
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్స్ అధునాతన ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్‌లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్, స్పోర్టి వీల్–రిమ్ స్టిక్కర్స్, పాస్–బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు.
110 సీసీ, పూర్తి మెటల్ బాడీ, అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్ డిజైన్ అయిందని వ్యాఖ్యానించారు.