క్రియేటర్‌లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్‌లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్‌లు ఉపయోగపడతాయి.
వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్‌స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్‌లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.
ఇన్‌స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్‌లైన్స్‌ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.
కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్‌లు, సబ్‌స్క్రైబర్‌లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.
ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్‌లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.
హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్‌లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్‌ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్‌ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు.
గూగుల్ పిక్సెల్ 9ప్రో..
డిస్‌ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.
మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/
256జీబి 16జీబి ర్యామ్/
512 జీబి 16జీబి ర్యామ్
బ్యాటరీ: 4700 ఎంఏహెచ్
ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీ
డిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..
బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా.
కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:
ఆల్ ఫాలో మోడ్
హాఫ్ ఫాలో మోడ్
ఆల్ లాక్ మోడ్
పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్
ఇన్‌స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్‌లోడ్ చేయడానికి...
‘వీడియో డౌన్‌లోడర్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్‌లు ‘రీల్స్’ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ‘ఇన్‌సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.
కొత్త ఇమోజీలు..
మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.
కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్‌లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.
ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్!
Comments
Please login to add a commentAdd a comment