మారుతున్న కాలానికి అనుకూలంగా యూట్యూబ్ కూడా అప్డేట్ అవుతోంది. ఇందులో భాగంగానే కంటెంట్ క్రియేటర్స్ లేదా వినియోగదారుల కోసం తాజాగా నాలుగు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టెక్స్ట్-టు-స్పీచ్
షార్ట్‌లకు టెక్స్ట్-టు-స్పీచ్ వీడియో నేరేషన్ ఫీచర్ ఒకటి. ఇది ఆర్టిఫిషియల్ వాయిస్‌ఓవర్‌ను అందించడానికి ఉపయోగపడుతుంది. టిక్‌టాక్‌లో చూసిన అదే ఫీచర్ ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మొదట టెక్స్ట్ రెడీ చేసుకున్న తరువాత.. స్క్రీన్ ఎగువన ఎడమవైపు మూలలో ఉండే యాడ్ వాయిస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావలసిన వాయిస్‌ని ఎంచుకోగలుగుతారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో కేవలం నాలుగు వాయిస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆటో జనరేటెడ్ క్యాప్షన్
క్యాప్‌కట్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మీరు మీ వీడియోలకు యాడ్ చేసుకోగలిగే ఆటోమేటిక్ క్యాప్షన్‌లను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. యూట్యూబ్ షార్ట్‌లకు ఇప్పటికే ఉన్న మాన్యువల్ టెక్స్ట్ ఓవర్‌లే ఫీచర్ లాగానే, వినియోగదారులు వివిధ ఫాంట్‌లు, రంగులతో క్యాప్షన్‌ల స్టైల్ కస్టమైజ్ చేసుకోవచ్చు.
మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్
యూట్యూబ్ తీసుకువచ్చిన మరో ఫీచర్ మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్. ఇందులో గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్, మైన్ క్రాఫ్ట్ రష్ వంటి మినీ గేమ్ వంటివి ఉన్నాయి.
వర్టికల్ వీడియో ఫార్మాట్
మరింత మంది యూట్యూబ్ క్రియేటర్లను ఆకర్శించమే లక్ష్యంగా వర్టికల్ వీడియో ఫార్మాట్ ఫీచర్ కూడా తీసుకువచ్చింది. ఇది కూడా టిక్‌టాక్‌లో మాదిరిగా ఉంటుంది. మొత్తం మీద మరింత మందిని ఆకర్శించడమే ప్రధానంగా యూట్యూబ్ ఈ ఫీచర్స్ తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment