నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే.. | Every Minute 500 Hours Of Content Been Uploaded | Sakshi
Sakshi News home page

నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే..

Published Sun, Apr 28 2024 8:21 AM | Last Updated on Sun, Apr 28 2024 8:40 AM

Every Minute 500 Hours Of Content Been Uploaded

ఒక నిమిషానికి దాదాపు 500 గంటల కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తున్న యూట్యూబ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

  • ఫిబ్రవరి 14, 2005లో పేపాల్‌లో పనిచేస్తున్న స్టీవ్ చెన్‌, చాడ్ హార్లీ, జావెద్ కరీం యూట్యాబ్‌ను రూపొందించారు.

  • 2005 ఏప్రిల్‌ 23న ‘మీ ఎట్‌ ది జు’ అనే వీడియోను మొదటగా అప్‌లోడ్‌ చేశారు.

  • మే 2005లో యూట్యూబ్‌ బెటా సైట్‌ను ప్రారంభించారు.

  • సెప్టెంబర్‌ 2005లో మొదటగా 1 మిలియన్‌ మంది వీక్షించిన వీడియా ‘నైక్‌’ యాడ్‌.

  • నవంబర్‌ 2005లో మొదటగా 3.5 మిలియన్‌ డాలర్లతో సెకోయా క్యాపిటల్‌ పెట్టుబడి పెట్టింది.

  • మార్చి 2006లో మొదటగా యూట్యూట్‌లో ప్రకటనలు ప్రారంభించారు.

  • జులై 2006 వరకు సగటున రోజూ 100 మిలియన్‌ వీక్షణలు వచ్చాయి.

  • అక్టోబర్‌ 9, 2006లో యూట్యూబ్‌ను 1.65 బిలియన్‌ డాలర్లకు గూగుల్‌ కొనుగోలు చేసింది.

  • యూట్యూబ్‌ వీడియో అప్‌లోడర్లుకు 2007 నుంచి అవార్డులను ప్రకటిస్తోంది.

  • 2008లో యూట్యూబ్‌ సినిమాలు, టీవీ షోలను అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టింది.

  • జనవరి 2010లో మూవీ రెంటల్‌ సర్వీస్‌ను తీసుకొచ్చింది.

  • మార్చి 2010లో ఉచితంగా స్పోర్ట్స్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ను ప్రారంభించింది.

  • మే 2010లో రోజూ సగటున 2 బిలియన్‌ వీక్షణలు వచ్చేవి.

  • 2011లో 3 బిలియన్‌ వీక్షణలకు చేరింది.

  • జనవరి 2012లో రోజూ 4 బిలియన్‌ వ్యూస్‌ వచ్చేవి.

  • 2012లో ప్రతి నిమిషానికి 60 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేంది. ప్రతినెల కొత్తగా 800 మిలియన్ల మంది యూట్యూబ్‌ చూసేవారు.

  • మొదటగా 2012 డిసెంబర్‌ 21న 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చిన వీడియా.. ‘గంగనమ్‌ స్టైల్‌’.

  • మార్చి 2013లో 1 బిలియన్‌ యూజర్ల మార్కును తాకింది.

  • సుసాన్ వోజ్కి ఫిబ్రవరి 2014లో యూట్యూబ్ సీఈఓగా నియమితులయ్యారు.

  • యూట్యూబ్‌ కిడ్స్‌ అని పిలువబడే మొబైల్ యాప్‌ను యూట్యూబ్‌ 2015లో విడుదల చేసింది.

  • 2017 ఫిబ్రవరి నాటికి ప్రతి నిమిషానికి 400 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.

  • ఆగస్టు 2017లో సర్వీస్ ప్లే బటన్‌తో లోగోను రీడిజైన్ చేశారు.

  • ఏప్రిల్ 3, 2018న కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిగాయి.

  • 2019 నాటికి ప్రతి నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.

  • పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్‌ వీడియో వ్యూస్‌ జనవరి, 2022 నాటికి 1400 కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. 2016 జూన్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు.

ఇదీ చదవండి: గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

  • అత్యంత వయసు కలిగిన యూట్యూబర్‌గా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ(107) రికార్డు నెలకొల్పారు.

  • యూట్యూబ్‌లో 70 శాతం ట్రాఫిక్‌ మొబైల్‌ ఫోన్ల ద్వారానే వస్తోంది.

  • 96 శాతం టీనేజర్లు దీన్ని వినియోగిస్తున్నారు.

  • 91 దేశాల్లో ఇది సేవలందిస్తోంది.

  • యూట్యూబ్‌ 80 భాషల్లో సేవలందిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ స్థానిక భాషలో వీడియోలు వీక్షించవచ్చు.
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement