features
-
Tech Talk: యూట్యూబ్‌లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ...ఈజీగా కనిపెట్టేయండిలా..!
-
Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్..
వీలైనన్ని చోట్ల ఏఐ ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది గూగుల్. గూగుల్ జెమిని యాప్స్, మోడల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని..హెల్ప్ మీ రైట్: రాసేటప్పుడు కొన్నిచోట్ల ఏం రాయలో తెలియక స్ట్రక్ అవుతుంటాం. ఇలాంటి సందర్భంలో రచన ముందుకు సాగడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఏఐ టెక్ట్స్‌ను జెనరేట్ చేస్తుంది.ఏఐ వాల్‌పేపర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్: ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు కొత్త వాల్‌పేపర్, బ్యాక్స్గ్రౌండ్స్కు ఉపయోగపడే ఏఐ ఫీచర్ ఇది. ఉదా: ఏ క్యాబిన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఏ పీస్ఫుల్ మెడో.మ్యాజిక్ ఎడిటర్: గూగుల్ ఫొటోస్‌లోని మ్యాజిక్ ఎడిటర్ ఇప్పుడు క్రోమ్ బుక్‌లో కూడా అందుబాటులో ఉంది. చిత్రంలోని వ్యక్తులు, వస్తువులను మూవ్ చేయడానికి, పూర్తిగా తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: Jasleen Royal: ఒకే సమయంలో.. ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసి.. వావ్! -
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్‌కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్‌ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్‌గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్‌చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్‌స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్‌కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్‌లైక్ ఇమేజ్‌లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్‌గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్‌లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్‌ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్‌లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్‌లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్‌యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్‌ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్‌ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్‌తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
క్రెడిట్ కార్డులు ఎన్ని రకాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారతదేశంలో చాలా బ్యాంకులు (ప్రభుత్వ & ప్రైవేట్) తమ కస్టమర్లకు కేవలం డెబిట్ కార్డులు మాత్రమే కాకుండా.. క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెగ్యులర్ క్రెడిట్ కార్డులు రెగ్యులర్ క్రెడిట్ కార్డులనేవి రివార్డ్ పాయింట్స్, ఫ్యూయెల్ సర్ఛార్జ్ మినహాయింపుల వంటి అదనపు సౌకర్యాలను అందిస్తాయి. జీవిత భాగస్వామి, పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులతో పంచుకోవడానికి మూడు ఫ్రీ యాడ్-ఆన్ కార్డ్‌లను కూడా పొందవచ్చు. ఇవి అన్ని విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లు ఈ కార్డ్‌లు మీకు ఫ్యాన్సీ లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్, గోల్ఫ్ ఫ్రీ రౌండ్లు, రివార్డ్‌లు, పెద్ద రెస్టారెంట్లలో కూల్ డిస్కౌంట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారికి ఇలాంటి కార్డులు ఉపయోగపడతాయి. కో-బ్రాండెడ్ కార్డ్‌లు కో-బ్రాండెడ్ కార్డ్‌లు కొన్ని రకాల అంశాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విమాన టికెట్లు, ప్రయాణాల మీద కొన్ని డిస్కౌంట్స్, స్పెషల్ చెక్-ఇన్ కౌంటర్స్, ఎక్స్ట్రా లగేజీ అలవెన్స్, లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఈ కార్డుల ద్వారా పొందవచ్చు. కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు మీ అవసరాల కోసం ఖర్చు చేసే సమయంలో కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు, కొనుగోళ్ల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. మీ చెల్లింపులను సైతం సులభంగా ట్రాక్ చేయవచ్చు. వీటిలో అదనపు ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్‌లు ప్రీపెయిడ్ కార్డలనేవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. లిమిటెడ్ క్రెడిట్‌తో లభించే ఈ కార్డులు మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు, వారు ఎంత ఖర్చు చేయాలో దీని ద్వారా నిర్దారించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి కంపెనీలు కూడా ఇలాంటి కార్డులను ఉపయోగిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య.. ప్రీమియం క్రెడిట్ కార్డులు ఎక్కువ డబ్బు సంపాదించి, ఎక్కువ పనుల కోసం కారు పొందాలనుకునే వినియోగదారులు ఇలాంటి ప్రీమియం క్రెడిట్ కార్డులను పొందవచ్చు. మెరుగైన రివార్డ్స్, అదనపు ప్రయోజనాల కోసం కూడా ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువలేనివారు కూడా ఇలాంటి కార్డులను పొందవచ్చు. అయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తామని బ్యాంకుకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సదరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేసిన డబ్బు క్రెడిట్ కార్డుకు కొలేటరల్‌గా పనిచేస్తుంది. -
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వాట్సప్ ఛానెల్స్, సింగిల్ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సప్ అకౌంట్లను వినియోగించే మల్టీ- అకౌంట్ ఫీచర్‌పై ప్రకటన చేసింది. తాజాగా, ‘వ్యూ వన్స్’ తరహాలో వాయిస్ నోట్స్‌పై మరో అప్డేట్తో ముందుకు వచ్చింది. వీ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్ల భద్రత కోసం వాయిస్ నోట్స్ అనే ఫీచర్‌పై వాట్సప్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాయిస్ రికార్డ్‌లు ఫోన్లలో స్టోరేజ్ అవ్వకుండా నిరోధిస్తుంది. ఉదాహరణకు ఏ అనే వాట్సప్ యూజర్ బీ అనే మరో వాట్సప్ యూజర్‌కు ఓ ఆడియో ఫైల్స్‌ని పంపిస్తాడు. సాధారణంగా అలాంటి వాయిస్ ఫైల్స్ ఫోన్లలో స్టోరేజ్ అవడంతో పాటు అనేక భద్రతా సమస్యలు తలెత్తేవి. అయితే, దీన్ని అధిగమించేలా వాయిస్ నోట్స్ పేరుతో వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో వాట్సప్‌లో పంపిన, లేదంటే రిసీవ్ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలా.. వాటంతట అవే కనుమరుగు కానున్నాయి. \ వ్యూ వన్స్ తరహాలో మీకు వాట్సప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి. మళ్లీ కనిపించవు. అదే తరహాలో వాయిస్ నోట్స్ ఫీచర్ రాబోతుంది. -
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు .. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్‌తో పాటు ఇతర ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా? వాట్సాప్ త్వరలో సీక్రెట్ కోడ్ ఫీచర్, సెర్చ్ ఫీచర్ ఫర్ అప్డేట్ ట్యాబ్, పిన్న్డ్ మెసేజెస్,రీడైజన్చాట్, ఐపీ ప్రైవసీ ఫీచర్లపై పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో సీక్రెట్ కోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగిలిన ఫీచర్లు అప్డేట్ కానున్నాయి. వాట్సాప్ అప్డేట్లను అందిచే వీబీటా ఇన్ఫో తాజాగా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లోని ఐదు ఫీచర్ల వివరాల్ని వెలుగులోకి తెచ్చింది. సీక్రెట్ కోడ్ ఫీచర్ ఫోన్లో మెయిన్ పాస్వర్డ్ ఎలా ఉందో.. ఇప్పుడు వాట్సాప్‌లోని చాట్లకు పిన్, బయోమెట్రిక్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. తద్వారా, ఫోన్లో మీరు చేసిన పర్సనల్ చాటింగ్, ఫోటోలు, వీడియోలు ఇతరులు చూసే వీలుండదు. అంతేకాదు, మీరు లాక్ చేసిన ఆ చాటింగ్ సమాచారం అంతా సపరేట్ సెక్షన్లో కనిపించనుంది. ఒకవేళ అగంతకులు ఆ చాట్‌ను ఓపెన్ చేసి చూడాలంటే మీరు ఎంటర్ చేసిన పిన్ లేదంటే బయో మెట్రిక్ అథంటికేషన్ ఇవాల్సి ఉంటుంది. సెర్చ్ ఫీచర్ ఈ ఫీచర్ ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో మీరు ఫాలో అయ్యే వాట్సాప్ ఛానెల్స్, వెరిఫైడ్ చానెల్స్‌లో ఎవరెవరు ఏం స్టేటస్ పెట్టారో సెర్చ్ బటన్ ఫీచర్లో పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. పిన్న్డ్ మెసేజెస్ పిన్న్డ్ మెసేజెస్ ఈ ఫీచర్‌తో సాయంతో ముఖ్యమైన మెసేజ్‌లను చాట్ కన్వర్షన్లో మీకు కనపడేలా పిన్ చేయొచ్చు. రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ ఈ రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ అప్డేట్తో వాట్సాప్ ఫ్రెష్‌లుక్‌తో కనిపించనుంది. వాట్సాప్‌లో వీడియో, కంటెంట్, ఆడియో ఫైల్స్ షేరింగ్ చేసే విధానం మారనుంది. ఐపీ అడ్రస్‌ను కనిపెట్టలేరు అగంతకులు మీ వాట్సాప్ ఐపీ అడ్రస్ ఏంటనేది కనిపెట్టలేరు. యూజర్ల సాధారణంగా ఐపీ అడ్రస్‌తో వాట్సాప్‌లో మనం చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇతర వివరాల్ని సేకరించవచ్చు. అయితే తాజాగా అప్డేట్తో ఐపీ అడ్రస్ గుర్తించలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్‌ను అప్డేట్ చేయనుంది. -
మరిన్ని ఫీచర్లతో వందే భారత్ రైళ్లు.. కొత్తగా ఏమేం ఉన్నాయంటే..?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్‌బ్యాక్‌లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏమేం మార్పులంటే.. ► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. ► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్‌తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్‌లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. ► వందే భారత్ రైళ్లలో కోచ్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్‌తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్‌టైట్ ప్యానల్స్‌లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్‌ను లోకో పైలట్‌కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్‌లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్‌లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు -
ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్‌తో 'జెల్లీ స్టార్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్లో పారదర్శక డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్ఈడీ నోటిఫికేషన్ లైట్‌ను ఇచ్చింది కంపెనీ. ఫోన్ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి. ధర, లభ్యత ఈ బుల్లి స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో కంపెనీ విడుదల చేసింది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను హాంకాంగ్‌లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్పెసిఫికేషన్లు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్‌తో 3 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 48 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా 2000mAH బ్యాటరీ -
ఐఫోన్ 15 ప్రో మాక్స్ కొత్త ఫీచర్స్...
-
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
వందే భారత్ రైలు ప్రత్యేకతలు
-
Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. అదేంటో తెలుసా?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ చాట్‌లోని వ్యక్తిగత ఫోటోలు, వీడియాలు,చాట్లను వేరే వాళ్లు చూడకుండా లాక్ వేయొచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్లు ఒకసారి ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ సాయంతో లాక్ చాట్ ఆప్షన్ వినియోగిస్తే సదరు చాట్‌ను వేరే వాళ్లు చూడడం, లేదంటే చోరి చేసే వీలుండదు. అంతేకాదు లాక్ చాట్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు సైతం ఫోన్ గ్యాలరీలు సేవ్ కావు. ఒకవేళ ఎవరైనా మీ అనుమతి లేకుండా ఫోన్ తీసుకుని పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ లేకుండా లాక్ చాట్ తెరవడానికి ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తం డిలీట్ చేయాలని కోరుతుంది. అలా ఇతరులు వాట్సాప్ చాట్‌ను చూడకుండా లాక్ చాట్ అదనపు ప్రొటెక్షన్ లేయర్‌గా పనిచేస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ది దశలోనే ఉండగా..దీన్ని అధికారికంగా యూజర్లకు ఎప్పుడు అందిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. -
లగ్జరీ ఫీచర్లతో ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: బుకింగ్స్ షురూ!
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్‌బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2.0లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్‌తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్‌లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు. -
హమ్మయ్యా.. డాక్టర్లు ప్రిస్కిప్షన్‌లో ఏం రాశారో ఇట్టే తెలుసుకోవచ్చు!
మీరెప్పుడైనా డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ (మందుల చీటి) తీక్షణంగా చూశారా? చూస్తే మీకేమైనా అర్థం అయిందా? అర్థం కాదు. ఎందుకంటే డాక్టర్లు రాసిన మందుల చీటీపై ఉన్న రాత గీతల మాదిగానూ, ఏదో వేరే బాషలా ఉంటుంది. అది కేవలం డాక్టర్లకు, మందుల షాపుల్లోని ఫార్మాసిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. అయితే ఆ సమస్యను పరిష్కరించేలా గూగుల్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ భారత్‌లో ‘గూగుల్ ఫర్ ఇండియా -2022’ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను డిజిటలైజ్ చేయడం, మల్టీ సెర్చ్ ఫంక్షనాలిటీ అంటే యూజర్లు ఫోటోలు, స్క్రీన్షాట్లను తీసుకోవడంతో పాటు వారికి తలెత్తిన అనుమానాల్ని ప్రశ్నల్ని సంధించడం కోసం టెక్ట్స్‌ను జోడించేందుకు అనుమతి ఇస్తుంది. సెర్చ్ ఇన్ వీడియో ఫోన్లలో సెర్చ్ యాప్ ద్వారా వీడియోలకోసం సెర్చ్ చేసేలా 'సెర్చ్ ఇన్ వీడియో' ఫీచర్‌ను ఈవెంట్లో గూగుల్ ప్రదర్శించింది. అదే సమయంలో, ఆండ్రాయిడ్‌లోని ఫైల్స్ బై గూగుల్ యాప్ ద్వారా డిజిలాకర్ డాక్యుమెంట్లను సురక్షితంగా యాక్సెస్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. ప్రిస్క్రిప్షన్‌తో గూగుల్ ఏం చేస్తోంది? గూగుల్ సంస్థ చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్లను చదవగలిగే ఏఐ,మెషిన్ లెర్నింగ్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్లు చదవడం చాలా కష్టం. అందుకే డాక్టర్లు చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్ డిజిటలైజ్ చేయనున్నట్లు పేర్కొంది. అంటే డాక్టర్లు చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్‌ను యూజర్లు గూగుల్‌లో అప్లోడ్ చేసి.. ఆ మందుల చీటీల్లో డాక్టర్ ఏం రాశారు? ఏ మందులు రాశారా? ఏ కారణం వల్ల అనారోగ్య సమస్య తలెత్తిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీ వినియోగ వచ్చిన అందించిన ఫలితాల ఆధారంగా ఫీచర్‌ను పరిచయం చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని కంపెనీ తెలిపింది. కాగా, ఆ ఫీచర్‌ను ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు చెప్పింది. స్థానిక భాషల్లో సమాచారం గూగుల్‌లో సెర్చ్ చేసే సౌకర్యాన్ని స్థానిక భాషల్లో సైతం అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా గూగుల్‌లో వాయిస్ ద్వారా ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండాలి. కానీ ఇకపై స్థానిక భాష తెలుగు, తమిళం,కన్నడ వాయిస్‌లతో కావాల్సిన సమాచారం పొందవచ్చు. మల్టీ సెర్చ్ మల్టీ సెర్చ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో మీకు ఏదైనా ప్రొడక్ట్ సమాచారం కావాలంటే సులభంగా తెలుసుకోవచ్చు. మీరు స్నేహితులు, లేదంటే చుట్టాలింటికి వెళ్లినప్పుడు అక్కడ మీకు నచ్చిన కర్టెన్లు , కార్పెట్లు, లేదంటే డ్రస్‌లు ఉంటే వాటిని ఫోటోలు తీసి గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకు..డ్రస్ ఫోటో తీసుకొని ‘గూగుల్ లెన్స్’ అనే ఫీచర్లో ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి. పక్కనే డ్రస్ అని సెర్చ్ చేస్తే.. ఆ కలర్ డ్రస్‌తో ఉన్న దుస్తులు, అవి అమ్మే ఈకామర్స్ సైట్ల జాబితా మొత్తం కనిపిస్తుంది. -
ఆ టీవీలను ఎగబడి కొంటున్న జనం.. సేల్స్‌లో దుమ్మురేపుతోంది!
భారత్‌లో స్మార్ట్ టీవీ అమ్మకాలు జోరందుకుంది. ఓటీటీ పుణ్యమా అని ఈ విభాగం టీవీలను మాత్రం వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో ఈ ఏడాడి ఏకంగా రెండంకెల వృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 38% పెరిగినట్లు వెల్లడించింది. ఇంట్లో కూర్చుని పెద్ద స్క్రీన్లలో ఓటీటీ (OTT) యాప్‌ల ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను చూసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. OTT యాప్స్ స్మార్ట్ టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీలకు సేల్స్ పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో మొత్తం టీవీ విభాగంలో 93 శాతం వాటా స్మార్ట్ టీవీలదే కావడం వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇంకా చాలా మంది CRT (కాథోడ్-రే ట్యూబ్) టీవీలను ఉపయోగిస్తున్నారు. వీటితో పోలిస్తే ప్రయోజనాల ఎక్కువగా స్మార్ట్ టీవీలో ఉండడంతో ఇటీవల ప్రజలు వాటికి అప్‌గ్రేడ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు రూ.20 వేల లోపు ఫీచర్లుతో కూడిని స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎప్పుడూ ప్రీమియం రేంజ్లో ఉండే గూగుల్ టీవీ ఇప్పుడిప్పుడే రూ.25,000 లోపు ధర విభాగంలోకి ప్రవేశించిందని, వచ్చే ఏడాది ఇంకా అది రూ.20 వేల లోపు సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అన్షికా జైన్ వెల్లడించారు. చదవండి కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్ -
ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉబర్ క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రైవర్ ఫోన్ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్ లొకేషన్ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. -
భారత్‌లోకి అడుగుపెడుతున్న బీఎండబ్ల్యూ సూపర్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
దేశంలో బైక్‌ల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకంగా యువతలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా పలు రకాల మోడల్స్ బైకులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా యువతను ఆకట్టుకునేలా ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ తన సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేయనుంది. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ ( BMW S 1000 RR) పేరుతో ఈ బైకును డిసెంబర్ 10న భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2023 BMW S 1000 RR ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. అయితే ఈ ఏడాది భారత్‌లోకి రానున్న ఈ మోడల్ బైక్ అప్డేటెడ్ ఇంజిన్‌తో పాటు మునుపటి కంటే లేటెస్ట్ టెక్నాలజీతో రాబోతోంది. ఈ బైక్.. మునుపటి వాటికంటే మెరుగ్గా! బీఎండబ్ల్యూ ఫ్లాగ్షిప్ బైక్‌ల కంటే కొన్ని ముఖ్యమైన మార్పులతో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. అత్యంత సమగ్రంగా సవరించిన ఛాసెస్ను కలిగి ఉండటం ఈ సూపర్ బైక్ ప్రాధాన్యత. లేటెస్ట్ ఇంజిన్, సస్పెన్షన్ కంట్రెల్, ఛాసిస్, ఏరోడైనమిక్స్, డిజైన్ వంటి అప్డేట్లతో వస్తోంది. ఇది 999 సీసీ ఇన్లైన్ఫోర్ మోటార్ శక్తితో నడుస్తుంది. ఆరు గేర్లుండే ఈ బైక్ 13,750 ఆర్పీఎంతో మాగ్జిమమ్ పవర్ 206.5 బీహెచ్పీకి చేరుతుంది. ఈ బైక్ స్లయిడ్ కంట్రోల్‌ని కలిగి ఉంది. ఇందులో కొత్త డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC)తో వస్తుంది. దీని ఇంజిన్ స్పీడ్ పరిధి మునుపటి కంటే ఇప్పుడు విస్తృతంగా ఉంది. ఇది మోటార్‌ను 14,600 rpm వరకు పుష్ చేయడంలో సహాయపడుతుంది. ఈ బైక్ వీల్‌బేస్ 1,441 mm నుంచి 1,457 mm వరకు పెరిగింది. ఇందులో కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ బైక్‌ను కంపెనీ డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా సేల్స్ జరపనున్నారు. దీని ధర ₹20-25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండచ్చని అంచనా. బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, స్టైల్ ప్యాషన్ రెడ్ నాన్-మెటాలిక్, లైట్ వైట్ నాన్-మెటాలిక్ రంగుల్లో ఈ స్పోర్ట్స్ బైక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
AP: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్‌ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్‌ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉత్పత్తులకు రంగులు సీఎం యాప్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్‌పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నాణ్యతను ట్రాక్ చేయవచ్చు... కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్‌గా 2 లేదా 3 బ్యాగ్‌లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్‌తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం. ఫార్మర్ ఆప్షన్‌తో ధరల వివరాలు సీఎం యాప్‌లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్‌ని అప్‌గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు సీఎం యాప్‌లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్‌లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. -
గ్రాండ్ లాంచ్‌కు రెడీగా రియల్మీ 10 సిరీస్.. ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో గ్రాండ్ లాంచ్క్ రెడీగా ఉంది. కంపెనీ రియల్మీ 10 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌పై పుకార్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. రాబోయే లైనప్‌లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్‌లు ఉన్నాయి. కంపెనీ రియల్మీ సిరీస్ డిజైన్, పెర్ఫార్మెన్స్, పనితీరును ట్విటర్ ద్వారా రివీల్ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది. ఫీచర్ల అంచనా.. Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ►4GB RAM, 128GB స్టోరేజ్ ►స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్ AMOLED FHD+ డిస్ప్లే ► అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ►స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సపోర్ట్ చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్? -
గూగుల్ మీట్లో అదిరిపోయే ఫీచర్లు
గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. గూగుల్ మీట్ ఫీచర్లో ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండగా.. ఇకపై గూగుల్ మీట్ కాల్స్ సంభాషణలు టెక్ట్స్ రూపంలో కనిపించనున్నాయి. అవసరం అయితే ఆటెక్ట్స్ను గూగుల్ డాక్ ఫార్మాట్లోనూ సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు కేవలం గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ప్రైజ్ స్టార్టర్, ఎంటర్ప్రైజ్ స్డాండర్డ్, ఎంటర్ప్రైజ్ ప్లస్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్‌గ్రేడ్ కస్టమర్లకు అందించనుంది. దశల వారీగా సాధారణ యూజర్లు సైతం వినియోగించేలా అందుబాటులోకి తీసుకొని రానుంది. కాగా ఈ ఫీచర్ అక్టోబర్ 24 నుంచి ఎనేబుల్ కానుంది. -
బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా!
ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బజాజ్ త్వరలో దేశీయ మార్కెట్లోకి సీటీ 125 ఎక్స్(CT125X) పేరుతో కొత్త బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఉన్న CT110X కమ్యూటర్ బైక్ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. సీటీ 110ఎక్స్ తరహాలో రూపొందించిన ఈ బైక్ ఫీచర్ జాబితాను అప్డేట్ చేయడంతో పాటు బైక్ ఎక్స్టీరియర్ని కూడా కొత్త రంగులతో నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది బజాబ్. ప్రత్యేకతలు(అంచనా) ఇందులో.. టైల్లైట్ , టర్న్ ఇండికేటర్ల కోసం హాలోజన్ బల్బులు ఉన్నాయి. ట్యాంక్ గ్రిప్ ప్యాడ్లు, సీట్ కవర్, లగేజ్ క్యారియర్, అండర్ బెల్లీ ప్రొటెక్టర్ ప్లేట్ వంటివి ఫీచర్లు సాధారణ బైక్‌కు కాస్త భిన్నంగా దీన్ని నిలబెడుతుంది. ఇది కొత్త 125 సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేకత ఏంటంటే సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. దీంతో మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు ఉండగా బజాజ్ సీటీ 125ఎక్స్ ధర దీనిపై అదనంగా 10 నుంచి 15 వేలు మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
సైలెంట్‌గా సైడ్ అయిపోవచ్చు, వాట్సాప్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు రానుంది. అంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్‌లోనే జతకూడనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. యూజర్ మరో యూజర్‌కు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫొటోను, వీడియోను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా కొత్త ఫీచర్ కొద్ది రోజుల్లో రానుంది. చదవండి👉ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
బ‘కిల్స్’! సేఫ్టీ ఫీచర్స్ లేని వాహనాల దందా!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై జరిగే కారు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఆయా కంపెనీలు అనునిత్యం అధ్యయనాలు చేస్తున్నాయి. వీళ్లు ప్రవేశపెట్టిన సేఫ్టీ ఫీచర్స్‌కు ‘విరుగుడు’ తయారు చేసే వాళ్లూ ఎక్కువైపోతున్నాయి. కారు ప్రమాదాల తీవ్రత, మృతులను తగ్గించడానికి ఉపకరించే సీట్ బెల్డ్ అలారం ఆపే బకెల్స్ సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కార్ డెకార్స్ దుకాణాలతో పాటు ఆన్లైన్లో వీటిని విక్రయించేస్తున్నారు. ఫలితంగా సీట్ బెల్ట్ స్ఫూర్తి దెబ్బతింటోందని, భద్రతా చర్యలన్నీ వాహనచోదకుల కోసమే అన్నది గుర్తుపెట్టుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణదాత సీట్‌బెల్ట్.. కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా.. హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్లు కచ్చితంగా సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ప్రస్తుతం కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కచ్చితంగా సీటుబెల్ట్ ధరించేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని మిగిలిన వారికీ విస్తరించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ఇలాగే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు సీటుబెల్ట్ ప్రాణదాతగా నిలిచింది. అలారం వచ్చేలా టెక్నాలజీ.. ఇంతటి కీలకమైన సీట్‌బెల్ట్ కచ్చితంగా వాడేలా చేయడానికి కార్ల తయారీ కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తొలినాళ్లలో కేవలం డ్రైవర్, ఇప్పుడు అతడితో పాటు ముందు సీట్లో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దీన్ని ధరించకపోతే అలారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి అనేక మంది వాహనచోదకులు సీట్‌బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. ఇటీవల దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీన్ని సీట్‌బెల్ట్ బకెల్ స్లాట్‌లో ఉంచేస్తే చాలు... కనీసం వెనుక నుంచీ బెల్ట్ పెట్టుకోనక్కర్లేదు. ఈ బకెల్స్ను కార్ డెకార్స్ దుకాణాలు వివిధ రకాలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. ఆన్లైన్లో ఏ కంపెనీ కారు వినియోగిస్తుంటే ఆ కంపెనీ లోగోతో అమ్మే వర్తకులు పట్టుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరిగిందని అధికారులే చెబుతున్నారు. వీటి ద్వారా అలారం మోగకుండా ఆపవచ్చు కానీ ప్రమాదం జరగకుండా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సీట్‌బెల్ట్ అనేది వాహన చోదకుడి ప్రాణాలు రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ బకెల్స్ వినియోగంపై చర్యలకు యోచిస్తున్నామని చెబుతున్నారు. (చదవండి: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆహా! అనిపించే ఫీచర్లు..
మహీంద్రా ఆటోమొబైల్స్ దశ దిశను మార్చి వేసిన మోడళ్లలో స్కార్పియో ఒకటి. రెండు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ మహీంద్రా క్రేజ్ ఇంచైనా తగ్గలేదు. స్కార్పియో తర్వాత అనేక ఎస్‌యూవీలు మార్కెట్‌కి పోటెత్తినా స్కార్పియో మార్కెట్ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ స్కార్పియో కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నారు. వీరందరి కోసం స్కార్పియోకి అదనపు హంగులు జోడించి ఎన్ సిరీస్‌లో రిలీజ్ చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా రెడీ అయ్యింది. ఫీచర్లు - పాపులర్ ఎస్యూవీ మహీంద్రా స్పార్పియో ఎన్ మోడల్లో అన్ని వేరియంట్లు 4X4 వీల్ డ్రైవ్‌లో వస్తున్నాయి. దీంతో ఇవి ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌లో కూడా దుమ్ము రేపనున్నాయి - స్కార్పియో ఎన్లో కూడా మహీంద్రా కొత్త లోగోనే ఉంటుంది. ఎక్స్‌యూవీ ఓఓ7 తర్వాత కొత్త లోగోతో వస్తున్న మోడల్ స్కార్పియో ఎన్ - స్పోర్టీ లుక్ కోసం డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టన్ లైటింగ్ ఇచ్చారు - డైనమిక్ టర్న్ ఇండికేటర్ వ్యవస్థను పొందు పరిచారు - డ్యాష్‌బోర్డు మధ్యలో ఇన్ఫోంటైన్మెంట్లో భాగంగా లార్జ్ టచ్ స్క్రీన్ - డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే - మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ - సన్‌రూఫ్ - ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చదవండి: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
ఇటలీ బెనెల్లి సపోర్ట్.. ఇండియాలో ఎలక్ట్రిక్ సైకిల్.. ధర ఎంతంటే?
కొచ్చి: ఈ–మొబిలిటీ స్టార్టప్ వాన్ ఎలక్ట్రిక్ మోటో.. అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైస్కిల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర అర్బన్‌స్పోర్ట్ రూ.59,999, అర్బన్‌స్పోర్ట్ ప్రో రూ.69,999 ఉంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. పెడల్ అసిస్టెడ్ రేంజ్ 60 కిలోమీటర్లు. బైసికిల్ అభివృద్ధిలో ఇటలీ బ్రాండ్ బెనెల్లి సహకారం తీసుకున్నారు. విడదీయడానికి వీలున్న 2.5 కిలోల 7.5 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, కాంపాక్ట్ 6061 అల్యూమినియం యూనిసెక్స్ ఫ్రేమ్స్, డిస్క్ బ్రేక్స్, 7 స్పీడ్ గేర్ సిస్టమ్, 250 వాట్స్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్, స్మార్ట్ ఎల్సీడీ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. చదవండి: హట్‌కేకుల్లా అమ్ముడైన కోటి కార్లు..! దిగ్గజ కంపెనీలకు భారీ షాక్..! -
కొనుగోలు దారులకు ఓలా ఎలక్ట్రిక్ భారీ షాక్..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ వెహికల్స్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కొనుగోలు దారులు ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఓలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు ఎన్నోరోజుల నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఓలా గత డిసెంబర్ నెలలో స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. అయితే తాజాగా ఓలా డెలివరీ చేసిన ఎస్1,ఫీచర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్రూయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్, నేవిగేషన్ అసిస్ట్, హైపర్ మోడ్'లలో సాఫ్ట్వేర్ లోపాలతో స్కూటర్ పని తీరు కొనుగోలు దారులు ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే స్పందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాఫ్ట్వేర్లను మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య కాలంలో అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు. “క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, నావిగేషన్ వంటి ఫీచర్లు వచ్చే కొద్ది నెలల్లో జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి”అని వరుణ్ దూబే అన్నారు. అంతేకాదు సాంకేతిక లోపం తలెత్తిన ఫీచర్ల సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయడంతో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అంటే ఈ ఆరు నెలల పాటు ఈ ఫీచర్లు లేకుండానే వినియోగదారులు తమ స్కూటర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? -
డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే!
దూరంలో ఉన్న ఆబ్జెక్ట్లను ఫోన్లో బంధించడం అంటే మీకిష్టమా? జూమ్ చేస్తే ఫోటోల క్లారిటీ మిస్సవుతుందా? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీసేందుకు డీఎస్ఎల్ఆర్ కెమెరాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కెమెరాతో పని లేకుండా చేతిలో ఉండే ఫోన్లతో దూరంలో ఉన్న వ్యక్తుల్ని, వస్తువుల్ని హై క్వాలిటీతో ఫోటోలు తీయొచ్చు. ఎలా అంటారా?! ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.ఈ ఏడాదిలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ విడుదల తరువాత ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడళ్లను యూజర్లకు పరిచయం చేయనుంది. అయితే ఈ ఫోన్ రేర్ కెమెరా సిస్టమ్‌లో పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నాయి. ఈ ఫీచర్ సాయంతో ఇప్పుడున్న ఐఫోన్13, ఐఫోన్14 సిరీస్ ఫోన్ల కంటే ఐఫోన్15 ఫోన్ కెమెరాతో మన కంటికి కనిపించే రేణువుల్ని సైతం హైక్వాలిటీలో జూమ్ చేసి మరి వీక్షించవచ్చు. అనలిస్ట్ జెఫ్ పీయూ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రోలో ఉన్న ఓ మూడు కెమెరాలలోని ఓ కెమెరాను పెరిస్కోప్ లెన్స్‌ను యాపిల్ అమర్చనున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ కంటే మెరుగ్గా..ఐఫోన్ 15 ప్రో కెమెరాను 10ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చని అన్నారు. కొత్తేం కాదు ఐఫోన్ 15ప్రోలో అందుబాటులోకి తెచ్చే ఈ పెరిస్కోప్ లెన్స్ కొత్త ఫీచర్లేం కాదు. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా, హువావే పీ40 ప్రో ప్లస్ ఫోన్లలో రేర్ కెమెరాలో ఈ పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమరాల సాయంతో జర్నీలో లేదంటే, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఈ పెరిస్కోప్ లెన్స్‌లోని ఫోక్స్(వెలుతురు) యాంగిల్ మిర్రర్ మీదిగా ప్రతిభింభించి మనం చూడాలనుకున్న టార్గెట్ మీద పడుతుంది. దీంతో చికటి కాస్తా వెలుతురు వెదజల్లుతుంది. అంతేకాదు జూమ్ చేసేందుకు, ఏదైనా ఫోటో బ్లెర్గా ఉన్న మనకు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. రెండేళ్ల నుంచి ప్రచారం.. యాపిల్ ఐఫోన్లలో పెరిస్కోప్ ఫీచర్‌ను అదిగో అప్పుడు తెస్తుందని, ఇదిగో ఇప్పుడే తెస్తుందంటూ టెక్ మార్కెట్లో గత రెండేళ్ల నుంచి ప్రచారం కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రాలేదు. ఇదే అంశంపై ప్రఖ్యాత విశ్లేషకుడు మింగ్-చి కువో మాట్లాడుతూ..పెరిస్కోప్ కెమెరా ఐఫోన్ 14 ప్రోలో ఉంటుందని, కానీ తాజాగా చిప్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఐఫోన్ 15ప్రో ఈ పెరిస్కోప్ కెమెరాతో మార్కెట్లో విడుదలవుతుందని అన్నారు. ఐఫోన్ 13 ప్రో మోడల్‌లలో సాధారణ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సర్వ సాధారణం. అయితే అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాలను మార్కెట్లోకి విడదల చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోటోలు, వీడియోలు తీసేందుకు డీఎస్ఎల్ఆర్ కెమెరాల అవసరం ఉండదని, ఫోన్‌తోనే దూరంగా ఉన్నా సరే ఫోటోల్ని అందంగా తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..? -
స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో!
న్యూ ఇయర్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో న్యూఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. తాగాజా స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 'వన్ ప్లస్ 10ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా..ఆఫోన్కు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. అంతేకాదు కొత్త ఏడాదిలో ఎప్పుడు మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు వన్ ప్లస్ ప్రతినిధులు. OnePlus 10 Pro from all angles launching on January 11, 2022 in China.#OnePlus #Oppo pic.twitter.com/FFFWq97ZQ9 — Abhishek Yadav (@yabhishekhd) December 30, 2021 అఫీషియల్‌గా చైనా సోషల్ మీడియా 'వైబో' కథనం ప్రకారం.. వన్‌ప్లస్ అఫీషియల్‌గా జనవరి 11,2022న చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అక్కడ విడుదల చేసిన తరువాత వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనుంది. 'వన్ ప్లస్ 10ప్రో' స్పెసిఫికేషన్లు చైనాలో విడుదలైన వన్ ప్లస్ 10ప్రో వీడియో ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్ 50ఎంపీ మెయిర్ రేర్ కెమెరా 6.7 కర్వుడ్ ఎల్టీపీఓ 2.0 అమోలెడ్ డిస్ప్లే 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు -
వాట్సాప్ కొత్త ఫీచర్లు, ఫేస్ రికగ్నైజేషన్‌తో లాక్ వేయొచ్చు..!
వాట్సాప్ రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వాట్సాప్ అప్డేట్ చేసిన ఈ ఫీచర్లు బాగున్నాయని, యూజర్ల భద్రత పరంగా ఇప్పటి వరకు విడుదలైన ఫీచర్ల కంటే కొత్తగా అప్డేట్ చేసిన ఫీచర్ల ఉపయోగం ఎంతో ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్లను విడుదల చేసింది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో ఫ్లాష్ కాల్స్ ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఇన్ స్టాల్ సమయంలో జరిగే ప్రాసెస్‌లో ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ తప్పని సరి చేసింది. అంతేకాదు కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం, ఎవరితో ఏం షేర్ చేయాలనే దానిని కంట్రోల్ చేయడం, అవసరమైన వాట్సాప్ మెసేజ్‌లను సీక్రెట్‌గా స్టోర్ చేయడం, టచ్ ఐడి లేదా ఫేస్ ఐడితో యాప్‌ను లాక్ చేయడం వంటి సెక్యూరిటీ సౌకర్యాలు కొత్తగా తెచ్చిన ఫీచర్లలలో ఉన్నాయని వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అంతే కాదు ఈ ఫ్లాష్ కాల్ ఫీచర్ లో యూజర్లు కొత్త ఫోన్లో వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసే సమయంలో ఎస్ఎంస్ వెరిఫికేషన్, ఆటోమేటెడ్ కాల్ ద్వారా ఫోన్ నంబర్‌ను యాక్సెప్ట్ చేసే ఆప్షన్ కోసం ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరో మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్ యూజర్ల ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన యూజర్లు ఎవరు, చూసిన వారిలో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని నియంత్రించవచ్చు. అవసరం అనుకుంటే బ్లాక్ చేయొచ్చు. అంతేకాదు సెక్యూరిటీ దృష్ట్యా రెండు సార్లు వెరిఫికేషన్ కూడా చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. మొత్తం వాట్సాప్ చాట్కోసం ప్రైవసీ సెట్టింగ్‌ను తెచ్చింది. -
సుజుకీ అవెనిస్ 125 స్కూటర్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త అవెనిస్ 125 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ. 86,700. రేస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 87,000. డిసెంబర్ మూడవ వారం నుంచి మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్, భారత ఇంజనీరింగ్ బృందాలు యువ కస్టమర్లు లక్ష్యంగా స్పోర్టీ డిజైన్‌తో స్కూటర్‌ను రూపొందించారు. -
'ఫోటో' తెచ్చిన చిక్కులు..ఫేస్బుక్ పై మరో బాంబు..!
Phhhoto Filed an Antitrust Suit Against Meta: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (మెటా)కు భారీ షాక్ తగిలింది. ఫేస్‌బుక్‌పై ఫోటో యాప్ సంస్థ 'ఫోటో'(Phhhoto) కోర్ట్‌ను ఆశ్రయించింది. తమ యాప్‌కు చెందిన క్లోనింగ్ ఫీచర్ ను కాపీ కొట్టి ఫేస్బుక్..ఇన్ స్ట్రాగ్రామ్లో వినియోగిస్తుందంటూ కోర్ట్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమకు ఫేస్బుక్ అధినేత మార్క్‌జుకర్ బర్గ్ నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో వరుస పరిణామాల నేపథ్యంలో తాజాగా ఫోటో యాప్ సైతం కోర్ట్‌లో ఫిర్యాదు చేయడం..ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ పరిస్థితి 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' అయ్యిందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో యాప్ ఫోటో యాప్ యూజర్లు ఒకే పాయింట్-అండ్-షూట్ బరస్ట్‌లో ఐదు ఫ్రేమ్‌లను క్యాప్చర్ చేయడానికి, చిన్న జిఫ్ వంటి వీడియోల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తన ఫీచర్‌ను ఫేస్బుక్ కాపీకొట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన 'బూమ్రాంగ్' ఫీచర్లో వినియోగిస్తుందని అమెరికన్ డిస్ట్రిక్ కోర్ట్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వినియోగిస్తున్న ఫీచర్ ఎంత పాపులర్ అయ్యిందో మాకు బాగా తెలుసు. కానీ ఈ ఫీచర్ ఆలోచన ఫేస్‌బుక్‌ది కాదు. ఫేస్బుక్..ఫోటో ఫీచర్‌ను కాపీ చేసి బూమ్ రాంగ్ గా ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్లకు అందించింది. అదే సమయంలో దివెర్జ్ కథనం ప్రకారం..ఇన్‌స్ట్రాగ్రామ్ ఏపీఐ నుంచి ఫోటోని ఫేస్బుక్ బ్లాక్ చేసిందని కంపెనీ ఆరోపిస్తుంది. ఫేస్బుక్ ఎవరిని ఎదగనీయదు ఫేస్బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ కారణంగా తన సంస్థ బిజినెస్ పరంగా భారీగా దెబ్బతిన్నదని, పెట్టుబడులు పెట్టే అవకాశాల్ని నాశనం చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. ఫేస్‌బుక్‌కు పోటీగా వస్తున్న ఏ సోషల్ మీడియా నెట్ వర్క్‌లను ఎదగనీయదని, ఫేస్బుక్ తీరు వల్లే ఫోటో నష్టపోయిందని ఫోటో ప్రతినిధులు కోర్ట్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017లో షట్ డౌన్ ఫోటో యాప్ 2014లో ప్రారంభమైంది. కానీ యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు 2017లో షట్‌డౌన్ చేశారు. అయితే ఈ ఫోటో యాప్ ప్రారంభంలో నెలవారి యూజర్లు 3.7 మిలియన్ల మంది వినియోగించుకున్నారని, వారిలో బియాన్స్, జో జోనాస్, క్రిస్సీ టీజెన్, బెల్లా హడిద్ లు ఉన్నట్లు తెలిపారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఇన్స్టాగ్రామ్ మాజీ సీఈవో కెవిన్ సిస్ట్రోమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి దాని ఫీచర్లను పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఫోటో సంస్థ ప్రతినిధులు ఫేస్బుక్ పై ఫిర్యాదు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఫోటో అర్ధం లేని ఆరోపణలు చేస్తుందని, కోర్ట్‌లో వేసిన పిటిషన్ పై న్యాయమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: జుకర్ బర్గ్‌పై మరో పిడుగు..! ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..! -
Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో
టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లే హీరోలు వ్యానిటీ కార్లు ఉపయోగిస్తుంటారు. అచ్చం ఇంటిలాగే బెడ్, డైనింగ్, కిచెన్, బాత్రూమ్ ఇలా సకల సౌకర్యాలు ఆ వ్యానిటీ వెహికల్లో ఉంటాయి. సినిమా హీరోల తరహాలో ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్లకే కాదు ఇప్పుడు అడ్వెంచరిస్టులు, క్యాంపర్లతో పాటు ఈ తరహా వాహనాలపై ఆసక్తి ఉన్న సామాన్యులకు వ్యానిటీ వెహికల్‌ను అందుబాటులోకి తెస్తోంది టయోటా. సెమా షోలో పూర్తి ఆఫ్‌రోడ్ వెహికల్‌గా టయోటా సంస్థ టోకోజిల్లాను రూపొందించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సెమా షో 2021లో ఈ ట్రక్‌ను టయోటా ప్రదర్శించింది. త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. కదిలే ఇళ్లు టయోటా టోకోజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించడమే కాదు ఇంటిగా మార్చుకుని బతికేందుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కిచెన్ అందులో స్టవ్, సింక్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ వంటివి ఉన్నాయి. బాత్రూమ్ కమ్ టాయిలెట్, టీవీ, డైనింగ్ ఏరియా, రెండు సోఫాలు, ఇద్దరు వ్యక్తులు పడుకునేందుకు వీలుగా స్లీపింగ్ ఏరియాతో పాటు సన్‌రూఫ్ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ ట్రక్కులో లివింగ్ ఏరియా 1.83 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేశారు. క్యాంపింగ్‌కి అనుకూలం టయోటా నుంచి 70, 80వ దశకాల్లో వచ్చిన ట్రక్ మోడల్లను అనుసరించి పూర్తి రెట్రో స్టైల్లో టాకోజిల్లాను తయారు చేశారు. క్యాంపింగ్ని ఇష్టపడే వారికి ఈ ట్రక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టయోటా అంటోంది. వచ్చే ఏడాదిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించి టయోటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంజన్ సామర్థ్యం 3.5 లీటర్ వీ6 ఇంజన్‌తో 6 మాన్యువల్ గేర్ షిప్ట్ పద్దతి 4 వీల్ డ్రైవ్ మోడ్‌లో ఈ కారుని డిజైన్ చేశారు. ఈ కారు ఇంజన్ 278 హెచ్పీతో 6,000 ఆర్పీఎమ్ ఇవ్వగలదు. -
షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'షావోమీ' మరో సిరీస్ 'షావోమీ 12' స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. త్వరలోనే విడుదల కానున్న ఈఫోన్ ఫీచర్లు ప్రస్తుతం చైనాలో లీకయ్యాయి. లీకైన వివరాల ఆధారంగా ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 870 ఫ్లాట్ ఫాం ఆధారంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోన్ సిరీస్‌లు ఏమై ఉంటాయనే విషయంపై షావోమీ అధికారికంగా ప్రకటించకపోయినా.. మార్కెట్ పండితులు అభిప్రాయం ప్రకారం..లీకైన స్నాప్ డ్రాగన్ 870 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రెండు ఫోన్లలో ఒకటి రెడ్ మీ, మరొకటి షావోమీ అని తెలుస్తోంది. షావోమీ, రెడ్మీ ఫీచర్లు షావోమీ విడుదల చేసే కొన్ని వెర్షన్ లు హై ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. దీన్ని బట్టి లీకైన ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 870, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నిక్‌లలో 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నాయి. కెమెరాల విషయానికొస్తే 108 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెన్సార్, హార్మోన్ కార్డాన్ స్పీకర్లు, ఎక్స్ -యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ ఉంటుందని భావిస్తున్నారు.మరోవైపు, రెడ్మి వెర్షన్లో స్నాప్‌డ్రాగన్ 870 చిప్, 6.6 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. -
ఫోర్స్ గూర్ఖా... ప్రత్యేకతలు ఇవే
ఆఫ్‌రోడ్ రైడింగ్‌లో స్పెషల్ వెహికల్‌గా ఫోర్స్ సంస్థ నుంచి వస్తున్న గూర్ఖా సెప్టెంబరు 27 నుంచి బుకింగ్స్ మొదలతువున్నాయి. మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న గూర్ఖా ఫీచర్లు ఇలా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది రెడ్, గ్రీన్, వైట్ , ఆరెంజ్, గ్రే రంగుల్లో లభిస్తుంది చదవండి : టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ‘హువావే’ అంటారు. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్, సైడ్–టచ్ ఫీచర్లుకు సంబంధించిన మోడల్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది హువావే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డింగ్ ఫోన్‌ని ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్‌తో రూపొందించారు. ఈ నేపథ్యంలో ‘హువావే’ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్ ద్వారా ఎక్స్ట్రాస్క్రీన్ కలిసొస్తుంది. రకరకాల ఐకాన్ల కోసం, సింగిల్ లైన్ మెసేజ్‌లు చదువుకోవడం కోసం ఉపయోగపడుతుంది. -
స్టైలిష్ లుక్‌తో హోండా సీబీ 200 ఎక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా కొత్త సీబీ200ఎక్స్ అడ్వెంచరర్–టూరర్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. గురుగ్రాం ఎక్స్‌షోరూంలో ధర రూ.1.44 లక్షలు. వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటుంది. 17 హెచ్‌పీ పవర్, 16 ఎన్ ఎం టార్క్‌తో 184 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్ఈడీ లైటింగ్, పూర్తి స్థాయి డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, డ్యూయల్ పర్పస్ టైర్స్, యూఎస్డీ ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్ మౌంటెడ్ కీ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : కంటి చూపుతో కాదు కత్తితో.. -
Ola Electric Scooter:వచ్చేసిందోచ్... ఓలా.. ఆసక్తికరమైన ఫీచర్లు ఇవే
హైదరాబాద్: నెల రోజులుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ధర గురుంచి నేడు తెలిసిపోయింది. పెట్రోలు ధరల బాదుడు నుంచి ఉపశమనం కలిగించే ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయం వెల్లడైంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. S1, S1 Pro ప్రొ పేరుతో ఓలా రెండు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్ ఈవెంట్లో ఈ వివరాలు వెల్లడించారు. . ఔరా అనిపిస్తున్న ఓలా - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది. - S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. - ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం చేయగలదని పేర్కొంది. - స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. - ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు. - ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది. - ఓలా స్కూటర్ 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది. - ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. - లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. కోటి స్కూటర్ల తయారీ - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్లైన్లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే. - 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది. - తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి. - స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్లో ఉన్నాయి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
MAHINDRA XUV700: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఇంటిలిజెన్స్..
Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. సాటిలేని ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తు్న ఆకారుగా మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోంటైన్మెంట్లో ఇంటీరియర్‌లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, , స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర కీ ఫీచర్లు - జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. - డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. - 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. - ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. - హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. You've heard about it You've talked about it, You've seen it in disguise. It’s the most awaited SUV It is the XUV700 driven by AdrenoX. Watch its debut using this link https://t.co/2yS6hOBboX on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm — MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021 -
పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు!
ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ పై కన్నేసింది. ముఖ్యంగా మొబైల్ వెర్షన్లో చిన్నపిల్లలు గేమ్స్ ఆడే విధంగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఫేస్ బుక్ ఎగ్జిక్యూటీవ్ మైక్ వెర్దును గేమ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ ఫీచర్ పై మైక్ వెర్దు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నాటికి కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు వీడియో గేమ్ ను ఆడేస్తున్నారు ప్రపంచ దేశాల్లో వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ఊపందుకుంది. మార్కెట్ పరిశోధన సంస్థ 'స్టాటిస్టా' రిపోర్ట్ లో 2012 నుంచి 2021 నాటికి వీడియో గేమింగ్ వినియోగం భారీగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. 2012లో 52.8 శాతంతో ప్రారంభమై 2021 నాటికి 138.4కి పెరిగింది. ముఖ్యంగా కరోనా క్రైసిస్‌లో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. -
లీకైన ఐఫోన్ 13 ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఐఫోన్ 13 కు సంబంధించి పలు ఫీచర్లు ఆన్లైన్లో లీకైయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 13లో పెద్ద వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్‌ను అమర్చారు. దీంతో ఛార్జింగ్ కాయిల్ వేడేక్కె అవకాశం తక్కువగా ఉండనుంది. ఐఫోన్ 13 మోడళ్లలో పోర్ట్రెయిట్ మోడ్ వీడియో ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరిస్తోందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో..ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. భవిష్యత్తులో ఐఫోన్ 12 మోడళ్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రియల్ మీ నుంచి రెండు స్మార్ట్ వాచెస్, సేల్స్ ప్రారంభం
లాస్ ఎంజెంల్స్ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ ఆన్ లైన్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా రియల్ మీ సంస్థ రియల్ మీ వాచ్ 2, రియల్ మీ వాచ్ 2 ప్రో స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. దీంతో పాటు రియల్ మీ జిటి 5 జి స్మార్ట్‌ఫోన్, రియల్మీ ప్యాడ్, రియల్ మీ బుక్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ వాచ్ 2 ప్రైస్, ఫీచర్స్ రియల్మే వాచ్ 2 స్మార్ట్ ఫోన్ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, ఫుల్ ఛార్జింగ్ పెడితే 12 రోజుల వినియోగించుకునేలా బ్యాటరి వస్తుంది. ఇది IP68 (ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కోడ్) డస్ట్ మరియు వాటర్-రెసిస్టెంట్ కోటింగ్ తో మరియు 90 స్పోర్ట్స్ మోడ్లతో లభ్యమవుతుంది. అంతేకాదు బ్లడ్, ఆక్సిజన్ మరియు హార్ట్ బీట్ రేట్ ను కౌంట్ చేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్ ఫీచర్లను కలిగి ఉంది.దీని ధర 54.99 యూరోలు (సుమారు 4,889) తో కొనుగోలు చేయోచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ వాచ్ 2 ప్రో ప్రైస్ 'స్మార్ట్' రియల్ మీ వాచ్ 2ప్రో 1.75 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ వాచ్ 2 మాదిరిగానే రియల్మీ వాచ్ 2 ప్రో ఐపి 68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ తో వస్తుంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్లు, 100 కి పైగా వాచ్ ఫేస్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్, మాగ్నెటిక్ ఛార్జింగ్ బేస్ ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ వాచ్ 2 ప్రో ధర 74.99 యూరోలకే (రూ. 6,889 సుమారు.) సొంతం చేసుకోవచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ రియల్ మీ చెందిన రియల్ మీ టెక్ లైఫ్ రోబో వాక్యూమ్ విడుదలైంది. స్మార్ట్ మ్యాపింగ్, నావిగేషన్ సిస్టమ్‌కు సహాయపడే లిడార్ సెన్సార్లతో సహా 38 ఇంటర్నల్ సెన్సార్లతో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌కు లిడార్ సెన్సార్ ఖచ్చితమైన రియల్ టైమ్ నావిగేషన్ మరియు ఖచ్చితమైన ఇన్-యాప్ రూమ్ మ్యాపింగ్ చేస్తుందని రియల్ మీ ప్రతినిథులు తెలిపారు. ఇక దాని పనితీరుకు సంబంధించి రియల్మీ టెక్లైఫ్ రోబోట్ సౌండ్ మోడ్‌లో శబ్దం స్థాయిలను 55dB కంటే తక్కువగా ఉంచుతుంది. 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 600 ఎంఎల్ డస్ట్ బిన్, 300 ఎంఎల్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. ఇది వాక్యూమ్ ఒకేసారి నేలని శుభ్రపరుస్తుంది మరియు తుడుచుకుంటుందని రియల్ మీ ప్రతినిధులు విడుదల సందర్భంగా చెప్పారు. చదవండి: Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! -
Hyundai Alcazar : ఆరు వేరియంట్లు... 8 రంగుల్లో..
హైదరాబాద్: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సెగ్మెంట్లో హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఆల్కజార్ మోడల్‌పై ఆటో వరల్డ్‌లో ఆసక్తి నెలకొంది. జూన్ 18న మార్కెట్లోకి రానున్న ఆల్కజార్ మోడల్‌కి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన బ్రోచర్లో కారుకు సంబంధించిన కీలక అప్డేట్స్ తెలిశాయి. 6 వేరియంట్లు హ్యుందాయ్ ఆల్కజార్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తోంది. అవి ప్రెస్టీజ్ (ఎంటీ) , ప్రెజ్టీజ్ (ఓ) ఏటీ, ప్లాటినమ్ (ఎంటీ), ప్లాటినమ్ (ఓ) ఏటీ, సిగ్నేచర్ (ఎంటీ), సిగ్నేచర్ (ఓ) ఏటీలుగా ఉన్నాయి. ఇందులో ప్రెస్టీజ్ ఎంటీ వేరియంట్ ఆరు సీట్లు, ఏడు సీట్ల లే అవుట్‌తో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 6 సీట్ల వేరియంట్లో పెట్రోల్ వెర్షన్లో లభిస్తున్న ఏకైక మోడల్‌గా ప్రెస్టీజ్ ఓ వేరియంట్ నిలిచింది. కలర్ ఆప్షన్స్ హ్యుందాయ్ ఆల్కజార్ కలర్ ఆప్షన్స్‌కి సంబంధించి సింగల్ టోన్‌లో టైఫూన్ సిల్వర్, టైగాబ్రౌన్, పోలార్వైట్, టైటాన్ గ్రే, ప్లాటినమ్ బ్లాక్, స్టేరీ నైట్ మొత్తం ఆరు కలర్లు ఉండగా డ్యూయల్టోన్లో పోలార్ వైట్ ప్లాటినమ్ బ్లాక్, టైటాన్ గ్రే ఫాంటమ్ బ్లాక్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు 7 సీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో అనేక నూతన ఫీచర్లు ఆల్కజార్లో అందుబాటో ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచ్ మల్టీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ వ్యూ మానిటర్, వెనుక వరుసలో కూర్చున్న వారికి వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ బేస్డ్ సన్‌రూఫ్, కంఫర్ట్, ఏకో, స్పోర్ట్ డ్రైవింగ్మోడ్లతో పాటు ట్రాక్షన్ మోడ్ (మడ్, స్నో, శాండ్) తదితర ఆధునాత ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్‌లెస్ కార్! -
iOS 15 వచ్చేది ఈ మోడళ్లకే
వెబ్‌డెస్క్: ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో అనేక అప్డేట్స్ వెల్లడయ్యాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆపిల్ ప్లాట్ఫార్మ్పై రాబోతున్న కొత్త ఫీచర్లు డెవలపర్స్ వెల్లడించారు. 6ఎస్ ఆపై మోడళ్లకే ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 15కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆపిల్ 6ఎస్ ఆ తర్వాత రిలీజైన మోడళ్లకు ఐఓఎస్ 15 అప్డేట్ని అందివ్వనుంది. అంతకు ముందు ఉన్న మోడళ్లకు ఈ కొత్త ఓఎస్ లేనట్టే. పెద్దతెరతో వచ్చిన ఆపిల్ 7, ఆపిల్ 8, ఆపిల్ ఎక్స్, ఆపిల్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఈ, ఐఫోన్ 12 సిరీస్‌లో వచ్చిన మోడళ్లకు కొత్త ఐఓఎస్ అప్డేట్ రానుంది. అయితే ఐఓఎస్ 15 ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా తెలియలేదు. న్యూ ఫీచర్స్ ఫేస్‌టైం పేరుతో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేలా వీడియో కాల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న అప్లికేషన్లో వాయిస్ క్యాన్సిలేషన్ మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెసేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా ప్రభావంతంగా ఉండేలా డెవలపర్స్ కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. ఫోటోలు, వీడియోలు తదితర స్టఫ్‌ని మేసేజ్ చేయడం మరింత సులువు కానుంది. వీటితో పాటు నోటిఫికేషన్స్, కాంటాక్ట్ ఫోటో, ఫోటో ఎడిటింగ్, డీఎన్డీ వంటి అంశాల్లోనూ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. -
నయా ట్రెండ్: కారు అలా కొనేస్తున్నారట!
సాక్షి,న్యూఢిల్లీ: కారు కొనే ముందు షోరూంకి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తాం. వీలైతే వాహనాన్ని నడుపుతాం. ఇదంతా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. షోరూంకి వెళ్లకుండానే కారు ఎలా ఉందో 3డీలో చూస్తున్నారు. 2020లో ఇలా 3డీని ఆసరాగా చేసుకుని కార్లను 76 లక్షల మంది భారతీయులు వీక్షించారని ఎక్సెంట్రిక్ ఇంజన్ తెలిపింది. 2019తో పోలిస్తే సంఖ్య పరంగా 300 శాతం వృద్ధి నమోదైందని చెబుతోంది. కరోన మూలంగా ఆఫ్‌లైన్ మార్కెటింగ్, షోరూంలలో ప్రమోషన్ కార్యక్రమాలకు అడ్డుకట్ట పడింది. దీంతో కార్ల ఎంపికకై కస్టమర్లు సాంకేతికత, ఆవిష్కరణ దన్నుగా ఉన్న ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారు. ఎక్సెంట్రిక్ ఇంజన్ వన్ 3డీ ప్లాట్‌ఫాం ద్వారా కార్లను 3డీ రూపంలో ఆన్లైన్లో వీక్షించవచ్చు. మారుతి సుజుకి, ఎంజీ, రెనో నిస్సాన్ మిత్సుబిషి తదితర సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే) ఆరు నగరాల నుంచే.. ఆన్లైన్లో కార్ల ఫీచర్లను వీక్షిస్తున్నవారిలో 51 శాతం మంది ఢిల్లీ, ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఉంటున్నారని ఎక్సెంట్రిక్ ఇంజన్ వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారని వివరించింది. 2018–20 కాలంలో తృతీయ శ్రేణి నగరాల వాటా 9 శాతంగా ఉంది. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్, ఇంఫాల్ వీటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఆన్లైన్ వీడియోలతో పోలిస్తే నాలుగింతలు ఎక్కువగా 3డీ విధానంలో వీక్షిస్తున్నారని ఎక్సెంట్రిక్ ఇంజన్ కో–ఫౌండర్ వరుణ్ షా తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకోవాలంటే తయారీ కంపెనీలకు 3డీ విధానం తప్పనిసరి అయిందని అన్నారు. (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు) చూసిన కారునే కొంటున్నారు.. కొనే ముందు 3డీలో చూస్తున్నారు తాము కొనబోయే కారును 70 శాతం మంది మొబైల్ ద్వారా, 25 శాతం మంది డెస్క్‌టాప్ ద్వారా వీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నారు. అత్యధికులు బుధవారం నాడు సర్చ్ చేస్తున్నారు. బ్లూ, వైట్ రంగులు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి. 40 శాతం మంది ఈ రంగులను ఎంచుకున్నారు. గ్రే, బ్రౌన్, సిల్వర్ కలర్స్‌ను 35 శాతం, రెడ్, బ్లాక్, ఆరేంజ్ను 15 శాతం మంది ఇష్టపడ్డారు. ఆన్లైన్లో చూసిన కారునే కొన్నవారు 91 శాతం మంది ఉండడం గమనార్హం. విదేశాల్లో ఉన్న భారతీయులు తమ వారి కోసం ఆన్లైన్లో చూసి కొనుగోలు చేస్తున్నారు. 2020లో వీక్షకుల్లో 4.6 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వీరిలో 31 శాతం ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్య 32, యూరప్ 10, యూకే 5, ఆస్ట్రేలియా 4, ఆఫ్రికా నుంచి 2 శాతం ఉన్నారు. చదవండి : దిగి వస్తున్న బంగారం ధరలు -
టీవీలన్నింటిల్లో ఇది స్పెషల్ టీవీ.. కింద నుంచి పైకి
ఇప్పటివరకూ చాలా టీవీలను చూసుంటారు.. మరి ఇలాంటిది.. అబ్బే చాన్సే లేదు.. ఫొటోలు చూస్తున్నారుగా.. అలా బటన్ నొక్కగానే.. అండర్‌గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది పైకి వస్తుంది.. నెమ్మదిగా అది ఐదు 4కే మైక్రో ఎల్ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ మీ హాల్లో ఠీవిగా ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ తయారుచేసిన ఈ టీవీ పేరు ఎం1. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్ టీవీ. హాల్లో అలా ఫ్లోర్‌లోంచి టీవీ పైకి రావడం వంటివి చూసి.. మీ ఇంటికి వచ్చినోళ్లు నోరెళ్లబెట్టడం ఖాయమని ‘సీ సీడ్’ కంపెనీ చెబుతోంది. పైగా.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే.. ఈ మైక్రో ఎల్ఈడీల్లో క్లారిటీ అదిరిపోవడం ఖాయమంటోంది. ఇంతకీ రేటెంతో చెప్పలేదు.. రూ.2.91 కోట్లే!!.. టీవీ కొనకముందే.. నోరెళ్లబెట్టేశారా.. ఇది జస్ట్ టీవీ రేటే.. ఆ అండర్‌గ్రౌండ్ సెట్టింగ్.. వాటన్నిటికీ అయ్యే ఇన్స్టలేషన్ చార్జీలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ చెబుతోంది.. ఓసారి ట్రై చేస్తారా ఏమిటి?? -
2021 వాట్సాప్ లో వచ్చే కొత్త ఫీచర్స్ ఇవే!
ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే వాట్సాప్ ఎప్పుడు వరుసగా అనేక అప్డేట్లు తీసుకొస్తూ కస్టమర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు చాట్ వాల్ పేపర్స్, మ్యూట్ ఆల్వేస్, గ్రూప్ వీడియో కాల్స్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది 2021లో కూడా ఇలాంటి సరికొత్త ఫీచర్స్ తీసుకురావాలని వాట్సాప్ భావిస్తుంది. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందామా..(చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన టాప్-10 ఫీచర్స్) వాట్సాప్ టర్మ్స్ & ప్రైవసీ పాలసీ వాట్సాప్ యూజర్లు వచ్చే ఏడాదిలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఒకవేల ఎవరైతే ఈ నిబంధనలను అంగీకరించారో వారు వాట్సాప్ ఖాతాని తొలిగించనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలను 2021 ఫిబ్రవరి 8 నుండి తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ భద్రత విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల్లో వినియోగదారుల డేటాని ఏ విదంగా ఉపయోగిస్తారో తెలియాజేయనున్నట్లు పేర్కొన్నారు. డెస్క్‌టాప్ లో ఆడియో, వీడియో కాల్స్ ప్రస్తుతం మొబైల్ వాట్సాప్ వినియోగదారులు వినియోగిస్తున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్ లను వచ్చే ఏడాదిలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు పేర్కొంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. వాయిస్ కాలింగ్, వీడియో కాల్ ఫీచర్ లు డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మిగతా అందరికి లభించనున్నట్లు పేర్కొంది. ఈ కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక పాప్ అప్ వస్తుంది అని సంస్థ పేర్కొంది. పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ వాట్సాప్ తన ఐఓఎస్ వినియోగదారుల కోసం పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ని వచ్చే ఏడాదిలో తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్ లో భాగంగా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం మల్టీపుల్ ఐటమ్స్ ని ఎంచుకొని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి టాప్ చేసి తర్వాత ‘కాపీ’ చేయాలి. ఇప్పుడు ఆ ఐటమ్స్ ని మీకు నచ్చిన వారికే ఒకేసారి పంపించవచ్చు. -
వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ తన వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామరో సరికొత్త ఫీచర్ ని పరిచయం చేయబోతుంది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో త్వరలో వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ విషయాన్నీ వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ లో ప్రకటించింది. వాట్సాప్ బ్లాగ్ వాబీట ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కొంతమంది వాట్సాప్ వెబ్ వెర్షన్ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బీటా వెర్షన్ కావడంతో కొద్దీ మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మిగతా వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులందరికి తీసుకురానున్నట్లు పేర్కొంది.(చదవండి: 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ) మొబైల్ లో మాదిరిగానే వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లో ఉంటుందని చూపించే కొన్ని స్క్రీన్షాట్లను తన అధికారిక బ్లాగ్ లో షేర్ చేసింది. మీకు వాట్సాప్ వెబ్ నుండి ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రత్యేక విండో పాపప్ వస్తుందని తెలుస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు. మీరు ఎవరకైన కాల్ చేసినప్పుడు ఒక చిన్న పాపప్ వస్తుందని తెలిపింది. మీరు కాల్ చేసిన ప్రతి సారి వీడియో కాల్ల మాదిరిగానే వీడియో ఆఫ్, మ్యూట్ వాయిస్, రిజెక్ట్ బటన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం మీ వాట్సాప్ మొబైల్ వెర్షన్లో మాత్రమే వాయిస్ లేదా వీడియో కాల్ ఫీచర్ ఉంది. ఏదైనా కాల్ కోసం మనకు ఇంటర్నెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం, వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ లో 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. -
ఐఫోన్ 12- 12 మినీ.. ఏది బెటర్?
ముంబై, సాక్షి: యాపిల్ తయారీ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ దేశీయంగా రూ. 10,000 ధరల తేడాతో లభిస్తున్నాయి. ఐఫోన్ 12 రూ. 79,900 నుంచి ప్రారంభంకాగా.. 12 మినీ రూ. 69,900 ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ప్రధానంగా డిస్ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం ప్రస్తావించవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇతర అంశాలు చూద్దాం.. 5.4 అంగుళాలు ఐఫోన్ 12.. డిస్ప్లే 6.1 అంగుళాలుకాగా.. 12 మినీ 5.4 అంగుళాల తెరను కలిగి ఉంది. పూర్తి హెచ్డీ, సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో లభిస్తోంది. ఫ్రంట్ కెమెరా నాచ్, ఫేస్ ఐడీ సెన్సార్లను సైతం కలిగి ఉంది. 12 మినీ పరిమాణం తక్కువకావడంతో ఒంటి చేత్తో ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది. అయితే ఐఫోన్ 5 Sతో పోలిస్తే పరిమాణంలో పెద్దదనే చెప్పాలి. కేవలం 135 గ్రాముల బరువుతో సౌకర్యంగా కూడా ఉంటుంది. 7.4 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండటంతో సులభంగా వినియోగించవచ్చు. గ్లాసీ బ్యాక్ కావడంతో చేతివేళ్ల మార్క్‌లకు ఆస్కారం తక్కువే. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే పెద్ద స్క్రీన్‌పై టైపింగ్‌కు అలవాటుపడిన వారికి కొంతమేర అసౌకర్యంగా అనిపించవచ్చు. చదవండి: (ప్లూటన్‌తో విండోస్ పీసీ హ్యాకర్లకు చెక్) 12తో పోలిస్తే 12 మినీ చిన్న స్క్రిన్‌ను కలిగి ఉన్నప్పటికీ ఐఫోన్ 12 స్థాయిలో బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. హెచ్డీఆర్ కంటెంట్ విషయంలో 625 నుంచి 1200 నిట్స్వరకూ బ్రైట్నెస్ను ప్రతిబింబిస్తుంటుంది. వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు స్టీరియో స్పీకర్ కారణంగా ఆడియో సైతం స్పష్టంగా బిగ్గరగా వస్తుంది. 12 మినీలోనూ 5 ఎన్ఎం ఆధారిత A14 బయోనిక్ చిప్‌నే వినియోగించారు. 4 జీబీ ర్యామ్, ఐవోఎస్ 14 ద్వారా అత్యుత్తమ యూజర్ ఎక్స్పీరియన్స్ పొందే వీలుంది. 64 GB అంతర్గత మెమొరీతో రూపొందింది. ఇక గేములు ఆడేటప్పుడు ఐఫోన్ 12తో పోలిస్తే 12 మినీ స్వల్పంగా వేడెక్కుతోంది. పరిమాణంరీత్యా ఇది ప్రస్తావించదగ్గ అంశంకాదు. ఇదేవిధంగా 12 మినీ 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుందని యాపిల్ చెబుతోంది. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే గేములు, వీడియో స్ట్రీమింగ్ విషయంలో బ్యాటరీ చార్జింగ్ తొందరగా కోల్పోయే అవకాశముంది. సగటు వినియోగదారునికి ఇది సమస్యకాకపోవచ్చు. ఫాస్ట్ చార్జర్ ఐఫోన్ 12 మినీ 18W చార్జర్‌తో గంటలోనే చార్జింగ్ పూర్తవుతుంది. కొత్త మాగ్‌సేఫ్ చార్జర్ సపోర్ట్ చేసినప్పటికీ 12W చార్జింగ్ సామర్థ్యానికే పరిమితం. ఐఫోన్ 12లో అయితే 15W చార్జింగ్కు వీలుంది. అంతేకాకుండా మాగ్‌సేఫ్ చార్జింగ్ వల్ల 12 మినీ కొంతమేర వేడెక్కుతోంది. ఈ చార్జర్‌ను రెండో ఆప్షన్‌గానే పరిగణించాలి. 12 మినీ బ్యాటరీ సామర్థ్యం 2227 ఎంఏహెచ్కాగా.. 2815 ఎంఏహెచ్ను ఐఫోన్ 12 కలిగి ఉంటుంది. ఇక వెనుకవైపు రెండు కెమెరాలు 12 ఎంపీ, వైడ్, అల్ట్రావైడ్ లెన్స్‌తో రూపొందాయి. ఫ్రంట్ కెమెరా సైతం 12 ఎంపీని కలిగి ఉంటుంది. వెరసి చాలా వరకూ రెండు ఫోన్లూ ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్క్రీన్ పరిమాణం, బ్యాటరీ విషయంలో మాత్రమే ఐఫోన్ 12 మినీ విభిన్నతను కలిగి ఉన్నట్లు స్మార్ట్‌ఫోన్ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఐఫోన్13 ఫీచర్లు హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయిన నెలరోజుల అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13 పై పలు నివేదికలు హల్చల్ చేస్తున్నాయి. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ప్రకారం టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ 2021లో ఐఫోన్ 13ను ఆవిష్కరించనుంది. స్వల్ప మార్పులతో ఐఫోన్ 12 తరహాలోనే, నాలుగు వేరియంట్లలో దీన్ని విడుదల చేయాలని భావిస్తోంది. తాజా అంచనా ప్రకారం ఐఫోన్ 13 ఫీచర్లపై అంచనాలు: 2021 ఐఫోన్లను పూర్తిగా వైర్లెస్ అనుభవంతో 5.4, 6.1, 6.7 అంగుళాల స్క్రీన్లతో మూడు పరిమాణాల్లో నాలుగు మోడల్స్ లాంచ్ చేయనుంది. రెండింటిని "ప్రో" మోడల్స్ గాను, మిగిలినవి బేసిక్ మోడల్స్‌గా రానున్నాయి. ఐఫోన్ 13లో వేగవంతమైన ఏ సిరీస్, క్వాల్కం కొత్త చిప్ సెట్‌ను జోడించనుంది. అలాగే కెమెరాసెటప్‌ను కూడా భారీగా అప్డేట్ చేయనుంది. కెమెరా టెక్నాలజీ పరంగా, హై-ఎండ్ 40 నుండి 64 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్‌లతో పాటు నాలుగు కెమెరాలనుఅమర్చనుంది. ఇంకా పోర్టింగ్ లెస్ డిజైన్, వైర్లెస్ ఛార్జింగ్, ఫేస్ఐడి ఆన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను సెటప్‌లను చూడవచ్చు. 5జీ చిప్ విషయానికి వస్తే, ఆపిల్ 2021 ఐఫోన్లో క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 60 మూడవ తరం 5 జీ మోడెమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే రాబోయే మరిన్ని ఐఫోన్లలో కూడా ఎక్స్ 65, ఎక్స్ 70 క్వాల్కమ్ మోడెమ్ చిప్‌లను వినియోగించనుంది. అంతేకాదు ఐఫోన్ 12 ధరతో పోలిస్తే సాఫ్ట్ బ్యాటరీ బోర్డ్ డిజైన్‌ద్వారా దాదాపు 30 నుంచి 40 శాతం రేటును తగ్గించనుందనే ఊహాగానాలు ఐఫోన్ ప్రేమికులకు ఊరటనిస్తున్నాయి. -
టెక్నో కామన్ 16 : సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : టెక్నో కామన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆవిష్కరించింది. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ ప్లే, ఏఐ లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా,18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి అద్భుతమైన ఫీచర్లతో టెక్నో కామన్ 16 ను లాంచ్ చేసింది. అంతేకాదు అందుబాటులో ధరలో తీసుకొచ్చింది. 34 గంటల కాలింగ్ సమయం, 16 గంటల వెబ్ బ్రౌజింగ్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 15 గంటల గేమ్ ప్లే 180 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమాయాన్ని తమ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ అందిస్తుందని సుమారు రెండు గంటల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని టెక్నో పేర్కొంది. ధర, లభ్యత టెక్నో కామన్ 16 ధరను 10,999 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా టెక్నో కామన్ 16 అందుబాటులో ఉంటుంది. క్లౌడ్ వైట్, ప్యూరిస్ట్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో లభ్యం. టెక్నో కామన్ 16 ఫీచర్లు 6.80 అంగుళాల ఫుల్ హెచ్ డీ హోల్ పంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 మీడియాటెక్ హెలియో జి 79 సాక్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2+2+2 మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
రెండు స్మార్ట్ఫోన్లు.. అద్భుత కెమెరా (స్పాన్పర్డ్)
వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై శాంసంగ్ పలు అప్డేట్స్ అందిస్తోంది. వీటిలో మీ గ్యాలరీ, వెబ్‌బ్రౌజర్, వాట్సాప్ వంటి యాప్స్‌ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్స్ మధ్య మార్చేందుకు వెసులుబాటు కల్పించే క్విక్ స్విచ్ కీలకమైనది. ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో మనం తీపిజ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, ఫ్రెండ్స్‌తో గేమ్స్ ఆడటం, ఓటీటీ కంటెంట్ వీక్షించడం, స్కూల్/వర్క్ కోసం వీడియో కాల్స్ మాట్లాడటం, నోట్స్ రాసుకోవడం వంటి పలు పనులను చక్కబెట్టేందుకు మనం స్మార్ట్ఫోన్లను వాడుతుంటాం. నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ స్మార్ట్ఫోన్లు మనకు ఉపకరిస్తున్నాయి గేమింగ్, ఫోటోలను క్లిక్ చేయడం, ప్రొఫెషనల్ వర్క్ పూర్తి చేయడం వంటి అన్ని అవసరాలను నెరవేర్చేలా శాంసంగ్ గెలాక్సీ ఏ51, దీని బిగ్ బ్రదర్ గెలాక్సీ ఏ71అందుబాటులోకి వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు అద్భుతమైన స్క్రీన్, అత్యద్భుత కెమేరా, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్ అనుభవాన్ని మనకు అందస్తాయని శాంసంగ్ భరోసా ఇస్తోంది. ►గెలాక్సీ ఏ51 ఈఏడాది తొలి క్వార్టర్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పరిశోధన సంస్థ స్ట్రేటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది ►మరి వీటిలో ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ఫోన్లతో మీరు మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచే అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అల్ట్ జడ్ జీవితం : ప్రైవసీకి ప్రాధాన్యం నేటి ఆధునిక జీవితంలో జనరేషన్ జడ్, మిలీనియల్స్ వారి స్మార్ట్ఫోన్లకు సంబంధించి పలు ప్రైవసీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ అల్ట్ జడ్ జీవితానికి మార్గం సుగమం చేసింది. మీ ప్రైవసీపై ఎలాంటి ఆందోళనకు గురవకుండా గెలాకీ ఏ51, గెలాక్సీ ఏ71తో మీరు అన్ని ఫీచర్లను మీరు ఆస్వాదించవచ్చు. ►మీ స్మార్ట్‌ఫోన్‌ను చూస్తామని మీ స్నేహితులు, సోదరులు అడిగిన ప్రతిసారీ ఎంతో అసౌకర్యంగా ఫీలవుతుంటా. వారు మీరు తీసిన ఓ ఫోటో కోసమో, మీరు సూచించిన గేమ్‌ను ఆడేందుకో వారు మీ స్మార్ట్‌ఫోన్‌ను అడిగినా మీరు కొంత అసౌకర్యానికి లోనవుతుంటారు. ►ఈ సమయాల్లో మీరు ఎలాంటి ఆందోళన, విచారం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను వారికి అందించే రెండు ఫీచర్లను శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ప్రవేశపెట్టింది. ►క్విక్ స్విచ్ పేరుకు తగ్గట్టే మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇతర యాప్స్‌ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌లోకి వేగంగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. పవర్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్‌లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీ ఆఫీస్‌లో పార్టీకి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపే సందర్భాల్లో క్విక్ స్విచ్ మీకు మీ జీవితాన్ని కాపాడే కీలక ఫీచర్‌గా ముందుకొస్తుంది. ►ఇక స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన ఏఐ ఆధారిత సొల్యూషన్‌గా ఇంటెలిజెంట్ సజెషన్స్ గ్యాలరీలో ప్రైవేట్ వెర్షన్లో భద్రంగా కాపాడే ఫోటోలను గుర్తించి సూచనలు చేస్తుంది. వారాంతం వెకేషన్ నుంచి నేరుగా ఆఫీస్‌కు వెళ్లడం వంటి పలు సందర్భాల్లో ఈ ఫీచర్ మీకు ఉపకరిస్తుంది. ప్రైవేట్‌గా ఉంచదలిచిన ఫోటోలు,ఇమేజ్‌లను మీరు ఎంపిక చేస్తే వాటిని ఎవరి కంటా పడకుండా ఏఐ మిగిలిన పని చక్కబెడుతుంది. ప్రముఖ వినూత్న ప్రైవసీ ఫీచర్లు ►నటి రాధికా మదన్ క్విక్ స్విచ్ పవర్‌ను ఉపయోగించి తన సోదరి (శిఖా తల్సానియ) ఆమె ఊహించిన దాని కంటే భిన్నమైనవి చూసేలా చేశారో గమనించవచ్చు ►ఫీచర్లను మరింత మెరుగ్గా అర్దం చేసుకోవడానికి వీడియోను వీక్షించండి ►ఈ తరహా ప్రైవసీని ఆస్వాదించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో బహుళ భద్రత లేయర్లతో కూడిన శాంసంగ్ నాక్స్ భద్రతతో క్విక్ స్విచ్ రూపొందింది. విశిష్ట కెమెరా ఫీచర్లు ఈ రెండు ఫోన్ల విశిష్ట కెమెరా ఫీచర్లను పరిశీలిద్దాం ►మీ ఫ్రెండ్ రన్నింగ్ రేస్ ఫోటోను సమగ్రంగా కెమెరాలో క్లిక్ చేయాలనుకుంటున్నారా? ఇండియా గేట్ వైడ్ యాంగిల్ షాట్ తీయాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ పోర్ట్రయిట్‌ను కెమెరాలో బంధించాలనుకుంటున్నారా? ఆకుపై వాలిన కీటకాన్ని ఫోటో తీయాలనుకుంటున్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71తో ఇవన్నీ సాధ్యమే. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ సొంతవైన క్వాడ్-కెమెరా సెటప్స్‌తో ముందుకొచ్చాయి. ►గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ముందుకొచ్చింది. ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ►ఇక గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్‌పై 64-మెగాపిక్సెల్ లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ర్టా-వైడ్ లెన్స్‌లు, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, రియర్పై 5-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ►గెలాక్సీ ఎస్20 నుంచి అద్భుత కెమెరా ఫీచర్లను గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు శాంసంగ్ అందిస్తోంది. మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసే ఫీచర్లను ఓసారి ప్రయత్నించండి సింగిల్ టేక్ : ఇది గెలాక్సీ ఎస్20ల్లో ఉత్తమ ఫీచర్, ఇది ఇప్పుడు గెలాక్సీ ఏ51పై అందుబాటులో ఉండటం వినియోగదారులకు సంతోషకరమైన అంశం. సింగిల్ టేక్ ఫీచర్ 10 ఫోటోలు, వీడియోల వరకూ క్యాప్చర్ చేస్తుంది. సరైన ఫోటోను ఎలా ఫ్రేమ్ చేయాలని మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. కెమెరాను ఓపెన్ చేసి సింగిల్ టేక్‌ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ►ఫోటోలను చూసేందుకు గ్యాలరీకి వెళ్లడం మామూలే. శాంసంగ్ సింగిల్ టేక్ ఫీచర్ మీ ఫోటోల్లో బెస్ట్ షాట్స్, మొమెంట్స్ను ఎంపిక చేసి వాటన్నింటినీ ఒక ఆల్బమ్‌లో అమర్చుతుంది. ఏఐని వాడుతూ మీరు షార్ట్ మూవీని, జీఐఎఫ్ యానిమేషన్స్ను, పలు స్టైలైజ్డ్ ఇమేజ్‌లను పొందవచ్చు. నైట్ హైపర్‌లాప్స్ : పర్యాటకుడిగా నగరాన్ని చుట్టిరావడం గొప్ప అనుభూతి. ఆ క్షణాలను ఫోటోలుగా మలచి ఆ తర్వాత వాటిని చూసి మురిసిపోవడం మనందరం ఇష్టంతో చేసే పనే. ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదించే వీడియోలను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించే హైపర్‌లాప్స్ ఫీచర్‌కు ఆదరణ పెరుగుతోంది ►శాంసంగ్ నైట్ హైపర్‌లాప్స్ ఫీచర్ ద్వారా గెలాక్సీ ఏ51పై హైపర్‌లాప్స్ వీడియోలు అర్ధరాత్రిలో క్యాప్చర్ చేసినా అత్యంత స్పష్టంగా, బ్రైట్‌గా ఉంటాయి. లాంగ్-ఎక్స్పోజర్ షాట్లను కాంతి, చలన మార్గాలతో వీడియో ఆర్ట్ పనిగా మార్చబడతాయి. కస్టమ్ ఫిల్టర్ : మీ ఫోటోలపై మీరు సొంతంగా వినూత్నంగా తీర్చిదిద్దుకునే నూతన పద్ధతిని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. కలర్స్‌ను ఎంపిక చేసుకోవడం నుంచి భిన్నమైన షేడ్స్‌తో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడం వరకూ మీకు వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ కస్టమ్ ఫిల్టర్ మోడ్ మీకు విస్తృత ఊహాశక్తికి ఊతమిస్తుంది. స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ : ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే కెమెరా తెలివిగా వైడ్ యాంగిల్ మోడ్‌లోకి వెళుతుంది. ప్రతిసారి అద్భుత సెల్ఫీలు తీసుకోవచ్చు. క్విక్ వీడియో : కెమెరా బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా క్విక్ వీడియోను తీసుకోవచ్చు. వీడియో మోడ్‌ను పొందేందుకు సెట్టింగ్స్‌లో కుస్తీ పడుతూ వీడియో తీసే సమయాన్ని మిస్ అవడం వంటి రోజులకు కాలం చెల్లింది. మీ స్మార్ట్‌ఫోన్ తీసుకుని కెమెరా బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రత్యేక క్షణాలను వెంటనే రికార్డ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్ రన్నింగ్ రేసు లేదా మీ బర్త్‌డే పార్టీలో మీ బంధువు పాట పాడటం వంటివి ఏవైనా వెంటనే వీడియో రికార్డు చేయవచ్చు. రికార్డింగ్‌లో స్విచ్ కెమెరా : ఫ్రంట్ నుంచి రియర్ కెమెరాకు మారేందుకు రికార్డింగ్‌ను నిలిపివేయడం, మళ్లీ ఫ్రంట్ కెమెరాకు మారడం వంటివి ఏమంత సౌకర్యంగా ఉండవు. గెలాక్సీ ఏ51లో లభించే ఫీచర్‌తో మీ మధురమైన క్షణాలను ఎలాంటి అవాంతరం లేకుండా రికార్డింగ్ చేస్తూనే ఫ్రంట్, రియర్ కెమెరాలకు మారే వెసులుబాటు ఉంటుంది ఏఐ గ్యాలరీ జూమ్: ఏఐ గ్యాలరీ జూమ్‌తో మీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ రిజల్యూషన్ కలిగిన ఇమేజ్‌ల నాణ్యతను మెరుగుపరిచేందుకు అనుమతిస్తుంది. బ్లర్, పిక్సలేటెడ్ ఇమేజ్‌లను ఆర్ట్ వర్క్స్‌గా మెరుగుపరుస్తుంది గెలాక్సీ ఏ51 గురించి మరిన్ని వివరాలు ►ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది ►6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ - రూ . 22,999 ►8జీబీ ర్యామ్ మరియు 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ - రూ . 24,499 ►ఈ రెండు వెర్షన్లు ప్రిస్మ్ క్రష్ వైట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తాయి. గెలాక్సీ ఏ51 కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ►గెలాక్సీ ఏ51 6.5 ఇంచ్‌ల సూపర్ అమోల్డ్ ఫుల్- హెచ్డీ+ (1080x2400 పిక్సెల్స్) డిస్ప్లేతో ముందుకొస్తోంది. ఆక్టా-కోర్ ఎక్సినాక్స్9611 ఎస్ఓసీ ఆధారిత పంచీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. మీరు మీ స్నేహితులు ఎలాంటి అసౌకర్యానికి లోనవకుండా ఫోటోలను, యూట్యూబ్ వీడియోలను వీక్షించదగిన గొప్ప వీక్షణా యాంగిల్స్‌తో కూడిన డిస్ప్లే ఆకట్టుకుంటుంది. ►ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. దీర్ఘకాలం గేమింగ్, అపరిమిత వాచింగ్ సెషన్స్‌కు సరిపడా చార్జింగ్ సామర్ధ్యం కలిగిఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఒన్ యూఐ 20 సాఫ్ట్‌వేర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. గెలాక్సీ ఏ 71పై ఇతర మెరుగైన ఫీచర్లు ►గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్‌ల (1080x2400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-0 సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ఓక్టా-కోర్ చిప్సెట్తో ముందుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో దైనందిన జీవితంలో భిన్నమైన టాస్క్‌లను నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తుంది. ►4500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కల్పిస్తుంది. గెలాక్సీ ఏ71 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ . 29,499 ►ఆకర్షణీయ ప్యాకేజ్, దీర్ఘకాల వీక్షణ, కాల్ ఆఫ్ డ్యూటీ : రెండు స్మార్ట్ఫోన్లపై మొబైల్ సెషన్లు, ఫోటో షూట్లు ఆహ్లాదభరిత అనుభూతిని అందిస్తాయి. వాటిపై ఏ టాస్క్‌ను మీరు ప్రయత్నించినా విశ్వాసంతో వాటిని నిర్వర్తిస్తాయి. అంతేనా..మీ స్మార్ట్‌ఫోన్ గోప్యతను చెక్కుచెదరకుండా ఉంచడం గురించి మీరు ఇక బాధపడరు! -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
సాక్షి,న్యూఢిల్లీ: వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో అప్డేట్స్ను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరో ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గత వారం ప్లేఫుల్ పియోమరు అనే యానిమేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ వాటికి మరి కొన్ని స్టిక్కర్లను జత చేయనుంది. (వాట్సాప్‌లో హోంవర్క్) చుమ్మీ చుమ్ చుమ్స్, రికోస్ స్వీట్ లైఫ్, బ్రైట్ డేట్, మూడీ ఫుడీస్ అనే యానిమేటెక్ స్టిక్కర్లను వాట్సప్ తన స్టోర్ ద్వారా అందించనుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని వాట్సాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టోర్‌లో కనిపించని వారు కొన్ని రోజుల తరువాత వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు వాట్సాప్ ను మెసెంజర్‌తో కలపాలనే ఆలోచనలో ఫేస్బుక్ ఉంది. దీని ద్వారా మెసేంజర్, వాట్సాప్ రెండు ఫ్లాట్ఫ్లాంల ద్వారా కూడా వినియోగదారులు కలుసుకోవచ్చు. ఇది ఇంకా ప్రయోగత్మాక దశలోనే ఉంది. త్వరలో దీన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఫేస్బుక్ ఉంది. (వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్‌లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్ స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్స్, వెబ్ వాట్సాప్‌కు డార్క్ మోడ్, క్వాలిటీ వీడియో కాల్స్, కైఓఎస్కు మాయమైపోయే స్టేటస్ లాంటి ఫీచర్స్‌ను కొద్దివారాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. (‘చైనా ట్విటర్’ అకౌంట్ మూసేసిన ప్రధాని) క్యూఆర్ కోడ్: ఓ వ్యక్తిని మీ వాట్సాప్‌లో జత చేసుకోవడానికి వారి మొబైల్ నంబర్‌ను అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు. ఇకపై ఒక్క క్యూఆర్ కోడ్‌తో వారి నంబర్‌ను స్కాన్ చేసి, యాడ్ చేసుకోవచ్చు. (మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్) యానిమేటెడ్ స్టిక్కర్స్: చాటింగ్‌ను మరింత ఫన్‌గా మార్చే యానిమేటెడ్ స్టిక్కర్స్‌ను వాట్సాప్ తీసుకురానుంది. వీటిలో వారికి నచ్చిన స్టిక్కర్స్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. వెబ్‌కు డార్క్‌మోడ్: ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో చాలా కాలం క్రితమే వాట్సాప్ డార్క్ మోడ్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడిక వెబ్ వెర్షన్‌కూ ఈ ఫీచర్‌ను జోడించనుంది. వీడియో క్వాలిటీ: ఇటీవల గ్రూప్ వీడియో కాల్లో పాల్గొనే వారి సంఖ్యను ఎనిమిదికి పెంచిన వాట్సాప్, ఇప్పుడు కాల్ క్వాలిటీపై దృష్టి సారించింది. దాంతోపాటు కాల్లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది. స్టేటస్: స్టేటస్ తనంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. కాగా, దీన్ని ఇప్పుడు కైఓఎస్కు వాట్సాప్ విస్తరించనుంది. -
మాస్టర్‌కార్డ్ కొత్త భద్రత ఫీచర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ’ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ వెబ్సైట్ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్ ఈ–కామర్స్ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకూ ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
ఆ మూడూ ముఖ్యం
ఎలాంటి అమ్మాయి కావాలి? అని సాధారణంగా అబ్బాయిల్ని అడిగితే ఫలానా హీరోయిన్లా ఉండాలి అని సమాధానం చెబుతారు. మరి ఏకంగా హీరోయిన్‌కే ఎలాంటి వాడు కావాలి? అంటే ‘గ్రీకువీరుడు...’ పాట పాడతారు. కానీ అదంతా సినిమాల్లో, నార్మల్ లైఫ్‌లో మూడు లక్షణాలు ఉండాలనుకుంటున్నాను అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూడు లక్షణాలు ఏంటంటే... నేను హీల్స్ వేసుకున్నా తనని తలెత్తుకు చూసేలా ఉండాలి. అంటే మంచి ఎత్తుండాలి. తనకు జీవితంలో ఓ ప్యాషన్ ఉండాలి. అది ఏ రంగంలో అయినా సరే. అందులో పెద్ద సక్సెస్ఫుల్ కానక్కర్లేదు. తన జీవితంలో ఒక విజన్‌తో ఉండాలి. ఇంక మూడోది.. నిజాయతీపరుడై ఉండాలి. సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగా ఉండాలి’’ అని పేర్కొన్నారు రకుల్. -
ద్వారకామాయి
ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. ‘మనది హిందూ ధర్మమే తప్ప హిందూమతం కానేకాదు’. ‘మతి’ని బట్టి ఏర్పడేది మతం. ఎవరో కొందరు ఓ సంఘంగా ఏర్పడి, ఒకరిని అనుసరిద్దామని నిర్ణయించుకుని, ఆ ఉత్తమ లక్షణాలు ఫలానావానిలో ఉన్నాయని, కాలంలో జరిగే ఆయన ప్రవర్తనలని బట్టి నిశ్చయించుకుని, ఆయన మతిని బట్టి కొన్ని నియమాలనీ, సంప్రదాయాలనీ ఏర్పరుచుకుంటే అదీ ‘మతం’. మన హిందూధర్మం ఓ మతం కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టీ నడుస్తూ ఉండే విధానం కలదీ కాదు. మనకి కనిపించని ఋషులందరూ.. ఏ ఉపనిషత్తులూ, వేదాలూ అనే వాటిని నిరంతరం మననం చేస్తూ.. ఉండేవారో ఆ వేదాలని బట్టి ఏర్పడిన ధర్మం మనది. అందుకే దీనికి మొదట్లో వేదధర్మం లేదా వైదికధర్మం అని పేరు ఏర్పడింది. ఆ మీదట కాలక్రమంలో ఇతర మతాలు ఏవేవో వచ్చాక ఈ గుర్తింపు నిలవడం కోసం ‘హిందూధర్మం’ అనే పేరుతో స్థిరపడింది. ఇదంతా ఎందుకంటే.. సాయి ఉండిన మసీదులో హిందూధర్మమే ఆచరింపబడుతూ ఉండేది. వినడానికి ‘ఇది నిజమా?’ అనిపిస్తుంది గానీ, కొద్దిగా పరిశీలించి చూస్తే మాత్రం– ఎందుకు ఇంతకాలం ఈ విషయాన్ని గమనించలేదు? అన్నంతగా హిందూధర్మమే పాటింపబడుతూ కనిపిస్తుంది పరిశీలిద్దాం!! 1. పంచసూనాలు భారతీయులం.. అందునా హిందువులమయ్యుండి కూడా ఈ మాటని (పంచసూనాలు) ఎందరో విని ఉండలేదు? సాయి మాత్రం నిరంతరం ఈ 5 దోషాలు(సూనాలు) ఏమున్నాయో వాటిని తొలగించుకుంటూనే ఉండేవాడు. రోట్లో ధాన్యం పోసి, రోకలితో దంచి, బియ్యంగా చేసేటప్పుడు (అప్పట్లో అదే మరి విధానం) మనకి తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు మన కారణంగా చంపబడతాయి. ఇలా దంచినప్పుడు ధాన్యపు పై–పొట్టుపోతుంది – తినే వీలుకల బియ్యంగా అవుతుంది ధాన్యం. దీన్నే సంస్కృతంలోనైతే వ్రీహీ అవఘాతనం (వడ్లని దంచడం) అంటారు. మరాఠాలోనైతే ‘కండణి’ అంటారు. ఇది మొదటి దోషం. దోషమంటే ఇక్కడ పాపదోషమని అర్థం. అన్ని దోషాల వల్లా పాపం రాదు. ఉదాహరణకి పిల్లలు ఎక్కువగా తీపిని తింటూ ఉంటే.. ఆ బెల్లం ముక్కని దాచేసి, కాకి ఎత్తుకుపోయిందని అబద్ధమాడతాం. అది దోషమే అయినా పాపదోషం (పాపాన్ని తెచ్చిపెట్టే దోషం) కాదు. ఇక ఆ రోజుల్లో ఎండినపుల్లలు, కందికట్టలు, కొబ్బరి డొక్కలు, మట్టలు.. వంటి వంటచెరకుతో వండుతూండేవారు. వాటిలో కొన్ని పురుగులుండచ్చు. అలాగే ఆ వండేటప్పుడు కూడా కొన్ని పురుగులు మంటలో మనకారణంగా చనిపోవచ్చు. ఇది రెండవ దోషం. సంస్కృతంలోనైతే ‘దాహన’మంటారు. మరాఠాలో ‘ఛుల్లీ’ అంటారు. ఇది రెండవ పాపదోషం. ఒకప్పటి రోజుల్లో తిరుగలి వాడకం మరింత ఎక్కువగా ఉండేది. కందులు, పెసలు, మినుములు, శనగలు, గోధుమలు... ఇలా అన్నింటినీ.. కొన్నింటిని పప్పుబద్దలుగా, కొన్నింటిని మొరుముగా, మరి కొన్నింటిని పిండిగా అయ్యేంత వరకూ విసిరేవారు. ఈ సందర్భంలో కూడా మన కారణంగా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. ఇది మూడవసూనం. దీన్నే మరాఠా, సంస్కృత భాషల రెండింటిలోనూ ‘పేషణి’ అంటారు. ఇది మూడవ పాపదోషం. ఇక నీళ్లని కడవలతో తెచ్చేందుకు వాటిని మట్టితో కడగడం, తొలవడం చేస్తారు. దానివల్ల ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. దాన్ని ‘ఉదకుంభి’ దోషంగా చెబుతారు. ఇది నాల్గవది. మరాఠాలో ‘ఉత్కంభి’ అంటారు. ఇక చీపురుతో నేలని ఊడ్చినప్పుడూ ఎన్నో జీవులు మనవల్ల చనిపోతాయి.. బలమైన సన్నికల్లు వంటి వాటిని నేల మీద పెట్టినప్పుడూ.. ఇంకా బూజు వంటివాటిని దులిపినప్పుడూ, ఆవుపేడనీటితో కలిపి కలాపం(అందం సౌందర్యం కోసం) (కలాపి)చల్లినప్పుడూ కొన్ని సూక్ష్మజీవులు మన కారణంగానే మరణిస్తాయి. ఆ పాప దోషాన్ని ‘మార్జని’ అంటారు ఉభయభాషల్లోనూ. ఆ 5 పాపదోషాలూ తొలగడం కోసం సాయి ఏ రోజునా బ్రహ్మయజ్ఞం – పితృయజ్ఞం– దేవయజ్ఞం– భూతయజ్ఞం(ఇది మరీ ముఖ్యం పంచసూనాల దోష నివృత్తికి) మనుష్యయజ్ఞమనే వాటినీ చేస్తూనే ఉండేవారు. (ఈ యజ్ఞాల గురించి 46వ భాగంలో వివరణ ఉంది) సాయి... ఈ చిన్నవాటిని ‘పంచసూనాలనే పేరిట చెప్పడమంటే? ప్రాచీన భారతీయధర్మాన్నీ, హైందవసంప్రదాయాన్నీ పాటించడం కిందికి రాదా?’ పోనీ ఇదంతా ఏ హిందూ దేవాలయంలోనా? అని ఆలోచిస్తే స్పష్టంగా మసీదులో కదా!? 2. అగ్ని ఆరాధన హైందవధర్మంలో అతి ముఖ్యమైనది దీపారాధన. ‘అగ్నిముఖా వై దేవాః’ దేవతల్లో ఏ ఒక్కరికి దేన్ని మనవి చేసుకోవాలన్నా ఆ దైవానికి సంబంధించిన జపం, ధ్యానం, మంత్రమననం అనే వాటిని– ఏ దైవానికి ఎంత సంఖ్యతో మననం చేయాలో అలా చేశాక ఆ మంత్రసంఖ్యలో దశాంశాన్ని (ఉదాహరణకి లక్షమార్లు మంత్రాన్ని మననం చేసే దానిలో 10వ వంతు అంటే.. 10 వేల మార్లు తర్పణం హోమం చేయాలి) మళ్లీ మంత్రాన్ని మననం చేస్తూ కొన్ని వస్తుద్రవ్యాలతో అగ్నిలో హోమం చేయాలి. అప్పుడు మాత్రమే ఏ దైవాన్ని పూజిస్తున్నామో కోరిక ఏమిటో ఏ దైవానికి చెందించవలసిందో అగ్నిదేవునికి తెలియజేయబడినట్లు. దాంతో ఆ అగ్ని ఆ దేవునికి ఈ వ్యక్తి వివరాలనీ కోరికలనీ తెలియజేస్తాడు ఆ అగ్నిలో వేయబడిన వస్తు ద్రవ్యాలతో సహా. ఈ అగ్నిలో వేయబడిన వస్తుద్రవ్యాలని నేతితో వేసే కారణంగా దాన్ని హవిస్సు అంటారు.అలా దేవతలతో మనకి దగ్గర సంబంధాన్ని ఏర్పరిచే దైవం అగ్ని అన్నమాట. మసీదులో నిత్యం అగ్ని వెలిగింపబడి దీప ఆరాధనం నిరంతరం సాగుతూనే ఉంటుంది. నూనె దీపాలన్నింటినీ వెలిగిస్తూ మనని నూనెకి ఇబ్బంది పెట్టడమా? అంటూ వర్తకులందరూ నూనెని ఇయ్యడం మానేసారనే విషయం – సాయే నీటితో దీపాలని మసీదు నిండుగా వెలిగించాడనీ అనుకున్నాం కదా! ఈ దీపారాధన అది కూడా మసీదులో జరగడమంటే హైందవ సంప్రదాయాన్ని పాటించడం కాదూ మరీ! అలాగే ఏ కోరిక తీరాలన్నా ఆ కోరికకి సరిపడిన హోమాన్ని చేస్తూ ఉంటాం. సరిగ్గా అదే పద్ధతి నిత్యహోమం జరుగుతూండే ‘ధుని’ ద్వారా మసీదులో నిర్వహింపబడుతూనే ఉంది. ఉదయం నిద్రనుండి లేచీ లేవగానే.. కాళ్లూచేతులూ కడుక్కుని, నోటిని పుక్కిలింత ద్వారా శుభ్రపరుచుకుని, వెంటనే గాయత్రీ మంత్రాన్ని మననం చేయడమనే ఆ హైందవసంప్రదాయాన్ని.. ‘అజపాగాయత్రి’ అంటారు. అదే విధానం సక్రమంగా సాయి చేత పాటించబడుతూ ‘అల్లాహ్హో మాలిక్!’ అనే మంత్రమే మననం చేయబడుతూ ఉండేది. ఈ లో–విశేషం తెలియని ఏ కొందరో మాత్రం ‘సాయి ఇంకా స్నానాన్నే చేయలేదు’ అని భావిస్తూ ఉండేవారు. ఈ స్నానానికి వెనుక మంత్ర మననం హైందవ సంప్రదాయం ప్రకారం ఉన్నదే కదా! పైగా ఇది మసీదులోనే జరుగుతూ ఉండేది! 3. నిత్య పారాయణాలు సహజంగా ఎవరైనా దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ దైవసమక్షంలో ఆ దైవానికి సంబంధించిన – దీంతోపాటూ ఇతర దేవతలకి సంబంధించిన మంత్రాలనో స్తోత్రాల్నో శ్లోకాల్నో పాటల్నో కీర్తనల్నో పద్యాల్నో అలా నోటికొస్తే చదువుతూ ఉండటం, రాని పక్షంలో చూసి చదువుతూండటమో చేస్తుంటాం. దాన్నే పారాయణం అంటాం. ఆశ్చర్యకరమైన అంశమేమంటే.. ‘రామదాసుబువా’ వంటి శ్రోత్రియులు శ్రీమద్రామాయణాన్నీ భగవద్గీతనీ అధ్యాత్మరామాయణకీర్తనలనీ ఇన్నింటికీ ముందు గాయత్రీమంత్రజపాన్నీ చేస్తూ ఉంటే, శ్యామా వంటి వాళ్లు శ్రీ విష్ణు సహస్రనామాలని పఠిస్తూ ఉంటే.. ఇంకా ఎందరో మరెందురో వాళ్ల వాళ్ల కొచ్చిన ఎన్నెన్నో స్తోత్రాలని చదువుకుంటూనే ఉంటూండేవాళ్లు. ‘ఇది మసీదు’ అని ఏ ఒక్కరూ అభ్యంతరపెట్టడం గాని, సాయి వీరందరినీ ఉద్దేశించి పఠించవద్దని అనడం గాని ఏ నాడూ జరగనే లేదు. 4. యా సాయీ! ఖండోబా దేవాలయపు అర్చకుడైన మహల్సాపతి తనని చూస్తూనే ‘యా సాయీ!’ (సాయీ! నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నీ రాకని పవిత్రపూర్వకంగానూ ఆదరణపూర్వకంగానూ భావిస్తున్నాను) అన్నాడు. ఈ అర్చకుడూ సామాన్యుడు కాదు నిజానికి. సాయిలో ఉన్న గొప్పదనాన్ని గమనించే ‘సాయీ!’ అనే పేరుతో పిలిచాడు. నిజంగా మహమ్మదీయాభిమానమే తనకి ఉన్నట్లయితే ‘నేను రాను!’ అనవచ్చు. మహమ్మదీయనామంతో తనని పిలిచినట్లయితేనే వస్తానని భీష్మించవచ్చు – లేదా – లోపల ద్వేషించుకుంటూ పైకి అలా అంగీకరించినట్లు భావించవచ్చు. అలాంటిదేమీ లేకుండా స్పష్టంగా తానంగీకరించాడంటే హైందవధర్మంతో మసీదు నిండిపోయి కనిపించడం లేదా? ఆయన చేతిలో ఉన్న సటుకాని సంన్యాసులకుండే ధర్మదండం (ఆకారంలో కనిపించే)గా భావించవచ్చు. నుదుట పెట్టించుకున్న భస్మాన్నీ దాన్ని కూడా త్రిపుండ్రాంకంగా (మూడు గీతలుగా భావించి ముఖాన పూసుకునే శైవ చిహ్నం) అంతేకాక హిందూసంప్రదాయానుగుణంగా ఏ చందనాన్ని అతిపవిత్రంగా భావిస్తూ అభిషేకాన్ని కూడా ఏ దైవానికి చేస్తూ ఉంటారో ఆ చందనంతో నామాన్ని డాక్టర్ పండిత్ పెడితే ఏ మాత్రపు అభ్యంతరాన్నీ పెట్టలేదు. శ్యామా మొదలైన వాళ్లు కంఠానికి చందనాన్ని రాస్తే ఆనందిస్తూ ఉండేవాడు కూడా. ఇక హైందవ సంప్రదాయ అర్చన పుష్పాలంకరణ నైవేద్యాలని పెట్టడం, హారతి విధానం, అగరుధూపసేవ.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా మసీదులోనే జరిగాయంటే ఇదంతా సంపూర్ణ హైందవ విధానం కాదూ! ఇంతటి హైందవ సంప్రదాయం పాటింపబడుతోంది కాబట్టే.. హిందూధర్మంలో నిత్యం మునకలేస్తూ ఉండే మహానుభావులైన తాపసులూ (తపస్సు మాత్రమే తను జీవన వృత్తిగా కలవారు) దండకమండలాలని ధరించేవారూ హరిద్వార్ మొదలైన పుణ్యపవిత్ర క్షేత్రంల్లో నిత్యం ఉండే యోగులూ మఠాధిపతులై మఠాల్లో ఉండే సంన్యాసులూ ఇంకా మఠం స్థాపించుకున్న స్థితిలో లేని పరి వ్రాజకులూ (నిత్యం భక్తులకి దర్శనాన్నిచ్చేందుకై యాత్రల్ని చేస్తూ తిరుగుతూ ఉండే సంన్యాసులూ) అన్నింటినీ విడిచిన త్యాగ బుద్ధితో ఉన్న త్యాగులూ ఎక్కడా భోజనాన్ని చేయకుండా తామే వండుకుని, తినే సంప్రదాయాన్ని పాటించే శిష్టులూ.. ఇలా అందరూ మసీదుకొస్తూ సాయిని దర్శించి వెళ్తూ ఉండేవారు. 5. శిరోవేష్టనం శిరః అంటే తలకి వేష్టనం అంటే ధరించిన వస్త్రవిధానమని అర్థం. మహమ్మదీయుల సంప్రదాయం ప్రకారం తలకి టోపీ పెట్టుకుంటారు. కొందరు బారుగా ఉండే పెద్ద వస్త్రాన్ని ఒక తలపాగాలాగా ఉండే పద్ధతిలో ధరిస్తారు. మరి కొందరైతే ఒంటిపొరతో గుడ్డని తలపాగగా ధరిస్తూ శిరసుని పూర్తిగా గుడ్డతో కలిపివేస్తూ కనిపిస్తాడు. సాయి శిరోవేష్టనవిధానాన్ని చూస్తే స్పష్టంగా అది ఇన్నింటికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఎలా అయితే హైందవధర్మ ప్రబోధకులైన స్వాములూ సంన్యాసులూ మఠాధిపతులూ తమ శిరసు కనిపించకుండా ఉండేలా ఒంటిపొర వస్త్రాన్ని తల మీద ఉంచుకుని, రెండు చెవులూ వినపడేలానూ, శిరసు కప్పబడి ఉండేలానూ ఆ మిగిలిన వస్త్రాన్ని చెవిపక్కన ముడివేసి కనిపించేలానూ శిరోవేష్టనాన్ని కలిగి ఉంటాడు. ఆయన శిరసు ఏనాడూ ఆచ్ఛాదన లేకుండా ఉండేది కాదు– ఉండదు. మన హైందవ సంన్యాసులు కూడా అదే తీరుగా ఉంటారనేది అనుభవంలో కనిపించే సత్యమే. ఇదే శిరోవేష్టన విధానాన్ని అవలంబిస్తూ సాయి దర్శనానికి వచ్చే భక్తులు స్త్రీలైతే తల మీద చీర చెంగుని ధరిస్తూనూ, పురుషులైతే తలపాగలతోనూ వస్తూండేవారు. యతిలాగా భిక్షావృత్తి హిందూ ధర్మ సంప్రదాయంలో యతీ లేదా సంన్యాసీ అయిన మహానుభావుడు మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే బిచ్చమెత్తాలి నిరహంకార విధానాన్ని సూచించుకుంటూ.. అది కూడా 5 ఇళ్ల నుండి మాత్రమే తీసుకోవాలి. ఆ తీరుగా వచ్చిన అన్నాన్ని పప్పుతో అన్నాన్ని కలిపీ.. పచ్చడితో అన్నాన్ని కలిపీ.. పులుసుతో అలాగే పెరుగుతో.. ఈ తీరుగా వేటి రుచిని వాటికిగా అనుభవిస్తూ తినడం సంన్యాససంప్రదాయం కాదు. అన్నింటినీ కలిపి రుచిలో అభిరుచి కలిగినవానిగా కాకుండా తినాలి. మళ్లీ కావాలంటూ మారు(రెండోమారు) అడగకూడదు. తినకూడదు. ఆ రోజుకి భగవంతుడు అంత మాత్రపు ఆహారాన్నే అంతటి రుచితోనే అనుగ్రహించాడని భావించి – యదృచ్ఛాలాభ సంతుష్టః – దొరికిందానితోనే సంతృప్తిపడే లక్షణాలతో ఉండాలి సంన్యాసి. సాయి ఇదే సంప్రదాయాన్ని మసీదులో పాటిస్తూ ఉండేవాడు.ఏ భజన సంప్రదాయం మన హిందువులదో ఆ ధర్మాన్ని మసీదులో పాటింపజేస్తూ పండరినాధుని భజననీ, వేణుగోపాలుని భజననీ చేయిస్తూ చేస్తూ ఉండేవాడు. కాళ్లకి గజ్జెలని కట్టుకుని ఆనందంతో నృత్యాన్ని చేస్తూ ఉండేవాడు కూడా. ఎందరెందరో భక్తులు ఏమేమో ఆహారపదార్థాలు తెచ్చినా ఆహారపదార్థాలు తెచ్చినా సంన్యాసధర్మానికనుగుణమైన భిక్షాటనాన్ని ఏనాడూ మరవలేదు. మహానుభావులైన ఏ కొందరు మహానుభావులో పవిత్రజీవనాన్ని గడిపి మరణిస్తే వాళ్ల సమాధుల వద్ద జరిగే ఉత్సవమైన ఉరుసురోజునే శ్రీరామనవమిని ఏర్పాటు చేసి మసీదుని హిందూదైవ మందిరంగా మార్చేసాడు సాయి. పైవారం – సాయి సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షా..? – సశేషం -
కొత్త లుక్‌తో ఫేస్బుక్
శాన్ జోసె (అమెరికా): సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్బీ5’గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ చెప్పారు. ఎఫ్8 పేరిట నిర్వహిస్తున్న వార్షిక టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కొత్త డిజైన్ పనితీరు మరింత సులభతరంగా, వేగవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నామన్నారు. ఫేస్బుక్ యాప్‌లో ఈ మార్పులు తక్షణం కనిపిస్తాయని, మరికొద్ది నెలల్లో డెస్క్‌టాప్ సైట్లో కూడా వీటిని చూడొచ్చన్నారు. ఫేస్బుక్ డేటింగ్ సర్వీసుల్లో సీక్రెట్ క్రష్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని జకర్బర్గ్ చెప్పారు. కొత్తగా బ్రెజిల్, మలేషియా తదితర 14 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఈ జాబితాలో భారత్ లేదు. మరోవైపు, మెసెంజర్ యాప్‌ను కూడా తేలికగా, వేగవంతంగా మారుస్తున్నామని జకర్బర్గ్ తెలిపారు. భారత్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఈ ఏడాది ఆఖరు నాటికి ఇతర దేశాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ప్రైవసీ, డేటా భద్రతపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జకర్బర్గ్ చెప్పారు. ఎన్నికల వేళ అనుచిత విధానాలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
రెనాల్ట్ ‘కాప్చర్’ మోడర్న్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త సేఫ్టీ ఫీచర్ల అప్డేట్తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’ మోడల్ కారును లాంచ్ చేసింది. తాజా కేంద్ర నిబంధనలు అనుగుణంగా భద్రతా ప్రమాణాలతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5- రూ.13 లక్షల ( ఎక్స్ షోరూం -న్యూఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఎక్సీడ్ ఫ్రంటల్, లాటరల్, పెడెస్ట్రైన్ సేఫ్టీ ఫీచర్లను జోడించినట్లు రెనాల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లను కొత్త కాప్చర్లో అదనంగా పొందుపర్చింది. ఈ సేఫ్టీ ఫీచర్లు అన్ని వర్షన్లతో కూడిన న్యూ రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటితోపాటు పలు ప్రీమియం ఫీచర్లు కూడా చేర్చామని రెనాల్ట్ తెలిపింది. -
స్మార్ట్ ఫీచర్లతో జియో ఫోన్ 3
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ల ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్ ధరలో సామాన్యులకు మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. 5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్‌లో జరిగే రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3 స్మార్ట్‌గా వినియోగదారులను పలకరించనుంది. -
పుస్తకాలుంటే.. ఆ మూడు మంచి లక్షణాలు
పుస్తకాలు చదివితే ఏమొస్తుందని కొందరంటారుగానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయని తేల్చేస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలతో సావాసం చేసిన వాళ్లకు అంకెలు, సమస్య పూరణాలతోపాటు మేధావితనపు సంస్కారం అలవడతాయని వీరు అంటున్నారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల మందిని సర్వే చేసి మరీ ఈ అధ్యయనం చేశామని జోవానా సికోరా తెలిపారు. సర్వేలో పాల్గొన్న వాళ్లు 25– 65 మధ్య వయస్కులు. పదహారేళ్ల వయసు వచ్చేలోపు ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అన్న ప్రశ్నకు వీరంతా సమాధానమిచ్చారు. నార్వే, స్వీడన్, చెచ్నియా వంటి దేశాల్లోని పిల్లల ఇళ్లలో సగటున 200 పుస్తకాలు ఉండగా చిలీ, సింగపూర్, టర్కీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 60 మాత్రమే. అందుబాటులో ఉన్న పుస్తకాల సంఖ్యకు తగ్గట్టుగానే ఆయా దేశాల యువకుల మేధోశక్తి కూడా ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా తెలిసింది. -
మార్కెట్లోకి టీవీఎస్ సరికొత్త ‘వీగో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్స్ అధునాతన ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్, స్పోర్టి వీల్–రిమ్ స్టిక్కర్స్, పాస్–బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్ బాడీ, అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్ డిజైన్ అయిందని వ్యాఖ్యానించారు. -
డీఎన్ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!
వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును సరిచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరు మందగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. మైటోకాండ్రియల్ డీఎన్ఏ పొడవు తగ్గుతున్న కొద్దీ మధుమేహం, వృద్ధులకు వచ్చే నాడీ సంబంధ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా దశాబ్ద కాలంలో మనిషి మైటోకాండ్రియల్ డీఎన్ఏలో నాలుగు కాపీలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశారు. యాంటీబయాటిక్‌ల ద్వారా వాటి మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గిపోయేలా చేసినప్పుడు కొన్ని వారాల్లోనే వెంట్రుకలు రాలిపోవడంతోపాటు, చర్మం ముడుతలు పడటం మొదలైంది. ఇవన్నీ వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలే. కాకపోతే వేగంగా చోటు చేసుకున్నాయి. యాంటీబయాటిక్‌లను నిలిపివేసిన వెంటనే పరిస్థితి చక్కదిద్దుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్య లక్షణాలకు, మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గుదలకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేశవ్‌సింగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
వన్‌ప్లస్ 6 ఫీచర్లు లీక్: మే 21నుంచి ప్రీ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6కి సంబంధించిన ఫీచర్లు మరోసారి ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన స్మార్ట్ బై ఆఫర్స్ వెబ్ పేజీలో వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్లు దర్శనమిచ్చాయి. దీని ప్రకారం వన్ ప్లస్ 6 లో కింది ఫీచర్లు ఉండనున్నాయి. 5.7 ఇంచ్ డిస్ప్లే 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 23ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 6 ను ఈ నెల16న లండన్‌లోనూ 17వ తేదీన చైనాతోపాటు ఒకేసారి భారత్‌లోనూ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రి బుకింగ్స్ మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. -
దిగ్గజాలకు దీటుగా: ఎల్జీ జీ7 థిన్‌క్యూ
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో భాగంగా జీ7 థిన్‌క్యూ పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్లాటినం గ్రే, అరోరా బ్లాక్, మొరాకన్ బ్లూ, రాస్ప్బెర్రీ రోజ్ రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఎల్జీ జీ7 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లతోపాటు గూగుల్ అసిస్టెంట్ కోసం ఈ ఫోన్‌పై ప్రత్యేకంగా బటన్‌ను పొందుపర్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర , లభ్యత గురించి ఇంకా కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముందుగా దక్షిణ కొరియాలో విడుదలైన ఈ ఫోన్ ఉత్తర అమెరికా, యూరోప్, లాటిన్ అమెరికా, ఆసియాలో మార్కెట్లు వస్తున్నట్లు సంస్థ నిర్ధారించింది. ఐ ఫోన్ ఎక్స్‌ను పోలి వున్న ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 9ప్లస్, పిక్సెల్ 2 ఎక్స్ఎల్, హువావే పీ 20లాంటి ఫోన్లను గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్జీ జీ7 థిన్‌క్యూ ఫీచర్లు 6.1 ఇంచ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్లెస్ చార్జింగ్ -
జీమెయిల్.. న్యూలుక్
సాక్షి, నేషనల్ డెస్క్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ జీమెయిల్లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత భద్రత కల్పించడంతో పాటు గోప్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దశలవారీగా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. 1. డౌన్లోడ్, ప్రింట్ చేయకుండా బ్లాక్ వ్యాపార సంస్థల గోప్యతను పరిరక్షించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాము పంపిన ఈ–మెయిల్‌ను అవతలివారు డౌన్లోడ్, ఫార్వర్డ్, కాపీ చేయకుండా, ప్రింట్ తీసుకోకుండా బ్లాక్ చేసే సదుపాయం కల్పించింది. 2. కాన్ఫిడెన్షియల్ మోడ్ నిర్ణీత గడువు తర్వాత ఈ–మెయిల్స్ డెలిట్ అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మోడ్‌లో అవతలివారికి ఈ–మెయిల్లో సమాచారం కాకుండా ఓ లింక్ మాత్రమే వెళుతుంది.దీనిపై క్లిక్ చేయగానే సమాచారం సాధారణ ఈ–మెయిల్లో ఉన్నట్లే కన్పిస్తుంది. 3. రెండు దశల్లో ధ్రువీకరణ అవతలి వ్యక్తి పంపిన ఈ–మెయిల్‌ను చూసేందుకు రెండు దశల్లో ఉండే ధ్రువీకరణను తీసుకొచ్చింది. ఈ–మెయిల్ అందుకున్న వ్యక్తి దాంట్లోని సమాచారాన్ని చూసేందుకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. 4. ముఖ్యమైన మెయిల్స్ కోసం స్నూజ్ వినియోగదారులు ముఖ్యమైన ఈ–మెయిల్స్‌కు జవాబివ్వడం మర్చిపోకుండా ఈ ఫీచర్‌ను తెచ్చింది. ముఖ్యమైన ఈ–మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో అన్నింటికంటే పైన కన్పించేలా ఈ ఫీచర్ ఉపకరిస్తుందని వెల్లడించింది. 5. ఆఫ్లైన్లోనూ వాడుకోవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండని సందర్భాల్లో సైతం జీ–మెయిల్‌ను వాడుకునేలా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నెట్ ఉన్నప్పుడు జీమెయిల్‌కు వచ్చిన సమాచారం ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయిపోతుంది. 6. చెక్చేయని మెయిల్స్ కోసం అలర్ట్స్ రెండ్రోజులు దాటినా ఓపెన్ చేయని మెయిల్స్‌ను ఈ ఫీచర్ వినియోగదారుల దృష్టికి తీసుకెళుతుంది. ముఖ్యమైన ఈ–మెయిల్స్‌ను మెషీన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా గుర్తిస్తామంది. యూజర్లు అందుకున్న ఈ–మెయిల్స్‌లో ఏవైనా ప్రశ్నలుంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తామంది. 7.తెరవకుండానే అటాచ్మెంట్లు చూసేలా మెయిల్స్‌ను ఓపెన్ చేయకుండానే వాటితో వచ్చిన అటాచ్మెంట్లను చూసే ఫీచర్ తెచ్చిం ది. ఈ ఫీచర్లో అటాచ్మెంట్లు ఈ–మెయిల్ కింద కన్పించే ఐకాన్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. 8. హై ప్రయారిటీ నోటిఫికేషన్లు ఈ ఫీచర్ ద్వారా ఇన్‌బాక్స్‌లో చేరే అనవసరమైన ఈ–మెయిల్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యమైన, అత్యవసరమైన ఈ–మెయిల్సే ఇన్‌బాక్స్‌లో చేరుతాయి. దీనివల్ల 97% అనవసరమైన ఈ–మెయిల్స్‌ను నిలువరించవచ్చు. 9.ఒక్క క్లిక్‌తో అన్–సబ్‌స్క్రైబ్ గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా అవసరం లేదని ఈ–మెయిల్ నోటిఫికేషన్లను ఓకే క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. 10.స్మార్ట్‌గా రిప్లై ఇవ్వొచ్చు ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని కంప్యూటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మెయిల్ అందుకున్న వ్యక్తులు సంక్షిప్తంగా తమ జవాబుల్ని పంపొ చ్చు. జీ–మెయిల్లో అప్పటికే ఉండే ఈ జవాబుల్ని కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. 11. జీమెయిల్లో స్లైడ్ ప్యానెల్ ఇతర యాప్‌లను వాడుకోవడానికి జీమెయిల్ నుంచి బయటకి వెళ్లకుండా కొత్తగా యాప్స్ ప్యానెల్‌ను తీసుకొచ్చింది. జీమెయిల్లో కుడివైపు కన్పించే ఈ ప్యానెల్లో క్యాలెండర్, టాస్క్స్ సహా పలు యాప్‌లను చేర్చారు. 12. ఆకర్షణీయంగా కన్పించేలా సరికొత్త యూజర్ ఇంటర్ఫేజ్ సాయంతో జీమెయిల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి వెబ్ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 13. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు టాస్క్స్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు సరికొత్త గూగుల్ టాస్క్స్(జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ తదితరాలు ఉండే) యాప్‌ను విడుదల చేసింది. 14. పిషింగ్ హెచ్చరికలు స్పష్టంగా.. సైబర్ నేరగాళ్లు పంపే పిషింగ్ మెయిల్స్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి హెచ్చరించేలా కొత్త ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. పిషింగ్ తీవ్రతను బట్టి ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో ప్రమాదకర ఈ–మెయిల్స్ కన్పిస్తాయని పేర్కొంది. -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ వినియోగదారులకోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా బీటావర్షన్‌లో వాట్సాప్‌లో ఈ రెండు ఫీచర్లను జోడించింది. ‘హై ప్రయారిటీ’, ‘ డిస్మిస్ యాజ్ అడ్మిన్’ అనే రెండు ఫీచర్లను పబ్లిక్ వెర్షన్లో ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ 2.18.117 లో అందుబాటులో ఉందని వాట్సాప్ ధృవీకరించింది. ‘హై ప్రయారిటీ నోటిఫికేషన్స్’ ఇన్కమింగ్ నోటిఫికేషన్లు నియంత్రించేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెటింగ్స్‌లో వెళ్లి ఈ ఆప్షన్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది తీసుకొచ్చిన పిన్డ్ చాట్స్ ఫీచర్లాంటిదే ఇది కూడా. ప్రయారిటీ నోటిఫికేషన్స్ పేరిట పిలువబడే ఈ సదుపాయం ద్వారా ఇకపై వాట్సప్ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మిగతా అప్లికేషన్ల నోటిఫికేషన్ల కన్నా పైభాగంలో ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ నిర్దిష్టమైన వ్యక్తి నుండి వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఇలా ప్రత్యేకంగా కనిపించేలా, లేక అందరివీ కనిపించాలా, గ్రూప్ ఛాట్లు కూడా ఇలా ప్రయారిటీ నోటిఫికేషన్ల ఎంపికను మనం చేసుకోవచ్చు అడ్మిన్లను తొలగించే ఫీచర్ వాట్సాప్ గ్రూప్స్ లను దృష్టిలో పెట్టుకుని డిస్సిస్ యాజ్ అడ్మిన్( అడ్మిన్‌గా డిస్సిస్) ఆప్షన్‌ను అందిస్తోంది. ఇప్పటివరకూ గ్రూపునుంచి సభ్యులను డిలీట్ చేసే అవకాశం అడ్మిన్లకు ఉంది. తాజాగా ఫీచర్‌తో గ్రూపులోని ఇతర అడ్మిన్లను గ్రూప్‌నుంచి డీమోట్ చేసే అవకాశమన్నమాట. అంటే అడ్మిన్లను తొలగించాల్సిన అవసరం లేకుండా వారిని డీమోట్ చేయొచ్చు. అంటే గ్రూప్ ఇన్ఫో మెనూలో అడ్మిన్ నంబర్ మనకు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, వెబ్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. -
