5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు బంపరాఫర్‌ | Realme Offering Big Discount On 5g Smartphone Realme Gt 2 Pro | Sakshi
Sakshi News home page

5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు బంపరాఫర్‌

Published Sat, Oct 15 2022 10:43 AM | Last Updated on Sat, Oct 15 2022 2:38 PM

Realme Offering Big Discount On 5g Smartphone Realme Gt 2 Pro - Sakshi

చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లపై బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ప్రీమియం ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు తెలిపింది. 

రియల్‌మీ అక్టోబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 31వరకు ‘రియల్‌మీ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌’ పేరుతో ప్రత్యేకంగా అమ్మకాలు జరపనుంది. అయితే ఈ సేల్‌ నిర్వహణకు ముందే రియల్‌మీ జీటీ 2 ప్రో ఫోన్‌లపై రూ.5వేల డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. 

8జీబీ ర్యామ్‌ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ.49,999 ఉండగా రూ.44,999కే పొందవచ్చు. ఇక ఐసిఐసిఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలుపై అదనంగా రూ.3వేల డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 16తో ముగియనుంది.

రియల్‌మీ జీటీ 2 ప్రో ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు

రియల్‌మీ సంస్థ 5000ఏఎంహెచ్‌ బ్యాటరీ, 1440*3216 పిక్సెల్స్‌ రెజెల్యూషన్‌తో  6.7 అంగుళాల 2కే ఎల్‌టీపీవో అమోలెడ్‌ డిస్‌ప్లేతో రియల్‌మీ జీటీ 2 ప్రోను తయారు చేసింది. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేటుతో డిస్‌ప్లే, ఫోన్‌ సురక్షితంగా ఉండేలా గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ తో 12జీబీ ర్యామ్‌,256 జీబీ వరకు ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంది.


అంతేకాదు ఈ ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 చిప్‌ సెట్‌, ప్రపంచంలోనే తొలి బయోపాలిమర్ డిజైన్‌తో మార్కెట్‌కు పరిచయం చేసినట్లు రియల్‌మీ ప్రతినిధులు తెలిపారు. 

రియల్‌మీ జీటీ 2 ప్రోలో 3 కెమెరాలతో వస్తుండగా ఫోటోలు తీసేందుకు అనువుగా ఈ ఫోన్‌ వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌, ఓఐఎస్‌ సపోర్ట్‌తో 50 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌,  సెల్ఫీలు దిగేందుకు 2 మెగా పిక్సెల్‌ మ్యాక్రో కెమెరా, 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాలున్నాయి. 

వీటితో పాటు డిస్‌ప్లేలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం  65డబ్ల్యూ సూపర్‌ డార్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ సౌకర్యం ఉంది. రియల్‌మీ యూఐ 3.0 ఆండ్రాయిడ్‌ 12 సపోర్ట్‌తో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై6, బ్లూటూత్‌ 5.2,జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ - సీ పోర్ట్‌ సౌకర్యం ఉంది.  

చదవండి👉 ఐఫోన్‌ కోసం దుబాయ్‌ వెళ్లాడు..కానీ చివరికి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement