ కనెక్టివిటీ: డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1 ధర: రూ.29,999 చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక -
ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి
రియల్మీ అభిమానులకు శుభవార్త. రియల్మీ నార్జో సిరీస్ కింద రియల్మీ గత ఏడాది మే నుంచి మొబైల్స్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సిరీస్ కింద ఇప్పటికే రియల్మీ నార్జో 10, నార్జో 10ఏ, నార్జో 20, నార్జో 20ఏ, నార్జో 20 ప్రో మోడల్స్ తీసుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన నార్జో 20 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్మీ నార్జో30, నార్జో30 ప్రో వంటి మొబైళ్లను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఒక సర్వే కూడా చేపడుతుంది. ఈ సర్వేలో భాగంగా రియల్మీ నార్జో 30 సిరీస్ రీటైల్ బాక్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని తన అభిమానులను కోరుతుంది. దింట్లో ఆరు ఎంపికలు ఉన్నాయి. మీరు కూడా గూగుల్ ఫారం ద్వారా ఓటు వేయవచ్చు. అలాగే ఒక లక్కీ విన్నర్ కి ఉచితంగా ఈ నార్జో మొబైల్ అందించనున్నట్టు తెలిపింది. ప్యాకేజింగ్, కంపెనీ పేరు తప్ప ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అలాగే ఇండియాలో 30లక్షల మంది రియల్మీ నార్జో వినియోగదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఈ ఫోన్ జనవరిలో విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న సర్వేను బట్టి చూస్తే త్వరలోనే తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. రియల్మీ ఇటీవల రియల్మీ నార్జో 20 ప్రో కోసం ఆండ్రాయిడ్ 11 ఓపెన్ బీటాను రియల్మీ యుఐ 2.0తో పాటు అనేక ఇతర ఫోన్లకు విడుదల చేసింది. 3 Million young players have chosen the performance-oriented #Narzobyrealme series so far. Now calling all gaming enthusiasts to choose your favourite Narzo smartphone box. 1 lucky fan will win a new narzo phone! Head here to #realmeCommunity for voting: https://t.co/sRIK7rZNw4 pic.twitter.com/uUeaRJTjGs — Madhav FutureX (@MadhavSheth1) February 8, 2021 చదవండి: ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్ అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11 -
రూ.13 వేలకే రియల్మీ 5జీ ఫోన్
రియల్మీ తన చవకైన 5జీ మొబైల్ వీ11ని చైనాలో తక్కువ ధరకే విడుదల చేసింది. ఇందులో 5,000 సామర్థ్యం గల ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. రియల్మీ వి11 5జీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ గత నెలలో తక్కువ ధరకే రియల్మీ వి15 5జీని విడుదల చేసింది. 6.52 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కూడా ఇందులో అందించారు.(చదవండి: అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!) రియల్మీ వీ11 ఫీచర్స్: రియల్మీ వీ11 5జీ 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయు ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. రియల్మీ వీ11 5జీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్ తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, వై-ఫై, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఫీచర్లను ఇందులో అందించారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఏకైక 4జీబీ+128జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రియల్మీ వీ11 5జీ ధర చైనా 1,199యువాన్లుగా(సుమారు రూ.13,500)గా ఉంది. ఇది వైబ్రాంట్ బ్లూ, క్వైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
15 స్పోర్ట్స్ మోడ్లతో రియల్మీ స్మార్ట్ వాచ్
న్యూఢిల్లీ: భారతదేశంలో రూ.12,000 ఫిట్నెస్ వాచ్ కేటగిరీ కింద వాచ్ ఎస్ ప్రోను రియల్మీ తీసుకొచ్చింది. అంతర్నిర్మిత జిపిఎస్ తో వచ్చిన మొట్ట మొదటి రియల్మీ స్మార్ట్ వాచ్ ఇదే. రియల్మే వాచ్ ఎస్ ప్రో ప్రోలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి.(చదవండి: ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి) రియల్‌మి వాచ్ ఎస్ ప్రో ఫీచర్స్ 46 ఎంఎం లార్జ్ డయల్ బరువు: 63.5 గ్రా. బ్యాటరీ: 420 ఎంఎహెచ్ బ్లూటూత్: 5.0 454* 454 పిక్సెల్ రెజల్యూషన్ అడ్వాన్స్డ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ మ్యూజిక్ కంట్రోల్ టహార్ట్రేట్ మానిటర్ గొరిల్లా గ్లాస్ టడ్రింక్ వాటర్ రిమైండర్ కెమెరా కంట్రోల్ (రిమోట్ షూటర్) 15 స్పోర్ట్ మోడ్స్ టకలర్: బ్లాక్ ధర: రూ.9,999 -
రియల్మీ వి15 వచ్చేస్తుంది!
రియల్మీ వి15 మొబైల్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి బదులుగా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ జనవరి 7న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ గత కొన్ని రోజులుగా దాని డిజైన్‌ను టీజ్ చేస్తోంది. రియల్ మీ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జు క్వి చేజ్ చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబోలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకొస్తున్నట్లు ధృవీకరించారు. రియల్మీ వి15 5జీ కనెక్టివిటీ, హోల్-పంచ్ కటౌట్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. రియల్మీ వి15 మొబైల్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ బరువు 176 గ్రాములు, 8.1 మీ.మీ మందంగా ఉంటుందని ఒక టిప్‌స్టర్ చెప్పారు. రియల్మీ రేపు(జనవరి 7న) చైనాలో మధ్యాహ్నం 11 గంటలకు (ఐఎస్ టీ ఉదయం 11:30 గంటలకు) ఫోన్‌ను ఆవిష్కరించనుంది. రియల్మీ వి15 భారతీయ మార్కెట్లోకి వస్తుందో లేదో చూడాలి.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్) -
ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో టెక్లైఫ్- 5జీ లీడర్ విజన్‌తో దేశీయంగా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు రియల్మీ తాజాగా పేర్కొంది. ఇటీవల కాలంలో కంపెనీ స్మార్ట్ఫోన్లతోపాటు.. పూర్తిస్థాయి టెక్నాలజీ బ్రాండుగా ఆవిర్భవిస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలియజేశారు. విభిన్న స్మార్ట్ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలు, ఆడియో, వేరబుల్ ప్రొడక్టులను మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పారు. తద్వారా రియల్మీ టెక్లైఫ్ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా 2021లో కంపెనీ నుంచి మరిన్ని కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. చదవండి: (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) X7 సిరీస్ ఫోన్లు రియల్మీ X7 బ్రాండుతో 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మాధవ్ వెల్లడించారు. వివిధ ధరలలో వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2021లో టెక్ లైఫ్‌స్టైల్ బ్రాండుగా వృద్ధి చేందే ప్రణాళకలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలువురికి దేశీయంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేశారు. రియల్మీ మాతృ సంస్థ చైనాకు చెందిన బీబీకే గ్రూప్‌కాగా.. 2020లో దేశీయంగా 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం విదితమే. గతేడాది 5 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలను అందుకోగా.. మే నెలలో స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెట్టినట్లు మాధవ్ వెల్లడించారు. ఈ బాటలో స్మార్ట్‌వాచీల విక్రయాలకూ తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) -
2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో చైనీస్ కంపెనీ రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కేవోఐగా నామకరణం చేసిన ఈ ఫోన్‌ను ప్రధాన బ్రాండుగా విడుదల చేసే వీలుంది. చైనా, జపాన్లలో సుప్రసిద్ధమైన కేవోఐ చేప పేరుతో స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. శుభప్రదంగా భావించే కేవోఐ చేపను పోలి విభిన్న కలర్స్, అందమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల కంపెనీ మోటో.. డేర్ టు లీప్ రైటప్తోపాటు.. రెండు కోయి చేపలతో అలంకరించిన పోస్టర్‌ను రియల్మీ విడుదల చేసినట్లు వెల్లడించాయి. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) ఫీచర్స్ ఇలా! ఫ్లాగ్షిప్ బ్రాండుగా 2021లో రియల్మీ తీసుకురానున్న కేవోఐ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరికల్లా మార్కెట్లో ప్రవేశించవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఫోన్ ఫీచర్స్ పూర్తిగా వెల్లడికానప్పటికీ వెనుకభాగంలో చతురస్రాకారంలో కనీసం మూడు సెన్సర్స్‌తో కూడిన 64 ఎంపీ లెన్స్ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫ్లాస్క్ షేపుతో మూడు రంగుల కలయికతో కోత్త ప్యాటర్న్‌లో వెనుక కవర్ ఉండవచ్చని చెబుతున్నారు. డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ ఏర్పాటుకానుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తోపాటు.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ అంతర్గత మెమొరీకి చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత యూజర్ ఇంటర్ఫేస్తో ఫోన్ విడుదల కావచ్చు. ఇతర వివరాలు వెల్లడికావలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ
ముంబై, సాక్షి: స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రియల్ మీ.. స్మార్ట్ వాచీలను ప్రవేశపెట్టింది. ఎస్ ప్రో, ఎస్ బ్రాండ్లతో వీటిని విడుదల చేసింది. సర్క్యులర్ డిజైన్‌తోపాటు.. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్‌తో రూపొందించింది. కొంత ప్రీమియం మోడల్ అయిన ఎస్ ప్రో వాచీ ధర రూ. 9,999కాగా.. ఎస్ వాచీ ధర రూ. 4,999. వీటికి మధ్యస్థంగా ఎస్ మాస్టర్ ఎడిషన్ పేరుతో రూ. 5,999 ధరలో మరో మోడల్ వాచీని సైతం ప్రవేశపెట్టింది. వీటిని ఈ నెల 29 నుంచీ రియల్మీ, ఫ్లిప్‌కార్ట్ సైట్లతోపాటు.. స్టోర్లలోనూ విక్రయించనుంది. ఇతర వివరాలు చూద్దాం..(యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) ఫీచర్స్.. సింగిల్ బ్లాక్ డయల్ గల ఎస్ ప్రో, ఎస్ వాచీలు.. సిలికాన్ స్ట్రాప్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‌లో స్ట్రాప్స్ లభించనున్నాయి. వీటితోపాటు.. వేగన్ లెదర్ స్ట్రాప్స్ సైతం బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో లభిస్తాయి. వీటికి రూ. 499-999 అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్ ప్రో వాచీ 1.39 అంగుళాల అమోలెడ్ తెరను కలిగి ఉంటుంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో లభిస్తుంది. లైట్ సెన్సర్ ద్వారా బ్రైట్నెస్లో 5 లెవెల్స్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఏఆర్ఎం కార్టెక్స్ ఎం4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక ఆల్వేస్ ఆన్డిస్ప్లే ఫీచర్‌ను ఓటీఏ అప్డేట్ ద్వారా తదుపరి దశలో అందించనుంది. రియల్మీ లింక్ యాప్ ద్వారా 100 వాచ్ ఫేసెస్ అందుబాటులోకి వస్తాయి. ఔట్‌డోర్, ఇన్డోర్ రన్, వాక్, సైక్లింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, యోగా తదితర 15 రకాల స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌ను వినియోగించడం ద్వారా స్విమ్మింగ్‌లోనూ యూజ్ చేయవచ్చు. రోజంతా హార్ట్‌రేట్ మానిటరింగ్‌తోపాటు.. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్ విధానంతో లభిస్తుంది. 420 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మాగ్నిటిక్ చార్జింగ్ బేస్‌తో రెండు గంటల్లో పూర్తి చార్జింగ్కు వీలుంది. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఎస్ మోడల్ ఇలా ఎస్ వాచీ 1.3 అంగుళాల స్క్రీన్‌తో, 390 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందింది. 2.5డి కర్వ్డ్ గొరిల్లా గ్లాస్3ను అమర్చారు. రన్నింగ్, సైకిల్, ఎలిప్టికల్, ఫుట్‌బాల్, యోగా తదితర 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. రియల్ టైమ్ హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్‌కు ఎస్పీవో2 ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్ట్ చేసిన ఫోన్ నుంచి నోటిఫికేషన్స్ అందుకుంటుంది. స్విమ్మింగ్‌కు అనుకూలంకాదు. -
రియల్ మీతో జత కట్టిన జియో
రిలయన్స్ జియో రియల్ మీ, ఇతర కంపెనీలతో కలిసి 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారీ ఒకరు తెలిపారు. తక్కువ ధరకు 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్ వర్క్ అనుగుణంగా ఫోన్ల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి దేశంలో చాలా మంది 2జీ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ తెలిపారు. త్వరలో వీరి కోసం చాలా తక్కువ ధరలో 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: 10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ మరియు ట్రిక్స్) 4జీ మొబైల్స్ ని తీసుకురావడంకోసం రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు, ఇతర పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ తెలిపారు. రియల్ మీ సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ.. దేశంలో త్వరలో తక్కువ ధరలో 5జీ మొబైల్స్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మొబైల్స్ ని తీసుకురావడానికి చిప్సెట్లు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన అన్నారు. మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ డిజిటల్ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో 5జీ సహాయంతో కృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం రాబోతుందని తెలిపారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు. -
2020లో ఎక్కువ వెతికిన మొబైల్స్ ఇవే!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పలు స్మార్ట్ఫోన్ల విడుదల ఆలస్యమైంది. అయినప్పటికీ భారత్‌లో లాక్డౌన్ తర్వాత పండుగ సీజన్ సందర్బంగా రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఆపిల్, వన్‌ప్లస్, షియోమీ, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు భారత మార్కెట్లో నూతన ఫోన్లను విడుదల చేశాయి. 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్ఫోన్ల జాబితాను గూగుల్ విడుదల చేసింది. 1) వన్‌ప్లస్ నార్డ్ వన్‌ప్లస్ నార్డ్ బేసిక్ ప్రైస్ వచ్చేసి రూ.24,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ 6.44 అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 20: 9 యాస్పెక్ట్ రేషియోలో లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 5జీ ప్రాసెసర్, 4115 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ యొక్క క్వాడ్-కెమెరా సెటప్ కలిగి ఉంది. 2) ఐఫోన్ 12 రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చిన ఐఫోన్ 12 మొబైల్ 64జీబీ, 128జీబీ, 256జీబీ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 5.4 అంగుళాల ఓఎల్ ఈఢీ డిస్ప్లేని కలిగి ఉంది. ఐఫోన్ 12 ఏ14 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనిని బ్లూ, వైట్, గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 3) రియల్ మీ 7 ప్రో రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48 ఎంపి ప్రధాన సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది, ఇది ప్రారంభ ధర రూ.19,999. 4) రెడ్మీ నోట్ 8 ప్రొ షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15,999. ఈ మొబైల్ హాలో వైట్, గామా గ్రీన్, షాడో బ్లాక్, డార్క్ బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో జీ90టీ ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 5) రెడ్మీ నోట్ 8 షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,499 రూపాయలు. రెడ్మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడిన 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది 6) ఒప్పో ఎఫ్ 17 ప్రో షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21,490 రూపాయలు. ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే (2400x1080p రిజల్యూషన్) కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో పీ 95 ప్రాసెసర్ ద్వారా వస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తున్న ఒప్పో ఎఫ్ 17ప్రో వెనుక భాగంలో 48 ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 7) రెడ్మి నోట్ 9 ప్రో షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.12,999 రూపాయలు. రెడ్మి నోట్ 9 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5020 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 48ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8) వివో వీ20 సన్‌సెట్ మెలోడీ, మిడ్నైట్ జాజ్, మూన్లైట్ సోనాట వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభించే వివో వీ20 హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.44-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ లో 44 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.దీని ప్రారంభ ధర రూ.23990. 9) రియల్ మీ 6ప్రో ప్రస్తుతం రూ.17,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్న రియల్మీ 6ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీతో నడిచే ఈ హ్యాండ్సెట్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ 64ఎంపీ + 8ఎంపీ + 12ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 10) రియల్ మీ 7 దీని ప్రారంభ ధర రూ.14,999. రియల్మీ 7 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ మొబైల్ వెనుక 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మొబైల్స్ బొనాంజా సేల్ ని తీసుకొచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ద్వారా కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లను ఉత్తమ ధరకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో షియోమి, రియల్మీ, ఆసుస్, శామ్సంగ్, పోకో, ఒప్పో, ఆపిల్ మరియు ఇతర ప్రముఖ పేర్ల బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్ ని తీసుకొచ్చింది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,750 తగ్గింపు లభించనుంది.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ సందర్బంగా షియోమీ మీ 10టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 4, ఆసుస్ రాగ్ ఫోన్ 3, మోటో రాజర్(4జీ వెర్షన్) వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించననున్నారు. షియోమి మీ 10టీ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ సేల్ సందర్భంగా రూ.35,999(అసలు ధర రూ.39,999)కి లభిస్తుంది. అలాగే, ఆసుస్ రోగ్ ఫోన్ 3 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 44,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్మీ 9ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది. రియల్ మీ నార్జో 20 ప్రోపై కూడా రూ.1,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది. ఇక మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రూ.15,499(అసలు ధర రూ.19,999)కి లభిస్తుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ మరియు ఇఎంఐ ఆఫర్లను కూడా పొందవచ్చు. -
రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888
రాబోయే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌ను తమ తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించనున్నట్లు రియల్మీ ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న మొబైల్ కంపెనీలలో రియల్మీ ఒకటి అని సంస్థ పేర్కొంది. రియల్మీ తదుపరి తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ను “రేస్” అనే కోడ్ పేరుతో పిలుస్తున్నారు. నిన్న జరిగిన టెక్ సమ్మిట్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చే మొబైల్ ఫోన్లలో లభిస్తుందని తెలిపారు. “ఇది రియల్మీ మరియు మా వినియోగదారులకు ఒక మైలురాయి. స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో మేము ఒకటి అయినందుకు గర్వపడుతున్నాము. ఈ మైలురాయితో 2021లో భారతదేశంలో మరిన్ని 5జీ మొబైల్ తీసుకురావాలనే మా నిబద్ధతను మేము తెలియజేస్తున్నాము ”అని సిఇఒ మాధవ్ శేత్ చెప్పారు.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G అనేది టాప్-ఆఫ్-ది-లైన్ చిప్సెట్ కావడంతో ఇది మొబైల్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు ప్రీమియం అనుభవాలను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ కు తదుపరి ప్రాసెసర్ గా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888ని తీసుకొచ్చింది. ఇది సిస్టమ్-ఆన్-చిప్ 3వ తరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 60 5జీ మోడెమ్-RF వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బ్యాండ్లలో ఎంఎమ్వేవ్ మరియు సబ్ -6లకు సపోర్ట్ తో గ్లోబల్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5జీ క్యారియర్ అగ్రిగేషన్, గ్లోబల్ మల్టీ-సిమ్, స్టాండ్ ఒంటరిగా, నాన్ స్టాండ్ ఒంటరిగా, మరియు డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6వ తరం క్వాల్కమ్ ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ ఉందట ద్వారా సెకనుకు 26 టెరా ఆపరేషన్లలో (TOPS) మెరుగైన పనితీరును కనబర్చింది. ఇది మొబైల్ గేమ్ లలో సెకనుకు 144 ఫ్రేమ్‌లను (fps) అందించగలదు. అడ్రినో జీపీయు సిరీస్ లో అడ్రినో 660 జిపియు అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని క్వాల్కమ్ తెలిపింది. ఈ ప్రాసెసర్ సెకనుకు 2.7 గిగాపిక్సెల్స్ వద్ద లేదా 12మెగాపిక్సల్ రిజల్యూషన్ వద్ద సుమారు 120 ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది అని సంస్థ తెలిపింది. -
పడిపోయిన మొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి. వచ్చే డిసెంబరు నెలలో మరింత తగ్గుతాయి అని తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. (చదవండి: బడ్జెట్ లో రెడ్మీ నోట్ 9 5జీ మొబైల్స్) "పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్‌మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ తర్వాత మరో కొత్త సేల్ తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ యొక్క బ్లాక్ ఫ్రైడే సేల్ నేటి నుండి నవంబర్ 30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు గత సేల్ లో ఆఫర్లు, డిస్కౌంట్లను కోల్పోయినట్లయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మళ్ళి మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ ను పొందటానికి మరొక అవకాశాన్ని కల్పించింది. ఈ-కామర్స్ దిగ్గజం ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇఎంఐ లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బ్లాక్ ఫ్రైడే అమ్మకం సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తున్నాం. (చదవండి: మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్) ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఇవే.. ► ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకం సమయంలో రూ. 38,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఎక్స్ఆర్ను అసలు ధర కన్నా రూ.10,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. దీని యొక్క అసలు ధర రూ .47,900. మీ దగ్గర కనుక పాత ఐఫోన్ ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రూ.14,100 వరకు తగ్గింపును పొందవచ్చు. ► ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలలో భాగంగా మోటో జి9 రూ.9,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 662 చిప్సెట్ మరియు 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పనిచేస్తుంది. ► ఫ్లిప్‌కార్ట్ కొన్ని రియల్మీ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో 20 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హిలియో జి95 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇది 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. దీని వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ► శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 + ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ. 49,999కు లభిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ► గూగుల్ పిక్సెల్ 4ఎ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకంలో భాగంగా రూ.31,999కు లభిస్తుంది. ఇది 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 5.81-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. పిక్సెల్ 4ఎలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ► శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ను ప్రస్తుతం రూ.54.999కి అందిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ అసలు ధర రూ. 79,999కు లభిస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ డీల్. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభిస్తుంది. ► ఐఫోన్ SE 2020 మీరు ఐఫోన్ కొనాలనుకుంటే, ఇది ఉత్తమ సమయం. ఐఫోన్ SE 2020ను రూ. 32,999కు కొనుగోలు చేయవచ్చు. దీని 64 జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర. 42,500 రూపాయల నుండి తగ్గింది. ఈ ఐఫోన్‌పై మీకు 9,501 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది. -
అత్యంత చవకైన డ్యూయల్ 5జీ ఫోన్
రియల్మీ 7 5జీ ఫోన్‌ని ఇంగ్లాండ్‌లో జరిగిన వర్చువల్ ఈవెంట్లో రియల్మీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన రియల్మీ వీ5నే రీబ్రాండ్ చేసి రియల్మీ 7 5జీగా లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ రియల్మీ ఈ ఫోన్లో పలు మార్పులు చేసింది. రియల్మీ వీ5లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను తీసుకురాగా, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మే 7 5 జీలో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి మరియు ఫ్రంట్ లో హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను అందిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో, రియల్ మీ 7ఐలకు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అత్యంత చవకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్ ఇదే. రియల్ మీ 7 5జీ స్పెసిఫికేషన్లు డిస్ ప్లే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ర్యామ్ 6 జీబీ స్టోరేజ్ 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు(256 జీబీ) ప్రధాన కెమెరా 48 ఎంపీ, 8 ఎంపీ( అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో షూటర్, మోనోక్రోమ్ ) ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ బ్లూటూత్ బ్లూటూత్ 5.1 సెన్సార్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యు ఐ కనెక్టివిటీ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై కలర్ బాల్టిక్ బ్లూ ఈ స్మార్ట్ ఫోన్ ధరను 279 యూరోలుగా(సుమారు రూ.27,400) నిర్ణయించారు. ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బాల్టిక్ బ్లూ రంగులో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇంగ్లండ్‌లో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని 229 యూరోలకే(సుమారు రూ.22,500) విక్రయించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియాల్సి ఉంది. -
5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్
ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్మార్ట్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ వినియోగాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది. కొన్నేళ్ల క్రితం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత డీమాండ్ ఉండేదో ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి అంత డిమాండ్ ఉంది. అందుకే శామ్సంగ్, షియోమి, ఒప్పో, రియల్మీ వంటి బడ్జెట్ లోనే మంచి నాణ్యత గల ఇయర్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరలకే వస్తున్నాయంటే వీటిలో ఫీచర్లు బాగాలేవనే అంచనాకు రాకండి. మంచి నాణ్యతతో కూడిన వస్తువులను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తేవాలంటే చాలా రీసెర్చ్ అవసరమవుతుంది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్నా ఇలాంటి సంస్థలు ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ ను మనకు పరిచయం చేస్తున్నాయి. 5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మరి వాటి ఫీచర్స్, ధర వంటి వివరాలు మీ కోసం.. ఒప్పో ఏక్నో W51 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్' మార్కెట్లో ఒప్పో యొక్క ఆవిష్కరణ అయిన ఒప్పో ఏక్నో W51లో మంచి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో 7 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఆన్‌బోర్డ్, సుమారు 10 మీటర్ల పరిధి వరకు ధ్వని వినిపిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ లో 25 ఎంఏహెచ్ బ్యాటరీతో నిండి ఉంటుంది, ఛార్జింగ్ కేసులో 480 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేస్తే ఈ ఇయర్ ఫోన్ 3.5 గంటలు పనిచేస్తుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేయకపోతే 20 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీ సామర్థ్యం ఉండడం హైలైట్. అయితే, బ్యాటరీ ఇక్కడ చాలా సగటు. మీరు 15 నిమిషాల ఛార్జ్ చేస్తే ఇయర్ఫోన్లు 3 గంటల వరకు పనిచేస్తాయి. దీనికి 3 మైక్రో పోన్ సిస్టంను ఒప్పో యాడ్ చేసింది. దీంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండి, నాయిస్ తగ్గుతుంది. దీని ధర రూ. 4,999. (చదవండి: ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా?) రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అత్యంత చవకైన వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గా పేరుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఇవి బాగా పనిచేస్తాయి. రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఫీచర్-ప్యాక్డ్, కంపానియన్ యాప్ సపోర్ట్ వల్ల ఉపయోగించడం సులభం అవుతుంది. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోలో సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పటికీ, మీకు అద్భుతమైన సౌండ్‌స్టేజ్, బేస్ భారతదేశంలో చాలా మంది ప్రజలు ఇష్టపడే విధంగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే సూపర్ అనుకోండి. ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయని రియల్ మీ చెబుతోంది. దీని ధర రూ. 4,999. వన్‌ప్లస్ బడ్స్ Z వన్‌ప్లస్ బడ్స్‌లో ఒక మంచి విషయం దాని యొక్క డిజైన్. దాని సాఫ్ట్ మాట్టే ప్లాస్టిక్ కేసు సూపర్ ప్రీమియం అనిపిస్తుంది. బడ్స్ Z యొక్క పిల్-ఆకారపు కేసు పూర్తిగా నిగనిగలాడే ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది, తెలుపు రంగులో ఉండటం వల్ల ఇది త్వరగా మురికిగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ఒక చేత్తో మూత తెరవడం అంత సులభం కాదు. దీని వెనుక భాగంలో టైప్ సి పోర్ట్ మరియు పెయిరింగ్ / రీసెట్ బటన్ ఉంటాయి. ముందు భాగంలో LED సూచిక ఉంటుంది. సాధారణ వన్‌ప్లస్ పద్ధతిలో వన్‌ప్లస్ బడ్స్ జెడ్‌ను బిటి 5.0 నెట్‌వర్క్‌లో గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌కు సులభంగా జత చేయవచ్చు. మీరు మూత తెరిచిన వెంటనే కార్డ్ మీ Android ఫోన్లో కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, వన్‌ప్లస్ బడ్స్ ఐదు గంటలు వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. మీరు 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 2-3 గంటల వరకు పాటలు వినవచ్చు. దీని ధర 2,999. (చదవండి: డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్) నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో ఒక్క సారి చార్జ్ చేసిన నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో బ్యాటరీ లైఫ్ 8 గంటలు. 2,200mAh బ్యాటరీ కేస్ ను కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో టిడబ్ల్యుఎస్ బ్లూటూత్ 5.0పై పని చేస్తుంది. క్వాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రోడక్ట్ నాణ్యతలో చాలా అత్యుత్తమం. ఈ కారణంగా ఇయర్ ఫోన్లో ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. AptX+AAC Hi-Fiఆడియో టెక్నాలజీతో IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. దీనిలో ప్రతి ఇయర్ బడ్ టచ్ సెన్సార్లతో వస్తుంది, అందువల్ల వాల్యూమ్‌ను నియంత్రించడానికి, కాల్లకు సమాధానం ఇవ్వడానికి / తిరస్కరించడానికి , మీడియాను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 3,499. షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ఏకంగా రూ. 3,999 ధరకే లభిస్తోంది. చూసేందుకు ఇయర్ ప్యాడ్స్ లాంటి ఇయర్ పీస్ లా దీన్ని డిజైన్ అయిన ఈ ఇయర్ పీస్ ఫీచర్స్ బాగున్నాయి. 14.2mmడ్రైవర్స్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, SBC, AAC, LHDC బ్లూటూత్ codecs సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇందులో ANC లేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. 12 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం షియోమీ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కు ఉండగా, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. -
15 వేల లోపు కొత్త ఫోన్ కొనాలంటే ఇవే బెస్ట్!
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పోటీగా మామూలుగా లేదు. తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ గల స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రూ .15 వేల లోపు ధర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ధర అనేది చాలా మందికి అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు రూ. 15,000 లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి, మీడియాటెక్ హెలియో జి80, మరియు మీడియాటెక్ హెలియో జి95 వంటి శక్తివంతమైన ప్రాసెసర్లను తీసుకొస్తున్నాయి. మంచి కెమెరా టెక్నాలజీ కూడా ఈ ధరలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్ లు ఉన్నందున, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ లను ఎంచుకోవడం అంత సులభం కాదు. అలా ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.. రియల్ మీ నార్జో 20.. ఈ మధ్య విడుదలైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ నార్జో సిరిస్ మొబైల్ ఫొన్లను కొత్తగా మార్కెట్ లొకి తీసుకొచ్చింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 4500mAh ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లాక్ నింజా, వైట్ నైట్ సెన్సర్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ రియల్ మీ 7.. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో వచ్చిన బెస్ట్ ఫోన్ లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ 7 రియల్ మీ 6తో పోలిస్తే మూడు ప్రధాన మార్పులు చేసింది. అవి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలలో మార్పు చేసింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000mAh ప్రధాన కెమెరా 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ మీస్ట్ బ్లూ, మీస్ట్ వైట్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ పోకో ఎం 2 ప్రో.. పోకో ఎం 2 ప్రో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండటంతో పాటు రెడ్మి నోట్ 9 ప్రోతో సమానంగా కనిపిస్తుంది. పోకోలో 6.67-అంగుళాల పూర్తి-హెచ్డి + ఎల్సిడి డిస్ప్లేను ఉపయోగించారు. పోకో ఫ్రంట్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. పోకో M2 ప్రో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 11 పై నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 720G SoC చిప్ ని వాడారు. 5,000mAh సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఒక రోజు మొత్తం సులభంగా వాడుకోవచ్చు. దీని ధర వచ్చేసి Rs. 13,999. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లూ, గ్రీన్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రెడ్మి నోట్ 9 ప్రో గతంలో రెడీమి నోట్ సిరీస్ లో వచ్చిన ఫోన్ ల కంటే రెడ్మి నోట్ 9 ప్రో తక్కువ ప్రారంభ ధరలో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 6.67-అంగుళాల ఎల్సిడి స్క్రీన్‌ను కలిగి ఉండటంతో పాటు పైభాగంలో హోల్-పంచ్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. దీనిలో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ ఉపయోగించారు. రెడ్మి నోట్ 9 ప్రో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర వచ్చేసి 12,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67- ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ అరోరా బ్లూ, ఛాంపింగ్ గోల్డ్, గ్లేసియర్ వైట్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రియల్ మీ నార్జో 10.. రియల్ మీ నార్జో 10 తక్కువ ఖర్చుతో కూడిన ఫోన్, ఇది మీడియాటెక్ హెలియో జి80 SoC ప్రాసెసర్ పై నడుస్తుంది. దీనిలో కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను వాడారు. ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ పొందవచ్చు. ఇందులో హెలియో జి80 ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల గేమింగ్ పనితీరు చాలా బాగుంది. భారత్ లో దీని ధర వచ్చేసి 11,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 720x1600 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో జి80 ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 128జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000ఎమ్ఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ గ్రీన్, వైట్ -
బడ్జెట్లో మైక్రోమాక్స్ నోట్ 1 మోడల్
micromax in note1 డిస్ప్లే: 6.67 అంగుళాలు రెజల్యూషన్: 1080్ఠ2400 పిక్సెల్స్ ర్యామ్: 4జీబి స్టోరేజ్: 128 జీబి బ్యాటరీ: 5,000 ఎంఎహెచ్ కలర్ ఆప్షన్స్: గ్రీన్, వైట్ ∙ఎల్‌యిడి ఫ్లాష్ ∙నైట్‌విజన్ సపోర్ట్ ∙48–మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ∙5–మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ ధర: రూ.10,999 realme 7i డిస్ప్లే: 6.5 అంగుళాలు మెమోరీ: 64జీబి 4జీబి ర్యామ్ 128జీబి 4జీబి ర్యామ్ 128జీబి 8జీబి బ్యాటరీ: 5000 ఎంఎహెచ్ రెజల్యూషన్: 720్ఠ1600 పిక్సెల్స్ బరువు: 188గ్రా, కలర్: అరోరా గ్రీన్, పొలార్ బ్లూ ∙ఫింగర్ ప్రింట్ సెన్సర్ ∙గొరిల్లా గ్లాస్ 3 ధర: రూ.12,999 నుండి. గ్యాడ్జెట్ బజార్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 సైజ్: 45 యంయం బాడీ: గొరిల్లా గ్లాస్ డిఎక్స్ మెమోరీ: 8జీబి 1జీబి ర్యామ్ డిస్ప్లే: 360్ఠ360 రెజల్యూషన్ కలర్ ఆప్షన్స్: మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ వైట్ ∙టైటానియం ఫ్రేమ్ ∙వాటర్ రెసిస్టెంట్ ∙ ఎల్టీయి కనెక్టివిటీ ∙శాంసంగ్ పే ∙సీజీ సర్టిఫైడ్ ∙ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ∙లౌడ్ స్పీకర్ ధర: రూ.29,990 సోషల్ మీడియా ఆతరువాత....ఇక మాయమే! టెలిగ్రామ్ ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజెస్’ ఫీచర్ తరహాలో సరికొత్త ఫీచన్‌ను తీసుకురానుంది వాట్సాప్. వ్యక్తులు లేదా గ్రూప్‌లకు పంపిన మెసేజ్ ఏడు రోజుల తరువాత దానికదే మాయమవుతుంది. బానే ఉందిగానీ ఆ టైమ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం రావచ్చు. అలాంటి వారి కోసం ‘టెంపరరీ మెసేజ్’ కనిపిస్తుంది. ఎనేబుల్, డిసేబుల్ ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, వృథాగా పడి ఉన్న మెసేజ్‌లను మరింత సులభంగా డిలిట్ చేయడానికి ‘స్టోరేజ్ మెనేజ్మెంట్’ టూల్‌ను అప్డెట్ చేస్తుంది వాట్సాప్. రిడిజైన్ చేసిన టూల్ ‘మెనేజ్ స్టోరేజ్’ సబ్ మేనూలో అందుబాటులో ఉండనుంది. ఎందుకంటే...ఇందుకంటా! ‘డిన్నర్ పార్టీ కోసం’ ‘హాస్పిటల్‌కు వెళ్లాలి’ ‘సురేష్ వచ్చాడు’....కాల్ చేయడానికి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. పీకలలోతు పనుల్లో మునిగిపోయి ముఖ్యమైన ‘కాల్’ను ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘కాల్’కు ముఖ్య కారణం సూక్ష్మంగా చెప్పేస్తే ఇరుపక్షాలకి మేలే కదా. కాల్పికప్ రేట్ కూడా పెగుతుంది. ఈ ఉద్దేశంతోనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ట్రూ కాలర్ ‘కాల్ రీజన్’ అనే కొత్త అప్లికేషన్‌ను తీసుకువస్తుంది. ‘సోషల్ మీడియాలో నెటిజెన్స్ పాప్లర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాల్ రీజన్ ఫీచర్‌ను తీసుకువస్తున్నాం’ అని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది ట్రూ కాలర్. -
బడ్జెట్ ధరలో రియల్మీ క్యూ2 5జీ స్మార్ట్ఫోన్లు
సాక్షి,ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా 5 జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ క్యూ2, రియల్మీ క్యూ2 ప్రో, రియల్మీ క్యూ2ఐ అనే మూడు స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసింది. రియల్మీ క్యూ, రియల్మీ క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలోనూ, రియల్మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్నాయి. రియల్మీ క్యూ2 ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2 ప్రో ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2ఐ ఫీచర్లు 6.5 అంగుళాల డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్ ఆండ్రాయిడ్ 10 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక ధరల విషయానికి వస్తే రియల్మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200 రియల్మీ క్యూ2 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. రియల్మీ క్యూ2ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,000 -
రియల్మీ 7ఐ: అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: రియల్మీ మరో అద్భుత స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మీ 7 సిరీస్‌లో 7ఐ పేరుతో బడ్జెట్ ధరలో అందిస్తోంది. భారీ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది. ధర, లభ్యత 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ రూ.11,999 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రూ.12,999 అక్టోబరు 16 నుంచి రియల్మీ 7ఐ ఫోన్ సేల్స్ ప్రారంభం బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ.కామ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో 10శాతం డిస్కౌంట్ పాటు పేటీఎంపై క్యాష్‌బ్యాక్ సదుపాయం దీనికి కూడా వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రియల్మీ 7ఐ ఫీచర్లు 6.50 అంగుళాల హెచ్డీ పంచ్ హోల్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 64+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ -
కొత్త టెక్నాలజీతో సూపర్ టీవీ
సాక్షి, ముంబై: స్మార్ట్ ఫోన్ తయారీదారు రియల్మీ త్వరలో ఒక కొత్త టీవీని ప్రారంభించనుంది. అద్భుతమైన టెక్నాలజీతో 55 అంగుళాల 4కే టీవీని అక్టోబర్‌లో విడుదల చేయనుంది. దీనిపై కంపెనీ సీఈఓ మాధవ్ శేథ్ ట్విటర్ ద్వారా సంకేతాలందించారు. రానున్న లాంచింగ్ పై ఆసక్తికరమైన కొత్త అప్ డేట్ అంటూ కొత్త టీవీ ఆవిష్కరణను చెప్పకనే చెప్పారు. రియల్మీ టీవీతో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సూపర్ టీవీ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడికానప్పటికీ కంపెనీ తన బ్లాగులో పంచుకున్న వివరాల ప్రకారం ప్రపంచంలో తొలి "ఎస్ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ” తీసుకొస్తోంది. కంపెనీ తన 55 అంగుళాల స్మార్ట్ టీవీని తీసుకొస్తోంది. టీవీ సూపర్ అల్ట్రా-వైడ్ కలర్, కంటికి హాని కలగకుండా లో బ్లూలైట్‌తో ఎస్ఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్‌ను జోడించింది. స్టీరియో సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను అందించడానికి డాల్బీ ఆడియో, ఎస్ పీడీ టెక్నాలజీ (స్పెక్ట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్) ఫీచర్లు న్నాయి. (రియల్మీ నార్జో 20 సిరీస్ ఫోన్లు : ఫీచర్లు ఇవే) కాగా రియల్మీ మొట్టమొదటి స్మార్ట్ టీవీలను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. రియల్మీ టీవీ 32 అంగుళాల వెర్షన్ ధర రూ .12,999 43 అంగుళాల వేరియంట్ ధర 21,999 రూపాయలు వద్ద ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. Really excited to #LeapToNextGen! I have some interesting updates about our upcoming launch for you all & I am sure it will make your lives much cooler with the most stunning visuals ever. Stay tuned for the next #AskMadhav episode. pic.twitter.com/m7RPky3PSZ — Madhav Faster7 (@MadhavSheth1) September 25, 2020 -
రియల్మీ నార్జో 20 సిరీస్ ఫోన్లు : ఫీచర్లు ఇవే
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దారు రియల్మీ నార్జో 20 సిరీస్ స్మార్ట్ఫోన్లను సోమవారం లాంచ్ చేసింది. రియల్మీ నార్జో 20,నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇప్పటికే రెండు బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేసి జోరుమీదున్న రియల్మీ తాజా ఫోన్లను కూడా బడ్జెట్ ధరల్లోనే తీసుకొచ్చింది. రియల్మీ నార్జో 20ఏ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే కాల్కం స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ 12+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3 జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర 8499 రూపాయలు. 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ మోడల్ 9499 రూపాయలు సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం రియల్మీ నార్జో 20 6.5 అంగుళాల స్క్రీన్ మీడియా టెక్ హీలియో జీ 85సాక్ 48+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ 10,499 రూపాయలు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 11,499 కు రూ సెప్టెంబర్ 28 న మధ్యాహ్నం 12:00 గంటలకు తొలి సేల్ రియల్మీ నార్జో 20 ప్రొ 6.5 అంగుళాల ఫుల్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే మీడియా టెక్ హీలియో జీ 95 చిప్ సెట్ 48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ 14,999 రూపాయలు 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ 16,999 రూపాయలు మొదటి అమ్మకం సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం 12:00 గంటలకు -
భారీ బ్యాటరీ, బడ్జెట్ ధర : రియల్‌మి స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: రియల్‌మి సంస్థ కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. రియల్‌మి సీ సిరీస్ లో కొనసాగింపుగా బడ్జెట్ ధరలో రియల్‌మి సీ 12, సీ15 ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. కోవిడ్ -19మహమ్మారి కారణంగా ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా వీటిని తీసుకొచ్చింది. వీటితోపాటు రియల్మిటీ షర్టులను, ఇయర్ బడ్స్ ను కూడా సంస్థ లాంచ్ చేసింది. స్మార్ట్ టీవీలను భారతదేశంలో స్థానికంగా నోయిడాలో తయారు చేయడం ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మి సీ15 ఫీచర్లు 6.5అంగుళాల మినీ-డ్రాప్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 35 సాక్ 13 + 8 + 2 + 2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6,000 ఎంఏహెచ్ 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. రియల్‌మి సీ15ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది.. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 9,999 రూపాయలు 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర 10,999 రూపాయలు ఆగస్టు 27 న ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో తొలిసేల్ ఆరంభం. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. రియల్‌మి సీ12 6.5అంగుళాల హెచ్డి + ఎల్సిడి డిస్ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ35 ప్రాసెసర్, 13 + 2 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 10 వాట్స్ చార్జింగ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రియల్‌మి సీ 12 సింగిల్ వేరియంట్లో తీసుకొచ్చింది. దీని ధరను (3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) 8,999 గా ఉంచింది. ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో దీని మొదటి అమ్మకం ఆగస్టు 24 న ప్రారంభం -
రియల్‌మి నుంచి బడ్జెట్ఫోన్ విడుదల
ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి నేడు భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 6ఐ గా పిలువబడే ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ఈ జూలై 31 మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్‌కామ్ ద్వారా కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. రియల్‌మి 6ఐ ఫీచర్లు 6.5 ఇంచుల డిస్ ప్లే+ 90 హెర్ట్జ్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ కలిగి ఉంది. ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వెనుకు వైపు 4ప్రధాన కెమెరాలు ఉన్నాయి. 48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్ క్వాడ్ రియర్ కెమెరా అందులో ప్రధాన కెమెరా 48 మెగాఫిక్చెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 30W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రియల్‌మి 6ఐ ధర 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 -
రియల్‌మి స్మార్ట్ ఫోన్లు : సూపర్ ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి ఎక్స్ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ ద్వారా లాంచ్ చేసింది. రియల్‌మి ఎక్స్ 3, రియల్‌మి ఎక్స్ 3 సూపర్‌జూమ్ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ధర, లభ్యత రియల్‌మి ఎక్స్ 3 రెండు వేరియంట్లలో లభ్యం. 6జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్,/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 25,999 రూపాయలు రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ లోయర్ వేరియంట్ 27,999 రూపాయలు 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 32,999 రూపాయలు ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మి వెబ్సైట్ ద్వారా జూన్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి. జూన్ 27వ తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు , ఈఎంఏ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ రియల్‌మి ఎక్స్ 3 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16+ 8-మెగాపిక్సెల్ డబుల్ సెల్పీ కెమెరా 64+8+12+2-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్ 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 32+8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
‘వాయువేగంతో పోకో స్మార్ట్‌ఫోన్ సేవలు’
ముంబై: మొబైల్ దిగ్గజం రియల్మీ జూన్ 25న ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అయితే మరోవైపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో (స్మార్ట్ ఫోన్)ఇండియా జనరల్ మేనేజర్ సీ.మన్మోహన్ మాత్రం రిలయ్‌మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్‌ను క్రీప్(నెమ్మదైన ఫోన్‌గా) అభివర్ణించాడు. ట్టిటర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సీ. మన్మోహన్ స్పందిస్తూ.. వాయు వేగంతో సేవలందించే పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండగా, మీరెందుకు రియల్మీ ఎక్స్2, ఎక్స్3 లాంటి నెమ్మదైన ఫోన్లను వాడడానికి ప్రయత్నిస్తారని యూజర్‌ను ప్రశ్నించారు. మరోవైపు పోకో మేనేజర్ గతంలో కూడా రియల్ మీ లాంచ్ చేసిన ఎక్స్ 50పప్రో (5జీ స్మార్ట్‌ఫోన్) నెట్వర్క్సేవలందించే ఫోన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ దేశంలో ప్రస్తుతం 5జీ సేవలను ప్రజలు కోరుకోవడం లేదని, ప్రజలు కోరుకునే అన్ని సేవలను పోకో స్మార్ట్‌ఫోన్ అందిస్తుందని తెలిపారు. -
ఆకర్షణీయ ధరల్లో రియల్మీ స్మార్ట్ టీవీలు
సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ స్మార్ట్ టీవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక అంచనాలు, ఊహాగానాలు, టీజర్ల మధ్య ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మీ స్మార్ట్ టీవీలను భారతదేశంలో లాంచ్ చేసింది. తద్వారా రియల్మీ భారతదేశంలో తన మొదటి స్మార్ట్ టెలివిజన్‌ను ప్రారంభించింది. అలాగే బడ్జెట్ధరల స్మార్ట్ టెలివిజన్ విభాగంలోకి దూసుకొచ్చింది. పాపులర్ సైజుల్లో, బడ్జెట్ ధరల్లో ఈ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన రియల్‌మి తన ప్రత్యర్థులు, షావోమి, వూక్ తదితరులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ టీవీలు 32, 43అంగుళాల రెండు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తాయి. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్) రియల్మీ స్మార్ట్ టీవీ ధరలు రియల్‌మి స్మార్ట్ టీవీ 32 అంగుళాల వేరియంట్ ధర రూ. 12,999 43 అంగుళాల వేరియంట్ ధర రూ. 21, 999 లభ్యత: జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మే.కామ్‌లో లభ్యం. త్వరలో ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా లభిస్తుందని రియల్‌మి ప్రకటించింది. రియల్‌మి స్మార్ట్ టీవీ ఫీచర్లు సైజు వేరియంట్‌ను బట్టి రిజల్యూషన్ ఉంటుంది. 32 అంగుళాల రియల్మే స్మార్ట్ టీవీ 1366x768 పిక్సెల్స్ (హెచ్డి-రెడీ) రిజల్యూషన్, 43 అంగుళాల వేరియంట్ 1920x1080 పిక్సెల్స్ (ఫుల్-హెచ్డి) రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 9 పై, 1 జీబీర్యామ్, 8 జీబీ స్టోరేజ్, మీడియాటెక్ ఎంఎస్ డీ6683 ప్రాసెసర్ తో సహా మిగిలిన అన్ని ఫీచర్లు రెండింటిలో దాదాపు ఒకేలా వున్నాయి. 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో 4- స్పీకర్ సిస్టమ్, డాల్బీఆడియో , బ్లూటూత్ 5.0 ఫీచర్లను కూడా జోడించింది. అంతేకాదు ఈ లాంచ్ ఈవెంట్లో రియల్మీ వాచ్, రియల్మీ బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. వాచ్ ధరను రూ. 3,999, ఇయర్ ఫోన్స్ ధరను రూ. 2,999 గా ఉంచింది. -
రియల్మీ ఫ్యాన్స్‌కు శుభవార్త
ముంబై : రియల్మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్మీ నుంచి నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ స్మార్ట్ఫోన్లను ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు ఫోన్లు మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఈవెంట్‌ను వాయిదా వేసింది. ఏప్రిల్ 20న లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఉండటంతో రియల్మీ ఆన్లైన్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 21న రియల్మీ నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేయనుంది. రియల్మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వాటితో పాటు నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్2 స్మార్ట్ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. #FeelThePower of a unique series with class-apart features and max performance. It is built for Gen Z. It is built for you. Are you ready to welcome #realmeNarzo10 & #realmeNarzo10A? Watch the launch video at 12:30 PM, 21st April on our official channels. https://t.co/hQGc0tJYkA pic.twitter.com/KlfVx30YR2 — realme (@realmemobiles) April 17, 2020 -
పెరిగిన ఐఫోన్ ధరలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరగడమే ఈ ధరల సవరణకు కారణం. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 64 జీబీ ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్ఆర్ మోడల్ రూ.2,600 అధికమై రూ.52,500లకు ఎగసింది. 64 జీబీ 11 ప్రో ధర రూ.1,06,600లుగా ఉంది. అంతక్రితం ఈ మోడల్ ధర రూ.1,01,200 ఉండేది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరింది. 32 జీబీ ఐఫోన్ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది. రియల్మీ కూడా... స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తన ఉత్పత్తుల ధరను పెంచింది. జీఎస్టీ పెంపు, రూపాయి పతనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త మోడళ్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. 2018 తర్వాత ఇలా ధరలను పెంచడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై తీవ్రంగా పడిందని తెలిపింది. దీంతో సరఫరా కొరతతోపాటు విడిభాగాల ధర అధికమైందని వివరించింది. అటు రూపాయి పతనం కూడా మొబైల్ ధర పెరిగేందుకు కారణమైందని తెలిపింది. జీఎస్టీ పెంపుతో కస్టమర్లపై రూ.15,000 కోట్ల భారం పడుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. -
రియల్ మి 6 ఫస్ట్ సేల్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను రేపటి(మార్చి11, బుధవారం)నుంచి ప్రారంభించనుంది. రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో తొలి సేల్కు అందుబాటులో వుంచినట్టు సంస్థ ప్రకటించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ .750 తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు: 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ .12,999, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999 రియల్ మి 6 ఫీచర్లు 6.5-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ 90 టీ సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 64 +8+2+ ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ Time for a Pro worthy upgrade with #realme6! Get the 64MP #ProCameraProDisplay smartphone in the first sale starting tomorrow at 12 PM on @Flipkart & https://t.co/HrgDJTZcxv. Get flat INR 750 off on ICICI Credit Cards & Credit EMI Transactions on Flipkart.https://t.co/ePGTGUwKKu pic.twitter.com/iw0lNUVb7h — realme (@realmemobiles) March 10, 2020 -
స్టార్ అంబాసిడర్, స్మార్ట్‌ఫోన్ గెల్చుకునే చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన బ్రాండ్లను మరింత ప్రోత్సహించుకునే చర్యల్లోభాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు రియల్మీ బుధవారం వెల్లడించింది. తమస్మార్ట్ఫోన్ల ప్రమోషన్‌కు సల్మాన్‌ఖానే ఉత్తమైన, సరియైన వ్యక్తిగా తాము భావించామని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. ముఖ్యంగా స్టైలిష్‌గా తీసుకొస్తున్న రియల్ మి సిరీస్ రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ప్రమోషన్‌కు సల్మాన్ ఖాన్ ఆమోదించినున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ భాగస్వామ్యం కొత్త మైలురాయిని సూచిస్తుందని, ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో పనిచేయడం ఇదే మొదటిసారని కంపెనీ తెలిపింది. ‘స్టే రియల్’ వైఖరితో మిలీనియల్స్ (యువత) లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.అంతేకాదు రియల్ సల్మాన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రారంభించింది. యూజర్లు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తే...రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చని ట్విటర్లో వెల్లడించింది. 'డేర్ టు లీప్' అనే ట్యాగ్‌లైన్ తనకు బాగా కనెక్ట్ అయిందని బాలీవుడ్ నటుడు, నిర్మాత సల్మాన్ ఖాన్ తెలిపారు. తక్కువ వ్యవధిలో, మెరుగైన ఉత్పత్తులతో నాణ్యమైన బ్రాండ్‌గా నిరూపించకున్న ట్రాక్ రికార్డ్ రియల్మీ సొంతమన్నారు. రియల్‌మి 6 స్మార్ట్ఫోన్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయని తాను విశ్వసిస్తున్నానన్నారు. మిడ్-రేంజ్ ధరల విభాగంలో రియల్‌మి 6 సిరీస్ మార్చి5న లాంచ్ కానుంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, రియల్‌మి 2019 లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. అలాగే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నాల్గవ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా ఏడవ స్థానంలోనూ ఉంది. కాగా ఇటీవల స్మార్ట్ టీవీల రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రియల్మీ, దేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ) (రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్) There's something hidden in this picture. To find it out you only need to connect the dots from 1 to 6 to reveal our favourite number. RT and reply with your screenshots of the answer with #TheGameOfSix for a chance to win a #realme product! Get, set, go! #Contest pic.twitter.com/caYpUmIxGn — realme (@realmemobiles) February 26, 2020 Welcoming @BeingSalmanKhan as the ambassador of @realmemobiles! Now it's time to make it grander! Unveiling 64MP #ProCameraProDisplay with #realme6 & #realme6Pro. Witness the launch live at 12:30 PM, 5th March. Know more: https://t.co/83RpVna6dw pic.twitter.com/V5w53O1Qow — realme (@realmemobiles) February 26, 2020 -
రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్‌మి తాజాగా భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. రియల్‌మి ఎక్స్50 ప్రొ 5జీ పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం సీఈవో మాధవ్ సేఠ్ తెలిపారు. దీని ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది. మెమరీ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి మూడు వేరియంట్లో లభ్యం. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 4జీ, 5జీ టెక్నాలజీపై పనిచేసేలా డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అయితే, దేశీయంగా ఇంకా 5జీ టెక్నాలజీ అమల్లోకే రానందున.. ఈ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండబోదని మార్కెట్ రీసెర్చ్ సంస్థ టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా వ్యాఖ్యానించారు. 2022 నాటికి గానీ భారత్‌లో 5జీ నెట్వర్క్ పూర్తిగా విస్తరించకపోవచ్చని, అప్పటికి ఈ ఫోన్లలోని టెక్నాలజీ పాతబడిపోవచ్చని పేర్కొన్నారు. అప్పటికి వీటి రేట్లు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. 4జీ ఫోన్ల విషయంలో ఇదే జరిగిందని ఫైసల్ చెప్పారు. ధరలు రూ. 37,999 రూ. 39,999 రూ. 44,999 రియల్ మీ ఎక్స్ 50 ప్రొ ఫీచర్లు 6.44 అంగుళాల డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 క్వాల్కం స్నాప్ డ్రాగన్ 865 సాక్ 64 జీబీ/128 జీబీ స్టోరేజ్ 64+12+8+2 ఎంపీ రియల్ 32+8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ -
రియల్‌మి, 5జీ ‘ఎక్స్50 ప్రొ’ వచ్చేస్తోంది
సాక్షి. న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి 5జీ స్మార్ట్ఫోన్ల రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. 5జీస్మార్ట్ఫోన్ల తయారీ సంస్థల మధ్య పోటీ ఊపందుకున్న నేపథ్యంలో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎక్స్50 ప్రొ’ పేరుతో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలో నేడు ( సోమవారం) మధ్నాహ్నం ‘ఎక్స్50 ప్రొ’ లాంచ్ చేయనుందని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. (చదవండి : స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ) కాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 60 +8+ 2 +2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ 8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను అమర్చినట్టు సమాచారం. అలాగే సరికొత్త క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించనుందని అంచనా. డ్యూయల్-మోడ్ 5 జి కనెక్టివిటీ, 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించపోయినప్పటికీ వూక్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ వల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ టీజర్ద్వారా అర్థం చేసుకోవచ్చు. ధర : సుమారు రూ. 50,000 Few hours before the launch of #realmeX50Pro! So guys can you tell us how many 'India First' features are we bringing with the #real5G? RT & reply with the correct number using #realmeX50Pro and stand a chance to win one. Livestream begins at 2:30PM.https://t.co/8pkvjxXwcl — Madhav 5G (@MadhavSheth1) February 24, 2020 -
స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్ టీవీలు క్యూ2 లో (ఏప్రిల్ నెలలో) విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌లో కూడా అవకాశం ఉందన్నారు. రియల్మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : ఎంటర్టైన్మెంట్ కా సూపర్‌స్టార్, బడ్జెట్ ధరలో) మరోవైపు రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకే సంబంధించినదే అని అందరూ ఖాయంగా భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ కాప్షన్‌తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. రియల్మీ టీవీల పూర్తి ఫీచర్లును అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ ఈ స్మార్ట్‌టీవీలలో సౌండ్, పిక్చర్ క్వాలిటీలు అద్భుతంగా ఉండనున్నాయని అంచనా. అయితే రియల్‌మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ What is this? pic.twitter.com/uFQBWYXBtv — Francis Wang (@FrancisRealme) February 21, 2020 -
ఎంటర్టైన్మెంట్ కా సూపర్‌స్టార్, బడ్జెట్ ధరలో
సాక్షి, ముంబై: రియల్‌మి సంస్థ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లాంచ్ చేసింది. రియల్ మి సీ సిరీస్‌లో భాగంగా ఎంటర్టైన్మెంట్ కా సూపర్ స్టార్ పేరుతో రియల్‌మి సీ3ని ఆవిష్కరించింది. 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. రియల్మీసీ 1 సీ2 స్మార్ట్ఫోన్లకు ఇండియాలో మంచి ఆదరణ లభించిందని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. ఈ స్మార్ట్ఫోన్ల 10 మిలియన్ యూనిట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు. రియల్మీ సీ3 ఫీచర్లు 6.5 అంగుళాల హెచ్డి + స్క్రీన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 70 సాక్ 12+2 ఎంపీ రియల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు బేస్ వేరియంట్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ రూ. 6,999 హై ఎండ్ వేరియంట్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ. 7.999. రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల (మధ్యాహ్నం) నుంచి అమ్మకానికి లభ్యం. త్వరలో ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఆఫర్ల విషయానికొస్తే రియల్మే సీ3 కొనుగోలుదారులకు రూ. 7,550 రిలయన్స్ జియో ఆఫర్. Presenting #EntertainmentKaSuperstar #realmeC3 starting at ₹6,999. -MediaTek Helio G70 AI Processor -5000mAh Battery -16.5cm (6.5") mini-drop full screen display -AI Dual Rear Camera 1st sale starts at 12 PM, 14 Feb on @Flipkart & https://t.co/HrgDJTZcxvhttps://t.co/VIVwlwDtaT pic.twitter.com/Pd6mQF0zww — realme (@realmemobiles) February 6, 2020 -
సంక్రాంతి స్పెషల్: రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: మొబైల్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 5ఐని నేడు (జనవరి 9) విడుదల చేసింది. నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ద్వారా జనవరి15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్వేరియింట్ ధరను రూ. రూ.8999 గా నిర్ణయించింది. రియల్‌మి 5ఐ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 12+8+2+ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆర్థిక సేవల్లోకి రియల్మీ
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ స్కోర్ రిపోర్టులు అందించేందుకు ‘రియల్మీ పైసా’ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే ’మి క్రెడిట్’ పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీ సులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్మీ పైసా బీటా యాప్ ద్వారా డిజిటల్ వ్యక్తిగత రుణాలు సుమారు రూ. 1 లక్ష దాకా, చిన్న.. మధ్యతరహా సంస్థలు రూ.5 లక్షల దాకా రుణాలు పొంద వచ్చు. తక్షణ ఉచిత క్రెడిట్ రిపోర్టులు, మూడు నెలల పాటు ఉచిత అప్డేట్స్, పాత.. కొత్త ఫోన్లకు స్క్రీన్ డ్యామేజ్ బీమా సరీ్వసులు ఈ యాప్ ద్వారా రియల్మీ అందించనుంది. 2020లో ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 1,000 కోట్ల దాకా రుణ వితరణ, 30–50 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరువ కావాలనేది తమ లక్ష్యమని రియల్మీ పైసా లీడ్ వరుణ్ శ్రీధర్ తెలిపారు. ‘మూడేళ్లలో బ్రేక్ ఈవెన్ వస్తుందని అంచనా వేస్తు న్నాం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న రియల్మీ పైసా యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు రియల్మీ యాప్‌స్టోర్‌లో లభిస్తుంది. రానున్న 6–12 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని శ్రీధర్ తెలిపారు. -
షావోమికి షాక్, రియల్‌మి కూడా
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్ మేకర్ ఒప్పో రంగం సిద్ధం చేసింది. భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పులిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్ చేసింది. రియల్ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఇ) లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని క్రమంగా ఇతర పట్టణాలకు విస్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించింది. గూగుల్ ప్లే నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రియల్‌మి పేసా వెబ్సైట్ వివరాల ప్రకారం వినియోగదారులు రూ .50 వేల పర్సనల్ లోన్ పొందే అవకాశం కూడా ఉంది. పేసాలోని లెండింగ్‌కార్ట్ ద్వారా సంస్థలు రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి రియల్‌మి పేసా ప్లాట్‌ఫామ్ ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చట. కాగా ఇండియా మార్కెట్లో చిన్న అప్పులు ఇచ్చేందుకు చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ క్రెడిట్ పేరుతో లెండింగ్ సొల్యూషన్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎంఐ పే తర్వాత రెండో పేమెంట్ సొల్యూషన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఎంఐ క్రెడిట్‌ద్వారా రూ. లక్ష దాకా వ్యక్తిగత రుణసదుపాయాన్ని కల్పిస్తోంది. 2023 నాటికి ఇండియాలో ఆన్లైన్ క్రెడిట్ లెండింగ్ మార్కెట్ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎంఐ క్రెడిట్ ద్వారా భారతదేశంలో 19,000 పిన్ కోడ్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రుణాల విభాగంలోకి రియల్మీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాలోని షెన్జెన్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ... డిజిటల్ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ఎంఐ క్రెడిట్ పేరిట డిజిటల్ లెండింగ్లోకి ప్రవేశించడం తెలిసిందే. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 14.3 శాతం వాటా.. గతేడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రియల్మీ ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి 20 దేశాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీకి 14.3 శాతం మార్కెట్ వాటా ఉంది. -
రియల్‌మి ఎక్స్2 ప్రో @ రూ. 29,999
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ ధర రూ. 29,999 వద్ద నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. వీటిలో 64–మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2018–19 ఏడాదిలో ఈ మొత్తం 3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016–17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. -
అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన రియల్ మీ ఖరీదైన ఫోన్ల జాబితాలో అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ నుబుధవారం లాంచ్ చేసింది. ఇంప్పటికే చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్ ఎక్స్ 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇపుడు భారత మార్కెట్లలో కూడా తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్2 ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు దీంతోపాటు రియల్ ఎక్స్ 2 ప్రొ మాస్టర్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. ధరలు ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.29,999 హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.33,999 మాస్టర్ ఎడిషన 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర : రూ.34,999 ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్‌నాటికి అందుబాటులోకి వస్తుంది. రియల్ మి ఎక్స్ 2 ప్రో ఫీచర్లు 6.50 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 1080x2400 పిక్సె ల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 64+13 +8+ 2 ఎంపీ క్వాడ్ రియర్‌కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ దీంతో పాటు రియల్‌మి ఎస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి విక్రయానికి లభ్యం. -
రియల్‌మి తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్
రియల్ మీ సంస్థ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోను మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సెగ్మెంట్లో తన మొట్టమొదటి డివైస్ రియల్ మి ఎక్స్ 2 ప్రొను సంస్థ ప్రకటించింది. చైనా, తదితర మార్కెట్లలో నవంబరు 4 నుంచి ప్రీ ఆర్డర్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుండగా, భారత మార్కెట్లో మాత్రం నవంబరు 20న ఆవిష్కరించనుంది. 8జీబీ ర్యామ్, 123 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యంకానుంది. భారత్‌లో డిసెంబర్ మొదటి వారంలో అమ్మకాలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. రియల్‌మి ఎక్స్ 2 ప్రొ ఫీచర్లు 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ సాక్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 64 +8+13+2 ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ సెల్పీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్, వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజీ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
అదిరిపోయే ఫోటోలకు ‘రియల్‌మి ఎక్స్‌టీ'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తాజాగా ‘ఎక్స్‌టీ’ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదలచేసింది. నూతన సిరీస్‌లో 64 మెగాపిక్సెల్ (ఎంపీ) క్వాడ్–కెమెరా సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించగా, భారత్‌లోనే ఈస్థాయి కెమెరా సామర్థ్యాన్ని కలిగిన స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ కాగా.. 6.4–అంగుళాల పూర్తి హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇందులో స్పెసిఫికేషన్లుగా వివరించింది. మొత్తం మూడు వేరియంట్లలో ఎక్స్‌టీ లభిస్తుండగా.. 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 15,999.. 6జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. -
‘రియల్‌మి 5, 5ప్రో’ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. దేశీ మార్కెట్లో మంగళవారం రెండు అధునాతన స్మోర్ట్ఫోన్లను విడుదలచేసింది. ‘రియల్‌మి 5’ పేరుతో విడుదలైన ఫోన్ ధర రూ.9,999 కాగా.. మొత్తం మూడు వేరియంట్లలో ఇది విడుదలైంది. ఆగస్టు 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్ప్లే, ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా.. వెనుకవైపు 119 డిగ్రీ 8మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 12ఎంపీ మెయిన్ కెమెరా లెన్స్, 2ఎంపీ ఆల్ట్రా మాక్రో లెన్స్, 2 ఎంపీ పోట్రెయిట్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ‘రియల్‌మి 5 పో’ సెప్టెంబరు 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 48ఎంపీ మెయిన్ కెమెరా లెన్స్ ఉన్నాయి. -
బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ
సాక్షి, ముంబై:చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో రియల్‌మి స్మార్ట్ఫోన్లను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియం ధరల్లో రియల్మిఎక్స్ను ఆవిష్కరించగా, బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ అనే స్మార్ట్ఫోన్నుకూడా తీసుకొచ్చింది. . 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధరను రూ.7,999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 9999గా ఉంచింది. జూలై 23నుంచి కొనుగోలుకు లభ్యం. రియల్‌మి 3ఐ ఫీచర్లు 6.20 అంగుళాల డిస్ప్లే మీడియా టెక్ హీలియో పీ 60ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ 3/4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్256 దాకా విస్తరించుకనే అవకాశం 13 ఎంపీ సెల్ఫీకెమెరా 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