దుఃఖాన్నే మిగులుస్తున్న స్మార్ట్ఫోన్లు
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. మితంగా ఉపయోగిస్తేనే మేలు జరుగుతుంది. అలా కాదని అతిగా అలవాటు పడితే దుఃఖానికే దారితీస్తుందనే విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. ఇదే సూత్రం స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి కూడా వర్తిస్తుందట. వాషింగ్టన్: కొన్న కొత్తలో ఏదైనా బాగానే ఉంటుంది. చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే..! వాడేకొద్దీ, అందులోని ఫీచర్లను ఉపయోగిస్తున్నకొద్దీ మన సంతోషం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. అది చివరకు దుఃఖానికి దారితీస్తుంది. ఇదేదో మాటవరసకు అంటున్న విషయం కాదు.. అమెరికాలో లక్షలాది మంది యువతపై అధ్యయనం చేసి, చెబుతున్న విషయం. స్మార్ట్ఫోన్ల కారణంగా యువత సంతోషంగా ఉండడం కంటే ఎక్కువగా దుఃఖంగానే ఉంటున్నారట. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. మిలియన్ మందికి ప్రశ్నలు.. సర్వేలో భాగంగా దాదాపుగా మిలియన్ మంది యువతను కొన్ని ప్రశ్నలు అడిగారట. కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ వంటివి రోజులో ఎంతసేపు వినియోగిస్తున్నారు? సోషల్ మీడియాలో ఎంతసేపు గడపుతున్నారు? వీడియో కాలింగ్, చాటింగ్ వంటివి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాయా? గతంలో సంతోషంగా ఉన్నారా? స్మార్ట్ స్క్రీన్లు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారా? వంటి కొన్ని ప్రశ్నలను అడిగి, వారిచ్చిన సమాధానాలను పరిశీలించారట. మిస్ అవుతున్నాం.. సర్వేలోభాగంగా యువత నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలిస్తే.. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు వాడుతున్నవారంతా.. తాము గతంలో కంటే సంతోషంగా లేమంటూ చెప్పారట. నాన్‌స్క్రీన్ యాక్టివిటీస్‌తో ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. స్పోర్ట్స్, అవుట్డోర్ గేమ్స్, పుస్తకాలు, న్యూస్‌పేపర్లు చదవడం, స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడడం వంటివి తమను ఎంతో సంతోషంగా ఉంచేవని చెప్పారట. ఆన్‌స్క్రీన్‌లో మునిగిపోయి చిన్నచిన్న సంతోషాలన్నింటికీ దూరమవుతున్నామని, పిల్లలతో, తల్లిదండ్రులతో, పొరుగువారితో గడపలేకపోతున్నామని చెప్పారు. -
వాట్సాప్‌లో త్వరలో గ్రూప్ కాల్స్ ఫీచర్
న్యూయార్క్: వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీ అలవాటైపోయింది. ఒకే క్లిక్‌తో గ్రూప్‌లో ఉన్నవారందరికీ ఒకేసారి మెసేజ్‌ను పంపే సదుపాయాం ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా.. గ్రూప్‌లోని సభ్యులందరితో ఒకేసారి మాట్లాడడం, వీడియో కాల్స్ చేయడం వంటి సదుపాయం మాత్రం ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు. కానీ త్వరలోనే ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న కాల్ స్విచ్చింగ్ ఆప్షన్‌ను ఇకపై తీసేస్తామని తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒక గ్రూప్‌నకు చెందిన యూజర్లు మూకుమ్మడిగా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫేస్బుక్ స్టిక్కర్లు, గ్రూప్ కేటగిరిని బట్టి ప్రత్యేక స్టిక్కర్లు యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇవేకాక కాంటాక్ట్స్‌లను వెతికేందుకు, రిప్లై ఇచ్చేందుకు కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీంతో గ్రూప్‌తో సంబంధం లేకుండా ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్ ఆప్షన్లను ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. ఇక వాట్సాప్ లేకుండా ఉండడం కష్టమే! -
సహజ లక్షణాలు
ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలుంటాయనడానికి రాముడే ఉదాహరణ. మహిమలు, మహత్యాలు చూపలేదు. కేవలం మానవమాత్రుడిగా మనలో ఒకడిగా కార్య నిర్వహణ చేశాడు. మనిషిగానే సాధించాడు. రాజ వంశంలో జన్మించిన రాముడికి, అవతలి వారు తనను పలకరించే వరకు వేచి చూడక తానే చిరునవ్వుతో పలకరించేవాడట. నవ్వు మనసులను, మనుషులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదదే! రాముడికి తండ్రి మాట వేదం. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసా వహిస్తే, అవే అందరకు ఆశీర్వచనాలు. రాముడిలోని మరో లక్షణం స్థిరచిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్యపాలనకు అంగీకరించమ’న్న భరతుని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించడంలోనూ, సీతాపరిత్యాగంలోనూ, ఏకపత్నీవ్రతంలోనూ, సుగ్రీవునకు మాటిచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడమనే సందర్భాల్లోనూ రాముని స్థిరచిత్తం స్పష్టంగా గోచరమవుతుంది. మనసు ఊయలలా ఊగులాడకుండా, అంకితభావంతో అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యసాధన. దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది. హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునేవాడు’ అని చెబుతాడు. అంటే తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకునే గొప్ప వ్యక్తిత్వం గలవాడు రాముడు. మన లోపాలు మనకు తెలిసుండి కూడా అహంకారంతో సంస్కరించుకోకుండా ఉండే వాళ్లకు ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం. అదేవిధంగా ఎంత అవసరమో అంతే మాట్లాడడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవడం, శత్రుశిబిరం నుంచి వచ్చినా (విభీషణుడు) నమ్మి ఆదరించడం, సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుబెట్టినా, కోపం తగ్గాక మరోవైపు ప్రయోగించడం, తనకు అన్యాయం చేసినా.. కైకను ఒక్క పరుషపు మాట అనకుండా గౌరవించడం ఇవన్నీ రామచంద్రుడి సహజాభరణాలు. భ్రాతృప్రేమను రుచి చూపి లక్ష్మణుని సహవాసిగా చేసుకున్నాడు. గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని సేవకుడిని చేసుకున్నాడు. అందుకే ఆయనకు దేవుడని పట్టంగట్టి వదిలెయ్యకుండా మనలో ఒకడిగా చూసుకుంటున్నాం. శ్రీరాముడి గుణసంపదలోంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్నా, వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం. ఇదే శ్రీరాముడు చూపిన మార్గం. -
జియో 4జీ ఫోన్ ఫీచర్స్ తెలుసా ?
-
జియోఫోన్.. అద్భుత ఫీచర్లు
న్యూఢిల్లీ: శుక్రవారం విడుదలైన జియోఫోన్ టెలికాం రంగంలో పెద్దకుదుపులనే తెచ్చింది. జియో వినయోగదారులందరికి ఫోన్ ఉచితంగా ఇస్తామంటూ ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. నామమాత్రపు రుసుముతో 36 నెలల తరువాత వాపసు ఇచ్చేలా కేవలం రూ.1500లకే అందిస్తామన్నారు. రూ.153లకే అన్లిమిటెడ్ డేటాను జియోఫోన్లకు అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఫోన్ విషయానికి వస్తే ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్లు ఇందులో పొందు పరిచారు. వాయిస్ ఓవర్ టెక్నాలజీ(వీవోఎల్టీఈ)తో పనిచేసే విధంగా ఈ ఫీచర్ ఫోన్‌ను జియో రూపొందించింది. దీన్ని ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది. ఫోన్ ఫీచర్స్: ► 2.4 అంగుళాల స్క్రీన్, ఆల్ఫాన్యూమరిక్ కీబోర్డుతో డిజైన్ చేశారు. ► దేశంలో 22 భాషలను సపోర్ట్ చేస్తుంది, వాయిస్ కమాండ్ ద్వారా పనిచేస్తుంది. ► జియో సినిమా యాప్‌లో సినిమాలు, టీవీ ఛానల్స్ ఫ్రీగా చూడవచ్చు ► కీపాడ్‌లో నెంబర్ 5లో అత్యవసర కాలింగ్ విధానాన్ని పొందు పరిచారు. ► నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు ► మెమోరీ కార్డు ద్వారా ఫోన్ మెమోరీ పెంచుకోవచ్చు. ► వీజీఏ కెమెరా ఏర్పాటు చేశారు. ► ఎఫ్ఎం రేడియో, ఆడియో ప్లేయర్ అప్లికేషన్లుకూడా ఉన్నాయి. ► ఇందులో బ్లూటూత్ టెక్నాలజీ 4.10 వెర్షన్ ఉపయోగించారు. ► డ్యూయెల్ సిమ్ సదుపాయం ఉంది. రెండు సిమ్స్లాట్లు వివోఎల్టీఈ ని సపోర్ట్ చేస్తాయి. -
మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్ ఇదేనట!
హ్యాకింగ్ భయాలతో ఆందోళన చెందుతున్నస్మార్ట్ఫోన్ ప్రేమికులకు శుభవార్త. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ మెకఫే ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ను తయారుచేసే ప్రణాళికలను ఆయన ఇటీవల ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. ‘న్యూస్‌వీక్’ వెబ్సైట్ తో మాట్లాడిన మెకఫే సంస్థ వ్యవస్థాపకుడు జాన్ మెకఫే ప్రపంచంలోనే తొలి పూర్తి ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కూడా ప్రకటించారు. ‘జాన్ మెకఫే ప్రైవసీ ఫోన్’ పేరుతో ఈ ఏడాదే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మెకఫే చెప్పారు. అయితే ఇది సాధారణ వినియోగదారుల కోసం కాదట... వ్యాపారవేత్తలు, సమాచార భద్రత కోరుకునే వారి కోసం దీన్ని తయారుచేశామన్నారు. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 65వేలు (1000 డాలర్లు) ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి ట్రూలీ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ అని జాన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ ఫొటోను షేర్ చేశారు. డెన్మార్క్‌లో డిజైన్ చేసి, అమెరికాలో డెవలప్ చేసి, యూరోప్‌లో అసెంబుల్డ్ చేసిన ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంజీటీ, మెకఫే సంస్థలు సంయుక్తంగా తయారుచేస్తునట్టు వివరించారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాత్రం వెల్లడించలేదు. దీని అఫీషియల్ లాంచింగ్ ముందు పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. ఈ డివైస్ హార్డ్‌వేర్ భద్రత అంశంలో కీలక ప్రాత పోషించనుందన్నారు. "హార్డ్‌వేర్ భద్రతకు మూలం..సాప్ట్వేర్ అభద్రతకు ఆధారం అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా యూజర్ల డేటాను రక్షించేందుకు ఆపిల్, గూగల్ ఆపరేటింగ్ సిస్టం ప్రైవసీ పద్దతులను పాటిస్తోంటే..మరి ఈ మెకఫీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో ఇంకా రివీల్ కావల్సి ఉంది. -
భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా?
డిజిటల్ లావాదేవీల సులభతరానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండు యాప్ అద్భుతాలను సృష్టిస్తుందని మోదీ కొనియాడారు. బీఆర్ అంబేద్కర్ పేరు ఘననివాళిగా తీసుకొచ్చిన ఆ యాప్ పేరు 'భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ'. స్మార్ట్‌ఫోన్ లేదా ఫీచర్ ఫోన్ ఏ ఫోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ యాప్‌కు ఇంటర్నెటే అవసరం లేదు. కేవలం చేతివేళ్లే చాలు. కస్టమర్లు ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలన్ని పూర్తిచేసుకోవచ్చు. భీమ్ గురించి మరికొన్ని ప్రత్యేకతలు.... కేవలం మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి నగదును బదిలీ చేసుకునే లేదా సులభతరంగా పేమెంట్లు కూడా చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. దుకాణదారుడు కూడా భీమ్ యాప్‌ను వాడుతుంటే, యాప్‌ను ఓపెన్ చేసి, సెండ్ మనీ అని కొట్టి, చెల్లింపు మొత్తాన్ని, వ్యాపారి ఫోన్ నెంబర్‌ను టైప్ చేస్తె చాలు. చెల్లింపు అయిపోతుంది. మీ అకౌంట్లో నగదు డెబిట్ అయి, వ్యాపారి బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. భీమ్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఐఓఎస్లకి త్వరలో అందుబాటులోకి రానుంది. కస్టమర్లకు క్యూఆర్ కోడ్‌ను స్కాం చేసుకునే అవకాశం కూడా ఈ యాప్ కల్పిస్తుంది. వ్యాపారి కూడా క్యూఆర్ కోడ్‌ను భీమ్ యాప్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్‌కి నగదు చెల్లించాలనప్పుడు స్కాన్‌ను ట్యాప్ చేసి, యాప్‌లో పే బటన్‌ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేస్తె చాలు. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. పేమెంట్ల కోసం భీమ్ యాప్ వాడటానికి ఏ విధమైన మొబైల్ నుంచైనా *99# ను డయల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మెనూ మనకు కనిపిస్తుందని. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం వివిధ నెంబర్లు మనకు వాటిలో దర్శనమిస్తాయి. నగదు పంపడానికి ఉదాహరణకు 1 నెంబర్‌ను టైప్ చేసి, సెండ్ కొట్టాలి. మొబైల్ నెంబర్‌ను ఎంపికచేయడం కోసం మళ్లీ 1 నెంబర్‌ను టైప్ చేయాలి. తర్వాత నెంబర్, పేమెంట్ మొత్తం టైప్ చేసి, భీమ్ యాప్‌తో పిన్ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌తో రూ.10వేల వరకున్న లావాదేవీ చేసుకోవచ్చు. రోజుకు రూ.20,000 వరకు లావాదేవీలను భీమ్‌తో ముగించుకోవచ్చు. మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట దానిలో నగదు నింపి, తర్వాత వాడుకోవాలి. కానీ ఈ యాప్‌లో నగదు నింపాల్సినవసరం లేదు. భీమ్ యాప్ అచ్చం డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల ఫోన్‌కు డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి పేమెంట్లు వెనువెంటనే జరిపోతాయి. దీనిపై వ్యాపారులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం ఉండదు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజ బ్యాంకులతో పాటు అన్ని యూపీఐ కనెక్ట్ బ్యాంకులన్నీ భీమ్‌ను అంగీకరిస్తాయి. యూపీఏతో సంబంధం లేని బ్యాంకులు కూడా ఐఎఫ్ఎస్సీ నెంబర్‌తో భీమ్ ద్వారా నగదు పొందుతాయి. -
ట్విట్టర్లో కొత్త ఫీచర్లు
న్యూయార్క్: ట్విట్టర్ రెండు కొత్త ఫీచర్లతో మరింత యూజర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలకు తెరలేపింది. దీని ద్వారా ట్విట్లర్ మొబైల్ యాప్‌లో మీ ప్రముఖ సంభాషణలను కనుగొనడం ఇకమీదట సులభంగా మారనుంది. ఇందులో భాగంగా ట్విట్టర్ మొబైల్ యాప్‌లో ‘రిప్లై కౌంటర్’, ‘కన్వర్సేషనల్ ర్యాంకింగ్’ అనే ఫిచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్‌ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే.. ట్విట్టర్లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్ ఆర్డర్లో కాకుండా వేరే విధంగా చూపిస్తాయి అని ‘ఎన్‌గాడ్జెట్’ బుధవారం వెల్లడించింది. ఈ ఫీచర్లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా.. ఒక ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం తెలుపుతాయి.