Realme C53 Price In India; Check Here Specifications, Features In Telugu - Sakshi
Sakshi News home page

రూ.10వేలే.. 108మెగా ఫిక్సెల్‌ కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌!

Published Wed, Jul 19 2023 5:03 PM | Last Updated on Wed, Jul 19 2023 7:20 PM

Realme C53 Price In India, Specifications, Features - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ రూ.10వేల ధరలో బడ్జెట్‌ ధరలో సీ53 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.9,999 బడ్జెట్‌ ధరలో విడుదలైన ఈ ఫోన్‌ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనక భాగంలో 108 ప్రైమరీ కెమెరాతో రానుంది. 

రియల్‌మీ సీ53 ధర
రియల్‌మీ సీ53 4జీబీ ప్లస్‌ 128 జీబీ, 6జీబీ ప్లస్‌ 64 జీబీ వేరియంట్స్‌ ఫోన్‌లను అందించనుంది. జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు సమయంలో పరిచయ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్‌ పొందవచ్చు. 

రియల్‌మీ సీ 53 ఫీచర్లు 
రియల్‌మీ సీ 53.. 6.74 అంగుళాల 90 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్‌ టూ బాడీ రేషియో 90.3శాతం, 560 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, 108 ఎంపీ ఆల్ట్రా క్లియర్‌ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, ఫోన్‌ ఫ్రంట్‌ సైడ్‌ 720 పీ/30 ఎఫ్‌పీఎస్‌ వీడియో రికార్డింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇస్తుంది. నానోకార్డ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్‌లు ఉన్నాయి. బ్లాక్‌, బ్లూ కలర్‌ వేరియంట్‌లో లభ్యం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement